అతి చిన్న సెన్సర్ సహాయంతో రోజూ తీసుకునే ఆహారం దానితో ముడిపడిన ఆరోగ్య అంశాలను రియల్ టైమ్‌లో (ఎప్పటికప్పుడు) పర్యవేక్షించవచ్చునని టఫ్ట్స్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ పరిశోధకులు చెబుతున్నారు. ఆరోగ్య పరిరక్షణకు లేదా వైద్యపరమైన అంశాల అధ్యయనానికి ఇది కీలకంగా మారనుంది. ఈ పరిశోధకులు రూపొందించిన సెన్సర్‌ను పంటిపై అమర్చి, దానిని మొబైల్‌కు అనుసంథానిస్తే చాలు.. మనం తీసుకున్న ఆహారంలోని గ్లూకోజ్ (చక్కెర), ఉప్పు, సేవించిన మద్యానికి సంబంధించిన సమాచారం ట్రాన్స్‌మిట్ అవుతుంది. వీటి ద్వారా పోషకాలు, రసాయనాలు,శారీరికపరమైన అంశాలు గుర్తించవచ్చు. ఆహార పర్యవేక్షణకు గతంలో అనుసరించే పద్ధతుల్లో కచ్చితత్వం కొరవడడంతో 2 మి.మీ పరిమాణంలో స్సెనర్‌ను రూపొందించినట్టు టఫ్ట్స్ ఇంజనీర్లు వెల్లడించారు.
మూడు దొంతరలుగా రూపొందించిన ఈ సెన్సర్లు చిన్న యాంటెన్నాలుగా రేడియో ప్రీక్వెన్సీ స్పెక్ట్రమ్‌లో తరంగాలు స్వీకరించి, ప్రసారం చేస్తాయి. ఉప్పు ,ఇథనాల్, తదితర వస్తువులు తీసుకున్నపుడు వేర్వేరు రేడియో ఫ్రీక్వెన్సీలు ప్రసారం చేస్తాయి. ఈ విధంగా పోషకాలు, ఇతర అంశాలు గుర్తిస్తారు. సాథారణంగా ఉపయోగించే రేడియో ప్రీక్వెన్సీ ఐడీ (ఆర్‌ఎప్‌ఐడీ) సాంకేతికతనే సెన్సర్ ప్యాకేజీలోకి మరింతగా విస్తరించి నిర్దేశిత ఫలితాలు సాధించినట్టు పరిశోధకులు ఫియోరెంజో ఒమెనెట్టో, ఫ్రాంక్ సి.డొబుల్ తెలిపారు. ఈ సెన్సర్‌ను పంటిపై, చర్మంపై లేదా మరెక్కడైనా అమర్చినా ఈ సమాచారాన్ని పొందవచ్చన్నారు. యూఎస్ ఆర్మీ నాటిక్ సోల్జర్ రిసెర్చ్, డెవలప్‌మెంట్ అండ్ ఇంజనీరింగ్ సెంటర్, ది నేషనల్ ఇనిసిట్యూట్స్ ఆఫ్ హెల్త్, నేషనల్ ఇనిసిట్యూట్ ఆఫ్ బయో మెడికల్ ఇమేజింగ్ అండ్ బయో ఇంజనీరింగ్, ఆఫీస్ ఆఫ్ ది నేవల్ రిసెర్చి సహకారంతో ఈ అధ్యయనం జరిపారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment