- ఢిల్లీ గల్లీలో దుర్గంధం చూస్తే అన్నం కూడా తినలేం
- ఢిల్లీ ప్రజల బతుకులు మారాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని ఈ తీర్పునిచ్చారు
- తొందర్లోనే తెలంగాణలో కూడా ఢిల్లీ తీర్పే రాబోతుంది
- ఎంపీ ఈటెల రాజేందర్
హైదరాబాద్: ఢిల్లీ ప్రజల బతుకులు మారాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని అక్కడ ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని ఎంపీ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ఈరోజు(శనివారం) ఈటెల రాజేందర్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మాట్లాడుతూ.. ఇది ఢిల్లీ(Delhi Assembly Elections 2025) ప్రజల స్పష్టమైన తీర్పు అని తేల్చిచెప్పారు.ఢిల్లీ గల్లీలో దుర్గంధం చూస్తే అన్నం కూడా తినలేం. ఢిల్లీ ప్రజల బతుకులు మారాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని ఈ తీర్పునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో మోదీకి 400 సీట్లు ఇవ్వనందుకు ప్రజలు బాధపడుతున్నారు.
అందుకే ఆ తర్వాత జరిగిన అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం అందిస్తున్నారు ప్రజలు. ఢిల్లీలో కేజ్రీవాల్ బాగుపడ్డాడు తప్ప.. పేద ప్రజల బతుకులు మారలేదు. గల్లీ గల్లీలో లిక్కర్ షాపులు ఏర్పాటు చేశారు. ఢిల్లీని తాగుబోతు రాష్ట్రంగా మార్చిన ఘనత కేజ్రీవాల్‌ది. లిక్కర్ స్కాం తో ఢిల్లీ ప్రజలు తలదించుకున్నారు. ఢిల్లీ ప్రజల చేతిలో కేజ్రీవాల్, ిసిసోడియాలు చావుదెబ్బ తిన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదు.
అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం చేసే సత్తా మోదీ(Narendra Modi)కే ఉందని ప్రజలు నమ్ముతున్నారు. తెలంగాణలో పదేళ్లు బీఆర్‌ఎస్ పాలన చూశాక వారికి పొరపాటున కూడా ఓటేయొద్దని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అతి తక్కువ కాలంలో వ్యతిరేకత మూటగట్టుకుంది. తొందర్లోనే ఢిల్లీ తీర్పు తెలంగాణలో రాబోతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలపై బీజేపీ మాత్రమే కొట్లాడుతుందని ప్రజలు నమ్ముతున్నారు’ అని ఈటెల పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment