sensors
-
సెన్సార్ల లోపం వల్లే ఎక్కువ ఉష్ణోగ్రతలు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మే 30వ తేదీన నమోదైన 56, వాయవ్య ఢిల్లీలోని ముంగేష్ పుర్లో మే 29వ తేదీన నమోదైన 52.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు తప్పు అని భారత వాతావరణ శాఖ శనివారం స్పష్టంచేసింది. మే 29న ముంగేష్ పుర్లో వాస్తవ గరిష్ట ఉష్ణోగ్రత 45.2 ఉంటే సెన్సార్ దానిని 52.9 డిగ్రీల సెల్సియస్‌గా చూపించింది. ముంగేష్ పుర్, నాగ్‌పూర్ స్టేషన్లలో ఉష్ణోగ్రతను లెక్కగట్టే సెన్సార్లలో లోపాలు తలెత్తడం వల్లే అసాధారణంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వివరణ ఇచి్చంది. ‘‘ ఈ రెండు ఆటోమేటిక్ వెదర్ స్టేషన్(ఏడబ్ల్యూఎస్)లో బిగించిన సెన్సార్లను త్వరలోనే పరిశీలిస్తాం. ఢిల్లీలోని ఇతర ఆటోమేటిక్, మాన్యువల్ అబ్జర్వేటరీల్లో నమోదైన ఉష్ణోగ్రతలతో పోలిస్తే ముంగేష్ పుర్ ఏడబ్ల్యూఎస్‌లో అసాధారణ ఉష్ణోగ్రత నమోదైంది. అక్కడికి ఇప్పటికే నిపుణుల బృందాన్ని పంపించాం. ముంగేష్‌పుర్‌లో స్టాండర్డ్ ఇన్స్ట్రుమెంట్ నమోదుచేసిన దానికంటే ఈ సెన్సార్ మూడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఎక్కువ చూపించింది. లోపాలున్న సెన్సార్‌ను త్వరలోనే మార్చేస్తాం’’ అని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర చెప్పారు. -
ఈ సాక్సులు వేసుకుంటే సినిమా మిస్ అవ్వరు.. ఎలా అంటే?
కంప్యూటర్ యుగంలో పెరుగుతున్న టెక్నాలజీని వినియోగదారులకు అనుకూలంగా తయారు చేయడానికి కొన్ని కంపెనీలు కంకణం కట్టుకున్నాయి. ఇందులో భాగంగానే 'నెట్‌ఫ్లిక్స్ సాక్స్' పేరుతో అందుబాటులో ఉండే సాక్స్ సినిమాలు చూసేటప్పుడు చాలా ఉపయోగకరంగా ఉండేలా తయారు చేశారు. ఈ అద్భుతమైన సాక్స్ గురించి మరిన్ని వివరాలను ఇక్కడ చూసేద్దాం. నిజానికి నెట్‌ఫ్లిక్స్ ద్వారా సినిమాలు.. లేదా ఇతర ప్రోగ్రామ్స్ చూసే సమయంలో నిద్ర వస్తే.. ఆ ప్రోగ్రామ్ లేదా సినిమా మిస్ అయిపోతామేమో అని చాలామంది కంగారు పడొచ్చు. కానీ ఇప్పుడు ఎలాంటి టెన్షన్ లేకుండా సినిమా చూసేటప్పుడు నిద్ర వస్తే నిద్రపోవచ్చు. మీరు ఏ మాత్రం చూస్తున్న ప్రోగ్రామ్ మిస్ అయ్యే అవకాశం లేదు. నెట్‌ఫ్లిక్స్ సాక్స్ పేరుతో మార్కెట్లో లభించే సాక్సులు సెన్సార్లను కలిగి ఉంటాయి, కాబట్టి టీవీ చూసే సమయంలో వాటిని కాళ్ళకు వేసుకోవాలి. సాక్సులు వేసుకుని టీవీ చూసే సమయంలో నిద్ర వస్తే.. సాక్సులోని సెన్సార్లు ఆ విషయాన్ని గుర్తించి.. మీరు చూస్తున్న సినిమాను అక్కడితో ఆపేస్తాయి. మీరు నిద్ర మేల్కొన్న తరువాత ప్రోగ్రామ్ మళ్ళీ అక్కడ నుంచే కంటిన్యూ అవుతుంది. ఇదీ చదవండి: ఇషా అంబానీ రైట్ హ్యాండ్ ఇతడే.. జీతం లక్షల్లో కాదు కోట్లల్లోనే.. ఈ సాక్సులు మీ కదలికలను దృష్టిలో ఉంచుకుని పనిచేస్తాయి. కొన్ని సందర్భాల్లో మీరు కదలకుండా అలాగే కూర్చుంటే సాక్సులోని సెన్సార్ టీవీని ఆపేయవచ్చు, కాబట్టి సాక్సు వేసుకుని టీవీ చూసేటప్పుడు కదలిక అవసరం. కదలకుండా కూర్చోవడం లేదా నిద్రపోవడం మధ్య వ్యత్యాసం ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఈ సాక్సులు సమస్యగా మారే అవకాశం ఉంటుంది. -
ఇకపై అరచేతిలో సమాచారం.. ఏఐ పిన్ ఎలా పనిచేస్తుందంటే..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ స్మార్ట్ పరికరాల్లో మరిన్ని ఫీచర్లు ప్రవేశపెడుతున్నారు. ఆ పరికరాలను మరింత చిన్నగా మారుస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా హ్యుమని అనే స్టార్టప్ కంపెనీ ప్రవేశపెట్టిన ఏఐ పిన్ చాలా చిన్నగా ఉండి అన్ని స్మార్ట్ పరికరాలను నియంత్రిస్తుంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. ఇద్దరు ఆపిల్ మాజీ ఎగ్జిక్యూటివ్‌లు స్థాపించిన హ్యుమని అనే స్టార్టప్ కంపెనీ ద్వారా ఏఐ పిన్ను ఆవిష్కరించారు. ఇది చిన్న, తేలికైన పరికరం. దీన్ని మన దుస్తులతోపాటు చాలా తేలికగా ధరించేలా తయారుచేశారు. ఇది అయస్కాంతం మాదిరి దుస్తువులకు అట్టే అతుక్కుపోతుంది. యూజర్లకు వివిధ ఫీచర్లు అందించడానికి సెన్సార్లు, ఏఐ సాంకేతికతను వినియోగించారు. ఏఐ పిన్ అంటే... ఏఐ పిన్ అనేది తేలికగా దుస్తులపై ధరించే స్క్రీన్‌లెస్ పరికరం. ఇందులో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ వినియోగించారు. దీనిలో కెమెరా, మైక్రోఫోన్, యాక్సిలరోమీటర్ వంటి సెన్సార్లు ఉన్నాయి. ఇది మీ అరచేతిలో లేదా ఇతర ప్రదేశాలపై సమాచారాన్ని ప్రదర్శించేలా ప్రొజెక్టర్‌ను కలిగి ఉంటుంది. ఎలా పని చేస్తుందంటే.. ఏఐ పిన్.. సెన్సార్లు, ఏఐ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. వీటి సహాయంతో కావాల్సిన సమాచారం తేలికగా అందిస్తుంది. ఉదాహరణకు, వీధిలో నడుస్తుంటే ఏఐ పిన్ కెమెరాల ద్వారా చుట్టూ ఉన్న వస్తువులు, ల్యాండ్‌మార్క్‌లను గుర్తిస్తుంది. దాని సహాయంతో దగ్గరలోని రెస్టారెంట్ పేరు, లేదా బస్ స్టాప్నకు ఎంత దూరంగా ఉన్నమనే వివరాలను విశ్లేషించి వినియోగదారులకు అందిస్తుంది. అయితే 2024లో ఏఐ పిన్‌లో నావిగేషన్ ఫీచర్లను సైతం ప్రవేశపెడతామని కంపెనీ తెలిపింది. ఏఐ పిన్ ద్వారా ఇతర స్మార్ట్ పరికరాలను కూడా నియంత్రించవచ్చు. ఉదాహరణకు మీరు కాల్స్, మెసేజ్‌లు చేసేలా, స్మార్ట్ హోమ్ పరికరాలను నియంత్రించేలా, స్మార్ట్‌ఫోన్‌లో మ్యూజిక్ వినేలా టెక్నాలజీని వాడారు. ట్రాన్స్లేషన్ సేవలు, వర్చువల్ అసిస్టెంట్ వంటి వివిధ రకాల ఏఐ సంబంధిత అప్లికేషన్లను యాక్సెస్ చేయడానికి ఏఐ పిన్ని ఉపయోగించవచ్చు. స్మార్ట్ఫీచర్లతోపాటు ఏఐ పిన్ వినియోగదారుల గోప్యతకు ప్రాధాన్యం ఇస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. స్మార్ట్ డివైజ్‌లోని కెమెరా, మైక్రోఫోన్ లేదా ఇన్పుట్ సెన్సార్లు పనిచేస్తున్న విషయాన్ని యూజర్లకు తెలియజేస్తుంది. ఎప్పుడైనా ఏఐ పిన్ సెన్సార్లను నిలిపేసే అవకాశం ఉంటుంది. హ్యూమని ఏఐ పిన్ ప్రారంభ ధర రూ.58300గా ఉందని కంపెనీ అధికారులు తెలిపారు. 2024లో దీన్ని వినియోగదారులకు డెలివరీ ఇవ్వనున్నారు. -
చిన్న క్లిప్పులా ఉంటుంది.. కానీ పనితీరు అమోఘం
పాతకాలం నాటి పాదరసం బీపీ మానిటర్లు ఇప్పటికీ చాలాచోట్ల వాడుకలో ఉన్నాయి. ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన డిజిటల్ బీపీ మానిటర్లు కూడా విరివిగా వాడుకలో ఉన్నాయి. ఇవేవి వాడాలన్నా, చేతికి పట్టీని చుట్టి నానా ప్రయాస పడాల్సి ఉంటుంది. అమెరికాకు చెందిన బయోమెట్రిక్ టెక్నాలజీ కంపెనీ ‘వాలెన్సెల్’ ఇటీవల ఎలాంటి పట్టీలు లేని, అతిచిన్న కఫ్లెస్ బీపీ మానిటర్‌ను రూపొందించింది. ఇది చూడటానికి పల్సాక్సి మీటర్లాగానే చిన్న క్లిప్పులా ఉంటుంది. ఇందులో వేలుపెడితే చాలు. దీని పైభాగంలో ఉన్న మానిటర్ మీద కచ్చితంగా బీపీ ఎంత ఉందో కనిపిస్తుంది. దీనిని ఈ ఏడాది జరిగిన సీఈఎస్–2023 ప్రదర్శనలో ‘వాలెన్సెల్’ ప్రదర్శించింది. త్వరలోనే దీనిని మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇది విరివిగా అందుబాటులోకి వస్తే, బీపీ మానిటర్‌ను ఇంచక్కా జేబులో వేసుకుని వెళ్లొచ్చు. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ బీపీని తెలుసుకోవచ్చు. -
టెక్నాలజీ అదిరింది, మొక్కలకు జబ్బు చేస్తే.. స్మార్ట్‌ఫోన్‌కు అలెర్ట్ వస్తుంది!
మొక్కలకు, చెట్లకు కూడా రకరకాల జబ్బులు వస్తుంటాయి. తెగుళ్లు సోకుతుంటాయి. వాటిని నయం చేయడానికి మందులు మాకులు వాడుతుంటాం. ఇదంతా అందరికీ తెలిసిన సంగతే! మొక్కలకు వ్యాధులు సోకిన వెనువెంటనే కనిపెట్టడం చాలా కష్టం. కొంత నష్టం జరిగాక గాని, మొక్కల ఆరోగ్య పరిస్థితి అర్థం చేసుకోలేం. అయితే, వాటికి తెగుళ్లు లేదా ఏదైనా జబ్బులు సోకిన వెనువెంటనే ఆ సంగతిని గుర్తించే సాధనాన్ని ఇటీవల అమెరికాలోని నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇదొక పలుచని గాజు పలకలాంటి చిన్న ఎలక్ట్రానిక్ ప్యాచ్. దీని పొడవు, వెడల్పులు సమానంగా ముప్పయి మిల్లీ మీటర్లు మాత్రమే! దీనిని ఆకులకు తగిలించి ఉంచితే, ఇందులోని సెన్సర్లు మొక్కలకు సోకిన వ్యాధికారక సూక్ష్మజీవులను, పరాన్నజీవులను, పరిసరాల్లోని కాలుష్యం వల్ల మొక్కలకు ఎదురవుతున్న ఒత్తిడిని, మొక్కల్లోని తేమను, ఉష్ణోగ్రతను కూడా నిర్దిష్టంగా గుర్తిస్తుంది. ఈ సమాచారాన్ని దీనికి అనుసంధానమై ఉన్న స్మార్ట్‌ఫోన్‌కు చేరవేస్తుంది. దీనివల్ల మొక్కలకు సోకే వ్యాధులను తొలిదశలోనే గుర్తించి, ఎలాంటి నష్టం జరగకముందే వాటిని కాపాడుకోవచ్చని దీని రూపకల్పనలో కీలకపాత్ర వహించిన ప్రొఫెసర్ యోంగ్ ఝు చెబుతున్నారు. ప్రస్తుతం నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీని పనితీరుపై ఇంకా పరీక్షలు జరుపుతున్నారు. పరీక్షలు పూర్తిగా విజయవంతమైతే, ఇది రైతులకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి -
సెన్సార్ పూర్తి చేసుకున్న పాన్ ఇండియా మూవీ 'సేవదాస్'
Sevadas Movie Completed Sensor Works: సీనియర్ హీరోలు సుమన్, భానుచందర్ కీలక పాత్రలు పోషించిన బహుభాష చిత్రం 'సేవదాస్'. శ్రీశ్రీ హథీరామ్ బాలాజీ క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాలో కెపీఎన్ చౌహాన్, ప్రీతి అస్రాని, వినోద్ రైనా, రేఖా నిరోష హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. కెపీఎన్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసిన సెన్సార్ సభ్యులు చిత్రంపై ప్రశంసలు కురిపించారు. బంజారా సంస్కృతిని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే 'సేవదాస్' సినిమాను బంజారా భాషలోనే కాకుండా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అభినందనీయమన్నారు. 64 దేశాల్లో గల 18 కోట్ల బంజారాలతోపాటు తెలుగు, హిందీ ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా రూపొందిన సేవాదాస్ నిర్మాణంలో పాల్గొనడం గర్వంగా ఉందని కార్యనిర్వహక నిర్మాత ఎమ్ బాలు చౌహాన్ పేర్కొన్నారు. ఈ చిత్రం తెరకెక్కించడంలో శ్రమించిన ప్రతీ ఒక్కరికీ అభినందనలు తెలిపారు. వీలైనంత త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. -
వేడి, ఒత్తిళ్లను గుర్తించే సెన్సర్లు.. ఆవిష్కరణకు వైద్యశాస్త్ర నోబెల్
గదిలో మాంచి నిద్రలో ఉన్నారు... అకస్మాత్తుగా వర్షం పడటం మొదలైంది... వాతావరణం చల్లబడింది... కళ్లు కూడా తెరవకుండా.. చేతులు దుప్పటిని వెతుకుతున్నాయి.. ముసుగేసుకోగానే... చుట్టేసిన వెచ్చదనంతో తెల్లవారి పోయింది! కాళ్లకు చెప్పుల్లేకుండా ఆరు బయట పచ్చిక బయల్లో నడుస్తున్నారు... కాళ్ల కింద నలిగిపోతున్న చిన్న గడ్డిపోచ కూడా మీకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది... చర్మాన్ని తాక్కుంటూ వెళ్లిపోతున్న పిల్లగాలిని ఆస్వాదిస్తూంటారు... రాత్రి అయితే చల్లదనాన్ని.. పగలైతే ఎండ వేడి.. తెలిసిపోతూంటాయి! మామూలుగానైతే వీటి గురించి మనం అసలు ఆలోచించం. కానీ... వేడి, ఒత్తిడి వంటి స్పర్శానుభూతులను మనం ఎలా పొందుతామన్న విషయంపై యుగాలుగా శాస్త్రవేత్తలు ఆలోచనలు చేస్తున్నారు. కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటున్నారు కూడా. ఇదే క్రమంలో మన నాడి కొసళ్లలో ఉండే అతిసూక్ష్మమైన సెన్సర్లు వేడిని... శరీరంలోని ప్రత్యేకమైన సెన్సర్లు ఒత్తిడిని గుర్తిస్తాయని ప్రపంచానికి తెలిపిన శాస్త్రవేత్తలు డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటాపౌటేయిన్‌లు ఈ ఏడాది ప్రతిష్టాత్మక వైద్యశాస్త్ర నోబెల్ అవార్డు దక్కించుకున్నారు. స్వీడన్‌లోని కారోలిన్స్కా ఇన్స్టిట్యూట్లో సోమవారం నోబెల్ అవార్డు కమిటీ ఈ విషయాన్ని ప్రకటించింది. త్వరలో ఒక ప్రత్యేక ఉత్సవంలో వీరికి ఈ అవార్డును అందజేయనున్నారు. వేడి, ఒత్తిడిలను శరీరం ఎలా పసిగడుతోందో తెలుసుకోవడం వల్ల వైద్యశాస్త్రంలో ఎన్నో ప్రయోజనాలు ఏర్పడ్డాయన్నది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేని అంశం. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఇంద్రియాల ద్వారా ఎలా అర్థం చేసుకోగలగుతున్నామన్న ప్రశ్న ఈ నాటిది కాదు. యుగాలనాటిదన్నా ఆశ్చర్యం లేదు. మిరపకాయలోని కాప్‌సేసన్‌ను ఉపయోగించడం ద్వారా ఈ ఏడాది వైద్యశాస్త్ర నోబెల్ అవార్డు గ్రహీతల్లో ఒకరైన డేవిడ్ జూలియస్ మన నాడుల చివర్లలో కొన్ని సెన్సర్ల వంటివి ఉంటాయని, ఇవి వేడి, మంట వంటి అనుభూతులను మెదడుకు చేరవేస్తాయని తెలుసుకోగలిగారు. ఆర్డెమ్ పటాపౌటేయిన్ ఒత్తిడిని గుర్తించే ప్రత్యేక కణాలను వాడి చర్మం, శరీరం లోపలి భాగాల్లోని ప్రత్యేక సెన్సర్లు యాంత్రిక ప్రేరణను ఎలా గుర్తిస్తాయో తెలుసుకున్నారు. 17వ శతాబ్దపు తత్వవేత్త రెన్ డెకాట్ శరీరంలోని వివిధ భాగాలకు, మెదడుకు మధ్య పోగుల్లాంటివి ఉంటాయని.. వీటిద్వారానే వేడి వంటి అనుభూతులు మెదడుకు చేరతాయని ప్రతిపాదించారు.అయితే తరువాతి కాలంలో జరిగిన పరిశోధనలు మన చుట్టూ ఉన్న వాతావరణంలో వచ్చే మార్పులను పసిగట్టేందుకు ప్రత్యేకమైన ఇంద్రియ సంబంధిత న్యూరాన్ల ఉనికిని వెల్లడి చేశాయి. ఇలాంటి వేర్వేరు న్యూరాన్లను గుర్తించినందుకు జోసెఫ్ ఎర్లాంగర్, హెర్బెర్ట్ గాసెర్లకు 1944లో వైద్యశాస్త్ర నోబెల్ అవార్డు కూడా దక్కింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ వేర్వేరు ప్రేరణలను గుర్తించగల నాడీ కణాల గుర్తింపు.. వాటి ద్వారా మన పరిసరాలను అర్థం చేసుకునే విధానాలపై అనేక పరిశోధనలు కూడా జరిగాయి. మనం ముట్టుకునే వస్తువు నున్నగా లేదా గరుకుగా ఉందా తెలుసుకోగలగడం, నొప్పి పుట్టించే వేడి లేదా వెచ్చటి అనుభూతినిచ్చే ఉష్ణోగ్రతల మధ్య అంతరం ఈ ప్రత్యేక నాడీ కణాల ద్వారానే తెలుస్తాయన్నది అంచనా. అయితే వేడి, ఒత్తిడిలాంటి యాంత్రిక ప్రేరణ నాడీ వ్యవస్థలో ఏ విధంగా విద్యుత్ ప్రచోదనాలుగా మారతాయన్న ప్రశ్నకు మాత్రం ఇటీవలి కాలం వరకూ సమాధానం లభించలేదు. డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటాపౌటేయిన్‌లు ఈ లోటును భర్తీ చేశారు. సెన్సర్ల గుట్టు తెలిసిందిలా.... 1990ల చివరి ఏళ్లలో కాలిఫోర్నియా యూనివర్శిటీ శాస్త్రవేత్తగా డేవిడ్ జూలియస్ కాప్‌సేసన్ అనే రసాయనంపై పరిశోధనలు చేపట్టారు. ఇది నాడీ కణాలను చైతన్యవంతం చేస్తున్నట్లు అప్పటికే తెలుసు. కానీ ఎలా అన్నది మాత్రం అస్పష్టం. డేవిడ్ తన సహచరులతో కలిసి కాప్‌సేసన్ తాలూకూ డీఎన్ఏ పోగులను లక్షల సంఖ్యలో సిద్ధం చేశారు. ఇవన్నీ నొప్పి, వేడి, స్పర్శ వంటి వాటికి మన సెన్సరీ న్యూరాన్లలోని జన్యువులను ఉత్తేజపరిచేవే. తాము సిద్ధం చేసిన డీఎన్ఏ పోగుల్లో కొన్ని కాప్‌సేసన్‌కు స్పందించగల ప్రొటీన్‌ను ఉత్పత్తి చేస్తూండవచ్చునని డేవిడ్ అంచనా వేశారు. మానవ కణాలపై ప్రయోగాలు చేసి కాప్‌సేసన్‌కు స్పందించని జన్యువును గుర్తించగలిగారు. మరిన్ని పరిశోధనలు చేపట్టిప్పుడు ఈ జన్యువు ఒక వినూత్నమైన ఐయాన్ ఛానల్ ప్రొటీన్ తయారీకి కారణమవుతున్నట్లు తెలిసింది. దీనికి టీఆర్పీవీ1 అని పేరు పెట్టారు. ఈ ప్రొటీన్ వేడికి బాగా స్పందిస్తూ చైతన్యవంతం అవుతున్నట్లు తెలియడంతో వేడి తదితరాలను గుర్తించేందుకు శరీరంలో ప్రత్యేకమైన సెన్సర్ల వంటివి ఉన్నట్లు స్పష్టమైంది. ఈ ఆవిష్కరణ కాస్తా శరీరంలో ఇలాంటి సెన్సర్లు మరిన్ని ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఉపయోగపడింది. మెంథాల్ ద్వారా టీఆర్‌పీఎం8ను గుర్తించారు. ఈ రెండింటికి సంబంధించిన అదనపు అయాన్ ఛానళ్లు ఉష్ణోగ్రతల్లో తేడాలకు అనుగుణంగా చైతన్యవంతం అవుతున్నట్లు తెలిసింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
తస్మాత్ జాగ్రత్త..ఈ స్మార్ట్ ఫోన్లు వారిని కనిపెట్టేస్తాయ్
స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారా? అయితే వాటితో తస్మాత్ జాగ్రత్త! ఎందుకంటే ఫోన్లలో ఉన్న సెన్సార్లు గంజాయిని సేవించిన వారిని గుర్తిస్తాయని సైంటిస్ట్‌లు నిర్ధారించారు. మనం వినియోగించే స్మార్ట్ ఫోన్లలో ఉన్న సెన్సార్లు అనేక రకాలైన పనులు చేస్తాయి.వాటిలో మోషన్ సెన్సార్స్, ఎన్విరాన్ మెంటల్ సెన్సార్, పొజీషన్ సెన్సార్, ఆంబీనెట్ లైట్ సెన్సార్లు ఉంటాయి. కానీ అవి ఎందుకు ఉన్నాయి?ఎలా పనిచేస్తాయనే విషయం గురించి పట్టించుకోం.కానీ ఇదే సెన్సార్లపై 'అమెరికన్ రట్జర్స్ యూనివర్సిటీ' సైంటిస్ట్‌లు 'జనరల్ డ్రగ్ అండ్ ఆల్కహాల్ డిపెండెన్సీ' పేరుతో రిసెర్చ్ చేశారు. రిసెర్చ్‌లో భాగంగా..వారానికి రెండు సార్లు గంజాయి సేవించిన యువకుల నుంచి సంబంధిత డేటాను సేకరించారు.ఆ డేటా సాయంతో ఫోన్ సెన్సార్ల ద్వారా గంజాయి సేవించిన సదరు యువకుల్ని పరీక్షించారు.ఆ టెస్ట్‌ల్లో యువకులు గంజాయి ఎప్పుడు తీసుకున్నారు? ఎంత తీసుకున్నారు. తీసుకున్న తరువాత వారి శరీరం తీరు ఎలా ఉందని గుర్తించారు.అంతేకాదు స్మార్ట్ ఫోన్ సెన్సార్ల సాయంతో యువకులు ఎంత మొత్తంలో గంజాయి తీసుకున్నారో 90శాతం పాజిటీవ్ రిజల్ట్ వచ్చిందని సైంటిస్ట్ టామీ చుంగ్ తెలిపారు. చదవండి : ఛార్జర్ ఒక్కటే.. కొత్త ఫోన్లకు ఛార్జర్లు ఇవ్వరు!! -
షూట్ చేస్తే..రంగు పడుద్ది!
లక్నో: ఒకపక్క కరోనా కేసులు పెరుగుతుంటే.. మరోక్క రంగుల పండగ హోలీ దగ్గరపడుతోంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతో ఇష్టంగా జరుపుకునే కలర్‌పుల్ పండగ హోలీ. మరోసారి కేసులు పెరుగుతున్న తరుణంలో హోలీ ఎలా జరుపుకోవాలి? అని బాధపడేవారందరికి తియ్యటి వార్త చెబుతున్నాడు వారణాసికి చెందిన విశాల్. హోలీ పండగ జరుపుకునేందుకు ప్రత్యేకంగా ‘యాంటీ కరోనా వాటర్ గన్’ రూపొందించిన విశాల్.. వాటర్‌గన్ ఉండగా మీకు చింతేలా అంటున్నాడు. కరోనా భయాన్నీ పక్కనబెట్టి, ఎటువంటి ఆందోళన లేకుండా ఈ వాటర్ గన్‌తో రంగులు చల్లుకుంటూ హోలీ జరుపుకోండి అంటూ భరోసా ఇస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పండగ జరుపుకోవాలన్నా సోషల్ డిస్టెన్స్ పాటించక తప్పదు. అయితే కొన్ని పండగల్ని డిస్టెన్స్ పాటిస్తూ జరుపుకోవచ్చు కానీ, హోలీ లాంటి వాటికి కుదరదు. అందువల్ల దీనికి పరిష్కారం కనుక్కోవాలనుకున్నాడు అశోక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్లో చదువుతోన్న విశాల్ పటేల్. ఇటు కరోనాను ఎదుర్కొంటూ అటు హోలీని ఎప్పటిలాగా జరుపుకునే విధంగా ఏదైనా కొత్తగా తయారు చేయాలనుకున్నాడు. ఈక్రమంలోనే యాంటీ కరోనా వాటర్ గన్ను రూపొందించాడు. ప్రత్యేకంగా రూపొందించిన ఈ గన్ ఉపయోగించి సోషల్ yì స్టెన్స్ పాటిస్తూ రంగులను చల్లవచ్చు. అయితే ఇది చేతితో పట్టుకుని షూట్ చేసే గన్ మాదిరి ఉండదు. దీనిని ఇంటిపైన అమర్చి ఉంచుతారు. ఎవరైనా వాటర్ గన్ ఉన్న ప్రాంతం వైపు వచ్చినప్పుడు వెంటనే.. గన్‌లో ఉన్న సెన్సర్లు యాక్టివేట్ అయ్యి వారి మీద రంగులు చిమ్ముతుంది. ఒకవేళ గన్ పరిసరప్రాంతాల్లో ఎవరూ రాకపోతే గన్ ఇన్‌యాక్టివ్‌గా ఉంటుంది. ఇవేగాక ఈ గన్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. దీనిలో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనే పిచికారీ కలపడం వల్ల ఇది మంచి శానిటైజర్‌గా కూడా పనిచేస్తుంది. ఒకేసారి ఎనిమిది లీటర్ల రంగును గన్‌లో నింపవచ్చు. గన్‌లో 12 ఓల్టుల బ్యాటరీతోపాటు ఇన్ఫ్రారెడ్ సెన్సర్, అల్ట్రాసోనిక్ సెన్సర్ స్విచ్, ఎల్ఈడీ లైటు ఉంది. ఇన్ని హంగులున్న వాటర్ గన్ను విశాల్ పదిహేను రోజుల్లో తయారు చేయడం విశేషం. దీని ధర దాదాపు రూ.750 మాత్రమే. బనారస్ హిందూ యూనివర్సిటీ కోఆర్డినేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ బిహేవియర్ ఆర్ట్స్ సెంటర్‌కు చెందిన మనీష్ అరోరా మాట్లాడుతూ.. వాటర్ గన్ వినూత్న ఆలోచన అని, సురక్షితంగా హోలీ జరుపుకోవడానికి బాగా ఉపయోగపడుతుందని ప్రశంసించారు. రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ సెల్ ఇన్చార్జ్ శ్యామ్ ఛౌరాసియా మాట్లాడుతూ.. ఈ సమయంలో ఇటువంటి టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుందని, విశాల్ పటేల్ వాటర్ గన్ రూపొందించి గొప్ప పనిచేశాడని అభినందించారు. -
మీ ఆరోగ్యాన్ని... దుస్తులే చెబుతాయి!
ఫిట్నెస్ కోసం మనం స్మార్ట్‌వాచ్‌ల వంటి బోలెడన్ని పరికరాలు వాడేస్తున్నామా... యూబీసీ ఓకనగాన్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ శాస్త్రవేత్తలు ఇకపై ఇవేవీ అవసరం లేదని చెప్పేస్తున్నారు. ఎందుకంటే.. తాము ఎంచక్కా ఉతికేసుకున్నా పనిచేయగల సెన్సర్లను అభివృద్ధి చేశామని.. వీటిని పోగులుగా వాడుకున్న దుస్తులను వేసుకుంటే మీ ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండవచ్చునని వీరు చెబుతున్నారు. అత్యంత సూక్ష్మస్థాయిలో ఉండే ఈ సెన్సర్ దుస్తుల్లోని పోగులు సాగిపోవడం ఆధారంగా మన కదలికలను గుర్తిస్తాయి. కాకపోతే ఈ పోగులను గ్రాఫీన్ నానోప్లేట్లెట్స్తో శుద్ధి చేయాల్సి ఉంటుంది. పీజో రెసిస్టివిటీ అనే భౌతిక ధర్మం ఆధారంగా ఈ సెన్సర్లు పనిచేస్తాయని, గుండెచప్పుళ్లను గుర్తించడంతోపాటు, ఉష్ణోగ్రత నియంత్రణకు వీటిని వాడుకోవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మినా హూర్ఫర్ అంటున్నారు. స్పాండెక్స్ వంటి వస్త్రాల్లో సెన్సర్లు ఉన్న పోగులను ఏర్పాటు చేసి దాన్ని సిలికాన్ షీట్లతో చుట్టేస్తే... అవి నిత్యం మన వివరాలను నమోదు చేస్తూ అవసరమైనప్పుడు సమాచారం అందిస్తాయని.. శరీరంలో నీళ్లు తగ్గితే తాగమని సూచించడం, ఒత్తిడికి గురైనప్పుడు విశ్రాంతి తీసుకోమని సలహా ఇవ్వడం వంటి పనులన్నీ ఈ సెన్సర్ ఆధారిత వస్త్రాలు చేయగలవని మినా అంటున్నారు. ప్రస్తుతానికి తాము సెన్సర్లను పరీక్షించే దశలో ఉన్నామని.. సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు అవకాశముందని చెప్పారు. అన్నీ సవ్యంగా సాగితే త్వరలోనే ఈ సరికొత్త, చౌక సెన్సర్ దుస్తులు మార్కెట్లోకి వచ్చేస్తాయని అన్నారు. -
పాలు పాడైతే పసిగట్టే సెన్సార్
వాషింగ్టన్: పాలు పాడైపోయిన విషయాన్ని పసిగట్టే సెన్సార్‌ను వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఈ సెన్సర్ రాకతో మనం పాల ప్యాకెట్లమీద ఎక్స్పైరీ డేట్లు చూసుకోవడమనేది గతంగా మిగిలిపోనుంది. పాలలో బ్యాక్టీరియా పెరిగితే పాలలోంచి వచ్చే వాయువులను ఈ సెన్సర్లపై రసాయనాల పూతతో ఉండే సూక్ష్మ అణువులు పసిగడతాయని వర్సిటీ ప్రొఫెసర్ శ్యామ్ సబ్లానీ తెలిపారు. ఈ సెన్సర్ పాలను నేరుగా తాకకుండానే అవి పాడైనవో కావో చెబుతుంది. ఏవైనా ఆహారపదార్థాలు పాడైతే అందులో బ్యాక్టీరియా పెరిగి వాటినుంచి చెడు వాసన వస్తుంది. కంటైనర్ ఓపెన్చేస్తేగానీ మనకా విషయం తెలీదు. కానీ ఈ సెన్సర్ మారిన ఆహారం రంగును, వెలువడే వాయువులను గుర్తించి వాటి వినియోగస్థితిని చెప్తుంది. -
మార్కెట్లోకి 2019 ‘రెనో కాప్చర్’
ముంబై: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘రెనో’ తాజాగా తన ప్రీమియం ఎస్యూవీ ‘కాప్చర్’ మోడల్లో నూతన వెర్షన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇంతకుముందు కంటే ఈకారులో మెరుగైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు కంపెనీ ప్రకటించింది. పాదచారుల భద్రతా ప్రమాణాల వంటి అన్ని రకాల దేశీ భద్రతా చట్టాలకు అనుగుణంగా ఈ నూతన వెర్షన్ రూపొందినట్లు తెలిపింది. ధరల శ్రేణి రూ.9.5లక్షలు–రూ.13లక్షలుగా ప్రకటించింది. ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ (ఈబీడీ)తో కూడిన అత్యున్నత బ్రేకింగ్ వ్యవస్థ (ఏబీఎస్), బ్రేక్ అసిస్టెన్స్, స్పీడ్ అలర్ట్, పార్కింగ్ సెన్సార్, డ్రైవర్ పక్కన వ్యక్తి సీట్ బెల్ట్ రిమైండర్, రెండు ఎయిర్ బ్యాగ్స్ వంటి ఫీచర్లు ఉన్నట్లు తెలిపింది. -
ప్రశ్నించేందుకు రెడీ
పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు నిర్మించారు నటుడు పి.సత్యారెడ్డి. ఇప్పుడు తన కుమారుడు మనీష్ బాబుని హీరోగా పరిచయం చేస్తూ జనం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘ప్రశ్నిస్తా’. అక్షిత కథానాయికగా నటించారు. రాజా వన్నెంరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ వారంలో సెన్సార్ పూర్తి చేసుకుని, వచ్చే వారం విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, ప్రభుత్వ విధానాలపై ఓ విద్యార్థి నాయకుడు ఏ విధంగా పోరాడాడు.. ఎలా ప్రశ్నించాడు? అన్నది ఈ చిత్రకథ. వినోదంతో పాటు సమాజానికి మంచి సందేశం ఉంటుంది. మనీష్‌కి ఇది తొలి సినిమా అయినా అనుభవం ఉన్నవాడిలా నటించాడు’’ అన్నారు. రావు రమేశ్, ఆమని, హసీన్, షిప్రా కౌర్, వేణుగోపాల్, ప్రభాస్ శ్రీను, అనంత్, శివపార్వతి, ముంతాజ్, ‘ఆర్ఎక్స్ 100’ లక్ష్మణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: వెంగి, కెమెరా: ఎన్.సుధాకర్ రెడ్డి. -
యూపీ శివ
తీర్థం ఇచ్చే చేతికి గన్ దొరికితే? మంత్రాలు చదివే మనిషి.. కంత్రీలతో తిరిగితే?శివ్ అలాంటి వాడే. యూపీలో కొట్టేవాడు. బిహార్ వణికేది. పాతికేళ్లకే గడగడలాడించిన డాన్ వాడు. ఎలా డాన్ అయ్యాడు? చివరికెలా గన్ డౌన్ అయ్యాడు? చదవండి.. ఈవారం ‘వెబ్ ఫ్లిక్స్’లో. ‘‘ఈ ఇంట్లో నాటిన చెట్టు కాత కొచ్చే సమయానికి కొమ్మలు, రెమ్మలు, కాయలతో పక్కింట్లో వాలింది. ఆ చెట్టుపళ్లను ఆ ఇంటి వాళ్లు కోయొద్దు.. అంటే కోయకుండా ఉంటారా?’’ ఓ గ్యాంగ్‌స్టర్ మరో గ్యాంగ్‌స్టర్‌ను అడుగుతాడు. ఈ లైన్ చుట్టూ అల్లుకున్నదే రంగ్‌బాజ్. జీ5లో కొత్తగా అప్‌లోడైన క్రైమ్ థ్రిల్లర్. 1990ల నాటి ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌వార్ ఈ సీరియల్‌కి నేపథ్యం. సెటిల్మెంట్లు, మారణాయుధాల అక్రమ రవాణా సామ్రాజ్యాన్ని యూపీ గోరఖ్‌పూర్ టు బీహార్ పట్నా దాక విస్తరింపచేసిన ఓ పాతికేళ్ల యువకుడి కథ. వెబ్ప్లే 1974, గోరఖ్‌పూర్.. బ్రాహ్మణ వర్ణానికి చెందిన రామ్‌శంకర్ తివారి (తిగ్మాంశు ధులియా), రాజపుత్రుడైన మేహా అనే ఇద్దరూ ఆయా సామాజిక వర్గాలకు ప్రతినిధులుగా, బలమైన శక్తులుగా, తూటాలు పేల్చుకునే ప్రత్యర్థులుగా మారుతారు. తమ బలగాలతో గోరఖ్‌పూర్‌ను ఏలుతుంటారు. రాజకీయాల్లోకీ అడుగుపెడ్తారు. తొంభయ్యవ దశకం వచ్చేసరికి ఎదురులేని ప్రజాప్రతినిధులుగా అసెంబ్లీలోనూ గ్యాంగ్‌వార్‌ను కొనసాగిస్తుంటారు. గ్యాంగ్‌ను మెయింటేన్ చేసుకోవడానికి గోరఖ్‌పూర్ యూనివర్శిటీలోని స్టూడెంట్స్‌ను వలలో వేసుకుంటూంటారు వాళ్లకు తుపాకులిస్తూ. అలా రామ్‌శంకర్ తివారీకి చిక్కిన విద్యార్థే శివ్ ప్రకాశ్ శుక్లా (సాఖీబ్ సలీమ్). గురి మార్చిన తూటా శివ్ ప్రకాశ్ శుక్లా తండ్రి స్కూల్ మాస్టర్. పాఠాలు చెప్పడం తప్ప ఇంకో ప్రపంచం లేని వ్యక్తి. శివ్ ప్రకాశ్ తల్లి ఆ తండ్రికి తగ్గ ఇల్లాలు. శివ్‌కు ఓ చెల్లి. అన్నంటే ప్రాణం. ఆ అమ్మాయి ఒకరోజు కాలేజ్ నుంచి వస్తుంటే ఓ షాపు యజమాని (యువకుడే) అల్లరి పెడ్తాడు. విషయం తెలుసుకున్న శివ్ ఆవేశంతో తన స్నేహితుడి దగ్గరున్న గన్ తీసుకొని అల్లరి పెట్టిన వాడిమీదకు వెళ్తాడు, బెదిరించాలనుకొని. పెనుగులాటలో తుపాకి పేలుతుంది. షాపు యజమాని నేలకొరుగుతాడు. భయంతో వచ్చి ఇంట్లో దాక్కుంటాడు శివ్. తల్లి, తండ్రి, చెల్లి షాక్ అవుతారు అతను చేసింది విని. ఏమీ పాలుపోదు ఎవరికీ. అప్పుడు వాళ్లింటికి వస్తాడు రామ్‌శంకర్ తివారి. భయపడొద్దు అంటూ వాళ్లకు అభయమిచ్చి శివ్‌ను వెంట తీసుకెళ్లిపోతాడు. విశ్వసనీయమైన అనుచరులతో అతనిని బ్యాంకాక్ పంపిస్తాడు. గురి చూసి తుపాకీ పేల్చడం, మూడో కంటికి తెలియకుండా టాస్క్ పూర్తి చేయడం వంటివాటిలో శిక్షణ ఇప్పిస్తాడు అక్కడే. అతని మీద పూర్తి నమ్మకం వచ్చాకే తిరిగి గోరఖ్‌పూర్‌లో దింపుతాడు రామ్ శంకర్ తివారి. శివ్‌కు తన ప్రత్యర్థి మేహాను చూపించి హత్య చేయమంటాడు. తుపాకి బొడ్లో దోపుకొని బయలుదేరుతాడు శివ్. నడి రోడ్డు మీద.. మనుషులను కిడ్నాప్ చేసి చంపడం అన్న ఓల్డ్స్టయిల్కు గుడ్‌బై చెప్తాడు శివ్ నడి రోడ్డుమీదే తుపాకి గురిపెడుతూ. ఈ విపరీతానికి గోరఖ్పూరే కాదు ఉత్తరప్రదేశ్ అంతా వణుకుతుంది. రామ్‌శంకర్ తివారి గర్వపడ్తుంటాడు. ఇరవై రెండేళ్ల కుర్రాడు నెత్తుటి భయం లేకుండా బహిరంగ హత్యలతో వీరంగం చేస్తుంటే ప్రత్యర్థి రక్తం చల్లబడ్తుంటుంది. మేహా కణతలో తూటా దింపుతాడు శివ్. తనకు ఏకచ్ఛత్రాధిపత్యం వచ్చేసిందన్న ఆనందాన్ని రామ్‌శంకర్ ఆస్వాదిస్తుండగానే శివ్ స్వంత నిర్ణయాలు తీసుకుంటున్నాడన్న చేదూ అతని చెవినపడుతుంది. కొడుకును కాదని పరాయివాడిని విశ్వసిస్తే జరిగిన నిర్వాకానికి నివ్వెరపోతాడు. శివ్ ధైర్యాన్ని, సాహసాన్ని అటు బీహార్ నేత చంద్రభాన్ సింగ్ ఉపయోగించుకోవాలనుకుంటాడు. తనకు సహాయం చేయమని కోరుతాడు. దీన్నే బాస్ రామ్శంకర్కు చెప్పకుండా సొంతంగా చేసేస్తాడు శివ్. అప్పటి నుంచి శివ్ చర్యల మీద ఓ కన్నేసి ఉంచుతాడు రామ్శంర్. శివ్ నిజాయితీని పరీక్షించడానికి ఒక మంత్రిని చంపే పని అప్పగిస్తాడు. సరేనని ఇంకో మంత్రిని చంపేస్తాడు శివ్.. బీహార్ గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత చంద్రభాన్ ఆజ్ఞప్రకారం. దీంతో శివ్ తన మనిషి కాదని రూఢీ అవుతుంది రామ్శంకర్కి. అప్పటికే శివ్ స్వతంత్రంగా ఓ సేననూ తయారు చేసుకుని ఉంటాడు. మంత్రి హత్యతో చంద్రభాన్సింగ్కు సన్నిహితుడవుతాడు. రామ్‌శంకర్ తివారి కూడా భయపడేంత బలవంతుడవుతాడు శివ్. నిండా పాతికేళ్లు కూడా లేని అతనితో మాట్లాడాలంటే చంద్రభాన్ మధ్యవర్తిత్వం తీసుకోవాల్సి వచ్చేంత పెద్దవాడవుతాడు. చెల్లి పెళ్లి బ్యాంకాక్ నుంచి వచ్చాక శివ్ ఒక్కసారి మాత్రమే ఇంటికి వెళ్తాడు. వార్తాపత్రికల్లో వస్తున్న కథనాలతో కొడుకు దందా అర్థమైపోతుంది తండ్రికి. శివ్ తల్లిదండ్రులుగా వీళ్లను చూసి జనాలు భయపడ్తుంటే సిగ్గుతో తలదించుకుంటుంటారు. పరిస్థితి మరీ దిగజారకముందే కూతురికి పెళ్లిచేసెయ్యాలని సంబంధం ఖాయం చేస్తారు. చెల్లి ఫ్రెండ్, తన గర్ల్‌ఫ్రెండ్ అయిన శృతి అనే అమ్మాయి ద్వారా చెల్లి పెళ్లి విషయం తెలుసుకుని ఇంటికి వస్తాడు శివ్. తనకు చెప్పకుండా చెల్లి పెళ్లి ఎట్లా చేస్తారు? అంటూ తల్లిదండ్రులతో గొడవపడ్తాడు. నిన్ను ఇన్వాల్వ్ చేస్తే గూండా చెల్లెలికి ఈ జన్మలో పెళ్లవుతుందా? అని నిలదీస్తారు తల్లిదండ్రులు. మారు మాట్లాడకుండా చెల్లి చేతిలో డబ్బు పెట్టి వెళ్లిపోతాడు శివ్. నిశ్చితార్థానికి తప్పకుండా ఇంటికి వస్తాడని, ఆ టైమ్‌లో వాడి చావుకి ముహూర్తం పెట్టమని తన కొడుక్కి పురమాయిస్తాడు రామ్‌శంకర్ తివారి. కాని శివ్రాడు. దాంతో శివ్ గర్ల్‌ఫ్రెండ్‌ని టార్గెట్ చేస్తాడు రామ్‌శంకర్. ఆ పిల్లకు తన మేనల్లుడితో పెళ్లి ఫిక్స్ చేస్తాడు. అది అశనిపాతమవుతుంది శివ్‌కి. ‘‘నీ పద్ధతితో విసిగిపోయారు. నవ్వు మారవు. నాకీ తుపాకులు, గోరఖ్‌పూర్ వాతావరణం నచ్చట్లేదు. అందుకే బెంగుళూరులో మంచి ఉద్యోగం చేసుకుంటున్న రామ్‌శంకర్ మేనల్లుడితో పెళ్లికి ఒప్పుకున్నాను’’ అని చెప్పి దూరమవుతుంది శృతి. కుంగిపోతాడు. రామ్‌శంకర్ మీద ఇంకా పగపెంచుకుంటాడు. రామ్‌శంకర్ కన్స్ట్రక్షన్ బిజినెస్ పార్ట్నర్ను కిడ్నాప్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేస్తాడు. ఆ డబ్బుతో పట్నా వెళ్లిపోయి అక్కడ కాంట్రాక్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలనే లక్ష్యంతో. ఆ మేరకు చంద్రభాన్ కూడా భరోసా ఇస్తాడు. డబ్బులిచ్చినట్టే ఇచ్చి ఆ కాంట్రాక్టర్ చేతికి చిక్కగానే శివ్ అండ్ గ్యాంగ్‌ను లేపేయాలనే ప్లాన్‌తో వస్తాడు రామ్‌శంకర్ తివారి కొడుకు. అయితే ఆ ప్లాన్ రివర్స్ అవుతుంది. డబ్బు తీసుకుని రామ్‌శంకర్ కొడుకుని, అతని అనుచరులనూ చంపేస్తాడు శివ్. కొడుకును చంపేశాడన్న కసి, కక్షతో ఉత్తరప్రదేశ్‌లో శివ్ మీద నిఘాను పెంచుతాడు రామ్‌శంకర్. అతనిని పట్టుకోవడానికి స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌నూ ఏర్పాటు చేయిస్తాడు. ఎన్కౌంటర్.. అప్పుడడప్పుడే సెల్ ఫోన్ల ఎంట్రీ. శివ్ దగ్గర మొబైల్ ఫోన్ ఉంటుంది. పట్నాకు వెళ్తూ లక్నోలో ఆగుతాడు. స్టార్ హోటల్లో బస కోసం వెళితే రిసెప్షనిస్ట్ నచ్చుతుంది. ఆమె పేరు బబితా శర్మ (ఆహనా కుమ్రా). ఇంట్లో సంబంధాలు చూస్తుంటే ఇంటర్‌కాస్ట్ అండ్ లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఇంట్లోంచి వచ్చేస్తుంది. ఈ ఇద్దరి పరిచయం ప్రేమగా మారుతుంది. మొబైల్ ఫోన్లో మాట్లాడుకుంటూంటారు. వీళ్ల సంభాషణను స్పెషల్ టాస్క్ ఫోర్స్ ట్యాప్ చేస్తూ ఉంటుంది శివ్‌ను పట్టుకోవడానికి. శివ్ అండర్‌వరల్డ్ చర్యలు పట్నాకూ పాకి.. అక్కడా పోలీసుల థ్రెట్ ఉండడంతో పట్నాలో ఆశ్రయం ఇస్తానన్న చంద్రభాన్ ఇంకోచోట తాత్కాలిక బస ఏర్పాటు చేస్తాడు. ఈలోపు చెల్లి పెళ్లి ఉంటుంది. వెళ్లాలనుకుంటాడు శివ్. వెళితే చంపేస్తారని అనుచరులు వారిస్తారు. ఇంకోవైపు లక్నో నుంచి ఘజియాబాద్‌కు మకాం మార్చమని బబితాకు చెప్తాడు. పట్నాకు తనతోపాటు ఆమెనూ తీసుకెళ్లాలనుకుంటాడు. ఇటు పోలీసులు బబితా అడ్రస్ ట్రేస్ చేస్తారు. చెల్లి పెళ్లికి వెళ్లాలా? ప్రియురాలి దగ్గరకు వెళ్లాలా అనే డైలమాతోనే ఉన్న చోటునుంచి బయలుదేరుతాడు శివ్. వాళ్ల సంభాషణను బట్టి అతను కచ్చితంగా ఆమె దగ్గరకే వెళ్తాడు అన్న నమ్మకంతో పోలీసులు బబితా ఇంటి ముందు పహారా కాస్తుంటారు మఫ్టీలో. చెల్లితో ఒకసారి మాట్లాడాలనుకుని ఇంటికి ఫోన్ చేస్తాడు శివ్. తండ్రి ఫోన్ ఎత్తుతాడు. మాట్లాడుతాడు. మాటల్లో కొడుకులో ఉన్న బాధ బయటపడుతుంది. తండ్రీ చలిస్తాడు. చెల్లికి విషెస్ తెలుపమంటాడు శివ్. ‘‘టైమ్ చిక్కినప్పుడు ఇంటికి రా’’ అంటూ ఫోన్ పెట్టేస్తాడు తండ్రి. చిన్నప్పటి జ్ఞాపకాలు వెంటాడుతాయి శివ్ని. పశ్చాత్తాపం మొదలవుతుంది. బబితను తీసుకొని నేపాల్ వెళ్లిపోయి ప్రశాంతంగా బతకాలనుకుంటా డు. ఆ సంగతే ఆమెకు ఫోన్లో చెప్పి బయలుదేరుతాడు. తమ అంచనా తప్పుకాలేదు అనుకుంటూ.. కారు దిగి బబితా ఫ్లాట్‌లోకి వెళ్లబోతున్న శివ్‌ను అనుసరిస్తారు పోలీసులు. అనుమానం వస్తుంది శివ్ అండ్ గ్యాంగ్‌కి. తూటాల యుద్ధం మొదలువుతుంది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ (రణ్వీర్ శౌరీ) చేతిలో శివ్ ప్రకాశ్ శుక్లా చనిపోతాడు. కొంత కల్పితాన్ని జోడించిన నిజం ఇది. 25 ఏళ్లకే డాన్ అయిన ఓ విద్యార్థి జీవితం. యూపీలో మొట్టమొదటిసారి ఏకే 47ను వాడింది అతనే. 20 మందిని దారుణంగా చంపాడు. అప్పుడప్పుడే ప్రైవేట్ చానళ్ల జోరు, క్రైమ్ కహానీల హోరు షురూ అయింది. శివ్‌ను పట్టుకోవడానికి ఓ ప్రైవేట్ చానల్లో శివ్ మీద క్రైమ్స్టోరీనీ షూట్ చేయించారు స్పెషల్ టాస్క్ పోలీసులు. అయినా పట్టుకోలేకపోతారు. చివరకు అలా ఎన్కౌంటర్ అవుతాడు శివ్. 100 మంది రాజకీయ నేతలతో అతనికి సంబంధాలున్నట్లు, వాళ్లందరికీ అతను పనిచేసిపెట్టినట్లూ శివ్ డైరీ వెల్లడించింది. వెబ్‌సిరీస్ అంటేనే సెన్సార్ లేకుండా బోల్డ్‌గా, కుటుంబ సమేతంగా చూడ్డానికి వీల్లేనివి అన్న అభిప్రాయం ఉంది. సత్యమే. కాని రంగ్‌బాజ్ దానికి విరుద్ధం. – సరస్వతి రమ -
నన్ను టార్గెట్ చేయొద్దు
హిందీ నటుడు గోవింద సుపరిచితమే. డిఫరెంట్ మ్యానరిజమ్, సరికొత్త డ్యాన్స్ స్టెప్స్‌తో ఆకట్టుకున్నారు ఆయన. ఆ మధ్య రాజకీయాల్లోకి వెళ్లినా మళ్లీ యాక్టర్‌గా బిజీ అయ్యారు. ఆయన లేటెస్ట్గా నటించిన చిత్రం ‘రంగీలా రాజా’. ఈ చిత్రానికి సెన్సార్ బృందం 20 కట్స్ చెప్పిందట. దాంతో సెన్సార్ బృందం తన సినిమాలను కావాలనే టార్గెట్ చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గోవింద. ‘‘నా సినిమాలు థియేటర్ వరకూ వెళ్లడం ఇబ్బంది అవుతోంది. ఇప్పుడనే కాదు. తొమ్మిది సంవత్సరాలుగా నా సినిమాలను టార్గెట్ చేస్తున్నారు. నేను రాజకీయాలకు దూరంగానే ఉంటున్నాను. కొంతమంది నా సినిమాలను అడ్డుకుంటున్నారు. నేనేం తప్పు చేశానో తెలియడంలేదు. ఎవరు టార్గెట్ చేసినా నేను వెనక్కి తగ్గను. నా పని నేను చేసుకుంటూనే వెళ్తాను. దయచేసి నాకు పని చేసుకోవడానికి ఓ ప్లాట్‌ఫామ్ కల్పించండి’’ అని పేర్కొన్నారు గోవింద. -
త్వరలో ఎలక్ట్రానిక్ ద్రావణాలు
లండన్: వ్యాధి నిర్ధారణకు త్వరలోనే ఓ వినూత్నమైన విధానం అందుబాటులోకి రానుంది. బ్యాక్టీరియా రూపంలో ఉండే చిన్న చిన్న ఎలక్ట్రానిక్ సెన్సర్లు కలిగిన ద్రావణాన్ని తాగడం ద్వారా అనారోగ్యానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఎలక్ట్రానిక్ సెన్సర్లు పరిమాణంలో ఎర్ర రక్త కణాల కంటే తక్కువగా ఉండటం గమనార్హం. బ్రిటన్‌లోని ఇంపీరియల్ కాలేజ్ లండన్, ఫ్రాన్స్‌లోని ఈపీఎఫ్‌ఎల్‌కు చెందిన పరిశోధకులు దీన్ని తయారు చేశారు ఇది అందుబాటులోకి వస్తే కేన్సర్‌తోపాటు ఇతర ప్రాణాంతక వ్యాధుల నిర్ధారణా పద్ధతులు సులువవుతాయని పేర్కొన్నారు. -
మీరు తిన్న తిండిని పసిగట్టేస్తుంది...!
అతి చిన్న సెన్సర్ సహాయంతో రోజూ తీసుకునే ఆహారం దానితో ముడిపడిన ఆరోగ్య అంశాలను రియల్ టైమ్‌లో (ఎప్పటికప్పుడు) పర్యవేక్షించవచ్చునని టఫ్ట్స్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ పరిశోధకులు చెబుతున్నారు. ఆరోగ్య పరిరక్షణకు లేదా వైద్యపరమైన అంశాల అధ్యయనానికి ఇది కీలకంగా మారనుంది. ఈ పరిశోధకులు రూపొందించిన సెన్సర్‌ను పంటిపై అమర్చి, దానిని మొబైల్‌కు అనుసంథానిస్తే చాలు.. మనం తీసుకున్న ఆహారంలోని గ్లూకోజ్ (చక్కెర), ఉప్పు, సేవించిన మద్యానికి సంబంధించిన సమాచారం ట్రాన్స్మిట్ అవుతుంది. వీటి ద్వారా పోషకాలు, రసాయనాలు,శారీరికపరమైన అంశాలు గుర్తించవచ్చు. ఆహార పర్యవేక్షణకు గతంలో అనుసరించే పద్ధతుల్లో కచ్చితత్వం కొరవడడంతో 2 మి.మీ పరిమాణంలో స్సెనర్ను రూపొందించినట్టు టఫ్ట్స్ ఇంజనీర్లు వెల్లడించారు. మూడు దొంతరలుగా రూపొందించిన ఈ సెన్సర్లు చిన్న యాంటెన్నాలుగా రేడియో ప్రీక్వెన్సీ స్పెక్ట్రమ్‌లో తరంగాలు స్వీకరించి, ప్రసారం చేస్తాయి. ఉప్పు ,ఇథనాల్, తదితర వస్తువులు తీసుకున్నపుడు వేర్వేరు రేడియో ఫ్రీక్వెన్సీలు ప్రసారం చేస్తాయి. ఈ విధంగా పోషకాలు, ఇతర అంశాలు గుర్తిస్తారు. సాథారణంగా ఉపయోగించే రేడియో ప్రీక్వెన్సీ ఐడీ (ఆర్ఎప్ఐడీ) సాంకేతికతనే సెన్సర్ ప్యాకేజీలోకి మరింతగా విస్తరించి నిర్దేశిత ఫలితాలు సాధించినట్టు పరిశోధకులు ఫియోరెంజో ఒమెనెట్టో, ఫ్రాంక్ సి.డొబుల్ తెలిపారు. ఈ సెన్సర్‌ను పంటిపై, చర్మంపై లేదా మరెక్కడైనా అమర్చినా ఈ సమాచారాన్ని పొందవచ్చన్నారు. యూఎస్ ఆర్మీ నాటిక్ సోల్జర్ రిసెర్చ్, డెవలప్మెంట్ అండ్ ఇంజనీరింగ్ సెంటర్, ది నేషనల్ ఇనిసిట్యూట్స్ ఆఫ్ హెల్త్, నేషనల్ ఇనిసిట్యూట్ ఆఫ్ బయో మెడికల్ ఇమేజింగ్ అండ్ బయో ఇంజనీరింగ్, ఆఫీస్ ఆఫ్ ది నేవల్ రిసెర్చి సహకారంతో ఈ అధ్యయనం జరిపారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
స్మార్ట్‌ఫోన్ సెన్సర్లతో జాగ్రత్త
సింగపూర్: స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసేటప్పుడు కెమెరా, స్క్రీన్, బ్యాటరీ వంటి వాటితోపాటు ఏయే సెన్సర్లు ఉన్నాయో చూస్తుంటాం. స్మార్ట్‌ఫోన్‌లో యాక్సిలోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ, యాంబియంట్ లైట్ సెన్సర్లతో పాటు ఇతర సెన్సర్లు కూడా ఉంటాయి. ఇవన్నీ స్మార్ట్‌ఫోన్‌ను మరింత స్మార్ట్‌గా మారుస్తాయి. అయితే ఈ సెన్సర్లు చాలా ప్రమాదకరమైనవని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ సెన్సర్ల సమాచారంతో పాస్వర్డ్స్, పిన్ నంబర్లను తేలికగా కనుక్కోవచ్చని చెబుతున్నారు. ఈ సమాచారాన్ని ఉపయోగించి హ్యాకర్లు ఫోన్ అన్‌లాక్ చేయగలరని సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. ఈ పరిశోధనలో భారత సంతతి శాస్త్రవేత్త కీలకపాత్ర పోషించారు. దీనిలో భాగంగా మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్, ఫోన్లోని ఆరు సెన్సర్ల సమాచారాన్ని ఉపయోగించి ఫోన్‌ను శాస్త్రవేత్తలు అన్‌లాక్ చేశారు. అది కూడా 99.5 శాతం కచ్చితత్వంతో కేవలం మూడు ప్రయత్నాల్లోనే ఫోన్‌ను అన్‌లాక్ చేయగలిగామని వివరించారు. ఇంతకుముందు ఫోన్ అన్‌లాక్ చేయగలిగే రేటు 74 శాతంగా ఉండేది. మనం ఫోన్ కీబోర్డులో పాస్‌వర్డ్స్‌ని ఎంటర్ చేసే సమయంలో ఫోన్లో కలిగే కదలికలను ఈ సెన్సర్లు సమాచార రూపంలో నమోదు చేసుకుంటాయి. ఈ సమాచారంతోనే ఫోన్ అన్‌లాక్ చేశారు. -
చెమటతో చక్కెర వ్యాధిని గుర్తించొచ్చు!
మెల్బోర్న్: చెమట ద్వారా రక్తంలోని చక్కెర స్థాయిని గుర్తించే కొత్త సెన్సర్లను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ధరించడానికి వీలుండే స్పాంజి వంటి కాపర్ ఆధారిత ఈ పదార్థం ద్వారా మధుమేహాన్ని సులువుగా తెలుసుకోవచ్చు. మధుమేహం బారిన పడిన వారు తరచుగా రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని తెలుసుకుంటూ ఉండాలి. ఆస్ట్రేలియాలోని ఒల్లంగాంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ పదార్థాన్ని కనిపెట్టారు. రంధ్రాలతో కూడిన స్పాంజి వంటి ఈ కాపర్ నిర్మాణంతో చాలా తొందరగా, కచ్చితత్వంతో చెమట, కన్నీరు వంటి ద్రవాల ద్వారా రక్తంలోని గ్లూకోజ్‌ను గుర్తించవచ్చు. వాహకత, తక్కువ ఖర్చు, అధిక పనితీరు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ సెన్సర్లను బాగా అధ్యయనం చేసినట్లు జపాన్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్స్ సైన్స్‌కు చెందిన ప్రొఫెసర్ యుసుకే యమౌచీ తెలిపారు. గాలికి ప్రభావితం అయినపుడు కాపర్ త్వరగా ఆక్సీకరణ చెందే స్వభావం ఉండటం వల్ల వస్త్రం వంటి పదార్థంగా తయారు చేయడం కష్టమని వివరించారు. కాపర్ ద్రవాన్ని పాలీ సై్టరీన్తో కలిపి చిన్న చిన్న పాలీసై్టరీన్ బంతులను తయారుచేసి బయటి నుంచి కాపర్‌ను పోతగా పోశారని తెలిపారు. ఆ తర్వాత ఎలక్ట్రోప్లేటింగ్ విధానాన్ని ఉపయోగించి అందులోని పాలీసై్టరీన్ కరిగిపోయేలా చేశారు. దీంతో ఆ బంతుల్లో చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడ్డాయి. ఇవి మానవ వెంట్రుక మందం కన్నా 10 వేల రెట్లు చిన్నగా ఉంటాయి. -
ఆట నేర్పే బంతి
మీరు ఫుట్‌బాల్ నేర్చుకోవాలనుకుంటున్నారా? కోచ్ ఎవరూ లేరని బాధపడుతున్నారా? అయితే ఫొటోలో కనిపిస్తున్న బంతి మీ కోసమే! ఈ హైటెక్ బంతిలోనే ఓ కోచ్ ఉన్నాడు. బంతిలో రకరకాల సెన్సర్లు అమర్చారు. మీరు బంతిని తన్నినప్పుడు ఎంత గట్టిగా తన్నారు? ఎంత మేరకు బంతి గిరగిరా తిరుగుతోంది?, బంతి ఎంత దూరం వెళ్లింది? ఏ మార్గంలో వెళ్లింది? ఇలాంటి అన్ని వివరాలను ఈ సెన్సర్లు నమోదు చేసుకుంటాయి. వైఫై ద్వారా సమాచారాన్ని విశ్లేషించే ఓ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ .. హెడ్‌ఫోన్ ద్వారా మీకు సూచనలిస్తుంది. ‘‘భలే కొట్టావు, బంతిని కుడివైపునకు తీసుకెళ్లు, సిసర్ కిక్ కొట్టు’’ అంటూ రకరకాల సూచనలు అందివ్వగలదు. వీటితోపాటు అప్లికేషన్లో పది షార్ట్ వీడియో కోచింగ్ మెటీరియల్‌ను పెట్టామని కంపెనీ చెబుతోంది. బాల క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు, కోచ్‌లు అనేక మందితో మాట్లాడాక మూడేళ్లు శ్రమపడి తాము ఈ ఇన్సైడ్ కోచ్ బంతిని అభివృద్ది చేశామని తెలిపింది. ఈ సంవత్సరం చివరినాటికి ఈ అధునాతన బంతి మార్కెట్లోకి రానుంది. -
ఆరుతడి వరికి ‘సెన్సార్ల’ దన్ను!
సెన్సార్లు అమర్చిన పొలాల్లో నిశ్చింతగా ఆరుతడి వరి సాగు నీరు నిల్వ కట్టనక్కర్లేదు.. భూమిలో కొంత మేరకు తేమ ఆరిన తర్వాత సెన్సార్ల ద్వారా రైతుకు ఎస్సెమ్మెస్ వరి మాగాణుల్లో 30-40% వరకు సాగు నీరు ఆదా! {పభుత్వ సంస్థ ‘వాలంతరి’ క్షేత్ర స్థాయి అధ్యయనంలో వెల్లడి కరువు కోరలు చాచి పంటలను కబళిస్తోంది. కరువు కరాళ నృత్యం చేస్తున్న కష్ట కాలం ఇది. బోర్లపై ఆధారపడే మెట్ట పొలాల్లోనే కాదు.. భారీ ప్రాజెక్టుల పరిధిలో సాగు నీటి భరోసా ఉందనుకున్న పొలాల్లోనూ నీటి బొట్టు లేని దుస్థితి. బోర్లలో ఉన్న కొద్ది నీటితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటను కాపాడుకోవడం ఇప్పుడు వారి ముందున్న సవాలు. నీటిని నిల్వగట్టకుండా కాలువ కింద భూముల్లో ఆరుతడి వరి సాగు చేసుకోవచ్చని, నేలలో జాన లోతు వరకు నీటి తేమ ఆరిన తర్వాత మళ్లీ తడి పెట్టుకుంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఆరు తడి పద్ధతుల్లో వరి సాగు చేస్తే దిగుబడి నష్టపోయే ప్రమాదమేమీ లేదా? ముమ్మాటికీ లేదంటున్నారు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్. సాయి భాస్కర్‌రెడ్డి. సెన్సార్లను పొలంలో అమర్చుకోవడం ద్వారా నేలలో తేమ గురించి ఎప్పటికప్పుడు సమాచారం పొందుతూ.. పంట ఎండిపోతుందేమోనన్న భయం లేకుండా నిశ్చింతగా ఆరుతడి వరి సాగు చేయవచ్చంటున్నారు. సాగునీటి ప్రాజెక్టుల కింద మాగాణుల్లో సాగు నీటిని సమర్థవంతంగా వాడుకోవడాన్ని రైతులకు అలవాటు చేయాలన్న సంకల్పంతో ‘వాలంతరి’ అనే ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో ‘క్లైమడాప్ట్’ ప్రాజెక్టు సమన్వయకర్తగా డా. సాయిభాస్కర్రెడ్డి పనిచేశారు. ఈ క్రమంలో సాగు నీటిని ఆదా చేసుకునేందుకు తోడ్పడే తక్కువ ఖర్చుతో కూడిన అల్ట్రాసోనిక్ సెన్సార్లను రూపొందించారు. నల్గొండ, గుంటూరు జిల్లాల్లో కొందరు రైతుల పొలాల్లో ప్రయోగాత్మకంగా వాటర్ ట్యూబులు పాతారు. నేలలోకి అల్ట్రాసోనిక్ సెన్సార్లను ఏర్పాటు చేశారు. 30-40 శాతం సాగు నీటిని ఆదా చేసుకోవచ్చని రుజువైందన్నారు. వరి పొలంలో నీరు నిల్వ లేకపోతే దిగుబడి తగ్గిపోతుందేమోనని రైతులు సాధారణంగా కంగారు పడుతుంటారు. అయితే, నీటి తేమ 15 సెం.మీ.(ఆరు అంగుళాల) లోతు వరకు పొడిబారే వరకు వేచి ఉండి.. తడి పెట్టినా ఇబ్బంది లేదని రైతులు అనుభవపూర్వకంగా గ్రహించారని డా. సాయి భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఆరుతడి పద్ధతుల్లో వరిని సాగు చేసినప్పుడు వేళ్లు మరింత లోతుకు చొచ్చుకెళ్తున్నందున పిలకలు ఎక్కువగా వస్తున్నాయని, ధాన్యం దిగుబడి కూడా పెరిగినట్లు తమ అధ్యయనంలో తేలిందన్నారు. తక్కువ నీటితో ఎక్కువ పంట దిగుబడి తీయడానికి సెన్సార్లు ఉపకరిస్తున్నాయన్నారు. నీటిని నిల్వగట్టే పద్ధతిలో రెండున్నర ఎకరాల(హెక్టారు)లో వరి పంటను సాగు చేయడానికి వాడే నీటికి లీటరుకు పైసా చొప్పున ఖరీదు కడితే రూ. 1,20,000 చెల్లించాల్సి వస్తుంది. కానీ, హెక్టారుకు రైతుకు వచ్చే ఆదాయం మాత్రం రూ. 30 వేలకు మించి ఉండటం లేదు. ఎంతో విలువైన జల వనరులను అతిపొదుపుగా వాడుకోవడానికి అధునాతన సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకోవడం ఉత్తమం. కాలువల ద్వారా చుక్క నీరు వచ్చే వీల్లేని ఈ కరువు కాలంలో బోరు నీటి సదుపాయం కలిగిన రైతులు సెన్సార్లను అమర్చుకొని నిశ్చింతగా ఆరుతడి వరిని పండించుకోవచ్చని డా. సాయి భాస్కర్ రెడ్డి సూచిస్తున్నారు. పంట కాలువల్లో / పొలాల్లో నీటి మట్టం, ఉష్ణోగ్రత, గాలిలో తేమ, నేలలో తేమ, పొలంలో నిల్వ ఉన్న నీటి మట్టం, పంటలున్న పొలం మట్టిలో నీటి తేమ ఎంత కాలంలో ఎంత లోతు వరకు ఆరిపోతున్న విషయాన్ని కూడా ఈ సెన్సార్ల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఆరుతడి పంటలు, పూర్తి వర్షాధార పంటలు, పండ్ల తోటల్లోనూ ఇటువంటి సెన్సార్లను ఏర్పాటు చేసుకోవచ్చు. పొలంలో నాలుగు చోట్ల సెన్సార్లు ఏర్పాటు చేసుకుంటే చాలని డా. సాయి భాస్కర్ రెడ్డి (96767 99191) తెలిపారు. - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఆరుతడి వరిలో సెన్సార్లతో ఉపయోగమే! నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఏడెకరాల్లో వరి, మొక్కజొన్న పండిస్తున్నా. మా పొలంలో డా. సాయి భాస్కర్‌రెడ్డి మూడేళ్ల క్రితం సెన్సార్లను ఏర్పాటు చేశారు. మా పొలంలో మూడు చోట్ల సెన్సార్లు ఏర్పాటు చేశారు. అంతకుముందు కాలువ నీరు ఎప్పుడూ చేనులో నుంచి పై నుంచి కిందికి పారుతూ ఉండేది. ఎప్పుడు నీరు నిల్వ ఉంచేవాళ్లం. సెన్సార్లు పెట్టిన తర్వాత నీరు నిల్వగట్టడం మానేశాను. పొలం మట్టిలో జాన లోతు వరకు తేమ ఆరిన తర్వాత తడి పెట్టడం నేర్చుకున్నాను. అవసరమైనప్పుడు నీటి తడి పెడితే చాలని సెన్సార్లు పెట్టిన తర్వాత తెలుసుకున్నాను. దిగుబడి కూడా పెరిగింది. గత ఖరీఫ్‌లో 1121 రకం 45 బస్తాలు, బీపీటీ 40 బస్తాల దిగుబడి వచ్చింది. నిరుడు ఆరుతడి పంటను సుడి దోమ అంతగా దెబ్బతీయలేదు. నీరు నిల్వగట్టిన పంటకు సుడిదోమ దెబ్బ ఎక్కువగా ఉంది. సెన్సార్లు ఉపయోగకరమే. ఈ సంవత్సరం కాలువ నీళ్లు రాలేదు. బోరు నీటితో 3 ఎకరాల్లో ఆరుతడి వరి సాగు చేస్తున్నా. - కొడాలి ప్రభాకరరావు (90522 46301), కొండప్రోలు, దామరచర్ల మండలం, నల్గొండ జిల్లా నీళ్లు జాగ్రత్తగా వాడటం నేర్చుకున్నా! మా రెండెకరాల వరి పొలంలో 4 చోట్ల సెన్సార్లు పెట్టాం. అంతకుముందు 24 గంటలూ పొలంలో నుంచి నీరు పారుతూనే ఉండేది. సెన్సార్లు పెట్టిన తర్వాత రోజుకు రెండు సార్లు సెల్‌కు మెసేజ్ వస్తుంది. నీటి లోతు, గాలిలో తేమ, ఉష్ణోగ్రత వివరాలుంటాయి. దీంతో నీళ్లు జాగ్రత్తగా వాడటం నేర్చుకున్నాను. ఇప్పుడు బోరు నీటితో ఆరుతడి వరి సాగు చేస్తున్నా. మామూలుగా 3 ఎకరాలకు సరిపోయే నీరు 5 ఎకరాలకు సరిపోతున్నది. - గోవిందు (99121 91838), గేలి తండా, దామరచర్ల, నల్గొండ జిల్లా -
ఘుమఘుమలతో నిద్ర లేవండి...
తెలతెలవారుతూండగా ‘‘కౌసల్యా సుప్రజా రామా...’’ అంటూ మంద్రంగా సుబ్బు లక్ష్మి వెంకటేశ్వర సుప్రభాతం వినిపిస్తూంటే... వంటింట్లోంచి కాఫీ ఘుమఘుమలు ముక్కు పుటాలకు చేరుతూంటే.. అది గుడ్ మార్నింగే అవుతుంది. ఈ అనుభూతి రోజూ పొందాలను కుంటున్నారా? మీకిష్టమైన సంగీతంతోపాటు... సువాసనలూ ఆస్వాదిస్తూ నిద్రలేవాలనుకుంటున్నారా? అయితే సెన్సర్ వేక్ అలారమ్ క్లాక్ మీ కోసమే! ఫ్రెంచ్ కంపెనీ తయారు చేసిన ఓ టేబుల్‌టాప్ అలారమ్ క్లాక్తోపాటు కొన్ని సెన్సర్ల సాయంతో కమ్మని వాసనలు వెలువరించే ఓ పరికరాన్నీ తయారు చేసింది మరి. ఈ పరికరంలో భారతీయ వంటకాల వాసనలేవీ ప్రస్తుతానికి లేకున్నా.. బ్రెడ్ రోస్ట్, ఎస్ప్రెస్సో కాఫీలతోపాటు పీచ్, స్ట్రాబెర్రీ కాండీ, అల్లం, పెప్పర్మింట్ సువాసనలను వెదజల్లుతుంది. నిద్ర లేవాలనుకున్న సమయాన్ని సెట్ చేసుకోవడం.. వాసనలు వెదజల్లే క్యాప్సూల్‌ను పరికరంలో పడేయడం మాత్రమే మనం చేయాల్సిన పనులు. గివావుడాన్ అనే కంపెనీ సెన్సర్ వేక్ కోసం సువాసనల క్యాప్సూళ్లను తయారు చేస్తోంది. అన్నీ సవ్యంగా సాగితే ఈ ఏడాది నవంబర్‌కల్లా సెన్సర్ వేక్ మార్కెట్లోకి రానుంది. -
ప్రపంచం మీ కాళ్ల కింద..!
- ‘లేచల్’ అంటున్న హైదరాబాదీ స్టార్టప్ - జీపీఎస్, సెన్సార్లతో పనిచేసే స్మార్ట్ షూ తయారీ - ఎవరి సహాయం లేకుండా ఎక్కడికైనా వెళ్ళొచ్చు - మార్కెట్లోకి రాకముందే 145 దేశాల నుంచి 50,000 ప్రీ-ఆర్డర్లు - సెప్టెంబర్ నుంచి రిటైల్ మార్కెట్లోకి లేచల్ బూట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచాన్ని జయించాలంటే అలగ్జాండరే కానవసరం లేదు! కత్తి యుద్ధంలో చేయి తిరగాల్సిన అవసరం అంతకంటే లేదు!! కావాల్సిందల్లా కాసింత బుర్ర. కలను సాకారం చేసుకోవాలన్న పట్టుదల, దానికి తగ్గ ప్రణాళిక. అచ్చం దీన్నే ఫాలో అయ్యాడు హైదరాబాదీ యువకుడు క్రిస్పియన్ లారెన్స్. మిచిగాన్ యూనివర్శిటీ పట్టభద్రుడైన ఈయన... లాభాల కోసం కాకుండా సమాజానికి ఉపయోగపడే సంస్థను స్థాపించాలనుకున్నాడు. రెండేళ్లపాటు శ్రమించి సహచరుడు అనిరుధ్ శర్మతో కలిసి డ్యుకేర్ టెక్నాలజీస్ సంస్థను స్థాపించారు. ‘లే చల్’ బ్రాండ్ పేరుతో షూ, ఇన్సోల్లను తయారు చేశారు. వీటి ప్రత్యేకత ఏంటంటే.. జీపీఎస్ టెక్నాలజీతో పనిచేసే ఈ షూలతో తెలియని ప్రాంతాలకు కూడా ఎవరి సహాయం అక్కర్లేకుండా చేరుకోవొచ్చు. దీనిపై క్రిస్పి లారెన్స్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ... లే చల్ విశేషాలను వివరించారు. అది ఆయన మాటల్లో చెప్పాలంటే... షూనే ముడి సరుకుగా ఎందుకు ఎంచుకున్నామంటే.. ఇప్పటికే మార్కెట్లో జీపీఎస్‌తో పనిచేసే గూగుల్ కళ్లద్దాలు, వాచ్‌ల వంటివి ఉన్నాయి. నిజానికి మనం బయటకు వెళుతున్నపుడు వాటిని మరిచిపోయే ప్రమాదముంది. కానీ, షూ లేకుండా ఎక్కడికీ వెళ్లం కదా? అందుకే దీన్ని ఎంచుకున్నాం. ప్రస్తుతం లే చల్ (అంటే నన్నూ తీసుకుపో అని అర్థం) బ్రాండ్‌తో షూ, ఇన్సోల్(దీన్ని మనకు ఏ షూలో కావాలంటే అందులో అమర్చుకోవచ్చు) 2 రకాల ఉత్పత్తులున్నాయి. నలుపు, ఎరుపు రంగుల్లో స్త్రీ, పురుషులిద్దరి ఇవి లభిస్తున్నాయి. వీటి ధరలు 150-200 డాలర్లు. మూగ, చెవిటి వాళ్లకు 30-40% రాయితీ ఇస్తున్నాం. ఇందుకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌తో ఒప్పందం చేసుకున్నాం. ఆర్డరిచ్చిన నెల రోజుల్లో డెలివరీ చేస్తాం. ముందైతే మూగ, చెవిటి వాళ్లకే.. కంపెనీ అంటే డబ్బు సంపాదన మాత్రమే కాదు. సమాజానికీ ఉపయోగపడాలన్నది నా కోరిక. అందుకే 2010లో డుకేర్ టెక్నాలజీస్‌ను స్థాపించాలనే ఆలోచన వచ్చినపుడు లే చల్ షూలను కేవలం మూగ, చెవిటి వాళ్ల కోసమే తయారు చేసేవాళ్లం. రెండేళ్ల తర్వాత ‘‘మనకు తెలియని ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి అడ్రస్‌ల గురించి ఇతరులను అడిగే బదులు లే చల్ షూలోని జీపీఎస్, సెన్సర్లను వినియోగించుకుంటే పోలే’’ అనిపించింది. వెంటనే అందరికీ ఉపయోగపడేలా చిన్న చిన్న మార్పులు చేసి ఫ్యాషన్ బ్రాండ్‌గా మార్కెట్లోకి విడుదల చేశాం. వీటి తయారీలో హై క్వాలిటీ థెర్మోప్లాస్టిక్ పాలీ యుతేరెన్, పాలియెస్టర్ ఫ్యాబ్రిక్, రబ్బర్, ఏబీపీసీ, ఇథలిన్ వినైల్ అసిటేట్(ఈవీఏ), పాలీప్రొపైలన్ (పీపీ)వినియోగిస్తాం. ఈ షూలు నీట్లో వాడినా ఏమీకావు. యాంటి బ్యాక్టీరియల్ కూడా. వైబ్రేషన్సే బండ గుర్తులు ముందుగా సెల్ఫోన్లో డ్యుకేర్ టెక్నాలజీ ఆప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వెళ్లాల్సిన చోటును ముందే ఆప్‌లో చెప్పాలి. వెంటనే అది మనం కాలుకు తొడుకున్న షూస్లోని జీపీఎస్, సెన్సార్ వ్యవస్థకు అనుసంధానమవుతుంది. దీన్ని కేవలం నడిచేటప్పుడే కాదు.. బైక్ మీద వెళ్తున్నప్పుడూ వినియోగించవచ్చు. మనం వెళ్తున్న సమయంలో మనం కుడి వైపునకు మళ్లాల్సి వచ్చినప్పుడు కుడి వైపుకు, ఎడమ వైపుకు మళ్లాల్సి వచ్చినప్పుడు ఎడమ వైపునకు షూలో వైబ్రేషన్స్ వస్తాయి. దానర్థం మనం దారి మళ్లాలని. ఇలా మనం ఎంచుకున్న స్థానానికి కాలికున్న షూ తీసుకెళుతుందన్న మాట. మనం ఎంత దూరం నడిచాం? ఇంకెంత దూరముంది? ఎంత వేగంతో నడుస్తున్నాం? ఎంత సమయంలో చేరుకున్నాం? ఎన్ని కేలరీలు కరిగాయి? వంటి ఆడియో ఫీడ్ బ్యాక్‌ను కూడా ఇస్తాయి. అవసరం లేనప్పుడు షూలను చార్జింగ్ చేసుకుంటే సరి. సెప్టెంబర్ నుంచి రిటైల్ మార్కెట్లోకి.. ప్రస్తుతం మా ఉత్పత్తులను లే చల్ వెబ్సైట్ నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. సెప్టెంబర్ నుంచి రిటైల్ మార్కెట్లోకి వస్తున్నాం. దీనికోసం దేశంలోని పెద్ద పెద్ద రిటైల్ చైన్లతో ఒప్పందం చేసుకున్నాం. ఈ ఏడాది ముగిసేనాటికి అంతర్జాతీయ స్పోర్ట్స్ బ్రాండ్స్‌తో కలిసి స్పోర్ట్స్ షూను కూడా మార్కెట్లోకి విడుదల చేస్తాం. ఇప్పటికి 145 దేశాల నుంచి వచ్చిన 50,000 షూల ప్రీ ఆర్డర్లను ఈ నెలాఖరుకు డెలివరీ చేస్తున్నాం. ఇందులో ఇండియాతో పాటు అమెరికా, జపాన్, యూరప్ దేశాల వాటా ఎక్కువగా ఉంది. 2016 డిసెంబర్ నాటికి 10 లక్షల స్థాయిని చేరుకోవాలనేది మా లక్ష్యం. స్టార్టప్ డైరీ స్టార్టప్‌ల అడ్డా హైదరాబాద్‌లో పుట్టుకొస్తున్న కంపెనీలు అంతర్జాతీయ దిగ్గజాలకు సైతం సవాలు విసురుతున్నాయి. మీరు చేయలేని పని మేం చేస్తున్నాం చూడమంటూ కవ్విస్తున్నాయి. అలాంటిదే ఈ స్టార్టప్ కంపెనీ ‘లే చల్’ కూడా. కొంపల్లిలో మరో యూనిట్.. ప్రస్తుతం సికింద్రాబాద్‌లో నెలకు 40 వేల షూలు, ఇన్సోల్లు ఉత్పత్తి చేసే యూనిట్ ఉంది. త్వరలోనే కొంపల్లిలో మరో యూనిట్ ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం మా కంపెనీలో 80 మంది ఉద్యోగులున్నారు. అసెంబుల్ సెక్షన్లో 70% సిబ్బంది మూగ, చెవిటి వాళ్లే. వాళ్ల సమస్యలేంటో వారికే సరిగ్గా తెలుస్తాయి కనక వారిని నియమించుకున్నాం. చైనా, సింగపూర్, జపాన్ల నుంచి ఎలక్ట్రానిక్స్, సెన్సర్లు, బ్యాటరీలు దిగుమతి చేసుకుంటున్నాం. కొన్ని భారత్‌లోనే తయారు చేస్తున్నాం. 5 మిలియన్ డాలర్ల పెట్టుబడులు.. రూ.2 కోట్ల పెట్టుబడులతో ప్రారంభించిన కంపెనీ ఇప్పుడు రూ.15 కోట్లకు చేరింది. 2013లో ఓ దేశీ టెక్నాలజీ సంస్థ 2 మిలియన్ల అమెరికా డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఈ ఏడాది ముగిసేనాటికి మరో 5 మిలియన్ డాలర్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉంది. పూర్తిస్థాయిలో మార్కెట్లోకి రావటానికి టర్నోవర్‌లో 5-10 శాతం మార్కెటింగ్ కోసం ఖర్చు చేస్తాం. లే చల్ షూ, ఇన్సోల్పై అమెరికా, ఇండియాల్లో 24 రకాల పేటెంట్స్ తీసుకున్నాం. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
ఇక ముందుగానే భూకంప హెచ్చరికలు!
న్యూఢిల్లీ: వరుస భూకంపాలు నేపాల్‌ను నేలమట్టం చేశాయి. ఇటు భారత్‌నూ వణికించాయి. అయితే.. పెను తుపాన్లు, సునామీల ముప్పును గుర్తించినట్లు.. భూకంప ముప్పునూ ముందస్తుగా గుర్తించలేమా? ఇప్పటికైతే.. భూకంపాలు ఎప్పుడు వస్తాయో కచ్చితంగా అంచనా వేయడం మాత్రం అసాధ్యం. కానీ.. భూకంపం మొదలయ్యాక.. అది విధ్వంసం సృష్టించడానికి కొన్ని సెకన్ల ముందయితే మాత్రం గుర్తించొచ్చు. అలా ముందస్తు భూకంప హెచ్చరికలు పంపే వ్యవస్థ జపాన్, చైనా, తైవాన్, టర్కీ, మెక్సికో దేశాల్లో ఇప్పటికే పని చేస్తోంది. భారత్‌లోనూ దీనిని ఏర్పాటు చేసేందుకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. వచ్చే నెలలో ఈ వ్యవస్థను కేంద్రం ప్రయోగాత్మకంగా పరీక్షించనుంది. ఇందు కోసం ఐఐటీ రూర్కీలోని ఎర్త్‌క్వేక్ ఇంజనీరింగ్ విభాగం ఓ పాజెక్టు కూడా ప్రారంభించిం ది. ప్రాజెక్టులో భాగంగా ఛమోలి-ఉత్తరకాశీల మధ్య 100 సెన్సర్లను ఏర్పాటు చేయాలని ప్రతి పాదించగా, 52 సెన్సర్లను ఇదివరకే అమర్చారు.