
టీ డికాషన్‌ని ఉపయోగించడం వల్ల వేసవి తాపం నుంచి చర్మాన్ని, శిరోజాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అయితే, ఇందుకు తేయాకులను మాత్రమే ఉపయోగిస్తే సరైన ఫలితం లభిస్తుంది.
చల్లారిన అరకప్పు టీ డికాషన్‌లో రెండు టీ స్పూన్ల బియ్యప్పిండి, అర టీ స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, 20 నిమిషాలు ఆరనివ్వాలి. శుభ్రపరుచుకోవడానికి ముందు కొన్ని నీళ్లు ముఖం మీద చల్లి, వేళ్లతో వలయాకారంగా రుద్దాలి.
టీ డికాషన్‌లో ఐస్ క్యూబ్ వేసి, ఆ నీటిని ముఖానికి స్ప్రే చేసుకొని, కాసేపు సేదతీరాలి.
ఎండ బారిన పడి ఇంటికి వచ్చినప్పుడు ఇలా చేయడం వల్ల కమిలిన చర్మం తిరిగి పూర్వపు స్థితికి చేరుకుంటుంది.
టబ్ బాత్ చేసేటప్పుడు కొన్ని తేయాకులు నీటిలో వేసి, అరగంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఎండవల్ల కలిగిన అలసట నుంచి చర్మం విశ్రాంతి పొందుతుంది.
జుట్టు పొడిబారి నిర్జీవంగా మారితే తలస్నానం చేసిన తర్వాత టీ డికాషన్‌తో కడగాలి. కండిషనర్‌లా ఉపయోగపడుతుంది.
ఇవి చదవండి: మిస్ కేరళ ఫిజిక్‌గా టైటిల్ తనకు సొంతం!
Comments
Please login to add a commentAdd a comment