
సులభరీతిలో బోధన జరగాలి
గుర్రంపోడు : ఉపాధ్యాయులు విద్యార్థులకు సులభరీతిలో విద్యాబోధన చేయాలని పిట్టలగూడెం జెడ్పీ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ హెచ్‌ఎం హిమజ అన్నారు. శుక్రవారం కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయుల శిక్షణా సమావేశంలో మాట్లాడారు. సమావేశాల్లో టీచర్లు రిసోర్స్ పర్సన్‌ల ద్వారా మెరుగైన బోధనకు కృషిచేయాలన్నారు. ఆటలు, చిత్రపటాలు, అభినయాల ద్వారా ఆకర్షితులై సులభంగా అర్థం చేసుకోగలుగుతారని అన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యత ఉండేలా హెచ్‌ఎంలు బాధ్యత వహించాలని అన్నారు. సమావేశంలో రిసోర్స్ పర్సన్‌లు మారం జగదీశ్వర్‌రెడ్డి, ఉమాదేవి, టీచర్లు పాల్గొన్నారు.