బ్రింజాల్ పిజ్జా..
కావలసినవి..
వంకాయలు– 3 లేదా 4 (కొంచెం పెద్ద సైజువి తీసుకుంటే పిజ్జాలు బాగా వస్తాయి)
ఆలివ్ నూనె– 1 టేబుల్ స్పూన్
బేబీ టమాటో– 2 (గుండ్రంగా కట్ చేసుకోవాలి)
మోజరెలా చీజ్– అర కప్పు
వెల్లుల్లి తురుము, మిరియాల పొడి– తగినంత
ఉప్పు– తగినంత, తులసి ఆకులు– కొన్ని
తయారీ..
– ముందుగా ఒక్కో వంకాయను శుభ్రం చేసుకుని గుండ్రంగా మూడు లేదా నాలుగు చక్రాల్లా కట్ చేసుకుని ఆలివ్ నూనెలో ముంచాలి.
– అనంతరం వాటిని ఒక ట్రేలో వరుసగా పేర్చుకుని, వాటిపై కొద్దిగా మోజరెలా చీజ్ వేసి, ఐదు నిమిషాల పాటు ఓవెన్‌లో దోరగా బేక్ చేసుకోవాలి.
– అనంతరం ముక్కలను బయటికి తీసి, వాటిపై మిరియాల పొడి, వెల్లుల్లి తురుము, చిన్నచిన్న టమాటో ముక్కలు, మోజరెలా చీజ్ చల్లుకోవాలి.
– మరోసారి ఆ ట్రేను ఓవెన్‌లో పెట్టుకుని, బేక్ చేసుకోవాలి. వాటిని తులసి ఆకులతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.
పొద్దుతిరుగుడు లడ్డూ..
కావలసినవి..
పొద్దుతిరుగుడు గింజలు– 1 కప్పు
బెల్లం తురుము– 1 కప్పు
నీళ్లు– పాకానికి సరిపడా
కొబ్బరి తురుము– పావు కప్పు
నెయ్యి– 3 టేబుల్ స్పూన్లు
తయారీ..
– ముందుగా పొద్దుతిరుగుడు గింజలను నేతిలో దోరగా వేయించి, మిక్సీలో పౌడర్‌లా చేసుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకుని కళాయిలో బెల్లం తురుము, నీళ్లు పోసుకుని పాకం పెట్టుకోవాలి.
– చల్లారాక వడకట్టుకుని, అందులో నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. అనంతరం ఆ మిశ్రమంలో పొద్దుతిరుగుడు గింజల పొడి,
కొబ్బరి తురుము వేసుకుని, ముద్దలా చేసుకోవాలి.
– అవసరం అయితే అదనంగా కాస్త నెయ్యి వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి.
టమాటో హల్వా..
కావలసినవి..
టమాటోలు– 10,
పంచదార– 1 కప్పు
నెయ్యి– అరకప్పు,
బొంబాయి రవ్వ– ఒక కప్పు
నట్స్– రెండు గుప్పిళ్లు, ఫుడ్ కలర్– అభిరుచిని బట్టి
ఏలకుల పొడి– అర టీస్పూను
తయారీ..
– ముందుగా టమాటోలను నీళ్లలో ఉడికించి చల్లార్చాలి. వాటిని మిక్సీలో వేసుకుని గుజ్జులా చేసుకుని, బౌల్‌లోకి వేయాలి.
– ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి రెండు స్పూన్ల నెయ్యి వేసి నట్స్, బొంబాయి రవ్వలను విడివిడిగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
– ఇప్పుడు స్టవ్ మీద కాస్త లోతుగా ఉండే పాత్రని పెట్టి అందులో రెండు కప్పుల నీళ్లు పోయాలి.
– నీళ్లు మరిగాక వేయించిన బొంబాయి రవ్వ, కొద్దిగా నెయ్యి వేసి కలుపుతూ ఉండాలి.
– రవ్వ చిక్కబడుతున్న సమయంలో టమాటో గుజ్జు, పంచదార, మిగిలిన నెయ్యి వేసి బాగా కలపాలి.
– ఆ మిశ్రమం హల్వాలా చిక్కబడుతున్న సమయంలో ఫుడ్ కలర్, ఏలకుల పొడి చల్లి, బాగా కలిపి దించేయాలి.
– తరువాత బౌల్ లోపల కాస్త నెయ్యి రాసి, సగానికి పైగా హల్వాని వేయాలి.
– తర్వాత నట్స్ చల్లుకుని, మిగిలిన హల్వా కూడా పైన వేసుకుని పరచుకోవాలి. గాలికి చల్లారి దగ్గరపడిన తర్వాత నచ్చిన షేప్‌లో కట్ చేసుకుంటే సరిపోతుంది.
ఇవి చదవండి:
Comments
Please login to add a commentAdd a comment