Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page
breaking news

ప్రధాన వార్తలు

chandrababu Government Conspiracy To Ys Jagan Public Tours 1
వైఎస్‌ జగన్‌ బంగారుపాళ్యం పర్యటనపై కూటమి ప్రభుత్వం కుట్ర

సాక్షి,అమరావతి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌ రెడ్డి పర్యటనలపై కూటమి ప్రభుత్వం కుట్రలు కొనసాగుతున్నాయి. జులై 9న (బుధవారం) వైఎస్‌ జగన్‌ బంగారుపాళ్యం పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. 500మంది మించిరాదు. రోడ్‌షో, పబ్లిక్‌ మీటింగ్‌ పెట్టకూడదు. హెలిప్యాడ్‌ వద్ద 30 మందికి మించి ఉండకూదు’అని ఎస్పీ మణికంఠ వెల్లడించారు.వైఎస్‌ జగన్‌ చిత్తూరు జిల్లాలోని మామిడి రైతుల కష్టాలను తెలుసుకునేందుకు స్వయంగా వస్తుండటంతో కూటమి ప్రభుత్వం కంగారు పడుతోంది. ఇప్పటి వరకు మామిడి రైతులను ఆదుకోవడంలోనూ, వారికి మద్దతు ధర కల్పించడంలోనూ చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ నేపథ్యంలో రైతులకు భరోసా కల్పించేందుకు వైఎస్‌ జగన్‌ వస్తున్నారని తెలిసి, కూటమి పెద్దలు కుట్రలకు దిగారు. బంగారుపాళ్యం పర్యటనపై అనుమతులు ఇచ్చే విషయంలో పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Zim Vs SA 2nd Test: Wiaan Mulder Sacrifices 400, Declares South Africa Innings Despite Being On Cusp Of Breaking Brian Lara's World Record2
క్వాడ్రపుల్‌ సెంచరీ (400) చేసే సువర్ణావకాశాన్ని వదిలేసిన సౌతాఫ్రికా కెప్టెన్‌

సౌతాఫ్రికా తాత్కాలిక కెప్టెన్‌ వియాన్‌ ముల్దర్‌ టెస్ట్‌ క్రికెట్‌లో అత్యంత అరుదైన క్వాడ్రపుల్‌ సెంచరీ (400) చేసే సువర్ణావకాశాన్ని జట్టు ప్రయోజనాల కోసం తృణప్రాయంగా వదిలేశాడు. జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ముల్దర్‌ రెండో రోజు తొలి సెషన్‌లోనే ట్రిపుల్‌ సెంచరీ పూర్తి చేసి, క్వాడ్రపుల్‌ సెంచరీకి 33 పరుగుల దూరంలో (367 నాటౌట్‌) ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు. ముల్దర్‌ తీసుకున్న ఈ అత్యంత సాహసోపేత నిర్ణయానికి యావత్‌ క్రికెట్‌ ప్రపంచం ఆశ్చర్యానికి గురైంది.టెస్ట్‌ క్రికెట్‌లో ఎప్పుడో కాని ఇలాంటి సువర్ణావకాశం రాదు. ముల్దర్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశాన్ని చేజేతులారా జారవిడిచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ముల్దర్‌ ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే మరో 20 బంతుల్లో ఈజీగా క్వాడ్రపుల్‌ సెంచరీ పూర్తయ్యేది. అయితే అతను అనూహ్యంగా లంచ్‌ విరామం తర్వాత తిరిగి బరిలోకి దిగకుండా ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు. తగినంత సమయం, అవకాశం ఉండి కూడా ముల్దర్‌ క్వాడ్రపుల్‌ సెంచరీని కాదనుకోవడాన్ని సగటు క్రికెట్‌ అభిమాని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఈ జమానా టెస్ట్‌ క్రికెట్‌లో ఇలాంటి అవకాశం బహుశా ఎవరికీ రాకపోవచ్చని బాధపడుతున్నారు. ఆటలో వేగం పెరిగిపోవడంతో డబుల్‌ సెంచరీలు చేయడమే ఎక్కువని క్రికెటర్లు భావిస్తున్నారు.ఏది ఏమైనా ముల్దర్‌ చేసిన పనికి విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులచే కీర్తించబడుతున్నాడు. నిస్వార్థ నాయకుడని జేజేలందుకుంటున్నాడు. జట్టు ప్రయోజనాలే ముఖ్యమనుకునే ఇలాంటి నాయకుడిని చరిత్రలో చూడలేమని సోషల్‌మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఇప్పటివరకు ఒకే ఒక్కరు క్వాడ్రపుల్‌ సెంచరీ చేశారు. 2004లో విండీస్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా ఇంగ్లండ్‌పై ఈ ఘనత సాధించాడు. టెస్ట్‌ల్లో అత్యధిక పరగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో లారా (400 నాటౌట్‌), మాథ్యూ హేడెన్‌ (380), బ్రియాన్‌ లారా (375), మహేళ జయవర్దనే (374) మాత్రమే ముల్దర్‌ కంటే ముందున్నారు. క్వాడ్రపుల్‌ మిస్‌ చేసుకున్నప్పటికీ ముల్దర్‌ మరో ఘనత సాధించాడు. విదేశీ గడ్డపై అత్యధిక టెస్ట్‌ స్కోర్‌ చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అలాగే సౌతాఫ్రికా తరఫున ఓ టెస్ట్‌ మ్యాచ్‌లో అత్యధిక స్కోర్‌ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు గ్రేమ్‌ స్మిత్‌ పేరిట ఉండేది. స్మిత్‌ 2003లో ఓ టెస్ట్‌ మ్యాచ్‌లో 362 పరుగులు (277 & 85) చేశాడు.దీనితో పాటు ముల్దర్‌ మరిన్ని రికార్డులు కూడా సాధించాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా.. టెస్ట్‌ల్లో సెకెండ్‌ ఫాస్టెస్ట్‌ ట్రిపుల్‌ సెంచరీ (297 బంతుల్లో) చేసిన ఆటగాడిగా (టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్‌ ట్రిపుల్‌ సెంచరీ రికార్డు వీరేంద్ర సెహ్వాగ్‌ (278 బంతుల్లో) పేరిట ఉంది).. టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక స్కోర్‌ చేసిన ఆటగాడిగా.. టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున హాషిమ్‌ ఆమ్లా (311 నాటౌట్‌) ట్రిపుల్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు.విదేశీ టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు..367* - వియాన్ ముల్డర్ (SA) vs ZIM, బులవాయో, 2025337 - హనీఫ్ మొహమ్మద్ (PAK) vs WI, బార్బడోస్, 1958336* - వాలీ హమ్మండ్ (ENG) vs NZ, ఆక్లాండ్, 1933334* - మార్క్ టేలర్ (AUS) vs PAK, పెషావర్, 1998334 - సర్ డాన్ బ్రాడ్‌మాన్ (AUS) vs ENG, హెడింగ్లీ, 1930మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ముల్దర్‌ 334 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 367 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 264 వద్ద రెండో రోజు బరిలోకి దిగిన ముల్దర్‌.. తొలి సెషన్‌లోనే ట్రిపుల్‌ సెంచరీ పూర్తి చేశాడు. ముల్దర్‌ వన్డే తరహాలో బ్యాటింగ్‌ చేస్తూ వేగంగా ట్రిపుల్‌ సెంచరీ పూర్తి చేశాడు.ముల్దర్‌ చెలరేగడంతో సౌతాఫ్రికా లంచ్‌ తర్వాత 626/5 స్కోర్‌ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ముల్దర్‌తో పాటు వెర్రిన్‌ (42) క్రీజ్‌లో ఉన్నాడు. అంతకుముందు సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోని డి జోర్జి 10, సెనోక్వానే 3, డేవిడ్‌ బెడింగ్హమ్‌ 82, లుహాన్‌ డ్రి ప్రిటోరియస్‌ 78, డెవాల్డ్‌ బ్రెవిస్‌ 30 పరుగులు చేసి ఔటయ్యారు. జింబాబ్వే బౌలర్లలో చివంగ, మటిగిము తలో 2 వికెట్లు తీయగా.. మసకద్జ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది.

Bank Of Baroda Dropping Minimum Balance Charges3
ఇక ఈ బ్యాంక్‌లోనూ మినిమమ్‌ బ్యాలెన్స్ అక్కర్లేదు..

పేదలు, సామాన్యులకు బ్యాంకింగ్‌ సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒక్కొక్కటిగా ముందుకువస్తున్నాయి. ఇందులో భాగంగా బ్యాంక్‌ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్‌ నిర్వహించకపోతే విధించే చార్జీలను రద్దు చేస్తున్నాయి. తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ జాబితాలో చేరింది. ప్రామాణిక పొదుపు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ఛార్జీలను తొలగించింది.బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఛార్జీల తొలగింపు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మార్పు ప్రీమియం ఉత్పత్తులు మినహా అన్ని సాధారణ పొదుపు ఖాతాలకు వర్తిస్తుంది.కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్‌లు ఇటీవలే పొదుపు ఖతాలకు కనీస బ్యాలెన్స్‌ ఛార్జీలు తొలగించిన తర్వాత బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కూడా అనుసరించింది. ఇక అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2020లోనే మినిమమ్ బ్యాలెన్స్ ఆవశ్యకతలను ఎత్తివేస్తూ ఈ దిశగా చర్యలు తీసుకుంది.మినిమమ్‌ బ్యాలెన్స్ లేని ఖాతాలపై విధిస్తున్న జరిమానాలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ, ప్రభుత్వ రంగ బ్యాంకుల మధ్య చర్చలు కొనసాగుతున్న క్రమంలో ఈ మార్పు చోటు చేసుకుంది. చౌక కరెంట్, పొదుపు ఖాతాల డిపాజిట్ల వాటాలో తగ్గుదలను బ్యాంకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ అంశం దృష్టిని ఆకర్షించింది.

Darshan case Inspiration Bengaluru youth Viral Video Case details4
దర్శన్‌ కేసు స్ఫూర్తితో..! కర్ణాటకలో మరో దారుణం

కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. తన గర్ల్‌ఫ్రెండ్‌కు అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టాడని ఓ యువకుడు.. మరో యువకుడిపై తన స్నేహితులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నెలమంగళ తాలుకా సోలదేవనహళ్లిలో జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. కుశాల్‌ అనే కుర్రాడు గతంలో ఓ యువతిని ప్రేమించాడు. అయితే తర్వాత ఇద్దరికీ బ్రేకప్‌ కాగా, ఆ యువతి మరో యువకుడితో రిలేషన్‌ మొదలుపెట్టింది. ఇది భరించలేని కుశాల్‌.. సదరు యువతికి అసభ్య సందేశాలు పంపాడు. ఈ విషయాన్ని సదరు యువతి తన తాజా ప్రియుడికి చెప్పింది. దీంతో రగలిపోయిన సదరు యువకుడు తన స్నేహితులతో కలిసి కుశాల్‌పై దాడికి పాల్పడ్డాడు. అయితే.. కుశాల్‌ను కిడ్నాప్‌ చేసి.. ఓ బహిరంగ ప్రదేశంలోకి ఈడ్చుకెళ్లి పడేశారు. పది మంది అతన్ని చుట్టుముట్టి కాళ్లతో, కర్రలతో తన్నారు. బట్టలు విప్పించి.. ప్రైవేట్‌ బాగాలపై దాడి చేస్తూ హింసించారు. దాడి సమయంలో ఆ యువతి కూడా అక్కడే ఉంది. దాడికి పాల్పడిన టైంలో ఆ గ్యాంగ్‌ మొత్తం కర్ణాటకలో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి కేసు ప్రస్తావన తెచ్చి మరీ కుశాల్‌పై దాడికి పాల్పడింది. వీడు మరో రేణుకాస్వామి రా అంటూ ఒక్కొక్కరుగా కుశాల్‌ను చితకబాదారు. ఇది కూడా ఆ కేసులాగే ముగుస్తుందంటూ హెచ్చరించారు కూడా. జూన్‌ 30వ తేదీన ఈ ఘటన జరగ్గా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాకు ఎక్కింది. బాధితుడి ఫిర్యాదు మేరకు 10 మందిపై సోలదేవనహళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటిదాకా 8 మందిని అరెస్ట్‌ చేశారు. కిడ్నాప్, దాడి, బెదిరింపు, వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.కన్నడనాట చాలెంజింగ్‌ స్టార్‌గా పేరున్న దర్శన్‌ నటి పవిత్రగౌడకు అసభ్య సందేశాలు పంపాడన్న కోపంతో తన అభిమాని అయిన రేణుకా స్వామి అనే వ్యక్తిని సుపారీ గ్యాంగ్‌తో కిడ్నాప్‌ చేయించి.. అత్యంత దారుణంగా హింసించి చంపాడని తెలిసిందే. ఈ ఉదంతం కర్ణాటకను మాత్రమే కాదు.. యావత్‌ దేశాన్ని కుదిపేసింది. ప్రస్తుతం ఈ కేసులో దర్శన్‌ బెయిల్‌ మీద బయట ఉన్నాడు.

Rajshree More was reportedly misbehaved with by Rahil Javed Shaikh5
నటితో అసభ్య ప్రవర్తన.. మద్యం మత్తులో ప్రముఖ నేత కుమారుడి వీరంగం

ముంబై: ముంబైలో కలకలం. మద్యం మత్తులో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) నాయకుడు జావేద్ షేక్ కుమారుడు రాహిల్ జావేద్ వీరంగం సృష్టించాడు. పీకల దాకా మద్యం సేవించి నటి రాజశ్రీ మోరే పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కారును ఢీకొట్టి దూర్భలాడాడు. తనతో ఎందుకు ఇలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ప్రశ్నిస్తే.. ఇదిగో కావాలంటే డబ్బులు తీసుకో అంటూ నటిని బెదిరిస్తున్న వీడియోలో వెలుగులోకి వచ్చాయి.గత ఆదివారం (జూలై 6న) ముంబైలోని అంధేరి ప్రాంతంలో రాహిల్‌ మోతాదుకు మించి మద్యం సేవించాడు. అంధేరి నుంచి మరో ప్రాంతానికి వెళుతుండగా.. మార్గం మధ్యలో నటి రాజశ్రీ మోరే కారును ఢీ కొట్టాడు. దీంతో రాజశ్రీ.. రాహిల్‌పై వాగ్వాదానికి దిగింది. అర్ధ నగ్నంగా ఉన్న రాహిల్‌ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. మా నాన్న ఎవరో నీకు తెలుసా? మహరాష్ట్ర నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు జావెద్‌ షేక్‌ అని బెదిరించాడు. ఇరువురి వాగ్వాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పోలీసులతో రాహిల్‌ ఘర్షణకు దిగారు. తాజా సమాచారం ప్రకారం.. రాహిల్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలుస్తోంది.ఇటీవల మరాఠీ భాషను బలవంతంగా తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎంఎన్‌ఎస్‌ కార్యకర్తలు తనని లక్ష్యంగా చేసుకున్నారని రాజశ్రీ ఆరోపించారు. ఘటన తాలూకు వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. The son of MNS leader Javed Shaikh abuses (in Hindi/Urdu, of course) a Marathi girl after hitting her car. He even mocks her Marathi surname.Let’s see whom the Thackeray brothers choose, a Marathi-speaking Maharashtrian or a Hindi-speaking Muslim. pic.twitter.com/xxamEFlTn7— Mr Sinha (@MrSinha_) July 7, 2025మహారాష్ట్రలో భాషా వివాదం మహారాష్ట్రలో భాషా వివాదం రాజుకుంది. ముంబైలో నివసించే వారు మరాఠీని తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన అవసరం లేదంటూ రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) సీనియర్‌ నాయకుడు సురేశ్‌ భయ్యాజీ జోషి చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా శివసేన(యూబీటీ) శ్రేణులు నిరసనలు చేపట్టాయి. దీంతో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ వెంటనే అప్రమత్తమయ్యారు. ముంబైతోపాటు మహారాష్ట్ర భాషగా మరాఠీని ఆయన అభివర్ణించారు. ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరూ మరాఠీని నేర్చుకుని మాట్లాడి తీరవలసిందేనంటూ స్పష్టంచేశారు. మీ మాతృభాషను మీరు ప్రేమించి, గౌరవిస్తే ఇతర భాషల పట్ల కూడా మీరు అలాగే వ్యవహరిస్తారు అని ఫడ్నవీస్‌ చెప్పారు.నటి రాజశ్రీ మోర్సేపై విమర్శలుఈ వివాదంపై నటి రాజశ్రీ మోరే స్పందించారు. మహరాష్ట్రలో మరాఠీ భాషను తప్పనిసరి చేయడంపై సోషల్‌ మీడియా వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో.. మరాఠీలు ఎక్కడ ఉన్నా కష్టపడి పనిచేస్తారు. కానీ భాషను రద్దు ప్రయత్నం చేయడం వల్ల వలసదారులు నగరం విడిచిపెడతారని అన్నారు. అదే జరిగితే ముంబైలోని స్థానిక మరాఠీ సమాజం పరిస్థితి మరింత దిగజారిపోతుందని ఆమె హెచ్చరించారు. ఈ ప్రకటనల తర్వాత, నటి రాజశ్రీ మోర్సేపై విమర్శలు వెల్లువెత్తాయి.నేపథ్యంలో, రాజ్‌శ్రీ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. మరాఠా భాషపై స్పందించిన వీడియోను డిలీట్‌ చేశారు. ఎంఎస్‌ఎన్‌ మద్దతు దారులు సైతం ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

YSRCp Perni Nani Slams AP Chandrababu Govt6
‘ఎన్ని కేసులైనా పెట్టుకోండి.. జగన్‌ జెండా వదిలేదే లేదు’

పల్నాడు: సత్తెనపల్లి పోలీసులు అమాయకులని, అధికార పార్టీ నాయకులు తప్పుడు కేసులు పెట్టమంటే పోలీసులు భయపడి పెడుతున్నారని కూటమి ప్రభుత్వ అరాచక పాలనపై మండిపడ్డారు మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత పేర్ని నాని. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పేర్ని నానికి సత్తెనపల్లి పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఆయన ఈరోజు(జూలై 7) విచారణకు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘సత్తెనపల్లి పోలీసులు అమాయకులు. అధికార పార్టీ నాయకులు తప్పుడు కేసులు పెట్టమంటే పోలీసులు భయపడి తప్పుడు కేసులు పెడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ పర్యటనలో పాల్గొన్నందుకు నాపై కేసు పెట్టారు. పోలీసులు నిన్న మా ఇంటికి నోటీసు అంటించి వెళ్ళిపోయారు. 11 సెక్షన్లతో నామీద నేరం నమోదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి పర్యటనకు మూడు కార్లు 100 మందిలో నేను ఒక వ్యక్తిని. నా మీద కూడా కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోతే బదిలీలు, సస్పెండ్ గాని చేస్తామని అధికార పార్టీ వారు బెదిరిస్తున్నారు. రాష్ట్రంలో సైకో పరిపాలన నరకాసుని పరిపాలన జరుగుతుంది. మహా అయితే బందర్ నుండి సత్తెనపల్లికి కేసులు పెట్టి తిప్పుతారు. ఎన్ని కేసులు అయినా పెట్టుకోండి జగన్ జెండా వదిలేదే లేదు’ అని పేర్ని నాని స్పష్టం చేశారు.

Tahawwur Rana admits Pak army trusted agent Check Details7
అవును.. నేను పాక్‌ ఆర్మీ ఏజెంట్‌నే: తహవూర్‌ రాణా

26/11 ముంబయి ఉగ్రదాడుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన కుట్రదారుల్లో ఒకడైన తహవూర్‌ హుస్సేన్‌ రాణా తన నేరాన్ని అంగీకరించాడు. అంతేకాదు.. పాకిస్తాన్ ఆర్మీకి అత్యంత విశ్వసనీయమైన ఏజెంట్‌గానూ తాను పనిచేశానని విచారణలో వెల్లడించాడు. ఈ మేరకు ఓ జాతీయ మీడియా సోమవారం ఓ కథనం ప్రచురించింది. ముంబై ఉగ్రదాడుల కేసులో అమెరికా నుంచి అప్పగింత మీద వచ్చిన రాణా.. ప్రస్తుతం ఢిల్లీ తిహార్ జైలులో NIA కస్టడీలో ఉన్నాడు. అయితే ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ విచారణలో 2008 ముంబై ఉగ్రదాడుల్లో తన ప్రేమయం ఉన్నట్లు అంగీకరించాడు. అంతేకాదు తాను, తన మిత్రుడు డేవిడ్ హెడ్‌లీతో కలిసి లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ద్వారా పలు శిక్షణా శిబిరాల్లో పాల్గొన్నట్టు వెల్లడించాడు. లష్కరే తోయిబా కేవలం ఉగ్రవాద సంస్థ మాత్రమే కాదని ప్రధానంగా ఓ గూఢచార సంస్థలా పనిచేస్తుందని తహవూర్‌ రాణా వెల్లడించినట్లు తెలుస్తోంది. ముంబైలో ఇమ్మిగ్రేషన్‌ సెంటర్‌ను ఓపెన్‌ చేయాలన్న ఆలోచన తనదేనని, ఆ కార్యాలయం ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలను వ్యాపార ఖర్చులుగా చూపించానని, 2008 నవంబర్‌లో జరిగిన ముంబయి దాడుల సమయంలో తాను ముంబయిలోనే ఉన్నానని, అది ఉగ్రవాదుల ప్రణాళికలో భాగమే అని అంగీకరించాడు. దాడులకు ముందు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వంటి ప్రదేశాలను స్వయంగా పరిశీలించినట్టు తెలిపాడు. అంతేకాదు.. ఈ దాడులు పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) సహకారంతోనే జరిగాయని తాను నమ్ముతున్నట్లు తహవూర్‌ రాణా వెల్లడించాడు. ఈ మేరకు ఇండియా టుడే ఓ కథనం ప్రచురించింది. ఇదిలా ఉంటే.. ముంబై దాడుల్లో తన ప్రమేయం లేదంటూ రాణా ఇప్పటిదాకా బుకాయిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. కానీ తాజా విచారణలో తన పాత్రను అంగీకరించడంతో పాటు పాక్‌ నిఘా వ్యవస్థ ప్రేమయం ఉండొచ్చన్న వ్యాఖ్యలు ఈ కేసును కీలక మలుపు తిప్పేలా కనిపిస్తున్నాయి.

Donald Trump Tariff warns To BRICS Nations Full Details Here8
బ్రిక్స్‌తో పొత్తు ఉంటే.. ట్రంప్‌ లేటెస్ట్‌ వార్నింగ్‌

బ్రిక్స్‌ సదస్సు వేళ.. అమెరికా అధ్యక్షుడు మరో సంచలన ప్రకటన చేశారు. బ్రిక్స్‌తో పొత్తు ఉంటే 10 శాతం అదనపు సుంకాలు తప్పవని హెచ్చరించారు. బిక్స్‌ విధానాలు అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నాయన్న ఆయన.. ఈ అడిషనల్‌ టారిఫ్‌ల విధింపులో ఎలాంటి మినహాయింపు ఉండబోదని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల BRICS దేశాలపై గట్టి హెచ్చరిక జారీ చేశారు. BRICS కూటమి అమెరికా వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని ట్రంప్ ఆరోపించారు. BRICS‌తో పొత్తు పెట్టుకునే ఏ దేశమైనా 10% అదనపు టారిఫ్‌కు గురవుతుందని ప్రకటించారు. ఈ విధానంలో ఏ దేశానికి.. ఎలాంటి మినహాయింపులు ఉండబోదు అని స్పష్టం చేశారు. అయితే బ్రిక్స్‌ను అమెరికా వ్యతిరేక కూటమిగా ఆయన ఎందుకు అభివర్ణించారో స్పష్టత లేనప్పటికీ.. .. బ్రెజిల్‌ రియో డి జనీరో వేదికగా BRICS 2025 సమ్మిట్ జరుగుతున్న వేళ.. ట్రంప్‌ నుంచి ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. తాజాగా BRICS దేశాలు అమెరికా-ఇజ్రాయెల్‌ దేశాలు ఇరాన్‌పై దాడులను తీవ్రంగా ఖండించాయి. అమెరికా యుద్ధ చర్యలతో వాణిజ్య ఆంక్షలు వంటి అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. అంతేకాదు.. అమెరికా, ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్లను ప్రస్తావించకుండానే.. ప్రతీకార సుంకాలు, బెదిరింపులను ఖండిస్తూ రియో డి జనీరో డిక్లరేషన్‌ను విడుదల చేశాయి. ఇందులో.. BRICS నేతలు ఏకపక్ష టారిఫ్ విధానాలను తీవ్రంగా ఖండించారు ఈ సుంకాలు WTO నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.ఈ నిర్ణయాలు.. ప్రపంచ వాణిజ్య స్థిరత్వాన్ని ఇది దెబ్బతీస్తుందని హెచ్చరించారు.BRICS 2009లో ఏర్పాటైంది. భారత్, చైనా, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, UAE, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేసియా, ఇరాన్.. సభ్య దేశాలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మొత్తం 11 సభ్య దేశాల కూటమి జనాభా.. ప్రపంచ జనాభాలో సుమారు 49.5% (దాదాపు 3.93 బిలియన్ మంది) కలిగి ఉంది. ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో (GDP) సుమారు 40% వాటా కలిగి ఉన్నాయి. అంతేకాదు.. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 26% వాటా BRICS దేశాలదే.ట్రంప్ ఇప్పటికే 12 దేశాలకు టారిఫ్ నోటీసులు సిద్ధం చేశారని తెలిపారు. అమెరికా టారిఫ్‌ మినహాయింపు 90 రోజుల గడువు ముగుస్తుండడంతో.. ఈ నిర్ణయం జూలై 9న అమలులోకి వచ్చే అవకాశం లేకపోలేదనే చర్చ మొదలైంది. అయితే..ఆగస్టు 1 నుంచి నూతన వాణిజ్య సుంకాలు: అమెరికా నూతన సుంకాలు జులై 9 నుంచి అమల్లోకి వస్తాయని గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అవి ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని తాజాగా అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్‌ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఒప్పందాలను నిర్ణయించే పనిలో ట్రంప్‌ నిమగ్నమై ఉన్నారని వెల్లడించారు.

Without Going To Gym Woman weight came down From 95 Kg To 65 Kg9
జిమ్‌కు వెళ్లకుండానే 30 కిలోలు తగ్గింది

అధిక బరువుకు కారణాలనేకం. జీవన శైలి, ఆహార అలవాట్లు, కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో చాలా మంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు. అయితే ‘‘చిన్నప్పటినుంచీ నేనింతే’’ అని కొంతమంది సరిపెట్టుకుంటే, మరికొంతమంది మాత్రం భిన్నంగా ఉంటారు. అధిక బరువుతో వచ్చే అనారోగ్య సమస్యల కారణంగా అయితేనే నేమి, అందంగా ఆరోగ్యంగా ఉండాలనే కోరికతోనేమి కష్టపడి శరీర బరువును తగ్గించు కుంటారు. అలా జిమ్‌ కెళ్లకుండానే 95 కిలోల వెయిట్‌ నుంచి 65 కిలోలకు చేరుకుందో యవతి. అదెలాగో తెలుసుకుందాం.ఇది ఉదితా అగర్వాల్ వెయిట్‌ లాస్‌ జర్నీ. బరువు తగ్గడం అనేది కష్టమైన ప్రయాణం. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ బరువు తగ్గాల్సి వస్తే ఇంకా కష్టం. అందుకే కారణాలను విశ్లేషించుకుని నిపుణుల సలహాతో ముందుకు సాగాలి. అలా సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అయిన ఉదితా అగర్వాల్ కేవలం ఫిట్‌నెస్ కోసం మాత్రమే కాకుండా తన ఆరోగ్యాన్ని మెరుగుపరచు కోవడానికి కూడా బరువు తగ్గాలని నిర్ణయించుకుంది. అద్బుతమైన విజయాన్ని సాధించింది.ఇదీ చదవండి: 300కు పైగా రైతులకు సాధికారత : తొలి ఏడాదిలోనే రూ. 8.7 కోట్లుఉదితా చిన్నప్పటి నుంచి ఊబకాయంతో బాధపడేది. దీనికి తోడు పిగ్మెంటేషన్, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, విపరీతంగా జుట్టు రాలిపోవడం, మొటిమలు, ముఖం మీద అన్‌వాంటెడ్‌ హెయిర్‌ ఇలా సవాలక్ష సమస్యలతో సతమతమయ్యేది. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలికి మారడం ద్వారా 8 నెలల్లో 30 కిలోల బరువు తగ్గింది. అదీ జిమ్‌కు వెళ్లకుండానే 95 కిలోల బరువున్న ఉదితా 65 కిలోలకు చేరుకుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడింది. View this post on Instagram A post shared by Udita Agarwal (@udita_agarwal20) తన వెయిట్‌ లాస్‌ జర్నీ గురించి సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో వైరల్‌గా మారింది. శుభ్రమైన ఆహారాలు తినడం ద్వారా ఆమె సహజంగానే 30 కిలోల బరువు తగ్గింది. ముఖ్యంగా "బరువు తగ్గడంలో జంక్‌ ఫుడ్‌ను మానేయడమే అది పెద్ద చాలెంజ్‌’’ అని ఆమె చెప్పుకొచ్చింది.చదవండి: చిన్నతనం నుంచే ఇంత పిచ్చా, పట్టించుకోకపోతే ముప్పే : ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ఉదిత వెయిట్‌ లాస్‌లో సాయపడిన అలవాట్లుడీటాక్స్ వాటర్: ప్రతిరోజూ డీటాక్స్ వాటర్ తీసుకునేది. ముఖ్యంగా జీరా, అజ్వైన్, సోంపు, మెంతిని నీటిలో మరిగించి తాగేది. ఇది ఉబ్బరాన్ని నివారించి జీర్ణక్రియకు సహాయపడుతుంది.ఆహారంపై దృష్టి: అప్పుడప్పుడు చీట్‌ మీల్‌ తీసుకున్నా.. ఆరోగ్యకరమైన ఆహార నియమాన్ని కచ్చితంగా పాటించేది.ఒక్కోసారి వెయిట్‌ పెరిగినా నిరాశపడలేదు: ప్రతీ రోజు వెయిట్‌ చెక్‌ చేసుకుంటూ ఉండేది. ఒకసారి బరువు పెరిగినా నిరుత్సాహ పడేది కాదు,అసలు ఆ హెచ్చుతగ్గులను పట్టించుకోలేదు.ఇంటి ఫుడ్‌: ఇంట్లో ఉన్నా, బయటికెళ్లినా, ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినేది. చియా సీడ్ వాటర్: చియా విత్తనాలను అర లీటరు నీటి నాన బెట్టి రోజుకు 3-4 లీటర్ల చొప్పున రోజంతా తాగేది. రోజుకు ఒకసారి టీ, మైదా ఫుడ్‌కు దూరంగా ఉంటూ అతిగా తినకుండా ఉండటానికి ఉదిత ప్రతి భోజనానికి ముందు నీరు త్రాగేది.

Jyoti Malhotra was Hired by Kerala Tourism RTI10
కేరళ శారీలో పాక్ గూఢచారి జ్యోతి మల్హోత్రా

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ కోసం గూఢచర్యం చేశారన్న అరోపణలతో అరెస్టయిన హర్యానాకు చెందిన ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా విచారణలో ఆమె నడిపిన అనేక బాగోతాలు వెలుగు చూస్తున్నాయి. జ్యోతి మల్హోత్రా కేరళ పర్యాటకరంగ ప్రోత్సహక ప్రచారంలో అతిథిగా భాగస్వామ్యం వహించారని, ఈ సందర్భంగా ఆమె కేరళను సందర్శించారని వెల్లడయ్యింది. సమాచార హక్కు (ఆర్‌టీఐ) చట్టం కింద అడిగిన ఒక ప్రశ్నకు వచ్చిన సమాధానంలో జ్యోతి మల్హోత్రాతో ముడిపడిన ఒక అంశం వెలుగు చూసింది. దక్షిణాదిని పర్యాటకంపరంగా ప్రోత్సహించేందుకు అతిథులుగా ఎంపిక చేసిన 41 మంది ఇన్‌ఫ్లుయెన్లర్లలో జ్యోతి మల్హోత్రా కూడా ఉన్నారని తేలింది. వీరి పర్యటనకు కేరళ ప్రభుత్వం నిధులు సమకూర్చిందని, వారి ప్రయాణం, వసతి, ఆహారం కోసం రాష్ట్ర ప్రభుత్వం సహకరించిదని సమాచారం. అలాగే వీడియోలను చిత్రీకరించడంలో వారికి సహాయం చేయడానికి ఒక ప్రైవేట్ ఏజెన్సీని కూడా ప్రభుత్వం నియమించింది.జ్యోతి మల్హోత్రాకు కేరళ ప్రభుత్వం సహకరించిందన్న విషయం బయటపడిన దరిమిలా ప్రతిపక్షాలు అధికార ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. కేరళ ప్రభుత్వం సరైన వెరిఫికేషన్ లేకుండా విదేశీ గూఢచారులను ఆహ్వానించిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. వీటిపై కేరళ పర్యాటక మంత్రి పీఏ మహమ్మద్ రియాస్ స్పందిస్తూ కేరళకు ఇతర ఇన్‌ఫ్లుయెన్లర్లతో పాటు జ్యోతిని ఆహ్వానించారని అన్నారు. ఇది కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో చేసిన ప్రయత్నమన్నారు. ఇది పారదర్శకంగా, మంచి ఉద్దేశంతో చేసిన కార్యక్రమమని, గూఢచారులని ముందుగా తెలుసుకోవడం ఎవరికీ సాధ్యపడదని అన్నారు.కేరళలో జ్యోతి మల్హోత్రా కొచ్చి, కన్నూర్, కోజికోడ్, అలప్పుజ, మున్నార్, తిరువనంతపురం ప్రాంతాలను సందర్శించారు. వీటికి సంబంధించిన వ్లాగ్‌లను ఆమె తన యూట్యూబ్‌ ఛానల్‌తో పాటు పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలలో షేర్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత గత మే నెలలో ఆమెను అరెస్టు చేశారు. పహల్గామ్‌ ఉగ్రదాడికి ముందు జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్‌ను సందర్శించారని పోలీసుల విచారణలో తేలింది.జరిగింది ఇదే.. జ్యోతి మల్హోత్రా.. హర్యానాకు చెందిన 33 ఏళ్ల యూట్యూబ్ వ్లాగర్, "Travel with Jo" అనే ఛానెల్ ద్వారా పలు దేశాల్లోని ప్రయాణ అనుభవాలను పంచుకుంటూ ప్రజాదరణ పొందారు. అయితే, 2025 మేలో ఆమెపై పాకిస్తాన్‌కు గూఢచర్యం చేసిన ఆరోపణలతో అరెస్ట్‌ చేశారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.2023లో ఆమె మొదటిసారిగా ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అక్కడ ఆమెకు "దానిష్" అనే పాక్ అధికారి పరిచయం అయ్యాడు. అదే సమయంలో ఆమె పాక్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌లోకి ప్రవేశించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. 2023 నుంచి 2025 మధ్యకాలంలో ఆమె కనీసం మూడు సార్లు పాకిస్తాన్‌కు ప్రయాణించినట్లు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. లాహోర్, కటాస్ రాజ్ ఆలయం వంటి ప్రదేశాల్లో ఆమె తీసిన వీడియోలు ఇప్పుడు దర్యాప్తులో భాగంగా పరిశీలించబడుతున్నాయి. 2024–2025లో కేరళ టూరిజం శాఖ ఆమెను అధికారికంగా ఆహ్వానించి, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో టూరిజం ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆహ్వానించింది. ఆమె ప్రయాణ ఖర్చులు, వసతి, షెడ్యూల్ అన్నీ ప్రభుత్వమే భరించింది. ఆమె "కేరళ సారీ" ధరించి తేయ్యం ప్రదర్శనలో పాల్గొన్న వీడియో వైరల్ అయింది. 2025 ఏప్రిల్‌లో పహల్గాం ఉగ్రదాడికి ముందు ఆమె పాకిస్తాన్‌లో కనిపించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఆమెకు అక్కడ సాయుధ రక్షణ ఉండటం గమనార్హం. ఇది ఆమెపై ఉన్న అనుమానాలను మరింత బలపరిచింది. దర్యాప్తులో భాగంగా.. ఆమె యూట్యూబ్ ఛానెల్‌లోని పాక్, బంగ్లాదేశ్‌, థాయిలాండ్ వీడియోలన్నీంటిని ఏజెన్సీలు పరిశీలించాయి. డిలీట్‌ చేసిన డాటాను సైతం రికవరీ చేసి గుట్టును తేల్చే ప్రయత్నంలో ఉన్నాయి. 2025 మే 16న హర్యానాలోని హిసార్‌లో ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెపై Official Secrets Act, 1923 కింద కేసు నమోదు చేశారు. జూన్ 12న బెయిల్ అభ్యర్థన తిరస్కరించబడింది. జూన్ 23న న్యాయస్థానం ఆమె న్యాయ హిరాసతను మరో రెండు వారాలు పొడిగించింది. తదుపరి విచారణ జూలై 7న(ఇవాళ) జరగనుంది. పాక్‌కు భారత రహస్యాలను చేరవేశారనే అభియోగాల కింద జ్యోతితో పాటు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో మరో 12 మందిని అరెస్ట్ చేశారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement