nalanda school
-
మిషన్ ఎవరెస్టుకు ఆశాకిరణ్‌రాణి ఎంపిక
శ్రీకాకుళం, కోటబొమ్మాళి: స్థానిక శ్రీ నలంద స్కూల్ పూర్వపు విద్యార్థిని, నర్సపురం గ్రామానికి చెందిన కొయ్య ఆశాకిరణ్‌రాణి మిషన్ ఎవరెస్టుకు ఎంపికయ్యారు. రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక మహిళ ఈమె. ఆశాకిరణ్‌రాణి ఎంపిక పట్ల ఆ పాఠశాల ప్రిన్సిపాల్ మంచాల శ్రీనివాస్, ఉపాధ్యాయులు వై.మురళి, నగేష్, నౌగాపు సుశీల, పద్మారావు, జగన్నాథరావు, కుసుము కుమారి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఫిజియోథెరపీ కోర్సు పూర్తిచేసి ప్రస్తుతం టెక్కలిలో నివాసముంటున్న ఈమె యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిషన్ ఎవరెస్టు కార్యక్రమానికి వెళ్లేందుకు ఆసిక్తి చూపి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించటం చిన్నప్పటి నుంచి అభిలాషగా ఎంచుకున్న ఆశాకిరణ్‌రాణి మిషన్ ఎవరెస్టు కార్యక్రమానికి ఎంపికయ్యారు. -
విజయవాడ నలంద విద్యానికేతన్ లో సంక్రాంతి సంబరాలు
-
ప్రపంచ శాంతి కోసం కృషి చేయాలి
పులివెందుల టౌన్ : ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుతూ మానవత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నలంద పాఠశాల విద్యార్థులతో కలిసి శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి స్థానిక మహాత్మగాంధీ విగ్రహం నుంచి ర్యాలీ ప్రారంభించారు. విద్యార్థులు ఫ్లకార్డులు చేతబూని ఉగ్రవాదం నశించాలని.. ప్రపంచశాంతి వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ పూలంగళ్ల సర్కిల్ వరకు ర్యాలీగా వచ్చి అక్కడ మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మానవతా విలువలు తరిగిపోతున్నాయన్నారు. ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ప్రజలు తమ వంత సహకారం అందజేయాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో మానవత స్వచ్ఛద సంస్థ చైర్మన్ సాంబశివారెడ్డి, కో చైర్మన్ వరప్రసాద్, పట్టణాధ్యక్షుడు డీవీ కొండారెడ్డి, రాంగోపాల్‌రెడ్డి, థామస్‌రెడ్డి, మాజీ ఓఎస్డీ చంద్రశేఖరరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. -
నేటినుంచి చెకుముకి రచయితల వర్క్‌షాప్
నందలూరు: నేటి నుంచి సిద్దవటంలోని శ్రీ నలందాస్కూల్లో రాయలసీమస్థాయి చెకుముకి రచయితల వర్క్‌షాపు,జరుగుతుందని రాజంపేట జేవీవీ డివిజన్ ఇన్చార్జ్ రౌఫ్బాషా తెలిపారు. 2వ తేదీన రాజంపేట, కోడూరు నియోజకవర్గ జెవివి కార్యకర్తల శిక్షణా కార్యక్రమం, 3వ తేదీన జిల్లాస్థాయి మ్యాజిక్ వర్క్‌షాపు, అదేరోజు జేవీవీ కార్యకర్తలు కడప నుంచి సిద్దవటం వరకు కళ్లకు గంతలు కట్టుకుని ద్విచక్రవాహనాలలో ర్యాలీగా వస్తారని ఆయన తెలిపారు.