ఇంట్లోనే సింపుల్‌గా ఇలాంటి వంటలను కమ్మగా, అద్భుతంగా చేయాలనుకుంటున్నారా! అయితే ఇలాట్రైం చేయండి..
స్వీట్ పొటాటో ఆమ్లెట్..
కావలసినవి:
చిలగడదుంప – 2 (మీడియం సైజ్, ఉడికించి పేస్ట్‌లా చేసుకోవచ్చు),
కొబ్బరి కోరు – 2 టేబుల్ స్పూన్లు,
టొమాటో సాస్ – 1 టేబుల్ స్పూన్,
చిల్లీ సాస్ – అర టేబుల్ స్పూన్,
చాట్ మసాలా – 1 టీ స్పూన్,
గుడ్లు – 6 ,
చీజ్ తురుము – 3 టేబుల్ స్పూన్లు,
ఉప్పు – తగినంత,
ఉల్లిపాయ ముక్కలు – 1 టేబుల్ స్పూన్ (చిన్నగా తరగాలి),
టొమాటో ముక్కలు – పావు టేబుల్ స్పూన్ (చిన్నగా తరగాలి),
పాలు – 1 టీ స్పూన్,
కారం – కొద్దిగా, నూనె – సరిపడా
తయారీ:
– ముందుగా ఒక బౌల్‌లో గుడ్లను పగలగొట్టి.. చీజ్ తురుము, పాలు, కారం, కొద్దిగా ఉప్పు వేసుకుని క్రీమీగా అయ్యేంతవరకు హ్యాండ్‌బ్లెండర్‌తో బాగా బీట్ చేసి పెట్టుకోవాలి.
– ఈలోపు మరో స్టవ్ వెలిగించి.. కళాయిలో కొద్దిగా నూనె వేసి వేడికాగానే.. ఉల్లిపాయ ముక్కలనూ వేసి దొరగా వేయించాలి.
– తర్వాత టొమోటో ముక్కలను వేయాలి.
– అవీ వేగాక.. చిలగడదుంప గుజ్జు, టొమాటో సాస్, చిల్లీ సాస్, చాట్ మసాలా, చిటికెడు ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని గరిటెతో బాగా కలిపి.. 1 నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
– అనంతరం గుడ్ల మిశ్రమంతో ఒక్కో ఆమ్లెట్ వేసుకుని.. అది ఉడికే క్రమంలో కొద్దికొద్దిగా చిలగడదుంప మిశ్రమాన్ని వేసుకుని.. గరిటెతో మొత్తం స్ప్రెడ్ చేసి.. ఆమ్లెట్‌ను ఇరువైపులా వేయించుకోవాలి. వాటిని ఫోల్డ్ చేసి సర్వ్ చేసుకోవాలి.
– నచ్చిన విధంగా గార్నిష్ చేసుకుని తింటే భలే రుచిగా ఉంటాయి ఈ ఆమ్లెట్స్.
అలోవీరా హల్వా..
కావలసినవి:
అలోవీరా (కలబంద) ముక్కలు – అర కప్పు (పైనున్న గ్రీన్ కలర్ తొక్క తొలగించి.. జెల్‌ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి),
నెయ్యి, గోధుమ పిండి – 1 కప్పు చొప్పున,
పంచదార – అర కప్పు (పెంచుకోవచ్చు), చిక్కటి పాలు – 1 కప్పు,
జాజికాయ పొడి,
ఏలకుల పొడి – కొద్దికొద్దిగా
బాదం ముక్కలు – అర టేబుల్ స్పూన్ చొప్పున (నేతిలో వేయించి పక్కనపెట్టుకోవాలి,
అభిరుచిని బట్టి కిస్మిస్,
జీడిపప్పు ముక్కలు కూడా తీసుకోవచ్చు),
కుంకుమపువ్వు – కొద్దిగా
తయారీ:
– ముందుగా కళాయిలో అరకప్పు నెయ్యి వేసుకుని.. అందులో గోధుమ పిండి, కలబంద జ్యూస్ వేసి తిప్పుతూ ఉండాలి.
– దగ్గరపడుతున్న సమయంలో పంచదార, కొద్దిగా నెయ్యి వేసుకుని కలపాలి.
– అనంతరం పాలు పోసుకుని మధ్యమధ్యలో గరిటెతో తిప్పుతూండాలి.
– కాస్త దగ్గరపడిన తర్వాత జాజికాయ పొడి, ఏలకుల పొడి, మిగిలిన నెయ్యి వేసుకుని మళ్లీ తిప్పుతూ ఉండాలి.
– పూర్తిగా దగ్గరపడిన తర్వాత సర్వ్ చేసుకునే ముందు.. బాదం ముక్కలు, లేదా కిస్మిస్, జీడిపప్పు ముక్కల్ని వేసుకుని తింటే భలే రుచిగా ఉంటుంది ఈ హల్వా.
ఓట్స్ యాపిల్ షేక్..
కావలసినవి:
పాలు – 2 కప్పులు (కాచినవి, ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి)
ఓట్స్ – అర కప్పు (దోరగా వేయించి పెట్టుకోవాలి)
యాపిల్స్ – 3 (రెండింటిని తొక్క,
గింజలు తొలగించి.. ముక్కలుగా కట్ చేసుకుని.. పప్పుగుత్తి సాయంతో కచ్చాబిచ్చాగా గుజ్జులా చేసుకోవాలి. మిగిలిన యాపిల్‌ని నచ్చినవిధంగా కట్‌చేసి గార్నిష్‌కి పక్కన పెట్టుకోవాలి),
వేరుశనగలు – పావు కప్పు (దోరగావేయించి, తొక్క తీసి.. కొన్నింటిని పక్కనే ఉంచుకుని.. మిగిలినవి కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకోవాలి), పంచదార – కొద్దిగా (అభిరుచిని బట్టి బెల్లం కూడా కలుపుకోవచ్చు),
హార్లిక్స్ పౌడర్,
దాల్చినచెక్క పొడి – కొద్దికొద్దిగా
జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్లు (దోరగా వేయించుకోవాలి)
తయారీ:
– ముందుగా ఒక బౌల్‌లో పాలు, యాపిల్ గుజ్జు, మిక్సీ పట్టిన వేరుశనగ మిశ్రమం, పంచదార వేసుకుని బాగా కలుపుకోవాలి.
– అనంతరం ఓట్స్ పౌడర్ వేసుకుని.. మరోసారి కలిపి సర్వ్ చేసుకోవాలి.
– పైన హార్లిక్స్ పౌడర్, దాల్చినచెక్క పొడి, జీడిపప్పులు, యాపిల్ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment