పుచ్చకాయలు పేలడం గురించి మీకు తెలుసా? ఇదేం విచిత్రం.. సాధారణంగా గట్టిగా నేలకేసి కొట్టినా పుచ్చకాయ పగలదు కదా అంటారా.. కానీ అమెరికాలో మాత్రం ఈమధ్య పుచ్చకాయలు బాంబుల్లా పేలిపోతున్నాయి. దీంతో అక్కడి వారు పుచ్చకాయలు కొనాలంటేనే హడలిపోతున్నారట. ఇలా ఎందుకు జరగుతుంది? అసలు పుచ్చకాయలు పేలిపోవడానికి గల కారణాలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం.
అమెరికాలో లీలా ఫాడెల్ అనే మహిళ.. మర్కెట్‌కు వెళ్లి పుచ్చకాయ తెచ్చుకున్నానని, ఇంటికెళ్లి కిచెన్‌లో పెట్టగానే అది పేలిపోయిందని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. ఇలా లీలా ఫాడెల్ మాత్రమే కాదు.. అమెరికాలో చాలామందికి ఈ మధ్య ఇలాంటి సంఘటనలే ఎదురయ్యాయి. పుచ్చకాయలు ఇలా సడెన్‌గా పేలిపోతున్నాయని ఇదేం విచిత్రం అంటూ నివ్వెరపోతున్నారు. బాంబుల్లా పేలిపోతున్న పుచ్చకాయలు అంటూ సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అన్నదానిపై రీసెర్చ్ మొదలైంది.
అమెరికాలో జరిపిన కొన్ని అధ్యయనాల ప్రకారం.. పుచ్చకాయలో ఒక నిర్ధిష్ట రకమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతోందని దానివల్ల సహజ చక్కెర, ఈస్ట్ అనే పదార్థాలు ఉత్పన్నం అవుతాయని తేలింది. పుచ్చకాయలు పేలడానికి ఫార్మెంటేషన్ మాత్రమే కారణం కాదని బ్యాక్టీరియా లేదా ఫంగల్ వ్యాధి కూడా కారణం కావచ్చని కార్నెల్‌లోని స్కూల్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ ప్లాంట్ సైన్స్ హార్టికల్చర్ ప్రొఫెసర్ డాక్టర్ స్టీవ్ రీనర్స్ అన్నారు.
పంట త్వరగా చేతికి రావాలని కొందరు రసాయనాలు కలుపుతున్నారని, ఇవి పుచ్చకాయల్లో ఉండే నేచురల్ షుగర్‌తో కలిసిపోయి పేలిపోతున్నట్లు రీసెర్చ్‌లో వెల్లడైంది. అంతేకాకుండా వీటిని ఒకేసారి అధిక ఉష్ణోగ్రతలు ఉన్న చోట పెట్టడం కూడా ఈ పేలుళ్లకు కారణం కావచ్చని తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment