
మేడ్చల్: జిల్లా బీజేపీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఎంపీ ఈటెల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవిని పొందేటప్పుడు ఉండే ఆరాటం.. పని చేసేటప్పుడు కూడా ఉండాలని బీజేపీ శ్రేణులకు చురకలంటించారు. పార్టీలో అటెండెన్స్ సిస్టం ఉండొద్దని, చేతులు ఎత్తే పద్ధతి ఉండొదన్నారు ఈటెల. ఇది ఇన్సల్ట్ చేసే పద్ధతి అని ఈటెల పేర్కొన్నారు.
‘ పదవుల్లో పొందిన వారు కష్టపడి పార్టీ కోసం పని చేయాలి. ఆరాటం అనేది రెండు విషయాల్లో ఉండాలి. ఒక వేళ పదవులు పొంది.. పని చేయకపోతే వారు రాజీనామా చేయండి. ఇందులో రాజీపడే ప్రసక్తే లేదు. డివిజన్ అధ్యక్షుడు ఆపైన నాయకులు 24 గంటలు అందుబాటులో ఉండాలి. ఆలా ఉండకపోతే పార్టీకి రాజీనామా చేయండి. ఈ రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమేనని చర్చ జరుగుతోంది. దానిని అందిపుచ్చుకునేందుకు మనమంతా సిద్ధంగా ఉండాలి’ అని ఈటెల పేర్కొన్నారు.