ప్రతిరోజూ ఎండతోపాటుగా.. వర్షాలు, చల్లదనం, వాతవరణంలో ఓకేసారి మార్పుల కారణంగా ఆరోగ్యంపై ప్రభావం పడవచ్చు. అందులో చర్మం విషయంలో ఎన్నో ఇబ‍్బందులు ఎదురవచ్చు. ఇలాంటి సమస్యలను అధిగమిస్తూ అందంగా కనిపంచాలంటే ఈ బ్యూటీ టిప్స్ ట్రై చేయండి..
పుచ్చకాయ.. ద్రాక్ష!
పుచ్చకాయ, ద్రాక్ష కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. దీంట్లో నిమ్మరసం, కోడిగుడ్డు లోని తెల్లసొన కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. వేసవిలో ఈ ఫ్రూట్ ప్యాక్‌ని తరచూ వేసుకోవడం వల్ల చర్మంలో జిడ్డు తగ్గి, కాంతిమంతం అవుతుంది.
ఆరెంజ్ జ్యూస్..
టీ స్పూన్ తేనె, కొద్దిగా ఆరెంజ్ జ్యూస్, టేబుల్ స్పూన్ ఓట్స్, రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉంచి, చల్లబడ్డాక ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకుంటే ముఖచర్మం సేదదీరుతుంది.
కొబ్బరిపాలతో..
ఎండలో నుంచి ఇంటికి వెళ్లినప్పుడు ఫ్రిజ్‌లో ఉంచిన కొబ్బరిపాలలో దూది ఉండను ముంచి, దాంతో ముఖం, చేతులపై అద్ది, పది నిమిషాలు సేదదీరాలి. తర్వాత స్నానం చేస్తే ఎండవల్ల కమిలిన చర్మానికి ఉపశమనం లభిస్తుంది. మృదువుగా, కాంతిమంతంగా తయారవుతుంది.
సోంపుతో..
రెండు టీ స్పూన్ల సోంపు గింజలను దంచి, అరకప్పు నీటిలో వేసి, మరిగించాలి. చల్లారాక ఈ నీటిని వడకట్టి, టీ స్పూన్ నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమం ఫ్రిజ్‌లో ఉంచాలి.
ఎండ నుంచి ఇంటికి వచ్చినప్పుడు దూది ఉండను సోంపు నీటిలో ముంచి ముఖం, మెడ, చేతులు తుడుచుకోవాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ నీళ్లు స్వేదరంధ్రాలలోని మలినాలను తొలగిస్తాయి. దురద, దద్దుర్లు, ట్యాన్ వంటి సమస్యలనూ తగ్గిస్తాయి. చర్మం కాంతిమంతంగా
కనిపిస్తుంది.
ఇవి చదవండి: ఖర్జూరతో.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా!
Comments
Please login to add a commentAdd a comment