method
-
ప్రతీదానికీ ఓ పద్ధతి ఉంటుంది కళ్ళు మూసుకుంటే సరిపోదు!!
అతను తన గురువుగారి ఆశ్రమంలో విడిగా ఏర్పాటు చేసిన ఓ పూరిపాకలో కూర్చుని స్థిరమైన మనసు కోసం తీవ్రంగా ప్రయత్నించ సాగాడు. ఎవరు చూడడానికి వచ్చినా అతను కళ్ళు తెరచి చూసేవాడు కాదు. ఎవరైనా వచ్చినట్టు అలికిడైనా సరే చూసేవాడు కాదు.అయితే ఒకరోజు గురువుగారు ఈ శిష్యుడిని చూడడానికి వెళ్ళారు. కానీ శిష్యుడు గురువుగారిని కూడా పట్టించుకోలేదు. అయినా గురువుగారు అక్కడి నుంచి కదలలేదు. పైగా ఆ పూరిపాక గుమ్మంలో ఓ ఇటుకరాయిని మరొక రాయిమీద పెట్టి అరగదీయడం మొదలుపెట్టాడు. అలా గీయడంతో పుట్టిన శబ్దాన్ని శిష్యుడు భరించలేకపోయాడు.అతను కళ్ళు తెరిచి అడిగాడు –‘‘మీరేం చేస్తున్నారు...తెలుస్తోందా...’’అని.గురువు చెప్పాడు – ‘‘ఇటుకను అద్దంగా మారుస్తున్నాను’’ అని.అప్పుడతను ‘‘ఇటుకను అద్దంగా మార్చడం సాధ్యమా... దానిని పిచ్చితనమంటారు... మరెంత అరగదీస్తే అంతగా అది అరిగి చివరికి ఇటుకరాయి జాడ కూడా కనిపించకుండా పోతుంది. అలాంటిది అద్దం ఎలా ఏర్పడుతుంది. కాస్త ఆపండి ఆలోచించండి... నన్ను నా మనసు మీద ఏకాగ్రత నిలుపు కోనివ్వండి’’ అని చెప్పాడు.అతని మాటలకు గురువుకు నవ్వొచ్చింది.‘‘అలాగైతే నువ్వేం చేస్తున్నావు... ఇటుకరాయి అద్దం కాలేని పక్షంలో మనసు ఎలా స్వచ్ఛమైన అద్దమవుతుందో చెప్పు. ముక్కు మూసుకుని కూర్చున్నంత మాత్రాన నిలకడ వచ్చేయదు. దానికో పద్ధతి ఉంది. అది తెలుసుకోకుండా ఎవరినీ చూడనని కళ్ళు గట్టిగా మూసుకుంటే సరిపోతుందని అనుకోవడం ఎంత అవివేకం?’’ అని ప్రశ్నించాడు గురువు. శిష్యుడు సిగ్గుతో తలవంచుకున్నాడు. – యామిజాల జగదీశ్ -
ఈ వెరైటీ వంటకాలను ఓసారి ట్రై చేయండి..!
బ్రింజాల్ పిజ్జా..కావలసినవి..వంకాయలు– 3 లేదా 4 (కొంచెం పెద్ద సైజువి తీసుకుంటే పిజ్జాలు బాగా వస్తాయి)ఆలివ్ నూనె– 1 టేబుల్ స్పూన్బేబీ టమాటో– 2 (గుండ్రంగా కట్ చేసుకోవాలి)మోజరెలా చీజ్– అర కప్పువెల్లుల్లి తురుము, మిరియాల పొడి– తగినంతఉప్పు– తగినంత, తులసి ఆకులు– కొన్నితయారీ..– ముందుగా ఒక్కో వంకాయను శుభ్రం చేసుకుని గుండ్రంగా మూడు లేదా నాలుగు చక్రాల్లా కట్ చేసుకుని ఆలివ్ నూనెలో ముంచాలి.– అనంతరం వాటిని ఒక ట్రేలో వరుసగా పేర్చుకుని, వాటిపై కొద్దిగా మోజరెలా చీజ్ వేసి, ఐదు నిమిషాల పాటు ఓవెన్లో దోరగా బేక్ చేసుకోవాలి.– అనంతరం ముక్కలను బయటికి తీసి, వాటిపై మిరియాల పొడి, వెల్లుల్లి తురుము, చిన్నచిన్న టమాటో ముక్కలు, మోజరెలా చీజ్ చల్లుకోవాలి.– మరోసారి ఆ ట్రేను ఓవెన్లో పెట్టుకుని, బేక్ చేసుకోవాలి. వాటిని తులసి ఆకులతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.పొద్దుతిరుగుడు లడ్డూ..కావలసినవి..పొద్దుతిరుగుడు గింజలు– 1 కప్పుబెల్లం తురుము– 1 కప్పునీళ్లు– పాకానికి సరిపడాకొబ్బరి తురుము– పావు కప్పునెయ్యి– 3 టేబుల్ స్పూన్లుతయారీ..– ముందుగా పొద్దుతిరుగుడు గింజలను నేతిలో దోరగా వేయించి, మిక్సీలో పౌడర్లా చేసుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకుని కళాయిలో బెల్లం తురుము, నీళ్లు పోసుకుని పాకం పెట్టుకోవాలి.– చల్లారాక వడకట్టుకుని, అందులో నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. అనంతరం ఆ మిశ్రమంలో పొద్దుతిరుగుడు గింజల పొడి, కొబ్బరి తురుము వేసుకుని, ముద్దలా చేసుకోవాలి.– అవసరం అయితే అదనంగా కాస్త నెయ్యి వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి.టమాటో హల్వా..కావలసినవి..టమాటోలు– 10, పంచదార– 1 కప్పునెయ్యి– అరకప్పు, బొంబాయి రవ్వ– ఒక కప్పునట్స్– రెండు గుప్పిళ్లు, ఫుడ్ కలర్– అభిరుచిని బట్టిఏలకుల పొడి– అర టీస్పూనుతయారీ..– ముందుగా టమాటోలను నీళ్లలో ఉడికించి చల్లార్చాలి. వాటిని మిక్సీలో వేసుకుని గుజ్జులా చేసుకుని, బౌల్లోకి వేయాలి.– ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి రెండు స్పూన్ల నెయ్యి వేసి నట్స్, బొంబాయి రవ్వలను విడివిడిగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.– ఇప్పుడు స్టవ్ మీద కాస్త లోతుగా ఉండే పాత్రని పెట్టి అందులో రెండు కప్పుల నీళ్లు పోయాలి.– నీళ్లు మరిగాక వేయించిన బొంబాయి రవ్వ, కొద్దిగా నెయ్యి వేసి కలుపుతూ ఉండాలి.– రవ్వ చిక్కబడుతున్న సమయంలో టమాటో గుజ్జు, పంచదార, మిగిలిన నెయ్యి వేసి బాగా కలపాలి.– ఆ మిశ్రమం హల్వాలా చిక్కబడుతున్న సమయంలో ఫుడ్ కలర్, ఏలకుల పొడి చల్లి, బాగా కలిపి దించేయాలి.– తరువాత బౌల్ లోపల కాస్త నెయ్యి రాసి, సగానికి పైగా హల్వాని వేయాలి.– తర్వాత నట్స్ చల్లుకుని, మిగిలిన హల్వా కూడా పైన వేసుకుని పరచుకోవాలి. గాలికి చల్లారి దగ్గరపడిన తర్వాత నచ్చిన షేప్‌లో కట్ చేసుకుంటే సరిపోతుంది.ఇవి చదవండి: -
రొమ్ము తొలగించకుండానే..కేన్సర్ కొమ్ము వంచేలా..
సాక్షి, హైదరాబాద్: రొమ్ము కేన్సర్ వచ్చిన మహిళా రోగులకు రొమ్ము తొలగించకుండా నిర్వహించే ‘ఆంకోప్లాస్టీ’ చికిత్స పద్ధతికి ప్రభుత్వ ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి శ్రీకారం చుట్టింది. ఢిల్లీ ఎయిమ్స్, ముంబైలోని టాటా కేన్సర్ ఆస్పత్రి, పుణే, కోల్‌కతాలతో పాటు హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే ఆస్పత్రిలోనే ఈ అధునాతన ఆంకోప్లాస్టీ పద్ధతిలో రొమ్ము కేన్సర్‌కు చికిత్స చేస్తున్నారు. ఎంఎన్‌జేలోని సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మాటూరి రమేష్ నేతృత్వంలోని వైద్యబృందం ఈ అధునాతన చికిత్స నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 50 మంది మహిళలకు ఆంకోప్లాస్టీ పద్ధతిలో చికిత్స చేశారు. పెరుగుతున్న రొమ్ము కేన్సర్ కేసులు రొమ్ము కేన్సర్లలో 70–80 శాతం మంది వ్యాధి ముదిరిన తర్వాతే మేలుకొంటున్నారు. ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రికి వచ్చే రోగుల్లో ఇలాంటి వారే ఎక్కువగా ఉంటున్నారు. మహిళా కేన్సర్ కేసుల్లో 15 శాతం వరకు రొమ్ము కేన్సర్వే ఉంటున్నాయి. అందులో 80 శాతం చాలా అడ్వాన్స్ స్టేజీలో చికిత్సకు వస్తున్నారు. అక్టోబరు నెలను బ్రెస్ట్ కేన్సర్ అవగాహన మాసంగా నిర్వహిస్తున్నారు. రొమ్ము కేన్సర్లకు చికిత్సపరంగా కీమోథెరపీ, సర్జరీ, రేడియేషన్ ఉంటాయి. వ్యాధి రొమ్ము వరకు ఉంటేనే సర్జరీ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉండి ఫోర్త్ స్టేజ్‌కు వస్తే నయం చేయలేం. 35 ఏళ్లు దాటిన ప్రతి మహిళ కేన్సర్ స్క్రీనింగ్ టెస్టు చేయించుకోవాలి. ఎంత ముందుగా గుర్తించగలిగితే నయం చేయడానికి అంత ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆంకోప్లాస్టీ చికిత్స ఇలా.. సాధారణంగా రొమ్ము కేన్సర్‌కు చికిత్సలో మహిళ రొమ్ము మొత్తం తీసేస్తారు. దీనివల్ల వారు మానసికంగా ఆందోళనకు గురవుతారు. అయితే పూర్తిగా రొమ్ము తీసే పద్ధతికి ఎంఎన్‌జే ఆస్పత్రి వైద్యులు చెక్ పెట్టారు. ఆంకోప్లాస్టీ పద్ధతిలో రొమ్ము తొలగించకుండానే సాధారణంగా ఉండేలా చేస్తున్నారు. ఎవరైనా మహిళకు రొమ్ము కేన్సర్‌ను గుర్తించినప్పుడు లేదా ఒకవేళ అది సైజు పెద్దగా ఉంటే కీమోథెరపీ ఇచ్చి గడ్డగా చిన్నగా చేస్తారు. గడ్డ వరకే ఆపరేషన్ చేసినప్పుడు మిగిలిన రొమ్ముపై గుంటలాగా ఉంటుంది. దాన్ని ఆంకోప్లాస్టీ ద్వారా దాన్ని సాధారణ స్థితికి తీసుకొస్తారు. ప్లాస్టిక్ సర్జరీ టెక్నిక్‌ను వాడుకొని ఏడాదిన్నరగా ఈ ఆంకోప్లాస్టీ చేస్తున్నారు. ఆంకోప్లాస్టీ సర్జరీ చేయడానికి నాలుౖగెదు గంటలు పడుతుంది. రొమ్ము పక్కన చంక సమీపంలోని కండను అంతర్గతంగానే ప్రత్యేక పద్ధతిలో తీసుకొచ్చి రొమ్ములో సర్దుబాటు చేస్తారు. అంటే చంకలో ఉండే అదనపు కొవ్వు, కండ, అవసరమైతే చర్మం కూడా తీసుకొని రొమ్ములో ఎక్కడ అవసరం పడుతుందో అక్కడకు తీసుకొచ్చి కుడతారు. పైకి ఎలాంటి కోత కనిపించకుండా ఆంకోప్లాస్టీ పద్ధతిలో చేస్తారు. ఎంఎన్జేలో ఇది పూర్తిగా ఉచితం. అదే కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఆంకోప్లాస్టీ సర్జరీకి ఏకంగా రూ.5 లక్షల వరకు ఉంటుంది. మూడువారాల్లో సాధారణ స్థితిలోకి.. ఆంకోప్లాస్టీ విధానంపై మేం ప్రత్యేకంగా శిక్షణ పొందాం.ఆంకోప్లాస్టీ సర్జరీ చేశాక మూడునాలుగు రోజుల్లో ఆస్పత్రి నుంచి రోగిని డిశ్చార్జి చేస్తాం. ఈ చికిత్సలో కుట్లు వాటంతట అవే కరిగిపోయేలా ఉంటాయి. కాబట్టి కుట్లు తీయాల్సిన పనిలేదు. మూడువారాల్లో రోగి సాధారణ జీవితం గడపొచ్చు. నొప్పులేమీ ఉండవు. ఇంటికి వెళ్లేప్పుడు డోలో వంటి మాత్రలు మాత్రమే ఇచ్చి పంపిస్తాం. – డాక్టర్ మాటూరి రమేష్,సర్జికల్ ఆంకాలజిస్ట్, ఎంఎన్‌జే, హైదరాబాద్ రొమ్ము కేన్సర్‌లో ఆంకోప్లాస్టీ ప్రాచుర్యం పొందింది ఈ నెల 13వ తేదీన ప్రత్యేకంగా రొమ్ము కేన్సర్‌పై అవగాహనకు వాక్ నిర్వహిస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఆంకోప్లాస్టీ విధానం ప్రపంచంలో ప్రాచుర్యం పొందుతుంది. ఇండియాలో కొన్నిచోట్ల మాత్రమే ఈ చికిత్స చేస్తున్నారు. అందులో హైదరాబాద్‌లో ఎంఎన్జేలో చేస్తున్నాం. – డాక్టర్ జయలత, డైరెక్టర్,ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి -
వెరైటీగా మొక్కజొన్న తినాలకుంటే జుట్టూడింది!
సోషల్ మీడియా అనేది వాకింగ్ కామెడీ షో లాంటిది. ఎవరైనా సోషల్ మీడియా సముద్రంలోకి దూకినప్పుడు వింతలు విడ్డూరాలు అనేకం కనిపిస్తాయి. ప్రతిరోజూ లెక్కలేనన్ని వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఒక వీడియో వైరల్‌గా మారింది. దీనిలో ఒక యువతి మొక్కజొన్న తినడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిని అనుసరించి భంగపడింది. ఈ వీడియోను చూసిన వారెవరైనా నవ్వకుండా ఉండలేకపోతున్నారు. వైరల్ వీడియోలో డ్రిల్ మెషిన్‌కు మొక్కజొన్న పొత్తు గుచ్చి, ఒక అమ్మాయి దానిని తినేందుకు ప్రయత్నిస్తుంది. కొంత సమయం వరకు అంతా బాగానే ఉంది. తరువాత ఒక్కసారిగా ఆమె జుట్టు కొద్దిమేరకు మెషీన్లో ఇరుక్కుపోయి ఊడిపోతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ X (గతంలో Twitter)లో @ZeroIQPeople అనే పేజీలో ఈ వీడియో పోస్ట్ చేశారు. ఇప్పటివరకూ 15 వేల 600 మంది ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియో చూసిన ఒక యూజర్.. ‘అందుకే యువతులు పవర్ టూల్స్‌కు దూరంగా ఉండాలని చెప్పేది’ అని రాశాడు. మరో యూజర్ నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేశారు. ఇది కూడా చదవండి: అమెరికన్లు త్వరగా ఎందుకు మరణిస్తున్నారు? pic.twitter.com/DQVFNWZH5P — People With 0 IQ (@ZeroIQPeople) October 1, 2023 -
ఇక ‘సౌండ్’తో పేమెంట్..!
న్యూఢిల్లీ: కొత్త చెల్లింపుల విధానం త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిజిటల్ చెల్లింపులను పెంచే లక్ష్యంతో శబ్దం ఆధారిత చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) ప్రయత్నాలు మొదలు పెట్టింది. శబ్దం ఆధారిత చెల్లింపుల విధానాన్ని పరీక్షించేందుకు ఫోన్‌పే, టోన్‌ట్యాగ్, అల్ట్రా క్యాష్ అనే మూడు సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 2016 నవంబర్‌లో డీమోనిటైజేషన్ ప్రకటించిన తర్వాత యూపీఐ లావాదేవీలు గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే, వర్తకులు ఇప్పటికీ యూపీఐ ఆధారిత చెల్లింపుల పట్ల విముఖంగానే ఉన్నారు. దీంతో ఎన్పీసీఐ ఆ తర్వాత యూపీఐతో అనుసంధానించిన క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకొచ్చింది. అయినా కానీ, ఈ విధానం కూడా సక్సెస్ కాలేదు. ఈ నేపథ్యంలో మరింత సులభతరంగా డిజిటల్ చెల్లింపులను సుసాధ్యం చేసేందుకు ప్రత్యామ్నాయాలపై ఎన్పీసీఐ దృష్టి పెట్టింది. అందులో భాగంగానే శబ్దం ఆధారిత చెల్లింపుల విధానం ముందుకు వచ్చింది. ఐసీఐసీఐ పాకెట్స్‌కు టోన్‌ట్యాగ్ అనుసంధానం టోన్‌ట్యాగ్‌కు చెందిన ‘సౌండ్‌పే’ను ఐసీఐసీఐ బ్యాంకు ‘పాకెట్స్’ యాప్‌తో ప్రయోగాత్మకంగా అనుసంధానించారు. దీంతో ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లు పాకెట్స్ యాప్ నుంచి దుకాణాల్లో ప్రస్తుతమున్న పేమెంట్ మెషీన్ల ద్వారానే చెల్లింపులు చేసేందుకు వీలవుతుంది. ‘‘దుకాణాల్లో క్యూఆర్ కోడ్ చెల్లింపులకు భద్రతా పరమైన సవాళ్లున్నాయి. క్యూఆర్ కోడ్లు మారకుండా స్టాటిక్గా ఉంటాయి. వాటికి సులభంగా నకిలీలను రూపొందించొచ్చు’’ అని టోన్‌ట్యాగ్ వ్యవస్థాపకుడు కుమార్ అభిషేక్ తెలిపారు. శబ్దం ఆధారిత చెల్లింపుల విధానం అటు క్యూఆర్ కోడ్ ఇంటరాపరబిలిటీ ఫీచర్, ఇటు నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ పేమెంట్స్ ఫీచర్ల సంయుక్తంగా పనిచేస్తుందని తెలిపారు. శబ్దం ఆధారిత చెల్లింపులకు సంబంధించి టోన్‌ట్యాగ్‌కు ఏడు అంతర్జాతీయ పేటెంట్లు ఉండడం గమనార్హం. అంతేకాదు దేశవ్యాప్తంగా 1,20,000 వ్యాపారులు టోన్‌ట్యాగ్‌తో భాగస్వామ్యం కాగా, 4.2 కోట్ల మంది కస్టమర్లు ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతమున్న కార్డు స్వైపింగ్ మెషిన్లలోనే సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం ద్వారా వాటిని శబ్ధ తరంగాల ఆధారిత చెల్లింపులు స్వీకరించేందుకు అనువుగా మారుస్తోంది. ఇలా పనిచేస్తుంది... అధిక ఫ్రీక్వెన్సీతో కూడిన శబ్దం కస్టమర్ ఫోన్ నుంచి విడుదల కాగానే, దాన్ని దుకాణంలోని మెషీన్లో ఏర్పాటు చేసిన స్పీకర్ క్యాప్చర్ చేస్తుంది. అదే ఆథెంటికేషన్‌గా పనిచేస్తుంది. దాంతో కార్డు, పిన్లు అక్కర్లేకుండానే చెల్లింపులు పూర్తవుతాయి. ఇంకో వెసులుబాటు ఏంటంటే శబ్దం ఆధారిత చెల్లింపుల విధానాన్ని ఇప్పుడున్న ఏ చెల్లింపుల వ్యవస్థతోనయినా సులభంగా అనుసంధానించుకోవచ్చు. అంటే బ్యాంకు కార్డులు, బ్యాంకు ఖాతాలు, యూపీఐ, ప్రీపెయిడ్ వ్యాలెట్లతోనూ అనుసంధానికి వీలవుతుందని చెబుతోంది టోన్‌ట్యాగ్. ఈ సంస్థ కర్ణాటక రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ భాగస్వామ్యంతో టోల్ చార్జీల చెల్లింపులకు శబ్దం ఆధారిత విధానాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఉంది. -
ముగిసిన మొక్కు‘బడి’
తూతూ మంత్రంగా ‘ముందస్తు విద్యాసంవత్సరం’ విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో కానరాని ఉత్సాహం లక్ష్యానికి ఆమడదూరంలో నిలిచిన ప్రయోగం ప్రభుత్వం సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ మాదిరిగా కొత్త విద్యా సంవత్సరాన్ని (2017-18) ఒక నెల ముందుగానే ప్రారంభిస్తే సత్ఫలితాలు ఉంటాయని ఆశించినా రాష్ట్ర ప్రభుత్వ ఆశయం లక్ష్యానికి ఆమడదూరంలోనే నిలచిపోయింది. రాష్ట్ర విద్యాశాఖ మార్చి 17వ తేదీలోగా ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు వార్షిక పరీక్షలు నిర్వహించి 2016-17 విద్యాసంవత్సరాన్ని ముగించింది. నాలుగు రోజుల వ్యవధినిచ్చి అదే నెల 21 నుంచి కొత్త విద్యాసంవత్సరాన్ని ప్రారంభించింది. అయితే, మార్చి నెలారంభం నుంచే ఎండలు విపరీతం కావడం, పెళ్లిళ్ల సీజన్, పదో తరగతి పరీక్షల స్పాట్ వాల్యుయేషన్‌కు టీచర్లు వెళ్లడం తదితర కారణాలతో కొత్త విద్యాసంవత్సరం మొక్కుబడిగా ముగిసింది. తరగతులు జరిగిన రోజులు పలు పాఠశాలల్లో పిల్లల హాజరు శాతం అతి తక్కువగా కనిపించింది. - కాకినాడ రూరల్ గత నెల 17 నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో టీచర్లు ఇన్విజిలేషన్‌కు వెళ్లడం, ఈ నెల మూడు నుంచి ప్రారంభమైన స్పాట్ వాల్యుయేషన్‌కు వెళ్లడంతో విద్యార్థులకు పాఠాలు బోధించేవారే కరువయ్యారు. మిగిలిన ఒకరో, ఇద్దరో పాఠశాలకు వచ్చి మమ అనిపించేశారు. దీంతో అసలు లక్ష్యం నెరవేరకపోగా సమయం వృథా అయ్యిందంటున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి పాఠ్యపుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేయకపోవడంతో చిన్నారులు పాతపుస్తకాలతోనే పాఠశాలకు వెళ్లడం తప్ప ముందస్తు విద్యాసంవత్సరంతో పిల్లలకు ఒరిగిందేమీలేదు. పాఠశాలలు సక్రమంగా నడుస్తున్నాయా? విద్యార్థుల సాధకబాధలేమిటీ? టీచర్లు సక్రమంగా హాజరవుతున్నారా? అనే విషయాల్లో ఉన్నతాధికారులు పర్యవేక్షించిన పాపాన పోలేదు. ముందస్తు పుణ్యమా అని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కొత్త అడ్మిషన్ల పేరుతో ఫీజులు దండికోవడం తప్పితే ఒనగూరిన ప్రయోజనం లేదని సర్వతా విమర్శలు వినిపిస్తున్నాయి. బోసిపోయిన తరగతులు ఎండలు తీవ్రమవ్వడంతో ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలల్లోనూ విద్యార్థుల సంఖ్య బాగా తగ్గింది. కొన్ని పాఠశాల్లోనైతే వేళ్లమీద లెక్కించదగ్గ విద్యార్థులే హాజరయ్యారు. ఉపాధ్యాయులు సైతం ఇష్టానుసారంగా వచ్చిపోవడం కూడా ముందస్తు విద్యాసంవత్సరం విఫలమవ్వడానికి కారణమన్న ఆరోపణలు లేకపోలేదు. మొత్తానికి మండిపోతున్న ఎండలతో శనివారంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. దీంతో ముందస్తు విద్యాసంవత్సరం ముగించేశారు. మార్పుపై పునరాలోచించాలి సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ తరహాలో కొత్త విద్యాసంవత్సరాన్ని మార్చి 21 నుంచి ప్రారంభించినా అందుకు తగ్గట్టు విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లను ప్రభుత్వం సన్నద్ధం చేయకపోవడంతో ఈ ప్రయోగం విఫలమైందని తల్లిదండ్రులు, విద్యా మేథావులు అభిప్రాయపడుతున్నారు. కనీసం వచ్చే విద్యా సంవత్సరానికైనా ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచించాలని కోరుతున్నారు. ముందస్తు విద్యాసంవత్సరాన్ని కొనసాగించదల్చుకుంటే అన్ని వసతులు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
బోధన పద్దతిలో మెళుకువలు పాటించాలి
నేలమర్రి(మునగాల): ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించే విధానంలో మెళుకువలు పాటించి నాణ్యమైన విద్యను అందించాలిని మండల విద్యాధికారి వసుకుల రామారావు కోరారు. మండలంలోని నేలమర్రి జెడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం స్కూల్ కాంప్లెక్స్ సమావేశం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వై. వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు తమ వి«ధుల పట్ల శ్రద్ధ వహించాలన్నారు. ఈ సమావేశంలో 11పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీ ఆర్.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
సులభరీతిలో బోధన జరగాలి
గుర్రంపోడు : ఉపాధ్యాయులు విద్యార్థులకు సులభరీతిలో విద్యాబోధన చేయాలని పిట్టలగూడెం జెడ్పీ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ హెచ్ఎం హిమజ అన్నారు. శుక్రవారం కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయుల శిక్షణా సమావేశంలో మాట్లాడారు. సమావేశాల్లో టీచర్లు రిసోర్స్ పర్సన్ల ద్వారా మెరుగైన బోధనకు కృషిచేయాలన్నారు. ఆటలు, చిత్రపటాలు, అభినయాల ద్వారా ఆకర్షితులై సులభంగా అర్థం చేసుకోగలుగుతారని అన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యత ఉండేలా హెచ్ఎంలు బాధ్యత వహించాలని అన్నారు. సమావేశంలో రిసోర్స్ పర్సన్లు మారం జగదీశ్వర్‌రెడ్డి, ఉమాదేవి, టీచర్లు పాల్గొన్నారు. -
సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ర్యాలీ
రాంనగర్ : సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ సీపీఎస్ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ నుంచి క్లాక్‌టవర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.అంజయ్య మాట్లాడుతూ ప్రభుత్వానికి సర్వీసు చేసిన సీపీఎస్ ఉద్యోగులకు ఉదద్యోగ విరమణ తర్వాత ఎటువంటి ఆర్థిక ప్రయోజనం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే సీపీఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జానయ్య, రామలింగం, యాకుబ్ పాషా, సైదులు, వెంకటరాంరెడ్డి, ఎ.ఎ.ఖాన్, వేణుకుమార్, వెంకట్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, హఫీజుల్లా, దీనేష్రెడ్డి, నుస్రత్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
ఇక చకచకా స్తంభం ఎక్కొచ్చు..!
విద్యుత్ స్తంభం ఎక్కడం ఆపరేటర్లు, హెల్పర్లకు ఎంతో కష్టం. వీరికి నిర్వహించే పరీక్షలోనూ కీలకాంశం స్తంభం ఎక్కడమే. ఎంతో క్లిష్టమైన ఈ పనిని ఓ చక్కని ఐడియాతో సులభం చేసేశాడు ఇల్లెందు ఎల్బీఎస్ నగర్‌కు చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మోతుకూరి శివ. కేవలం రూ.200 ఖర్చుతో కూడిన ఈ పరికరం తయారీ గురించి.. ‘ఓ రెండు ఇనుపరాడ్డులు తీసుకొని స్తంభానికి పట్టుకొని ఉండే విధంగా ఒక్కోదానికి రెండు ఇనుప బోల్ట్రాడ్ల చొప్పున వెల్డింగ్ పెట్టించాడు. ప్రధాన రాడ్డు మరో చివర తీగలతో చెప్పు అమర్చాడు. ఇలా రెండు రాడ్లను తయారు చేసి.. ముందుగా ఒక రాడ్డును స్తంభానికి పెట్టి.. దానిపైన మరో రాడ్డు..ఇలా ఒక్కొక్కటి మార్చుకుంటూ ఆ రెండు రాడ్ల సహాయంతో ఈజీగా స్తంభం ఎక్కేశాడు. ఈ పరికరాన్ని చూసి స్థానిక విద్యుత్ అధికారులు తమ సిబ్బందికి వీటిని అందించాలని ఆలోచన చేశారు. దీన్ని తయారు చేసిన శివను అభినందించారు. – ఇల్లెందు అర్బన్