ఈ వెరైటీ వంటకాలను.. ఎప్పుడైనా ట్రై చేశారా..!? | Have You Ever Tried This Variety Of Dishes | Sakshi
Sakshi News home page

ఈ వెరైటీ వంటకాలను.. ఎప్పుడైనా ట్రై చేశారా..!?

Published Sun, Jun 16 2024 1:28 PM | Last Updated on Sun, Jun 16 2024 2:34 PM

Have You Ever Tried This Variety Of Dishes

హనీ– మిల్క్‌ పౌడర్‌ కప్‌ కేక్‌..
కావలసినవి..
తేనె– 1 కప్పు;
మిల్క్‌ పౌడర్‌– 1 కప్పు;
మైదా పిండి– అర కప్పు;
పంచదార– పావు కప్పు (పొడి చేసుకోవాలి, అభిరుచి బట్టి కాస్త పెంచుకోవచ్చు);
నెయ్యి, కొబ్బరి కోరు– అర కప్పు చొప్పున;
గుడ్లు– 4, చిక్కటి పాలు– 2 టేబుల్‌ స్పూన్లు;
తినే సోడా, వెనీలా ఎసెన్స్– అర టీ స్పూన్  చొప్పున;

తయారీ..

  • ముందుగా ఒక బౌల్‌లో గుడ్లు కొట్టి, పాలు పోసి క్రీమీగా అయ్యేలా బాగా గిలకొట్టుకోవాలి.

  • ఆ మిశ్రమంలో తేనె, మైదా, మిల్క్‌ పౌడర్‌ వేసి ఉండలు లేకుండా కలుపుకుని పేస్ట్‌లా కలుపుకోవాలి. తర్వాత తినే సోడా, సగం నెయ్యి, వెనీలా ఎసెన్ ్స వేసుకుని బాగా కలుపుకోవాలి.

  • ఈలోపు మిగిలిన నేతిలో కొబ్బరి కోరు, పంచదార పొడి వేసుకుని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

  • ఇప్పుడు మినీ కేక్‌ బౌల్స్‌ తీసుకుని, వాటికి నెయ్యి రాసి పెట్టుకోవాలి.

  • తర్వాత వాటిలో కొద్దిగా గుడ్ల మిశ్రమం వేసుకుని మధ్యలో కొద్దిగా కొబ్బరికోరు మిశ్రమం నింపుకుని, మళ్లీ పైన గుడ్ల మిశ్రమాన్ని వేసుకుని నింపుకుని ఓవెన్‌లో బేక్‌ చేసుకోవాలి.

  • చల్లారాక క్రీమ్‌తో గార్నిష్‌ చేసుకుని, పైన గార్నిష్‌ కోసం.. కొద్దిగా తేనె పోసుకుని సర్వ్‌ చేసుకుంటే సరిపోతుంది.


ఎగ్‌ – బాదం హల్వా..
కావలసినవి..
గుడ్లు– 8, బాదం పాలు– 1 కప్పు;
కస్టర్డ్‌ మిల్క్‌– పావు కప్పు;
పంచదార– 1 టేబుల్‌ స్పూన్  (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు);
ఏలకుల పొడి– 1 టీ స్పూన్;
నెయ్యి– 4 టేబుల్‌ స్పూన్లు;
కుంకుమ పువ్వు– చిటికెడు;
వెనీలా ఎసెన్ ్స– 1 టీ స్పూన్;
బాదంపప్పు– 2 టేబుల్‌ స్పూన్లు (దోరగా నేతిలో వేయించాలి, అభిరుచిని బట్టి జీడిపప్పు, కిస్మిస్‌ వంటివి జోడించుకోవచ్చు);

తయారీ..

  • ముందుగా ఒక పెద్ద బౌల్‌ తీసుకుని అందులో గుడ్లలోని పసుపు సొనను మాత్రమే తీసుకుని, బాగా గిలకొట్టాలి.

  • అందులో కస్టర్డ్‌ మిల్క్, బాదం పాలు, పంచదార, ఏలకుల పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని మరోసారి కలుపుకోవాలి. 

  • అనంతరం స్టవ్‌ ఆన్  చేసుకుని, పాన్  బౌల్‌లో నెయ్యి వేడి చేసుకుని, అందులో ఈ మిశ్రమం మొత్తం వేసుకుని చిన్న మంట మీద ఉడికించుకోవాలి.

  • మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూనే ఉండాలి. మిశ్రమం సగానికి తగ్గుతున్నప్పుడు కుంకుమ పువ్వు వేసుకుని గరిటెతో బాగా కలుపుకోవాలి.

  • మళ్లీ మధ్యమధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కాస్త దగ్గర పడుతున్నప్పుడు వెనీలా ఎసెన్ ్స వేసుకుని మరోసారి కలపాలి.

  • ఆ మిశ్రమం మరింత దగ్గర పడుతున్న సమయంలో నేతిలో వేయించిన బాదం పప్పు వంటి వేసుకుని, కలుపుకుని స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి.

స్వీట్‌కార్న్‌ ఇడియాప్పం..
కావలసినవి..
స్వీట్‌ కార్న్‌ జ్యూస్‌ (వడకట్టుకోవాలి);
బియ్యప్పిండి– 3 కప్పులు చొప్పున;
జొన్న పిండి, ఓట్స్‌ పౌడర్‌– పావు కప్పు చొప్పున:
జీలకర్ర పొడి– పావు టీ స్పూన్;
చిక్కటి కొబ్బరి పాలు– పావు కప్పు;
నీళ్లు– కొద్దిగా, నెయ్యి– 1 టీ స్పూన్;
ఎల్లో ఫుడ్‌ కలర్‌– కొద్దిగా (అభిరుచి బట్టి);

తయారీ..

  • ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో బియ్యప్పిండి, జీలకర్ర పొడి, స్వీట్‌కార్న్‌ జ్యూస్, కొబ్బరి పాలు వేసుకుని కలుపుకోవాలి. 

  • అవసరాన్ని బట్టి నీళ్లు పోసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఫుడ్‌ కలర్‌ వేసుకుని, మరోసారి  బాగా కలుపుకోవాలి.

  • తర్వాత ఇడ్లీ పాన్  లేదా పెద్ద బౌల్‌కి బ్రష్‌తో నెయ్యి పూసుకోవాలి.

  • అనంతరం మురుకుల మేకర్‌కి సన్నని హోల్స్‌ ఉండే ప్లేట్‌ని అమర్చి, అందులో ఈ మిశ్రమాన్ని సగానికి నింపుకుని, ఇడ్లీ పాన్ లో లేదా పెద్ద బౌల్‌లో నూడుల్స్‌లా ఒత్తుకుని ఆవిరిపై ఉడికించాలి.

  • అభిరుచిని బట్టి ఆవాలు, కరివేపాకు, కొత్తిమీరలతో తాళింపు వేసి, కలుపుకుని.. సర్వ్‌ చేసుకుంటే సరిపోతుంది.

ఇవి చదవండి: ఈ 'తియా శిలాఫలకాలు'.. ఏ కాలంనాటివో తెలుసా!?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement