Honey
-
వేసవిలో మెరిసే చర్మం : అద్భుతమైన మాస్క్‌లు
వేసవి ఉష్ణోగ్రతలకు చర్మం పొడిబారిపోతుంది. తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ముఖం కూడా కళా విహీనంగా తయారవుతుంది. చర్మ, ముఖం సౌందర్య రక్షణలో శతాబ్దాల తరబడి కలబంద లేదా అలోవెరా విశిష్టంగా నిలుస్తోంది. వడదెబ్బ నుంచి ఉపశమనం మొదలు, మొటిమల నివారణలో బాగా పనిచేస్తుంది.అలోవెరాలో అనేక ఆరోగ్య లక్షణాలున్నాయి. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు చర్మానికి అద్భుతాలు చేసే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంది. మరి అలోవెరా, ఇతర మూలికలు, పదార్థాలతో కలిసి వేసుకునే మాస్క్‌ల గురించి తెలుసుకుందామా?జర్నల్ ఆఫ్ ట్రెడిషనల్ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, కలబంద జెల్లో పాలీసాకరైడ్లు , గ్లైకోప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. గాయం మానడాన్ని వేగవంతం చేసేలా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి మంటను తగ్గించడానికి సాయ పడతాయి. ఇంకాకలబందలోని హైడ్రేటింగ్, యాంటీమైక్రోబయల్లక్షణాలు మొటిమలు, తామర లాంటి సమస్యల నివారణతోపాటు, చర్మం, పొడిబారడం, ఎర్రబారడం, పగుళ్లు, కాలిన గాయాలకు కూడా ప్రభావవంతంగా పనిస్తుందని అధ్యయనం పేర్కొంది.కలబంద ఫేస్ మాస్క్లుకలబంద - తేనె మాస్క్: ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జులో 1 టీస్పూన్ తేనె కలపాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి, 15 నిమిషాలు అలాగే ఉంచి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసువాలి. ఇది చక్కటి హైడ్రేటింగ్ ఏజెంట్‌గా పనిచేసి పోషణనిస్తుంది. చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది.కలబంద - పసుపు మాస్క్: పసుపు, తేనె లేదా రోజ్ వాటర్ వంటి మూలికలు , సుగంధ ద్రవ్యాలతో కలిపినప్పుడు, కలబంద చర్మ సంరక్షణ శక్తి కేంద్రంగా మారుతుంది. ముఖ్యంగా సేంద్రీయ పసుపు , కలబంద మాస్క్, నిస్తేజమైన చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. మొటిమల మచ్చలను తగ్గిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్‌ను చిటికెడు పసుపుతో కలపండి. 10 నిమిషాలు అలాగే ఉంచి సున్నితంగా కడగాలి. కలబంద -రోజ్ వాటర్ మాస్క్: ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్, టీస్పూన్ రోజ్ వాటర్ బాగా కలపాలి. దీన్ని ముఖంపై సమానంగా అప్లై చేయాలి. 15 నిమిషాలు అలాగే ఉంచాలి. ఎరుపును తగ్గించి, చర్మాన్ని రిఫ్రెష్ చేస్తుంది.కలబంద - నిమ్మకాయ మాస్క్: ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్లో కొన్ని చుక్కల నిమ్మరసంతో కలపండి.దీన్ని ముఖానికి అప్లై చేసి, 10 నిమిషాలు ఉంచి శుభ్రంగా కడిగేసుకోవాలి. (బాగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు ఇది వాడకూడదు). నిమ్మకాయ నల్ల మచ్చలను క్రమంగా తగ్గిస్తుంది.కలబంద-గ్రీన్ టీ మాస్క్: ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్లో, చల్లని గ్రీన్ టీ కలపండి. ఈ మిశ్రమాన్ని అప్లై చేసి, క 15 నిమిషాలు అలాగే ఉంచి కడగాలి. యాంటీఆక్సిడెంట్లతో నిండిన ఈ మాస్క్ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. యవ్వనమైన, అందమైన చర్మాన్ని అందిస్తుంది.కలబంద-కీరా మాస్క్: కలబంద జెల్లో తురిమిన కీరా కలిపి దీన్ని సున్నితంగా ముఖానికి అప్లై చేయాలి. చల్లటి నీటితో శుభ్రం చేయడానికి ముందు 15 నిమిషాలు అలాగే ఉంచండి. ఈ మాస్క్ చాలా రిఫ్రెష్‌గా ఉంటుంది, అలసిపోయిన చర్మాన్ని డీపఫ్ చేయడానికి , హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. -
Harsh Goenka: తేనె-నిమ్మకాయ నీటితో బరువు తగ్గరు..!
బరువు తగ్గించే అద్భుతమైన డ్రింక్స్‌కి సంబంధించి చాల రకలా పానీయాల గురించి విన్నాం. అదీగాక ఇటీవల రోజుకో కొత్తరకం పానీయం గురించి సమాచారం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇది కొవ్వుని కాల్చేస్తుంది. దెబ్బకు బరువు మాయం అంటూ ఊదరగొట్టేలా చెప్పేస్తున్నారు కొందరూ. వాటిలో వాస్తవికత ఎంత అనేదాంట్లో స్పష్టత మాత్రం ఉండదు. అచ్చం అలాంటి వాటికి సంబంధించిన ఏళ్లనాటి రెమిడీనే తేనె నిమ్మకాయ నీరు. అమ్మమ్మల కాలం నుంచి ఇది బరువుని మాయం చేసే అద్భుతమైన డ్రింక్ అని చెబుతుండటం విన్నాం. అయితే ఈ డ్రింక్‌పై తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఇది బరువు తగ్గడంలో ఏమాత్రం సహాయపడదంటూ మండిపడ్డారు. ఆయన చెప్పినట్లుగా నిజంగానే ఇది బరువుని అదుపులో ఉంచలేదా..?. మరి నిపుణులు ఏం చెబుతున్నారు తదితరాల గురించి తెలుసుకుందాం..!.వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా(Harsh Goenka) సోషల్ మీడియా ఎక్స్‌లో ఈ నిమ్మకాయ తేనె పానీయం(honey-lemon water) వల్ల బరువు తగ్గరంటూ తన అనుభవాన్ని వెల్లడించారు. తాను రెండు నెలలపాటు పరగడుపునే తేనె నిమ్మరసంతో కూడిన గోరువెచ్చని నీటిని తాగేవాడినని. ఇది బరువు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుందని చెప్పడంతో క్రమతప్పకుండా ఇలా తాగాననని అన్నారు. అయితే అలా ఇప్పటి వరకు రెండు కిలోలు నిమ్మకాయలు, మూడు కిలోలు తేనె తీసుకున్నాను కానీ తన బరువులో ఎట్టి మార్పు కనిపించలేదని వాపోయారు. బహుశా ఈ పదార్థాలన్నీ బరువుని పెంచేవే కాబోలు అంటూ పోస్ట్‌లో వ్యగ్యంగా రాసుకొచ్చారు. దీంతో నెటిజన్లు... అయితే ఇది మార్కెట్ ట్రిక్ అని ఒకరు, ఇది కేవలం శరీరంలోని అదనపు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుందే కానీ బరువుని కాదు అని మరొకరు కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. చెప్పాలంటే పారిశ్రామిక వేత్త లేవెనెత్తిన ప్రశ్న సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. మరి దీని గురించి నిపుణులు ఏమంటున్నారంటే..ప్రముఖ డైటీషియన్, సర్టిఫైడ్ డయాబెటిస్ కనిక్క మల్హోత్రా(Kanikka Malhotra) మాత్రం పరగడుపునే దీన్ని తీసుకుంటే బరువు తగ్గుతారని చెబుతున్నారు. ముఖ్యంగా జీర్ణక్రియకు సహాయపడుతుందని, హైడ్రేషన్‌ని ప్రోత్సహిస్తుందని చెప్పారు. అధిక కేలరీల పానీయాలకు బదులుగా ఇలా తేనె-నిమ్మకాయ నీటితో భర్తీ చేయడం వల్ల మొత్తం కేలరీలు తీసుకోవడం తగ్గుతుంది. తద్వారా బరువు తగ్గేందుకు దారితీస్తుంది. అలాగే నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల జీవక్రియ మెరుగ్గా ఉండి, కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఫలితంగా ఇది పౌండ్లను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే నిమ్మకాయలోని విటమిన్ సీ, తేనెలోని యాంటీఆక్సిడెంట్లు మొత్తం ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. అంతేగాదు ఇది ఆరోగ్యకరమైన జీవక్రియకు మద్దతిస్తుంది. నిమ్మరసం జీర్ణరసాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. తేనె ప్రీబయోటిక్‌గా పనిచేస్తుంది. అంటే ఇక్కడ ప్రేగు పనితీరుకి మద్దతిస్తుంది. అదీగాక మలబద్ధకాన్ని నివారించి పేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. భారతదేశంలో అందరూ ఉపయోగించే సాధారణ పద్ధతి, పైగా పరగడుపునే ఇలా తీసుకోవడం అనేది ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం అని చెప్పారు. ఇది చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచి, శక్తి స్థాయిలను పెంచేందుకు ఉపయోగపడుతుంది. నిజానికి బరువు తగ్గడానికి అద్భుత పరిష్కారం కాన్పటికీ ఇది సమతుల్య ఆహారంలా ఉపయోగపడుతుంది. వ్యాయామ దినచర్య లేనివారికి అద్భతమైన డ్రింక్‌లా ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ బరువు తగ్గడం అనేది మొత్తం ఆహారం, జీవనశైలిపై ఆధారపడి ఉంటుందనేది గుర్తెరగాలని అన్నారు. ఇందులో ఉపయోగించే తేనె రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి అధిక బరువుని నియంత్రిస్తుంది. అలాగే ఉపవాస సమయంలో దీన్ని తీసుకుంటే శరీర బరువు తోపాటు శరీరం బీఎంఐని కూడా తగ్గిస్తుందని మల్హోత్రా నొక్కి చెప్పారు. అలాగే బరువు తగ్గడం అనేది శక్తి సమతుల్యతకు సంబంధించినది. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారు ఈ పానీయాలపై ఆధారపడటానికి బదులు తీసుకునే డైట్‌పై ఫోకస్ పెట్టండి అప్పుడే ఈ డ్రింక్ బరువు తగ్గించడంలో హెల్ఫ్ అవుతుందని చెప్పారు. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా ఉండే సమతుల్య ఆహారానికే ప్రాధాన్యత ఇస్తూ..హైడ్రేటెడ్‌గా ఉండే యత్నం చేస్తే చక్కటి ఫలితం పొందగలుగుతారని నిపుణులు చెబుతున్నారు.(చదవండి: అమ్మ 'చక్కెర' బిడ్డకూ చేదు..!) -
తేనెతో ఎన్నో లాభాలు : కానీ కల్తీని ఎలా గుర్తించాలి!
భారతదేశంలో చిన్న పిల్లలనుంచి పెద్దవాళ్లకు నిస్పందేహంగా వాడే పదార్థం తేనె (Honey). తేనెటీగల ద్వారా సహజంగా లభించే ఒక తీపి పదార్థం (Natural Sweetener). తేనె వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అలాగే కొలెస్ట్రాల్, కొవ్వు సోడియం లేని చక్కటి ఆహారం కూడా తేనె. ప్రపంచవ్యాప్తంగా తేనెను ఎక్కువగా ఉపయోగించేది మన భారతీయులే. అయితే కోవిడ్ తరువాత తేనె వినియోగం విపరీతంగా పెరిగింది. ఇది విశ్వవ్యాప్తమైంది. పెరిగిన డిమాండ్ తో తేనె కల్తీ కూడా పెరిగింది. మార్కెట్లో ఇప్పుడు స్వచ్ఛమైన తేనె, బ్రాండ్లు చాలా తక్కువే అని చెప్పవచ్చు. మరి స్వచ్ఛమైన తేనెను ఎలా గుర్తించాలి.తేనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. తేనెలో ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, విటమిన్లు, ఎంజైమ్‌లు, ఖనిజాలు దండిగా లభిస్తాయి. ఆరోగ్య ప్రయోజనాల మాట దేవుడెరుగు కల్తీ తేనె అనేక సమస్యలకు కారణమవుతోంది. అందుకే స్వచ్ఛమైన తేనె ఏది. నకిలీది ఏది గుర్తించడం, దాని గురించి అవగాహనకలిగి ఉండటం చాలా అవసరం.తేనె కల్తీ ఎలా?తేనె కల్తీ చౌకైన పదార్థాలతో చేయబడుతుంద. ఇది ప్రయోగశాల పరీక్ష పారామితులను తేలిగ్గా దాటేస్తుంది. . మొలాసిస్: ఇది మందపాటి , జిగటగా చెరకు రసం. చెరకు రసం మరిగించడం వల్ల తేనెలా తీపిగా ఉండే టర్బిడ్, ముదురు ద్రావణం లభిస్తుంది.ద్రవ గ్లూకోజ్: ఇది మిఠాయి చ బేకింగ్ పరిశ్రమలో ఉపయోగించే మెరిసే , మందపాటి ద్రావణం. ఇది మార్కెట్లో సులభంగా లభిస్తుంది.ఇన్వర్ట్ షుగర్: ఇది మెరిసే , మందపాటి ద్రవం, శుద్ధి చేసిన చక్కెరను ప్రాసెస్ చేయడం ద్వారా దీన్ని ఉత్పత్తి చేస్తారు.హై గ్లూకోజ్ కార్న్ సిరప్ (HFCS): ఇది స్వీట్‌కార్న్‌ను ప్రాసెస్ చేసినప్పుడు ఉత్పత్తి అవుతుంది.ఇది అచ్చం తేనెలాగానే కనిపిస్తుంది. రైస్ సిరప్: ఈ సిరప్ బియ్యం ప్రాసెసింగ్ సమయంలో ఉత్పత్తి అవుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా తేనెను కల్తీ చేసే వాటిలో ఒకటి.ఇదీ చదవండి: సిల్వర్ స్క్రీన్ క్వీన్ : దేవుడా, ఇలాంటి జీవితం పగవాడిక్కూడా వద్దు! తేనె స్వచ్ఛమైనదా లేదా కల్తీదా ఎలా తనిఖీ చేయాలి?బొటనవేలిపై కొద్దిగా తేనె రాసుకొని చూడండి. నిజమైన తేనె చిక్కగా ఉంటుంది. తేనెను ఒక గ్లాసు నీటిలో నెమ్మదిగా వేయండి. తేనె నీటిలో కరగకుండా గ్లాసు అడుగు భాగానికి చేరుకుంటే తేనె స్వచ్ఛమైనది. నీటిలో కరిగిపోతుంటే అది నకిలీది అని అర్థం. వెనిగర్ నీటిలో కొన్ని చుక్కల తేనె కలపండి. మిశ్రమం నురగలు రావడం ప్రారంభిస్తే అది కచ్చితంగా నకిలీదే. తేనెలో అగ్గిపుల్లను ముంచి, ఆపై వెలిగించడానికి ప్రయత్నించడం ద్వారా ఇంకో పరీక్ష చేయవచ్చు. తేనె స్వచ్ఛంగా ఉంటే, అగ్గిపుల్ల సులభంగా మండుతుంది. కల్తీ దైతే అగ్గిపుల్లను వెలిగించడం కష్టం కావచ్చు.ఇదీ చదవండి: భారీ వేతనమిచ్చే ఉద్యోగాన్ని వదిలేసి.. ఐపీఎస్ అయ్యిందిలా!తేనె-ప్రయోజనాలు తేనె సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. తేనె అనేది గొంతు నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది.కాలిన గాయాలు, దెబ్బలకు పై పూత చికిత్సగా వాడవచ్చు.యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో పాటు సూపర్-హైడ్రేటింగ్‌గా ఉంటుంది. అందుకే మొటిమల నివారణలోకూడా పనిచేస్తుందితేనెలో కాటలేస్ అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది చిన్న మంట నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుందిహృదయనాళ వ్యవస్థను రక్షించండి గ్యాస్ట్రోఎంటెరిటిస్ లక్షణాల నుండి ఉపశమనం లభిస్తుంది. జ్ఞాపకశక్తి లోపాలను నివారిస్తుంది. -
సమంత వెబ్ సిరీస్.. ప్రతిష్టాత్మక అవార్డుల్లో నిరాశ
సినీ ఇండస్ట్రీ అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను(Critics Choice Awards) ప్రకటించారు. ఈ అవార్డుల కోసం సమంత నటించిన సిటాడెల్ ఇండియన్ వర్షన్ హనీ బన్నీ వెబ్ సిరీస్, ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ మూవీ కూడా పోటీపడ్డాయి. బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ వెబ్ సిరీస్‌ల జాబితాలో నామినేట్ అయిన హనీ బన్నీ అవార్డ్‌ను సాధించలేకపోయింది. ఈ కేటగిరీలో కొరియన్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్-2 అవార్డ్‌ను దక్కించుకుంది. గతేడాది నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. నాలుగేళ్ల క్రితం విడుదలైన ఈ సిరీస్ సీజన్-2 2024లో విడుదలైంది. అంతేకాకుండా ఈ సిరీస్ సీజన్-3 ఈ ఏడాది జూన్‌లో అందుబాటులోకి రానుంది.అయితే బెస్ట్ ఫారిన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో పోటీపడిన మూవీ ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్. ఈ మూవీకి కూడా నిరాశే ఎదురైంది. పాయల్ కపాడియా తెరకెక్కించిన ఈ చిత్రం అవార్డ్ సాధించలేకపోయింది. దీంతో మన దేశం నుంచి పోటీలో నిలిచిన చిత్రాలకు తీవ్రంగా నిరాశపరిచాయి. అయితే గతేడాది కేన్స్‌లో గ్రాండ్ ప్రిక్స్ అవార్డ్‌ను పాయల్ కపాడియా చిత్రం దక్కించుకుంది. అంతేకాకుండా ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డ్స్‌లో జ్యూరీ గ్రాండ్ ప్రైజ్, గోథమ్ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్, న్యూ యార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్‌ను కూడా అందుకుంది. ఈ అవార్డుల వేడుక శాంటా మోనికాలోని బార్కర్ హ్యాంగర్‌లో జరిగింది.క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల విజేతలు వీరే..ఉత్తమ విదేశీ వెబ్ సిరీస్ : స్క్విడ్ గేమ్ 2ఉత్తమ చిత్రం : అనోరాఉత్తమ నటుడు: డెమి మూర్ఉత్తమ నటి : కియేరన్ కుల్కిన్ఉత్తమ సహాయ నటుడు : కీరన్ కుల్కిన్ఉత్తమ సహాయనటి : జోయ్ సల్దానా -
స్వచ్ఛమైన తేనెకు చిరునామా చిల్లకొండయ్యపల్లి
ఒక్కో ఊరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇది కూడా అలాంటి ఊరే. ఈ ఊరు పేరు చెబితే చాలు నోరూరుతుంది. తియ్యని పిలుపు రారమ్మంటుంది. అదే తాడిమర్రి మండలంలోని చిల్లకొండయ్యపల్లి (Chillakondaiahpalli). వర్షాభావ పరిస్థితుల్లో వ్యవసాయంతో నష్టపోయిన రైతులు (Farmers) ఉపాధి కోసం అడవి బాట పట్టారు. కొండ, గుట్టలెక్కుతూ తేనె (Honey) సేకరించి కుటుంబాలను పోషించుకుంటున్నారు.ఉదయమే సద్దిమూట కట్టుకుని అందరూ పొలం బాట పడితే సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం (Tadimarri Mandal) చిల్లకొండయ్యపల్లి యువకులు మాత్రం అడవిబాట పడతారు. కొండ, గుట్ట, చెట్టు, చేమ చుట్టేస్తూ సేకరించిన స్వచ్ఛమైన తేనెను విక్రయించి కుటుంబాలను పోషించుకుంటున్నారు. గ్రామంలోని 25 కుటుంబాలు తేనె సేకరణను ఉపాధిగా మలచుకున్నాయి. 15 ఏళ్లుగా... తేనె సేకరణే వృత్తిగాదాదాపు 15 సంవత్సరాలుగా తేనె సేకరణనే వృత్తిగా పెట్టుకుని చిల్లకొండయ్యపల్లి యువత జీవనం సాగిస్తోంది. అప్పట్లో వ్యవసాయ పనులు లేక పోవడంతో కుటుంబాన్ని పోషించుకునేందుకు కాటమయ్య అనే వ్యక్తి తొలిసారిగా తేనె సేకరణను ఉపాధిగా మార్చుకున్నాడు. అనంతరం అదే బాటలో కొందరు యువకులు పయనించారు. అయితే వీరు సేకరించిన తేనెకు సరైన మార్కెటింగ్ లేక ఇబ్బంది పడుతుండడంతో అప్పట్లో మహాత్మాగాంధీ యువజన సంఘం మండల అధ్యక్షుడిగా ఉన్న రామలింగప్ప స్పందించి, గిట్టుబాటు ధరతో తేనె కొనుగోలు చేసేలా చెన్నకొత్తపల్లిలోని ధరణి స్వచ్చంద సంస్థతో ఒప్పందం కుదిర్చాడు. ప్రస్తుతం సంస్థ కిలో తేనెను రూ.400 చొప్పున కొనుగోలు చేస్తుండగా... స్థానికంగానే ఇతరులకు రూ.500తో విక్రయిస్తూ ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కు తున్నారు. ఉమ్మడి జిల్లాలో చిల్లకొండయ్యపల్లి తేనెకు మంచి గిరాకీ ఉంది.అన్నం పెడుతున్న అడవి.. మండలంలోని దాడితోట బీట్ పరిధిలో కునుకుంట్ల, చిల్లవారిపల్లి, దాడితోట గ్రామాలతో పాటు పుట్లూరు మండలం ఎల్లుట్ల పరిధిలో సుమారు 3,534 హెక్టార్లలో రిజర్వు ఫారెస్టు విస్తరించి ఉంది. రిజర్వు ఫారెస్టులో అటవీ అధికారులు నారేపి, ఎర్రచందనం, తవసీ తదితర మొక్కలు భారీగా నాటారు. ఇప్పుడా మొక్కలు పెద్ద వృక్షాలై తేనెపట్టులకు ఆవాసాలుగా మారాయి. ఫలితంగా రిజర్వు ఫారెస్టు ఎందరికో ఉపాధి వనరుగా మారి అన్నం పెడుతోంది. ముంగార్ల కాలం అనువైనది.. తేనె సేకరణకు ముంగార్ల కాలం అనువైనది. జూన్ ప్రారంభంతో వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో అడవులు, తోటలు పచ్చదనం సంతరించుని పుష్పాలు వికసిస్తాయి. ఆ పుష్పాల్లోని మకరందం కోసం వచ్చే తేనెటీగలు సమీపంలోనే తేనెపట్టులను ఏర్పాటు చేసుకుంటాయి. ఏడాదిలో 9 నెలల పాటు తేనె సేకరణలో ఇక్కడి యువకులు నిమగ్నమవుతారు. నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఆదాయం వస్తోందని చెబుతున్నారు.చదవండి: పెళ్లి మంటపాల్లో ‘డబ్బు’ వాద్యాలుతేనె సేకరణలో కష్టాలు ఎన్నో.. తేనె ఎంత రుచిగా ఉంటుందో దానిని సేకరించడమంటే అంతకు రెట్టింపు కష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది. అయినా చిల్లకొండయ్యపల్లి యువకులు కష్టాలను లెక్కచేయడం లేదు. కళ్లముందు తేనె పట్టు కనిపిస్తే చాలు వెంటనే సేకరణలో నిమగ్నమవుతారు. ఈ క్రమంలో ముళ్లకంపలు గుచ్చుకున్నా, తేనెటీగలు కుట్టినా తమ పట్టు మాత్రం వదలరు. ఎన్ని రక్షణ చర్యలు తీసుకున్నా... తేనెటీగలు కుట్టి తీవ్ర అస్వస్థతకు లోనైన సందర్భాలు ఎన్నో ఉన్నాయని యువత తెలుపుతోంది. -
2024లో వార్తల్లో నిలిచిన 'సూపర్‌ఫుడ్స్' ఏంటో తెలుసా?
2024 ఏడాదికి బైబై చెప్పేసి2025 సంవత్సరానికి ఆహ్వానం పలికాం. అనేక రంగాల్లో ఎన్నో పరిశోధనలు, సరికొత్త అధ్యయనాలకు సాక్ష్యం 2024. ఈ క్రమంలో 2024లో సూపర్ ఫుడ్‌గా వార్తల్లో నిలిచిన ఆహారం గురించి తెలుసుకుందాం. గతంలో లాగానే 2024 కూడాసహజమైన ఆహారాలు , పదార్దాల ఆరోగ్య ప్రయోజనాలపై కొత్త పరిశోధనలకు బలమైన సంవత్సరంగా నిలిచింది వీటిలో కొన్ని శతాబ్దాలుగా సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించ బడుతున్నవే. బరువు తగ్గడం, కణాల మరమ్మత్తు, వాపు లేదా గుండె ఆరోగ్యం తదితర విషయాల్లో 'సూపర్‌ఫుడ్స్' అద్భుత నివారణలు కాకపోవచ్చు. కానీ కొన్ని మాత్రం ఆరోగ్య సంరక్షణ మించి ఉన్నాయని తేలింది. అలాగే చాలా మంచి ఫుడ్ కూడా కొంతమందికి ప్రాణాపాయంగా ఉండవచ్చిన నిపుణులు చెప్పారు.చీజ్‌తో మానసిక ఆరోగ్యం2.3 మిలియన్ల మంది వ్యక్తులపై జరిపిన ఒక అధ్యయనంలో, షాంఘై జియావో టోంగ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు చీజ్ వినియోగంతో మెరుగైన మానసిక ఆరోగ్యం ముఖ్యంగా వృద్ధుల్లో సామాజిక ఆర్థిక కారకాలతో సంబంధం లేకుండా ఎక్కువ ప్రభావం ఉంటుందని తేలింది. జన్యపరంగా వృద్ధాప్యం సహజమే అయినా, చీజ్ ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి ముఖ్యమైన సాంఘికీకరణ వంటి ఇతర కార్యకలాపాలతో ముడిపడి ఉందని పరిశోధన సూచించింది.నట్స్ - మెదడుగింజలు చిత్తవైకల్యం నుండి మెదడును రక్షించడంలో సహాయపడతాయి మెల్బోర్న్లోని మోనాష్ యూనివర్శిటీ పరిశోధకులు 49-ఐటమ్ ఫుడ్-ఫ్రీక్వెన్సీ సర్వేను పూర్తి చేసిన 70 ఏళ్లు పైబడిన 9,916 మంది వ్యక్తుల రికార్డులను పరిశీలించారు. ఇతర కారకాలను పరిశీలించిన తరువాత, తక్కువ నట్స్ తినే వారితో పోలిస్తే,తమ ఆహారంలోరోజుకు ఒకటి లేదా రెండుసార్లు నట్స్‌ను తీసుకునేవారిలో మంచి అభిజ్ఞా పనితీరు శారీరక ఆరోగ్యాన్ని నిలుపుకోవటానికి మంచి అవకాశం ఉందని గుర్తించింది. ఫాక్స్ నట్స్ఫాక్స్ నట్స్ ఆగ్నేయాసియాతోపాటు ఇండియాలో చాలాకాలంగా సంప్రదాయ వైద్యంలో వాడుతున్నారు. నీటి కలువ కుటుంబానికి చెందిన నీటి మొక్క (యురేల్ ఫెరోక్స్ ఫ్లవర్) గింజలే ఫాక్స్ నట్స్. వీటిల్లోని యాంటీ ఏజింగ్ లక్షణాలు ఈ ఏడాది పరిశోధకులకు ప్రత్యేక ఆసక్తిని కలిగించాయి. 2012, 2018, 2020లో అధ్యయనాలతో పాటు, ఇటీవల 2023లోని యాంటీఆక్సిడెంట్ల అధ్యయనాలను సమీక్షించారు. తద్వారా ఇవి కణాల ఆరోగ్యానికి, వాపును ఎదుర్కోవడానికి ముఖ్యమైన సమ్మేళనాలు అని గమనించారు. అంతేకాదు ప్రోటీన్- స్టార్చ్-రిచ్ సీడ్స్ పాప్‌కార్న్ లాగా చేసుకోవచ్చు. ఇవి ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్ నివారణలో బాగా ఉపయోగడతాయని గుర్తించారు.గాలి నుండి తయారైసూపర్ ప్రోటీన్సొలీన్ ప్రొటీన్ ఉత్పత్తికి ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్య-స్థాయిఫ్యాక్టరీ ఫిన్లాండ్లో ఏర్పాటైంది 2024లోనే. సోలిన్ ప్రొటీన్ (సోలెంట్ గ్రీన్ కాదు) శక్తి కోసం హైడ్రోజన్‌ను ఆక్సీకరణం చేసే రహస్య సింగిల్-సెల్ మట్టిలో ఉండే సూక్ష్మజీవి ద్వారా తయారు చేస్తారు. సోలిన్ అని పిలువబడే పొడి లాంటి పదార్ధంలో 65-70% ప్రోటీన్, 5-8% కొవ్వు, 10-15% డైటరీ ఫైబర్స్ , 3-5% ఖనిజ పోషకాలు ఉంటాయి కేవల ఐదో వంతు కర్బన ఉద్గారాలతో, 100 రెట్లు తక్కువ నీరు, 20 శాతం కంటే తక్కువ మొక్క ప్రోటీన్ ఉత్పత్తి. డయాబెటిస్‌కు డార్క్ చాక్లెట్డార్క్ చాక్లెట్ ఆరోగ్య ప్రయోజనాలపై పరిశోధనా ప్రపంచంలో చర్చనీయాంశంగా ఉన్నాయి. కానీ ఈ ఏడాది హార్వర్డ్ T.H. చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు వారానికి ఐదు సార్లు డార్క్ చాక్లెట్ వల్ల మంచిదని తేల్చారు. దీని వల్ల బరువు పెరగకుండానే టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 21శాతం తగ్గుతుందని కనుగొన్నారు. అధిక-ఫ్లావనాల్ కోకో ఉత్పత్తులు ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తాయని పరిశోధకులు విశ్వసిస్తున్నారు. ఇది ఇతర రకాల చాక్లెట్లలో కనిపించదు. ఫ్లేవనోల్స్, పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు మెరుగైన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చి, టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని అంచనా.తేనె- ప్రొబయాటిక్స్ఇల్లినాయిస్ యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్బానా-ఛాంపెయిన్ పరిశోధకులు పెరుగులో ఒక టేబుల్ స్పూన్ తేనెను జోడించడం వల్ల జీర్ణకోశంలో ప్రోబయోటిక్ మనుగడను పెంచుతుందనికనుగొన్నారు. జీర్ణక్రియను పెంచడంలో సహాయ పడుతుంది. ముఖ్యంగా క్లోవర్ తేనె - మంచి బ్యాక్టీరియాను రక్షిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది ఎగువ జీర్ణశయాంతర ప్రేగుల ద్వారా గట్ మైక్రోబయోమ్‌కు ప్రయాణిస్తుంది, అక్కడ మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.అలర్జీ నివారణలో స్ట్రాబెర్రీటోక్యో యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, స్ట్రాబెర్రీ అలర్జీల నివారణలో సాయపడతాయి. ఫ్లేవనాయిడ్ కెంప్ఫెరోల్ రోగనిరోధక వ్యవస్థపై దాని ప్రభావం ద్వారా ఆహార అలెర్జీలతో సహా,ఇతర శరీరం అలెర్జీలను ఇవి తగ్గిస్తాయి. కెంప్ఫెరోల్ టీ, బీన్స్, బ్రోకలీ, యాపిల్స్, స్ట్రాబెర్రీలలో పుష్కలంగా ఉంటుంది. ఈ నిర్దిష్ట ఫ్లేవనాయిడ్ మైక్రోబయోలాజికల్ యాంటీగ్గా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. -
పాత ఇంగ్లీష్ సినిమాల్లోని హీరోయిన్లా సమంత (ఫోటోలు)
-
హనీ సంస్థ ప్రచారకర్తగా అదితిరావు హైదరీ
న్యూఢిల్లీ: హమ్దర్ద్ హనీ తన ప్రచాకర్తగా సినీ నటి అదితిరావు హైదరీని నియమించుకుంది. ఈ సందర్భంగా ‘ద నో కాంప్రమైజ్ హనీ’ పేరుతో ఒక టీవీ ప్రచార వీడియో విడుదల చేసింది. నాణ్యత, స్వచ్ఛతల మేలికలయిక హమ్దర్ద్ బ్రాండ్‌కు ప్రచారకర్తగా వ్యవహరించనుండటం సంతోషం కలిగిస్తోందని అదితిరావు అన్నారు. ఆరోగ్యకర జీవన శైలి కోరుకునే ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో ఈ తేనె భాగం కావాలన్నారు. అదితిరావుతో భాగస్వామ్యం కుదుర్చుకోవడంపై హమ్దర్ద్ సీఈవో హమీద్ అహ్మద్ హర్షం వ్యక్తం చేశారు. -
రొమ్ము క్యాన్సర్ చికిత్సకు మానుకా తేనె.. ఎలా పని చేస్తుందంటే!
తేనె అనేది ప్రకృతిలో ఓ అద్భుతం. తేనెటీగలు తేనెను సేకరించి… దాచుకోవడం, దాన్ని ప్రాసెస్ చేసి… ప్యాక్ చేసి మనకు ఇవ్వడం… ఆ శుద్ధమైన తేనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందుతున్నాం. మన చర్మ కణాల్ని తేనె కాపాడుతోంది. జుట్టుకు కూడా రక్షణ కల్పిస్తోంది.తేనెలో చాలా రకాలు ఉంటాయి.. వీటిలో మానుకా తేనె చాలా ప్రత్యేకమైనది. దీనిని ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌లలో తేనెటీగలు తయారు చేస్తాయి. మనుక చెట్టు మకరందంతో తేనెటీగలు ఈ తేనెను ఉత్పత్తి చేస్తాయి. ఈ చెట్టు సంవత్సరంలో 2 నుంచి 6 వారాలు మాత్రమే పువ్వులు పూస్తుంది. ఇది చాలా అరుదైన తేనెగా చెబుతున్నారు. మామూలు తేనే కన్నా దీని తీపి కాస్త తక్కువగా ఉంటుంది. మామూలు తేనేలాగే మానుకా తేనేను కూడా రోజూ వాడొచ్చు. మానుకా తేనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, హీలింగ్ గుణాలు ఉన్నాయని అధికంగా ఉంటాయి. ప్రీ రాడికల్స్ వల్ల శరీరం దెబ్బతినకుండా ఇది కాపాడుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కాపాడుతుంది. మానుకా తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు చర్మ మీద అయిన గాయాలను తగ్గించడంతో సాయపడతాయి. తాజాగా మానుకా తేనే ఎలాంటి దుష్ప్రభావాలను కలిగించకుండా రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను 84% తగ్గించినట్లు ఓ అధ్యయనం ద్వారా వెల్లడైంది. ఈ పరిశోధనలు సహజమైన, నాన్-టాక్సిక్ సప్లిమెంటరీ యాంటీకాన్సర్ చికిత్సను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడనున్నాయి.ఇందులోని పోషకాహారం', 'ఫార్మాస్యూటికల్స్' కలయిక పోషక విలువలను అందించడమే కాకుండా, ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్షణాలను కలిగి ఉంటాయి. మానుకా తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, హీలింగ్ గుణాలు అధికంగా ఉంటాయి. తాజాగా యూసీఎల్ఏ పరిశోధకుల ప్రాథమిక అధ్యయనాల ద్వారా ఈ న్యూట్రాస్యూటికల్ రొమ్ము క్యాన్సర్ నివారణ, చికిత్సలో సహాయపడతాయని కనుగొన్నారు.ఈ పరిశోధనలు సాంప్రదాయ కీమోథెరపీకి ప్రత్యామ్నాయ చికిత్సగా ఉపయోగపడతాయని పరిశోధకులు వెల్లడించారు. క్యాన్సర్ చికిత్సలో సహజ సమ్మేళనాల ప్రయోజనాలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి మరింత పరిశోధన అవసరం అయినప్పటికీ, ఈ అధ్యయనం మరింత అన్వేషణకు బలమైన పునాదిని ఏర్పరుస్తుందని చెప్పారు.ఈస్ట్రోజెన్ రిసెప్టర్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వారిలో 60% నుంచి 70% వరకు- రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న వారే ఉన్నారు. క్యాన్సర్ కణాలలో గ్రాహకాలు ఉంటాయి. ఇవి ఈస్ట్రోజెన్ హార్మోన్‌ను వృద్ధి చేయడానికి ఉపయోగించుకునేలా చేస్తాయి. యాంటీ-ఈస్ట్రోజెన్ లేదా ఎండోక్రైన్తో చికిత్స చాలా మంది రోగులలో కణితి పెరుగుదలను నిరోధించవచ్చు.పరిశోధకులు మొదట తమ ప్రయోగంలో ఈఆర్ పాజిటివ్, ట్రిపుల్-నెగటివ్ రొమ్ము క్యాన్సర్ కణాలను పెంచారు, ఇది రొమ్ము క్యాన్సర్ అత్యంత సాధారణ రకాల్లో ఒకటి. మనుకా తేనె లేదాడీహైడ్రేటెడ్ మనుకా తేనె పొడితో చికిత్స చేసిన ఈఆర్ పాజిటివ్ కణాలలో.. నియంత్రణలతో చికిత్స చేయబడిన వాటితో పోలిస్తే క్యాన్సర్ కణాల విస్తరణ గణనీయమైన మోతాదు-ఆధారిత నిరోధాన్ని వారు గమనించారు. ట్రిపుల్-నెగటివ్ కణాల కోసం మనుక తేనెను టామోక్సిఫెన్తో కలిపినప్పుడు యాంటిట్యూమర్ ప్రభావం మరింత తక్కువగా ఉంటుంది.కణాలను మరింత నిశితంగా పరిశీలిస్తే, తేనె రక్తంలోని ఈస్ట్రోజెన్ స్థాయిలు, కణితుల్లో ఈస్ట్రోజెన్ గ్రాహకాలలో తగ్గుదలకు కారణమైందని తేలింది. కణితి కణాలలో అపోప్టోసిస్ లేదా సెల్ డెత్‌ను ప్రేరేపించడం ద్వారా క్యాన్సర్ పురోగతిని మరింత దెబ్బతీస్తుందని పరిశోధకులు కనుగొన్నారు.మనుకా తేనెను జంతు నమూనాలలో పరిశోధకులు పరీక్షించారు. మానవ ఈఆర్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ కణాలతో అమర్చబడి కణితిని అభివృద్ధి చేసిన ఎలుకలకు మనుకా తేనెను నోటి ద్వారా అందించారు. తేనెతో చికిత్స చేయబడిన ఎలుకలు నియంత్రణలతో పోలిస్తే కణితి పెరుగుదలను గణనీయంగా అణిచివేసాయి. మొత్తంమీద ఇది ఆరోగ్యకరమైన కణాలను ప్రభావితం చేయకుండా మానవ రొమ్ము క్యాన్సర్ కణితి పెరుగుదల, పురోగతిని 84% నిరోధించింది. -
గుండెపోటుకు తేనెతో చెక్!
గుండెపోటును నివారించుకునేందుకు ఒక తియ్యటి దారి ఉంది. అదేమంటే రకరకాల తీపి పదార్థాల్లో తీపినిచ్చే పదార్థాలు రకరకాలుగా ఉంటాయి. ఉదాహరణకు పిండి పదార్థాలైన బియ్యం, గోధుమలలో మాల్టోజ్, పండ్లలో ఫ్రక్టోజ్, చెరుకులో సుక్రోజ్, గ్లూకోజ్ ఇలా. అలాగే తేనెలో తీపినిచ్చే మరికొన్ని పదార్థాలతోపాటు ‘టెహ్రలోజ్’ కూడా ఉంటుంది. ఇదే స్వీటెనర్ కొన్ని పుట్టగొడుగులు, ఈస్ట్, సోయాబీన్స్‌లో కూడా ఉంటుంది. తేనెలోని టెహ్రలోజ్ను ఇంజెక్ట్ చేసిన ఎలుకల రక్తనాళాల్లో ప్లాక్’ చేరక పోగా గతంలో చేరిన ప్లాక్‌లో దాదాపు 30 శాతం తగ్గుదల కనిపించింది. ఈప్లాక్ వల్లనే రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడి అది గుండెపోటుకు దారితీస్తుందన్న విషయం తెలిసిందే. రక్తనాళాల్లోని ప్లాక్‌ను శుభ్రం చేసే పని చేసే ఇమ్యూన్ కణాల పుట్టుకకు టీఎఫ్‌ఈబీ అనే ఒక రకమైన ్రపోటీన్ ఉత్పాదనకు టెహ్రలోజ్ తోడ్పడుతుంది. అలా గుండెపోటును నివారించ వచ్చని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు భావిస్తూ ఆ మేరకు పరిశోధనలు చేస్తున్నారు. -
ఈ వెరైటీ వంటకాలను.. ఎప్పుడైనా ట్రై చేశారా..!?
హనీ– మిల్క్ పౌడర్ కప్ కేక్..కావలసినవి..తేనె– 1 కప్పు;మిల్క్ పౌడర్– 1 కప్పు;మైదా పిండి– అర కప్పు;పంచదార– పావు కప్పు (పొడి చేసుకోవాలి, అభిరుచి బట్టి కాస్త పెంచుకోవచ్చు);నెయ్యి, కొబ్బరి కోరు– అర కప్పు చొప్పున;గుడ్లు– 4, చిక్కటి పాలు– 2 టేబుల్ స్పూన్లు;తినే సోడా, వెనీలా ఎసెన్స్– అర టీ స్పూన్ చొప్పున;తయారీ..ముందుగా ఒక బౌల్లో గుడ్లు కొట్టి, పాలు పోసి క్రీమీగా అయ్యేలా బాగా గిలకొట్టుకోవాలి.ఆ మిశ్రమంలో తేనె, మైదా, మిల్క్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలుపుకుని పేస్ట్‌లా కలుపుకోవాలి. తర్వాత తినే సోడా, సగం నెయ్యి, వెనీలా ఎసెన్ ్స వేసుకుని బాగా కలుపుకోవాలి.ఈలోపు మిగిలిన నేతిలో కొబ్బరి కోరు, పంచదార పొడి వేసుకుని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు మినీ కేక్ బౌల్స్ తీసుకుని, వాటికి నెయ్యి రాసి పెట్టుకోవాలి.తర్వాత వాటిలో కొద్దిగా గుడ్ల మిశ్రమం వేసుకుని మధ్యలో కొద్దిగా కొబ్బరికోరు మిశ్రమం నింపుకుని, మళ్లీ పైన గుడ్ల మిశ్రమాన్ని వేసుకుని నింపుకుని ఓవెన్లో బేక్ చేసుకోవాలి.చల్లారాక క్రీమ్‌తో గార్నిష్ చేసుకుని, పైన గార్నిష్ కోసం.. కొద్దిగా తేనె పోసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.ఎగ్ – బాదం హల్వా..కావలసినవి..గుడ్లు– 8, బాదం పాలు– 1 కప్పు;కస్టర్డ్ మిల్క్– పావు కప్పు;పంచదార– 1 టేబుల్ స్పూన్ (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు);ఏలకుల పొడి– 1 టీ స్పూన్;నెయ్యి– 4 టేబుల్ స్పూన్లు;కుంకుమ పువ్వు– చిటికెడు;వెనీలా ఎసెన్ ్స– 1 టీ స్పూన్;బాదంపప్పు– 2 టేబుల్ స్పూన్లు (దోరగా నేతిలో వేయించాలి, అభిరుచిని బట్టి జీడిపప్పు, కిస్మిస్ వంటివి జోడించుకోవచ్చు);తయారీ..ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో గుడ్లలోని పసుపు సొనను మాత్రమే తీసుకుని, బాగా గిలకొట్టాలి.అందులో కస్టర్డ్ మిల్క్, బాదం పాలు, పంచదార, ఏలకుల పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని మరోసారి కలుపుకోవాలి. అనంతరం స్టవ్ ఆన్ చేసుకుని, పాన్ బౌల్లో నెయ్యి వేడి చేసుకుని, అందులో ఈ మిశ్రమం మొత్తం వేసుకుని చిన్న మంట మీద ఉడికించుకోవాలి.మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూనే ఉండాలి. మిశ్రమం సగానికి తగ్గుతున్నప్పుడు కుంకుమ పువ్వు వేసుకుని గరిటెతో బాగా కలుపుకోవాలి.మళ్లీ మధ్యమధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కాస్త దగ్గర పడుతున్నప్పుడు వెనీలా ఎసెన్ ్స వేసుకుని మరోసారి కలపాలి.ఆ మిశ్రమం మరింత దగ్గర పడుతున్న సమయంలో నేతిలో వేయించిన బాదం పప్పు వంటి వేసుకుని, కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.స్వీట్‌కార్న్ ఇడియాప్పం..కావలసినవి..స్వీట్ కార్న్ జ్యూస్ (వడకట్టుకోవాలి);బియ్యప్పిండి– 3 కప్పులు చొప్పున;జొన్న పిండి, ఓట్స్ పౌడర్– పావు కప్పు చొప్పున:జీలకర్ర పొడి– పావు టీ స్పూన్;చిక్కటి కొబ్బరి పాలు– పావు కప్పు;నీళ్లు– కొద్దిగా, నెయ్యి– 1 టీ స్పూన్;ఎల్లో ఫుడ్ కలర్– కొద్దిగా (అభిరుచి బట్టి);తయారీ..ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బియ్యప్పిండి, జీలకర్ర పొడి, స్వీట్‌కార్న్ జ్యూస్, కొబ్బరి పాలు వేసుకుని కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి నీళ్లు పోసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకుని, మరోసారి బాగా కలుపుకోవాలి.తర్వాత ఇడ్లీ పాన్ లేదా పెద్ద బౌల్‌కి బ్రష్‌తో నెయ్యి పూసుకోవాలి.అనంతరం మురుకుల మేకర్‌కి సన్నని హోల్స్ ఉండే ప్లేట్‌ని అమర్చి, అందులో ఈ మిశ్రమాన్ని సగానికి నింపుకుని, ఇడ్లీ పాన్ లో లేదా పెద్ద బౌల్లో నూడుల్స్‌లా ఒత్తుకుని ఆవిరిపై ఉడికించాలి.అభిరుచిని బట్టి ఆవాలు, కరివేపాకు, కొత్తిమీరలతో తాళింపు వేసి, కలుపుకుని.. సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.ఇవి చదవండి: ఈ 'తియా శిలాఫలకాలు'.. ఏ కాలంనాటివో తెలుసా!? -
Beauty Tips: ఇలా చేశారో.. మీ చర్మం కాంతివంతమే!
టీ డికాషన్‌ని ఉపయోగించడం వల్ల వేసవి తాపం నుంచి చర్మాన్ని, శిరోజాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అయితే, ఇందుకు తేయాకులను మాత్రమే ఉపయోగిస్తే సరైన ఫలితం లభిస్తుంది.చల్లారిన అరకప్పు టీ డికాషన్‌లో రెండు టీ స్పూన్ల బియ్యప్పిండి, అర టీ స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, 20 నిమిషాలు ఆరనివ్వాలి. శుభ్రపరుచుకోవడానికి ముందు కొన్ని నీళ్లు ముఖం మీద చల్లి, వేళ్లతో వలయాకారంగా రుద్దాలి.టీ డికాషన్‌లో ఐస్ క్యూబ్ వేసి, ఆ నీటిని ముఖానికి స్ప్రే చేసుకొని, కాసేపు సేదతీరాలి.ఎండ బారిన పడి ఇంటికి వచ్చినప్పుడు ఇలా చేయడం వల్ల కమిలిన చర్మం తిరిగి పూర్వపు స్థితికి చేరుకుంటుంది.టబ్ బాత్ చేసేటప్పుడు కొన్ని తేయాకులు నీటిలో వేసి, అరగంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఎండవల్ల కలిగిన అలసట నుంచి చర్మం విశ్రాంతి పొందుతుంది.జుట్టు పొడిబారి నిర్జీవంగా మారితే తలస్నానం చేసిన తర్వాత టీ డికాషన్‌తో కడగాలి. కండిషనర్‌లా ఉపయోగపడుతుంది.ఇవి చదవండి: మిస్ కేరళ ఫిజిక్‌గా టైటిల్ తనకు సొంతం! -
తేనెని నేరుగా వేడిచేస్తున్నారా?
మనం నిత్యం కొన్ని పదార్థాలను నిల్వ చేసేటప్పుడు పలు సమస్యలు ఎదుర్కొంటాం. ఒకవేళ పాడైతే ఎండలో పెట్టడమో లేక ఓ సారి మంటపై వేడిచేయడమో చేస్తాం. కానీ అలా అన్ని వేళలా అన్ని రకాల పదార్థాలకు పనికిరాదు. ఏవీ వేడి చేస్తే మంచిది? వేటిని నేరుగా వేడి చేయకూడదు వంటి ఆసక్తికర ఇంటి చిట్కాలు తెలుసుకుందామా! తేనె కొంతకాలం వాడకుండా ఉంచేస్తే సీసా అడుగున గడ్డకట్టుకుపోతుంటుంది. అలాంటప్పుడు తేనెను కరిగించడానికి ఓ అరగంట పాటు తేనె సీసాను ఎండలో ఉంచాలి. తేనెను ఎప్పుడూ నేరుగా వేడి చేయకూడదు. ఎండ లేకుండా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఒక పాత్రలో నీటిని వేడి చేసి అందులో తేనె సీసాను ఉంచాలి. నీటి వేడితో ఐదు – పది నిమిషాల్లో తేనె కరుగుతుంది. ఒకవేళ తేనెను నేరుగా వేడిచేస్తే పోషక విలువలు పోయి పాయిజన్‌గా మారిపోతుందట. పైగా నేరుగా వేడి చేయడం వల్ల జిగురు వంటి పదార్థంలా మారిపోతుంది. దాన్ని గనుక ఆహారంగా తీసుకుంటే జీర్ణవ్యవస్థ శ్లేష్మ పొరలకు అంటుకుని, అమా అనే టాక్సిన్‌గా మారుతుంది. దీంతో మనకు కడుపు నొప్పి రావడం, శ్వాసక్రియ, ఇన్సులిన్ సెన్సిటివిటీ, చర్మ వ్యాధులు, బరువు పెరుగుటం వంటి దుష్పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. పాల ప్యాకెట్లు ఫ్రిజ్‌లో పెట్టుకునేటప్పుడు ఆ ప్యాకెట్లను నేరుగా పెట్టకూడదు. ప్యాకెట్ మన వాకిటి ముందుకు వచ్చే లోపు రకరకాల ప్రదేశాలను తాకి ఉంటుంది. కాబట్టి ప్యాకెట్‌ని నీటితో కడిగి ఫ్రిజ్‌లో పెట్టడం మంచిది. వెల్లుల్లి రేకలు పొట్టు సులువుగా వదలాలంటే... వెల్లుల్లి రేకను కటింగ్ బోర్డు మీద పెట్టి చాకు వెనుక వైపు (మందంగా ఉండే వైపు, ఈ స్థితిలో చాకు పదును ఉన్న వైపు పైకి ఉంటుంది) తిప్పి వెల్లుల్లి రేక చివర గట్టిగా నొక్కితే వెల్లుల్లి రేక తేలిగ్గా విడివడుతుంది. పైనాపిల్‌ను కట్ చేయడానికి పెద్ద చాకులను (షెఫ్స్ నైఫ్) వాడాలి. ముందుగా కాయ పై భాగాన్ని, కింది భాగాన్ని తొలగించాలి. ఇప్పుడు కాయను నిలువుగా పెట్టి చెక్కును పైనుంచి కిందకు తొలగించాలి. ఆ తర్వాత మీడియం సైజ్ చాకుతో కాయను చక్రాలుగా తరగాలి. బటర్‌ను వంట మొదలు పెట్టడానికి ఓ అరగంట లేదా గంట ముందు ఫ్రిజ్‌లో నుంచి తీసి బయట పెట్టుకోవాలి. ఒకవేళ మర్చిపోతే వేడి పాలగిన్నె మూత మీద లేదా ఉడుకుతున్న వంట పాత్ర మూత మీద పెడితే పది నిమిషాల్లో మెత్తబడుతుంది. అలా కుదరకపోతే స్టవ్ మీద బర్నర్ల మధ్య ఉండే ఖాళీ ప్రదేశంలో ఉంచాలి. ఐస్‌క్రీమ్ సర్వింగ్ స్పూన్లు ఇంట్లో ఉండవు. పెద్ద ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు దానిని పలుచగా కట్ చేయాలంటే చాకును మరుగుతున్న వేడి నీటిలో ముంచి తీయాలి. ఒక స్లయిస్ కట్ చేయగానే చాకు చల్లబడిపోతుంది. కాబట్టి ప్రతి స్లయిస్కూ ఓ సారి వేడి నీటిలో ముంచాలి. (చదవండి: శిల్పాశెట్టి చెప్పే తిరగలి తిప్పే భంగిమ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా!) -
ఈ బ్యూటిప్స్ వాడారో.. ఇకపై ట్యాన్‌కు చెక్!
చలికాలంలో చాలా మంది తమ ముఖాలు అందంగా కనిపించేలా ప్రయత్నాలు చేస్తుంటారు. చలి తీవ్రతతో.. ముఖం నిగారింపు తగ్గడం, పెదవులు పొడిబారిపోవడం, కళ్లకింద నల్లరంగు చారలు ఏర్పడటంలాంటి సమస్యలు కనిపిస్తూంటాయి. వీటిని అధిగమించడానికి మరెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు తెలియని ఫేస్‌క్రీమ్స్ వాడి లేని సమస్యలను కొనితెచ్చుకుంటారు. మరి వీటినుండి బయటపడాలంటే ఈ చిన్న చిన్న బ్యూటిప్స్ని వాడితే చాలు. అవేంటో చూద్దాం. రోజ్ వాటర్, తేనెతో.. రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండిలో టీస్పూను తేనె, టీస్పూను రోజ్ వాటర్ వేసి చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వాలి. చక్కగా ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్‌ను వారానికి ఒకసారి వేసుకోవడం వల్ల ముఖం మీద పేరుకుపోయిన ట్యాన్ తగ్గుముఖం పడుతుంది. రోజ్ వాటర్ ముఖానికి సహజసిద్ధ్ద నిగారింపుని ఇస్తే, తేనె చర్మానికి తేమనందిస్తుంది. ఇంగువతో నిగారింపు.. రెండు స్పూన్ల ముల్తానీ మట్టిలో స్పూను తేనె, చిటికెడు ఇంగువ, స్పూను రోజ్‌వాటర్ వేసి చక్కగా కల΄ాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి ఇరవై నిమిషాల΄ాటు ఆరబెట్టాలి. తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఈ ΄్యాక్‌ను వారంలో రెండుసార్లు వేయడం వల్ల మొటిమలు, నల్లమచ్చలు, ముడతలు ΄ోతాయి. చర్మం ΄÷డిబారడం తగ్గి ముఖం కాంతిమంతమవుతుంది. ఇవి కూడా చదవండి: ఏంటి? కనీసం 6 గంటలైనా నిద్ర పోవట్లేదా..! -
నవజాత శిశువులకు తేనె ఇవ్వకూడదా? సోనమ్ కపూర్ సైతం..
అప్పుడే పుట్టిన పిల్లలకు కొందరు తేనె పెడుతుంటారు. మాటలు తెనె పలుకుల్లా ఉంటాయని మన పెద్దవాళ్ల ఆలోచన. చెప్పాలంటే తరతరాలుగా వస్తున్న సంప్రదాయంలో భాగంగా మన పెద్దలు అప్పుడే పుట్టిన పిల్లలకు తేనె పెడుతుంటారు. ఇలా పెట్టడంతో పిల్లలు చనిపోయిను ఉదంతాలు కూడా ఉన్నాయి. ఐతే అసలు తేనె పిల్లలకు పెట్టొచ్చా? ఆయుర్వేద పరంగా ఎన్నో ఔషధా గుణాలు కలిగిన తేనె చిన్నారుల పాలిట విషమా? తదితరాల గురించే ఈ కథనం. ఏదీఏమైనా అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు తేనె అస్సలు పెట్టొదనే అంటున్నారు ఆరోగ్య నిపుణలు. బాలీవుడ్ నటి, అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ సైతం ఇదే చెబుతుంది. ఎన్నో ఏళ్లుగా ఇలా చేసినప్పటికీ నిర్మొహమాటంగా మీ ముక్కు పచ్చలారని చిన్నారులకు తేనెను ఇవ్వనని గట్టిగా చెప్పండి అని అంటోంది సోనమ్. అది వారి ప్రాణాలను హరించే విషం అంటూ హితవు పలుకుతుంది. తాను కూడా తన కొడుకు వాయు కపూర్‌కి ఇవ్వలేదని. ఇది మన ఆచారమే అయినా..దాన్ని తను స్కిప్ చేశానని. అలాగే మీరు కూడా చేయండి అని సోషల్ మీడియా వేదికగా చెబుతుంది. అప్పుడే పుట్టిన శిశువుల్లో పూర్తిస్థాయి జీర్ణవ్యవస్థ ఉండదు. దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు ప్రాణాంతకం కూడా కావచ్చు. దయచేసి ఇలాంటి పనులు మానుకుండి. కోరి కోరి గర్భశోకాన్ని అనుభవించొద్దు ఓ తల్లిగా చెబుతున్నా అని సోనమ్ స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇస్తోంది. “had an argument with Pandit ji for feeding Honey to newly born child because i don’t believe in these traditions”, like seriously ??? Wokeism at its peak!! pic.twitter.com/fBbQ7TVGVL — Moana (@ladynationalist) September 27, 2023 శిశువులకు తేనె ఎందుకు సురకక్షితం కాదంటే... శిశువులకు తేనె ఎందుకు సురక్షితం కాదని తెలుసుకోవడానికి తాను ఆరోగ్య నిపుణులను కూడా సంప్రదించినట్లు తెలిపింది సోనమ్. అంతేగాదు ఆమె శిశువులకు తేనె ఎందుకు ఇవ్వకూడదో వివరిస్తూ, సికె బిర్లా హాస్పిటల్ గురుగ్రామ్‌లోని నియోనాటాలజీ అండ్ పీడియాట్రిక్స్ డాక్టర్ శ్రేయా దూబే చెప్పిన విషయాలను కూడా పంచుకుంది. తేనెలో క్లోస్ట్రిడియం అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది 12 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న శిశువుల ప్రేగులలో విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. అదికాస్త శిశు బోటులిజం అనే తీవ్రమైన వ్యాధికి దారితీస్తుంది. ఈ బొటులిజంలో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో.. ఒకటి ఆహారం ద్వారా వచ్చేవి, రెండు గాయం ద్వారా వచ్చే శిశు బొటులిజం. ఈ బ్యాక్టీరియా శిశువుల నరాలపై దాడి చేసి ప్రాణాలు కోల్పోయేలా చేస్తుంది. అందువల్ల, తేనెనూ ఏ విధంగానూ శిశువులకు తినిపించకపోవడమే మంచిదిని సోనమ్ గట్టిగా నొక్కి చెబుతోంది. వైద్యులు ఏం చెబుతున్నారంటే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం తేనెలో "క్లోస్ట్రిడియం బోటులినమ్ అనే తక్కువ ఆక్సిజన్ పరిస్థితులలో ప్రమాదకరమైన టాక్సిన్లను (బోటులినమ్ టాక్సిన్స్) ఉత్పత్తి చేసే బాక్టీరియం ఉంటుందని పేర్కొంది. శిశు వైద్యురాలు డాక్టర్ మీనా జే మాట్లాడుతూ..వడకట్టలేని లేదా ప్రాసెస్ చేయని తేనె శిశువులకు ఇవ్వడం వల్ల న్యూరోటాక్సిసిటీకి గురై కండరాల పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది శిశువుని మరణం అంచులదాక తీసుకువెళ్తుందని తెలిపారు. తొలుత మలబద్దకం, హైసోటోనియాతో మొదలవుతుంది. క్రమేణ పక్షవాతానికి దారితీసి శ్వాస తీసుకోలేని స్థితికి చేరుకుంటారు. చివరికి మరణం సంభవిస్తుందని చెబుతున్నారు. అలాగే హైదరాబాద్‌లోని యశోద ఆస్పతత్రిలోని శిశు వైద్యుడు డాక్టర్ సురేష్ కుమార్ పానుగంటి మాట్లాడుతూ.. తేనె వల్ల శిశు బొటులిజంకి గురవ్వుతారని అన్నారు. దీనివల్ల కండరాల బలహీనతకు దారితీసి కనీసం పాలను కూడా ఫీడ్ చేయలేనంత బలహీనంగా మారిపోయి విరేచనలు అయ్యే అవకాశం ఉందని అన్నారు. నవజాత శిశువుల్లో అప్పుడే రోగ నిరోధక వ్యవస్థ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందదు. దీని ఫలితంగా మనం ఆచారం పేరుతో శిశువులకు తేనెను ఇచ్చేస్తాం. వారి ప్రేగుల్లో తేనెలో ఉన్న టాక్సిన్స్‌తో పోరాడే రక్షణ పూర్తిగా ఉండదు. జీర్ణసమస్యలు ఏర్పడి వివిధ అనారోగ్య సమస్యలకు దారితీసస్తుందని హెచ్చరిస్తున్నారు. ఏడాదిలోపు చిన్నారులకు తేనె ఇవ్వకపోవడమే మంచిదని సూచిస్తున్నారు డాక్టర్ సురేష్ కుమార్ పానుగంటి. ఇక ఇండియన్ పీడియాట్రిక్ ప్రకారం అప్పుడే పుట్టిన శిశువులకు జంతువులకు సంబంధించిన పాలు, పాల పొడి, టీ, నీరు, గ్లూకోజ్ నీరు లేదా ఇతర ఏ ద్రవాలు ఆహారంగా వ్వకూడదని హానికరం అని పేర్కొంది. ప్రజలు తేనెని శిశువులోని ప్రేగు కార్యకలాపాలను ఉత్తేజపరిచి విరేచనం సాఫీగా అయ్యేలా చేస్తుందని భావిస్తారు. వాస్తవానికి తేనె శరీరంలో చాలా నీటిని తీసుకుంటుంది. ఫలితంగా వదులుగా ఉండే మలం వస్తుంది .కానీ అప్పుడే ఉండే శిశువు శరీరంలో ఆ స్థాయిలో నీరు ఉండదు, పైగా అరిగించుకునేంత జీర్ణవ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో ఉండదు. అందువల్ల ఇలాంటి ఆచారాన్ని మానుకోవాలని డాక్టర్ అమిత్ గుప్తా చెబుతున్నారు. భారతదేశంలో అనేక ప్రాంతాల్లో నవజాత శిశువుల తొలి ఆహారంగా ఆవుపాలు లేదా తేనె వంటివి ఇస్తుంటారు. ఇది చాలా పెద్ద తప్పుని గట్టిగా నొక్కి చెబుతున్నారు. తల్లిపాలు తప్ప మిగతావన్నీ శిశువుకు లేనిపోని ఆరోగ్య సమస్యలను కలిగించేవేనని అధ్యయనంలో వెల్లడైంది. కావునా మనం ఆ సంస్కృతులు, ఆచారాలు అనేవి ఆయా పరిస్థితులు దృష్ట్యా వచ్చినవి. కానీ ప్రస్తుతం పరిస్థితులు అంతటి స్థాయిలో లేవు అనేదాన్ని కూడా మనం గమనించి విచక్షణతో వ్యవహరించాల్సి ఉంది. (చదవండి: ఆరోగ్యం గురించి.. ఆనాడే గాంధీ పుస్తకం రాసి మరీ..) -
తేనె మంచిదని ఎక్కువగా తీసుకుంటున్నారా..?
తేనె ఆరోగ్యానికి చాలామంచిదని తినే ఆహరంలో ఏదో ఒక రూపంలో తీసుకుంటుంటారు చాలామంది. కానీ తేనెని ఇలా ఎక్కువగా తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది మంచిగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంత మంచిదే ఎక్కువగా తీసుకుంటే అంతే హానికరం అని చెబుతున్నారు. ఈ తేనెను కొన్ని పదార్థాలతో కలిసి తీసుకొవద్దని హెచ్చరిస్తున్నారు కూడా. ముందుగా ఈ తేనె ఏవిధంగా ఆరోగ్యానికి హనికరమో చూద్దాం! తేనె వల్ల కలిగే దుష్ప్రయోజనాలు: పుప్పొడి గింజలు శరీరంపై పడితే అలెర్జీ ఉన్నవారు అస్సలు తేనెను తీసకోకూడదు. దీని వల్ల అలర్జీ మరింత పెరిగే ప్రమాదం ఉంది. అలాగే తేనె అధికంగా తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో కడుపు నొప్పి, విరేచనాలు, వాంతుల వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అదే చిన్న పిల్లలకు అయితే బోటులిజం అనే కండరాల బలహీనత లేక పక్షవాతం వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఇది ఎక్కువగా తీసుకుంటే కడుపు నొప్పి రావడం, పొట్టకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. తేనెలో ఉండే ఫ్రక్టోజ్ చిన్న ప్రేగు శోషక సామర్థా్యన్ని తగ్గిస్తుంది. దీంతో కడుపులో లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదం పొంచి ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగాపెరగవచ్చు. అందువల్ల మధుమేహ రోగులు తేనెను తీసుకోకపోవడమే మంచిది. తేనెను ఇలా అస్సలు తీసుకోవద్దు! ►తేనె దేశీయ నెయ్యితో సమాన పరిమాణంలో అస్సలు తీసుకోవద్దు. ఇది అత్యంత విషం. ►గర్భధారణ సమయంలో, పాలిచ్చే తల్లులు తేనెను ఎక్కువగా అస్సలు తీసుకోకూడదు ►చాలా వేడి నీటిలో తేనె ఎప్పుడు తాగకూడదు. గోరువెచ్చని నీటిలో కలుపుకోవాలే గానీ అలా అస్సలు తాగొద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. (చదవండి: పరగడుపునే ఆ నీళ్లు తాగితే..బరువు తగ్గడం ఖాయం!) -
చీమల తేనె గురించి విన్నారా! ఇది జలుబు, గొంతు నొప్పి ఇన్ఫెక్షన్లను..
తేనె అంటే తేనెటీగల నుంచి వస్తుందని అందరికీ తెలుసు. మహా అయితే కొన్ని దేశాల్లో ఇంకాస్తా ఔషధాలతో కూడిన తేనె దొరకొచ్చు. కానీ మాగ్జిమమ్ తేనె అంటే వివిధ తేనెటీగల జాతుల నుంచే వస్తుంది. చీమల నుంచి కూడా తెనె వస్తుందని మీరు ఎప్పుడైనా విన్నారా?. పైగా ఇందులో చాలా మంచి ఔషధాలు ఉన్నాయట. ఆస్ట్రేలియాలోని ప్రజలు ఈ తేనెనే ఎక్కువగా ఉపయోగిస్తారట. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయని పరిశోధకులు కూడా చెబుతున్నారు. ఆస్ట్రేలియలో ఉండే హనీపాట్ చీమలు ఈ తేనెను ఉత్పత్తి చేస్తాయట. ఇందులో జలుబు, గొంతు నొప్పుల ఇన్ఫెక్షన్ల భారి నుంచి కాపాడే మంచి యాంటీబయోటిక్స్ ఉన్నాయట. అక్కడ ప్రజలు సాంప్రదాయ వైద్యంలో భాగంగానే కాగా నిత్య జీవితంలో కొన్ని రకాల వ్యాధులకు ఔషధంగా వాడతారట. ఈ చీమలు పశ్చిమ ఆస్ట్రేలియాలో ఉత్తర భూభాగంలోని ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని రిప్లీట్స్ అని పిలుస్తారు. ఇవి తేనేను అధికంగా తింటాయి. వాటి పొత్తికడుపులో చిన్న అంబర్ గోళీల పరిమాణానికి చేర్చి తేనెను ఉత్పత్తి చేస్తాయి. అవి తమ గూళ్లు పై కప్పులపై వేళ్లాడుతూ ఉండి ఈ తేనెను స్టోర్ చేయడం ప్రారంభిస్తాయి. వాటికి ఆహరం కొరత ఉన్న సమయంలో ఈ తేనెను తీసుకుని జీవిస్తాయి. ఈ తేనె స్టెఫిలోకాకస్ ఆరియస్ బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పనిచేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. క్రిప్టోకోకస్ చెట్లలో ఈ చీమలు గూడ్లు కట్టుకుంటాయని చెబుతున్నారు. వీటి తేనెలో యాంటీమైక్రోబయల్ పెప్టైడ్, మిథైల్గ్లైక్సాల్ సమ్మేనం, హైడ్రోజన్ పెరాక్సైడ్ తదితరాలు ఉంటాయని పరిశోధకులు తెలిపారు. అందువల్లే ఇది మంచి ఔషధంగా ప్రజలు భావించినట్లు తెలిపారు. దీన్ని గాయాలకు లేపనంగా పూస్తే త్వరితగతిన తగ్గిపోతాయని పేర్కొన్నారు. ఈ చీమల తేనె మాములు తేనె కంటే చిక్కగా ఉండి తక్కువ తీపి ఉంటుందట. ఇది మాపుల్ సిరప్‌ని పోలి ఉంటుంది. అంతేగాదు పరిశోధకులు ఈ తేనెలో ఉండో మైక్రోబయల్ను ఉపయోగించి భవిష్యత్తులో మరిన్ని మందులు తయారు చేసే దిశగా అధ్యయనాలు చేస్తున్నాట్లు పరిశోధకులు తెలిపారు. (చదవండి: ఈ ప్యాక్స్‌తో..జుట్టురాలే సమస్యకు చెక్‌పెట్టండి!) -
పొలంలో దొరికిన వజ్రం .. రూ.25 లక్షలకు కొన్న వ్యాపారి?
పత్తికొండ: కర్నూలు జిల్లాలో ఓ మహిళ పంట పండింది. తుగ్గలి మండలం జొన్నగిరి పొలాల్లో ఇటీవల ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తికి తేనె రంగు వజ్రం లభించిందని ప్రచారం జరిగింది. ఈ వజ్రాన్ని స్థానిక వ్యాపారి రూ.25 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అదే రోజు మరో రెండు వజ్రాలు లభ్యమైనట్లు సమాచారం. మద్దికెర మండలం మదనంతపురం వాసి పొలంలో కలుపు తీస్తుండగా శనివారం వజ్రం దొరికినట్లు ప్రచారం సాగుతోంది. మహిళా రైతు శనివారం పొలంలో కలుపు మొక్కలు తీసే పనుల్లో ఉన్నారు. ముందు రోజు రాత్రి వర్షం కురవడంతో తళతళ మెరిసే రాయి కనిపించింది. వెంటనే ఆ రాయిని తీసుకెళ్లి పెరవళిలో ఓ వ్యాపారికి చూపించగా.. వెంటనే రూ.14 లక్షలు డబ్బులు.. 2 తులాలు బంగారం ఇచ్చి ఆ వజ్రాన్ని వ్యాపారి సొంతం చేసుకున్నట్లు తెలిసింది. అంటే దాదాపు రూ.15 లక్షల వరకు రాగా.. ఒక్క రోజులో ఆమె లక్షాధికారి అయ్యారు. తొలకరి వర్షాలు కురవగానే కర్నూలుతో పాటుగా అనంతపురం జిల్లాల్లోని గ్రామాల్లో వజ్రాల వేట ప్రారంభమవుతుంది. భూమిలో నుంచి వజ్రాలు బయట పడతాయని ప్రచారం ఉంది. దీంతో గ్రామాల్లో జనాలు పొలాలకు వెళతారు.. వజ్రాల కోసం గాలిస్తుంటారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి, తుగ్గలి, పగిడిరాయి, ఎర్రగుడి, ఉప్పర్లపల్లి.. అలాగే మద్దికెర మండలం వజ్రాల బసినేపల్లి, పెరవళి, మదనంతాపురంలలో వజ్రాలు దొరుకుతాయనే ప్రచారం ఉంది. ఈ వజ్రాల కోసం కర్నూలు జిల్లాల వాళ్లే కాదు ఆ పొరుగు ఉండే జిల్లాల్లు, రాష్ట్రాల నుంచి వస్తుంటారు. పొలాల్లో తిరుగుతూ వజ్రాల వేటలో ఉంటారు. వజ్రాలు దొరికితే కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడుతుంటారు. ఒకవేళ వజ్రం దొరికితే.. బరువు, రంగు, రకాన్ని బట్టి క్యారెట్లలో లెక్కకట్టి డబ్బులు చెల్లిస్తారు. ఈ వ్యాపారం అధికారికంగా జరగదనే చర్చ ఉంది. గత నెలలో మద్దికెర మండలం వజ్రాల బసినేపల్లిలో ఓ వ్యక్తికి రూ.2 కోట్ల విలువైన వజ్రం దొరికిందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. -
ఆ తేనెలో మద్యానికి మించిన మత్తు.. ఎక్కడ దొరుకుతుందంటే..
తేనె గురించి, అది అందించే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనం ఎప్పుడో ఒకప్పుడు వినేవుంటాం. తేనె పలు వ్యాధులను కూడా దూరం చేస్తుందని చెబుతుంటారు. అయితే మీరు ఎప్పుడైనా ఎర్ర తేనె గురించి విన్నారా? ఇది ఎంతో మత్తును కలిగిస్తుంది. పెద్ద తేనె టీగలు ఈ తేనెను తయారుచేస్తాయి. ఈ తేనెను ఉత్పత్తి చేసే తేనెటీగలను ‘హిమాలయన్ క్లిఫ్ బీస్’ అని అంటారు. ఈ తేనెకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎర్ర తేనెను ఉత్పత్తి చేసేందుకు ‘హిమాలయన్ క్లిఫ్ బీస్’ విషపూరితమైన పండ్ల రసాన్ని సేకరిస్తాయి. ఈ తేనె ఎంతో మత్తునిస్తుంది. దీనిలో పలు ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఈ ఎర్ర తేనెకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది. ఈ తేనె తీసుకోవడం వలన లైంగిక సామర్థ్యం పెరుగుతుందని చెబుతారు. డయాబెటీస్‌తో పాటు హైబ్లడ్ ప్రజర్‌ను ఇది తగ్గిస్తుందని చెబుతారు. ఇది అందించే మత్తు కారణంగా దీనికి అత్యధిక డిమాండ్ ఏర్పడిందని అంటారు. ఎర్ర తేనె నేపాల్ శివారు ప్రాంతాలలో లభ్యమవుతుంది. కాగా ఈ తెనె తీయడం ఎంతో ప్రమాదకరమని చెబుతారు. సాధారణ తీసే విధానం కన్నా ఇది ఎంతో కష్టమైనది. ఎర్ర తేనెను గురూంగా గిరిజన జాతివారు ఎంతో చాకచక్యంగా సేకరిస్తుంటారు. ఈ తేనె సేకరించేందుకు ముందుగా ఒక తాడు సహాయంతో ఎన్నో అడుగుల ఎత్తయిన ప్రాంతానికి చేరుకుంటారు. తరువాత పొగ సాయంతో తేనేటీగలను తరిమికొడతారు. ఈ నేపధ్యంలో తేనె సేకరించేవారు తేనెటీగల దాడికి కూడా బలవుతుంటారు. ఎర్ర తేనె అత్యధిక మత్తు కలిగిన ఎస్బింథే లాంటిది. ఎస్బింథే వినియోగంపై పలు దేశాల్లో నిషేధం ఉంది. ఎరుపు తేనెను అధికమోతాదులో తీసుకుంటే హృదయ సంబంధిత వ్యాధుల బారినపడే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి: డాక్టర్‌కు షాకిచ్చిన సమోసాలు.. రూ 1.40 లక్షలకు టోకరా! -
ప్రతి మూడో ముద్ద తేనెటీగలు పెడుతున్నదే!
ప్రకృతిలో తేనెటీగల వంటి చిరుప్రాణులు లేక పోతే మన మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. మొక్కల్లో పూలు కాయలుగా మారడానికి పరాగ సంపర్కమే కారణం. ఈ ప్రక్రియకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపకరిస్తూ పంటల ఉత్పాదనలో ఈ చిరుప్రాణులు తోడ్పడటం వల్లనే మనం మూడు పూటలా తినగలుగుతున్నాం. మనం తింటున్న ప్రతి మూడో ముద్ద ముఖ్యంగా తేనెటీగల పుణ్యమే. తేనెటీగలు లేకపోతే ఎన్నో రకాల పంటలు పండవు. అందుకే, తేనెటీగలు అంతరిస్తే నాలుగేళ్లలోనే మానవ జాతి అంతరిస్తుంది అన్నాడో మహనీయుడు. తేనెటీగల ఉసురు తీస్తున్న పురుగుమందులు, కలుపుమందులు, పచ్చదనం కొరత, వ్యాధికారక క్రిముల విజృంభణ వంటి సమస్యలకు ఇప్పుడు అదనంగా ‘వాతావరణ మార్పులు’తోడయ్యాయి. అందువల్ల కరువు, కుంభవృష్టి వంటి వాతా వరణ మార్పు ప్రభావాల నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ తేనెటీగలను సైతం కనిపెట్టుకుని ఉండాలి. – సాక్షి సాగుబడి డెస్క్ మనం ఏం చేయగలం? ♦ అటవీ ప్రాంతాలను నాశనం చేయకుండా ఉండటం.. ♦ గ్రామీణ ప్రాంతాల్లో పొలాల గట్ల మీద రకరకాల స్థానిక రకాల పూల మొక్కల్ని పెంచటం.. ♦నగరాలు, పట్టణాల్లోని ఖాళీ స్థలాల్లో, మిద్దె తోటల్లో, పెరటి తోటల్లో, ముఖ్యంగా రోడ్ల పక్కన ఖాళీ జాగాల్లో కూడా మొక్కలతోపాటు స్థానిక జాతుల పూల మొక్కల్ని విస్తృతంగా పెంచటం.. ♦ రసాయనిక పురుగు మందులు, కలుపు మందులు చల్లకుండా ఉండటం.. ♦తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించటం వంటి పనులను మనం చేస్తుంటే జీవవైవిధ్యం పరిఢవిల్లుతుంది. తేనెటీగల వంటి చిరు జీవులు మనుగడ సాగిస్తాయి. మనల్ని రక్షిస్తాయి.. తేనెటీగలు.. కొన్ని వాస్తవాలు ♦ తేనెటీగ సగటు జీవితకాలం పనిచేసే కాలంలో సుమారు 1.5 నెలలు; పని లేని సీజన్లో సుమారు 2.5 నెలలు. ∙అర కిలో తేనె ఉత్పత్తికి 556 తేనెటీగలు పని చేయాల్సి ఉంటుంది. ♦ తేనెటీగల సంతతి వసంత రుతువులో 15,000 ఉంటుంది. వేసవిలో 80,000 వరకు ఉంటుంది. ♦ 2021లో ప్రపంచవ్యాప్తంగా సహజంగా ఉత్పత్తయిన తేనె: 1.77 మిలియన్ మెట్రిక్ టన్నులు 20,000 ప్రకృతిలో ఉన్న తేనెటీగల జాతులు.. పరాగ సంపర్కానికి దోహదపడే.. అంతరించిపోయే ముప్పుఎదుర్కొంటున్న సకశేరుక (వెన్నెముక ఉన్న) జాతులు 16.9 అంతరించిపోతున్న తేనెటీగలు, సీతాకోక చిలుకలు వంటి అకశేరుక (వెన్నెముక లేని) జాతులు 40% తేనెటీగలు తదితర కీటకాల పరాగసంపర్కమే ఆధారం. పుష్పించే అడవి మొక్కలు/చెట్లలో తేనెటీగలు/జంతువుల పరాగసంపర్కంపై ఆధారపడుతున్నవి. 90% ప్రపంచవ్యాప్తంగా పరాగసంపర్కంపై ఆధారపడి ఉన్న ఆహార పంటలు. 75% -
ఉదయాన్నే నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తీసుకుంటున్నారా? వేసవిలో ఇలా చేస్తే..
ఎండాకాలం కాసేపు బయటికి వెళితే చాలు ముఖచర్మం కమిలిపోతుంది. విపరీతంగా చెమటలు పోస్తాయి. నీరసం, నిస్త్రాణ కలుగుతాయి. కాసేపు పని చేస్తే చాలు శరీరం అలసిపోయి, సొమ్మసిల్లినట్లు అవుతుంది. బయటికి వెళ్లేటప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే ఎండల్లోనూ అందంగా ఆరోగ్యంగా ఉండవచ్చు. అవేమిటో చూద్దాం... పుదీనా, నిమ్మరసం- తేనెతో ►మంచి నీటిని మించిన ఔషధం లేదు. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడేది మంచినీరు మాత్రమే. కాబట్టి ఇప్పటినుంచీ దాహం వేసినా వేయకపోయినా వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగడం అలవాటుగా మార్చుకోండి. ►గుప్పెడు పుదీనా ఆకులను తాగే నీటిలో వేసుకుంటే... శరీరం చల్లగా ఉంటుంది. ఈ కాలంలో పుదీనా టీని ఎంచుకుంటే మరీ మంచిది. ఎండ ప్రభావాన్ని కొంతవరకూ తట్టుకోగలుగుతారు. ►నిమ్మరసం వేసవికి ఔషధం లాంటిది. ఉదయాన్నే గ్లాసు నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. పెరుగు తీసుకుంటే ఉప్పు, కొద్దిగా మసాలాలు జోడించి పెరుగు చిలికి చేసే మజ్జిగ శరీరంలో వేడిని చల్లారుస్తుంది. డీహైడ్రేషన్ ను నివారిస్తుంది. ఇది ఎలక్ట్రోలైట్ల భరితం. వేసవి తాపంతో పోరాడటానికి మజ్జిగ ఒక మంచి ఆప్షన్. దీనిలో క్యాలరీలు తక్కువ. కాల్షియం, పొటాషియంతో పాటు ప్రొటీన్ కూడా దీని నుంచి దొరుకుతుంది. అసిడిటీని తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అదేవిధంగా పెరుగు తీసుకోవడం కూడా మంచిదే. కొత్తిమీర రసంతో ►గసగసాలను ఎక్కువగా ఆహారపదార్థాల్లో వాడాలి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాదు, వేడిని తగ్గించి, శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. ►కొత్తిమీరను ఆహారంలో అధికంగా తీసుకోవాలి. కొత్తిమీర రసం లేదా వంటకాల్లో దీన్ని వాడినా... శరీరంలోని అధిక ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. సీజనల్ పండ్లు తినడం వల్ల ►వేసవిలో ఆయిల్ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. ఇంటి వంటలలో కూడా నూనె వాడకం తగ్గించాలి. ►ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. మసాలా కూరలు తగ్గించాలి. ►అల్పాహారంగా ఆవిరి కుడుములు, ఇడ్లీ వంటివి తీసుకుంటే మేలు. ►కర్బూజా, పుచ్చకాయలు, ఈత కాయలు, తాటి ముంజలు వంటి సీజనల్ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ►వేసవిలో రోజుకోసారి రాగిజావ తీసుకోవడం వల్ల కడుపులో చల్లగా ఉండటంతోపాటు మరెన్నో లాభాలు ఉన్నాయి. ►రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. చర్మ సంరక్షణ ముఖ్యం ►వేసవిలో సన్‌స్క్రీన్ లోషన్‌ని రాసుకోవడం వల్ల చర్మానికి సమస్యలు తగ్గుతాయి. ఈ సన్ స్క్రీన్ లోషన్‌ని బయటికి వెళ్లినప్పుడు మాత్రమే కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా అప్లై చేసుకోండి. సన్ స్క్రీన్ లోషన్ వాడటం వల్ల చర్మ సమస్యలు ఉండవు. అలాగే చర్మానికి రక్షణ ఉంటుంది. ►ఎండల్లో బయటకు వెళ్ళినప్పుడు చర్మాన్ని కవర్ చేసుకోవడం అవసరం. కాబట్టి మీరు బయటకు వెళ్లేటప్పుడు గొడుగుని తీసుకువెళ్లడం మర్చిపోకండి. అలానే ఎండాకాలంలో బయటకు వెళ్ళేటప్పుడు సన్ గ్లాసెస్‌ని ధరించడం, తలకు పెద్ద టోపీ పెట్టుకోవడం పైగా ఎలాంటి సమస్యలూ రావు. చదవండి: ఇరవై మందార పూలు.. మెంతులు.. పచ్చకర్పూరం! ఇలా చేస్తే ఒత్తైన కురులు -
టాప్ అమెరికా ఎంఎన్సీ సీఈవోగా ఇండో అమెరికన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్
న్యూఢిల్లీ: భారతీయ సంతతికి చెందిన బిజినెస్ ఎగ్జిక్యూటివ్ మరో టాప్ ఇంటర్నేషనల్ కంపెనీ కీలక ఎగ్జిక్యూటివ్‌గా నియమితులయ్యారు. అమెరికాలోని దిగ్గజ మల్టీ నేషనల్ కంపెనీ హనీవెల్ ఇంటర్నేషనల్ కొత్త సీఈఓగా విమల్ కపూర్ ఎంపికయారు. ప్రస్తుత సీఈవీ డారియస్ ఆడమ్జిక్ స్థానంలో కంపెనీ బాధ్యతలు స్వీకరిస్తారు. 57 ఏళ్ల కపూర్ ఏడాది జూన్ 1 నుంచి బాధ్యతలు చేపడతారని కంపెనీ ప్రకటించింది. అలాగే ఈ నెల(మార్చి) 13 నుంచి హనీవెల్ డైరెక్టర్ల బోర్డులో కూడా చేరతారని తెలిపింది తెలిపింది. విమల్ కపూర్ ప్రస్తుతం కంపెనీ ప్రెసిడెంట్, సీవోవోగా సేవలందిస్తున్నారు. పనిచేస్తున్నారు. అలాగే డారియస్ ఆడమ్జిక్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతారని హనీవెల్ స్పష్టం చేసింది. 2018లో ఛైర్మన్‌గా, 2017లోసీఈవోగా నియమితులైన ఆడమ్జిక్ నేతృత్వంలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 88 బిలియన్ డాలర్ల నుంచి 145 బిలియన్లకు డాలర్లకు పెరగడం విశేషం. పాటియాలాలోని థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి ఇన్స్ట్రుమెంటేషన్లో స్పెషలైజేషన్‌తో ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్‌గా పట్టభద్రుడయ్యారు. ఇండియాలో స్టడీ పూర్తి చేసిన తర్వాత కంపెనీలో చేరిన విమల్ అనేక కీలక పదవులను నిర్వహించారు. నిర్మాణ సాంకేతికతలతో పాటు పనితీరు మెటీరియల్స్ అండ్ టెక్నాలజీ యూనిట్ల సీఈవోగా సేవలందించారు. వైవిధ్యభరిత తయారీదారుల వివిధ వ్యాపారాలకు నాయకత్వం వహించిన విమల్ కపూర్‌కు మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. హనీవెల్ సీఈవోగా నియమితులైన దాదాపు 10 నెలల తర్వాత మరో కీలక పదవికి ప్రమోట్ అయ్యారు. అమెరికన్ లిస్డెడ్ కంపెనీహనీవెల్ ఇంటర్నేషనల్.. ఏరోస్పేస్, బిల్డింగ్ టెక్నాలజీస్, పెర్ఫార్మెన్స్ మెటీరియల్స్ అండ్ టెక్నాలజీస్, సేఫ్టీ అండ్ ప్రొడక్టివిటీ సొల్యూషన్స్ వ్యాపారాలను నిర్వహిస్తోంది -
ఆత్మీయ అతిథులకు అటవీ ఉత్పత్తులు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ఆర్థిక పురోభివృద్ధిలో కొత్త చరిత్ర సృష్టిస్తూ విశాఖ వేదికగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా దేశ విదేశీ ప్రముఖులకు ఆత్మీయ ఆతిథ్యంతోపాటు మధుర స్మృతులను మిగిల్చే కానుకలు సిద్ధమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక జ్ఞాపికల కిట్స్‌తో పాటు గిరిజన సహకార సంస్థకు చెందిన ఉత్పత్తుల కిట్లను కూడా అందించనున్నారు. జీఐఎస్ సదస్సుకు దాదాపు 3 వేల మంది ప్రముఖులతో కలిపి మొత్తం 8 వేల మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరందరికీ కలకాలం గుర్తుండే ఆతిథ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ జ్ఞాపకాల్ని తమతో మోసుకెళ్లేలా ప్రత్యేక కానుకలు అందించనున్నారు. స్వచ్ఛమైన ప్రేమను పంచే గిరిజనులు సేకరించిన కల్తీ లేని ఉత్పత్తులను కానుకగా ఇవ్వనున్నారు. నాణ్యమైన జీసీసీ ఉత్పత్తుల్ని దేశ విదేశీ ప్రముఖులకు పరిచయం చేయాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు జీసీసీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, జీసీసీ ఎండీ సురేష్‌కుమార్ తెలిపారు. ఈ సమ్మిట్‌కు హాజరైన ప్రముఖులకు జీసీసీ గిఫ్ట్స్‌ను అందించనున్నారు. ఇందుకోసం 200 కిట్లను జీసీసీ సిద్ధం చేసింది. నాణ్యమైన తేనె, హెర్బల్ ఆయిల్, పెయిన్ రిలీఫ్ నుంచి అరకు కాఫీ వరకూ 12 రకాల జీసీసీ ఉత్పత్తులు ఈ కిట్లలో ఉంటాయి. -
చీమలందు తేనెచీమలు వేరయా!
తేనెటీగలు ఉంటాయి గాని, తేనెచీమలు ఏమిటనేగా మీ అనుమానం? చీమలందు తేనెచీమలే వేరు! భూమ్మీద ఎన్నోరకాల చీమలు ఉన్నా, వాటిలో తేనెను సేకరించే జాతి ఒక్కటే! అరుదైన ఈ చీమలను ‘హనీపాట్ యాంట్స్’ అంటారు. ఈ చీమలు నిరంతరం కష్టించి, తేనెను సేకరించి, తమ పుట్టల్లో నిల్వ చేసుకుంటాయి. రకరకాల మొక్కల నుంచి ఇవి పొట్ట నిండా తేనెను సేకరిస్తాయి. నెమ్మదిగా తమ స్థావరానికి చేరుకున్నాక, కదల్లేని స్థితిలో పుట్టల పైకప్పును పట్టుకుని వేలాడుతుంటాయి. తమ సాటి చీమలకు అవసరమైనప్పుడు తమ పొట్టలో దాచుకున్న తేనెను బయటకు వెలిగక్కుతాయి. ఆహారం దొరకని పరిస్థితుల్లో దాచుకున్న తేనెనే ఆహారంగా స్వీకరించి బతుకుతాయి. ఈ జాతికి చెందిన చీమలు ఎక్కువగా అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, మెక్సికో దేశాల్లోని ఎడారి ప్రాంతాల్లోను, బీడు భూముల్లోను కనిపిస్తాయి. -
వెరీ ఇంట్రెస్టింగ్.. తేనెను మాత్రమే తిని జీవించే పక్షి.. ప్రత్యేకతలివే..
పెద్దదోర్నాల(ప్రకాశం జిల్లా): విమాన వేగంతో ఆకాశంలో నిరంతరం సంచరిస్తూ నల్లమల అభయారణ్యంలోని పక్షి జాతులకు మకుటం లేని మహారాజులు ఈ గద్దజాతి పక్షులు. అభయారణ్యంపై నిరంతర నిఘాతో ఆకాశం నుండే ఆహారాన్ని గుర్తించి, క్షణంలోనే దానిపై వాలి సేకరించటం ఈ పక్షుల ప్రత్యేకత. గద్ద జాతిలో అరుదైన గద్ద హనీ బజార్డ్. తేనెను మాత్రమే ఆహారంగా తీసుకుని జీవించే ఇటువంటి ప్రత్యేక ఆహారపు అలవాట్లు కలిగిన హనీ బజార్డ్ గద్దపై ప్రత్యేక కథనం.. అభయారణ్యంలోని క్రిమి కీటకాలు, వన్యప్రాణుల కళేబరాలు, పెరుగుతున్న పాముల సంతతి తదితర వాటిని నియంత్రిస్తూ ఎప్పటికప్పుడు ప్రకృతి సమతుల్యాన్ని కాపాడుతున్న గద్దలు ప్రకృతిలో ఎంతో ముఖ్యమైనవి. నల్లమల అభయారణ్యంలో నైతిక ధైర్యంతో మిగతా జీవులకు ఆదర్శంగా నిలిచే గద్దల జీవనశైలి ఎంతో ముఖ్యమైనది. నల్లమలలో క్రెస్టడ్ సర్పెంటీగల్, షార్ట్టౌడ్ స్నేక్ ఈగల్, క్రెస్టడ్హార్డ్ ఈగల్, బోనెల్లీస్ ఈగల్, శిఖర, బ్లాక్ షోల్డర్ కైట్, బ్లాక్ ఈగల్ లాంటి గద్ద జాతులు సంచరిస్తుంటాయి. పర్యావరణాన్ని సంరక్షించే గద్ద జాతులు: నల్లమల అభయారణ్యంలో ఎన్నో రకాల వన్యప్రాణులతో పాటు, ఆకాశంలో సంచరించే పక్షి జాతులు కూడా ఎక్కువే. పక్షి సంతతిలో అత్యంత ముఖ్యమైనవిగా ప్రాచుర్యం పొందిన గద్దలు ప్రకృతిని, పర్యావరణాన్ని సంరక్షించి వాతావరణాన్ని సమతుల్యంగా ఉండేందుకు దోహద పడుతున్నాయి. ప్రకృతిలో ఎక్కువవుతున్న పాములు, క్రిమి కీటకాలు, మిడతలు, కుందేళ్లు తదితర వాటిని ఆహారంగా తీసుకోవటంతో పాటు నల్లమలలో జంతువులు వేటాడిన మృతకళేబరాలను భక్షిస్తూ ఎప్పటికప్పుడు నల్లమలను స్వచ్ఛంగా ఉంచేందుకు దోహద పడుతున్నాయి. సహజంగా మాంసాహార జాతులైన గద్దలు కొనతేలిన ముక్కు, పొడవైన రెక్కలతో, ఎంత బరువున్న ఆహారాన్నైనా సునాయాసంగా తీసుకెళ్లే నైపుణ్యం కలిగి ఉంటాయి. వీటిలో ముఖ్యంగా క్రిస్టడ్ సర్పెంటీగల్, షార్ట్టౌడ్ స్నేక్ ఈగల్‌లు దట్టమైన అభయారణ్యంలోని గడ్డి మైదానాలను, ఆ ప్రాంతంలో సంచరిస్తున్న పాములను గుర్తించి వాటిని గురి చూసి వేటాడటం వీటి ప్రత్యేకత. క్రెస్టడ్హార్డ్ ఈగల్, బోనెల్లీస్ ఈగల్‌లు అభయారణ్యంలోని కుందేళ్లను ఎక్కువగా వేటాడి చంపుతుంది. ఒక్కో సారి గొర్రెలు, మేకల పిల్లలనుసైతం అవలీలగా ముక్కున కరుచుకుని పోయేటంత బలం వీటికి ఉంటుంది. శిఖర, బ్లాక్ షోల్డర్ కైట్, బ్లాక్ ఈగల్ తదితర రకాల గద్దలు మాత్రం మిడతలు, తొండలు, కీటకాలను ఆహారంగా తీసుకుని జీవనాన్ని కొనసాగిస్తాయి. నల్లమలలో సంచరించే గద్దలపై శ్రీశైలం ప్రాజెక్టు బయోడైవర్సిటీలో ఎన్నో రకాల పరిశోధనలు జరుగుతున్నాయి. నైతిక ధైర్యానికి నిదర్శనం: సహజంగా 70 ఏళ్ల పాటు జీవించే గద్దలకు 40 ఏళ్లు వచ్చే సరికి ఎన్నో జీవన్మరణ సమస్యలు ఎదురవుతాయి. ఆ సమయంలోనే అవి ఎంతో మానసిక స్దైర్యంతో తమ సమస్యను ఎదుర్కొని పునర్జన్మ ఎత్తి మరో ముప్పై ఏళ్ల పాటు జీవిస్తాయి. సాధారణంగా పొడవుగా, వాడిగా, పదునుగా ఉండే దాని ముక్కు నిరంతర రాపిడి వల్ల అరిగిపోతుంది. వాడిగా, పొడువుగా ఉండి సులభంగా ఒంగి ఆహారాన్ని తీసుకు పోయేందుకు ఉపకరించే కాలిగోళ్లు సైతం తమ సామరాధ్యన్ని కోల్పోతాయి. దీంతో పాటు పెరిగిన వయసు వల్ల బరువైన రెక్కలు, దట్టమైన ఈకలు దాని గుండెకు హత్తుకు పోయి ఎగరటంలో కష్టాన్ని కలిగిస్తాయి. దీంతో నిర్వీర్యమైన పరిస్థితిలో ఉన్న గద్దలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుని శరీర పునర్నిర్మాణాన్ని చేపడతాయి. ఆ క్రమంలో అవి ఎత్తైన పర్వతాల మీదకు చేరుకుని అక్కడ కొండ రాళ్లకు తన ముక్కును ఢీకొడుతూ దాన్ని రాల్చి కొత్త ముక్కు వచ్చేంత వరకు వేచి ఉంటాయి. కొత్త ముక్కు రాగానే దాని సహాయంతో దాని పాత రెక్కలను పీకేసి కొత్త రెక్కలు వచ్చే వరకు వేచి ఉంటాయి. ఇలా ఐదు నెలల పాటు ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని నైతిక ధైర్యంతో దాని జీవిత కాలాన్ని మరో 30 ఏళ్లు వరకు పొడిగించుకుంటాయి. తేనె మాత్రమే తినే హనీ బజార్డ్ నల్లమల అభయారణ్యంలో మిగతా గద్దలకు విభిన్నంగా తేనెను మాత్రమే సేవించి తమ జీవనాన్ని గడిపే గద్దలు ఉన్నాయంటే ఎవరికైనా ఆశ్చర్యమనిపిస్తుంది. అలా జీవించే గద్దలే హనీ బజార్డ్. వీటి జీవనశైలి ఎంతో విచిత్రమైంది. ఇవి నల్లమల అభయారణ్యం యావత్తూ ఆకాశంలో సంచరిస్తుంటాయి. వీటి ప్రయాణంలో ఎక్కడైనా తేనె తుట్టెలు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే అవి అక్కడ వాలి తేనెను సేకరిస్తుంటాయి. ఈ క్రమంలో అవి వాటి భారీ రెక్కలను విసురుతూ తేనెటీగలను తరిమి వేస్తాయి. ఆకాశం గుండా సంచరిస్తూ ఎంత దూరంలోని తేనె తుట్టలనైనా గుర్తించటం హనీ బజార్డ్ల ప్రత్యేకత. ఇవి తేనె తప్ప మిగతా ఎటువంటి ఆహారాన్ని ఇష్టపడవు. చదవండి: ఈ భార్యాభర్తలు మామూలోళ్లు కాదు.. సినిమా స్టైల్లో.. ఆ గద్దకు తేనే ఆహారం హనీ బజార్డ్లు తేనెను మాత్రమే తాగి జీవించే గద్దజాతి పక్షులు. అభయారణ్యంపై సంచరిస్తూ ఎక్కడ తేనె నిల్వలు ఉన్నా అక్కడ వాలి తేనెను సేకరించటం వీటి ప్రత్యేకత. కొన్ని గద్ద జాతులు పాములు, సరీసృపాలు, కీటకాలను భక్షించి పర్యావరణ సమతుల్యతను కాపాడుతుంటాయి. గద్దలు నైతిక ధైర్యానికి ప్రతీకలు. ఇవి జీవితంలో కఠినమైన ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొని విజయాన్ని సాధిస్తాయి. – షేక్ మహమ్మద్ హయాత్, ఫారెస్టు రేంజి అధికారి, శ్రీశైలం బయోడైవర్సిటీ. -
సీఎం జగన్ ను కలిసిన చిన్నారి హనీ, తల్లీదండ్రులు
-
సీఎం జగన్‌ను కలిసిన చిన్నారి హనీ, తల్లిదండ్రులు
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన చిన్నారి హనీ, తల్లిదండ్రులు కలిశారు. అరుదైన గాకర్స్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి చికిత్స కోసం గతంలో కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్న సీఎంను హనీ తల్లిదండ్రులు నాగలక్ష్మి, రాంబాబులు కలిశారు. దీంతో అప్పటికప్పుడే చిన్నారి చికిత్స కోసం సీఎం జగన్ రూ.1 కోటి మంజూరు చేశారు. చిన్నారి హనీ చికిత్సకు అవసరమైన ఖరీదైన ఇంజక్షన్లతో పాటు నెలకు రూ.10వేలు పెన్షన్ కూడా ప్రభుత్వం అందిస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో చికిత్స అందుకుంటూ చిన్నారి హనీ ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంది. అయితే ఈ రోజు హనీ పుట్టినరోజు సందర్భంగా సీఎం జగన్‌ను కలిసి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపగా, సీఎం చిన్నారిని ఆశీర్వదించారు. చదవండి: (‘సీఎం జగన్ మాటిచ్చారు.. నెరవేర్చారు’) -
Natural Beauty Tips: నిమ్మరసం, కీరా జ్యూస్, ఆలివ్ ఆయిల్‌తో ఇలా చేస్తే..
►తాజా నిమ్మరసం చర్మం రంగును మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడుతుంది. ఒక టీ స్పూను తాజా నిమ్మరసం, రెండు టీ స్పూన్లు కీరా జ్యూస్, ఆలివ్ ఆయిల్ మూడు టీ స్పూన్లు తీసుకుని మూడింటినీ కలుపుకోవాలి. ముందుగా నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. వేళ్ళతో నెమ్మదిగా రబ్ చేయాలి. ఆ తర్వాత సబ్బుతో కడిగేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికే కాకుండా శరీరమంతా కూడా అప్లై చేసుకోవచ్చు. స్నానానికి వెళ్ళే ముందు ఈ చిట్కా పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా ప్రతిరోజూ స్నానానికి ముందు చేయడం వల్ల మీ చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా తయారవుతుంది. అర టీస్పూన్ గంధపు పొడిలో తగినంత రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా మూడు రోజులకోసారి చేస్తూ వుంటే ముడతలు తగ్గడంతో ΄ాటు ముఖ కాంతి మెరుగుపడుతుంది. నల్లమచ్చల నివారణకు... ► నాలుగు తులసి ఆకులు, పావు టీస్పూన్ పసుపు కలిపి పేస్ట్ చెయ్యాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి15 నిమిషాలు ఉంచి కడిగేయాలి. ► అరచేతిలో టీ స్పూన్ తేనె తీసుకుని రెండు రేకల కుంకుమ పువ్వుని వేసి రంగరించాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, 15 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా చేస్తే క్రమంగా నల్ల మచ్చలు తగ్గుముఖం పడతాయి. -
‘సీఎం జగన్ మాటిచ్చారు.. నెరవేర్చారు’
సాక్షి అమలాపురం: ‘మాట తప్పరు.. మడమ తిప్పరు’ అనే విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. అల్లవరం మండలం నక్కా రామేశ్వరానికి చెందిన చిన్నారి కొప్పాడి హనీ కాలేయానికి గాకర్స్ వ్యాధి సోకి బాధపడుతోంది. అరుదైన ఈ వ్యాధికి రూ.కోటి ఖరీదైన వైద్యం అందించేందుకు సీఎం హామీ ఇచ్చారు. దానిని అమలు చేసి చూపించారు. అక్కడితో ఆగలేదు.. ఆ పాప ఆలనాపాలనా కోసం నెలకు రూ.10 వేల చొప్పున పింఛన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. అక్టోబర్‌లో తొలి ఇంజెక్షన్ హానీకి ప్రతి 15 రోజులకు ఒకసారి రూ.74 వేలు విలువ చేసే సెరిజైమ్ ఇంజెక్షన్ చేయాల్సి ఉంది. తొలి విడతగా రూ.10 లక్షలతో 13 ఇంజెక్షన్లు తెప్పించారు. మరో రూ.40 లక్షలతో 52 ఇంజెక్షన్లు తెప్పించేందుకు చర్యలు తీసుకున్నారు. అక్టోబర్ 2వ తేదీన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, అమలాపురం మునిసిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణి స్థానిక ఏరియా ఆస్పత్రిలో తొలి ఇంజెక్షన్ అందజేశారు. ప్లకార్డు చూసి... స్పందించిన సీఎం గత ఏడాది జూలై 26న గోదావరి వరదల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోనసీమలో పర్యటించారు. బాధితులను పరామర్శించి గంటిపెదపూడిలోని హెలీప్యాడ్ వద్దకు తిరిగి వెళుతున్న సీఎం జగన్‌కు ‘సీఎం గారూ.. మా పాపకు వైద్యం అందించండి’ అని ప్లకార్డు పట్టుకుని హనీ తల్లిదండ్రులు కనిపించారు. వారిని తన వద్దకు పిలిపించుకున్న సీఎం వైఎస్ జగన్ హనీకి వచి్చన కష్టం వివరాలు తెలుసుకుని పాప వైద్యానికి తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. నెలవారీ రూ.పది వేల పింఛన్ రూ.కోటి విలువైన వైద్యానికి అంగీకరించడమే కాదు... హనీ ఆలనాపాలనా చూసేందుకు నెలకు రూ.10 వేల చొప్పున పింఛన్ అందేలా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జనవరి నెల నుంచి ఆ బాలికకు పింఛన్ అందిస్తున్నారు. ఈ నెల 6వ తేదీన కలెక్టర్ శుక్లా తొలి పింఛన్‌ను హనీ కుటుంబ సభ్యులకు అందజేశారు. సీఎం జగన్ ఆదేశాలతో హనీకి అమలాపురం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఉచితంగా విద్యను అందించేందుకు ఏర్పాట్లు చేశారు. -
'వీర సింహారెడ్డి' వైఫ్ హనీరోజ్ బ్యూటిఫుల్ ఫోటోలు
-
తేనెటీగలే కాదు.. చీమలు కూడా తేనెను ఉత్పత్తి చేస్తాయని తెలుసా?
తేనె అనగానే మనకు గుర్తొచ్చేది తేనెటీగలే. అవి వివిధ రకాల పూల నుంచి మకరందాన్ని సేకరించి తేనెను ఉత్పత్తి చేస్తాయి. అందులోనూ కొన్నిరకాలే ఈ పనిచేస్తాయి. మరి వీటికి పూర్తి భిన్నంగా ఉండే ఒక రకం చీమలు కూడా తేనెను ఉత్పత్తి చేస్తాయి తెలుసా?.. ఈ చీమల తేనె, దాని సేకరణ, నిల్వ విధానం చాలా చిత్రంగా ఉంటుంది కూడా.. ఆ వివరాలేమిటో తెలుసుకుందాం.. కరువులో వాడుకొనేందుకు.. సాధారణంగా చాలా రకాల జీవులు ఎప్పుడైనా ఆహారం దొరకని పరిస్థితుల్లో వాడుకొనేందుకు వీలుగా నిల్వ చేసుకుంటూ ఉంటాయి. అది అవి మామూలుగా తినే ఆహారమే అయి ఉంటుంది. కానీ ఆ్రస్టేలియా, అమెరికా, మెక్సికోతోపాటు పలు ఆఫ్రికా దేశాల్లోని ఎడారి భూముల్లో ఉండే ఒక రకం చీమలు ఏకంగా తేనెను నిల్వ చేసుకుంటాయి. అది కూడా చిత్రమైన పద్ధతిలో కావడం విశేషం. ఇవి కాంపోనోటస్ ఇన్ఫ్లాటస్ జాతికి చెందినవి. సింపుల్‌గా హనీపాట్ చీమలు అని పిలుస్తుంటారు. శరీరంలోనే ‘తేనె’నిల్వ ► సాధారణంగా తేనెటీగలు తమ నోటిద్వారా పూల నుంచి మకరందాన్ని సేకరించి.. దానిని ప్రత్యేకమైన పట్టుల్లో నిల్వచేస్తాయి. కానీ ఈ చీమలు తేనెను నిల్వ చేయడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లేమీ ఉండవు. వాటి శరీరంలోనే తేనెను నిల్వ చేసుకుంటాయి. అందుకే వీటిని హనీపాట్ చీమలు అని పిలుస్తుంటారు. ► సాధారణంగా చీమల కాలనీల్లో వేర్వేరు విధులను వేర్వేరు చీమలు నిర్వహిస్తుంటాయి. ఇలా వర్కర్ చీమలు పూల నుంచి మకరందాన్ని సేకరించుకుని వచి్చ.. పుట్టలోనే ఉండే హనీపాట్ చీమల నోటికి అందిస్తాయి. హనీపాట్ చీమలు దానిని తేనెగా మార్చి తమ కడుపులో నిల్వ చేస్తాయి. ► ఈ నిల్వ ఏ స్థాయిలో ఉంటుందంటే.. హనీపాట్ చీమల కడుపు పగిలిపోతుందేమో అన్నంతగా తేనెను నింపుకొంటాయి. ఆ బరువుతో కదలలేక.. పుట్టలో గోడలను పట్టుకుని చాలా రోజులు అలాగే ఉండిపోతాయి. ► పుట్టలోని చీమలకు ఆహారం కొరత తలెత్తినప్పుడు.. ఈ హనీపాట్ చీమల కడుపు నుంచి తేనెను బయటికి తీసి తినేస్తాయి. ఒక్కోసారి ఇతర పుట్టల చీమలు.. హనీపాట్ చీమలున్న పుట్టపై దాడిచేసి తేనెను ఎత్తుకుపోతుంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ చీమలు.. బహుమతులు సాధారణ తేనెతో పోలిస్తే ఈ చీమల తేనె తీపిదనం తక్కువని, కాస్త పుల్లటి రుచి కూడా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చీమల తేనెలో గ్లూకోజ్ చక్కెర శాతం ఎక్కువని.. అదే తేనెటీగల తేనెలో ఫ్రక్టోజ్ రకం చక్కెర అధికమని వివరించారు. ఆ్రస్టేలియాలో స్థానిక తెగల ప్రజలు తేనెచీమలను సేకరించి బహుమతిగా ఇచ్చి పుచ్చుకుంటారట కూడా. చదవండి: మనసు మాట వినే చక్రాల కుర్చీ! -
థాంక్యూ జగనన్న.. మా పాప ప్రాణాన్ని నిలబెట్టారు
అమలాపురం టౌన్: గాకర్స్ వ్యాధి బాధితురాలు చిన్నారి హనీ తల్లిదండ్రులు కొప్పాడి రాంబాబు, నాగలక్ష్మిలు ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి జోగి రమేష్, రాష్ట్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, వారు.. చిన్నారి హనీతో పాటు విజయవాడకు వెళ్లి ప్రభుత్వ ప్రతినిధులను మంగళవారం కలిశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు, కమిషనర్ నివాస్, ఏపీ ఎంఎస్ఐడీఎస్ డైరెక్టర్ డి.మురళీధరరెడ్డిలను వారు వేర్వేరుగా కలిసి మాట్లాడారు. వీరంతా చిన్నారి హనీని ఎత్తుకుని మరీ ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే సీఎం జగన్‌ను కలిసే ఏర్పాటు చేస్తామన్నారని తండ్రి రాంబాబు ‘సాక్షి’కి తెలిపారు. వరదల పరిస్థితిని చూసేందుకు కోనసీమకు వచ్చిన సీఎం జగన్ చిన్నారి హనీ పరిస్థితిని తెలుసుకుని చలించారు. పాప వైద్యానికి ప్రభుత్వం తరఫున ఖర్చు చేస్తామని బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. కలెక్టర్ హిమాన్షు శుక్లాను ఏర్పాట్లు చేయమని ఆదేశించారు. దీంతో రూ.కోటి కేటాయించి, ఖరీదైన ఇంజెక్షన్లను అమెరికా నుంచి రప్పించి వైద్యం అందిస్తున్న విషయం తెలిసిందే. -
Beauty: బియ్యప్పిండి.. తేనె.. ట్యాన్ తగ్గుముఖం పట్టడం ఖాయం!
Honey Pack Benefits: ట్యాన్ తొలగి ముఖారవిందం ద్విగుణీకృతం కావాలా? సహజసిద్దమైన నిగారింపుతో మెరిసిపోవాలా? అయితే, తేనెతో వీటిని కలిపి ముఖానికి అప్లై చేయండి. మెరుగైన ఫలితాలు పొందవచ్చు. పెరుగుతో ►రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, టేబుల్ స్పూను తేనె తీసుకుని బాగా కలపాలి. ►ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ►పదిహేను నిమిషాల తరువాత కడగాలి. పసుపులో కలిపి ►టీ స్పూను తేనెలో అర టీస్పూను పసుపు వేసి బాగా కలిపి ముఖానికి రాసుకోవాలి ►ఇరవై నిమిషాల తరువాత కడిగేయాలి. ►ఈ రెండు ప్యాక్‌లను వారానికి మూడు సార్లు వేయడం వల్ల చర్మం మృదువుగా మారడమేగాక, ఆరోగ్యంగా ఉంటుంది. సహజసిద్ధ నిగారింపు ►రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండిలో టీస్పూను తేనె, టీస్పూను రోజ్ వాటర్ వేసి చక్కగా కలపాలి. ►ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి ►పదిహేను నిమిషాలపాటు అలాగే ఉండనివ్వాలి. ►బాగా ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ►ఈ ప్యాక్‌ను వారానికి ఒకసారి వేసుకోవడం వల్ల ముఖం మీద పేరుకు పోయిన ట్యాన్ తగ్గుముఖం పడుతుంది. ►రోజ్ వాటర్ ముఖానికి సహజసిద్ధ నిగారింపుని ఇస్తే, తేనె చర్మానికి తేమనందిస్తుంది. చదవండి: Beauty Tips: ట్యాన్, నల్ల మచ్చల సమస్యా? బియ్యం, రోజ్‌వాటర్.. ఇలా చేశారంటే Beard Shaving: రోజూ షేవింగ్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలిస్తే! -
Beauty Tips: మొటిమలు, వాటి తాలుకు గుంతల సమస్య వేధిస్తోందా? ఇలా చేస్తే
మొటిమల సమస్య వేధిస్తోందా? ఈ చిట్కాలు ట్రై చేసి చూడండి. ►పదిహేను పుదీనా ఆకుల్ని తీసుకుని మెత్తగా నూరాలి. ►దీనిలో రెండు టీస్పూన్ల ఓట్స్, రెండు టీస్పూన్ల కీరా రసం, టీస్పూను తేనె వేసి చక్కగా కలపాలి. ►ఈ మిశ్రమాన్ని మొటిమలపై పూతలా వేసుకుని ఇరవై నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. ►ఇలా చేయడం వల్ల మొటిమలు పోతాయి. తేనెతో పాటు.. పుదీనా ఆకుల పేస్టులో తేనె, రోజ్‌వాటర్ వేసి కలిపాలి. మొటిమలపైన పూతలా వేసుకుంటే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు పోతాయి. ఇలా కూడా! కొన్ని పుదీనా, కొన్ని తులసి ఆకులు తీసుకొని బాగా పిండాలి. ఒక నిమ్మకాయ తీసుకుని ఈ రసంలో పిండాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మొటిమలపై పూయాలి. ఆరిన తర్వాత ముఖం కడుక్కోవాలి. చర్మం గరుకుగా ఉంటే.. ముఖంపై చర్మం గరుకుగా అనిపిస్తోందా? అలాంటప్పుడు.. క్యాబేజీని ఉడికించిన నీళ్లలో కొద్దిగా శనగపిండి కలిపి ముఖానికి మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మారే అవకాశం ఉంటుంది. గుంతలు పోవాలంటే.. మొటిమలు తగ్గిన తర్వాత కూడా వాటికి సంబంధించిన గుంతలు అలాగే ఉంటాయి చాలా మందికి. ఈ సమస్య నుంచి బయపడాలంటే.. ఉడకపెట్టిన బంగాళదుంప గుజ్జును ఓ వారం పాటు రాత్రుళ్లు నిద్రపోయే ముందు ముఖానికి రాస్తే సరి! చదవండి: Hair Fall Control: అల్లం, ఆవాలు, లవంగాలతో.. ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా, పొడవుగా! Madhuri Dixit: వారానికి 3 సార్లు ఇలా చేస్తా! నా బ్యూటీ సీక్రెట్ అదే! -
Beauty: వారానికి 3 సార్లు ఇలా చేస్తా! నా బ్యూటీ సీక్రెట్ అదే: మాధురీ దీక్షిత్
Madhuri Dixit- Beauty Secret: అందం, అభినయానికి తోడు తనవైన స్టెప్పులతో బాలీవుడ్‌ను ఉర్రూతలూగించిన అలనాటి హీరోయిన్ మాధురీ దీక్షిత్. తొంభయవ దశకంలో యువత కలల రాణిగా వెలుగొందిన ఈ ముంబై నటి.. యాభై పదుల వయసులోనూ అందంతో కట్టిపడేస్తోంది. తన చర్మ సౌందర్యం వెనుక ఉన్న రహస్యాన్ని ఇటీవల అభిమానులతో పంచుకుంది. వయసును దాచేసే మంత్రం! ‘‘వయసుని కనిపించనివ్వని చర్మ సౌందర్యానికి ఏం చేస్తున్నారేంటి అని అభిమానులే కాదు.. నా తోటి నటీమణులూ అడుగుతుంటారు. స్కిన్‌కేర్ విషయంలో నేను ఇంటి చిట్కాలనే నమ్ముతా.. అది మా అమ్మమ్మ నుంచి నేర్చకున్నా. శనగపిండిలో కాసిన్ని తేనె చుక్కలు.. కొంత నిమ్మరసం కలిపి మొహానికి పట్టిస్తా.. పాలల్లో ముంచిన కీరా దోసకాయ ముక్కలను కళ్ల మీద పెట్టుకుని ఓ ఇరవై నిమిషాల పాటు రిలాక్స్ అవుతా. తర్వాత చన్నీళ్లతో మొహం కడిగేసుకుంటా. ఇలా వారానికి మూడుసార్లు చేస్తానంతే!’’ అంటూ తన బ్యూటీ సీక్రెట్ వెల్లడించింది మాధురి దీక్షిత్. కాగా 70కి పైగా సినిమాల్లో నటించిన మాధురీ.. టీవీ షోల్లో జడ్జీగా అభిమానులను అలరిస్తోంది. చదవండి: ఉల్లిపాయ రసంలో బాదం నూనె కలిపి జుట్టుకు పట్టిస్తున్నారా? కొబ్బరి నూనెలో ఆవాలు వేయించి ముఖానికి రాస్తే! -
Beauty Tips: ఇలా చేస్తే.. ముఖం మెరిసిపోతుంది! బ్యూటీ సీక్రెట్ చెప్పిన హీరోయిన్
Tara Sutaria- Beauty Secret: ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టిన ముంబై భామ తారా సుతారియా. అరంగేట్రంలోనే తన అందంతో యువతను ఫిదా చేసింది. తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇక మర్జావన్, తడప్, ఏక్ విలన్ రిటర్న్స్ వంటి సినిమాలతో ప్రేక్షకులకు చేరువైన తారా.. తన మెరిసే మేనికి అమ్మ చెప్పిన చిట్కాలే కారణం అంటోంది. ముఖం చంద్రబింబంలా మెరవాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలని చెబుతోంది. నా బ్యూటీ సీక్రెట్ ఏమిటంటే! ‘‘నా బ్యూటీ సీక్రెట్ మంచినీళ్లు, మా నేర్పిన హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్. పెరుగులో తేనె, శనగపిండి, కాస్త పసుపు కలిపి ప్యాక్‌లా తయారు చేసుకుని మొహానికి అప్లయ్ చేస్తా. అది కాస్త డ్రై అవుతోంది అనుకున్నప్పుడు చన్నీళ్లతో కడిగేసుకుంటా! మొహంలోని అలసట మాయమైపోయి.. గ్లో వచ్చేస్తుంది! నిజానికి ఈ హోమ్ మేడ్ చిట్కా మా అమ్మమ్మది. మా అమ్మ ఫాలో అయ్యింది.. ఇప్పుడు నేను! ఫాలో అవుతున్నా’’ అంటూ అందం వెనుక ఉన్న రహస్యాన్ని పంచుకుంది 26 ఏళ్ల తారా. చదవండి: Hair Care Tips: ముఖం జిడ్డుకారుతుందని పదేపదే షాంపుతో తలస్నానం చేస్తే! ఈ సమస్యలు తప్పవు! Beetroot Aloe Vera Gel: బీట్రూట్ అలోవెరా జెల్‌తో ముఖం మీది మచ్చలు మాయం! అయితే ఈ క్రీమ్ రాసిన తర్వాత.. -
Beauty Tips: వేప, తేనె, పాలు.. వారానికి మూడు సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే!
వర్షాకాలంలో సైతం కొంతమంది చర్మం తేమలేక పొడిబారడమే గాక, మొటిమలతో విసిగిస్తుంటుంది. ఇటువంటి చర్మానికి తేనె, వేప, పాలతో తయారైన ఫేస్‌ప్యాక్ మంచి పరిష్కారం చూపుతుంది. వేప.. మొటిమలను తగ్గిస్తే... తేనె చర్మానికి తేమనిస్తుంది. వారానికి మూడు సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే! రెండు టేబుల్ స్పూన్ల వేపాకు పేస్టులో టేబుల్ స్పూను తేనె, ఒకటిన్నర టేబుల్ స్పూన్ల పచ్చి పాలు పోసి పేస్టులా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఆరాక గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారంలో మూడుసార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మొటిమలు పోయి ముఖం ఫ్రెష్‌గా కనిపిస్తుంది. కాంతివంతమైన ముఖం కోసం.. ఒక స్పూను శనగపిండి, ఒక స్పూను పెరుగు, అర స్పూను తేనె కలిపి... ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి. రోజూ ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా ఉంటుంది. దీనిని అన్ని రకాల చర్మతత్వాల వాళ్లూ పాటించవచ్చు. అయితే డ్రైస్కిన్కి మీగడ పెరుగు, ఆయిలీ స్కిన్ వాళ్లు మీగడ లేని పెరుగు వాడాలి. చదవండి: Yami Gautam: నా బ్యూటీ సీక్రెట్ అదే! ఇలా చేస్తే చర్మం నిగనిగలాడుతుంది -
Beauty Tips: చింతపండు సిరప్‌తో మొటిమలు, మచ్చలు మాయం!
Benefits Of Tamarind Syrup: కూరల్లో పులుపు, రుచికోసం వాడే చింతపండు ఆరోగ్యాన్ని కాపాడడంలో, చర్మాన్ని అందంగా ఉంచడంలో ప్రముఖపాత్ర పోషిస్తుంది. చింతపండులో విటమిన్స్, ఐరన్, పొటాషియం, ఖనిజపోషకాలు, పీచుపదార్థంతోపాటు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల చింతపండు రోగాల నుంచి శరీరాన్ని కాపాడడమేగాక, శరీరానికి తగినంత రక్తాన్ని అందించి చర్మాన్ని మెరిపిస్తుంది. చింతపండులోని విటమిన్ సి ముఖం మీద మొటిమలు తొలగించి అందంగా ఉంచుతుంది. ఇన్ని గుణాలు ఉన్న చింతపండు సిరప్‌ను ముఖానికి రాసుకున్నా, నేరుగా తాగినా ఈ గుణాలన్నీ శరీరానికి పుష్కలంగా అందుతాయి. ఇంకెందుకాలస్యం... చింతపండు సిరప్ తయారీ, వాడకం గురించి తెలుసుకుందాం... ఇలా చేయండి.. ►చింతపండుని నీళ్లలో మరిగించి వడగట్టాలి. ►ఈ నీటిలో కొద్దిగా తేనె లేదా బెల్లం వేసి బాగా కలపాలి. ►దీనిలో నాలుగైదు ఐస్‌ముక్కలు వేస్తే చింతపండు సిరప్ రెడీ! దీనిని నేరుగా తాగేయాలి. మొటిమలు, మచ్చలు మాయం! ►చింతపండు మరిగించిన నీటిలో కొద్దిగా తేనెవేసి ముఖానికి అప్లై చేయాలి. ►ఇరవైనిమిషాలపాటు మర్దనచేసి ఆరాక కడిగేయాలి. ►వారానికి రెండుమూడుసార్లు ఈ విధంగా చేయడం వల్ల ముఖం మీద మొటిమలు, మచ్చలు పోయి ముఖం కాంతిమంతంగా మారుతుంది. ►సిరప్‌ను తరచూ తాగినా ఆరోగ్యంతోపాటు, చర్మం అందంగా మెరుస్తుంది. చదవండి: Benefits Of Onion Juice: ఉల్లి రసాన్ని కొబ్బరి నూనెతో కలిపి జుట్టుకు పట్టిస్తే! నల్లని, ఒత్తైన కురులు..! Sonakshi Sinha: అమ్మ చెప్పింది.. ఇలా చేస్తే మొటిమలు, మచ్చలు, ట్యాన్ దరిచేరవు! -
Hair Care Tips: ఉల్లి రసాన్ని కొబ్బరి నూనెతో కలిపి జుట్టుకు పట్టిస్తే!
Hair Care Tips In Telugu: ఉల్లి లేని కూరలను.. ఉప్పు లేని పప్పు చారుతో పోల్చుతారు కొంతమంది. ఎందుకంటే ఉల్లి వల్ల వంట రుచికరంగా ఉండడంతోపాటు ఆరోగ్యానికీ ఎంతో మేలు. అలాగే. ఉల్లి వల్ల జుట్టుకు కూడా ఎంతో మంచిదని ఇటీవల కాలంలో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ►ఉల్లి రసాన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది. ముఖ్యంగా ఇది జుట్టును ఊడిపోకుండా కాపాడుతుంది. అందుకు ఏం చేయాలంటే..? ►ఉల్లిని మెత్తగా గ్రైండ్ చేసి.. దాన్నుంచి రసాన్ని తీసి.. ఒక గిన్నెలో నిల్వ చేసి కొబ్బరి నూనెలో కలిపి జుట్టుకు రాసుకుంటూ ఉండాలి. ►ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ►ఈ నూనెను గోరువెచ్చగా వేడి చేసు రాసుకున్నా మంచిదే. ఈ నూనె బట్టతల సమస్యలు రాకుండా కాపాడుతుంది. మెరిసే జుట్టును సొంతం చేసుకునేందుకు ఇలా చేయండి తేనె, ఆలివ్ ఆయిల్.. ►టీ స్పూన్ తేనె, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, టీస్పూన్ నిమ్మరసం కలపాలి. ►ఈ మిశ్రమాన్ని కోడిగుడ్డులోని తెల్లసొనని వేసి కలపాలి. ►దీనిని కుదుళ్ల నుంచి జుట్టుకి పట్టించాలి. ►20 నిమిషాల తరువాత తల స్నానం చేయాలి. కరివేపాకుతో.. ►కప్పు కొబ్బరినూనె, ఒక కప్పు ఆవాల నూనె కలపాలి. ►ఈ మిశ్రమంలో ఒక కప్పు కరివేపాకుల్ని వేసి రాత్రంతా నానబెట్టాలి. ►మరుసటి రోజు ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలో పోసి చిన్న మంట పై వేడి చేయాలి. ►కరివేపాకు కాస్త వేగగానే నూనె మిశ్రమంలోంచి తీసేయాలి. ►ఆ తరువాత దింపేసి మూడు కర్పూరం బిళ్లలు వేయాలి. ►చల్లారిన తరువాత నూనె మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి జుట్టుకంతా పట్టించి రాత్రంతా అలాగే ఉంచి, మరుసటి రోజు తలస్నానం చేయా లి. ►ఇలా వారంలో రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చదవండి: Health Tips: కాలీఫ్లవర్, క్యారెట్లు, బీట్రూట్, పుట్టగొడుగులు అతిగా తింటే అంతే సంగతులు! కాస్త.. -
మ్యాడ్ హనీ: అధిక మోతాదులో తీసుకుంటే డేంజరే
తేనె ఆరోగ్యానికి మేలు చేస్తుంది... దాని తీయటి రుచి చిన్నారులకూ తెగ నచ్చుతుంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ అదే తేనె మనకు హాని కలిగిస్తే?! శారీరక, మానసిక అనారోగ్యానికి దారితీస్తే? అయినప్పటికీ వేల ఏళ్లుగా ఇది వాడకంలోనే ఉంటే..! ఏమిటీ విచిత్రం అని అవాక్కవుతున్నారా? ఆగండాగండి.. అన్ని ప్రాంతాల్లో లభించే సాధారణ తేనె రకాల్లో ఈ లక్షణాలు ఉండవులెండి. కేవలం నేపాల్‌లోని హిమాలయ పర్వతసానువుల్లో లభించే అత్యంత అరుదైన, ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైనదిగా పరిగణించే ‘మ్యాడ్ హనీ’లోనే ఈ ప్రత్యేకత ఉంది. దీన్ని పరిమిత మోతాదులో సేవిస్తే కాస్త కళ్లుతిరగడంతోపాటు చెప్పలేనంత ఉత్తేజం, ఉల్లాసం లభిస్తుంది. అందుకే దీన్ని ‘మ్యాడ్’ హనీ అని పిలుస్తారు. పర్వత ప్రాంతాల్లో పెరిగే రోడోడెండ్రాన్ జాతి మొక్కలు ఉత్పత్తి చేసే గ్రెయనోటాక్సిన్ అనే రసాయనం మకరందం, పుప్పొడిలో ఉండటం, వాటినే తేనెటీగలు సేకరించడం ఈ తేనెలో విచిత్ర లక్షణాలకు కారణం. కానీ ఉల్లాసం కలిగిస్తుంది కదా అని దీన్ని అధిక మోతాదులో తీసుకుంటే మాత్రం డేంజరే. వాంతులు, మూర్ఛ, భాంత్రి భావనలతోపాటు అరుదైన సందర్భాల్లో మరణం కూడా సంభవిస్తుంది. చదవండి: పొదలమాటున నక్కి.. ఒక్క ఉదుటున మొసలిపై దూకి..వాట్ ఏ పవర్ దీనికితోడు మామూలు తేనె తియ్యగా ఉంటే ఈ తేనె భరించలేనంత చేదుగా ఉంటుంది! మరి ఇంత ప్రమాదకరమైన తేనెను తీసుకోవడం ఎందుకంటారా? లైంగిక సామర్థ్యం పెంచే ఔషధంగా, ఉదర సంబంధ వ్యాధులకు ప్రత్యామ్నాయ చికిత్సా పద్ధతుల్లో దీన్ని వాడుతున్నందుకే. దీన్ని సేకరించడమూ ఎంతో కష్టంతో కూడుకున్నదే. సముద్రమట్టానికి 3,900 అడుగుల నుంచి సుమారు 11,800 అడుగుల ఎత్తులో కొండల అంచున తేనెటీగలు తేనెపట్టును భద్రపరుచుకుంటాయి. అందుకే అనుభవజ్ఞులైన స్థానికులకే ఈ తేనె సేకరణ సాధ్యం. ఇది ఎక్కువగా నేపాల్‌లోనే లభిస్తున్నప్పటికీ టర్కీలోని నల్ల సముద్ర ప్రాంతంలోనూ దొరుకుతుందట. క్రీస్తుపూర్వం 2,100 నుంచే మ్యాడ్ హనీ పర్వత ప్రాంతాల్లో లభిస్తోందని 2018లో జరిగిన ఓ అధ్యయనం తేల్చింది. -
Beauty Tips: నల్ల మచ్చలు వేధిస్తున్నాయా? ఈ సులభమైన చిట్కాలతో..
ముఖం మీద మొటిమల మచ్చలు, గీతలు ఉంటే ఇబ్బంది పడతారు చాలా మంది. బ్యూటీ పార్లర్లకు వెళ్లి డబ్బు ఖర్చు చేస్తారు. అయితే, ఇంట్లోనే కొద్దిపాటి శ్రద్ధ తీసుకుంటూ ఈ చిట్కాలు పాటిస్తే మీ ముఖారవిందం మీకే కనువిందు చేస్తుంది. తేనె, రోజ్ వాటర్ వేసి.. ►రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండిలో టీస్పూను తేనె, టీస్పూను రోజ్ వాటర్ వేసి చక్కగా కలపాలి. ►శుభ్రంగా కడిగి పొడిగా తుడిచిన ముఖానికి ఈ మిశ్రమాన్ని అప్లై చేసి ఇరవై నిమిషాలపాటు ఆరనివ్వాలి. ►తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ►వారానికి ఒకసారి ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖం మీద నల్లటి మచ్చలు, ట్యాన్ వల్ల ఏర్పడిన నలుపు పోతుంది. ►రోజ్ వాటర్ చర్మానికి సహజసిద్ధమైన మెరుపునిస్తే, తేనె చర్మానికి లోపలినుంచి తేమనందించి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి కూడా పాటిస్తే... ►ఒక టేబుల్ స్పూన్ తేనెలో టీ స్పూన్ నిమ్మరసం, చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాయాలి. ►ఇలా ప్రతిరోజూ చేస్తుంటే మూడు వారాలకు ఫలితం కనిపిస్తుంది. ►ముఖం మీదున్న నల్ల గీతలు, మచ్చలు తొలగిపోయి చంద్రబింబంలా మెరుస్తుంది. బంగాళా దుంపతో.. ►ఒక టేబుల్ స్పూన్ బంగాళదుంప తురుములో ఐదారు చుక్కల నిమ్మరసం, అంతే మోతాదులో తేనె కలిపి ముఖానికి పట్టించాలి. ►కొంచెం మంటగా ఉంటుంది. కాబట్టి ముఖమంతా పట్టించవద్దనుకుంటే మచ్చల మీద మాత్రమే రాయవచ్చు. ►ఇరవై నిమిషాల తర్వాత చన్నీటితో కడగాలి. ►అయితే పిగ్మెంటేషన్, సన్‌బర్న్ వంటి సమస్యలకు పై ప్యాక్‌ను ముఖమంతా వేస్తే మంచి ఫలితం ఉంటుంది. వేపాకులతో.. ►వేపాకులను పచ్చిగా కాని ఉడికించి కాని పేస్టు చేసి ముఖానికి రాస్తే మచ్చలు, గుల్లలు విస్తరించకుండా తగ్గిపోతాయి. చదవండి: Anushka Sharma Beauty Secret: టీనేజ్‌లో ఉన్నపుడు అమ్మ చెప్పింది.. నా బ్యూటీ సీక్రెట్ అదే! Smart Necklace: నెక్లెస్ ఉంటే ఆరోగ్యం పదిలం... -
కర్ణాటక: తేనె రైతుకు ప్రధాని మోదీ ప్రశంసలు
సాక్షి, బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్‌లో కర్ణాటకలో నిర్వహించిన అమృత భారతికి కన్నడ హారతి కార్యక్రమాన్ని అభినందించారు. అలాగే తేనె ఉత్పత్తిలో కరావళి, మలెనాడు, ఉత్తర కన్నడ ప్రాంతాల్లో రైతులు చేస్తున్న కృషిని మోదీ కొనియాడారు. ఉత్తర కన్నడ జిల్లాలోని శిరసి తాలూకాలోని తేనె రైతు మధుకేశ్వర హెగ్డేను ఆయన ప్రస్తావించారు. హెగ్డే కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొంది 50 పెట్టెల తేనెటీగల పెంపకం ప్రారంభించారు. నేడు 800కు పైగా పెట్టెల్లో తేనెపట్లను పెంచుతున్నారు. మధు అంటే తేనె, ఆ పనిలో సాధన చేసి పేరును సార్థకం చేసుకొన్నారని మోదీ ప్రశంసించారు. -
అడవి బిడ్డలకు ఆర్థిక భరోసా
పార్వతీపురం టౌన్: ఆరు దశాబ్దాల కిందటి వరకూ గిరిజనులు నిలువు దోపిడీకి గురయ్యేవారు. గిరిజనులు పండించే పంటను మైదాన ప్రాంతం నుంచి వచ్చే వ్యాపారులు వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తక్కువ ధరకే కొనుగోలు చేసి వారి శ్రమను దోచుకునేవారు. గిరిజన గూడాల్లో జీసీసీలు ఏర్పడే వరకూ ఇదే తంతు సాగగంతో ఆర్థికంగా వారి బతుకులు కుదేలయ్యాయి. అయితే ఇప్పుడు గిరిజనుల సంపదకు వారే యజమానులు. గిరిజనుల నుంచి మద్దతు ధరకు ముడిసరుకును జీసీసీ (గిరిజన సహకార సంస్థ) కొనుగోలు చేస్తుండడంతో వారి మోముల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. ఇలా కొనుగోలు చేసిన సరుకులను మరింత నాణ్యమైన ఉత్పత్తులుగా మలిచి జీసీఎంఎస్ (గిరిజన్ కార్పొరేషన్ మార్కెటింగ్ సొసైటీ) ద్వారా జనం చెంతకు జీసీసీ(గిరిజన సహకార సంస్థ) చేర్చుతోంది. తక్కువ ధరలకే విక్రయిస్తూ అటు వినియోగ దారులు, ఇటు గిరిజనులకు లాభాల వారధిగా నిలుస్తోంది. దళారుల బారినుంచి గిరిజనులను కాపాడుతూ అధిక ఆదాయం అర్జించి పెడుతూ ఏటా రూ.కోట్ల విలువైన వ్యాపారం సాగిస్తోంది. ఉత్పత్తులు ఇలా.. గిరిజనుల నుంచి తేనె, చింతపండు, నరమామిడి వంటి దాదాపు 26 రకాల చిన్న తరహా అటవీ ఉత్పత్తులను ఏటా జీసీసీ కొనుగోలు చేసి 70 కేంద్రాల్లో నిల్వచేస్తోంది. ఏడు పారిశ్రామిక సదుపాయాల్లో ప్రాసెసింగ్ అనంతరం ఉత్పత్తులను మార్కెట్లో వినియోగదారులకు అందుబాటులోకి తేవడమే జీసీసీ లక్ష్యం. పసుపు, కుంకుమ, తేనె, షరబత్, షాంపూలు, సబ్బులు, కాఫీ పొడి తదితర 27 ఉత్పత్తులను రిటైల్‌గా ప్రత్యేక ఔట్లెట్లు, సూపర్ బజార్లు, రైతుబజార్లు, ఆన్‌లైన్‌లోనూ విక్రయిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం పరిసర గ్రామాలు పట్టణ ప్రాంతాల్లో స్టాల్స్ పెట్టి విక్రయాలు నిర్వహించడమే కాకుండా మొబైల్ సేవలను కూడా ప్రారంభించింది. మారుమూల పల్లెలకు గిరిజన ఉత్పత్తులను చేరవేస్తోంది. గిరిజనులకు ఆర్థిక ఊతం ప్రకృతి సిద్ధమైన గిరిజన ఉత్పత్తులు దళారుల పాలవకుండా మైదాన ప్రాంతాల ప్రజలకు చేరువ చేసేందుకు జీసీఎంఎస్ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టాం. రానున్న రోజుల్లో గిరిజన ఉత్పత్తులను ప్రజలందరికీ చేరువచేసే ప్రణాళిక సిద్ధం చేశాం. గిరిజనులకు ఆర్థిక ఊతం కల్పిస్తాం. ముడిసరుకులకు మద్దతు ధరకల్పిస్తాం. - శోభా స్వాతిరాణి, చైర్పర్సన్, జీసీసీ ప్రతి గ్రామానికి చేరువ చేస్తాం జీసీఎంఎస్‌కు మరింత ఆదాయం చేకూరేలా ఉత్పత్తులను గ్రామ స్థాయి ప్రజలకు అందించేందు మొబైల్ సేవలు ప్రారంభించాం. దీనివల్ల గిరిజనులు లబ్ధిపొందడమే కాకుండా ప్రభుత్వానికి మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ప్రతి గ్రామానికి జీసీఎంఎస్ ఉత్పత్తులు సరఫరా అయ్యేలా మొబైల్ సేవలను విస్తృతం చేస్తాం. - డి. సురేంద్ర కుమార్, జీసీసీ డివిజనల్ మేనేజర్ పార్వతీపురం ఆరోగ్యకర ఉత్పత్తులు స్వచ్ఛమైన ముడి సరుకుల తో ప్రజారోగ్యానికి ఎటు వంటి హాని కలిగించని ఉత్పత్తులను జీసీఎంఎస్ ఆధ్వర్యంలో విక్రయిస్తున్నాం. ఆరోగ్యానికి మేలుచేసే ఆయుర్వేద ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్నాం. జిల్లా కేంద్రం పార్వతీపురం పరిధిలో నాలుగు స్టాల్స్‌తో పాటు మొబైల్ వాహన సేవలు ప్రారంభించాం. - సాంబశివరావు, సీనియర్ అసిస్టెంట్, జీసీసీ పార్వతీపురం -
Beauty Tips: అరటి పండు, క్యారెట్ గుజ్జు, కాఫీ పొడి.. ఇలా చేస్తే ముడతలు మాయం!
Beauty Tips: ముఖం కాంతిమంతంగా కనిపించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందుకోసం చాలా మంది బ్యూటీ పార్లర్‌కు వెళ్లి డబ్బు ఖర్చు చేస్తారు. అయితే ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే తక్కువ ఖర్చుతోనే మెరిసే మేని, మృదువైన, ముడతలు లేని ముఖ సౌందర్యం మీ సొంతమవుతుంది. అరటిపండుతో ఇలా రెండు టీస్పూన్ల అరటిపండు గుజ్జులో టీ స్పూను తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల తరువాత కడిగేయాలి. రోజుమార్చి రోజూ ఈ విధంగా చేయడం వల్ల ముఖ చర్మం లోతుగా శుభ్రపడి మెరుపుని సంతరించుకుని యవ్వనంగా కనిపిస్తుంది. ఈ ప్యాక్ క్రమం తప్పకుండా వేసుకోవడం వల్ల వదులుగా మారిన చర్మం బిగుతుగా మారుతుంది. క్యారట్ గుజ్జును కలిపితే అరటి పండు గుజ్జుతో క్యారెట్ గుజ్జును కలిపి ప్యాక్ చేసి ముఖానికి వేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. కావలసినవి: క్యారెట్ గుజ్జు – 3 టేబుల్ స్పూన్స్, అరటిపండు గుజ్జు – 2 టేబుల్ స్పూన్స్, పెరుగు – అర టేబుల్ స్పూన్, తేనె – పావు టేబుల్ స్పూన్. ముందుగా ఒక బౌల్ తీసుకుని... క్యారెట్ గుజ్జు, అరటిపండు గుజ్జు మిక్స్ చేసుకోవాలి. తరువాత ఆ మిశ్రమంలో పెరుగు, తేనె కలుపుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు బాగా పట్టించి ఓ 20 నిమిషాలు పాటు బాగా ఆరనివ్వాలి. తరువాత గోరువెచ్చని నీళ్లతో మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి 2 లేదా 3 సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. కాఫీ పొడితో మృతకణాలు మాయం ఫిల్టర్‌లో వేయడానికి ఉపయోగించే కాఫీ పొడి (ఇన్స్టంట్ కాఫీ పౌడర్ కాదు)ని ఒక టేబుల్ స్పూన్ తీసుకుని కొద్ది నీటితో పేస్టు చేయాలి. ఆ పేస్ట్‌ని ఒంటికి రాసి, ఐదునిమిషాల తర్వాత వలయాకారంగా మర్దన చేయాలి. ఇలా చేస్తే కొవ్వు కణాలు, మృతకణాలు రాలిపోవడంతోపాటు చర్మం శుభ్రపడుతుంది. మృదువుగా మారుతుంది. చెడు వాసన వస్తుంటే.. ►రెఫ్రిజిరేటర్లో చెడు వాసన వస్తుంటే... దూదిలో వెనిల్లా పౌడర్ వేసి ఫ్రిజ్‌లో ఒక మూలగా ఉంచితే చాలు. ఒక గంట సేపటికి చెడు వాసన మాయమైపోతుంది. ►ఫ్లోరింగ్ టైల్స్‌ను ఎంత శుభ్రంగా తుడిచినా మురికిగానే కనిపిస్తుంటాయి. ►అలాంటప్పుడు అమ్మోనియా కలిపిన నీటిలో స్పాంజ్‌ను ముంచి టైల్స్ తుడిస్తే తళతళమెరుస్తాయి. చదవండి: జుట్టు రాలడానికి మందులు కూడా ఓ కారణమే.. ఆ మందులు ఇవే.. -
Health Tips: వాతం ఎక్కువైందా? నిద్ర పట్టడం లేదా?
Health Tips: రాత్రిపూట త్వరగా భోజనం చేయడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మనం తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసేందుకు కావల్సినంత సమయం లభిస్తుంది. అలాగే మరుసటి రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసే వరకు చాలా సమయం ఉంటుంది కనుక జీర్ణవ్యవస్థకు మరమ్మత్తులు చేసుకునేందుకు కావల్సినంత సమయం లభిస్తుంది. దీంతో జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. రాత్రి త్వరగా భోజనం చేయడం వల్ల నిద్ర చక్కగా పడుతుంది. భోజనానికి, నిద్రకు 3 గంటల వ్యవధి ఉంటే నిద్ర చక్కగా వస్తుంది. లేదంటే నిద్రలేమి సమస్య వస్తుంది. కనుక రాత్రి చక్కగా నిద్ర పట్టాలంటే త్వరగా భోజనం చేసేయాలి. వాతం ఎక్కువైందా? ఒంట్లో వాతం ఎక్కువైనప్పుడు కీళ్ళ నొప్పి, ఎముకల్లో నుండి శబ్దాలు రావడం జరుగుతాయి. ఇక మోకాళ్ళలో జిగురు అరిగిపోవడం వలన ఎముకలు రాపిడికి గురయ్యి ఎక్కువ నొప్పిని కలుగజేస్తాయి. వీటన్నింటికి చెక్ పెట్టడానికి ఒక చిట్కా ఉంది.. దీనిని రెగ్యులర్‌గా 15 రోజులు తీసుకుంటే.. కీళ్ల నొప్పులు, వాతం నొప్పులు తగ్గుతాయి అంటున్నారు నిపుణులు. ఈ పొడి తయారీ గురించి తెలుసుకుందాం.. ►50 గ్రాములు సొంఠి, 50 గ్రాముల మెంతులు, 50 గ్రాములు వాము తీసుకుని.. వీటన్నిటిని కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ►రోజూ ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీరు తీసుకుని అందులో ఈ పొడిని ఒక స్పూన్ వేసుకోవాలి. ►అందులో బెల్లం పొడి.. లేదా తేనే ను వేసుకుని తాగాలి. షుగర్ వ్యాధి ఉన్నవారు బెల్లం కలుపుకోకుండా తీసుకుంటే సరి. ►ఇలా ఈ టీ తాగడం వలన 15 రోజుల్లో వాతం తగ్గుతుంది. జాయింట్లలో జిగురు వచ్చేలా చేస్తుంది. చదవండి: Health Tips: చేదుగా ఉందని బెల్లం, చింతపండుతో వండిన కాకరకాయ కూర తింటే.. -
శ్రీనివాసుని అభిషేకానికి మన్యం మకరందం
సాక్షి, విశాఖపట్నం: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి అభిషేకానికి మన్యం తేనె సిద్ధమైంది. శ్రీనివాసుని అభిషేకానికి గిరిజన తేనె కొనుగోలు చేయాలంటూ ఇటీవల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని గిరిజన సహకార సంస్థ (జీసీసీ) చైర్పర్సన్ శోభా స్వాతి రాణి కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన టీటీడీ బోర్డు తిరుమల ప్రధాన ఆలయంలో స్వామివారి అభిషేకంతో పాటు ఇతర దేవాలయాల్లో అభిషేకానికి గిరిజన తేనె పంపించాలంటూ ఆర్డరు పెట్టారు. 1,800 కిలోల తేనె సిద్ధం చేయాలన్న టీటీడీ ఆదేశాలతో జీసీసీ ఏర్పాట్లు చేసింది. తొలుత రూ.2.69 లక్షల విలువైన 900 కిలోల మన్యం తేనెతో జీసీసీ వాహనం గురువారం సాయంత్రం తిరుమలకు చేరుకుంది. మరో 15 రోజుల్లో మిగిలిన తేనెను పంపేందుకు ప్రాసెసింగ్ చేపడుతున్నట్లు జీసీసీ చైర్పర్సన్ శోభా స్వాతి రాణి తెలిపారు. గిరిజనులు ప్రకృతి వ్యవసాయంతో ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసిన తేనెను కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి సేవకు సమకూర్చే అవకాశం కల్పించినందుకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
Honey Chicken: హనీ చికెన్ కర్రీ..టేస్ట్ అదుర్స్.. ఇలా చేసుకోండి
మనం నిత్యం చూస్తూ ఉంటాం ప్రతి ఒక్కరూ రకరకాల రుచికరమైన వంటలను తయారు చేసుకొని అరగిస్తూ ఉంటారు. ముఖ్యంగా చికెన్ అంటే చాలు లొట్టలేసుకుని లాగించేస్తారు. ఈ రోజుల్లో చిన్న నుంచి పెద్ద వరకు చికెన్ అంటే ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు. అలాంటి వారి కోసమే హనీ చికెన్ తయారీతో మీ ముందుకు వచ్చాము. ఈ చక్కని వెరైటీ రిసిపిని ఊహించుకుంటేనే నోరూరుతుంది కదా? అయితే వెంటనే మీరు కూడా తయారు చేసుకోవాలిసిందే.... హనీ చికెన్ కావాల్సిన పదార్థాలు.. 1. కొన్నిబొన్లెస్ చికెన్ ముక్కలు 2. అవసరాన్ని బట్టి ఉప్పు 3. తేనె తగినంత 4. వెన్న కావలసినంత 5.తగినంత నిమ్మ రసం 6. సోయా సాస్ తగినంత ఇప్పుడు తయారీ విధానం... ముందుగా చికెన్ ను శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత స్టౌవ్ మీద ఒక దళసరి పాన్ని పెట్టుకోని నూనె వేసుకోవాలి. నూనె తగినంత వేడెక్కిన తర్వాత చికెన్ ముక్కలను వేసి 4-5 నిమిషాలు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మీడియం మంట మీద ఇంకో పాన్ని తీసుకోండి. దానిలో కొద్దిగా వెన్న, తేనె వేసుకోవాలి. వెన్న అనేది పూర్తిగా కరిగిన తరువాత మంటను ఆపేయండి. ఇప్పుడు అదే పాన్‌లో కొద్దిగా నిమ్మ రసం, ఉప్పు తగినంత వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఆ తరువాత ఈ తేనె మిశ్రమం లో ఫ్రై చేసిన చికిన్ ముక్కలను వేసి సుమారు 20 నిమిషాలు ఉడికించాలి. అవసరం బట్టి షెజ్వాన్ సాస్ కూడా ఊపయోగించ వచ్చు. ఆ తరువాత స్టౌ మీద నుంచి కూరను దింపేయాలి. అంతే వేడి వేడిగా హనీ చికెన్ రెడీ. చదవండి: ఘుమ ఘుమలాడే పనీర్ సమోసా, మరమరాల వడ తయారీ -
ఏరులైపారుతున్న తేనే! ఈ ఏడాది 1.25 లక్షల టన్నుల ఉత్పత్తి
న్యూఢిల్లీ: భారత దేశంలో తేనే ఏరులై పారుతుంది. తేనే ఉత్పత్తి కోసం గత కొన్నేళ్లుగా ప్రభుత్వం అమలు చేసిన విధానాల కారణంగా ఒక్కసారిగా తేనే ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌తోమర్ అన్నారు. ఢిల్లీలోని కిసాన్ భవన్లో జరిగిన బీకీపర్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తేనే ఉత్పత్త పెంచేందుకు కేంద్రం రూ. 500 కోట్ల రూపాయలను ప్రత్యేకంగా కేటాయించిందన్నారు. ఈ నిధులతో పది వేలకు పైగా ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ వచ్చాయన్నారు. ముఖ్యంగా తేనే, ఫలాలు పండించేందుకు అనువుగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో ఈ పథకం చక్కని ఫలితాలు ఇచ్చిందని ఆయన అన్నారు. కేంద్రం అమలు చేస్తున్న విధానాల కారణంగా తేనే ఉత్పత్తిలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఇండియాలో తేనే ఉత్పత్తి 76 వేల మెట్రిక్ టన్నులు ఉండగా ఏడేళ్లు గడిచే సరికి ఏకంగా 1.25 లక్షల టన్నులకు పెరిగిందన్నారు. అదే విధంగా విదేశాలకు ఉత్పత్తి చేస్తున్న తేనే 28 వేల మెట్రిక్ టన్నుల నుంచి 60 వేల మెట్రిక్ టన్నులకు పెరిగిందన్నారు. -
AP: గిరిజన తేనెకు తిరుపతి వెంకన్నే బ్రాండ్ అంబాసిడర్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అడవుల నుంచి గిరిజనులు సేకరించే తేనెకు కలియుగ దైవం శ్రీనివాసుడు బ్రాండ్ అంబాసిడర్ కానున్నారు. ఏడుకొండల స్వామిని అభిషేకించేందుకు గిరిజన తేనెను వినియోగించాలని టీటీడీ నిర్ణయించింది. ఏపీ గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ప్రతిపాదనకు టీటీడీ ఆమోద ముద్ర వేసింది. గిరిజన తేనె నమూనాలను తీసుకున్న టీటీడీ వాటికి ల్యాబ్‌లలో నాణ్యత పరీక్షలు చేయించింది. స్వచ్ఛత బాగుందనే ఫలితాలు రావడంతో గోవిందుడి అభిషేకానికి గిరిజన తేనె వినియోగించాలని నిర్ణయించింది. గిరిజనుల నుంచి సేకరించే తేనెను జీసీసీ శుద్ధి చేసి కిలో రూ.298.77 చొప్పున విక్రయిస్తోంది. టీటీడీకి అవసరమైన తేనెను తిరుపతి, రాజమండ్రి కేంద్రాల్లో శుద్ధి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. (చదవండి: దీపావళికి ప్రత్యేక రైళ్లు.. వివరాలివే..) ఈ రెండు కేంద్రాల్లో రోజుకు 2,500 నుంచి 3 వేల కిలోల తేనెను శుద్ధిచేసే సామర్థ్యం ఉందని అధికారులు చెబుతున్నారు. ఎంత తేనె కావాలనేది టీటీడీ నుంచి ఆర్డర్ రావడమే తరువాయి అని జీసీసీ జనరల్ మేనేజర్ చినబాబు ‘సాక్షి’కి చెప్పారు. తేనెతోపాటు శ్రీవారి నిత్య కైంకర్యాలకు, నైవేద్యానికి వినియోగించే పసుపు, జీడిపప్పును కూడా జీసీసీ నుంచి కొనుగోలు చేయాల్సిందిగా టీటీడీకి ప్రతిపాదన చేశామని చినబాబు తెలిపారు.(చదవండి: AP: ఆర్టీసీలో ఇ–బస్సులకు లైన్‌క్లియర్) విశాఖ మన్యంలోని పాడేరులో గిరిజనుల నుంచి సేకరిస్తున్న పసుపు నాణ్యతలో నంబర్–1 స్థానంలో ఉంది. గిరిజన పసుపు, జీడిపప్పు శాంపిల్స్‌ను జీసీసీ ఇప్పటికే టీటీడీకి అందించింది. దీనిపై టీటీడీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తిరుపతితోపాటు మరికొన్ని ఆలయాలు, పర్యాటక ప్రాంతాల్లో గిరిజన తేనె, జీడిపప్పు, ఇతర ఉత్పత్తుల స్టాల్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. దీనివల్ల గిరిజన ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి గిరిజనులకు మరింత మేలు కలుగుతుందని భావిస్తున్నారు. -
తేనె సేకరిస్తున్నప్పడు ఆ తాడును బావమరిది మాత్రమే పట్టుకోవాలి!
సాక్షి, అచ్చంపేట (మహబూబ్‌నగర్): అడవి బిడ్డలు సేకరించే తేనె అంటే ఎంతో స్వచ్ఛమైనది. ఎలాంటి కల్తీ లేని తేనె పట్టు వారి వద్ద లభిస్తుంది. తరతరాలుగా వారు తేనె సేకరణ కులవత్తిగా సాగుతోంది. ప్రకతి దేవతలకు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి తేనె సేకరణకు బయలుదేరే చెంచులు.. చెట్లపైకి ఎక్కే దగ్గరి నుంచి తేనె సేకరణ పూర్తి చేసే వరకు ఓ ప్రత్యేకమైన ఆచారాన్ని నేటికీ అవలంబిస్తున్నారు. తమ ఆచారాన్ని కొనసాగిస్తూనే పుష్కరకాలంగా శాస్త్రీయ పద్ధతుల్లో సైతం తేనెను సేకరిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో చెంచులు అధికంగా ఉన్న నల్లమలలోని లోతట్టు అటవీ ప్రాంతంలోని ప్రతి ఏడాది జనవరి, ఫిబ్రవరి, మే, జూన్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్ మాసంలో మాత్రమే తేనె సేకరణ చేస్తారు. సీజన్ల వారీగా అడవి బిడ్డలు తేమ సేకరణ విధానం, అందుకోసం ఉపయోగించే పద్ధతులు.. తదితర వాటిపై సండే స్పెషల్.. (చదవండి: వివాహేతర సంబంధం: కారు ఆగింది.. కథ అడ్డం తిరిగింది) తేనె సేకరణ కోసం చెట్టు ఎక్కేందుకు సిద్ధమైన చెంచు వ్యక్తి నల్లమల అటవీ ప్రాంతంలో ఎన్నో చెంచు కుటుంబాలకు తేనె ముఖ్య జీవనాధారం. సీజన్లను బట్టి వివిధ రకాల తేనె సేకరణ చేస్తుంటారు. తొలకరి వర్షాకాలంలో దేవదారి పూతతో వచ్చే తేనె శ్రేష్టమైనది. మామిడి పూతతో వచ్చే తేనె చాలా మధురంగా, వామ తోటల మకరందాన్ని సేకరించిన సమయంలో వచ్చే తేనె కొంత ఘాటుగా ఉంటుంది. పొద్దుతిరుగుడు, కందిపూల నుంచి తేనెటీగలు మకరందాన్ని సేకరిస్తాయి. తాటి పూతతో వచ్చే తేనె కొంత అరుదుగా దొరుకుతుంది. చెంచులకు తేనె సేకరణలో అవగాహన పెంపొందించే దిశగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా పదేళ్లుగా కోనేరు స్వచ్ఛంద సంస్థ అచ్చంపేట, అమ్రాబాద్, బల్మూర్, లింగాల, కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి మండలాల్లో చాలామంది చెంచులకు శాస్త్రీయ పద్ధతుల్లో తేనె సేకరణ విధానంపై అవగాహన కల్పించారు. తేనె సేకరణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు వారికి అవసరమైన కిట్లను అందజేస్తున్నారు. చెంచులు చూడడానికి నీరసంగా ఉన్నప్పటికీ తేనె సేకరణ సమయంలో కొండలు, చెట్లు సునాయసంగా ఎక్కగలుగుతారు. (చదవండి: రూ.2 కోట్ల విలువైన మెఫిడ్రోన్ స్వాధీనం) వేప చెట్టు కొమ్మపై పొదిగి ఉన్న పెద్ద తేనె తుట్ట తుట్టె నుంచి తేనెను వేరు చేయడం తుట్టెగా ఉన్న తేనె గడ్డలను పలుచని తెల్ల వస్త్రంలో వేసి జల్లెడలాంటి ఓ ప్రత్యేక పాత్రలో పిండుతారు. తర్వాత వాటిని సీసాలు, డబ్బాల్లో నింపి గిరిజన సహకార సంస్థలో విక్రయించి, వారికి అవసరమైన నిత్యావసర సరుకులు కొనుగోలు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో చేతులతో పిండి తేనెను తుట్ట నుంచి వేరు చేస్తారు. ఇది చూడడానికి అంతగా బాగో లేనప్పటికీ, తేనెతో పాటు వచ్చే మైనం ఆరోగ్యానికి మంచే చేస్తుంది. శాస్త్రీయ పద్ధతిలో తెనే సేకరిస్తున్న చెంచులు శాస్త్రీయ పద్ధతిలో సేకరణ తేనెటీగలు నశించిపోకుండా చూడటంతో పాటు ఒకే తేనె తుట్ట నుంచి 5–6 సార్లు తేనె సేకరించే విధానాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో చేయవచ్చు. 12 ఏళ్లుగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు చెంచులతో మమేకమై, వారికి శిక్షణ ఇచ్చి ప్రాక్టికల్‌గా రుజువు చేసి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఇప్పటికే ఆయా స్వచ్ఛంద సంస్థలు అందజేసిన కిట్లు ప్రతి గ్రామం, పెంట, గూడెంలలో చెంచులకు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా సీజన్ల వారీగా తేనె సేకరిస్తున్నారు. తేనె సేకరణకు సంబంధించి కిట్టులో బలమైన రెండు తాళ్లు, ఎలిమెంట్, గ్లౌజెస్ బూట్లు, తెల్లనిప్యాంట్, షార్టు, బకెట్, కత్తి ఉంటాయి. (చదవండి: ఖైదీని పట్టుకోబోతే గంజాయి దొరికింది) తుట్టలో తేనె ఉన్న భాగం తేనె సేకరణ ఇలా.. తేనె సేకరణకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా ప్రకతి, వన దేవతలను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అనంతరం తేనె తుట్ట కింది భాగంలో ఆకులు, పుల్లలతో దట్టమైన పొగ పెట్టేవారు. దీంతో తేనె టీగలు ఊపిరాడక కొన్ని చనిపోవడంతో పాటూ మరికొన్ని అక్కడి నుంచి లేచి వెళ్లిపోతాయి. ఆ తర్వాత తేనెను సునాయసంగా తీస్తారు. కొండభాగంలో ప్రత్యేక ఆచారం.. కొండభాగంలో ఉన్న తేనె సేకరించే సమయంలో చెంచులు ఆచారం ప్రకారం కొండపై నుంచి జాలువారే తాడును బావమరిదిని మాత్రమే పట్టుకొనిస్తారు. తాడు సహాయంతో తేనె తుట్టె వద్దకు వెళ్లే సమయంలో ఓ ప్రత్యేకమైన శబ్ధం చేస్తూ వెంట తెచ్చుకున్న సుడేకు మంటపెట్టి, ఆ పొగతో తేనెటీగలను తేనె పట్టుకు దూరం చేస్తారు. అనంతరం వెంట తెచ్చుకున్న శిబ్బెంలో (పల్లెం) తేనె ఉన్న భాగాన్ని వేసుకుని కింద ఉన్న వారికి చేరవేస్తారు. ప్రభుత్వ ప్రోత్సాహం లేదు.. తేనె సేకరణలో ప్రభుత్వ ప్రోత్సాహం ఉండడం లేదు. రోజురోజుకీ నశించి పోతున్న తేనెటీగలు పెంపకానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. జీసీసీలో కొనుగోలు చేసే ధర కంటే బయటి వ్యక్తులకు అమ్మకుంటే అధిక డబ్బలు వస్తున్నాయి. కల్తీ లేని తేనెను సేకరిస్తున్నాం. అందుకే మంచి డిమాండ్ ఉంటుంది. చాలా మంది తేనె కోసమే మా చెంచుపెంటలకు వస్తున్నారు. – చిగుర్లపెద్ద లింగయ్య, రాంపూర్ పెంట ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి.. ప్రభుత్వం తేనెకు మద్దతు ధర కల్పించడంతో పాటు తేనె సేకరణకు వెళ్లే ప్రతి ఒక్కరికి ప్రమాద బీమా(ఇన్సూరెన్స్) సౌకర్యం కల్పించాలి. కొన్నేళ్లుగా స్వచ్ఛంద సంస్థలు మాత్రమే తేనె సేకరణలో మాకు ఉపయోగపడుతున్నాయి. వారు ఇచ్చిన క్లిట్లు కూడా పాడైనవి. కొత్త వాటిని ఇవ్వలేదు. ప్రస్తుత సీజన్లో తేనె ఎక్కవ సేకరణ జరుపుతాం. అడవిలో చాలా దూరం వెళ్లాల్సి వస్తోంది. గతంలో పెంటలకు అందుబాటులో తేనె లభించేది – బయన్న, మల్లాపూర్ చెంచుపెంట -
Health Tips: టీలో ‘తేనె’ కలిపి తాగుతున్నారా? స్లో పాయిజన్‌గా మారి..!
ప్రకృతి సిద్ధంగా దొరికే తేనె.. ఇంటివైద్యం మొదలుకొని ఆయుర్వేదం వరకు రకరకాల సమస్యల నివారణకు వాడుకలో ఉన్నదే. ప్రకృతి ప్రసాదమేకదా! అని ఎట్లాపడితే అట్లా వాడితో ఔషధం విషంగా మారుతుంది. అవును!! చాలా మంది పరకడుపున వేడినీళ్లలో తేనె కలుపుకుని తాగుతారు. సాధారణంగా ఈ ప్రక్రియను శరీరంలోని కొలెస్ట్రాల్‌ను కరిగించి బరువును తగ్గిస్తుందనే నమ్మకంతో అనుసరిస్తారు. సహజంగానే తీపి గుణం కలిగిన ప్రకృతి సిద్ధమైన తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, మాగ్నిషియం, కాపర్, మాంగనీస్, పొటాషియం, జింక్ వంటి మినరల్స్, ఎన్జైమ్స్ పుష్కలంగా ఉంటాయి. తీపికి ప్రత్నామ్నాయంగా డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు కూడా ముడి తేనె ఉపయోగంలో ఉంది. అంతేకాక ఇది దగ్గు నుంచి ఉపశమనాన్నిస్తుంది. ప్రేగులను శుభ్రపరుస్తుంది. కాలిన గాయాలను నయం చేస్తుంది. చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసుంది కూడా. ఇంతటి సుగుణాలు ఉన్న తేనెను హెర్బల్ టీ, లెమన్ టీ, వేడి పాలు.. వంటి ఏ రకమైన వేడిపదార్ధాలతోనైనా కలిపి తాగడం ఆయుర్వేదం ప్రకారం ప్రమాదమని ప్రముఖ ఆయుర్వేద ఎక్స్పర్ట్ డా. రేఖా రాధామణి హెచ్చరిస్తున్నారు. కారణమేమిటో తెలుసుకుందాం.. చదవండి: అలాంటప్పుడు.. తాళం ఎందుకేసుకున్నావయ్యా!! ►తేనెను వేడిగా తీసుకుంటే అది శరీరంలో స్లో పాయిజన్‌గా మారుతుంది. ఒక్కసారి దీనిని వేడిగా తీసుకుంటే దీనిలోని పోషకాలు శరీరంలో హానికారక విషాలుగా రూపాంతరం చెందుతాయి. ఇవి శరీరంలో క్రమంగా పెరిగి అనేక వ్యాధులకు కారణమవుతుంది. ►ముడి తేనెలో పోషకాలు సహజంగానే అధికంగా ఉంటాయి. దీనిని అలాగే నేరుగా వినియోగించాలి. ఐతే స్టోర్లలో లభించే పాశ్చరైజ్డ్ తేనెలో ఆర్టిఫిషియల్ స్వీట్నర్, కార్న్ (మొక్కజొన్న) సిరప్ వంటివి తీపి కోసం కలుపుతారు. ఇది డయాబెటిస్ రోగులకు చాలా ప్రమాదకరం. అలాగే ముడి తేనెలో ఉండే పుప్పొడి, యాంటీఆక్సిడెంట్లు, ఎంజైమ్‌లు కూడా దీనిలో ఉండవు. ►అంతేకాకుండా సూపర్ మార్కెట్లలో లభించే అన్నిరకాల తేనెలు విపరీతమైన ఉష్ణోగ్రతల్లో వేడి చేసి ప్యాక్ చేయబడి ఉంటాయి. అటువంటి తేనెను కొనకపోవడం మంచిది. వాడకపోవడం ఇంకా మంచిది. తేనెటీగల నుండి నేరుగా సహజ తేనెను తీసి విక్రయించేవారి నుంచి కొని, వేడి చేయకుండా తింటే తేనెలోని సహజ పోషకాలు నేరుగా శరీరానికి అందుతాయని డాక్టర్ రాధామణి సూచిస్తున్నారు. చదవండి: మీరు బాదం పాలు తాగుతున్నారా? వికారం, థైరాయిడ్, అలర్జీ.. -
Hair Care: చిన్నపాటి చిట్కాలు పాటిస్తే.. మృదువైన జుట్టు మీ సొంతం!
ప్రతి ఒక్కరూ ఒత్తైన, మెరిసే, సిల్కీ హెయిర్ కోసం ఆరాటపడుతుంటారు. కానీ జట్టు ఒత్తుగా ఉన్నప్పుడు చిక్కబడి విపరీతంగా విసిగిస్తుంటుంది. ఎక్కడికైనా అర్జంటుగా వెళ్లాల్సి వచి్చనప్పుడు తల దువ్వుకోవాలన్నా, ఏదైనా సరికొత్త హెయిర్ స్టైల్ చేసుకుందామన్నా అస్సలు కుదరదు. చిక్కులు పడే కురులను చిన్నపాటి చిట్కాల ద్వారా మృదువుగా మార్చుకోవచ్చు. అదెలాగో చూద్దాం.. ►తలస్నానం చేసిన చేసిన తరువాత సాధారణంగా మందమైన టవల్ లేదా బట్టతో తలను గట్టిగా తుడుచుకుంటూ ఉంటారు. దానికి బదులు పలుచటి వస్త్రంతో తలను మృదువుగా తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎక్కువ చిక్కుపడదు. ప్రతి మూడు నెలలకోసారి స్ప్లిట్ ఎండ్స్ తీసేసి, జుట్టును ట్రిమ్ చేయాలి. జుట్టుకు పోషకాలనందించే స్పాను తప్పనిసరిగా నెలకోసారి చేసుకోవాలి. ►దీర్ఘకాలికంగా బాధిస్తున్న చిక్కులకు కెరాటిన్ ట్రీట్మెంట్ కూడా బాగా పనిచేస్తుంది. దీనివల్ల జుట్టు మృదువుగా మారడమేగాక మెరుపుని సంతరించుకుంటుంది. ►ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల సీరమ్‌లు దొరుకుతున్నాయి. వీటిలో మీ జుట్టుకు నప్పే సీరమ్‌ను వాడడం వల్ల కూడా కురులు మృదువుగా మారతాయి. ►సల్ఫేట్ తక్కువగా ఉండే షాంపు వాడడం వల్ల జుట్టు ఎక్కువ చిక్కుపడదు. ►చర్మసంరక్షణలో వాడే గ్లిజరిన్ కేశాల సమస్యలకు మంచి పరిష్కారం చూపుతుంది. గ్లిజరిన్‌ను జుట్టుకు కండీషనర్‌లా పట్టిస్తే.. కురులు పొడిబారడం తగ్గి మృదుత్వాన్ని సంతరించకుంటాయి. ►మార్కెట్లో దొరికే హెయిర్ మాస్క్‌లు కాకుండా ఇంట్లో తయారు చేసుకున్న మాసు్కలు జుట్టును పదిలంగా ఉంచుతాయి. తేనె, ఆలివ్ ఆయిల్‌లను హెయిర్ మాస్్కగా వాడితే స్ప్లింట్ ఎండ్స్, చిక్కులు పడడం తగ్గుతుంది. ►ఆలివ్ ఆయిల్, తేనెను సమపాళల్లో తీసుకుని మైక్రో వేవ్‌లో 30 సెకన్ల పాటు ఉంచాలి. తరువాత ఈ మిశ్రమాన్ని చల్లారనిచ్చి కొద్దిగా మజ్జిగ కలిపి జుట్టుకు పట్టించాలి. అరగంటపాటు ఆరనిచ్చి సాధారణ షాంపూతో కడిగేయాలి. ►మనం పడుకునేటప్పుడు తలకింద పెట్టుకునే దిండు కూడా జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందువల్ల దిండు కవర్ సిల్క్‌తో తయారైనదిగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే కాటన్ దిండు కవర్ వల్ల వెంట్రుకలు పొడిబారతాయి. ►ఇవన్నీ పాటిస్తే జుట్టు చిక్కులు పడడం తగ్గుతుంది. చదవండి: Hair Care: తెల్ల జట్టు సమస్యా.. హెన్నా పెడుతున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించకపోతే! -
తేనె పూసిన 'కల్తీ'
సాక్షి, అమరావతి: మార్కెట్లో విక్రయిస్తున్న ప్రముఖ బ్రాండ్ల తేనెలో 77 శాతం కల్తీవేనని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) తేల్చింది. చాలా కంపెనీలు తేనెలో చక్కెర పాకం కలిపి విక్రయిస్తున్నట్టు స్పష్టం చేసింది. 13 రకాల ప్రముఖ బ్రాండ్లకు చెందిన తేనె నమూనాలను సేకరించిన సీఎస్ఈ జర్మనీలోని ల్యాబ్‌లో పరీక్ష చేయించగా.. దిగ్భ్రాంతి కలిగించే ఈ మోసం బయటపడింది. అడవుల నుంచి పట్టు, పుట్ట తేనెను సేకరించామంటూ రోడ్లపక్కన తేనె పేరిట బెల్లం పాకాన్ని పిండి ఇస్తున్న దానికీ.. ప్రముఖ బ్రాండ్ల పేరిట అమ్మే తేనెకు ఏ మాత్రం తేడా కనిపించడం లేదని ప్రకటించింది. ఎన్ఎంఆర్ పరీక్షల్లో ఏం తేలిందంటే.. తేనెలో ఏయే రకాల చక్కెర పాకాలను కలుపుతున్నారనేది గుర్తించడానికి న్యూక్లియర్ మాగ్నటిక్ రెసోనాన్స్ (ఎన్ఎంఆర్) పరీక్ష నిర్వహిస్తారు. దేశంలో ఇటువంటి పరీక్షా కేంద్రాలు లేకపోవడం సీఎస్ఈ సేకరించిన నమూనాలను జర్మనీకి పంపింది. తేనెలో సీ–3 సుగర్‌ను ఎక్కువ కలుపుతున్నట్టు ఆ పరీక్షల్లో తేలింది. దీనిని చైనా నుంచి పెద్దఎత్తున దిగుమతి చేసుకుంటున్నారని సీఎస్ఈ ప్రకటించింది. ఆ సంస్థ నివేదిక ప్రకారం చైనా కంపెనీలు ఫ్రక్టోజ్ సిరప్ పేరిట చక్కెర పాకాన్ని భారత్‌కు పంపిస్తున్నాయి. ఏటా చైనా నుంచి సుమారు 10 వేల మెట్రిక్ టన్నుల ఫ్రక్టోజ్ దిగుమతి అవుతోంది. దీనిని స్వల్ప మోతాదులో ఉండే తేనెతో కలిపి విక్రయిస్తున్నట్టు సీఎస్ఈ తేల్చింది. ఈ నేపథ్యంలోనే మార్కెట్లో విక్రయిస్తున్న ప్రముఖ బ్రాండ్ల తేనెలన్నీ కల్తీవేనంటూ ఓ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. దీనికి మరికొన్ని సంస్థలు కూడా గొంతు కలిపాయి. కల్తీని గుర్తించడం ఎలా? తేనె సీసాల లేబుల్‌పై ముద్రించి ఉండే కాంపొనెంట్స్ ఏమిటనేది గుర్తించాలి. అందులో వాడిన ముడి పదార్థాలేమిటో పరిశీలించాలి. మూత తీసేప్పుడు చిన్నపాటి శబ్దం (సోడా బాటిల్ మూత తీసేప్పుడు వచ్చే శబ్దం మాదిరి) వస్తే అదిమంచిది కానట్టే. బాటిల్ లోపల పులియటం (ఫెర్మంటేషన్) జరిగితే ఈ శబ్దం వస్తుంది. వెనిగర్ కలిపిన నీళ్లలో తేనెను వేసినప్పుడు నురగ వస్తే అది మంచిది కాదు. తేనెను మరగబెట్టినా ఆవిరి కాదు. బొటన వేలిపై ఒక బొట్టు తేనె వేసుకున్నప్పుడు కొన్ని సెకన్ల పాటు అయినా కదలకుండా ఉండాలి. తేనెటీగల పెంపకందారుల జీవనోపాధికి గండి కల్తీ తేనె వల్ల తేనెటీగల పెంపకందారుల జీవనోపాధి దెబ్బతింటోంది. రాష్ట్రంలో గిరిజన కార్పొరేషన్ విక్రయించే తేనెకు మంచి పేరుంది. అయినా అమ్మకాలు మాత్రం తక్కువే. తేనెటీగల పెంపకందారులు కల్తీతో పోటీ పడలేకపోతున్నారు. కల్తీ తేనె ధర తక్కువ. తేనెటీగలు పెంచి ఉత్పత్తి చేసే తేనె ధర ఎక్కువగా ఉంటుంది. – డాక్టర్ వై.వెంకటేశ్వరరావు, చైర్మన్, రైతు నేస్తం ఫౌండేషన్ కల్తీని కట్టడి చేసే చట్టం రావాలి కరోనా నేపథ్యంలో తేనె వినియోగం పెరిగింది. ఈ పరిస్థితిని సొమ్ము చేసుకునేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. దానిలో భాగమే కల్తీ. దీన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని రూపొందిస్తోంది. వాస్తవానికి అది గత ఏడాది జూలైలో అమల్లోకి రావాల్సి ఉంది. త్వరలో ఆ చట్టం అమల్లోకి వస్తే కల్తీని కట్టడి చేయవచ్చు. చెరకు, వరి, మొక్కజొన్న, బీట్రూట్, గోధుమల నుంచి కూడా సుగర్ సిరప్ తయారు చేసి తేనెలో కలుపుతున్నట్టు తెలుస్తోంది. – జె.కుమారస్వామి, భారతీయ కిసాన్ సంఘ్ నేత -
తేనెతో గుండెపోటు నివారణ సాధ్యమా?
రకరకాల తీపిపదార్థాల్లో తీపిని అందించే పదార్థాలను గ్లూకోజ్, మాల్టోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్ అని పిలుస్తారన్న విషయం మనకు తెలిసిందే. అలాగే తేనెలో తీపిని ఇచ్చే పదార్థాన్ని ‘ట్రెహలోజ్’ అంటారు. కొన్ని ఎలుకల శరీరాల్లోకి ట్రెహలోజ్‌ను ఇంజెక్ట్ చేస్తూ నిర్వించిన పరిశోధనలు గుండెపోటు నివారణను సుసాధ్యం చేస్తాయేమోననే అభిప్రాయాన్ని కలగజేస్తున్నాయట. తేనెలోని టెహ్రలోజ్ ఇంజెక్ట్ చేసిన ఎలుకల్లోని రక్తనాళాల్లో ‘ప్లాక్’ చేరలేదట. పైగా గతంలో చేరిన ప్లాక్‌లో దాదాపు 30 శాతం వరకు తగ్గుదల కనిపించింది. అయితే ఈ ట్రెహలోజ్‌ను నేరుగా నోటి ద్వారా పంపిన ఎలుకల్లోనూ లేదా ఇతర రకాల చక్కెరలను ఇంజెక్ట్ చేసిన మూషికాలలో ఈ విధమైన తగ్గుదల కనిపించలేదు. ప్రస్తుతం కనుగొన్న విషయం భవిష్యత్తులో అద్భుతమైన ఆవిష్కరణకు దారితీసే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తల అభిప్రాయం. రక్తనాళాల్లోని ప్లాక్‌ను శుభ్రం చేసే పనిని మ్యాక్రోఫేజ్ అనే ఒక రకం ఇమ్యూన్ కణాలు చేస్తుంటాయి. వాటిని పుట్టించేందుకు అవసరమైన టీఎఫ్‌ఈబీ అనే ఒక రకమైన ప్రోటీన్ ఉత్పాదనకు ట్రెహలోజ్ దోహదపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దాంతో గుండెపోటు ముప్పును నివారించగల ట్రెహలోజ్ సహాయంతో రక్తనాళాల్లోని పాచిని తొలగించి, తద్వారా గుండెపోటు ముప్పును నివారించే అవకాశాలపై శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఇలా చక్కెరకు బదులు తేనె వాడటం ద్వారా గుండెపోటు ముప్పును నివారించవచ్చా అనే అంశంపై వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహిస్తున్నారు. -
స్వచ్ఛమైన తేనె ఎలా గుర్తించాలి?
వెనుకటి రోజుల్లో పెరట్లోనో, పోలాల్లోనో, పండ్ల తోటల్లోనో, అడవుల్లో తేనె తుట్టెలు విరివిగా కనిపించేవి. తేనె పక్వానికి వచ్చినప్పుడు తేనెటీగలు కుట్టకుండా జాగ్రత్తగా ఒడిసిపట్టి ఇంట్లో నిల్వచేసేవారు. మాటలు రాని చిన్నపిల్లలకు ఈ స్వచ్ఛమైన తేనెను నాకించేవారు. అయితే ప్రస్తుతం ఇప్పుడా పరిస్థితి లేదు. ఇప్పుడంతా ఎటుచూసినా కాంక్రీట్ జంగిల్ మాత్రమే కనిపిస్తుంది. దీనితోడు మార్కెట్లలో పేరుమోసిన అనేక బ్రాండ్లు స్వచ్ఛమైన తేనె అని చెప్పి ఒక బాటిల్ కొంటే మరో బాటిల్ ఫ్రీ అని అమ్మెస్తున్నాయి. అయితే మార్కెట్లో దొరికే తేనె నాణ్యత ఎంత..? ఈ తేనెలో ఆరోగ్యానికి మంచి చేసే సుగుణాలు ఉన్నాయా..? తెలుసుకొని కొనాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని గమనించండి.. ► స్వచ్ఛమైన తేనె కాస్త నల్లగా ఉంటుంది. పసుపుగా అందంగా కనిపించదు. కల్తీలేని తేనెను గాజుసీసాలో పోస్తే సీసాకు అవతల ఉన్న వస్తువులేవీ కనిపించవు. కాలం గడిచేకొద్ది కల్తీ తేనెలు కూడా నల్లగా ముదురు రంగులోకి మారతాయి. అలా అని అది స్వచ్ఛమైన నిఖార్సైన తేనె అనుకోలేము. తయారీ తేదీని బట్టి రంగును గుర్తించాలి. ► తేనెలో 18 శాతం కంటే తక్కువ వాటర్ ఉంటే అది స్వచ్ఛమైన తేనెగా గుర్తించాలి. ► ఒక స్పూన్‌తో కొద్దిగా తేనె తీసి దానిని ప్లేటుపై ఒక చుక్క వేయాలి. అప్పుడు ఆ తేనె చుక్కలు ముద్దగా లేదా ధారలా జారాలి. అప్పుడు అది మంచి తేనె అని నిర్ధారించుకోవాలి. అలా కాకుండా చుక్కలు చుక్కలుగా విడిపోతూ ఉంటే అది కల్తీకలిసిన తేనెగా గుర్తించాలి. ► నాణ్యమైన తేనె అంటే ఆర్గానిక్ మాత్రమే. తేనెలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్‌లు ఉండడం వల్ల అది పంచదార కంటే తియ్యగా ఉంటుంది. ► తేనెను ప్రాసెస్ చేసే క్రమంలో వేడిచేస్తారు. ఇలా వేడిచేసేటప్పుడు తేనెలోని ఎంజైమ్‌లు, ప్రోబయోటిక్స్ తోపాటు ఇతర పోషకాలు దెబ్బతింటాయి. ► తీపిదనంతో పాటు తేనెలో 20 శాతం కంటే తక్కువగా నీరు కూడా ఉంటుంది. అందువల్ల తేనెలో సూక్ష్మజీవులు పెరగలేవు. ► ఎక్కువ కాలం తేనె తాజాగా ఉండాలని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. అలా చేస్తే అది చక్కెరలా మారిపోతుంది. శుభ్రమైన పొడి గాజుసీసాలో పోసీ గాలిపోకుండా టైట్‌గా మూతపెట్టి భద్రపరిస్తే ఎన్నేళ్లైనా తేనెకు శల్యం ఉండదు. -
కల్తీ తేనె కలకలం: మరింత కరోనా ముప్పు
సాక్షి, న్యూఢిల్లీ: రోగనిరోధక శక్తి పెంచుతుంది.. యాంటీ ఆక్సిడెంట్, ఇమ్యూనిటీ బూస్టర్ అంటూ కరోనా కాలంలో తేనెను తెగ లాగించేస్తున్నారా? అయితే మీకొక షాకింగ్ రిపోర్టు.. చైనా సుగర్ సిరప్‌తో గుర్తు పట్టలేనంతగా దేశంలో కల్తీ తేనెను చలామణీ చేస్తున్నవ్యవహారం కలకలం రేపుతోంది. చిన్నా పెద్ద సహా దాదాపు అన్ని బ్రాండ్ల తేనె చక్కెర సిరప్‌తో కల్తీ చేస్తున్నారని తమ అధ్యయనం తేలిందని ప్రకటించింది. దేశంలోని 13 ప్రధాన బాండ్లలో డాబర్, పతంజలి, బైద్యనాథ్ జండుతో సహా మొత్తం 10 సంస్థలు విక్రయిస్తున్న తేనె కల్తీమయమని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) తేల్చి చెప్పింది. కరోనా సంక్షోభ సమయంలో ప్రజలు తేనెకు బదులుగా, ఎక్కువ చక్కెరను తింటున్నారని, ఇది కోవిడ్-19 ప్రమాదాన్నిమరింత పెంచుతుందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. తేనెలో చైనా చక్కెరతో కలిపి కల్తీ తేనెను విక్రయిస్తున్నారని ఇటీవల నిర్వహించిన క్వాలిటీ పరీక్షల్లో నిర్దారణ అయిందని తెలిపింది. గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్డిడిబి) సెంటర్ ఫర్ ఎనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్‌స్టాక్ అండ్ ఫుడ్ (కాల్‌ఎఫ్)లో వీటి నమూనాలను పరీక్షించారు. జర్మనీలోని ఒక ప్రత్యేక ప్రయోగశాలలో ఎన్ఎంఆర్ టెక్నాలజీని ఉపయోగించి పరీక్షించినప్పుడు, చాలా బ్రాండ్లు విఫలమయ్యాయి. పరీక్షించిన 13 బ్రాండ్లలో మూడు బ్రాండ్లు మాత్రమే ఎన్ఎంఆర్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాయని సీఎస్ఈ వెల్లడించింది. అయితే ఈ ఆరోపణలను డాబర్, పతంజలి, జండు ప్రతినిధులు ఖండించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఎఐ) నిర్దేశించిన ప్రమాణాలకనుగుణంగానే ఉందని వాదిస్తున్నాయి. సీఎస్ఈ విడుదల చేసిన రిపోర్టు అవాస్తవమైందనీ, ఇండియన్ నాచురల్ హనీ ఇండస్ట్రీని దెబ్బ తీసే కుట్ర జరుగుతోందని పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ వివాదంపై ప్రముఖ ఆయుర్వేద, హెర్బల్ ఉత్పత్తుల సంస్థ డాబర్ స్పందిస్తూ ప్రపంచంలోనే నంబర్ వన్ తేనె డాబర్ హనీ అని, తమ తేనె 100 శాతం స్వచ్ఛమైంది, సురక్షితమైందని తెలిపింది. తమ తేనెలో కల్తీ జరగలేదని ట్వీట్ చేసింది. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో తేనె అమ్మకాలు పెరిగినప్పటికీ ఉత్తర భారతదేశంలో తేనెటీగల పెంపకందారులు లాభాలు క్షీణించాయని, దీంతో దర్యాప్తు ప్రారంభించినట్లు సీఎస్ఈ డైరెక్టర్ జనరల్ సునీతా నరేన్ తెలిపారు. శీతల పానీయాలపై 2003, 2006 సంవత్సరాల్లో తాముచేపట్టిన పరిశోధనలో పరిశోధనలలో కనుగొన్న దానికంటే దుర్మార్గమైన, దారుణమైన మోసాన్ని గుర్తించామన్నారు. అతి ఘోరమైన, అధునాతన కల్తీ ఇదని, ఇప్పటివరకు గుర్తించినదానికంటే చాలా ఎక్కువ హానికరమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మనం ప్రాణాంతక మహమ్మారితో పోరాడుతున్నామనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని నరేన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్-19 పై పోరులో భాగంగా చాలామందితేనెను విరివిగా వినియోగిస్తున్న తరుణంలో ఈ ఫలితాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. తేనెలోకల్తీని గుర్తించడం కష్టమని ఫుడ్ సేఫ్టీ అండ్ టాక్సిన్స్ టీం ప్రోగ్రామ్ డైరెక్టర్ అమిత్ ఖురానా అన్నారు. సీఎస్ఈ అధ్యయనం ప్రకారం , ప్రారంభంలో తేనెలో తీపిని పెంచేందుకు మొక్కజొన్న, చెరకు, బియ్యం, బీట్రూట్ నుండి తీసిన చక్కెరను తేనెలో కల్తీ చేసేవారు. ఇది సీ3, సీ4 పరీక్షల్లో బయటపడుతుంది. కానీ ఈ కొత్త కల్తీ ‘చైనీస్ సుగర్’ ను న్యూక్లియర్ మాగ్నెటిక్ రెసొనెన్స్ (ఎన్ఎంఆర్) అనే పరీక్ష ద్వారా మాత్రమే గుర్తించగలం. ప్రముఖ బ్రాండ్లైన డాబర్, పతంజలి, బైద్యనాథ్, జండు, హిత్కారీ, అపిస్ హిమాలయా సంస్థలనుంచి సేకరించిన తేనె నమూనాలు ఎన్ఎంఆర్ పరీక్షలో విఫలమయ్యాయి. మారికో సఫోలా హనీ, మార్క్‌ఫెడ్ సోహ్నా, నేచర్ నెక్టా మాత్రమే అన్ని పరీక్షల్లో నెగ్గాయి. World's No. 1 Dabur Honey is 100% Pure & Safe! ✅We are NMR profiled ✅We are 22 FSSAI tests compliant. Dabur Honey clears all FSSAI tests and has the first corporate-owned NMR machine in India to ensure 100% purity. Read the complete report here, https://t.co/hLlEEMzh2M pic.twitter.com/J36fBkvnKG — Dabur India Ltd (@DaburIndia) December 2, 2020 -
కరోనా వైరస్: విస్కీతో విరుగుడు!
బీజింగ్: చైనాలో బయటపడ్డ కరోనా వైరస్ రోజు రోజుకూ ఖండాలు దాటుతోంది. దీని దెబ్బకు చైనాలోని ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. అయితే ఈ ప్రాణాంతక మహామ్మారిని తేనె, మద్యంతో అరికట్టవచ్చని ఓ బ్రిటీష్ ఉపాధ్యాయుడు చెబుతున్నాడు. వివరాలు.. బ్రిటన్‌కు చెందిన కానర్ రీడ్ అనే వ్యక్తి చైనాలోని వుహాన్‌లో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కరోనా వైరస్ గురించి మాట్లాడుతూ.. ‘రెండు నెలల క్రితం నేను తీవ్రమైన దగ్గు, జలుబుతో కూడిన ఫ్లూ, న్యుమోనియాతో బాధపడ్డాను. చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లగా నా శరీరంలో చిన్న క్రిమి ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. రెండు వారాలు పాటు ఆసుపత్రిలో ఉండాలని డాక్టర్లు సూచించారు. ఇక నాకు శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా ఉండటంతో బ్రీత్ అనలైజర్ కూడా పెట్టుకున్నాను’ అని చెప్పుకొచ్చాడు. అయితే డాక్టర్లు సూచించిన ఆంటీ బయాటిక్ మందులను సున్నితంగా తిరస్కరించానని.. సొంత వైద్యానికే మొగ్గు చూపానని తెలిపాడు. వ్యాధి నివారణలో భాగంగా.. ఒక గ్లాసు వెచ్చని విస్కీలో తేనె కలుపుకుని తాగే వాడినని, ఇలా క్రమంగా తీసుకోవడంతో తన ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని.. తనలో ఉన్న ఆ వైరస్కూడా చనిపోయిందని పేర్కొన్నాడు. ఇక తాను పూర్తిగా కోలుకోవడానికి తగిన విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందన్నాడు. ఇలా విస్కీతో తాను ఆ వైరస్‌ను జయించానని పేర్కొన్నాడు. కాగా తనకు వచ్చి ఆ వ్యాధి లక్షణాలు, కరోనా వైరస్ లక్షణాల ఒకేలా ఉన్నాయని, ఒకవేళ నాకు సోకింది కరోనా వైరస్ అయ్యుంటే ఇలా విస్కీ, తేనెతో ఆరికట్టవచ్చు అని చెప్పుకొచ్చాడు. కాగా, మూడేళ్లుగా చైనాలో ఉంటున్నానని తెలిపిన కానర్.. ఎప్పుడూ జనసంద్రంగా ఉండే వుహాన్ కరోనా వల్ల ఒక్కసారిగా దెయ్యాల నగరంగా మారిందన్నాడు. ఇక్కడి ప్రజలు బయట కాలు పెట్టడానికే జంకుతున్నారని, ఇక ముసుగు లేకుండా బయటకు వస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారని తెలిపాడు. ఈ కరోనా వైరస్ వల్ల చైనాలో ఇప్పటికే 490కి పైగా మంది మృతి చెందగా.. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20 వేలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదు అయినట్లు సమాచారం. (చైనా వెళ్లినవారి వీసాలను రద్దు చేసిన భారత్) -
మార్కెట్లోకి జీసీసీ ‘హనీ ట్విగ్స్’
సాక్షి, హైదరాబాద్: ‘గిరి’తేనెను ప్రతి ఇంటికీ చేర్చాలనే లక్ష్యంతో గిరిజన సహకార సంస్థ(జీసీసీ) వ్యూహాత్మక ప్రణాళిక రూపొందించింది. టమోటా సాస్ సాకెట్ల తరహాలో తేనెను తక్కువధరకు లభ్యమయ్యేలా ‘హనీ ట్విగ్స్’రూపంలో మార్కెట్లోకి తెచ్చింది. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గురువారం ఈ ఉత్పత్తిని ప్రారంభించారు. హనీ ట్విగ్స్ పేరిట విడుదల చేసిన సాకెట్లో 8 మిల్లీలీటర్ల తేనె ఉంటుంది. ఒక బాక్స్‌లో 20 ప్యాకెట్లు ఉంటాయి. ఏటా 90 మెట్రిక్ టన్నుల తేనె విక్రయం ఏటా గిరిజనుల నుంచి సేకరించిన తేనెను శుద్ధి చేసిన తర్వాత ‘గిరి హనీ’పేరిట కిలో, అరకిలో బాటిల్స్ రూపంలో దాదాపు 90 మెట్రిక్ టన్నుల మేర మార్కెట్లో విక్రయి స్తోంది. ఇందుకోసం ఆసీఫాబాద్‌లో జీసీసీ తేనె ప్రాసెసింగ్ యూనిట్‌ను తెరిచింది. ఈ ఏడాది హనీ ట్విగ్స్ రూపంలో 25 మెట్రిక్ టన్నుల తేనెను విక్రయించాలని లక్ష్యంగా జీసీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ‘‘తేనెలో కార్బోహైడ్రేడ్లు్ల, విటమిన్ సి, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. పిల్లలకు సత్వర శక్తి పొందేందుకు ఉపయోగపడుతుంది. చాక్లెట్లు, బిస్కట్లు అందించే బదులుగా హనీ ట్విగ్స్ను అందుబాటులోకి తీసుకొచ్చింది’’అని జీసీసీ ఉన్నతాధికారి వి.సర్వేశ్వర్‌రెడ్డి సాక్షితో చెప్పారు. -
పెదవులు మృదువుగా...
►పెదవులు పొడిబారుతుంటే... కీరదోస ముక్కతో ఐదు నిమిషాల సేపు పెదవుల మీద వలయాకారంగా మర్దన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం చేస్తే మూడు లేదా నాలుగు రోజుల్లోనే పెదవులు మృదువుగా మారతాయి. ►టేబుల్ స్పూన్ తేనె, గుడ్డులోని తెల్లసొన కలిపి ముఖానికి ప్యాక్‌లా వేయాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. జిడ్డును తొలగించి, ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది ఈ ప్యాక్. ►టీ స్పూన్ పెరుగు, అర టీ స్పూన్ ఆరెంజ్ జ్యూస్ కలిపి ముఖానికి రాయాలి. వేళ్లతో కొద్దిగా మసాజ్ చేసి, ఐదు నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల మలినాలు తొలగి, చర్మం కాంతివంతం అవుతుంది. -
ఇవి తినండి సరి అవుతుంది
ఆధునిక జీవన శైలిలో దేహ కదలికలు తగ్గిపోయాయి. దాంతో జీవక్రియల వ్యవస్థ గాడి తప్పడమూ ఎక్కువైంది. దానికి తోడు చలికాలంలో దేహక్రియల్లో ఒడిదొడుకులు ఎదురవుతుంటాయి. వీటన్నింటి కారణంగా ప్రతి పదిమందిలో ఏడుగురు మహిళలు పీరియడ్స్ క్రమం తప్పడం అనే సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనిని నివారించడానికి మందుల మీద ఆధారపడాల్సిన పని లేదు. ఆహారంలో మార్పులు చేసుకుంటే చాలని గైనకాలజిస్టులు సూచిస్తున్నారు. ►చలికాలంలో రోజూ కొద్దిగా బెల్లం తింటూ ఉంటే రుతుక్రమం సక్రమంగా ఉంటుంది. రుతుస్రావ సమయంలో వచ్చే కడుపు నొప్పిని కూడా బెల్లం అరికడుతుంది. ►ముప్పై రోజులు దాటినా కూడా పీరియడ్స్ రాకుండా ఉన్నప్పుడు విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లు, కూరలను తీసుకోవాలి. బొప్పాయిలోని ఆస్కార్బిక్ యాసిడ్ ఈస్ట్రోజెన్ హార్మోన్ల మీద ప్రభావం చూపించి సమస్యను సరిదిద్దుతుంది. ఈ సమస్యను పరిష్కరించే మరికొన్ని పండ్లు పైనాపిల్, మామిడి, కమలాలు, నిమ్మ, కివి. ►పచ్చి అల్లం తరుగులో స్వచ్ఛమైన తేనె కలిపి ప్రతి రోజూ ఉదయం తీసుకోవాలి. ఇవి హార్మోన్లలో అసమతుల్యతను క్రమబద్ధీకరిస్తాయి. ►స్వచ్ఛమైన పసుపును రోజూ ఆహారంలో తీసుకోవాలి. పీరియడ్స్ ఆలస్యమైతే గ్లాజు వేడి పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగుతుంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ సమస్య తలెత్తదు. పసుపును తేనెతో కలిపి చప్పరించినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ►పీరియడ్స్ సక్రమంగా రావడం, కండరాల నొప్పిని తగ్గించడంలో కాఫీ కూడా మంచి మందే. కాఫీలో ఉండే కెఫీన్ ఈస్ట్రోజెన్ హార్మోన్‌ను ప్రభావితం చేస్తుంది. ►బీట్రూట్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్, క్యాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి దేహక్రియలను సక్రమంగా ఉంచుతాయి. ►ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ చక్కెర, ఒక స్పూన్ వాము లేదా వాము పొడి వేసి మరిగించి తాగాలి. రోజూ ఉదయాన్నే పరగడుపున ఈ టీ (కాన్కాక్షన్) తాగితే పీరియడ్ సక్రమం కావడంతోపాటు మెన్స్ట్రువల్ పెయిన్ కూడా ఉండదు. -
ఆపిల్ ప్యాక్
►ఆపిల్ పై తొక్క తీసి, ముక్కలు కోసి, మిక్సర్‌లో వేసి గుజ్జు చేయాలి. దీంట్లో రెండు టీ స్పూన్ల తేనె, విటమిన్–ఇ క్యాప్సుల్ మిశ్రమం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసి, పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ ముఖ చర్మాన్ని మృదువుగా మార్చుతుంది. ►సగం ఆపిల్ ముక్కను ఉడికించి గుజ్జు చేయాలి, అందులో రెండు టేబుల్ స్పూన్ల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని పదినిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచి, తీసి, ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ ఫేస్‌ప్యాక్ ముడతలను నివారిస్తుంది. ►సగం ముక్క ఆపిల్‌ను తరగాలి. రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్, టేబుల్ స్పూన్ కొబ్బరి పాలు కలిపి మెత్తగా నూరి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసి మృదువుగా వేళ్లతో రాయాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. కొబ్బరిపాలు లేదంటే మజ్జిగ కలుపుకోవచ్చు. ఈ ప్యాక్ పొడిబారిన చర్మాన్ని మృదువుగా చేస్తుంది. -
బ్లాక్‌హెడ్స్‌ను తొలగించే ఎఫెక్టివ్ టిప్
అందంగా, కనిపించాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఉన్నంతలో చక్కగా తయారవ్వడం ఎవరికైనా ఇష్టమే. అందం మనలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అయితే కొంత మందికి అనేక కారణాలతో ముఖం మీద మచ్చలు, బ్లాక్‌హెడ్స్ వంటి సమస్యలు ఏర్పడతాయి. అలాంటి బ్లాక్‌హెడ్స్‌ను వదిలించుకోవడానికి చాలా మంది సెలూన్తోపాటు బ్యూటీ ప్రొడక్ట్స్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. అయితే అలాంటివి వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయని చాలా మంది భయపడుతుంటారు. చాలామంది ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అయినా కూడా చర్మం పొడిబారి పోవడం, నల్లగా మారడం వంటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ఇక ఎండలో బయట తిరిగినప్పుడు ముఖం మీద ధూళి కణాలు చేరి చివరికి బ్లాక్ హెడ్స్ ఏర్పడటానికి దారితీస్తాయి. మొటిమలు, వైట్‌హెడ్స్, బ్లాక్‌హెడ్స్ వంటి చర్మ సమస్యలు గల వారికి చర్మం జిడ్డులాగా మారుతుంది. అయితే ఇంట్లో లభించే కొన్ని వస్తువుల ద్వారా ఇలాంటి వాటిని సులువుగా వదిలించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మచ్చలు, బ్లాక్‌హెడ్స్ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది. అంతేగాక మీ చర్మం బయటి నుంచే కాకుండా లోపల నుంచి తాజాగా మెరిసిపోవడం గ్యారంటీ అంటున్నారు నిపుణులు... అవేంటో వాటి వైపు ఓ కన్నేద్దాం... కావలసిన పదార్థాలు ► అరటిపండు ► తేనే(ఒక టేబుల్ స్పూన్) ► ఓట్స్(ముద్దగా చేయాలి) ఉపయోగించే విధానం ముందుగా అరటి పండును గుజ్జుగా, ఓట్స్‌ను మెత్తగా పొడి చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. ఆ తరువాత ఓ గిన్నె తీసుకొని అందులో ఓట్స్, తేనె, గుజ్జుగా చేసిన అరటిపండుతో కలిపి మిక్స్ చేయాలి. బాగా కలిపిన తర్వాత దానిని జాగ్రత్తగా ముఖానికి బ్లాక్‌హెడ్స్ ఉన్న చోట మాస్క్‌లాగా అప్లై చేయాలి. ఇలా చేసిన తర్వాత 5 నుంచి 7 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత గోరు వెచ్చని నీళ్లతో కడుక్కోవాలి. చివరగా ముఖంపై మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఉపయోగాలు.. ► ఓట్స్ వల్ల చర్మంలోని మృతకణాల తొలగించడంతోపాటు, ముఖంపై ఉన్న ధూళిని తొలగిస్తుంది. ► అంతేగాక చర్మం నుంచి అధికంగా ఉన్న ఆయిల్‌ను గ్రహించే శక్తి ఓట్స్‌కు ఉంటుంది. ► ఇక తేనె ముఖంలోని బాక్టీరియాను పొగొట్టేందుకు ఉపయోగపడుతుంది. ► మోముపై మెరుపును తీసుకువచ్చి..కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది. చర్మంలో కోల్పోయిన తేమను తిరిగి తెస్తుంది. ► ఓట్స్, అరటిపండు మిక్స్ చేయడం వల్ల ఎక్స్‌ఫోలియేటింగ్ శక్తిని రెట్టింపు చేస్తుంది. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. ఇది జిడ్డుగల చర్మం వారితోపాటు అన్ని రకాల చర్మం గల వారికి సహాయపడుతుది. ఇంకేందుకు ఆలస్యం ఇకపై ఫేస్ ప్యాక్ చేసుకునే ముందు దీన్ని ప్రయత్నించండి. ఇక బ్లాక్‌హెడ్స్‌కు బై-బై చెప్పండి. -
చర్మం కాంతివంతం ఇలా...
తేనె, చక్కెర సమపాళ్లలో తీసుకుని బాగా కలిపి కళ్ల చుట్టూ మినహాయించి, ముఖానికి, మెడకు పట్టించి, వలయాకారంగా మర్దన చేయాలి. ఇది చర్మానికి నునుపుదనం తీసుకురావడంతోపాటు మృతకణాలను తొలగిస్తుంది. మొటిమలతో గుంతలు పడిన చర్మానికి తరచుగా ఈ ట్రీట్మెంట్ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ♦ రెండు టేబుల్స్పూన్ల టొమాటో జ్యూస్, 50 గ్రా.ల ఓట్స్, 25 గ్రా.ల పెరుగులో కప్పుడు నీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. బ్లాక్‌హెడ్స్, మొటిమలు తగ్గి చర్మం మృదువుగా కాంతివంతంగా కనిపిస్తుంది. ♦ రెండు టీ స్పూన్ల క్యారెట్ తురుము, టీ స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమానికి రెండు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ చేర్చి దీనితో ముఖాన్ని మృదువుగా రబ్ చేసి, పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి జీవకాంతి లభిస్తుంది. ♦ రెండు టీ స్పూన్ల తేనెలో చిటికెడు దాల్చిన చెక్క పొడిని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోబోయే ముందు ముఖానికి అప్లై చేసి వేళ్లతో 20 నిమిషాలపాటు మృదువుగా మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా సమయం దొరికినప్పుడల్లా చేస్తుంటే ముఖంపైన జిడ్డు, మొటిమలు తగ్గి చర్మం కాంతివంతంగా ఉంటుంది. ♦ మూడు టీ స్పూన్ల దోసరసం, రెండు టీ స్పూన్ల అలొవెరా జెల్, టీ స్పూన్ పెరుగు కలిపి ముఖానికి, మెడకు పట్టించి, పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఎండవల్ల కందిపోయిన, రసాయనాల వల్ల ర్యాష్ ఏర్పడిన చర్మానికి ఈ ప్యాక్ సహజమైన సౌందర్యలేపనంలా పనిచేస్తుంది. ♦ బంగాళదుంపని మెత్తగా ఉడకబెట్టి పొట్టు తీయకుండా మెదుపుకోవాలి. దీంట్లో పాలు, కొబ్బరి నూనె జత చేసి పేస్ట్‌లా కలపాలి. మెడపై ఈ మిశ్రమాన్ని అప్లై చేసి, 20 నిమిషాల తరవాత కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే మెడ మీద నలుపు తగ్గి చర్మం కాంతివంతం అవుతుంది. -
ప్రపంచంలో అత్యంత ఖరీదైన తేనె ఇదే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తేనె అంటే ఇష్టపడని వారుండరు. సహజసిద్ధమైంది కావడం, ఔషధ గుణాలు బోలెడు ఉడడం, అలాగే రుచిలో మేటి కారణంగా దీని స్థానం ఎప్పుడూ ప్రత్యేకమే. మినరల్స్, విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్ నిండుగా ఉండడంతో ఫుడ్ సప్లిమెంట్స్, సౌందర్య సాధనాలతోపాటు ఔషధాల తయారీలో కూడా తేనెను విరివిగా వాడుతున్నారు. ఒక్క భారత్ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ ఉత్పాదనకు డిమాండ్ 365 రోజులూ ఉంటుంది. భారత్‌లో తేనె వ్యాపారం విలువ 2018లో సుమారు రూ.1,560 కోట్లు నమోదైంది. ఏటా 10.2 శాతం వృద్ధితో 2024 నాటికి ఇది రూ.2,806 కోట్లకు చేరుకోనుందని మార్కెట్ వర్గాల సమాచారం. వందకుపైగా రకాలు.. తేనెటీగలు 300–350 రకాల పూల నుంచి హనీని సేకరిస్తాయి. ఫ్లవర్స్ నాణ్యతనుబట్టి రంగు, రుచి, వాసన, టెక్స్చర్ మారుతుంది. తెలుపు, పసుపు, నలుపు, గోధుమ తదితర వర్ణాల్లో తేనె లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 100కుపైగా రకాల హనీ తయారవుతోంది. ‘మూడు నుంచి ఆరు వారాల జీవిత కాలం ఉండే తేనెటీగ సుమారు 10 గ్రాముల తేనెను ఉత్పత్తి చేస్తుంది. 40 లక్షల పూల నుంచి సేకరించిన మకరందంతో 4 కిలోల తేనెతుట్టె సిద్ధమవుతుంది. దీని నుంచి 1 కిలో తేనె వస్తుంది’ అని జీనోమ్‌ల్యాబ్స్ బయో ఈడీ అశోక్ కుమార్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. తేనెను వేరు చేయగా వచ్చే నీరు, పుప్పొడిని ఫుడ్ సప్లిమెంట్స్, బ్యూటీ ప్రొడక్ట్స్, మెడిసిన్స్‌లో వాడుతున్నారు. ‘అరుదైన తేనెతో విభిన్న ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్నాం. ఫ్లోనీ బ్రాండ్‌లో ప్రీమియం వెరైటీలను ఇప్పటికే ప్రవేశపెట్టాం’ అని తెలిపారు. వినియోగం, తయారీలోనూ..: వినియోగం పరంగా యూఎస్, యూరప్, చైనా, భారత్, ఆస్ట్రేలియా ప్రధాన మార్కెట్లుగా ఉన్నాయి. ప్రీమియం హనీ ఉత్పత్తికి యూరప్‌లోని హంగేరీ పెట్టింది పేరు. యూఎస్, న్యూజీలాండ్, కెనడా, చైనా, భారత్‌లో తేనె పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతోంది. వినియోగం, తయారీ పరంగా భారత్ ప్రధాన దేశాల్లో ఒకటిగా నిలిచింది. రూ.1,560 కోట్ల భారత హనీ విపణిలో వ్యవస్థీకృత రంగం వాటా రూ.1,200 కోట్లుంది. డాబర్, పతంజలి, జంఢు, ఏపిస్, రస్న తదితర బ్రాండ్లు పోటీపడుతున్నాయి. ఇవేగాక ఆర్గానిక్ విభాగంలో 24 లెటర్ మంత్ర, ప్రో నేచుర్, ఆర్గానిక్ తత్వ, నేచుర్ ల్యాండ్ వంటి బ్రాండ్లు ఉన్నాయి. పేరుకు తగ్గట్టే రాయల్.. మనుక, అకేషియా, లిండేన్, మిల్క్‌వీడ్, బ్లాక్‌బెర్రీ, బ్లూబెర్రీ, క్లోవర్ వంటి పూలు చాలా ఖరీదైనవి. పలు దేశాల్లో ఈ పూల మొక్కలతో ప్రత్యేక తేనె ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. రసాయనాలు వాడకుండా పూర్తిగా సేంద్రియ పద్ధతిలో ఈ మొక్కలను పెంచుతున్నారు. వీటి తేనె ఖరీదు కిలోకు రూ.1 లక్షకుపైగా ఉంటోంది. హనీ రకాల్లో అత్యంత ఖరీదైంది రాయల్ జెల్లీ. ఇతర వెరైటీలతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నంగా పేస్ట్ మాదిరి గా ఉంటుంది. క్వీన్ బీ నుంచి సేకరించిన 30 ప్లస్ గ్రేడ్ వెరైటీ కిలో ధర రూ.1.5 లక్షల పైమాటే. ఇది వాడడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టే ఈ స్థాయి ఖరీదు ఉంది. -
మెరిసే చర్మం కోసం..
నిగనిగలాడే చర్మ సౌందర్యాన్ని సొంతం చేసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందుకోసం బోలేడు డబ్బు ఖర్చు చేసి రకరకాల బ్యూటీ ప్రోడక్ట్స్ వాడుతుంటారు. కానీ ఇంట్లో దొరికే పదార్ధాలతోనే అందమైన మేనిని సొంతం చేసుకోవచ్చు. అదేలాగో చూడండి. శరీరం కాంతీవిహీనంగా మారడానికి ప్రధాన కారణం చర్మంపై ఉండే బ్లాక్ హెడ్స్, జిడ్డు. దానికి తోడు బయట వాతావరణంలోని దుమ్ము, ధూళీ మన శరీరం మీద బ్లాక్ హెడ్స్‌తో కలవడంతో మరిన్ని సమస్యలు. వీటి నివారణ కోసం జనాలు పార్లర్ల చుట్టూ తిరుగుతూ.. బ్యూటీ ఉత్పత్తుల మీద డబ్బు ఖర్చు చేస్తుంటారు. అయితే కాస్త ఓపిక చేసుకుంటే.. మన వంటింట్లో దొరికే పదార్థాలతోనే.. చాలా తక్కువ ఖర్చుతో ప్రకాశవంతమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. అన్ని సహజమైన పదార్ధాలే కాబట్టి దుష్ప్రభావాల మాటే ఉండదు. అవేంటో మీరు చూడండి. కావాల్సిన పదార్థాలు.. అరటి పండు(మెత్తనిది), ఓట్స్ - రెండు టేబుల్ స్పూన్స్(పొడి చేసుకోవాలి), తేనె - 1 టేబుల్ స్పూన్ విధానం.. పైన చెప్పిన పదార్థాలన్నింటిని ఒక పాత్రలో తీసుకుని బాగా కలపాలి. ముందుగా చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఈ ప్యాక్‌ను అప్లై చేయాలి. 5-7 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపర్చుకోవాలి. తర్వాత మాయిశ్చరైజర్‌ను అప్లై చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ప్రకాశవంతమైన చర్మం మీ సొంతం. ఓట్స్ చర్మం మీద ధూళిని తొలగించడంతో పాటు శరీరంపై వచ్చే జిడ్డును నివారిస్తుంది. ఓట్స్, తేనె మిశ్రమం యాంటీ బాక్టీరియల్‌గా ఉపయోగపడటంతో పాటు సూక్ష్మజీవుల నివారిణిగా కూడా పని చేస్తుంది. చర్మానికి తేమను అందించడంలో అరటి ఎంతో సహాయపడుతుంది. -
బంగాళదుంప నీటితో కురుల నిగారింపు...
►బంగాళదుంపను తురిమి, ఒక పల్చటి క్లాత్‌లో వేసి, పిండి, రసం తీయాలి. ఒక పాత్రలో మూడు టీ స్పూన్ల బంగాళాదుంప రసం, గుడ్డులోని తెల్లసొన, టీ స్పూన్ పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించాలి. 10–15 నిమిషాల తర్వాత వెచ్చని నీటిని ఉపయోగిస్తూ షాంపూతో తలస్నానం చేయాలి. వారంలో మూడు సార్లు ఇలా చేస్తూ ఉంటే జీవం లేని కురుల నిగనిగలు పెరుగుతాయి. ►బంగాళాదుంప తొక్క తీసి, నీటిలో వేసి, 20 నిమిషాలు ఉడికించి, తీయాలి. షాంపూతో తలస్నానం చేసిన తర్వాత బంగాళాదుంప ఉడికించిన నీటితో జుట్టును కడగాలి. తల స్నానం చేసిన ప్రతీసారీ ఇలా చేస్తూ ఉంటే తెల్ల జుట్టు ఎరుపురంగులోకి మారుతుంది. ►జుట్టు రాలే సమస్య అధికంగా ఉంటే.. మూడు టీస్పూన్ల బంగాళాదుంప రసం, మూడు టీ స్పూన్ల అలొవెరా రసం, రెండు టీ స్పూన్ల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, అరగంట ఆరనివ్వాలి. తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. -
ముఖమా! ముత్యమా!
మార్చి, ఏప్రిల్, మే.. మూడు నెలలు ఎండలు దంచి కొట్టాయి. రోట్లో స్వయానా మనమే ఎండు మిరపకాయలు దంచి కొట్టినా ఇంతగా మంటెత్తిపోదేమో. ప్రచండుడు ప్రతాపం చూపించాడు. రెండు మూడు రోజుల్లో రుతు ³వనాలు అంటున్నారు. వానలే వానలు. సంతోషమే కదా. భూమి చల్లబడుతుంది. మన ఇళ్లూ, ఒళ్లూ చల్లబడతాయి. అయితే ఇన్నాళ్లూ ఎండలకు ఛాయ తగ్గిన మోము మాటేమిటి? మెల్లిగా మునుపటి మెరుపులోకి తెచ్చుకోవలసిందే. అయితే అందుకోసం గొడుగు వేసుకుని సూపర్ బజార్‌కి పరుగెత్తే పని లేదు. ఇంట్లో ఉండి, ఇంట్లో ఉండేవాటితో ముఖ కాంతిని చల్లని చంద్రకాంతిలా వెలిగించుకోవచ్చు. ‘ఒట్టిమాటలు కట్టిపెట్టోయ్.. గట్టిమేల్ తలపెట్టవోయ్’ అంటున్నారా.. ఇంటి క్రీమ్‌లు అనగానే! క్రీమ్‌లు కావివి. కీర దోసకాయలు, బేసన్ ఫ్లోర్.. (సెనగపిండి), పసుపు, పెరుగు, తేనె, నిమ్మ, పాలు. అంతే! అన్నిటినీ కలిపి ముఖానికి టచింగ్ ఇవ్వమనడం లేదు. కాంబినేషన్లతో మూడు రకాలుగా ప్రయోగిస్తే చాలు. వా..డా..య్.. అంటూ మీ ముఖంలోకి కాటుక లేని అందమైన చంద్రముఖి వచ్చేస్తుంది. దోస్కాయ్ తీస్కోండి దోసంటే కీర దోస. రౌండ్‌గా చక్రాల్లా కొయ్యండి. రౌండ్‌గా ఎలా కొయ్యాల్రా దేవుడా అని కంగారు పడకండి. కళ్లు మూసుకుని కోసినా.. కీర చక్రాలు చక్రాలుగానే వస్తుంది. ఆ చక్రాలను కళ్ల మీద పెట్టుకోనవసరం లేదు. మెల్లిగా ముఖమంతా రుద్దండి. ఒకే చక్రాన్ని కాదు. ముఖానికంతటికీ చాలినన్ని చక్రాలు. ఇప్పుడు ముఖమంతా కీరా అయింది కదా. అదే.. కీరా రుద్దడంతో తడితడిగా అయింది కదా. ఆ తడిని పది నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడిగేయండి. వెంటనే మెరిసిపోతుందా ముఖం?! మెరుపు కనిపిస్తుంది.. మంచి మెరుపు కోసం వారానికి రెండుసార్లైనా కీరాను కొయ్యాల్సిందే. సెనగ ప్యాక్ వేస్కోండి కీరాతో రుద్ది కడిగాక సెనగ ప్యాక్ వెయ్యమని కాదు. అది వేరు. ఇది వేరు. ఇదింకో టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ అనే మాట బాగోలేదా! అయితే సౌందర్యసాధనం అందాం. రెండు టేబుల్స్పూన్ల సెనగ పిండి తీసుకోండి. బజ్జీలు వేసే సెనగపిండే. ఇక రెండు టేబుల్స్పూన్లంటే రెండు రెండు చిన్న కూరగరిటెలంత. టీస్పూన్ లెక్క వేరు. కాఫీని, టీని కలపడానికి ఉపయోగించే స్పూన్ టీస్పూన్. సరే, ఇవి మీకు తెలియనివా కానీ, ఇప్పుడేం చేస్తారంటే సెనగపిండిలో టీ స్పూను పసుప్పొడి కలపండి. అందులోనే ఒక టేబుల్ స్పూన్ పెరుగు వెయ్యండి.మూడింటినీ మిక్స్ చెయ్యండి. బాగా పేస్ట్‌లా వచ్చేయాలి. ఆ పేస్ట్‌ని బ్రష్‌తో ముఖానికికంతటికీ అద్దండి. మళ్లీ ఈ బ్రెష్ ఎక్కడి నుంచి తేవాలి! ఫేస్‌ప్యాక్ బ్రెష్ అని బయట అమ్ముతారు కానీ.. అక్కర్లేదు, వేళ్లతో మృదువుగా ముఖానికి పామేయండి. అదంతా ఆరిపోయేవరకు ఆగి, ఆ తర్వాత శుభ్రంగా కడిగేయండి. చల్లని నీళ్లతోనే. ముఖం తళతళ. మార్పు ఇమ్మీడియెట్‌గా కనిపిస్తుంది. తేనె, నిమ్మ రాస్కోండి రెండు చిన్నగరిటెల తేనె, ఒక టీస్పూన్ నిమ్మరసం కలపండి. మంచి వాసనొస్తుంది. తినబుద్ధవుతుంది. తినకండి. మనం పెట్టుకున్న పని వేరే కదా. ఆ సెషన్ (తినే సెషన్) మరోసారెప్పుడైనా పెట్టుకుందాం. ఇప్పుడైతే ముఖానికి పూసుకోండి. పావు గంట తర్వాత చల్లటి నీటితో కడిగేయండి.ఈ మూడు ట్రిక్లలో (మీ ముఖం ఎలా ఇంతగా మెరిసిపోతుంది అని అడిగినవారికి చెప్పకపోతే అది ట్రిక్కే కదా).. ‘చల్లటి నీరు’ అనే మాట కనిపించింది కదా. చల్లటి నీరు అంటే ఫ్రిజ్‌లోని వాటర్ కాదు. ముఖానికి హాయినిచ్చేంత చల్లగా ఉండే నీరు. ఎటూ వర్షాలు మొదలై వాతావరణ చల్లబడబోతోంది కాబట్టి ట్యాంకులోని నీళ్లు, తొట్లలోని నీళ్లు, బిందెల్లోని నీళ్లు చల్లగానే ఉంటాయి. అవి చాలు. ఓ మగ్గు నీటితో మెరిసేయొచ్చు.. ఒకవేళ వర్షాలొచ్చినా.. మీ కాలనీలో నీళ్లు రాకపోతుంటే.గుర్తుంచుకోండి.. ఈ మూడు ఒకేసారి, ఒకే రోజు చేయవలసినవి కాదు. మీ మూడ్‌ని బట్టి, మీ టైమ్‌ని బట్టి, కిచెన్‌లో మీకు అందుబాటులో ఉన్నవాటిని బట్టి ఏదో ఒకటి ఎంచుకుని చెయ్యండి. ఇంకో రోజు ఇంకోటి.. తర్వాత ఇంకోటి.. ఇలా!వెలిగిపోతున్న మీ ముఖాన్ని చేసి, అంత కాంతిని భరించలేక సూర్యుడే తన కళ్లకు చెయ్యడ్డు పెట్టకోవాలి. దెబ్బకు దెబ్బ తియ్యకుండా ఊరుకుంటామా మరి. -
ముంజల వారి విందు
ఐస్‌ను ఫ్రై చేసుకుని తింటే ఎలా ఉంటుంది?అడిగినవారికి మైండ్ లేదనిపిస్తోంది కదూ!కానీ మీకు తెలుసా... ఫ్రైడ్ ఐస్ క్రీమ్ దొరుకుతుందని!అలాగే చల్లటి ముంజలను వేడివేడిగా వండుకుని తినొచ్చు!ప్రయత్నించండి! వేడివేడిగా తినండి.కడుపును చల్లబరచండి. నొంగు పాల్ కావలసినవి: లేత ముంజలు – 6 (తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి); పాలు – 2 కప్పులు; పంచదార/తేనె – 1 టేబుల్‌స్పూను; ఏలకుల పొడి – పావు టీ స్పూను తయారీ: ►ఒక పాత్రలో పాలు పోసి స్టౌ మీద ఉంచి బాగా కాగిన తరవాత, మంట బాగా తగ్గించి, పాలు మూడు వంతులయ్యే వరకు మరిగించాలి ►పంచదార/తేనె జత చేసి బాగా కలియబెట్టాలి ►ఏలకుల పొడి జత చేసి ఆపకుండా కలుపుతుండాలి ►అన్నీ బాగా కరిగిన తరవాత దింపి చల్లార్చాలి ►ముంజలను చేతితో మెత్తగా మెదిపి, మరిగించిన పాలకు జత చేసి బాగా కలపాలి ►ఫ్రిజ్‌లో ఉంచి రెండు మూడు గంటల తరవాత బయటకు తీసి, చల్లగా అందించాలి. (నన్నారి, పిస్తా, రోజ్, చాకొలేట్, కేసర్ టూటీ ఫ్రూటీలతో కూడా తయారు చేసుకోవచ్చు) ముంజలు మునగ కాడ కర్రీ కావలసినవి: లేత ముంజల గుజ్జు – 2 కప్పులు; లేత మునగకాడ ముక్కలు – ఒక కప్పు; టొమాటో తరుగు – అర కప్పు; ఉల్లి తరుగు – అర కప్పు; పనీర్ తురుము – పావు కప్పు; గసగసాలు + జీడి పప్పు + ఎండు కొబ్బరి పేస్ట్ – ఒక టేబుల్ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 6; నూనె – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు. తయారీ: ►స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చి మిర్చి ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి ►మునగ కాడల ముక్కలు వేసి కొద్దిగా వేయించాలి ►టొమాటో తరుగు, ఉల్లి తరుగు ఒకదాని తరవాత ఒకటి వేసి కొద్దిసేపు వేయించాలి ►ముంజల గుజ్జు జత చేసి బాగా కలపాలి ►కొద్దిగా నీళ్లు, తగినంత ఉప్పు జత చేసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి ►కొద్దిగా ఉడికిన తరవాత పనీర్ తురుము, గసగసాలు + జీడి పప్పు + ఎండు కొబ్బరి పేస్ట్ జత చేసి కలియబెట్టి, మరి కొద్ది సేపు ఉడికించాలి ►కొత్తిమీర తరుగుతో అలంకరించి దింపేయాలి ►వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది. ముంజల డ్రింక్ కావలసినవి: ముంజలు – 8; పాలు – రెండు కప్పులు; నీళ్లు – తగినన్ని; పంచదార – 2 టేబుల్ స్పూన్లు; రూహ్ అఫ్జా – ఒక టేబుల్ స్పూను. తయారీ: ►మిక్సీ జార్లో నాలుగు తాటి ముంజలు వేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టాలి ►మిగిలిన ముంజలను చాకుతో సన్నగా కట్ చేసి పక్కన ఉంచాలి ►మిక్సీ జార్లో పాలు, కొద్దిగా నీళ్లు, పంచదార, రూహ్ అఫ్జా, ముంజల గుజ్జు వేసి బాగా మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టి, గ్లాసులోకి తీసుకోవాలి ►ముంజ ముక్కలు, ఐస్ ముక్కలు జత చేసి చల్లగా అందించాలి. ముంజల బజ్జీ కావలసినవి: కొద్దిగా ముదిరిన ముంజలు – 10; సెనగ పిండి – ఒక కప్పు; బియ్యప్పిండి – పావు కప్పు; ధనియాల పొడి – ఒక టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ►ముంజల తొక్క తీసి, నీరు వేరు చేయాలి ►ఒక గిన్నెలో సెనగ పిండి, బియ్యప్పిండి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, మిరప కారం, ఉప్పు వేసి బాగా కలపాలి ►తగినన్ని నీళ్లు జత చేసి బజ్జీ పిండి మాదిరిగా కలుపుకోవాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ముంజలను పిండిలో ముంచి బజ్జీల మాదిరిగా వేయాలి ►రెండు వైపులా దోరగా కాలిన తరవాత పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ►టొమాటో సాస్‌తో తింటే రుచిగా ఉంటాయి. తాటి ముంజల పొట్టు చట్నీ కావలసినవి: ముంజల పొట్టు – ఒక కప్పు; మినప్పప్పు – 3 టేబుల్ స్పూన్లు; కంది పప్పు – ఒక టీ స్పూను; వెల్లుల్లి రెబ్బలు – 4; చింత పండు – నిమ్మకాయంత; ఎండు మిర్చి – 5; లవంగాలు – 4; ఎండు కొబ్బరి ముక్కలు – అర కప్పు; ఉప్పు – ఒక టీ స్పూను; నూనె – ఒక టీ స్పూను తయారీ: ►ముంజల పొట్టును నీళ్లలో నానబెట్టాలి (లేదంటే రంగు మారిపోతుంది) ►స్టౌ మీద బాణలి వేడయ్యాక మినప్పప్పు, కంది పప్పు, వెల్లుల్లి, ఎండు మిర్చి, చింత పండు కొబ్బరి ముక్కలు, లవంగాలు ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించి దింపేసి, ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ►ముంజల పొట్టులోని నీటిని పూర్తిగా ఒంపేయాలి ►పొట్టును ఒక ప్లేట్లో ఉంచాలి ►స్టౌ మీద బాణలిలో పావు టీ స్పూను నూనె వేసి కాగాక ముంజల పొట్టు, ఉప్పు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి ఒక ప్లేటులోకి తీసుకోవాలి ►ముందుగా పోపు సామానును మిక్సీలో వేసి మెత్తగా చేశాక, ముంజల పొట్టు జత చేసి మరోమారు మెత్తగా అయ్యేవరకు తిప్పి, గిన్నెలోకి తీసుకోవాలి ►ఇది చపాతీ, దోసె, బ్రెడలలో నంచుకుని తినొచ్చు, అన్నంలోకి కూడా రుచిగా ఉంటుంది. తాటి ముంజల కూర కావలసినవి: నూనె – ఒక టేబుల్ స్పూను; బిర్యానీ ఆకులు – 2; కరివేపాకు – రెండు రెమ్మలు; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 6; ఉప్పు – తగినంత; ముంజలు – 10 (కొద్దిగా ముదురుగా ఉండాలి); పసుపు – పావు టీ స్పూను; కారం – అర టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను తయారీ: ►స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక, రెండు బిర్యానీ ఆకులు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి ►ఉల్లి తరుగు, టొమాటో తరుగు, పచ్చి మిర్చి తరుగు వేసి వేయించాలి ►కొద్దిగా ఉప్పు జత చేయాలి ►తరిగిన ముంజలు వేసి బాగా కలపాలి ►తగినంత పసుపు, కారం వేసి మరోమారు కలియబెట్టాలి ►అల్లం వెల్లుల్లి ముద్ద జత చేయాలి ►కొద్దిగా నీళ్లు పోసి, మూత పెట్టి, ముంజలు మెత్తబడే వరకు ఉడికించాలి ►మూత తీసి మరోమారు కలియబెట్టాలి ►ధనియాల పొడి, కొత్తిమీర తరుగు జత చేసి మరోమారు కలియబెట్టి దింపేయాలి. తాటి ముంజల కుర్మా కావలసినవి: తాటి ముంజలు – 12; ఉప్పు – తగినంత; కారం – ఒక టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; నూనె – 2 టేబుల్ స్పూన్లు; పోపు సామాను – ఒక టీ స్పూను (ఆవాలు, జీలకర్ర); ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 3; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను ; క్యారట్ తరుగు – పావు కప్పు; నువ్వులు + జీడి పప్పు పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు; పెరుగు – అర కప్పు; కొత్తిమీర – అర టీ స్పూను; గరం మసాలా – ఒక టీ స్పూను. తయారీ: ►ముంజలను ఒక ప్లేట్లో ఉంచి, వాటి మీద ఉప్పు, పావు టీ స్పూను కారం, పావు టీ స్పూను పసుపు చల్లి, అన్నిటికీ అంటేలా చేతితో సరిచేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి ►ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు కలపాలి ►అల్లం వెల్లుల్లి ముద్ద జత చేయాలి ►క్యారట్ తరుగు వేసి మరోమారు కలపాలి ►టొమాటో తరుగు జత చేసి కలియబెట్టాలి ►కొద్దిగా నీళ్లు పోసి మరోమారు కలిపి, మూత ఉంచి ఉడికించాలి ►జీడిపప్పు, నువ్వుల పేస్ట్ వేసి కలిపి ఉడికించాలి ►తగినంత ఉప్పు జత చేయాలి ►కారం, పసుపు, ధనియాల పొడి వేసి మరోమారు కలపాలి ►పెరుగు జత చేసి కలియబెట్టాలి ►కొద్దిగా నీళ్లు జత చేయాలి ►ముంజలను జత చేసి ఉడికించాలి ►గరం మసాలా, కొత్తిమీర తరుగు జత చేసి మూత ఉంచాలి ►కొద్దిగా ఉడికిన తరవాత మూత తీసి మరోమారు కలియబెట్టాలి ►ఉడికిన కుర్మాను ఒక పాత్రలోకి తీసుకుని కొత్తిమీరతో అలంకరించాలి. తాటి ముంజల పొట్టు కర్రీ కావలసినవి: తాటి ముంజల పొట్టు – ఒక కప్పు; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – ఒక టేబుల్ స్పూను. పోపు కోసం: ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 4; ఉల్లి తరుగు – అర కప్పు; కరివేపాకు – రెండు రెమ్మలు; కారం – ఒక టీ స్పూను; గరం మసాలా – అర టీ స్పూను తయారీ: ►స్టౌ మీద మందపాటి గిన్నె ఉంచి, అందులో తగినన్ని నీళ్లు పోసి మరిగించాలి ►తాటి ముంజల పొట్టు వేసి ఉడికించాలి ►చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు జత చేసి కలియబెట్టి బాగా ఉడికించి దింపేయాలి ►నీటిని వడకట్టి తీసేయాలి ►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నూనె వేసి కాచాలి ►జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఎండు మిర్చి, పచ్చి సెనగ పప్పు వేసి వేయించాలి ►ఉల్లి తరుగు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►కరివేపాకు వేసి మరోమారు వేయించాలి ►పసుపు జత చేయాలి ►ముంజల పొట్టు జత చేసి బాగా కలపాలి ►కారం, గరం మసాలా వేసి మరోమారు కలిపి, దింపేయాలి. -
ఎండ నుంచి మేనికి రక్షణ
ఎండ వేడిమి దాడి చేస్తోంది. దీనికి విరుగుడుగా ఈ కాలం మేని సంరక్షణ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. ►ఎండ నుంచి వచ్చిన తర్వాత బొప్పాయి గుజ్జు చర్మానికంతా పట్టించి, మూడు నిమిషాలుంచి కడిగేయాలి. మృతకణాలు తొలగిపోవడమే కాకుండా ఎండవేడిమికి కమిలిన చర్మం సాధారణ స్థితికి చేరుకుంటుంది. ►చర్మం తాజాగా ఉండాలంటే ఎండలో బయటికి వెళ్లి వచ్చిన తర్వాత బొప్పాయి గుజ్జులో టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి ప్యాక్ వేసుకొని, 5 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ►చలికాలానికి మాయిశ్చరైజర్లు మాదిరి ఈ కాలం సన్‌ప్రొటెక్షన్ లోషన్లు వాడుతుంటారు. అయితే, వీటిని బయటకు వెళ్లడానికి 10 నిమిషాల ముందు రాసుకుంటే చాలు ఎండబారి నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు. ►ఎండవేడికి చర్మం కమిలి, మంట పుడుతుంటే ఉపశమనానికి అలొవెరా జెల్ రాసి, పది నిమిషాలు ఆగి చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ►ఈ కాలం శిరోజాలు పొడిబారడం సమస్య ఎక్కువ. అందుకని వారానికి ఒకసారి అరటిపండు గుజ్జును తలకు అంతా పట్టించి, పది నిమిషాలు ఉంచి, కడిగేయాలి. దీనివల్ల వెంట్రుకల మృదుత్వం దెబ్బతినదు. ►చర్మం నిస్తేజంగా మారకుండా రోజూ 8–10 గ్లాసుల నీళ్లు తప్పక తాగాలి. -
తేనెపట్టు కోసం వెళితే...
శ్రీకాకుళం, బొబ్బిలి: పాడుబడిన భవనంలో ఉంటే తేనెపట్టుకోసం వెళ్లిన విద్యార్థులు గోడ కూలడంతో గాయపడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రంలోని గురుకులంలో పాత వంటశాల గది శిథిలావస్థకు చేరుకుంది. అయితే ఈ భవనాన్ని తొలగించకుండా అలానే వదిలేశారు. ఈ గదిలో ఉన్న తేనెపట్టును తీసేందుకు తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఎస్. రాము, సీహెచ్ ప్రవీణ్, ఎస్. వంశీకృష్ణ వెళ్లారు. తేనెపట్టు తీసేందుకు గోడ ఎక్కడా ఒక్కసారిగా పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ వంశీకృష్ణకు నడుమభాగంలో తీవ్ర గాయం కావడంతో విజయనగరం తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. వంశీకృష్ణ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడని ప్రిన్సిపాల్ కె. రాంబాబు తెలిపారు. స్వల్పంగా గాయపడిన ఎస్. రాముది మెరకముడిదాం కాగా సీహెచ్ ప్రవీణ్‌ది బలిజిపేట మండలం అంకలాం. తీవ్రంగా గాయపడిన విద్యార్థి ఎస్. వంశీకృష్ణది మెరకముడిదాం మండలం గోపన్నవలస. ఇదిలా ఉంటే పాఠశాల ఆవరణలో పాడైన భవనాలు తొలగించకపోవడంతోనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
బ్యూటిప్స్
ఆపిల్స్ – 2 తేనె – ఒక టేబుల్ స్పూన్‌ఆపిల్స్‌ని చెక్కు తీసి, గ్రైండ్ చేసుకోవాలి. తేనెలో గ్రైండ్ చేసిపెట్టుకున్న ఆపిల్ పేస్ట్‌ని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తరువాత కడిగేయాలి. లెమన్ మాస్క్ నిమ్మకాయ – 1 ఓట్మీల్ – అర కప్పు, కోడిగుడ్డు – 1(తెల్లసొన)ఒక పాత్రలో పై పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. -
ప్రాపర్టీలకు అడ్డా హనీగ్రూప్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అపార్ట్మెంట్స్, ప్లాట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలు ఏవైనా కానివ్వండి.. ఒక్కో దానికి ఒక్కో నిర్మాణ సంస్థను సంప్రదించాల్సిన అవసరం లేదు. జస్ట్! హనీగ్రూప్‌లో లాగిన్ అయితే చాలు. ఒకే చోట అన్ని రకాల ప్రాపర్టీలు దొరికిపోతాయి. అంతేకాదండోయ్.. సైట్ విజిట్ నుంచి మొదలుపెడితే లీగల్, వేల్యువేషన్, రిజిస్ట్రేషన్, బ్యాంక్ లోన్స్ అన్ని రకాల సేవల నిర్వహణ బాధ్యత కూడా హనీగ్రూప్దే. మరిన్ని వివరాలను సంస్థ సీఎండీ ఎం. ఓబుల్ రెడ్డి ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. 3 రాష్ట్రాలు; 6 బ్రాంచీలు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మూడు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) గుర్తింపు పొందిన కంపెనీ హనీగ్రూప్. ఫ్లాట్లను, ప్లాట్లను ప్రొఫెషనల్‌గా విక్రయించడం మా పని. ప్రస్తుతం విశాఖపట్నం, కూకట్పల్లి, ఉప్పల్, గాజువాక, శ్రీకాకుళం, బెంగళూరుల్లో బ్రాంచీలున్నాయి. వచ్చే 6 నెలల్లో గచ్చిబౌలి, సికింద్రాబాద్, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, భువనేశ్వర్, చెన్నై, బెంగళూరు సౌత్, ఈస్ట్, సెంట్రల్ ప్రాంతాల్లో కొత్త బ్రాంచీలను ప్రారంభించనున్నాం. 230 మంది డెవలపర్లు; 360 ప్రాజెక్ట్‌లు.. ప్రస్తుతం పూర్వాంకర, ప్రెస్టిజ్, ఎల్అండ్టీ, బిగ్రేడ్, లెగసీ, ప్రావిడెంట్, సెంచురీ, గోద్రెజ్ వంటి 230 నిర్మాణ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. వీటిల్లో సుమారు 360 ప్రాజెక్టŠస్ ఉంటాయి. లక్ష చ..అ. ఫ్లాట్స్, 10 వేల వరకు ఓపెన్ ప్లాట్లుంటాయి. హైదరాబాద్‌లో సుమారు 50 మంది డెవలపర్లు, 120 ప్రాజక్ట్స్ ఉంటాయి. హనీగ్రూప్తో డెవలపర్లకు లాభమేంటంటే? త్వరగా ఫ్లాట్లను విక్రయించి పెడుతుంది. దీంతో నిర్మాణ సంస్థలకు ఆదాయం త్వరగా వస్తుంది. కొనుగోలుదారులకు ఏం లాభమంటే? హనీ గ్రూప్‌లో ఏజెంట్లుండరు. అందరూ కంపెనీ సొంత ఉద్యోగులే. దీంతో ధర తగ్గుతుంది. ఏడాదిలో వెయ్యి మంది ఉద్యోగులు.. విశాఖపట్నం కేంద్రంగా 9 మంది ఉద్యోగులతో ప్రారంభమైన హనీగ్రూప్‌లో ప్రస్తుతం 304 మంది ఉద్యోగులున్నారు. వచ్చే ఏడాది నాటికి 1,000 మంది ఉద్యోగులను చేర్చాలన్నది లక్ష్యం. పెద్ద నోట్ల రద్దు తర్వాత చాలా వరకు నిర్మాణ సంస్థలు ఉద్యోగుల్ని తొలగిస్తే.. హనీగ్రూప్‌లో మాత్రం 5 బ్రాంచీల్లో కలిపి 240 మంది ఉద్యోగులను నియమించుకున్నాం. హనీగ్రూప్‌లో సుమారు 2 వేల మంది కస్టమర్లున్నారు. 95 శాతం కస్టమర్లు తొలిసారి గృహ కొనుగోలుదారులే. ఇంటీరియర్ ప్లాంట్.. ప్రస్తుతం అచ్యుతాపురంలో సొంతంగా రెండు ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నాం. 800 గజాల్లోని శ్రీనివాసం ప్రాజెక్ట్‌లో 15 ఫ్లాట్లుంటాయి. 4 వేల గజాల్లోని మరో ప్రాజెక్ట్‌లో 80 ఫ్లాట్లుంటాయి. గతేడాది హనీగ్రూప్ రూ.3.5 కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది. ఈ ఏడాది రూ.5 కోట్ల వ్యాపారాన్ని లకి‡్ష్యంచాం. ఇటీవలే యాపిల్ పేరిట ఇంటీరియర్ కంపెనీని ప్రారంభించా. విశాఖపట్నంలోని గంభీరంలో ఫ్యాక్టరీని నిర్మిస్తున్నాం. 1,200 గజాల్లోని ఈ ప్లాంట్‌లో వార్డ్ రోబ్స్, మాడ్యులర్ కిచెన్స్, టీవీ యూనిట్స్ వంటి ఇంటీరియర్‌ను తయారు చేస్తాం. -
యవ్వనకాంతి
పండ్లు, కూరగాయలు, వాటి నుంచి వచ్చే నూనెలను సౌందర్య లేపనాలుగా ఉపయోగిస్తే చర్మం యవ్వనకాంతితో మెరిసిపోతుంది. విటమిన్ –సి సహజసిద్ధమైన యాంటీ ఏజింగ్ కాంపౌండ్స్ గల స్ట్రాబెర్రీ మాస్క్ వల్ల రెట్టింపు అందాన్ని పొందవచ్చు. ఎండకు కమిలిన, మృతకణాలున్న చర్మాన్ని సాధారణ స్థితికి తీసుకువచ్చి యవ్వనకాంతిని పెంచుతుంది. ఓ కప్పు తాజా స్ట్రాబెర్రీలు మిక్సర్‌లో మెత్తగా బ్లెండ్ చేయాలి. దీంట్లో కప్పు పెరుగు, ఒకటిన్నర టేబుల్ స్పూన్ తేనె కలపాలి. ఈ మెత్తటి మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి లేదా రెండువారాలకు ఒకసారి ఈ ప్యాక్ వేసుకోవచ్చు. చర్మం ముడతలు పడనివ్వని యాంటీ ఏజింగ్ కాంపౌండ్స్ దానిమ్మలో పుష్కలం. యాంటీయాక్సిడెంట్స్, విటమిన్–సి సమృద్ధిగా ఉన్న దానిమ్మ ఓట్స్ లేదా పెరుగుతో కలిపి మేలైన ఫేస్ ప్యాక్ తయారవుతుంది. మృతకణాలను తొలగించడమే కాదు చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల దానిమ్మ గింజలు, కప్పు ఓట్స్ కలిపి మిక్సర్‌లో వేసి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకొని, 2 టేబుల్ స్పూన్ల తేనె, 2 టేబుల్ స్పూన్ల మజ్జిగ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఐదు నిమిషాలు ఉంచి, కడిగేయాలి. -
పెట్టకండి.. ఫ్రిజ్జు తినేస్తుంది
ఇంట్లో ఫ్రిజ్ ఉంటే ఆ నిశ్చింతే వేరు. పండ్లు, కూరగాయలు, మిగతా పదార్థాలు ఫ్రిజ్‌లో పెట్టేస్తేరెండు మూడు రోజులైనా తాజాగా ఉంటాయి. ఒకేసారి కొని తెచ్చేసుకుని, ఫ్రిజ్‌లో ఓ మూల పడేసి, అవసరం వచ్చినప్పుడు బయటికి తీసి వాడుకునే సౌలభ్యం ఉండడం వల్ల ఫ్రిజ్ ఇప్పుడు దాదాపుగాప్రతి ఇంట్లోనూ కనిపిస్తుంది. అయితే పండ్లుగానీ, బ్రెడ్డు, తేనె.. ఇంకా ఇతరత్రా పదార్థాలు ఏవైనాఫ్రిజ్లో పెట్టే ముందు మీరెప్పుడైనా ఆలోచించారా.. ‘వీటిని ఫ్రిజ్‌లో పెట్టొచ్చా?’ అని. ఆలోచించే ఉంటారు.సమాధానమే దొరికి ఉండదు. ఫర్వాలేదు. ఏయే ఫుడ్స్‌ని ఫ్రిజ్‌లో రోజులకొద్దీ పెట్టకూడదో ఇప్పుడుసాక్షి ‘ఫ్యామిలీ’ ఇప్పుడు మీకు చెబుతోంది. కట్ చేసుకుని భద్రపరచుకోండి. భద్రపరచుకోవడం అంటే.. ఫ్రిజ్‌లో కాదని మీకు తెలియకుండా ఉంటుందా?! నట్స్ : బాదం పప్పులు, వాల్నట్స్, ఎండు ఖర్జూరాలు, ఇతరత్రా పప్పుల్ని ఫ్రిజ్‌లో పెడితే వాటి లోపల ఉండే నూనె నిక్షేపంగా ఉంటుంది కానీ, రుచే చప్పబడిపోతుంది. అందుకని ఏం చేస్తారంటే గాలిచొరబడని ఒక డబ్బాలో ఈ నట్స్‌ను పోసి, మూత గట్టిగా బిగించండి. ఫ్రిజ్ బయట వేడి ఎక్కువగా లేని చోట ఆ డబ్బాను పెట్టుకోండి. నిల్వా ఉంటాయి, రుచీ ఎక్కడికీ పోదు. చాక్లెట్ స్ప్రెడ్ : బ్రెడ్ స్లయిస్కి అద్దుకుని తింటే ఆ టేస్ట్ ఎంత బాగుంటుందో! అయితే దీన్ని ఫ్రిజ్‌లో పెట్టి తియ్యడం వల్ల కాస్త గట్టి పడినట్లయి స్లయిస్ మీద చక్కగా పరుచుకోదు. పైపెచ్చు కొంచెం ఫ్లేవర్ కూడా తగ్గుతుంది. కాబట్టి చాక్లెట్ స్ప్రెడ్‌ని కూడా టైట్ జార్లో ఉంచి మూత గట్టిగా తిప్పేయండి. కీర దోస : ఎవరి ఫ్రిజ్ డోర్ తెరిచినా కూరగాయలతో పాటు కీర దోస తప్పనిసరిగా కనిపిస్తుంది. కనిపించలేదంటే, అంతకు ముందే బయటికి తీసి లాగించేసి ఉంటారని అనుకోవాలి. సరే, కీర దోసను ఫ్రిజ్‌లో ఎందుకు పెట్టకూడదంటే.. చల్లదనానికి అవి మెత్తబడిపోతాయి. సొట్టలు పడతాయి. తాజాదనం పోతుంది. కట్ చేసి పెట్టినవైతే నీరుకారి పోతాయి. గది ఉష్ణోగ్రతలోనే ఇవి నవనవలాడుతూ ఉంటాయి. వెల్లుల్లి : వెల్లుల్లి గుబ్బలు గానీ, రెబ్బలు గానీ ఫ్రిజ్‌లోని తేమకు పాడైపోతాయి. రాత్రి వంటకో, మర్నాడు లంచ్‌కో ఒలిచి సిద్ధం చేసి పెట్టుకున్న వెల్లుల్లిని తప్ప మామూలుగానైతే బయటే ఉంచడం మంచిది. ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. టమాటా : టమాటాలు కూడానా! అనిపిస్తుంది. అవును టమాటాలను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. పెడితే ఆ చల్లదనానికి పై పొర పాడైపోతుంది. అందుకని కిచెన్ టెంపరేచర్లోనే వాటిని ఉంచేయడం బెటర్. అంతకన్నా బెటర్, ఎక్కువెక్కువ టమాటాల్ని ముందే కొనేసి పెట్టుకోకపోవడం. తేనె : బాటిల్లోని తేనెతో మీరు ఫైటింగ్ చేయదలచుకుంటే తప్ప మీరు తేనె సీసాను ఫ్రిజ్‌లో పెట్టనవసరమే లేదు. ఫ్రిజ్ చల్లదనానికి తేనె చిక్కనవుతుంది. అందులోని చక్కెర కణాలన్నీ ఉండలు చుట్టుకుపోతాయి. అందుకే తేనె చిక్కబడినట్లయి, చివరికి బంకమన్నులా మారినా ఆశ్చర్యం లేదు. ఉల్లిగడ్డలు : మరీ ఎక్కువకాలం ఫ్రిజ్‌లో ఉంచితే ఉల్లిగడ్డలు కూడా పాడైపోతాయి. వెలుతురు సోకని చల్లటి ప్రదేశంలో వీటిని ఉంచాల్సిన మాట నిజమే కానీ, ఫ్రిజ్‌లో పెట్టినందు వల్ల ఇవి మెత్తబడి, చెమ్మగిల్లుతాయి. ఆలుగడ్డలు : ఫ్రిజ్‌లోని చల్లదనం ఆలుగడ్డలోని పిండి పదార్థాన్ని చక్కెరగా మారుస్తుంది. దాంతో ఆలుగడ్డ టేస్టు తగ్గుతుంది. పైగా రంగు కూడా మారుతుంది. అందుకే ఆలుగడ్డల్ని బయటి వాతావరణంలోనే వెలుతురు సోకని చల్లటి ప్రదేశంలో కడగకుండా నిల్వ ఉంచాలి. కడిగితే మట్టి వల్ల ఏర్పడిన రక్షణ కవచం దెబ్బతింటుంది. బ్రెడ్డు : మీకు డౌట్ వచ్చే ఉంటుంది. బ్రెడ్‌ను ప్రిజ్‌లో పెట్టొచ్చా అని. పెడితే సేమ్ ఆలుగడ్డలకు వచ్చే సమస్యే బ్రెడ్డుకూ వస్తుంది. ఫ్రిజ్‌లోని చల్లదనానికి బ్రెడ్లోని పిండి పదార్థాలు చక్కెరగా మారి సహజమైన రుచి తగ్గుతుంది. అంతేకాదు, మామూలుగా పాడైపోయే బ్రెడ్డు, ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల మరింత వేగంగా పాడవుతుంది. దీనినే ‘రిట్రోగ్రెడేషన్’ అంటారు. నిజానికి ఈ రిట్రోగ్రెడేషన్.. బేకింగ్ అవెన్ నుంచి బ్రెడ్డును బయటికి తీసిన మరుక్షణం నుంచే మొదలవుతుంది. అందుకే వీలైనంత త్వరగా బ్రెడ్‌ను వాడేయాలి. మామిడి పండ్లు : పండినవైతే కవర్లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచుకోవచ్చు. పండకుండా మాత్రం అలాగే పెట్టేయకూడదు. ఫ్రిజ్‌లోని చల్లదనం కాయను త్వరగా పండనివ్వదు. అందుకని పండేవరకు బయట ఉంచి, పండాకే ఫ్రిజ్‌లో పెట్టాలి. అది కూడా కవర్లో చుట్టి పెట్టాలి. లేకుంటే పై పొర దెబ్బతింటుంది. పుచ్చకాయ : ఏంటి! పుచ్చకాయను కూడా ఫ్రిజ్‌లో పెట్టకూడదా! అవును. ఎందుకంటే ఫ్రిజ్‌లో పెట్టినా, బయట పెట్టినా ఒకేలా నిల్వ ఉంటుంది పుచ్చకాయ. అలాంటప్పుడు ఫ్రిజ్‌లో స్థలాన్ని వృథా చేయడం ఎందుకు? కోసిన ముక్కల్ని ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు కానీ, కవర్లో పెట్టి, పెట్టాలి. విడిగా పళ్లెంలో పెట్టి సుదీర్ఘంగా ఉంచితే ఆ ఎర్రటి గుజ్జు మెత్తబడిపోతుంది. తినబుద్ధేయదు. అరటి పండ్లు : అరటి పండ్లు మగ్గడానికి పొడి వాతావరణం అవసరం. అందుకని వాటిని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. అంతేకాదు, ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల సరిగా పండకపోగా, పండు పై తోలు నల్లబడి పోతోంది. పండు రుచీ తగ్గుతుంది. కేక్ : కేక్ పైన క్రీమ్ ఉంటే తప్ప ఫ్రిజ్‌లో పెట్టకూడదు. పైగా పొడి వాతావరణంలోనే కేక్ రుచి తగ్గకుండా ఉంటుంది. కాబట్టి గాలి చొరబడని కంటెయినర్లో, ఫ్రిజ్ బయటే కేక్‌ను నిల్వ ఉంచుకోవాలి. ఇక కామన్ టిప్ ఏంటంటే.. వండిన పదార్థాల్ని రెండు రోజులకు మించి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచకూడదని డేవిస్లోని కాలిఫోర్నియా యూనివర్శిటీ పరిశోధకులు సూచిస్తున్నారు. -
తేనెటీగల చిరకాల మిత్రుడు!
తేనెటీగల జీవన విధానాన్ని శ్రద్ధగా అర్థం చేసుకొని అత్యంత నాణ్యమైన తేనె సేకరించడంలో మాదు నాగేశ్వరరావుది అందెవేసిన చేయి. పరిసర ప్రాంతాల్లో పెట్టెలను ఏర్పాటు చేసి 67 ఏళ్లుగా తేనె సేకరించడమే ఆయన వ్యాపకం. నాణ్యత విషయంలో రాజీ పడరు. ఆయన వద్ద నుంచి ఇతర దేశాల్లోని తెలుగు వారు సైతం తేనెను కొనుగోలు చేస్తుంటారు. నాగేశ్వరరావు అనుభవాలు ఆయన మాటల్లోనే... మా స్వగ్రామం కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరు. అత్తవారిది ఈడుపుగల్లు. మాది వ్యవసాయ కుటుంబం. మా ప్రాంతానికి చెందిన శేషాచలం, అప్పారావు, కొల్లి రాజారావు వంటి వారి వద్ద నుంచి మెలకువలు నేర్చుకున్నాను. 1950లో గాంధీజీ తేనె పరిశ్రమను స్థాపించాను. ప్రత్యేకంగా తయారు చేసుకున్న తేనె పెట్టెలు చెట్లు, పండ్లతోటలు, ఇళ్ల పరిసరాల్లో ఏర్పాటు చేసుకోవాలి. డెల్టా ప్రాంతంలో కన్నా అటవీ ప్రాంతాల నుంచి సేకరించిన తేనె ఉత్తమం. నవంబర్, డిసెంబర్ నెలల్లో తేనెటీగల సంతతి పెరుగుతుంటుంది. జనవరి నాటికి పెట్టెలు ఇరుకు అవుతాయి. ఈగలను మరో పెట్టెలోకి తరలించటం ద్వారా అవి మరో ప్రాంతానికి వలస వెళ్లకుండా కాపాడుకోవాలి. తద్వారా తేనె ఉత్పత్తిని క్రమంగా పెంచుకుంటూ ఉండొచ్చు. గతంలో తేనె పెట్టెలను ఖాదీ గ్రామోద్యోగ మిషన్ సబ్సిడీపై ఇస్తుండేది. ప్రస్తుతం బయటి మార్కెట్లో కొనుక్కోవాల్సిందే. పంటలపై రసాయనిక పురుగు మందుల వాడకం పెరుగుతున్నందున తేనెటీగల సంఖ్య తగ్గుతున్నది. పుప్పొడి సేకరించే తరుణంలో తేనెటీగలు పురుగుమందుల ప్రభావంతో చనిపోతున్నాయి. మార్చి, ఏప్రిల్‌లో వేప, తాటి గులకల మీది నుంచి మకరందాన్ని సేకరిస్తాయి. కలప కోసం ఆ చెట్లను నరికేస్తున్నారు. ఆ సీజన్లో తేనె అనుకున్నంతగా రావటం లేదు. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావుతో పాటు కొందరు సినిమాతారలకు కూడా తేనె ఇచ్చాను. తొలి రోజుల్లో వీసె తేనె రూ. 12కి విక్రయించటం తెలుసు. ప్రస్తుతం కిలో రూ.260కి ఇస్తున్నాం. తేనె సేకరణలో చాలా మందికి శిక్షణ ఇచ్చాను. మొబైల్: 99592 65559. – ఈడా శివప్రసాద్, సాక్షి, కంకిపాడు, కృష్ణా జిల్లా -
తేనె స్వచ్ఛత తెలియాలంటే
►కీర దోస, బీర కాయలు కొన్ని చేదుగా ఉంటాయి. చెక్కు తీసే ముందే వాటిని మధ్యలోకి విరిస్తే చేదుబారవు. ►తేనె స్వచ్ఛత తెలియాలంటే, ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ తేనె వేయాలి. నీటిలో కరగకుండా అడుగుకు చేరితే అది మంచి తేనె. ►వేడి నీటిలో ఉప్పు కలిపి వాడాల్సి వస్తే, నీళ్లు మరిగిన తర్వాత మాత్రమే ఉప్పు కలపాలి. ముందే ఉప్పు వేస్తే మరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. ►చికెన్ కాని, మటన్ కాని ప్రెషర్ కుకర్‌లో ఉడికించినట్లయితే గ్యాస్‌తో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. అందులోని పోషకాలు నశించకుండా ఉంటాయి. ►వెల్లుల్లి పొట్టు త్వరగా రావాలంటే అరగంట సేపు నీటిలో నానబెట్టాలి. ►నూనె ఎక్కువగా వేసి చేసే డీప్ ఫ్రైలను తగ్గించి వంటకాలను బేక్ చేసి తినడం అలవాటు చేసుకుంటే శరీరంలోకి చేరే కొవ్వు శాతం తగ్గుతుంది. ►కాపర్ బాటమ్ పాత్రలు తళతళ మెరవాలంటే మామూలుగా వాడుతున్న క్లీనింగ్ పౌడర్ కాని సబ్బు కాని వేసి మెటల్ స్క్రబ్బర్‌తో శుభ్రం చేయాలి. -
హనీ.. సింగ్.. ఓ కథ..
- తలలంటుకుని జన్మించిన చిన్నారులు - ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబం - శస్త్ర చికిత్సకు ఢిల్లీ ఎయిమ్స్‌లో ఏర్పాట్లు - చేయూతనందించిన రైల్వే శాఖ సాక్షి, భువనేశ్వర్: తెలుగునాట తలలంటుకుని జన్మించిన వీణావాణిలను మరిచిపోకముందే.. ఒడిశాలోని కంధమాల్ జిల్లా ఫిరంగియా గ్రామంలోనూ వీరిలానే ఇద్దరు చిన్నారులు తలలంటుకుని నరకయాతన అనుభవిస్తున్నారు. వారే రెండున్నరేళ్ల హానీ, సింగ్. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు తమ బిడ్డల బాధలు చూడలేక తల్లిదండ్రులు విలవిల్లాడుతున్నారు. ఒకేసారి జన్మించిన సోదరులు విధి వైచిత్రితో ఇంతవరకు ఒకరి ముఖం ఒకరు చూడలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అందరి సాయంతో చిన్నారుల దయనీయ పరిస్థితి అందరి హృదయాల్ని కలిచివేసింది. చికిత్స కోసం తల్లిదండ్రులు కటక్‌లోని ఎస్సీబీ మెడికల్ కళాశాల ఆస్పత్రి వైద్యుల్ని సంప్రదించారు. అయితే చిన్నారులకు చికిత్స అందించడానికి స్థానికంగా వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు. దీంతో కళాశాల సలహా మేరకు చిన్నారులతో కలసి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు బయలుదేరారు. వీరితోపాటు నువాపడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ఆయుష్ వైద్యుడు, జాతీయ బాలల ఆరోగ్య కార్యక్రమం విభాగం నుంచి మరో అధికారి కూడా ఉన్నారు. కంధమాల్ కలెక్టర్ స్వయంగా ఎయిమ్స్ డీఎంఈటీ డైరెక్టర్ డాక్టర్ అశోక్ మహాపాత్రోతో ఫోన్లో మాట్లాడారు. ఎయిమ్స్ న్యూరోవిభాగం వీరికి శస్త్రచికిత్స నిర్వహిస్తుంది. ఎయిమ్స్‌లో చికిత్స విజయవంతమై అన్నదమ్ములిద్దరూ ఆడుతూపా డుతూ ఉండాలని అందరూ నిరీక్షిస్తున్నారు. అయితే వీరికి శస్త్రచికిత్స నిర్వహించే తేదీని ఎయిమ్స్ ఇంకా ఖరారు చేయలేదు. మరోవైపు రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో న్యూఢిల్లీ బయల్దేరిన హానీ, సింగ్‌లకు దారిపొడవునా ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. టాటా నగర్ రైల్వే స్టేషన్లో ప్రత్యేక వైద్య నిపుణుల బృందం చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది. -
మచ్చలు పోవడానికి
అందమె ఆనందం ► కొబ్బరి నూనెలో గోరింటాకు పొడి కలిపి పేస్టు చేసుకుని ముఖానికి పట్టిస్తే మచ్చలు పోతాయి. కొబ్బరి నూనె బదులుగా మరే ఇతర నూనెనయినా వాడవచ్చు. ►అర టీ స్పూన్ నిమ్మరసంలో నాలుగు చుక్కల గ్లిజరిన్ కలిపి మచ్చల మీద రాస్తుంటే మచ్చలు పోతాయి. ►కరివేపాకులో చిటికెడు పసుపు వేసి గ్రైండ్ చేసి మచ్చల మీద రాసి పదిహేను నిమషాల తర్వాత కడగాలి. ►గోరింటాకు పొడిలో చిటికెడు పసుపు కలిపి మచ్చల మీద రాయాలి. ► ఎండిన తులసి, వేప, పుదీన ఆకులు ఒక్కొక్కటి వందగ్రాములు తీసుకుని అందులో చిటికెడు పసుపు వేసి కలుపుకుని నిలవ ఉంచుకోవాలి. వాడేటప్పుడు రెండు టీ స్పూన్ల పొడిలో తగినంత పన్నీరు వేసి కలుపుకుని ముఖానికి పట్టించాలి. ► తమలపాకుల్లో కొద్దిగా కొబ్బరినూనె కలిపి గ్రైండ్ చేసి మచ్చల మీద రాయాలి. ► తులసి ఆకులలో పసుపు వేసి గ్రైండ్ చేసి ముఖానికి పట్టించాలి. ► దోసకాయ రసాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత కడిగితే గీతలు, మచ్చలు తగ్గడమే కాకుండా చర్మం బిగుతుగా కూడ ఉంటుంది. ► తేనెలో కుంకుమ పువ్వు కలిపి రంగరించి మచ్చల మీద రాయాలి. -
బ్యూటిప్స్
టేబుల్ స్పూన్ పచ్చి పాలలో కొన్ని చుక్కల రోజ్ వాటర్, తేనె, కొద్దిగా శనగపిండి వేసి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిస్తే ముఖం నిగారిస్తుంది.టీ స్పూన్ శనగపిండిలో మూడు చుక్కల నిమ్మరసం, కొద్దిగా బొప్పాయి రసం కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తరవాత కడిగేయాలి. అర టేబుల్ స్పూన్ మెంతులను పొడి చేయాలి. దీంట్లో పెరుగు, మూడుచుక్కల రోజ్‌వాటర్ కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మెడకు, ముఖానికి పట్టించి 20 నిమిషాల తరవాత కడిగేయాలి. వారంలో ఒకసారి ఈ ప్యాక్ వేసుకుంటే చర్మం నిగారిస్తుంది. -
పాలతో మృదుత్వం
• బ్యూటిప్స్ పాలు చర్మ సౌందర్యానికి ఎంతగా మేలు చేస్తాయో అందరికీ తెలిసే ఉంటుంది. పాలల్లో తేనె, ఓట్మీల్ కలిపి మిశ్రమం చేసుకుంటే చక్కని ఫలితాన్ని పొందొచ్చు. ముందుగా పావు కప్పు ఓట్స్‌ని తీసుకుని కప్పు తాజా పాలల్లో ఉడకబెట్టుకోవాలి. దానిలో ఒక టీ స్పూను తేనె కలుపుకోవాలి. ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకుని తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. చేతి వేళ్లతో నెమ్మదిగా రబ్ చేయాలి. మిశ్రమంలో పసుపు లేదా గంధం పొడిని కూడా కలుపుకోవచ్చు. ప్యాక్‌ను పావుగంట ఉంచుకుని నీటితో కడిగేయాలి. ఈ మిశ్రమాన్ని మెడకు, చేతులకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా వారానికొకసారి చేయడం వల్ల చర్మం ఎంతో మృదువుగా తయారవుతుంది.