దేశంలో వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. బుధవారం లీటర్ పెట్రోల్ పై 90 పైసలు, డీజిల్ పై 87 పైసలు పెరిగాయి. దీంతో పెరుగుతున్న ధరలతో బండి బయటకు తీయాలంటే భయపడుతున్నారు.
ఇక ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత చమరు కంపెనీలు సామాన్యులపై పెట్రో బాదుడును కొనసాగిస్తున్నాయి. గత మంగళవారం అంటే మార్చి 22 నుంచి ఒక్కరోజు మార్చి 24 మినహా ఇస్తే ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచుతూ వాహనదారుల్ని బెంబేలెత్తిస్తున్నాయి.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌ధర రూ.114.51 పైసలు ఉండగా డీజిల్ ధర రూ.100.70పైసలుగా ఉంది
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.01 పైసలు ఉండగా డీజిల్ ధర రూ.100.21గా ఉంది.
ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.115.88 పైసలు ఉండగా డీజిల్‌ధర రూ.100.10గా ఉంది
చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.69 పైసలు ఉండగా డీజిల్ ధర రూ.96.76 గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment