
శ్రీకాకుళం, కోటబొమ్మాళి: స్థానిక శ్రీ నలంద స్కూల్ పూర్వపు విద్యార్థిని, నర్సపురం గ్రామానికి చెందిన కొయ్య ఆశాకిరణ్‌రాణి మిషన్ ఎవరెస్టుకు ఎంపికయ్యారు. రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక మహిళ ఈమె. ఆశాకిరణ్‌రాణి ఎంపిక పట్ల ఆ పాఠశాల ప్రిన్సిపాల్ మంచాల శ్రీనివాస్, ఉపాధ్యాయులు వై.మురళి, నగేష్, నౌగాపు సుశీల, పద్మారావు, జగన్నాథరావు, కుసుము కుమారి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఫిజియోథెరపీ కోర్సు పూర్తిచేసి ప్రస్తుతం టెక్కలిలో నివాసముంటున్న ఈమె యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిషన్ ఎవరెస్టు కార్యక్రమానికి వెళ్లేందుకు ఆసిక్తి చూపి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించటం చిన్నప్పటి నుంచి అభిలాషగా ఎంచుకున్న ఆశాకిరణ్‌రాణి మిషన్ ఎవరెస్టు కార్యక్రమానికి ఎంపికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment