సాక్షి, హైదరాబాద్: మళ్లీ ఆర్టీసీ ఛార్జీలు పెరుగుతాయని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, డీజిల్ రేట్లు పెరుగుదలే ఇందుకు ప్రధాన కారణమని తెలిపారు. తప్పని పరిస్థితుల్లో ఆర్టీసీ ఛార్జీలు పెంచామన్నారు. ‘‘పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీకి 2 రూపాయలు, ఆపై బస్సులకు 5 రూపాయలు పెంచాం. డీజిల్ ధరలు ఇదే విధంగా పెరిగితే మళ్లీ ఆర్టీసీ ఛార్జీలు పెంచే అవకాశం ఉందని’’ సజ్జనార్ పేర్కొన్నారు.
చదవండి: గవర్నర్‌పై మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు
‘‘కొత్త బస్సుల కొనుగోలు కోసం కొంత మంది బ్యాంకర్లు లోన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. లోన్లు రాగానే కొత్త బస్సులు కొనుగోలు చేస్తాం. ఇప్పటికే ఉన్న కొన్ని బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తున్నామని’’ ఆర్టీసీ ఎండీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment