ప్రపంచ శాంతి కోసం కృషి చేయాలి | every one should try in world peace | Sakshi
Sakshi News home page

ప్రపంచ శాంతి కోసం కృషి చేయాలి

Published Sat, Nov 5 2016 6:49 PM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM

every one should try in world peace

పులివెందుల టౌన్‌ : ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుతూ మానవత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నలంద పాఠశాల విద్యార్థులతో కలిసి శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి స్థానిక మహాత్మగాంధీ విగ్రహం నుంచి ర్యాలీ ప్రారంభించారు. విద్యార్థులు ఫ్లకార్డులు చేతబూని ఉగ్రవాదం నశించాలని.. ప్రపంచశాంతి వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ పూలంగళ్ల సర్కిల్‌ వరకు ర్యాలీగా వచ్చి అక్కడ మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మానవతా విలువలు తరిగిపోతున్నాయన్నారు. ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ప్రజలు తమ వంత సహకారం అందజేయాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో మానవత స్వచ్ఛద సంస్థ చైర్మన్‌ సాంబశివారెడ్డి, కో చైర్మన్‌ వరప్రసాద్, పట్టణాధ్యక్షుడు డీవీ కొండారెడ్డి, రాంగోపాల్‌రెడ్డి, థామస్‌రెడ్డి, మాజీ ఓఎస్డీ చంద్రశేఖరరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement