cps
-
కొత్త పెన్షన్ విధానానికి కేంద్రం ఆమోదం.. కీలకాంశాలు..
కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) స్థానంలో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ పథకం (యూపీఎస్)ను అమలు చేసేలా విధానాలు రూపొందించింది. 2025 ఏప్రిల్ 1 నుంచి ఈ యూపీఎస్ విధానం అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. 2004 ఏప్రిల్ 1 తర్వాత సర్వీసులో చేరిన ఉద్యోగులకు ప్రస్తుతం ఎన్పీఎస్ వర్తిస్తోంది. వీరందరూ యూపీఎస్ పరిధిలోకి రానున్నారు. దాంతో 23 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్) స్థానంలో కొత్త యూపీఎస్‌ను అమలు చేస్తే లబ్ధిదారుల సంఖ్య 90 లక్షలకు చేరుతుందని చెప్పింది. ఇటీవల ప్రధాని మోదీ సమక్షంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ విధానానికి ఆమోదం లభించింది.యూపీఎస్ విధానంలోని కీలకాంశాలు..ప్రస్తుతం అమలవుతున్న ఎన్పీఎస్ విధానంలో ఉద్యోగి వేతనం నుంచి 10 శాతం, ప్రభుత్వం మరో 10 శాతం జమచేసి పెట్టుబడి పెట్టేది. ఉద్యోగి పదవీ విరమణ పొందాక ఆ మొత్తాన్ని పెన్షన్ రూపంలో అందించేవారు. అయితే యూపీఎస్‌లో మాత్రం రిటైర్డ్ అయ్యే 12 నెలల ముందు వరకు ఎంత వేతనం ఉందో అందులో సరాసరి 50 శాతం పెన్షన్ రూపంలో చెల్లిస్తారు.పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కనీస సర్వీసు 25 సంవత్సరాలు ఉంటే పూర్తి పెన్షన్‌కు అర్హులు. ఒకవేళ 25 ఏళ్లు పూర్తి అవ్వకపోతే దామాషా ప్రకారం 10-25 ఏళ్లలోపు పెన్షన్ లెక్కించి ఇస్తారు.కనీసం 10 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకుంటేనే యూపీఎస్ కిందకు వస్తారు. అలా కేవలం పదేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులు కనిష్ఠంగా రూ.10,000 పెన్షన్ తీసుకోవచ్చు. ఆపై 25 ఏళ్లలోపు సర్వీసు ఉన్న వారికి దామాషా ప్రకారం పెన్షన్ చెల్లిస్తారు. 25 ఏళ్ల సర్వీసు దాటితే పూర్తి పెన్షన్ వస్తుంది.ఏటా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. కాబట్టి యూపీఎస్ కింద ఇచ్చే పెన్షన్‌లోనూ ఏటా ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసి ఇస్తారు. దాంతో కిందటి ఏడాది కంటే ప్రస్తుత ఏడాదికి ఎక్కువ పెన్షన్ అందుతుంది.యూపీఎస్ విధానంలో చేరిన పెన్షనర్లు మరణిస్తే అప్పటివరకు తాము తీసుకుంటున్న పెన్షన్‌లో 60 శాతం వారి భాగస్వామికి ఇస్తారు.యూపీఎస్ నిబంధనల ప్రకారం 1/10వ వంతు సుపర్ అన్యూయేషన్(మొత్తం సర్వీసును లెక్కించి చెల్లించే నగదు) చెల్లిస్తారు. బేసిక్ వేతనంలో 1/10వ వంతును పరిగణనలోకి తీసుకుని ప్రతి ఆరు నెలలకు ఒకసారి దీన్ని లెక్కిస్తారు. సర్వీసు పూర్తయిన వెంటనే ఒకేసారి ఈ మొత్తాన్ని అందిస్తారు. ఈ చెల్లింపునకు, పెన్షన్‌కు ఎలాంటి సంబంధం ఉండదు.కొత్త యూపీఎస్ విధానానికి మారాలనుకునే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు స్థానిక ప్రభుత్వాలను అనుసరించి డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. అయితే అందుకు రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్ అమలుకు సిద్ధంగా ఉండాలి.నేషనల్ పెన్షన్ స్కీమ్ కంటే యూపీఎస్ కొంత మేలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ యూపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్(ఓపీఎస్)ను భర్తీ చేయదని కొందరు చెబుతున్నారు. ఇదిలాఉండగా, హరియాణా, మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతుండగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం ఏమిటని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: కేజీ బేసిన్లో మరో బావి నుంచి ఉత్పత్తిరాష్ట్రాల వాటాపై పర్యవేక్షణయూపీఎస్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వాములు కావాలని కేంద్రం కోరుతోంది. అయితే ఇప్పటికే అమలవుతున్న ఎన్పీఎస్ విధానంలో కొన్ని రాష్ట్రాలు చెల్లించాల్సిన వాటాను జమ చేయకపోవడంతో కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పదవీ విరమణ అనంతరం ఎలాంటి అవినీతికి పాల్పడకుండా కేవలం గ్రాట్యుటీ, పెన్షన్ డబ్బుమీదే ఆధారపడే ఉద్యోగులకు కొత్త విధానం కొంత ఊరట చేకూరుస్తుందనే వాదనలున్నాయి. కానీ ఈ విధానాన్ని ఎంచుకునే రాష్ట్రాలు తప్పకుండా వాటి వాటాను సైతం జమచేసేలా పర్యవేక్షణ ఉండాలని విశ్లేషకులు కోరుతున్నారు. -
దేశానికే ఆదర్శంగా నిలిచిన వైఎస్ జగన్ పాలన
-
సీపీఎస్ రద్దు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం అమలవుతున్న కంట్రిబ్యూటరీ పింఛన్ విధానాన్ని (సీపీఎస్) రద్దు చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వనుంది. దాని స్థానంలో పాత పింఛన్ విధానాన్ని (ఓపీఎస్)ను పునరుద్ధరిస్తామని చెప్పనుంది. ఈ మేరకు తన ఎన్నికల ప్రణాళికలో చేర్చనుంది. వచ్చే ఎన్నికల్లో ప్రజలకు ఇవ్వాల్సిన హామీలతో కూడిన పార్టీ మేనిఫెస్టో కోసం మాజీ మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని కమిటీ దాదాపు గత నెలరోజులుగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు సమావేశమైన కమిటీ మొత్తం 36 అంశాలతో మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దినట్టు తెలుస్తోంది. తాజాగా బుధవారం రాత్రి కూడా గాంధీభవన్‌లో కమిటీ సమావేశమైంది. ఒకట్రెండు అంశాలపై స్పష్టత రాకపోవడంతో పార్టీ పెద్దలను సంప్రదించిన తర్వాత ఆ అంశాలను పొందుపరిచి నాలుగైదు రోజుల్లోపు మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. కొత్త స్కీములు..కౌంటర్ పథకాలు విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ప్రతి ఏటా ఉద్యోగుల బదిలీలు నిర్వహిస్తామని, ప్రతి ఏటా ఉద్యోగాల భర్తీ కేలండర్‌ను విడుదల చేయడంతో పాటు ఐదేళ్లలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వనుంది. కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాన్ని 25 శాతం పెంచుతామనే హామీని కూడా మేనిఫెస్టోలో పొందు పరుస్తున్నారు. బాలింతలకు ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న కేసీఆర్ కిట్‌కు కౌంటర్‌గా మరో పథకాన్ని ప్రకటిస్తారని, కిట్‌లోని వస్తువులతో పాటు ఆర్థిక సాయం పెంచుతారని సమాచారం. అదే విధంగా రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లందరికీ ప్రతి ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం పథకాన్ని కూడా ప్రకటించనున్నారు. చదువుకుంటున్న విద్యార్థినులందరికీ స్కూటీలు ఇస్తామని గతంలో ప్రకటించినప్పటికీ, తాజాగా వాటి స్థానంలో ల్యాప్‌టాప్‌లిస్తామని మేనిఫెస్టోలో వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. అందరి సంక్షేమమే లక్ష్యం..! కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికను ప్రజా మేనిఫెస్టో పేరుతో విడుదల చేయనున్నారు. ఇందులో తెలంగాణ ఉద్యమ, అమరవీరుల సంక్షేమ, వ్యవసాయం–రైతు సంక్షేమం, నీటి పారుదల, యువత–ఉపాధి కల్పన, విద్య, వైద్య రంగాలు, గృహ నిర్మాణం, భూపరిపాలన, పౌరసరఫరాలు, ని త్యావసరాల పంపిణీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ప్రభుత్వ/ప్రైవేటు ఉద్యోగుల సంక్షేమం, విద్యుత్ రంగం, టీఎస్ఆర్టీసీ సంక్షేమం, మద్య విధానం, మహిళా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, సింగరేణి కార్మికులు, కార్మికులు, న్యాయవాదులు, సీనియర్ సిటిజన్లు, జర్నలిస్టులు, గల్ఫ్ ఎన్నారైలు, ట్రాన్స్జెండర్ల సంక్షేమం, క్రీడారంగం, పోలీస్–శాంతి భద్రతల వ్యవస్థ, పర్యాటక రంగం, జానపద, సినిమా–సాంస్కృతిక రంగం, ధార్మిక రంగం, పర్యావరణం, గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి తదితర అంశాలతో కూడిన మేనిఫెస్టోకు కాంగ్రెస్ నేతలు రూపకల్పన చేస్తుండడం గమనార్హం. -
నూతన సీపీలు, ఎస్పీల నియామకంపై డీజీపీ కసరత్తు.. హైదరాబాద్ సీపీ రేసులో ఉన్నది వీరే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలపై 20 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, నాన్ కేడర్ ఎస్పీలపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ సీపీ సహా ముగ్గురు పోలీసు కమిషనర్లు, నాలుగు జిల్లాల కలెక్టర్లు, 10 జిల్లాల ఎస్పీలు, ఓ శాఖ కార్యదర్శి, మరో శాఖ డైరెక్టర్, ఇంకో శాఖ కమిషనర్లపై బదిలీ వేటు వేసింది. వీరిలో 18 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, నాన్ కేడర్ ఎస్పీలకు శాసనసభ ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి బాధ్యతలు అప్పగించకూడదని ఆంక్షలు విధించింది. బదిలీ అయిన అధికారులు సత్వరమే బాధ్యతల నుంచి తప్పుకొని తమ తర్వాతి స్థానంలో ఉన్న అధికారికి బాధ్యతలు అప్పగించాలని స్పష్టం చేసింది. ఈ మూడు శాఖలకు కొత్త ముఖ్య కార్యదర్శులతోపాటు బదిలీ వేటుపడిన 20 మంది అధికారుల స్థానంలో ఈ రోజు సాయంత్రం 5 గంటల్లోగా కొత్త అధికారులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది ఈ క్రమంలో నూతన సీపీలు, ఎస్పీల నియామకంపై డీజీపీ అంజనీకుమార్ కసరత్తు ప్రారంభించారు. సీఈసీకి పంపే లిస్ట్‌ను డీజీపీ సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ సీపీ రేసులో మహేష్ భగవత్, షికా గోయల్, శివధర్‌రెడ్డి, కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, నాగిరెడ్డి, సజ్జనార్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ముగ్గురి పేర్లతో సీఈసీకి ప్రభుత్వం లిస్ట్ పంపనుంది. ప్రతి పోస్టుకు ముగ్గురు పేర్లతో జాబితాను ప్రభుత్వం పంపనుంది. ఆ ముగ్గురిలో ఒకరిని ఆయా పోస్టుల్లో ఈసీ ఎంపిక చేయనుంది. రాష్ట్ర సర్కార్ పంపిన ముగ్గురి జాబితాలోని పేర్లపై అభ్యంతరాలు ఉంటే ఈసీ తిరస్కరించే అవకాశం ఉంది. మళ్లీ కొత్తగా పేర్లు ప్రతిపాదన చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ కోరనుంది. ఈసీ ఫైనల్ చేసిన తర్వాత ఆయా నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. -
జీపీఎస్‌తోనే మంచి ప్రయోజనాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) స్థానంలో ఉద్యోగులకు మెరుగైన పెన్షన్ అందించేలా ప్రభుత్వం ప్రతిపాదించిన గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్)పై ప్రభుత్వ ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్)తో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో జీపీఎస్‌లోనూ అలాంటివే ఉన్నాయని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ఓపీఎస్‌లో ఉన్న మెజారిటీ అంశాలను జీపీఎస్‌లో కొనసాగించడంపై వారిలో సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. ఈ మేరకు వాట్సాప్ గ్రూపులు, సామాజిక మాధ్యమాల్లో ఉద్యోగుల మధ్య ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఓపీఎస్, జీపీఎస్, సీపీఎస్ మధ్య లాభనష్టాలను పోలుస్తూ ఒక పట్టికను వారు విస్తతంగా షేర్ చేస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్‌లో కేవలం రెండు అంశాల్లో మినహా.. యథాతథంగా ఓపీఎస్ వల్ల కలిగే లాభాలు ఉన్నాయనే అభిప్రాయాన్ని ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగి పెన్షన్ విషయంలో 13 కీలకాంశాల్లో ఏకంగా తొమ్మిదింటిని ప్రభుత్వం జీపీఎస్‌లో చేర్చడం పట్ల వారిలో సానుకూలత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఓపీఎస్‌లో మాదిరిగానే పెన్షన్‌కు భద్రత కల్పించడం, జీవిత భాగస్వామికి సైతం పెన్షన్ వర్తిస్తుండటంపై జీపీఎస్ మంచిదని అభిప్రాయపడుతున్నారు. సీపీఎస్‌లో అనిశ్చితి కంటే ఇదే మేలు.. సీపీఎస్‌లో ఉద్యోగ విరమణ తర్వాత కార్పస్‌లో 60 శాతాన్ని ఉద్యోగి తీసుకుని.. 40 శాతం సొమ్ము యాన్యుటీ పెన్షన్ స్కీమ్‌లో పెట్టుబడిగా పెట్టాల్సి ఉంది. ఇదంతా మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. పూర్తి అనిశ్చితి ఏర్పతే.. రావాల్సిన పెన్షన్‌కూ గ్యారెంటీ ఉండదు. బేసిక్ శాలరీలో 20.3 శాతమే పెన్షన్‌గా వచ్చే అవకాశం ఉండగా.. ఇది కూడా వడ్డీరేట్లపై ఆధారపడే వస్తుండటంతో భద్రత కూడా కష్టమే. జీపీఎస్‌లోనూ సీపీఎస్‌లో చెల్లించినట్టే ఉద్యోగి 10 శాతం పెన్షన్ వాటాగా ఇస్తే.. ప్రభుత్వం కూడా అంతే కడుతుంది. ఉద్యోగ విరమణ సమయంలో చివరి జీతంలో బేసిక్‌లో 50 శాతం పెన్షన్‌గా అందుతుంది. ఇక్కడ సీపీఎస్‌తో పోలిస్తే పెన్షన్ 150 శాతం అధికంగా ఉంటుంది. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏడాదికి డీఏ/డీఆర్లు ఇస్తుంది. ఒక రిటైర్ అయిన వ్యక్తి చివరి నెల బేసిక్ జీతం రూ.లక్ష ఉంటే.. అందులో ఏకంగా రూ.50 వేలు పెన్షన్‌గా వస్తుంది. డీఆర్‌లతో కలుపుకుని ఇది ఏటా పెరుగుతుంది. 62 ఏళ్లకు రిటైర్ అయ్యే వ్యక్తి మరో ఇరవై ఏళ్ల తర్వాత అంటే.. అంటే 82 ఏళ్లకు జీపీఎస్ ద్వారా నెలకు రూ.1,10,000 పెన్షన్ తీసుకుంటారు. వాట్సాప్ గ్రూపుల్లో ఈ లెక్కలన్నీ వేసుకుంటూ జీపీఎస్‌పై ఉద్యోగులు సుదీర్ఘ చర్చలు సాగిస్తున్నారు. 2070 నాటికి జీపీఎస్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన డబ్బు క్రమంగా పెరుగుతూ అప్పటికి రూ.1,33,506 కోట్లకు చేరుకుంటుంది. ఇందులో రూ.1,19,520 కోట్లు ప్రభుత్వం బడ్జెట్ నుంచి భరించాల్సి వస్తుంది. ఒకవేళ ఉద్యోగులకు జీపీఎస్ నచ్చకుంటే సీపీఎస్‌లో కొనసాగే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. మళ్లీ రద్దు చేస్తే ఎలా.. ఓపీఎస్ రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుపై పెను ప్రభావం చూపే ప్రమాదం ఉండటంతోనే ప్రభుత్వం జీపీఎస్‌ను తీసుకొచ్చింది. ఓపీఎస్ ఇవ్వాల్సి వస్తే ప్రభుత్వం చెబుతున్నట్టు అప్పటికి ఇవ్వాల్సిన పెన్షన్ల మొత్తం.. ఉద్యోగుల జీతాలను కూడా దాటేసి మోయలేని స్థాయికి చేరుకుంటుంది. 2041 నాటికి రాష్ట్ర బడ్జెట్లో ఏకంగా రూ.65,234 కోట్లు పెన్షన్ల కోసమే చెల్లించాల్సి వస్తుంది. రుణాలపై చెల్లింపులతో కలుపుకుని రాష్ట్ర సొంత ఆదాయంలో 220 శాతానికి చేరుకుంటుంది. 2070 నాటికి ఈ చెల్లింపులు సుమారు రూ.3,73,000 కోట్లు అవుతాయి. ఏదోక దశలో ఈ మోయలేని భారాన్ని తట్టుకోలేక 2003 మాదిరిగానే మళ్లీ ఓపీఎస్‌ను రద్దు చేయాల్సిన పరిస్థితి వస్తే మళ్లీ కథ మొదటికి వస్తుందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఓపీఎస్‌కు దగ్గరగా మెరుగైన పెన్షన్ భరోసా జీపీఎస్‌తో లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఆ రెండింటిపై కూడా అనుకూలంగా ఉంటే.. ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించడంలో ప్రభుత్వం జీపీఎస్ ద్వారా పూర్తి గ్యారెంటీ ఇస్తుండటంపై ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. జీపీఎస్‌లో ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్‌కు పీఆర్సీ వర్తింపు ఉండదు. పెన్షన్ కాంట్రిబ్యూషన్ చెల్లించాలి. ఈ రెండు మినహా ఓపీఎస్లోని అంశాలన్నీ జీపీఎస్‌లోనూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాట్సాప్ గ్రూపుల్లో చర్చల ద్వారా ఉద్యోగులు ఒకరికొకరు తమ సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్), అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ విషయంలో కూడా సందిగ్ధతను తొలగించి వాటిని కూడా ఇచ్చేస్తే మొత్తం 11 అంశాలతో జీపీఎస్ మరింత సంపూర్ణంగా ఉంటుందని ఉద్యోగులు భావిస్తున్నారు. దీనిపై ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందోనని వారిలో ఆసక్తికర చర్చ సాగుతోంది. -
AP: సీపీఎస్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
సాక్షి, విజయవాడ: సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వం అమలు చేసే గ్యారంటీ పెన్షన్ స్కీం లో మరిన్ని ప్రయోజనాలు కలగనున్నాయి. రిటైర్మెంట్ నాటి బేసిక్ పేలో 50 శాతం గ్యారంటీ పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగి వార్షిక చెల్లింపుల్లో లోటు ఉంటే ప్రభుత్వమే భర్తీ చేయాలని నిర్ణయించింది. జీపీఎస్ ఉద్యోగుల జీవిత భాగస్వామికి 60 శాతం పెన్షన్, యాన్యుటిలో లోటు ఉంటే ప్రభుత్వమే భర్తీ చేయాలని నిర్ణయించింది. ద్రవ్యోల్బణం, అప్పటి ధరల ఆధారంగా బేసిక్ పే నిర్థారించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చదవండి: AP: కాంట్రాక్ట్ ఉద్యోగులకు మరో శుభవార్త -
AP: అనిశ్చితి నుంచి నిశ్చింతగా!.. జీపీఎస్‌తో పూర్తి గ్యారెంటీ
సాక్షి, అమరావతి: ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అధికారంలో ఉండగా 2003లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)కు బీజం పడింది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు సీపీఎస్ రద్దు గురించి వినడానికి కూడా ఇష్టపడలేదు. సీపీఎస్ ఉద్యోగులకు మేలు చేస్తామని గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ ప్రకటించడంతో చంద్రబాబు హడావుడిగా రిటైర్డ్ ఐఏఎస్ టక్కర్ అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి చేతులు దులుపుకొన్నారు. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం సీపీఎస్ ఉద్యోగులకు, కాంట్రాక్టు ఉద్యోగులకు మేలు చేస్తుంటే తప్పుడు కథనాలతో ఈనాడు రామోజీ బురద చల్లుతున్నారు. రాష్ట్రం, ఉద్యోగాల ప్రయోజనాలను కాపాడుతూ.. సీపీఎస్ విధానంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల చివరి నెల బేసిక్‌లో 20 శాతం కూడా పెన్షన్ కింద వస్తుందని గ్యారెంటీ లేదు. అదే జీపీఎస్ విధానం ప్రకారం రిటైర్డ్ ఉద్యోగుల చివరి నెల బేసిక్‌లో 50 శాతం పెన్షన్‌గా అందుతుందని గ్యారెంటీ కల్పిస్తుంటే రామోజీకి రుచించడంలేదు. ఉద్యోగులకు మంచి చేస్తుంటే భరించలేకపోతున్నారు. ఓపీఎస్ అమలు చేయడం వల్ల భవిష్యత్ తరాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. పెన్షన్ భారం ఉద్యోగుల జీతాలను సైతం దాటేసి మోయలేని స్థాయికి చేరుతుంది. రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుంటుంది. ఏదో ఒక దశలో ఈ మోయలేని భారాన్ని తట్టుకోలేక 2003 తరహాలోనే రద్దు చేసి ప్రత్యామ్నాయం తేవాల్సి వస్తుంది. ఇవన్నీ అధ్యయనం చేసిన తరువాతే సీపీఎస్ కన్నా మెరుగ్గా జీపీఎస్‌ను రూపొందించారు. ఇటు రాష్ట్ర భవిష్యత్తుతో పాటు అటు ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడుతూ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీని వెనుక రెండున్నరేళ్ల పాటు కసరత్తు చేసింది. మంత్రుల కమిటీని నియమించి అధ్యయనం చేసింది. సీఎస్ అధ్యక్షతన వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. చార్టర్డ్ అకౌంటెంట్ నిపుణులతో అధ్యయనం జరిపింది. ఉద్యోగులకు మంచి చేయాలనే ఉద్దేశంతో వారి యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకుని సమతూకం పాటిస్తూ జీపీఎస్‌ను తెచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో తిరిగి ఓపీఎస్ తెస్తున్నట్లు పేర్కొన్నా అమలులోకి రాకపోవడం గమనార్హం. సీపీఎస్‌లో అనిశ్చితి ♦ సీపీఎస్ విధానం 01–09–2004 తర్వాత చేరిన ఉద్యోగులకు వర్తిస్తుంది. ♦ సీపీఎస్ విధానంలో పెన్షన్ ఎంత వస్తుందనేది గ్యారెంటీ లేదు. ♦ రిటైరైన ఉద్యోగి చివరి నెల బేసిక్ వేతనం రూ.లక్ష అయితే పెన్షన్ సుమారు రూ.20 వేలు మాత్రమే వస్తుంది. ఇది కూడా వడ్డీరేట్లపై ఆధారపడి ఉంటుంది. వడ్డీ రేటు తగ్గితే పెన్షన్ కూడా తగ్గుతుంది. ♦ వడ్డీ రేట్లు ఇంకా తగ్గిపోతే 20 శాతం పెన్షన్ కూడా వస్తుందా రాదో అనే అనిశ్చితి. ఇదంతా మార్కెట్‌తో లింక్ అయి ఉంటుంది. మారుతున్న వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుంది. దశాబ్దం కాలంగా వడ్డీ రేట్లు తగ్గుతూ వస్తున్నాయి. ♦ ద్రవ్యోల్బణం వల్ల కాలం గడిచేకొద్దీ పెరిగే జీవన వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి డీఆర్లు ఇందులో ఇవ్వడం లేదు. ♦ 62 ఏళ్లకు ఉద్యోగి రిటైరైతే మరో 20 ఏళ్ల తరువాత పెన్షన్ విషయంలో ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ♦ ప్రభుత్వ ఉద్యోగులు తమ బేసిక్‌లో 10 శాతం జీతాన్ని పెన్షన్ ఫండ్‌కు బదిలీ చేయాలి. అంతే మొత్తాన్ని ప్రభుత్వం ఇస్తుంది. ♦ సీపీఎస్ పెన్షన్‌లో పూర్తి అనిశ్చితి ఉంటుంది. మార్కెట్లో పరిస్థితుల ప్రకారం హెచ్చు తగ్గులుంటాయి. ♦ పెన్షన్‌కు గ్యారెంటీ, భద్రత లేదు ♦ పదవీ విరమణ తరువాత ఉద్యోగికి ద్రవ్యోల్బణం నుంచి రక్షణ లేదు. జీపీఎస్‌తో పూర్తి గ్యారెంటీ ♦ జీపీఎస్ విధానంలో పెన్షన్‌కు పూర్తి గ్యారెంటీ ఉంటుంది. పెన్షన్ ఎంత వస్తుందో ఉద్యోగికి ముందుగానే తెలుస్తుంది. ♦ సీపీఎస్ తరహాలోనే ఉద్యోగి 10 శాతం చెల్లిస్తే ప్రభుత్వం దానికి సమానంగా అందచేస్తుంది. ♦ మార్కెట్ స్థితి గతులతో, వడ్డీ రేట్లతో ఎలాంటి సంబంధం లేదు. ఎలాంటి అనిశ్చితికి తావేలేదు. పెన్షన్ విషయంలో పూర్తి భరోసా. ♦ రిటైర్మెంట్ చివరి నెల వేతనం బేసిక్‌లో 50 శాతం పెన్షన్‌గా కచ్చితంగా అందుతుంది. సీపీఎస్‌తో పోలిస్తే జీపీఎస్‌లో అందే పెన్షన్ 150 శాతం అధికంగా ఉంటుంది. ♦ ద్రవ్యోల్బణాన్ని, పెరిగే ధరలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆర్నెల్లకు ఒకసారి ప్రకటించే డీఏలను పరిగణలోకి తీసుకుని ఏడాదికి రెండు డీఆర్లు ఇస్తారు. దీని వల్ల పెన్షన్ ఏటా పెరుగుతూ పోతుంది. ♦ రిటైరైన ఉద్యోగి చివరి నెల బేసిక్ జీతం రూ.లక్ష ఉంటే రూ.50 వేలు పెన్షన్‌గా వస్తుంది. ఏడాదికి రెండు డీఆర్‌లతో కలుపుకొని ఇది పెరుగుతూ పోతుంది. ♦ 62 ఏళ్లకు రిటైరైన ఉద్యోగికి 82 ఏళ్లు వచ్చేసరికి జీపీఎస్ ద్వారా పెన్షన్ రూ.1,10,000కి చేరుతుంది. తద్వారా రిటైరైన ఉద్యోగి జీవన ప్రమాణాలను కాపాడినట్లు అవుతుంది. ♦ పదవీ విరమణ అనంతరం జీవన విధానానికి ఆటంకాలు లేకుండా, సంతోషంగా గడిపేలా జీపీఎస్‌లో రక్షణ చర్యలు తీసుకున్నారు. సీపీఎస్‌లో ఇలాంటి వెసులు బాటే లేదు. -
‘థ్యాంక్యూ సీఎం సార్’.. సీపీఎస్‌కు బదులు మెరుగైన జీపీఎస్
సాక్షి, అమరావతి: ఉద్యోగుల సమస్యలను ఉదారంగా పరిష్కరించిన సీఎం జగన్మోహన్రెడ్డికి ఉద్యోగుల తరపున కృతజ్ఞతలు తెలిపినట్లు రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు కె.వెంకటరామిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 12వ పీఆర్సీ ఏర్పాటుకు నిర్ణయం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సీపీఎస్ బదులు మెరుగైన పెన్షన్ వచ్చేలా జీపీఎస్ తేవడం, వైద్య విధాన పరిషత్ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం పట్ల ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపినట్లు చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జగన్మోహన్రెడ్డి ఉద్యోగులకు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేయడానికి వేగంగా చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. 27 శాతం ఐఆర్ ఇచ్చారని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారని, ఇవన్నీ ధైర్యం గల ముఖ్యమంత్రిగా జగన్ చేశారని తెలిపారు. ఆ తర్వాత కరోనా మహమ్మారితో ప్రభుత్వ ఆదాయం తగ్గిపోవడంతో వేగంగా నిర్ణయాలు తీసుకోలేకపోయారని, పీఆర్సీ కూడా ఆశించిన స్థాయిలో ఇవ్వలేకపోయారని, ప్రభుత్వ ఉద్యోగులుగా వీటిని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. జీపీఎస్ దేశానికే రోల్‌మోడల్ జీపీఎస్‌లో ఉద్యోగులకు తొలుత బేసిక్‌లో 30 శాతం వరకే పెన్షన్ వచ్చేలా ప్రతిపాదనలు చేస్తే ముఖ్యమంత్రి స్వయంగా బేసిక్‌లో 50 శాతం పెన్షన్ వచ్చేలా మార్పులు చేశారని, అలాగే సీపీఎస్‌లో లేని డీఆర్‌ను జీపీఎస్‌లోకి తెచ్చారని, గతంలోకన్నా మెరుగ్గా ఉందని సీపీఎస్ ఉద్యోగలు చెబుతున్నారని తెలిపారు. ప్రభుత్వం తెచ్చిన జీపీఎస్ దేశంలోనే రోల్‌మోడల్‌గా నిలుస్తుందని ముఖ్యమంత్రి తెలిపారని, ఏ రాష్ట్రంలోనూ జీపీఎస్ ప్రయోజనాలు లేవని చెప్పారు. సీఎం జగన్ నిర్ణయం సాహసోపేతమైనదని కొనియాడారు. వైద్య విధాన పరిషత్ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల 15 వేల కుటుంబాలకు మేలు చేశారని అన్నారు. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలన్నీ 60 రోజుల్లో అమలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారన్నారు. జీపీఎస్ విధివిధానాలు వచ్చిన తరువాత ఉద్యోగుల్లో ఉన్న అపోహలు తొలిగిపోతాయని చెప్పారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు గత ప్రభుత్వం ఆరు నెలలకోసారి వేతనాలు ఇచ్చేదని, ఈ ప్రభుత్వంలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటే వేతనాలు ఇస్తున్నారని తెలిపారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి దళారీ వ్యవస్థను నిర్మూలించారని గుర్తు చేశారు. 12వ పీఆర్సీని ముందుగానే ఏర్పాటు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతులు తెలిపినట్లు వెంకటరామిరెడ్డి తెలిపారు. అశోక్‌బాబుకు సవాల్ ఉద్యోగ సంఘాల మాజీ నాయకుడు, టీడీపీ నేత అశోక్‌బాబు మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నారని, ఆయన బహిరంగ చర్చకు వస్తే టీడీపీ మేనిఫెస్టోలో చెప్పినవి ఎన్ని అమలు చేసిందీ, ఇప్పటి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పినవి ఎన్ని అమలు చేసిందీ చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో చాలావరకు అమలు చేసిందని, ఇంకా ఏమైనా ఉంటే అమలు చేయడానికి ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ఉన్నారని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులను టీడీపీ ప్రభుత్వం రైగ్యులరైజ్ చేయలేదని, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ధైర్యంగా 10 వేల మందికిపైగా కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. చదవండి: ఏపీకి చల్లని కబురు.. మరో రెండు రోజుల్లో.. -
ఎన్‌ఎంఓపీ జాతీయ సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ
సాక్షి, హైదరాబాద్: వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి చెందిన కంపెనీలకు ఇచ్చిన అప్పులతో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ఉద్యోగుల జీతాల నుంచి జమ చేసుకుంటున్న నిధులకు ముప్పు ఏర్పడుతుందని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ (ఎన్‌ఎంఓపీ) జాతీయ సెక్రటరీ జనరల్ గంగాపురం స్థితప్రజ్ఞ ఆవేదన వ్యక్తం చేశారు. హిండెన్‌బర్గ్ వెల్లడించిన నివేదిక ప్రకారం అదానీ కంపెనీలకు ఎల్ఐసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రుణాలలో సీపీఎస్ ఉద్యోగులకు చెందిన 67 శాతం పింఛన్ నిధులున్నాయని వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఎన్‌ఎంఓపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ, అదానీ గ్రూప్ కంపెనీల్లో ఎల్ఐసీ రూ.77వేల కోట్లు, ఎస్బీఐ రూ.80 వేల కోట్లు పెట్టుబడులు పెట్టాయని, ఇప్పుడు కంపెనీల షేర్లు పతనం కావడంతో దేశంలోని 84 లక్షల మంది ఉద్యోగుల సొమ్ము ఆవిరైపోతోందని చెప్పారు. -
సీపీఎస్‌పై చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం
సాక్షి, విజయవాడ: సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో రేపు(బుధవారం) ప్రభుత్వం చర్చలు జరపనుంది. మంత్రుల కమిటీతో చర్చలకు రావాలని 20 ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు ప్రభుత్వం ఆహ్వానం అందించింది. సీపీఎస్ రద్దు అంశంపై చర్చించేందుకు రావాలని ప్రభుత్వం పేర్కొంది. సాయంత్రం నాలుగు గంటలకు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనుంది. -
ఉద్యోగ సంఘాలతో చర్చలు.. సజ్జల కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: ఉద్యోగ సంఘాలతో జీపీఎస్‌పై చర్చించినట్లు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలని ఉద్యోగులను కోరామన్నారు. సీపీఎస్ రద్దు చేస్తామని గతంలో చెప్పిన మాట వాస్తవమేనన్నారు. అయితే సీపీఎస్ వల్ల నష్టం కలుగుతుందనే జీపీఎస్ ప్రతిపాదన తెచ్చామన్నారు. జీపీఎస్‌తో ఉద్యోగులకు పెన్షన్ భద్రత కలుగుతుంది. సీపీఎస్ రద్దు వల్ల ఇప్పటికిప్పుడు ప్రభుత్వంపై భారం పడదు. కానీ ఓపీఎస్‌తో భవిష్యత్‌లో మోయలేని భారం పడుతుంది. అందుకే సీఎం జగన్ బాధ్యతగా భవిష్యత్ కోసం ఆలోచించారు. ఉద్యోగులకు నచ్చజెప్పి జీపీఎస్‌లో ఏమైనా అదనపు ప్రయోజనాలు కావాలంటే పరిశీలిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చదవండి: (ఎక్కడికెళ్లినా మాతృభూమిని మర్చిపోకండి: గవర్నర్ హరిచందన్) -
CPS వల్ల ఇప్పటికిప్పుడు ప్రభుత్వంపై భారం పడదు: సజ్జల
-
సీపీఎస్ రద్దుపై ఏపీ ప్రభుత్వం కొత్త కమిటీ
సాక్షి, అమరావతి: సీపీఎస్ రద్దుపై ఏపీ ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీ ఏర్పాటు చేసింది. సీఎస్‌తో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఉద్యోగ సంఘాలతో కొత్త కమిటీ చర్చలు జరపనుంది. చర్చల తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. చదవండి: సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం సమావేశం -
సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం సమావేశం
సాక్షి, అమరావతి: సీపీఎస్ అంశంపై సచివాలయం రెండో బ్లాకులో పలు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం సమావేశమైంది. ఉద్యోగ సంఘాల ముందు జీపీఎస్(గ్యారంటీ పెన్షన్ స్కీం) ప్రతిపాదనను ప్రభుత్వం ఉంచింది. ఈ కొత్త ప్రాతిపాదన అంగీకరించేది లేదని, సీపీఎస్ రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. ఉద్యోగ సంఘాలకు అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. చదవండి: సీపీఎస్ రద్దుపై ఏపీ ప్రభుత్వం కొత్త కమిటీ ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ ఆర్) శశిభూషణ్ కుమార్, కార్యదర్శులు గుల్జార్, హెచ్.అరుణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం)పి.చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాల తరపున ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, ఏపీ సెక్రటేరియట్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు కె.ఆర్ సూర్యనారాయణ, ఏపీ (పీ ఆర్ టి యు) అధ్యక్షులు మిట్టా కృష్ణయ్య, ఏపీ యుటిఎఫ్ అధ్యక్షులు ఎన్. వెంకటేశ్వర్లు, ఏపీటిఎఫ్ అధ్యక్షులు జి.హృదయ రాజు తదితరులు పాల్గొన్నారు. -
సీపీఎస్ విధానంపై సరైన నిర్ణయం తీసుకుంటాం: బొత్స
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సీపీఎస్ విధానంపై సరైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. యూటీఎఫ్ సభ్యులు ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామనడం సరికాదన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడటం ప్రభుత్వం బాధ్యత అని తెలిపారు. కమిటీ వేశామని.. ఆ కమిటీ అన్ని విషయాలను పరిశీలిస్తుందని తెలిపారు. దానిపై మళ్లీ ఓ సమావేశం కూడా జరగనుందని చెప్పారు. ఉపాధ్యాయుల సెలవుపై టీడీపీ, బీజేపీ అనవసర రాదాంతం ఎందుకు చేస్తున్నాయని మండిపడ్డారు. సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం భేటీ సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం భేటీ కానుంది. సోమవారం సాయంత్రం మంత్రులు, జాయింట్ స్టాఫ్ కమిటీ సభ్యులతో సమావేశం జరగనుంది. 16 ఉద్యోగ సంఘాలను సంప్రదింపులకు ప్రభుత్వం ఆహ్వానించిన విషయం తెలిసిందే. -
Andhra Pradesh: ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, అమరావతి: గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వోద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ సంక్షోభంలోనూ శుభవార్త అందించింది. జులై 2019 నుంచి చెల్లించాల్సిన కరువు భత్యాన్ని (డీఏ) మంజూరు చేసింది. ఉద్యోగుల మూల వేతనంలో ప్రస్తుతమున్న 33.536 శాతం నుంచి 38.776 శాతానికి (5.24) కరువు భత్యం పెంచుతూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఎస్ రావత్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ► 2019 జులై నుంచి 2021 డిసెంబర్ వరకు కరువు భత్యం బకాయిలను వచ్చే ఏడాది జనవరి నుంచి మూడు సమాన వాయిదాల్లో ఉద్యోగుల జీపీఎఫ్‌కు జమచేయనున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. ► పెరిగిన కరువు భత్యాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి నగదు రూపంలో ఫిబ్రవరి 1వ తేదీ వేతనాలతో చెల్లిస్తారు. ► అలాగే, సీపీఎస్ ఉద్యోగులకు పెరిగిన డీఏని వచ్చే ఏడాది జనవరి నుంచి నగదు రూపంలో ఫిబ్రవరి 1వ తేదీ వేతనాల నుంచి చెల్లిస్తారు. ► సీపీఎస్ ఉద్యోగులకు 2019 జులై నుంచి 2021 డిసెంబర్ వరకు డీఏ బకాయిలను వచ్చే ఏడాది జనవరి నుంచి మూడు సమాన వాయిదాల్లో నగదు రూపంలో చెల్లించనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎవరెవరికి వర్తిస్తుందంటే.. పెరిగిన కరువు భత్యం జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ, జిల్లా గ్రంధాలయాల సమితి, రెగ్యులర్ స్కేల్స్‌లో పనిచేస్తున్న వర్క్ చార్జ్డ్ ఎస్టాబ్లిష్మెంట్ ఉద్యోగులకు వర్తించనుంది. అంతేకాక.. రెగ్యులర్ పే స్కేల్స్‌లో పనిచేస్తున్న ఎయిడెడ్ ఇనిస్టిట్యూషన్స్, ఎయిడెడ్ పాలిటెక్నిక్‌లో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులకు వర్తిస్తుంది. విశ్వవిద్యాలయాలతో పాటు వ్యవసాయ యూనివర్శిటీ.. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్శిటీ, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్శిటీలో రెగ్యులర్ పే స్కేల్స్‌లో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికీ పెరిగిన కరువు భత్యం వర్తించనుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల డీఏకు సొంత నిధులను వినియోగించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు రాష్ట్ర ప్రభుత్వం 2019 జులై నుంచి చెల్లించాల్సిన 5.24 శాతం కరువు భత్యం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేయడంపట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కే వెంకట్రామిరెడ్డి హర్షం వ్యక్తంచేశారు. డీఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇప్పించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
ఏపీ 11వ పీఆర్సీ నివేదిక.. కేంద్రం తరహాలోనే!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫిట్‌మెంట్‌పై ఏడు రకాల విశ్లేషణలు చేసిన సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ కేంద్ర వేతన సంఘం (సీపీసీ) మాదిరిగానే ఇవ్వాలని సిఫారసు చేసింది. 11వ పీఆర్సీ నివేదికను సోమవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందచేసిన అనంతరం వెలగపూడి సచివాలయంలో కార్యదర్శుల కమిటీ సభ్యులతో కలసి సీఎస్ మీడియాతో మాట్లాడారు. అధికారుల కమిటీ మూడు సార్లు సమావేశమైందని, ఉద్యోగ సంఘాలతో ఒకసారి సమావేశం నిర్వహించామని చెప్పారు. అనంతరం నివేదిక రూపొందించామని, దీనిపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఎంత ఇస్తే ఎంత భారం? ఫిట్మెంట్ ఎంత శాతం ఇస్తే ఎంత భారం పడుతుందనే అంశాలను విశ్లేషిస్తూ ఏడు మోడల్స్ సూచించాం. 23 శాతం ఫిట్మెంట్ అయితే ప్రభుత్వంపై ఏటా రూ.11,557 కోట్ల అదనపు భారం పడుతుంది. 27 శాతం అయితే రూ.13,422 కోట్లు, కేంద్ర వేతన సంఘం అమలు చేస్తున్న 14.29 శాతం అయితే రూ.9,150 కోట్లు భారం పడుతుంది. ఏడో సీపీసీ ప్రకారం ఇస్తే... 23 శాతం ఫిట్మెంట్ ఇస్తే అదనపు పెన్షన్, హెచ్ఆర్ఏతో రూ.10,211 కోట్ల అదనపు భారం పడుతుంది. 23.5 శాతం ఫిట్మెంట్ అయితే అదనపు పెన్షన్, హెచ్ఆర్ఏతో రూ.11,413 కోట్లు భారం పడుతుంది. 30 శాతం ఫిట్మెంట్ ఇచ్చి హెచ్ఆర్ఏ, క్వాంటమ్ పెన్షన్ 7వ సీపీసీ ప్రకారం ఇస్తే రూ.12,736 కోట్ల అదనపు భారం పడుతుంది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత కేంద్ర వేతన సంఘం ఇస్తున్న ఫిట్‌మెంట్‌ను ఇవ్వాలని సిఫారసు చేశాం. ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు ఇదే విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇది మంచి విధానం. శాస్త్రీయంగా అధ్యయనం చేశాకే అమలు చేస్తున్నారు. ఇక్కడా కూడా ఇది అమలు చేయాలి. 2018 నుంచి అమలు ఈ పీఆర్సీని 2018 నుంచి అమలు చేయాలని సిఫారసు చేశాం. ఈ ఏడు సిఫారసుల్లో ఏది అమలు చేసినా ప్రభుత్వంపై సుమారు రూ.8 వేల నుంచి రూ.9 వేల కోట్ల అదనపు భారం పడుతుంది. ఇప్పటికే ఉద్యోగులకు మధ్యంతర భృతి కింద సుమారు రూ.16 వేల కోట్లు ప్రభుత్వం చెల్లించింది. ఆర్థిక శాఖ వెబ్సైట్లో అప్లోడ్.. ఉద్యోగ సంఘాలకు ప్రతి 11 పీఆర్సీ నివేదికను ఆర్థిక శాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాం. ఉద్యోగ సంఘాల నేతలకు కాపీని అందచేస్తాం. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, హోంగార్డులను పీఆర్సీ నివేదికలో కలిపాం. గతంలో ఈ విధానం లేదు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను కూడా చేర్చాం. ఉద్యోగులకు అమలు చేయాల్సిన ఇతర సంక్షేమ చర్యలను కూడా సూచించాం. వైద్యం, ఇతర సౌకర్యాలపైనా సిఫారసులు చేశాం. జీతాల వ్యయం ఏపీలో 36 శాతం.. తెలంగాణలో 21 శాతం నివేదిక తయారు చేసే క్రమంలో ఇతర రాష్ట్రాల ఉద్యోగుల జీతాలను కూడా పోల్చి చూశాం. మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులో ఉద్యోగుల జీతాల వ్యయం ఏపీలో ప్రస్తుతం 36 శాతం ఉంది. చత్తీస్‌ఘడ్‌లో 32 శాతం, మహారాష్ట్రలో 31, పశ్చిమబెంగాల్ 31, ఒరిస్సా 29, మధ్యప్రదేశ్‌లో 28 శాతం, హర్యానాలో 23 శాతం, తెలంగాణలో 21 శాతం ఉంది. మిగతావి కూడా పరిష్కరిస్తాం.. సీపీఎస్‌కి పీఆర్సీకి సంబంధం లేదు. నివేదిక తయారు చేసేముందు ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకున్నాం. కేంద్రం, వివిధ రాష్ట్రాల్లో వేతనాలు, గత 30 సంవత్సరాల్లో వేతనాలపై అధ్యయనం చేశాం. భవిష్యత్తులో ఎలా ఉండాలో చూసి నివేదిక ఇచ్చాం. ఉద్యోగ సంఘాల 71 డిమాండ్లలో పీఆర్సీ ఒకటి కాగా మిగిలిన వాటిపై రాష్ట్ర, జిల్లా స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్స్ పరిశీలిస్తున్నాయి. వాటిని కూడా పరిష్కరిస్తాం. హౌస్ రెంట్ అలవెన్స్(హెచ్ఆర్ఏ) 11వ పీఆర్సీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ నుంచి తరలివెళ్లిన ఉద్యోగులకు మూల వేతనంలో 30 శాతం లేదా నెలకు రూ.26 వేలకు మించకుండా ఇవ్వాలి. పది లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో మూల వేతనంలో 22 శాతం లేదా నెలకు రూ.22,500లు ఇవ్వాలి. రెండు నుంచి పది లక్షల జనాభా లోపు ఉన్న పట్టణాల్లో మూల వేతనంలో 20 శాతం లేదా రూ.20 వేలకు మించకుండా ఇవ్వాలి. 50 వేల నుంచి రెండు లక్షల జనాభా ఉన్న పట్టణాల్లో మూల వేతనంలో 14.5 శాతం లేదా రూ.20 వేలకు మించకుండా.. ఇతర ప్రాంతాల్లో ఉద్యోగులకు మూల వేతనంలో 12 శాతం లేదా నెలకు రూ.17 వేలకు మించకుండా ఇవ్వాలి. సెక్రటరీల కమిటీ: కేంద్ర ఏడో వేతన సవరణ సంఘం సిఫార్సుల మేరకు ఉద్యోగులకు 50 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో మూల వేతనంలో 24 శాతం, 5 లక్షల నుంచి 50 లక్షలలోపు ఉన్న నగరాల్లో ఉద్యోగులకు మూల వేతనంలో 16 శాతం, ఐదు లక్షలలోపు జనాభా ఉన్న నగరాల్లో మూల వేతనంలో 8 శాతాన్ని హెచ్ఆర్ఏగా ఇవ్వాలి. సిటీ కాంపెంసేటరీ అలవెన్స్(సీసీఏ) 11వ పీఆర్సీ కమిటీ: విశాఖపట్నం, విజయవాడల్లో రూ.400 నుంచి రూ.1000, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలో రూ.300 నుంచి రూ.750 చొప్పున ఇవ్వాలి. సెక్రటరీల కమిటీ: కేంద్ర ఆరో వేతన సంఘం సీసీఏను రద్దు చేసింది. కేంద్రం తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా సీసీఏను రద్దు చేయాలి. అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ 11వ పీఆర్సీ: ఉన్నత అర్హతలు సాధించిన వారికి మాత్రమే ప్రత్యేకంగా ఇవ్వవచ్చు. సాధారణ పరిస్థితుల్లో అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ ఇవ్వకూడదు. సెక్రటరీల కమిటీ: 11వ పీఆర్సీ కమిటీ సిఫార్సును అమలు చేయాలి. కరవు భత్యం(డీఏ) 11వ పీఆర్సీ: కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న తరహాలోనే ఏడాదికి రెండు సార్లు జనవరి 1, జూలై 1న డీఏలు ఇవ్వాలి. 1–1–2019 నుంచి కేంద్రం డీఏను ఒక శాతం పెంచితే.. రాష్ట్ర ప్రభుత్వం 0.91 శాతం పెంచాలి. సెక్రటరీల కమిటీ: 11వ పీఆర్సీ చేసిన సిఫార్సును అమలు చేయాలి. -
థాంక్యూ.. కేటీఆర్ సార్..
లక్డీకాపూల్: ఉద్యోగులకు మేలు చేసిన కేసీఆర్ ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటామని సీపీయస్ రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ అన్నారు. మంగళవారం వారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో సీపీయస్ కోశాధికారి నరేష్ గౌడ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు లింగమూర్తి, ఉపాధ్యక్షులు పవన్ కుమార్, కూరకుల శ్రీనివాస్, దర్శన్ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ మల్లికార్జున్, సాహిత్య కార్యదర్శి రోషన్, జాయింట్ సెక్రటరీ ఉపేందర్, హైదరాబాద్ అధ్యక్షుడు నరేందర్ రావులు పాల్గొన్నారు. యథావిధిగా ఓయూ పీజీ, డిగ్రీ పరీక్షలు ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో జరిగే వివిధ కోర్సుల పరీక్షలు య«థావిధిగా కొనసాగుతాయని ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొ.శ్రీరామ్ వెంకటేష్ మంగళవారం తెలిపారు. రేపటి నుంచి విద్యా సంస్థలు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించిన ఓయూ పీజీ,డిగ్రీ సెమిస్టర్ పరీక్షలతో పాటు ఇతర పరీక్షలను యథావిధంగా కొనసాగిస్తామన్నారు. -
సీపీఎస్ రద్దుపై వర్కింగ్ కమిటీ
సాక్షి, అమరావతి : కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం(సీపీఎస్) రద్దు అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్కింగ్ కమిటీని నియమించింది. చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ఐదు శాఖల కార్యదర్శులతో కమిటీ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ కన్వీనర్‌గా ఆర్థికశాఖ కార్యదర్శి, సభ్యులుగా ప్లానింగ్, పాఠశాల విద్య, పంచాయతీ రాజ్, వైద్య శాఖ కార్యదర్శులు ఉన్నారు. కమిటీ ఛైర్‌పర్సన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని నియమించింది. ఎన్పీ టక్కర్ కమిటీ ఇచ్చిన నివేదికను ఈ కమిటీ పరిశీలిస్తుంది. జూన్ 30లోపు నివేదిక అందజేయాలని వర్కింగ్ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. -
ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ వరాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు వరాల జల్లు కురిపించారు. తొలిసారి సచివాలయానికి వచ్చిన ఆయన శనివారం ఉదయం గ్రీవెన్స్ హాల్లో ఉద్యోగులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ను ప్రకటించారు. అంతేకాకుండా సీపీఎస్ రద్దుపై ఆదివారం జరిగే మంత్రవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచుతామని ప్రకటన చేశారు. 27 శాతం మధ్యంతర భృతి ఇస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే మేనిఫెస్టోలోని హామీలన్నీ అమలు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వం నుంచి పాలన అందించాలంటే ఉద్యోగుల సహకారం కావాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాలు సన్నిహితంగా ఉండటం సర్వసాధారణమని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుకోవడానికి సన్నిహితంగా ఉంటారని, గత ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్నవాళ్లను తాను తప్పుపట్టనని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చదవండి...మీపై పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది : సీఎం జగన్ అంతకు ముందు సచివాలయంలో ఉదయం 10 గంటలకు అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్‌వోడీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతోపాటు అన్ని శాఖల ముఖ్య అధికారులు, ప్రిన్స్‌పల్ సెక్రటరీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఎంతో నమ్మకంతో ఎన్నుకున్నారని, మీరు (అధికారులు) పూర్తిగా సహకరిస్తే ప్రజల- ప్రభుత్వ కల సాకారం అవుతుందని పేర్కొన్నారు. అధికారులపై తనకు పూర్తి విశ్వాసముందని తెలిపారు. తమ ప్రభుత్వంలో అవినీతికి ఆస్కారంలేని పారదర్శక పాలన అందించడానికి తాను దృఢసంకల్పంతో ఉన్నట్టు స్పష్టం చేశారు. అవినీతిని నిర్మూలించి ప్రభుత్వానికి నిధులు ఆదా చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు తమకు ఉన్న పూర్తి అవగాహనతో సహకరించాలని కోరారు. అనవసర వ్యయాన్ని తగ్గించాలన్నారు. మంచి పనితీరు ప్రదర్శించే అధికారులను సన్మాన సత్కారాలతో గౌరవిస్తానని తెలిపారు. మన పాలన దేశానికే ఆదర్శంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. -
‘రెండేళ్లలోనే టీడీపీ గ్రాఫ్ పడిపోయింది’
సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టింస్తుందని సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ (సీపీఎస్) పోస్ట్ పోల్ సర్వే చీఫ్ వేణుగోపాల్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ అంశాన్ని తీసుకున్నా వైఎస్సార్సీపీకే అనుకూలంగా ఉందని ఆయన తెలిపారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల నుంచే చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, గత రెండేళ్లుగా టీడీపీ గ్రాఫ్ పడిపోయిందని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4లక్షలకు పైగా శాంపిల్స్ సేకరించి సర్వే చేపట్టినట్లు వేణుగోపాల్ వివరించారు. చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకతతోనే వైఎస్ జగన్‌కు పట్టం కట్టారని ఆయన పేర్కొన్నారు. కేవలం అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు అవకాశంఇచ్చారని, కానీ ప్రజల అంచనాలను ఆయన అందుకోలేకపోయారని తెలిపారు. ఐదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పకుండా.. కేవలం సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని అన్నారు. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ 133-135 స్థానాలను గెలుపొందనుందని, అధికార టీడీపీ కేవలం 37 నుంచి 40 సీట్లు మాత్రమే విజయం సాధిస్తుందని సీపీఎస్ సర్వే వెల్లడించింది. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ సున్నా లేదా ఒక్క స్థానం గెలిచే అవకాశముందని, ఐదు స్థానాల్లో హోరాహోరీ పోటీ నెలకొని ఉంటుందని పేర్కొంది. వైఎస్సార్సీపీకి 50.1% శాతం ఓట్లు వస్తాయని, టీడీపీకి 40.2% శాతం ఓట్లు, జనసేనకు 7.3% శాతం ఓట్లు, ఇతరులకు 2.6% శాతం ఓట్లు వస్తాయని సీపీఎస్ వెల్లడించింది. -
సీపీఎస్ సర్వేలో వైఎస్సార్సీపీకి భారీ మెజారిటీ!
-
సీపీఎస్ సర్వేలో వైఎస్సార్సీపీకి బంపర్ మెజారిటీ!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడం ఖాయమని సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ (సీపీఎస్) పోస్ట్ పోల్ సర్వే అంచనా వేసింది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ 133-135 స్థానాలను గెలుపొందనుందని, అధికార టీడీపీ కేవలం 37 నుంచి 40 సీట్లు మాత్రమే విజయం సాధిస్తుందని సీపీఎస్ సర్వే వెల్లడించింది. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ సున్నా లేదా ఒక్క స్థానం గెలిచే అవకాశముందని, ఐదు స్థానాల్లో హోరాహోరీ పోటీ నెలకొని ఉంటుందని పేర్కొంది. వైఎస్సార్సీపీకి 50.1% శాతం ఓట్లు వస్తాయని, టీడీపీకి 40.2% శాతం ఓట్లు, జనసేనకు 7.3% శాతం ఓట్లు, ఇతరులకు 2.6% శాతం ఓట్లు వస్తాయని సీపీఎస్ వెల్లడించింది.. పోస్ట్ పోల్ సర్వే ప్రకారం పార్టీల వారీగా ఓట్ల శాతం వైఎస్సార్సీపీ టీడీపీ జనసేన ఇతరులు 50.1% 40.2% 7.3% 2.6% పోస్ట్ పోల్ సర్వే ప్రకారం పార్టీల వారీగా సీట్లు వైఎస్సార్సీపీ టీడీపీ జనసేన హోరాహోరీ సీట్లు 133 - 135 37 - 40 0 - 1 5 ఆ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేలోను ఇంచుమించుగా ఇదే ఫలితాలు వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్ సర్వేలో వైఎస్సార్సీపీకి 130 నుంచి 133 స్థానాలు, టీడీపీకి 43 నుంచి 44 స్థానాలు వస్తాయని, జనసేనకు సున్నా నుంచి ఒక్క స్థానం వస్తుందని పేర్కొంది. ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం పార్టీల వారీగా ఓట్ల శాతం వైఎస్సార్సీపీ టీడీపీ జనసేన ఇతరులు 50.1% 40.2% 7.3% 2.6% ఎగ్జిట్ సర్వే ప్రకారం పార్టీల వారీగా సీట్లు వైఎస్సార్సీపీ టీడీపీ జనసేన 130 - 133 43-44 0 - 1 తమ సంస్థ 2006 నుంచి ప్రీపోల్స్ సర్వేలు నిర్వహిస్తోందని, 2009లో అవిభక్త ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపైనా తాము సర్వే నిర్వహించామని సీపీఎస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 88 నుంచి 90 స్థానాలు వస్తాయని తాము అంచనా వేశామని, తమ అంచనా నిజమై టీఆర్ఎస్కు 88 స్థానాలు వచ్చాయని, అదేవిధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 98 నుంచి 100 స్థానాలు వస్తాయని తాము పేర్కొనగా.. ఆ పార్టీకి 99 స్థానాలు వచ్చాయని తెలిపింది. ఇక, గతంలో 2009 ఏపీ ఎన్నికల్లో దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి 159 సీట్లు వస్తాయని పేర్కొనగా.. ఆ పార్టీకి 156 సీట్లు వచ్చాయని వివరించింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : సీపీఎస్ సర్వేలో వైఎస్సార్సీపీకి భారీ మెజారిటీ! -
సీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పై సస్పెన్షన్ వేటు
-
సీపీఎస్ ఉద్యోగులపై చంద్రబాబు సర్కారు కక్ష సాధింపు
-
ఆయన వద్దు బాబోయ్..
సాక్షి, అమరావతి : శ్రీనివాసరావు (పేరు మార్చాం) మాట్లాడుతూ... ‘వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కుల, మత, ప్రాంతం, వర్గ భేదాలు లేకుండా ఉద్యోగులను సొంత మనుషుల్లా చూసేవారు. కేంద్రం ప్రకటించిన నెలలోపు ఉద్యోగులకు డీఏలు, ఇతరత్రా అలవెన్సులు ఇచ్చేవారు. ఈ స్వేచ్ఛతో ఉద్యోగులు కష్టపడి పనిచేసి రాష్ట్రాన్ని ప్రగతి బాట పట్టించారు. వ్యవసాయంలో జాతీయ సగటును దాటి ఉత్పత్తి సాధించగలిగాం. మళ్లీ అటువంటి పాలన రావాలని ప్రతి ఉద్యోగి కోరుకుంటున్నాడు’ అని తన మనసులోని మాట చెప్పారు. వెంకటేష్ (పేరు మార్చాం) స్పందిస్తూ.. ‘చంద్రబాబు పాలనంతా డీఏలను పెండింగ్‌లో పెట్టడమే సరిపోయింది. 2014 నుంచి ఇప్పటివరకు మూడు డీఏలు పెండింగ్‌లో ఉంచారు. మళ్లీ ఆయనే వస్తే ఉద్యోగులకు డీఏ అవసరమా అంటారు. రద్దు చేస్తే ఎవరు అడుగుతారనే భావనకు వస్తారు. ఇంకా ఎలాంటి నిర్ణయాలను చూడాల్సి వస్తుందో’ అంటూ నిట్టూర్చారు. ‘అవును. హెల్త్‌కార్డుల సంగతేంటి. అవి కనీసం నాలుక గీసుకోవటానికి కూడా పనికి రావటం లేదండి. క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అన్నారు. ఏ హాస్పిటల్‌కు వెళ్లినా మేం ట్రీట్మెంట్ చేయలేమంటూ చేతులు ఎత్తేస్తున్నారు. పెన్షనర్ల పరిస్థితి ఐతే మరీ ఘోరం. వచ్చిపడే రోగాలకు వైద్యం చేయించుకోలేక నానా అగచాట్లు పడుతున్నారు’ అంటూ వెంకటేష్‌తో మాట కలిపారు సాయిరాం. ‘చెప్పటం మరచిపోయాను. సీపీఎస్ రద్దు చేస్తామన్నారు. దాని కోసం కమిటీ వేశారు. అది ఏమైందో ఆ దేవుడికే తెలియాలి. అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు చేస్తానంటూ వైఎస్ జగన్ పాదయాత్రలో ప్రకటించారు. ఇచ్చిన మాటపై నిలబడే లక్షణం ఆ కుటుంబానికే ఉంది. కచ్చితంగా రద్దు చేస్తాడని ప్రతి ఉద్యోగి నమ్ముతున్నాడు. జగన్ రావాలి.. ఈ బాధలు పోవాలి ’ అంటూ రమేష్ చర్చను ముగించాడు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలివీ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటామన్నారు. క్రమబద్ధీకరణ చేయకుండా మోసం చేశారు. అన్ని ప్రాంతాల్లో ఉద్యోగులకు ఇళ్ల స్థలాలంటూ ఎన్నికలు దగ్గరపడటంతో ఓ పాలసీ తయారు చేశారు. ఉద్యోగుల ఇంటి నిర్మాణానికి తక్కువ వడ్డీతో రుణాలని చెప్పి ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఖాళీగా ఉన్న పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అమలులో ఘోరంగా విఫలమయ్యారు. లక్షల్లో ఉద్యోగాలు ఖాళీ ఉన్నప్పటికీ భర్తీ చేసింది చాలా తక్కువ. వారానికి 5 రోజుల పని దినాలు అమలు చేస్తామన్నారు. ఈ విధానాన్ని కేవలం సచివాలయం, హెచ్ఓడీలలో మాత్రమే అమలు చేసి మిగిలిన వారికి చెయ్యిచ్చారు. ఉద్యోగులకు పదవీ విరమణ రోజే బెనిఫిట్స్ అందిస్తామన్నారు. అమలులో పూర్తిగా విఫలమయ్యారు. ఏళ్ల తరబడి తిరిగినా బెనిఫిట్స్ అందటం లేదు. పెన్షనర్లకు మెరుగైన క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అమలు కాలేదు. సొంత డబ్బుతో వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి. -
విజయవాడ: ‘ఛలో అసెంబ్లీ’ ఉద్రిక్తం
-
CPS రద్దు కోసం విజయవాడలో ఉద్యోగుల ఆందోళన
-
చలో అసెంబ్లీ : ప్రకాశం బ్యారేజీపై ఉద్రిక్తత
-
గళమెత్తిన ఉద్యోగులు
చిలకలపూడి(మచిలీపట్నం): రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల సమస్యల సాధన కోసం పలు శాఖలకు చెందిన ఉద్యోగులు శుక్రవారం కలెక్టరేట్ వద్ద గళమెత్తారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయటంతోపాటు సమస్యలను పరిష్కరించాలని లేకపోతే రాబోయే ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని వివిధ సంఘాల నాయకులు హెచ్చరించారు. ఏపీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.మణికుమార్ మాట్లాడుతూ 30 నుంచి 35 సంవత్సరాల విధి నిర్వహణలో ఉద్యోగులకు బీపీ, షుగర్ తప్ప ఎటువంటి సదుపాయాలు ప్రభుత్వం నుంచి రావటం లేదన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రభుత్వానికి చేయూతను అందిస్తుంటే కష్టాలను మాత్రం పట్టించుకోకుండా మిన్నకుండి పోతున్నారన్నారు. తూర్పు కృష్ణా జేఏసీ చైర్మన్ ఉల్లి కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మధ్యంతర భృతిని వెంటనే ప్రకటించాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలికంగా ఉపాధ్యాయులు సమస్యలపై పోరాడుతున్నా ప్రభుత్వం ఇంత వరకు వాటిని పరిష్కరించలేదన్నారు. పింఛనుదారులకు క్వాంటమ్ ఆఫ్ పింఛన్‌ను మంజూరు చేయాలని, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ వారిని క్రమబద్ధీకరించాలని కోరారు. వీఆర్వోలకు పదోన్నతులు కల్పించాలన్నారు. ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకపోతే సమ్మె ద్వారానైనా సమస్యలను సాధించుకుంటామన్నారు. సీపీఎస్ ఉద్యోగుల సంఘ నాయకుడు శోభన్‌బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకుండా ఉద్యోగులను రోడ్డు పాలు చేసిందన్నారు. నాలుగు సంవత్సరాలపాటు బీజేపీ ప్రభుత్వ సహకారంతో పాలన చేసి ఇప్పుడు నిధులు ఇవ్వకపోవటంతో ఆ ప్రభుత్వం రాష్ట్రాన్ని మోసం చేస్తోందని ప్రకటిస్తున్న పాలకులు ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరించకుండా మోసం చేస్తోందన్నారు. యూటీఎఫ్ జిల్లా నాయకుడు కేఏ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు, ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఎస్టీయూ నాయకుడు కొమ్ము ప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు పరిపాలనలోనే ఉద్యోగులు రోడ్డు మీద పడతారన్నారు. పోలవరం ప్రాజెక్టు సందర్శన కోసం వేల కోట్లు రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఎటువంటి నిర్ణయం తీసుకోవటం లేదన్నారు. సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పి సత్యనారాయణ మాట్లాడుతూ సీపీఎస్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే వరకు వివిధ ఉద్యోగ సంఘాలతో పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. ధర్నా కార్యక్రమంలో తూర్పు జేఏసీ కన్వీనర్ దారపు శ్రీనివాసరావు, ఉపాధ్యాయ సంఘ నాయకులు లెనిన్‌బాబు, జీవీఎస్ పెరుమాళ్లు, తమ్ము నాగరాజు, మహంకాళరావు, జేఏసీ మహిళా విభాగం కన్వీనర్ కె గౌరి, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు దుర్గాప్రసాద్, ఈవీ రామారావు, పీవీ సాయికుమార్, జీటీవీ రమణ, విజయ్‌కుమార్, బాబాప్రసాద్, బి భానుమతి, బీటీఏ సంఘ నాయకులు మట్టా రాజేష్, టి దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. -
కాలయాపన సహించం
చిత్తూరు కలెక్టరేట్ : సీపీఎస్ రద్దు కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీల పేరుతో చేస్తున్న కాలయానను సహించేది లేదని ఏపీసీపీఎస్ఈఏ సంఘం జిల్లా అధ్యక్షుడు సమీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి స్థానిక గాంధీ విగ్రహం వద్ద సీపీఎస్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. సమీర్ మాట్లాడుతూ సీపీఎస్ రద్దు చేసేందుకు కమిటీలను నియమిస్తున్నామని జీఓను విడుదల చేసి చేతులు దులుపుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు సీపీఎస్ ఉద్యోగులకు చేసిన మోసం చాలని, ఇకపై మళ్లీ మోసం చేయాలనుకోవడం మానుకోవాలన్నారు. తెలంగాణ మహాకూటమి ఎన్నికల మేనిఫెస్టోలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని ప్రకటించిన సీఎం చంద్రబాబునాయుడుకు ఏపీలో ఉద్యోగులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తగిన గుణపాఠం తప్పదు వైద్యఆరోగ్య శాఖ అసోసియేషన్ నాయకులు శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ సీపీఎస్ ఉద్యోగుల నగదును ప్రభుత్వం షేర్ మార్కెట్లో పెట్టిందని ఎద్దేవా చేశారు. సీపీఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌చేశారు. లేకపోతే త్వరలో జరిగే ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. త్వరలో జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాల్లో సీపీఎస్ ఉద్యోగులకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాలన్నారు. సీపీఎస్ అసోసియేషన్ నాయకులు నోబెల్ మాట్లాడుతూ సీపీఎస్ విధానంతో ఉద్యోగులకు భద్రత లేకుండా పోయిందన్నారు. ఈనెల 28న ప్రభుత్వం జారీచేసిన సీపీఎస్ కమిటి జీఓ 2052 ను ఆ సంఘ నాయకులుం దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు అమర్, రాజేశ్, రజియా, సుబ్బలక్ష్మీ, జయశ్రీ, బాలాజీ, దేవ, బాషా, గణేశ్, అరుళ్ తదితరులు పాల్గొన్నారు. -
సీపీఎస్ రద్దు చేస్తామన్న వైఎస్ జగన్
సాక్షి, కురుపాం(విజయనగరం): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలోని కురుపాం నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. మంగళవారం ఉదయం సీమనాయుడు వలస శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించిన జననేతను ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త కొండవీటి జ్యోతిర్మయి కలిసి టీటీడీలో రాజకీయ జోక్యాన్ని తగ్గించాలని వినతిపత్రం అందజేశారు. పాదయాత్ర సాగుతున్న మార్గంలో ప్రజలు తమ సమస్యలను జననేత దృష్టికి తీసుకువస్తున్నారు. పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్‌ను కలిసిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సీపీఎస్ రద్దు చేయాలని జననేతకు వినతిపత్రం ఇచ్చారు. వారి సమస్యపై స్పందించిన వైఎస్ జగన్ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. జననేత హామీపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజాసంకల్పయాత్రకు వారి సంఘీభావాన్ని తెలియజేశారు. అలాగే ఏఎన్ఎమ్లు కూడా తమ సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. 11 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగ భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అరకొర జీతాలతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. వైఎస్ జగన్ కలిసిన రేషన్ డీలర్లు.. వైఎస్ జగన్‌ను కలిసిన రేషన్ డీలర్లు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని.. కమిషన్ కాకుండా.. ప్రతి నెలా జీతం వచ్చేలా తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వైఎస్ జగన్‌ను కలిసిన ప్రైవేటు మెడికల్ ప్రాక్టీసర్స్ అసోషియేషన్ సభ్యులు తమ సమస్యలను జననేత దృష్టికి తీసుకువచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో శిక్షణ ఇచ్చి మెడికల్ ప్రాక్టీసుకు అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. టీడీపీ హయంలో తమకు గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ కలిసిన జీఎం వలస మహిళలు జననేతను కలిసిన జీఎం వలస మండలానికి చెందిన మహిళలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పరాజపాడు గ్రామానికి రోడ్డు, స్కూల్, మంచినీరు ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. పెన్షన్ రావడం లేదని మహిళలు వైఎస్ జగన్ వద్ద తమ ఆవేదనను వ్యక్తం చేశారు. మినీ రిజర్వాయర్ నిర్మించాలని వినతి.. కొమరడ మండలంలోని 9 పంచాయితీలకు చెందిన రైతులు వైఎస్ జగన్‌ను కలిశారు. గుమ్మిడిగడ్డ మినీ రిజర్వాయర్ నిర్మించాలని వినతిపత్రం అందజేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే గుమ్మిడిగడ్డ రిజర్వాయర్ ఎప్పుడో పూర్తయ్యేదని అన్నారు. ఈ రిజర్వాయర్‌తో 12 వేల ఎకరాలు సాగులోకి వస్తుందని తెలిపారు. నీటి వసతి లేకపోవడంతో కూలీ పనుల కోసం రైతులు వలస వెళ్లాల్సి వస్తుందని జననేత దృష్టికి తీసుకవచ్చారు. -
ఉద్యోగులేమైనా ఉగ్రవాదులా ?
విజయపురం : వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు గుదిబండగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్)ను రద్దు చేసి, ఓపీఎస్‌ను అమలు చేస్తామని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. సీపీఎస్ రద్దు కోరుతూ ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన చలో అసెంబ్లీని ప్రభుత్వం భగ్నం చేయడంపై బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగుల ద్రోహి అని.. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమేనని విమర్శించారు. సీపీఎస్ రద్దు కోరుతూ చలో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఉద్యోగులను ఉగ్రవాదుల్లాగా కొట్టి ఈడ్చుకెళ్లి అరెస్టు చేయించడం దారుణమన్నారు. ఉద్యోగులపై సర్కారు దమనకాండను వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ఇదే చంద్రబాబు 2003లో సీపీఎస్‌ను తీసుకొచ్చారని, వాటిని రద్దు చేసే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదని అన్నారు. ఉద్యోగస్తులను కొట్టడం చంద్రబాబుకు కొత్తేమి కాదని.. ఇది వరకే అంగన్వాడీ వర్కర్లను గుర్రాలతో తొక్కించారని గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కాగానే సీపీఎస్ రద్దు చేస్తామని, ఇది ఉద్యోగులు గుర్తించుకోవాలన్నారు. -
పోరు ఆగదు
ఒంగోలు టౌన్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దు చేయాలని కోరుతూ ఉపాధ్యాయులు చేపట్టిన ఆందోళనను రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అణచివేసింది. భావి భారత పౌరులను తీర్దిదిద్దే గురువులపై దమనకాండకు దిగింది. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని భగ్నం చేసిన సర్కారుపై ఉపాధ్యాయులు ఆగ్రహంతో ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలకు చివరి రోజైన బుధవారం సీపీఎస్ రద్దుకు సంబంధించి ఏకవాక్య తీర్మానం చేసి కేంద్రానికి పంపించమని ఫ్యాఫ్టో నాయకత్వం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎక్కడికక్కడ ఫ్యాఫ్టో నాయకులను బైండోవర్ చేయడం, విజయవాడలో కనిపించిన ప్రతి ఒక్కరిని బలవంతంగా అరెస్టులు చేసి అక్కడి పోలీసు స్టేషన్లన్నింటికి తరలించి ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో జిల్లాకు చెందిన ఫ్యాఫ్టో నాయకత్వం చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో 8 లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారని, వారి కుటుంబాల్లో 60 లక్షల ఓట్లు ఉన్నాయని, చంద్రబాబును గద్దె దించేవరకు తాము పోరాడతామంటూ హెచ్చరికలు చేశాయి. ఠాణాలకు టీచర్ల తరలింపు.. సీఎస్‌పురం: సీపీఎస్ రద్దు కోరుతూ చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి మంగళవారం సీఎస్‌పురం మండలంలోని ఉపాధ్యాయులు తరలి వెళ్లారు. ఏపీటీఎఫ్, యూటీఎఫ్‌ల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రెండు బృందాలుగా వెళ్లారు. యూటీఎఫ్ సభ్యులను పెదకాకాని వద్ద, ఏపీటీఎఫ్ ఆద్వర్యంలో వెళ్లిన ఉపాధ్యాయులను గవర్నర్ పేట వద్ద పోలీసులు అరెస్ట్ చేసి ఆయా ఏరియాలలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోరాటం ఆగదు: గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉపాధ్యాయులపై ప్రభుత్వం నిర్బం«ధం విధించింది. చలో అసెంబ్లీని భగ్నం చేసేందుకు ముందస్తు అరెస్టులు చేసింది. అన్ని పోలీసు స్టేషన్లకు సమాచారం ఇచ్చి ఫ్యాఫ్టో నాయకత్వాన్ని ఎక్కడికక్కడ అరెస్టు చేయించింది. యాభై శాతం నాయకత్వాన్ని అరెస్టు చేయించింది. మిగిలిన యాభై శాతం విజయవాడ చేరుకుంటే అక్కడ కూడా బలవంతంగా అరెస్టులు చేయించింది. ఉదయం పదిగంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అరెస్టులు జరిగాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. విజయవాడ వన్‌టౌన్ పోలీసు స్షేషన్‌లో తాము ఉపాధ్యాయులం కాదని చెప్పినా పదిమందిని అరెస్టు చేయించింది. రోడ్డుపై ఎవరూ కనిపించకూడదన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరించింది. సీపీఎస్ రద్దు చేస్తారా, గద్దె దిగుతారా అనేది చంద్రబాబు ప్రభుత్వం తేల్చుకోవాలి. పిల్లి రమణారెడ్డి, ఫ్యాఫ్టో జిల్లా చైర్మన్ కనబడితే అరెస్టులు: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగుల పట్ల విచక్షణారహితంగా వ్యవహరించింది. సీపీఎస్ రద్దు చేయాలంటూ కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్నాం. ఒకసారి రాష్ట్రవ్యాప్తంగా జాతా నిర్వహించాం. ఇంకోసారి విజయవాడలో మహా«ధర్నా చేపట్టాం. మరోసారి కలెక్టరేట్లను ముట్టడించి పాలనను స్తంభింప చేశాం. తప్పనిసరి పరిస్థితుల్లో చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాం. ఉపాధ్యాయులు కనబడితే ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. బస్టాండులు, రైల్వే స్టేషన్లు, రోడ్లపై ఇలా ఎక్కడ కనిపిస్తే అక్కడ అరెస్టులు చేశారు. ఉపాధ్యాయులు కానివారిని కూడా అరెస్టు చేశారు. ఒక్కసారి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అయితే జీవితాంతం పెన్షన్ ఇస్తున్నారు. ముపై ఏళ్లపాటు పనిచేసిన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. చల్లా శ్రీనివాసులు, ఫ్యాఫ్టో జిల్లా సెక్రటరి జనరల్ -
సర్కారు హుకుం.. ఖాకీ జులుం
పెన్షన్ భిక్ష.. కాదు.. మా హక్కు.. సీపీఎస్ అంతమే.. మా పంతం అంటూ ఉద్యమిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు... ప్రతిపక్షనేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీపీఎస్‌ను రద్దు చేసి తీరుతాం అంటూ ఇచ్చిన విశ్వసనీయమైన హామీ ఉద్యోగుల్లో ఆశలు చిగురింపచేసింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఉద్యోగులు మిలియన్ మార్చ్‌లు సైతం నిర్వహించారు. అయితే ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమం పట్టించుకోవాల్సిన ప్రభుత్వం మాత్రం హక్కు కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగులపై ఉక్కుపాదాన్ని మోపుతోంది. దీంతో ప్రభుత్వ చర్యల పట్ల ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు, వారి కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సాక్షి ప్రతినిధి కడప: ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎలాంటి సామాజిక భద్రత ఉంటుందో.. రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఉద్యోగికి అలాంటి భద్రతే ఉండాలన్న విధానాన్ని మన ప్రభుత్వాలు తుంగలో తొక్కాయి. సామాజిక భద్రతను కాలరాసేలా ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) విధానాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు. 2003లో ఎన్డీఏ ప్రభుత్వం నోటిఫై చేయగా 2004 జనవరి నుంచి కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు అమలులోకి వచ్చింది. అనంతరం 2004లో ఏర్పడిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం పీఎఫ్ఆర్డీఏ (పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ) బిల్లు పార్లమెంట్లో పెట్టింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో సైతం సీపీఎస్ విధానాన్ని తీసుకువచ్చింది. అయితే అప్పట్లో ఉద్యోగ, కార్మిక సంఘాలు పోరాటాలు చేయడంతో దాదాపు 10 సంవత్సరాల పాటు బిల్లు ఆగింది. అనంతరం 2013లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీలు కలిసి పీఎఫ్ఆర్డీఏ చట్టం తెచ్చి దేశంలోని కోట్లాదిమంది ఉద్యోగుల జీవితాలకు భద్రత లేకుండా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏ పెన్షన్ విధానం అమలు చేయాలని నిర్ణయించాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలే. వారి రాజకీయ నిర్ణయంతో పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి నూతన పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామంటూ పీఎఫ్ఆర్డీఏతో ఒప్పందం కుదుర్చుకున్నది రాష్ట్ర ప్రభుత్వమే. సీపీఎస్ విధానంలో ఉద్యోగుల వాటా 10 శాతం ఉంటే.. ప్రభుత్వ వాటా 10 శాతం కలిపి వేలకోట్ల సొమ్మును ఎన్ఎస్డీఎల్కు (స్టాక్‌మార్కెట్)లో పెడుతున్నారు. పాలకులకు సీపీఎస్ రద్దు చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగులు, ప్రభుత్వం చెల్లిస్తున్న 10 శాతం వాటాను రద్దు చేయడంతో పాటు పీఎఫ్ఆర్డీఏతో ఒప్పందం రద్దు చేసుకుంటేనే పాత పెన్షన్ విధానం సాధ్యమవుతుందని మేధావుల మాట. క్విట్ సీపీఎస్ అంటూ ఉద్యమిస్తున్న ఉద్యోగులు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సంస్కరణల్లో భాగంగా అమలు చేస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌తో పాటు అనేక రాష్ట్రాల్లో ఉద్యోగులు ఉద్యమిస్తున్నారు. మన రాష్ట్రంలో 1,86,000 మంది ఉద్యోగుల, ఉపాధ్యాయులు సీపీఎస్ విధానం వలన ఉద్యోగ జీవితానికి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత పెన్షన్ భద్రత కోల్పోయారు. అయితే రాజకీయ నిర్ణయంతో తెచ్చిన నూతన పెన్షన్ పథకాన్ని రాజకీయ నిర్ణయంతోనే రద్దు చేయగలరని భావించిన ఉద్యోగ సంఘాలు ఉద్యమబాట పట్టాయి. మిలియన్ మార్చ్, క్విట్ సీపీఎస్, మాస్ క్యాజువల్ లీవ్‌లు పెట్టి కలెక్టరేట్ల ముట్టడి ఇలా వరుసగా ఏదో ఒక కార్యక్రమంతో పెన్షన్ హక్కు కోసం ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉద్యమిస్తున్నారు. సంజీవినిలా వైఎస్ జగన్ హామీ.. సీపీఎస్ రద్దు కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎడారిలో ఒయాసిస్సులా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చి న హామీ వారిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రజాసంక్పల్పయాత్ర ప్రారంభించిన రోజే లక్షలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబాల్లో ఆనందం నింపేలా పెన్షన్ భద్రతతో పాటు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామంటూ స్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో సీపీఎస్ రద్దు కోసం ఉద్యమబాట పట్టిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఈయన ఇచ్చిన హామీ వారికి కొండంత బలాన్ని ఇచ్చింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఉద్యమం తీవ్రతరం చేశారు. అయితే సీపీఎస్‌ను రద్దు చేసే రాజకీయ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా ప్రభుత్వం స్పందించకుండా దాటవేత ధోరణి అవలంబిస్తోంది. దీంతో ఉద్యోగులు సైతం సీపీఎస్ రద్దు చేస్తారో.. లేక గద్దె దిగుతారో తేల్చుకోవాలని అల్టిమేటం జారీ చేస్తున్నారు. అదే విధంగా అన్ని రాజకీయ పార్టీలు సీపీఎస్ విధానంపై స్పష్టమైన విధానం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. హక్కుపై.. ఉక్కుపాదం.. తమకు, తమ కుటుంబాలకు జీవిత భద్రతను ఇచ్చే పెన్షన్ హక్కు కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులపై టీడీపీ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. సీపీఎస్ విధానంపై స్పష్టమైన వైఖరి తెలపకుండా ఉద్యమిస్తున్న వారిని ఎక్కడికక్కడ అణివేతకు గురిచేస్తోంది. చిన్న చిన్న మండలాల స్థాయిలోనే ఉద్యోగులను, ఉపాధ్యాయులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో ఉంచుతున్నారు. దీంతో అమ్మా.. పెట్టదు.. అడుక్కోనివ్వదు.. అన్న విధంగా తయారైంది పరిస్థితి. ఉద్యోగులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం న్యాయం చేయకపోగా.. న్యాయమైన హక్కుకోసం పోరాడుతున్న వారిని అరెస్టు చేయడం పట్ల సీపీఎస్ ఉద్యోగులు మండిపడుతున్నారు. సీపీఎస్‌ను రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని.. తాటాకు చప్పుళ్ల లాంటి అరెస్టులకు భయపడమని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. -
పెన్షన్ టెన్షన్
-
టీచర్ల అరెస్ట్‌ను ఖండించిన వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం(సీపీఎస్) రద్దు చేసి.. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరుతూ ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. వివిధ జిల్లాల నుంచి అసెంబ్లీ ముట్టడికి తరలివచ్చిన ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పలుచోట్ల ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఉద్యోగులను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. న్యాయమైన తమ డిమాండ్ల కోసం ఆందోళన చేపట్టిన ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వ్యవహరించిన తీరును ఏపీ ప్రతిపక్షనేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండించారు. ఈ మేరకు ఆయన ‘సీపీఎస్ కోసం అమరావతిలో నిరసన వ్యక్తం చేసిన టీచర్లను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. Strongly condemn the arrest of teachers protesting for the abolition of CPS in Amaravati. — YS Jagan Mohan Reddy (@ysjagan) September 18, 2018 అంతకు ముందు ఉద్యోగుల అక్రమ అరెస్టులపై పీడీఎఫ్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. సీపీఎస్‌పై వైఎస్ జగన్ ఇప్పటికే తన వైఖరి ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ విషయంలో టీడీపీ తన వైఖరి వెల్లడించడానికి ఇబ్బందేంటని ప్రశ్నించారు. ఎన్నడు లేని విధంగా ఉపాధ్యాయులను అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు. సీపీఎస్ రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని విమర్శించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో సీపీఎస్‌పై చర్చిస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పిందని మండిపడ్డారు. ఏపీలో వేలాది మంది ఉపాధ్యాయులను అరెస్ట్ చేశారని.. ప్రభుత్వం వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చదవండి: ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం -
ఉద్రిక్తంగా మారిన ఉద్యోగుల చలో అసెంబ్లీ
-
ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం
సాక్షి, అమరావతి: కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం(సీపీఎస్) రద్దు చేసి.. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరుతూ మంగళవారం ప్యాప్టో ఆధ్వర్యంలో చేపట్టిన చలోఅసెంబ్లీ రాజధాని ప్రాంతంలో ఉద్రిక్తతలకు దారితీసింది. వివిధ జిల్లాల నుంచి అసెంబ్లీ ముట్టడికి తరలివస్తున్న ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ప్రకాశం బ్యారేజీ నుంచి వెలగపూడి వరకు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసిన పోలీసులు.. స్కూల్ బస్సులు, ప్రైవేట్ వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సుల్ని కూడా తనిఖీలు చేస్తున్నారు. చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా విజయవాడ లెనిన్ సెంటర్‌కు భారీగా ఉద్యోగులు చేరుకున్నారు. పలుచోట్ల ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ఈడ్చుకుంటూ వెళ్లారు. మహిళల ఉద్యోగులను సైతం పోలీసులు ఈడ్చుకెళ్లారు. ఉద్యోగులను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. చాలా చోట్ల ఉద్యోగులపై దారుణంగా ప్రవర్తించారు. ఉద్యోగుల అక్రమ అరెస్టులపై పీడీఎఫ్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. సీపీఎస్‌పై వైఎస్ జగన్ ఇప్పటికే తన వైఖరి ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ విషయంలో టీడీపీ తన వైఖరి వెల్లడించడానికి ఇబ్బందేంటని ప్రశ్నించారు. ఎన్నడు లేని విధంగా ఉపాధ్యాయులను అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు. సీపీఎస్ రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని విమర్శించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో సీపీఎస్‌పై చర్చిస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పిందని తెలిపారు. ఏపీలో వేలాది మంది ఉపాధ్యాయులను అరెస్ట్ చేశారని.. ప్రభుత్వం వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ఉపాధ్యాయుల అక్రమ అరెస్ట్‌లపై శాసనమండలిలో పీడీఎఫ్ సభ్యులు వాయిదా తీర్మానం ఇవ్వగా.. మండలి చైర్మన్ దానిని తిరస్కరించారు. దీంతో సీపీఎస్ రద్దుతో పాటు ఉపాధ్యాయుల అక్రమ అరెస్ట్‌పై మండలిలో చర్చ చేపట్టాలని పీడీఎఫ్ సభ్యులు చైర్మన్ పోడియం ముందు నిరసనకు దిగారు. సీపీఎస్ రద్దు చేయమంటే అక్రమ అరెస్టుల చేస్తారా అని మండిపడ్డారు. ఉపాధ్యాయులు అనుకుంటున్నారా.. ఉగ్రవాదులు అనుకుంటున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్కూళ్లలోకి వెళ్లి ఉపాధ్యాయులను అరెస్ట్ చేయాల్సిన అవసరమేముందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎస్ రద్దుపై మండలిలో వెంటనే చర్చ జరపాలని.. దీనిపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని పీడీఎఫ్ సభ్యులు పట్టుబట్టారు. సీపీఎస్ రద్దుపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా పీడీఎఫ్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. -
సీసీఎస్‌లో లాకప్‌డెత్ కలకలం..?
అల్లిపురం(విశాఖ దక్షిణం): విశాఖ నగరంలోని సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ (సీసీఎస్)లో మంగళవారం లాకప్ డెత్ జరిగినట్లు కలకలం రేగింది. విశ్వసనీయ సమాచారం మేరకు... విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతానికి చెందిన పాత నేరస్తుడు గొర్లి పైడిరాజు (26)ను సీసీఎస్ పోలీసులు విచారణ నిమిత్తం తీసుకొచ్చినట్లు తెలిసింది. మంగళవారం అతడిని విచారిస్తున్న సమయంలో మృతి చెందినట్లుగా సమాచారం. తక్షణమే పోలీసులు మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారని, ఈ విషయం నగర పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డాకు తెలియడంతో సీసీఎస్ ఏసీపీ వై.గోవిందరావును తన చాంబర్‌కు పిలిపించి హెచ్చరించినట్లు సమాచారం. సీసీఎస్ వద్ద హైడ్రామా విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న ఏసీపీ గోవిందరావు ఎందుకు వచ్చారని మీడియాను ఎదురు ప్రశ్నించారు. మీడియా ప్రతినిధులు అడిగిన దానికి సమాధానం దాటవేసి అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నారు. తరువాత సీసీఎస్‌లో ఉన్నవారు ఒకరొకరు వెళ్లిపోవడంతో స్టేషన్ నిర్మానుష్యంగా మారింది. 6 గంటల తర్వాత మృతదేహం మార్చురీకిఅనుమానాస్పదంగా మృతి చెందిన గొర్లి పైడిరాజు మృతదేహాన్ని పోలీసులు మంగళవారం మధ్యాహ్నమే సీసీఎస్ పోలీస్ స్టేషన్ నుంచి రహస్యంగా తరలించారు. కానీ రాత్రి 8.45 గంటల సమయంలో మృతదేహాన్ని మార్చురీకి తరలించటం విశేషం. ఈ ఆరు గంటల పాటు మృతదేహాన్ని పోలీసులు ఎక్కడ తిప్పారన్నది ప్రశ్నార్థకంగా మారింది. పోలీసులు విషయాన్ని బయటకు పొక్కకుండా చూద్దామని ప్రయత్నించినట్లు తెలుస్తోంది. మరో పక్క మృతుడు గుండెపోటుతో చనిపోయాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మృతుడిపై ఆరు కేసులు మృతుడు గొర్లె పైడిరాజుపై ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు నిందితుడిని సీసీఎస్ పోలీస్‌లు విచారణ నిమిత్తం తీసుకొచ్చారు. అతని సహ నిందితుడు దున్నా కృష్ణ సమాచారం కోసం విచారణ చేపట్టినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే గొర్లె పైడిరాజు మృతి చెందినట్లు సమాచారం. విచారణ జరుపుతున్నాం సంఘటపై విచారణ జరుపుతున్నాం. మృతుడు గొర్లె పైడిరాజును విచారణ నిమిత్తం తీసుకొచ్చాం. సోమవారం రాత్రి అతని భార్య వచ్చి తీసుకెళ్లిపోయింది. కానీ ఏం జరిగిందో పూర్తి విచారణ చేపట్టమని నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా ఆదేశించారు. ఈ మేరకు ప్రస్తుతం విచారణ జరుపుతున్నాం. పూర్తి వివరాలు తరువాత వెల్లడిస్తాం. – దాడి నాగేంద్రకుమార్, జాయింట్ పోలీస్ కమిషనర్, విశాఖపట్నం. -
‘వైఎస్ జగన్ ఉద్యోగుల పక్షపాతి’
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తారనే నమ్మకముందని ఉద్యోగులు తెలిపారు. విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం కొత్తపెంట వద్ద వైఎస్ జగన్‌ను కలిసిన ఉద్యోగులు వారి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వినతి పత్రం కూడా అందజేశారు. వైఎస్ జగన్ ఉద్యోగుల పక్షపాతి అని నమ్ముతున్నామని పేర్కొన్నారు. తమ సమస్యల కోసం ఉద్యమం చేస్తుంటే టీడీపీ సర్కార్ ప్రజాస్వామ్య హక్కులను కాలరాసి తమను అక్రమ అరెస్ట్‌లు చేయిస్తుందని తెలిపారు. 253వ రోజు ప్రజాసంకల్పయాత్రలో ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. వైఎస్సార్సీపీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు కోడా సింహాద్రి వైఎస్ జగన్‌ను కలిశారు. గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయుల సమస్యలను ఆయన జననేతకు వివరించారు. మరోవైపు మాడుగులకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. చిన్నారుల చేత ఉట్టి కొట్టించిన వైఎస్ జగన్ కొత్తపెంటలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో వైఎస్ జగన్ పాల్గొన్నారు. బాలకృష్ణుడి వేషధారణలో ఉన్న పలువురు చిన్నారులు ఆయన్ని కలిశారు. వారితో కలిసి వైఎస్ జగన్ ఉత్సవంలో పాల్గొన్నారు. కృష్ణుడి వేషధారణలో ఉన్న చిన్నారులతో ఆయన ఉట్టి కొట్టించారు. -
సీపీఎస్ రద్దు ఉద్యమానికి మద్దతు: చాడ
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల పాలిట శాపంగా మారిన సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యమిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యా య సంఘాలకు మద్దతు తెలుపుతున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో 1,17,872 మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్యత్ ప్రశ్నార్థకమైందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేంద్ర ఆర్థిక సంస్థ పీఎఫ్డీఆర్ఏ.. కొత్త పెన్షన్‌లో ఉంటారా? పాత పెన్షన్ అమలు చేస్తారా? అని అడిగితే సీఎం కేసీఆర్ కొత్త పెన్షన్ స్కీం కొనసాగిస్తూ జీవో 28 ఇచ్చారని మండిపడ్డారు. -
ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
-
మేం వస్తే సీపీఎస్ రద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు శాపంగా మారిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) విధానాన్ని వెంటనే రద్దు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్డీయే ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 1,17,782 మంది ఉద్యోగులు, టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం సీపీఎస్‌ను రద్దు చేయని పక్షంలో తాము అధికారంలోకి వచ్చాక రద్దు చేస్తామని, ఈ అంశమే ఉద్యోగుల విషయంలో తీసుకునే మొదటి నిర్ణయం అవుతుందని ప్రకటించారు. శనివారం టీపీసీసీ అధికార ప్రతినిధి జి.హర్షవర్ధన్‌రెడ్డి నేతృత్వంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు గాంధీభవన్ లో ఉత్తమ్‌ను కలసి తమ సమస్యలను వివరించారు. అనంతరం ఉత్తమ్ విలేకరులతో మాట్లాడుతూ.. సీపీఎస్ కారణంగా ఉద్యోగులకు పదవీ విరమణ పొందిన తర్వాత పింఛన్ లేకుండా పోతోందన్నారు. ఈ విధానం అమల్లోకి వచ్చాక మృతిచెందిన 174 మంది ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్ ఉద్యోగులకు డెత్కమ్ గ్రాట్యుటీ ఇస్తానని సీఎం కేసీఆర్ ఈ ఏడాది మే 16న ఉపాధ్యాయ సంఘాలతో చర్చల సందర్భంగా మాట ఇచ్చారని, ఇంతవరకు ఆ జీవో విడుదల కాలేదని చెప్పారు. తెలంగాణ ఏర్పాటయ్యాక కొత్త పింఛన్ విధానంలో ఉంటారా? పాత పింఛన్ పద్ధతి లోనే కొనసాగుతారా అని పీఎఫ్ఆర్డీఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిందని.. తాము కొత్త పింఛన్ విధానంలో ఉంటామని కేసీఆర్ జీవో 28 విడుదల చేశారన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే వంశీచందర్‌రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్‌యాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సీఎం మజాక్ చేస్తున్నారు.. తాము ఎట్టి పరిస్థితుల్లో 100 సీట్లు గెలుస్తామన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఉత్తమ్ కొట్టిపారేశారు. సీఎం మజాక్ చేస్తున్నారని, ఆయన వేరే రాష్ట్రంలో సర్వేలు చేయించుకుని ఉంటారని ఎద్దేవా చేశారు. తాము తెలంగాణలో చేసిన సర్వేల్లో కాంగ్రెస్ 75 సీట్లు గెలుస్తుందని తేలిందన్నారు. ఎన్నికలు ఎప్పు డొచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అది దోపిడీ సభ... అనంతరం ఉత్తమ్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నిర్వహిస్తోంది ప్రగతి నివేదన సభ కాదని, దోపిడీ సభ అని, ప్రగతి లేని నివేదన సభ అని వ్యాఖ్యానించారు. తన నాలుగున్నరేళ్ల పాలనలో ఏం సాధించారని కేసీఆర్ సభ పెడుతున్నారని ప్రశ్నించారు. ఏడు గంటల పాటు మంత్రులతో సమావేశమైన కేసీఆర్ ఆ సమావేశ వివరాలను మీడియాకు ఎందుకు ప్రకటించలేదని నిలదీశారు. ఈసారి ఎన్నికలకు రాష్ట్ర స్థాయి మేనిఫెస్టోతో పాటు ప్రతి నియోజకవర్గానికి మేనిఫెస్టో ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఉత్తమ్ చెప్పారు. బయ్యారం ప్రస్తావన లేకపోవడం దారుణం సీఎల్పీ ఉపనేత పొంగులేటి సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన వినతిపత్రంలో కనీసం బయ్యారం ఉక్కు పరిశ్రమ ప్రస్తావన లేకపోవడం దారుణమని సీఎల్పీ ఉపనాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బయ్యారం ఉక్కు–తెలంగాణ హక్కు అంటూ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రజలు ఎలుగెత్తి చాటిన ఆకాంక్ష పట్ల కేసీఆర్ ఎందుకు వివక్ష ప్రదర్శిస్తున్నారని శనివారం ఓ ప్రకటనలో ఆయన ప్రశ్నించారు. వేలాది మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు దాగుడుమూతలు ఆడుతున్నాయో సీఎం కేసీఆర్ స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
ప్రజాసంకల్పయాత్ర: వైఎస్ జగన్‌ను కలిసిన సీపీఎస్ ఉద్యోగులు
-
సీపీఎస్ ధర్నాలో ఆశోక్‌బాబుకు చుక్కెదురు
-
ప్రభుత్వ ఉద్యోగులకు వైఎస్ జగన్ హామీ
-
‘అధికారంలోకి రాగానే సీపీఎస్‌ను రద్దు చేస్తాం’
సాక్షి, రాయవరం : అధికారంలోకి రాగానే కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం(సీపీఎస్)ను రద్దు చేస్తామని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. అలాగే ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఇళ్ల స్థలంతో పాటు, ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంతో సోమవారం 209వ రోజు ఆయన తూర్పు గోదావరి జిల్లా రాయవరంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుపై మండి పడ్డారు. ఎన్నికలకు ఆరు నెలల ముందుగా డ్రామాతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సభలో జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. నాలుగేళ్లుగా మోసాలు.. అవినీతి ‘నాలుగేళ్ల చంద్రబాబు పాలన అవినీతిమయం, మోసాలతో ముగిసింది. మట్టి, ఇసుకతో సహా అన్నింటిలోను దోపిడీ చేశారు. నీరు-చెట్టు పథకం ద్వారా మట్టిని కూడా దోచేశారు. పేదలను కూడా వదలకుండా దోచుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు. దివంగత నేత వైఎస్సార్ హయంలో మండపేట నియోజక వర్గంలో 14 వేల ఇళ్లు కట్టించారు. ఇళ్లస్థలాలను అందించారు. వైఎస్సార్ పేదల కోసం సేకరించిన స్థలాలలో ఇప్పుడు బాబు అవినీతి ప్లాట్లు నిర్మిస్తామంటున్నారు. అడుగుకు రూ. వెయ్యి అయ్యే ప్లాటును బాబు 2వేల రూపాయలకు అమ్ముతాడట. మూడు లక్షలు అయ్యే ప్లాటును బాబు 6లక్షలకు అమ్ముతాడట. మూడు లక్షలు ప్రభుత్వం మాఫీ చేయగా.. మరో 3 లక్షలు పేద ప్రజలు 20 ఏళ్ల వరకూ నెలకు రూ.3 వేలు కట్టాలట. మీకు ప్లాటు ఇస్తే కాదనకుండా బంగారంలా తీసుకోండి. అధికారంలోకి రాగానే ఆ డబ్బులను మాఫీ చేస్తాం. ఎన్నికల సమయంలో రూ. 87వేల 612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ బాబు ఇచ్చిన డబ్బుతో వడ్డీలు కూడా మాఫీ కాలేదు. పొదుపు సంఘాల రుణాలు మాఫీ అన్నారు..కానీ రూపాయి కూడా మాఫీ చేయలేదు’ అని ఆరోపించారు. వారికి మాత్రమే ఇసుక ఫ్రీ రాష్ర్ట వ్యాప్తంగా ఇసుకదోపిడీని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పోలీసులు దగ్గర ఉండి మరీ లారీలలో ఇసుకను రవాణ చేయిస్తున్నారు. ఏ కలెక్టరూ వాటిని అడ్డుకోరు. కోట్ల కొద్ది లంచాలు తీసుకుంటూ ఇసుకను తరలిస్తున్నారు. పేరుకేమో ఇసుక ఫ్రీ అంటుంన్నారు. ఎవరికైనా ఫ్రీగా వస్తుందా..? ప్రతి పేదవాడు లారీ ఇసుకను 7వేల నుంచి 12వేలకు పెట్టి కొంటున్నాడు. కేవలం చంద్రబాబుతో లంచాలను పంచుకునేవారికి మాత్రమే ఫ్రీగా వస్తోంది. ఎన్నికలకు ఆరు నెలల ముందు ఇసుక ప్రక్షాళన చేస్తామని మాయ మాటలు చెబుతున్నారు. కోడి కూర పెడతాడట నాలుగేళ్లుగా మెస్ ఛార్జీలను పెంచలేని చంద్రబాబు ఎన్నికలకు ఆరు నెలల ముందు విద్యార్థులకు కోడి కూర పెడతామని అంటున్నారు. అదిగో అన్నాక్యాంటీన్లు అంటూ ప్రజలను మళ్లీ మోసం చేయడానికి రెడీ అవుతున్నారు. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం రావాలంటే బాబు అధికారంలోకి రావాలి అన్నారు. వచ్చాయా ఇప్పుడు..? ఆయన అధికారంలోకి వచ్చారు కానీ అక్కా చెల్లెళ్ల మంగళసూత్రాలు మాత్రం ఇంటికి రాలేదు. బ్యాంకుల్లోని బంగారం రాలేదు కానీ ఇంటికి మాత్రం నోటీసులు వచ్చాయి. హామీలు నెరవేర్చకుంటే రాజీనామా చేయాలి నాలుగు సంవత్సరాల చంద్రబాబు పాలన చూశాం. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఎలాంటి నాయకుడు అవసరమో ఆలోచించండి. అబద్ధాలు చెప్పేవాడు, మోసాలు చేసే వాడు మనకు నాయకుడుగా కావాలా? చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత తీసుకు రావాలి. నిజాయితీ తీసుకు రావాలి. ప్రజలు ఇచ్చిన హామీలను నాయకుడు నెరవేర్చకుంటే సిగ్గుతో రాజీనామా చేసే వ్యవస్థను రూపొందించాలి. ఇవి జరగాలంటే జగన్ ఒక్కడి వల్లే సాధ్యం కాదు. నాకు మీ అందరి తోడు కావాలి. మీ అందరి దీవెనలు కావాలి. అపుడే ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారుతుంది. విశ్వసనీయత అనే పదానికి అర్థం వస్తుంది. చంద్రబాబును క్షమిస్తే.. తాను ఇచ్చిన హామీల్లో 98 శాతం అమలు చేశానని చెప్పి మన చెవుల్లో క్యాలీఫ్లవర్ పెట్టే యత్నం చేస్తారు. చిన్న అబద్ధాలు, మోసాలకు నమ్మరని ఇంటికి కేజీ బంగారం, ఒక బెంజీ కారు ఇస్తానని వాగ్దానం చేస్తారు. కానీ అది మీరు నమ్మరని ప్రతి ఇంటికీ మహిళా సాధికార మిత్రలను పంపుతాడు. వారు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు డబ్బు పెడతారు. వద్దనకండి. రూ.5 వేలు కావాలని గుంజండి. ఆ డబ్బంతా మనదే. మన జేబుల్లో నుంచి దోచేసిందే. కానీ మీ మనస్సాక్షి ప్రకారం ఓట్లేయండి. అబద్ధాలు చెప్పే వాళ్లను, మోసాలు చేసే వాళ్లను బంగాళాఖాతంలో కలిపే పరిస్థితులు తీసుకు రండి. మన ప్రభుత్వం రాగానే నవరత్నాలతో పేదలందరినీ ఆదుకుంటాం’’ అని వైఎస్ జగన్ అన్నారు. మన ప్రభుత్వం రాగానే ఇలా చేస్తాం.. సీపీఎస్‌ను రద్దు చేస్తాం ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లను ఇస్తాం డీఏలు సమయానికి అందేలా చూస్తాం ఇళ్ల ప్లాట్‌కు కట్టాల్సిన డబ్బును మాఫీ చేస్తాం పేదవాడి పిల్లలకు ఉచిత విద్యను అందిస్తాం హాస్టల్ మెస్ ఛార్జీకోసం ఏడాదికి రూ.20వేలు అందిస్తాం పాఠశాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఏడాదికి రూ.15వేలు అందిస్తాం -
గ్రాట్యుటీకి ఓకే
సాక్షి, హైదరాబాద్ : కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్)లో ఉన్న ఉద్యోగులకు శుభవార్త. సీపీఎస్‌లో ఉన్న ఉద్యోగులకు గ్రాట్యుటీ వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్మెంట్ గ్రాట్యుటీ, డెత్ గ్రాట్యుటీని వర్తింపజేసింది. 2004 సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారందరికీ గ్రాట్యుటీ ప్రయోజనాలు కల్పిస్తూ రాష్ట్ర ఆర్థిక ముఖ్య కార్యదర్శి ఎన్.శివశంకర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2004 సెప్టెంబర్ నుంచి ఈ గ్రాట్యుటీ చెల్లింపులు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. రాష్ట్రంలో మొత్తం 1.26 లక్షల మంది ఉద్యోగులు సీపీఎస్ పరిధిలో ఉన్నారు. వీరిలో ఇప్పటికే 998 మంది పదవీ విరమణ పొందగా, 263 మంది ఉద్యోగులు మరణించారు. తాజా ఉత్తర్వుల ప్రకారం ఈ కుటుంబాలన్నీ రిటైర్మెంట్ గ్రాట్యుటీ, డెత్ గ్రాట్యుటీ ప్రయోజనాలు పొందనున్నాయి. పాత పెన్షన్ విధానంలో ఉన్న ఉద్యోగులకు ప్రస్తుతం గ్రాట్యుటీ చెల్లింపు అమల్లో ఉంది. ప్రస్తుతం పదవీ విరమణ చేసినప్పుడు లేదా చనిపోయిన సందర్భంలో గరిష్టంగా రూ.12 లక్షలకు మించకుండా గ్రాట్యుటీ చెల్లిస్తోంది. అయితే సీపీఎస్‌లో ఉన్న ఉద్యోగులకు మాత్రం ఇప్పటివరకు గ్రాట్యుటీ లేకపోవడంతో ఆందోళన వ్యక్తమైంది. సీపీఎస్ రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీపీఎస్ ఉద్యోగులకు ఈ గ్రాట్యుటీ ప్రయోజనాలను విస్తరించడంతో కొంతమేరకు ఊరట లభించనుంది. గత ఏడాది ఆగస్టులోనే సీపీఎస్‌లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గ్రాట్యుటీని వర్తింపజేసింది. అన్ని రాష్ట్రాలు అక్కడి పరిస్థితులకు అనుగుణంగా గ్రాట్యుటీ చెల్లించే అవకాశాలను పరిశీలించాలని సూచించింది. కేంద్రం సూచన మేరకు ఇప్పటికే ఏపీ, హర్యానాతో పాటు పలు రాష్ట్రాలు సీపీఎస్‌లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీని వర్తింపజేశాయి. రాష్ట్రంలోనూ గ్రాట్యుటీ చెల్లిస్తామని ఇటీవలే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఉత్తర్వులు వెలువడ్డాయి. -
సీపీఎస్ వద్దు..పెన్షన్ కావాలి
చిలకలపూడి(మచిలీపట్నం): సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు గళమెత్తారు. మచిలీపట్నంలో పెన్షన్ సాధన సమితి తూర్పుకృష్ణాశాఖ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు, పెన్షనర్ల ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎన్జీవో హోమ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నాయకులు మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, పలు దఫాలుగా పోరాటాలు చేసినా ప్రభుత్వం ఏ మాత్రం స్పందించటం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి వెట్టిచాకిరీ చేస్తున్న ఉద్యోగులకు సౌకర్యాలు కల్పించే విషయంలో ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి అసెంబ్లీలో తీర్మానం చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఆందోళన ధర్మమైనది : పేర్ని ఏపీ ఏన్జీవో అసోసియేషన్ తూర్పు కృష్ణా శాఖ సారధ్యంలో పెన్షన్ సాధన సమితి నేతృత్వంలో ఉద్యోగ, ఉపాధ్యాయసంఘాల ఆందోళనకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని) మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు చేస్తున్న ఆందోళన ధర్మమైనదని ఇందుకు ఉద్యోగుల సమస్యకు సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. డీఏ పెంపుదల విషయంలో కేసీఆర్‌ను చూసి ఉద్యోగులకు ప్రకటించిన విధంగానే తెలంగాణా రాష్ట్రంలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తున్నామని కేసీఆర్ ప్రకటిస్తే తప్ప ఆంధ్రరాష్ట్రంలో సీఎం చంద్రబాబు స్పందించే పరిస్థితి లేదని అర్ధమవుతోందన్నారు. కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ తూర్పు కృష్ణా అధ్యక్ష,కార్యదర్శులు ఉల్లి కృష్ణ, దారపు శ్రీనివాస్, పీఆర్టీయు రాష్ట్ర అధ్యక్షులు మత్తి కమలాకరరావు, సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు పి సత్యనారాయణ, శోభన్‌బాబు, యూటీఎఫ్ నాయకులు కెఏ ఉమామహేశ్వరరావు, ఏపీటీఎఫ్ నాయకులు తమ్ము నాగరాజు, ఎస్టీయు నాయకులు కొమ్ము ప్రసాద్, డి చంద్రశేఖర్, బీటీఏ రాష్ట్ర అధ్యక్షులు చేబ్రోలు శరత్చంద్ర, కైతేపల్లి దాస్, ఎల్ఐసీ ఉద్యోగ సంఘం నాయకులు జి కిషోర్‌కుమార్, పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు జీటీవీ రమణ, పెన్షనర్స్ అసోసియేషన్ జీవీ రామారావు, రామస్వామి, ఎన్జీవో సంఘ నాయకులు గౌరి, రమాదేవి, బి సీతారామయ్య, ఎల్వీ సూర్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంజనేయటవర్స్ వద్ద ధర్నా ఇబ్రహీంపట్నం: కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దుచేయాలని రాష్ట్ర పెన్షన్ సాధన సమితి పిలుపుమేరకు క్యాపిటల్ సిటీ బ్రాంచి అమరావతి ఆధ్వర్యంలో వివిధ ఉద్యోగసంఘాలు ఆంజనేయటర్స్ వద్ద శనివారం ధర్నా నిర్వహించాయి. క్యాపిటల్ సిటీ బ్రాంచి అమరావతి సంఘం రాష్ట్ర అ«ధ్యక్షుడు సీవీ.రావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.మణికుమార్ మాట్లాడుతూ పెన్షన్ రద్దు కోసం దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. రాష్ట్రకోశాధికారి వీరేంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక విధానాల వల్ల ఉద్యోగులు నష్టపోతున్న ట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రచార కార్యదర్శి సీహెచ్ అజయ్‌కుమార్, మహిళా అ«ధ్యక్షురాలు పీవీఎల్ఎస్.రత్న, ఏపీఎన్టీవో సంఘం కార్యదర్శులు నరసింహం, జగదీశ్వరరావు, తులసీరత్నం, కృపావ రం, క్యాపిటల్సీటీ బ్రాంచి కార్యదర్శి నాగభూష ణం, రాష్ట్ర ఉద్యోగుల సమైక్య సభ్యులు రాజ్యలక్ష్మీ, రాష్ట్ర అడిట్సంఘం ప్రధానకార్యదర్శి శ్రీధర్, రాష్ట్ర ఎకనామిక్, స్టాటిక్స్ సంఘం, పీఏవో, అగ్నిమాపక శాఖల యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. -
సీపీఎస్ కోసం కేంద్రంతో పోరాడుదాం: ఎంపీ కవిత
నిజామాబాద్ నాగారం (నిజామాబాద్ అర్బన్): ఉద్యోగులకు సంబంధించి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానం అమలుకు కేంద్రంతో పోరాడుదామని ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో టీఎన్జీవోస్ నాన్‌గెజిటెడ్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర సాధనలో ఉద్యోగాలను సైతం లెక్క చేయకుండా ఉద్యోగులు ఉద్యమాలు చేశారని గుర్తుచేశారు. టీఎన్జీవోస్ సంఘానికి టీఆర్ఎస్కు వీడదీయరాని బంధం ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తూ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. కేంద్ర పరిధిలో ఉన్న సీపీఎస్ రద్దుకు కలసి ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో చురుకైన పాత్ర పోషించాలని ఎంపీ కవిత సూచించారు. -
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌పై ఎలుగెత్తిన ఉద్యోగి
సాక్షి, అమరావతి: పదవీ విరమణ అనంతరం దక్కే పెన్షన్ ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఉద్యోగులు కొండంత ఆశతో ఎదురు చూస్తుంటారు. ఓ ఇల్లు కొనాలన్నా, పిల్లల చదువులు పూర్తి కావాలన్నా, భవిష్యత్తు సాఫీగా గడిచిపోవాలన్నా ఎంతో మందికి అదే ఆధారం. ఓ ఉద్యోగి జీవితంలో అనుకోని ఉపద్రవాలు సంభవించినా ఆ కుటుంబాన్ని చివరకు ఆదుకునేది కూడా అదే. తమ ఆశలను ఛిద్రం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (సీపీఎస్)పై రాష్ట్రవ్యాప్తంగా 1.84 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు భగ్గుమంటున్నారు. తమ భవిష్యత్తును అంధకారం చేసే కాంట్రిబ్యూటరీ పెన్షన్ (సీపీఎస్) స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రంపై నెపం వేసి తప్పించుకునేందుకు దారులు వెతుకున్న రాష్ట్ర ప్రభుత్వంపై ఇక ఉద్యమించాలని నిర్ణయించారు.చాలా రోజులుగా వినతిపత్రాలు, ధర్నాలు, మౌన ప్రదర్శనలు, నిరసనలు, కలెక్టరేట్ల ముట్టడి నిర్వహించినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడంతో బుధవారం చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. విజయవాడలో వారిని పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. సీపీఎస్ మొగ్గ తొడిగింది బాబు జమానాలోనే లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల భవిష్యత్తును చీకటిమయం చేసే సీపీఎస్ విధానం గతంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే సిద్ధమైంది. 2003కి ముందు టీడీపీ ప్రధాన భాగస్వామిగా ఉన్న అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రూపొందించింది. అయితే దీన్ని అమలు చేయాలా వద్దా..? అనే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు తీరని అన్యాయం చేసే ఈ విధానాన్ని అమలు చేసేందుకు నిర్ణయించి తన ఆమోదాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. ప్రపంచ బ్యాంకు సూచనల ప్రకారం ఈ నూతన పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. అప్పటికే ఈ విధానం పలు దేశాల్లో విఫలమైంది. ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన చంద్రబాబు, కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నూతన పెన్షన్ విధానం బిల్లును పార్లమెంటులో ఆమోదించటం ఉద్యోగులకు అశనిపాతంగా పరిణమించింది. బెంగాల్, త్రిపురలో నేటికీ పాత విధానమే... 2004 జనవరి 1వతేదీ నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నూతన పెన్షన్ విధానాన్ని వర్తింపచేశారు. ‘‘రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేయడం, చేయకపోవడం వాటి ఇష్టం’ అని కేంద్రం స్పష్టం చేసింది. ఈ విధానం చాలా లోపభూయిష్టమైనదని, ఉద్యోగుల చరమాంక జీవితానికి ఏమాత్రం భరోసా ఇవ్వదని పార్లమెంటులో గొంతెత్తిన వామపక్షాలు వాటి ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో నూతన పెన్షన్ విధానాన్ని అమలు చేయలేదు. పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాలలో ఇప్పటికి పాతపెన్షన్ విధానమే అమలవుతుండటం గమనార్హం. ఉద్యోగులను అరెస్టు చేసి బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కిస్తున్న పోలీసులు ఉద్యోగుల ప్రయోజనాలకు గండి ఆంధ్రప్రదేశ్‌లో 2004 సెప్టెంబర్ 10 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ (సీపీఎస్)విధానాన్ని వర్తింపచేశారు. ఉద్యోగులు ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న 1980 నాటి పెన్షన్ నిబంధనలు, వాటిలోని ప్రయోజనాలు సీపీఎస్ విధానంలో వర్తించవు. 1980 పెన్షన్ నిబంధనల ప్రకారం పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ, కమ్యూటేషన్, ఆర్జిత సెలవును నగదుగా మార్చుకొనే సదుపాయం, మరణానంతర ప్రయోజనాలనేకం ఉద్యోగులకు సమకూరాయి. కొత్త పెన్షన్ విధానం వల్ల పదవీ విరమణ అనంతరం ఉద్యోగుల జీవితం గాలిలో దీపంలా మారనుంది. రూ. వందల్లోకి పెన్షన్ కుదింపు.. ఉదాహరణకు పాత పెన్షన్ విధానంలో ఓ ఉద్యోగి బేసిక్ వేతనం రిటైరయ్యే నాటికి రూ. 66,330 ఉంటే పదవీ విరమణ తరువాత అతడికి రూ. 33,165 పెన్షన్‌గా అందుతుంది. 40 శాతం కమ్యూటేషన్ చేసినా మిగిలిన మొత్తం రూ. 19,899తో పాటు డీఏ, మెడికల్ అలవెన్సులు కలిపితే రూ. 27,398 పెన్షన్‌గా అందేది. అదే కొత్త పెన్షన్ విధానంలో ఒక ఉద్యోగి పెన్షన్ ఖాతాలో అక్టోబర్ నెలలో రూ. 4,93,564 ఉన్నాయనుకుంటే ఆ మొత్తం పెట్టుబడిగా పెడితే నెల చివరికి రూ. 4,95,888 అవుతోంది. అంటే పెరిగిన ఆదాయం రూ.2,324 మాత్రమే. ఈ లెక్కన ఉద్యోగికి వచ్చే పెన్షన్ నెలవారీ వందల్లోనే తప్ప అంతకు మించి అందదు. ఇక ఎవరైనా ఉద్యోగి చనిపోతే షేర్ మార్కెట్లో ఉన్న సొమ్ము మొత్తం ఆ కుటుంబానికి చెల్లిస్తారు. తరువాత ఆ ఉద్యోగి కుటుంబానికి ఫ్యామిలీ పెన్షన్ రాదు. పాత పద్దతిలో అయితే చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి ఉద్యోగి చివరి బేసిక్‌లో సగం + దానిపై డీఏ వచ్చేది. ఈ నేపథ్యంలో కొత్త పెన్షన్ విధానంతో తమ కుటుంబాలు ఎలా బతకాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కుటుంబ పెన్షన్ లేకపోవడం, కమ్యూటేషన్ తొలగించటం, ఇతర ప్రయోజనాలను కూడా లేకుండా చేయడంతో వృద్ధాప్యంలో తమ పరిస్థితి ఏమిటని ఆక్రోశిస్తున్నారు. మండలిలో నిలదీసిన టీచర్ ఎమ్మెల్సీలు ఉపాధ్యాయ, పట్టభద్ర ఎమ్మెల్సీలు బొడ్డు నాగేశ్వరరావు, కత్తినరసింహారెడ్డి, వై.శ్రీనివాసులురెడ్డి, రామసూర్యారావులు బుధవారం శాసనమండలిలో సీపీఎస్ రద్దు కోసం ఏకవాక్య తీర్మానానికి పట్టుబట్టారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో సభను స్తంభింపచేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్లకార్డులతో నినాదాలు చేస్తూ పోడియం ముందు బైఠాయించారు. లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన సమస్య పై చర్చించకపోవడం అన్యాయమని, తమ గోడును వెళ్లబోసుకొనేందుకు అసెంబ్లీకి వస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులను ముందురోజు నుంచే అరెస్టు చేయడం అన్యాయమని ఎమ్మెల్సీలు ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేస్తామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించినందున ప్రభుత్వం కూడా దీనిపై తన వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని పట్టుబట్టారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో నిరసనగా సభనుంచి వాకౌట్ చేశారు. ఈనెల 20వ తేదీన శాసనమండలి, అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై మళ్లీ ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొంటామని ప్రకటించారు. మహిళ ఉద్యోగులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు పాత పెన్షన్ విధానంలో ఉద్యోగులకు ప్రయోజనాలు ఇవీ - ప్రతి నెలా జీతం నుంచి సొమ్ము చెల్లించకున్నా రిటైర్ అయిన తర్వాత నిర్ధిష్టమైన పెన్షన్ నెలనెలా అందుతుంది. ఏటా వచ్చే డీఏ, పీఆర్సీ ఇతర సదుపాయాలను అనుసరించి ఇది ప్రతినెలా పెరుగుతుంది. ఉద్యోగి బతికి ఉన్నంతవరకు పెన్షన్ ఇవ్వటంతోపాటు చనిపోయిన తరువాత ఉద్యోగి భార్యకు పెన్షన్ చెల్లిస్తారు. ఆ పెన్షన్ బాధ్యత ప్రభుత్వానిదే. - ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణిస్తే అతడి కుటుంబంలో అర్హులైన వారికి దామాషా ప్రకారం జీవితాంతం ఫ్యామిలీ పెన్షన్ చెల్లిస్తారు ఇది కూడా ప్రతినెలా పెరుగుతుంది. - ఉద్యోగి అవసరాలకోసం ప్రతినెలా జీతంలో కొంతభాగం జీపీఎఫ్ ఖాతాలో పొదుపు చేసుకోవచ్చు. ఈ ఖాతాలను ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ఈ సొమ్ముపై ప్రతి నెలా నిర్దిష్ట వడ్డీ చెల్లిస్తుంది. ఉద్యోగికి డబ్బు అవసరమైతే వడ్డీలేని రుణంగా పొందవచ్చు. సులభ వాయిదాల్లో చెల్లించవచ్చు. - పదవీ విరమణ అనంతరం ఉద్యోగి ఆరోగ్య అవసరాల కోసం హెల్త్ కార్డుల సదుపాయం ఉంది. - తన శక్తి సామరŠాధ్యలను ప్రభుత్వ సేవకి వినియోగించినందుకు పదవీ విరమణ సమయంలో బహుమానంగా దామాషా ప్రకారం గరిష్టంగా రూ.12 లక్షల వరకు గ్రాట్యుటీ చెల్లిస్తారు. పీఆర్సీ ప్రకారం ఇది పెరుగుతుంది. - పదవీ విరమణ సమయంలో కుటుంబ అవసరాలు తీర్చుకునేందుకు తనకు వచ్చే పెన్షన్‌లో దామాషా ప్రకారం 40 శాతం వరకు ముందుగానే తీసుకోవచ్చు. ఈ సొమ్మును పెన్షన్ నుంచి ప్రతి నెలా మినహాయిస్తారు. దీన్నే కమ్యుటేషన్ అంటారు. - ఉద్యోగికి లభించే ఆర్థిక ప్రయోజనాలపై ఎలాంటి పన్ను విధించరు. కొత్త విధానంలో అన్నిటికీ కోతే - పదవీ విరమణ అనంతరం పెన్షన్ గురించి ఉద్యోగే చూసుకోవాలి. దీనికోసం ఉద్యోగి తన సర్వీసు ప్రారంభం నుంచే జీతంలో ప్రతి నెలా 10 శాతం సొమ్ము పొదుపు చేసుకోవాలి. దీనికి ప్రభుత్వం అంతే మెత్తం జమచేసి ఎన్ఎస్డీఎల్ అనే సంస్థ ద్వారా షేర్ మార్కెట్లలో వివిధ రకాల ఫండ్లలో పెట్టుబడిగా పెడుతుంది. పదవీ విరమణ సమయంలో లాభనష్టాలు పోనూ మిగిలిన సొమ్ములో 60 శాతం ఉద్యోగికి చెల్లిస్తారు. దీనిపై ఉద్యోగి పన్ను చెల్లించాలి. మిగిలిన 40 శాతం సొమ్ము మళ్లీ షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టి వచ్చే లాభాలతో పెన్షన్ ఇస్తారు. ఇది ఎంత అనేది నిర్ధిష్టంగా ఉండదు. షేర్ మార్కెట్లలో నష్టాలు వస్తే పెన్షన్ తగిపోతుంది. ఒకవేళ పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తి మరణిస్తే కుటుంబానికి ఫ్యామిలి పెన్షన్ అందదు. ఆ కుటుంబం వీధుల పాలు కావాల్సిందే. - ఉద్యోగి తన శక్తి సామర్థ్యాలను ప్రభుత్వ సేవకి అంకితం చేసినందుకు పదవీ విరమణ సమయంలో ఇచ్చే ్రగ్రాట్యుటీ సదుపాయం లేదు. అయితే దీన్ని ఇచ్చేందుకు ఇటీవలే ప్రభుత్వం అంగీకరించి జీవో ఇచ్చింది. - రిటైరయిన తరువాత ఉద్యోగి హెల్త్ కార్డులపై స్పష్టత లేదు. - ఉద్యోగులకు కమ్యుటేషన్ సదుపాయం లేదు. - పాత పెన్షన్ విధానంలో మాదిరిగా ఆపదలో ఆదుకోనే జీపీఎఫ్ లోన్ సదుపాయం ఉద్యోగులకు లేదు. ఉపాధ్యాయుల చలో అసెంబ్లీ భగ్నం భవానీపురం(విజయవాడ): కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్)ను వ్యతిరేకిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు బుధవారం చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమంపై ప్రభుత్వం పోలీసులను ప్రయోగించింది. మంగళవారం మధ్యాహ్నం నుంచే అన్ని జిల్లాల్లో అరెస్టుల పర్వం కొనసాగింది. బస్సులు, రైళ్లలో బయలుదేరిన వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. విజయవాడ, గుంటూరుల్లో భారీగా పోలీసులను మోహరించటంతోపాటు వెలగపూడిలోని తాత్కాలిక అసెంబ్లీకి వచ్చే అన్ని దారుల్లోనూ నిఘా వేశారు. విజయవాడకు చేరుకున్న వేలాది మందిని అడ్డుకొని సుదూరంలోని పోలీసు స్టేషన్లలో నిర్బంధించారు. ఫ్యాప్టో లోని అన్ని సంఘాల రాష్ట్ర నేతలు, జిల్లాల నేతలను పోలీసులు అరెస్టుచేసి రాత్రి వరకు నిర్బంధించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి అసెంబ్లీ ముట్టడికి బయల్దేరేందుకు 13 జిల్లాల నుంచి ఉద్యోగులు ఉదయమే కళాక్షేత్రం వద్దకు భారీగా చేరుకున్నారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసు బలగాలు వారిని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. కిందపడిపోయిన మహిళా మహిళలను నిర్దాక్షిణ్యంగా ఎత్తి వ్యాన్లలో పడేశారు. సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, పాత పెన్షన్ స్కీం విధానాన్నే కొనసాగించాలంటూ ఉద్యోగులు నినదించారు. ప్రభుత్వ దమననీతి నశించాలని, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసుల అత్యుత్సాహంపై ఉద్యోగులు మండిపడ్డారు. సీపీఎస్ విధానం రద్దు కోరేది తమ ఒక్కరి కోసమే కాదని, అది మీకు కూడా వర్తిస్తుందన్న విషయాన్ని గుర్తించాలని హితవు పలికారు. ఆడామగా తేడా లేకుండా విచక్షణా రహితంగా ప్రవర్తించిన పోలీసులపై ఆగ్రహం వ్యక్తమైంది. ఒక దశలో కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులను కూడా పోలీసులు వదలలేదు. ఒక ఛానల్ రిపోర్టర్ పొట్టలో పిడిగుద్దులు గుద్దారు. మరికొంతమందిపైనా దౌర్జన్యం చేశారు. -
జగన్ నోట... సీపీఎస్ రద్దు మాట...
రాయవరం (మండపేట): ప్రభుత్వ ఉద్యోగం అంటే భద్రత, భరోసా. దానికి కారణం ఉద్యోగ విరమణ అనంతరం కూడా పెన్షన్ రావడమే. అయితే 2004 సెప్టెంబర్ నుంచి అమలవుతున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పాలిట అశనిపాతంగా మారింది. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోరాటం చేస్తున్నారు. సీపీఎస్ విధానంతో కష్టనష్టాలను చవిచూస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ పోరాటబాట పడుతున్నారు. జిల్లాలో 16 వేల మంది సీపీఎస్ ఉద్యోగులున్నారు. సీపీఎస్‌పై రాష్ట్రాల పరిధిలోనే నిర్ణయం తీసుకోవాలని కేంద్రం చెప్పగా, ఇటీవల ముఖ్యమంత్రి ఇది తన పరిధిలో లేదని, కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని చెప్పడంతో నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలో ప్రతిపక్ష నేత సీపీఎస్, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై చేసిన ప్రకటన ఆయా వర్గాల్లో ఆశలు రేకెత్తించింది. ఈ సందర్భంగా పలు ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘం నేతల అభిప్రాయాలు వారి మాటల్లోనే... ఇది మంచి నిర్ణయం.. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పింఛన్ విధానాన్ని అమలు చేస్తానని ప్రతిపక్ష నేత వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మంచి నిర్ణయం. – చింతాడ ప్రదీప్ కుమార్, ప్రధాన కార్యదర్శి, పీఆర్టీయూ ఆహ్వానించదగ్గ పరిణామం.. పాత పింఛన్ విధానాన్ని అమలు చేస్తానని జగన్ ఇచ్చిన హా మీ ఆహ్వానించదగ్గ పరిణామం. సీపీఎస్ విధానంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. – కవి శేఖర్, ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ ఉద్యోగుల శాపాన్ని తొలగించినట్లవుతుంది.. ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానని ఇచ్చిన హామీ ఉద్యోగుల పాలిట శాపాన్ని తొలగించినట్లవుతుంది. లక్షలాది మంది ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత బతుకుతామనే ఆశను కల్పించినటై్టంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు హర్షం వెలిబుచ్చుతున్నారు. – డీవీ రాఘవులు, జిల్లా అధ్యక్షుడు, యూటీఎఫ్ పోరాటాలు ఫలించినట్లవుతుంది.. సీపీఎస్ విధానం రద్దుకు చర్యలు తీసుకుంటామని ప్రతిపక్ష నేత వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి చెప్పడం ఉద్యోగులు, ఉపాధ్యాయుల పోరాటాన్ని గుర్తించినట్లయింది. – పితాని త్రినాథరావు, జిల్లా చైర్మన్, అమరావతి జేఏసీ, కాకినాడ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటన హర్షణీయం.. రాష్ట్రాల పరిధిలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేసుకోవచ్చునని కేంద్రం ప్రభుత్వం చెబుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన చేతుల్లో లేదని చెప్పడం ఆశ్ఛర్యంగా ఉంది. ప్రతిపక్ష నేత జగన్ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తాననడం హర్షణీయం. – చింతా నారాయణ మూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ -
సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలివ్వండి
సాక్షి, హైదరాబాద్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ఉద్యోగులకు డీఏ బకాయిలను దసరా పండుగకు కాకుండా క్రిస్మస్కు ఇస్తామనడం సరికాదని, వారికి వెంటనే బకాయిలను చెల్లించాలని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌కు టీటీఎఫ్ విజ్ఞప్తి చేసింది. బుధవారం ఈ మేరకు ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఈటలను టీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునందన్ కలసి సమస్యను వివరించారు. ఇతర ఉద్యోగులకు ఇచ్చినట్లుగా సీపీఎస్ ఉద్యోగులకు కూడా నగదు రూపంలో ఇప్పుడే డీఏ బకాయిలను ఇవ్వాలని కోరారు. స్పందించిన మంత్రి.. ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావుతో మాట్లాడి సవరణ ఉత్తర్వులు విడుదల చేయిస్తామని హామీ ఇచ్చారు. -
సీపీఎస్ విధానం దుర్మార్గపు చర్య
-
సీపీఎస్ విధానం దుర్మార్గపు చర్య
► ఉద్యోగ సంఘాల నేతల మండిపాటు ► రద్దు చేసే వరకు ఉద్యమం ఆపేది లేదని స్పష్టం సాక్షి, హైదరాబాద్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం కొనసాగించాలని సచివాలయ ఉద్యోగ సంఘం నేతలు, ఉద్యోగులు డిమాండ్ చేశారు. సామూహిక సెలవు, నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం సచివాలయ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో సచివాలయం ‘డి’బ్లాక్ నుంచి ‘సి’బ్లాక్ వరకు నిరసన తెలిపారు. సీపీఎస్‌ను కేంద్రం రద్దు చేసి పాతపెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే దాకా ఉద్యమం ఆపేదిలేదని స్పష్టం చేశారు. 2004 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేషనల్ స్కీం పేరుతో పెట్టిన సీపీఎస్ విధానం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. సీపీఎస్ వల్ల ఉద్యోగ కుటుంబాలకు జీవిత భద్రత లేకుండా పోతుందన్నారు. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానమే అమలవుతుందని గుర్తు చేశారు. ఉమ్మడి ఏపీ అందరికంటే ముందు ఏకపక్షంగా సీపీఎస్ విధానాన్ని అమల్లోకి తెచ్చి ఉద్యోగు లకు అన్యాయం చేసిందని ఆరోపించారు. దీనిపై 14 ఏళ్లుగా ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమ న్నారు. నిరసన కార్యక్రమంలో తెలంగాణ సచివాలయం సంఘం ప్రధాన కార్యదర్శి యూసుబ్ మియా, కోశాధికారి ఆర్ . రాజేశ్, ఉపాధ్యక్షులు మంగమ్మ, లింగమూర్తి, రాజే శ్వర్‌రెడ్డి , కార్యదర్శులు రమేశ్, నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పెన్షన్.. టెన్షన్!
♦ గందరగోళంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ♦ ఆందోళనలో 1.2 లక్షల మంది ఉద్యోగులు ♦ నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల సామూహిక సెలవు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2004 సెప్టెంబర్ 1 నుంచి అమల్లో ఉన్న కాంట్రిబ్యుటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) గందరగోళంగా మారింది. పాత పెన్షన్ విధానంలో ఉన్న ప్రయోజనాలేవీ వర్తించకపోగా.. ఉన్న ప్రయోజనాలూ సరిగా అందని దుస్థితి నెలకొంది. రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వం నుంచి అందే లాభాలేమీ పెద్దగా లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఉద్యోగులు సీపీఎస్ కింద చెల్లించిన సొమ్ముకు సంబంధించిన ఖాతాలు, లెక్కలు సరిగా లేకపోవడం, పెన్షన్ ఫండ్‌లో ఉన్న సొమ్ముకు కనీస వడ్డీ కూడా అందని పరిస్థితి ఉండడం సమస్యగా మారింది. దీంతో అసలు సీపీఎస్‌ను రద్దు చేయాలని.. తిరిగి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం సామూహిక సెలవు పెట్టడం తోపాటు నిరసన చేపట్టనున్నారు. సీపీఎస్‌తో ప్రయోజనం అంతంతే! కేంద్ర ప్రభుత్వం 2004 సెప్టెంబర్ 1 నుంచి సీపీఎస్‌ను అమల్లోకి తెచ్చింది. దాని ప్రకారం... పెన్షన్ కోసం ఉద్యోగి తన వాటాగా వేతనంలో 10 శాతం చెల్లిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం మరో 10 శాతం చెల్లిస్తుంది. ఈ మొత్తం కేంద్ర ప్రభుత్వ అధీనంలోని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) వద్ద జమవుతూ ఉంటుంది. ఉద్యోగి రిటైరైనపుడు తన ఖాతాలో ఉన్న సొమ్ములో 60 శాతాన్ని ఒకేసారి వెనక్కి తీసుకోవచ్చు. మిగతా 40 శాతం సొమ్మును పీఎఫ్ఆర్డీఏ తమ వద్దే ఉంచుకుని.. దానిని స్టాక్మార్కెట్లో పెట్టుబడులుగా పెడుతుంది. ఆ సొమ్ము నెట్ అసెట్ వ్యాల్యూ ప్రకారం లెక్కించి ఉద్యోగికి పెన్షన్‌ను ఇస్తుంది. వేల మంది ఖాతాలు గందరగోళమే..! రాష్ట్రంలో 1.2 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు ఉంటే.. అందులో దాదాపు 40 శాతం మంది పెన్షన్ ఖాతాల్లో సొమ్ము ఎంత జమ అయిందో తెలియని పరిస్థితి నెలకొంది. 2004 నుంచే సీపీఎస్‌ను అమలు చేస్తున్నా.. 2013లో కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ఆర్డీఏ చట్టం చేసింది. ఈ మధ్య కాలంలో నియమితులైన దాదాపు 50 వేల మంది ఉద్యోగుల ఖాతాల నిర్వహణ గందరగోళంగా మారింది. సీపీఎస్ పరిధిలో లేని త్రిపుర, బెంగాల్ వాస్తవానికి త్రిపుర, బెంగాల్ రాష్ట్రాలు ఇప్పటికీ సీపీఎస్ పరిధిలో లేవని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాలు కూడా సీపీఎస్ రద్దు కోసం కమిటీలను వేశాయని, మన రాష్ట్రంలోనూ సీపీఎస్ రద్దుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నాయి. అయితే సీపీఎస్ రద్దు, ఫ్యామిలీ పెన్షన్ వర్తింపు, పాత పెన్షన్ విధానం అమలు అంశాలు కొంతమేర కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్నాయి. గ్రాట్యుటీ అంశం రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంది. ఈ నేపథ్యంలో సీపీఎస్ ఉద్యోగులకు వెంటనే గ్రాట్యుటీ సదుపాయాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. పాత పెన్షన్ విధానంలో ప్రయోజనాలెన్నో రాష్ట్రంలో 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం వర్తిస్తుంది. దాని ప్రకారం.. ఆ ఉద్యోగి పదవీ విరమణ రోజు నాటికి ఉన్న మూల వేతనంలో సగం మేర సొమ్ము ఆ తర్వాత నెలనెలా పెన్షన్‌గా అందుతుంది. ఇందుకు ఉద్యోగి ఎలాంటి వాటా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక ఆ ఉద్యోగి మరణిస్తే.. వారిపై ఆధారపడిన కుటుంబానికి కుటుంబ పెన్షన్ వస్తుంది. గరిష్టంగా రూ.12 లక్షల వరకు గ్రాట్యుటీ అందజేస్తారు. జీపీఎఫ్‌లో దాచుకున్న సొమ్ము వడ్డీతో సహా వస్తుంది. కానీ 2004 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టం (సీపీఎస్)లో ఈ ప్రయోజనాలేవీ ఉండవు. నిరసనలు చేపడతాం ‘‘సీపీఎస్ రద్దు కోసం జాక్టో తరఫున సామూహిక సెలవు పెడుతున్నాం. దానితోపాటు నిరసన కార్యక్రమాలు చేపడతాం..’’ – భుజంగరావు, ఎస్టీయూ అధ్యక్షుడు సీపీఎస్ నుంచి వైదొలగవచ్చు ‘‘త్రిపుర, బెంగాల్ రాష్ట్రాలు అసలు సీపీఎస్‌లోనే లేవు. కాబట్టి తెలంగాణ కూడా సీపీఎస్ నుంచి వైదొలిగే వీలుంది. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ తరఫున జిల్లా కేంద్రాల్లో సామూహిక ధర్నాలు నిర్వహిస్తాం..’’ – చావ రవి, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి వెంటనే గ్రాట్యుటీ ఇవ్వాలి ‘‘సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందే. దీనిపై కేంద్రంతో వెంటనే మాట్లాడాలి. గ్రాట్యుటీ ఇచ్చే ఆలోచన చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం..’’ – కారెం రవీందర్‌రెడ్డి, టీఎన్జీవో అధ్యక్షుడు సీపీఎస్ రద్దు చేయాల్సిందే.. ‘‘సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందే. తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ తరఫున ఇందుకోసం నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం..’’ – వి.మమత, టీజీవో అధ్యక్షురాలు -
రేపు ఉద్యోగుల సామూహిక సెలవు
-
రేపు ఉద్యోగుల సామూహిక సెలవు
సీపీఎస్ రద్దు కోసం డిమాండ్ సాక్షి, హైదరాబాద్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్)ను రద్దు చేయాలని, పాత పెన్షన్ స్కీంను పునరుద్ధరించాలన్న డిమాండ్‌తో రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనబాట పట్టాయి. సీపీఎస్ ఉద్యోగ సంఘం పిలుపు మేరకు సెప్టెంబర్ 1న నిర్వహించనున్న మాస్ క్యాజువల్ లీవ్‌కు అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ నెల 28 నుంచే అన్ని జిల్లా కేంద్రాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నిరసన ర్యాలీలు, ధర్నాలు ప్రారంభించాయి. బుధవారం కూడా టీజీవో ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ర్యాలీలు చేశారు. ఈ నెల 31న అన్ని జిల్లా, డివిజన్ కేంద్రాల్లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన ర్యాలీలు, ధర్నాలు నిర్వహించేందుకు అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఏర్పాట్లు చేశాయి. సామూహిక సెలవుకు అన్ని ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు మద్దతు ప్రకటించాయి. జాక్టోలోని ఎస్టీయూ తదితర భాగస్వామ్య సంఘాలు నేరుగా మాస్ క్యాజువల్ లీవ్‌కు పిలుపునివ్వగా, టీటీజేఏసీలోని పీఆర్టీయూ–టీఎస్ తదితర సంఘాలు సీపీఎస్ పరిధిలోని ఉద్యోగులు మాస్ క్యాజువల్ లీవ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 1న మ«ధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులంతా మండల విద్యాధికారి కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొంది. ఇక ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీలోని యూటీఎఫ్ తదితర సంఘాలు సెప్టెంబర్ 1ని పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ జిల్లా కేంద్రాల్లో సామూహిక ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చాయి. ఈ ఆందోళనకు జూనియర్ లెక్చరర్ల సంఘం, డిగ్రీ గెజిటెడ్ అధ్యాపకుల సంఘం మద్దతు ప్రకటించాయి. తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీలోని టీజీవో, టీఎన్జీవో తదితర సంఘాలు సెప్టెంబర్ 1న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు చేపట్టాలని పిలుపునిచ్చాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పదవీ విరమణ తర్వాత వారి భరోసా, భద్రతకు విఘాతం కలిగేలా ఉన్న సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి, పాత పెన్షన్ విధానం అమల్లోకి తేవాలన్న ప్రధాన డిమాండ్‌తో దాదాపు అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు 1వ తేదీన పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం అయ్యాయి. ఇవీ ప్రధాన డిమాండ్లు.. – 1.2 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్యత్తుకు భద్రత లేని సీపీఎస్‌ను రద్దు చేయాలి. – సీపీఎస్ స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తేవాలి. – ప్రస్తుతం సీపీఎస్‌లో ఉన్న ఉద్యోగులందరికీ గ్రాట్యుటీ మంజూరు చేయాలి. – సీపీఎస్‌లోని ఉద్యోగి చనిపోతే వారి కుటుంబానికి పెన్షన్‌ను మంజూరు చేయాలి. -
సీపీఎస్ రద్దు రాజకీయ ఎజెండా కావాలి
– మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ పిలుపు –యూటీఎఫ్ ఆధ్వర్యంలో సీపీఎస్ రద్దు కోరుతూ సమావేశం భానుగుడి (కాకినాడ) : కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు రాజకీయ ఎజెండాగా మారిన రోజునే న్యాయం జరుగుతుందని ప్రముఖ ఎనలిస్ట్, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. దీనికి పూర్వపు పెన్షన్ విధానం అమలులో ఉన్న ఉద్యోగులూ మద్దతు తెలపకుంటే అసలుకే మోసం వచ్చే అవకాశం ఉందన్నారు. ఆదివారం కాకినాడ పైండా చలమయ్య కల్యాణ మండపంలో జిల్లా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో íసీపీఎస్ రద్దు కోరుతూ నిర్వహించిన సదస్సుకి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కరీంనగర్ జిల్లాలో ఒక ఉపాధ్యాయుడు మరణించగా వస్తున్న వేతనం రూ.30వేలయితే పాత పెన్షన్ విధానంలో రూ.15వేలు రావాల్సి ఉన్నా.. ప్రస్తుత విధానం కారణంగా కేవలం రూ.800 వస్తోందన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి డీఎస్ నకారా.. పెన్షన్ అనేది ప్రభుత్వం ప్రేమతో ఇచ్చే ఫలంకాదు. ఉద్యోగుల మానవ హక్కు అని స్పష్టం చేశారని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్సీగా పనిచేసినప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనం పెంపుతో చట్టం చేసిన విధానాన్ని తప్పుబట్టానన్నారు. సీపీఎస్‌లో ఉద్యోగుల వేతన సొమ్మును షేర్ మార్కెట్లో పెట్టే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారన్నారు. ఈ విధానాన్ని తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీస గ్యారంటీ లేకుండా అడ్డగోలుగా బిల్లు ఆమోదించిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలైనా దీన్ని సవరించాలన్నారు. అమెరికా, అర్జెంటీనాల్లో ఆర్థిక సంక్షోభం వస్తే కుప్పకూలిపోయింది, రోడ్డున పడ్డది పెన్షనర్లేనని, స్టాక్‌మార్కెట్ ద్వారా నష్టపోయిన వారేగాని లాభపడినవారు చరిత్రలో లేరన్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రాము సూర్యారావు, జిల్లా జేఏసీ కన్వీనర్ బూరిగ ఆశీర్వాదం, రాష్ట్ర ఉపాధ్యాయ జేఏసీ కన్వీనర్ ఐ.వెంకటేశ్వరరావు, యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డీవీ రాఘవులు, టి.కామేశ్వరరావు పాల్గొన్నారు. -
సీపీఎస్ రద్దే లక్ష్యంగా ఉద్యమం
విజయనగరంఅర్బన్: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేయించడమే లక్ష్యంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక (జెఏసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరావు పిలుపునిచ్చారు. యూటీఎఫ్ జిల్లా కమిటీ స్థానిక ఎన్జీవో భవనం సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ బ్యాంక్ షరతులకు తలొగ్గి 2004లో కాంగ్రెస్ పాలకులు ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారని, దాన్ని రద్దు చేయకుండా బీజేపీ కొనసాగించడం అన్యాయమన్నారు. ఉద్యోగి పదవీ విరమణ చేసిన తరువాత బతుకు భరోసా లేకుండా సీపీఎస్ విధానం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నేపథ్యంలో వచ్చినది కాబట్టి అదే రాజకీయ విధానంతోనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు ఎస్.మురళీమోహన్ అధ్యక్షతన జరిగిన సదస్సులో రాష్ట్ర సహాధ్యక్షురాలు కె.విజయగౌరి, కార్యదర్శి డి.రాము, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం.కృష్ణారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శేషగిరి, జిల్లా నాయకుడు ఎ.సత్యశ్రీనివాస్, జి.నిర్మల, పి.శ్రీనివాసరావు, ఈశ్వరరావు, వెంకటరావు, నాగరాజు, వివిధ మండలాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందే
ఢిల్లీలో నినదించిన 29 రాష్ట్రాల ప్రభుత్వోద్యోగులు జంతర్‌మంతర్ వద్ద మహా ధర్నా.. పెద్ద సంఖ్యలో హాజరైన టీఎన్జీవో, గెజిటెడ్ అధికారుల ఫోరం సభ్యులు సాక్షి, న్యూఢిల్లీ: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 29 రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులు ఢిల్లీలో కదంతొక్కారు. అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఇచ్చిన పిలుపు మేరకు జంతర్‌మంతర్ వద్ద మహా ధర్నా చేపట్టారు. ‘పెన్షన్ భిక్షకాదు.. ఉద్యోగుల హక్కు’అని నినదిస్తూ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి టీఎన్జీవో, గెజిటెడ్ ఆఫీసర్ల ఫోరం ఆధ్వర్యంలో సుమారు 2 వేల మంది ఉద్యోగులు పాల్గొన్నారు. కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలన్నీ ఒకే మాటతో నూతన పెన్షన్ విధానాన్ని ఉపసంహరించుకొనేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షుడు లీలాపత్ డిమాండ్ చేశారు. పెన్షన్ ఉద్యోగుల హక్కు..: దేవీ ప్రసాద్ టీఎన్జీవో గౌరవాధ్యక్షుడు దేవీ ప్రసాద్ మాట్లాడుతూ.. పెన్షన్ తీసుకోవడం ఉద్యోగుల హక్కు అని, ఈ ప్రయోజనానికి ప్రతిబంధకంగా మారిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఆయన కోరారు. సీపీఎస్ వల్ల ఉద్యోగ భద్రత, కుటుంబ భద్రత లేకుండా పోయిందని పేర్కొన్నారు. ఈ విధానం వల్ల ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబానికి ఎలాంటి గ్రాట్యుటీ లభించడం లేదని ఆరోపించారు. దీంతో ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పారు. సీపీఎస్ విధానం రద్దుకు తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని, దీన్ని అభినందిస్తున్నామన్నారు. ఉద్యమ స్ఫూర్తితో అన్ని రాష్ట్రాలను ఏకం చేస్తామని, కేంద్రం పార్లమెంటులో చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టేలా ఒత్తిడి తెస్తామని తెలిపారు. ధర్నాలో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్, గెజిటెడ్ ఆఫీసర్ల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జి.స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కె.శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పాత పెన్షన్ విధానం పునరుద్ధరణకు జైట్లీతో చర్చిస్తా: దత్తాత్రేయ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే విషయమై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో యూపీ ఎన్నికల అనంతరం చర్చిస్తానని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. అవసరమైతే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కూడా చర్చిస్తానని పేర్కొన్నారు. తనను కలసిన తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో ఆయన చర్చించారు. -
సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందే
► ఢిల్లీలో నినదించిన 29 రాష్ట్రాల ప్రభుత్వోద్యోగులు ► జంతర్‌మంతర్ వద్ద మహా ధర్నా.. ► పెద్ద సంఖ్యలో హాజరైన టీఎన్జీవో, గెజిటెడ్ ఉద్యోగలు ఫోరం సభ్యులు న్యూఢిల్లీ: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 29 రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులు ఢిల్లీలో కదంతొక్కారు. అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఇచ్చిన పిలుపు మేరకు జంతర్‌మంతర్ వేదికగా ‘పెన్షన్ భిక్షకాదు.. ఉద్యోగుల హక్కు’ అంటూ నినదిస్తూ పాతపెన్షన్ విధానాన్ని అమలు చేయాలని మహా ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి టీఎన్జీవో, గెజిటెడ్ ఆఫీసర్ల ఫోరం ఆధ్వర్యంలో సుమారు 2 వేల మంది ఉద్యోగులు పాల్గొన్నారు. కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలన్నీ ఒకే మాటతో నూతన పెన్షన్ విధానాన్ని ఉపసంహరించుకొనేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అఖిలభారత ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షుడు లీలాపత్ డిమాండ్ చేశారు. టీఎన్జీవో గౌరవాధ్యక్షుడు దేవీ ప్రసాద్ మాట్లాడుతూ.. పెన్షన్ తీసుకోవడం ఉద్యోగుల హక్కు అని, ఈ ప్రయోజనానికి ప్రతిబంధకంగా మారిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఆయన కోరారు. సీపీఎస్ విధానం వల్ల ఉద్యోగ భద్రత, కుటుంబ భద్రత లేకుండా పోయిందన్నారు. ఈ విధానం వల్ల ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబానికి ఎలాంటి గ్రాట్యుటీ లభించడం లేదన్నారు. దీని వల్ల ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ఇలా ఉద్యోగుల ప్రయోజనాలకు ప్రతిబంధకంగా మారిన సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విధానం రద్దుకు తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని, దీనిని అభినందిస్తున్నామన్నారు. ఉద్యమ స్ఫూర్తితో అన్ని రాష్ట్రాలను ఏకం చేస్తామని, కేంద్రం పార్లమెంటులో చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టేలా ఒత్తిడి తెస్తామన్నారు. ధర్నాలో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్, గెజిటెడ్ ఆఫీసర్ల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జి. స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కె. శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
సీపీఎస్ రద్దుకు నేడు ఢిల్లీలో ధర్నా
పెద్ద ఎత్తున ఢిల్లీ చేరుకున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు సాక్షి, న్యూఢిల్లీ: తమ ప్రయోజనాలకు ప్రతిబంధకంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 29 రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద గురువారం ధర్నాకు దిగనున్నారు. ధర్నా అనంతరం పార్లమెంటు వరకు ర్యాలీగా వెళ్లనున్నారు. ఈ నిరసన ప్రదర్శనకు తెలంగాణ ఎన్జీవో సంఘం, గెజిటెడ్ ఉద్యోగుల ఫోరం మద్దతు పలికాయి. ధర్నాలో పాల్గొనడానికి రెండు సంఘాల ఆధ్వర్యంలో ఉద్యోగులు ఇప్పటికే పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం ఇక్కడి తెలంగాణ భవన్లో టీఎన్జీవో సంఘం గౌరవాధ్య క్షుడు దేవీ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఉద్యోగ విరమణ తర్వాత ఉద్యోగుల హక్కు అయిన పెన్షన్ స్వీకరణకు ప్రతిబంధకంగా ఉన్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రంపై ఒత్తిడి తెస్తామని మంత్రి హరీశ్ రావు, ఎంపీ కవిత తదితరులు మద్దతు పలికారని పేర్కొన్నారు. సమావేశంలో సంఘం అధ్యక్షుడు కారం రవీందర్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
మాతృ సంఘాలతోనే సీపీఎస్ రద్దు
– నూతన సీపీఎస్ సంఘం ఆవిర్భావం తిరుపతి ఎడ్యుకేషన్ : ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన కాంట్రిబ్యూటరి పెన్షన్ స్కీమ్(సీపీఎస్) రద్దు మాతృ సంఘాల మద్దతుతోనే సాధ్యమని పలువురు పేర్కొన్నారు. తిరుపతిలోని టీపీపీఎం ఉన్నత పాఠశాలలో ఆదివారం చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, ప్రకాశం, తూర్పుగోదావరి, నెల్లూరు, కర్నూలు జిల్లాల వివిధ సంఘాల నాయకులతో నూతన సీపీఎస్ సంఘం తాత్కాలిక యాక్షన్ కమిటీ ఆవిర్భవించింది. ఇందులో రాయలసీమ నుంచి పీవీఆర్.నాయుడు, ప్రభాకర్, రవిశంకర్‌రెడ్డి, దేవానంద్, సమీర్, రమణ, మోహన్, దక్షిణ కోస్తాకు రత్తయ్య, మోజస్, విశ్వనాథ్, కృష్ణారావు, ఉత్తర కోస్తాకు బాలకృష్ణ, పట్టా శ్రీనివాస్, అదనపు బాధ్యులుగా రవికుమార్, లోకేష్, దేవరాజులు, డిల్లీ ప్రకాష్, గురుప్రసాద్, మాధవరెడ్డి, పుల్లారెడ్డి, జానకిరామయ్య, కరుణాకర్, రఘుపతిరెడ్డిలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన పెన్షన్ విధానం రద్దుకు అన్ని శాఖల మాతృ సంఘాలను కలుపుకుపోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. -
సీపీఎస్ అంతం.. ఉద్యోగుల పంతం
- కాకినాడలో కదం తొక్కిన ఉద్యోగులు - భారీ ప్రదర్శన, బహిరంగ సభ - సంఘటిత ఉద్యమం ఉద్ధృతానికి నేతల పిలుపు కాకినాడ సిటీ : కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు కాకినాడలో శనివారం కదం తొక్కారు. ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యాన జిల్లా నలుమూలల నుంచీ వివిధ శాఖల ఉద్యోగులు పెద్ద ఎత్తున కాకినాడ తరలివచ్చి మహాశాంతి ర్యాలీ నిర్వహించారు. తొలుత బాలాత్రిపురసుందరి అమ్మవారి ఆలయం నుంచి మెయిన్‌రోడ్, బాలాజీచెరువు సెంటర్, జీజీహెచ్, కలెక్టరేట్, రామారావుపేట మీదుగా మెక్లారిన్ స్కూల్ వరకూ భారీ ప్రదర్శన నిర్వహించారు. ‘సీపీఎస్ అంతం - ఉద్యోగుల పంతం, ఒకే సర్వీసుకు ఒకే పెన్షన్ ఉండాలి’ అంటూ పెద్ద పెట్టున నినదించారు. సీపీఎస్ విధానంవల్ల ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక హక్కులైన పెన్షన్, గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ వంటి సదుపాయాలను కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక, ఆర్థిక భద్రత లేని సీపీఎస్ విధానం రద్దు చేసేలా నిర్ణీత కాలపరిమితితో కూడిన కమిటీ వేయాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న డెత్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ సదుపాయం తమకు కూడా కల్పించాలని, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలను తక్షణం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ర్యాలీ అనంతరం మెక్లారిన్ హైస్కూల్ ఆవరణలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో తొలుత ఇటీవల మృతి చెందిన సీపీఎస్ ఉద్యోగులకు నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వీ యుగంధర్ మాట్లాడుతూ, 2004 జనవరి ఒకటి నుంచి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను అమలు చేస్తూ, 2004కు ముందు, తరువాత అంటూ ఉద్యోగులను ప్రభుత్వం విభజించి గోడ నిర్మించిందన్నారు. ఆ గోడను బద్దలుగొట్టేందుకు ఉద్యోగులు మరింత సంఘటితంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. పాత పెన్షన్ విధానాన్ని సాధించుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళదామని పిలుపునిచ్చారు. ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని, సీపీఎస్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) అనే తేడా లేకుండా ఉద్యోగులందరూ ఉద్యమిస్తే పాలకులు దిగి వస్తారని అన్నారు. ఉద్యమ కార్యాచరణ జిల్లాలో ఉద్యమ కార్యాచరణను సీపీఎస్ ఉద్యోగుల సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతా నారాయణమూర్తి ప్రకటించారు. సంఘ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 28న రక్తదాన శిబిరాలు, జూన్‌లో వారం రోజులు బ్లాక్‌డే పాటించాలని, జూలై మొదటి వారంలో ఉద్యోగులు వారి కార్యాలయాల ముందు ధర్నాలు చేపట్టాలని, ఆగస్ట్ 9న క్విట్ ఉద్యమం, సెప్టెంబర్ ఒకటిన చలో అమరావతి చేపట్టాలని వివరించారు. అలాగే తునిలో భిక్షాటన, అమలాపురంలో భారీ బైక్ ర్యాలీ, రాజమహేంద్రవరంలో సత్యాగ్రహ యాత్ర చేపట్టాలని నిర్ణయించామని, వీటి తేదీలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. సంఘ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర నాయకులు కె.మునిప్రసాద్, గుబ్బల శ్రీనివాస్, ఖాజా రహ్మతుల్లా, జిల్లా గౌరవాధ్యక్షులు తూతిక శ్రీనివాస విశ్వనాథ్, జిల్లా నాయకులు కె.వెంకటేష్, కె.రత్నాకర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి
జన్మభూమిలో గెజిటెడ్ అధికారుల వినతి తొండవరం(అంబాజీపేట) : కాంట్రిబ్యూటరీ పింఛ¯ŒS విధానాన్ని (సీపీఎస్) రద్దు చేసి పాత పింఛ¯ŒS పద్ధతిలో కొనసాగించాలని అంబాజీపేట ఎంపీడీఓ, జిల్లా ఏపీసీపీఎస్ సంక్షేమ సంఘ గౌరవ అధ్యక్షుడు తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ అన్నారు. అంబాజీపేట మండలం తొండరంలో మంగళవారం జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఎంపీడీఓ విశ్వనాథ్ ఆధ్వర్యంలో గెజిటెడ్ ఉద్యోగులు వినతిపత్రాన్ని ప్రజాప్రతినిధులకు అందజేశారు. విశ్వనాథ్ మాట్లాడుతూ ఈ విధానం అమలులోకి వచ్చాక 120 మంది ఉద్యోగులు మరణించగా ప్రభుత్వం పరంగా సాయం అందక కుటుంబాలు రోడ్డున పడ్డాయని జన్మభూమిలో ప్రజాప్రతినిధులకు వివరించారు. ఎంపీడీఓ విశ్వనాథ్, తహసీల్దారు ఏబీవీఎస్బీ శ్రీనివాస్, వైద్యాధికారి వి.పద్మదీపిక, ఏఓ ఎం.విజయలక్ష్మి, హౌసింగ్ ఏఈ డి.శ్రీనివాస్, ఆర్డబ్ల్యూఎస్ జేఈ సీహెచ్ చినబాబు వినతిపత్రాన్ని ఎంపీపీ దాసరి వీరవెంకట సత్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యుడు బొంతు పెదబాబులకు అందజేశారు. -
సమరశీల పోరాటాలకు సిద్ధమవుదాం
ఎమ్మిగనూరురూరల్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు సవాలుగా మారిన సీపీఎస్ రద్దు కోసం çసమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యాదర్శి ఎస్వీ రమణయ్య పిలుపునిచ్చారు. స్థానిక గా«ంధీనగర్‌లో డీటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులు పదవి విరమణ పొందిన తరువాత భవిష్యత్త్‌కు భద్రత లేని కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని అమలు చేయడం తగదన్నారు. ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంకు అనుకులంగా సంక్షేమ రంగంలో ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని అలోచిస్తున్నాయన్నారు. 2012లో ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ కింద 9565 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు కాగా నిబంధనలకు విరుద్ధంగా వాటిలో 155 మందికి హెచ్ఎంలుగా పదోన్నతలు కల్పించారన్నారు. దీంతో సాంకేతికంగా జీతాలు చెల్లింపు సమస్య వచ్చిందని చెప్పారు. జిల్లాలో పదోన్నతులు పొందిన 33 మంది హెచ్ఎంల జీతాల చెల్లింపునకు ట్రెజరీ అధికారులు నిరాకరిస్తే డీటీఎఫ్ కృషి ఫలితంగా ఏపీ ట్రిబ్యునల్ ఉత్తర్వులను అమలు చేస్తూ ప్రభుత్వం జీతాలు చెల్లిస్తోందన్నారు. అయితే సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఇందులో భాగంగా 2012 జనవరిలో జారీ చేసిన 3,4 జీఓలను సవరించి హెచ్ఎంల పోస్టులు మంజూరు చేయాలని కోరారు. సమస్యల పరిష్కారంకోసం 2017 జనవరి 11 న విజయవాడ(అమరావతి)లో ధర్నా తలపెట్టినట్లు చెప్పారు. రాష్ట్ర కార్యదర్శి కె.రత్నం, జిల్లా అ«ధ్యక్ష, కార్యదర్శులు కరె కృష్ణ, జి.తిమ్మప్ప నాయాకులు వీరన్న, గొట్ల చంద్రశేకర్, కిశోర్, రామన్న, వెంకట్రాముడు, ఈశ్వరరెడ్డి, వీరేష్ తదితరులు పాల్గొన్నారు. -
సీపీఎస్‌ను రద్దు చేయాలి
ఎమ్మెల్సీ రాముసూర్యారావు డిమాండ్ ఆత్రేయపురంలో ఉపాధ్యాయ సంఘాల ఆందోళన 29న చలో ఢిల్లీ ఆత్రేయపురం : ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పిచాలని ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రాముసూర్యారావు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఆధ్వర్యంలో ఆత్రేయపురంలో ఉపాధ్యాయ సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించి అధికారులకు వినతిపత్రాలు సమర్పించాయి. ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 29న చలో ఢిల్లీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 2004 సంవత్సరం సెప్టెంబర్ నుంచి విధుల్లో చేరిన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు సీపీఎస్ ప్రవేశపెట్టడంపై దేశవ్యాప్తంగా ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ అసంబద్ధ విధానాలతో ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ఆయన కోరారు. అసెంబ్లీలో పెన్షన్ భద్రతకు అనుకూలంగా తీర్మానం చేయాలని, పార్లమెంట్లో పీఎఫ్ , ఆర్డీఏలోని అంశాన్ని మార్పు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఉపాధ్యాయులపై పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తొలుత యూటీఎఫ్, ఎస్టీఎఫ్ఐల ఆధ్వర్యంలో ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ వరదా సుబ్బారావు, ఎంపీడీవో జెఏ ఝూన్సీ, ఎంఈవో లలితాకుమారికి వినతిపత్రాలను ఎమ్మెల్సీ చేతుల మీదుగా అందజేశారు. జిల్లా యూటీఎఫ్ కార్యదర్శి ఎస్.జ్యోతిబసు, మండల యూటీఎఫ్ అధ్యక్షుడు బీవీ రమణ, ప్రధాన కార్యదర్శి ఎస్వీఎస్ ప్రసాద్, సహ అధ్యక్షుడు ఎన్. రంగ మహాలక్ష్మి, అసోసియేట్ అధ్యక్షుడు కేడీవీ ప్రసాదరావు, కోశాధికారి ఎం.సురేష్‌బాబు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఫణికుమార్, జి.సురేష్‌లతో పాటు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సీపీఎస్ రద్దుకు కొవ్వొత్తుల ర్యాలీ
కాకినాడ సిటీ : రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలని కోరుతూ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నుంచి బాలాజీ చెరువు సెంటర్ వరకు అన్ని శాఖల సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి చింతా నారాయణమూర్తి మాట్లాడుతూ అతి దారుణమైన సామాజిక, ఆర్థిక భరోసా లేని లోపభూయిష్టమైన సీపీఎస్ విధానం వల్ల ఉద్యోగుల కుటుంబాలు వీధిన పడే పరిస్థితి దాపురించిందన్నారు. 2004 సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రారంభమైన ఈ సీపీఎస్ విధానంలో ఉన్న ఉద్యోగులలో ఇప్పటి వరకూ రాష్ట్రంలో 109 మంది చనిపోయారని, ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు అందలేదన్నారు. ప్రభుత్వం వెంటనే వారందరి కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనాలు అందజేయాలని, కుటుంబ పెన్షన్ వర్తింప చేయాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రాట్యుటీ సదుపాయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడు తూతిక విశ్వనా«థ్, జిల్లా కమిటీ ఆర్థిక కార్యదర్శి రత్నాకర్, ఉపాధ్యక్షుడు అలీమ్, సత్తిరాజు, భాస్కర్, కార్యదర్శి రమణమూర్తి, కాకినాడ నగర కమిటీఅధ్యక్షుడు జాన్ పాల్ పాల్గొన్నారు. -
సీపీఎస్ రద్దుకు జాతీయ స్థాయిలో పోరాటం
కర్నూలు సిటీ: ఉద్యోగులకు శాపంగా మారిన కాంట్రిబ్యూటరీ పింఛన్ విధానాన్ని రద్దు చేసేవరకు పోరాడతామని రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు షన్మూర్తి అన్నారు. స్థానిక ఎస్టీయూ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఎస్ వల్ల ఉపాధ్యాయుడు చనిపోయినా, పదవి విరమణ పొందినా ఆర్థిక ప్రయోజనం అగమ్యగోచరంగా మారే అవకాశం ఉందన్నారు. ఈ విధానం రద్దు కోసం చేస్తున్న పోరాటాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా డీల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నాలు చేశామని, అయినా ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదన్నారు. జాతీయ అధికార, ప్రతిపక్ష పార్టీ దృష్టికి తీసుకెళ్లి పోరాటాలు చేస్తామని ప్రకటించారు. సర్వీస్ రూల్స్ సమస్య త్వరలోనే పరిష్కారం అయ్యే అవకాశం ఉందన్నారు. ఆదర్శ స్కూల్ టీచర్ల సమస్యలపై కూడా పోరాడతామన్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా ఇటీవలే ఎన్నికైన షన్మూర్తిని జిల్లా కమిటీ ఈ సందర్భంగా ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రసాద్‌రెడ్డి, తిమ్మన్న, గౌరవాధ్యక్షులు రమేష్, ట్రెజరర్ గోకారి తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మిగనూరు యార్డులోనే పత్తి కొనుగోలు
–వచ్చే వారం నుంచి సీసీఎస్ ద్వారా ప్రారంభం –మార్కెటింగ్‌శాఖ కమిషనర్ మల్లికార్జున రావు ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులో వెంటనే పత్తికొనుగోళ్లను ప్రారంభించాలని రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ కమిషనర్ మల్లికార్జునరావు ఆదేశించారు. ఆదివారం ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్‌ను ఆయన పరిశీలించారు. పత్తి రైతులకోసం ఏర్పాటు చేసిన టీఎంసీ యార్డు, యార్డు క్యాంటీన్లను ఆయన పరిశీలించారు. మార్కెట్ యార్డులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై యార్డు కార్యదర్శి జయలక్ష్మితో చర్చించారు. రైతుల కోసం క్యాంటీన్లో ఫాస్టుఫుడ్ తరహాలో సేవలు, ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు, మార్కెట్ ప్రహరీ గోడ నిర్మాణం ,యార్డులో బ్యాంక్ సేవలు అందించాలని చెప్పారు. జీరో వ్యాపారాలపై నిఘా పెంచాలని అధికారులను ఆదేశించారు. రైతు బజారు ఏర్పాటుకు స్థల పరిశీలన చేపట్టాలని సూచించారు.అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వచ్చే వారం నుంచి రాష్ట్రంలోని 43మార్కెట్లలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లను చేపట్టాలని సూచించామన్నారు.బయట వ్యారులు రేట్లను తగ్గించినప్పుడు ప్రత్యామ్నాయంగా సీసీఐ ఉంటుందన్నారు. క్వింటాల్‌కు రూ.4,160 ప్రకారం ధర ఉంటుందన్నారు. గతంలో సీసీఐ కొనుగోళ్ల పేరుతో భారీ అక్రమాలు జరిగిన విషయం వాస్తవమేనని, దీనిపై ,ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రాయలసీమ జిల్లాలో ఉల్లిపంటను అధికంగా సాగుచేశారని, కిలో రూ.6కు తగ్గకుండా కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టామన్నారు. అనంతరం కమిషన్ మర్చంట్స్ ఉరుకుందయ్యశెట్టి, యూటి శంకర్,ప్రతాప్ కిట్టు, శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మార్కెట్లో టెండర్‌ఫారాలు సరిగ్గా లేవని, బ్యాంక్ సౌకర్యాలు కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏడీఎం సత్యనారాయణ చౌదరీ,సెక్రటరీ జయలక్ష్మి, డీఈఈ సుబ్బారెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ సుందరం, తదితరులు పాల్గొన్నారు. చైర్మెన్‌డుమ్మా: మార్కెట్ కమిషనర్ మల్లికార్జునరావు ఎమ్మిగనూరు మార్కెట్ పరిశీలనకు వస్తున్నట్లు సమాచారం రావటంతో చైర్మెన్ సంజన్న ముఖం చాటేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు,మార్కెట్‌యార్డు సిబ్బందిని వేధించటం, ప్రతి పనిలో కమీషన్ల కోసం ఇబ్బంది పెట్టడం తదితర వాటిపై కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తారనే నెపంతో సంజన్న ముఖం చాటేసినట్లు కమీషన్ ఏజెంట్లు చర్చించుకోవటం గమనార్హం. -
సీపీఎస్ రద్దయ్యేంత వరకు ఉద్యమం
– ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) రద్దయ్యేంత వరకు ఉద్యమిస్తామని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మన్న పేర్కొన్నారు. సలాంఖాన్ ఎస్టీయూ భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తలసమావేశంలో వారు మాట్లాడారు. సెప్టెంబర్‌లో సీపీఎస్‌రద్దు కోసం ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర భారీ ధర్నా నిర్వహించినట్లు చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి పది లక్షల మంది ఉపాధ్యాయుల వినతిపత్రాలు సమర్పించినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు గ్రాట్యూటీ చెల్లించుటకు ఒప్పుకుందని, ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే గ్రాట్యూటీ చెల్లింపు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరెడ్డి, నాయకులు ఎంఎండీ షఫీ, సుబ్బారాయుడు, ప్రసాదరావు, టీకీ జనార్దన్ పాల్గొన్నారు. -
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
కరీంనగర్‌ఎడ్యుకేషన్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని కోరుతూ గురువారం జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్‌కు పీఆర్టీయూ తెలంగాణ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చోల్లేటి శ్రీనివాస్, పాతూరి రాజిరెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 1, 2014 నుంచి సీపీఎస్ పెన్షన్ విధానం అమల్లోకి వచ్చిన సందర్భంగా బ్లాక్‌డేగా పాటిస్తూ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గోనే శ్రీనివాస్, కార్యదర్శిసత్యనారాయణ పాల్గొన్నారు. సీపీఎస్ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చీటి భూపతిరావు ఆధ్వర్యంలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సీపీఎస్ ఉద్యోగ సంఘం నాయకులు పాల్గొన్నారు. -
సీపీఎస్‌పై అశోక్‌బాబు వ్యాఖ్యలు సరికాదు
చిలకడపూడి : ఏపీ ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు సీపీఎస్‌కు వ్యతిరేకంగా ఉద్యోగులు చేస్తున్న పోరాటంపై చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా నాయకులు పి సత్యనారాయణ, శోభన్‌బాబులు ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. సీపీఎస్ విధానం కారణంగా ఉద్యోగులు నష్టపోతున్నారని దీనిపై సెప్టెంబరు 1వ తేదీన విజయవాడలో శాంతి ర్యాలీ నిర్వహించనున్నామన్నారు. దీనికి మద్దతు పలకాలని ఉద్యోగులు సమాయత్తం అవుతుంటే అశోక్‌బాబు చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయన్నారు. శాంతి ర్యాలీ, మహాసభకు ఎన్జీవో నాయకులు సహకరించాలని వారు కోరారు. -
‘సీపీఎస్’ను రద్దు చేయాలి
సెప్టెంబర్ ఒకటిన విజయవాడలో సభ ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు గిరీష్ డిమాండ్ విజయవాడ(గాంధీనగర్) : రాజ్యాంగ వ్యతిరేకమైన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని, పాత విధానం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీసీపీఎస్ఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు ఎం.గిరీష్ డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 57 శాఖల్లో 1.64 లక్షల మంది ఉద్యోగులు సీపీఎస్ విధానంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీపీఎస్ విధానంపై పోరాటం చేయడం సరికాదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు ప్రకటనలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏపీసీపీఎస్ఈఏ మీడియా కమిటీ కన్వీనర్ సీహెచ్ కష్ణారావు మాట్లాడుతూ సెప్టెంబర్ ఒకటిన విజయవాడ జింఖానా మైదానంలో సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉద్యోగ– ఉపాధ్యాయుల సమస్యలపై అశోక్‌బాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సభకు హాజరుకావాలని కోరారు. సభకు ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సీఎం దాసు పాల్గొన్నారు. -
‘సీపీఎస్’ను రద్దు చేయాలని వినతి
మచిలీపట్నం (చిలకలపూడి) : రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మీర్జా జైగం అబ్బాస్ కోరారు. ఈ మేరకు ఆయన గురువారం మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావుకు వినతిపత్రాలు అందజేశారు. 2004, సెప్టెంబర్ ఒకటో తేదీన తర్వాత ఉద్యోగం పొందిన వారికి నూతన పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు. దీనివల్ల రివైజ్డ్ పెన్షన్ రూల్స్–1980 ద్వారా పొందుతున్న పెన్షన్, కుటుంబ పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యూటేషన్, పీఎఫ్ సౌకర్యాలు రద్దయ్యాయని వివరించారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు బీవీ మల్లికార్జునరావు, ఉపాధ్యక్షుడు అబ్దుల్ వహీద్ పాల్గొన్నారు. -
సీపీఎస్ విధానం రద్దు చేయాలి
నల్లగొండ టూటౌన్ : సీపీఎస్ విధానం రద్దు చేసి, పాత పెన్షన్ పద్ధతిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం.రాజశేఖర్‌రెడ్డి మాట్లాడారు. సీపీఎస్ విధానం ఉద్యోగుల పాలిటశాపంగా మారిందన్నారు. సీపీఎస్ ద్వారా వసూలైన డబ్బులు షేర్ మార్కెట్లో పెట్టడం వల్ల అది కార్పొరేట్లకు ఉపయోగపడే విధంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల సైదులు, పి.వెంకటేశం, రామలింగయ్య, రాజశేఖర్, వీరాచారి, ఆంజనేయులు, సైదులు, రామారావు, సతీశ్, యాదయ్య, నరేశ్, సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీపీఎస్ విధానం రద్దు చేయాలి
నల్లగొండ టూటౌన్ : సీపీఎస్ విధానం రద్దు చేసి, పాత పెన్షన్ పద్ధతిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం.రాజశేఖర్‌రెడ్డి మాట్లాడారు. సీపీఎస్ విధానం ఉద్యోగుల పాలిటశాపంగా మారిందన్నారు. సీపీఎస్ ద్వారా వసూలైన డబ్బులు షేర్ మార్కెట్లో పెట్టడం వల్ల అది కార్పొరేట్లకు ఉపయోగపడే విధంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల సైదులు, పి.వెంకటేశం, రామలింగయ్య, రాజశేఖర్, వీరాచారి, ఆంజనేయులు, సైదులు, రామారావు, సతీశ్, యాదయ్య, నరేశ్, సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీపీఎస్‌తో ఉద్యోగులకు అంధకారమే
– రద్దు చేయాలంటూ సెప్టెంబర్ 1న ర్యాలీ, సభ గాంధీనగర్: రాజ్యాంగ వ్యతిరేకమైన, లోపభూయిష్టమైన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని (సీపీఎస్)ను రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 1న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏపీసీపీఎస్ఈఏ) రాష్ట్ర ఉపాధ్యక్షులు సిఎం దాస్ తెలిపారు. సెప్టెంబర్ 1న ఏలూరు రోడ్డు నుంచి జింఖానా మైదానం వరకు శాంతి ర్యాలీ నిర్వహిస్తామని, అనంతరం మహాసభ జరుగుతుందని ఆయన తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీపీఎస్ వల్ల 2004 తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులు గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్‌ను కోల్పోవడమే కాకుండా దాచుకున్న సొమ్ము షేర్‌మార్కెట్ లో పెట్టి ఉద్యోగుల భవిష్యత్‌ను అంధకారంలో నెడుతున్న ఈ విధానాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలన్నారు. సీపీఎస్‌ను రద్దుచేసి పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ మహాసభ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు పార్థసారధి, గుంటూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి ప్రతాప్, సుదర్శనం, రత్తయ్య, కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి ఎం శ్రీను పాల్గొన్నారు.