సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని ర్యాలీ | must cancel CPS method | Sakshi
Sakshi News home page

సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని ర్యాలీ

Published Thu, Jul 28 2016 11:43 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని ర్యాలీ

సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని ర్యాలీ

రాంనగర్‌ : సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ సీపీఎస్‌ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌ నుంచి క్లాక్‌టవర్‌  వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.అంజయ్య మాట్లాడుతూ ప్రభుత్వానికి సర్వీసు చేసిన సీపీఎస్‌ ఉద్యోగులకు ఉదద్యోగ విరమణ  తర్వాత ఎటువంటి ఆర్థిక ప్రయోజనం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే సీపీఎస్‌ విధానం రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జానయ్య, రామలింగం, యాకుబ్‌ పాషా, సైదులు, వెంకటరాంరెడ్డి, ఎ.ఎ.ఖాన్, వేణుకుమార్, వెంకట్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, హఫీజుల్లా, దీనేష్‌రెడ్డి, నుస్రత్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement