సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులపై టీఎస్‌ఆర్టీసీ మరో భారం మోపింది. ఆర్టీసీ టికెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల జాతీయ రహదారులపై టోల్ చార్జీలను అయిదు శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. శనివారం నుంచి ఆ నిర్ణయం అమల్లోకి రానుండటంతో ఆర్టీసీపై మరింత భారం పడనుంది. పెరిగిన టోల్ చార్జీల భారాన్ని ప్రయాణికులపైనే వేసేందుకు ఆర్టీసీ సిద్ధమైంది.
ఈ మేరకు ఆర్టీసీ టికెట్‌లో వసూలు చేసే టోల్ ఛార్జీలను పెంచింది. టోల్ ఛార్జీలను పెంపుతో టికెట్ ధరలు సైతం పెరిగాయి. ఆర్డీనరి నుంచి గరుడ ప్లస్ వరకు బస్సుల్లో ఒక్కో ప్రయాణికుడిపై టోల్ ప్లాజా ఛార్జీలను తాజాగా రూ.4 వరకు పెంచినట్లు ప్రకటించింది. నాన్ ఏసీ స్లీపర్ బస్సుల్లో రూ.15 పెంచింది. ఏసీ స్లీపర్ బస్సుల్లో ఒక్కో ప్రయాణికుడిపై టోల్ ఛార్జీ రూ.20 వసూలు చేస్తున్నారు. టోల్‌ప్లాజాల మీదుగా వెళ్లే సిటీ ఆర్డినరీ బస్సుల్లో రూ.4 పెంచారు. పెరిగిన ధరలు శనివారం నుంచి అమల్లోకి వచ్చాయి.
చదవండి: కేసీఆర్‌ది కొంపముంచే సర్కార్: బండి సంజయ్
Comments
Please login to add a commentAdd a comment