
సాక్షి, హైదరాబాద్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ఉద్యోగులకు డీఏ బకాయిలను దసరా పండుగకు కాకుండా క్రిస్‌మస్‌కు ఇస్తామనడం సరికాదని, వారికి వెంటనే బకాయిలను చెల్లించాలని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌కు టీటీఎఫ్ విజ్ఞప్తి చేసింది.
బుధవారం ఈ మేరకు ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఈటలను టీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునందన్ కలసి సమస్యను వివరించారు. ఇతర ఉద్యోగులకు ఇచ్చినట్లుగా సీపీఎస్ ఉద్యోగులకు కూడా నగదు రూపంలో ఇప్పుడే డీఏ బకాయిలను ఇవ్వాలని కోరారు. స్పందించిన మంత్రి.. ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావుతో మాట్లాడి సవరణ ఉత్తర్వులు విడుదల చేయిస్తామని హామీ ఇచ్చారు.