72 గంటల పాటు హైదరాబాద్ బంద్! | Telangana JAC plan to go for 72 hours hyderabad bandh | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 5 2013 11:28 AM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM

తెలంగాణ జేఏసీ కీలక సమావేశం ఈ రోజు సాయంత్రం 4 గంటలకు టీఎన్జీవో భవన్లో జరగనుంది. ఈ నెల 7న తలపెట్టిన శాంతి ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించడం, అదే సమయంలో ఏపీఎన్జీవోల సభను అనుమతి ఇవ్వడంపై జేఏసీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. టీఆర్ఎస్తో పాటు బీజేపీ నేతలు కూడా ఈ జేఏసీ భేటికి హాజరు కానున్నారు. ఇందులో 72 గంటల పాటు హైదరాబాద్ బంద్ నిర్వహించే అంశంపై జేఏసీ నేతలు చర్చించనున్నారు. భేటీ అనంతరం జేఏసీ నేతలు కీలక ప్రకటన చేయనున్నారు. మరోవైపు శాంతిర్యాలీకి అనుమతి ఇవ్వాలంటూ న్యాయవాది శ్రీరంగారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ స్వీకరించిన న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement