వరంగల్, న్యూస్‌లైన్ :
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటే ఊరుకునేది లేదని విద్యుత్ ఉద్యోగులు హెచ్చరించారు. ఎన్పీడీసీఎల్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవా రం సిబ్బంది నగరంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించా రు. కార్పొరేట్ కార్యాలయం పక్కన ఉన్న విద్యుత్ గెస్ట్‌హౌస్ నుంచి ప్రారంభమైన ర్యాలీ కళాకారుల ఆట పాటలు, డప్పు చప్పుళ్ల మధ్య కొనసాగింది. ఈ సందర్భంగా సీమాంధ్ర నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు తరలిరావడంతో విద్యుత్ భవన్ నుంచి అమరవీరుల స్థూపం వరకు ట్రాఫిక్ స్తంభించింది. ర్యాలీ అనంతరం తెలంగా ణ అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, విద్యుత్ ఉద్యోగుల ఐక్య వేదిక చైర్మన్ వొంటేరు తిరుపతిరెడ్డి మాట్లాడారు. దశాబ్దాల పోరాటాల ఫలితంగా వచ్చిన తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్రులు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ వస్తే విద్యుత్‌లోటు ఉంటుం దం టూ అబద్దాలు ప్రచారం చేస్తున్న సీమాంధ్ర నేతలు దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతంలో విద్యుత్ ప్రాజెక్టు లు నిర్మించకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. ఇక్కడి బొగ్గును తరలించుకుపోయి విద్యుత్ ప్రాజెక్టులు నిర్మిం చుకున్నారని, మన బొగ్గుతో ఉత్పత్తి చేసిన కరెంట్‌ను మనకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని విమర్శించా రు. తెలంగాణను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం అమరవీరు స్థూపం నుంచి ఆర్ట్స్ కళాశాల మైదానం వరకు ర్యాలీగా వెళ్లి బీజేపీ దీక్షలకు సంఘీభావం ప్రకటించా రు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ యూనస్, అధికారులు ఎస్‌ఈ మోహన్‌రావు, నార్ల సుబ్రమణ్యేశ్వర్‌రావు, సామ్యానాయక్, బండారి ప్రభాకర్, గూడూరు సమ్మిరెడ్డి, శ్రీరాంనాయక్, రవీందర్, ప్రభావతి, రాజేం దర్, వాలూ నాయక్, కుమారస్వామి, లక్ష్మణ్ నాయక్, మమత, కవిత, జితేందర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణను అడ్డుకుంటే ఊరుకోం
Published Sat, Sep 7 2013 3:05 AM | Last Updated on Fri, Sep 1 2017 10:30 PM
Advertisement
Advertisement