
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు మరో షాకిచ్చింది. ఇప్పటికే సెస్సుల పేరుతో చార్జీలు పెంచిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ రిజర్వేషన్ చార్జీలు పెంచేందుకు సిద్ధమైంది. రిజర్వేషన్ ధరలను రూ.20 నుంచి 30 రూపాయలకు పెంచేందుకు ఆర్టీసీ రంగం సిద్ధం చేసింది. అయితే, గుట్టుచప్పుడు కాకుండా చార్జీల పెంపు నిర్ణయం తీసుకున్న యాజమాన్యం ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. పెరిగిన రిజర్వేషన్ చార్జీలు మార్చి 27 నుంచి అమలు కానున్నట్టు సమాచారం.
(చదవండి: సర్కారు గొర్రెల్ని తీసుకొని.. లాభాలు పంచుకుందామంటూ..)
Comments
Please login to add a commentAdd a comment