diesel price
-
పెట్రోల్, డీజిల్ అమ్మకాలు ఎలా ఉన్నాయంటే..
పండుగల సందర్భంగా పెట్రోల్, డీజిల్‌కు డిమాండ్ ఏర్పడింది. వరుసగా కొన్ని నెలల పాటు క్షీణించిన అమ్మకాలు నవంబర్‌లో తిరిగి పుంజుకున్నాయి. ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీల (ఐవోసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్) గణాంకాల ప్రకారం పెట్రోల్ విక్రయాలు నవంబర్‌లో 8.3 శాతం పెరిగి 3.1 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే నెలలో అమ్మకాలు 2.86 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. డీజిల్ విక్రయాలు సైతం క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 5.9 శాతం పెరిగి 7.2 మిలియన్ టన్నులకు చేరాయి.వర్షాల సీజన్లో వాహనాల కదలికలు తగ్గడం వల్ల పెట్రోల్, డీజిల్ డిమాండ్ క్షీణిస్తుంటుంది. అదే కాలంలో వ్యవసాయ రంగం నుంచి డీజిల్ డిమాండ్ తగ్గుతుంది. ఇక అక్టోబర్ నెల విక్రయాలతో పోల్చి చూస్తే.. నవంబర్‌లో 4.7 శాతం అధికంగా 2.96 మిలియన్ టన్నులు మేర పెట్రోల్ విక్రయాలు నమోదయ్యాయి. డీజిల్ విక్రయాలు 11 శాతం పెరిగి 6.5 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. పెట్రోలియం ఇంధన విక్రయాల్లో 40 శాతం వాటా డీజిల్ రూపంలోనే ఉంటుంది. వాణిజ్య వాహనాలు, వ్యవసాయ రంగంలో వినియోగించే పనిముట్లకు డీజిల్‌ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. ముఖ్యంగా రవాణా రంగమే 70 శాతం డీజిల్‌ను వినియోగిస్తుంటుంది.ఇదీ చదవండి: ఇక ఉబర్‌లో ‘శికారా’ల బుకింగ్!విమానాల ఇంధనంజెట్ ఫ్యూయల్ (విమానాల ఇంధనం/ఏటీఎఫ్) అమ్మకాలు 3.6 శాతం పెరిగి 6,50,900 టన్నులుగా ఉన్నాయి. ఏటీఎఫ్ డిమాండ్ కరోనా పూర్వపు స్థాయిని దాటిపోయింది. వంటగ్యాస్ (ఎల్పీజీ) అమ్మకాలు 7.3 శాతం పెరిగాయి. 2.76 మిలియన్ టన్నులుగా నమోదైంది. అంతకుముందు నెల అక్టోబర్‌లో 2.76 మిలియన్ టన్నులుగా ఉండడం గమనార్హం. -
చౌకగా లభిస్తోన్న ముడి చమురు
రష్యా ముడిచమురు ఇప్పటికీ తక్కువ ధరకే లభిస్తుందని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. దాంతో రష్యన్ కంపెనీల నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యా ముడిచమురు దిగుమతులపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దాంతో రష్యా తక్కువ ధరకు క్రూడాయిల్ విక్రయిస్తోంది.భారత్ తన చమురు అవసరాల్లో 88 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రపంచంలోని అతిపెద్ద ఇంధన వినియోగదారుల్లో భారత్ ఒకటిగా ఉంది. దేశీయంగా వార్షిక ముడిచమురు శుద్ధి సామర్థ్యం సుమారు 252 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంది. అంటే రోజుకు 50.04 లక్షల బ్యారెల్స్ శుద్ధి చేసే కెపాసిటీ కలిగి ఉంది. భవిష్యత్తులో ఇంధన వినియోగం పెరగనుందని మంత్రి అన్నారు. అందుకు అనుగుణంగా సంవత్సరానికి 300 మిలియన్ మెట్రిక్ టన్నుల (రోజూ 60 లక్షల బ్యారెల్స్) వరకు చమురు శుద్ధి చేసేలా కర్మాగారాల సామర్థ్యాన్ని పెంచే ప్రాజెక్ట్‌లు అమలులో ఉన్నాయని తెలిపారు.ఇదీ చదవండి: ఏటా 2.5 లక్షల టన్నుల గ్రీన్ అమ్మోనియా సరఫరాఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్-రష్యాల మధ్య నెలకొన్న భౌగోళిక అనిశ్చితుల వల్ల యూరప్ దేశాలు రష్యా క్రూడ్ దిగుమతిపై ఆంక్షలు విధించాయి. దాంతో రష్యా చమురు ధరను తగ్గించడంతోపాటు రూపాయిల్లో ట్రేడ్ చేసుకునేందుకు వీలు కల్పించింది. ఇతర దేశాల నుంచి పోలిస్తే రష్యా చమురు దిగుమతి భారత్‌కు కలిసివచ్చింది. చైనా కూడా రష్యా చమురు వాడకాన్ని పెంచింది. ఈ పరిణామాల వల్ల ప్రస్తుతం భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా ఉద్భవించింది. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముందు భారత్‌కు చమురు దిగుమతిలో రష్యా వాటా 1 శాతం కంటే తక్కువే ఉండేది. క్రమంగా అది పెరుగుతూ దాదాపు 40 శాతం వాటాకు చేరింది. -
పెట్రోల్, డీజిల్ ధరలపై త్వరలో కేంద్రం తీపి కబురు
దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్రం యోచిస్తోంది. చమురు ధరలు జనవరి కంటే కనిష్ట స్థాయికి పడిపోవడమే ఇందుకు కారణమని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మార్కెట్లో ముడిచమురు ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన పదేళ్లలో గరిష్ఠంగా జూన్ 2022లో బ్యారెల్ ధర 115 డాలర్లుగా నమోదైంది. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ధర దాదాపు 70 డాలర్లకు చేరింది.అంతర్జాతీయ భౌగోళిక అనిశ్చితుల వల్ల గతంలో భారీగా పెరిగిన ముడిచమురు ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇటీవల క్రూడాయిల్ ధర 70 డాలర్లకు చేరువలో ఉంది. క్రూడ్ ధరలు గరిష్ఠంగా ఉన్నపుడు చమురుశుద్ధి కంపెనీలకు నష్టాలు రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ రేట్లను కొద్దిగా తగ్గించినా దిగివస్తున్న క్రూడ్ ధరలకు అనుగుణంగా మాత్రం రేట్లను తగ్గించలేదు. దాంతో కంపెనీలకు భారీగా లాభాలు చేకూరుతున్నాయి.త్వరలో జరగబోయే హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు అధికారపక్షం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. లీటర్‌కు నాలుగు నుంచి ఆరు రూపాయలు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.ఇదీ చదవండి: సెబీ చీఫ్‌పై ఆరోపణలు.. పీఏసీ విచారణ?చమురు ధరలు తగ్గుముఖం పట్టడానికి పలు అంశాలు కారణమవుతున్నాయి. లిబియా తన ముడిచమురు సరఫరాలు పెంచింది. అక్టోబర్ నుంచి ఒపెక్ + దేశాలు ఉత్పత్తి కోతలను నిలిపివేయాలని నిర్ణయించాయి. ఒపెక్ దేశాల కాకుండా ముడిచమురు వెలికితీసే ఇతర దేశాలు వాటి ఉత్పత్తిని పెంచుతున్నాయి. దాంతో సరఫరా పెరిగి ధరలు తగ్గుతున్నాయి. -
4 శాతం తగ్గిన డీజిల్ డిమాండ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జూన్ ప్రథమార్ధంలో డీజిల్ వినియోగం 4 శాతం క్షీణించింది. కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న తీవ్ర వేడి వాతావరణ పరిస్థితులు రవాణాపై ప్రభావం చూపించడం వల్లే వినియోగం తగ్గినట్టు తెలుస్తోంది. సాధారణంగా ఎన్నికల తరుణంలో ఇంధన విక్రయాలు పెరుగుతుంటాయి. కానీ, ఈ ఏడాది ఎన్నికల సమయంలో వినియోగం నెలవారీగా క్షీణిస్తూ వచి్చంది. ఎన్నికలు ముగిసిన మరుసటి నెలలోనూ వినియోగం తగ్గడం వాతావరణ పరిస్థితుల వల్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జూన్ 1 నుంచి 15 మధ్య 3.95 మిలియన్ టన్నుల డీజిల్ విక్రయాలు నమోదైనట్టు ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ సంస్థల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 3.9 శాతం తక్కువ కావడం గమనార్హం. అంతేకాదు ఈ ఏడాది మార్చిలో 2.7 శాతం, ఏప్రిల్‌లో 2.3 శాతం, మే నెలలో 1.1 శాతం చొప్పున డీజిల్ విక్రయాలు క్షీణించాయి. ఇక జూన్ మొదటి 15 రోజుల్లో పెట్రోల్ అమ్మకాలు 1.42 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోనూ 1.41 మిలియన్ టన్నుల విక్రయాలే జరిగాయి. మే నెల మొదటి అర్ధ భాగంలోని విక్రయాలతో పోల్చి చూస్తే అమ్మకాలు 3.6 శాతం తగ్గాయి. వేసవిలో అధిక వేడి నుంచి ఉపశమనం కోసం కార్లలో ఏసీ వినియోగం పెరుగుతుంది. ఇది అధిక ఇంధన వినియోగానికి దారితీస్తుంది. అయినా కానీ, ఈ వేసవిలో ఇంధన అమ్మకాలు క్షీణించాయి. ఏప్రిల్‌లో పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు రూ.2 చొప్పున ప్రభుత్వరంగ సంస్థలు తగ్గించడం కూడా అమ్మకాలకు ప్రేరణనివ్వలేదని తెలుస్తోంది. పెట్రోలియం ఉత్పత్తుల మొత్తం అమ్మకాల్లో డీజిల్ వాటా 40 శాతంగా ఉంటోంది. 70 శాతం డీజిల్ వినియోగం రవాణా రంగంలోనే నమోదవుతుంటుంది. పెరిగిన ఏటీఎఫ్ అమ్మకాలు... ఇక విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) విక్రయాలు ఈ నెల మొదటి 15 రోజుల్లో 2.3 శాతం పెరిగి (క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు) 3,31,000 టన్నలుగా ఉన్నాయి. మే నెల మొదటి 15 రోజులతో పోల్చి చూస్తే 4.5 శాతం తక్కువ. పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ వినియోగం కరోనా ముందునాటి స్థాయిని దాటిపోవడం గమనార్హం. వంటగ్యాస్ వినియోగం (ఎల్పీజీ) పెద్దగా మార్పు లేకుండా 1.24 మిలియన్ టన్నులుగా నమోదైంది. -
డీజిల్ ధర తగ్గినా మారని సరుకు రవాణా ఖర్చు
సరుకు రవాణా ధరలు మార్చి 2024లో ఫ్లాట్‌గా ఉన్నాయని శ్రీరామ్ ఫైనాన్స్ నెలవారీ లాజిస్టిక్స్ పరిశోధన నివేదిక శ్రీరామ్ మొబిలిటీ బులెటిన్ తెలిపింది. గౌహతి-ముంబై ట్రిప్ మినహా మెజారిటీ రూట్లలో పెరుగుదల కనిపించలేదని చెప్పింది. ఈ మార్గంలో రవాణా ధరలు 1.1 శాతం పెరిగాయని పేర్కొంది. మరోవైపు దిల్లీ-కోల్‌కతా, దిల్లీ-చెన్నై, దిల్లీ-బెంగళూరు, ముంబై-కోల్‌కతా ట్రిప్‌ల్లో రవాణా ధరలు స్వల్పంగా తగ్గాయి. దిల్లీ-కోల్‌కతా మార్గంలో గరిష్టంగా 1.4 శాతం ధరలు తగ్గినట్లు నివేదిక తెలిపింది. అందులోని వివరాల ప్రకారం..ఆల్ ఇండియా వెహికల్ రిటైల్ అమ్మకాలు ఫిబ్రవరిలో 20.29 మిలియన్ యూనిట్లతో పోలిస్తే మార్చిలో 21.27 మిలియన్ యూనిట్లు పెరిగాయి. ఈ విభాగంలో 4.81 శాతం వృద్ధి నమోదైంది. ఇది మార్చి 2023లో నమోదైన 20.62 మిలియన్లతో పోలిస్తే 3.14 శాతం ఎక్కువ. ఇదీ చదవండి: పాతబడేకొద్దీ మరింత ప్రమాదం ఆర్థిక సంవత్సరంలో మార్చి చివరి నెల కావడంతో కార్పొరేట్ సంస్థలు తమ లక్ష్యాలను పూర్తి చేయడానికి కాస్త అధికంగా సరుకు రవాణా చేయడంతో ట్రక్కుల అద్దెలు స్థిరంగా ఉన్నాయి. ఫిబ్రవరి చివరి వారం నుంచి మార్చి చివరి వరకు ఇంధన ధరలు తగ్గాయి. ఫిబ్రవరి 28న దిల్లీలో డీజిల్ ధరలు లీటరుకు రూ.89.62 ఉండగా, మార్చి 31న లీటరుకు రూ.87.62 పడిపోయింది. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మార్చి 15న లీటరుకు రూ.2 చొప్పున ఇంధన ధరలను తగ్గించాయి. అయినా ట్రక్కు అద్దె ధరలు, రవాణా ధరల్లో ఎలాంటి మార్పు లేదని నివేదిక ద్వారా తెలిసింది. -
పెట్రోల్, డీజిల్‌పై రూ.2 తగ్గింపు
న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: దాదాపు రెండేళ్ల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. త్వరలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రానుండగా పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు రూ.2 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ రంగ సంస్థలు తెలిపాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి తగ్గించిన ధరలు అమల్లోకి రానున్నాయని కేంద్ర చమురు శాఖ గురువారం సాయంత్రం తెలిపింది. ధర తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.96.72 నుంచి రూ.94.72కు, డీజిల్ ధర రూ.89.62 నుంచి 87.62కు రానుంది. వారం క్రితమే కేంద్రం వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.100 మేర తగ్గించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఇలా.. స్థానిక, అమ్మకం పన్నులు కలిపి రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర రూ.2.70, డీజిల్ ధర రూ. 2.54 మేర తగ్గనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో రూ.109.66గా ఉన్న పెట్రోల్ ధర రూ.106.96కు తగ్గనుండగా, డీజిల్ ధర రూ.97.82 నుంచి రూ. 95.28కు తగ్గనుంది. -
తీవ్ర ఒడిదుడుకుల్లో చమురు మార్కెట్లు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా చమురు మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. అవి స్థిరపడ్డాకే దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకునేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో ఈ విషయం గురించి ఎటువంటి చర్చలూ జరపలేదని చెప్పారు. ముడి చమురు రేట్లు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించే అవకాశాలపై స్పందిస్తూ మంత్రి ఈ విషయాలు తెలిపారు. ‘అంతర్జాతీయంగా రెండు ప్రాంతాల్లో (రష్యా–ఉక్రెయిన్, ఇజ్రాయెల్–పాలస్తీనా) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరిన్ని సవాళ్లేమైనా తలెత్తినా .. లేదా ఆటంకాలేమైనా ఎదురైనా దాని ప్రభావాలు ఎదుర్కొనాల్సి రావచ్చు. కానీ అలాంటిదేమీ జరగకూడదని కోరుకుందాం. తీవ్ర ఒడిదుడుకులు నెలకొన్న పరిస్థితుల్లో ఇంధన లభ్యత, అందుబాటు ధరలో అది అందేలా చూడటం ప్రాథమిక బాధ్యత. జాగ్రత్తగా దీన్నుంచి బైటపడే ప్రయత్నం చేస్తున్నాం‘ అని పురి వివరించారు. మరోవైపు, చమురు దిగుమతులకు సంబంధించి రష్యాకు చెల్లింపుల విషయంలో ఎలాంటి సమస్యా లేదని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. -
పెట్రోలియం క్రూడ్‌పై విండ్‌ఫాల్ పన్ను పెంపు
దేశీయంగా ఉత్పత్తయ్యే పెట్రోలియం ముడి చమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను కేంద్రం పెంచింది. డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయెల్(ఏటీఎఫ్)పై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను తగ్గించింది. అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బుధవారం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం పెట్రోలియం క్రూడ్‌పై విండ్‌ఫాల్ పన్నును టన్నుకు రూ.9,050 నుంచి రూ.9,800కి పెంచింది. ఈ ధరలు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయెల్(ఏటీఎఫ్)పై లీటరుపై రూ.1గా ఉన్న విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను తొలగించినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ప్రభుత్వం డీజిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ని లీటర్‌కు రూ.4 నుంచి రూ.2కు తగ్గించింది. అయితే కేంద్రం అక్టోబర్ 18న పెట్రోలియం క్రూడ్‌పై విండ్‌ఫాల్ పన్నును టన్నుకు రూ.12,100 నుంచి రూ.9,050కి తగ్గించింది. గత ఏడాది జూలైలో ముడి చమురు ఉత్పత్తిదారులపై విండ్‌ఫాల్ పన్ను విధించింది. గ్యాసోలిన్, డీజిల్, విమానయాన ఇంధనాల ఎగుమతులపై పన్నును పొడిగించింది. -
షెల్ డీజిల్ లీటర్ 20 పెంపు
న్యూఢిల్లీ: షెల్ ఇండియా తన అవుట్లెట్ల ద్వారా విక్రయించే డీజిల్ ధరను లీటర్‌పై రూ.20 పెంచుతున్నట్టు ప్రకటించింది. వారం లోపే రెండో విడత ధరలను పెంచింది. దేశంలో అధిక వాటా కలిగిన ప్రభుత్వరంగ సంస్థలు మాత్రం ఎలాంటి మార్పుల్లేకుండా అవే రేట్లను కొనసాగిస్తున్నాయి. 2022 ఏప్రిల్ నుంచి ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు విక్రయ ధరల్లో ఎలాంటి సవరణలు చేయకపోవడం గమనించొచ్చు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మే నెలలో 75 డాలర్లలోపు ఉంటే, ప్రస్తుతం 95 డాలర్లపైకి చేరుకోవడం తెలిసిందే. షెల్ ఇండియా గత వారం కూడా లీటర్ డీజిల్‌పై రూ.4 చొప్పున పెంచింది. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 346 పెట్రోల్ స్టేషన్లు ఉన్నాయి. ముంబైలో లీటర్ డీజిల్‌ను రూ.130కు, చెన్నైలో రూ.129 చొప్పున విక్రయిస్తోంది. పెట్రోల్ లీటర్ ధర రూ.117–118గా ఉంది. అదే ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు లీటర్ డీజిల్‌ను రూ.95, లీటర్ పెట్రోల్ ధరను రూ.107 స్థాయిలో విక్రయిస్తుండడం గమనార్హం. ప్రాంతాలను బట్టి ఈ రేట్లలో స్వల్ప మార్పులు ఉంటాయి. -
పాక్‌లో కొండెక్కిన ధరలు.. చుక్కలు చూపిస్తున్న పాలు, పెట్రోల్, డీజిల్
ఇస్లామాబాద్: పొరుగు దేశం పాకిస్తాన్లో నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు భారీ ఎత్తున పెరిగాయి. లీటర్ పాల ధర 210 రూపాయలకు పెరిగింది. పాడి ఉత్పత్తులతోపాటు వంటనూనె, గ్యాస్, గోధుమలు వంటి నిత్యావసర సరకుల ధరలన్నీ కనీవినీ ఎరగనంతగా పెరిగి జనానికి చుక్కలు చూపుతున్నాయి. పెరిగిన ధరలు చూసి పాక్ ప్రజలు అల్లాడిపోతున్నారు. చుక్కలు చూపిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు పాక్‌లో పెట్రోల్ ధరలు కూడా చారిత్రలో తొలిసారి గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. లీటర్ పెట్రోల్‌పై 22 రూపాయలు పెంచడంతో ప్రస్తుతం ధర రూ. 272కు చేరింది. అంతేగాక డీజిల్‌పై 17.20 రూపాయలు పెరగడంతో లీటర్ డీజిల్ ధర రూ.280కి పెరిగింది. డాలర్‌తో రూపాయి విలువ క్షీణించడం వల్ల ఈ పెరుగుదల చోటుచేసుకుందని ఆర్థిక విభాగంపేర్కొంది. కాగా ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో సతమతమవుతున్న పౌరులపై మరింత భారాన్ని మోపింది. రికార్డు స్థాయిలో చికెన్ ధరలు పాకిస్తాన్లో కిలో కోడి మాంసం ఏకంగా 780 రూపాయలైంది! బోన్‌లెస్ అయితే రూ.1,100కు చేరుకుంది. కిలో కోడి ధర రూ. 490లుగా ఉంది. దేశ చరిత్రలోనే చికెన్ ధర ఇంతలా పెరగడం ఇదే తొలిసారి. కొన్నాళ్లుగా పాక్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కి శ్రీలంకను తలపిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ మారక నిల్వలు 1998 ఏడాది తర్వాత అత్యంత కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. చదవండి: హిండెన్‌బర్గ్ ఆరోపణలు.. ‘అదానీ’పై మరో కేసు -
ఎన్నాళ్ల కెన్నాళ్లకు..వాహనదారులకు శుభవార్త!
వారణాసి: త్వరలో పెట్రోల్ ధరలు తగ్గుతాయన్న ఆశాభావాన్ని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి వ్యక్తం చేశారు. గతంలో పెట్రోల్ విక్రయంపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నష్టాలను చూడగా, అంతర్జాతీయంగా తగ్గిన ధరలతో అవి ఇప్పుడు లాభాలను చూస్తున్నాయి. అదే సమయంలో డీజిల్‌పై అవి ఇప్పటికీ నష్టపోతున్నాయి. గడిచిన ఏడాదికి పైగా పెట్రోలియం కంపెనీలు రేట్లను సవరించడం లేదు. ఈ నష్టాలు ముగింపునకు రాగానే పెట్రోల్, డీజిల్ విక్రయ ధరలు తగ్గుతాయని పురి అన్నారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, దేశీయ వినియోగదారులపై ఆ భారాన్ని మోపకుండా ఆయిల్ కంపెనీలు బాధ్యతాయుత కార్పొరేట్ సంస్థలుగా వ్యవహరించాయని పేర్కొన్నారు. -
చమురు కంపెనీలకు భారీ షాక్!, బాబోయ్..ఈ నష్టాలు భరించలేం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు (హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ) ఎనిమిది నెలల నుంచి విక్రయ ధరలు సవరించకపోవడంతో భారీ నష్టాలను మూటగట్టుకున్నాయని, వాటిని సర్దుబాటు చేయాలంటూ ఆర్థిక శాఖను పెట్రోలియం శాఖ కోరనుందని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల కాలంలో ఈ మూడు కంపెనీలు రూ.21,201 కోట్ల నష్టాలను ప్రకటించడం గమనార్హం. గత కొన్ని సంవత్సరాలకు సంబంధించి ఎల్పీజీ సబ్సిడీ రూ.22,000 కోట్లు కూడా వాటికి రావాల్సి ఉంది. విక్రయ ధరలు పెంచకపోవడం వల్ల అప్పటికే పెరిగిపోయిన ద్రవ్యోల్బణం దృష్ట్యా, ఆర్థిక వ్యవస్థకు మేలు జరిగినట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఈ దృష్ట్యా వాటికి పరిహారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రణల పరిధి నుంచి తొలగించారు. కనుక ఓఎంసీలు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా రోజువారీ రేట్లను నిర్ణయించొచ్చు. కానీ, అవి తమ ఇష్టానుసారం అవే రేట్లను కొనసాగించాయి’’అని వివరించారు. కనుక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి ధరల పెంచకపోవడం వల్ల పడే భారంపై అంచనాకు వచ్చిన, ఆ తర్వాత ఆర్థిక శాఖను సంప్రదించొచ్చని చెప్పారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు గతంతో పోలిస్తే కొంత దిగొచ్చినప్పటికీ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికీ నష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 6 నుంచి అవి రేట్ల సవరణను నిలిపివేశాయి. -
తెలంగాణ కంటే కర్ణాటకలోనే పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువ.. ఎందుకు?
‘గొంగట్లో కూర్చుని అన్నం తింటూ వెంట్రుకలు ఏరుకోవాలనుకునే’వారిలాగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ నాయకుల వైఖరి ఉందని పలువురు సామాన్యులు భావిస్తున్నారు. ఎందుకంటే తప్పులన్నీ తాము చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై నెపాన్ని నెట్టడాన్ని రాజకీయ పరిశీలకులు కూడా విమర్శిస్తున్నారు. ఇటీవల టీఆర్ఎస్ అధినాయకులు పదే పదే కేంద్రాన్ని విమర్శిస్తూ రాష్ట్రాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందనీ, నిధులు ఇవ్వడం లేదనీ అబద్ధాలాడడం ఎంత వరకు సమంజసం? కేంద్రమే నిధులివ్వక పోతే రాష్ట్రంలో ఇన్ని జాతీయ రహదారులు ఎలా రూపుదిద్దుకునేవి? గ్రామ పంచాయతీలలో వివిధ అభివృద్ధి పనులకు ఫైనాన్స్ కమిషన్ల పేరుతో వస్తున్నవి కేంద్రం నిధులే. వీటితోనే గ్రామ పంచాయతీల కరెంటు బిల్లులు కట్టించి నిధులు మళ్లించడం మీ తప్పిదం కాదా? రాష్ట్ర ఖజానా పరిస్థితి ఆలోచించి డబుల్ బెడ్రూమ్ల పేరుతో డాంబికాలకు పోకుండా ఉండి ఉంటే పక్కనున్న ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా తదితర రాష్ట్రాలలాగా లక్షలాది కుటుంబాలకు కేంద్రం నిధులతో సొంతింటి కల నెరవేరేది కాదా? మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి మంజూరవుతున్న ‘ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన’ నిధులు కేంద్రానివి. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు రాష్ట్ర నిధులతో జరుగుతున్న పనులేవీ అనే సందేహం రాకమానదు. రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షా రూ. 20 వేలకోట్ల ప్రజాధనాన్ని నీటిపాలు చేయడం మీ తప్పు కాదా? హైదరాబాద్ మెట్రోతోపాటు స్కైవేలు, ఫ్లైఓవర్లు, రింగ్ రోడ్లు అంటూ టీఆర్‌ఎస్‌వారు గొప్పగా చెప్పుకుంటున్న వాటి అభివృద్ధికి ఇబ్బడిముబ్బడిగా అందుతున్నవి కేంద్రం నిధులు కావా? రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు అనుమతులు రాకపోవడానికి కారణం కేంద్ర నిబంధనల ప్రకారం మీరు ప్రతిపాదనలు పంపక పోవడమే కదా! మునుగోడు ఎన్నికల్లో ప్రజావ్యతిరేకత వ్యక్తం అవుతుండడంతో ఈ మధ్య చేనేత కార్మికులపై కపట ప్రేమ ఒలకబోస్తూ జీఎస్టీపై మంత్రి కేటీఆర్ ప్రధానికి లేఖ రాయడం ఎవరిని మభ్యపెట్టడానికి? ప్రతి జీఎస్టీ మండలి సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పాల్గొంటున్న ప్రతినిధులు అప్పుడే ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? జీఎస్టీ మండలిలో రాష్ట్రాలన్నీ కలిసి ప్రతి నిర్ణయం తీసుకుంటాయి కదా! మరి కేంద్రంపై నిందలు వేయడం ఏంటి? పై పెచ్చు జీఎస్టీ మండలి చేనేత కార్మికుల విషయంలో పన్ను పరిధిని రూ. 40 లక్షలకు పెంచితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ. 20 లక్షలకు మించితే పన్ను వసూలు చేస్తూ ప్రధానికి లేఖ రాయడం ‘మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కడం’ లాంటిది కాదా? కేంద్రం నుంచి ప్రతి నెలా చేనేత కార్మికులకు 5 కిలోల ఉచిత రేషన్ బియ్యం అందుతున్నాయి. గతంలో నూలుపై ఉన్న 10 శాతం సబ్సిడీని మోదీ ప్రభుత్వం 15 శాతానికి పెంచింది. నేత కార్మికులు కేంద్ర ప్రభుత్వ సహకారంతో క్లస్టర్ ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చెందాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపకుండా అడ్డుపడుతోంది. కేంద్రానికి పేరు వస్తుందనా? దేశంలోనే తొలి చేనేత బజార్ స్థలం కబ్జాకు గురికాగా ఆ సమస్య పరిష్కరిస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చినా ఇంతవరకు నెరవేరలేదు. కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాన్ని నిలిపివేసి నిరుపేదల నుంచి కిలో రూపాయి చొప్పున వసూలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం కాదా? ఉచిత రేషన్ విషయంలో కేంద్రం ఇస్తున్న సబ్సిడీ ఒక్కో కిలోకి రూ. 28కి పైగా ఉంది. మరి ప్రభుత్వం వాటా ఎంత? ‘మాతా శిశు సంక్షేమ పథకం’ పేరుతో కేంద్రం నిధులిస్తే దానికి కేసీఆర్ కిట్ అంటూ ప్రచారం చేసుకోవడం మీ తప్పిదం కాదా? (క్లిక్ చేయండి: మతతత్త్వం కాదు... సామరస్యం కావాలి) నోరెత్తితే కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతుందని అంటున్నారు. మరి పక్కనే ఉన్న కర్ణాటకలో మన కంటే 10 నుంచి 15 రూపాయలు తక్కువకు పెట్రోల్, డీజిల్ ఎలా లభిస్తుంది? మీకు పేదలపైన అంత ప్రేమ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా విధిస్తున్న పన్నులు తగ్గిస్తే సరిపోతుంది. కానీ మీరలా చేయట్లేదు. దేశంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్లుగా అవినీతి ఆరోపణలు లేకుండా పూర్తి పారదర్శకంగా పాలన సాగిస్తుంటే అవినీతి మరకలు అంటించేందుకు విఫలయత్నం చేశారు. కేసీఆర్ కుటుంబంపై, పార్టీపై అవినీతి ఆరోపణలు వస్తే కేంద్ర విచారణ సంస్థలు నిజాలు నిగ్గుతేల్చే పనిచేస్తే కక్ష సాధింపు చర్యలని కేంద్రాన్నే బదనామ్ చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని బదనామ్ చేయడం ఆపి తమపై ప్రజా వ్యతిరేకతను తగ్గించుకునే చర్యలు తీసుకుంటే మంచిది. (క్లిక్ చేయండి: దారి తప్పిన మునుగోడు ఉప ఎన్నిక) - శ్యామ్ సుందర్ వరయోగి సీనియర్ జర్నలిస్ట్, బీజేపీ రాష్ట్ర నాయకులు -
డీజిల్ ధరల పెరుగుదల కొండంత.. సెస్ పెంపు గోరంతే
సాక్షి, అమరావతి: అర్ధసత్యాలు, అవాస్తవాలతో ఈనాడు, ఎల్లో మీడియా మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై విషం కక్కింది. ఆర్టీసీ డీజిల్ సెస్ పెంపును వక్రీకరిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు పడరాని పాట్లు పడింది. రోజుకోరీతిలో వైఎస్సార్సీపీ సర్కారుపై దుష్ప్రచారమే అజెండాగా వ్యవహరిస్తున్న ఈనాడు పత్రిక ఆర్టీసీ డీజిల్ సెస్ పెంపు విషయంలోనూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. చంద్రబాబు హయాం కంటే ప్రస్తుత ప్రభుత్వంలోనే ఆర్టీసీ చార్జీలు పెరిగాయని చెప్పుకొచ్చిన ఈనాడు పత్రిక ఆ కథనంలో ఎక్కడా కూడా దేశంలో డీజిల్ ధరలు అమాంతంగా పెరుగుతున్నాయని ఒక్క వాక్యం కూడా రాయలేదు. ఇక చంద్రబాబు ప్రభుత్వంలో డీజిల్ ధర ఎంత.. ప్రస్తుతం రెండేళ్లుగా పెరిగిన డీజిల్ ధరలు ఎంత అన్న లెక్కలు కూడా దాచిపెట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించింది. డీజిల్ ధరలు అమాంతంగా పెరుగుతుండటంతో పొరుగునున్న తెలంగాణతో సహా దేశంలో అన్ని రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలు విధిలేని పరిస్థితుల్లో డీజిల్ సెస్ విధించాయి. తెలంగాణ కంటే ఏపీఎస్ ఆర్టీసీ తక్కువగానే విధించింది. ఈ వాస్తవాలను ప్రస్తావించకుండా చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా తప్పుడు కథనాన్ని ప్రచురించడం ఎల్లో మీడియా కుతంత్రాన్ని మరోసారి బయటపెట్టింది. డీజిల్ ధర పెరుగుదల 104 శాతం.. సెస్ విధింపు 45 శాతం ఇక డీజిల్ ధరలు అమాంతంగా పెరుగుతున్నా సరే వీలైనంత వరకు ప్రయాణికులపై తక్కువ భారం పడేలా ఆర్టీసీ విధాన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ మూడేళ్లలో డీజిల్ ధరలు ఏకంగా 104 శాతం పెరిగాయి. కానీ, ఆర్టీసీ మూడు విడతల్లో కలిపి కేవలం 45 శాతమే డీజిల్ సెస్ విధించింది. ఈ మూడేళ్లలో డీజిల్ ధరల పెరుగుదలను ప్రధానంగా మూడు భాగాలుగా పరిగణిస్తే.. డీజిల్ ధరలు పెరిగిన నిష్పత్తిలో ఆర్టీసీ డీజిల్ సెస్‌ను పెంచలేదు. పెరుగుతున్న ధరల్లో రెండొంతుల భారాన్ని ఆర్టీసీనే భరిస్తోంది. ఆర్టీసీ డీజిల్ సెస్ పెంచిన మూడు సందర్భాల్లోనూ ఇలానే వ్యవహరించింది. అందుకు నిదర్శనం ఈ గణాంకాలే.. భారీగా పెరిగిన డీజిల్ ధరలు టీడీపీ హయాంలో కంటే ఇప్పుడే ఆర్టీసీ చార్జీలు పెరిగాయని చెబుతున్న ఎల్లో మీడియా.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పెరిగిన తీరు.. ఇప్పుడు పెరిగిన తీరును వివరించలేదు. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వ హయాంలో కంటే ప్రస్తుతం డీజిల్ ధరలు భారీగా పెరిగాయన్న వాస్తవాన్ని అంగీకరించాల్సి వస్తుంది కాబట్టి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మార్కెట్ ధరలను బట్టి ఆర్టీసీ లీటరు డీజిల్‌ను రూ.48.46 చొప్పున కొనుగోలు చేస్తే.. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో రూ.99.06, బల్క్ డీజిల్ అయితే లీటరుకు రూ.134.79 ఉంది. దాంతో ఎప్పుడూ కొనుగోలు చేసే బల్క్ డీజిల్ కాకుండా ఆర్టీసీ ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో డీజిల్ కొనుగోలు చేస్తోంది. అంత హేతుబద్ధంగా వ్యవహరిస్తున్నా ఆర్టీసీపై రోజుకు అదనంగా రూ.2.50 కోట్ల ఆర్థికభారం పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరల పెరుగుదల, కరోనా పరిస్థితులు, రష్యా–ఉక్రేయిన్ యుద్ధ పరిణామాలతో దేశంలో డీజిల్ ధరలు అమాంతంగా పెరుగుతున్నాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అలాగే, చంద్రబాబు అధికారంలో ఉన్న 2015లో కంటే ఇప్పటికి బహిరంగ మార్కెట్లో డీజిల్ ధర వంద శాతం పెరగగా.. ఆర్టీసీ సాధారణంగా కొనుగోలు చేసే బల్క్ డీజిల్ ధర దాదాపు 150 శాతం పెరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రయాణికులపై నామమాత్రపు భారమే... మరోవైపు.. డీజిల్ సెస్ పెంపుతో ప్రయాణికులపై ఏడాదికి రూ.2వేల కోట్ల అదనపు భారం పడుతుందన్న ఈనాడు పత్రిక వాదన పూర్తిగా అవాస్తవం. గతంలో రెండుసార్లు డీజిల్ ధరలు అమాంతంగా పెరిగినప్పుడు ఆర్టీసీ అనివార్యంగా పెంచిన డీజిల్ సెస్‌తో ఆదాయం నామమాత్రంగానే పెరిగింది. 2019 డిసెంబరులో చార్జీల పెంపుతో ఏడాదికి రూ.844 కోట్ల రాబడి వస్తుందని ఆర్టీసీ అంచనా వేసింది. కానీ, కోవిడ్ ప్రభావంతో ఆర్టీసీ సర్వీసులను సరిగా నిర్వహించలేకపోయింది. ఇక ఏప్రిల్ 2022లో డీజిల్ సెస్ పెంపుతో ఏడాదికి రూ.712 కోట్ల రాబడి వస్తుందని.. రోజుకు రూ.2కోట్ల వరకు రాబడి వస్తుందని భావించారు. కానీ, రోజుకు రూ.1.50 కోట్ల ఆదాయమే వస్తోంది. ఇక తాజాగా నామమాత్రంగా పెంచిన డీజిల్ సెస్‌తో కూడా ఆర్టీసీకి అదే రీతిలో నామమాత్రంగానే రాబడి పెరుగుతుందన్నది తెలుస్తూనే ఉంది. అంటే ప్రయాణికులపై పెద్దగా భారం పడబోదన్నది స్పష్టమవుతోంది. తెలంగాణ కంటే తక్కువగా సెస్ ఇక పొరుగు రాష్ట్రం తెలంగాణ కంటే ఏపీఎస్ఆర్టీసీ డీజిల్ సెస్ తక్కువగానే విధిస్తోంది. తద్వారా ప్రయాణికులపై ఎక్కువ భారం పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. రెండు రాష్ట్రాల ఆర్టీసీ డీజిల్ సెస్ పెంపులో ఉన్న వ్యత్యాసమే ఇందుకు నిదర్శనం. ఆ వివరాలు ఇవిగో.. -
ఆర్టీసీ డీజిల్ సెస్ పెంపు
సాక్షి, అమరావతి: డీజిల్ ధరలు అమాంతం పెరుగుతుండటంతో నష్టాలను కొంతవరకు భర్తీ చేసుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం టికెట్లపై డీజిల్ సెస్సు పెంచింది. పెరిగిన డీజిల్ ధరలతో ఆర్టీసీపై రోజుకు రూ.2.50 కోట్ల మేర అదనపు భారం పడుతోంది. దీంతో అనివార్యంగా డీజిల్ సెస్సు పెంచుతున్నట్టు ఆర్టీసీ చైర్మన్ ఎ.మల్లికార్జునరెడ్డి, ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పెరిగిన డీజిల్ సెస్సు శుక్రవారం నుంచి అమలులోకి రానుంది. కనీస దూరం ప్రయాణానికి డీజిల్ సెస్ పెంపుదల నుంచి మినహాయింపునిచ్చారు. అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణాలపై ఏకమొత్తంగా కాకుండా కి.మీ. ప్రాతిపదికన డీజిల్ సెస్ పెంచారు. ప్రయాణికులపై తక్కువ భారం పడేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సిటీ బస్సుల్లో డీజిల్ సెస్ పెంచలేదు. తెలంగాణతో పోలిస్తే ఏపీఎస్ ఆర్టీసీ డీజిల్ సెస్ తక్కువ పెంచింది. తెలంగాణలో అన్ని ఆర్టీసీ బస్సులు, విద్యార్థుల బస్ పాస్‌లపై డీజిల్ సెస్‌ను రెండోసారి జూన్ 9న పెంచిన విషయం తెలిసిందే. బల్క్ డీజిల్ ధర లీటర్ రూ.131 2019 డిసెంబర్లో డీజిల్ ధర మార్కెట్లో లీటరు రూ.67 ఉండగా ఈ ఏడాది ఏప్రిల్ నాటికి రూ.107కి చేరుకుంది. అంటే లీటరుకు రూ.40 చొప్పున పెరిగింది. దీంతో నష్టాన్ని కొంతవరకు భర్తీ చేసుకునేందుకు అనివార్యంగా ఆర్టీసీ డీజిల్ సెస్‌ను ఈ ఏడాది ఏప్రిల్ 13 నుంచి విధిస్తోంది. ప్రస్తుతం బల్క్ డీజిల్ ధర లీటర్ రూ.131కి చేరుకోవడంతో ఆర్టీసీ నిత్యం అదనంగా రూ.2.50 కోట్ల నష్టాన్ని భరించాల్సి వస్తోంది. బస్సుల నిర్వహణ, స్పేర్ పార్ట్‌ల ధరలు కూడా పెరగడంతో ఆర్థిక భారం అధికమైంది. దీన్ని కొంతవరకైనా భర్తీ చేసే ఉద్దేశంతో డీజిల్ సెస్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కనీస దూరానికి పెంపులేదు ప్రయాణించే దూరాన్ని బట్టి కి.మీ. ప్రాతిపదికన డీజిల్ సెస్ పెంచారు. కనీస దూరానికి డీజిల్ సెస్ పెంచలేదు. పల్లె వెలుగు బస్సుల్లో 30 కి.మీ, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో 30 కి.మీ, అల్ట్రా డీలక్స్ బస్సుల్లో 20 కి.మీ, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 55 కి.మీ, ఏసీ సర్వీసుల్లో 35 కి.మీ, అమరావతి సర్వీసుల్లో 55 కి.మీ వరకు ప్రస్తుతం డీజిల్ సెస్సు పెంచలేదు. అంతకుమించి ప్రయాణించే కి.మీ. ప్రాతిపదికన డీజిల్ సెస్సు పెంచారు. విద్యార్థుల బస్ పాస్ చార్జీలు కూడా స్వల్పంగా పెరుగుతాయి. సహృదయంతో సహకరించాలి డీజిల్ ధరలు అమాంతం పెరుగుతుండటంతో ఆర్టీసీపై నష్టాల భారం రోజురోజుకు పెరుగుతోంది. అనివార్యంగా ఆర్టీసీ డీజిల్ సెస్ పెంచాల్సి వచ్చింది. ప్రజలు సహృదయంతో అర్థం చేసుకొని సహకరించాలని కోరుతున్నాం. ఆర్టీసీలో సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణ సేవలందిస్తాం. – ఎ.మల్లికార్జున రెడ్డి, (ఆర్టీసీ చైర్మన్), సీహెచ్.ద్వారకా తిరుమలరావు (ఆర్టీసీ ఎండీ) -
పెరిగిన డీజిల్ ధరలతో గ్రేటర్ ఆర్టీసీ కుదేల్
సాక్షి, హైదరాబాద్: పీకల్లోతు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న గ్రేటర్ ఆర్టీసీపై పెరిగిన ఇంధన ధరలు మరింత భారంగా మారాయి. ప్రతి రోజు కోట్లాది రూపాయలు ఇంధనం కోసం వెచ్చిస్తున్నారు. దీంతో ప్రయాణికుల నుంచి టికెట్లపై వచ్చే ఆదాయం కంటే ఖర్చులే అధికంగా ఉన్నాయి. విడిభాగాలు, ఇతర నిర్వహణ వ్యయం కంటే డీజిల్ కొనుగోలు కోసమే పెద్ద మొత్తంలో ఖర్చవుతున్నట్లు అంచనా. గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 2,550కిపైగా సిటీ బస్సులు ప్రతి రోజు 7.20 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. ఇందుకోసం రోజుకు 1.55 లక్షల లీటర్ల డీజిల్ వినియోగమవుతోంది. ఏటా నష్టాలతో కుదేలైన సంస్థలో కోవిడ్ అనంతరం ఇటీవల కాలంలో క్రమంగా ప్రయాణికుల ఆదరణ పెరుగుతోంది. సిటీ బస్సుల్లో ఆక్యుపెన్సీ సైతం 60 శాతానికిపైగా నమోదవుతున్నట్లు అంచనా. కానీ బస్సుల నిర్వహణ భారంగా మారడంతో అధికారులు ఇటీవల పెద్ద ఎత్తున దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఒకవైపు ప్రయాణికుల ఆదరణ పెంచుకొనేందుకు చర్యలు చేపడుతూనే తక్కువ వనరులతో ఎక్కువ ఫలితాలను సాధించేందుకు సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు. పొదుపుగా వాడితేనే.. ► ప్రస్తుతం నగరంలో రోజుకు రూ.2.5 కోట్ల వరకు ఆదాయం లభిస్తుండగా ఇంధనం, విడిభాగాలు, జీతభత్యాలు, బస్సుల నిర్వహణ తదితర అవసరాల కోసం రూ.3.5 కోట్లకుపైగా ఖర్చు చేయాల్సివస్తోంది. దీంతో రోజుకు రూ.కోటికిపైగా నష్టంతో సిటీ బస్సులు నడుస్తున్నాయి. ► ఈ క్రమంలో వనరుల వినియోగంపై అధికారులు దృష్టి సారించారు. ముఖ్యంగా పెరిగిన ఇంధన ధరలను దృష్టిలో ఉంచుకొని డీజిల్‌ను పొదుపుగా వినియోగిస్తే ప్రతినెలా కోట్లాది రూపాయలు ఆదా అవుతాయని అంచనా. ► సిటీ బస్సులు లీటర్ వినియోగంపై 4.67 (కేఎంపీఎల్) చొప్పున తిరుగుతున్నాయి. డీజిల్‌ను పొదుపుగా వినియోగించగలిగితే 0.1 కిలోమీటర్ అదనంగా పెంచుకొనే అవకాశం ఉంటుంది. అంటే ఒక లీటర్‌పై 4.77 కేఎంపీల్ పెంచుకోవచ్చు. ఇలా 0.1 కి.మీ అదనంగా పెరిగితే ప్రతినెలా రూ.కోటి ఆదా అవుతుంది. నెలకు రూ.12 కోట్లు మిగుతాయని ఓ ఆర్టీసీ ఉన్నతాధికారి తెలిపారు. అవగాహన కోసమే నోటీసులు.. డీజిల్ వినియోగంపై డ్రైవర్లలో అవగాహన పెంచి పొదుపు పాటించేందుకు కసరత్తు చేపట్టారు. ఒక డ్రైవర్ అదనంగా డీజిల్ వినియోగించడం వల్ల అయ్యే ఖర్చును నేరుగా అతనికే నోటీసుల రూపంలో అందజేస్తున్నారు. ‘డ్రైవర్లను అప్రమత్తం చేసేందుకు మాత్రమే వారి జీతాల్లోంచి ఎందుకు వసూలు చేయకూడదంటూ హెచ్చరిస్తున్నాం. కానీ అదనపు డీజిల్ భారాన్ని వారిపై మోపేందుకు కాదు’ అని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. డ్రైవర్ల చేతుల్లోనే ‘గేర్’.. ► ఇంధనాన్ని పరిమితంగా వినియోగించే నైపుణ్యం డ్రైవర్ల చేతుల్లోనే ఉంది. ఉదాహరణకు ఒకే రూట్లో, ఒకే దూరానికి కొంతమంది డ్రైవర్లు 50 లీటర్లు వినియోగిస్తే మరికొందరు 60 లీటర్ల వరకు వినియోగిస్తున్నారు. (క్లిక్: ఆ వెబ్సైట్ మాకు ఇప్పించండి!) ► గేర్లు మార్చే సమయంలో యాక్సిలేటర్‌ను అవసరానికి మించి నొక్కడం వల్ల ఇంజిన్లోకి డీజిల్ అదనంగా చేరుతుంది. ‘మొదటి గేర్‌పై బండి నడిపే సమయంలో ఏ మేరకు డీజిల్ అవసరమో ఆ మేరకు యాక్సిలేటర్ నొక్కాలి, కానీ అలా జరగడం లేదు. దీంతో ఎక్కువ డీజిల్ వినియోగమవుతోంది’ అని ఓ అధికారి వివరించారు. (క్లిక్: ఇంటర్నేషనల్ కన్స్ట్రక్షన్ వర్సిటీ సాధ్యమే) -
కరోనా వల్ల ఆర్టీసీకి రూ.5,680 కోట్ల నష్టం
రాజమహేంద్రవరం సిటీ: కరోనా వేవ్‌ల వల్ల ఆర్టీసీ రూ.5,680 కోట్ల మేర నష్టపోయిందని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి చెప్పారు. డీజిల్ ధరల పెరుగుదలతో మరింత భారం పడిందని తెలిపారు. అయినా కూడా ప్రజల ప్రయోజనాలను కాపాడుతూ ఆర్టీసీని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించే చర్యలు తీసుకుంటున్నామన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ను ఆయన తనిఖీ చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. కరోనా వల్ల ఆర్టీసీకి రూ.5,680 కోట్ల నష్టం వాటిల్లిందని.. డీజిల్ ధరలు అమాంతం పెరగడంతో రోజుకు రూ.320 కోట్ల మేర నష్టపోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టీసీని అప్పుల బారి నుంచి బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తే.. ప్రతిపక్షాలు తమ ఉనికి కోసం రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు మల్లికార్డునరెడ్డి ప్రశంసాపత్రాలు అందజేశారు. సమావేశంలో ఈడీ చింతా రవికుమార్, కోనసీమ డీపీటీవో ఆర్వీఎస్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
అనివార్యమయ్యే ఆర్టీసీ టికెట్లపై డీజిల్ సెస్
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇంధన సంస్థలు డీజిల్ ధరలను అమాంతం పెంచడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్టీసీ టికెట్లపై డీజిల్ సెస్ విధించాల్సి వస్తోందని ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. 2019లో లీటర్ డీజిల్ రూ.67 ఉండగా ప్రస్తు తం రూ.107కు పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. బుధవారం విజయవాడలోని బస్ భవన్లో విలేకరులతో మాట్లాడారు. అనివార్య పరిస్థితుల్లో పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో ఒక్కో టికెట్‌పై డీజిల్ సెస్ నిమిత్తం రూ.2 చొప్పున, ఎక్స్‌ప్రెస్, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ సర్వీసుల్లో రూ.5 చొప్పున, సూపర్ లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో రూ.10 చొప్పున డీజిల్ సెస్ వసూలు చేయనున్నట్లు తెలి పారు. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో కనీస టికెట్ ధర రూ.10గా ఉంటుందన్నారు. పెరిగిన డీజిల్ సెస్ చార్జీలు గురువారం నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించారు. అమాంతం పెరిగిన డీజిల్ ధరలతో ఆర్టీసీపై ఏటా రూ.1,100 కోట్లు అదనంగా ఆర్థికభారం పడుతోందని చెప్పారు. డీజిల్ సెస్ ద్వారా ఏడాదికి రూ.720 కోట్లు సమకూరినప్పటికీ అదనంగా దాదాపు రూ.400 కోట్ల భారాన్ని ఆర్టీసీ భరించాల్సి వస్తోందని వివరించారు. డీజిల్ ధరలు తగ్గితే సెస్ తొలగించే విషయాన్ని పరిశీలిస్తామన్నా రు. తెలంగాణలో కూడా డీజిల్ సెస్ విధించిన విషయాన్ని గుర్తు చేశారు. కోవిడ్ పరిస్థితుల్లో గత రెండేళ్లలో ఆర్టీసీ దాదాపు రూ.5,680 కోట్ల రాబడి కోల్పోయిందని తెలిపారు. అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకునే దిశగా సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ ఖాళీ స్థలాలను వాణిజ్య ప్రయోజనాల కోసం బీవోటీ ప్రాతిపదికన కేటాయించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. టెండర్లను త్వరలోనే ఖరారు చేస్తామన్నారు. కార్గో సేవల ద్వారా అదనపు ఆదాయాన్ని సాధించడానికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు. దయచేసి అర్థం చేసుకోవాలి.. డీజిల్ ధరలు అమాంతం పెరగడంతో అనివార్యం గా సెస్ విధించాల్సి రావటాన్ని ప్రజలు సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల కోవిడ్ గడ్డు పరిస్థితుల్లో కూడా ఉద్యోగులకు జీతాలు చెల్లించగలిగామన్నారు. ప్రభుత్వం ప్రతి నెల రూ.300 కోట్ల వరకు జీతాల భారాన్ని భరిస్తోందని తెలిపారు. -
TSRTC: మళ్లీ ఆర్టీసీ ఛార్జీలు పెరుగుతాయి: సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: మళ్లీ ఆర్టీసీ ఛార్జీలు పెరుగుతాయని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, డీజిల్ రేట్లు పెరుగుదలే ఇందుకు ప్రధాన కారణమని తెలిపారు. తప్పని పరిస్థితుల్లో ఆర్టీసీ ఛార్జీలు పెంచామన్నారు. ‘‘పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీకి 2 రూపాయలు, ఆపై బస్సులకు 5 రూపాయలు పెంచాం. డీజిల్ ధరలు ఇదే విధంగా పెరిగితే మళ్లీ ఆర్టీసీ ఛార్జీలు పెంచే అవకాశం ఉందని’’ సజ్జనార్ పేర్కొన్నారు. చదవండి: గవర్నర్‌పై మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు ‘‘కొత్త బస్సుల కొనుగోలు కోసం కొంత మంది బ్యాంకర్లు లోన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. లోన్లు రాగానే కొత్త బస్సులు కొనుగోలు చేస్తాం. ఇప్పటికే ఉన్న కొన్ని బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తున్నామని’’ ఆర్టీసీ ఎండీ అన్నారు. -
సామాన్యుడు బతికేది ఎలా?.. మోత మోగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. నేడు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 80 పైసలు చొప్పున పెరిగాయి. గత 10 రోజుల్లో ఇంధన ధరలు లీటరుకు 6.40 రూపాయలకు పెరిగాయి. దీంతో, సామాన్యుడు బయటకి వెళ్లాలంటే బయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రతి వస్తువు ధర పెరగడంతో మూలిగే నక్క మీద తాటి పండు పడినట్లు ఉంది సామాన్యుడి పరిస్థితి. ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు పెరగడం వల్ల కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసన ప్రారంభించింది. గత ఏడాది నవంబర్ 4 చివరి సారిగా ఇంధన ధరలు పెరిగాయి. అప్పటి నుంచి మార్చి 22 వరకు ఇంధన ధరలలో పెద్ద మార్పు లేదు. ఈ మధ్య కాలంలో దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఇంధన ధరలు పెంచడానికి కేంద్రం సాహసించలేదు. ఎన్నికలు ముగియగానే పెట్రోల్ ధరలు పెంపు మొదలు పెట్టింది. అయితే, ఈ అంశంపై స్పందించిన కేంద్రం, రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్దం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో దేశంలో ఇంధన ధరలను పెంచాల్సి వచ్చినట్లు తెలిపింది. అయితే, ప్రతిపక్షాలు మాత్రం కేంద్రం సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి. పెట్రోల్, డీజిల్ పై లీటరుకు 80 పైసల చొప్పున పెంచిన తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.101.81 ఉండగా.. డీజిల్ లీటర్ రూ.93.07 వద్దకు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 116.72గా ఉండగా.. డీజిల్ ధర రూ.100.94కు చేరుకుంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.45గా ఉంటే.. డీజిల్ ధర రూ.97.52కు చేరుకుంది. ఇక కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటరుకు ₹.111.35(83 పైసలు పెరిగింది), లీటర్ డీజిల్ ధర ₹96.22 (80 పైసలు పెరిగింది)గా ఉంది. (చదవండి: కేంద్రం కీలక నిర్ణయం, అకౌంటెన్సీ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ!) -
మళ్ళీ భగ్గుమన్న పెట్రోల్ ధర
-
జనం జేబుకు పెట్రో మంట..హైదరాబాద్‌లో సెంచరీ దాటిన డీజిల్ ధర
దేశంలో వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. బుధవారం లీటర్ పెట్రోల్ పై 90 పైసలు, డీజిల్ పై 87 పైసలు పెరిగాయి. దీంతో పెరుగుతున్న ధరలతో బండి బయటకు తీయాలంటే భయపడుతున్నారు. ఇక ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత చమరు కంపెనీలు సామాన్యులపై పెట్రో బాదుడును కొనసాగిస్తున్నాయి. గత మంగళవారం అంటే మార్చి 22 నుంచి ఒక్కరోజు మార్చి 24 మినహా ఇస్తే ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచుతూ వాహనదారుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ధర రూ.114.51 పైసలు ఉండగా డీజిల్ ధర రూ.100.70పైసలుగా ఉంది ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.01 పైసలు ఉండగా డీజిల్ ధర రూ.100.21గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.115.88 పైసలు ఉండగా డీజిల్‌ధర రూ.100.10గా ఉంది చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.69 పైసలు ఉండగా డీజిల్ ధర రూ.96.76 గా ఉంది. -
తగ్గేదేలే అంటున్న పెట్రోల్, డీజిల్..
-
ఆగని పెట్రో బాదుడు.. ఇవాళ ఎంతంటే..?
చమురు సంస్థలు వినియోగదారులపై ఏమాత్రం కనికరం చూపించడం లేదు. దీంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు కొనసాగుతుంది. ఇక సోమవారం దేశ వ్యాప్తంగా పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 30పైసలు పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధలు ఇలా ఉన్నాయి హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.112.35 ఉండగా డీజిల్ ధర రూ.99.09గా ఉంది. వైజాగ్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.113.08 ఉండగా డీజిల్ ధర రూ.99.09గా ఉంది ముంబైలో లీటర్ పెట్రోల్ధర రూ.113.88 పైసలు ఉండగా.. డీజిల్ ధర రూ.98.13 గా ఉంది ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.99.11 ఉండగా.. డీజిల్ ధర రూ.90.42గా ఉంది కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.53 పైసలుగా ఉండగా డీజిల్ ధర రూ.93.57గా ఉంది. -
Telangana: సెస్సుల సెగలు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ సంక్షోభం కోలుకోలేని దెబ్బతీసింది. తాజాగా పెరుగుతున్న డీజిల్ ధరలతో పాటే పెరిగిపోతున్న నష్టాలు ఆర్టీసీని మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బస్సు చార్జీలు పెంచితే తప్ప, ప్రగతిరథం ముందుకు సాగని పరిస్థితిలో ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతి పాదన పంపినా ఇంతవరకు ఆమోదం లభించక పోవడంతో రోజు గడవడమే గగనంగా మారింది. దీంతో నేరుగా చార్జీలు కాకుండా, ఇతరత్రా రుసుములు, ఫీజులను పెంచటం ద్వారా ఎక్కడెక్కడ చార్జీలను సవరించేందుకు అవకాశం ఉందో వెతికి మరీ ఆదాయార్జనకు ప్రయత్నిస్తోంది. చిన్నచిన్న రుసుములే అయినా అన్నీ కలిపేసరికి ప్రయాణికుల జేబుకు బాగానే కత్తెర పడుతోంది. ఇతర పట్టణాల నుంచి నగరానికి వచ్చే బస్సుల్లో చార్జీ కేటగిరీల వారీగా కొన్ని రోజుల వ్యవధిలోనే రూ.10–20 వరకు పెరిగిపోయింది. ఇవేవీ అధికారికంగా వెల్లడించకుండా, అంతర్గత నిర్ణయాలతో ఆర్టీసీ పని కానిచ్చేస్తోంది. ఇప్పటికే పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, వాటికి అనుగుణంగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో అల్లాడిపోతున్న సగటు జీవిపై, చార్జీల్లో ‘అనధికార పెంపు’ మరింత భారం మోపుతోంది. సేఫ్టీ సెస్‌తో మొదలు.. రాష్ట్రం ఉమ్మడిగా ఉండగా సేఫ్టీ సెస్‌ను విధించాలని నాటి ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. కానీ అది వెంటనే అమలు కాలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీకి అది గుర్తొచ్చింది. బస్సు ప్రమాదాల్లో చనిపోయేవారికి చెల్లించే పరిహారం సాలీనా సగటున రూ.30 కోట్ల వరకు ఉంటోంది. దానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం ఉండనందున.. ఇప్పుడు ఆ మొత్తాన్ని జనం నుంచే రాబట్టాలని నిర్ణయించి సేఫ్టీ సెస్ పెంపు ప్రతిపాదన ఫైలుకు ఇటీవల దుమ్ముదులిపింది. ప్రతి టికెట్‌పై రూపాయి చొప్పున చార్జీ విధించింది. వింటే అది చిన్న మొత్తమే.. కానీ, ఆ రూపాయి విధింపుతో మారిన టికెట్ చార్జీలు కండక్టర్లకు–ప్రయాణికుల మధ్య చిల్లర తగాదాలకు కారణమవుతుందని చెప్పి చార్జీని రౌండ్ ఆఫ్ చేసింది. అంటే రూ.15, రూ.20, రూ.25, రూ.30... ఇలా అన్నమాట. దీంతో నిర్ధారిత స్టేజీల తర్వాత రూపాయి చార్జీ కాస్తా రూ.5కు పెరిగిపోయింది. ఎమినిటీస్ (వసతుల) సెస్.. సేఫ్టీ సెస్ విధించి ఐదారురోజులు గడవకముండే ఆర్టీసీకి మరో సెస్ గుర్తొచ్చింది. బస్టాండ్లలో ప్రయాణికులకు వసతులు మెరుగుపరిచే ఉద్దేశంతో 2013లో ప్రారంభించిన ప్యాసింజర్ ఎమినిటీస్ సెస్‌ను సవరించేసింది. పల్లె వెలుగు మినహా ఇతర కేటగిరీ బస్సుల్లో టికెట్‌పై రూపాయిగా ఉన్న సెస్‌ను ఒకేసారి రూ.5కు పెంచేసింది. అంటే కొత్తగా రూ.4 పెరిగిందన్నమాట. ఇప్పుడు బేస్ టికెట్ ఫేర్‌లో దీన్ని కూడా చేర్చి టికెట్ ధరలను రౌండాఫ్ చేసింది. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో తదుపరి రూ.5కు (ధర రూ.21 ఉంటే రూ.25కు), సూపర్ లగ్జరీ నుంచి ఆ పై కేటగిరీ సర్వీసుల్లో రూ.10కి రౌండాఫ్ (టికెట్ ధర రూ.21 ఉంటే రూ.30కి) చేసింది. ఈ కొత్త చార్జీలు ఆదివారం ఉదయం నుంచి అమల్లోకి తెచ్చింది. రౌండాఫ్తో పెరిగిన భారం ♦రెండు సెస్‌లు కలిపి రూ.5 మేర మాత్రమే విధిస్తున్నట్టు కనిపిస్తున్నా.. రౌండాఫ్ వల్ల టికెట్ ధరల్లో ఒక్కసారిగా భారీ మార్పు చోటుచేసుకుంది. ♦నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు రూ.195గా ఉన్న ఎక్స్‌ప్రెస్ చార్జీ ఇప్పుడు రూ.205కు, రూ.270గా ఉన్న సూపర్ లగ్జరీ చార్జీ రూ.280కి, రూ.330గా ఉన్న రాజధాని చార్జీ రూ.350కి చేరింది. ♦కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు రూ.175గా ఉన్న ఎక్స్‌ప్రెస్ చార్జీ రూ.190కి, రూ.220గా ఉన్న సూపర్‌లగ్జరీ చార్జీ రూ.235కు, రూ.305 గా ఉన్న రాజధాని చార్జీ రూ.320కి చేరింది. ♦వరంగల్ నుంచి హైదరాబాద్‌కు... రూ.190గా ఉన్న డీలక్స్ చార్జీ రూ.200కు, రూ.215గా ఉన్న సూపర్‌లగ్జరీ చార్జీ రూ.230కి, రూ.295గా ఉన్న రాజధాని చార్జీ రూ.310కి పెరిగింది. త్వరలో సమాచార సెస్! ఇప్పటికే విధించిన సెస్సులకు తోడుగా ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ (ప్రయాణికుల సమాచార) సెస్ పేరుతో మరో పెంపును త్వరలో అమలు చేసేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసుకుంటోంది. నాలుగు రోజుల క్రితం బస్సు పాస్ ధరలను కూడా సంస్థ పెంచేసిన సంగతి తెలిసిందే. గతంలో తీసుకున్న ఓ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని మరీ చార్జీలు సవరించారు. ఇక ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే వారికి రిజర్వేషన్ చార్జీలను కూడా రూ.20 నుంచి రూ.30కి పెంచేసింది. -
తగ్గని బాదుడు..మళ్లీ పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు!
దేశంలో పెట్రోల్,డీజిల్ ధరల పెంపు కొనసాగుతుంది. దీంతో ఆదివారం దేశ వ్యాప్తంగా లీటర్ పెట్రోల్‌పై 50పైసలు, లీటర్ డీజిల్‌పై 55పైసలు పెరిగాయి. దేశంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.112.35 పైసలు ఉండగా లీటర్ డీజిల్ ధర రూ.98.68పైసలుగా ఉంది వైజాగ్‌లో పెట్రోల్ ధర రూ.113.08 ఉండగా డీజిల్ ధర రూ.99.09 పైసలుగా ఉంది ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.99.11 పైసలుగా ఉండగా డీజిల్ ధర రూ.90.42 పైసలుగా ఉంది ముంబైలో పెట్రోల్ ధర రూ.113.88 పైసలుగా ఉండగా డీజిల్ ధర రూ.98.13 పైసలుగా ఉంది చెన్నైలో పెట్రోల్ ధర రూ.104.90పైసలు ఉండగా డీజిల్ ధర రూ.95.00 పైసలుగా ఉంది కోల్ కతాలో పెట్రోల్ ధర రూ.108.53పైసలు ఉండగా డీజిల్ ధర రూ.93.57పైసలుగా ఉంది 'మూడిస్' ఏం చెబుతుందంటే ప్రముఖ ఇన్వెస్టర్ సర్వీస్ సంస్థ మూడిస్ ప్రకారం..ఈ ఏడాదిలో జరిగిన ఐదురాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో మనదేశానికి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోల్ కార్పొరేషన్ సంస్థలు పెట్రోల్ ధరల్ని పెంచకుండా తటస్థంగా ఉంచాయి. దీని కారణంగా చమురు సంస్థలకు రూ.19వేల కోట్లు నష్టం వాటిల్లినట్లు తెలిపింది. అదే సమయంలో బ్యారెల్ చమురు ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వెరసీ కొంత మేర నష్టాలను సర్దుబాటు చేసుకునేలా పెట్రో ధరల పెంపు అనివార్యమైనట్లు మూడిస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తన నివేదికలో తెలిపింది. -
సామాన్యులపై కొనసాగుతున్న పెట్రో బాదుడు
-
వంట గ్యాస్ మంట.. హైదరాబాద్‌లో సిలిండర్ రూ.1002
న్యూఢిల్లీ: ఐదురాష్ట్రాల ఎన్నికల ప్రభావంతో దాదాపు ఐదు నెలలుగా గ్యాస్, పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచకుండా ఉన్న కంపెనీలు మంగళవారం జూలు విదిల్చాయి. వంటగ్యాస్ సిలిండర్‌పై రూ. 50 పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో ఎల్పీజీ సిలిండర్ ధర జీవితకాల గరిష్టానికి చేరింది. అయితే పెట్రోల్, డీజిల్ ధరలను మాత్రం భారీగా పెంచకుండా లీటరుకు దాదాపు 80పైసలతో సరిపెట్టాయి. తాజా పెరుగుదలతో ఒక్కసారిగా ద్రవ్యోల్బణ భయాలు పెరిగాయి. కొత్త ధరల ప్రకారం సబ్సిడీఏతర ఎల్పీజీ సిలిండర్ (14.2 కిలోలు) ధర ఢిల్లీ, ముంబైలో 949.50 రూపాయలకు చేరింది. గతేడాది అక్టోబర్ తర్వాత ఎల్పీజీ రేట్లు సవరించడం ఇదే ప్రథమం. గతేడాది జూలై, అక్టోబర్ మధ్య కాలంలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 100 మేర పెరిగింది. ప్రస్తుతం సబ్సిడీ సిలిండర్ ధర సైతం నాన్ సబ్సిడీ సిలిండర్ ధరంత పలుకుతోంది. గతంలో ప్రభుత్వం సబ్సిడీ కింద రూ.600 వరకు సాయం అందించేది. 2020 నుంచి ఈ సబ్సిడీని తొలగించారు. పెంచిన ధరల ప్రకారం 5 కిలోల గ్యాస్ íసిలిండర్ ధర రూ. 349కి, 10కిలోల íసిలిండర్ ధర రూ. 669కి చేరింది. మరోవైపు దేశ రాజధానిలో లీటర్ పెట్రోలు ధర రూ. 95.41 నుంచి 96.21కి, డీజిల్ ధర రూ. 86.67 నుంచి 87.47కు పెరిగింది. ఇతర నగరాల్లో స్థానిక పన్నులు కలుపుకొని ధరలు పెరిగాయి. ప్రభుత్వం సిలిండర్ ధర రూ. వెయ్యికి చేర్చాలని కంకణం కట్టుకుందని విపక్షాలు దుయ్యబట్టాయి. పార్లమెంట్లో ఈ విషయమై నిరసనకు దిగాయి. అంతర్జాతీయంగా ఉక్రెయిన్ సంక్షోభ కారణంగా ఇంధన ధరలు పెరగడంతో దేశీయంగా ధరలు పెంచాల్సివచ్చిందని ఇంధన సంస్థలు తెలిపాయి. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 119 డాలర్ల వద్ద కదలాడుతోంది. భారత్ తన ఇంధన అవసరాల్లో 85 శాతం వరకు దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధర పెరిగితే భారత్‌పై భారం పడుతోంది. నిజానికి తాజా రేట్ల ప్రకారం పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ. 15– 25 చొప్పున పెంచాల్సిఉందని, కానీ కంపెనీలు ఆ మొత్తాన్ని తామే భరిస్తున్నాయని అధికారులు తెలిపారు. విజయవాడలో సిలిండర్ రూ. 972 విజయవాడలో గ్యాస్ íసిలిండర్ ధర రూ. 50 పెరిగి రూ. 972కు చేరింది. కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2,185ను తాకింది. ఇతర ప్రధాన నగరాల్లో కూడా గ్యాస్ సిలిండర్ ధర రూ. 50 మేర పెరిగింది. విజయవాడలో పెట్రోల్ ధర లీటరుకు 0.96పైసలు(స్థానిక పన్నులు కలుపుకొని) పెరిగి రూ. 110.89కి చేరింది. డీజిల్ 83పైసలు పెరిగి రూ. 96.89కి చేరింది. విశాఖ పట్నంలో పెట్రోల్ ధర రూ. 110. 01కు, డీజిల్ ధర రూ. 96.02కు, తిరుపతిలో పెట్రోల్ధర రూ. 112.02కు, డీజిల్ ధర రూ. 98.00కు చేరాయి. హైదరాబాద్‌లో సిలిండర్ రూ.1002 తెలంగాణలో మంగళవారం లీటర్ పెట్రోల్ ధర 90 పైసలు, డీజిల్ ధర 88 పైసలు (స్థానిక పన్నులు కలుపుకొని) చొప్పున పెరిగాయి. వంట గ్యాస్ ధర రూ. 50 పెరిగడంతో 14.2 కిలోల గృహావసర వంట గ్యాస్ సిలిండర్ ధర రాష్ట్రంలో పన్నులు కలుపుకొని రూ. 1000 దాటింది. సిలిండర్ ధర తెలంగాణలో ఆదిలాబాద్‌లో అత్యధికంగా రూ. 1,026కు చేరింది. రాష్ట్రంలో 1.18 కోట్ల గృహావసర సిలిండర్లు వినియోగంలో ఉండగా, ప్రతిరోజూ సగటున 1.20 లక్షల సిలిండర్లను డెలివరీ చేస్తున్నారు. సగటున రాష్ట్రంలో పెట్రోల్‌వినియోగం నెలకు 15 కోట్ల లీటర్లుండగా, సగటు డీజిల్ వినియోగం 25 కోట్ల లీటర్లుంది. -
బాదుడు షురూ..ఒకేసారి డీజిల్‌పై రూ. 25 పెంపు..! బంకుల మూసివేత..!
రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో బ్యారెల్ క్రూడాయిల్ ధరలు ఏకంగా 140 డాలర్లకు ఎగబాకింది. పలుదేశాల్లో ఇంధన ధరలు భారీగా పెరిగినప్పటికీ భారత్‌లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. గతేడాది నవంబర్ 4 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు. ఎన్నికల ఫలితాలు తరువాత ధరలు పెరుగుతాయని భావించడంతో ఎన్నడూ లేనంతగా జనాలు పెట్రోలు, డిజీల్ను భారీగా నిల్వ చేసుకున్నారు. అయితే బడ్జెట్ రెండో విడత సమావేశాల నేపథ్యంలో ధరల పెంపుపై కేంద్రం వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు లేదు. అయితే బల్క్ కస్టమర్లకు చమురు సంస్థలు గట్టి షాకిస్తూ బాదుడు షురూ చేశాయి. లీటరుకు రూ. 25 పెంపు..! బల్క్ కస్టమర్లకు డీజిల్ రేట్లను భారీగా పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఒకేసారి లీటరు డీజిల్‌పై రూ.25 మేర పెంచేశాయి. రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 40 శాతం మేర పెరగడంతో ధరల పెంపు అనివార్యమైందని పలు సంస్థలు వెల్లడించాయి. కాగా పెట్రోల్ బంకుల్లో విక్రయించే డీజిల్ రిటైల్ ధరలు ప్రస్తుతానికి యథాతథంగా ఉండనున్నాయి.ప్రస్తుతం ముంబయిలో లీటరు బల్క్ డీజిల్ ధర రూ.122.05 ఉండగా.. రిటైల్ పెట్రోల్ బంకుల్లో రేటు రూ.94.14గా ఉంది. ఢిల్లీలో బల్క్ డీజిల్ ధర రూ.115 ఉంటే.. రిటైల్ ధర రూ.86.67 ఉంది. బంకుల మూసివేత యోచనలో..! బల్క్ డీజిల్ ధరలు భారీగా పెరగడంతో ప్రైవేట్ రిటైల్ కంపెనీలకు బంకుల నిర్వహణ కష్టంగా మారే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం ఉన్న ధరలతో ఇంధనాన్ని విక్రయించడం వల్ల రిటైలర్లకు భారీగా నష్టాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. నయారా ఎనర్జీ, జియో-బీపీ, షెల్ వంటి సంస్థలకు నష్టాలు భారీగా పెరగనున్నాయి. తక్కువ ధరకు ఇంధనాన్ని విక్రయించే బదులు.. బంకులను మూసివేయడమే మంచిదనే యోచనలో ఈ సంస్థలు ఉన్నాయని తెలుస్తోంది. బస్సులకు ఇంధనం.. బంకుల్లోనే.. బల్క్ డిజీల్ ధరలు మార్కెట్ రేట్ల కన్నా అధికంగా ఉన్న నేపథ్యంలో.. బస్సులు సాధారణ పెట్రోల్ బంకుల్లోనే ఇంధనాన్ని నింపుకొంటున్నాయి. చమురు సంస్థల నుంచి నేరుగా పెట్రోల్, డీజిల్‌ను ఆర్డర్ చేసుకునే మాల్స్, ట్రావెల్స్ సర్వీసులు సైతం.. బంకులపైనే ఆధారపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంకుల్లో ఇంధన విక్రయాలు భారీగా పెరిగాయి. దీంతో రిటైలర్లకు నష్టాలూ పెరుగుతున్నాయి. చదవండి: తీవ్రమైన ఒత్తిడిలో కంపెనీలు..సామాన్యుడిపై బాంబు వేసేందుకు సిద్ధం..! వీటి ధరలకు రెక్కలు -
Telangana: రష్యా-ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్.. 20% బస్సులు డిపోల్లోనే!
సాక్షి, హైదరాబాద్: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వల్ల డీజిల్ ధరలు భారీగా పెరగడంతో ఆర్టీసీ ఉక్కిరిబిక్కిరవుతోంది. పెరిగిన ఖర్చులు తగ్గించుకునేందుకు బస్సుల ట్రిప్పులు కుదించుకోవాలని ఆలోచిస్తోంది. కనీసం 20 శాతం ట్రిప్పులు తగ్గించి ఆ మేరకు బస్సులను డిపోలకే పరిమితం చేయాలనుకుంటోంది. కుదుటపడుతున్న సమయంలో.. కోవిడ్ వల్ల గత రెండేళ్లుగా ఆర్టీసీ పూర్తిస్థాయిలో ట్రిప్పులు తిప్పలేకపోతోంది. ఇప్పుడిప్పుడే అన్ని బస్సులు ఊళ్లకు వెళ్తున్నాయి. పరిస్థితి క్రమంగా కుదుటపడుతుందని అనుకుంటున్న సమయంలో తాజా ‘డీజిల్ సంక్షోభం’ఆర్టీసీని మళ్లీ సమస్యల్లోకి నెట్టింది. ఆర్టీసీ నిత్యం సగటున 5 లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తుంది. ఫిబ్రవరి 16 వరకు ఆర్టీసీ కొనే బల్క్ డీజిల్ లీటరు ధర రూ.92గా ఉంది. తర్వాతి రోజే అది రూ. 6 మేర పెరిగింది. దీంతో అంతకంటే తక్కువ ధర ఉన్న రీటైల్లో కొనటం ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ముగుస్తూనే రిటైల్లోనూ రేట్లు పెరగుతాయని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బల్క్ డీజిల్ లీటరు ధర రూ.104కు చేరింది. యూపీ ఎన్నికలు ముగిసేనాటికి నాటికి రేటు రూ. 110ని మించుతుందని, ఆర్టీసీకి బల్క్ పర్చేస్ డిస్కౌంట్‌తో కలుపుకుంటే అది రూ.105 కంటే ఎక్కువే ఉంటుందని ఆర్టీసీ అంచనా. అదే జరిగితే రోజువారీగా అదనంగా రూ.65 లక్షల భారం ఆర్టీసీపై పడుతుంది. దీన్ని భరించటం అసాధ్యమని సంస్థ చెబుతోంది. అందుకే కనీసం 20 శాతం ట్రిప్పులను, ఆ మేరకు ఖర్చులను తగ్గించుకోవాలని ఆలోచిస్తోంది. చదవండి: (గుడ్‌న్యూస్: సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం) పెళ్లిళ్లూ లేకపోవడంతో.. సాధారణంగా ఆర్టీసీకి పెళ్లిళ్ల సీజన్లో ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం శుభముహూర్తాలు లేకపోవడంతో పెళ్లిళ్లకు కూడా విరామం వచ్చింది. మరో 20 రోజులు ముహూర్తాల్లేవు. శుభముహూర్తాలు లేకుంటే ఆక్యుపెన్సీ రేషియో కూడా తగ్గుతుంది. బుధవారం 60 శాతం ఆక్యుపెన్సీ రేషియోనే నమోదైంది. ఇది ఇంకా తగ్గే అవకాశముంది. తక్కువ ఆక్యుపెన్సీ రేషియోను చూపి ట్రిప్పులను తగ్గించి అంతమేర బస్సులను డిపోలకే పరిమితం చేయాలని ఆర్టీసీ ఆలోచిస్తోంది. నేరుగా జనంపై డీజిల్ భారం చాలినన్ని బస్సుల్లేక, కొత్త బస్సులు కొనేందుకు నిధుల్లేక పాత బస్సులనే ఆర్టీసీ నడుపుతోంది. వేల సంఖ్యలోని ఊళ్లకు రవాణా వసతిని అందించలేకపోతోంది. దీంతో జనం ప్రైవేటు వాహనాలపై ఆధారపడుతున్నారు. డీజిల్ ధర పెరగటంతో ఆటో చార్జీలూ భగ్గుమంటున్నాయి. ఇప్పుడు ఆర్టీసీ ట్రిప్పులూ తగ్గితే, బస్సుల్లేవని ఆటోవాలాలు చార్జీలు పెంచే అవకాశం ఉంది. దీంతో డీజిల్ భారం నేరుగా జనం జేబుపై పడబోతోంది. -
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుందా..?
ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు దిగినప్పటి నుంచి బంగారం, చమరు ధరలు భారీగా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ రోజు బ్యారెల్ బ్రెంట్ క్రూయిడ్ ఆయిల్ ధర 115 డాలర్లకు చేరుకుంది. అయితే, ఒకవైపు అంతర్జాతీయంగా చమరు ధరలు భారీగా పెరగడంతో ఆ ధరల నుంచి మన దేశ ప్రజలకు ఉపశమనం అందించడానికి కేంద్రం మార్గాలను అన్వేషిస్తోంది. వినియోగదారులపై చమురు ధరల ప్రభావం పడకుండా ఉండటానికి లీటరు పెట్రోల్, డీజిల్'పై రూ.8-10 ఎక్సైజ్ సుంకన్నీ తగ్గించడానికి కేంద్రం ఆలోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు బిజినెస్ టుడే మీడియాకు తెలిపాయి. గత ఏడాది నవంబర్ నెలలో 68 డాలర్లు ఉన్న బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర నేడు 115 డాలర్లకు చేరుకుంది. అప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలలో పెద్దగా మార్పులేదు. "అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశంలో డీజిల్ & పెట్రోల్ ధరలు ఇప్పటి వరకు లీటరుకు రూ.9-14 ఎక్కువగా ఉండాలి" అని ఎస్బిఐ ఎకోర్యాప్ కొద్ది రోజుల క్రితం తన నివేదికలో తెలిపింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినట్లయితే, అప్పుడు ఖజానాకు లక్ష కోట్ల రూపాయలు నష్ట వస్తుంది. కాబట్టి, అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశంలో డీజిల్ & పెట్రోల్ ధరలు పెంచే అవకాశం కూడా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. చమురు ధరల ప్రభావం వినియోగదారుడి మీద పడకుండా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకన్నీ, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గిస్తే పరిస్థితి చక్కదిద్దుకొనే అవకాశం ఉన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రపంచ ముడి చమురు ధరలు పెరిగిన ప్రకారం దేశంలో చమురు ధరలను పెంచితే ద్రవ్యోల్బణం 52-65 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు, రేట్లు పెరగకుండా చూడటం కోసం ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు సుమారు రూ.7 తగ్గించినట్లయితే, అప్పుడు నెలకు రూ.8,000 కోట్ల ఎక్సైజ్ సుంకం నష్టం వాటిల్లుతుంది అని ఎస్బీఐ తన నివేదికలో తెలిపింది. చూడాలి మరి మార్చి తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది. (చదవండి: కొత్తగా రుణం కోసం దరఖాస్తు చేసుకునే వారికి షాకిస్తున్న బ్యాంకులు..!) -
సామాన్యులను కలవర పెడుతున్న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధర!
వంట గ్యాస్ ధరల మార్పు విషయంలో చమరు మార్కెటింగ్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకోబోతున్నాయి. మార్చి 1 నుంచి ఎల్పీజీ ధరలను పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి నెలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ ధరల విషయంలో రివ్యూ మీటింగ్ చేపడుతుంటాయి. ఈ మీటింగ్‌లో ధరల పెంచాలా? వద్దా అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభ నేపథ్యంలో ఎల్పీజీ, నేచురల్ గ్యాస్ ధరలు పెరగనున్నాయని పలు నివేదికలు ప్రజలను ఇప్పటికే హెచ్చరిస్తున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీ ఎత్తున పెరిగాయి. పెట్రోల్, డీజిల్‌తో పాటు భారత్‌లో ఎల్పీజీ ధరలు పెరగనున్నాయని పలువురు నిపుణులు అంచనావేస్తున్నారు. ఈ ధరల పెంపు భారత్‌లోని పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. చూడలిమరి చమురు కంపెనీలు రేపు వంట గ్యాస్ ధరలను పెంచుతాయా? లేదా? అనేది. కానీ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా గ్యాస్ ధర సిలిండర్ ధర రూ.100 నుంచి 200 వరకు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. (చదవండి: అడ్వాన్స్ ట్యాక్స్ సకాలంలో చెల్లించకపోతే జరిమానా ఎంతో తెలుసా?) -
రష్యా-ఉక్రెయిన్ ఎఫెక్ట్.. కేంద్రానికి లక్ష కోట్ల నష్టం..!
రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణ నేపథ్యంలో బ్రెంట్ బ్యారెల్ ముడి చమరు ధర $100కు చేరుకుంది. అయితే, ముడి చమురు ధరలు పెరగడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.95,000 కోట్ల నుంచి లక్ష కోట్ల రూపాయల నష్టం కలగవచ్చు అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బిఐ) ఆర్థిక విభాగం ఒక నివేదికలో తెలిపింది. రెండు రోజుల నుంచి ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నవంబర్ 2021 నుంచి పెట్రోల్ & డీజిల్ ధరలలో పెద్దగా మార్చలేదు. "ప్రస్తుతం ధరల ప్రకారం.. ఒక బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర $95/బిబిఎల్.-$110 బిబిఎల్ మధ్య ఉంది. అయితే, అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశంలో ఉన్న ప్రస్తుత డీజిల్ & పెట్రోల్ ధరల కంటే రూ.9-14 ఎక్కువగా ఉండాలి" అని ఎస్బీఐ 'ఎకోర్యాప్' పేర్కొంది. అయితే, ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత మార్చిలో పెట్రోల్ & డీజిల్ ధరలు పెరగకుండా ఉండాలంటే పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.7 తగ్గించాల్సి ఉంటుంది అని పేర్కొంది. అప్పుడు నెలకు రూ.8,000 కోట్లకు పైగా ఎక్సైజ్ సుంకం నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. "వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్ & డీజిల్ వినియోగం ఆర్థిక సంవత్సరంలో 8-10 శాతం పెరిగితే అప్పుడు ప్రభుత్వం నష్టం సుమారు 95000 కోట్ల నుండి లక్ష కోట్ల రూపాయల వరకు ఉంటుంది" అని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం దేశ రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో 6.01 శాతంగా ఉంది. గత ఏడు నెలల కాలంలో ఇదే గరిష్టం. (చదవండి: ఎల్ఐసీ పాలసీదారులకు అలర్ట్.. ఆ అవకాశం మరో 3 రోజులే!) -
పోలింగ్ ముగుస్తూనే.. పెట్రో బాంబ్?
(సాక్షి, బిజినెస్/ సాక్షి,అమరావతి): జాతీయ పార్టీల తలరాతలు మార్చే ఉత్తర ప్రదేశ్‌తో సహా నాలుగు రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికలు... గడిచిన మూడు నాలుగు నెలలుగా పెట్రో ధరల పెంపు నుంచి సామాన్యులను కాపాడుతున్నాయనే చెప్పాలి. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో ఇటీవల ముడి చమురు ధరలు విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. వివిధ దేశాల్లో ఈ మేరకు స్థానికంగా రిటైల్ పెట్రోలు, డీజిల్ ధరలు కూడా పెరగటంతో ఆ ప్రభావం ఆయా దేశాల ద్రవ్యోల్బణం మీద పడింది. అమెరికా, బ్రిటన్, చైనా వంటి అగ్రరాజ్యాల్లో సైతం ద్రవ్యోల్బణం (ధరల మంట) విపరీతంగా పెరిగింది. ఎన్నికల్లో విజయావకాశాల దృష్ట్యా కొన్నాళ్లుగా ధరల పెంపు జోలికి కేంద్ర ప్రభుత్వం వెళ్లకపోవటంతో దేశంలో ఇంకా ద్రవ్యోల్బణం కాస్త అదుపులోనే ఉంది. కాకపోతే కొన్నాళ్లుగా పెరుగుతున్న అంతర్జాతీయ ధోరణికి తగ్గట్టుగా ఇక్కడా ధరలు పెంచక తప్పదు కనక ఎన్నికలు పూర్తయిన మరు క్షణంలోనే ఆ భారాన్ని జనంపై మోపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు దీనికి రష్యా– ఉక్రెయిన్ యుద్ధం తోడయింది. ఇది ముడి చమురు ధరలను మరింతగా మండిస్తోంది. ఈ ధరలు ఏ స్థాయికి వెళతాయో కూడా ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. ఈ భారాన్ని కూడా అంతిమంగా జనంపైనే మోపుతారు కనక... ఈ రెండు పరిణామాలూ సామాన్యులపై భరించలేని భారాన్ని మోపే సంకేతాలొస్తున్నాయి. నెల జీతంలో కనీసం 8 నుంచి 15 శాతాన్ని పెట్రోలు, డీజిల్‌పైనే పెట్టే సామాన్యులకిది మింగుడుపడని వ్యవహారమే. బల్క్ ధరలు ఇప్పటికే పెంపు! నిజానికి కొన్నాళ్లుగా రిటైల్ అవుట్లెట్లలో సామాన్యులు కొనే పెట్రోలు, డీజిల్ ధర పెంచకపోయినా రైల్వే, ఆర్టీసీ వంటి సంస్థలు టోకుగా కొనుగోలు చేసే బల్క్ డీజిల్ ధర మాత్రం ఇప్పటికే పెంచేశారు. సహజంగా బల్క్ ధర రిటైల్ ధర కన్నా ఎంతో కొంత తక్కువే ఉంటుంది తప్ప ఎక్కువ ఉండదు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొన్నాళ్లుగా బంకుల్లో సామాన్యులకు విక్రయించే ధరలు పెంచకుండా... బల్క్‌గా కొనుగోలు చేసేవారికి మాత్రం పెంచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో చూస్తే రిటైల్‌గా కొనుగోలు చేసే లీటర్ డీజిల్ ధర రూ.96 ఉండగా... బల్క్‌గా కొనుగోలు చేస్తున్న వారికి మాత్రం ఈ ధర ఇప్పటికే రూ.100 దాటిపోయింది. అంటే.. రిటైల్‌పై పెంచాల్సిన భారం ఇప్పటికే పెండింగ్‌లో ఉందన్న మాట!!. మరి దీనికి రష్యా–ఉక్రెయిన్ యుద్ధ భయాల కారణంగా అమాంతంగా ఎగసిన ముడిచమురు ధరలు కూడా తోడయితే..? అమ్మో! తలచుకుంటేనే గుండె గుభేల్మనక మానదు. బల్క్‌కు ఎప్పుడూ తక్కువ ధరే! సాధారణంగా బల్క్ డీజిల్ ధరను 15 రోజులకోసారి నిర్ణయిస్తారు. రవాణా ఛార్జీలు, ఇతరత్రా కలిసొస్తాయి కనక రిటైల్ వినియోగదారులకు విక్రయించే ధరకంటే లీటరుకు రూ.6 నుంచి రూ.10 తక్కువకే ఆయిల్ సంస్థలు బల్క్ వినియోగదారులకు సరఫరా చేస్తాయి. గతేడాది నవంబరులో రిటైల్ డీజిల్ ధర కంటే బల్క్ డీజిల్ ధర లీటర్‌కు ఏకంగా రూ.15.36 తక్కువ ఉంది. జనవరి నుంచి బల్క్ డీజిల్ ధర పెరుగుతూ వచ్చింది. జనవరి 16న బల్క్ డీజిల్ ధర లీటరుకు రూ.90.68 ఉండగా.. రిటైల్ ధర లీటరుకు రూ.96.02 ఉంది. ఫిబ్రవరి 1 నాటికి రెండు ధరలూ దాదాపు సమానమయ్యాయి. ఇపుడైతే రిటైల్ డీజిల్ ధర రూ.96.02 ఉండగా బల్క్ ధర రూ.100.41కు చేరింది. అంటే రిటైల్ ధర కంటే బల్క్ డీజిల్ ధర లీటర్‌కు రూ.4.39 ఎక్కువ.!! రిటైల్ నుంచే కొంటున్న ఆర్టీసీ... రాష్ట్రంలో ఆర్టీసీ సగటున నెలకు 2.50 కోట్ల లీటర్ల డీజిల్ కొంటుంది. ఆ ప్రకారం ఆర్టీసీపై నెలకు ఏకంగా రూ.10 కోట్ల భారం అదనంగా పడుతోంది. దీంతో ఆర్టీసీ బస్సులకు పెట్రోల్ బంకుల్లో రిటైల్ డీజిల్ కొనడానికి అనుమతినిచ్చింది. దీనిద్వారా కొంత ఆర్థిక భారం తగ్గుతోంది. రైల్వేలో దేశవ్యాప్తంగా 65 శాతం రైళ్లు విద్యుత్తుతో, 35 శాతం రైళ్లు డీజిల్‌తో నడుస్తున్నాయి. రైల్వే శాఖ నెలకు 22 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగిస్తోంది. ఆ ప్రకారం లీటరుకు సగటున రూ.4.39 చొప్పున రైల్వేపై నెలకు దాదాపు 96.58 కోట్ల ఆర్థికభారం అదనంగా పడుతోంది. ఎన్నికల తరువాత ఎంత బాదుడు? బల్క్– రిటైల్ ధరలను పోల్చినపుడు రిటైల్ ధర బల్క్కన్నా 15–20% ఎక్కువుండేది. అంటే లీటరుపై రూ.15 నుంచి 20 వరకూ పెరగొచ్చు. అది కూడా రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం లేనపుడు. మరి యుద్ధంతో ఇప్పటికే ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి కనక రిటైలర్లపై బాదుడు ఏ స్థాయిలో ఉంటుందన్నది ఊహించుకోవాల్సిందే. ఎన్నికలప్పుడు పెంచకపోవటమనేది కేంద్రంలోని ప్రభుత్వాలకు కొత్త కాదు. 2013 చివర్లోనూ ఇలానే జరిగింది. 2014 ఏప్రిల్‌లో సాధారణ ఎన్నికలు ఉండటంతో రిటైల్ డీజిల్ ధర పెంచలేదు. బల్క్ ధరను మాత్రం 2013 చివరి నుంచి ఆయిల్ కంపెనీలు పెంచుకుంటూపోయాయి. ఇప్పుడూ ఇదే పరిస్థితి. ఏపీలో ప్రస్తుతం రోజుకు 84.02 లక్షల లీటర్ల డీజిల్, 52.90 లక్షల లీటర్ల పెట్రోల్ వినియోగిస్తుండటం గమనార్హం. భయపెడుతున్న ద్రవ్యోల్బణం అమెరికా–చైనా నాలుగేళ్ల కిందట ప్రారంభించిన టారిఫ్‌ల యుద్ధం... ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల మధ్య ఆంక్షలు ఇప్పటికే చాలా దేశాల్లో ద్రవ్యోల్బణాన్ని పెంచేశాయి. ఇక కోవిడ్‌తో వివిధ దేశాల సరళతర ద్రవ్య విధానాలు మరింత ముమ్మరమై ధరల స్పీడ్‌ను తెగ పెంచేశాయి. ఆర్థిక వ్యవస్థకు ఊతమన్న పేరుతో అమెరికా రిజర్వు బ్యాంకు ‘ఫెడ్’.. ఎడాపెడా నిధులు కుమ్మరించింది. ఫలితం...అమెరికాలో ద్రవ్యోల్బణం క్రమంగా పెరుగుతూ 2022 జనవరిలో నాలుగు దశాబ్దాల్లోనే గరిష్ట స్థాయి అయిన 7.5 శాతాన్ని తాకింది. 1982 తరవాత ఈ స్థాయి ద్రవ్యోల్బణం ఎప్పుడూ నమోదు కాలేదు మరి. చైనాలోనూ ద్రవ్యోల్బణం 10 శాతం స్థాయిలో కొనసాగుతోంది. భారత్ విషయానికొస్తే జనవరిలో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ (సీపీఐ) ద్రవ్యోల్బణం ఏకంగా ఏడు నెలల గరిష్ట స్థాయి 6.01 శాతంగా (2021 ఇదే నెల ధరలతో పోల్చి) నమోదయింది. పెట్రో ధరలు పెంచకపోవటంతో ఇది ఈ స్థాయిలో ఉందని, అదే జరిగితే మరింత పైకెగసే ప్రమాదం లేకపోలేదని ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇక తాజాగా తలెత్తిన యూరోప్ భౌగోళిక ఉద్రిక్తతలు మరో నెలపాటు కొనసాగితే... ఈ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం 150 నుంచ 200 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. -
భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
-
వాహనదారులకు షాక్.. భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
గత కొద్ది రోజుల నుంచి రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధానికే సై అంటున్నారు. రష్యా తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా మద్దతుగల వేర్పాటువాద ప్రాంతాల డోనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ప్రపంచ దేశాలు రష్యా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో మంగళవారం చమురు ధరలు 2014 నుంచి గరిష్టస్థాయికి చేరుకున్నాయి. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు! ఈ యుద్ద వాతావరణం వల్ల ముడి చమరు బ్యారెల్ ధర 100 డాలర్లకు పైగా పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తునారు. "బ్యారెల్ చమరు ధర $100 కంటే ఎక్కువకు పెరిగే అవకాశం ఉంది" అని ఆయిల్ బ్రోకర్ పీవిఎంకు చెందిన తమస్ వర్గా అన్నారు. ప్రపంచ బెంచ్ మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 3.48 డాలర్లు(3.7%) పెరిగి 98.94 డాలర్లుగా ఉంది. గతంలో ఇంతకు ముందు ఈ ధర 99.38 డాలర్లకు చేరుకుంది. 2014 సెప్టెంబర్ తర్వాత ఇదే అత్యధికం. యుఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్(డబ్ల్యుటిఐ) క్రూడ్ ఆయిల్ ధర 4.54 డాలర్లు(4.8%) పెరిగి 95.61 డాలర్లకు చేరుకుంది. కరోనావైరస్ మహమ్మారి తీవ్రత తగ్గడంతో ప్రపంచ వ్యాప్తంగా తిరిగి పెట్రోల్, డీజిల్‌కి డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్త వాతావరణం వల్ల చమరు ధరలు 7 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్ పోర్టింగ్ దేశాలు, ఒపెక్+గా పిలువబడే మిత్రదేశాలు చమరు సరఫరాను ఎక్కువ పెంచడానికి ఆలోచిస్తున్నాయి. మన దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత దేశంలో భారీగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు గతంలో డెలాయిట్ టచి తోమత్సు ఇండియా తన నివేదికలో పేర్కొంది. "5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా కేంద్రం రిటైల్ ధరలను పెంచలేదు" అని డెలాయిట్ భాగస్వామి దేబాసిష్ మిశ్రా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన(మార్చి 10) తర్వాత అమ్మకపు ధరలో కొరతను పూడ్చడానికి కంపెనీలు లీటరుకు 8-9 రూపాయలు (11-12 సెంట్లు) ధరలను పెంచాలని చూస్తున్నట్లు మిశ్రా తెలిపారు.అంతర్జాతీయంగా ధరలకు అనుగుణంగా కంపెనీలకు ధరలు సవరించే అవకాశం ఉన్నప్పటికీ కేవలం ఎన్నికల కారణంగానే చమరు కంపెనీ పెంచలేదు అని పేర్కొన్నారు. ఇంధన ధరలు పెరగడం వల్ల అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు సెంట్రల్ బ్యాంకుకు ఇబ్బందేనని మిశ్రా పేర్కొన్నారు. చమురు ధరలు పెరగడం వల్ల మళ్లీ నిత్యవసర ధరలు పేరుగుతాయని, దీంతో మళ్లీ ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పారు. ద్రవ్యోల్బణం కట్టడి చేయడం అనేది కేంద్ర బ్యాంకుకు కత్తి మీద సాము కానున్నట్లు తెలిపారు. చమురు ధరలో ప్రతి 10 డాలర్ల పెరుగుదల భారతదేశ ఆర్థిక వృద్ధిని 0.3% నుండి 0.35%కు తగ్గనున్నట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయంగా చమురు ధర 100 డాలర్లకు దాటితే రిటైల్ ద్రవ్యోల్బణం, కరెంట్ ఖాతా లోటును అదుపు చేయడం కష్టం అని అన్నారు. (చదవండి: ట్రంప్ అన్నంత పని చేశాడు.. ఇక సోషల్ మీడియాకు చుక్కలే?) -
పెట్రోల్, డీజిల్ వినియోగదారులకు భారీ షాక్.. మళ్లీ పెరగనున్న ధరలు!
గత కొన్ని నెలలుగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలలో పెద్దగా మార్పు కనిపించడం లేదు అని సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే, ఇది కేవలం కొద్ది రోజుల వరకు మాత్రమే అని సమాచారం. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత దేశంలో భారీగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు డెలాయిట్ టచి తోమత్సు ఇండియా పేర్కొంది. "5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా కేంద్రం రిటైల్ ధరలను పెంచలేదు" అని డెలాయిట్ భాగస్వామి దేబాసిష్ మిశ్రా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మార్చి 10 తర్వాత అమ్మకపు ధరలో కొరతను పూడ్చడానికి కంపెనీలు లీటరుకు 8-9 రూపాయలు (11-12 సెంట్లు) ధరలను పెంచాలని చూస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ ఇండియన్ ఆయిల్ కార్ప్, భారత్ పెట్రోలియం కార్ప్, హిందుస్థాన్ పెట్రోలియం కార్ప్ ధరలను పెంచలేదు అని వివరించారు. అంతర్జాతీయంగా ధరలకు అనుగుణంగా కంపెనీలకు ధరలు సవరించే అవకాశం ఉన్నప్పటికీ కేవలం ఎన్నికల కారణంగానే పెంచలేదు అని పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత భారీగా ధరలను పెంచే అవకాశం ఉన్నట్లు ఆయన అన్నారు. ఒకవేళ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన అందులో కొంత మొత్తాన్ని కేంద్రం భరిస్తుందని, మిగతా మొత్తాన్ని ప్రజల మీద వేసే అవకాశం ఉన్నట్లు మిశ్రా తెలిపారు. ఇంధన ధరలు పెరగడం వల్ల అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు సెంట్రల్ బ్యాంకుకు ఇబ్బందేనని పేర్కొన్నారు. చమురు ధరలు పెరగడం వల్ల మళ్లీ నిత్యవసర ధరలు పేరుగుతాయని, దీంతో మళ్లీ ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పారు. చమురు ధరలో ప్రతి 10 డాలర్ల పెరుగుదల భారతదేశ ఆర్థిక వృద్ధిని 0.3% నుండి 0.35%కు దెబ్బతీస్తుందని మిశ్రా తెలిపారు. అంతర్జాతీయంగా చమురు ధర 100 డాలర్లకు దాటితే రిటైల్ ద్రవ్యోల్బణం, కరెంట్ ఖాతా లోటును అదుపు చేయడం కష్టం అని అన్నారు. (చదవండి: అమెజాన్ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీగా పెరగనున్న వేతనం!) -
పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం ఆదాయం ఎంతనో తెలుసా..!
గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో పెట్రోల్, డీజిల్‌పై పన్నులు, సెస్ రూపంలో కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.4,55,069 కోట్లు వసూలు చేసినట్లు పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి రామేశ్వర్ తెలీ తెలిపారు. ఇదే కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం రూ.2,02,937 కోట్లు అమ్మకపు పన్ను, విలువ ఆధారిత పన్ను(వ్యాట్)గా వసూలు చేసినట్లు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర మంత్రి తెలియజేశారు. రాష్ట్రాల్లో మహారాష్ట్ర అన్ని పెట్రోలియం ఉత్పత్తులపై అమ్మకపు పన్ను, వ్యాట్ రూపంలో గరిష్టంగా 25,430 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ రూ.21,956 కోట్లు, తమిళనాడు రూ.17,063 కోట్లు వసూలు చేశాయి. నవంబర్ 3న పెట్రోల్‌పై విధించే సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని రూ.5, డీజిల్‌పై రూ.10 తగ్గించినప్పటికీ దేశంలో పెట్రోల్ & డీజిల్ ధరలు ఇంకా ఆకాశాన్ని తాకుతున్నాయి. కేంద్రం ప్రకటన తర్వాత అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధనంపై వ్యాట్‌ను కూడా తగ్గించాయి. ప్రస్తుతం దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.88.67గా ఉంది. భారతదేశం తన చమురు డిమాండ్‌లో 85 శాతం, 55 శాతం సహజ వాయువు అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడి ఉంది. భారతదేశం 2020-21లో ముడి చమురు దిగుమతుల కోసం 62.71 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. (చదవండి: డిస్నీ+ హాట్‌స్టార్ అదిరిపోయే ప్లాన్..! కేవలం రూ. 49 కే సబ్స్క్రిప్షన్..!) -
వాహనదారులకు శుభవార్త.. తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
రోజు రోజుకి పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రోజు రోజుకి పెరిగిపోతున్న ధరలను తగ్గించడం కోసం అమెరికా, జపాన్ వంటి ఇతర దేశాల తరహాలోనే అత్యవసర వ్యూహాత్మక నిల్వ కేంద్రాల నుంచి సుమారు 5 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురును వెలికి తీయాలని భారతదేశం యోచిస్తున్నట్లు ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది అని అన్నారు. భారతదేశం, జపాన్‌తో సహా ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థ గల దేశాల సహకారంతో ముడి చమురు అత్యవసర స్టాక్‌ను విడుదల చేయడానికి అమెరికా ప్రణాళిక వేసింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గే అవకాశం ఉంది. భారతదేశంలోని తూర్పు, పశ్చిమ తీరంలో మూడు ప్రదేశాలలో ఉన్న భూగర్భ చమురు కేంద్రాలలో సుమారు 38 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురును నిల్వ చేస్తుంది. ఇందులో నుంచి సుమారు 5 మిలియన్ బ్యారెల్స్ విడుదల చేయడానికి సిద్దం అవుతున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రక్రియ 7-10 రోజులలో ప్రారంభం కానున్నట్లు ఆ అధికారి తెలిపారు. వ్యూహాత్మక నిల్వలకు పైప్ లైన్ ద్వారా అనుసంధానించిన మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌పిఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్ప్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్)లకు స్టాక్స్ విక్రయించనున్నారు. (చదవండి: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే!) భారత్, అమెరికా, జపాన్, చైనా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా వంటి దేశాలు ఏకకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యవసర చమురు నిల్వల కేంద్రాల నుంచి ముడి చమురు ఒకేసారి బయటకి తీయడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. అత్యవసర చమురు నిల్వల కేంద్రాల నుంచి ముడి చమురును విడుదల చేయాలని అమెరికా ఈ దేశాలను కోరినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. చమురు ఉత్పత్తి దేశాలు కావాలనే కృత్రిమ సృష్టించడం పట్ల భారతదేశం పదేపదే ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో ధరలు పెరగడం, ప్రతికూల పరిణామాలకు దారితీస్తుంది అని ఒక ప్రకటనలో గతంలో తెలిపింది. (చదవండి: 5 నిమిషాల ఛార్జ్‌తో 4 గంటల ప్లేబ్యాక్ హెడ్‌ఫోన్స్‌ను లాంచ్ చేసిన సౌండ్‌కోర్..!) -
బీజేపీ నేతలు నీతులు చెప్పడం విడ్డూరం: పేర్ని నాని
సాక్షి, అమరావతి: ఏ రాష్ట్రంలో లేనన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏపీలో అమలవుతున్నాయని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. రాకెట్ కంటే వేగంగా పెట్రోల్, డీజీల్ ధరలను కేంద్రం పెంచుతోందన్నారు. బీజేపీ నేతలు తమకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలపై జాలి, దయ లేకుండా ధరలు పెంచుతున్నారు. రూ.70 పెట్రోల్‌ను రూ.110కి తీసుకెళ్లారు. ఇప్పుడు 5 రూపాయలు తగ్గించి గొప్పలు చెబుతున్నారని మంత్రి మండిపడ్డారు. చదవండి: అలాంటి ఫలితాలే రానున్నాయి: కాసు మహేష్‌రెడ్డి అక్టోబర్‌లో ధర ఎంత ఉంది? నవంబర్‌లో ఎంత ఉంది. కేంద్రం చేస్తున్న దోపిడీ ప్రజలకు తెలియదా? బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ధర్నా చేయాలి. రూ.5 కాదు రూ.25 తగ్గించాలని మోదీని డిమాండ్ చేయాలి. సెస్ రూపంలో కేంద్రం 2.85 లక్షల కోట్లు వసూలు చేసింది. బీజేపీ నేతలు ధర్నా చేస్తే నేను కూడా ఢిల్లీ వస్తా. ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో కేంద్రం కళ్లు తెరిచింది. ప్రజలపై జాలితో 5 రూపాయలు తగ్గించారు. కేంద్రం వసూలు చేస్తున్న పన్నులు ఎలా ఖర్చు చేస్తున్నారు. ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలు ఎక్కడైనా ఉన్నాయా. సంక్షేమ పథకాలపై ఏపీ చేస్తున్న వ్యయం మీకు కనిపించలేదా?. గ్యాస్ ధర ఎంత ఉండేది.? ఇప్పుడు ఎంత చేశారు.? అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. చదవండి: Kuppam Municipality: కుప్పంలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి.. సీఎం జగన్ పాలనను ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు. వరుస ఎన్నికల్లో వస్తున్న ఫలితాలే ప్రజాదరణకు నిదర్శనం. ప్రభుత్వంపై బురదజల్లేందుకే టీడీపీ పరిమితమవుతోంది. బీజేపీ,టీడీపీల తప్పుడు విమర్శలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి పేర్ని నాని అన్నారు. -
స్పెషల్ డిబేట్ ఆన్ పెట్రోల్ డీజిల్ రేట్స్
-
పెట్రో పరుగుకు బ్రేకులు...! వాహనదారులకు కేంద్రం శుభవార్త..!
న్యూఢిల్లీ: దీపావళి పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు తీపి కబురు అందించింది. నింగిలోకి దూసుకెళ్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గేలా బుధవారం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. వీటిపై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున తగ్గించింది. ఈ తగ్గింపు గురు వారం నుంచే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటన జారీ చేసింది. దేశంలో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని ఈ స్థాయిలో తగ్గించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ తగ్గింపుతో దేశవ్యాప్తంగా పెట్రోల్ ధర లీటర్‌కు రూ.5, డీజిల్ ధర రూ.10 చొప్పున తగ్గనుంది. కొన్ని నెలలుగా వరుసగా పెరుగుతున్న ధరలు కొంత తగ్గడంతో ప్రజలకు ఆ మేరకు ఊరట లభించనుంది. వ్యవసాయ రంగానికి మేలు డీజిల్ ధర దిగి రావడం వ్యవసాయ రంగానికి ఎంతగానో మేలు చేయనుందని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ‘‘లాక్డౌన్ కాలంలోనూ రైతులు తమ శ్రమ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా తోడ్పాటు అందించారు. డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో రాబోయే రబీ సీజన్లో రైతాంగానికి మేలు జరుగుతుంది. ఇటీవలి కాలంలో ముడి చమురు ధరలు అంతర్జాతీయంగా విపరీతంగా పెరిగాయి. ఫలితంగా భారత్‌లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగక తప్పలేదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల ఇంధనాల కొరత కనిపించింది. ధరలు పెరిగాయి. మన దేశంలో ఇంధనాల కొరత తలెత్తకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. దేశ అవసరాలకు సరిపడా పెట్రోల్, డీజిల్ వంటి వాటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. కోవిడ్–19 వ్యాప్తి వల్ల డీలా పడిన దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మళ్లీ గాడిలో పడింది. తయారీ, సేవలు, వ్యవసాయం తదితర రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం ఇవ్వడానికి పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని గణనీయంగా తగ్గించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ఇంధనాల వినియోగం పెరుగుతుంది, ద్రవ్యోల్బణం తగ్గుతుంది. పేదలు, మధ్య తరగతి ప్రజలకు లబ్ధి చేకూరుతుంది..’’ అని ఆర్థిక శాఖ పేర్కొంది. డీజిల్ రేటు తగ్గడం వల్ల పంటల సాగుకు పెట్టుబడి వ్యయం స్వల్పంగానైనా తగ్గనుంది. తద్వారా రైతాంగంపై కొంత భారం దిగిపోయినట్లే. కాగా వినియోగదారులకు మరింత ఉపశమనం కలిగించడానికి రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గించాలని కేంద్ర ఆర్థిక శాఖ సూచించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై రూ.32.90, లీటర్ డీజిల్‌పై రూ. 31.80 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ (సెస్‌లతో కలిపి) విధిస్తోంది. ఇందులో నుంచి పెట్రోల్‌పై ఐదు రూపాయలు, డీజిల్‌పై 10 రూపాయలు తగ్గించనుంది. దీని ప్రభావం మన రాష్ట్ర పన్నులపై కూడా పడనుంది. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై సుమారు రూ.6.81, డీజిల్‌పై రూ.12.73 తగ్గనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.114.47, డీజిల్ రూ.107.37 ధరలు ఉండగా, తగ్గిన సుంకంతో పెట్రోల్ రూ.107.66కు, డీజిల్ రూ.94.64కు తగ్గే అవకాశం ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రేటు రూ.110.04 నుంచి రూ.105.04కు, డీజిల్ రేటు రూ.98.42 నుంచి రూ.88.42కు తగ్గిపోనుంది. ఎన్నికల్లో పరాజయాలతో అప్రమత్తం దేశంలో పెట్రో ధరలు రికార్డు స్థాయిలో పెరగడంతో ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. చాలా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధర రూ.100 మార్కును ఎప్పుడో దాటేసింది. మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో అయితే లీటర్ పెట్రోల్ రేటు రూ.120కి చేరింది. ఈ పరిణామాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు బీజేపీకి చేదు అనుభవాల్నే మిగిల్చాయి. ప్రజాగ్రహాన్ని గుర్తించిన కేంద్రం ఒక మెట్టు కిందికి దిగిరాక తప్పలేదు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు జరిగిన పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని పరిశీలిస్తే ఎక్సైజ్ సుంకం తగ్గింపు వల్ల ప్రభుత్వ ఖజానాకు నెలకు రూ.8,700 కోట్ల మేర నష్టం వాటిల్లనుంది. అంటే సంవత్సరానికి రూ.లక్ష కోట్ల పైమాటేనని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఉన్న కాలానికి రూ.43,500 కోట్ల నష్టం వాటిల్లనుంది. -
వరుసగా ఐదో రోజు పెరిగిన చమురు ధరలు
-
డీజిల్ ధరలు పెరిగినప్పుడల్లా.. బస్సు చార్జీల సవరణ!
టిమ్స్‌తో సులువే.. గతంలో టికెట్లు ఇచ్చే విధానం అమల్లో ఉన్నప్పుడు, టికెట్ చార్జీలు సవరిస్తే వాటిపై కొత్త ధరలను ప్రింట్ చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం టిమ్స్ యంత్రాల ద్వారా టికెట్లు ఇస్తున్నారు. వీటిల్లో చార్జీల పట్టికను సవరించటం సులభం. తరచూ ధరలు మారినా, రాత్రికి రాత్రే వాటిల్లో సవరించే వెసులుబాటు ఉన్నందున కొత్త విధానం ఇబ్బంది కాదని అధికారులు చెబుతున్నారు. సాక్షి, హైదరాబాద్: డీజిల్ ధరల్లో మార్పులు జరిగినప్పుడల్లా టీఎస్ఆర్టీసీ టికెట్ చార్జీలు కూడా మార్చే విధానం తెరపైకి వస్తోంది. ప్రస్తుతం కర్ణాటకలో అమల్లో ఉన్న ఈ విధానాన్ని తెలంగాణ ఆర్టీసీలో కూడా ప్రవేశపెట్టాలన్న నిపుణుల సూచనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఆర్టీసీపై డీజిల్ భారాన్ని ఎప్పటికప్పుడు తగ్గించ డంతో పాటు, ఒకేసారి చార్జీలు భారీగా పెంచిన భావన ప్రజల్లో లేకుండా ఉంటుందన్న కోణంలో దీనికి ప్రాధాన్యం లభిస్తోంది. దీనిపై తెలంగాణ ఆర్టీసీ కూడా ఆసక్తి కనబరుస్తోంది. వాస్తవానికి రెండేళ్ల కిందటే ఈ అంశం చర్చకు వచ్చింది. 2019లో ఆర్టీసీలో సుదీర్ఘ సమ్మె అనంతరం పరిస్థితులు తిరిగి సద్దుమణిగే సమయంలో ఆర్టీసీ అధికారులతో సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. అదే సంవత్సరం డిసెంబర్లో ఆర్టీసీ చార్జీలు పెంచారు. ఆ తర్వాత డీజిల్ ధరల మార్పులకు తగ్గట్టుగా బస్సు ఛార్జీలు సవరించే విధానాన్ని అనుసరిస్తే ఎలా ఉంటుందన్న కోణంలో చర్చించారు. కానీ ఆ వెంటనే కోవిడ్ సమ స్య రావటంతో అది కాస్తా పెండింగులో పడింది. నిర్ణయాధికారం ఆర్టీసీకే.. 2019లో ఆర్టీసీ సమ్మె జరిగిన సమయంలో డీజిల్ ధర లీటరుకు రూ.66గా ఉంది. ఆ సంవత్సరం ఆరంభంలో అది రూ.62గా ఉంది. రెండేళ్లలో లీటర్‌పై ఏకంగా రూ.39 వరకు పెరిగింది. ఫలితంగా రోజుకు ఆర్టీసీపై రూ.2 కోట్ల అదనపు భారం పడుతోంది. ఇటీవల సీఎం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో మరోసారి ఆర్టీసీ బస్సు చార్జీలను సవరించాలన్న అంశం చర్చకు వచ్చింది. దీంతో ప్రతిపాదన పంపాలని, తదుపరి మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ మేరకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. గతంలో లాగా కిలోమీటర్‌కు 20 పైసలు పెంచితే ఉండే ప్రభావం, 25 పైసలు, 30 పైసలు పెంచితే ఎంతుంటుందన్న వివరాలు పొందుపరిచారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కిలోమీటర్‌కు 25 పైసలు పెంచాలని ఆర్టీసీ కోరుతోంది. ఇదే సమయంలో ఇలా కొంతకాలం తర్వాత ఒకేసారి భారీగా పెంచటం కంటే, డీజిల్ ధరలు మారినప్పు డల్లా చార్జీలు సవరించే అధికారాన్ని ఆర్టీసీకి కట్టబెట్టాలన్న సూచన మరోసారి తెరపైకి వచ్చింది. ఒకేసారి చార్జీలు పెంచితే ప్రజలు భారంగా భావిస్తారు. డీజిల్ ధరలు మారినప్పుడల్లా అదే దామాషా ప్రకారం చార్జీలు పెంచితే, ఆ భారం కూడా స్వల్పంగానే ఉన్నట్లు ప్రయాణికులకు కన్పిస్తుంది. వెంటవెంటనే చార్జీలు మారితే డీజిల్ పెంపుతో వచ్చే నష్టాలను ఆర్టీసీ అధిగమిస్తూ నష్టాలకు చెక్ పెట్టొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. (చదవండి: యాదాద్రిలో 250 విల్లాలు.. ఒక్కోటి 2 కోట్లు) -
నిర్మాణ రంగంపై డీజిల్, బొగ్గు దెబ్బ
సాక్షి, అమరామతి: పెద్ద నోట్ల రద్దు, ఆర్థిక సంక్షోభం, కోవిడ్ వంటి వరుస దెబ్బలను తట్టుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నిర్మాణ రంగాన్ని డీజిల్ ధరలు, బొగ్గు కొరత మరోసారి తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఏడాదిన్నరలో లీటర్ డీజిల్ ధర ఏకంగా రూ.28 పెరగడంతో రవాణా వ్యయం భారీగా పెరిగింది. ఏడాదిన్నర కిందట లీటర్ డీజిల్ ధర రూ.78గా ఉండగా ఇప్పుడు అది రూ.106 దాటింది. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా బొగ్గు కొరత రావడంతో డిమాండ్ లేకున్నా ఉత్పత్తి తగ్గడం వల్ల స్టీల్, సిమెంట్, అల్యూమినియం, కాపర్, ప్లాస్టిక్ వంటి అన్ని రకాల ఉత్పత్తుల ధరలు 40 నుంచి 50 శాతం వరకూ పెరిగాయని బిల్డర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బొగ్గు కొరత ప్రభావం అధికంగా స్టీల్ రంగంపై పడింది. కొరత లేకముందు టన్ను స్టీల్ ధర రూ.40–45 వేల మధ్య ఉంటే.. ఇప్పుడది ఏకంగా రూ.65,000 మార్కును అధిగమించింది. సిమెంట్ బస్తా రూ.260 నుంచి రూ.370కి చేరింది. డీజిల్ ధరలు పెరగడంతో ఇసుక, కంకర, ఇటుక వంటి వస్తువుల రవాణా వ్యయం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిందని ఏపీ క్రెడాయ్ ప్రెసిడెంట్ రాజాశ్రీనివాస్ చెప్పారు. ముడి సరుకుల వ్యయం భారీగా పెరగడంతో చదరపు అడుగు నిర్మాణ వ్యయం 20 శాతం వరకూ పెరుగుతోందన్నారు. దీంతో నూతన ప్రాజెక్టులు చేపట్టేందుకు బిల్డర్లు వెనుకాడుతున్నారు. ఇప్పటికే మొదలు పెట్టినవారు పని వేగాన్ని తగ్గించినట్టు క్రెడాయ్ వర్గాలు చెబుతున్నాయి. ఉన్నవాటిని వదిలించుకుందాం.. నిర్మాణ వ్యయం పెరిగినా ధరలు పెంచలేని పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ రంగం ఉందని ఏపీ క్రెడాయ్ ప్రెసిడెంట్ రాజా శ్రీనివాస్ చెప్పారు. వడ్డీరేట్లు తక్కువగా ఉండటంతో ఇప్పుడిప్పుడే అమ్మకాలు పుంజుకుంటున్నాయన్న తరుణంలో నిర్మాణ వ్యయం ఒక్కసారిగా పెరిగిపోయిందని, దీంతో నూతన ప్రాజెక్టుల కంటే.. ఇప్పటికే నిర్మించిన వాటిని అమ్ముకోవడం పైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. కొత్త వెంచర్లు వేసేందుకు కూడా బిల్డర్లు వెనుకాడుతున్నారని వైజాగ్ క్రెడాయ్ చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. క్రెడాయ్ అంచనాల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 1.4 లక్షల ఫ్లాట్స్ నిర్మాణంలో ఉండగా, వాటిలో 56,000 ఫ్లాట్స్ గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయి. లక్షలాది మందికి ఉపాధి కల్పించే నిర్మాణ రంగాన్ని వరుస సంక్షోభాలు వెంటాడుతున్నాయని క్రెడాయ్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
Petrol Diesel Prices: వరుసగా ఐదో రోజు కూడా బాదుడే...!
ఆకాశమే హద్దుగా ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా ఐదో రోజు కూడా ఇంధన ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరుగడంతో..దేశ వ్యాప్తంగా మరోమారు పెట్రోలు, డిజీల్ ధరలు పెరిగాయి. చదవండి: అదరగొట్టిన టీవీఎస్ మోటార్స్..! వరుసగా ఐదవ రోజూ ఆదివారం (అక్టోబర్ 24, 2021) 35 పైసలు పెంపుదల పెట్రోల్, డీజిల్‌పై కనిపిస్తోంది. తాజా పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.107.59పైసలు, లీటర్ డీజిల్ ధర రూ.96.32పైసలు వద్ద కొనసాగుతోంది. వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ ధర రూ.113.46పై., డీజిల్ రూ.104.38కు చేరింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.91కి చేరింది. డీజిల్ రూ.105.08 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.113.52, రూ.106.11 గా ఉన్నాయి. బెంగళూరులో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.111.34, రూ.102.23 కు చేరింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.104.52, డీజిల్ రూ.100.59. ఆయా రాష్ట్రాలోని ట్యాక్స్‌ల ఆధారంగా ఇంధన ధరల్లో మార్పులు ఉండనున్నాయి. గతంలో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధరలూ 19 డాలర్లకు తగ్గడంతో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధరలు సుమారు 85 డాలర్లకు చేరుకుంది. చదవండి: 12 గంటలపాటు నిలిచిపోనున్న ఆదాయపు పన్ను వెబ్సైట్! ఎప్పుడంటే.. -
దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు
-
Petrol, Diesel Prices: అక్కడ లీటర్ పెట్రోల్ రూ.120!
Petrol, diesel prices today:పెట్రోల్ ధరలకు కళ్లెం పడేది ఎప్పుడా? అని వాహనదారులు ఎదురు చూస్తున్నారు. కానీ, నవంబర్ మధ్య వరకు ఇది ఇలానే కొనసాగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా.. శనివారం మరోసారి పెరుగుదలతో పెట్రో రేట్లు హయ్యెస్ట్ మార్క్‌ను అందుకున్నాయి. వరుసగా నాలుగవ రోజూ శనివారం(అక్టోబర్ 23, 2021) 35 పైసలు పెంపుదల పెట్రోల్, డీజిల్‌పై కనిపిస్తోంది. తాజా పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.107.24పై., లీటర్ డీజిల్ ధర రూ.95.97పై.కు వద్ద కొనసాగుతోంది. వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ ధర రూ.113.12పై., డీజిల్ రూ.104కు చేరింది. దేశంలోనే ఫ్యూయల్ ధరలు కాస్ట్లీ కొనసాగుతోంది రాజస్థాన్ టౌన్ గంగానగర్‌లో. ఇక్కడ పెట్రోల్ ధర రూ.119.42గా కొనసాగుతోంది. ఇక డీజిల్ ధర రూ.110.26గా ప్రస్తుతం నడుస్తోంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.55కి చేరింది. డీజిల్ రూ.104.70పై వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.110.98, రూ.101.86 వద్ద కొనసాగుతున్నాయి. లోకల్ ట్యాక్స్‌ల ఆధారంగా రేట్లలో మార్పు ఉంటుందనే విషయం గుర్తించాలి. చెన్నైలో మాత్రం పెట్రో ధరలు.. గురువారం నాటివే కొనసాగుతున్నాయి!. లీటర్ పెట్రోల్ రూ.104.22పై., డీజిల్ రూ.100.25పై. తమిళనాడులో డీజిల్ ధర వంద దాటడం ఇదే మొదటిసారి!. ఇక సెప్టెంబర్ 28 నుంచి 19సార్లు పెట్రో ధరలు పెరిగాయి. గత మూడువారాల మొత్తంగా పెట్రోల్ మీద దాదాపు 6 రూపాయలు, డీజిల్ మీద 7 రూపాయలు(సెప్టెంబర్ 24 నుంచి 22 సార్లు పెంపు) పెంపు కనిపిస్తోంది. అంతకు ముందు మే 4 నుంచి జులై 17 మధ్య లీటర్ పెట్రోల్ ధర రూ.11.44 పెంపు చోటుచేసుకోగా, డీజిల్ ధర రూ.9.14కు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు బ్యారెల్ ధరను 70 డాలర్ల కన్నా దిగువకు తీసుకురావాల్సి ఉందని చెబుతున్న కేంద్రం.. ఈమేరకు చమురు ఉత్పత్తి దేశాలతో సంప్రదింపులు నిర్వహిస్తోంది. -
పెరిగిన పెట్రో ధరలు.. అక్కడ మాత్రం మంటలు
Petrol And Diesel Prices Today: పండుగ తర్వాత చల్లబడుతుందేమో అనుకున్న పెట్రో మంట.. మళ్లీ ఎగసిపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్ ధరల స్థిరీకరణ పేరుతో గ్యాప్ లేకుండా బాదుతున్నాయి చమురు కంపెనీలు. దీంతో గురవారం మళ్లీ ధరలు పెరిగాయి. ఇదే స్పీడ్ కొనసాగితే.. మరో రెండు వారాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.120, డీజిల్ ధర రూ.110 చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇవాళ(గురువారం, అక్టోబర్ 21) మరోసారి పెరిగాయి. లీటరు పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 35 పైసలు పెరిగాయి. దీనితో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.106.54పై. గా, డీజిల్ ధర రూ.95.27కు ఎగబాకింది. అటు ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.112.44కి, డీజిల్ ధర రూ.103.26గా చేరింది. రాజస్థాన్‌లోని గంగానగర్‌లో పెట్రో మంటలు ఎక్కువగా ఉన్నాయి. లీటర్ పెట్రోల్ రేటు రూ.117.98గా ఉందక్కడ(దేశంలో ఇదే అధికం!). ఇక చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.103.71 డీజిల్ 99.59కి చేరింది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ రేటు రూ.110.25కి చేరగా, డీజిల్ ధర 101.12ను తాకింది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.107.11, డీజిల్ రూ.98.38గా ఉంది. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ. 110.92, డీజిల్ ధర రూ. 103.91కు చేరింది. పెట్రోల్ ఎంత ప్రియంగా మారిందంటే.. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ కంటే 35 శాతం ధర ఎక్కువ!. ఏటీఎఫ్ కిలో లీటర్‌కు ఢిల్లీలో 79వేలకు అమ్ముడుపోతోంది. అంటే లీటర్‌కు కేవలం 79 రూ. అన్నమాట. తగ్గించే ప్రయత్నాలు.. పెట్రో మంట తగ్గాలంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు బ్యారెల్ ధరను 70 డాలర్ల కన్నా దిగువకు తీసుకురావాల్సి ఉందని చెబుతోంది కేంద్రం. ఇందుకోసం సౌదీ అరేబియా నుంచి రష్యా వరకు.. చమురు ఉత్పత్తి దేశాలతో పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంప్రదింపులు నిర్వహిస్తోంది. మరోవైపు పెట్రో ధరలను జీఎస్టీ పరిధిలోకి తెస్తే అందరికీ ఉపశమనం కలుగుతుందనే చర్చ ఎప్పటి నుంచూ జరుగుతూనే ఉంది. -
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర ఎంతంటే..
Petrol Diesel Prices Today: వరుసగా మూడో రోజూ పెరిగిన ఇంధన ధరలు. ముడి చమురు ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా మూడో రోజూ పెరిగాయి. గత మూడు వారాల్లో డీజిల్ ధరలు 18 సార్లు పెరగ్గా.. పెట్రోల్ ధరలు 15 సార్లు ఎగబాకాయి. తాజాగా దసరా తెల్లారి శనివారం లీటర్ పెట్రోల్ 36 పైసలు, డీజిల్‌పై 38 పైసలు చొప్పున పెరిగాయి. ఈ పెంపుతో హైదరాబాద్‌లో ఇవాళ(అక్టోబర్ 16, శనివారం) లీటర్ డీజిల్ ధర రూ. 102.80, లీటర్ పెట్రోల్ ధర రూ.109.73కు చేరుకుంది. ఇక ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.105.49పై.లతో గరిష్టానికి చేరుకోగా, ముంబైలో రూ.111.43పై., డీజీల్ ధర ఢిల్లీలో డీజీల్ లీటర్ ధర. రూ.94.22పై., ముంబైలో రూ.102.15పై.కు చేరుకుంది. చెన్నైలో పెట్రోల్ ధర102.70పైసలుగా, డీజీల్ రూ. 98.59పైసలుగా ఉంది. అక్టోబర్ 12, 13 తేదీల్లో పెట్రో రేట్లలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న వాహనదారులకు మళ్లీ హ్యాట్రిక్ రోజుల పెంపు కంగారుపుట్టిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ ధరల స్థిరీకరణ పేరుతో గ్యాప్ లేకుండా బాదుతున్నాయి చమురు కంపెనీలు. చదవండి: గ్యాస్ సిలిండర్ పేలుళ్లు.. ఈ జాగ్రత్తలు పాటిస్తే సురక్షితం -
సామాన్యుడికి చుక్కలు, మరోసారి పెరిగిన పెట్రో ధరలు
బియ్యం, గోధుమ, వంటనూనెల ధరలు తగ్గుతున్నా..రోజురోజుకీ పెరుగుతున్న పెట్రో ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి.వాహనదారులు బండ్లను బయటకు తీయాలంటే జంకుతున్నారు.దీంతో నిత్యవసర ధరలతో పాటు పెట్రో ధరల్ని తగ్గించాలని కోరుకుంటున్నారు. ఇక శనివారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వరుసగా ఐదోరోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.ముంబై వంటి ప్రధాన నగరాల్లో డీజిల్ ధర కూడా పెట్రోల్‌తో పోటీ పడీ మరి పెరిగిపోతోంది. శనివారం రోజు లీటర్ పెట్రోల్‌పై 30 పైసలు, లీటర్ డీజిల్ పై 35పైసలు పెరిగాయి. దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.82 ఉండగా డీజిల్ ధర 100.29 ఉంది ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 103.84 ఉండగా డీజిల్ ధర రూ.92.47 ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ.101.27 ఉండగా డీజిల్ ధర రూ.96.93 ఉంది కోల్ కతాలో పెట్రోల్ ధర రూ. 104.52 ఉండగా డీజిల్ ధర రూ.95.58 ఉంది హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.108.02 ఉండగా డీజిల్ ధర రూ.100.89 ఉంది బెంగళూరులో పెట్రోల్ ధర రూ.107.77 ఉండగా డీజిల్ ధర రూ.98.15 ఉంది. -
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..ఎంతంటే?
శుక్రవారం రోజు మరో సారి పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమన్నాయి. లీటర్ పెట్రోల్ పై 31 పైసలు,డీజిల్ పై 38 పైసలు పెరిగాయి. దీంతో వాహనదారులు పెరుగుతున్న ఇంధన ధరలతో చేతి చమురు వదులుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కష్ట కాలంలో కూడా ఇంధన రేట్లను పెంచడం దారుణమని వాపోతున్నారు. రవాణా రంగం మీద ఆధారపడే వాళ్లు సైతం బండి బయటకు తీయాలంటేనే భయపడుతున్నారు.ఇన్ని రోజులు వర్క్ ఫ్రం హోంకే పరిమితమైన ఉద్యోగులు ఆఫీస్‌లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.కానీ రోజురోజుకి రికార్డ్ స్థాయిలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ఆఫీస్‌కు వెళ్లాలంటే జంకుతున్నారు. దేశంలోని పలు నగరాల్లో రోజురోజుకి పెరగుతున్న ఇంధన ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి.ఇప్పటికే పెట్రోల్ రేటు వంద దాటి పరుగులుపెడుతుండగా.. డీజల్ రేట్లు సైతం వంద మార్క్‌ను దాటాయి. పలు నగరాల్లో పెరిగిన పెట్రోల్, డీజిల్ వివరాలు హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.107.71 ఉండగా డీజిల్ లీటర్ రూ.100.51 ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 103.54 ఉండగా.. లీటర్ డీజిల్ రూ. 92.12 ఉంది ముంబైలో పెట్రోల్ రూ. 109.54 ఉండగా డీజిల్ రూ .99.92 ఉంది కోల్‌కతాలో పెట్రోల్ రూ. 104.23 ఉండగా డీజిల్ రూ. 95.23 ఉంది చెన్నైలో పెట్రోల్ రూ .101.01 డీజిల్ రూ. 96.60 ఉంది. -
స్థిరంగా పెట్రోల్ ధరలు, ఏ నగరంలో ఎంతంటే?
వాహనదారులకు స్వల్ప ఊరట లభించింది. వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు బ్రేకులు పడింది.ఆదివారం పెట్రోల్‌పై 25 పైసలు,డీజిల్‌పై 30 పైసలు పెరిగాయి. కానీ సోమవారం మాత్రం పెట్రో ధరలు పెరగకపోవడంతో పోవడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం దేశంలోని పెట్రోల్, డీజిల్ ధరలు హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.106.51 ఉండగా లీటర్ డీజిల్ ధర రూ.99.04 ఉంది విజయవాడలో పెట్రోల్ ధర రూ.108.57 ఉండగా డీజిల్ ధర రూ.100.45 ఉంది. వైజాగ్‌లో పెట్రోల్ ధర రూ.107.19 ఉండగా..డీజిల్ ధర రూ.99.14 ఉంది. ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.102.39 ఉండగా..డీజిల్ ధర రూ.90.77ఉంది కోల్ కతాలో పెట్రోల్ ధర రూ.103.07 ఉండగా .. డీజిల్ ధర రూ.93.87 ఉంది చెన్నైలో పెట్రోల్ రూ100.01 ఉండగా డీజిల్ ధర రూ.95.31 ఉంది. -
ఆగని పెట్రోమంట..మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశంలో సామాన్యుడిపై పెట్రో మంట కొనసాగుతుంది. వరుసగా రుగుతున్న ధరలు సరికొత్త రికార్డ్లను క్రియేట్ చేస్తున్నాయి. ఆదివారం సైతం లీటర్ పెట్రోల్ పై 25పైసలు, డీజిల్ పై 30పైసలు పెరిగింది. దీంతో దేశంలో పలు ప్రధాన నగరాల్లో డీజిల్ ధరలు సెంచరీని క్రాస్ చేశాయి. ముఖ్యంగా గత నాలుగు రోజులుగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే సమయంలో ఇంధన ధరల పెంపుపై కేంద్రం చెప్పిన కారణాలపై పెదవి విరిస్తున్నారు. దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.106.51 ఉండగా లీటర్ డీజిల్ ధర రూ.99.04 ఉంది విజయవాడలో పెట్రోల్ ధర రూ.108.57 ఉండగా డీజిల్ ధర రూ.100.45 ఉంది. వైజాగ్‌లో పెట్రోల్ ధర రూ.107.19 ఉండగా..డీజిల్ ధర రూ.99.14 ఉంది. ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.102.39 ఉండగా..డీజిల్ ధర రూ.90.77ఉంది కోల్ కతాలో పెట్రోల్ ధర రూ.103.07 ఉండగా .. డీజిల్ ధర రూ.93.87 ఉంది చెన్నైలో పెట్రోల్ రూ100.01 ఉండగా డీజిల్ ధర రూ.95.31 ఉంది. -
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!
హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ క్రమ క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా నేడు పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. దీంతో వాహనదారులపై ప్రతికూల ప్రభావం పడనుంది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర 26 పైసలు పెరగడంతో రూ.105.74కు చేరింది. డీజిల్ ధర 32 పైసలు పెరుగుదలతో రూ.98.06కు ఎగసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.46 శాతం తగ్గుదలతో 77.73 డాలర్లకు క్షీణించింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.28 శాతం క్షీణతతో 74.61 డాలర్లకు తగ్గింది. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలను, రూపాయి-డాలర్ మారకపు విలువను పరిగణనలోకి తీసుకుని ప్రతిరోజూ ఇంధన రేట్లను సవరిస్తాయి. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి కొత్త పెట్రోల్, డీజిల్ ధరలు మార్పులు చేస్తారు. దేశంలోని ఇతర నగరాలలో కొత్త ఇంధన రేట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి. (చదవండి: పది ఏళ్లుగా ముఖేష్ అంబానీ నెంబర్ 1) -
సామాన్యులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల సామాన్యుడు బతుకు జీవుడా అంటూ బతుకు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజు రోజుకి పెరిగి పోతున్న ఈ ధరల వల్ల సామాన్యుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. తాజాగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ ధరలు 20 పైసలు పెరగగా, డీజిల్ మంగళవారం 25 పైసలు పెరిగింది. ఈ పెంపు తర్వాత ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.101.39కు చేరుకుంది. దేశ రాజధానిలో ఒక లీటర్ డీజిల్ ను రూ.89.57కు విక్రయిస్తున్నారు. భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.107.47, డీజిల్ ధర లీటరుకు రూ.97.21గా ఉన్నాయి. గత రెండు నెలల వ్యవధిలో పెట్రోల్ ధరలు పెరగడం ఇది తొలిసారి కాగా.. డీజిల్ ధరలు నాలుగోసారి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు దాదాపు మూడేళ్ల గరిష్ఠానికి చేరాయి. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పెరిగి పోతున్నాయి. దీంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెంచాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్ 17 సెంట్లు లేదా 0.2 శాతం తగ్గి 79.36 డాలర్లకు చేరుకుంది. కరోనా మహమ్మారి భయాలు తగ్గడం, వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని క్రమ క్రమంగా తొలిగించడంతో ఇంధన ధరలకు అంతర్జాతీయంగా డిమాండ్ ఏర్పడింది.(చదవండి: 35వేల కోట్ల జరిమానా సరే! యాపిల్ సంగతేంది?) దేశంలోని ప్రధాన నగరాల్లో లీటర్ డీజిల్, పెట్రోల్ ధరలు.. City Name Petrol Price Diesel Price హైదరాబాద్ 105.48 97.46 విజయవాడ 107.54 99.25 విశాఖపట్నం 106.77 98.51 ఢిల్లీ 101.39 89.57 ముంబై 107.47 97.21 బెంగళూరు 104.92 95.06 చెన్నై 99.15 94.17 -
TSRTC: కి.మీ.కు 25 పైసలు పెంపు!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ చార్జీల పెంపు దిశగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతానికి కిలోమీటరుకు 25 పైసల చొప్పున పెంచే దిశగా నివేదికను రూపొందిస్తున్నారు. దీనికితోడు కిలోమీటరుకు 20 పైసలు, కిలోమీటరుకు 28–30 పైసలుతో మరో రెండు ప్రత్యామ్నాయ నివేదికలను కూడా తయారు చేస్తున్నారు. తదుపరి మంత్రివర్గ సమావేశంలో చర్చించేందుకు వీలుగా వీటిని సీఎం కార్యాలయానికి సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి సూచనతో.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆర్టీసీని ఇప్పటికిప్పుడు గట్టెక్కించాలంటే టికెట్ చార్జీల పెంపు అనివార్యమంటూ మంగళవారం సీఎం నిర్వహించిన సమీక్షలో అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ప్రతిపాదనలు సమర్పిస్తే.. మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం పేర్కొన్నట్టు మంగళవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో సీఎం కార్యాలయం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అధికారులు కసరత్తు ప్రారంభించి దాదాపు పూర్తి చేసినట్టు తెలిసింది. ప్రస్తుతానికి 25 పైసలైతే ఓకే.. పెరిగిన డీజిల్, టైర్లు, ఇతర పరికరాల ధరల కార ణంగా గత కొన్ని నెలల్లో ఆర్టీసీపై పడిన అదనపు భారం నుంచి గట్టెక్కాలంటే కిలోమీటరుకు 25 పైసలు చొప్పున చార్జీలు పెంచాలనే అభిప్రాయానికి అధికారులు వచ్చారు. 2019 డిసెంబర్లో కిలోమీటరుకు 20 పైసలు చొప్పున చార్జీలు పెంచారు. ఆ సమయంలో డీజిల్ ధర లీటరుకు రూ.65 ఉంది. ఈ రెండేళ్లలో లీటరుపై గరిష్టంగా రూ.22 మేర పెరిగింది. దీంతో అదనంగా సాలీనా దాదాపు రూ.500 కోట్ల భారం పడిందని లెక్కలు తేల్చారు. ఇక టైర్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఆ భారం కిలోమీటరుకు రూపాయి చొప్పున పడుతోంది. విడిభాగాల ధరలు భారీగా పెరగడం వల్ల పడిన అదనపు భారం కిలోమీటరుకు మరో రూపాయి చొప్పున పడుతోంది. ఈ లెక్కన నిత్యం సగటున రూ.50 లక్షల అదనపు భారం ఉంటోంది. అంటే సాలీనా సుమారు రూ.180 కోట్ల భారం పడుతోంది. ఈ నేపథ్యంలోనే కి.మీ.కు 25 పైసలు చొప్పున చార్జీలు పెంచితే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం కోవిడ్ పరిస్థితుల వల్ల గతంలో లాగా బస్సులు తిరగటం లేదు. కోవిడ్ సమస్య తగ్గితే ఖర్చు కూడా పెరుగుతుంది. అప్పుడు కూడా కొంత అనుకూలంగా ఉండేలా కి.మీ.కు 28 పైసల నుంచి 30 పైసల వరకు పెంచాలనే ప్రత్యామ్నాయ నివేదికను సిద్ధం చేస్తున్నారు. అదే సమయంలో మధ్యేమార్గంగా 20 పైసలతో మరో నివేదికను కూడా తయారు చేసే పనిలో ఉన్నారు. వీటిని పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు పెంపు చోటు చేసుకునే అవకాశం ఉంది. -
TSRTC: చుక్కలు చూపిస్తున్న చమురు
సాక్షి, హైదరాబాద్: ఎప్పటికప్పుడు పెరుగుతున్న చమురు భారం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను తీవ్రంగా కలవరపెడుతోంది. చూస్తుండగానే మొత్తం వ్యయంలో డీజిల్ వాటా ఏకంగా 30 శాతాన్ని మించింది. రెండేళ్ల స్వల్ప విరామంలోనే లీటరు డీజిల్‌పై రూ.24 మేర ధర పెరగటంతో ప్రస్తుతం ఆర్టీసీ పరిస్థితి గందరగోళంగా మారింది. సంస్థ తాజా లెక్కల ప్రకారం.. ఒక కిలోమీటరుకు వ్యయం (కాస్ట్ పర్ కిలోమీటర్) రూ.60గా ఉండగా, అందులో డీజిల్ వాటా రూ.21కి చేరింది. ఉద్యోగుల జీతాల ఖర్చు 53 శాతం ఉండగా, ఇప్పుడు డీజిల్ భారం 30 శాతాన్ని మించటంతో ఈ రెంటినీ ఎలా తగ్గించుకోవాలనే విషయంపై ఆర్టీసీ మేధోమధనం ప్రారంభించింది. సంస్థ కొత్త ఎండీగా బాధ్యతలు స్వీకరించిన వీసీ సజ్జనార్, వీలైనంత త్వరగా డీజిల్ ఖర్చు తగ్గింపుపై సరికొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రోజుకు 5.4 లక్షల లీటర్ల వాడకం రెండేళ్ల క్రితం ఆర్టీసీలో సమ్మె జరిగిన సమయంలో డీజిల్ ధర లీటరుకు రూ.73గా ఉంది. ఆ సమ్మె సమయంలో కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్లలో ఆర్టీసీపై డీజిల్ భారాన్ని తగ్గించడం కూడా ఒకటి. చమురుపై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్‌ను ఎత్తేయటం ద్వారా ఆర్టీసీని రక్షించాలని కార్మికులు డిమాండ్ చేశారు. సరిగ్గా రెండేళ్ల తర్వాత ఇప్పుడు లీటర్ ధర రూ.97కు చేరింది. ఆర్టీసీకి చమురు కంపెనీలు కొంత తగ్గింపు ధరలకే డీజిల్‌ను సరఫరా చేస్తున్నా.. లీటర్‌పై మొత్తం మీద రూ.24 పెరిగిపోవటంతో రోజువారీ వినియోగంలో అదనపు భారం దాదాపు రూ.1.30 కోట్లకు చేరింది. పేరుకుపోతున్న బిల్లులు ఆర్టీసీ నిత్యం 5.4 లక్షల లీటర్ల ఆయిల్‌ను వాడు తుంది. కోవిడ్ వల్ల ఏడాదిన్నరగా పూర్తిస్థాయి లో బస్సులు తిరగకపోవటంతో ఈ ఖర్చు కొం త ఆదా అయింది. ఇప్పుడు కోవిడ్ దాదాపు తగ్గిపోవటంతో పూర్తిస్థాయిలో బస్సులను నడుపుతున్నారు. దీంతో డీజిల్ వినియోగం మళ్లీ గరిష్ట స్థాయికి చేరింది. దీంతో ఖర్చును భరించలేక ఆర్టీసీ కిందామీదా పడుతోంది. గతంలో ఇలాగే బిల్లులు పేరుకుపోతే సరఫరా నిలిపేస్తామని ఆయిల్ కంపెనీలు హెచ్చరించటంతో కొంతచెల్లించి సమస్య లేకుండా చూసింది. ఇప్పుడు ప్రతినెలా బిల్లులు పేరుకుపోతుండటంతో కంపెనీల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. మళ్లీ ప్రత్యామ్నాయాలపై దృష్టి.. చమురు ధరల భారాన్ని తట్టుకోలేక కొంతకాలం క్రితం ఆర్టీసీ కొన్ని ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారించింది. అందులో ముఖ్యమైంది ఎలక్ట్రిక్ కన్వర్షన్. ఎలక్ట్రిక్ బస్సులు నడిపితే చమురు వినియోగం ఉండనందున అటువైపు మొగ్గు చూపింది. అయితే ఆ బస్సుల ఖరీదు ఎక్కువ కావటంతో కొత్త బస్సులు కొనే పరిస్థితి లేదు. ఇందుకోసం ఉన్న బస్సులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని యోచించింది. ఈ మేరకు కొన్ని కంపెనీలతో చర్చించింది. కానీ ఖర్చు కూడా ఎక్కువగా ఉంది. దీంతో కన్వర్ట్ చేసిన కంపెనీలే కొన్నేళ్లు వాటిని నిర్వహించి డీజిల్ ఆదా రూపంలో మిగిలిన మొత్తంలో లాభం తీసుకోవటం లాంటి ఒప్పందాలు చేసుకోవాలని భావించింది. కానీ నాటి ఎండీ దీనిపై ఎటూ తేల్చకుండా పెండింగులో పెట్టారు. -
జులైలో ముడి చమురు ఉత్పత్తి తగ్గింది
న్యూఢిల్లీ: దేశీయంగా ముడిచమురు ఉత్పత్తి జులైలోనూ క్షీణించింది. గతేడాది(2020) ఇదే నెలతో పోలిస్తే 3.2 శాతం తగ్గి 2.5 మిలియన్ టన్నులకు పరిమితమైంది. ప్రధానంగా ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ లక్ష్యాన్ని అందుకోలేకపోవడం ప్రభావం చూపింది. ఈ ఏడాది(2021–22) తొలి 4 నెలల్లో సైతం దేశీ చమురు ఉత్పత్తి 3.4 శాతం నీరసించి 9.9 మిలియన్ టన్నులకు చేరింది. పెట్రోలియం, సహజవాయు శాఖ విడుదల చేసిన గణాంకాలివి. గత నెలలో ఓఎన్జీసీ 4.2 శాతం తక్కువగా 1.6 మిలియన్ టన్నుల చమురును వెలికి తీసింది. ఇక ఏప్రిల్–జులై మధ్య 4.8 శాతం క్షీణించి 6.4 మిలియన్ టన్నులకు పరిమితమైంది. అయితే నేచురల్ గ్యాస్ ఉత్పత్తి పుంజుకుంది. చదవండి : Flipkart: కిరాణా వర్తకులకు ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్ -
స్వల్పంగా తగ్గిన పెట్రో ధరలు
వాహన దారులకు స్వల్ప ఊరట లభించింది. లీటరు పెట్రోలు, డీజిల్‌పై కేవలం15 పైసలు తగ్గిస్తున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. దీంతో గడచిన 38 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రెండవసారి తగ్గినట్లైంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో పెట్రో ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.101.49 ఉండగా లీటర్ డీజిల్ రూ.88.92గా ఉంది హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.105.63ఉండగా డీజిల్ రూ.97.16గా ఉంది ముంబైలో పెట్రోల్ ధర రూ. 107.52 వద్ద ఉండగా డీజిల్ ధర రూ .96.48గా ఉంది ఇక మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు రూ.110 క్రాస్ చేశాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అమరావతి, తిరువనంతపురంలలో సెంచరీ దాటింది. దీంతో పెట్రోల్ ధర రూ.100 దాటిన నగరాల్లో ఢిల్లీ, కోల్‌కతా, భోపాల్, చెన్నై, జైపూర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, పాట్నా, తిరువనంతపురం, పాట్నా, భువనేశ్వర్ తదితర నగరాలు ఉన్నాయి. -
వరుసగా రెండో రోజు తగ్గిన డీజిల్ ధరలు
హైదరాబాద్: వరుసగా రెండో రోజు డీజిల్ ధరను తగ్గించాయి చమురు కంపెనీలు. లీటరు డీజిల్‌పై మరోసారి 20 పైసల వంతున ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పడిపోవడంతో డీజిల్ ధరలు తగ్గుతున్నాయి. డీజిల్ ధరలు తగ్గిస్తోన్న చమురు కంపెనీలు పెట్రోలు ధర తగ్గించకపోవడంపై ప్రజల్లో అంసంతృప్తి నెలకొంది. ధరల తగ్గింపుకు ముందు హైదరాబాద్‌లో లీటరు డీజిల్ ధర రూ.97.74 ఉండగా తాజా తగ్గింపుతో రూ.97.54గా ఉంది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను ఒకేసారి 25 రూపాయలు పెంచుతూ డీజిల్ ధరలు కేవలం లీటరుకు 20 పైసల వంతున తగ్గించడంపై విమర్శలు వస్తున్నాయి. మొత్తంగా చూస్తే గత నెల రోజులుగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరగకుండా నిలకడగా ఉండటం వల్ల సామాన్యులకు ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తోంది. -
ఈ చిన్న చిన్న చిట్కాలతో పెట్రోల్,డీజిల్‌ను ఆదా చేయండి
గత కొద్దిరోజులుగా చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో వాటి ధర తగ్గొచ్చు..లేదంటే మరింత పెరగొచ్చు.అయితే వాటి ధరలు ఎలా ఉన్నా వాహనదారులు ఈ చిట్కాలు పాటించి పెట్రోల్- డీజిల్‌ను సేవ్ చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్పీడ్ డ్రైవింగ్ చేయకండి మీ మోటారు వాహనాల్ని స్పీడ్‌గా డ్రైవ్ చేయడం,బ్రేకులు వేయడంవల్ల పెట్రోల్ లేదంటే డీజిల్ త్వరగా అయిపోతుంది. అలా కాకుండా స్లోగా నడపడం వల్ల ఇంధనాన్ని సేవ చేసుకోవడమే కాదు. రాబోయే ప్రమాదల నుంచి సురక్షితంగా ఉండొచ్చు. హైవేలు,నగరాల్లోని రహదారాల్లో డ్రైవింగ్ చేయడం వల్ల 33శాతం ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు. మీ వేగాన్ని అదుపులో ఉంచుకోండి మీకారు ఇంధన వినియోగం ఏరోడైనమిక్స్, రహదారులు, ఇంజిన్ సామర్ధ్యం వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. కారు వేగం పెరిగే కొద్దీ ఎదురుగా వీచే గాలిసామర్ధ్యం పెరిగిపోతుంది. దీంతో ఇంధనం అయిపోతుంది. ఇటీవల ఆటోమొబైల్ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో వాహనాన్ని నడిపే పద్దతిని బట్టి అది పనిచేసే సామర్థ్యం గణనీయంగా పడిపోతుందని తేలింది. కాబట్టి మీరు 50- 60 కిలోమీటర్ల వేగంతో డ్రైవింగ్ చేయడం ఉత్తమం. ఇంధన సామర్ధ్యం ఎక్కువగా ఉండాలి అది కారైనా కావొచ్చు, ద్విచక్రవాహనమైనా కావొచ్చు. అందులో ఇంధనం పూర్తి స్థాయిలో ఉండాలి. మనలో ఎక్కువమంది వాహనంలో తగినంత ఇంధన లేకపోయినా డ్రైవింగ్ చేస్తుంటారు. అలా చేయడం వల్ల ఇంధన వినియోగం పెరిగిపోతుంది. మీ వాహనం పనితీరు మందగిస్తుంది. రెగ్యులర్ సర్వీసింగ్ అవసరం ఏదైనా వస్తువును వాడే కొద్ది దాని పనితీరు ఆగిపోతుంది. అలా కాకుండా దాని పనితీరు బాగుండాలంటే మరమ్మత్తులు అవసరం.వాహనాలు కూడా అంతే. సమయానికి వాహనాల్ని శుభ్రం చేయండి. ఇంజన్ , ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్, ఆయిల్ చెకింగ్ తో పాటు వాహనం కండీషన్ బాగుండేలా చూసుకోవాలి. మీ కారు అద్దాల్ని క్లోజ్ చేయండి కారు అద్దాల్ని ఓపెన్ చేసి డ్రైవింగ్ చేయడం వల్ల ఇంధన వినియోగం పెరిగిపోతుంది. ప్రయాణంలో కారు అద్దాల్ని ఓపెన్ చేయడం ద్వారా..కారు లోపలికి ప్రవేశించి మీ కారు మరింత వేగంగా వెళ్లేందుకు సాయం చేస్తుంది.దీంతో 10శాతం ఇంధన వినియోగం పెరిగిపోతుంది. ఏసీ వాడకం తగ్గించండి డ్రైవింగ్ సమయాల్లో కారు ఏసీ వినియోగాన్ని తగ్గించండి.ప్రయాణంలో ఏసీ వినియోగించడం వల్ల ఇంజన్‌పై లోడ్ పెరిగి ఇంధన వినియోగం పెరిగిపోతుంది. కాబట్టి ఏసీ వినియోగంపై పరిమితులు విధించండి. వాహనం టైర్లపై ఒత్తిడి పడకుండా చూడండి కొంతమంది వాహనదారులు తమ వాహనాల్ని ఇష్టానుసారంగా వినియోగిస్తుంటారు. అవసరం లేకుండా బ్రేకులు వేస్తూ వాహనంపై ఒత్తిడిపడేలా చేస్తుంటారు. అలా కాకుండా వాహనాన్ని నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ బ్రేక్ వినియోగాన్ని తగ్గిస్తే 20శాతం వరకు ఆదాచేసుకోవచ్చు. ఇంజన్ వినియోగాన్ని తగ్గించండి ప్రయాణంలో వాహనం ఇంజన్ వినియోగం ఎక్కువగా ఉంటే ఇంధన వినియోగం పెరిగిపోతుంది. అదే ప్రయాణంలో ఏమాత్రం చిన్న గ్యాప్ వచ్చినా ఇంజన్ ను ఆపేయండి. ముఖ్యంగా ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఇంజన్ ను ఆపేయడం వల్ల ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు.ట్రాఫిక్‌లో 10శాతం కంటే ఎక్కువ సమయంలో ఇంజన్ ఆపేయడం ఉత్తమంది. దీని వల్ల ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు. -
దేశంలో పెట్రో ధరలు పెరగకపోవడానికి కారణం అదేనా?!
దేశంలోని వాహనదారులకు పెట్రోధరలపై ఊరట కలిగింది.గత ఆదివారం నుంచి ఈ రోజు(శనివారం) వరకు చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.పార్లమెంట్ సమావేశాలు, ఒపెక్ (పెట్రోలియం ఉత్పత్తి చేసే దేశాల సమాఖ్య) సమావేశంలో కరోనా ఎఫెక్ట్‌తో తగ్గించిన పెట్రోలు నెల వారి ఉత్పత్తి సామార్థ్యాన్ని తిరిగి రోజుకు 400,000 బారెల్స్ పెంచాలని ఒపెక్ దేశాలు నిర్ణయించాయి. ఈ ప్రకటన తర్వాత ముడి ధరలు బాగా పడిపోయాయి. ఇక శనివారం రోజు పెట్రోల్ ధరల వివరాలు హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ .105. 83 ఉండగా డీజిల్ రూ .97.96గా ఉంది ముంబై లీటర్ పెట్రోల్ ధర రూ .107.83 ఉండగా డీజిల్ ధర రూ .97.45గా ఉంది ఢిల్లీలో పెట్రోల్ ధర రూ .101.84 ఉండగా డీజిల్ ధర రూ .89.87గా ఉంది చెన్నైలో పెట్రోల్ ధర రూ102.49 ఉండగా డీజిల్ రూ .94.39 గా ఉంది కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ .102.08 ఉండగా డీజిల్ రూ .93.02 గా ఉంది బెంగళూరు లో పెట్రోల్ ధర రూ .105.25 ఉండగా డీజిల్ రూ .95.26గా ఉంది -
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
సాక్షి,న్యూఢిల్లీ : దేశంలో చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కాగా,గత శనివారం లీటర్ పెట్రోల్‌పైన 30పైసలు పెరిగింది. ఆ తర్వాత ఆదివారం నుండి చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. జులై నెల 20రోజుల్లో ఇంధన ధరలు పదిసార్లు పెరిగాయి...మే 3 నుంచి ఇప్పటివరకూ వరుసగా 5 రోజుల పాటు పెట్రో ధరలు పెరగకపోవడం గమనార్హం. గత ఆదివారం ఒపెక్, అనుబంధ దేశాలు ఆగస్ట్ నుంచి చమురు ఉత్పత్తి పెంచేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పదం ప్రకారం.. ఆగస్టు నుంచి డిసెంబరు వరకు రోజుకు 20 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి పెంచనున్నారు. ఈ ఒప్పందం నేపథ్యంలో చమురు ధరలు నిలకడగా ఉన్నాయి. భవిష్యత్‌లో వీటి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక గురువారం రోజు పెట్రోల్ ధరల వివరాలు హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ .105. 83 ఉండగా డీజిల్ రూ .97.96గా ఉంది ముంబై లీటర్ పెట్రోల్ ధర రూ .107.83 ఉండగా డీజిల్ ధర రూ .97.45గా ఉంది ఢిల్లీలో పెట్రోల్ ధర రూ .101.84 ఉండగా డీజిల్ ధర రూ .89.87గా ఉంది చెన్నైలో పెట్రోల్ ధర రూ102.49 ఉండగా డీజిల్ రూ .94.39 గా ఉంది కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ .102.08 ఉండగా డీజిల్ రూ .93.02 గా ఉంది బెంగళూరు లో పెట్రోల్ ధర రూ .105.25 ఉండగా డీజిల్ రూ .95.26గా ఉంది -
పెట్రోల్,డీజిల్ వినియోగదారులకు శుభవార్త
ముంబై: ఇంధన కొనుగోళ్లపై తగ్గింపుల ప్రయోజనాలతో కూడిన కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డును ఐసీఐసీఐ బ్యాంకు విడుదల చేసింది. ‘ఐసీఐసీఐ బ్యాంకు హెచ్‌పీసీఎల్ సూపర్ సేవర్’ కార్డుతో హెచ్‌పీసీఎల్ పెట్రోలియం ఔట్లెట్ల వద్ద చేసే చెల్లింపులపై 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుందని.. ‘హెచ్‌పీపే’ యాప్ ద్వారా కార్డుతో చెల్లింపులు చేసినట్టయితే అదనంగా మరో 1.5 శాతం క్యాష్ బ్యాక్ పొందొచ్చని ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది. వీసా భాగస్వామ్యంతో ఈ కార్డును ఆఫర్ చేస్తుండగా.. వార్షిక ఫీజు రూ.500గా ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్టాలకు చేరిన తరుణంలో తగ్గింపుల ప్రయోజనాలతో బ్యాంకు ఈ వినూత్నమైన కార్డును ఆవిష్కరించడం మార్కెట్ వాటాను పెంచుకునే వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. తరచుగా సాంకేతిక అవాంతరాలు తలెత్తుండడంతో నూతన క్రెడిట్ కార్డులు జారీ చేయవద్దంటూ హెచ్డీఎఫ్సీ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో పోటీ సంస్థలైన ఎస్బీఐ కార్డ్స్, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు.. క్రెడిట్ కార్డుల్లో వాటాను పెంచుకునేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాయి. -
స్థిరంగా పెట్రో ధరలు, ఏ నెలలో ఎన్నిసార్లు పెరిగాయో తెలుసా?
దేశంలో డీజిల్,పెట్రోల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గురువారం రోజు చమురు ధరలు స్వల్పంగా పెరిగినా శుక్రవారం,శనివారం వాటి ధరలు అలాగే స్థిరంగా ఉన్నాయి. ముఖ్యంగా మే 4 నుంచి కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత చమరు ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో 4నుంచి మే 27 మధ్యకాలంలో 14 సార్లు, జూన్ నెలలో 16సార్లు, జులై నెలలో(ఈరోజు వరకు) 8 సార్లు పెరిగాయి. కాగా,చమురు ఉత్పత్తి చేసే దేశాల కూటమి(ఒపెక్) లతో జరిగే చర్చల్లో ఎలాంటి మార్పు కనబడడం లేదు. ఇప్పుడు అదే అంశం పెట్రో ధరలపై పడినట్లు తెలుస్తోంది. ఇక శనివారం రోజు పెట్రోల్ డీజిల్ ధరలు వివరాలు హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.52గా ఉండగా డీజిల్ ధర రూ. 97.96గా ఉంది న్యూఢిల్లీలో పెట్రోల్ ధర రూ.101.54 గా ఉండగా డీజిల్ ధర రూ.89.87 గా ఉంది చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.23 గా ఉండగా డీజిల్ ధర రూ.94.39 గా ఉంది. ముంబైలో పెట్రోల్ ధర రూ. 107.54 గా ఉండగా డీజిల్ ధర రూ. 97.45గా ఉంది. బెంగళూరులో పెట్రోల్ ధర రూ.104.94 గా ఉండగా డీజిల్ ధర రూ. రూ.95.26 గా ఉంది. విశాఖ పట్నంలో పెట్రోల్ ధర రూ.106.5 గా ఉండగా డీజిల్ ధర రూ. రూ.98.43గా ఉంది. -
రెండు రోజుల సంబరమే,మరోసారి పెరిగిన పెట్రో ధరలు
దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దాదాపు రెండు నెలల తరువాత జులై 12 నుంచి చమురు ధరలు కాస్త తగ్గి స్థిరంగా కొనసాగుతున్నాయి. రెండు రోజుల పాటు చమురు ధరలు అలాగే ఉన్నా.. గురువారం రోజు వాటి ధరలు స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్ ధర 31 నుంచి 39 పైసా వరకు పెరగ్గా..డీజిల్ ధర 15 నుంచి 21 పైసా వరకు పెరిగింది. దీంతో చెన్నై, ముంబై వంటి మెట్రో నగరాల్లో చమురు ధరలు రికార్డ్ స్థాయిల్ని నమోదు చేశాయి. గురువారం రోజు ప్రధాన నగరాల్లో చమురు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.52, డీజిల్ ధర రూ.97.96 ఉంది. ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.101.54, డీజిల్ ధర రూ.89.87 చెన్నైలో పెట్రోల్ రూ.102.23, డీజిల్ ధర రూ.94.39 ముంబై పెట్రోల్ ధర రూ.107.54 డీజిల్ ధర రూ.97.45 కోల్ కతా లో పెట్రోల్ ధర రూ.101.74, డీజిల్ ధర రూ.93.02 కాగా, జాతీయ అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశంలో చమురు ధరల పెరగడానికి కారణమైందని రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. ముఖ్యంగా అమెరికన్ మార్కెట్లో క్రూడ్ అయిల్ స్టాక్స్ ప్రభావం లేకపోవడంతో పాటు సెప్టెంబర్ నాటికి చమురు ధరల రవాణా తగ్గిపోతుండడంతో వాటి ప్రభావం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలకు కారణమైనట్లు తెలుస్తోంది. -
Petrol Diesel Prices: వాహనదారులకు ఊరట..స్థిరంగా ధరలు
దేశంలో నిత్యం పెరుగుతున్న పెట్రో ధరలకు మరోసారి బ్రేక్ పడింది. ఆల్ మోస్ట్ 2 నెలల తరువాత జులై 12 నుంచి చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా బుధవారం చమురు ధరల్లో ఎలాంటి పెరుగుదల లేదని చమురు కంపెనీలు ప్రకటించాయి. ఇక మే 4వ తేదీ నుండి ఇంధన ధరలు 39సార్లు పెరగ్గా జులై నెలలోనే పెట్రోల్ ధర ఏడుసార్లు పెరిగింది. ఇక దేశంలో ప్రధాన నగరాల్లో ప్రస్తుతం పెట్రోల్ - డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.105.15, డీజిల్ ధర రూ.97.78 ఉంది. చెన్నైలో పెట్రోల్ రూ.101.92, డీజిల్ ధర రూ.94.24 ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.101, డీజిల్ ధర రూ.89.72 ముంబై పెట్రోల్ ధర రూ.107.20 డీజిల్ ధర రూ.97.29 కోల్ కతా లో పెట్రోల్ ధర రూ.101.35, డీజిల్ ధర రూ.92.81 -
Petrol Diesel Prices: వాహనదారులకు స్వల్ఫ ఊరట
న్యూఢిల్లీ: చమురు ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే వరుసగా పెరుగుతున్న పెట్రో ధరలకు ఇవాళ బ్రేక్ పడింది. ఈరోజు చమురు ధరల్లో ఎలాంటి పెరుగుదల లేదని చమురు కంపెనీలు ప్రకటించాయి. మంగళవారం ఉదయం భారత్ పెట్రోలియం, హెచ్‌పీ, ఇండియన్ ఆయిల్ లాంటి ప్రధాన పెట్రోల్ బంకుల్లో పెట్రో ధరల్లో ఎలాంటి పెరుగుదల కనిపించలేదు. ఇక మే 4 నుంచి మొదలైన ధరల పెంపు.. కొనసాగుతూ వస్తోంది. ఈ ఒక్క జులై నెలలోనే పెట్రోల్ ధర ఏడుసార్లు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.15పై., డీజిల్ రూ.97.78పై.గా ఉంది. చెన్నైలో రూ.102.. రూ.92, ముంబైలో రూ.107, రూ.97, ఢిల్లీలో రూ.101, రూ.89, బెంగళూరులో రూ.104, రూ.98గా లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్నాయి. అయితే ఒపెక్ దేశాల వైఖరితో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు రాబోయే రోజుల్లో పెరిగే అవకాశమే ఉందని నిపుణులు భావిస్తున్నారు. -
డీజిల్‌పై స్వల్ఫ ఊరట.. మరింత పెరిగిన పెట్రోల్ ధర
-
పెట్రోల్ ధరలు తగ్గించండి - ఇక్రా
ముంబై: పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ వినియోగం.. ‘ప్రభుత్వ ఆదాయాలకు ఎటువంటి విఘాతం కలుగకుండా’ ఇంధన సెస్ తగ్గింపునకు దోహదపడుతుందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా శుక్రవారం విశ్లేషించింది. 2020–21లో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయాల్లో ఎటువంటి ప్రభావం పడకుండా పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.4.5 సెస్ భారం తగ్గించవచ్చని పేర్కొంది. అంతర్జాతీయంగా ఇంధన ధరల తీవ్రత దీనితో దేశంలో ఆకాశాన్ని అంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నేపథ్యంలో ఇక్రా తాజా సూచనలు చేసింది. దీనివల్ల ద్రవ్యోల్బణం ఆందోళనలను కూడా తగ్గించవచ్చని పేర్కొంది. ఇక్రా విశ్లేషణాంశాలను పరిశీలిస్తే.. మహమ్మారి వ్యాప్తికి ముందు 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2021–22లో పెట్రోల్ వినియోగం 6.7 శాతం, డీజిల్ వినియోగం 3.3 శాతం పెరుగుతుందని అంచనా. కాగా, 2020–21లో పోల్చితే పెట్రోల్ వినియోగం 2021–22లో 14 శాతం పెరుగుతుందని అంచనా. డీజిల్ విషయంలో ఈ అంచనా 10 శాతంగా ఉంది. 2020–21లో సెస్ ద్వారా రూ.3.2 లక్షల కోట్లు వసూలవుతాయని కేంద్ర ప్రభుత్వం అంచనావేస్తోంది. అయితే అధిక వినియోగం వల్ల ఈ ఆదాయాలు 2021–22లో మరో రూ.40 వేల కోట్లు పెరిగి రూ.3.6 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. పెరుగుతున్న రవాణా, ఎకానమీ రికవరీ దీనికి కారణం. అంటే వినియోగం భారీ పెరుగుదల వల్ల సెస్‌ల రూపంలో 2021–22లో రూ.40,000 కోట్లు ప్రభుత్వానికి అదనపు ఆదాయం వస్తుందన్నమాట. ఈ అదనపు సెస్ రూ.40,000 కోట్ల వసూళ్లను ప్రభుత్వం వదులుకోడానికి సిద్ధపడితే, లీటర్ ఇంధనంపై రూ.4.5 మేర సెస్ భారం తగ్గుతుంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకూ సెస్ ద్వారా వచ్చిన ఆదాయాలను చూస్తే, ఏప్రిల్, మే నెలల్లో రూ.80,000 కోట్లు ఒనగూరాయి. 2020–21 ఆదాయాలను చేరడానికి మరో రూ.2.4 లక్షల కోట్లు వసూలయితే సరిపోతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న విధంగా 2 నుంచి 6 శాతం శ్రేణిలో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికీ రూ.40,000 కోట్ల సెస్ తగ్గింపు నిర్ణయం దోహదపడుతుంది. సెస్‌ను లీటర్‌కు రూ.4.5 తగ్గిస్తే, ఇంధనం, లైట్, ఆహార ద్రవ్యోల్బణం 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గే అవకాశం ఉంది. రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం) నిర్ణయానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22లో 5.3 శాతం ఉండే వీలుంది. ఆర్బీఐ అంచనా ప్రకారం ఇది 5.1 శాతంగా ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణం మొదటి, రెండవ, మూడవ, నాల్గవ త్రైమాసికాల్లో వరుసగా 5.2 శాతం, 5.4 శాతం, 4.7 శాతం, 5.3 శాతంగా కొనసాగుతాయని ఆర్బీఐ ఇటీవలి ద్వైమాసిన సమీక్ష అంచనావేసింది. అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదలకు తోడు డాలర్ మారకంలో రూపాయి బలహీన ధోరణి, మార్చి 2020 నుంచీ కేంద్రం విధించిన అధిక సెస్‌లు, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు రెట్లకుపైగా పెంచిన వ్యాల్యూ యాడెడ్ పన్నులు (వీఏటీ) పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు భారీగా పెరుగుదలకు కారణమయ్యాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే పెట్రోల్ ధర లీటర్ రూ.100 దాటేసింది. డీజిల్ విషయంలోనూ ధర మూడంకెలకు చేరవయ్యింది. ఈ పరిస్థితుల్లో వినియోగదారుకు ప్రయోజనం చేకూర్చడానికి ఇంధనంపై విధించిన సెస్‌ను తగ్గించాలన్న డిమాండ్ విస్తృతమవుతోంది. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు భారీగా పడిపోయిన నేపథ్యంలో అదనపు ఆదాయానికి ఒక మార్గంగా 2020 ప్రారంభంలో సెస్ మార్గాన్ని కేంద్రం ఎంచుకుంది. ఇప్పుడు క్రూడ్ ధరలు భారీగా పెరిగాయి. అయినా ప్రభుత్వం సెస్‌ను కొనసాగిస్తోంది. ఇది వినియోగదారుపై తీవ్ర భారాన్ని మోపుతోంది. ద్రవ్యోల్బణం ఐదు శాతం: యూబీఎస్ అంచనా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటున రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతంగా ఉండే వీలుందని స్విస్ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ అంచనావేసింది. అయితే రూపాయి మరింత బలహీనపడి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పెరిగితే రిటైల్ ద్రవ్యోల్బణం మరింత పెరగవచ్చని కూడా తన తాజా నివేదికలో పేర్కొంది. ఇక్రా రేటింగ్స్ విషయంలో ఈ అంచనా 5.3 శాతంగా ఉండగా, ఆర్బీఐ అంచనా 5.1 శాతం -
మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
న్యూఢిల్లీ:మళ్లీ పెట్రో ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పెరగడంతో అది జాతీయ మార్కెట్ పై ప్రభావం చూపింది. గురువారం పెట్రోల్‌పై 26 పైసలు, డీజిల్ లీటర్‌కు 7 పైసలు వరకు పెరిగాయి. దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.101.60.. డీజిల్ రూ.96.25 పెరిగింది విజయవాడలో పెట్రోల్ రూ.103.53, డీజిల్ రూ.97.61 పెరిగింది ఢిల్లీలో పెట్రోల్ రూ.97.76.. డీజిల్ రూ.88.30 పెరిగింది ముంబైలో పెట్రోల్ రూ.103.89.. డీజిల్ రూ.95.79 పెరిగింది చెన్నైలో పెట్రోల్ రూ.98.88.. డీజిల్ రూ.92.89 పెరిగింది బెంగళూరులో పెట్రోల్ రూ.101.03, డీజిల్ రూ.93.61 పెరిగింది చదవండి: జేపీ ఇన్ఫ్రాటెక్ : ఆ 20వేలమందికి త్వరలోనే ఫ్లాట్లు ? -
రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న పెట్రోల్ ధరలు
హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డు సృష్టిస్తున్న ఇంధన ధరలు ఒకరోజు విరామం తరువాత నేడు మళ్ళీ భారీగానే పెరిగాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు జీవిత కాల గరిష్ఠాన్ని తాకాయి. ఢిల్లీలో పెట్రోల్ ధరలు 28 పైసలు పెరగడంతో రూ.97.50 చేరుకుంటే, డీజిల్ ధర 26 పైసలు రూ.88.23కు చేరుకుంది. హైదరాబాద్ లో తాజాగా నేడు పెట్రోల్ ధరలు 29 పైసలు, డీజిల్ 28 పైసలు పెరగడంతో పెట్రోల్ ధర రూ.101.33, డీజిల్ ధర రూ.96.17గా ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 98.65, డీజిల్ ధర రూ. 92.83 ముంబైలో పెట్రోల్ ధర రూ. 103.63, డీజిల్ ధర రూ. 95.72 కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 97.38, డీజిల్ లీటరుకు రూ. 91.08 భోపాల్‌లో పెట్రోల్ ధర రూ. 105.72, డీజిల్ ధర లీటరుకు రూ. 96.93 బెంగళూరులో పెట్రోల్ ధర రూ. 100.76, డీజిల్ ధర లీటరుకు రూ. 93.54 దేశంలోని చాలా నగరాల్లో పెట్రోల్ ధర ఇప్పటికే రూ.100 మార్కును తాకింది. మే 4 నుంచి వేగంగా పెరిగిన చమురు ధరలు. కేవలం 29 రోజుల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.7.18 పెరిగితే, డీజిల్ ధర రూ .7.45 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ ముడి చమురు ధరలను బట్టి దేశీయ ఇంధన ధరలు మారుతాయి. అంతేగాక, ఆర్థిక వృద్ధి కూడా పెట్రోల్ ధరల పెరుగుదల, పతనానికి కారణం. పన్నులు, సరుకు ఛార్జీలను బట్టి ఇంధన ధరలు రాష్ట్రాన్ని బట్టి మారతాయి.కొత్త ఇంధన ధరలను ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మారుస్తారు. చదవండి: చైనాకు భారీ షాక్ ఇచ్చిన శామ్సంగ్ -
దేశంలో పరుగులు పెడుతున్న పెట్రోల్,డీజిల్ ధరలు
సాక్షి,వెబ్‌డెస్క్: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నువ్వా నేనా అంటూ పోటీపడుతున్నాయి. జూన్ నెలలో పదో సారి ఇందన రేట్లు పెరిగి సరికొత్త రికార్డ్లను క్రియేట్ చేస్తున్నాయి. ఆయిల్ రిటైలర్లు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలో లీటర్ పెట్రలో ధర రూ. 96.93 చేరుకోగా లీటర్ డీజిల్ ధర రూ.87.69 వద్ద కొనసాగుతుంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.08 ఉండగా.. డీజిల్ ధర రూ.95.14కు చేరింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.98.14 ఉండగా..డీజిల్ రూ. 92.31 కు పెరిగింది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.84 గా ఉంటే లీటర్ డీజిల్ రూ. 90.54కు చేరింది. ఇక భోపాల్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ.105.13 ఉండగా డీజిల్ ధర రూ. 96.35 వద్ద ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.17 ఉండగా డీజిల్ రూ. 92.97 వద్ద అమ్ముడవుతోంది. రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ జిల్లాలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 108.07 ఉండగా డీజిల్ ధర.100.82 గా ఉంది. ఇక మొత్తం ఏడు రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు సెంచరీకి చేరాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక,లడఖ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 కు చేరింది. కాగా,హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.100.74, డీజిల్ రూ.95.59, విజయవాడలో పెట్రోల్ రూ.102.69, డీజిల్ రూ.96.97 కు చేరింది. చదవండి: అరే...! ఈ పాట ఎక్కడో విన్నట్టుందే ? -
Fuel Price hike: పెట్రోల్‌ని క్రాస్ చేసిన డీజిల్
హైదరాబాద్: ఇంధన ధరల పెరుగుదలలో పెట్రోల్‌ని డీజిల్ క్రాస్ చేసింది. గత నలభై నాలుగు రోజులుగా పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలను పరిశీలిస్తే... పెట్రోలు కంటే డీజిల్ ధరలే ఎక్కువగా పెరిగాయి. గడిచిన 44 రోజుల్లో ఇంధన ధరలను 25 సార్లు పెంచాయి చమురు కంపెనీలు. ఇలా 25 సార్లు పెరిగిన ధరల మొత్తాన్ని కలిపితే లీటరు పెట్రోలుపై రూ. 6.26 డీజిల్‌పై రూ. 6.68 ధర పెరిగింది. మొత్తంగా పెట్రోలు కంటే డీజిల్ ధర 42 పైసలు ఎక్కువగా పెరిగింది. సెంచరీ దిశగా డీజిల్ బెంగాల్ ఎన్నికలు ముగిసింది మొదలు చమురు కంపెనీలు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పేరు చెప్పి ఇంధన ధరలు పెంచుకుంటూ పోయాయి. ఇప్పటికే దేశంలో చాలా చోట్ల లీటరు పెట్రోలు ధర వంద దాటగా తాజాగా డీజిల్ సెంచరీకి చేరువగా వస్తోంది. రాజస్థాన్‌లోని గంగానగర్‌లో డీజిల్ ధర వందను దాటేసింది. ఇక్కడ లీటరు డీజిల్ ధర రూ. 100.51గా నమోదైంది. ఇదే ట్రెండ్ మరో నెలరోజులు కంటిన్యూ అయితే తెలుగు స్టేట్స్‌లోనూ లీటరు డీజిల్ ధర వందను దాటం ఖాయమనేట్టుగా ఉంది పరిస్థితి. చదవండి : హోప్ ఎలక్ట్రిక్: సింగిల్ ఛార్జ్ తో 125 కి.మీ. ప్రయాణం -
వాహనదారులకు చుక్కలే, మరోసారి పెరిగిన పెట్రోల్ ధర
పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి వాహనదారులకు చుక్కలు చూపించాయి. బుధవారం రోజు లీటర్ పెట్రోల్ పై 26 పైసలు,డీజిల్ పై 13పైసలు పెరిగాయి. దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.100.46 కాగా డీజిల్ ధర రూ. 95.28 గా ఉంది. ఇక హైదరాబాద్ తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో చమురు కంపెనీలు ధరల్ని పెంచాయి. అధికారిక లెక్కల ప్రకారం..ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్ లలో చమురు కంపెనీలు డీజిల్, పెట్రోల్ ధరల్ని పెంచాయి. ఈ రోజు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.66 రూపాయలుగా ఉంది. ఇది నిన్నటితో పోలిస్తే ఈరోజుకి 25 పైసలు పెరిగింది. 13 పైసలు పెరిగి లీటర్ డీజిల్ ధర రూ .87.28కు చేరింది. ముంబై మెట్రో నగరాల్లో పెట్రోల్ ధర అత్యధికంగా ఉంది. లీటర్ పెట్రోల్ ధర రూ. 102.82 రూపాయలు ఉండగా డీజిల్ ధర లీటర్ కు రూ.94.84 కు ఉంది. దేశంలో అత్యధికంగా రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ జిల్లాలో పెట్రోల్ ధర రూ. 107 ఉండగా, డీజిల్ ధర లీటర్ కు రూ.100.51 గా ఉంది. కాగా, వివిధ నగరాల్లో వేర్వేరు ధరల కారణంగా ఢిల్లీ మరియు ముంబై మధ్య ధరల వ్యత్యాసం ఉంది. సరుకు రవాణా, ఛార్జీలు, స్థానిక పన్నులు మరియు వ్యాట్ ఆధారంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. చదవండి: ధరలకు ఇంధన సెగ! -
పెట్రో ధరలపై కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
దేశంలో రోజు రోజుకి పెట్రోల్, డీజల్ భారీగా పెరుగుతూ పోతున్న సంగతి అందరికి తెలిసిందే. ధరలు భారీగా పెరుగుతుండటంతో నిత్యావసర ధరలు కూడా పెరుగతున్నాయి. దీంతో సామాన్య ప్రజానీకం ఈ ధరల పెరుగుదలపై గగ్గోలు పెడుతున్నారు. ఈ ధరల పెరగుదలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరణ ఇచ్చారు. పెట్రో ధరలు భారీగా పెరుగుతున్నాయిని, దీన్ని తాము అంగీకరిస్తున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలపై పడుతున్న ఈ భారాన్ని తాము అర్థం చేసుకోగలమని అన్నారు. గత నెల మే 4వ తేదీ నుంచి ఇప్పటివరకు చమురు ధరలు 23 సార్లు పెరిగిన నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ పైవిధంగా స్పందించారు. పెట్రో ధరలపై కేంద్రం చర్యలు తీసుకోకపోవడానికి కారణాలు కూడా వివరించారు. సంక్షేమ పథకాలకు నిధులు కోసం నగదును సర్దుబాటు చేయాల్సి వస్తుంది అని ఆయన వెల్లడించారు. సంక్షేమ కార్యక్రమాల కోసం నిధులు ఆదా చేస్తున్నందునే పెట్రో ధరల పెంపును ఉపేక్షించాల్సి వస్తోందని ఆయన వివరణ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా రేషన్ కోసం రూ. లక్ష కోట్లు, వ్యాక్సిన్ల కోసం రూ.35 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో నిధులు ఆదా చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకే పెట్రో భారంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నట్లు చెప్పారు. చదవండి: హోమ్ లోన్, వ్యక్తిగత రుణాల కోసం సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి? -
Petrol, Diesel Prices: మరోసారి పెరగిన ఇంధన ధరలు
Petrol, Diesel Prices Today: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. ఆదివారం లీటర్ పెట్రోల్‌పై 28 పైసలు, డీజిల్‌పై 31 పైసలు పెరుగుదల నమోదైంది. వాణిజ్య రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ ప్రస్తుతం రూ.101.25 డీజిల్ ధర లీటరుకు రూ. 93.10 పెరిగినట్లు ప్రభుత్వ ఇంధన రిటైలర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ రేటు లీటరుకు రూ.95.03, డీజిల్ రేటు రూ.85.95గా ఉన్నాయి. ► హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.98.76, డీజిల్ రూ.93.70 ► కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.02, లీటర్ డీజిల్ రేటు రూ. 88.80 ► చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.47,లీటర్ డీజిల్ ధర రూ. 90.66 చదవండి: GST: జీఎస్టీ వసూళ్లలో రికార్డు -
సెంచరీ దాటేసిన పెట్రోల్ ధర
సాక్షి, అమరావతి: పెట్రోల్ ధర సెంచరీ కొట్టడమే కాదు.. వంద దాటేసింది. డీజిల్ ధర కూడా దానివెంటే పరుగులు పెడుతూ రూ.వందకు చేరువైంది. విజయవాడలో బుధవారం లీటర్ పెట్రోల్ ధర రూ.101.11కి, డీజిల్ ధర రూ.95.34కి చేరాయి. గతేడాది జూన్ 1న విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.74.21, డీజిల్ రూ.68.15 ధర ఉండేవి. నాటి ధరలను పరిగణనలోకి తీసుకుంటే ఏడాదిలో పెట్రోల్ లీటరుపై రూ.26.90, డీజిల్‌పై రూ.27.19 ధర పెరిగాయి. దీంతో రవాణా వ్యయం భారీగా పెరిగింది. ఇది నిత్యావసర సరుకుల ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పెట్రో ధరలపై 2017లో కేంద్రం నియంత్రణ ఎత్తేసింది. దాంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలకు అనుగుణంగా దేశంలో పెట్రో ఉత్పత్తి సంస్థలు ఏ రోజుకారోజు సమీక్షించి.. పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తున్నాయి. రిఫైనరీ నుంచి ప్రాంతాల దూరాన్ని బట్టి.. రవాణా ఖర్చులను కలిపి ఆయా ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను ఉత్పత్తి సంస్థలు ఖరారు చేస్తాయి. అయితే, ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు రోజూ పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం నాటికి రాష్ట్రంలో వైఎస్సార్, ప్రకాశం విశాఖపట్నం జిల్లాలు మినహా పది జిల్లాల్లో పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది. డీజిల్ ధర కూడా అదే బాటలో పయనిస్తోంది. రానున్న కొద్ది రోజుల్లోనే డీజిల్ ధర కూడా రూ.వంద దాటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని పెట్రో డీలర్లు చెబుతున్నారు. -
Petrol, Diesel Prices: మరోసారి పెరిగిన ధరలు
Petrol, Diesel Prices Today: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. సోమవారం లీటర్ పెట్రోల్‌పై 29 పైసలు, డీజిల్‌పై 28 పైసలు పెరుగుదల నమోదైంది. వాణిజ్య రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.100 వద్ద కొనసాగుతోంది. అక్కడ లీటరు పెట్రోల్ ప్రస్తుతం రూ.100.47, డీజిల్ ధర లీటరుకు రూ. 92.25 పెరిగినట్లు ప్రభుత్వ ఇంధన రిటైలర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ రేటు లీటరుకు రూ.94.23, డీజిల్ రూ.85.15. దేశంలో మే 3 నుంచి ఇంధన ధరలు.. పెట్రోల్ లీటరు ధర రూ. 3.83, డీజిల్ రేటు రూ.4.42 పెరగటం గమనార్హం. ► హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.97.63, డీజిల్ రూ.92.54 చదవండి: నేడు 2020–21 జీడీపీ గణాంకాలు!