water melon
-
నిలువు పుచ్చ తోట!అవును..నిజమే!
నిలువు పుచ్చ తోట, అవును మీరు చదవింది.. ఈ ఫొటోలో చూస్తోంది.. నిజమే! మన పుచ్చ తోటల్లో పాదులు నేలపై పరచుకొని ఉంటాయి. పుచ్చ కాయలు నేలపైనే పెరుగుతాయి కదా. సౌతాఫ్రికాలో ఒక కంపెనీ పాలీహౌస్‌లలో పుచ్చ పాదులు నిలువుగా ఎగబాగుకుతున్నాయి. పుచ్చ కాయలు వాటికి వేలాడుతున్నాయి. ట్రెల్లిస్ పద్ధతిలో పెరిగే టొమాటోల మాదిరిగా ఈ పుచ్చకాయలు వేలాడుతున్నాయి కదూ.. కాండీ బాల్ సీడ్లెస్ పుచ్చకాయలు కిలో నుంచి కిలోన్నర వరకు బరువు పెరుగుతాయి. అదేమాదిరిగా కిలో బరువు పెరిగే స్మైల్ మెలన్స్ (ఇదో రకం కర్బూజ) పండ్లను కూడా నిలువు తోటల్లో పెంచుతున్నారు. టొమాటోలు వంటి కాయలు బరువు తక్కువగా ఉంటాయి కాబట్టి తీగజాతి మొక్కలు మొయ్యగలుగుతాయి. అయితే, ఇలాంటి నిలువు తోటలో పుచ్చకాయలు, కర్బూజ కాయల బరువు మొక్కలకు భారం కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లాస్టిక్ నెట్ కవర్లతో కాయలను ప్లాస్టిక్ వైర్లకు కట్టేస్తున్నారు. ‘నిలువు తోటలో పెరిగిన పుచ్చకాయలను మేం త్వరలోనే అమ్మకానికి పెట్టబోతున్నాం. సౌతాఫ్రికా మార్కెట్లో మేమే ఫస్ట్’ అంటున్నారు ఆ కంపెనీ ప్రతినిధి ఫ్రాంకోయిస్ ఫౌరీ. పాలీహౌస్‌లు, నెట్‌హౌస్‌లలో, మేడపై ఇంటిపంటల్లో ట్రెల్లిస్ పుచ్చ, కర్బూజ సాగు సాధ్యమే అని గ్రహించాలి! -
కేన్స్‌లో హైలెట్‌గా నటి పుచ్చకాయ హ్యాండ్‌బ్యాగ్.. వెనుక ఇంత కథా..!
ఇటీవల ప్రాన్స్‌లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలో అగ్ర సినీ తారలంతా తమదైన ఫ్యాషన్ స్టైల్లో మెరిశారు. ఒక్కోకరూ ఒక్కో పంథాలో తమ డిజైనర్ వేర్ డ్రస్సింగ్ స్టయిల్‌తో మెరిశారు. మరికొందరూ మాత్రం తమ ఫ్యాషన్‌కి అద్భుతమైన జోడించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. సరిగ్గా అలాంటి పనే చేశారు మలయాళ నటి కని కుస్రుతి. ఆమె ధరించిన పర్సు వెనుక ఉన్న స్టోరీ వింటే..వావ్..! అని మెచ్చుకోకుండా ఉండలేరు.కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో నటి కని కుస్రుతి కీలక పాత్ర పోషించిన "ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్" చిత్రానికి గ్రాండ్ ప్రిక్స్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె కేన్స్ రెడ్ కార్పెట్‌పై అద్భుతమైన డిజైన్ వేర్ దుస్తులతో మెరిశారు. అయితే ఈ వేడుకలో ఆమె చేతికి ఉన్న పుచ్చకాయను పోలిన హ్యాండ్‌బ్యాగ్ కాస్త హైలెట్‌గా నిలిచింది. ఈ వేడుకలో ఆమె స్టయిలిష్‌గా ఈ పుచ్చకాయను ధరించడానికి గల రీజన్ వింటే కంగుతింటారు. తన ఫ్యాషన్‌తో ఈ కేన్స్ రెడ్‌కార్పెట్‌పై భారత్ తరుఫునా పాలస్తీనాకు సంఘీభావం తెలిపారు కని. అందుకోసమే ఆమె ఈ పుచ్చకాయ హ్యండ్ బ్యాగ్‌ను ఎంచుకున్నారట. అందేంటి దీంతో సంఘీభావమా? అనుకోకండి. ఎందుకంటే ఈ పుచ్చకాయ పాలస్తీనా జెండా రంగులను పోలీ ఉంటుంది. ఎర్ర పుచ్చకాయలోని గజ్జు, నల్లగింజలు, లోపలి తెల్లని తొక్క భాగం పైన ఉండే ఆకుపచ్చని భాగం ఇవన్నీ పాలస్తీనా జెండాకు చిహ్నంగా ఉంటాయి. అందుకే దీన్ని ఎంచుకున్నారు కని. నిజానికి ఇలా పాలస్తీనా చిహ్నంగా పుచ్చకాయ చిహ్నంగా ఉద్భవించింది 1967లో. ఇజ్రాయెల్ గాజా వెస్ట్ బ్యాంక్‌ను నియంత్రణలోకి తెచ్చుకుని తూర్పు జెరూసలెంని స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత గాజాలో పాలస్తీనా జెండాను ప్రదర్శించడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ.. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఒక ఉత్తర్వుని జారీ చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ పాలస్తీనియన్లు పుచ్చకాయను తమ జెండాకు చిహ్నంగా ఉపయోగించారు.ప్రస్తుతం గాజాపై ఇజ్రాయెల్ దాడులతో భయంకరంగా విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఇప్పటి వరకు దాదాపు 35 వేల మందికి పైగా చనిపోయారు. వారిలో సుమారు 15 వేలకు పైగా చిన్నారులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కాగా, ఇలా కని తోపాటు కేన్స్‌లో పాలస్తీనాకు సంఘీ భావం తెలిపిన ఇతర అంతర్జాతీయ నటులు, కేట్ బ్లాంచెట్, లీలా బెఖ్తీ వంటి వారు కూడా ఉన్నారు. ఇక్కడ నటి కేట్ బ్లాంచెట్ పాలస్తీనా జెండాను అనుకరించేలా గౌను ధరించగా, బెఖ్తీ పుచ్చకాయ విత్తనాన్ని పోలిన హృదయం ఆకారపు పిన్ను ధరించారు. (చదవండి: ఆ వ్యాధి ధనవంతులకే వస్తుందా?) -
Beauty Tips: కాలానుగుణంగా.. చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే..?
ప్రతిరోజూ ఎండతోపాటుగా.. వర్షాలు, చల్లదనం, వాతవరణంలో ఓకేసారి మార్పుల కారణంగా ఆరోగ్యంపై ప్రభావం పడవచ్చు. అందులో చర్మం విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవచ్చు. ఇలాంటి సమస్యలను అధిగమిస్తూ అందంగా కనిపంచాలంటే ఈ బ్యూటీ టిప్స్ ట్రై చేయండి..పుచ్చకాయ.. ద్రాక్ష!పుచ్చకాయ, ద్రాక్ష కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. దీంట్లో నిమ్మరసం, కోడిగుడ్డు లోని తెల్లసొన కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. వేసవిలో ఈ ఫ్రూట్ ప్యాక్‌ని తరచూ వేసుకోవడం వల్ల చర్మంలో జిడ్డు తగ్గి, కాంతిమంతం అవుతుంది.ఆరెంజ్ జ్యూస్..టీ స్పూన్ తేనె, కొద్దిగా ఆరెంజ్ జ్యూస్, టేబుల్ స్పూన్ ఓట్స్, రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉంచి, చల్లబడ్డాక ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకుంటే ముఖచర్మం సేదదీరుతుంది.కొబ్బరిపాలతో..ఎండలో నుంచి ఇంటికి వెళ్లినప్పుడు ఫ్రిజ్‌లో ఉంచిన కొబ్బరిపాలలో దూది ఉండను ముంచి, దాంతో ముఖం, చేతులపై అద్ది, పది నిమిషాలు సేదదీరాలి. తర్వాత స్నానం చేస్తే ఎండవల్ల కమిలిన చర్మానికి ఉపశమనం లభిస్తుంది. మృదువుగా, కాంతిమంతంగా తయారవుతుంది.సోంపుతో..రెండు టీ స్పూన్ల సోంపు గింజలను దంచి, అరకప్పు నీటిలో వేసి, మరిగించాలి. చల్లారాక ఈ నీటిని వడకట్టి, టీ స్పూన్ నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమం ఫ్రిజ్‌లో ఉంచాలి.ఎండ నుంచి ఇంటికి వచ్చినప్పుడు దూది ఉండను సోంపు నీటిలో ముంచి ముఖం, మెడ, చేతులు తుడుచుకోవాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ నీళ్లు స్వేదరంధ్రాలలోని మలినాలను తొలగిస్తాయి. దురద, దద్దుర్లు, ట్యాన్ వంటి సమస్యలనూ తగ్గిస్తాయి. చర్మం కాంతిమంతంగా కనిపిస్తుంది.ఇవి చదవండి: ఖర్జూరతో.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా! -
అమెరికాలో అసలేం జరుగుతుంది?బాంబుల్లా పేలుతున్న పుచ్చకాయలు
పుచ్చకాయలు పేలడం గురించి మీకు తెలుసా? ఇదేం విచిత్రం.. సాధారణంగా గట్టిగా నేలకేసి కొట్టినా పుచ్చకాయ పగలదు కదా అంటారా.. కానీ అమెరికాలో మాత్రం ఈమధ్య పుచ్చకాయలు బాంబుల్లా పేలిపోతున్నాయి. దీంతో అక్కడి వారు పుచ్చకాయలు కొనాలంటేనే హడలిపోతున్నారట. ఇలా ఎందుకు జరగుతుంది? అసలు పుచ్చకాయలు పేలిపోవడానికి గల కారణాలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. అమెరికాలో లీలా ఫాడెల్ అనే మహిళ.. మర్కెట్‌కు వెళ్లి పుచ్చకాయ తెచ్చుకున్నానని, ఇంటికెళ్లి కిచెన్‌లో పెట్టగానే అది పేలిపోయిందని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. ఇలా లీలా ఫాడెల్ మాత్రమే కాదు.. అమెరికాలో చాలామందికి ఈ మధ్య ఇలాంటి సంఘటనలే ఎదురయ్యాయి. పుచ్చకాయలు ఇలా సడెన్‌గా పేలిపోతున్నాయని ఇదేం విచిత్రం అంటూ నివ్వెరపోతున్నారు. బాంబుల్లా పేలిపోతున్న పుచ్చకాయలు అంటూ సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. దీంతో అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అన్నదానిపై రీసెర్చ్ మొదలైంది. అమెరికాలో జరిపిన కొన్ని అధ్యయనాల ప్రకారం.. పుచ్చకాయలో ఒక నిర్ధిష్ట రకమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతోందని దానివల్ల సహజ చక్కెర, ఈస్ట్ అనే పదార్థాలు ఉత్పన్నం అవుతాయని తేలింది. పుచ్చకాయలు పేలడానికి ఫార్మెంటేషన్ మాత్రమే కారణం కాదని బ్యాక్టీరియా లేదా ఫంగల్ వ్యాధి కూడా కారణం కావచ్చని కార్నెల్‌లోని స్కూల్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ ప్లాంట్ సైన్స్ హార్టికల్చర్ ప్రొఫెసర్ డాక్టర్ స్టీవ్ రీనర్స్ అన్నారు. పంట త్వరగా చేతికి రావాలని కొందరు రసాయనాలు కలుపుతున్నారని, ఇవి పుచ్చకాయల్లో ఉండే నేచురల్ షుగర్‌తో కలిసిపోయి పేలిపోతున్నట్లు రీసెర్చ్‌లో వెల్లడైంది. అంతేకాకుండా వీటిని ఒకేసారి అధిక ఉష్ణోగ్రతలు ఉన్న చోట పెట్టడం కూడా ఈ పేలుళ్లకు కారణం కావచ్చని తెలియజేశారు. -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుచ్చకాయ.. ఏందుకంత స్పెషల్?
పుచ్చకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో 95 శాతం నీరు ఉండటం వల్ల శరీరం డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. అంతేకాకుండా పుచ్చకాయను ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకుంటే క్యాన్సర్ బారి నుంచి కూడా తప్పించుకోవచ్చు. రక్తప్రసరణను మెరుగుపరిచడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని పదిల పరిచే పుచ్చకాయను ఏ సీజన్లో అయినా తినేందుకు ఇష్టపడతారు. కానీ ఓ పుచ్చకాయ ధర 5లక్షల రూపాయలంటే నమ్మగలరా? జపాన్‌లో పండే ఈ అరుదైన పుచ్చకాయ అక్కడ చాలా ఫేమస్. ఎందుకంత కాస్ట్లీ? అసలు ఏంటీ దాని స్పెషాలిటీ ఇప్పుడు చూద్దాం. జపాన్ దేశంలో అత్యంత ఖరీదైన పండ్లను పండిస్తారు. వాటిలో ఒకటి డెన్సుకే పుచ్చకాయ. దీన్ని పండించేందుకు అత్యాధునిక వ్యవసాయ పద్ధతులను పాటిస్తారు. ఈ పుచ్చకాయల్ని అత్యంత జాగ్రత్తగా పండిస్తారు. ప్రతీ పుచ్చకాయ బరువు దాదాపు 6 నుంచి 7 కేజీల దాకా ఉంటుంది. అంతేకాకుండా దీని రుచి కూడా చాలా బాగుంటుందంట. తియ్యగా కరకరలాడుతూ, రవ్వ రవ్వగా ఉంటుంది. ఏడాది మొత్తంలో కేవలం 100 డెన్సుకే పుచ్చకాయలు మాత్రమే పండుతాయి. పైగా ఇవి సాధాసీదా మార్కెట్లలో లభించవు. వీటిని ప్రత్యేకంగా వేలం పాట ద్వారా విక్రయిస్తారు. దీన్ని జీవితంలో ఒక్కసారైనా రుచి చూడాలనే పట్టుదలతో ఉండేవారు ఈ వేలం పాటలో పాల్గొంటారు. ఈ పుచ్చకాయ ధర ప్రతి ఏటా పెరుగుతుంది. ప్రస్తుతం దీని ధర మార్కెట్లో సుమారు రూ. 5 లక్షలు ఉంది. మరో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే.. ఈ పుచ్చకాయలను తినడానికి కొనరంట..ఎవరికైనా బహుమతిగా ఇవ్వడానికి ఎక్కువగా కొనుగోలు చేస్తారట. అయినా అంద ధర పెట్టి పుచ్చకాయ కొనడం, తినడం రెండూ విడ్డూరమే కదూ.. -
పుచ్చకాయఫై రాజ్యాంగ నిర్మాత ముఖచిత్రం
-
Health Tips: ఆ పళ్లు తిన్న వెంటనే నీళ్లు తాగారో ఇబ్బందుల్లో పడ్డట్లే!
కొందరు వైద్యులు మంచినీళ్లు బాగా తాగమని చెబుతుంటారు. ఇంకొందరు అంత ఎక్కువగా తాగవద్దని చెబుతారు. అయితే కొన్ని పదార్థాలు తిన్న తర్వాత లేదా తాగిన తర్వాత నీళ్లు తాగడం మంచిది కాదని పెద్దవాళ్లు చెబుతుంటారు. దీని వెనుక మనలో చాలా మందికి తెలియని కారణం ఉంది. ఇంతకీ మనం ఏయే పదార్థాలు తీసుకున్న తర్వాత నీరు తాగకుండా ఉండాలో తెలుసా మరి? ►అరటిపండు.. ఆయుర్వేదం ప్రకారం, పండ్లను తీసుకున్న తర్వాత నీరు తాగకూడదు. ఎందుకంటే ఇది శరీర సమతుల్యతను దెబ్బతీస్తుంది. మరి అరటిపండు తిన్న తర్వాత కనీసం అరగంట పాటు నీళ్లు తాగకపోవడానికి ఇదే కారణం. ►పుచ్చకాయ: నీటిశాతం అధికంగా ఉండే వాటిలో పుచ్చకాయదే ప్రముఖ స్థానం. పుచ్చకాయ తిన్న తర్వాత నీటిని తాగడం ద్వారా సహజంగా ఊరే జీర్ణరసాలు పలుచన అవుతాయి. దీనివల్ల పొట్ట ఉబ్బరంగా మారుతుంది. కడుపు నొప్పి లేదా అజీర్ణంతో బాధపడ వలసి వస్తుంది. ►పాలు: పాలు తాగిన తర్వాత నీళ్లు తినకూడదు. ఇలా చేయడం వల్ల జీవక్రియలు మందగిస్తుంది. ఇది ఎసిడిటీ, అజీర్ణానికి కూడా దారి తీస్తుంది. ►సిట్రస్ జాతి ఫలాలు తిన్న తర్వాత... నారింజ, ఉసిరి, సీజనల్ మొదలైన సిట్రస్ పండ్లను తిన్న తర్వాత మన జీర్ణవ్యవస్థ నుండి యాసిడ్ బయటకు వస్తుంది. ఈ పండ్లను తిన్న తర్వాత మనం నీరు తాగితే, పిహెచ్ బ్యాలెన్స్ చెదిరిపోతుంది. అందుకే సిట్రస్ పండ్లు తిన్న తర్వాత మనం నీరు తాగకూడదు. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కోసం మాత్రమే. చదవండి: Postpartum Care- Fitness: బిడ్డల్ని కనే సమయాన్ని వాయిదా వేయనక్కర్లేదు! ఇవి పాటించడం వల్ల ప్రసవం తర్వాత కూడా.. Beard Shaving: రోజూ షేవింగ్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలిస్తే! -
Kitchen Tips: గుడ్లు, చాక్లెట్లు, ఉల్లి.. ఇంకా వీటిని కూడా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? అయితే
Why Should We Not To Store These Foods In Refrigerator: కూరగాయలు, పండ్లు... ఇలా ఏవైనా బయటి నుంచి కొనుక్కుని రాగానే శుభ్రం చేసి ఎక్కువ కాలం తాజాగా ఉండాలని ఫ్రిజ్‌లో పెట్టేస్తాం. అది కొంతవరకూ నిజమే. అయితే కొన్ని కూరగాయలు, పండ్లను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల అవి వాటి సహజ గుణాలను కోల్పోతాయి. ఒక్కోసారి అవే మన అనారోగ్యానికి కారణమవుతాయి. అలాగని ఫ్రిజ్‌లో పెట్టవలసిన వాటిని పెట్టడం మానకూడదు. అయితే ప్రస్తుతానికి మనం ఫ్రిజ్‌లో ఏమేమి పెట్టకూడదో తెలుసుకుందాం. ఈ కింది వాటిని ఎప్పుడూ ఫ్రిజ్‌లో పెట్టకండి. వీటికి గది ఉష్ణోగ్రతే సరిపోతుంది. ఇంతకీ అవేమిటి? వాటిని ఫ్రిజ్‌లో పెడితే ఏమౌతుందో తెలుసుకుందాం. టమాటా: టమాటాలు ఫ్రిజ్‌లో పెడితే గట్టిపడిపోతాయి. వాసన కూడా పోతుంది. దీంతో మనం ఏదైనా వంటకం చేస్తే రుచీపచీ ఉండదు. కాబట్టి ఈసారి మీరు ఇంటికి టమాటాలు తీసుకువస్తే శుభ్రం చేసిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టకుండా బయట గది ఉష్ణోగ్రత వద్దే ఉంచడం మరచిపోకండి. అరటికాయలు: అరటికాయలను ఫ్రిజ్‌లో పెడితే తొందరగా నల్లబడిపోతాయి. ఇలా నల్లబడిన అరటికాయలను చూస్తూ చూస్తూ పారేయలేము. అలాగని తినలేము కూడా. ఒకవేళ తిన్నా కూడా రుచి ఉండదు. అందువల్ల ఫ్రిజ్‌లో పెట్టకుండా ఎక్కువ రోజులు అరటికాయలు తాజాగా ఉండాలంటే వాటిని తడి లేని ప్రదేశంలో ఉంచి ప్లాస్టిక్ కవర్ సగం వరకు తొడగండి. అరటి కాయలే కాదు, అరటి పండ్లు కూడా ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఆవకాడో: ఫ్రూట్స్‌లో కాసింత ఖరీదయినది అవకాడో. మరి అంత ఖరీదు పెట్టి అవకాడో కొన్నాం కదా అని దానిని తీసుకెళ్లి పదిలంగా ఫ్రిజ్‌లో పెట్టేయద్దు. దానివల్ల అవకాడో రుచి మారుతుంది. వాటిని తడి లేని చోట, గాలి మారే చోట భద్రపరిస్తే మంచిది. పుచ్చకాయ: ఇంటికి పుచ్చకాయ తెస్తే సగం కోసి మిగిలింది ఫ్రిజ్‌లో పెట్టేస్తాం. అందరి ఇళ్లల్లో జరిగేదే ఇది. కానీ, పుచ్చకాయని ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల వాటిలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ని కోల్పోతాం. ఫలితంగా పుచ్చకాయ తిన్నా కడుపు నిండుతుందేమో గానీ ఆరోగ్య ప్రయోజనాలు అందవు. వంకాయ: వంకాయలను ఫ్రిజ్‌లో పెడితే తొందరగా పాడైపోతాయి. ఇవి ఫ్రిజ్‌లో కంటే బయట ఉంటేనే తాజాగా ఉంటాయి. ఉల్లి, వెల్లుల్లి: వెల్లుల్లిపాయలు ఫ్రిజ్‌లో కంటే గాలి, వెలుతురు ఉండే చోట పెడితే నెలరోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయి. వీటిని ఫ్రిజ్‌లో పెడితే జిగురు వస్తుంది. ఉల్లి కూడా అంతే! చాక్లెట్లు: చాలామంది పేరెంట్స్ చాక్లెట్లను ఫ్రిజ్‌లో పెట్టి పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఇస్తుంటారు. అయితే అలా ఫ్రిజ్‌లో పెట్టిన చాక్లెట్లు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. పైగా ఫ్రిజ్ లో పెట్టడం వల్ల చాక్లెట్లకు ఉండే సహజమైన రుచి, ఫ్లేవర్ దెబ్బతింటాయి. అయితే బయటపెట్టినా వీటిని ఎండలో కాకుండా కాంతి కిరణాలకు దూరంగా ఉంచడం మంచిది. గుడ్లు: చాలామంది ఇళ్లలో ఫ్రిజ్ తెరవగానే ఎగ్ ట్రేస్ దర్శనమిస్తాయి. అయితే ఎగ్స్‌ని ఎప్పుడూ ఫ్రిజ్‌లో పెట్టకూడదు. మార్కెట్లలో కూడా గుడ్లను ఫ్రిజ్‌లో ఉంచరు. వీలయినంత వరకు వీటిని బయట ఉంచితేనే బెటర్. బ్రెడ్: బ్రెడ్‌ని ఫ్రిజ్‌లో ఉంచితే తొందరగా పాడవుతుంది. అది త్వరగా ఎండిపోతుంది. బ్రెడ్ ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత కూడా బయట ఉంచితే అది ఫ్రెష్‌గా ఉంటుంది. బత్తాయి పండ్లు: సిట్రస్ యాసిడ్ ఉన్న బత్తాయిలు ఫ్రిజ్‌లో ఉంచితే త్వరగా పాడైపోతాయి. అదే విధంగా... తేనె, కాఫీ గింజలు, కెచప్, పీనట్ బటర్, దోసకాయలు, స్ట్రాబెర్రీస్‌లను ఫ్రిజ్‌లో పెట్టద్దు. మరేం చేయాలి.. అని చికాకు పడకండి. మరీ సంచులు సంచులు కాకుండా వారానికి సరిపడా కూరగాయలు, పండ్లు తెచ్చుకోండి చాలు. ఆ తర్వాత మళ్లీ తాజాగా తెచ్చుకుంటే సరి. అప్పుడు అనారోగ్యాలు మీ దరి చేరవు. చదవండి: Health Tips: బోడ కాకర తరచుగా తింటున్నారా? దీనిలోని లుటీన్ వల్ల.. -
ఎండలే కాదు ధరలు మండుతున్నాయ్.. కొనలేం.. తినలేం
సాక్షి,కౌటాల(అదిలాబాద్): జిల్లాలో ఈ ఏడాది కేవలం 30 ఎకరాల్లో పుచ్చకాయల పంటను రైతులు సాగు చేశారు. కాగజ్‌నగర్ డివిజన్లోని మోసం, సిర్పూర్(టి), కౌటాల, చింతలమానెపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో 25 ఎకరాల్లో, ఆసిఫాబాద్ డివిజన్లోని, కెరమెరి, రెబ్బెన మండలాల్లో కేవలం 5 ఎకరాల్లో పుచ్చకాయ పంట సాగవుతున్నట్లు ఉద్యాన శాఖ జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలోని ఆరెగూడ, ఈజ్గాం, నజ్రుల్‌నగర్, సిర్పూర్(టి), వెంపల్లి, రెబ్బెన, గురుడుపేట, డబ్బా, బాబాసాగర్ గ్రామాల్లో రైతులు పుచ్చకాయ పంట అధికంగా సాగుచేస్తున్నారు. వేడిమి నుంచి ఉపశమనం.. వేసవి కాలంలోనే కాకుండా ప్రతీ కాలంలో ప్రజలు పుచ్చకాయలను ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ వీటిపై ఆసక్తి చూపుతారు. రుచిగా, తియ్యగా ఉండే ఈ కాయల్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ప్రస్తుతం కర్భూజాలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఎండలు ముదురుతున్న సమయంలో పుచ్చకాయలు రుచి చూడడానికి అందరూ ఇష్టపడతారు. అందుకే జిల్లాలో ప్రస్తుతం వీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. అధిక ధరలు జిల్లాలో ఒక్కో పుచ్చకాయ ధర కనిష్టంగా రూ.40 నుంచి గరిష్టంగా రూ.120కు పైబడి ధర పలుకుతున్నాయి. కాయ సైజును బట్టి వ్యాపారులు ధర చెబుతున్నారు. వేసవిలో మాత్రమే పండించే పుచ్చకాయలకు ఎక్కడ లేని డిమాండ్ ఏర్పడడంతో సహజంగానే వ్యాపారులు ధర పెంచి క్రయవిక్రయాలు చేస్తున్నారు. ఎండతీవ్రత పెరిగే కొద్ది పుచ్చకాయల ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో ఆశించిన స్థాయిలో రైతులు పుచ్చకాయ పంటను సాగు చేయకపోవడంతోనే జిల్లాలో పుచ్చకాయల ధరలు మండిపోతున్నాయని పుచ్చకాయ ప్రియులు పేర్కొంటున్నారు. పేద, సామాన్య ప్రజలు కొనుగోలు చేయలేని స్థితిలో రేట్లు పెరుగుతుండడంతో కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు. ధరలు భారీగా పెరిగిపోవడంతో పుచ్చకాయలను తినలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగుకు ఆసక్తి చూపని రైతులు గతంలో జిల్లాలో వందల ఎకరాల్లో పుచ్చకాయ పంటను రైతులు సాగు చేసేవారు. పుచ్చకాయ పంట సాగుపై రైతులకు అవగాహన లేకపోవడంతో పాటు సాగునీటి సౌకర్యం లేకపోవడంతో పంటను సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు. ఈ సంవత్సరం రైతులు జిల్లా వ్యాప్తంగా కేవలం 30 ఎకరాల్లో పుచ్చకాయ పంటను సాగు చేశారు. ఏటేటా పుచ్చకాయ పంట సాగు తగ్గుతుందని, పంటకు సాగునీరు అందక సరైన ఉత్పత్తి లేక పుచ్చకాయ ధర పెరిగిందని పలువురు చెబుతున్నారు. ధరలు తగ్గించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, జిల్లాలో పుచ్చకాయ పంటను అధికంగా సాగు చేసేందుకు రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. కొనలేని పరిస్థితులు ఉన్నాయి మార్కెట్లో పుచ్చకాయ ధర చూస్తే కొనలేని పరిస్థితులు ఉన్నాయి. సాధారణ సైజు పుచ్చకాయ ధర కూడా పేదలకు అందుబాటులో ఉండటం లేదు. జిల్లాలో రైతులు పుచ్చకాయ పంటను అధికంగా సాగు చేయడం లేదు. అందుకే పుచ్చకాయ ధరలు అమాంతం పెరిగాయి. – జె.రాందాస్, ముత్తంపేట ధరలు బాగా పెరిగాయి పుచ్చకాయల ధరలు అమాంతం పెరిగాయి. మేం ఒక ట్రాక్టర్ పుచ్చకాయలను రూ.10 వేలు పెట్టి కొనుగోలు చేస్తున్నాం. దీంతో పుచ్చకాయకు రూ. 40 నుంచి రూ. 100 వరకు అమ్ముతున్నాం. పుచ్చకాయల ధరలు అధికంగా ఉండండతో ప్రజలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. – డి.గంగారం, పండ్ల వ్యాపారి, కౌటాల -
కోవిడ్ సాగు: షుగర్ క్వీన్.. తియ్యటి పంట
సీమా రథీశ్ లెక్కల టీచర్. కేరళలోని కసర్గోడ్ జిల్లా, ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం. గత ఏడాది నుంచి కోవిడ్ స్కూళ్ల టైమ్‌టేబుల్‌ను, క్యాలెండర్లను తలకిందులు చేసింది. సీమ ఉద్యోగ జీవితం కూడా కొద్దిపాటి ఒడిదొడుకులకు లోనయింది. ఉద్యోగాలు లేని కారణంగా కొందరు, ఆన్లైన్లో ఇంటినుంచి పని చేయడం అనే వెసులుబాటు వల్ల కొందరు పట్టణాలు, నగరాల నుంచి గ్రామాల బాట పట్టారు. సీమ కూడా భర్తతోపాటు తన పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడికి వెళ్లి ఊరికే కాలక్షేపం చేయలేదామె. గత ఏడాది నవంబరులో పుచ్చకాయ మొక్కలు నాటింది. సేంద్రియ పద్ధతిలో సాగు చేసింది. ఈ ఎండాకాలం నాటికి ఐదు టన్నుల తియ్యటి కాయలు కాశాయి. కాయలు కేజీ పాతిక లెక్కన అమ్మింది. అమ్మో! ఇంత ధరా!! అని నోరెళ్లబెట్టిన వాళ్లకు ‘ఇది షుగర్క్వీన్ వెరైటీ పుచ్చకాయ. సేంద్రియ ఎరువులతో పండించాను. తియ్యదనంలో తేడా ఉంటే అప్పుడు అడగండి. మరో కాయ కోసం రాకుండా ఉండగలరేమో చూడండి’ సున్నితంగా సవాల్ విసిరింది సీమ. ఆమె అన్న మాట నిజమే అయింది. కాయలన్నీ మంచి ధరకు అమ్ముడయ్యాయి. ఏప్రిల్ నెలాఖరుకు ఖర్చులు పోను రెండు లక్షలు మిగిలాయి. పంట పండింది! ‘‘లాక్డౌన్ తర్వాత నేను, మా వారు మా సొంతూరు మీన్గోత్కు వెళ్లాం. మాది వ్యవసాయ కుటుంబం. నాన్న ఉన్నప్పుడు పదిహేను ఎకరాలు సాగుచేసేవాడు. ఇప్పుడు మా అన్న, అమ్మ మా కుటుంబ వ్యవసాయం చూసుకుంటున్నారు. లాక్డౌన్లో మా ఉద్యోగాల్లో ఎదురైన ఒడిదొడుకులు గమనించిన మా అన్నయ్య ‘వ్యవసాయం ఇప్పుడు లాభసాటిగానే ఉంటోంది. ప్రయత్నించకూడదూ’ అని సలహా ఇచ్చాడు. సాగు చేయకుండా ఉన్న రెండున్నర ఎకరాల పొలంలో కలుపుతీసి, రాళ్లు ఏరివేసి, మంచి ఎరువు వేసి సాగుకు అనువుగా మట్టిని గుల్లబరిచాం. నషీద్ అనే స్నేహితుడి సూచన ప్రకారం షుగర్ క్వీన్ రకం పుచ్చమొక్కలు నాటాం. మొత్తం ఐదు లక్షలు ఖర్చయింది. ఖర్చులు పోగా తొలి పంట ఆదాయం రెండు లక్షలు. ఇప్పుడు బెండకాయ, మిర్చి, ఉల్లిపాయ పంటలు వేస్తున్నాను. కోవిడ్ పూర్తిగా తగ్గిపోయి పూర్తిస్థాయిలో మా ఉద్యోగాలు గాడిన పడినా సరే... ఉద్యోగం చేస్తూనే వ్యవసాయాన్ని కొనసాగిస్తాను. కోవిడ్ చాలా నేర్పించింది. నేను వ్యవసాయం చేయగలనని నాకు తెలియచేసింది’’ అంటోంది సీమ. చదవండి: Oxygen Train: లోకో పైలట్ శిరీషకు ప్రధాని ప్రశంస -
బరువు తగ్గాలనుకుంటే.. ఈ ఆహారం తీసుకోండి!
సాక్షి, మహబూబ్‌నగర్ : కొత్త వంటకాలు.. సరికొత్త రుచులకు అలవాటు పడి కొందరు తమ శరీర బరువును అమాంతం పెంచేసుకుంటున్నారు. ఆ తరువాత దాన్ని తగ్గించుకోవడానికి ఎన్నో కుస్తీలు పడుతున్నారు. ఇలా అధిక బరువుతో బాధపడే వాళ్లంతా సమ్మర్ చిట్కాలు.. యోగా.. పండ్ల జ్యూస్‌లతో స్లిమ్‌గా తయారు కావచ్చునని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. (కరోనా: వర్క్ ఫ్రం హోం వాళ్లు ఇలా చేయండి!) వేసవికాలం.. ఎంతో వరం బరువు తగ్గాలనుకొనేవారికి వేసవి కాలం వరంలాంటిది. బరువు పెరిగిపోతున్నామని తెగ బెంగ పడుతున్న వారు ఎలాగైనా బరువు తగ్గించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఫిట్నెస్ సెంటర్లకు పరుగులు పెడుతున్నారు. మరో వైపు మారుతున్న జీవన విధానంలో జిహ్వచాపల్యాన్ని అదుపులో ఉంచుకోలేక మోతాదుకు మించి భుజిస్తుండడంతో బరువు పెరుగుతున్నారు. దాంతోపాటు ప్రస్తుత యాంత్రిక జీవనంలో ఎన్నో రకాల పనుల నిమిత్తం ఒత్తిడి సైతం రెట్టింపవుతుంది. అయితే, నడకతో ఒత్తిడిని అధిగమించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. శ్వాస సంబంధ వ్యాధులు, దీర్ఘకాలిక నొప్పులు తగ్గుతాయంటున్నారు. ప్రస్తుతం లాక్డౌన్ ఉండడం వల్ల ఇంట్లోనే వాకింగ్, చిన్నపాటి వ్యాయామాలు చేసుకోవచ్చు. (పదే పదే శానిటైజర్ వాడుతున్నారా?) వేసవిలో ఈ ఆహారం తీసుకుంటే మేలు.. ► నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు ఆహారంగా తీసుకోవాలి. పుచ్చ, కీర, కర్భూజ, తాటి ముంజలు, బీర, పొట్ల వంటి వాటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వీటి ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు, లవణాలు అందుతాయి. ► పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల కడుపు నిండినట్లు అవుతుంది. డైట్ కంట్రోల్ అవుతుంది. బరువు కూడా తగ్గుతుంది. ► షుగర్ వేసిన జ్యూస్ మ్యాంగో, సపోటా వంటివి తీసుకొంటే బరువు తగ్గకపోగా కొత్త సమస్యలు మొదలవుతాయి. ► వేసవిలో ఆకలి తక్కువగాను దాహం ఎక్కువగాను ఉంటుంది. జీర్ణక్రియలోను తేడాలు వస్తుంటాయి. డైట్‌పాటిస్తూ కాలానికి తగ్గట్టుగా ఆహారపదార్థాలను తీసుకోవడం ద్వారా బరువును నియంత్రించవచ్చు. మజ్జిగ, కొబ్బరి నీళ్ళు తీసుకోవాలి. (కొబ్బరిబోండంతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా) శీతల ప్రాణాయామంతో మేలు వేసవిలో భానుడి ప్రతాపం ఉదయం 8 నుంచి మొదలవుతుంది. ఎండ తీవ్రతను తట్టుకోవాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి. నీటితో పాటు శీతల ప్రాణాయామం చేస్తే కొంతవరకు ఎండల ప్రతాపాన్ని తట్టుకునే శక్తి శరీరానికి అందుతుంది. శీతల ప్రాణాయామం బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఉదయం ఏడు గంటలలోపు 5 నిమిషాల పాటు ఈ వ్యాయామం చేయడం మంచిదని యోగా నిపుణులు పేర్కొంటున్నారు. యోగా చేస్తే బరువు తగ్గవచ్చు నిత్యం క్రమపద్ధతిలో యోగా చేస్తే బరువు తగ్గవచ్చు. వయస్సు ప్రకారం యోగాసనాలు, సూక్ష్మ వ్యాయామాలు, సూర్యనమస్కారాలు చేయాలి. ప్రాణాయామాలు కూడా నిత్యం చేస్తే శరీరం అదుపులో ఉండి బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. – బాల్‌రాజు, జిల్లా యోగా సంఘం కార్యదర్శి ద్రవ పదార్థాలు ఎక్కువగా.. ఎంతటి భోజన ప్రియులైన వేసవి కాలంలో కాస్తా మోతాదు తగ్గించి ఆహారం తీసుకోవాలి. వేసవిలో ఘన పదార్థాల కంటే ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. వేసవిలో దాహం ఎక్కువ. ఆకలి తక్కువగా ఉంటుంది. అందువలన 15 నుంచి 20 నిమిషాలకు ఒక సారి చొప్పున రోజుకు కనీసం 5 లీటర్లను వివిధ రూపాల్లో తీసుకుంటే బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. ఫ్రిజ్‌లో నీటికన్నా కుండలోని నీటిని తాగడం ఉత్తమం. గొంతు నొప్పి తదితర సమస్యలు తలెత్తవు. -
పండ్లు ఎలా తింటే మంచిది?
సాక్షి, న్యూఢిల్లీ : ఆకు కూరలను మాత్రమే తినడాన్ని ‘విజిటేరియనిజం’ అన్నట్లుగా పండ్లను మాత్రమే తినడాన్ని ‘ఫ్రూటరియనిజం లేదా ఫ్రూజివోరిజం’ అని అంటారు. అయితే పండ్లను ఎలా తినాలి? ఆహారానికి ముందు తినాలా? తర్వాత తినాలా? ఏ రకమైన పండ్లను తినాలి? పండ్లను నమిలి తినాలా? జూస్‌గా చేసుకొని తాగాలా? ఇటీవల చాలా మందిని వేధిస్తున్న అనుమానాలు ఇవి. పరగడుపున పండ్లు తింటే మంచిదని, అప్పుడు అవి మంచిగా జీర్ణం అవుతాయని, అన్నంతోపాటు తింటే టాక్సిక్ ఆసిడ్లు రిలీజై కడుపు పాడవుతుందని ఇటీవల కొందరు కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఇది పూర్తిగా తప్పని, కడుపులో ఒకోరకమైన పదార్థాలకు ఒకో రకమైన జీర్ణ వ్యవస్థ ఉండదని, మోతాదులో తింటే పరగడుపున తిన్నా, అన్నంతోపాటు తిన్నా పండ్లు ఒకే రకమైన ఫలితాలను ఇస్తాయని స్పెయిన్‌లోని ‘పాలిటెక్నిక్ యూనివర్శిటీ ఆఫ్ వాలెన్సియా’లో బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జోస్ మైగుల్ ములెట్ తెలియజేశారు. ఆయన కథనం ప్రకారం స్పెయిన్‌లో ఓ సామెత ప్రచారంలో ఉంది. ‘మిలన్ ఇన్ ది మార్నింగ్ ఈజ్ గోల్డ్, ఆఫ్టర్నూన్ ఇట్ ఈజ్ సిల్వర్, ఎట్ నైట్ ఇట్ కిల్స్ యూ’ (పుచ్చకాయ లేదా కర్భూజా ఉదయం బంగారం, మధ్యాహ్నం వెండిలాంటిది. రాత్రి తింటే నిన్ను చంపేస్తుంది). ఆస్ట్రియా చక్రవర్తి ఆల్బర్ట్–2 1358లో, పోప్ పాల్–2 1471లో, పోప్ క్లెమెంట్–8 1605లో పుచ్చకాయల విందులో వాటికి ఎక్కువగా తినడం వల్ల వారు ముగ్గురు ప్రముఖులు మరణించారనే ప్రచారం ఉంది. ఈ కారణంగా పుచ్చకాయలు తినడంపై సామెత పుట్టుకొచ్చి ఉండవచ్చని ప్రొఫెసర్ ములెట్ వివరించారు. ఒకప్పుడు ఈ పండ్లు ఖరీదు ఎక్కువ అవడం వల్లన ధనవంతులకే అందుబాటులో ఉండేవి కనుక, రాత్రి పూట అవి తినడం మంచిది కాదన్న వాదను పుట్టుకొచ్చి ఉండవచ్చన్నది ప్రొఫెసర్ వాదన. కేవలం పండ్ల వలనే మన శరీరానికి కావాల్సిన పోషకాలు రావని, వంటకాలను కూడా తినాలని, వండేటప్పుడు కూడా కొన్ని కూరగాయల నుంచి ఆ వేడికి కొన్ని పోషకాలు ఉత్పత్తి అవుతాయని ఆయన చెప్పారు. పండ్లు తినే జంతువులకన్నా మానవులు ఎక్కువ తెలివి తేటలు కలిగి ఉండడానికి, తక్కువ ఆహారం తిన్నా ఎక్కువ శక్తి రావడానికి కారణం అవుతున్నది వంటేనన్నది కూడా ఆయన వాదన. అందుకే కోతులు, చింపాజీలీ లాంటి జంతువులు శక్తి సరిపోక ఎప్పుడూ పళ్లను తింటూనే ఉంటాయని ఆయన చెప్పారు. పండ్లలో డీ విటమిన్ అస్సలు ఉండదని దాని కోసం పాలు, గుడ్లు, మాంసం, చేపలు తీసుకోవడం లేదా ఎండలో కూర్చోవడం లాంటివి చేయాల్సిందేనని ఆయన చెప్పారు. పండ్లను ఎప్పుడైనా తినవచ్చని, అయితే జూస్ బదులు పండ్లను నేరుగా తినడమే మంచిదని ఆయన తెలిపారు. ఉదాహరణకు బత్తాయి తీసుకుంటే మహా అంటే ఒకటి, రెండు తీసుకుంటామని, అదే జూస్ తాగితే నాలుగైదు పండ్ల రసం తాగుతామని, దానివల్ల శరీరంలోని రక్తంలో సుగర్ స్థాయి హఠాత్తుగా పెరుగుతుందని ఆయన అన్నారు. అదే బత్తాయి పండును నమిలి తిన్నట్లయితే అందులోని ఫైబర్ (పీచు) పదార్థం కడుపులోకి వెళ్లి జీర్ణ వ్యవస్థకు తోడ్పడుతుందని ఆయన చెప్పారు. ఏ సీజన్లో వచ్చే పండ్లను ఆ సీజన్లో తీసుకుంటే మంచిదని, ఆకు కూరలు, పండ్లు, మాంసాహారం అన్న తేడా లేకుండా ఎవరి అలవాట్లనుబట్టి వారు తమ శరీర శ్రమకు తగ్గట్లుగా పరిమితంగా ఆహారాన్ని తీసుకోవడం మంచిదని ‘వాట్ ఈజ్ ఈటింగ్ హెల్తీ’ అనే పుస్తకాన్ని రాసిన ప్రొఫెసర్ ములెట్ సూచిస్తున్నారు. -
పుచ్చకాయ పత్రిక తీసుకోండి.. పెళ్లికి రండి!
వెండి బంగారుతో నగిషీలు చెక్కి నవరత్నాలు పొదిగిన పెళ్లిపత్రికలను పంచే సంపన్నుల గురించి వార్తలొచ్చాయి. బంగారు నగలు, పట్టుచీరలు వంటి ఖరీదైన కానుకలతో కూడిన పెళ్లిపత్రికలను ఇచ్చినవారూ ఉన్నారు. పెళ్లిపత్రిక అంటే వారి వారి ఆర్థిక స్థోమతను బట్టి ఎంతో ఖరీదైనవి ముద్రించి పంచడం చూస్తుంటాం. కానీ బళ్లారినగరవాసి పెళ్లి ఆహ్వానపత్రికను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. సాక్షి, బళ్లారి : నగరంలోని ఎస్పీ సర్కిల్ సమీపంలో సాయిగోపాల్, వాణికుమారిల కుమారుడు సాయి సందీప్ ఎస్జీ కాలేజీలో బాటనీ హెచ్ఓడీగా పని చేస్తున్నారు. ఈయన పెళ్లి అదే కాలేజీలో వృక్షశాస్త్రం లెక్చరర్‌గా పని చేస్తున్న తేజస్వినితో కుదిరింది. పెళ్లి ఆహ్వాన పత్రికలను వినూత్న తరహాలో ముద్రించాలని భావించిన సాయి సందీప్ మండుటెండల్లో తీయగా ఉపశమనం కలిగించే పుచ్చకాయ మీద పెళ్లి పత్రికను ముద్రించి, బంధుమిత్రులకు ఆహ్వానం పలుకుతున్నారు. వెయ్యి పుచ్చకాయ పత్రికల పంపిణీకి ఏర్పాట్లు ఇప్పటివరకు 400 వరకు పుచ్చకాయలను పంపిణీ చేశానని, మొత్తం వెయ్యి మందికి ఆహ్వానం పలకనున్నట్లు చెప్పారు. ప్రతి రోజు ఉదయమే మార్కెట్లో 100కు పైగా పుచ్చకాయలను కొనుగోలు చేసి బంధుమిత్రులకు అందజేస్తున్నామన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తన తల్లిదండ్రులు కూడా తొలుత వ్యతిరేకత వ్యక్తం చేశారని, కొంత మందికి పెళ్లి ఆహ్వానాలు పలికిన తర్వాత పుచ్చకాయలపై పెళ్లి ఆహ్వానం పలకడంతో సంతోషించారని, దీంతో తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. వృథా కాకూడదనే ఈ ప్రయత్నం సాయి సందీప్ సాక్షితో మాట్లాడుతూ మే 9న పెళ్లి సత్యనారాయణ పేటలోని రాఘవేంద్ర స్వామి కళ్యాణ మంటపంలో పెళ్లి ముహూర్తమని తెలిపారు. ఖరీదైన పెళ్లి పత్రికను తయారు చేసి పంపిణీ చేసినా ఇలా చూసి అలా పడేస్తారని, దీంతో తాను అందించిన ఆహ్వాన పత్రిక వృథా కాకూడదని, గుర్తుండాలన్న సంకల్పంతో పాటు కళింగర కాయపై పెళ్లి వివరాలను రాసిన కాగితాన్ని అంటించి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఆహ్వాన పత్రికను చూసిన తర్వాత చల్లని పుచ్చకాయను ఆరగించాలన్నదే తన ఉద్దేశమన్నారు. -
పుచ్చకాయతో నష్టాలు
పుచ్చకాయ తింటే లాభాలనేకం అందుకే వేసవిలో పుచ్చకాయను తినని వారుండరు. కాని పుచ్చ పంటకు తెగులు సొకడంతో దిగుబడి తగ్గి కష్టాల్లో ఉన్న రైతన్నను మార్కెట్లొ ధర వెక్కిరించింది. చివరికి పెట్టుబడి సొమ్ము కూడా చేతికి రాక రైతుకు కన్నీరే మిగిల్చింది. సాక్షి, చిట్టమూరు: వర్షాభావ పరిస్థితులు మెట్టపంటల సాగు రైతును కుదేలు చేసింది. ఈ ఏడాది పుచ్చ పంట వేసిన రైతులకు నష్టాల ఊబిలో కూరుకుపోయారు. గతేడాది వివిధ ప్రాంతాల్లో వేసిన పంటకు అంతు పట్టని తెగులు సోకడంతో దిగుబడులు తగ్గి రైతులు నష్టపోయారు. ఈ సంవత్సరం అయినా పంట ఆశాజనకంగా ఉంటుందని ఆశించిన రైతులు గతేడాది కంటే ఎక్కువగా నష్టాలను చవిచూశారు. పుచ్చ పంట సాగు చేసిన రైతులకు ఉద్యానవన శాఖ అధికారుల నుంచి ఎటువంటి సలహాలు, సూచనలు అందలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సరైన సేద్యం పద్ధతులు అవలంబించలేకపోవడంతో పంటలను తెగుళ్లు ఆశించాయి. రైతులు పురుగు మందు దుకాణదారులు చెప్పిన మందులు వాడినా దిగుబడులు అంతంత మాత్రమే వస్తున్నాయన్నారు. గూడూరు నియోజకవర్గంలో చిట్టమూరు, కోట, వాకాడు, గూడూరు చిల్లకూరు మండలాల్లో సుమారు 2 వేల ఎకరాల్లో మెట్ట ప్రాంతాల్లో రైతులు పుచ్చ పంట సాగుచేశారు. ప్రస్తుతం కోత దశలో ఉండటంతో రైతులు కాయలు కోసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. కాయ సైజును బట్టి వ్యాపారులు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నారు. చిన్న సైజు కాయలను వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో రోడ్ల పక్కన రైతులే అమ్మకాలు చేస్తున్నారు. వేలు పెట్టుబడి పెట్టి చివరకు కాయ సైజు రాకపోవడంతో అప్పుల పాలయ్యామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిట్టమూరు మండలంలో ప్రధానంగా చిల్లమూరు, మొలకలపూడి, రామాపురం గ్రామాల్లో మెట్టు ప్రాంతాల్లో రైతులు పుచ్చసాగు చేశారు. చిట్టమూరు మండలం నుంచి గతంలో దేశ రాజధాని ఢిల్లీకు కూడా ఎగుమతి అయ్యేవి. అయితే ఈ సంవత్సరం కాయ సైజు పెద్దగా రాకపోవడం, నాణ్యత లేకపోవడంతో ఎగుమతులు నిలిచిపోయాయని రైతులు చెబుతున్నారు. ధరలు భారీగా పతనం ఈ ఏడాది పుచ్చకాయల ధరలు భారీగా పనమయ్యాయి. గతేడాది టన్ను రూ.10 వేలు ఉంటే.. ఈ ఏడాది రూ.6 వేల నుంచి రూ.6,500 వరకు ఉన్నాయి. కాయలు చిన్నవి అయితే రూ.4,500 లోపే కొనుగోలు చేస్తున్నారు. కానీ మార్కెట్లో వ్యాపారులు మాత్రం కాయల సైజ్‌ను బట్టి విక్రయిస్తుండడంతో టన్ను రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వస్తుంది. ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకంటే.. వ్యాపారులు రెండింతల లాభాలను పొందుతున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పుచ్చసాగు నియోజకవర్గంలో ఈ ఏడాది వర్షాలు పూర్తిస్థాయిలో కురవకపోవడంతో రైతులు వరి పంటకు సాగు నీరు లేక ఆరుతడి పంట పుచ్చను సాగు చేశారు. బావులు, గుంతల్లోని నీటి ఆధారంగా పుచ్చసాగు చేశారు. డీజిల్ ఇంజన్ల ద్వారా పుచ్చ పంటకు సాగునీరు అందించి వ్యయప్రయాసలు పడి పండించినా చివరకు కష్టమే మిగిలిందని రైతులు వాపోతున్నారు. ఎకరా పుచ్చసాగుకు దుక్కి మొదలు, కోత దశ వరకు సుమారు రూ.30 వేలు ఖర్చు అవుతుంది. అయితే తొలి కోతలో రెండు టన్నులు, రెండో కోతలో రెండు టన్నులు మొత్తం ఎకరాకు 4 నుంచి 5 టన్నుల దిగుబడి మాత్రమే వస్తుందని రైతులు తెలిపారు. అయితే అన్ని బాగుండి గతంలో ఎకరాకు సుమారు 15 టన్నుల వరకు దిగుబడి వచ్చేదని రైతులు పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఎకరాకు రూ.10 వేలు నష్టం వస్తుందని రైతులు తెలిపారు. ఎకరాకు రూ.10 వేలు నష్టం నాలుగు ఎకరాల్లో పుచ్చ పంట సాగు చేశాను. దిగుబడి తక్కువగా రావడంతో ఎకరాకు రూ. 10 వేలు నష్టం వచ్చింది. అధికారుల నుంచి పంట సస్యరక్షణపై ఎటువంటి సలహాలు, సూచనలు లేకపోవడంతో తెగుళ్లను తగ్గించేందుకు పెట్టుబడులు పెరిగాయి. – సంక్రాంతి కస్తూరయ్య, రైతు, మొలకలపూడి, చిట్టమూరు మండలం డిసెంబర్ నెలలో నాటుకోవాలి రైతులు డిసెంబర్ నెలలో విత్తనాలు నాటుకుంటే పంటకు తెగుళ్లు తగ్గి దిగుబడి పెరుగుతోంది. తామర పురుగు, డైబ్యాక్ తెగులు ఎక్కువగా వస్తున్నాయి. వైరస్ ఎక్కువగా సోకడంతో తెగుళ్లు వ్యాప్తి చెందుతున్నాయి. రైతులు మేలు రకమైన విత్తనాలను విత్తుకోవాలి. పాతరకం విత్తనాలు వేసుకోవడం వల్ల తెగుళ్లు వస్తున్నాయి. – ఆనంద్, ఉద్యానశాఖ అధికారి, గూడూరు -
సమ్మర్ సలాడ్స్
చీపొమెగ్రనేట్ స్వీట్‌కార్న్ సలాడ్ కావలసినవి ► దానిమ్మకాయ - ఒకటి, స్వీట్‌కార్న్ - సగం కండె, అరటిపండు - సగం ► ద్రాక్ష - అరకప్పు, జామపండు - సగం, ఖర్జూరాలు - పది తయారి: స్వీట్‌కార్న్ అంటే తియ్యగా ఉండే మొక్కజొన్న కండె. దీనినే అమెరికన్ కార్న్ అని కూడా అంటారు. ఇది కూరగాయల మార్కెట్లలోనూ, సూపర్ మార్కెట్లలోనూ దొరుకుతుంది. ఇవి లేతగా, గిల్లితే పాలుకారుతుంటాయి. వండాల్సిన అవసరం ఉండదు. పచ్చిగానే తినవచ్చు. ముందుగా మొక్కజొన్న గింజలు ఒలిచి పక్కన ఉంచుకోవాలి. దానిమ్మకాయ గింజలను ఒలిచి అందులో వేసిన తర్వాత అరటి, జామపండ్లను సన్నని ముక్కలుగా కట్ చేసి కలుపుకోవాలి. ఖర్జూరాన్ని గింజలు తీసేసి సన్నని ముక్కలు చేసి ఫ్రూట్మిక్స్లో కలిపితే పొమెగ్రనేట్ - స్వీట్‌కార్న్ సలాడ్ రెడీ. వాటర్మెలన్ సలాడ్ కావలసినవి: ► పుచ్చకాయ ముక్కలు -ఒక కప్పు ► తర్బూజముక్కలు - అర కప్పు ► పుదీన - రెండు రెమ్మలు ► పెరుగు - ఒక టేబుల్ స్పూన్ ► ఉప్పు - చిటికెడు ఇది చాలా సులభంగా చేసుకోదగిన సలాడ్. ఒక బౌల్లో పుచ్చకాయ, తర్బూజ ముక్కలు వేసి అందులో పుదీన ఆకులు, పెరుగు, ఉప్పు కూడా కలపాలి. అంతే! వాటర్మెలన్ సలాడ్ రెడీ. సాధారణంగా పుచ్చకాయ తినేటప్పుడు, సలాడ్ల కోసం ముక్కలు కోసినప్పుడు గింజలను వదిలేస్తుంటారు. నిజానికి గింజలలో అనేక ఔషధగుణాలుంటాయి. కాబట్టి గింజలను తినాలి. అలాగే తర్బూజ గింజలు కూడా తినవచ్చు. వీటిని విడిగా తీసుకోవడం సులభం కాబట్టి ఎండబెట్టి పొడి చేసుకుని వాడుకోవచ్చు. అయితే గింజ నలిగేటట్లు నమలాలి . స్ట్రాబెర్ర గ్రేప్ సలాడ్ కావలసినవి ► స్ట్రాబెర్రీలు - పది (సన్నగా ముక్కలు చేయాలి) ► ద్రాక్ష - ఒక కప్పు, సపోటాముక్కలు - అర కప్పు ► జామముక్కలు - అర కప్పు, నల్లద్రాక్షరసం - ఒక టేబుల్ స్పూన్ ► గార్నిష్ చేయడానికి: క్రీమ్ - మూడు టీ స్పూన్లు, చెర్రీలు - నాలుగు తయారి స్ట్రాబెర్రీ, జామ, సపోట ముక్కలను, ద్రాక్షపండ్లను కలపాలి. సర్వ్ చేసే ముందు ఈ ముక్కలను కప్పులో వేసి ఒక్కొక్క కప్పులో ఒక టీ స్పూన్ ద్రాక్షరసం వేసి పైన క్రీమ్ పెట్టి చెర్రీతో అలంకరించాలి. ముందుగా క్రీమ్ పెట్టి దాని మీద ద్రాక్షరసం వేసినా బాగుంటుంది. పిల్లలు క్రీమ్ ఇష్టపడతారు కాబట్టి కాస్త ఎక్కువ క్రీమ్ వేసి మధ్యలో చెర్రీ పెట్టి దాని చుట్టూ ద్రాక్షరసం రకరకాల బొమ్మల షేప్ వచ్చేటట్లు వేస్తే ఆనందంగా తింటారు. -
వేసవి నేస్తం.. తీరుస్తుంది మీ తాపం!
వేసవి పేరు చెప్పగానే భగభగ మండే భానుడి ఎండ ప్రతాపం గుర్తుకు రావడం ఎంత సహజమో.. వాటి నుంచి ఉపశమనం ఇచ్చే తియ్యనైన చల్లని పుచ్చకాయ ముక్కలు గుర్తుకురావడం కూడా అంతే సహజం. వీటి రుచిని ఆస్వాదించకుండా వేసవి పూర్తికాదనే చెప్పాలి. అందరికీ అందుబాటు ధరలో అత్యధిక పోషకాలనందిస్తూ వేసవి తాపాన్ని తీరుస్తున్నాయి. మార్చిలో కూడా అడుగుపెట్టక ముందే అప్పడే భానుడు తన ప్రతాపం చూపడం మొదలు పెట్టాడు. అందుకే మార్కెట్లో పుచ్చకాయల వినియోగం ఊపందుకుంది. ఈరోజు వాటి విశేషాల గురించి తెలుసుకుందాం..! - సాక్షి, స్కూల్ ఎడిషన్ పుచ్చకాయనే కర్జూజ అని కూడా పిలుస్తారు. దీన్ని మన దేశంలో ఉద్యాన పంటగా సాగుచేస్తున్నారు. పుచ్చకాయ ఎక్కడ పుట్టిందో కచ్చితమైన ఆధారాలు లేకపోయినా ఈజిప్టులో ఐదు వేల ఏళ్ల క్రితమే పుచ్చను పండించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అప్పటి ఫారో చక్రవర్తులకు పుచ్చకాయ రుచి ఎంతో నచ్చడం వల్లే వారి గోడల మీదున్న చిత్రాల్లో వీటికి చోటు కల్పించారు. సమాధుల్లో కూడా వీటిని ఉంచేవారట. 13వ శతాబ్దానికి ఈ పంట యూరప్‌కు విస్తరించింది. మన దేశానికి.. క్రీ.శ నాలుగో శతాబ్దంలో మనదేశానికి పుచ్చకాయ వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నప్పటికీ ఇక్కడే పుట్టిందని వాదించే వాళ్లూ ఉన్నారు. శుశృతుడు తన శుశృత సంహితలో సింధునదీ తీరంలో పుచ్చకాయలను పండించినట్టు పేర్కొన్నాడు. అందులో దీన్ని ‘కళింద’గా రాసాడట. పొడిగా ఉండే ఉష్ణమండల వాతావరణంలో ఎలాంటి నేలలో అయినా పుచ్చ పంటను సాగుచేయవచ్చు. అందుకే ఇది ప్రపంచమంతా విస్తరించింది. ఈ పంట అమెరికన్లకు 17వ శతాబ్దంలో పరిచయమయింది. పోషకాలమయం.. ఎండలో దాహార్తిని తీర్చుకోవాలంటే మొదట ప్రాధాన్యం ఇచ్చేది ఎర్రని పుచ్చకాయలకే. అన్ని సీజన్లలోనూ ఇవి లభ్యమవుతున్నా వేసవిలో పండించే వాటికి నాణ్యత, రుచి ఎక్కువ. బి-విటమన్లు, పొటాషియం సమృద్ధిగా లభించే పుచ్చకాయల నుంచి ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా అందుతాయి. బి-విటమిన్లు శరీరానికి శక్తినందిస్తే, పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. వడదెబ్బ బారిన పడి శరీరం నిస్తేజం అయిపోకుండా కాపాడుతుంది. వేడికి కమిలిన శరీరానికి చల్లని పుచ్చకాయ గుజ్జును రాస్తే చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. ముదురు ఎరుపు లేక గులాబీ రంగు పుచ్చకాయలో కెరోటినాయిడ్స్, బీటా కెరోటిన్లు అధికంగా లభ్యమవుతాయి. వీటిని మన శరీరం ఎ-విటమిన్‌గా మార్చుకుంటుంది. వీటితో పాటు విటమిన్ బీ6, విటమిన్ సీ, పీచు పదార్థాలు కూడా ఉంటాయి. మిగిలిన పండ్లతో పోల్చుకుంటే నీటి శాతం వీటిలో అత్యధికం. విశేషాలు.. - అమెరికన్లు పుచ్చ పంటను సాగుచేయడంలో ఆఫ్రికన్లతో పోటీపడి అనేక ప్రయోగాలు చేస్తూన్నారు. గింజలు లేని పుచ్చకాయల్ని పండించడంతో పాటు ఎరుపు, పసుపు, గులాబీ రంగుల్లో పండిస్తున్నారు. - వీటి ఉత్పత్తిలో అమెరికాది నాలుగో స్థానం. - జపాన్‌లో చతురస్రాకారంలో ఉండే పుచ్చకాయల్ని పండిస్తున్నారు. పిందె దశలో ఉన్నప్పుడే కావాల్సిన పరిమాణంలో ఒక దీర్ఘ చతురస్రాకారపు చెక్క పెట్టెలో తీగకు ఉన్న పిందెను అమర్చుతారు. అది క్రమంగా అదే ఆకారంలో అమరుతుంది. ఇవి చూడటానికి కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. - చైనా,జపాన్లలో ఇంటికి వచ్చే అతిథులు ఎక్కువగా తెచ్చే బహుమతులు పుచ్చకాయలే. - సాధారణ పుచ్చకాయ బరువు 5-10 కిలోల బరువుంటే, వీటికి భిన్నంగా అమెరికాలో 20 కిలోల బరువుండే పుచ్చకాయల్ని పెంచుతారు. - అమెరికాలోని ఎరింగ్టన్కు చెందిన బిల్కార్నర్ 119 కిలోల బరువున్న పుచ్చకాయను పండించాడు. - పుచ్చలు డిసెంబర్ నుంచి మే వరకు బాగా పండుతాయి. - ఇజ్రాయెల్, ఈజిప్టు దేశాల్లో పుచ్చకాయముక్కలకు ఉప్పగా ఉండే చీజ్ ముక్కలు చేర్చి తినడాన్ని బాగా ఇష్టపడతారు. 100 గ్రాములు పుచ్చకాయ గుజ్జులో.. 1 నీరు - 95.2 గ్రా 1 ప్రోటీన్ - 0.3 గ్రా 1 కొవ్వు పదార్థాలు - 0.2 గ్రా 1 పీచు పదార్థాలు - 0.4 గ్రా 1 కెరోటిన్ - 169 మి.గ్రా 1 సీ విటమిన్ - 26 మి.గ్రా 1 కాల్షియం - 32 మి.గ్రా 1 ఫాస్పరస్ - 14 మి.గ్రా 1 ఇనుము - 1.4 మి.గ్రా 1 సోడియం - 104.6 మి.గ్రా 1 పొటాషియం - 341 మి.గ్రా 1 శక్తి - 17 కిలోక్యాలరీలు విభిన్న రకాలు.. ప్రపంచవ్యాప్తంగా 1200 రకాల పుచ్చ జాతుల్ని పండిస్తున్నారు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి.. 1 నూర్జహాన్ 1 షర్బత్-ఎ- అనార్ 1 అనార్కలీ 1 షుగర్బేబీ (మహారాష్ట్రలోని అమెరికా రకం) 1 అసాహా యమటో (పశ్చిమ బెంగాల్‌లోని జపాన్ రకం) 1 నందారి (ఏపీలో అధికంగా పండించే రకం) 1 రెడ్ టైగర్ 1 ఆల్ స్వీట్ 1 వాల్ పెయింట్