peace rally
-
నందిగం సురేష్‌పై దాడిని నిరసిస్తూ శాంతి ర్యాలీ
సాక్షి, విజయవాడ : బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌పై టీడీపీ శ్రేణుల దాడిని నిరసిస్తూ విజయవాడలో శుక్రవారం శాంతి ర్యాలీని నిర్వహించారు. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ భారీ ర్యాలీలో పాల్గొన్న నేతలు ఎంపీపై దాడిని తీవ్రంగా ఖండించారు. అనంతరం వివిధ సంఘాలకు చెందిన ప్రతినిధులు మాట్లాడుతూ.. జేఏసే ముసుగులో చంద్రబాబు నాయుడు ప్రజాప్రతినిధులపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. దళితుడైన నందిగం సురేష్‌కు చంద్రబాబు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని అన్నారు. కాగా అమరావతిలో ఈ నెల 23న జరిగిన రథమహోత్సవంలో పాల్గొన్న ఎంపీ సురేష్‌పై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. (ఎంపీ సురేష్‌పై టీడీపీ నేతల దాడి) -
మారుతీరావుకు మద్దతుగా శాంతి ర్యాలీ
సాక్షి, నల్లగొండ : మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసులో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మారుతీరావుకు మద్దతుగా తల్లిదండ్రుల హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో శాంతిర్యాలీ నిర్వహించారు. స్థానిక వాసవీభవన్ నుంచి జిల్లా జైల్ వరకు ర్యాలీ నిర్వహించారు. జైల్లో మారుతీరావుని కలిసేందుకు ములాఖాత్ కోరగా అందుకు పోలీస్ అధికారులు నిరాకరించారు. జైల్లో ఉన్న మారుతీరావు సోదరుడు శ్రవణ్‌ను ములాఖాత్ పై కలిసారు. ఆ తర్వాత కలెక్టర్, ఎస్పీలను కలిసి వేర్వేరుగా వినతిపత్రాలను అందజేసారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ప్రణయ్ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. విగ్రహం ఏర్పాటు వల్ల భావిసమాజానికి చెడుసంకేతాలు వెళతాయన్నరు.ఎస్సీ అట్రాసిటీ కేసు చెల్లదని మేజర్ అయినప్పటికీ ప్రేమ వివాహల్లో తల్లిదండ్రుల అంగీకారం ఉండేలా చట్ట సవరణ చేయాలని కోరారు. కార్యక్రమంలో యామ మురళి,రాజు, జనార్దన్, సురేందర్, భిక్షపతి, ఈశ్వర్, శ్ర్రీను, కోటగిరి దైవాదీనం, శేఖర్ పాల్గొన్నారు. ప్రణయ్ విగ్రహం పెట్టొద్దని ధర్నా మిర్యాలగూడ : పట్టణ నడిబొడ్డున ఇటీవల హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్ విగ్రహం పెట్టొద్దని వ్యాపారులు సోమవారం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పెరుమాళ్ల ప్రణయ్ హత్యకు గురికావడం చాలా బాధాకరమైన విషయమన్నారు. కానీ పట్టణ నడిబొడ్డున ప్రణయ్ విగ్రహం పెడితే భవిష్యత్‌లో యువత అదేబాటలో నడుస్తారని భయపడుతున్నామని ఆందోళనవ్యక్తం చేశారు. అతను చేసిన త్యాగాలు ఉంటే విగ్రహం ప్రతిష్ఠించాలని, ఇలాంటి వారికి నడిరోడ్డుపై విగ్రహాలు పెడితే మహానుభావులకు చిన్నచూపుగా ఉంటుందన్నారు. అనంతరం ప్రణయ్ విగ్రహ ప్రతిష్ఠను ఆపాలని ఆర్డీఓ జగన్నాధరావుకు వినతిపత్రం అందేశారు. కార్యక్రమంలో సమీఖాద్రి, సత్యనారాయణ, శ్రీనివాస్, యాదగిరి, రాములు, నాగేందర్, కిష్టయ్య, వెంకటేశ్వర్లు, ఫయాజ్, సైదయ్య ఉన్నారు. ప్రణయ్ కుటుంబానికి పరిహారం వర్తించదు నల్లగొండ టూటౌన్ : మిర్యాలగూడలో ఇటీవల హత్యకు గురైన ప్రణయ్‌కు షెడ్యూల్ క్యాస్ట్‌కు వర్తించే వాటిని ఇవ్వవద్దని కోరుతూ తెలంగాణ మాల యువసేన రాష్ట్ర అధ్యక్షుడు గోలి ప్రభాకర్ సోమవారం కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రణయ్ ఎస్సీ కాదని, అతని కుటుంబం క్రిష్టియన్ అని తెలిపారు. ప్రణయ్ అంత్యక్రియలు క్రైస్తవ ఆచారం ప్రకారం నిర్వహిం చారని కలెక్టర్‌కు వివరించారు. ప్రణయ్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇల్లు తదితర వాటిని ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ఇచ్చే పరి హారం అతని కుటుంబానికి వర్తించదని పేర్కొన్నారు. చదవండి: అమృతను చట్టసభలకు పంపాలి అమృతకు వ్యవసాయభూమి, డబుల్ బెడ్రూం ఇల్లు ప్రణయ్ విగ్రహం: కేటీఆర్ అనుమతి ఇవ్వాలి! -
సునయన శాంతి ర్యాలీ
హూస్టన్: అమెరికాలో జాత్యాహంకార దాడిలో హత్యకు గురైన తెలుగు సాఫ్ట్వేర్ ఇంజినీర్ కూచిభొట్ల శ్రీనివాస్ భార్య సునయన ఆయన సహోద్యోగులతో కలసి హూస్టన్‌లో శాంతి ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం కూచిభొట్ల 34వ పుట్టిన రోజు సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. కూచిభొట్ల పనిచేసిన కంపెనీ గార్మిన్ నుంచి హత్యకు గురైన బార్ వరకు సుమారు 3 కి.మీ మేర ఈ యాత్ర సాగింది. -
కరుణాయముడు యేసు
జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ కర్నూలు (టౌన్): కరుణామయుడు యేసు ప్రభువని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. ఈస్టర్ పండగ పురస్కరించుకొని స్థానిక స్టాంటన్ చర్చి ఆవరణలో రన్‌ఫర్ జీసస్ పేరుతో నిర్వహిస్తున్న రన్‌ను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. శాంతికి చిహ్నంగా గాలిలోకి పావురాలను, బెలూన్లను వదిలారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. శత్రువులను సైతం ప్రేమించాలన్న క్రీస్తు మాటాలను క్త్రెస్తవులు ఆచరించడం అభినందనీయమన్నారు. మైనార్టీ వేల్ఫేర్ అధికారి మస్తాన్ వలీ మాట్లాడుతూ.. 236 దేశాల్లో 750 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే క్త్రెస్తవులు అత్యధికంగా ఉన్నారన్నారు. సిలువ వేసి మరణానికి కారుకులైన వారిని సైతం క్షమించమని దేవున్ని వేడుకున్న క్రీస్తు క్షమాగుణాన్ని కలిగి ఉన్నప్పుడే ప్రపంచశాంతి ప్రజ్వరిల్లుతుందన్నారు. రన్ ఫర్ జీసస్లో కర్నూలు క్త్రెస్తవులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రన్ స్థానిక స్టాంటన్ చర్చి నుంచి ్రప్రారంభమై కలెక్టరేట్ మీదుగా సి. క్యాంపు ప్రార్థన మందిరం వరకు సాగింది. పాస్టర్ల ప్రార్థనలతో రన్‌ను ముగించారు. పాస్టర్లు రెవరెండ్ సజీవన్, జాన్సన్, విక్టర్ ఇమ్మానియేలు, కార్యనిర్వహణ కార్యదర్శి డి.సుధీర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రపంచ శాంతి కోసం కృషి చేయాలి
పులివెందుల టౌన్ : ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుతూ మానవత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నలంద పాఠశాల విద్యార్థులతో కలిసి శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి స్థానిక మహాత్మగాంధీ విగ్రహం నుంచి ర్యాలీ ప్రారంభించారు. విద్యార్థులు ఫ్లకార్డులు చేతబూని ఉగ్రవాదం నశించాలని.. ప్రపంచశాంతి వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ పూలంగళ్ల సర్కిల్ వరకు ర్యాలీగా వచ్చి అక్కడ మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మానవతా విలువలు తరిగిపోతున్నాయన్నారు. ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ప్రజలు తమ వంత సహకారం అందజేయాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో మానవత స్వచ్ఛద సంస్థ చైర్మన్ సాంబశివారెడ్డి, కో చైర్మన్ వరప్రసాద్, పట్టణాధ్యక్షుడు డీవీ కొండారెడ్డి, రాంగోపాల్‌రెడ్డి, థామస్‌రెడ్డి, మాజీ ఓఎస్డీ చంద్రశేఖరరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. -
సీపీఎస్‌తో ఉద్యోగులకు అంధకారమే
– రద్దు చేయాలంటూ సెప్టెంబర్ 1న ర్యాలీ, సభ గాంధీనగర్: రాజ్యాంగ వ్యతిరేకమైన, లోపభూయిష్టమైన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని (సీపీఎస్)ను రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 1న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏపీసీపీఎస్ఈఏ) రాష్ట్ర ఉపాధ్యక్షులు సిఎం దాస్ తెలిపారు. సెప్టెంబర్ 1న ఏలూరు రోడ్డు నుంచి జింఖానా మైదానం వరకు శాంతి ర్యాలీ నిర్వహిస్తామని, అనంతరం మహాసభ జరుగుతుందని ఆయన తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీపీఎస్ వల్ల 2004 తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులు గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్‌ను కోల్పోవడమే కాకుండా దాచుకున్న సొమ్ము షేర్‌మార్కెట్ లో పెట్టి ఉద్యోగుల భవిష్యత్‌ను అంధకారంలో నెడుతున్న ఈ విధానాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలన్నారు. సీపీఎస్‌ను రద్దుచేసి పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ మహాసభ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు పార్థసారధి, గుంటూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి ప్రతాప్, సుదర్శనం, రత్తయ్య, కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి ఎం శ్రీను పాల్గొన్నారు. -
వేములవాడలో ముస్లింల శాంతి ర్యాలీ
ఉగ్రవాదుల దాడులకు నిరసనగా వేములవాడ పట్టణంలో వేములవాడ ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఉగ్రదాడులను అందరూ ఏకతాటిపై ఖండించాల్సిన అవసరముందని,హింసతో సాధించేదేమీ లేదని, ప్రజలందరూ సోదరభావంతో మెలగాలని ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న పలువురు మతపెద్దలు అన్నారు. -
హైదరాబాద్ విద్యార్థుల శాంతిర్యాలి
-
హర్షవర్థన్ మృతికి సంతాపంగా శాంతి ర్యాలీ
-
హర్షవర్థన్ మృతికి సంతాపంగా శాంతి ర్యాలీ
హైదరాబాద్ : సీనియర్ విద్యార్థి దాడిలో మృతి చెందిన హర్షవర్ధన్‌రావు మృతికి సంతాపంగా సోమవారం విద్యార్థులు శాంతి ర్యాలీ చేపట్టారు. విద్యార్థినిని ర్యాగింగ్ చేయొద్దన్న పాపానికి హనుమాన్ టేకిడీలోని ప్రగతి మహావిద్యాలయ కళాశాలలో రాంకోఠికి చెందిన హర్షవర్థన్‌పై సతీష్ కోడ్కర్ అనే విద్యార్థి దాడి చేయటంతో హర్షవర్థన్ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా హర్షవర్థన్ అంతిమ యాత్రలో నిన్న వందలాదిమంది విద్యార్థులు, బంధువులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం వైఖరిపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కళాశాల గేట్లు తోసుకొని లోపలికి దూసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కళాశాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. విద్యార్థి మృతి పట్ల తమకు ఆవేదన, ఆందోళన ఉందని కళాశాల అధ్యాపకులు తెలిపారు. కాగా హర్షవర్థన్‌పై దాడి చేసి అతడి మృతికి కారణమైన సీనియర్ విద్యార్థి సతీష్ కోడ్కర్ను సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అతడిని రహస్య ప్రాంతాలకు తరలించి విచారిస్తున్నట్లు తెలిసింది. అయితే సతీష్ అరెస్ట్‌ను పోలీసులు ధ్రువీకరించలేదు. నిందితుడిని ఇవాళ లేదా మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. -
తెలంగాణను అడ్డుకుంటే ఊరుకోం
వరంగల్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటే ఊరుకునేది లేదని విద్యుత్ ఉద్యోగులు హెచ్చరించారు. ఎన్పీడీసీఎల్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవా రం సిబ్బంది నగరంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించా రు. కార్పొరేట్ కార్యాలయం పక్కన ఉన్న విద్యుత్ గెస్ట్‌హౌస్ నుంచి ప్రారంభమైన ర్యాలీ కళాకారుల ఆట పాటలు, డప్పు చప్పుళ్ల మధ్య కొనసాగింది. ఈ సందర్భంగా సీమాంధ్ర నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు తరలిరావడంతో విద్యుత్ భవన్ నుంచి అమరవీరుల స్థూపం వరకు ట్రాఫిక్ స్తంభించింది. ర్యాలీ అనంతరం తెలంగా ణ అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, విద్యుత్ ఉద్యోగుల ఐక్య వేదిక చైర్మన్ వొంటేరు తిరుపతిరెడ్డి మాట్లాడారు. దశాబ్దాల పోరాటాల ఫలితంగా వచ్చిన తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్రులు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ వస్తే విద్యుత్‌లోటు ఉంటుం దం టూ అబద్దాలు ప్రచారం చేస్తున్న సీమాంధ్ర నేతలు దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతంలో విద్యుత్ ప్రాజెక్టు లు నిర్మించకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. ఇక్కడి బొగ్గును తరలించుకుపోయి విద్యుత్ ప్రాజెక్టులు నిర్మిం చుకున్నారని, మన బొగ్గుతో ఉత్పత్తి చేసిన కరెంట్‌ను మనకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని విమర్శించా రు. తెలంగాణను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం అమరవీరు స్థూపం నుంచి ఆర్ట్స్ కళాశాల మైదానం వరకు ర్యాలీగా వెళ్లి బీజేపీ దీక్షలకు సంఘీభావం ప్రకటించా రు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ యూనస్, అధికారులు ఎస్ఈ మోహన్‌రావు, నార్ల సుబ్రమణ్యేశ్వర్‌రావు, సామ్యానాయక్, బండారి ప్రభాకర్, గూడూరు సమ్మిరెడ్డి, శ్రీరాంనాయక్, రవీందర్, ప్రభావతి, రాజేం దర్, వాలూ నాయక్, కుమారస్వామి, లక్ష్మణ్ నాయక్, మమత, కవిత, జితేందర్ తదితరులు పాల్గొన్నారు. -
యూటీ అంటే ఉద్యమమే
శాడిస్టు ప్రేమికుల్లా సీమాంధ్ర నేతల కుట్రలు టీఎన్జీవోల నేత దేవీప్రసాద్ హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం(యూటీ)గా మార్చాలని చూస్తే మరో మహోద్యమం తప్పదని టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీ దేవీప్రసాద్‌రావు హెచ్చరించారు. యూటీ చేయడంవల్ల ప్రభుత్వంలో స్థానిక ప్రజల భాగస్వామ్యం రద్దవుతుందని, దీన్ని సహించబోమన్నారు. ముల్కీ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా బుధవారం కరీంనగర్లో శాంతి ర్యాలీ, దీక్షల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన టీఎన్జీవోల భవనంలో మీడియాతో మాట్లాడారు. తమకు దక్కనిది ఇతరులకు దక్కకూడదన్న శాడిస్టు ప్రేమికుల్లాగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు హైదరాబాద్‌ను యూటీ చేసేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో 7న జరుపతలపెట్టిన శాంతి ర్యాలీకి అనుమతివ్వాలని 10 రోజుల ముందే అనుమతి కోరితే నిరాకరించిన ప్రభుత్వం ఏపీఎన్జీవోల సభకు మాత్రం ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’కు అనుమతి కుట్రే సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరిట విభజన వద్దంటూ సభ నిర్వహించడం రెచ్చగొట్టడమేనని, హైదరాబాద్‌ను అశాంతి నగరంగా మార్చే కుట్రలో భాగంగానే ఈ సభకు అనుమతిచ్చారని ఆరోపించారు. తాము గతంలో ఎప్పుడు సభలకు అనుమతి కోరినా చివరి నిమిషం వరకు తేల్చకుండా ఇబ్బంది పెట్టిన పోలీసులు నాలుగు రోజుల ముందే ఈ సభకు ఎలా అనుమతిస్తారన్నారు. అసెంబ్లీ వద్ద గతంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల ఆందోళనలకు అనుమతించలేదని, మంగళవారం సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ధర్నాకు మాత్రం పోలీసులు దగ్గరుండి రక్షణ కల్పించారన్నారు. ప్రభుత్వమే సీమంధ్ర ఉద్యమాన్ని నడుపుతోందన్న విషయం ఇప్పుడు రుజువైందని చెప్పారు. శాంతి ర్యాలీకి టీ మంత్రులే అనుమతి ఇప్పించాలని, ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలకైనా టీ మంత్రులే బాధ్యత వహించాలన్నారు. అనుమతి ఇవ్వకపోయినా ర్యాలీ నిర్వహించి తీరుతామని తేల్చిచెప్పారు. ఉద్యోగుల అపోహలను కేంద్రం పరిష్కరించాలని దేవీప్రసాద్ కోరారు. -
72 గంటల పాటు హైదరాబాద్ బంద్!
-
72 గంటల పాటు హైదరాబాద్ బంద్!
హైదరాబాద్ : తెలంగాణ జేఏసీ కీలక సమావేశం ఈ రోజు సాయంత్రం 4 గంటలకు టీఎన్జీవో భవన్లో జరగనుంది. ఈ నెల 7న తలపెట్టిన శాంతి ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించడం, అదే సమయంలో ఏపీఎన్జీవోల సభను అనుమతి ఇవ్వడంపై జేఏసీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. టీఆర్ఎస్తో పాటు బీజేపీ నేతలు కూడా ఈ జేఏసీ భేటికి హాజరు కానున్నారు. ఇందులో 72 గంటల పాటు హైదరాబాద్ బంద్ నిర్వహించే అంశంపై జేఏసీ నేతలు చర్చించనున్నారు. భేటీ అనంతరం జేఏసీ నేతలు కీలక ప్రకటన చేయనున్నారు. మరోవైపు శాంతిర్యాలీకి అనుమతి ఇవ్వాలంటూ న్యాయవాది శ్రీరంగారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ స్వీకరించిన న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది. -
శాంతి ర్యాలీకి అనుమతి ఇవ్వాలి:దేవీ ప్రసాద్
హైదరాబాద్ నగరాన్ని అశాంతి నగరంగా మార్చేందుకే కిరణ్ సర్కార్ 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు అనుమతి ఇచ్చిందని టీఎన్జీవో రాష్ట్రాధ్యక్షుడు దేవీ ప్రసాద్ ఆరోపించారు. బుధవారం ఆయన కరీంనగర్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఏపీఎన్జీవోలకు అనుమతి ఇచ్చినట్లే టీఎన్జీవోలు నిర్వహించే శాంతి ర్యాలీ కూడా అనుమతి ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ ప్రాంత ఉద్యోగులు నిర్వహించే శాంతి ర్యాలీకి అనుమతి ఇవ్వకుంటే తెలంగాణ వ్యాప్తంగా శాంతియుత నిరసన ర్యాలీలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఏడో తేదీన హైదరాబాద్‌లో సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ జరిగితే తదనంతర జరగబోయే పరిణామాలకు తెలంగాణ ప్రాంత మంత్రులే బాధ్యత వహించాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించేందుకు రాష్ట ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని ఆయన పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న తెలంగాణ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని లేదా తమ ప్రాంతానికి బదిలీ చేయాలని దేవీ ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే మరో ఉద్యమం తప్పదని ఆయన కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో తెలంగాణ ఆత్మగౌరవంపై దాడి చేస్తున్నారని టీఎన్జీవో నేత దేవీ ప్రసాద్ వ్యాఖ్యానించారు. -
ఓయూలో శాంతిర్యాలీని అడ్డుకున్న పోలీసులు
న్యూస్‌లైన్ నెట్వర్క్ : ఓయూ క్యాంపస్‌లో వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ చేపట్టారు. సోమవారం తెలంగాణ విద్యార్థి జేఏసీ, ఓయూ విద్యార్థి జేఏసీ, టీజీవీఎస్, టీపీఏ ఆధ్వర్యంలో హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పా టు చేయాలని డిమాండ్‌తో ఆర్ట్స్ కళాశాల నుంచి గన్‌పార్క్ వరకు చేపట్టిన శాంతి ర్యాలీని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ముఖ్య కార్యదర్శి రామచంద్రుడు నాయక్ జెండాఊపి ప్రారంభిం చారు. క్యాంపస్ ప్రవేశ ద్వారం ఎన్సీసీ గేటు వద్ద మోహరించిన పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకోవడంతో విద్యార్థులు సీమాంధ్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి జేఏసీ ప్రధాన కార్యదర్శి కరాటే రాజు మాట్లాడుతూ వచ్చే నెల 7న నిర్వహించతలపెట్టిన సీమాంధ్రుల సభను రద్దు చేసుకోకపోతే అదేరోజు సీమాంధ్ర ఉద్యోగులే లక్ష్యంగా ఎల్బీ స్టేడియం వరకు మిలీనియం మార్చ్ చేపడతామని, దాడులు చేయడానికీ వెనుకాడబోమని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలకు శాంతియుత, సాయుధ ఉద్యమం సాగించిన చరిత్ర ఉందన్న విషయాన్ని సీమాంధ్ర ఉద్యమ నాయకులు గుర్తించుకోవాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బీసీ సంక్షేమ భవన్ వద్ద నిర్వహించిన శాంతి సద్భావన దీక్షలో ఆయన టీఎన్జీవో నేత దేవీప్రసాద్, తదితరులతో కలిసి పాల్గొన్నారు. శాంతి ర్యాలీకి అనుమతి ఇవ్వాలి: ఈటెల సెప్టెంబర్ 7న నిర్వహించే శాంతి ర్యాలీకి అనుమతి ఇవ్వాలని టీఆర్ఎస్ శాసనసభ పక్ష నేత ఈటెల రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాంతి ర్యాలీకి అనుమతి ఇవ్వాలని కోరు తూ సోమవారం టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిజాం కళాశాల నుంచి ర్యాలీని తలపెట్టారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు బాల్క సుమన్ మాట్లాడుతూ నగరంలో సీమాం ధ్రుల బహిరంగ సభకు అనుమతి ఇచ్చిన పోలీసులు తెలంగాణవాదులు తలపెట్టిన శాంతి ర్యాలీకి కూడా అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే శాంతిర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు టీఆర్ఎస్ నాయకులను అరెస్టుచేశారు. నల్లగొండ, సూర్యాపేట పట్టణాల్లో ‘హైదరాబాద్ హమారా’ పేరిట శాంతిర్యాలీలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో సోమవారం తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో సద్భావన ర్యాలీ జరిగింది. విద్యార్థులు భారీ సంఖ్య లో పాల్గొని, తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. టీవీవీ, టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, టీఎన్జీవోలు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. రెబ్బెన, ఖానాపూర్ మండల కేంద్రాల్లో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. ఈ నెల 30న మంచిర్యాలలో భారీ శాంతిర్యాలీకి సన్నాహకంగా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే అరవిందరెడ్డి, సీపీఐ, బీజేపీ, న్యూడెమెక్రసీ, టీఆర్ఎస్, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. హమారా హైదరాబాద్ నినాదంతో టీఆర్ఎస్వీ, టీఎస్‌జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ జిల్లాలో విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. కరీంనగర్ తెలంగాణ చౌక్‌నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి నాయకులు మాట్లాడారు. టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ.. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని, అది ఎన్నటికీ తెలంగాణకే సొంతమని పేర్కొన్నారు. న్యాయవాదులపై దాడులు, అరెస్టులకు నిరసన న్యాయవాదులపై దాడులు, ఎమ్మెల్యేల అరెస్టులకు వ్యతిరేకంగా వరంగల్ జిల్లాలో సోమవారం న్యాయవాదులు, టీఆర్ఎస్ నాయకులు, తెలంగాణవాదులు నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ స్టేషన్‌ఘన్‌పూర్‌లో రాస్తారోకో చేపట్టారు. దీంతో వరంగల్, హైదరాబాద్ ప్రధానరహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య, పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్ళపల్లి రవీందర్రావు పాల్గొన్నారు. అరెస్టులను నిరసిస్తూ హన్మకొండ చౌరస్తా, మహబూబాబాద్‌లో టీఆర్ఎస్ కార్యకర్తలు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. పాలకుర్తిలో తెలంగాణవాదులు ధూంధాం నిర్వహించారు. న్యాయవాదులపై దాడులను నిరసిస్తూ వరంగల్‌లో కోర్టులో విధులు బహిష్కరించి అదాలత్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జనగామలో న్యాయవాదులు స్థానిక కోర్టు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ములుగురోడ్డులో విద్యుత్ కార్మికులు సమైక్యవాదుల దిష్టిబొమ్మను దహ నం చేసి నిరసన వ్యక్తం చేశారు. డీజీపీ దినేష్‌రెడ్డి సీమాంధ్ర ఉద్యమానికి అండగా నిలుస్తున్నారని పేర్కొంటూ టీజేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. న్యాయవాదులను అక్రమంగా అరెస్టు చేశారని పేర్కొంటూ కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు డీజీపీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. న్యాయవాదులపై జరిగిన దాడికి నిరసనగా నగరంలోని నిజామాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. నగరంలో పొట్టిశ్రీరాములు విగ్రహం ముందు రోడ్డుపైనే న్యాయవాదులు మానవహారం నిర్మించారు. కొన్ని పత్రికల ప్రతుల ను దహనం చేశారు. రాస్తారోకో చేశారు. సీమాంధ్ర నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో న్యాయవాది జేఏసీ నాయకులు పి.పి.రాజేందర్‌రెడ్డి, బార్ అసోసియేషన్ కార్యదర్శి దేవిదాస్, ఉపాధ్యక్షులు రవీందర్, కోశాధికారి వెంకట్మ్రణగౌడ్, కల్పన, కవితరెడ్డి, టిఆర్ఎస్ మధు, ఈగ గంగారెడ్డి, దయాకర్‌గౌడ్, న్యాయవాదులు పాల్గొన్నారు. -
హోరెత్తిన నిరసనలు
సాక్షి నెట్వర్క్: జై సమైక్యాంధ్ర.. జై తెలంగాణ..నినాదాలతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల పోటాపోటీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. గురువారం రాజధానిలోని విద్యుత్‌సౌధ, ఇతర ప్రధాన ప్రభుత్వ విభాగాలు నిరసన కార్యక్రమాలతో హోరెత్తాయి. వివరాలు..సమైక్యాంధ్రను కోరుతూ సీమాంధ్ర ఉద్యోగులు, ప్రత్యేక తెలంగాణను వెంటనే ప్రకటించాల తెలంగాణ ఉద్యోగుల ధర్నాలు, నినాదాలతో విద్యుత్‌సౌధ దద్దరిల్లింది. సీమాంధ్ర ఉద్యోగులు- ‘కుర్చీని కాపాడుకోవడం ఎలా?’ అనే నాటికను ప్రదర్శించారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్య తలెత్తుతుందని సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీవిద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. శాంతిభద్రతల్ని సాకుగా చూపుతూ సీఎం మాట్లాడడం సరికాదని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు రఘు పేర్కొన్నారు. కాగా, సమైక్యాంధ్రకు మద్దతుగా కోఠి డీఎంహెచ్ఎస్లో ఏపీఎన్జీవోలు విధులు బహిష్కరించి డీఎంహెచ్ఎస్ క్యాంపస్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైద్య విధాన పరిషత్, ఏపీసాక్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం, డీఎంఈ, డీహెచ్ తదితర కార్యాలయాల ఉద్యోగులు ర్యాలీలో సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. అబిడ్స్ తిలక్‌రోడ్డులోని బీమాభవన్‌లో, బొగ్గులకుంటలోని దేవాదాయ ధర్మాదాయ కమిషనర్ కార్యాలయంలోనూ ఏపీఎన్జీవోల ప్రదర్శనలు కొనసాగాయి. -
కుట్రలను తిప్పికొడతాం: కోదండరాం
* సీమాంధ్ర ప్రాంత సమ్మె నేపథ్యంలో జేఏసీ స్టీరింగ్ కమిటీ భేటీ * ఈనెల చివరి వారంలో హైదరాబాద్‌లో భారీ శాంతి ర్యాలీ * 16 నుంచి గ్రామగ్రామాన..17 నుంచి హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద రిలే నిరాహార దీక్షలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకునేందుకు జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టగల శక్తి తమకు ఉందని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి కుట్రలెన్నింటినో తెలంగాణ సమాజం చూసిందన్నారు. కుట్రలతో ఆపగలిగితే ఆగే పరిస్థితిలో తెలంగాణ లేదని తేల్చి చెప్పారు. రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే ఎలాంటి కుయుక్తులు తమ ముందు నడవవని హెచ్చరించారు. సంయమనం అవసరమన్న ఉద్దేశంతోనే తాము ఇన్నాళ్లూ ఆగుతూ వచ్చామని తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఏపీఎన్జీవోలు సమ్మెకు దిగిన నేపథ్యంలో తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ మంగళవారం జేఏసీ ప్రధాన కార్యాలయంలో సమావేశమైంది. టీఆర్ఎస్ శాసనసభాపక్ష నాయకుడు ఈటెల రాజేందర్, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు డి. శ్రవణ్, బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ నాయకుడు అశోక్, పలువురు ఉద్యోగ సంఘాల, జేఏసీ నేతలు పాల్గొన్నారు. సమావేశ అనంతరం కోదండరాం విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలను నిరసిస్తూ ఈనెల చివరి వారంలో హైదరాబాద్‌లో భారీ శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. సీమాంధ్ర పాలకులు, పెత్తందారులు తమ ఆధిపత్యం కాపాడుకోవడానికి ప్రజల మధ్య తీవ్రమైన రీతిలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. శ్రీవేంకటేశ్వరుని దర్శనం కోసం తిరుపతి వెళ్లేవారికి కూడా ఇబ్బంది కలిగించేంత ప్రాంత విద్వేషాలు పెంచడం నాగరిక సమాజంలో సరికాదన్నారు. వారిది ఆధిపత్య ధోరణి అయితే తెలంగాణ ఉద్యమపంథా శాంతి మార్గమని చెప్పారు. రాష్ట్ర విభజన వల్ల ఇరుప్రాంతాల్లో తలెత్తే సమస్యల పరిష్కారం కోసం చర్చ జరగాలన్నది తెలంగాణ ఉద్యమం అభిప్రాయం కూడానని స్పష్టం చేశారు. ఇందుకోసం కేంద్ర మంత్రివర్గం తక్షణమే తెలంగాణ బిల్లును ఆమోదించి, చర్చల ప్రక్రియను మొదలుపెట్టాలని జేఏసీ డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణను అడ్డుకునేందుకు అన్నిరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిని నిలువరించేందుకు ఒక భవిష్యత్ కార్యాచరణను జేఏసీ సిద్ధం చేసుకుందని తెలిపారు. 16వ తేదీ నుంచి తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాల్లో గ్రామ, గ్రామా న ఎక్కడికక్కడ శాంతి ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు. 16, 17 తేదీలతో ఉద్యోగ సంఘాల నేతలు కూడా అన్ని డివిజన్ కేంద్రాలలో ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారని, వాటిని కూడా సమన్వయం చేసి ఆ సందర్భంగా భారీ ర్యాలీలు జరపాలని కోరారు. విద్యార్థులు ఈ ర్యాలీలలో పాల్గొన్ని విజయవంతం చేయాలన్నారు. 17వ తేదీ నుంచి జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించనున్నట్టు తెలిపారు. సకల జనుల సమ్మెలో పాల్గొన్న అందరినీ మరోసారి ఐక్యం చేసి భవిష్యతులో ఏమి చేయాలన్న దానిపై చర్చిస్తామన్నారు. సీమాంధ్ర ప్రాంత మంత్రుల భార్యలు గవర్నర్‌ను కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరడాన్ని తప్పుపట్టారు. సీమాంధ్ర ప్రాంతంలోని జిల్లాలు వెనుకబడి ఉన్నాయని మంత్రుల భార్యలు చెబుతున్నారని, ఆ ప్రాంతం వెనుకబడడానికి ఈ మంత్రులే కారణం కాబట్టి వారిపై ఏం చర్యలు తీసుకోవాలో వారి భార్యలు చెపితే బాగుంటుందని కోదండరాం సూచించారు. తెలంగాణ సమాజం కిరణ్‌పై విశ్వాసం కోల్పోయింది: ఈటెల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఒకప్రాంత పక్షపాతిగా వ్యవహరిస్తున్నార ని ఈటెల రాజేందర్ ఆరోపించారు. తెలంగాణ సమాజం కిరణ్‌కుమార్‌రెడ్డి పట్ల విశ్వాసం కోల్పోయిందని, తక్షణమే ఆయన పదవి నుంచి తప్పుకోవాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసోం్తదని చెప్పారు. జేఏసీ కార్యక్రమాలకు ప్రజలు, పార్టీ కార్యకర్తలు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. సమైక్యాంద్రకు మద్దతుగా ఏపీ ఉద్యోగుల సమ్మె ప్రభావం హైదరాబాద్ నగరంపై నామమాత్రంగా ఉందని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ చెప్పారు. సమ్మెలో పాల్గొనని ఉద్యోగులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈనెల 19న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలసి తెలంగాణ ప్రక్రియను నిలిపివేసే పక్షంలో తామందరం మెరుపుసమ్మెకు దిగుతామన్న నోటీసు అందజేయనున్నట్టు టి. గెజిటెడ్ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు శ్రీనివాస గౌడ్ చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తమపై వందలాది కేసులు నమోదు చేసిన ప్రభుత్వానికి ఇప్పుడు సీమాంధ్ర జిల్లాల్లో, సచివాలయంలో జరుగుతున్నవి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా జరుగుతున్న ఉద్యమంలో సీమాంధ్ర ప్రాంతంలో కొన్ని చోట్ల బీజేపీ కార్యాలయాలపై దాడులు జరగడాన్ని ఆ పార్టీ నేత అశోక్‌కుమార్ ఖండించారు.