beauty tips
-
మేకప్ వేసుకుంటున్నారా..? ఈ పొరపాట్లు చెయ్యకండి..
మేకప్ అందంగా కనిపించడానికే కాదు ఆత్మవిశ్వాసాన్నీ కలిగిస్తుంది. అయితే, మేకప్ ఉత్పత్తుల ఎంపికలోనూ, వాడకంలోనూ సాధారణంగా కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. వాటిని నివారించడానికి సరైన అవగాహన ఉండాలి. వాతావరణానికి తగిన విధంగా మేకప్ ఉత్పత్తులు సీజన్‌ని బట్టి వాడేవి ఉంటాయి. అందుకని, బ్రాండ్ అని కాకుండా ప్రొడక్ట్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలి. వేడి, చలి వాతావరణానికి తగిన నాణ్యమైన ఉత్పత్తులను ఎంచుకోవాలి. దీంతో పాటు అవి తమ చర్మ తత్త్వానికి ఎలా ఉపయోగపడతాయో చెక్ చేసుకోవాలి. అందుకు ప్రొడక్ట్స్ అమ్మేవారే స్కిన్ టెస్ట్‌కి అవకాశం ఇస్తారు. శుభ్రత ముఖ్యంమేకప్ వేసుకోవడానికి ముందు ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. చాలా మంది ఈ విషయాన్ని అంతగా పట్టించుకోరు. కానీ, అప్పటికే చర్మంపై పేరుకుపోయిన జిడ్డు, దుమ్ము కణాలు చేరుతాయి. ముఖం శుభ్రం చేయకుండా మేకప్ వేసుకుంటే బ్యాక్టీరియా ఎక్కువ వృద్ధి చెందుతుంది. దీనివల్ల కూడా ముఖ చర్మం త్వరగా పాడవుతుంది. సాధారణ అవగాహన లైనర్, ఫౌండేషన్, కాజల్.. ఇలా ఏ మేకప్ ప్రొడక్ట్ ఉపయోగించినా కొన్ని మిస్టేక్స్ సహజంగా జరుగుతుంటాయి. ఇలాంటప్పుడు మేకప్ పూర్తిగా తీసేయాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఫౌండేషన్ అయితే బ్లెండింగ్ బాగా చేయాలి. ఎంత బాగా బ్లెండ్ చేస్తే లుక్ అంత బాగా వస్తుంది. బ్యూటీ ప్రొడక్ట్ ఎంత అవసరమో అంతే వాడాలి. లేదంటే ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. మేకప్‌లో ఫేస్ షేప్, స్కిన్ టోన్, బాడీకి తగినట్టు కూడా మేకప్ ఉంటుంది. ఇందుకు ముందుగా నిపుణుల సూచనలు తీసుకోవచ్చు.మరికొన్ని...నాణ్యమైనవి, ఖరీదైనవి అని కాకుండా తమ స్కిన్ టోన్‌కి తగిన మేకప్ ప్రొడక్ట్స్ ఎంపిక చేసుకోవాలి. మేకప్‌కి ఒకరు వాడిన టవల్, బ్రష్, స్పాంజ్ వంటివి మరొకరు ఉపయోగించకూడదు. వాటిని పూర్తిగా శుభ్రం చేసిన తర్వాతనే తిరిగి వాడాలి. రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా మేకప్ తొలగించాలి. లేక;yతే స్వేదరంధ్రాలు మూసుకు;yయి, మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. ఫౌండేషన్‌ని ఒకసారి ఎక్కువ మొత్తంలో ఉపయోగిస్తే హెవీగా కనిపిస్తుంది. తక్కువ మొత్తాన్ని అప్లై చేసి, పూర్తిగా బ్లెండ్ చేయాలి.మేకప్ ట్రెండ్స్‌ని అనుసరించడం కన్నా, తమ ముఖానికి నప్పే అలంకరణను ఎంచుకోవడం మేలు. రోజంతా ఉన్న మేకప్ పైన మరొకసారి టచప్ చేయకపోవడమే మంచిది. మస్కారా వంటివి మరొక కోట్ వేయకుండా బ్రష్‌ను తడిపి, కనురెప్పలపై అద్దవచ్చు. లిప్‌స్టిక్‌ను ఉపయోగించే ముందు లిప్ బ్రష్‌ను వాడితే, అలంకరణ నీటుగా వస్తుంది. – శ్రీలేఖ, మేకప్ ఆర్టిస్ట్ -
మృదువైన చేతులు... ముచ్చటేసే ముఖం కోసం...!
చలికాలంలో సౌందర్య రక్షణ కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. శీతగాలుల వల్ల చర్మం పొడిబారినట్టు అవుతుంది. ముఖంలో కాంతి తగ్గిపోతుంది. అందుకే ఇంట్లో దొరికే వస్తువులతో కొన్ని టిప్స్ పాటిస్తే, మృదువైన చేతులు, చందమామ లాంటి మోము సొంతం అవుతుంది. వీటితో పాటు సమతుల ఆహారం, చక్కటి వ్యాయామం, తగినన్ని నీళ్లు తాగడం, మంచి నిద్ర వీటిని మాత్రం అస్సలు మర్చిపోకూడదు! బ్యూటీ టిప్స్స్పూన్ గ్లిజరిన్, స్పూన్ ఆలివ్ ఆయిల్, స్పూన్ నిమ్మరసం తీసుకుని వాటిని బాగా కలిపి చేతులకి రాసుకుంటే చేతులు మృదువుగా ఉంటాయి.రాత్రి పడుకోబోయే ముందు పెట్రోలియమ్ జెల్లీలో కొద్దిగా కార్బాలిక్ యాసిడ్ కలిపి ఆ మిశ్రమాన్ని చేతులకి మర్దనా చేస్తూ ఉంటే క్రమేపీ చేతులు తెల్లగా... మృదువుగా మారతాయి.కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత కడిగేసు కోవాలి. తర్వాత శెనగపిండితో గానీ, నలుగుపిండితో గానీ ముఖం రుద్దుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే కొద్దిరోజుల్లోనే ముఖ చర్మం మృదువుగా అవుతుంది.కొత్తిమీర, పుదీనా మెత్తగా నూరి చర్మానికి రాస్తే నల్లమచ్చలు తొలగి పోతాయి. రోజూ రాత్రి పడుకునే ముందు తేనె, నిమ్మరసం కలిపి రాస్తే చర్మంపై మచ్చలు తగ్గిపోతాయి.ఓట్మీల్ పౌడర్ టీ స్పూన్ తీసుకుని అందులో ఆరెంజ్ జ్యూస్ కలిపి ముఖం, చేతులు, మెడకు ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత కొద్దిగా నీళ్లు చల్లి వలయాకారంగా మర్దన చేసి ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఇలా వారానికోసారి చేస్తుంటే చర్మం కాంతివంతంగా ఉంటుంది.బాగా పండిన అరటిపండు గుజ్జు టేబుల్ స్పూన్ తీసుకుని అందులో ఐదారు చుక్కల తేనె కల పాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు రాసి వలయాకారంగా మర్దన చేయాలి. మిశ్రమంలోని తేమ ఇంకే వరకు మర్దన చేసి, ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఇది పొడి చర్మానికి ఈ కాలంలో మంచి ఫలితాన్నిస్తుంది. క్రమం తప్పకుండా కొన్ని రోజుల పాటు చిటికెడు పసుపు, మీగడ కలిపి ముఖానికి రాసుకుని అరగంట తర్వాత స్నానం చేయాలి ఇలా చేస్తుంటే మచ్చలు, చారల్లాంటివి తొలగి ముఖం మృదువుగా నిగనిగలాడుతుంటుంది. -
ప్రసవానంతర చర్మ సంరక్షణ కోసం..!
డిజైనర్, నటి మసాబా గుప్తా ఎప్పటికప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలను నెటిజన్లతో షేర్ చేసుకుంటుంటారు. అలానే తాజాగా ప్రసవానంతర చర్మ సంరక్షణకు సంబంధించి.. కొన్ని ఆసక్తికర చిట్కాలను షేర్ చేశారు. నిజానికి ప్రసవానతరం చర్మం వదులుగా అయిపోయి..అందవిహీనంగా ఉంటుంది. మెడ వంటి బాగాల్లో ట్యాన్ పేరుకుపోయి ఒకవిధమైన గరుకుదనంతో ఉంటుంది. అలాంటప్పుడు నటి మసాబా చెప్పే ఈ చిట్కాలను పాటిస్తే సులభంగా కాంతివంతమైన మెరిసే చర్మాన్ని పొందొచ్చు. అదెలాగో చూద్దామా..!.ప్రసవానంతరం జీవితం అందంగా సాగిపోవాలంటే ఈ బ్యూటీఫుట్ చిట్కాలను తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు మసాబా. అవిసె గింజలు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా మంచిదని చెబుతోంది. ముఖ్యంగా ఈ అవిసె గింజలు, పెరుగు, తేనెతో కూడిన ఫేస్ ప్యాక్‌తో కాంతివంతమైన చర్మాన్ని ఈజీగా పొందొచ్చని అంటోంది. ఈ మూడే ఎందుకు..?అవిసె గింజల పొడి: దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ సమృద్ధిగా ఉంటుంది. ఇది ముఖంపై ఉండే ఎరుపు ర్యాష్‌లను తగ్గించడం తోపాటు ఫ్రీ రాడికల్స్‌తో కూడా పోరాడుతోంది. ఇందులో ఉండే ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ చర్మాన్ని హైడ్రేటెడ్‌గా చేసి, బొద్దుగా ఉండేలా చేస్తుంది. అలాగే మలినాలను తొలగించి చర్మా ఆకృతిని మెరుగుపరుస్తుంది. అందువల్లే దీన్ని ఎక్స్‌ఫోలియేటింగ్ ఏజెంట్ అని కూడా పిలుస్తారు. తేనె: ఇది తేమను లాక్ చేస్తుంది. చర్మం మృదువుగా చేసి, మొటిమలను నివారిస్తుంది. ముఖంపై ఉండే ఒక విధమైన చికాకుని తగ్గించేలా యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా నిస్తేజమైన చర్మానికి పోషణనిచ్చి పునురుజ్జీవంప చేసి సహజమైన కాంతిని అందిస్తుంది. పెరుగు: ఇది లాక్టిక్ యాసిడ్‌తో నిండి ఉంటుంది. ముఖంపై ఉండే సున్నితమైన ఎక్స్ఫోలియంట్, మృతకణాలను తొలగించి చర్మానికి అద్భుతమైన మెరుపుని అందిస్తుంది. దీని ప్రోబయోటిక్స్ చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. పోడి లేదా సున్నితమైన చర్మానికి ఇది బెస్ట్. ఈ ఫేస్ ప్యాక్ తయారీ..అవిసె గింజల పొడి: 1 టేబుల్ స్పూన్పెరుగు: 1 టేబుల్ స్పూన్ తేనె : 1 టేబుల్ స్పూన్ఈ మూడింటిని ఒక బౌల్లోకి తీసుకుని చక్కగా కలిపి ముఖం, మెడ భాగాల్లో సమానంగా అప్లై చేయాలి. ఇలా సుమారు 15 నుంచి 20 నిమషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో కడగండి. ఇక్కడ అవిసెగింజల పొడిని తాజాదనం కోల్పోకుండా మంచి డబ్బాలో నిల్వ చేసుకోవడం మంచిది. View this post on Instagram A post shared by Masaba 🤎 (@masabagupta)(చదవండి: శిఖర్ ధావన్ ఫిట్నెస్ సీక్రెట్ తెలిస్తే కంగుతినాల్సిందే..!) -
చలికాలంలో మేకప్, ఈ జాగ్రత్తలు తప్పదు.. లేదంటే!
చలికాలం ఉక్కపోత ఉండదు, మేకప్ చెదిరిపోదు, బాగుంటుంది అనుకుంటారు. అయితే, ప్రతి సీజన్‌కి బ్యూటీ చాలెంజెస్ ఉంటాయి. చలికాలంలో చేయించుకోదగిన ఫేషియల్స్, మేకప్, ఫుడ్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వివాహ వేడుకలకు మేకప్ చేయించుకునేవారు ఈ జాగ్రత్తలు పాటిస్తే, సరైన ప్రయోజనాలను పొందుతారు. పొడిగా ఉన్నా, జిడ్డుగా ఉన్నా చలి కాలం మేకప్ చేసేముందు హైడ్రేటెడ్ మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. లేదంటే, మేకప్ కూడా డ్రైగా కనిపిస్తుంది. అవసరాన్ని బట్టి ప్రైమరీ లోషన్ వాడుకోవచ్చు.మెరిసే చర్మానికి..చర్మం మెరుస్తున్నట్టుగా ఆరోగ్యంగా కనిపించాలంటే నూనె శాతం ఎక్కువ ఉండే మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. హైలురానిక్ యాసిడ్స్ ఉన్న సీరమ్‌ని ముందు ఉపయోగిస్తే మాయిశ్చరైజర్‌ని స్కిన్ మీద పట్టి ఉంచుతుంది. దీని వల్ల మేకప్ డ్రైగా కనిపించదు. బడ్జెట్‌ని బట్టి సీరమ్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. వాటిలో చర్మానికి అవసరమయ్యే గుణాలు ఏవి ఉన్నాయో అవి చెక్ చేసుకోవాలి. సాధారణంగా చర్మం సహజ ఆయిల్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. కానీ, వయసు పెరుగుతున్నకొద్దీ సహజ నూనెల ఉత్పత్తి ఆగి΄ోతుంది. దాంతో చర్మం ΄÷డిబారుతుంది. చలికాలం పెళ్లిళ్లు ఉన్న బ్రైడల్స్ అయితే కనీసం నెల ముందు నుంచి స్కిన్ కేర్ తీసుకోవాలి.హెల్తీ స్కిన్‌కి పోషకాహారంస్కిన్ కేర్ తీసుకోకుండా పెళ్లిరోజు మేకప్ చేయించుకుంటే హెల్తీగా కనిపించదు. నెల రోజుల ముందు నుంచి హైలురానిక్ యాసిడ్స్ ఉన్న సీరమ్స్ ఉపయోగించాలి. ΄ోషకాహారం, ΄ానీయాల మీద దృష్టి పెట్టాలి. జంక్ ఫుడ్, మాంసాహారం కాకుండా పండ్లు, కూరగాయలు, జ్యూసులను ఆహారంలో ఎక్కువ చేర్చుకోవాలి. దీని వల్ల చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది.మేకప్‌కి ముందుమేకప్కి ముందు ఎంజైమ్ స్క్రబ్ ఉపయోగిస్తారు. తర్వాత సీరమ్స్, అవసరమైతే షీట్ మాస్క్‌లు, అండర్ ఐ ప్యాచెస్ వాడుతారు. దీని వల్ల మేకప్ ప్యాచ్‌లుగా కనిపించదు.మేకప్ తీయడానికి తప్పనిసరిరిమూవర్స్ ఉపయోగించుకోవచ్చు. లేదంటే కొబ్బరినూనె, బాదం నూనె, బేబీ ఆయిల్ ను ఉపయోగించి మేకప్‌ను పూర్తిగా తీసేయాలి. తర్వాత ఫేస్‌వాష్‌తో శుభ్రపరుచుకొని, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అలసి΄ోయామనో, మరుసటి రోజు చూడచ్చులే అనో మేకప్ తీసేయకుండా అలాగే పడుకుంటే స్కిన్ బాగా దెబ్బతింటుంది. చర్మం ఇంకా పొడిబారడం, యాక్నె వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. మేలైన ఫేషియల్స్చలికాలంలో రొటీన్ ఫేషియల్స్ కాకుండా హైడ్రా ఫేషియల్ చేయించుకోవడం మంచిది. దీని వల్ల చర్మం నిగారింపు కోల్పోదు. వీటితో పాటు కొన్ని కెమికల్ పీల్స్ ఉంటాయి. అయితే, వీటిని పెళ్లికి పది రోజుల ముందు చేయించుకోవాలి. కెమికల్ పీల్ని బ్యూటీపార్లర్‌లో కాకుండా చర్మనిపుణుల సమక్షంలో చేయించుకోవడం మంచిది. – విమలారెడ్డి పొన్నాల, సెలబ్రిటీ అండ్ బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్ -
చలికాలంలో మీ స్కిన్ మృదువుగా ఉండాలంటే.!
చలికాలం చర్మం పొడిబారి, జీవం కోల్పోయినట్టు కనపడుతుంది. ఇలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కలిగి ఉండాలి. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అందుకు సంబంధించి కొన్ని టిప్స్ మీకోసం. టీ స్పూన్ బాదం నూనె, అర టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి, చేతులకు, పాదాలకు రాసి మసాజ్ చేయాలి. స్నానం చేసేముందు నాలుగు చుక్కల బాదం నూనె బకెట్ నీటిలో కలపాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. అరటిపండు గుజ్జు, కప్పు పెరుగు, టేబుల్ స్పూన్ తేనె, టేబుల్ స్పూన్ ఓట్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మేనికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. దీంతో చర్మానికి జీవకళ వస్తుంది. స్నానం చేయడానికి అరగంట ముందు కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె మేనికి రాసుకోవాలి. మృదువుగా మర్దనా చేసి, గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి చలికాలం నూనె శాతం అధికంగా ఉన్న మాయిశ్చరైజర్లు వాడాలి. ఆలివ్ ఆయిల్, అలొవెరా జెల్ సమపాళ్లలో తీసుకొని అందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని చలికాలం మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు. టీ స్పూన్ శనగపిండిలో అర టీ స్పూన్ తేనె, పచ్చిపాలు కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే పొడిబారిన ముఖ చర్మం ముడతలు తగ్గుతాయి. చర్మం పొడిబారకుండా ఉండాలంటే మృతకణాలను తొలగిస్తూ ఉండాలి. అలాగని చర్మాన్ని మరీ రబ్ చేయకూడదు. కార్న్‌ఫ్లేక్స్‌ని పొడి చేసి, అందులో తేనె, పాలు కలిపి చర్మానికి పట్టించి, మర్దనా చేయాలి. మృతకణాలు తొలగి పోయి చర్మం మృదువుగా మారుతుంది. -
శిల్పంలాంటి ముఖాకృతి కోసం..!
సినీ తారలు, సెలబ్రిటీల ముఖాలు చాలా ప్రకాశవంతంగా రిఫ్రెష్‌గా కనిపిస్తాయి. వాళ్ల ముఖాల్లో ఇంత గ్లో ఎలా సాధ్యమవుతోంది?. అందరికి వ్యక్తిగతంగా ఏవేవో టెన్షన్లు, ఒత్తిడులు కామన్‌గానే ఉంటాయి. అయినా అవేమీ వాళ్ల ముఖాల్లో కనిపించకుండా భలే ప్రశాంతంగా నిర్మలంగా కనిపిస్తాయి. అందుకు బ్యూటీ పార్లర్లు, ఫేస్ క్రీంలు మాత్రం కాదని అంటున్నారు నిపుణులు. సినీస్టార్లు ప్రముఖులు, వర్కౌట్లు, వ్యాయామాల తోపాటు ఫేస్ యోగా కూడా చేస్తారని, అది వారి దైనందిన జీవితంలో భాగమమని చెబుతున్నారు. అదే వారి అందమైన ముఖాకృతి రహస్యం అని చెబుతున్నారు. అసలేంటి ఫేస్ యోగా?. ఎలా చేస్తారంటే..?ప్రస్తుత రోజుల్లో ఫేస్ యోగా చాలామంది సెలబ్రిటీలకు ఇష్టమైన వర్కౌట్‌గా మారింది. ఇది ప్రకాశవంతంగా కనిపించేలా చేయడమే గాక చెక్కిన శిల్పంలా ముఖాకృతి ఉంటుంది. ముఖ్యంగా వృద్ధాప్య లక్షణాలను కనిపించనివ్వదు, అలాగే ముడతలను నివారిస్తుంది. ఈ ఫేస్ యోగా ముఖం, మెడలోని మొత్తం 57 కండరాలను బలోపేతం చేస్తుంది. అంతేగాదు రక్తప్రసరణ మెరుగ్గా ఉంచి చర్మ ఆరోగ్యాన్ని పెంపొదిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ముఖానికి మంచి మసాజ్‌లా ఉండి సెలబ్రిటీల మాదిరి ముఖాకృతిని పొందేలా చేస్తుందన్నారు. ఎలా చేయాలంటే.. ఫిష్ ఫేస్:ముఖాన్ని చేప మాదిరిగా.. రెండు బుగ్గలను లోపలకు గట్టిగా లాగాలి. ఇది బుగ్గలు, దవడలలోని కండరాలను బలోపేతం చేస్తుంది. ముఖం ఉబ్బడాన్ని తగ్గిస్తుంది. ఈ భంగిమలో ఐదు నుంచి పది సెకన్లు ఉంటే చాలు.'O' మాదిరిగా నోరు తెరవడం..మధ్య ముఖ ప్రాంతాన్ని ఎత్తి చేస్తాం. అంటే ఆంగ్ల అక్షరం 'o' అని పెద్దగా నోరు తెరిచి ఉంచాలి. ఇలా పది నుంచి 15 నిమిషాలు చేయాలి. ఇది ముఖం కుంగిపోకుండా నివారిస్తుంది.ముఖంపై సున్నితంగా టచ్ చేయడం..నుదిటి కండరాల నుంచి ఒత్తిడిని విడుదల చేయడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. అలాగే కోపాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. రెండు చేతులను నుదిటిపై నుంచి మెడ వరకు సుతి మెత్తంగా టచ్ చేస్తూ పోవాలి.ది ఐ ఓపెనర్కళ్లకు సంబంధించిన వ్యాయామం. కళ్లను పెద్దవిగా చేసి అటు ఇటూ తిప్పడం. అలాగే కొద్దిసేపు గుండ్రంగా తిప్పడం వంటివి చేయాలి. కళ్ల చుట్టూ ఉన్న కండరాలను బలపరుస్తుంది. కనురెప్పలు కుంగిపోకుండా చేస్తుంది. కిస్సింగ్ అండ్ స్మైలింగ్ పోస్ముఖాన్ని ఇంటి పైకపు చూస్తున్నట్లుగా పైకెత్తాలి. ఈ భంగిమలో పైకి చూస్తూ..కాసేపు నవ్వడం, కిస్ చేస్తున్నట్లుగా గడ్డం పైకెత్తడం వంటివి చేయాలి.ప్రయోజనాలు..వృద్ధాప్య సమస్యలకు చక్కటి సహజసిద్ధమైన పరిష్కారంచర్మపు స్థితిస్థాపకతను పెంచుతుందిముడతలను తగ్గిస్తుందిధృడమైన యవ్వన రూపాన్ని అందిస్తుంది. ముఖ ఉద్రిక్తతను తగ్గించి, ఉబ్బడాన్ని నివారిస్తుంది.చెంప ఎముకలను చక్కటి ఆకృతిలో ఉండేలా చేస్తుందికను రెప్పలు వంగిపోకుండా నివారిస్తుందిఅలాగే ముఖాకృతిని మెరుగుపరుస్తుంది -
పెసర పిండితో బ్యూటీ ప్యాక్స్ : మెరిసే మోము
శీతాకాలంలో చర్మం, ముఖం సౌందర్య పట్ల మరింత జాగ్రత్త తీసుకోవాలి. రసాయనాలులేని సహజ పదార్థాలతోనే చర్మ సౌందర్యాన్నిమెరుగు పర్చు కోవడానికి ప్రయత్నించాలి. చర్మాన్ని మృదువుగా చేయడంలోనూ, చర్మానికి మెరుపును ఇవ్వడంలోనూ, చక్కటి రంగు తేలేలా చేయడంలోనూ పెసలు చక్కగా పని చేస్తాయి. ఈ నేపథ్యంలో పెసర పిండితో కొన్ని చిట్కాలను ఇపుడు చూద్దాం! టీ స్పూన్ పెసరపిండిలో పచ్చిపాలు కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. దీనిని ముఖానికి మాస్క్‌లా వేయాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడిచర్మాన్ని ఈ మాస్క్ మృదువుగా మారుస్తుంది.పెసరపిండిలో కొద్దిగా పెరుగు, కొబ్బరి నూనె కలిపి చేతులకు రాయాలి. సున్నితంగా రబ్ చేసి, పది నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పెసరపిండి, పెరుగు, కొబ్బరి నూనె చర్మాన్ని మరింత మృదువుగా మారుస్తాయి.టేబుల్ స్పూన్ పెసర్లు, ఐదు బాదంపప్పులు రాత్రి నీళ్లలో నానబెట్టాలి. ఉదయాన్నే వీటిని పేస్ట్ చేసి, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే చర్మం పొడిబారడం సమస్యే దరిచేరదు. -
శీతాకాలం చర్మం పొడిబారకుండా ఉండాలంటే..?
శీతాకాలం అనంగానే అందరికి ఎందురయ్యే ప్రధాన సమస్య చర్య పొడిబారడం. దీని వల్ల దద్దుర్లు, ఒక విధమైన దురద మంట వస్తాయి. అలాగే చర్మం కూడా అసహ్యంగా మారిపోతుంది. తాకినప్పుడుల్లా గరుకుదనంతో మంటగా ఉంటుంది. అలాంటి సమస్యకు ఇంట్లో దొరికే వాటితో ఈజీగా చెక్ పెట్టొచ్చు . అదెలాగో చూద్దామా..!.టీ స్పూన్ పెసరపిండిలో పచ్చిపాలు కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. దీనిని ముఖానికి మాస్క్‌లా వేయాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడిచర్మాన్ని ఈ మాస్క్ మృదువుగా మారుస్తుంది.పెసరపిండిలో కొద్దిగా పెరుగు, కొబ్బరి నూనె కలిపి చేతులకు రాయాలి. సున్నితంగా రబ్ చేసి, పది నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పెసరపిండి, పెరుగు, కొబ్బరి నూనె చర్మాన్ని మరింత మృదువుగా మారుస్తాయి.టేబుల్ స్పూన్ పెసర్లు, ఐదు బాదంపప్పులు రాత్రి నీళ్లలో నానబెట్టాలి. ఉదయాన్నే వీటిని పేస్ట్ చేసి, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే చర్మం పొడిబారడం సమస్యే దరిచేరదు. (చదవండి: పెదవులు గులాబీ రంగులో మెరవాలంటే ఆపిల్, అరటిపండ్లతో ఇలా చేయండి..!) -
పెదవులు గులాబీ రంగులో మెరవాలంటే ..!
చలికాలంలో పెదాలు పొడిబారినట్లుగా అయిపోయవడమే గాక ముఖం, చర్మం కాంతి విహీనంగా మారుతుంది. ఓపక్క పని ఒత్తిడి వల్ల కళ్లకింద నలుపు, ముఖంంపై ముడతలతో అందవిహీనంగా కనిపిస్తుంది. ఇలాంటి వాటిని ఆరోగ్యం కోసం తినే ఫ్రూట్స్‌తో చెక్‌పెడదాం. అదెలాగో చూద్దామా..కీరదోసకాయని చక్రాల్లా కోసుకుని కళ్ళమీద పెట్టుకుంటే కంటి అలసట తగ్గుతుంది. రెండు స్పూన్ల చల్లని పాలలో కాటన్ బాల్స్‌ని ముంచి కళ్ళ చుట్టూ వలయాకారంగా మర్ధించి 20 నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే కంటి కింద నలుపు తగ్గి అందంగా ఉంటాయి. మెడ మురికి పట్టేసినట్లు నల్లగా ఉంటే... నాలుగు టీ స్పూన్ల పుల్లటి పెరుగులో రెండు స్పూన్ల బియ్యప్పిండి కలిపి మెడకు పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మానికి పట్టిన నలుపుతోనాటు ముడతలుపోతాయి.టీ స్పూన్ అరటిపండు గుజ్జులో టీస్పూన్ తేనె కలిపిన మిశ్రమాన్ని పెదవులకు రాసి మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే నల్లని పెదవులు గులాబీ రంగులోకి మారతాయి.టీస్పూన్ పాల మీగడ, అయిదారు గులాబి రేకులు తీసుకుని పేస్ట్ చేసిన మిశ్రమాన్ని పెదవులకు రాసుకుంటే పెదవులు పొడిబారకుండా మృదువుగా ఉంటాయి. చలికాలంలో లిప్‌స్టిక్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది. లిప్ గార్డ్, మీగడ, వెన్న, నెయ్యి వంటివి రాసుకుంటూ ఉంటే పెదవులు పొడిబారకుండా అందంగా ఉంటాయి. టీ స్పూన్ ఆపిల్ గుజ్జులో టీ స్పూన్ అరటిపండు గుజ్జు, అయిదారు చుక్కల తేనె వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ఫేస్ మాస్క్‌లా వేసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖంపై ఏర్పడ్డ ముడతలు, జిడ్డు తగ్గి ముఖం మెరుస్తూ కాంతివంతంగా ఉంటుంది. (చదవండి: ఐపీఎల్ ఆటగాళ్ల ‘వేలం'లో మెరిసిన ఆ చిన్నది ఎవరు?) -
క్యారెట్‌తో ఇలా చేస్తే 24 క్యారెట్ల బంగారంలా!
క్యారెట్లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మపు రంగు , ఆకృతిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. క్యారెట్లో ఉండే బీటా కెరోటిన్ మన బాడీలో విటమిన్ ‘ఏ’గా మారి ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది. క్యారెట్‌లోని విటమిన్ సి కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. అలాగే క్యారెట్లు జుట్టు కణాలను పునరుద్ధరించేందుకు ,జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. మరి ముఖ సౌందర్య పోషణలో క్యారెట్లు ఎలా పనిచేస్తాయో చూద్దాం!క్యారెట్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలుసు. అయితే ఇది అందానికీ ఎంతగా మెరుగులు దిద్దుతుందో తెలుసా? ‘24 క్యారెట్ల’ బంగారం లాంటి ముఖ సౌందర్యానికి ఏం చేయాలంటే...∙రెండు క్యారెట్లను మెత్తని పేస్టులా చేసుకుని, అందులో ఐదారు చెంచాల పాలు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత ప్యాక్‌ను తీసేసి ముఖానికి ఆవిరి పట్టాలి. కొన్నాళ్లిలా చేస్తే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ పోతాయి.క్యారెట్ గుజ్జులో కాసింత ముల్తానీ మట్టి, తేనె కలిపి ప్యాక్ వేసుకుంటే... ముఖం కాంతిమంతమవుతుంది.క్యారెట్, కీరా, బంగాళ దుంపల్ని మెత్తని పేస్ట్‌లా చేయాలి. ఇందులో కాసింత టొమాటో రసం, చిటికెడు గంధం కలిపి ముఖానికి పూసుకోవాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేసుకుంటే ముఖం మిలమిలా మెరుస్తుంది. -
ఇంట్లోనే ఈజీగా కర్లీ హెయిర్..!
కొందరికి గిరజాల జుట్టు అంటే ఇష్టంగా ఉంటుంది. నిజానికి వేసుకున్న డ్రెస్‌కు తగినట్లుగా హెయిర్ స్టైల్‌ని మార్చేవాళ్లకు చిత్రంలోని ఈ హెడ్ బ్యాండ్ భలే చక్కగా పని చేస్తుంది. అందుకే చాలామంది కేశాలంకరణ ప్రియులు, హెయిర్ స్ట్రెయిటనర్తో పాటు హెయిర్ కర్లర్ వాడుతూ ఉంటారు. ఈ కర్లర్ హీట్‌లెస్ బ్యాండ్‌ను వెంట ఉంచుకుంటే, ఎలక్ట్రిక్ కర్లర్‌తో పని ఉండదు. దాంతో జుట్టు పాడవదు. పైగా ఈ రోలర్ టూల్‌ను ఉపయోగిస్తే చక్కటి హెయిర్ స్టైల్‌తో అందంగా మెరిసిపోవచ్చు.ఈ బ్యాండ్స్ చాలా రకాలు, చాలా రంగుల్లో లభిస్తున్నాయి. ఆయా బ్యాండ్స్‌ని ఆయా పద్ధతుల్లోనే తలకు అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం జుట్టును కొన్ని చిన్నచిన్న పాయలుగా విడదీసుకుని, బ్యాండ్ కిందకు వేలాడుతున్న లేసులకు ఆ పాయలను బిగించి చుట్టి, 2 లేదా 3 గంటల పాటు అలా ఉంచుకోవాలి. అనంతరం లేసుల నుంచి జుట్టును పాయలు పాయలుగా విడదీసేస్తే, జుట్టు మొత్తం కర్లీగా మారిపోతుంది. ఈ టూల్‌ని చిత్రంలో చూపిన విధంగా తల వెంట్రుకలకు బిగించుకుని ఇంటిపనులు, వంటపనులు చేసుకోవచ్చు, లేదా చక్కగా నిద్రపోవచ్చు. ఈ ఉంగరాలు తిరిగిన జుట్టు ఎక్కువ సమయం ఉండాలన్నా, ఎక్కువ రింగులు తిరగాలన్నా రాత్రి పూట తలకు ఈ బ్యాండ్ పెట్టుకుని పడుకుంటే, ఉదయం లేచేసరికి అందమైన హెయిర్ స్టైల్ మీ సొంతమవుతుంది. ఈ ప్రీమియం కర్లింగ్ మెటీరియల్ 100% సహజమైన, నాణ్యత కలిగిన స్పాంజ్‌తో రూపొందింది. ఇది ఎలాంటి ప్లాస్టిక్ వాసన రాదు. హానికరం కాదు. పైగా ఇది వాడుకోడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ బ్యాండ్ కేవలం రూ.500 కంటే తక్కువ ధరలోనే ఆన్లైన్లో అందుబాటులో ఉంది. నచ్చినవాళ్లకు ఈ టూల్‌ని బహుమతిగా కూడా ఇవ్వవచ్చు. (చదవండి: నోటిలో నాటే ఇంప్లాంట్స్...) -
అందాల రాణి ఐశ్వర్య రాయ్ బ్యూటీ సీక్రెట్ ఇదే..!
బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ అందానికే ఐకానిక్‌గా ఉండే సౌందర్యం ఆమె సొంతం. ఎంతమంది అందగత్తలైన ఆమెకు సాటి రారు. అలాంటి అద్భుతమైన అందం ఆమెది. ఐదుపదుల వయసులో కూడా అంతే గ్లామర్‌గా ఉండటం విశేషం. ఎక్కడ ఐశ్వర్యరాయ కనిపించినా..అందాల రాణి వస్తుందని ఆత్రంగా చూస్తారు. అంతటి ఆకర్షణీయమైన అందాన్ని మెయింటైన్ చేసేందుకు ఐశ్వర్య ఏంచేస్తుందో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు కూడా. అంతేగాదు ప్రతి మహిళ చర్మ సంరక్షణ కోసం ఏం చేయాలో కూడా చెప్పారామె. ఇంతకీ అవేంటో చూద్దామా..!.మాజీ మిస్ ఇండియా ఐశ్వర్య రాయ్ ఇప్పటికి అంతే ఫిట్‌గా అందంగా కనిపిస్తారు. ఎక్కడ మచ్చ్చుకైనా..వృద్ధాప్య ఛాయలు కానరావు. అంతలా మేని ఛాయ మెరుస్తూ ఉండేందుకు ఐశ్వర్య ఎంతో కేర్ తీసుకుంటానని చెప్పారు. ఆరోగ్యం కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో అలాగే చర్మ సంరక్షణ కూడా అంతే ముఖ్యమని అంటోంది ఐశ్వర్య రాయ్. తాను కూడా ప్రతి భారతీయ మహిళ ఎలా ఉంటుందో తాను అలానే ఉంటానన్నారు. "అయితే ఆత్మగౌరవంతో, సరైన వ్యక్తిత్వంతో బతకాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రతి స్త్రీ తన ఆత్మగౌరవాన్ని చంపుకుని జీవించాల్సిన పనిలేదు. అదీగాక మహిళలు నిద్ర లేచిన దగ్గర నుంచి గడియారంలోని ముల్లుకంటే వేగంగా ఆగకుండా పనిచేస్తూనే ఉంటారని అన్నారు. అందువల్ల కనీసం కొద్దిసేపైనా మీ కోసం సమయం కేటాయించడం అత్యంత ముఖ్యం. హైడ్రేటెడ్‌గా పరిశుభ్రంగా ఉండేందుకు ప్రయత్నించండి. మీ గౌరవాన్ని ఇనుమడింప చేసే అందంపై దృష్టి పెట్టండి. అందులో ఎలాంటి తప్పు లేదు. తప్పసరిగా మొటిమలు, అలెర్జీలు వంటి బారిన పడకుండా స్కిన్కేర్లు వాడలన్నారు. తప్పనసరిగా మాయిశ్చరైజర్లను వాడమని సూచించింది. వంటపనులతో సతమతమయ్యే మహిళలు తమ చర్మ ఆరోగ్యం కోసం మాయిశ్చరైజర్లు వాడాలని అన్నారు." ఐశ్వర్యరాయ్.(చదవండి: 'తుప్పా దోస విత్ చమ్మంతి పొడి' గురించి విన్నారా?) -
చలి పులి వచ్చేస్తోంది నెమ్మదిగా...ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!
నెమ్మదిగా చలి ముదురుతోంది. వెచ్చని దుప్పట్టు, చలిమంటలు కాస్త ఊరటనిచ్చినా ఇంకా అనేక సమస్యలు మనల్ని వేధిస్తుంటాయి. ముఖ్యంగా శీతగాలులకు శ్వాసకోశ వ్యాధులు, చర్మ సమస్యలు బాగా కనిపిస్తాయి. మరి ఈ సీజన్లో చర్మం పొడిబారకుండా, పగలకుండా ఉండాలంటే ఏం చేయాలి. ఇదిగో మీ కోసం ఈ చిట్కాలు.పొడి బారే చర్మానికి మాయిశ్చరైజర్లు పదే పదే రాయాల్సి వస్తుంది. ఆ అవసరం లేకుండా, చర్మం మృదుత్వం కోల్పోకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి.పాల మీగడలో తేనె కలిపి ముఖానికి, చేతులకు పట్టించి, మృదువుగా మసాజ్ చేయాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.చలికాలం రోజూ ఈ విధంగా చేస్తుంటే చర్మకాంతి కూడా పెరుగుతుంది. చర్మానికి సరైన పోషణ లేక లేకపోతే జీవ కళ కోల్పోతుంది. పాలు, బాగా మగ్గిన అరటిపండు గుజ్జు కలిపి మిశ్రమం తయారుచేసుకొని ప్యాక్ వేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. జిడ్డుచర్మం గలవారు పాలు–రోజ్‌వాటర్ కలిపి రాసుకోవచ్చు. తర్వాత వెచ్చని నీటితో కడిగేయాలి. చర్మంపై ఎక్కువ మృతకణాలు కనిపిస్తే కలబంద రసంలో పది చుక్కల బాదం నూనె, నువ్వుల నూనె కలిపి ముఖానికి, చేతులకు రాయాలి. వృత్తాకారంలో రాస్తూ మర్దన చేయాలి.రాత్రంతా అలాగే వదిలేసి, మరుసటి రోజు ఉదయం వెచ్చని నీటితో కడిగేయాలి.శీతాకాలంలో శరీరాన్ని తేమగా ఉంచుకోవాలి. చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకుంటేనే మెరుస్తూ ఉంటుంది. అలా ఉండాలంటే తగినన్ని నీళ్లు తాగాలి. (నో జిమ్.. నో డైటింగ్ : ఏకంగా 20 కిలోల బరువు తగ్గింది!)ఫ్యాటీఫుడ్స్కు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. తాజా ఆకుకూరలు, సీ విటమిన్ లభించే పండ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒత్తిడికి దూరంగా ఉంటూ సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి. రోజూ వాకింగ్, యోగా లాంటి వ్యాయామం చేస్తే శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో మన ముఖంలో చర్మకాంతిలో చక్కటి గ్లో వస్తుంది. -
ఏళ్లు గడుస్తున్నా యంగ్‌గానే..!
వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంలో పలు మార్పులు చోటు చేసుకుంటాయి. అది యవ్వనంలో ఉండే మెరుపును, బిగుతును కోల్పోతుంది. చర్మంలోని బిగుతూ, మిసమిస పది కాలాల పాటు ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం...చర్మంపై వయసు ప్రభావం కనపడనివ్వకుండా చేసుకోడానికి అన్నిరకాల పోషకాలు ఉండే సమతుల ఆహారాన్ని తీసుకోండి. అందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు, బాదం వంటి డ్రై ఫ్రూట్స్‌లో ఈ పోషకాలు ఎక్కువ. ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండటంతో పాటు శరీరంలోని లవణాలను కోల్పోకుండా చూసుకోండి. దీనివల్ల హైడ్రేటెడ్‌గా ఉంటారు. ఫలితంగా చర్మం ఆరోగ్యకరమైన మేని మెరుపు తో నిగారిస్తూ ఉంటుంది. గోరువెచ్చని నీళ్లతో... తక్కువ గాఢత ఉన్న మైల్డ్ సోప్‌లు వాడటమే మంచిది. మంచి మాయిశ్చరైజేషన్ లోషన్స్‌తో చర్మాన్ని పొడిబారకుండా చూసుకోవాలి. రోజూ ఎండకు వెళ్లే వారు మంచి సస్‌స్క్రీన్ లోషన్స్ ఉపయోగించాలి. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా సౌకర్యవంతమైన దుస్తులు ధరించాలి. చర్మంపై వచ్చే ఇన్ఫెక్షన్స్ను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవాలి. ఈ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే వయసు పెరుగుతున్నప్పటికీ చర్మం ఏజింగ్ ప్రభావానికి గురికాకుండా ఉంటుంది. (చదవండి: గంటలకొద్ది కూర్చొని పనిచేసే వాళ్లకు ది బెస్ట్ వర్కట్లివే..!) -
Beauty Tips: ముడతలు మాయం
సౌందర్య సంరక్షణలో సహజ వైద్యాన్ని కోరుకుంటారు చాలామంది. అందులో ముఖ్యంగా ముఖానికి ఐస్ మసాజ్ అనేది బెస్ట్ ట్రీట్మెంట్ అంటారు చాలామంది. అయితే ఐస్ ముక్కను ఎక్కువ సమయం చేత్తో పట్టుకోవడం కష్టం. పైగా త్వరగా కరిగిపోయి, చికాకు కలిగిస్తుంది. అందుకే చాలామంది ఐస్ రోలర్స్ ఉపయోగిస్తూ ఉంటారు. వాటిని ఫ్రిజ్‌లో కొన్ని గంటలు ఉంచి, ఆ తర్వాత వినియోగిస్తూ ఉంటారు. అయితే చిత్రంలోని ఐస్ రోలర్ సులువుగా వాడుకోవడానికి అనువుగా తయారైంది. ఇప్పుడు దాని వివరాలు చూద్దాం.సౌందర్య నిపుణుడు కెర్రీ బెంజమిన్ ఈ రోలర్‌ను రూపొందించారు. దీన్ని పట్టుకోవడానికి వీలుగా హ్యాండిల్, దానిపైన గుండ్రటి రోలర్ అటాచ్ చేసి ఉంటుంది. దీనిని స్టెయిన్స్ లెస్ స్టీల్‌తో రూపొందించడంతో ఫ్రిజ్‌లో ఉంచి తీశాక ఆ చల్లదనం చాలాసేపు ఉంటుంది. అలాగే ముఖంపై మసాజ్ చేసుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. దీనితో మసాజ్ చేసుకుంటే కళ్లకింద వాపులు, కళ్ల చుట్టూ నల్లటి వలయాలు, ముఖంపై ముడతలు తగ్గుతాయి. ఇది వయసు తెలియకుండా కాపాడుతుంది. దీని రోలర్‌కి మాత్రమే సరిపోయేలా సిలికాన్ క్యాప్ అవసరాన్ని బట్టి అమర్చుకోవచ్చు, తీసేసుకోవచ్చు. ఇది ఎర్గానామిక్ హ్యాండిల్‌ని కలిగి ఉండటంతో ఫ్రిజ్‌లో పెట్టినా హ్యాండిల్ చల్లగా కాదు. దాంతో చేత్తో పట్టుకుని వినియోగించుకోవడం తేలిక అవుతుంది.ఈ మసాజర్ ఎర్రగా కందిపోయినట్లుగా మారిన చర్మాన్ని ఇట్టే చక్కగా, మృదువుగా మారుస్తుంది. దురదల వంటి సమస్యలను దూరం చేస్తుంది. దీని ధర 85 డాలర్లు. అంటే 7,138 రూపాయలు. -
మెరిసే మేని చాయను కాపాడుకోడం ఎలా అని ఆలోచిస్తున్నారా?
మారుతున్న వాతావరణ పరిస్థితుల మధ్య మేని ఛాయను కాపాడుకోవడం చాలాకష్టం. కాలుష్యం, సూర్యకిరణాల ప్రభావం నుంచి రక్షణ పొందాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. అవేంటో చూద్దామా! తక్షణ తాజాదనం కోసం రోజ్ వాటర్ లేదా దోసకాయ రసంతో మేనికి మర్దనా చేసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. పచ్చి పాలను కాటన్ బాల్‌తో అద్దుకొని, ముఖానికి రాయాలి. 10 నిమిషాలపాటు అలాగే ఉంచి కడిగేయాలి. పాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, ఇది చర్మాన్ని సున్నితంగా ఉంచడంతోపాటు శుభ్రపరుస్తుంది.చర్మంపై నుంచి సహజ నూనెలను ΄ోకుండా ఉండటానికి చర్మతత్వానికి సరి΄ోయే తేలిక΄ాటి, క్లెన్సర్‌ని ఉపయోగించాలి. ఓట్మీల్లో తేనె, కొద్దిగా నీళ్లతో కలిపి పేస్ట్ చేయాలి. మృత చర్మ కణాలను తొలగించడానికి, పోర్స్‌ను శుభ్రం చేయడానికి సున్నితంగా స్క్రబ్ చేయాలి.ప్రతిరోజూ కలబంద జెల్‌ను రాసి, మృదువుగా మర్దనా చేయాలి. దీని వల్ల చర్మం నునుపుగా, తేమగా ఉంటుంది. టేబుల్ స్పూన్ తేనెను, టేబుల్ స్పూన్ పెరుగుతో కలపాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి, 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ చర్మాన్ని కాంతిమంతం చేస్తుంది.సగం అరటిపండును మెత్తగా చేసి, టీస్పూన్ తేనెతో కలపాలి. చర్మం మృదువుగా, మెరుస్తూ ఉంటుంది.కొద్దిగా గ్రీన్ టీని కాచి, చల్లబరచాలి. ఈ నీటిని దూదితో అద్దుకుంటూ, మేనికి పట్టించాలి. ఎండకు కమిలిన చర్మం తాజాగా మారుతుంది. -
అలియా లాంటి మెరిసే చర్మం కోసం..!
బాలీవుడ్ నటి అలియా భట్ ఎంత గ్లామరస్‌గా కనిపిస్తుందో చెప్పాల్సిన పనిలేదు. మచ్చలేని చందమామలా ఉండే అలియా సౌందర్యాన్ని ఇష్టపడని వారుండదరు. అలాంటి మెరిసే చర్మం కోసం ఈ టిప్స్ ఫాలో అయితే చాలంటున్నారు నిపుణులు. ప్రస్తుతం అలియా కాశ్మీర్లో ఉంది. త్వరలో ప్రేక్షకుల మందుకు రానున్న అల్ఫా మూవీ చిత్రీకరణలతో బిజీగా ఉంది. అక్కడ నో మేకప్ లుక్‌లో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. సూర్యుడే దిగి వచ్చి ముద్దాడేలా క్యూట్‌గా ఉన్న ఆమె ముఖ కాంతికి ఫిదా కాకుండా ఉండలేం. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) అంతటి చలిలో కూడా చక్కగా గ్లామర్ మెయింటైన్ చేస్తూ..అలియాలా అందంగా కనిపించాలంటే నిపుణులు ఈ చిన్నపాటి చిట్కాలను ఫాలోకండి అని చెబతున్నారు. శీతాకాలంలో సైతం చర్మం పాడవ్వకుండా అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఐదు బ్యూటీ టెక్నిక్స్ ఫాలో అవ్వాలని తెలిపారు బ్రైన్ మావర్ డెర్మటాలజిస్ట్, డాక్టర్ హుసింజాద్తరుచుగా మాయిశ్చరైజర్ చేయడం..సెరామైడ్లు, హైలురోనిక్ యాసిడ్, పెట్రోలియం జెల్లీ కలిగిన మాయిశ్చరైజర్లు చర్మంలోని తేమని నిలుపుకోవడంలో సహాయపడతాయి. తేలికపాటి లోషన్ల కంటే చిక్కటి క్రీములు ఎంచుకోండి. శీతాకాలంలో ఇలాంటి మాయిశ్చరైజర్లు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి.హైడ్రేటింగ్ క్లెన్సర్లకు మారండిచలికాలంలో, ముఖంపై కఠినమైన క్లెన్సర్లను నివారించండి. అంటే బాగా గాఢత గల ఫేస్‌వాష్‌లను నివారించండి. ముఖం తేమతో ఉండేలా చేసి, శుభ్రపరిచే మంచి ఫేస్‌వాష్‌ని ఉపయోగించండి.వేడి నీళ్లు ఎక్కువగా ఉపయోగించొద్దు..శీతాకాలం సాధారణంగా వేడినీళ్లు ముఖంపై జల్లుకునేందుకు ఇష్టపడతాం. కానీ నిపుణులు అభిప్రాయం ప్రకారం..ఇలా అస్సలు వద్దని చెబుతున్నారు. గోరువెచ్చని నీటిని ఉపయోగించమని సూచిస్తున్నారు. బాగా వేడి నీళ్లు ఉపయోగిస్తే చర్మం పొడిగా మారిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులుకఠినమైన స్క్రబ్‌లు,సువాసనగల ఉత్పత్తులను నివారించండికఠినమైన స్క్రబ్‌లు,సువాసనగల ఉత్పత్తులు పొడి చర్మంపై చికాకుని తెప్పిస్తాయి. మంటకు దారితీసే ప్రమాదం లేకపోలేదు. ఆరోగ్యకరమైన చర్మం కోసం శీతాకాలంలో వీటిని నివారించండి. పొడిచర్మం కలవాళ్లు గాఢమైన సువాసనలేని సబ్బులు, బాడీ వాష్‌లు ఉపయోగించండి.హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవాలి..శరీరంలో నీటి శాతాన్ని పెంచడానికి శీతాకాలంలో హైడ్రేషన్ అవసరం. చలికాలంలో పానీయాలు , ఆల్కహాల్ వినియోగం శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే శీతాకాలంలో సైతం ఆరోగ్యకరమైన మెరిసే చర్మం మన సొంతం అని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: మానసిక ఆరోగ్యం కోసం 'టిబెటన్ సింగింగ్ బౌల్స్'! ఎలా ఉపయోగపడతాయంటే..) -
మీ ముఖాన్ని.. మెరిపించే మంత్రదండం!
ముఖ వర్చస్సును మెరుగుపరచే ఈ పరికరం అందానికి అసలైన సాధనం అంటున్నారు వినియోగదారులు. ఇది కళ్లచుట్టూ ఉండే వాపును, నల్లటి వలయాలను ఇట్టే తగ్గిస్తుంది. వయసుతో వచ్చే చర్మసమస్యలను వేగంగా రూపుమాపుతుంది. ముఖాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. సౌందర్యాన్ని కోరుకునే మహిళలకు ఇది మంత్రదండం లాంటిది.అర్గనామిక్ డిజైన్ ను కలిగి ఉన్న ఈ మెషిన్ చేతిలో చక్కగా ఇమిడిపోతుంది. ట్రీట్మెంట్కి అనువుగా ఉంటుంది. సుతిమెత్తని శరీరభాగాల్లో సులభంగా మూవ్ అవుతుంది. కళ్ల పక్కన ఇరుకైన ప్రదేశాల్లో అటు ఇటు కదిలించి మసాజ్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇందులోని క్రియోథర్మల్ టెక్నాలజీ వల్ల దీనిలో కూలింగ్‌తో పాటు హీటింగ్ మోడ్ కూడా ఉంటుంది. కోల్డ్ ట్రీట్మెంట్ మోడ్ చర్మాన్ని 50నిఊ వరకు చల్లబరుస్తుంది, ఇది రంధ్రాలను బిగించి, ముఖాన్ని కాంతిమంతం చేస్తుందిఇక హీట్ మోడ్ 108నిఊ వరకు చేరి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనికి ఉన్న క్యాప్‌ను తొలగించి, దీని హెడ్‌ను చర్మానికి ఆనించి, మెషిన్ ఆన్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. రెడ్ కలర్ హీట్ మోడ్‌ను, బ్లూ కలర్ కూల్ మోడ్‌ను సూచిస్తుంది. ముందే చార్జింగ్ పెట్టుకుని వైర్‌లెస్‌గా కూడా వినియోగించుకోవచ్చు. ఇలాంటి పరికరాలను కొనుగోలు చేసేటప్పుడు ఆన్లైన్లో పలు రివ్యూస్ చూసి తీసుకోవడం మంచిది.ఇవి చదవండి: పళ్ల చిగుళ్ల.. సమస్య! ఏ ట్రీట్మెంట్ వాడాలి? -
Health: ఈ సమస్యలు.. కొనితెచ్చుకుంటున్నారా?
డెర్మోరెక్సియా... ఈ పదంలో డెర్మో ఉంది, కానీ ఇది చర్మ సమస్య కాదు. మానసిక సమస్య. ఒకరకంగా అనెరొక్సియా వంటిదే. సాధారణ బరువుతో ఉన్నప్పటికీ లావుగా ఉన్నామనే భ్రాంతికి లోనవుతూ సన్నబడాలనే ఆకాంక్షతో ఆహారం తినకుండా దేహాన్ని క్షీణింపచేసుకోవడమే అనెరొక్సియా. ఇక డెర్మోరెక్సియా అనేది చర్మం అందంగా, యవ్వనంగా, కాంతులీనుతూ ఉండాలనే కోరికతో విపరీతంగా క్రీములు వాడుతూ చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోవడమే డెర్మోరెక్సియా. ఇటీవల మధ్య వయసు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోంది.ఆత్మవిశ్వాసానికి అందం కొలమానం కాదు! ‘అందం ఆత్మవిశ్వాసాన్ని పెం΄÷ందిస్తుంది’ అనే ప్రచారమే పెద్ద మాయ. సౌందర్య సాధనాల మార్కెట్ మహిళల మీద విసిరిన ఈ వల దశాబ్దాలుగా సజీవంగా ఉంది, ్రపాసంగిక అంశంగానే కొనసాగుతోంది. ఈ తరం మధ్య వయసు మహిళ ఈ మాయలో పూర్తిగా మునిగి΄ోయిందనే చె΄్పాలి. వార్ధక్య లక్షణాలను వాయిదా వేయడానికి, ముఖం మీద వార్ధక్య ఛాయలను కనిపించకుండా జాగ్రత్తపడడానికి యాంటీ ఏజింగ్ క్రీములను ఆశ్రయించడం ఎక్కువైంది. ఒక రకం క్రీము వాడుతూండగానే మరోరకం క్రీమ్ గురించి తెలిస్తే వెంటనే ఆ క్రీమ్‌కు మారి΄ోతున్నారు. వీటి కోసం ఆన్లైన్లో విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. క్రమంగా ఇది కూడా ఒక మానసిక సమస్యగా పరిణమిస్తోందని చెబుతున్నారు లండన్ వైద్యులు.క్రీమ్‌ల వాడకం తగ్గాలి! లుకింగ్ యూత్‌ఫుల్, ఫ్లాలెస్ స్కిన్ కోసం, గ్లాసీ స్కిన్ కోసం అంటూ ప్రచారం చేసుకునే క్రీమ్‌లను విచక్షణ రహితంగా వాడుతూ యాక్నే, ఎగ్జిమా, డర్మటైటిస్, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. గాఢత ఎక్కువగా ఉన్న గ్లైకోలిక్ యాసిడ్, నియాసినామైడ్, రెటినాల్, సాలిసైలిక్ యాసిడ్, అల్ఫా హైడ్రాక్స్ యాసిడ్స్ చర్మానికి హాని కలిగిస్తున్నాయి. అలాగే చర్మం మీద మృతకణాలను తొలగించడానికి చేసే ఎక్స్ఫోలియేషన్ విపరీతంగా చేయడం వల్ల చర్మం మరీ సున్నితమై΄ోతోంది. కళ్లచుట్టూ ఉండే చర్మం మీద ఈ క్రీమ్‌లను దట్టంగా పట్టించడం వల్ల ఆర్బిటల్ ఏరియాలో ఉండే సన్నని సున్నితమైన రక్తనాళాలు పలుచబడి వ్యాప్తి చెందుతాయి. దాంతో కళ్ల కింద చర్మం ఉబ్బెత్తుగా మారుతుంది. డెర్మోరెక్సియాను గుర్తించే ఒక లక్షణం ఇది. డెర్మోరెక్సియాను నిర్ధారించే మరికొన్ని లక్షణాలిలా ఉంటాయి. – చర్మం దురదగా ఉండడం, మంటగా అనిపించడం, ఎండకు వెళ్తే భరించలేక΄ోవడం – తరచూ చర్మ వ్యాధి నిపుణులను కలవాల్సి రావడం, ఎన్ని రకాల చికిత్సలు తీసుకున్నప్పటికీ సంతృప్తి కలగక΄ోవడం. – చర్మం ఆరోగ్యంగా ఉన్నప్పటికీ తరచూ అద్దంలో చూసుకుంటూ అసంతృప్తికి లోనవడం. తళతళ మెరిసే గ్లాసీ స్కిన్ కోసం చర్మం మీద ప్రయోగాలు చేయడం – షెల్ఫ్‌లో అవసరానికి మించి రకరకాల బ్యూటీ ్ర΄ోడక్ట్స్ ఉన్నాయంటే డెర్మోరెక్సియాకు దారితీస్తోందని గ్రహించాలి. మధ్య వయసు మహిళలే కాదు టీనేజ్ పిల్లల విషయంలో కూడా ఈ లక్షణం కనిపించవచ్చు. పేరెంట్స్ గమనించి పిల్లలకు జాగ్రత్తలు చె΄్పాలి.ఓసీడీగా మారకూడదు..శరీరం అందంగా కనిపించట్లేదనే అసంతృప్తి వెంటాడుతూనే ఉండడం బాడీ డిస్మార్ఫోఫోబియా అనే మానసిక వ్యాధి లక్షణం. ముఖం క్లియర్‌గా, కాంతిమంతంగా కనిపించాలనే కోరిక మంచిదే. కానీ అది అబ్సెషన్‌గా మారడం ఏ మాత్రం హర్షణీయం కాదు. ఇది ఎంత తీవ్రమవుతుందంటే... అందంగా కనిపించడానికి రకరకాల ట్రీట్మెంట్లు తీసుకోవడం, ఏ ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ, ఆ ట్రీట్మెంట్లో ఎంత మంచి ఫలితం వచ్చినప్పటికీ సంతృప్తి చెందక΄ోవడం, తీవ్రమైన అసంతృప్తితో, ఎప్పుడూ అదే ఆలోచనలతో మానసిక ఒత్తిడికి లోనుకావడం వంటి పరిణామాలకు దారి తీస్తుంది. మెదడు ఇదే ఆలోచనలతో నిండి΄ోయినట్లయితే కొంతకాలానికి ఆ సమస్యకు వైద్యం చేయాల్సి వస్తుంది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఆ గీతను అర్థం చేసుకోవాలి..ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు, ఆ సంభాషణ తాలూకు విషయమే ముఖ్యం. అంతే తప్ప వారి ముఖం ఎలా ఉంది అనేది పట్టించుకునే అంశం ఏ మాత్రం కాదు. అందం– ఆత్మవిశ్వాసం ఒకదానితో ఒకటి ముడివడి ఉంటాయనేది కొంతవరకే. ఆత్మవిశ్వాసానికి అందం గీటురాయి కానేకాదు. ఈ సన్నని గీతను అర్థం చేసుకోవాలి. సాధారణంగా వయసుతోపాటు దేహంలో మార్పు వస్తుంటుంది. ఆ మార్పు ప్రభావం చర్మం మీద కనిపిస్తుంటుంది. ఈ మార్పును స్వీకరించాల్సిందే. చర్మం కాంతిమంతంగా ఉండడం కోసం రసాయన క్రీములను ఆశ్రయించడం కంటే మంచి ఆహారం, వ్యాయామం, ఒత్తిడి లేని జీవనశైలి, మంచి నిద్ర ఉండేటట్లు చూసుకోవాలి. – ప్రొఫెసర్ శ్రీనివాస్ ఎస్‌ఆర్‌ఆర్‌వై, హెచ్‌వోడీ, సైకియాట్రీ విభాగం, కాకతీయ మెడికల్ కాలేజ్ఇవి చదవండి: Lathika Sudhan: రేకులు విప్పిన కలువ.. కొలనైంది! -
పండగ వేళ: ఫ్యాషన్ అండ్ బ్యూటీ క్వీన్‌లా మెరవాలంటే..!
పండుగ సీజన్ ఫుల్ స్వింగ్‌లోకి వచ్చేసింది. వినాయక చవితి తరువాత వరుసగా వచ్చే పండుగల సందడి మామూలుగా ఉండదు. ఇంటిని అందంగా అలంకరించుకోవడం, పిండి వంటలు మాత్రమే కాదు, పండుగకు అందంగా తయారు కావడం, స్పెషల్ ముస్తాబుతో మురిసిపోవడం చాలా సాధారణం. అందుకే ఫెస్టివల్ లుక్‌లో ఎలా మెరిసి పోవాలో చూద్దాం.శరీరాన్ని తేమగా ఉంచుకోవాలి. చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటేనే మెరుస్తూ ఉంటుంది. ఇందుకోసం తగినన్ని నీళ్లు తాగాలి. అలాగే ఫ్యాటీఫుడ్స్కు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన ఆహారం, ఆకుకూరలు, పండ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఉపవాసాల సమయంలో తేలికపాటి ఆహారం తీసుకోవాలి. పల్చటి మజ్జిగ, పండ్ల రసాలు మెనూలో చేర్చుకోవాలి. ఒత్తిడికి దూరంగా ఉంటూ సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి. రోజూ వాకింగ్, యోగా లాంటి వ్యాయామం చేస్తే ఫేస్‌లో చక్కటి గ్లో వస్తుంది. అలాగే ముఖానికి ఇంట్లోనే తయారు చేసుకునేలా ఫేస్ ప్యాక్, జుట్టు అందం కోసం ప్యాక్‌లు వేసుకోవడం మర్చిపోవద్దు. ఫేస్ ప్యాక్బంగాళాదుంపను మిక్సిలో వేసి రసం తీసి పక్కన పెట్టుకోండి. ఇందులో కొద్దిగా శనగపిండి, నాలుగు చుక్కల బాదం నూనె, కొద్దిగా తేనె వేసి బాగా కలపండి. ముఖాన్ని ముందుగా శుభ్రం చేసుకున్న తరువాత దీన్ని అప్లయ్ చేసి, పూర్తిగా ఆరడానికి 10-15 నిమిషాలు ఆగి చల్లని నీటితో శుభ్రంగా కడగాలి. ఆ తరువాత సబ్బు, ఫేస్ వాష్ లాంటివి వాడకండి. మీ ఫేస్‌లోని మెరుపు చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఈ మిశ్రమాన్ని శుభ్రపర్చిన గాజు సీసాలో దాచుకోవచ్చు. చర్మం ముడతలు లేకుండా,కాంతిమంతంగా ఉండాలంటే..: టేబుల్ స్పూన్ మినప్పప్పు, 6 బాదాంపప్పులు కలిపి నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ రెండింటినీ మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి పట్టించి, మృదువుగా రుద్దాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. చర్మం మృదువుగా, తాజాగా కనిపిస్తుంది.∙టేబుల్ స్పూన్ చొప్పున ఆరెంజ్ జ్యూస్, నిమ్మరసం తీసుకొని కప్పు పెరుగులో కలపాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి పట్టించి, ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో స్నానం చేయాలి.జుట్టుకు బలమైన చూర్ణంఅరకప్పు డ్రైఫ్రూట్స్... బాదం, పల్లీలు, పొద్దుతిరుగుడు గింజలు, వాల్నట్స్; అరకప్పు ఓట్స్, పచ్చి శనగపప్పు, పెసరపప్పు కలిపి అరకప్పు, సబ్జా గింజలు అరకప్పు, అవిసె గింజలు అరకప్పు చొప్పున తీసుకుని దోరగా వేయించి చూర్ణం చేసుకుని డబ్బాలో నిల్వ చేయాలి. ఈ పొడిని టేబుల్ స్పూన్ తీసుకుని టీ లేదా స్మూతీలో వేసుకుని తాగాలి. టీ అలవాటు లేని వాళ్లు వేడినీళ్లలో కలుపుకొని రోజూ ఉదయాన్నే తాగితే రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ పొడి జుట్టు సంరక్షణకే గాక ఆరోగ్యాన్నీ మెరుగు పరుస్తుంది.ఫ్యాషన్ అండ్ మ్యాజిక్మంచి కలర్‌ఫుల్ డ్రెస్‌లను ఎంచుకోండి. పండుగ సీజన్లో ప్యాషన్ ,లేదా సంప్రదాయ దుస్తులు ఏదైనా సరే మన శరీరానికి నప్పేలా ఉండాలి. డ్రెస్‌కు సరిపడా సింపుల్, లేదా హెవీ జ్యుయలరీ ఉంటే అద్భుతమైన ఫెస్టివ్ లుక్ మీసొంతం అవుతుంది. -
కాకరకాయ ఆయిల్‌తో ఎన్ని లాభాలో : చుండ్రుకు చెక్, జుట్టు పట్టుకుచ్చే!
కరేలా ఆయిల్ లేదా కాకరకాయ నూనె గురించి ఎపుడైనా విన్నారా? కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, బాదం నూనె, రోజ్ మేరీ గురించి విన్నాం గానీ, ఈ కరేలా హెయిర్ ఆయిల్ ఏంటి అనుకుంటున్నారా? కాకర తినడమే కష్టం.. కాకరకాయ హెయిర్ ఆయిలా? అని తేలిగ్గా తీసి పారేయకండి. కొన్ని శతాబ్దాలుగా ఆయుర్వేదంలో దీన్ని ఔషధంగా వినియోగిస్తున్నారు. జుట్టు, చర్మ ఆరోగ్యానికి ఉపయోపగడే కరేలా ఆయిల్ గురించి తెలుసుకుందాం.కాకరకాయ ఎన్నో ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది. దీని నుంచి ఆయిల్‌ను బిట్టర్ గార్డ్ ఆయిల్, కరేలా ఆయిల్ అని కూడా పిలుస్తారు. ఈ నూనెలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు , కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మం జుట్టు ,మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. జుట్టుకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాదు చుండ్రును తగ్గించి, జుట్టు ఆరోగ్యంగా ఎదగడానికి తోడ్పడుతుంది. రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్న కాకరకాయ నూనె చర్మానికి రాస్తే మృతకణాలు నశించి యవ్వనంగా, కాంతి వంతంగా తయారవుతుంది. ఈ నూనెలో విటమిన్లు ఎ , సి వంటి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టు కుదుళ్లకు పోషణనిచ్చి, జుట్టును బలంగా చేస్తాయి. కరేలా నూనెలో సహజ యాంటీ ఫంగల్ , యాంటీమైక్రోబయల్ చుండ్రు , స్కాల్ప్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేస్తుంది, దురద, ఇతర చికాకులనుకూడా ఇది చక్కటి పరిష్కారం.జుట్టు తెల్లబడకుండాకరేలా నూనెను వారానికి రెండుసార్లు అప్లై చేయడం వల్ల జుట్టు తొందరగా నెరసిపోకుండా ఉంటుంది. తల చర్మం, జుట్టు తంతువులు రెండింటినీ హైడ్రేట్ చేస్తుంది. జుట్టును తేమగా ఉంచుతుంది. సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. స్కాల్ప్ లోని సహజ నూనె (సెబమ్) ఉత్పత్తిని నియంత్రిస్తుంది ఇది జుట్టు పెళుసుదనాన్ని తగ్గిస్తుంది. కరేలా నూనెను క్రమం తప్పకుండా మృదువుగా, సున్నితంగా , మెరుస్తూ ఉంటుంది. యాంటీమైక్రోబయల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, చిన్న గాయాలు, కాలిన గాయాలకు తొందరగా నయమవుతాయి. -
తెల్లదనం సాధ్యమే..! ఎండకు వాడిన చర్మం..!
టీనేజ్ అమ్మాయిల దగ్గర నుంచి వర్కింగ్ విమెన్స్ వరకు అందరూ ఎదుర్కొన్నే సమస్య ముఖం నల్లగా మారి, వాడిపోవడం. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో బయటకు అడుగు పెట్టనదే పని కాదు. అలాంటప్పడు ఎండకు, కాలుష్యానికి గురై చర్మం నల్లగా మారి కమిలిపోవడం జరుతుంది. ఒక విధమైన డల్నెస్తో వాడిపోయినట్లు ఉంటుంది. అందుకోసం పార్లర్లకు పరుగులు తీయాల్సిన పనిలేదు. మనకు దొరికిన టైంలోనే ఇంట్లో మనం అను నిత్యం వాడే వాటితోనే ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. నలుపు దనానికి చెక్‌పెట్టొచ్చు. ఎలాగో చూద్దామా..!బంగాళదుంప నాచురల్ బ్లీచ్. బంగాళదుంప రసాన్ని ముఖానికి రాసి ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. రసం తీయడం కుదరకపోతే బంగాళదుంపను పలుచగా తరిగి ముఖం మీద పరిచినట్లు అమర్చాలి. అందులోని రసాన్ని చర్మం పీల్చుకున్న తర్వాత ఆ ముక్కలతోనే ముఖమంతటినీ వలయాకారంగా రుద్ది ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తుంటే ఎండ తీవ్రత వల్ల, వాతావరణ కాలుష్యం వల్ల నల్లబడిన చర్మం తెల్లబడుతుంది.మెడ దగ్గర నలుపు తగ్గాలంటే... మెడ భాగం జిడ్డుగా, నలుపుగా మారితే బొ΄్పాయిపండు గుజ్జును పట్టించి, పది నిమిషాల మృదువుగా మసాజ్ చేయాలి. తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారంలో రెండుసార్లైనా ఇలా చేస్తూ ఉంటే నలుపు తగ్గుతుంది.మోచేతుల నలుపు తగ్గాలంటే నిమ్మ ఉప్పును రాసి, అరగంట ఉంచి, శుభ్రపరుచుకోవాలి.ఆలివ్ ఆయిల్‌తో మోచేతుల భాగాన్ని మసాజ్ చేసి, ఆ తర్వాత నిమ్మకాయ రసంతో రుద్దితే నలుపుదనం తగ్గుతుంది.పెదాలు నలుపు తగ్గాలంటే బీట్రూట్ ముక్కతో పెదాలను కొద్దిపాటి ఒత్తిడితో మర్దనా చేయాలి.శిరోజాల కోసం చూర్ణం..అరకప్పు డ్రైఫ్రూట్స్... బాదం, పల్లీలు, పొద్దుతిరుగుడు గింజలు, వాల్నట్స్; అరకప్పు ఓట్స్, పచ్చి శనగపప్పు, పెసరపప్పు కలిపి అరకప్పు, సబ్జా గింజలు అరకప్పు, అవిసె గింజలు అరకప్పు చొప్పున తీసుకుని దోరగా వేయించి చూర్ణం చేసుకుని డబ్బాలో నిల్వ చేయాలి. ఈ పొడిని టేబుల్ స్పూన్ తీసుకుని టీ లేదా స్మూతీలో వేసుకుని తాగాలి. టీ అలవాటు లేని వాళ్లు వేడినీళ్లలో కలుపుకొని రోజూ ఉదయాన్నే తాగితే రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ పొడి జుట్టు సంరక్షణకే గాక ఆరోగ్యాన్నీ మెరుగు పరుస్తుంది.(చదవండి: యూట్యూబర్ వెయిట్ లాస్ జర్నీ: జస్ట్ రెండేళ్లలో ఏకంగా వంద కిలోలు..!) -
వినాయక పందిళ్లలో సందడి చేసే మగువలూ.. మీకోసమే ఈ చిట్కాలు
వినాయక చవితి పండగ వచ్చేసింది. ఈ నవరాత్రులు గణనాథుని సేవలో మునిగిపోతారు..భక్తులు. గణేష్ మంటపాలలో మహిళల సందడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా చాలా హౌసింగ్ సొసైటీలు, అసోసియేషన్ల ఆధ్వర్యంలో కొలువుదీరే విఘ్ననాయకుడికి రకరకాల నైవేద్యాలు సమర్పిస్తారు. భక్తి గీతాలు, శాస్త్రీయ నృత్యాలతోపాటు అనేక రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. మగువలంతా శుభప్రదమైన ఆకుపచ్చ, ఆరెంజ్, పసుపు రంగు దుస్తుల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. మరీసందర్భంలో ముఖంతోపాటు కాళ్లూ, చేతులపై కూడా శ్రద్ధ పెట్టాలి. మరి అదెలాగో చూసేద్దాం.ఇంట్లో దొరికే వస్తువులతో మాస్క్, స్క్రబ్‌లను ప్రయత్నించాలి.ఓట్స్- పెరుగుటీ స్పూన్ ఓట్స్‌ను మెత్తగా పొడిగా చేసుకోవాలి. ఇందులో పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని కాళ్లూ చేతులకు బాగా పట్టించాలి. ఆ తరువాత బాగా రుద్దుకని చల్లటి నీళ్లతో శుభ్రంగా కడిగేయాలి. టొమాటో స్క్రబ్బాగా పండిన టొమాటో చక్కెర చల్లి, ముఖం, కాళ్లు, చేతులపై బాగా స్క్రబ్ చేసుకోవాలి. కొద్దిసేపు ఆర నిచ్చి చల్లని నీటితో కడిగేసుకోవాలి. అలాగే చల్లని ఐస్ క్యూబ్‌తో మృదువుగా మసాజ్ చేసి, మాయిశ్చరైజర్ పూసుకోవాలి. టమాటో గుజ్జుని కాళ్ళకి, చేతులకి రాసి మసాజ్ చేయడం వలన కాళ్లు చేతుల మీద ఉండే నలుపు తగ్గుతుంది. టొమాట విటమిన్ సి చర్మాన్ని మెరిసేలా చేయడమే కాకుండా సూర్యకిరణాల నుంచి రక్షిస్తుంది.శనగపిండి, పెరుగు,పసుపు శనగపిండిలో కొద్దిగా పెరుగు, పసుపు కలిపి పేస్టులా చేయాలి. ఈ పిండిని కాళ్లు, చేతులకు రాసి కాసేపు వదిలేయాలి. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ సహజ బ్లీచింగ్ లాగా పని చేస్తుంది.కీరదోసకాయ కీరదోసకాయ గుజ్జుని కాళ్ళకి చేతులకి అప్లై చేసి ఒక 15 నిమిషాల తరువాత వాష్ చేసుకోవాలి. కీర దోసకాయలలో ఉండే విటమిన్ ఏ చర్మం ముదురు రంగులోకి మార్చే మెననిన్ ని కంట్రోల్ చేస్తుంది. నిమ్మరసంలో కూడా సహజ బ్లీచింగ్ లక్షణాలు చర్మం మెరిసే లాగా చేస్తాయి. ఇందులోని విటమిన్ సి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.కాఫీ పౌడర్ఫిల్టర్ కాఫీ పౌడర్‌లో చక్కెర కలిపి మసాజ్ చేసుకొని పదినిమిషాల తరువాత కడిగేసుకుంటే, ముఖానికి చేతులకు ఇన్స్టెంట్ గ్లో వస్తుంది. చందమామలా మెరిసిపోతారు. -
పండగల వేళ : చందమామలా మెరిసిపోవాలంటే!
వరుస పండుగల సీజన్ వచ్చేస్తోంది. వినాయక చవితి మొదలు తెలుగుముంగిళ్లు దసరా, దీపావళి,సంక్రాంతి సంబరాలతో కళకళలాడతాయి. అంతేనా ఆడబిడ్డలు పట్టుచీరలు, కొత్త నగలు అంటూ షాపింగ్‌తో సందడిగా ఉంటారు. దీనికి తోడు గృహిణులు, కొత్తకోడళ్లు, కొత్త పెళ్లి కూతుళ్లు తమ అందానికి మెరుగులు దిద్దుకునే పనిలో బిజీబిజీగా ఉంటారు. మరి ముఖం, చర్మం, మెరుస్తూ చందమామలా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పవు. అవేంటో ఒకసారి చూద్దాం.చర్మం నిగనిగలాడుతూ ఉండాలంటే, చక్కటి ఆహారం తీసుకోవాలి. పండగల సందడిలో స్వీట్లు వగైనా ఎక్కువగా తినేస్తాం కాబట్టి ఒంటికి కాస్తంత పని చెప్పాలి. కనీసం ఓ అరగంట పాటైనా వాకింగ్, యోగా లాంటి వ్యాయామం తప్పని సరి. అలాగే రోజుకు సరిపినన్ని నీళ్లు తాగేలా జాగ్రత్త పడాలి. ఒక ఆరోగ్య సంరక్షణ, ముఖ సౌందర్య విషయానికి వస్తే... కొవ్వు పదార్థాలకు దూరంగా, అప్పుడప్పడు కొన్ని ఆరోగ్యమైన ద్రవాలను తాగుతూఉండాలి. అందమైన చందమామ లాంటి ముఖం కోసం సహజంగా దొరికే వస్తువులో ప్యాక్ వేసుకుంటూ ఉండాలి. ఫేస్ మాస్క్రోజ్ వాటర్‌తో ముఖం మెరుస్తూ కనిపిస్తుంది. రోజ్ వాటర్, కలబంద, తేనె సహాయంతో మంచి మాస్క్ వేసుకుంటే ముఖం కొత్త కళతో మెరిసిపోతుంది. రోజ్ వాటర్‌లో మరికొన్ని సహజసిద్ధమైన ఉత్పత్తులను ఉపయోగించి ఆరోగ్యకరమై ఫేస్ మాస్క్‌లను తయారు చేసుకోవచ్చు. ఇంకా చర్మాన్ని బట్టి పసుపు, శెనగపిండి, పెరుగు, అలోవెరా మిశ్రమాలతో ప్యాక్ వేసుకొని, ఆ తరువాత ఐస్ ముక్కలతో మృదువుగా మసాజ్ చేసుకోవాలి.కీరా, పైనాపిల్ జ్యూస్కీరదోసలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. నీటి శాతం ఎక్కువగా ఉన్నందు వల్ల చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సహజత్వాన్ని కాపాడతాయి ఇక పైనాపిల్‌లో ఉండే బ్రొమెలిన్ అనే ఎంజైమ్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వాపులను తగ్గిస్తుంది.కీర, పైనాపిల్ ముక్కలు, తాజా పుదీనా ఆకులు వేసి జ్యూస్ చేసుకొని, దీనికి రుచుకోసం నిమ్మరసం, కొద్దిగా తేనె కలుపుకొని తాగితే చర్మం యవ్వనంగా, కాంతిమంతంగా మారుతుంది.ముఖంపై మంగు మచ్చులాంటివి కూడా తగ్గుతాయి. క్యారెట్, బీట్రూట్ యాపిల్ జ్యూస్ (ఏబీసీ)ఆపిల్, బీట్రూట్ క్యారెట్ కాంబినేషన్లో జ్యూస్ తాగితే ఎన్నో ప్రయోజనాలున్నాయి. యాపిల్, క్యారెట్లో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటే బీట్ రూట్ పోషకాలు మయం.శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. కంటి , చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.ఇంకాజంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. పచ్చని ప్రకృతిలోగడిపితే ఆరోగ్యానికి ఆరోగ్యం మానసిక వికాసం కూడా. అంతేకాదు స్వచ్ఛమైన గాలి, సూర్యకాంతితో డీ విటమిన్ అందుతుంది. అందమైన చర్మం కోసం ఇది చాలా అవసరం. -
డార్క్ సర్కిల్స్ భయమే వద్దు, ఈ చిట్కాలు పాటించండి!
కళ్ల చుట్టూ నల్లటి వలయాలు అలసటకు, ఒత్తిడికి అద్దం పడుతూంటాయి. చంద్రబింబం లాంటి ముఖమున్నా, డార్క్ సర్కిల్స్ వేధిస్తూ ఉంటాయి. అందంగా లేమా? అనే అత్మన్యూనత వారిని వెంటాడుతుంది. నిజానికి నల్లటి వలయాలకు కారణాలు అనేకం. జీవనశైలి మార్పులు, వాతావరణ పరిస్థితులు, ఒత్తిడి, నిద్రలేమి , మరికొన్ని ఇతర సమస్యల మూలంగా చాలామందికి కళ్ళ చుట్టూ నల్లని వలయాలు ఏర్పడతాయి. వీటికి కారణాలు ఏంటి? తగ్గేందుకు ఏం చేయాలో తెలుసుకోండి. చాలా మంది డార్క్ సర్కిల్స్‌తో బాధపడతారు. తొందరగా వృద్ధాప్య రూపం వచ్చేసిందని ఆందోళనపడతారు. అయితే కొన్ని జాగ్రత్తలు, ఇంట్లోనే లభించే వస్తువులతో తయారు చేసిన చిట్కాలతో డార్క్ సర్కిల్స్నుంచి విముక్తి పొందవచ్చు.డార్క్ సర్కిల్స్ కారణాలుఆందోళన , అలసటరక్త ప్రసరణ సరిగా జరగకపోవడం ఎక్కువ సేపు స్క్రీన్కు ఎక్స్పోజ్ కావడం, కంటి ఒత్తిడిఅలర్జీలు, డీహైడ్రేషన్, థైరాయిడ్ వయసు మీద పడటం అనేది ప్రధాన సమస్య. ఇంటి చిట్కాలుదోసకాయ: దోసకాయ ముక్కలను చక్రాల్లా తరిగి రిఫ్రిజిరేటర్లో చల్లబరచండి. వాటిని మూసిన కనురెప్పలపై సుమారు 10-15 నిమిషాల పాటు ఉంచండి. దోసకాయలు యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే కళ్ల వాపు తగ్గి, ,నల్లటి వలయాలు మాయమవుతాయి.టీ బ్యాగ్‌లు: రెండు టీ బ్యాగ్‌లను (నలుపు లేదా ఆకుపచ్చ) వేడి నీటిలో నానబెట్టి, ఆపై వాటిని రిఫ్రిజిరేటర్లో చల్లబరచాలి. వాటిని కళ్లపై 10-15 నిమిషాలు ఉంచండి. టీలోని కెఫిన్ , యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాలను శాంతపరుస్తాయి.బాదం నూనె: పడుకునే ముందు మీ కళ్ల కింద కొన్ని చుక్కల బాదం నూనెను సున్నితంగా మసాజ్ చేయండి. బాదం నూనెలో విటమిన్లు ఇ , కె పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మపు రంగును మెరుగుపర్చి, కాలక్రమేణా పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తాయి.బంగాళాదుంప రసం: పచ్చి బంగాళాదుంపను తురిమి రసాన్ని తీసుకోవాలి. ఈజ్యూస్లో కాటన్ ప్యాడ్‌ను నానబెట్టి, కంటి కింద భాగంలో 10-15 నిమిషాల పాటు అప్లై చేయండి. బంగాళాదుంపలలో ఎంజైమ్‌లు , యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి నల్లటి వలయాలను తగ్గించి, కళ్ల ఉబ్బును తగ్గిస్తాయి.రోజ్ వాటర్: కాటన్ ప్యాడ్లను రోజ్ వాటర్‌లో నానబెట్టి, మూసిన కళ్లపై 10-15 నిమిషాలు ఉంచండి. రోజ్ వాటర్లోయాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నల్లటి వలయాలను తగ్గించి, కంటి ప్రాంతాన్ని రిఫ్రెష్ చేస్తాయి.వటొమాటో గుజ్జు: తాజా టొమాటో గుజ్జును కళ్ల కింద అప్లై చేసి 10-15 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. టొమాటోల్లోలైకోపీన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగాఉంటాయి. నల్లటి వలయాలను పిగ్మెంటేషన్‌ను తొలగిస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.పచ్చి పాలు: చల్లని (ముడి) పాలలో కాటన్ ప్యాడ్లను నానబెట్టి, వాటిని మూసిన కళ్లపై 10-15 నిమిషాలు ఉంచండి. పాలలో లాక్టిక్ యాసిడ్ ,విటమిన్లు ఉంటాయి, ఇవి చర్మాన్ని శాంతపరచడానికి, పిగ్మెంటేషన్‌ను కాంతివంతం చేయడానికి కళ్ల చుట్టూ ఉబ్బినట్లు తగ్గడానికి సహాయపడతాయి.వీటితోపాటు ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు సన్‌స్క్రీన్ రాయడం మర్చిపోకూడదు. చక్కటి నిద్ర, తగినన్ని నీళ్లు అవసరం. కెఫిన్, ఆల్కహాల్ వినియోగం, స్క్రీన్స్ వాడకాన్ని బాగా తగ్గించాలి. అలాగే ఇంటి చిట్కాలతో నయం కాక పోవచ్చు. అంతమాత్రాన బెంగపడాలసిన అవసరం లేదు. నిపుణైలైన వైద్యుల సమక్షంలో లేజర్ థెరపీ, ఫిల్లర్స్, హైలురోనిక్ యాసిడ్, ఇంజెక్షన్స్లాంటివా వాడవచ్చు.