Telangana State
-
ఎం.ఎం.ఎం మర్డర్స్.. మగ్గు.. మరణశిక్ష!
నేరాల నిరోధం (ప్రివెన్షన్), కేసులు కొలిక్కి తీసుకురావడం (డిటెక్షన్), నిందితుల్ని దోషులుగా నిరూపించడం (కన్విక్షన్).. ఇవి పోలీసుల ప్రాథమిక విధులు. మొదటి రెండింటి మాట అటుంచితే అనివార్య కారణాల నేపథ్యంలో మూడోది మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. కోర్టులో నేర నిరూపణే కష్టసాధ్యంగా మారిన తరుణంలో ఇక నిందితుడికి ఉరి శిక్ష అనేది దుర్లభమే. గత ఏడాది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం మూడు కేసుల్లోనే ఈ శిక్షపడగా.. వాటిలో ఒకటి హైదరాబాద్‌లోని నారాయణగూడ పరిధిలో జరిగిన ఓ కుటుంబ హత్యకు సంబంధించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడికి ఉరి శిక్ష పడటంతో ఓ హోటల్ మగ్గు కీలకమైన భౌతిక సాక్ష్యంగా నిలిచింది.హైదరాబాద్, అంబర్‌పేటలోని గోల్నాకకు చెందిన రావుల సాయి అలియాస్ నాగుల సాయి.. శుభకార్యాలకు బ్యాండ్ వాయించే పని చేస్తుండేవాడు. ఆ పనిలేనప్పుడు చిత్తుకాగితాలు ఏరుకుని బతుకీడ్చేవాడు. అతనికి స్నేహితుడి ద్వారా హైదరాబాద్‌లోని చిక్కడపల్లి వాసి ఆర్తితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 2014లో ఇరువురూ ఒక్కటి కాగా.. ఏడాదికి కూతురు పుట్టింది. ఆ ఇద్దరి మధ్యా ఉన్న చిన్న చిన్న స్పర్థలు చినికి చినికి గాలివానగా మారడంతో ఆర్తి 2021లో భర్తను వదిలేసింది. కూతురిని తీసుకుని చిక్కడపల్లిలోని పుట్టింటికి వెళ్లిపోయి తల్లి లక్ష్మీబాయి, సోదరుడు జితేందర్లతో కలిసి ఉండసాగింది. సాయి తరచు ఆర్తి పుట్టింటికి వెళ్తూ ఆమె కుటుంబీకులతో ఘర్షణ పడేవాడు. ఓ సందర్భంలో జితేందర్‌పై దాడి చేసి, మరోసారి కోర్టు ధిక్కరణ నేరంపై జైలుకూ వెళ్లాడు. ఆర్తికి మగతోడు అవసరమని తలచిన జితేందర్ భార్య అనువైన సంబంధం కోసం వెదకసాగింది. ఆమె ద్వారా పరిచయమైన నాగరాజు మీద ఆర్తి కుటుంబానికి సదభిప్రాయం కలగడంతో 2021లో వీరిద్దరికీ వివాహం చేశారు. తన భార్యను వివాహం చేసుకుని తనకు పూర్తిగా దూరం చేశాడనే ఉద్దేశంతో నాగరాజుపై ద్వేషం పెంచుకున్నాడు సాయి. హైదరాబాద్, నారాయణగూడ ఫ్లైఓవర్ కింద ఉన్న మార్కెట్లో నాగరాజు పూల వ్యాపారం చేసేవాడు. అతనికి ఆర్తి చేదోడువాదోడుగా ఉండేది. తరచు తమ దుకాణం వద్దకు వచ్చి ఘర్షణ పడుతున్న, తన భార్యతో వాగ్వాదానికి దిగుతున్న సాయిని నాగరాజు అనేకసార్లు మందలించాడు. వీరికి కొడుకు (విష్ణు) పుట్టడంతో సాయిలో ద్వేషంతో పాటు ఈర్ష్య కూడా పెరిగింది. దాంతో అతని ప్రవర్తన విపరీతంగా మారడమే కాదు ఆర్తి కుటుంబాన్ని నాశనం చేస్తానంటూ పలుమార్లు బహిరంగంగానే బెదిరించాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన నాగరాజు.. తన భార్యను వేధిస్తున్న సాయిని బెదిరించాలని భావించాడు. 2022 నవంబర్ 7న నారాయణ గూడ మెట్రో స్టేషన్ వద్ద నాగరాజుకు సాయి కనిపించాడు. అతడిని అడ్డగించి.. మరోసారి ఆర్తితో మాట్లాడినా, ఫోన్ చేసి బెదిరించినా ఊరుకునేది లేదంటూ బెదిరించిన నాగరాజు.. ఇకపై ఆమెను సోదరిగా భావిస్తూ చెల్లి అని పిలవాలంటూ హెచ్చరించాడు. ఈ పరిణామంతో విచక్షణ కోల్పోయిన సాయి.. చిక్కడపల్లికే చెందిన తన స్నేహితుడు రాహుల్‌తో కలిసి నాగరాజు, ఆర్తిల హత్యకు కుట్రపన్నాడు. అదేరోజు రాత్రి హైదరాబాద్, నల్లకుంటలోని పెట్రోల్ బంక్ నుంచి ఖాళీ వాటర్ బాటిల్లో పెట్రోల్ తీసుకు వచ్చాడు. ఆర్తి, నాగరాజు తమ దుకాణంలో ఉన్నారని గుర్తించిన అతగాడు.. ఇద్దరిపైనా పెట్రోల్ చల్లడం ఇబ్బందికరమని భావించాడు. తన స్నేహితుడు రాహుల్‌తో కలిసి నారాయణ గూడ ఫ్లైఓవర్ సమీపంలో ఉన్న లక్కీ కేఫ్‌లోకి వెళ్లాడు. అక్కడ మంచి నీళ్లు తాగుతూ అదును చూసుకుని ఓ మగ్గు తస్కరించాడు. నాగరాజు దుకాణానికి సమీపంలో ఆగి బాటిల్లోని పెట్రోల్‌ను మగ్గులో పోసుకున్నాడు. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఓ చేతిలో అగ్గిపెట్టెను సిద్ధంగా ఉంచుకుని నాగరాజు దుకాణం వద్దకు వెళ్లాడు. ఆర్తి, నాగరాజు తేరుకునేలోపే వారిపై మగ్గులోని పెట్రోల్ చల్లి నిప్పంటించాడు. ఆ దాడిలో వీరిద్దరితో పాటు ఆర్తి ఒడిలో ఉన్న ఎనిమిది నెలల విష్ణు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడ నుంచి రాహుల్‌తో కలిసి బర్కత్‌పుర వైపు పారిపోయిన సాయి నల్లగొండకు చేరి తలదాచుకున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆర్తి, విష్ణు, నాగరాజు చనిపోయారు. పోస్టుమార్టంలో ఆర్తి గర్భవతని తేలింది. దీంతో సాయి చేతిలో చనిపోయింది నలుగురుగా తేల్చారు. నారాయణగూడ పోలీసులు సాయి, రాహుల్‌ను అదే నెల 16న అరెస్టు చేశారు. ఈ కేసులో దర్యాప్తు చేసిన అధికారులు ఘటనాస్థలి నుంచి కాలిన స్థితిలో ఉన్న మగ్గును స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఇన్వెస్టిగేషన్ అనంతరం 48 మందిని సాక్షులుగా చేరుస్తూ కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. కోర్టు విచారణ సందర్భంగా కొందరు సాక్షులు విముఖత చూపినా.. పెట్రోల్ చల్లేందుకు వాడిన, సగం కాలిన మగ్గు కీలకమైన భౌతిక సాక్ష్యంగా మారింది. దీన్ని తస్కరించినట్లు సాయి అంగీకరించగా.. అది తమ మగ్గే అంటూ లక్కీ కేఫ్ యజమాని సాక్ష్యం చెప్పాడు. దీన్ని సైతం ఓ కీలక ఆధారంగా పరిగణించిన న్యాయస్థానం సాయి, రాహుల్‌ను దోషులుగా తేల్చింది. గత నెల 20న (20.12.2024) సాయికి ఉరి శిక్ష, రాహుల్‌కు జీవితఖైదు విధించింది. ఈ కేసు విచారణలో నారాయణగూడ ఇన్స్పెక్టర్ యు.చంద్రశేఖర్ కీలక పాత్ర పోషించారు. -
తెలంగాణకు వానగండం
-
ఇదేం కమిషన్?
సాక్షి, హైదరాబాద్: విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ తొలిదశలోనే వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేయాల్సిన కమిషన్‌ను ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంటోందన్న విమర్శలు వస్తున్నాయి. విద్యా కమిషన్ కోసం ఏర్పాటు చేసిన సలహా మండలి సభ్యులు ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎలాంటి హేతుబద్ధత లేకుండా, తమను సంప్రదించకుండానే సభ్యులుగా చేర్చారని కొందరు సభ్యులు మండిపడుతున్నారు.సలహా మండలిలో చేరేదే లేదని ఇప్పటికే ఇద్దరు సీనియర్ ప్రొఫెసర్లు ప్రభుత్వానికి స్పష్టం చేశారని.. మరో ఇద్దరు ఇదే బాటలో ఉన్నారని తెలిసింది. మరోవైపు కమిషన్ చైర్మన్ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. కమిటీ ఏర్పాటు చేసినా.. ఎలాంటి మౌలిక సదుపాయాలు ఇవ్వకపోవడం, సలహాదారుల ఎంపికలో తనకు ప్రమేయమే లేకపోవడాన్ని ఆయన జీర్ణించుకోవడం లేదని తెలిసింది. విద్యాశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి అన్నీ తానే అయి నడిపిస్తుండటమే దీనికి కారణమని విద్యాశాఖ వర్గాలు చెప్తుండటం గమనార్హం. ఇవేం నియామకాలు? విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. చైర్మన్‌గా ఆకునూరి మురళిని నియమించింది. చాలా రోజుల తర్వాత కమిషన్‌కు ముగ్గురు సభ్యులను నియమించింది. వాస్తవానికి విద్యా రంగంలోని వివిధ విభాగాల నుంచి సభ్యుల నియామకం జరగాలని కొన్ని నెలల క్రితం జరిగిన మేధావుల సమావేశంలో సీఎంకు పలువురు సూచించారు. కానీ ఒక కార్పొరేటర్, అధికార పారీ్టకి చెందిన ఓ స్కాలర్ సహా మరో వ్యక్తిని సభ్యులుగా నియమించడంపై విమర్శలు వచ్చాయి. దీనివల్ల సభ్యులు రాజకీయ కోణంలో ఆలోచించే అవకాశం ఉంటుందని.. విద్యా రంగంలో పారదర్శకంగా సంస్కరణలు చేపట్టలేమనే అభిప్రాయాలు వచ్చాయి.ఈ నేపథ్యంలోనే విద్యా కమిషన్‌కు సలహా కమిటీ సభ్యులుగా ప్రొఫెసర్ హరగోపాల్ సహా పలువురు ప్రొఫెసర్లను నియమించారు. అయితే ఈ నియామకాలు విద్యా కమిషన్ పరిధిలో జరిగి ఉంటే బాగుండేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేవలం కొందరి సూచనల మేరకు సలహా కమిటీని సీఎం వేశారని అంటున్నారు. సలహా కమిటీ కేవలం ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని.. అలాంటప్పుడు విద్యా కమిషన్‌కు స్వతంత్ర ప్రతిపత్తి ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. సంస్కరణలు సాధ్యమేనా? విద్యా కమిషన్‌పై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని.. విద్యా రంగంలో సంస్కరణల దిశగా అడుగులు వేయడం లేదని సలహా కమిటీలో నియమితులైన సభ్యుడొకరు మండిపడ్డారు. కర్నాటకలోనూ విద్యా కమిషన్ ఏర్పాటు చేశారని, ఆ కమిషన్ మొత్తం 14 సబ్ కమిటీలను వేసుకుందని.. వాటి ద్వారా మార్పులకు శ్రీకారం చుడుతోందని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ రాజకీయ, సామాజిక కోణంలోని వారినే ఈ కమిషన్ పరిధిలోకి తెచ్చారని.. సాంకేతిక విద్య, అంగన్వాడీ, ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యలో నిపుణులను భాగస్వామ్యం చేసే పరిస్థితి కనిపించడం లేదన్నారు. అంతేగాకుండా అసలు విధులేమిటో చెప్పలేదని, ఏం సలహాలివ్వాలి, ఎవరికి ఇవ్వాలనే స్పష్టతా లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో విద్యా కమిషన్‌కు ఆదిలోనే తలపోట్లు తప్పేలా లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు..
-
తెలంగాణ బీజేపీ అధ్యక్ష నియామకంపై సస్పెన్స్
-
మహా ప్రగతి
నింగినంటే ఆకాశ హర్మ్యాలు.. వేగం పెంచిన రహదారులు.. ఫ్లైఓవర్లు.. ప్రపంచ నగరాల చెంతన నిలిపిన అంతర్జాతీయ హంగులతో మహానగరం గ్లోబల్ సిటీగా అవతరించింది. దేశవిదేశాలకు చెందిన కార్పొరేట్ దిగ్గిజాలకు కేరాఫ్‌గా నిలిచింది. ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సదస్సులు, ఉత్కంఠభరితమైన పోటీలు జరిగాయి. గత పదేళ్లలో నగరంలో అనేక మార్పులు వచ్చాయి. దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి, శ్వేతసౌధాన్ని తలపించే సచివాలయం, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల భారీ విగ్రహం, ఆ చెంతనే కొలువుదీరిన మాజీ ప్రధాని పీవీ విగ్రహం.. లుంబినిని ఆనుకొని నిర్మించిన అమరుల స్మారకం, ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు మార్గంలో పర్యాటకులను ఆకట్టుకొనే డబుల్ డెక్కర్ బస్సులు, లక్షలాదిమంది ప్రయాణికులకు చేరువైన మెట్రో రైలు. సుమారు రూ.వంద కోట్లతో నిర్మించిన సైకిల్‌ట్రాక్, ప్రపంచదేశాలను ఆకట్టుకున్న ఫార్ములా–ఈ వంటి పోటీలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం పదేళ్లలో మహా నగరం రూపురేఖల్లో అనూహ్యమైన మార్పులొచ్చాయి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నగరాలతో పోటీ అన్నట్లుగా విశ్వనగరం దిశగా అడుగులు వేస్తోంది.నూతన రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన భాగ్యనగరం ప్రగతి పథంలోనూ తనదే పైచేయి అంటూ సగర్వంగా నినదిస్తోంది. తెలంగాణ రాష్ట్రం అవతరించి పదేళ్లవుతున్న సందర్భంగా ‘సాక్షి’ బిగ్ స్టోరీ. – సాక్షి, హైదరాబాసిటీబ్యూరో బృందం రూ.8 వేల కోట్లతో ఎస్సార్డీపీ.. నగరంలో ఎస్సార్డీపీ (వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం) కింద దాదాపు రూ.8 వేల కోట్ల పనులు జరిగాయి. వీటిలో ఎలివేటెడ్ కారిడార్లు, ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, ఆర్ఓబీలు, ఆర్‌యూబీలు, తదితరమైనవి ఉన్నాయి. మొదటి దశ కింద చేపట్టిన ఈ పనుల్లో 36 పూర్తిచేశారు. మరో ఆరు పురోగతిలో ఉన్నాయి. పూర్తయిన పనుల వల్ల రద్దీ మార్గాల్లో వాహన వేగం 15 కేఎంపీహెచ్ నుంచి 35 కేఎంపీహెచ్‌కు పెరిగింది. దాదాపు రూ.450 కోట్లతో స్లిప్‌రోడ్లు, లింక్‌రోడ్లు నిర్మించారు.రూ.530 కోట్లతో ఎస్ఎన్డీపీ.. ఎస్ఎన్డీపీ (వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం) కింద రూ. 530 కోట్ల పనులు చేశారు. లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లకుగాను దాదాపు 70 వేల గృహాలను లబ్ధిదారులకు అందజేశారు. థీమ్‌పార్కులు, కాలనీపార్కుల వంటివి వందలాదిగా అభివృద్ధి చేశారు. సమగ్ర రోడ్డు నిర్వహణ పథకం (సీఆర్ఎంపీ) పథకం ద్వారా ఎంపిక చేసిన ప్రధాన రహదారుల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకివ్వడంతో రోడ్ల సమస్యలు తగ్గాయి. 38 మోడల్ మార్కెట్లు, 12 మల్టీ పర్పస్ ఫంక్షన్ హాళ్లు, 30కి పైగా శ్మశాన వాటికల నిర్మాణం/ఆధునికీకరణ పనులు చేశారు. బస్తీ దవాఖానాలు.. అన్నపూర్ణ భోజనం పేదలకు రూ. 5లకే అన్నపూర్ణ భోజనం, బస్తీ దవాఖానాలు అందుబాటులోకి వచ్చాయి. చెత్త తరలింపునకు స్వచ్ఛ ఆటోలు, రెఫ్యూజ్ కాంపాక్ట్ వాహనాలు వినియోగంలోకి తెచ్చారు. 5 ప్రధాన కారిడార్ల ద్వారా నిత్యం 15 లక్షల వాహనాలు (పీసీయూ) ప్రయాణిస్తున్నాయి. దశాబ్ద కాలంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అనేక సంస్కరణలు చేపట్టింది. అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడంతో పాటు అండర్ గ్రౌండ్ లైన్ల సంఖ్యను పెంచింది. సామర్థ్యానికి మించి నమోదవుతున్న డిమాండ్‌ను తట్టుకుని నిలిచేలా సరఫరా వ్యవస్థను మెరుగుపర్చింది. రయ్‌మన్న ఫార్ములా– ఈ హుస్సేన్‌సాగర్ తీరంలో గతేడాది ఫిబ్రవరి 11న అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఫార్ములా–ఈ పోటీలు ప్రపంచం దృష్టినిఆకర్షించాయి. ఈ పోటీల కోసం నెక్లెస్‌రోడ్డులో 2.8 కిలోమీటర్ల స్ట్రీట్ సర్క్యూట్‌ను ఏర్పాటు చేశారు. పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహనాల ప్రాధాన్యతను ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యంగా దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా– ఈ ప్రిక్స్ పోటీల్లో 11 జట్లకు చెందిన 22 మంది రేసర్లు అద్భుతమైన ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. పాదచారుల భద్రతకు ఉప్పల్ స్కైవాక్ ప్రతిరోజు వేలాది మంది బాటసారులు నలువైపులా నడిచే ఉప్పల్ రింగ్‌రోడ్డు వద్ద హెచ్ఎండీఏ నిర్మించిన స్కైవాక్‌తో పాదచారుల భద్రతకు భరోసా ఏర్పడింది. సుమారు రూ.25 కోట్లతో ఈ స్కైవాక్‌ను నిర్మించారు. దీని నిర్మాణంలో 8 లిఫ్టులు, 6 మెట్ల మార్గాలు, మరో 4 ఎస్కలేటర్లను ఏర్పాటు చేశారు. సైకిల్ ట్రాక్.. అదరహో.. ఔటర్‌రింగ్ రోడ్డు మార్గంలో అంతర్జాతీయ ప్రమాణాలతో 23 కిలోమీటర్ల మేర సైకిల్ ట్రాక్‌ను నిర్మించారు. దీనికి సోలార్ రూఫ్‌ను కూడా ఏర్పాటు చేశారు. దేశంలోనే ఇది తొట్టతొలి అధునాతన సైక్లింగ్ ట్రాక్. నానక్‌రామ్‌గూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు 8.5 కి.మీ, కొల్లూరు నుంచి నార్సింగి వరకు మరో 14.5 కి.మీ మేర దీన్ని ఏర్పాటు చేశారు. 5.3 మీటర్ల వెడల్పుతో, మూడు లైన్లతో ట్రాక్‌ను నిర్మించారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం.. నెక్లెస్ రోడ్డులో సుమారు 11.4 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో ఆహ్లాదకరమైన పచ్చదనం వాతావరణం మధ్య భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని నెలకొల్పారు. ఎలాంటి ప్రతికూల వాతావరణాన్నైనా తట్టుకొనేవిధంగా ఈ మహామూర్తిని ఏర్పాటు చేశారు. పార్లమెంట్ భవనం ఆకృతిలో ఏర్పాటు చేసిన బేస్మెంట్ మరో ప్రత్యేకమైన ఆకర్షణ. ఇది 50 అడుగుల ఎత్తు ఉంటుంది. బేస్మెంట్లోని హాళ్లలో అంబేడ్కర్ జీవితంపై విస్తారమైన సమాచారంతో కూడిన గ్రంథాలయం, ఆయన జీవిత విశేషాలను, రాజ్యాంగ రచనా కాలం నాటి ఫొటోలను, చిత్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. నలువైపులా మెట్రో సేవలు... నగరంలో 2017 నవంబర్‌లో మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మెట్రో ప్రయాణికుల సంఖ్య 54 కోట్లు దాటింది. నగరంలోని మూడు కారిడార్లలో మెట్రో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. మెట్రో రెండో దశలో భాగంగా ప్రస్తుత ప్రభుత్వం ఎల్బీనగర్, పాతబస్తీ రూట్ల నుంచి ఎయిర్‌పోర్టు వరకు మెట్రో నిర్మించనున్నారు.అలాగే నగరం నలువైపులా మెట్రో రైళ్లను విస్తరించేందుకు ప్రణాళికలను రూపొందించారు. భేషుగ్గా నీటి నిర్వహణ కోటిన్నరకు పైగా జనాభా కలిగిన మహా నగరానికి తాగునీటి సరఫరాతో పాటు మురుగు నీటి నిర్వహణను జలమండలి సమర్థంగా నిర్వహిస్తోంది. నగర నలుమూలల తాగునీటి రిజర్వాయర్లతో పాటు మంచినీటి శుద్ధి కేంద్రాలను నిర్మించి తాగునీరు సరఫరా చేస్తోంది. భవిష్యత్ తాగునీటి సరఫరాకు భరోసా కల్పిస్తూ సుంకిశాల ప్రాజెక్టు నిర్మిస్తోంది. మరోవైపు వంద శాతం మురుగు శుద్ధి కోసం మూడు ప్యాకేజీల్లో అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో కొత్తగా 31 మురుగు నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణ పనులు చేపట్టగా అందులో ఇప్పటికే సగానికి పైగా పూర్తయ్యాయి. నగర వాసులకు నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచిత తాగునీటి సరఫరా పథకం అమల్లోకి వచి్చంది. పారిశుద్ధ్య విధానం పూర్తిగా మ్యానువల్ నుంచి యాంత్రికానికి మారింది. ప్రస్తుతం సివర్ జెట్టింగ్ యంత్రాలను వినియోగిస్తోంది. మ్యాన్ హోళ్లలో మానవ సహిత పారిశుద్ధ్య పనులు నిషేధించింది. హుస్సేన్ సాగర్ పరిరక్షణ చర్యల్లో భాగంగా కూకట్పల్లి నుంచి వచ్చే మురుగు నీటిని సాగర్‌లో కలవకుండా వేరే ప్రాంతానికి మళ్లించింది. దశాబ్ది ధగధగలు అవతరణ ఉత్సవాలకు ముస్తాబైన గ్రేటర్ సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు నగరం ముస్తాబైంది. ఆదివారం జరగనున్న వేడుకల కోసం ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. సెక్రటేరియట్, అంబేడ్కర్ విగ్రహం, అమరుల స్మారకం, నెక్లెస్‌రోడ్డు, తెలుగుతల్లి ఫ్లైఓవర్, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాలు వెలుగులు విరజిమ్మేలా ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమకారులతో పాటు, అమరుల కుటుంబాలను సమున్నతంగా గౌరవించనుంది. సాయంత్రం 6 గంటలకు ట్యాంక్‌బండ్ వద్ద సుమారు 700 మందికి పైగా కళాకారులు, వివిధ సాంస్కృతిక బృందాలు భారీ కవాతును నిర్వహించనున్నాయి. బతుకమ్మ, బోనాలు, డప్పు వాద్యాలు, ఒగ్గుడోలు తదితర కళాకారుల బృందాలు వేడుకల్లో పాల్గొంటాయి. తెలంగాణ రుచులను పరిచయం చేసే వివిధ రకాల వంటలతో స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. లేజర్ షోలతో ఆకాశం సరికొత్త అందాలను సంతరించుకోనుంది. రాత్రి 8.50 గంటలకు బాణాసంచా వెలుగుల్లో వేడుకలను ముగించనున్నారు.నేడు ట్రాఫిక్ ఆంక్షలుమధ్యాహ్నం 2 నుంచి రాత్రి 12 గంటల వరకు ఖైరతాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 12 గంటల వరకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలతో పాటు మళ్లింపులు ఉంటాయని పోలీసులు తెలిపారు. » లుంబినీ పార్క్, ఎన్టీఆర్ ఘాట్, ఎన్టీఆర్ గార్డెన్, ఐమాక్స్, పీపుల్స్ ప్లాజా ఎగ్జిబిషన్లు ఆదివారం మూసివేసి ఉంటాయి. సాధారణ ప్రజలు, పర్యాటకులు ఆయా ప్రాంతాలకు రాకూడదు. » ట్యాంక్‌బండ్‌పై జరిగే ఉత్సవాలకు పాసులు ఉన్నవారికే అనుమతి ఉంటుంది. » మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఎఎస్, ఐపిఎస్ అధికారులతో పాటు పోలీసులు, అధికారులు వారి వారి వాహనాల పార్కింగ్ కోసం బోట్స్ క్లబ్, చి్రల్డన్స్ పార్క్, హోటల్ అమోఘం, సచివాలయం నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ రోడ్డు, నెక్లెస్ రోడ్డు సంజీవయ్య పార్క్ రోడ్డు, జీహెచ్ఎంసీ లేన్లతో పాటు ఎనీ్టఆర్ స్టేడియంను పార్కింగ్ కోసం కేటాయించారు. » రాణిగంజ్ రైల్వే ట్రాక్ నుంచి నెక్లెస్ రోడ్డు వైపు వచ్చే వాహనాలకు అనుమతి లేదు. ఆ వాహనాలు మినిస్టర్ రోడ్డు వైపు మళ్లిస్తారు. సైఫాబాద్ ఓల్డ్ పీఎస్ నుంచి వచ్చే వాహనాలు రవీంద్రభారతి వైపు డైవర్షన్ తీసుకోవాలి. » తెలుగుతల్లి ఫ్లైఓవర్ పై నుంచి స్టీల్ బ్రిడ్జి వైపు వెళ్లే వాహనాలను అనుమతిస్తారు. తెలుగుతల్లి చౌరస్తా, ట్యాంక్‌బండ్ వైపు అనుమతి లేదు. » కూకట్పల్లి నుంచి పంజాగుట్ట, సికింద్రాబాద్ వైపు, పంజాగుట్ట వైపు వాహనాలకు అనుమతి ఉంటుంది. ఖైరతాబాద్ చౌరస్తా వైపు అనుమతించరు. » మెహిదీపట్నం నుంచి లక్డీకాపూల్ వైపు వచ్చే వాహనాలను మాసబ్ ట్యాంక్ నుంచి సికింద్రాబాద్ వైపు అనుమతిస్తారు. » లిబర్టీ, హిమాయత్‌నగర్ నుంచి ట్యాంక్‌బండ్, అంబేద్కర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలకు అనుమతి లేదు. ఖైరతాబాద్ ఫ్రైలఓవర్ మీదుగా నెక్లెస్ రోడ్డు, ఐమాక్స్ వైపు వెళ్లే వాహనాలను అనుమతించరు. నేరాల నియంత్రణకు ఐసీసీసీపదేళ్ల కాలంలో ‘గ్రేటర్’లో పోలీసు విభాగాలకు సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెం.12లో అందుబాటులోకి వచ్చిన హైదరాబాద్ పోలీసు కమిషనరేట్– తెలంగాణ స్టేట్ పోలీసు ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీఎస్‌పీఐసీసీసీ) తలమానికంగా నిలిచింది. దీన్ని 6.427 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ భవనంలో హైదరాబాద్ కమిషనర్ ఇతర ఉన్నతాధికారులతో పాటు సైబర్ సేఫ్టీ బ్యూరో, నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, డయల్–100, వ్యవస్థీకృత నేరాల నిరోధక విభాగం, ప్రాసిక్యూషన్ సపోర్ట్ సెంటర్, సిటిజన్ ఫీడ్‌బ్యాక్ సపోర్ట్ సెంటర్ తదితరాలు ఉన్నాయి. ఇది మొత్తం ఏడు ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులోని ‘ఏ’ టవర్ 1,69,000, ‘బీ’ టవర్ 1,25,000, ‘సీ’ టవర్ 34,414, ‘డీ’ టవర్ 27,166, ‘ఈ’ టవర్ 45,000, బేస్మెంట్ 2,16,365 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. 60 మీటర్ల ఎత్తులో 14,15 అంతస్తుల మధ్య ఉన్న స్కై బ్రిడ్జ్ 20,750 అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ విభాగాల సీసీ కెమెరాలన్నీ ఇక్కడి కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించి ఉంటాయి. గ్రేటర్‌లోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో సుమారు పది లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల విషయంలో దేశంలోనే ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. సైబరాబాద్‌లోని తూర్పు భాగంతో ప్రత్యేకంగా రాచకొండ పోలీసు కమిషనరేట్ ఏర్పాటైంది. ప్రతి కమిషనరేట్‌లోనూ జోన్లు, డివిజన్లు, పోలీసుస్టేషన్లు పునర్ వ్యవస్థీకరణ జరిగింది. -
చిహ్నం విషయంలో చర్చ జరగాలి!
ఐదు దశాబ్దాల పైగా అస్తిత్వం కోసం పోరాడిన తెలంగాణకు జనగీతం ఏది? పదేళ్ల క్రితం ‘మా రాష్ట్రం’ అని చెప్పుకునే అవకాశం తెలంగాణ ప్రజలకు దక్కింది. ఒక రాష్ట్రంగా చిహ్నం, విగ్రహం రూపుదిద్దుకున్నాయి. తెలంగాణ అవతరణ పదేళ్ల తరువాత, కాంగ్రెస్ పార్టీవారి ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని ‘తెలంగాణ రాష్ట్ర గీతం’గా ప్రకటించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని కూడా మార్చి కొత్త చిహ్నాన్ని రూపొందిస్తోంది. ఈ సందర్భంగా రకరకాల చర్చలు మొదలయ్యాయి.దేశానికి ఒక జాతీయ గీతం ఉన్నట్లే రాష్ట్రానికి ఓ రాష్ట్ర గీతం ఉండాలని కోరుకోవడం సహజమే. రాష్ట్రం ఏర్పడ్డ పదేళ్ల తరువాత ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే... దానిపై వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి.జాతీయ గీతంలాగే రాష్ట్ర గీతం...జాతీయ గీతం ‘జన గణ మన’, జాతీయ గేయం ‘వందేమాతరం’... రెండింటినీ సమానంగా గౌరవించాలని మన రాజ్యాంగ సభ అధ్యక్షులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజ్యంగ సభలో ప్రకటించారు. అప్పటి నుంచి భారతీయులు ఆ యా గీతాలను అత్యంత గౌరవంతో ఆలాపిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ పర్వదినాలను నిర్వహించే సమయంలో చిన్నా పెద్ద, అధికారి, అనధికారి అనే భేదం లేకుండా అందరూ గౌరవంగా నిలబడాలనేది ఒక నియమం. కనీసం జాతీయ గీతాలాపన సమయంలో మౌనంగా ఉండి తమ గౌరవాన్ని వ్యక్తం చేయాలి. అయితే అలా గౌరవించనివారూ ఉంటారు. అందుకు శిక్షలు ఉండవు. కాని, అవమానిస్తే మాత్రం నేరమే. రెండు జాతీయ గీతాలకూ, జాతీయ చిహ్నానికీ, జాతీయ పతాకానికీ సంబంధించి ఒక చట్టం కూడా చేసుకున్నాం.దేశ సౌభాగ్యాన్నీ, సంస్కృతీ వారసత్వాలూ, గొప్పదనాన్నీ ప్రతిబింబించే మన జాతీయ గీతాలను గర్వంగా భారతీయులమంతా ఎలా ఆలపిస్తున్నామో... అంతే గర్వంగా రాష్ట్రాల ప్రజలు తమ తమ రాష్ట్ర గీతాలను ఆలపించడం సహజం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదేళ్లయినా ఇంతవరకూ రాష్ట్ర గీతం అంటూ ఏదీ లేకపోవడాన్ని కొందరు చర్చిస్తూ వచ్చారు. చరిత్ర, సంస్కృతి, వారసత్వాల పేర సాగిన ఉద్యమ ఫలితంగా ఏర్పడిన రాష్ట్రం కావడంతో ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం అందెశ్రీ రాసిన గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించడంతో చాలామంది స్వాగతించారు. ఎందుకంటే ఈ గీతం తెలంగాణలో ఉన్న పాత జిల్లాల అన్నింటి ప్రత్యేకతలనూ, వైశిష్ట్యాన్నీ అద్భుతంగా ఆవిష్కరించింది కనుక. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలందరినీ ఒక ఊపు ఊపింది కనుక. అలాగే దీని రచయిత అందెశ్రీ తెలంగాణ మట్టిమనిషి, ఉద్యమకారుడు. తన కలం, గళం ద్వారా ప్రజాబాహుళ్యంలోకి చొచ్చుకుపోయినవారు. అందుకే చాలామంది రాష్ట్ర గీత ప్రకటనను స్వాగతిస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వ కొత్త చిహ్నం..గత తెలంగాణ ప్రభుత్వం ఆమోదించి అమలులో పెట్టిన ప్రభుత్వ చిహ్నాన్ని పక్కన పెట్టి, ప్రస్తుత ప్రభుత్వం మరో నమూనాను రూపొందిస్తున్నది. ఇప్పటికే దానిపై సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి వంటి రాజకీయ పార్టీల నేతలతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. ఈ నమూనా చాలా బాగుందని కొందరూ, బాగులేదనీ మరికొందరూ అంటున్నారు.అసలు ఇప్పుడు రాష్ట్ర చిహ్నాన్ని మార్చడం, రాష్ట్ర గీతం అంటూ ఒక గీతాన్ని ప్రకటించడం అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. పోనీ వాటిని నిర్ణయించేటప్పుడు ప్రధాన ప్రతిపక్షాన్ని సంప్రదించాలి కదా? దాన్నీ ఈ ప్రక్రియలో భాగం చేయలేదనేది ప్రధానమైన విమర్శ. ఇది సమస్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించి ఏమార్చడానికే అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.విధానం, సంవిధానం? దేశానికి కానీ, రాష్ట్ర స్థాయిలో ప్రతి రాష్ట్రానికి కానీ ఒక ప్రత్యేక నిర్ణయ విధానం (పాలసీ) అంటూ ఒకటి ఉండాలి. ప్రజలందరికీ సంబంధించిన కొన్ని అంశాలపై నిర్ణయాలను కేవలం ‘మంత్రివర్గం’ తీసుకుంటే సరిపోదు. విస్తృతంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించాల్సి ఉంటుంది. సభలు, సదస్సులు, జిల్లా స్థాయి చర్చలు, సంప్రదింపులు జరపాలి. సోషల్ మీడియా, ఇంటర్నెట్ ద్వారా వివిధ వర్గాలవారి అభిప్రాయాలను సేకరించిన తర్వాతే కొన్ని నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవాలి. మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలూ, అసెంబ్లీ సమావేశాల్లో చేసిన చర్చలూ, నిర్ణయాలను అందరికీ అందుబాటులో ఉండేలా వైబ్సైట్లో పెట్టాలి. మొత్తంమీద రాష్ట్ర గీత ప్రకటన, ప్రభుత్వ చిహ్నం మార్పు వంటి అంశాల్లో అధికార పక్షం ఏకపక్షంగా వ్యవహరించడం అన్యాయం. – వ్యాసకర్త డీన్, స్కూల్ ఆఫ్ లా, మహీంద్రా యూనివర్సిటీఅభిప్రాయం: మాడభూషి శ్రీధర్ -
తెలంగాణ రాష్ట్ర గేయం.. ఇప్పుడే ఎందుకు వివాదమైంది?
తెలంగాణ రాష్ట్ర గేయంపై కొత్తగా వివాదం ఎందుకు వచ్చింది? గతంలో లేని వివాదం ఇప్పుడే ఎందుకు వివాదమైంది? రాష్ట్ర గేయం రూపకల్పనలో గులాబీ పార్టీకి ఉన్న అభ్యంతరం ఏంటి? ఇందులో కాంగ్రెస్ సర్కార్ పాత్ర ఎంతవరకు ఉంది? పాటకు సంగీతం సమకూరుస్తున్న వ్యక్తే వివాదానికి కేంద్ర బిందువుగా మారారా? దీనిపై బీఆర్ఎస్ ఏమంటోంది? ముఖ్యమంత్రి రేవంత్ సమాధానం ఏంటి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతోంది. దశాబ్ది ఉత్సవాలు చేసుకుకోవాల్సిన సమయంలో కొత్త వివాదాలు ముందుకు వస్తున్నాయి. రాష్ట్ర చిహ్నంలో మార్పులు, రాష్ట్ర గేయం రూపకల్పనపైన ప్రధాన విపక్షం నుంచి తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కారు, హస్తం పార్టీల మధ్య తెలంగాణ గేయం ఇరుక్కుంది. రాష్ట్ర గేయం అంశం పదేళ్లలో ఎన్నడూ చర్చనీయాంశం కాలేదు. కానీ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర గేయం అంశాన్ని మళ్ళీ తెరమీదకు తీసుకుని వచ్చింది. అందులో మార్పులు చేసి గేయాన్ని సరికొత్తగా ఆవిష్కరించాలని నిర్ణయించింది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆలోచన బాగానే ఉన్నా.. పాట రచయిత అందే శ్రీ తో ప్రభుత్వంతో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ, పాటకు సంగీతం సమకూర్చే పనిని కీరవాణికి అప్పగించటంపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.తెలంగాణ ఆత్మ గౌరవ అంశాన్ని తెలంగాణేతరులకు అప్పగించటం పట్ల గులాబీ పార్టీ నేతలు మండి పడుతున్నారు. సంగీత దర్శకులు, గాయకుల్లో తెలంగాణ బిడ్డలు చాలామంది ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలనే కొత్త వివాదాలు సృష్టిస్తున్నారని బీ ఆర్ ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా గేయానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకునే పెట్టేందుకే గులాబీ పార్టీ నాయకత్వం నిర్ణయించుకుంది.ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని కూడా చూస్తోంది. రాష్ట్ర కోసం, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవద్దనిబీఆర్‌ఎస్ అనుకుంటోంది. ఇది చిలికి చిలికి గాలి వానలా మారుతుండటంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓ ప్రకటనతో చల్లగా వివాదం నుంచి తప్పుకున్నారు. తెలంగాణ గేయ రచన, సంగీతం సమకూర్చే పనిని కీరవాణికి అప్పగించే విషయంలో తన ప్రమేయం ఏమీ లేదని ఇదంతా అందే శ్రీ చూస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి అనుమతి లేకుండానే అందెశ్రీ నిర్ణయాలు తీసుకుంటారా అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. అదేవిధంగా తెలంగాణ రాజముద్రలో కాకతీయ తోరణం, చార్మినార్లను తొలగించాలన్ని నిర్ణయాన్ని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్రంగా తప్పుపడుతున్నారు. తెలంగాణ వారసత్వానికి, పోరాటాలకు చిహ్నాలుగా ఉన్నవాటిని ఎలా తొలగిస్తారని నిలదీశారు. తెలంగాణ రాష్ట్ర గేయానికి సంగీతం సమకూర్చే బాధ్యతను తెలంగాణేతరులకు ఇవ్వడానికి వీల్లేదని గులాబీ పార్టీ గట్టిగా పట్టుపడుతోంది. మరి ప్రభుత్వం ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. -
రాజముద్రపై రాజకీయ రగడ
-
తెలంగాణ రాష్ట్ర గేయం ఇదే
జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లీ నీరాజనం!! పలు జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణా!! పోతనది పురిటిగడ్డ, రుద్రమది వీరగడ్డ గండరగండడు కొమురం భీముడే నీ బిడ్డ!! కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్!! జై తెలంగాణ జై జై తెలంగాణా!! జానపద జనజీవన జావలీలు జాలువారు కవిగాయక వైతాళిక కళల మంజీరాలు!! జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర అనునిత్యం నీగానం అమ్మ నీవే మా ప్రాణం!! జై తెలంగాణ జై జై తెలంగాణా!! సిరివెలుగులు విరజిమ్మె సింగరేణి బంగారం అణువణువున ఖనిజాలు నీ తనువుకు సింగారం!! సహజమైన వన సంపద చక్కనైన పువ్వుల పొద సిరులు పండే సారమున్న మాగాణియే కద నీ ఎద!! జై తెలంగాణ జై జై తెలంగాణా!! గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్లాలి పచ్చని మాగాణుల్లో పసిడి సిరులు పండాలి!! సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణ యుగం కావాలి!! జై తెలంగాణ జై జై తెలంగాణా!! అందెశ్రీ నేపథ్యం.. తెలంగాణ రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణ జననీ జయకేతనం అనే పాటను వరంగల్ జిల్లాకు చెందిన తెలుగు కవి, సినీగేయ రచయిత అందెశ్రీ రాశారు. ప్రజాకవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధుడైన అందెశ్రీ వరంగల్ జిల్లా జనగామ వద్ద ఉన్న రేబర్తి అనే గ్రామంలో జూలై 18, 1961లో జన్మించారు. ఈయన అసలు పేరు అందె ఎల్లయ్య. గొర్రెల కాపరిగా పనిచేసిన ఈయన్ను శృంగేరి మఠానికి సంబంధించిన స్వామీ శంకర్ మహారాజ్ అందెశ్రీ పాడుతుండగా విని చేరదీశాడు. రాష్ట్రవ్యాప్తంగా అందెశ్రీ పాటలు ప్రసిద్ధం. నారాయణ మూర్తి నటించిన విప్లవాత్మక సినిమాల విజయం వెనక అందెశ్రీ పాటలున్నాయి. 2006లో గంగ సినిమాకు గాను నంది పురస్కారాన్ని అందుకున్నారు. బతుకమ్మ సినిమా కోసం ఈయన సంభాషణలు రాశారు. కాకతీయ విశ్వవిద్యాలయం అందెశ్రీని గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. అందెశ్రీ సినీ పాటల జాబితా జయజయహే తెలంగాణ జననీ జయకేతనం పల్లెనీకు వందనాలమ్మో మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు గలగల గజ్జెలబండి కొమ్మ చెక్కితే బొమ్మరా.. కొలిచి మొక్కితే అమ్మరా జన జాతరలో మన గీతం ఎల్లిపోతున్నావా తల్లి చూడాచక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి -
నకిలీ డాక్టర్లకు చెక్..
సాక్షి, హైదరాబాద్: అర్హత లేకున్నా వైద్యులుగా ప్రాక్టీస్ చేస్తున్న వారిపై, అక్రమంగా ఆసుపత్రులు నడుపుతున్నవారిపైనా తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి (టీఎస్ఎంసీ) ఉక్కుపాదం మోపుతోంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, ఖైరతాబాద్‌లో అర్హత లేకున్నా ప్రాక్టీస్ చేస్తున్న రెండు ఆసుపత్రు లకు ఇటీవలే ఎన్నికైన కొత్త మండలి నోటీసులు జారీ చేసింది. సదరు ఆసుపత్రుల్లో యాంటీబయా టిక్స్, స్టెరాయిడ్స్ వంటి షెడ్యూల్డ్ డ్రగ్స్‌ను గుర్తించి ఈ మేరకు వాటిపై కేసులు నమోదు చేసింది. ఇంకా అనేక చోట్ల నకిలీ వైద్యుల దందాపై దాడులకు శ్రీకారం చుట్టింది. డాక్టర్లుగా చెప్పుకునే ఆర్ఎంపీలపై క్రిమినల్ కేసులు పెడతామని మండలి హెచ్చరించింది. పేరుకు ముందు ‘డాక్టర్’ హోదా పెట్టుకున్నా, ఆసుపత్రి అని రాసి ఉన్న బోర్డులు ప్రదర్శించినా, రోగులకు ప్రిస్క్రిప్షన్ రాసినా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ఆర్ఎంపీల ముసుగులో రాష్ట్రంలో ఆర్ఎంపీ, పీఎంపీలు 30 వేల మంది వర కు ఉన్నారని ఓ అంచనా. ప్రతీ గ్రామంలో వారు ప్రాక్టీస్ చేస్తుంటారు. అయితే కొంతమంది నకిలీ సర్టిఫికెట్లతో ఆర్ఎంపీలు, పీఎంపీల ముసుగులో డాక్టర్లుగా చెలామణీ అవుతూ.. ఇష్టారాజ్యంగా అబార్షన్లు చేయడం, అత్యధిక మోతాదులో ఉన్న యాంటీబయాటిక్స్ ఇవ్వడం, చిన్న రోగాలకు కూడా అధికంగా మందులు రాస్తున్నారని మండలి గుర్తించింది. ఇటీవల నగరంలోని మలక్‌పేట్ ప్రాంతంలో నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను కలిగి ఉన్న ఒక అర్హతలేని ప్రాక్టీషనర్ ప్రిస్క్రిప్షన్‌ను పరిశీలిస్తే, శిశువుకు యాంటీబయాటిక్ ఇంజెక్షన్ మెరోపెనెమ్ రాయడం చూసి అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. సహజంగా శిశువులకు ఉపయోగించే యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు పెద్దలకు ఉప యోగించేవి కాకుండా ప్రత్యేకంగా ఉంటాయి. పెద్ద లకు వాడే ఇంజెక్షన్లు శిశువుకు ప్రాణాంతకంగా మారతాయి. మలక్‌పేటలోని ఆ నకిలీ డాక్టర్ మాది రిగానే చాలామంది నకిలీ డాక్టర్లు మానసిక ఔష ధాల ప్రిస్క్రిప్షన్‌లోనూ ఇష్టారాజ్యంగా మందులు రాస్తున్నారని తేలింది. ఈ నేపథ్యంలో నకిలీ డిగ్రీని ప్రదర్శించడం, అర్హత లేకున్నా ప్రిస్క్రిప్షన్లు రాయ డం వంటి దృష్టాంతాలను మండలి తీవ్రంగా తీసు కుంది. మరోవైపు అడ్డగోలుగా అల్లోపతి మందు లను సూచిస్తున్న ఇద్దరు నకిలీ ఆయుష్ వైద్యులను గుర్తించి వారిపై ఆయుష్ శాఖకు లేఖ రాసింది. ఇక నకిలీ వైద్యుల ఆగడాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) సాయాన్ని కూడా తీసుకోవాలని మండలి నిర్ణయించింది. నకిలీ ప్రైవేట్ ప్రాక్టీషనర్ల ద్వారా రోగులకు మందులు అందకుండా చేయాలని నిర్ణయించింది. -
నిరుద్యోగ యువత ఆకాంక్ష నెరవేరేనా!
తెలంగాణ ఉద్యమం ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ ప్రధాన అంశాలుగా ప్రారంభమైంది. విద్యార్థులు ఈ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. సుమారు 1,200 మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం కోసం తమ జీవితాలను అర్పించారు. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమీప భవిష్యత్తులో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉండదనీ, నూతన రాష్ట్రంలో తమ కలలు సాకారం అవుతాయనీ భావించిన నిరుద్యోగులు ఆశించారు. కానీ వారి ఆశలు ఆడియాసలయ్యాయి. మొదటి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా ఉద్యోగ నియామకాల ఊసు లేకపోవడంతో 2015లో నిరుద్యోగ జేఏసీని ఏర్పాటు చేసి ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకటీ అరా ఉద్యోగ ప్రకటనలు వచ్చినా అనేక మంది ఉద్యమకారులకు పరీక్షలకు హాజరవ్వడానికి వయసు మీరిపోయింది. అర్హత ఉన్న చాలా మంది సీనియర్లకు నవ యువకులతో పోటీపడే శక్తి లేకుండా పోయింది. అదే సమయంలో ఉద్యోగ నియామకా లపై కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇంతలో కొత్త ప్రభుత్వం మొదటి టెర్మ్ ముగిసిపోయింది. 2018లో మళ్లీ ఎన్నికలు వచ్చాయి. అంతకు ముందు అధికారంలో ఉన్న పార్టీయే మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఈసారన్నా తమకు ఉద్యోగాలొస్తాయని నిరుద్యోగులు భావించారు. ఇంతలో కరోనా విజృంభించింది. దాని కోరల నుంచి బయటపడి గ్రూప్ వన్ పరీక్షకు ప్రిపేర్ అయిన నిరుద్యోగులను పేపర్ లీకేజ్ వ్యవహారం కుంగదీసింది. అప్పటినుంచి నిరు ద్యోగులు చదవడం మానేసి తమకు జరిగిన అన్యా యాన్ని గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలు పెట్టారు. ప్రభుత్వం నిరుద్యోగులకు భరోసా కల్పించడంలో విఫలమైంది. అదే సమయంలో ఉద్యోగం రాలేదని బాధతో ప్రాణ త్యాగం చేసినటువంటి ఒక విద్యార్థిని కూడా అవహేళన చేసే విధంగా మాట్లాడారు అధికారంలో ఉన్నవారు. అటువంటి అహంకార ధోరణిని నిరుద్యోగులు జీర్ణించుకోలేక పోయారు. అప్పటివరకు రాజకీయ ప్రక్రియలో చురుకుగా పాల్గొనని నిరుద్యోగ యువతీ యువకులు ఒక్కసారిగా రాజకీయాలను మార్పు చేయాలనీ, తమ తలరాతను తామే మార్చుకోవాలనీ భావించి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సాధారణ ఎన్ని కల్లో ప్రభావాన్ని చూపించారు. 2023 జూన్ కంటే ముందు తెలంగాణలో వేరే పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదు. ఎందుకంటే బలమైన ప్రతిపక్షం లేదు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే నాయకులను మనం వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. అటువంటి పరిస్థితులలో గ్రూప్ వన్ పేపర్ లీకేజీ అంశం ప్రతిపక్ష పార్టీలకు ప్రధానఅస్త్రంగా మారింది. అప్పటినుంచి రాష్ట్రంలో రాజ కీయ సమీకరణలు మారినాయి. అన్ని పార్టీలు నిరు ద్యోగ సమస్యని తమ ప్రధాన ఎజెండాగా కార్యా చరణ రూపొందించడం ప్రారంభించాయి. ఈ నిరు ద్యోగ ఉద్యోగ సమస్యలు ఈనాడు కాంగ్రెస్ ప్రభు త్వాన్ని అధికారంలోకి తీసుకొని వచ్చాయి అనడంలో అతిశయోక్తి కాదు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమ యంలో అధికార పార్టీ చాలా అంశాలను ప్రస్తావించింది కాని, నిరుద్యోగులకూ, ఉద్యోగులకూ భరోసా కల్పించే విధంగా ఏ వాగ్దానాలు చేయలేదు. అందు వలన ఎక్కడెక్కడో చదువుకొనే చాలామంది నిరు ద్యోగులూ, చిరుద్యోగులూ తమ తమ గ్రామాలకు వెళ్లి ఆ గ్రామాలలో ఉన్నటువంటి మిగతా వర్గాల వారికీ, ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వారికీ... తమ వాదాన్నీ, బాధనూ అర్థమయ్యేలా చెప్పు కున్నారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేయమని అర్థించారు. నిరుద్యోగుల సమస్యలను ప్రజానీకానికి తెలి యచేయడానికి శిరీష అలియాస్ బర్రెలక్క ఎన్నికల్లో పోటీ చేయడం తెలిసిందే. ఒక సాధారణ వెనుక బడిన తరగతికి చెందిన యువతికి సపోర్ట్ చేయడా నికి విదేశాల నుంచి కూడా కొందరు రావడం, మన రాష్ట్రంలోని చాలామంది ప్రముఖులు ఆమెకు మద్దతు ప్రకటించడం మనం గమనించాం. నిరు ద్యోగ సమస్య ఎజెండాగా తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి హేమాహేమీ నాయకులకు చెమటలు పట్టించిందామె. కాబట్టి పార్టీలు ఈ అంశాన్ని ఒక గుణపాఠంగా భావించవలసిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇవ్వడం, జాబ్ క్యాలెండర్లు ప్రకటిస్తామని భరోసా కల్పించడంతో నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీని సంపూర్ణ మెజారిటీతో గెలిపించారు. పార్టీలో గెలిచినటువంటి 64 మంది అభ్యర్థుల మెజారిటీని మనం గమనిస్తే ఎక్కువమంది సుమారు 20 వేల నుంచి 65 వేల మధ్య మెజారిటీ సాధించినవారే కనిపిస్తారు. ఇందుకు కారణం నిరుద్యోగ యువతే అని చెప్పవచ్చు. నూతన ప్రభుత్వమైనా విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలను పరిష్కరించి వారి బంగారు భవిష్యత్తుకు బాట వేస్తుందని ఆశిద్దాం. -వ్యాసకర్త రాజనీతి శాస్త్ర ఉపన్యాసకుడు మొబైల్: 99514 50009 - డా‘‘ ఎ. శంకర్ -
తెలంగాణలో మరోసారి తెరపైకి నియోజకవర్గాల పునర్విభజన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జిల్లాలను పునర్విభజన చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రకటించడంతో పాటు ఆ దిశగా కసరత్తు కూడా ప్రారంభమైన నేపథ్యంలో జీహెచ్ఎంసీ జోన్లు, సర్కిళ్లలోనూ మార్పు చేర్పులు ఉంటాయా? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జీహెచ్ఎంసీలో గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఐదు జోన్లు (ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్) ఉండేవి. వాటిలో 18 సర్కిళ్లు ఉండేవి. 18 సర్కిళ్లను తొలుత 24 సర్కిళ్లుగా మార్చారు. తర్వాత వాటిని 30 సర్కిళ్లుగా చేశారు. ఐదు జోన్లను ఆరు జోన్లుగా మార్చారు. ఆరు జోన్లకు చార్మినార్, ఎల్బీనగర్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, సికింద్రాబాద్ జోన్లుగా పేర్లు పెట్టారు. 12 జోన్లు.. 48 సర్కిళ్లు.. పరిపాలన సౌలభ్యం కోసమంటూ గత ప్రభుత్వం జిల్లాల సంఖ్యను పెంచినట్లే జీహెచ్ఎంసీ జోన్లను సైతం 12 జోన్లుగా చేయాలని.. ఒక్కో జోన్లో నాలుగు సర్కిళ్ల వంతున 48 సర్కిళ్లను ఏర్పాటు చేయాలని భావించింది. ఆమేరకు జీఓ కూడా వెలువడింది. కానీ.. ఎందుకనో అది కార్యరూపం దాల్చలేదు. జోన్లను పదికి, సర్కిళ్లను యాభైకి పెంచాలని 2018లో స్టాండింగ్ కమిటీ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించగా, 12 జోన్లు.. 48 సర్కిళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం జీఓ వెలువరించింది. కానీ అంతకుముందే ఏర్పాటైన ఆరు జోన్లే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జిల్లాల పునరి్వభజన తెరపైకి రావడంతో జీహెచ్ఎంసీలోనూ జోన్లు, సర్కిళ్లు మారతాయా అనేది జీహెచ్ఎంసీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికీ ప్రస్తుతమున్న సర్కిళ్లు, జోన్లలో సమస్యలున్నాయి. ఖైరతాబాద్ జోన్ షేక్‌పేట దాకా విస్తరించి ఉంది. శేరిలింగంపల్లి ఒకే జిల్లా పరిధిలో లేదు. ఇలా వివిధ అంశాల్లో వ్యత్యాసాలున్నాయి. గతంలో ఇలా.. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా వాటిని 12 జోన్ల పరిధిలోకి తేవాలని భావించారు. ఒక్కో జోన్లో రెండు నియోజకవర్గాలు, నాలుగు సర్కిళ్లు ఉండేలా పునర్వ్యవస్థీకరించాల్సిందిగా జీవో జారీ చేశారు. ఆమేరకు కమిషనర్‌ను ఆదేశించారు. కానీ ఏర్పాటు కాలేదు. ప్రస్తుతం జీహెచ్ఎంసీలోనూ మార్పుచేర్పులు జరగవచ్చననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్ బాధ్యతలు కమిషనర్‌కు.. జీహెచ్ఎంసీ పరిధిలో నాలుగు జిల్లాలున్నాయి. అన్ని జిల్లాల్లో ఎన్నికల నిర్వహణ కలెక్టర్లది కాగా హైదరాబాద్ జిల్లాది మాత్రం కమిషనర్‌కు అప్పగించారు. దీంతో ఎన్నికలొచ్చినా ప్రతిసారీ జీహెచ్ఎంసీలో పనులు నిలిచిపోతున్నాయి. కోటిమందికి పైగా సేవలందించే జీహెచ్ఎంసీ కమిషనర్‌కు జిల్లా ఎన్నికల అధికారి బాధ్యతలున్నాయి. గ్రేటర్ పరిధిలోనే ఉన్న ఒక జిల్లాలో ఐదు నియోజకవర్గాలుంటే, ఒక జిల్లాలో 15 నియోజకవర్గాలున్నాయి. ఒక ఎమ్మెల్యే పరిధిలో తక్కువ వార్డులుంటే.. మరో ఎమ్మెల్యే పరిధిలో ఎక్కువ వార్డులున్నాయి. ఇలా వివిధ అంశాల్లో వ్యత్యాసాలున్నాయి. దీంతో నియోజకవర్గాలతో పాటే జీహెచ్ఎంసీ జోన్లు, సర్కిళ్లు, వార్డుల్లోనూ మార్పుచేర్పులుంటాయా ? అనేది చర్చనీయాంశంగా మారింది. -
18న ములుగులో సభ.. 19న భూపాలపల్లిలో పాదయాత్ర
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణలో మూడు రోజుల పర్యటన ఖరారైంది. ఈనెల 18న కాంగ్రెస్ బస్సుయాత్రను ప్రారంభించేందుకు రానున్న ఆయన మూడు రోజులపాటు ఇక్కడే ఉండనున్నారు. ముందుగా కొండగట్టు నుంచి బస్సుయాత్రను ప్రారంభించాలని భావించినా, రాహుల్ షెడ్యూల్లో కొంత మార్పు జరిగింది. దీని ప్రకారం రామప్ప ఆలయం వద్ద రాహుల్ కాంగ్రెస్ బస్సుయాత్రను ప్రారంభిస్తారు. ఏఐసీసీ వర్గాలు వెల్లడించిన ఈ షెడ్యూల్ ప్రకారం 18, 19, 20 తేదీల్లో ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో రాహుల్ బస్సుయాత్రలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పాదయాత్రలు చేయనున్న ఆయన పలువురు కారి్మకులు, ఇతర వర్గాలతో సమావేశం కానున్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని సందర్శించనున్నారు. ములుగు, పెద్దపల్లి, ఆర్మూర్ బహిరంగ సభల్లో పాల్గొంటారు. మూడు దశల్లో బస్సు యాత్ర ప్రతి రోజు మూడు నియోజకవర్గాల చొప్పున 12 రోజులపాటు రాష్ట్రంలోని 36 నియోజకవర్గాల్లో బస్సుయాత్ర నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా తొలి విడతలో రాహుల్ మూడు రోజులపాటు 8 నియోజకవర్గాల్లో యాత్ర నిర్వహించనున్నారు. మూడు రోజుల పర్యటనతో తొలి విడత యాత్ర ముగియనుండగా, దసరా తర్వాత రెండో విడత ప్రారంభించనున్నారు. ఆ సమయంలో ప్రియాంకా గాంధీ హాజరయ్యే అవకాశముంది. ఇక, నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిశాక మూడో విడత నిర్వహించాలని, ఈ యాత్రకు సోనియాతో సహా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యేలా టీపీసీసీ ప్రణాళిక రూపొందిస్తోంది. -
మూడోసారి.. మూడో తేదీ... ముక్కోణం!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత మూడోసారి జరుగుతున్న ఎన్నికల ఫలితాలు మూడో తేదీనే రావడం.. అందునా ఈసారి ముక్కోణపు పోరు జరుగుతుండటం ‘ప్రత్యేకత’ను సంతరించుకుంటోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పటి నుంచి చూసినా ముక్కోణ పోటీలు మనకు తక్కువే. 1978, 2009లలో మినహా మూడు పార్టీల మధ్య ఎన్నికల పోరాటం జరగలేదు. కాంగ్రెస్–జనతా పార్టీ, కాంగ్రెస్–కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్–తెలుగుదేశం పార్టీల మధ్యనే ఎన్నికల్లో పోటీ ఉండేది. అప్పుడో పార్టీ, ఇప్పుడో పార్టీ పోటీలోకి వచ్చినా ద్విముఖ పోటీలో చొరబడేంత స్థాయిలో ప్రభావం చూపకపోయేది. 1978లో మాత్రం ఇందిరా కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్, జనతా పార్టీల మధ్య హోరాహోరీగా ముక్కోణపు పోటీ జరిగింది. నిరుపేద వర్గాలు అండగా నిలవడంతో ఆ ఎన్నికల్లో ఇందిరమ్మ పార్టీ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇక 2009లో ప్రజారాజ్యం పార్టీ మూడో పక్షంగా నిలబడి 18 శాతం ఓట్లను తెచ్చుకున్నది. తెలంగాణ ప్రాంతంలో అయితే అంతకంటే తక్కువే వచ్చాయి. సరిగ్గా అలాంటి ముక్కోణం పోటీ మళ్లీ ఇప్పుడు జరగబోతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ప్రజల ‘మూడ్’ ఏమిటో? ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల నడుమ ఆసక్తికర పోటీ జరగనుంది. గత రెండు ఎన్నికల్లోనూ గట్టిగానే తలపడిన బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు తోడు ఈసారి బీజేపీ వచ్చిచేరింది. ఇప్పటికే పదేళ్లు అధికారంలో ఉన్నందున బీఆర్ఎస్పై ప్రజావ్యతిరేకత ఉందనేది ఒక అభిప్రాయం. అయితే ప్రభుత్వాన్ని ఓడించి తీరాలన్నంత వ్యతిరేకత మాత్రం కనిపించడం లేదన్నది క్షేత్రస్థాయి అంచనా. ఐదేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, కేసీఆర్ నాయకత్వం, రేసు గుర్రాల్లాంటి కేటీఆర్, హరీశ్‌రావుల ప్రచార తోడ్పాటు వెరసి ముచ్చటగా మూడోసారీ తామే అధికారంలోకి వస్తామని గులాబీ దళం గట్టిగా నమ్ముతోంది. ఇక కాంగ్రెస్ బలం పుంజుకుంటున్నట్లు కొందరు పరిశీలకులు అంచనా వేస్తుండగా ఆ పార్టీలోని వర్గ విభేదాలు, ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన చరిత్ర, కేసీఆర్‌కు దీటైన నేత లేకపోవడం బలహీనతలుగా కనిపిస్తున్నాయి. కానీ బీఆర్ఎస్పై వ్యతిరేకత ఉపయోగçపడుతుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా తమకు ఈసారి ప్రజలు పట్టం కడతారనే విశ్వాసంతో ముందుకెళుతున్నారు. ‘మూడో’పార్టీనే కీలకమా? కొంతకాలం కింద బలపడినట్లు కనిపించిన బీజేపీ ఇప్పుడు బలహీనపడిందని, ప్రధాన పోటీదారు కాకపోవచ్చని సర్వే రాయుళ్లు చెబుతున్నారు. కానీ సంచలనాలకు మారుపేరైన బీజేపీ... తెలంగాణలో ఒక ‘ప్రత్యేక’వ్యూహంతో 35 స్థానాలపై బలంగా గురిపెట్టబోతున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషించే లక్ష్యంతో ఆ పార్టీ పావులు కదుపుతోంది. కమలనాథుల ప్రయత్నాలు సఫలమైతే కచ్చితంగా త్రిశంకు సభ (హంగ్) ఏర్పడుతుంది. అప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వరుసగా మూడు స్థానాల్లో ఉండవచ్చు. ఈ పరిస్థితి తెలంగాణలో ఆసక్తికర రాజకీయాలకు తెరతీయవచ్చు. కానీ చారిత్రకంగా స్పష్టమైన తీర్పులనే ఇచ్చే సంప్రదాయం తెలుగు ప్రజలకున్నది. ఈ నేపథ్యంలో ఈ మూడు పార్టీల్లో ప్రజలు ఎవరివైపు మొగ్గు చూపుతున్నారది ఇప్పుడు మిలియన్ డాలర్ల క్వశ్చన్. ఈ మూడు పార్టీలు పోను ఉభయ కమ్యూనిస్టులు, టీజేఎస్, వైఎస్సార్టీపీ, బీఎస్పీ లాంటి పార్టీలు తెచ్చుకొనే ఓట్లు చాలా తక్కువ చోట్ల అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయొచ్చని అంచనా. నంబర్ గేమ్‌ను కొంచెం అటుఇటుగా మార్చవచ్చనే అంచనాలున్నా ఫైనల్‌గా బీజేపీ సాధించే ఓట్లు, సీట్లు ఎన్నికల తుది ఫలితాలను శాసించవచ్చన్నది రాజకీయ వర్గాల అభిప్రాయంగా కనిపిస్తోంది. ఇందిరా.. ఎన్టీఆర్.. మీటింగ్‌ల మిద్దె.. ఈ ఇంటిని చూశారా! సూర్యాపేట జిల్లా కోదాడ నయానగర్‌లోని వెంకట్రామయ్య నివాసం ఇది. పాతతరం నాయకులందరికీ సుపరిచితమైన ఇల్లు. పట్టణ నడి»ొడ్డున ఉన్న ఈ ఇంటి పరిసరాలన్నీ ఆ సమయంలో వ్యవసాయ భూములుగా ఉండేవి. 1980 ప్రాంతంలో కోదాడలో ఏ పార్టీ మీటింగ్ జరిగినా సభావేదికగా ఈ ఇంటినే ఎంచుకునేవారు. ఎన్టీ రామారావు 1982లో తొలిసారి కోదాడకు వచ్చినప్పుడు ఈ ఇంటి మీద నుంచే ప్రసంగించారు. ఆ తర్వాత నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన చింతా చంద్రారెడ్డి.. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాందీతో మీటింగ్ ఏర్పాటు చేయగా ఆమె కూడా ఇక్కడి నుంచే మాట్లాడారు. మాజీ ఉపప్రధాని దేవీలాల్ ఈ ఇంటినే వేదికగా చేసుకుని మీటింగ్‌లలో పాల్గొన్నారు. – కోదాడ గాసిప్టైమ్ తండ్రి కోసం కొడుకు త్యాగం కొడుకు భవిష్యత్తు కోసం తండ్రి త్యాగం చేయడం కామన్... కానీ ఈసారి రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో తండ్రి కోసం కొడుకు త్యాగం చేయాల్సి వస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా రాజకీయాలు చేసే ఓ మాజీ ఎంపీ ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలనుకున్నారు. రాజధాని నడి»ొడ్డున ఉండే ఓ నియోజకవర్గాన్ని కూడా ఎంచుకున్నారు. అయితే, అక్కడ గత ఎన్నికల్లో ఆ మాజీ ఎంపీ కుమారుడు పోటీ చేశారు. ఇప్పుడు ఆ టికెట్ కోసమే తండ్రి, కొడుకులు దరఖాస్తు చేసుకున్నారు కూడా. అయితే, ఇద్దరిలో ఎవరికి అన్నప్పుడు పాపం కొడుకే తండ్రి కోసం త్యాగం చేసేందుకు సిద్ధమయ్యాడట. నువ్వు పోటీ చేస్తే నేనొద్దంటానా? అని తాను పోటీ నుంచి తప్పుకున్నాడంట. తండ్రి కోసం కొడుకు త్యాగం వృ««థా కాబోదనే అంచనాతోనే ఆయన పోటీ నుంచి విరమించుకున్నాడనే చర్చ జరుగుతోంది. తండ్రి గెలిచి పుసుక్కున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బలహీన వర్గాల కోటాలో తండ్రి మంత్రి అవుతాడనే నమ్మకంతోనే ఆయన విరమించుకున్నాడని, భవిష్యత్తు మీద గట్టి అంచనాతోనే స్వామికార్యం స్వకార్యం నెరవేర్చుకుంటున్నాడని గాం«దీభవన్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. బంగారు కడియాలు తెచ్చా.. సార్ అసెంబ్లీ టికెట్ అంటే ఈ సీజన్లో మామూలు ముచ్చట కాదు. టికెట్ వస్తే చాలు... అది కూడా ప్రధాన పార్టీ టికెట్ అంటే హాట్ కేకే. టికెట్ వచ్చిందంటేనే సగం ఎమ్మెల్యే అయినంత హ్యాపీ. మరి ఆ టికెట్ ఇచ్చేవాళ్లను ఏదో రకంగా ప్రసన్నం చేసుకోవాలనుకునే వారు లేకుండా ఉంటారా? అలాంటి వారుంటేనే కదా టికెట్ల కేటాయింపు సీజన్లో మాల్మసాలా వార్తలు బయటకు వచ్చేది. ఏం జరిగినా జరగకపోయినా రాజకీయ నాయకులు తమ మీద పడిన బురద కడుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ప్రసన్నం చేసుకునే పాట్లలోనే ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మహిళా కాంగ్రెస్ ఆశావహురాలు కంగు తిన్నారట. తనకు టికెట్ కచ్చితంగా వస్తుందన్న అంచనాతోనే విదేశాల నుంచి తెచ్చిన రెండు బంగారు కడియాలను ఢిల్లీలోని ఓ పెద్ద నాయకుడికి ఇవ్వబోయారట. ఇదేంటమ్మా.. అంటే ‘ఏదో నా తృప్తి సార్.. ఫలానా ఆయనకు ఇచ్చా.. ఇంకో ఆయనకు కూడా ఇచ్చాను’అంటూ ఇద్దరి ముగ్గురి పేర్లు చెప్పిందంట. అంతా విన్న ఆ ఢిల్లీ పెద్ద నాయకుడు ‘ఇలాంటివి పెట్టుకోకమ్మా... నీ ‘బంగారు’భవిష్యత్తుకు దెబ్బ పడుతుంది’అని చెప్పి పంపించేశాడట. మూడు సీట్ల ‘మహరాజ్’! వామపక్షాలతో పొత్తు ఓ నాయకుడికి అరుదైన ఖ్యాతిని తెచ్చిపెట్టబోతోందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. వామపక్షాలు, కాంగ్రెస్ పొత్తు ఖరారైతే రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఓ నియోజకవర్గాన్ని పెద్ద కమ్యూనిస్టు పార్టీకి ఇవ్వాల్సి వస్తుందని, అప్పుడు అక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేను పక్కనే ఉన్న మరో చోటకు పంపిస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అలా పంపిస్తే మాత్రం ఆయన ‘మూడు సీట్ల మహరాజ్’అనే కీర్తిని మూటగట్టుకోబోతున్నారనే టాక్ కూడా నడుస్తోంది. గతంలోనే పొరుగు జిల్లా నుంచి ప్రస్తుతమున్న సీట్లోకి వచ్చిన ఆయన ఇప్పుడు పొత్తు ముచ్చటలో మళ్లీ పక్కకు జరుగుతారని, అలా జరిగితే మాత్రం రికార్డేనని అంటున్నారు. గతంలో రెండు చోట్ల గెలిచిన ఆయన ఇక్కడ కూడా గెలిస్తే ఒకే పార్టీ తరఫున మూడు చోట్ల చట్టసభలకు ఎన్నికైన నేతగా జాతీయ స్థాయి గుర్తింపు దక్కించుకున్నా ఆశ్చర్యం లేదని గాం«దీభవన్‌లో టాక్. మరి ఏమవుతుందో... ఆ మూడు సీట్ల మహరాజ్‌కు విజయమో... ‘వీర’ని్రష్కమణమో... చూద్దాం.! ఈ నెలాఖరు వరకు ఓటరు నమోదుకు అవకాశం ‘‘దేవాన్ష్ కు అక్టోబరు 15వ తేదీతో 18 ఏళ్లు నిండుతాయి. కానీ, ఓటు నమోదు ప్రక్రియ సెపె్టంబరులోనే ముగిసింది. దీంతో అతను ఓటేయాలంటే మరో ఐదేళ్లు ఆగాల్సిందేనా? అంటే అవసరం లేదని అంటోంది ఎన్నికల సంఘం.’’సెపె్టంబరులో ఓటు దరఖాస్తు చేసుకోలేని వారందరికీ ఇంకా నమోదుకు అవకాశం ఉందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో నవంబర్ 30న శాసనసభ ఎన్నికలు జరగనుండగా ఓటరు నమోదుకు అక్టోబరు 31వరకు మరో అవకాశం చేసుకునే వెసులుబాటు కల్పించింది. తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఓటరుగా నమోదు కావాలనుకునేవారు తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫారం–6 తీసుకుని అందులో వివరాలను పొందుపరిచి అక్కడే కార్యాలయంలో సమర్పించాలి. ఆధార్ కార్డు, ఇంటి చిరునామాను సూచించే కరెంట్ బిల్లు, ఇతరత్రా ఏదేనీ ఆధారాన్ని జత చేయాల్సి ఉంటుంది. బీఎల్వోలు క్షేత్రస్థాయిలో విచారించి ఓటరుగా నమోదు చేస్తారు. ఓటరు నమోదుకు వివిధ మార్గాలు క్యాంపెయిన్‌కు వెళ్లలేనివారు అరచేతిలోనే ఓటరుగా నమోదు కావచ్చు.http:///voters.eci.gov.in (హెచ్‌టీటీపీ://వీవోటీఈఆర్ఎస్.ఈసీఐ.జీవోవీ.ఐఎన్) వెబ్సైట్లోకి వెళ్లాలి. సర్వీస్ పోర్టల్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. అందులో మొబైల్ నంబర్‌తో సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం లాగిన్ అవ్వాలి. ఆన్లైన్లో కొత్త ఓటుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. యాప్‌తో కూడా బీఎల్వో వద్దకు వెళ్లలేని వారు.. వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోలేని పరిస్థితుల్లో మీ వద్ద ఉన్న మొబైల్లో ఓటర్ హెల్ప్‌లైన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. దానిపై క్లిక్ చేయగానే పోర్టల్ ఓపెన్ అవుతుంది. కొత్తగా ఓటు నమోదు చేసుకోవచ్చు. జాబితాలో పేరుందా.. లేదా చూసుకునే అవకాశం కూడా కల్పించారు. – సాక్షిప్రతినిధి, కరీంనగర్ -
1న మోదీ షెడ్యూల్ ఖరారు
సాక్షి, హైదరాబాద్: వచ్చేనెల 1న (అక్టోబర్) ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆదివారం మధ్యాహ్నం 11.20 గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి ఐఏఎఫ్ ప్రత్యేక విమానంలో బయల్దేరి మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడికి దగ్గరలోనే ఉన్న ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్, రైల్వే, ఇతర శాఖల అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు బేగంపేట నుంచి ఎంఐ–17 ప్రత్యేక హెలీకాప్టర్‌లో బయల్దేరి మధ్యాహ్నం 3.05 గంటలకు మహబూబ్‌నగర్‌కు చేరుకుంటారు. మహబూబ్‌నగర్ శివార్లలోని భూత్పూర్లో మధ్యాహ్నం 3.15 నుంచి 4.15 గంటల వరకు జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు మహబూబ్‌నగర్ హెలీపాడ్ నుంచి హెలీకాప్టర్‌లో 5.05 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 5.10 గంటలకు ఐఏఎఫ్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు పయనమవుతారు. 3న మరోసారి రాష్ట్రానికి మోదీ అక్టోబర్ 3న ప్రధాని మోదీ మరోసారి రాష్ట్రానికి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నిజామాబాద్‌లో రోడ్‌షో, బహిరంగసభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పసుపుబోర్డుకు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించడంతోపాటు, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. -
రాష్ట్రంలో ‘సింటెక్స్’ పెట్టుబడి రూ.350 కోట్లు
సాక్షి, హైదరాబాద్: వెల్స్పన్ గ్రూపు కంపెనీల్లో భాగస్వామిగా ఉన్న ‘సింటెక్స్’ హైదరాబాద్‌లో రూ.350 కోట్ల పెట్టుబడితో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. వాటర్ ట్యాంకులు, ప్లాస్టిక్ పైపులు, ఆటో కాంపొనెంట్స్, ఇతర పరికరాలను తయారుచేసే ఈ యూనిట్ ద్వారా వేయి మందికి ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. వెల్స్పన్ ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న చందన్వెల్లిలోనే సింటెక్స్ తయారీ యూనిట్ ఏర్పాటవుతుంది. ఈ నెల 28న జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్రఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీ రామారావుతో పాటు వెల్స్పన్ కంపెనీ చైర్మన్ బీకే గోయెంకా హాజరవుతారు. కాగా, ఇప్పటికే తెలంగాణలో భారీగా పెట్టుబడులతో కార్యకలాపాలు నిర్వహిసున్న వెల్స్పన్ గ్రూప్ రాష్ట్రంలో మరింత విస్తరించనుండటం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో అందుబాటులోని మౌలిక వసతుల వలన అనేక నూతన పెట్టుబడులు రాష్ట్రానికి తరలివస్తున్నాయని కేటీఆర్ అన్నారు. -
ఆస్పత్రి నుంచి అమ్మ ఒడికి..
సైదాబాద్: కుమార్తె వైద్యానికైన బిల్లు కట్టలేక.. ఆస్పత్రిలో వదిలేసి వచ్చిన తల్లిదండ్రుల చెంతకు ఆ చిన్నారి ఎట్టకేలకు చేరింది. తెలంగాణ స్టేట్ లీగల్ సెల్ అథారిటీ జడ్జి చొరవతో కథ సుఖాంతమైంది. ప్రేమ వివాహం చేసుకుని సింగరేణి కాలనీలో నివసిస్తున్న నితిన్, ప్రవల్లిక దంపతులకు ఈనెల7న పాప పుట్టింది. తీవ్ర అస్వస్థతకు గురైన పాప మెరుగైన వైద్యం కోసం వారు పిసల్‌బండలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఆరు రోజుల చికిత్సకు రూ.లక్షా16వేల బిల్లు అయింది. వారి వద్ద కేవలం రూ.30 వేలు మాత్రమే ఉండటంతో దిక్కుతోచక పాపను ఆస్పత్రిలో వదిలేసి వచ్చేశారు. వారి నిస్సహాయస్థితిపై సాక్షి దినపత్రికలో బుధవారం ‘బిల్లు కట్టలేక బిడ్డను ఆసుపత్రిలో వదిలేశారు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దాంతో పలువురు దాతలు వారిని సంప్రదించి తోచిన సహాయం చేశారు. సాక్షి కథనంపై స్పందించిన తెలంగాణ స్టేట్ లీగల్ సెల్ అథారిటీ జడ్జి కళార్చన, గోవర్ధన్‌రెడ్డి గురువారం ఆస్పత్రికి చేరుకున్నారు. యాజమాన్యంతో మాట్లాడి అదే రాత్రి చిన్నారిని డిశ్చార్జి చేయించారు. తమ పరిస్థితిని వెల్లడిస్తూ కథనం ప్రచురించిన సాక్షి దినపత్రికకు, తెలంగాణ లీగల్ సెల్ అథారిటీ అధికారులకు చిన్నారి తల్లిదండ్రులు నితిన్, ప్రవల్లికలు కృతజ్ఞతలు తెలిపారు. -
సినిమాల్లోని సీన్ల పైనా నజర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (టీఎస్–నాబ్) అధికారులు మాదాపూర్‌లోని విఠల్‌నగర్‌లో ఉన్న ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో గత నెల 31న జరిగిన ఓ డ్రగ్ పార్టీపై దాడి చేశారు. ఆ ఫ్లాట్‌లో కనిపించిన సీన్... ఇటీవల విడుదలైన ‘బేబీ’ సినిమాలోని సీన్లకు మధ్య సారూప్యత ఉందని హైదరాబాద్ పోలీసు కమిషనర్, టీఎస్ నాబ్ డైరెక్టర్ సీవీ ఆనంద్ అన్నారు. మాదకద్రవ్యాల వినియోగాన్ని ప్రేరేపించేలా ఉన్న ఆ సన్నివేశాలకు సంబంధించి చిత్ర యూనిట్‌కు నోటీసులు ఇచ్చామని, వారు తమ ఎదుట హాజరై వివరణ ఇచ్చారని గురువారం చెప్పారు. అందులో ఉన్న సీన్లపై తాము చెప్పిన తర్వాతే సినిమాలో వార్నింగ్ నోట్ పెట్టారని, అప్పటివరకు అలాంటిది కూడా లేదని అన్నారు. ఇలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాలను సినిమాల్లో పెట్టవద్దని ఆనంద్ హితవు పలికారు. వీటి ద్వారా స్ఫూర్తి పొంది అనేక మంది యువకులు మాదకద్రవ్యాలకు బానిసలుగా మారే ప్రమాదం ఉందన్నారు. గతంలోనూ ఇలాంటి సీన్లతో కూడిన సినిమాలు వచ్చాయని, అయితే వాటిని ఎవరూ పట్టించుకోలేదని చెప్పిన ఆనంద్.. ఇకపై ఈ తరహాలో ఉన్న వాటిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘టాలీవుడ్ లింకులు ఉన్న డ్రగ్స్ కేసు’లో పరారీలో ఉన్న సూర్య.. స్నాట్ అనే పేరుతో పబ్ నిర్వహిస్తున్నాడని, కొకైన్ వంటి మాదకద్రవ్యాలను స్నాటింగ్ ప్రక్రియ ద్వారా వినియోగిస్తారని చెప్పారు. దీన్ని బట్టి సూర్య తన వద్ద మాదకద్రవ్యాలు లభిస్తాయని అర్థం వచ్చేలా తన పబ్‌కు పేరు పెట్టాడని భావించాల్సి వస్తోందని ఆనంద్ వ్యాఖ్యానించారు. బాలీవుడ్ చిత్రాల్లోనూ డ్రగ్స్‌ను ప్రేరేపించే సీన్లు లేకుండా చూడాలని, ఉన్న వాటిపై చర్యలు తీసుకోవాలని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోను (ఎన్సీబీ) కోరతామన్నారు. ఎన్సీబీ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది డ్రగ్స్ వినియోగదారులు ఉన్నారని, దీన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని వివరించారు. తాము ఇటీవల కాలంలో 33 మంది నైజీరియన్లను అరెస్టు చేయగా, వారిలో 18 మంది బెంగళూరులో స్థిరపడిన వారిగా తేలిందన్నారు. టీఎస్ నాబ్ సేవల విస్తరణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని హైకోర్టును కోరతామని చెప్పారు. -
రాష్ట్రంలో మరో రెండ్రోజులు మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం వాయవ్య మధ్యప్రదేశ్ నుంచి, ఈశాన్య రాజస్తాన్‌పై వరకు, దక్షిణ చత్తీస్‌గఢ్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 4.5కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఈనెల 12వ తేదీన వాయవ్య బంగాళాఖాతం నుంచి పశ్చిమ, మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం రుతుపవనాల కదలికలు చురుగ్గా ఉండడంతో రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు పలుచోట్ల తేలికపాటి వానలు వరుసగా నమోదవుతాయని తెలిపింది. అదేవిధంగా ఉత్తర ప్రాంత జిల్లాల్లో మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు నమోదవుతాయని అంచనా వేసింది. ఆదివారం రాష్ట్రంలో సగటున 6.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 22శాతం అధికవర్షపాతం నమోదు ప్రస్తుత సీజన్లో రాష్ట్రంలో ఇప్పటివరకు 63.15 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... ఆదివారం సాయంత్రానికి 76.82 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 22శాతం అధికవర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో 22 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా... 11 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఆదివారం రాష్ట్రంలో అత్యధికంగా సంగారెడ్డి జిల్లా కంగ్టిలో 4.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ప్రస్తుతం రాష్ట్రానికి పశ్చిమ, వాయవ్య దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు బలంగా వీస్తున్నట్లు వాతావరణ శాఖ వివరించింది. -
రాష్ట్ర వైద్య మండలి ఎన్నికలు షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యానికి సంబంధించి అనేక కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్న తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి (టీఎస్ఎమ్సీ) ఎన్నికలను 17 ఏళ్ల తర్వాత తొలిసారిగా నిర్వహించనున్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ వేదికగా ఆదివారం ఈ ఎన్నికల మేనిఫెస్టోను హెచ్ఆర్డీఏ విడుదల చేసింది. అర్హత లేకుండా వైద్యం చేస్తున్న వారిని ప్రత్యేక కమిటీలు వేసి అరకడతామని ఈ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. నూతన భవనం నిర్మించి, తెలంగాణ వైద్యులకు గౌరవం లభించేలా చూస్తామని, వైద్య విద్య ఫీజు నియంత్రణ దిశగా ప్రయత్నాలు చేస్తామని ప్రకటించారు. 48,405మంది డాక్టర్లకు ఓట్లు ప్రస్తుతం 48,405 మంది తెలంగాణ డాక్టర్లు ఈ ఎన్నికల్లో ఓటు వేసే అర్హత కలిగి ఉన్నారు. ఈ ఎన్నికల్లో 13 మంది వైద్యులు వైద్య మండలికి ఎన్నిక కానుండగా, ఇందుకోసం వందకు పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అభ్యర్థులంతా తమ విధివిధానాలతో సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడగా, మరికొందరు ప్యానల్‌గా ఏర్పడి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికలు పోస్టల్ బాలెట్ ద్వారా జరగనున్నాయి. వచ్చే నెల నుంచి బ్యాలెట్ పేపర్ల పంపిణీ జరగనుండగా, వాటి లెక్క డిసెంబర్ 1న మొదలుకానుంది. కాగా మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో డా.మహేష్‌కుమార్, డా. ప్రతిభాలక్ష్మీ, డా. కుసుమరాజు రవికుమార్, డా.కిరణ్‌కుమార్ తోటావర్ తదితరులు పాల్గొన్నారు. -
వానలు మిస్సింగ్!
సాక్షి, హైదరాబాద్: నెల కిందట ఇంట్లోంచి కాలు బయటపెట్టకుండా వానలు.. రాత్రయితే చలిపెట్టేలా గాలులు.. వారం పదిరోజులు కొనసాగిన ఆ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నెల రోజులుగా వానల జాడే లేకుండా పోయింది. ఇదేమైనా ఎండా కాలమా అన్నట్టుగా ఉష్ణోగ్రతలూ నమోదవుతున్నాయి. నిజానికి ఏటా నైరుతి రుతుపవనాల సీజన్లో సంతృప్తికరంగా వానలు పడేది ఆగస్టు నెలలోనే. అలాంటిది ఈసారి భిన్నమైన పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో అడపాదడపా చినుకులు, తేలికపాటి జల్లులు కురిసినా.. ఎక్కడా భారీ వర్షాలు పడలేదు. నెలంతా పొడి వాతావరణంతోనే గడిచింది. ఇదే సమయంలో ఈ నెలలో సగటున 29.5 డిగ్రీలకుపైన గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం, గత నాలుగు దశాబ్దాల్లోనే అత్యధిక వేడి ఆగస్టుగా నిలవడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న తీవ్ర మార్పుల కారణంగా.. ఇలా వానలు ఆగిపోవడం, ఒక్కసారిగా భారీగా కురవడం వంటివి జరుగుతున్నాయని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఆగస్టులో 63.34శాతం లోటు వర్షపాతం రాష్ట్రంలో ఈసారి నైరుతి సీజన్ తీరును పరిశీలిస్తే.. ఇప్పటివరకు గడిచిన మూడు నెలలకుగాను.. రెండు నెలల్లో అత్యంత లోటు వర్షపాతమే నమోదైంది. నైరుతి రుతుపవనాల రాక జాప్యం, వచ్చినా సరిగా వానలు పడక జూన్ నెలలో తక్కువగా వర్షపాతం నమోదైంది. జూలై నెల రెండో వారం నుంచి వానలు ఊపందుకుని, నెలాఖరులో కుండపోత వర్షాలు పడ్డాయి. ఆ నెలలో ఏకంగా రెండింతలు అధికంగా వర్షపాతం నమోదైంది. తర్వాత ఆగస్టు నెలకు వచ్చేసరికి వానలు జాడే లేకుండా పోయాయి. రుతు పవనాల్లో కదలిక మందగించడంతో నెలంతా పొడి వాతావరణమే ఏర్పడింది. సాధారణంగా ఆగస్టులో సగటున 21.74 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవాల్సి ఉండగా.. కేవలం 7.97 సెంటీమీటర్లే పడింది. అంటే ఏకంగా 63.34శాతం లోటు వర్షపాతం కావడం గమనార్హం. 1901 సంవత్సరం తర్వాత మళ్లీ ఈ ఏడాది ఆగస్టులో అత్యంత తక్కువగా వానలు పడినట్టు భారత వాతావరణ శాఖ కూడా ప్రకటించింది. పొడి వాతావరణం కారణంగా ఉష్ణోగ్రతలు కూడా పెరిగాయి. ఈ నెలలో గరిష్టంగా 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని.. రాష్ట్రవ్యాప్తంగా సగటున 30డిగ్రీల సెల్సియస్‌గా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ప్రణాళిక శాఖ గణాంకాలు చెప్తున్నాయి. సీజన్ సగటు మాత్రం అధికమే.. మొత్తంగా నైరుతి రుతపవనాల సీజన్ పరిస్థితిని పరిశీలిస్తే.. జూన్ ఒకటో తేదీ నుంచి ఆగస్టు 30వరకు సాధారణంగా 56.69 సెంటీమీటర్ల వర్షం కురవాలి. ఈసారి అంతకన్నా 13శాతం ఎక్కువగా 64.22 సెంటీమీటర్లు కురిసింది. ఇందులో జూన్‌లో తీవ్ర లోటు ఉండగా.. జూలై చివరినాటికి ఏకంగా 57శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఈ నెలలో వానలు కురవకపోవడంతో అధిక వర్షపాతం 13 శాతానికి పడిపోయింది. నైరుతి సీజన్లో కురవాల్సిన, కురిసిన వర్షపాతం తీరు ఇదీ.. (సెం.మీ.లలో) నెల కురవాల్సింది కురిసినది శాతం జూన్ 12.94 7.26 56.15 జూలై 22.91 48.99 213.86 ఆగస్టు 21.74 7.97 36.66 మండలాల వారీగా వర్షపాతం తీరు.. కేటగిరీ మండలాలు అత్యధికం (60% కంటే ఎక్కువ) 26 అధికం (20–59% ఎక్కువ) 236 సాధారణం (–19% నుంచి +19% వరకు) 293 లోటు (–20% నుంచి –59%) 57 జిల్లాల వారీగా వర్షపాతాన్ని పరిశీలిస్తే... ప్రస్తుత సీజన్లో 14 జిల్లాల్లో అధికంగా, 19 జిల్లాల్లో సాధారణ స్థాయిలో వానలు పడినట్టు అధికారులు చెప్తున్నారు. మండలాల వారీగా పరిశీలిస్తే 26 మండలాల్లో అత్యధిక వర్షపాతం, 236 మండలాల్లో అధిక వర్షపాతం, 293 మండలాల్లో సాధారణ వర్షపాతం, 27 మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. జూన్ 1వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మూడు వారాలు వానల్లేక రాష్ట్రంలో డ్రైస్పెల్ నమోదైంది. జూలై తొలి రెండు వారాలు కూడా చాలాచోట్ల పొడి వాతావరణమే ఉంది. ఆగస్టు మొదటి వారం నుంచి మూడో వారం వరకు వరుసగా పొడి వాతావరణంతో డ్రైస్పెల్ నమోదైంది. చివరి వారంలో మాత్రం పలుచోట్ల తేలికపాటి వానలు పడ్డాయి. కొన్నిచోట్ల వాతావరణం కాస్త చల్లబడింది. -
రోబోటిక్స్‌పై ప్రత్యేక దృష్టి
రాయదుర్గం: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నూతన సాంకేతికత, రోబోటిక్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిందని ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్‌రంజన్ పేర్కొన్నారు. నానక్‌రాంగూడలోని షరటాన్ హోటల్లో శనివారం రోబోటిక్ గైనకలాజికల్ సర్జరీపై రెండు రోజుల జాతీయ సదస్సును ఆయన అపోలో ఆస్పత్రుల గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో అన్ని రంగాల్లో అత్యాధునిక సాంకేతికత, పరిజ్ఞాన్ని వినియోగిస్తున్నామన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రోబోటిక్స్ పాలసీని ప్రారంభించామన్నారు. దేశంలోనే నిర్దిష్ట రోబోటిక్ పాలసీని కలిగి ఉన్న మొదటి రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఈ పాలసీలో భాగంగా హెల్త్‌కేర్, అగ్రికల్చర్, ఇండ్రస్టియల్ ఆటోమేషన్, కన్సూ్మర్ రోబోటిక్స్ అనే నాలుగు వర్టికల్స్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించామన్నారు. రోబోలను తయారు చేసే కొన్ని ప్రీమియర్ కంపెనీలతో ముందస్తుగా చర్చలు జరుపుతున్నామన్నారు. నిమ్స్‌లో డావిన్సీ ఎక్స్ఐ 4వ వెర్షన్ సిస్టమ్‌ను పూర్తి స్థాయిలో అమర్చిన రోబోటిక్ సర్జరీ ల్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. డాక్టర్ సంగీతారెడ్డి మాట్లాడుతూ అపోలో ఆస్పత్రులలో ఇప్పటి వరకు 12 వేల రోబోటిక్ సర్జరీలు చేశామన్నారు. అందులో డాక్టర్ రుమా సిన్వా స్వయంగా 700 రోబోటిక్ సర్జరీలు చేశారన్నారు. అనంతరం సమావేశం బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏజీఆర్‌ఎస్ అధ్యక్షురాలు ప్రొఫెసర్ రమాజోíÙ, ఆర్నాల్డ్ పి.అడ్విన్కులా, డాక్టర్ టోనిచల్ హౌబ్, డాక్టర్ జోసెఫ్ పాల్గొన్నారు. -
ఇంటింటా ఇన్నోవేటర్
సాక్షి, సిటీబ్యూరో: అధునాతన సాంకేతికత, వినూత్న ఆవిష్కరణలతో దేశంలోనే అత్యున్నత ఇన్నోవేటివ్ హబ్‌గా తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తోంది. ఈ ఆవిష్కరణల్లో హైదరాబాద్ నగరం వేదికగానే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని ఇన్నోవేటర్స్ తమవంతు కృషిని కొనసాగిస్తున్నారు. ఈ వినూత్న ప్రయాణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రారంభించిన ‘తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్(టీఎస్ఐసీ), ఐటీఈ–సి’ శాఖలు కీలకంగా పని చేస్తున్నాయి. రాష్ట్రంలో నూతన ఆవిష్కరణల సంస్కృతిని ప్రోత్సహించడానికి ఈ వేదికలు కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా 2019లో టీఎస్ఐసీ ఆధ్వర్యంలో ‘ఇంటింటా ఇన్నోవేటర్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలో ఉన్నటువంటి ఆవిష్కర్తలను వెలికితీయడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. గ్రామీణ ప్రాంతంలో ఉన్న సమస్యలకు వినూత్న పరిష్కారాలు కనుగోవడమే లక్ష్యంగా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 700 పైగా ఇన్నోవేటర్స్ తమ విభిన్న ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఈ ఏడాది కూడా ‘ఇంటింటా ఇన్నోవేటర్’ కార్యక్రమం కోసం ఆవిష్కర్తల దరఖాస్తులను తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆహా్వనిస్తోంది. ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని టీఎస్ఐసీ ప్రకటించింది. ఔత్సాహికులు తమ పేరు, ఆవిష్కరణకు సంబంధించిన ఆరు వాక్యాలు, రెండు నిమిషాల నిడివి ఉన్న వీడియో, నాలుగు ఫొటోలను 9100678543 నెంబర్‌కు వాట్సాప్ చేయాలని సూచించారు. టీఎస్ఐసీ సహకారం 2020 ఇంటింటా ఇన్నోవేటర్ ప్రదర్శలో భాగంగా విత్తనాలు ఉన్న పేపర్ నాప్కిన్స్ను తయారు చేశాను. ప్రతిరోజు ఇంట్లో ఉండే తడి చెత్తను కంపోస్ట్ పిట్లో పెట్టడంతో దుర్వాసన వచ్చేది. ఆ సమయంలో వచ్చిన ఈ ఆలోచనతో దీనిని తయారు చేశాను. ఈ పేపర్‌ను మొక్కలకు ఎరువుగా ఉపయోగించవచ్చు. ఇందులో విత్తనాలు కూడా ఉండడంతో కొత్త మొక్కలు వచ్చే అవకాశం ఉంటుంది. దీనిని గుర్తించిన టీఎస్ఐసీ అప్పటినుంచి సహకారం అందిస్తున్నారు. –అరుణ్ జ్యోతి, గృహిణి, నల్గొండ జిల్లా అకుంర దశలోనే ప్రోత్సాహం.. 33 జిల్లాలో ఎంతో మంది ఇన్నోవేటర్స్ ఉన్నారు, వారికీ సరైన సహకారం, దిశానిర్దేశం చేయడానికి ఈ వేదిక రూపొందించబడింది. ఏ ఆవిష్కరణకైనా అకుంర దశ నుంచి ప్రోత్సహించాలి. టీఎస్ఐసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ అధికారులు, భాగస్వాముల సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఆవిష్కర్తలను గుర్తిస్తూ వారి జీవితాల్లో మార్పులు తీసుకువస్తున్నాం. ప్రతీ ఒక్కరూ వినూత్నంగా ఆలోచించాలి, వారి ఆవిష్కరణలతో ‘ఇంటింటా ఇన్నోవేటర్’ కార్యక్రమంలో పాల్గొనాలని ఆశిస్తున్నాం. ఎంపికైనవారికి ఆగష్టు 15 స్వత్రంత దినోత్సవ సంబరాలలో తమ ఆవిష్కరణ ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. –డా. శాంతా తౌటం, తెలంగాణ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ -
నీతి ఆయోగ్ చెప్పినా పైసా ఇవ్వలేదు.. కేంద్రంపై కేటీఆర్ గరం గరం
సాక్షి, హైదరాబాద్: కేంద్రంపై మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. నీతి ఆయోగ్ చెప్పినా తెలంగాణ రాష్ట్రానికి మోదీ సర్కార్ నయా పైసా ఇవ్వలేదని దుయ్యబట్టారు. విభజన చట్టంలో పొందుపరిచిన ఏ ఒక్క హామీని కేంద్రం నెరవేర్చలేదని చెప్పుకొచ్చారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఎన్నో అంశాల్లో మద్దతు ఇచ్చామని తెలిపారు. కేంద్రానికి మనం రూపాయి ఇస్తే 46 పైసలు మాత్రమే తిరిగి వస్తున్నాయని పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంగా తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్లో శుక్రవారం ఏర్పాటు చేసిన అభయ్ త్రిపాఠి స్మారక ఉపన్యాసం కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని కొత్త రాష్ట్రం – సవాళ్లు అనే అంశంపై ప్రసంగించారు. బోర్లు ఎక్కువ, అందుకే 24 గంటలు అవసరం కేటీఆర్ మాట్లాడుతూ.. ‘1950 నుంచి 2014 వరకు దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఏర్పడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎన్నో సవాళ్లు, సందేహాలు ఉండే. తెలంగాణ ఏర్పడితే ఇక్కడ ఇతర ప్రాంతాల వారి భద్రతపై ఎన్నో సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కేసీఆర్ ప్రతి ఇంటికి తాగునీరు అందించారు. అదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథ పథకం అమలు చేశాం. రాష్ట్రంలో 30 లక్షలకు పైగా వ్యవసాయ బోర్లు ఉన్నాయి. కాబట్టి కరెంట్ ఎక్కుక అవసరం పడుతుంది. వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల విద్యుత్‌ను ఉచితంగా అందజేస్తున్నాం. కాళేశ్వరంతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలమైంది. ప్రపంచంలోనే లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఐటీ సెక్టార్లో ఉద్యోగాల కల్పనలో రెండేళ్లుగా బెంగళూరును హైదరాబాద్ దాటేసింది’ అని కేటీఆర్పేర్కొన్నారు.