సీపీఎస్‌తో ఉద్యోగులకు అంధకారమే
సీపీఎస్‌తో ఉద్యోగులకు అంధకారమే
Published Thu, Aug 18 2016 9:39 PM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM
– రద్దు చేయాలంటూ సెప్టెంబర్ 1న ర్యాలీ, సభ
గాంధీనగర్: రాజ్యాంగ వ్యతిరేకమైన, లోపభూయిష్టమైన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని (సీపీఎస్)ను రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 1న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏపీసీపీఎస్‌ఈఏ) రాష్ట్ర ఉపాధ్యక్షులు సిఎం దాస్ తెలిపారు. సెప్టెంబర్ 1న ఏలూరు రోడ్డు నుంచి జింఖానా మైదానం వరకు శాంతి ర్యాలీ నిర్వహిస్తామని, అనంతరం మహాసభ జరుగుతుందని ఆయన తెలిపారు.
స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీపీఎస్ వల్ల 2004 తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులు గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్‌ను కోల్పోవడమే కాకుండా దాచుకున్న సొమ్ము షేర్‌మార్కెట్ లో పెట్టి ఉద్యోగుల భవిష్యత్‌ను అంధకారంలో నెడుతున్న ఈ విధానాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలన్నారు. సీపీఎస్‌ను రద్దుచేసి పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ మహాసభ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు పార్థసారధి, గుంటూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి ప్రతాప్, సుదర్శనం, రత్తయ్య, కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి ఎం శ్రీను పాల్గొన్నారు.
Advertisement