petrol and diesel
-
‘చౌకగా పెట్రోల్.. ప్రజలకు రాయితీల్లేవు’
మోదీ ప్రభుత్వం ఇథనాల్ మిశ్రమ(బ్లెండెడ్) పెట్రోల్‌ను తీసుకొచ్చిన నేపథ్యంలో పెట్రోల్ ధరను తగ్గించాలని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకెత్ గోఖలే రాజ్యసభలో డిమాండ్ చేశారు. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ లీటరుకు కనీసం రూ.9 చౌకగా లభిస్తున్నప్పటికీ వినియోగదారు నుంచి పూర్తి స్థాయిలో వసూలు చేస్తున్నట్లు తెలిపారు. మోదీ ప్రభుత్వం ఈ విషయంలో ప్రజలను మోసం చేస్తోందని, ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును లాగేసుకుంటుందని విమర్శించారు. దాంతో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు కారణమవుతుందని దుయ్యబట్టారు.‘మోదీ ప్రభుత్వం పెట్రోల్‌లో 20% ఇథనాల్ కలపాలని గతంలోనే ఆదేశించింది. ఇథనాల్ చౌకైనది మాత్రమే కాదు.. వాహన మైలేజీని కూడా గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఇది బీఎస్-IV, పాత ఇంజిన్లను నాశనం చేస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ లీటరుకు కనీసం రూ.9 చౌకగా లభిస్తోంది. కానీ ప్రజలు ఈ రాయితీ పొందడం లేదు. వాస్తవ ధరకే పెట్రోల్ కొనుగోలు చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం నిస్సందేహంగా ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును దొచుకుంటోంది. దాంతో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు కారణం అవతుంది. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌ను తప్పనిసరి చేస్తే మోదీ ప్రభుత్వం ధరలు తగ్గించాలి’ అని ఎంపీ తెలిపారు.𝐈𝐦𝐩𝐨𝐫𝐭𝐚𝐧𝐭:𝐘𝐨𝐮 𝐚𝐫𝐞 𝐛𝐞𝐢𝐧𝐠 𝐎𝐕𝐄𝐑𝐂𝐇𝐀𝐑𝐆𝐄𝐃 𝐛𝐲 𝐚𝐭 𝐥𝐞𝐚𝐬𝐭 ₹𝟗 𝐩𝐞𝐫 𝐥𝐢𝐭𝐞𝐫 𝐚𝐭 𝐭𝐡𝐞 𝐩𝐞𝐭𝐫𝐨𝐥 𝐩𝐮𝐦𝐩. Modi Govt has mandated 20% blending of ethanol with petrol. Ethanol is not only cheaper but also significantly reduces your car… pic.twitter.com/iEBjgp9SX9— Saket Gokhale MP (@SaketGokhale) February 5, 2025ఇథనాల్ పెట్రోల్‌పై భిన్నాభిప్రాయాలుముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, గ్రీన్ ఎన్విరాన్మెంట్ను ప్రోత్సహించడంలో భాగంగా గతంలో ప్రభుత్వం పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలపాలని నిర్ణయించింది. ఇథనాల్ పెట్రోల్ కంటే తక్కువ శక్తి కంటెంట్ కలిగి ఉంటుందని అభిప్రాయాలున్నాయి. ఇది వాహనం మైలేజ్‌ను 3-4% తగ్గిస్తుందని వాహన నిపుణులు చెబుతున్నారు. పాత వాహనాలకు ముఖ్యంగా బీఎస్-4 ఇంజిన్లు ఉన్న వాహనాలకు అధిక ఇథనాల్ కంటెంట్ ప్లాస్టిక్, రబ్బరు, అల్యూమినియం భాగాలకు హాని కలిగిస్తుందని తెలియజేస్తున్నారు. ఇది ఇంజిన్ పనిచేయకపోవడం, మన్నిక తగ్గడానికి దారితీస్తుందంటున్నారు.ఇదీ చదవండి: అంతకంతకూ పెరుగుతున్న పసిడి ధర! తులం ఎంతంటే..పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలపడం వల్ల ముడి చమురు దిగుమతులపై తక్కువ ఆధారపడే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం తెలుపుతుంది. ఇది ఇంధన భద్రతను బలోపేతం చేస్తుంది. ఇథనాల్ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గిస్తుంది. చెరకు నుంచి ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. -
పెట్రోల్, డీజిల్‌కు అధిక డిమాండ్
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ వినియోగం డిసెంబర్ నెలలో గణనీయంగా పెరిగింది. క్రితం ఏడాది ఇదే నెలలోని వినియోగంతో పోల్చి చూస్తే, పెట్రోల్ అమ్మకాలు (ప్రభుత్వరంగ సంస్థల) 10 శాతం పెరిగి 2.99 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు బీపీసీఎల్, ఐవోసీఎల్, హెచ్‌పీసీఎల్ ద్వారా 90 శాతం ఇంధన విక్రయాలు నడుస్తుంటాయి. క్రితం ఏడాది డిసెంబర్ నెలలో పెట్రోల్ అమ్మకాలు 2.72 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. డీజిల్ అమ్మకాలు సైతం 4.9 శాతం పెరిగి 7.07 మిలియన్ టన్నులకు చేరాయి. నవంబర్ నెలలోనూ పెట్రోల్, డీజిల్ వినియోగం క్రితం ఏడాది ఇదే నెల గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 8.3 శాతం, 5.9 శాతం చొప్పున పెరగడం గమనార్హం. వరుసగా రెండో నెలలోనూ వృద్ధి నమోదైంది. డిసెంబర్లో క్రిస్మస్ సెలవుల సందర్భంగా పర్యటనలు పెరగడం, ఖరీఫ్ సాగు సందర్భంగా యంత్రాలకు ఇంధన వినియోగం పెరగడం వినియోగంలో వృద్ధికి దారితీసింది. ఇక ఈ ఏడాది నవంబర్ నెల విక్రయాలతో పోల్చి చూస్తే డిసెంబర్లో పెట్రోల్ అమ్మకాలు 3.6 శాతం, డీజిల్ అమ్మకాలు 1.7 శాతం చొప్పున తక్కువగా ఉండడం గమనార్హం. దేశ ఇంధన మార్కెట్లో 40 శాతం డీజిల్ రూపంలోనే వినియోగం అవుతుంటుంది. ముఖ్యంగా 70 శాతం డీజిల్‌ను రవాణా రంగం వినియోగిస్తుంటుంది. ఆ తర్వాత వ్యవసాయ రంగంలో డీజిల్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇక విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) అమ్మకాలు డిసెంబర్ నెలలో క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చితే 6.8 శాతం పెరిగి 6,96,400 టన్నులుగా ఉన్నాయి. వంటగ్యాస్ (ఎల్పీజీ) వినియోగం 5 శాతానికి పైగా పెరిగి 2.87 మిలియన్ టన్నులకు చేరింది. -
పెట్రోల్ కల్తీని ఎలా గుర్తించాలంటే..
రాజు మూడు నెలల కిందట షోరూమ్‌లో బైక్ కొనుగోలు చేశాడు. కానీ కంపెనీ ఇచ్చిన హామీ మేరకు బైక్ మైలేజీ రావడంలేదు. కనీసం అందులో సగమైన మైలేజీ రాకపోవడంతో నిరాశ చెందాడు. అయితే బైక్ కొన్నప్పటి నుంచి తాను ఒకే పెట్రోల్ పంపులో పెట్రోల్ కొట్టించేవాడు. అనుకోకుండా ఇటీవల వేరే పంపులోని పెట్రోల్ వాడాడు. అప్పటివరకు సరిగా మైలేజీ రాని తన బైక్ ఈసారి మెరుగైన మైలేజీ నమోదు చేసింది. దాంతో తాను గతంలో వాడిన పెట్రోల్ కల్తీ అయిందని గుర్తించాడు.మీకూ ఇలాంటి సంఘటనలు ఎదురవుతూనే ఉంటాయి. అందుకు కొన్ని ఏజెన్సీలు పెట్రోల్‌ను కల్తీ చేయడమే కారణం. భారత్ భారీగా పెట్రోల్‌ను దిగుమతి చేసుకుంటోంది. అందుకు పెద్దమొత్తంలో డాలర్లు ఖర్చు చేస్తోంది. దీని ప్రభావం ఆయిల్ మార్కెటింగ్ సంస్థలపై పడుతుంది. వీటికి అనుబంధంగా ఉన్న కొన్ని ఏజెన్సీలు అక్రమంగా డబ్బు పోగు చేసుకోవాలనే దురుద్దేశంతో పెట్రోల్‌ను కల్తీ చేస్తున్నాయి. అయితే మనం వాహనాల్లో వాడే పెట్రోల్ కల్తీ అయిందా..లేదా..అనే విషయాన్ని ఎలా కనుగొనాలో తెలుసుకుందాం.ఇదీ చదవండి: ఇళ్ల అమ్మకాల తగ్గుదలకు కారణాలు..రెండు నిమిషాల్లో కల్తీ గుర్తించండిలా..నిబంధనల ప్రకారం ప్రతి పెట్రోల్ పంపు సిబ్బంది విధిగా తమ వద్ద ఫిల్టర్ పేపర్ ఉంచుకోవాలి. మనం వాహనాల్లో పెట్రోల్ కొట్టించాలనుకున్నప్పుడు పెట్రోల్ పంపు సిబ్బంది నుంచి ఫిల్టర్ పేపర్ అడిగి తీసుకోవాలి. దానిపై పెట్రోల్ గన్ ద్వారా 2-3 డ్రాప్స్ పెట్రోల్ వేయాలి. 2-3 నిమిషాలు ఆ ఫిల్టర్ పేపర్‌ను ఆరనివ్వాలి. తర్వాత పెట్రోల్ పోసినచోట పేపర్‌పై ఎలాంటి మచ్చలు ఏర్పడకపోతే అది స్వచ్ఛమైన పెట్రోల్‌గా పరిగణించవచ్చు. అలాకాకుండా ఏదైనా మచ్చలు ఏర్పడితే కల్తీ జరిగినట్లు భావించాలి. -
పెట్రోల్,డీజిల్ ధరల్ని పెంచిన కర్ణాటక.. ఎంతంటే?
బెంగళూరు : కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయానికి దోహదం చేసిన ఉచిత హామీలు ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రజలకు భారంగా మారుతున్నట్లు తెలుస్తోంది. ఉచిత హామీలతో ఖాళీ అవుతున్న ఖజానాను నింపుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం నిత్యవసర వస్తువల ధరల్ని పెంచుతున్నట్లు సమాచారం.ఇందులో భాగంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచింది. పెట్రోల్‌పై రూ.3, డీజిల్‌పై రూ.3.20 పెంచుతూ నిర్ణయించింది. దీంతో కర్ణాటకలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.85చేరగా.. డీజిల్ ధర రూ.88.93కి చేరింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. -
నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు: పెట్రోల్, డీజిల్ వాహనాలు బ్యాన్?
దేశంలో ఫ్యూయెల్ (పెట్రోల్, డీజిల్) వాహనాల వినియోగం గతంతో పోలిస్తే.. ఇప్పుడు కొంత తక్కువగా ఉందనే తెలుస్తోంది. కొత్త ఎలక్ట్రిక్ కార్లు పుట్టుకొస్తున్న సమయంలో కొందరు వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ తరుణంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాబోయే 10 సంవత్సరాల్లో.. డీజిల్, పెట్రోల్ వాహనాలను తొలగించే యోచనలో ఉన్నట్లు సంచలన ప్రకటన చేశారు.మార్కెట్లో బైకులు, స్కూటర్లు, కార్లు, బస్సులు మాత్రమే కాకుండా ఆటో రిక్షాలు కూడా ఎలక్ట్రిక్ వెర్షన్లో లభిస్తున్నాయి. కాబట్టి రానున్న రోజుల్లో ఇతర వాహనాలు కూడా తప్పకుండా ఈవీల రూపంలో అందుబాటులో ఉంటాయి. ఈ రోజు పెట్రోల్ వాహనాల కోసం పెట్టే ఖర్చు కంటే.. ఎలక్ట్రిక్ కార్ల కోసం పెట్టే ఖర్చు చాలా తక్కువ కూడా. కాబట్టి రాబోయే రోజుల్లో డీజిల్ మరియు పెట్రోల్ వాహనాలను తొలగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు.. గడ్కరీ హిమాచల్ ప్రదేశ్‌లోని బహిరంగ ర్యాలీలో పేర్కొన్నారు.ఎలక్ట్రిక్ కార్ల వినియోగాన్ని పెండానికి కేంద్రం ఇప్పటికే సబ్సిడీలను కూడా అందిస్తోంది. ఇవన్నీ ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచడంలో ఉపయోగపడ్డాయి. ప్రజలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి, వినియోగించడానికే ఆసక్తి చూపుతున్నారు. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింత పెరుగుతుందని స్పష్టంగా తెలుస్తోంది.కొత్త ఈవీ పాలసీలు ఆమోదం పొందిన తరువాత ఈవీల సేల్స్ పెరుగుతాయని తెలుస్తోంది. కాబట్టి 2030 నాటికి ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల సంఖ్య ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ మాత్రమే కాకుండా అమెరికా, యూకే వంటి దేశాలు కూడా ఇదే విధాన్ని పాటించడానికి సుముఖత చూపుతున్నాయి.భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరుగుతోంది. కానీ ఈవీలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు విరివిగా అందుబాటులో లేదు. ఇప్పటికి కూడా ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకునే వారు ఛార్జింగ్ సదుపాయాలు ఎక్కువగా లేదనే కారణంగానే.. పెట్రోల్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కేంద్రం చెప్పినట్లు 2034 నాటికి డీజిల్, పెట్రోల్ కార్లను తొలగించాలంటే.. కావలసినన్ని ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. -
‘రష్యా నుంచి చమురు దిగుమతి చేయకపోతే..’ కేంద్రం కీలక వ్యాఖ్యలు
ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు దిగిన రష్యా ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి పశ్చిమ దేశాలు ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించిన విషయం తెలిసిందే. దాంతో చమురు ధరపై పరిమితిని విధించాయి. మరోవైపు రష్యా ముడి చమురును తక్కువ ధరకే విక్రయించడానికి సిద్ధమైంది. డిస్కౌంట్ ధరలో చమురు దొరుకుతుండడంతో భారత్ రష్యా నుంచి తన దిగుమతులను గణనీయంగా పెంచుకుంది. ఎప్పుడూలేని విధంగా రికార్డు స్థాయిలో చమురును ఆ దేశం నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఒకప్పుడు మన దేశ చమురు దిగుమతిలో ఒక్క శాతం వాటా కూడా లేని రష్యా.. ఇప్పుడు భారత్‌కు అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా అవతరించింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయని, చౌకగా దొరికిన రష్యన్ ఆయిల్‌ను కొనుగోలు చేయకపోయి ఉంటే భారత్‌లో ద్రవ్యోల్బణం భారీగా పెరిగేదని పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మినిస్ట్రీ ఓ నివేదికలో పేర్కొంది. ‘ఇండియన్ రిఫైనర్లు రష్యన్ ఆయిల్‌ను కొనుగోలు చేయకపోయి ఉంటే దేశంలో ఆయిల్ కొరత ఏర్పడేది. రోజుకి 19 లక్షల బ్యారెల్స్ అవసరం అవుతున్నాయి. రష్యా కాకుండా ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తే ఆయిల్ రేటు బ్యారెల్‌కు అదనంగా 30–40 డాలర్ల మేరకు భారం పడేది’ అని వెల్లడించింది. అంతర్జాతీయంగా రోజుకి 10 కోట్ల బ్యారెళ్ల క్రూడాయిల్ అవసరం అవుతుందని కొన్ని నివేదికలు అంచనా వేస్తున్నాయి. ఇదీ చదవండి: 2.24 లక్షల మందిని ఇంటికి పంపిన కంపెనీలు ఒకవేళ ‘ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్’ (ఒపెక్) రోజుకి ఒకటి లేదా రెండు మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ ఉత్పత్తి తగ్గిస్తే, ధరలు 10 శాతం నుంచి 20 శాతం మేర పెరిగే అవకాశం ఉంది. దాంతో ఆయిల్ ధర బ్యారెల్‌కు 125–130 డాలర్లకు చేరుకుంటుంది. ఇండియాలో రోజుకి అవసరమయ్యే 19.5 లక్షల బ్యారెల్స్‌ను సిద్ధం చేయకపోతే అదనంగా మరింత ధర పెరిగే ప్రమాదం ఉందని పెట్రోలియం మినిస్ట్రీ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ వాడకంలో ఇండియా మూడో స్థానంలో ఉందని, అందులో 85 శాతం క్రూడ్ అవసరాలను దిగుమతుల తీర్చుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. దేశంలోని రిఫైనింగ్ కెపాసిటీ రోజుకి 50 లక్షల బ్యారెల్స్‌గా ఉందని తెలిపారు. -
కేంద్రం మరో సంచలనం: భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?
దేశ ప్రజలకు రక్షాబంధన్ గిప్ట్ అందించిన కేంద సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకోనుందా అంటే.. అవుననే అంటున్నాయి తాజా రిపోర్టులు. 2024 ఎన్నికలకు ముందు కేంద్రం మోటార్ ఇంధన ధరలపై దృష్టి పెట్టే అవకాముందని సిటీ గ్రూప్ నివేదించింది. ఎల్పీజీ సిలిండర్ల రేటును తగ్గించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ద్రవ్యోల్బణం దాదాపు 30 బేసిస్ పాయింట్ల మేర తగ్గనుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఈ క్రమంలో మరో కీలకమైన పెట్రోల్, డీజిల్ ధరలను కూడా తగ్గించే దేశ ప్రజలకు ఊరట కల్పించనుందని అంచనా వేస్తున్నారు. వంట గ్యాస్ ధరల్ని తగ్గిస్తూ మోదీ సర్కార్ నిర్ణయం ద్రవ్యోల్బణాని చెక్ పెట్టడమేకాకుండా, కొన్ని ప్రధాన పండుగలు, కీలక ఎన్నికలకు ముందు గ్యాసోలిన్, డీజిల్ ధరల తగ్గింపు వైపు దృష్టి సారించనుందని సిటీ గ్రూప్ తన కథనంలో పేర్కొంది. ఎల్పీజీ తగ్గింపుతో ద్రవ్యోల్బణం దిగి వస్తుందని ఆర్థికవేత్తలు సమీరన్ చక్రవర్తి, ఎం. జైదీ అభిప్రాయపడ్డారు. అంతేకాదు టొమాటో ధరల తగ్గుదల, తాజా చర్యతో సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం 6శాతం దిగువకు చేరే అవకాశం ఉందన్నారు. జులైలో 15 నెలల గరిష్ట స్థాయికి చేరిన రిటైల్ ధరలను చల్లబరచడానికి అధికారులు చురుకైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఎల్పీజీ సిలిండర్ల ధరలను 14.2 కిలోగ్రాముల గ్యాస్‌ను 200 రూపాయలు తగ్గింపుతో దాదాపు 300 మిలియన్ల వినియోగ దారులకు కొంత ఉపశమనం కలిగించింది. ఆహార ధరలను తగ్గించడానికి గృహ బడ్జెట్లను అదుపులో ఉంచడానికి భారతదేశం ఇప్పటికే బియ్యం, గోధుమలు , ఉల్లిపాయలు వంటి ప్రధాన వస్తువుల ఎగుమతులను కఠినతరం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఒత్తిడితోపాటు, కే- ఆకారపు రికవరీ నేపథ్యంలో, గ్యాస్ ధర తగ్గింపు వినియోగదారుల సెంటిమెంట్‌కు సానుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యంగా సెప్టెంబర్‌లో డిమాండ్-సరఫరా కొరత కారణంగా ఉల్లి ధర పెరుగుతుందన్న అంచనాలను గమనించాలన్నారు.అలాగే గ్లోబల్ క్రూడ్ ధరలలో అస్థిరత ఉన్నప్పటికీ, గత ఏడాదినుంచి పెట్రోలు, డీజిల్ ధరలు పెరగలేదనీ, ఈ నేపథ్యంలో ఎక్సైజ్ డ్యూటీ కోతద్వారా ఇంధన ధరలను తగ్గించవచ్చని, ఎన్నికల ముందు ఈ అంశాన్ని తోసి పుచ్చలేమని వ్యాఖ్యానించారు. కాగా తెలంగాణ, మిజోరం రాజస్థాన్, మధ్యప్రదేశ్ ,ఛత్తీస్‌గఢ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఈ ఏడాది చివరల్లో జరగ నున్నాయి. ఆ తర్వాత 2024 ప్రారంభంలో జాతీయ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ కేంద్రంలో మరోసారి అధికారాన్ని చేజిక్కించు కోవాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. -
Petro Prices : త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు ?
మరోసారి భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధలరకు రెక్కలు రానున్నాయా ? అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగకపోయినా సరే ....ఇండియాలో క్రూడాయిల్ ధరలు ఎందుకు పెరుగబోతున్నాయి ? మొన్నటి వరకు భారత్‌కు చమురు దిగుమతుల్లో డిస్కౌంట్స్ ఇచ్చిన ఆ దేశం ఒక్కసారిగా ధరలు పెంచడమే ఇందుకు కారణమా ? ముడిచమురు కోసం ఒకటి రెండు దేశాలపై ఆధారపడటమే భారత్‌కు శాపంగా మారిందా ? డిస్కౌంట్ ఫట్.. రేట్లు అప్ మరికొద్ది రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలుకు రెక్కలు రాబోతున్నాయన్న అంచనాలు వస్తున్నాయి. ఇప్పటి దాకా ఒపెక్ దేశాల మీద ఆధారపడి చమురును దిగుమతి చేసుకున్న భారత్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తరువాత రష్యా నుంచి ముడిచమురు దిగుమతిని చేసుకోవడం ప్రారంభించింది. అది కూడా ఇతర చమురు దేశాల నుంచి దిగుమతి చేసుకునే రేటు కంటే దాదాపుగా బ్యారెల్ 30 డాలర్లకే భారత్‌కు ముడిచమురు దొరికేది. కానీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో రష్యా నుంచి ఇండియాకు దిగుమతి అవుతున్న క్రూడాయిల్ పై డిస్కౌంట్‌ను డిస్కనెక్ట్ చేసింది రష్యా దీంతో ఈ భారం ఇండియాపై పడనుంది. The rest of Europe needs cheap and plentiful amount of food, to feed their welfare parasites. No Russian sanctions on their grain trade. I think Russia's goal with Ukraine has larger implications for eastern trade alliances developing in the energy markets without the petro$$$$$$ pic.twitter.com/tBTNS5McTq — Snuff Trader (@SnuffTrader) July 6, 2023 మన వాటా ఎంత? ఎంతకు కొంటున్నాం? ఉక్రెయిన్ వార్ మొదలైనప్పటి నుంచి రష్యన్ క్రూడ్‌ను చాలా తక్కువ రేటుకు ఇండియన్ కంపెనీలు కొంటున్నాయి. తాజాగా ఈ క్రూడ్‌పై ఇస్తున్న డిస్కౌంట్‌ను రష్యా బ్యారెల్‌పై 4 డాలర్ల వరకు మాత్రమే పరిమితం చేసింది. అదీకాక రవాణా ఛార్జీలను కూడా ఇంతకు ముందున్న దానికంటే రెట్టింపు వసూలు చేస్తోంది. ఇంతకు ముందు మన చమురు అవసరాల్లో కేవలం 2శాతం మాత్రమే రష్యా నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళం కానీ యుద్ధం తరువాత తక్కువ ధరకే చమురు లభించడంతో ఇపుడు మన చమురు దిగుమతుల్లో రష్యా వాటా 44శాతానికి పెరిగింది. పశ్చిమ దేశాల ఆంక్షలెందుకు? 2022లో పశ్చిమ దేశాలు రష్యన్ క్రూడ్‌పై బ్యారెల్‌కు 60 డాలర్ల ప్రైస్ లిమిట్‌ను విధించాయి. అయినప్పటికీ అదే ఆయిల్‌ను డెలివరీ చేస్తున్న రష్యన్ కంపెనీలు బ్యారెల్‌కు 11 నుంచి 19 డాలర్ల వరకు రవాణా ఛార్జీని వసూలు చేయడమే ఇపుడు చమురు ధరలు భారీగా పెరిగేందుకు కారణంగా కనపబడుతోంది. క్రూడాయిల్‌ను బాల్టిక్, బ్లాక్ సముద్రాల నుంచి మన దేశంలోని వెస్ట్రన్ కోస్ట్‌కు డెలివరీ చేయడానికి ఈ మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. Ruble surrendered long before the rest of Russia, has lost 40% of its worth since the 2022 invasion. This would be difficult for any country, far more shocking for a petro-state. Russia is Venezuela w/ bigger army. pic.twitter.com/Uf7F8yumMs — steve from virginia (@econundertow) July 6, 2023 అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడిచమురు ధరలు రష్యా ఉక్రేయిన్ పై దాడి చేస్తున్న సమయంలో బ్రెంట్ క్రూడాయిల్‌ధర 80-100 డాలర్ల దగ్గర ఉంది. అయినప్పటికీ మనకు రష్యా అతి తక్కువ ధరకే ముడిచమురును అందించడంతో ఇండియన్ రిఫైనరీ కంపెనీలు రష్యా నుంచి భారీగా ఆయిల్‌ను దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టాయి. ఐఓసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్, హెచ్‌పీసీఎల్ మిట్టల్ ఎనర్జీ వంటి ప్రభుత్వ కంపెనీలు, రిలయన్స్, నయారా వంటి ప్రైవేట్ కంపెనీలు రష్యన్ కంపెనీలతో సపరేట్గా డీల్స్ కుదుర్చుకుంటుండడంతో రష్యన్ క్రూడ్‌పై ఇస్తున్న డిస్కౌంట్ భారీగా తగ్గిందని కొంత మంది చమురు రంగ నిపుణులు చెబుతున్నారు. మనకెంత ధర? రష్యాకు ఎంత ఖర్చు? ప్రస్తుతం బ్యారల్ బ్రెంట్ ముడిచమురు ధర 77 డాలర్ల దగ్గర ఉంది ఈ లెక్కన రష్యా నుంచి దిగుమతి చేసుకునే ముడిచమురు ధర రవాణా ఛార్జీలతో కలిపితే ఇంచు మించు అంతే మొత్తంలో ఖర్చు అవుతుండటంతో ఇపుడు భారత్ మరోసారి ప్రత్యామ్నయ మార్గాలను అన్వేశిస్తోంది. అదీకాక మరోసారి రష్యా కంపెనీలతో బేరమాడేందుకు ఇండియాకు ఛాన్స్ ఉంది. ఎందుకంటే చైనా ఐరోపాల నుంచి రష్యా చమురుకు ప్రస్తుతం డిమాండ్ తగ్గింది సో.. ఇది భారత ప్రభుత్వానికి కలిసివచ్చే అవకాశం. సామాన్యుడి పరిస్థితేంటీ? మన ప్రభుత్వ ఆధీనంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు రష్యా నుంచి రోజుకు 2 మిలియన్ బ్యారెళ్ళ ముడిచమురును దిగుమతి చేసుకుంటున్నాయి. సో మనం కనుక మరోసారి రష్యాతో బేరమాడితే మనకూ తక్కువ ధరలో చమురు లభించే అవకాశం ఉంది. అయినప్పటికీ మన ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలకు ఉన్న నష్టాలతో రిటైల్ మార్కెట్లో కామన్ మ్యాన్‌కు మాత్రం ఆ ప్రయోజనాలు అందడం లేదనేది నిజం. అంతర్జాతీయంగా ఎలా ముడిచమురు ధరలు ఉన్నా సామాన్యుడికి మాత్రం ప్రయోజనం శూన్యం అనేది నిపుణులు చెపుతున్నమాట. రాజ్ కుమార్, బిజినెస్ కరస్పాండెంట్ -
ఆయిల్ కంపెనీలకు ఇక మీదట లాభాలే.. మరి డీజిల్,పెట్రోల్ ధరలు తగ్గేనా?
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లాభాలు ఆర్జిస్తాయని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. గతేడాది ఇవి భారీ నష్టాలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. చము రు ధరలు బ్యారెల్‌కు 78.8 డాలర్లకు క్షీణించడాన్ని సానుకూలంగా ప్రస్తావించింది. దీంతో 2022–23 ఆర్థిక సంవత్సరం నష్టాలను.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో వచ్చే లాభాలతో భర్తీ చేసుకోగలవని తెలిపింది. గతేడాది ఏప్రిల్ నుంచి ప్రభుత్వరంగ సంస్థలైన ఐవోసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ పెట్రోల్ ధరలను ఒకే స్థాయిలో కొసాగిస్తూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా రేట్లు పెరిగినప్పటికీ, దేశీయంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు సవరించకపోవడంతో అవి నష్టాల పాలయ్యాయి. చమురు ధరలు గణనీయంగా తగ్గిన తర్వాత నుంచి తిరిగి అవి లాభాలను చూస్తున్నాయి. 5 శాతం పెరగొచ్చు గడిచిన ఆర్థిక సంవత్సరంలో పెట్రోలియం డిమాండ్ 10 శాతం పెరగ్గా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5–6 శాతం మేర పెరగొచ్చని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. అంతేకాదు మధ్య కాలానికి సైతం దేశంలో పెట్రోల్ డిమాండ్ 5–6 శాతం మేర పెరగొచ్చని పేర్కొంది. భారత్ జీడీపీ వచ్చే కొన్నేళ్లపాటు 6–7 శాతం మేర వృద్ధి చెందొచ్చని అంచనా వేసింది. ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై వ్యయాలను పెంచుతూ ఉండడం, పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకోవడం పెట్రోల్ వినియోగానికి సానుకూలంగా పేర్కొంది. ‘‘స్థూల రిఫైనింగ్ మార్జిన్లు 2023–24లో మోస్తరు స్థాయికి దిగొస్తాయి. అయినప్పటికీ స్థూల మార్జిన్లు సగటు స్థాయిలకు ఎగువనే ఉండొచ్చని అంచనా వేస్తున్నాం’’అని ఫిచ్ రేటింగ్స్ వివరించింది. మోస్తరు స్థాయిలో ధరలు చమురు ధరలు 2022–23 గరిష్టాల నుంచి చూసుకుంటే మోస్తరు స్థాయిలో, ఎగువవైపే కొనసాగొచ్చని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. దీనివల్ల చమురు ఉత్పత్తి సంస్థలైన ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాలకు మంచి నగదు ప్రవాహాలు సమకూరతాయని పేర్కొంది. భారత నూతన గ్యాస్ ధరల విధానం వల్ల ఈ సంస్థలకు నగదు ప్రవాహాల్లో ఉన్న అస్థిరతలు తగ్గుతాయని తెలిపింది. ఉత్పత్తికి సంబంధించి ఈ సంస్థలకు అధిక మూలధన నిధులు అవసరం కొనసాగుతుందని అంచనా వేసింది. దేశ చమురు ఉత్పత్తి 2022–23లో 1.7 శాతం తగ్గినట్టు వివరించింది. ఓఎన్జీసీ ఉత్పత్తి 1 శాతం తగ్గగా, ఆయిల్ ఇండియా ఉత్పత్తి 5 శాతం పెరిగినట్టు తెలిపింది. పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్ బలంగా ఉండడం, దేశీయంగా ఉత్పత్తి స్థిరంగా ఉండడంతో 2023–24లోనూ చమురు దిగుమతులు అధికంగానే ఉంటాయని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. -
ఆయిల్ కంపెనీలకు భారీ ఉపశమనం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?
న్యూఢిల్లీ: డీజిల్, జెట్ ఫ్యూయెల్– ఏటీఎఫ్ ఎగుమతులపై జీరో రేటును కొనసాగిస్తూనే, దేశీయంగా ఉత్పత్తయిన ముడి చమురుపై కూడా ప్రభుత్వం విండ్‌ఫాల్ గెయిన్స్ ట్యాక్స్‌ను పూర్తిగా తొలగించింది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) వంటి కంపెనీలు ఉత్పత్తి చేసే ముడి చమురుపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని (ఎస్ఏఈడీ) ప్రభుత్వం మంగళవారం నుండి పూర్తిగా తొలగించినట్లు అధికారిక ఉత్తర్వులు వెల్లడించాయి. ప్రస్తుతం ఈ పన్ను టన్నుకు రూ.4,100గా ఉంది. చమురు ఉత్పత్తిదారులు, ఇంధన ఎగుమతిదారుల భారీ లాభాలపై పన్ను విధించడానికి సంబంధించిన ఈ లెవీని గత ఏడాది జూన్‌లో ప్రవేశపెట్టిన తర్వాత పూర్తిగా తొలగించడం ఇది రెండవసారి. ఏప్రిల్ ప్రారంభంలో పన్నును సున్నాకి తగ్గించారు. అయితే అదే నెల ద్వితీయార్థంలో టన్నుకు రూ. 6,400 విధించడంతో తిరిగి విధించారు. అటు తర్వాత రూ.4,100కి తగ్గించడం జరిగింది. ప్రస్తుతం పన్ను పూర్తగా తీసివేస్తున్నట్లు వెల్లడించింది. ఏప్రిల్4న డీజిట్ ఎగుమతులపై, మార్చి 4 నుంచి ఏటీఎఫ్ ఎగుమతులపై పూర్తిగా తొలగించిన పన్ను యథాతథంగా కొనసాగుతుందని కూడా తాజా ప్రకటన తెలిపింది. దేశీయంగా ఉత్పత్తి అయిన ముడి చమురుపై విండ్‌ఫాల్ గెయిన్స్ ట్యాక్స్‌లో కోతకు ప్రధాన కారణం.. అంతర్జాతీయ చమురు ధరలు బ్యారల్‌కు 80 డాలర్ల నుంచి 75 డాలర్లకు తగ్గడమేనని అధికార వర్గాలు వెల్లడించాయి. చదవండి👉 అమ్మకాల్లో దూసుకెళ్తున్న మారుతి వేగన్ - ఆర్! భారీ ఆదాయాలు.. భారత్ 2022 జూలై 1వ తేదీన విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. చమురు ఉత్పత్తిదారులు ప్రతి బ్యారెల్‌కు 75 డాలర్ల కంటే ఎక్కువ ధరను పొందే సందర్భంలో వారు పొందే విండ్‌ఫాల్ లాభాలపై ప్రభుత్వం పన్ను విధింపు దీని లక్ష్యం. తద్వారా అంతర్జాతీయంగా ధరలు పెరుగుదల వల్ల ఇంధన కంపెనీలకు అనూహ్యంగా వచ్చే భారీ లాభాలపై పన్ను విధిస్తున్న పలు దేశాల సరసన చేరింది. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ప్రతి పదిహేను రోజులకు ఈ పన్ను మదింపు, నిర్ణయం జరుగుతోంది. అటువంటి లెవీ ప్రస్తుతం ఉన్న అన్ని ఇతర పన్నులకు అదనం. దేశీయ చమురు అన్వేషణకు విఘాతం కలుగుతుందని పేర్కొంటూ ఈ పన్నును రద్దు చేయాలని ఫిక్కీ వంటి పారిశ్రామిక సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. క్రూడ్ ఆయిల్, పెట్రోలియం ప్రొడక్టుల ఎగుమతులపై విధించిన ఈ ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం (ఎస్ఏఈడీ) వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఖజానాకు దాదాపు రూ.40,000 కోట్ల ఆదాయం లభించింది. దేశీయంగా ఉత్పత్తి అయిన ముడి చమురుపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ ద్వారా 2023–24లో దాదాపు రూ.15,000 కోట్ల ఆదాయం వస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేసింది. చదవండి👉 ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్? అదేంటంటే? -
ఊపందుకున్న పెట్రోల్, డీజిల్ విక్రయాలు
న్యూఢిల్లీ: వ్యవసాయ పనులు, పరిశ్రమల అవసరాలు, ట్రక్కుల ద్వారా రవాణా పెరగడంతో ఏప్రిల్ ప్రథమార్ధంలో డీజిల్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. గతేడాది ఏప్రిల్ ప్రథమార్ధంతో పోలిస్తే ఈసారి డీజిల్ విక్రయాలు 15 శాతం పెరిగి 3.45 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. నెలలవారీగా చూసినప్పుడు మార్చి ప్రథమార్ధంలో నమోదైన 3.19 మిలియన్ టన్నులతో పోలిస్తే 8.4 శాతం పెరిగాయి. ఇక పెట్రోల్ విషయానికొస్తే ఏప్రిల్ 1–15 మధ్య కాలంలో అమ్మకాలు 2 శాతం పెరిగి 1.14 మిలియన్ టన్నులకు చేరాయి. నెలవారీగా చూస్తే మాత్రం 6.6 శాతం మేర తగ్గాయి. కోవిడ్ పూర్వంతో (2020) పోలిస్తే ఏప్రిల్ ప్రథమార్ధంలో పెట్రోల్ అమ్మకాలు 128 శాతం, డీజిల్ అమ్మకాలు 127 శాతం పెరిగాయి. వార్షికంగా వంట గ్యాస్ విక్రయాలు 5.7 శాతం పెరిగి 1.1 మిలియన్ టన్నులకు చేరాయి. మరోవైపు, ఏవియేషన్ కార్యకలాపాలు తిరిగి యథాప్రకారం ప్రారంభమైన నేపథ్యంలో గతేడాది ఏప్రిల్ ప్రథమార్ధంతో పోలిస్తే తాజాగా విమాన ఇంధనం (ఏటీఎఫ్) అమ్మకాలు 14 శాతం పెరిగి 2,84,600 టన్నులకు చేరాయి. నెలలవారీగా చూస్తే 3.8% తగ్గినప్పటికీ.. 2020తో పోల్చినప్పుడు 468 శాతం పెరిగాయి. పారిశ్రామిక కార్యకలాపాలు గణనీయంగా పుంజుకోవడం దేశీయంగా ఆయిల్ డిమాండ్‌కు ఊతమిస్తోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇటు సర్వీసులు, అటు పరిశ్రమల నుంచి మద్దతుతో భారత్ స్థిరమైన వృద్ధి సాధించగలుగుతోందని పేర్కొన్నాయి. -
డీజిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. ఎంతంటే?
విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్ ఎగుమతిపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌ను లీటర్‌కు 50 పైసలు తగ్గించింది. అదే సమయంలో దేశీయంగా ఉత్పత్తి చేసే చమురు కంపెనీలకు లెవీ పన్నును మరో రూ.50 విధించింది. కొత్తగా అమల్లోకి తెచ్చిన ఈ ధరలు మార్చి 4 నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్రం ఆర్ధిక శాఖ అధికారికంగా ప్రకటించింది. క్రూడ్ పెట్రోలియంపై స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (ఎస్ఏఈడీ) టన్నుకు రూ.4350 నుండి రూ. 4400కు పెంచింది. ప్రస్తుతం ఎగుమతి అవుతున్న డీజిల్‌పై పన్ను రూ.2.5 ఉండగా, దీనిని 50 పైసలు తగ్గించింది. అలాగే ఏటీఎఫ్‌పై విధిస్తున్న రూ.1.50 విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను సైతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. భూమి నుండి, సముద్రపు అడుగుభాగం నుండి పంప్ చేయబడిన ముడి చమురును శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఇంధనం వంటి ఇంధనాలుగా మారుస్తున్న విషయం తెలిసిందే. -
పెట్రోల్, డీజిల్ విక్రయాలు మళ్లీ పైకి
న్యూఢిల్లీ: శీతాకాలం ప్రభావం తొలగిపోవడంతో ఫిబ్రవరిలో మళ్లీ పెట్రోల్, డీజిల్ అమ్మకాలు పుంజుకున్నాయి. రెండంకెల వృద్ధిని చూశాయి. ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీల గణాంకాలను పరిశీలిస్తే.. ఫిబ్రవరిలో పెట్రోల్ అమ్మకాలు 12 శాతం పెరిగి 2.57 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. 2022 ఫిబ్రవరిలో పెట్రోల్ అమ్మకాలు 2.29 మిలియన్ టన్నులుగా ఉండడం గమనార్హం. 2021 ఫిబ్రవరి విక్రయాలు 1.57 మిలియన్ టన్నులతో పోల్చినా వృద్ధి నమోదైంది. నెలవారీగా చూస్తే.. జనవరి నుంచి ఫిబ్రవరికి పెట్రోల్ అమ్మకాలు 13.5 శాతం పెరిగాయి. ఇక డీజిల్ విక్రయాలు గత నెలలో 6.52 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. గతేడాది ఇదే నెలలో విక్రయాలతో పోలిస్తే 13 శాతం పెరిగాయి. ఈ ఏడాది జనవరి నెల విక్రయాలతో పోల్చి చూసినప్పుడు 9.2 శాతం వృద్ధి నమోదైంది. పర్వత ప్రాంతాల్లో మంచు వల్ల జనవరిలో డీజిల్ అమ్మకాలు 8.6 శాతం తగ్గడం గమనార్హం. ట్రక్కులు తిరిగి పూర్తి స్థాయిలో రోడ్లపైకి రావడం, రబీ సాగు సీజన్ రద్దీగా మారడంతో ఇక ముందూ డీజిల్ అమ్మకాలు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. విమానయాన సేవలు పెరగడం ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) అమ్మకాలను పెంచింది. గతేడాది ఇదే నెలతో పోల్చినప్పుడు 2023 ఫిబ్రవరిలో ఏటీఎఫ్ విక్రయాలు 41 శాతం పెరిగి 5,74,200 టన్నులుగా ఉన్నాయి. ఎల్పీజీ అమ్మకాలు 2.43 శాతం పెరిగి 2.53 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. -
తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు? కేంద్రం నిర్ణయంపై ఉత్కంఠ?
వాహనదారులకు త్వరలో కేంద్రం శుభవార్త చెప్పనుందా? దేశంలో భారీగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందా? పెట్రోల్, డీజిల్‌తో సహా మరికొన్నింటిపై పన్నులు తగ్గించే అవకాశం ఉందా? అవుననే అంటున్నాయి రాయిటర్స్ కథనాలు. ఆకాశాన్ని తాకిన పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు కొన్నింటిపై ట్యాక్స్ తగ్గించే అవకాశం ఉందని రాయిటర్స్ తన కథనంలో తెలిపింది. గత కొంత కాలంగా దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం, ఆర్బీఐ కృషి చేస్తున్నాయి. ఇందలో భాగంగా గతేడాది మే నెలలో పెట్రోల్‌పై 8 రూపాయలు, డీజిల్‌పై 6 రూపాయలు చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. అయితే జనవరి నెల నుంచి వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ పంజా విసరడంతో కేంద్రం, ఆర్బీఐ లెక్కలు తారుమారయ్యాయి. డిసెంబర్ నెలలో 5.72 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం 6.52 శాతానికి చేరింది. జనవవరిలో మూడు నెలల గరిష్ట స్థాయి 6.52 శాతంగా (2022 ఇదే నెలతో పోల్చి ధరల తీరు) నమోదయ్యింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న దానిప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం దిగువన ఉండాలి. అయితే 10 నెలలు ఆపైన కొనసాగిన రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్, డిసెంబర్ నెలల్లో కట్టడిలోకి (ఆరు శాతం దిగువకు) వచ్చింది. దేశంలో ఆహార ధరలు విపరీతంగా పెరగడం వల్లే రీటైల్ ద్రవ్యోల్బణం పెరిగింది. ఇక తృణధాన్యాల ధరలు ఏడాది ప్రాతిపదికన 16.12 శాతం పెరగగా, గుడ్లు 8.78 శాతం, పాలు 8.79 శాతం పెరిగాయి. కూరగాయల ధరలు 11.7 శాతం పడిపోయాయి. ఈ క్రమంలోనే ఆర్బీఐ సిఫార్సులకు అనుగుణంగా కేంద్రం మొక్కజొన్నపై విధిస్తున్న దిగుమతి సుంకాన్ని తగ్గించాలని యోచిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై ప్రస్తుతం 60 శాతం బేసిక్ డ్యూటీ వర్తిస్తోంది. అలాగే పెట్రో ధరలపై మరోసారి ఊరట ఇచ్చే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని పేర్కొన్నాయి. దీనిపై అటు ఆర్థికమంత్రిత్వ శాఖ గానీ, ఆర్బీఐ గానీ స్పందించలేదు. -
అదనపు వ్యాట్ బాబు వేసిందేగా?
సాక్షి, అమరావతి: చంద్రబాబు నాయుడి హయాంలోనూ అదే 31 శాతం వ్యాట్. ఇప్పుడూ అదే వ్యాట్. చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చాక పెట్రోలు, డీజిల్ రెండింటిపైనా లీటర్‌కు 4 రూపాయలు అదనపు వ్యాట్ విధించారు. ఇప్పుడూ అదే అదనపు వ్యాట్ కొనసాగుతోంది. కాకపోతే చంద్రబాబు హయాంలో రోడ్లను పట్టించుకోకపోవటంతో... దారుణంగా తయారైన రహదారుల మరమ్మతుల కోసం ఈ ప్రభుత్వం లీటరు డీజిల్, పెట్రోల్‌పై ఒక రూపాయి సెస్‌ను మాత్రం వసూలు చేస్తోంది. విచిత్రమేంటంటే ‘ఈనాడు’కు గానీ.. పనిగట్టుకుని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న దాని అధిపతి రామోజీరావుకు గానీ ఈ పన్నులన్నీ మునుపటి నుంచే కొనసాగుతున్నాయన్న వాస్తవం తెలిసి కూడా తెలియనట్టే వ్యవహరిస్తుండటం!!. ఇప్పుడేదో కొత్తగా పన్నులు పెంచేసినట్లు... దీనివల్ల ఇంధన ధరలు రాత్రికి రాత్రే హఠాత్తుగా పెరిగిపోయినట్లు ‘ఈనాడు’ రాసిన కథనం చూస్తే ఎవ్వరికైనా ‘ఔరా..!’ అనిపించకమానదు. పైపెచ్చు తాను పెంచిన అదనపు వ్యాట్ 4 రూపాయలు కాగా... కేవలం ఎన్నికలకు మూడునాలుగు నెలల ముందు ఏదో ఉపశమనం ఇస్తున్నట్లుగా అందులో 2 రూపాయలు తగ్గించారు చంద్రబాబు. తన పదవీకాలం మొత్తం పెంచిన ఛార్జీల్ని వసూలు చేసి... చివర్లో నాలుగు నెలలు ఎన్నికల్లో ఓట్ల కోసం... అందులోనూ సగం మాత్రమే తగ్గిస్తే... అప్పట్లో ‘ఈనాడు’ దీన్ని ప్రశ్నిస్తే ఒట్టు!. ఇదంతా ఎన్నికల గిమ్మిక్కేనని ఒక్క అక్షరం కూడా రాయని రామోజీరావు... ఇప్పుడూ అవే ఛార్జీలను కొనసాగిస్తున్నా.. ఏదో రాత్రికి రాత్రే రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరల్ని పెంచేసినట్లు వార్తలు రాయటం చూస్తే ఇదెక్కడి పాత్రికేయమని అనిపించకమానదు. పన్నులన్నీ కేంద్రానివేనని తెలియదా? అంతర్జాతీయంగా ముడి చమురు ధరల కదలికలను బట్టే దేశంలో ధరలు పెరగటం, తగ్గటం జరుగుతోందన్నది వాస్తవం. కాకపోతే అంతర్జాతీయంగా బాగా తగ్గినపుడు... కేంద్రం ఆ ఉపశమనాన్ని వినియోగదారులకు బదలాయించటం లేదు. రకరకాల పన్నులను పెంచటం ద్వారా ఆ ప్రయోజనాన్ని తన ఖాతాలో వేసుకుంటోంది. ఇలా కేంద్రం అదనపు ఎక్సైజ్ డ్యూటీలు, సెస్‌ల పేరుతో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం వల్లే ఇంధన ధరలు భగ్గుమంటున్నాయన్నది రామోజీరావుకు తెలియనిదేమీ కాదు. నిజం చెప్పాలంటే ఇంధన ధరలు రూపాయి అటూఇటుగా ఇంచుమించు అన్ని రాష్ట్రాల్లో ఒకే మాదిరిగా ఉన్నాయి. ఒక పక్క చార్జీలు, సెస్‌లు పేరిట కేంద్రం వాతలు పెడుతుంటే వాటిపై స్పందించకుండా రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు మోపటం చూస్తుంటే రామోజీరావు ఏ స్థాయికి దిగజారుతున్నారన్నది అర్థం కాక మానదు. ► ముడి చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో గణనీయంగా తగ్గినప్పటికీ దేశీయ మార్కెట్లో అందుకు అనుగుణంగా ధరలను తగ్గించలేదు. 2019 మే నెలలో లీటరు పెట్రోలు రూ.76.89, డీజిల్ రూ.71.50 చొప్పున ఉండగా 2021 నవంబర్ 1న పెట్రోలు రూ.115.99, డీజిల్ రూ.108.66కి పెరిగాయి. ఇప్పుడు పెట్రోల్ లీటర్ రూ.111.87, డీజిల్ రూ.99.61 ఉంది. ► పెట్రోలు, డీజిల్‌పై కేంద్రం వసూలు చేస్తున్న మొత్తం పన్నుల్లో రాష్ట్రాల వాటా కేవలం 5.8 శాతం. నేరుగా పన్నుల పేరిట వసూలు చేస్తే రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి ఉంటుంది కనక సెస్‌లు, సర్ చార్జీలు, అదనపు ఎక్సైజ్ డ్యూటీ, అదనపు ప్రత్యేక ఎక్సైజ్ డ్యూటీ పేరిట కేంద్రం వసూలు చేస్తోంది. ఇలా వసూలు చేస్తున్న మొత్తంలో ఒక్క పైసా కూడా రాష్ట్రాలకు వాటా ఇవ్వడం లేదు. ►పెట్రో ఉత్పత్తుల విక్రయాలపై వార్షికంగా రూ.3.35 లక్షల కోట్లు వసూలవుతున్నా రాష్ట్రాలకు ఇస్తున్న వాటా రూ.19,475 కోట్లు (5.8%) మాత్రమే. వాస్తవానికి కేంద్రం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాల వాటాగా 41 శాతం పంచాల్సి ఉంది. అయితే పెట్రో ఆదాయం ఇలా డివిజబుల్ పూల్‌లోకి రాకుండా సెస్‌లు, సర్‌చార్జీ రూపంలో కేంద్రం సుమారు రూ.2,87,500 కోట్లు వసూలు చేస్తోంది. ఈ వాస్తవం ‘ఈనాడు’కు తెలియదనుకోలేం!!. ► టీడీపీ అధికారంలో ఉండగా రహదారులపై దృష్టి పెట్టకపోవడంతో నిర్వహణ లోపం కారణంగా రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ఏటా విస్తారంగా వర్షాలు కురిశాయి. ఫలితంగా రోడ్లు ఇబ్బందికరంగా తయారయ్యాయి. ఈ నేపథ్యంలో రూ.2,205 కోట్లతో 8,970 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధి, మరమ్మతులు చేపట్టింది ప్రభుత్వం. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా లీటరుపై కేవలం రూ.1 మాత్రమే సుంకంగా విధించాల్సి వచ్చింది. ఇది మినహా వ్యాట్ గానీ, గత సర్కారు విధించిన అదనపు నాలుగు రూపాయలకు మించిగానీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఒక్క పైసా పెంచలేదు. గత ప్రభుత్వంలో ఉన్నట్లే వ్యాట్, అదనపు రూ.నాలుగు ఇప్పుడూ ఉన్నాయి. మరోవైపు కోవిడ్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వేల కోట్ల రాబడిని కోల్పోయింది. అయినప్పటికీ వాహనదారులపై భారం మోపలేదు. -
ఎన్నాళ్ల కెన్నాళ్లకు..వాహనదారులకు శుభవార్త!
వారణాసి: త్వరలో పెట్రోల్ ధరలు తగ్గుతాయన్న ఆశాభావాన్ని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి వ్యక్తం చేశారు. గతంలో పెట్రోల్ విక్రయంపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నష్టాలను చూడగా, అంతర్జాతీయంగా తగ్గిన ధరలతో అవి ఇప్పుడు లాభాలను చూస్తున్నాయి. అదే సమయంలో డీజిల్‌పై అవి ఇప్పటికీ నష్టపోతున్నాయి. గడిచిన ఏడాదికి పైగా పెట్రోలియం కంపెనీలు రేట్లను సవరించడం లేదు. ఈ నష్టాలు ముగింపునకు రాగానే పెట్రోల్, డీజిల్ విక్రయ ధరలు తగ్గుతాయని పురి అన్నారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, దేశీయ వినియోగదారులపై ఆ భారాన్ని మోపకుండా ఆయిల్ కంపెనీలు బాధ్యతాయుత కార్పొరేట్ సంస్థలుగా వ్యవహరించాయని పేర్కొన్నారు. -
పెట్రోల్‌పై లాభం.. డీజిల్‌పై నష్టం
న్యూఢిల్లీ: చమురు మార్కెటింగ్ కంపెనీలు ఒక్కో లీటర్ పెట్రోల్ విక్రయంపై రూ.10 చొప్పున లాభాన్ని చూస్తున్నాయి. మరోవైపు లీటర్ డీజిల్ విక్రయంతో అవి రూ.6.5 నష్టపోతున్నాయి. పెట్రోల్‌పై లాభం వస్తున్నా కానీ అవి విక్రయ రేట్లను తగ్గించడం లేదు. ఎందుకంటే అంతకుమందు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు భారీగా పెరిగిపోయిన సమయంలో అవి రేట్లను ఒక దశ వరకు పెంచి, ఆ తర్వాత నుంచి నష్టాలను సర్దుబాటు చేసుకున్నాయి. పైగా ఇప్పుడు డీజిల్‌పైనా నష్టపోతున్నాయి. దీంతో పెట్రోల్ రేటు దిగి రావడం లేదు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) గత 15 నెలల నుంచి రేట్లను సవరించడం లేదు. ‘‘2022 జూన్ 24తో ముగిసిన వారంలో లీటర్ పెట్రోల్‌పై 17.4 నష్టపోగా, లీటర్ డీజిల్‌పై రూ.27.70 చొప్పున నష్టాన్ని ఎదుర్కొన్నాయి. అక్టోబర్–డిసెంబర్ కాలానికి వచ్చే సరికి అవి లీటర్ పెట్రోల్‌పై రూ.10 లాభం, లీటర్ డీజిల్‌పై నష్టం రూ.6.5కు తగ్గింది’’అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తన నివేదికలో తెలిపింది. 2022 ఏప్రిల్ 6 నుంచి ఈ మూడు ప్రభుత్వరంగ ఆయిల్ విక్రయ సంస్థలు రేట్లను సవరించడం నిలిపివేశాయి. చమురు బ్యారెల్ ధర 103 డాలర్ల నుంచి 116 డాలర్లకు పెరిగినప్పటికీ అవి రేట్లను యథాతథంగా కొనసాగించాయి. ఫలితంగా ఏప్రిల్–సెప్టెంబర్ కాలానికి ఈ మూడు సంస్థలు కలసి ఉమ్మడిగా రూ.21,201 కోట్ల నష్టాన్ని నమోదు చేశాయి. కానీ, ఈ నెల చమురు ధర 78 డాలర్లకు తగ్గిపోయింది. దీంతో అవి ఇక మీదట డీజిల్‌పైనా లాభాలను ఆర్జించనున్నట్టు తెలుస్తోంది. ఆపరేటింగ్ లాభాలు స్థూల రిఫైనింగ్ మార్జిన్లు బ్యారెల్‌కు 10.5–12.4 డాలర్లుగా ఉండడంతో మూడు కంపెనీలు తిరిగి ఆపరేటింగ్ లాభాల్లోకి ప్రవేశిస్తాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్‌కు ఐవోసీ రూ.2,400 కోట్ల ఎబిట్డా (వడ్డీ, పన్నులు, తరుగుదలకు ముందు), బీపీసీఎల్‌కు రూ.1,800 కోట్లు, హెచ్‌పీసీఎల్‌కు రూ.800 కోట్ల ఎబిట్డా నమోదు చేస్తాయని పేర్కొంది. కాకపోతే నికరంగా నష్టాలను నమోదు చేస్తాయని అంచనా వేసింది. ఐవోసీ రూ.1,300 కోట్లు, హెచ్‌పీసీఎల్ రూ.600 కోట్లు చొప్పున నష్టాలను నమోదు చేయవచ్చని అంచనా వేసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు కరోనా ఆరంభంలో 2020లో మైనస్‌కు పడిపోవడం గమనార్హం. అక్కడి నుంచి రెండేళ్లలోనే 2022 మార్చి నాటికి బ్యారెల్ ధర 140 డాలర్లకు చేరి, 14 ఏళ్ల గరిష్టాన్ని నమోదు చేశాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగడం చమురు ధరలకు ఆజ్యం పోసిందని చెప్పుకోవాలి. అమెరికా, యూరప్‌లో మాంద్యం, చైనాలో వృద్ధి మందగమనం పరిస్థితులతో డిమాండ్ తగ్గి తిరిగి ధరలు దిగొస్తున్నాయి. ఈ మూడు ప్రభుత్వరంగ సంస్థలు కలిపి పెట్రోల్ డీజిల్ విక్రయాల్లో 90 శాతం మార్కెట్ వాటా కలిగి ఉన్నాయి. ఇవి ఇంతకాలం పాటు రేట్లను సవరించకుండా ఉండడం గత రెండు దశాబ్దాల్లో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. -
పెట్రోల్, డీజిల్ భారీ అమ్మకాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలు 2022 డిసెంబర్ నెలలోనూ గణనీయ వృద్ధిని చూశాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పనులకు వీటికి డిమాండ్ ఏర్పడడం ఈ వృద్ధికి దోహదపడినట్టు చెప్పుకోవాలి. పెట్రోల్ విక్రయాలు 2.76 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. 2021 డిసెంబర్ నెలతో పోల్చి చూస్తే 8.6 శాతం అధికం. ఇక 2020 డిసెంబర్ తో పోల్చినప్పుడు 13 శాతం, 2019 డిసెంబర్‌తో (కరోనాకు ముందు) పోల్చి చూసినప్పుడు 23 శాతం చొప్పున వృద్ధి కనిపించింది. ఇక 2022 నవంబర్ నెల విక్రయాలతో పోల్చి చూసినా 4 శాతం పెరుగుదల కనిపిస్తోంది. అటు డీజిల్ అమ్మకాలు సైతం 2021 డిసెంబర్ నెలతో పోలిస్తే 2022 డిసెంబర్లో 13 శాతం పెరిగి 7.3 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. 2020 డిసెంబర్ నెల కంటే 15 శాతం, 2019 డిసెంబర్ కంటే 11 శాతం అధికం. ఇక 2022 నవంబర్ నెల విక్రయాలతో పోల్చినప్పుడు 0.5 శాతం తగ్గాయి. ఇతర ఇంధనాల వినియోగమూ పైపైకే వ్యవసాయ రంగంలో వినియోగం పెరిగినట్టు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఇరిగేషన్ పంప్‌లు, ట్రక్ల కోసం డీజిల్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారని తెలిసిందే. 2022 జూన్ నుంచి చూస్తే మధ్యలో జూలై, ఆగస్ట్‌లో మాత్రం అధిక వర్షాలతో పెట్రోల్, డీజిల్ విక్రయాలకు కొంత డిమాండ్ తగ్గగా, మిగిలిన నెలల్లో జోరుగా కొనసాగింది. విమాన ప్రయాణికుల రద్దీ కూడా గరిష్ట స్థాయికి చేరుకోవడం గమనార్హం. దీంతో ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) విక్రయాలు గత నెలలో 18 శాతం వృద్ధి చెంది 6,06,000 టన్నులుగా ఉన్నాయి. 2020 డిసెంబర్‌తో పోల్చినప్పుడు 50 శాతం అధికంగా ఉన్నాయి. వంటగ్యాస్ విక్రయాలు 8 శాతం వృద్ధితో 2.72 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. నెలవారీగా చూస్తే వృద్ధి 6 శాతానికి పైనే ఉంది. -
చమురు కంపెనీలకు భారీ షాక్!, బాబోయ్..ఈ నష్టాలు భరించలేం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు (హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ) ఎనిమిది నెలల నుంచి విక్రయ ధరలు సవరించకపోవడంతో భారీ నష్టాలను మూటగట్టుకున్నాయని, వాటిని సర్దుబాటు చేయాలంటూ ఆర్థిక శాఖను పెట్రోలియం శాఖ కోరనుందని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల కాలంలో ఈ మూడు కంపెనీలు రూ.21,201 కోట్ల నష్టాలను ప్రకటించడం గమనార్హం. గత కొన్ని సంవత్సరాలకు సంబంధించి ఎల్పీజీ సబ్సిడీ రూ.22,000 కోట్లు కూడా వాటికి రావాల్సి ఉంది. విక్రయ ధరలు పెంచకపోవడం వల్ల అప్పటికే పెరిగిపోయిన ద్రవ్యోల్బణం దృష్ట్యా, ఆర్థిక వ్యవస్థకు మేలు జరిగినట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఈ దృష్ట్యా వాటికి పరిహారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రణల పరిధి నుంచి తొలగించారు. కనుక ఓఎంసీలు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా రోజువారీ రేట్లను నిర్ణయించొచ్చు. కానీ, అవి తమ ఇష్టానుసారం అవే రేట్లను కొనసాగించాయి’’అని వివరించారు. కనుక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి ధరల పెంచకపోవడం వల్ల పడే భారంపై అంచనాకు వచ్చిన, ఆ తర్వాత ఆర్థిక శాఖను సంప్రదించొచ్చని చెప్పారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు గతంతో పోలిస్తే కొంత దిగొచ్చినప్పటికీ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికీ నష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 6 నుంచి అవి రేట్ల సవరణను నిలిపివేశాయి. -
రెండంకెల స్థాయిలో ఇంధన విక్రయాల వృద్ధి
న్యూఢిల్లీ: పండుగల సీజన్లో కార్యకలాపాలు మరింత పుంజుకోవడం, వ్యవసాయ రంగంలో డిమాండ్ పెరగడంతో నవంబర్‌లో దేశీయంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలు గణనీయంగా వృద్ధి చెందాయి. రెండంకెల స్థాయిలో పెరిగాయి. గతేడాది నవంబర్‌తో పోలిస్తే ఈసారి పెట్రోల్ అమ్మకాలు 11.7 శాతం పెరిగి 2.66 మిలియన్ టన్నులకు, డీజిల్ విక్రయాలు 27.6 శాతం వృద్ధి చెంది 7.32 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. కోవిడ్ కష్టకాలమైన 2020 నవంబర్‌తో పోలిస్తే పెట్రోల్ అమ్మకాలు 10.7 శాతం, కోవిడ్ పూర్వం 2019 నవంబర్‌తో పోలిస్తే 16.2 శాతం పెరిగాయి. అటు డీజిల్ విక్రయాలు 17.4 శాతం (2020 నవంబర్‌తో పోలిస్తే), 9.4 శాతం (2019 నవంబర్‌తో పోలిస్తే) పెరిగాయి. జూన్ నుండి పెట్రోల్, డీజిల్ అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. పంటల సీజన్ కావడంతో డీజిల్‌కు డిమాండ్ గణనీయంగా ఉంటోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సాగు నీటి పంపులు, ట్రక్కుల్లో ఇంధనాల వినియోగం ఎక్కువగా పెరిగిందని వివరించాయి. విమాన ప్రయాణాలు కూడా పుంజుకుంటూ ఉండటంతో విమాన ఇంధన (ఏటీఎఫ్) విక్రయాలు సైతం గత నవంబర్‌తో పోలిస్తే ఈసారి 21.5 శాతం పెరిగి 5,72,200 టన్నులకు చేరాయి. అయితే, కోవిడ్ పూర్వం నవంబర్ (2019)తో పోలిస్తే మాత్రం 13.3 శాతం తక్కువగా నమోదయ్యాయి. దేశీయంగా విమాన ప్రయాణాలు కోవిడ్ పూర్వ స్థాయులకు చేరినప్పటికీ కొన్ని దేశాల్లో ఇంకా ఆంక్షలు కొనసాగుతుండటంతో అంతర్జాతీయ ప్రయాణాల ట్రాఫిక్ కాస్త తక్కువగానే ఉంటోందని పరిశ్రమ వర్గాలు వివరించాయి. ఏటీఎఫ్ ధర తగ్గింపు .. అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు తగ్గడంతో ప్రభుత్వ రంగ చమురు రిటైల్ కంపెనీలు ఏటీఎఫ్ రేటును గురువారం 2.3 శాతం తగ్గించాయి. అయితే, పెట్రోల్, డీజిల్ రేట్లను మాత్రం వరుసగా ఎనిమిదో నెలా సవరించకుండా, యథాతధంగా ఉంచాయి. తాజా తగ్గింపుతో ఏటీఎఫ్ రేటు ఢిల్లీలో కిలోలీటరుకు రూ. 2,775 తగ్గి రూ. 1,17,588కి చేరింది. గత నెల కూడా ఆయిల్ కంపెనీలు విమాన ఇంధనం రేటును 4.19 శాతం (రూ. 4,842) తగ్గించాయి. విమానయాన కంపెనీల నిర్వహణ వ్యయా ల్లో 40 శాతం వాటా ఇంధనానిదే ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజా తగ్గింపులు వాటికి కొంత ఊరటనివ్వనున్నాయి. ఏటీఎఫ్ రేటును ఆయిల్ కంపెనీ లు ప్రతి నెలా 1వ తారీఖున సమీక్షిస్తాయి. పెట్రో ల్, డీజిల్ రేట్లను అవి ఏప్రిల్ 6 నుండి సవరించలేదు. విండ్‌ఫాల్ లాభాలపై పన్ను సగానికి తగ్గింపు డీజిల్ ఎగుమతుల లెవీపై ఊరట అంతర్జాతీయంగా రేట్ల అనూహ్య పెరుగుదలతో, దేశీ చమురు ఉత్పత్తి దారులకు వచ్చే భారీ లాభాలపై (విండ్‌ఫాల్ ట్యాక్స్) పన్నును కేంద్ర ప్రభుత్వం సగానికి తగ్గించింది. అలాగే, డీజిల్ ఎగుమతులపైనా లెవీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఓఎన్జీసీ తదితర సంస్థలు ఉత్పత్తి చేసే టన్ను చమురుపై ప్రస్తుతం రూ.10,200గా ఉన్న పన్నును రూ.4,900కు తగ్గించింది. లీటర్ డీజిల్ ఎగుమతిపై లెవీని 10.5 నుంచి 8కి తగ్గించింది. ఏటీఎఫ్‌పై అదనపు ఎక్సైజ్ డ్యూటీ లీటర్‌కు రూ.5గా కొనసాగనుంది. మొదట పెట్రోల్ ఎగుమతులైనా కేంద్రం లెవీ విధించగా, తర్వాత దాన్ని ఎత్తివేయడం గమనార్హం. ఉక్రెయిన్‌పై రష్యా యు ద్ధం తర్వాత అంతర్జాతీయంగా చమురు ఉత్పత్తి, సరఫరా తగ్గిపోయి, ధరలు గణనీయంగా పెరిగిపోవడం తెలిసిందే. ఈ పరిణా మం దేశీ చమురు ఉత్పత్తి కంపెనీలకు అనూహ్య లాభాలు వచ్చేందుకు దారితీసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం విండ్‌ఫాల్ పన్నును ప్రవేశపెట్టడం తెలిసిందే. -
వాహనదారులకు అలర్ట్.. ఆ సర్టిఫికెట్ లేకపోతే నో పెట్రోల్, డీజిల్
వాహనాదారులకు ఢిల్లీ ప్రభుత్వం షాకిచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ కీలక నిరయం తీసుకుంది. బంకుల్లో పెట్రోల్, డీజిల్ కావాలంటే తప్పనిసరిగా పొల్యూషన్ సర్టిఫికెట్(పీయూసీ) ఉండాలనే నిబంధన విధించింది. వివరాల ప్రకారం.. ఢిల్లీలో ప్రతీ శీతాకాలం గాలి కాలుష్య తీవ్రత బాగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం.. పీయూసీ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేసింది. పీయూసీ సర్టిఫికెట్ లేకుండా బంకుల్లో పెట్రోల్, డీజిల్‌ను పోయరని స్పష్టం చేసింది. అక్టోబర్ 25 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌రాయ్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి గోపాల్‌రాయ్ మాట్లాడుతూ సెప్టెంబర్ 29న పర్యావరణం, రవాణా, ట్రాఫిక్ అధికారులతో సమావేశం సందర్భంగా కాలుష్య నియంత్రణకు ప్రణాళిక, విధివిధానాలను చర్చించినట్టు తెలిపారు. కాగా, పీయూసీ సర్టిఫికెట్‌కు సంబంధించిన నోటిఫికేషన్ తర్వలోనే విడుదలవుతుందని వెల్లడించారు. అంతేకాకుండా అక్టోబర్ 6వ తేదీ నుంచి యాంటీ డస్ట్ క్యాంపెయిన్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అక్కడ నిర్మాణ స్థలాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కాలుష్యాన్ని అరికట్టనున్నట్లు స్పష్టం చేశారు. దీంతో, కాలుష్య నియంత్రణ కొంత మేరకు సాధ్యమవనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. Vehicle owners will not be provided fuel at petrol pumps in Delhi without showing a valid pollution under control certificate from October 25, Environment Minister Gopal Rai said @AapKaGopalRai #Petrol #Environment https://t.co/yz1zlIw4Sz — The Telegraph (@ttindia) October 1, 2022 -
దేశంలో తగ్గిన పెట్రోల్, డీజిల్ డిమాండ్
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ డిమాండ్‌లో నెలవారీగా మందగమన ధోరణి కనబడుతోంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం, ఆగస్టు (జూలైతో పోల్చితే) మొదటి 15 రోజుల కాలంలో డీజిల్ డిమాండ్ తగ్గింది. పెట్రోల్ డిమాండ్ దాదాపు అక్కడక్కడే ఉంది. జూన్‌తో పోల్చితే జూలైలో అటు పెట్రోల్ ఇటు డీజిల్ డిమాండ్ రెండూ తగ్గిన సంగతి తెలిసిందే. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల వినియోగం భారీగా తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రుతుపవనాల ప్రారంభకాలం, ఎడతెరిపిలేని వర్షాలు, వరదల ఎఫెక్ట్ దీనికి కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ కాలంలో రవాణా, ట్రావెల్ రంగాలు సహజంగా నెమ్మదిస్తాయి. తీవ్ర వర్షాలు వ్యవసాయ రంగం కార్యకలాపాలకు సైతం అడ్డంకిగా నిలుస్తుంది. ఇందుకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► జూలై 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ డీజిల్ డిమాండ్ 3.17 మిలియన్ టన్నులు. అయితే ఆగస్టు ఇదే కాలంలో డిమాండ్ 11.2 శాతం పడిపోయి 2.82 మిలియన్ టన్నులుగా నమోదయ్యింది. ► ఇక జూలై మొదటి 15 రోజుల్లో పెట్రోల్ అమ్మకాలు 1.28 మిలియన్ టన్నులు. ఆగస్టు ఇదే రోజుల్లో ఈ పరిమాణం దాదాపు అక్కడక్కడే 1.29 మిలియన్ టన్నులుగా ఉంది. ► జూన్‌తో పోల్చితే జూలై నెలలో డీజిల్ వినియోగం 13.1 శాతం తగ్గి 6.44 మిలియన్ టన్నులుగా ఉంది. జూన్‌లో డీజిల్ విక్రయాలు 7.39 మిలియన్ టన్నులు. ఇక పెట్రోల్ వినియోగం జూలైలో 5 శాతం తగ్గి 2.66 మిలియన్ టన్నులుగా ఉంది. జూన్‌లో పెట్రోల్ వినియోగం 2.8 మిలియన్ టన్నులు. ► వార్షికంగా చూస్తే పెట్రోల్, డీజిల్ డిమాండ్‌లో గణనీయమైన వృద్ధిరేటు నమోదవుతోంది. -
తగ్గిన పెట్రోల్, డీజిల్ వినియోగం
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ విక్రయాలు జులైలో తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురియడం ఇంధనాల వినియోగం తగ్గేలా చేసింది. డీజిల్ వినియోగం 13.1 శాతం తగ్గి 6.44 మిలియన్ టన్నులుగా ఉంది. జూన్‌లో డీజిల్ విక్రయాలు 7.39 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. కానీ, క్రితం ఏడాది జూలై నెలలోని వినియోగంతో పోలిస్తే ఈ ఏడాది జూలైలో వినియోగం 17 శాతం అధికంగా ఉంది. ఇక 2020 జూలై నెల గణాంకాలతో పోలిస్తే ఏకంగా 32 శాతం అధికం కావడం గమనించాలి. 2020లో కరోనా ఆంక్షల కారణంగా వినియోగం గణనీయంగా పడిపోయింది. ఇక పెట్రోల్ వినియోగం జూలైలో 5 శాతం తగ్గి 2.66 మిలియన్ టన్నులుగా ఉంది. జూన్‌లో పెట్రోల్ వినియోగం 2.8 మిలియన్ టన్నులుగా ఉండడం గమనించాలి. ఏటీఎఫ్ (విమాన ఇంధనం) విక్రయాలు జూలైలో 79 శాతం పెరిగి 5,33,600 టన్నులుగా ఉన్నాయి. ఎల్పీజీ విక్రయాలు సైతం 4 శాతం పెరిగి 2.46 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. -
పెట్రోల్‌లో నీళ్లు...
సాక్షి,సిటీబ్యూరో: మహానగరంలోని బంకుల్లో పెట్రోల్, డీజిల్‌తో పాటు నీళ్లు పోస్తున్నారు. ఇదేమి ప్రశ్నిస్తే అది అంతే అంటున్నారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు తోడు పెట్రోల్‌లో కలుస్తున్న నీళ్లు వాహనాలను దెబ్బతీసి జేబులను గుల్ల చేస్తున్నాయి. బంకుల యాజమానులకు కాసుల ధ్యాస తప్ప నాణ్యమైన పెట్రోల్, డీజిల్ అందించాలన్న ప్రయత్నం మాత్రం కనిపించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెట్రోల్ బంకుల నిర్వహణలో నిర్లక్ష్యం వినియోగదారులకు శాపంగా మారింది. ఆయిల్ కంపెనీల నుంచి ఇథనాల్‌తో కూడిన పెట్రోల్ సరఫరా నిల్వలు దెబ్బతీస్తున్నాయి. ఇథనాల్ మిళితమైన పెట్రోల్ నిల్వల్లో నీటిచుక్క కలిసినా...క్రమంగా పెట్రోల్ మొత్తం నీరుగా మారుతోంది. అధికారికంగానే: ప్రధాన చమురు సంస్థలు అధికారికంగానే ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రాం కింద పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్‌ను కలుపుతున్నట్లు కంపెనీల ఇన్వాయిస్లు స్పష్టం చేస్తున్నాయి. ఇథనాల్‌ను ఇంధనంతో కలపడం వల్ల పెట్రోల్‌లోని ఆక్టేన్ సంఖ్య పెరుగుతుంది. దీంతో ధర కూడా తగ్గించాల్సి ఉంటుంది. చమురుసంస్ధలు వీటిని పట్టించుకోకుండా పెట్రోల్‌లో సుమారు 10 శాతం ఇథనాల్ కలిపి సరఫరా చేస్తూ ఫూర్తి ధరను కోట్ చేస్తున్నాయి. వర్షకాల కష్టం ఇథనాల్‌తో కూడిన పెట్రోల్ నిల్వలకు వర్షాకాలం కష్టం వచ్చి పడింది. వర్షకాలం నేపథ్యంలో ట్యాంకుల్లో కొద్ది పాటి నీరు చేరినప్పటికీ నిల్వలు క్రమంగా నీళ్లుగా మారుతున్నాయి. బంకుల నిర్వాహకులు అడుగు నిల్వలను సైతం వాహనాలకు పంపింగ్ చేస్తుండటంతో అవి కాస్తా మోరాయిస్తున్నాయి. స్టార్ట్ అయినా మధ్యలో ఆగిపోవడం తదితర సమస్యలు ఎదురవుతున్నాయి. ఫలితంగా ఇంజిన్‌పై ప్రభావం పడుతోంది. నాలుగుచక్రాల వాహనాలకు ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. దీంతో వాహనదారుల ఆందోళనకు దిగుతున్నా అధికారులు మాత్రం మొక్కుబడిగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. శాంపిల్స్‌కే పరిమితం: పౌరసరఫరాల అధికారులు పెట్రోల్ బంక్‌లలో శాంపిల్స్ సేకరించేందుకు పరిమితమవుతున్నారనే ఆరోపనలు వ్యక్తమవుతున్నాయి. పౌరసరఫరాల శాఖ పెట్రోల్‌పై ఎప్పటికప్పుడు శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపి పరీక్షించాలి. అధికారులు వద్ద కూడా పరీక్షలు నిర్వహించేందుకు పరికరాలు అందుబాటులో ఉండాలి. అయితే అవీ అందుబాటులో ఉన్నా ఉపయోగించిన దాఖలాలు లేవు. పౌరసరఫరాల శాఖ తనిఖీలు నిర్వహించి రెడ్‌హిల్స్‌లోని ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ పరీక్షకు పంపించిన శాంపిల్స్ వేళ్లపై లెక్కపెట్టవచ్చు. ►రెండు రోజుల క్రితం నగరంలోని జాతీయ రహదారిపై గల చైతన్యపురిలో హెచ్‌పీ పెట్రోల్ వద్ద వాహనదారులు ఆందోళనకు దిగారు. బైక్‌లో పెట్రోల్ పోయించుకోగా స్టార్ట్ కాక మొరాయించడంతో అనుమానం వచ్చి ఖాళీ బాటిల్లో పోయించారు. బాటిల్ అడుగున నీరు ఉండటంతో బంక్ సిబ్బందిని నిలదీశారు. వారి నుంచి సరైన సమాధానం రాక పోవడంతో ఆందోళనకు దిగారు. ►గతంలోనూ హయత్‌నగర్‌లోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ లో నీళ్లతో కూడిన పెట్రోలు వచ్చిందని వాహనదారులు ఆందోళన చేపట్టారు. దీనిపై ఫిర్యాదు అందడంతో పౌరసరఫరాల శాఖాధికారులు శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించి చేతులు దులుపుకున్నారు. -
రణ్వీర్ సింగ్ నగ్న ఫోటోతో..భవిష్ అగర్వాల్ మార్కెటింగ్ స్ట్రాటజీ!
కార్పొరేట్ వరల్డ్‌లో బ్రాండ్ వ్యాల్యూ చాలా ముఖ్యం. ఒక్కసారి పోగొట్టుకుంటే నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఇటీవలి కాలంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ప్రీ బుకింగ్‌లోనే లక్షకు పైగా ఆర్డర్లు సాధించిన ఓలా పరిస్థితి తారుమారైంది. వెహికల్స్‌లోని లోపాలు ఆ సంస్థను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అందుకే ఆ సంస్థ అధినేత భవిష్ అగర్వాల్ తన మార్కెటింగ్ స్ట్రాటజీతో బ్రాండ్ వ్యాల్యూని నిలబెట్టి.. అమ్మకాలు పెంచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అగ్గిపుల్ల నుంచి సబ్బుబిళ్ల అగ్గిపుల్ల నుంచి సబ్బుబిళ్ల వరకు అమ్మకాలు జరిపేందుకు కార్పొరేట్ దిగ్గజాలు మూడు మార్కెటింగ్ స్ట్రాటజీస్‌ను ఫాలో అవుతుంటాయి. గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ చెప్పిన ఈథోస్, పాథోస్,లోగోస్ టెక్నిక్‌ను ఉపయోగించి ప్రొడక్ట్‌లను సేల్ చేస్తుంటాయి. మిగిలిన కార్పొరేట్ కంపెనీల మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా ఉన్నా..భవిష్ అగర్వాల్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పెట్రోల్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను పోల్చుతూ..తాజాగా పేపర్ మ్యాగజైన్ కోసం నగ్నంగా ఫోజులిచ్చిన స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ఫోటోల్ని ట్వీట్ చేశారు. 🤷♂️ pic.twitter.com/V0TUsYEgJy — Bhavish Aggarwal (@bhash) July 22, 2022 పెట్రోల్ వాలా వర్సెస్ ప్రోవాలా భవిష్ ట్వీట్లో నేలపై నగ్నంగా కూర్చొన్న రణ్వీర్ సింగ్ ఫోటోకు 'పెట్రోల్ వాలా' అని.. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ నగ్నంగా డ్యాన్స్ ఫోజ్ పెట్టిన రణ్వీర్ ఫోటోకు 'ప్రో వాలా' అని పేర్కొన్నారు. పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో తగ్గిపోతున్న పెట్రో వాహనాల వినియోగం తగ్గుతుందని..ఆటోమొబైల్ మార్కెట్లో ఈవీ వెహికల్స్ డిమాండ్‌ను హైలెట్ చేస్తూ మరికొన్ని మీమ్స్ నెటిజన్లతో పంచుకున్నారు. pic.twitter.com/GmTGZLq8QC — Bhavish Aggarwal (@bhash) July 22, 2022 ఈవీ వెహికల్స్ కాలిపోతుంటాయ్ ఆసక్తికరమైన విషయమేమిటంటే, అగర్వాల్ ఈ తరహాలో ట్వీట్ చేయడం ఇదేం తొలిసారి కాదు. ఈ ఏడాది జూన్‌లో అగ్నికి ఆహుతైన టాటా నెక్సాన్ ఈవీ విజువల్స్‌పై స్పందించారు. ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. విదేశాల్లో తయారైన వెహికల్స్ సైతం కాలిపోతుంటాయి. ఈవీ వెహికల్స్‌తో పోలిస్తే పెట్రో ఇంజిన్ (ఐసీఈ)లకే ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటాయంటూ ఆటోకార్ ఇండియా ఎడిటర్ హోర్మజ్డ్ సోరాబ్జీని కూడా ట్యాగ్ చేశారు. ఏది ఏమైనా ఆటోమొబైల్ మార్కెట్లో మార్కెటింగ్ మహరాజుగా పేరొందిన భవిష్ అగర్వాల్..ఓలా ఈవీ వెహికల్స్ అమ్మకాల కోసం ఇంకెన్ని ప్రయత్నాలు చేస్తారో చూడాలి' అంటూ ఆటోమొబైల్ మార్కెట్ నిపుణులు చమత్కరిస్తున్నారు. -
తగ్గిన పెట్రోల్, డీజిల్ వాడకం..కారణం అదేనా!
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌కు డిమాండ్ తగ్గింది. ఈ నెల మొదటి 15 రోజుల్లో వర్షాలు ఎక్కువగా ఉండడం ఇంధన వినియోగంపై ప్రభావం చూపించింది. డీజిల్ వినియోగం 13.7 శాతం తగ్గి 3.16 మిలియన్ టన్నులుగా ఉంది. జూన్‌లో మొదటి 15 రోజుల్లో డీజిల్ వినియోగం 3.67 మిలియన్ టన్నులు ఉండడం గమనించాలి. సాధారణంగా ఏప్రిల్–జూన్ కాలంలోని వినియోగంతో పోలిస్తే.. జూలై–సెప్టెంబర్ కాలంలో డీజిల్, పెట్రోల్ డిమాండ్ సహజంగానే తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వర్షాలతో రవాణా తగ్గుతుంది. సాగు రంగం నుంచి కూడా డిమాండ్ తక్కువగా ఉంటుంది. 2021 జూలై మొదటి 15 రోజుల వినియోగంతో పోలిస్తే మాత్రం.. ఈ ఏడాది ఇదే కాలంలో 27 శాతం వృద్ధి నమోదైంది. ఇక 2020 ఇదే కాలంతో చూస్తే 43 శాతం పెరిగింది. పెట్రోల్ వినియోగం సైతం ఈ నెల మొదటి 15 రోజుల్లో 8 శాతం తగ్గి 1.27 మిలియన్ టన్నులుగా నమోదైంది. జూన్ మొదటి 15 రోజుల్లో పెట్రోల్ వినియోగం 1.38 మిలియన్ టన్నులుగా ఉంది. 2021 జూలై మొదటి 15 రోజులతో పోలిస్తే 23 శాతం, 2020 జూలై మొదటి 15 రోజులతో పోలిస్తే 46 శాతం అధికం. ఇక 2019 జూలై 15 రోజులతో పోల్చి చూసినా పెట్రోల్ వినియోగం 28 శాతం ఎక్కువగా ఉంది. -
100 డాలర్ల దిగువకు చముర ధర..పెట్రో ధరలు ఎందుకు తగ్గడం లేదు!
భారత్‌లో క్రూడాయిల్ ధర బ్యారల్ 100డాలర్లకు దిగువకు చేరాయి. ఏప్రిల్ తర్వాత తొలిసారి బ్యారల్ ధర తగ్గడంతో వాహన దారులు ఫ్యూయల్ ధరలు తగ్గుతాయని ఊహించారు. కానీ వాటి ధరలు అలాగే కొనసాగుతాయని, ఇప్పట్లో పెరిగే అవకాశాలు లేవని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశీయంగా ఏప్రిల్ 25న బ్యారెల్ క్రూడాయిల్ ధర 99.17 డాలర్లు ఉండగా..ఆ తర్వాత వాటి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తూ వచ్చాయి. అయితే జులై 14న అదే క్రూడాయిల్ ధర బ్యారెల్ 99.76 డాలర్లు చేరింది. అంతర్జాతీయంగా మాంద్యం, డిమాండ్ - సప్లై వంటి భయాల కారణంగా ధర 5.5శాతం తగ్గింది. మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య సౌదీ అరేబియా ముందస్తు ఉత్పత్తిని పెంచుతుందనే ఆశతో బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడాయిల్ 100డాలర్ల కంటే ఎక్కువ పెరిగింది. కానీ యూఏఈ మాత్రం క్రూడాయిల్ ఉత్పత్తిని తగ్గించింది. అయితే ఈ తరుణంలో పెట్రోల్,డీజిల్ తగ్గిపోతాయనుకున్న వాహన దారులకు భంగపాటు ఎదురైంది. చమురు కంపెనీలు నష్టాల్ని పూడ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయే తప్పా.. వాటిని వాహనదారులపై బదాలయించే ప్రయత్నం చేయడం లేదని తెలుస్తోంది. నష్టాల నుంచి గట్టెక్కుతున్నారు. క్రూడాయిల్ రేట్లు తగ్గడం వల్ల దేశీయ చమురు కంపెనీలకు ఊరట లభించినట్టయింది. గతంలో క్రూడాయిల్ బ్యారెల్ ధర 120 నుంచి 123 డాలర్ల వరకు వెళ్లిన నేపథ్యంలో.. కొనుగోలు చేయడానికి భారీ ఎత్తున ఖర్చు పెట్టాల్సి వచ్చేది. మే నెలలో కేంద్రం పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.8, డీజిల్‌పై లీటరుకు రూ.6 తగ్గించడంతో చమురు కంపెనీలకు మరింత భారం పెరిగింది. ఎక్సైజ్ సుంకం తగ్గింపు, బ్యారల్ ధర పెరుగు ధరలతో చమురు కంపెనీలు క్రూడాయిల్‌పై భారీగా ఖర్చు చేశాయి. ఇప్పుడు ఆ నష్టాల్ని పూడ్చుకునేందుకు తక్కువకే ధరకే క్రూడాయిల్ బ్యారెల్‌ను కొనుగోలు చేస్తున్నాయి. పెట్రో ధరల్ని అలాగే కొనసాగిస్తున్నాయి. -
ఇకపై ఆ దేశంలో రేషన్ ద్వారా పెట్రోల్, డీజిల్ పంపిణీ!
కొలంబో: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ఇంధన కొరత తీవ్ర స్థాయికి చేరుకుంది. పెట్రోల్, డీజిల్ కోసం పెట్రోల్ పంపుల ముందు రోజుల తరబడి నిలుచోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలో కీలక నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం. 'నేషనల్ ఇంధన పాస్' పేరుతో ఇంధన రేషన్ పథకాన్ని శనివారం ప్రవేశపెట్టారు ఆ దేశ విద్యుత్తు, ఇంధన శాఖ మంత్రి కాంచన విజేశేకర. ఈ కొత్త పాస్ ద్వారా వారం పద్ధతిలో ఇంధన కోటాను కేటాయిస్తారు. వాహన నంబర్, ఇతర వివరాలను ధ్రువీకరించి నేషనల్ ఐడెండిటీ కార్డు(ఎన్ఐసీ) అందిస్తారు. దానికి క్యూఆర్ కోడ్లు కేటాయిస్తారు. Introduction to the National Fuel Pass will be held @ 12.30pm. A guaranteed weekly fuel quota will be allocated. 1 Vehicle per 1 NIC, QR code allocated once Vehicle Chassis number & details verified. 2 days of the week according to Last Digit of number plate for fueling with QR. https://t.co/hLMI9Nm5ZF — Kanchana Wijesekera (@kanchana_wij) July 16, 2022 రిజిస్ట్రేషన్ వాహన యజమానులు తమ రిజిస్ట్రేషన్ నంబర్లోని చివరి అంకె ద్వారా తమ వంతు ఎప్పుడు వస్తుందని తెలుసుకోవచ్చు. మరోవైపు.. దేశంలోని పర్యాటకులు, విదేశీయులు కొలంబోలో పెట్రోల్, డీజిల్ పొందేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు మంత్రి. ' శనివారం మధ్యాహ్నం నుంచి నేషనల్ ఇంధన పాస్‌ల పంపిణీ ప్రారంభిస్తున్నాం. పాస్‌ల ద్వారా వారం పద్ధతిలో గ్యారంటీపెట్రోల్, డీజిల్‌ల కోటాను కేటాయిస్తాం. ఒక వాహనానికి ఒక ఎన్ఐసీ, క్యూఆర్ కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ ద్వారా నంబర్ ప్లేట్ లోని చివరి అంకె సహాయంతో వారంలో రెండు రోజుల్లో ఇంధనం పొందొచ్చు.' అని విజేశేకర ట్విట్టర్లో పేర్కొన్నారు. దేశంలోని ఇంధన కొరతను తీర్చేందుకు పొరుగు దేశాలతో పాటు రష్యాతోనూ చర్చలు జరుపుతున్నట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. రష్యా నుంచి ముడి చమురు సరఫరాకు మార్గం సుగమమైతే కొంత మేర ఇంధన కొరతకు తెరపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుతం దేశంలో ఇంధనంతో పాటు ఆహార, ఔషధాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇదీ చూడండి: Gotabaya Rajapaksa: అందుకోసం శతవిధాల ప్రయత్నం చేశా: గొటబయ -
జూన్‌లో ఇంధన అమ్మకాలు జూమ్..
న్యూఢిల్లీ: పంటల సీజన్, ప్రయాణాలు, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్న నేపథ్యంలో ఇంధన విక్రయాలు పెరుగుతున్నాయి. జూన్‌లో దేశీయంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలు భారీగా పెరిగాయి. పరిశ్రమ గణాంకాల ప్రకారం.. పంటల సీజన్ ప్రారంభ దశ కావడంతో డీజిల్ విక్రయాలు కరోనా ముందు స్థాయికి ఎగిశాయి. రెండంకెల స్థాయి వృద్ధి నమోదు చేశాయి. జూన్‌లో డీజిల్ అమ్మకాలు (2021 జూన్‌తో పోలిస్తే) 35.2 శాతం పెరిగి, 7.38 మిలియన్ టన్నులకు చేరాయి. 2019 జూన్‌తో (కరోనా పూర్వం) పోలిస్తే ఇది 10.5 శాతం, 2020 జూన్‌తో పోలిస్తే 33.3 శాతం ఎక్కువ. అలాగే ఈ ఏడాది మేలో నమోదైన 6.7 మిలియన్ టన్నులతో పోలిస్తే 11.5 శాతం అధికం. వ్యవసాయం, రవాణా రంగాల్లో వినియోగం పెరగడం వల్ల డీజిల్‌కు డిమాండ్ ఎగిసిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మరోవైపు, ప్రభుత్వ రంగ రిటైల్ సంస్థల్లో పెట్రోల్ విక్రయాలు జూన్‌లో 29 శాతం పెరిగి 2.8 మిలియన్ టన్నులకు చేరాయి. 2020 జూన్‌తో పోలిస్తే ఇది 36.7 శాతం, 2019 అదే నెలతో పోలిస్తే 16.5 శాతం అధికం. నెలవారీగా చూస్తే 3.1 శాతం ఎక్కువ. గతేడాది ఇదే వ్యవధిలో బేస్ తక్కువగా నమోదు కావడం కూడా జూన్‌లో గణాంకాలు మెరుగ్గా ఉండటానికి కారణమని పరిశ్రమ వర్గాలు వివరించాయి. అటు, గత నెల వంట గ్యాస్ అమ్మకాలు స్వల్పంగా 0.23 శాతం పెరిగి 2.26 మిలియన్ టన్నులకు చేరాయి. విమానయాన రంగం రెండేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తుండటంతో విమాన ఇంధనం (ఏటీఎఫ్) విక్రయాలు రెట్టింపై 5,35,900 టన్నులుగా నమోదయ్యాయి. విండ్‌ఫాల్ ట్యాక్స్‌తో సుంకాల నష్టం దాదాపు భర్తీ .. దేశీయంగా ఉత్పత్తయ్యే, విదేశాలకు ఎగుమతి చేసే చమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్ విధించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగానే దఖలు పడనుంది. దీంతో పెట్రోల్, డీజిల్‌పై సుంకాల తగ్గింపు వల్ల వాటిల్లే సుమారు రూ. 1 లక్ష కోట్ల నష్టాన్ని నాలుగింట మూడొంతుల మేర ప్రభుత్వం భర్తీ చేసుకోనుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కంపెనీలు ప్రత్యేకంగా ఎటువంటి పెట్టుబడులు పెట్టకుండా, ధరలు అనూహ్యంగా పెరగడం వల్ల పొందే భారీ లాభాలపై విధించే పన్నును విండ్‌ఫాల్ ట్యాక్స్‌గా పరిగణిస్తారు. విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు దాకా కొనసాగించిన పక్షంలో ఖజానాకు కనీసం రూ. 72,000 కోట్ల మేర ఆదాయం రావచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
రిలయన్స్‌కు భారీ షాక్, గంటల వ్యవధిలో లక్షల కోట్ల కంపెనీ సంపద ఆవిరి!
ముంబై: అధిక వెయిటేజీ రిలయన్స్‌తో పాటు ఇంధన షేర్లు పతనంతో స్టాక్ సూచీలు మూడోరోజూ (శుక్రవారం) నష్టాలను మూటగట్టుకున్నాయి. జూన్‌లో తయారీ రంగం తొమ్మిది నెలల కనిష్టానికి చేరుకోవడం కూడా సెంటిమెంట్‌పై ఒత్తిడిని పెంచింది. ట్రేడింగ్‌లో భారీ నష్టాల్లో కదలాడిన సూచీలు చివరకు ఓ మోస్తారు నష్టాలతో ముగిశాయి. ఇంట్రాడేలో 925 పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్ చివరికి 111 పాయింట్ల నష్టంతో 52,907 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 269 పాయింట్ల పతనం నుంచి కోలుకోని 28 పాయింట్ల నష్టంతో 15,752 వద్ద నిలిచింది. ఒక్క ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు మిగిలిన అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్సులు వరుసగా 0.74%, అర శాతం చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,138 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.1,378కోట్ల షేర్లను కొన్నారు. విండ్‌ఫాల్ ట్యాక్స్ ఎఫెక్ట్ విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనంపై ఎగుమతి పన్ను, విండ్‌ఫాల్ ట్యాక్స్ విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించడంతో ఆయిల్అండ్ గ్యాస్ షేర్లు భారీ పతనాన్ని చవిచూశాయి. ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ, రిలయన్స్, గెయిల్ షేర్లు 15 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో ఇంధన షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ నాలుగు శాతం నష్టపోయింది. రిలయన్స్‌కు రూ.1.25 లక్షల కోట్ల నష్టం కేంద్ర విధించిన విండ్‌ఫాల్ ట్యాక్స్‌తో దేశీయ ప్రైవేట్ రంగ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ట్రేడింగ్‌లో రెండేళ్ల అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. ఇంట్రాడేలో తొమ్మిది శాతం నష్టపోయి రూ.2365 వద్ద స్థాయిని తాకింది. చివరికి ఏడుశాతం నష్టంతో రూ.2409 వద్ద నిలిచింది. షేరు భారీ పతనంతో రూ.1.25 లక్షల కోట్ల కంపెనీ సంపద ఆవిరైంది. మార్కెట్లో మరిన్ని సంగతులు ♦ఏజీఆర్ బకాయిల చెల్లింపుల వాయిదాతో ఎయిర్టెల్ 2% క్షీణించి రూ. 673 వద్ద నిలిచింది. ♦బలహీన మార్కెట్లోనూ ఐటీసీ షేరు రాణించింది. ఎఫ్ఎంసీజీ షేర్ల ర్యాలీలో భాగంగా 4% లాభపడి రూ. 284 వద్ద స్థిరపడింది. ♦బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించడంతో టైటాన్ షేరు ఇంట్రాడేలో 7% నష్టపోయింది. చివరికి 0.20 శాతం లాభంతో రూ.1,946 వద్ద స్థిరపడింది. -
పెట్రో లాభాలపై పన్ను పిడుగు! కేంద్ర ఖజానాకు లక్షకోట్లు!
న్యూఢిల్లీ: పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వ అనూహ్య నిర్ణయాలు ప్రకటించింది. దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురు సంస్థలకు అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరలతో భారీ లాభాలు వచ్చి పడుతున్నాయి. దీంతో దేశీయంగా ఉత్పత్తి చేసే టన్ను ముడి చమురుపై రూ.23,250 పన్ను (విండ్‌ఫాల్ ట్యాక్స్) విధించింది. ఫలితంగా దేశీ అవసరాలను పట్టించుకోకుండా, లాభాల కోసం ఎగుమతులకు ప్రాధాన్యం ఇస్తున్న సంస్థలకు కళ్లెం వేసినట్టయింది. ఇక్కడి నుంచి ఎగుమతి చేసే లీటర్ పెట్రోల్‌పై రూ.6, విమాన ఇంధనం ఏటీఎఫ్‌పై రూ.6, లీటర్ డీజిల్ ఎగుమతిపై రూ.13 పన్ను విధిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. అంతేకాదు, జూలై 1 నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. ఎగుమతులపై పన్ను రిలయన్స్ ఇండస్ట్రీస్, రోజ్‌నెఫ్ట్‌కు చెందిన నయారా ఎనర్జీపై ప్రభావం చూపించనుంది. ఈ రెండు సంస్థలు తమ రిఫైనరీ ప్లాంట్లలో ముడి చమురును శుద్ధి చేసి ఎగుమతి చేస్తుంటాయి. దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై పన్ను విధింపు నిర్ణయం ప్రభుత్వరంగ సంస్థలైన ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాతోపాటు, ప్రైవేటు రంగంలోని కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ (వేదాంత)పై ప్రభావం చూపించనుంది. ఏటా 29 మిలియన్ టన్నుల క్రూడాయిల్ దేశీయంగా ఉత్పత్తి అవుతోంది. టన్నుకు రూ.23,250 విండ్‌ఫాల్ ట్యాక్స్‌తో కేంద్రానికి రూ.66,000 కోట్లు సమకూరనుంది. విండ్‌ఫాల్ ట్యాక్స్ అంటే? కంపెనీలు ప్రత్యేకంగా ఎటువంటి పెట్టుబడులు పెట్టకుండా, ధరలు అనూహ్యంగా పెరగడం వల్ల వచ్చే భారీ లాభాలపై విధించే పన్నును విండ్‌ఫాల్ ట్యాక్స్‌గా చెబుతారు. అంతర్జాతీయంగా పలు దేశాల్లో ఈ పన్ను విధానం అమల్లో ఉంది. విండ్‌ఫాల్ ట్యాక్స్కుతోడు, ఎగుమతులపై పన్ను రూపంలో కేంద్రానికి సుమారు రూ.లక్ష కోట్లు సమకూరనుంది. ఇటీవల ధరలు భారీగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించి కొతం ఊరట కల్పించడం తెలిసిందే. దీనివల్ల రూ.లక్ష కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. తాజా నిర్ణయాలో ఖజానాకు ఈ మొత్తం భర్తీ కానుంది. అంతర్జాతీయ పరిణామాల ఫలితం ఇటీవలే బ్రిటన్ అసాధారణ పెట్రో లాభాలపై 25 శాతం పన్ను విధించడం గమనార్హం. తాజా నిర్ణయంతో భారత్ కూడా బ్రిటన్ బాటలో నడిచినట్టయింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం అనంతరం ఐరోపా సమాఖ్య రష్యా నుంచి చమురు, గ్యాస్ దిగుమతులను తగ్గించుకోవడం మొదలు పెట్టింది. దీన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ మంచి అవకాశంగా భావించాయి. ఐరోపా, అమెరికాకు ఎగుమతి చేయడం ద్వారా గణనీయమైన లాభాలను ఆర్జిస్తున్నాయి. రష్యా నుంచి చౌకగా లభిస్తున్న ముడి చమురును దిగుమతి చేసుకుని ఇక్కడ ప్రాసెస్ చేసి, ఎగుమతి చేస్తుండడం గమనార్హం. దీంతో ఎగుమతులను నిరుత్సాహపరిచేందుకు కేంద్రం పన్నులు విధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో (ఏప్రిల్, మే) 5.7 మిలియన్ టన్నుల డీజిల్, 2.5 మిలియన్ టన్నుల పెట్రోల్ దేశం నుంచి ఎగుమతి అయింది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ దేశీయంగా పెట్రోల్ పంపులు నిర్వహిస్తున్నాయి. ఇవి ప్రైవేటు సంస్థలు. ఆయిల్ మార్కెటింగ్‌లో 90 శాతం వాటా కలిగిన ప్రభుత్వరంగ సంస్థలు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా రిటైల్ విక్రయ ధరలను సవరించకుండా కొంత కాలంగా నియంత్రణ పాటిస్తున్నాయి. దీంతో పీఎస్‌యూల మాదిరే తక్కువ రేట్లకు పెట్రోల్ ఉత్పత్తులను విక్రయించడం వల్ల భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోందంటూ రిలయన్స్, నయారా ఎనర్జీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వరంగ సంస్థల మాదిరి తక్కువ రేట్లకు విక్రయించకపోతే అవి మార్కెట్ వాటాను నష్టపోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో అవి స్థానిక విక్రయాలను తగ్గించుకుని కొంత మేర ఎగుమతులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి.. ‘‘ఇటీవలి కాలంలో క్రూడ్ ధరలు గణనీయంగా పెరిగాయి. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న కంపెనీలకు ఇది అనుకూలంగా మారింది. అంతర్జాతీయ ధరలకే దేశీ రిఫైనరీలకు అవి ముడి చమురును విక్రయిస్తున్నాయి. దీనివల్ల స్థానికంగా ముడి చమురు ఉత్పత్తి చేసే సంస్థలు భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకుని టన్ను ముడి చమురుపై రూ.23,250 పన్ను విధిస్తున్నాం’’అని ఆర్థిక శాఖ తెలిపింది. నూతన లెవీ అన్నది చమురు కంపెనీలు పొందుతున్న ధరలో 40 శాతానికి సమానమని పేర్కొంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 2 మిలియన్ బ్యారెళ్ల కంటే తక్కువ ఉత్పత్తి చేసిన సంస్థలకు ఈ పన్నును మినహాయించినట్టు తెలిపింది. కళ్లు చెదిరే లాభాలు.. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర ప్రస్తుతం 112 డాలర్ల స్థాయిలో ఉంది. లోగడ ఇది 139 డాలర్లకూ వెళ్లింది. ఫలితంగా ఓఎన్జీసీ 2021–22 ఆర్థిక సంవత్సరానికి రూ.40,306 కోట్ల లాభం ఆర్జించింది. ఆయిల్ ఇండియా రూ.3,887 కోట్ల లాభాన్ని ప్రకటించింది. ఎగుమతులతో అద్భుత లాభాలు దేశీ సరఫరాలను పణంగా పెట్టి ఎగుమతి చేయడం ద్వారా కొన్ని ఆయిల్ రిఫైనరీ కంపెనీలు అద్భుత లాభాలు గడిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దీనివల్లే పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్‌పై ఎగుమతి పన్ను విధించాల్సి వచ్చినట్టు చెప్పారు. ఎగుమతి పన్నుతోపాటు, దేశీయ ఉత్పత్తిపై విధించిన విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షించి, అవసరమైతే మార్పులు చేస్తామని తెలిపారు. ప్రైవేటు తయారీ సంస్థలు ఎగుమతులపైనే ప్రధానంగా దృష్టి పెట్టాయని, దీంతో దేశీయ సరఫరా పెంచేందుకు కొత్త పన్నును లక్ష్యంగా చేసుకున్నట్టు వివరించారు. లాభాలు పెంచుకునే సంస్థల పట్ల తాము కక్ష సాధించడం లేదని స్పష్టం చేశారు. ఎగుమతులపైనా పరిమితులు.. ఒకవైపు పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై పన్ను విధించిన కేంద్ర సర్కారు.. మరోవైపు ఎగుమతుల పరిమాణంపై పరిమితులు విధించింది. దేశీయంగా వీటి అందుబాటు పెంచడమే ఈ చర్యల ఉద్దేశ్యం. 2023 మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో ఎగుమతి చేసే పెట్రోల్ పరిమాణంలో సగం మేర దేశీయ మార్కెట్లో విక్రయించాల్సి ఉంటుంది. అదే డీజిల్, గ్యాస్ అయితే ఎగుమతి పరిమాణంలో 30 శాతాన్ని దేశీయంగా విక్రయించాలని ఆర్థిక శాఖ పరిమితి పెట్టింది. దీనివల్ల దేశీయంగా పెట్రోల్, డీజిల్ మరింత అందుబాటులోకి వస్తుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రైవేటు సంస్థల పెట్రోల్ పంపులు ఎప్పుడూ నో స్టాక్ బోర్డుతో దర్శనమిస్తున్నాయి. కేంద్రం పెట్టిన పరిమితులతో ఇకమీదట ఈ పరిస్థితి ఉండదు. భూటాన్, నేపాల్ దేశాలకు ఎగుమతులను ఈ నిబంధనల పరిధి నుంచి మినహాయింపు కల్పించింది. అలాగే, నూరు శాతం ఎగుమతి ఆధారిత యూనిట్లు, సెజ్‌లలోని యూనిట్లకు ఎగుమతుల పరిమాణం పరిమితులు వర్తించవు. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏ రిఫైనరీ అయినా కానీ, ఎగుమతులపై పన్ను ఒకే విధంగా అన్నింటికీ అమలవుతుందని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ స్పష్టం చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు గుజరాత్‌లోని జామ్ నగర్లో రెండు రిఫైనరీలు ఉన్నాయి. -
చమురు సంక్షోభం: ఆఫీసులు, విద్యా సంస్థలు బంద్
కొలంబో: చమురు సంక్షోభంతో శ్రీలంక సతమతమవుతోంది. దాంతో సోమవారం నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలను మూసేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయాలని పేర్కొంది. ఆన్లైన్ తరగతులు నిర్వహించాలనిఆదేశించింది. చమురు నిల్వలు అడుగంటుతుండటంతో విదేశీ మారక ద్రవ్యం కోసం ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలైన్లలో గంటల తరబడి నిలబడలేక ప్రజలు మళ్లీ నిరసనలకు దిగుతున్నారు. చదవండి: (Warren Buffett: బఫెట్‌తో భోజనం @ రూ.148 కోట్లు) -
పెట్రోలు లేదు: రెండు వారాలు ఇంటినుంచే పని
కొలంబో: గత ఏడుదశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్రమైన పెట్రోలు కొరత కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు రెండు వారాల పాటు ఇంటి నుంచి పని చేయాలని శుక్రవారం ఆదేశించింది. ఇంధన సరఫరాపై ఆంక్షలు, బలహీనమైన ప్రజా రవాణా వ్యవస్థ, ప్రైవేట్ వాహనాలను ఉపయోగించడంలో ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని ఈ సర్క్యులర్ జారీ చేశామని మినిమం స్టాఫ్ సోమవారం నుండి పనికి రావచ్చని శ్రీలంక పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. ఫలితంగా సుమారు పది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులలో, ఆరోగ్య సంరక్షణ వంటి అవసరమైన సేవలను అందించే వారు మాత్రమే ఆఫీసు డ్యూటీకి రిపోర్టు చేస్తారని పేర్కొంది. (అటు పెట్రో సంక్షోభం: ఇటు రహమాన్ పాటకు డాన్స్‌తో ఫిదా!) విదేశీ మారకద్రవ్య నిధులు అడుగంటిపోవడంతో ఇంధనం కోసం శ్రీలంక అష్టకష్టాలు పడుతోంది. రానున్న ఆహారకొరత భూతం మరింత వణికిస్తోంది. మరోవైపు పెట్రోలు, డీజిల్ కోసం పెట్రో బంకుల వద్ద కిలోమీటర్ల పొడవునా క్యూలైన్లలో జనాలు నానా అగచాట్లు పడుతున్నారు. కొంతమంది వినియోగదారులు పెట్రోలు కోసం ఏకంగా 10 గంటలకు పైగానే వేచి ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతమున్న స్టాక్ పెట్రోల్, డీజిల్ కొద్ది రోజుల్లో అయిపోనుందనే ఆందోళన వెంటాడుతోంది. కోవిడ్-19, ఇటీవలి రాజకీయ సంక్షోభం లాంటి పరిణామాల నేపథ్యంలో 1948లో బ్రిటన్ నుండి స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి ఎన్నడూ లేనంత ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంది. కాగా బెయిలౌట్ ప్యాకేజీ కోసం దేశం అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థతో కొలంబోలో ఒక ప్రతినిధి బృందం చర్చలు జరపనుంది. రాబోయే నెలల్లో 5 మిలియన్ల మంది శ్రీలంక వాసులు ఆహార కొరతతో ప్రత్యక్షంగా ప్రభావితం కావచ్చని ప్రధానమంత్రి రణిల్ విక్రమ సింఘే కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే రాబోయే నాలుగు నెలల్లో మరింత సంక్షోభంలోకి జారిపోనున్న 1.7 మిలియన్ల శ్రీలంక పౌరులకు సహాయం అందించేందుకు 47 మిలియన్ డాలర్లు సేకరించేలా ఐక్యరాజ్యసమితి కసరత్తు చేస్తోంది. -
'మమ్మల్ని ఆదుకోండి సార్',కేంద్రం తలుపు తట్టిన చమురు కంపెనీలు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినప్పటికీ, పెట్రోల్ ఉత్పత్తుల ధరలు వరుసగా రెండు నెలల పాటు ఎటువంటి మార్పు ల్లేకుండా కొనసాగించడం వల్ల నష్టాలను ఎదుర్కొంటున్నట్టు ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు (బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐవోసీ) చెబుతున్నాయని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఈ విషయంలో తమకు ఉపశమనం కావాలంటూ అవి ప్రభుత్వం తలుపు తట్టినట్టు చెప్పారు. లీటర్ పెట్రోల్‌పై రూ.17.10, డీజిల్‌పై రూ.20.40 చొప్పున నష్టాలను ఎదుర్కొన్నట్టు వెల్లడించారు. ప్రైవేటు చమురు రిఫైనరీ కంపెనీలు రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేసి, రిఫైన్డ్ చేసిన తర్వాత అమెరికాకు ఎగుమతి చేయడం ద్వారా భారీ లాభాలను ఆర్జిస్తున్నాయన్న వార్తలపై స్పందించారు. అంతర్జాతీయంగా ధరలు పెరగడం వల్ల చమురు, గ్యాస్ కంపెనీలు ఆర్జించే అసాధారణ లాభాలపై విండ్‌ఫాల్ ట్యాక్స్ విధించడం అన్నది ఆర్థిక శాఖ పరిధిలోని అంశమని స్పష్టం చేశారు. మన కార్పొరేట్ సంస్థలు అన్నీ బాధ్యతగానే పనిచేస్తాయన్నారు. గత నెలలో పెట్రోల్ లీటర్‌పై రూ.8, డీజిల్ లీటర్‌పై రూ.6 చొప్పున కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ పన్నును తగ్గించడం తెలిసిందే. చమురు కంపెనీలు దీన్ని తమ నష్టాల భర్తీకి సర్దుబాటు చేసుకోకుండా.. వినియోగదారులకు బదిలీ చేయడం గమనార్హం. ప్రైవేటులో రిలయన్స్ బీపీ, నయాయా ఎనర్జీ (షెల్)కి మాత్రమే రిఫైనరీలు, దేశవ్యాప్తంగా పెట్రోల్ విక్రయ కేంద్రాలు ఉండడం గమనార్హం. ధరలు పెరగడంతో ఇవి స్థానికంగా విక్రయాలు తగ్గించుకుని.. ఎగుమతి చేయడం ద్వారా భారీ లాభాలను ఆర్జిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. -
మే నెలలో పెరిగిన ఇంధన వినియోగం!
న్యూఢిల్లీ: ఇంధన అమ్మకాలు దేశవ్యాప్తంగా ఈ ఏడాది మే నెలలో జోరుగా సాగాయి. 90 శాతం మార్కెట్ వాటా కలిగిన ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ సంస్థలు గత నెలలో 28 లక్షల టన్నుల పెట్రోల్ విక్రయించాయి. 2021 మే నెలతో పోలిస్తే ఇది 55.7 శాతం అధికం. 2020 సంవత్సరం అదే నెలతో పోలిస్తే 76 శాతం ఎక్కువ. నెలవారీ వృద్ధి 8.2 శాతం నమోదైంది. గతేడాదితో పోలిస్తే డీజిల్ అమ్మకాలు 39.4 శాతం అధికమై 68.2 లక్షల టన్నులకు ఎగసింది. 2022 ఏప్రిల్‌తో పోలిస్తే ఇది 1.8 శాతం ఎక్కువ. గత నెలలో అధిక ధరల తర్వాత డిమాండ్ తిరిగి రావడం వల్ల అమ్మకాలపై సానుకూల ప్రభావంతో ఇంధన వినియోగం ఎక్కువైంది. పంట కోత సీజన్ ప్రారంభం కావడం కూడా డిమాండ్‌కు తోడ్పడింది. వేసవి నుంచి ఉపశమనానికి శీతల ప్రాంతాలకు యాత్రలు పెరిగాయి. ఇక వంట గ్యాస్ అమ్మకాలు 1.48 శాతం అధికమై 21.9 లక్షల టన్నులకు చేరుకుంది. 2020 మే నెలతో పోలిస్తే ఇది 4.8 శాతం తక్కువ. 2022 మార్చి నుంచి ఒక్కో సిలిండర్ ధర రూ.103.5 పెరిగింది. విమానాల్లో వాడే ఇంధనం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) వినియోగం రెండింతలకుపైగా పెరిగి 5,40,200 టన్నులు గా ఉంది. నెలవారీ వృద్ధి 7.5% నమోదైంది. -
ధరల దెబ్బ..! దేశంలో భారీగా పడిపోతున్న పెట్రోల్, డీజిల్ అమ్మకాలు!
ఆదాయం..ఆవ గింజలా ఉంటే.. ఖర్చు కొండలా మారింది. దీంతో తోడు పెరిగిపోతున్న నిత్యవసర ధరలతో పాటు..సరుకు రవాణాకు లింకై ఉండడంతో పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి. అందుకే సామాన్యులు ఒక్కోరూపాయి లెక్కలేసుకొని మరి ఖర్చు చేస్తున్నారు. దీంతో గత నెల తొలి 16 రోజులతో పోల్చితే ఈ నెలలో 10 శాతం పెట్రోల్ వినియోగం తగ్గాయి. డీజిల్ వినియోగం 15.6 శాతం, వంటగ్యాస్ వినియోగం 1.7 శాతం తగ్గింది. అలాగే మహమ్మారి సమయంలో గ్యాస్ వినియోగం వృద్ధి పెరిగింది. అయినప్పటికీ తాజాగా గ్యాస్ డిమాండ్ తగ్గింది. వంట గ్యాస్ ఏప్రిల్ 1 నుంచి 15 రోజుల వినియోగంలో నెలవారీగా 1.7శాతం క్షీణించింది.పెరుగుతున్న ధరలతో ఏప్రిల్ 1 నుండి 15 వరకు ప్రాథమికంగా, ప్రభుత్వ ఆధీనంలోని చమురు సంస్థల పెట్రోలు అమ్మకాలు 1.12 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 12.1శాతం అధికంగా ఉంది. అలాగే 2019 కాలంతో పోలిస్తే 19.6శాతం అయితే, మార్చి 2022 మొదటి 15 రోజుల్లో నమోదైన 1.24 మిలియన్ టన్నుల అమ్మకాలతో పోలిస్తే పెట్రోల్ వినియోగం 9.7శాతం తగ్గింది. ఇంకా, దేశంలో అత్యధికంగా ఉపయోగించే డీజిల్ ఏప్రిల్ మొదటి 15రోజుల వరకు 7.4 అమ్మకాలను నమోదు చేసి సుమారు 3 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఇది కూడా 2019లో ఇదే కాలం కంటే 4.8% ఎక్కువ. అయితే ఈ ఇంధన వినియోగం మార్చి 1 నుంచి 15 రోజుల మధ్య 3.53 మిలియన్ టన్నుల వినియోగంతో పోలిస్తే 15.6 శాతానికి పడిపోయింది. -
భారీ డిమాండ్... పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ వినియోగం..!
న్యూఢిల్లీ: ఎకానమీ పుంజుకుంటున్న నేపథ్యంలో దేశీయంగా పెట్రోల్, డీజిల్ వినియోగం తిరిగి గణనీయంగా పెరుగుతోంది. కరోనా పూర్వ స్థాయికి మించి నమోదవుతోంది. మార్చి నెలలో ఇంధనాలకు డిమాండ్ మూడేళ్ల గరిష్టానికి చేరింది. 4.2 శాతం పెరిగి 19.41 మిలియన్ టన్నులుగా నమోదైంది. 2019 మార్చితో పోలిస్తే ఇది గరిష్ట స్థాయి. చమురు శాఖలో భాగమైన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. కోవిడ్–19 మహమ్మారి థర్డ్ వేవ్ తీవ్ర ప్రభావాల నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకునే క్రమంలో మార్చిలో ఇంధనాలకు డిమాండ్ కూడా మెరుగుపడింది. పెట్రోలియం ఉత్పత్తులు అన్నింటిలోకెల్లా అత్యధికంగా వినియోగించే (దాదాపు 40 శాతం) డీజిల్‌కు డిమాండ్ 6.7 శాతం పెరిగి 7.7 మిలియన్ టన్నులకు చేరింది. పెట్రోల్ అమ్మకాలు కొద్ది నెలల క్రితమే కోవిడ్ పూర్వ స్థాయిని దాటాయి. వీటి విక్రయాలు మార్చిలో 6.1 శాతం పెరిగి 2.91 మిలియన్ టన్నులకు చేరాయి. వ్యవసాయంతో డీజిల్‌కు డిమాండ్.. వ్యవసాయ రంగంలోడిమాండ్ నెలకొనడంతో పాటు ధరలు పెంచుతారన్న అంచనాలతో వినియోగదారులు, పెట్రోల్ బంకులు కూడా నిల్వ చేసుకోవడంతో డీజిల్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఇక, వంట గ్యాస్‌కు డిమాండ్ 9.8 శాతం పెరిగి 2.48 మిలియన్ టన్నులకు చేరింది. వార్షికంగా చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో ఇంధనాలకు డిమాండ్ 4.3 శాతం పెరిగి 202.71 మిలియన్ టన్నులుగా నమోదైంది. 2020 ఆర్థిక సంవత్సరం తర్వాత ఇంధనాలకు ఈ స్థాయి డిమాండ్ నమోదు కావడం ఇదే ప్రథమం. ఆటోమొబైల్, వంట గ్యాస్ వినియోగం పెరిగినప్పటికీ పారిశ్రామికంగా డిమాండ్ క్షీణించింది. 2021–22లో పెట్రోల్ వినియోగం 10.3 శాతం పెరిగి 30.85 మిలియన్ టన్నులకు, డీజిల్ అమ్మకాలు 5.4 శాతం పెరిగి 76.7 మిలియన్ టన్నులకు చేరాయి. ద్రవీకృత వంట గ్యాస్ వినియోగం 3 శాతం పెరిగి 28.33 మిలియన్ టన్నులుగా నమోదైంది. విమాన ఇంధనానికి (ఏటీఎఫ్) డిమాండ్ 35 శాతం పెరిగి 5 మిలియన్ టన్నులకు చేరింది. అయినప్పటికీ కరోనా పూర్వ స్థాయి 8 మిలియన్ టన్నులతో పోలిస్తే ఇది తక్కువే కావడం గమనార్హం. -
ఏం ఐడియా సామీ! పెళ్లిలో వధూవరులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన స్నేహితులు
పెళ్లికి వెళితే బహుమతులు తీసుకెళ్లడం తెలిసిన విషయమే. సాధారణంగా డబ్బులను కట్నాలుగా రాపించడం.. లేదా ఏదైనా ఖరీదైన గిఫ్ట్‌లను అందజేస్తారు.అయితే ఈ మధ్య కాలంలో యువత వినూత్నంగా ఆలోచిస్తున్నారు. తమ స్నేహితులు, బంధువుల పెళ్లిళ్లో చిన్నపిల్లల పాల బాటిళ్లు వంటి ఢిఫరెంట్ గిఫ్ట్స్ ఇస్తున్నారు. తాజాగా తమిళనాడులోనూ కొంతమంది స్నేహితులు కొత్త దంపతులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. వారంలో కనీసం నాలుగు రోజులు ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఓ పెళ్లికి విచ్చేసిన అతిథులు వధూవరులకు పెట్రోల్, డీజిల్ నింపినబాటిళ్లను కానుకగా అందించారు. చెంగల్పట్టు జిల్లా చెయ్యూరుకు చెందిన గిరీశ్ కుమార్, కీర్తన పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి స్నేహితులు పెట్రోల్, డీజిల్‌ను లీటర్ బాటిళ్లలో నింపి, వాటిని వధూవరులకు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా తమిళనాడులో గత 15 రోజుల్లో 9 రూపాయలకు పైగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్ ధర రూ. 110.85 ఉండగా, డీజిల్ ధర రూ. 100.94గా ఉంది. చదవండి: ఊహించని అదృష్టం.. పొరపాటున లాటరీ టికెట్ కొంటే.. కోటీశ్వరురాలిని చేసింది -
రెండేళ్లే! ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు దారులకు కేంద్రం అదిరిపోయే శుభవార్త!
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహన (ఈవీలు) ప్రియులకు కేంద్ర మంత్రి గడ్కరీ తీపి కబురు చెప్పారు. రెండేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు పెట్రోల్ వాహన ధరల స్థాయికి వచ్చేస్తాయని ఆయన ప్రకటించారు. ఈ మేరకు లోక్‌సభలో ఒక ప్రకటన చేశారు. పార్లమెంటు ఆవరణలో ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసిన తర్వాత సభ్యులు ఈవీలను కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు. ‘‘ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహన ధరలు పెట్రోల్ వాహన ధరలకే రెండేళ్లలో లభిస్తాయని సభ్యులు అందరికీ హామీ ఇస్తున్నాను’’ అని మంత్రి ప్రకటించారు. దిగుమతులకు ప్రత్యామ్నాయంగా, కాలుష్య రహిత, దేశీయంగా ఉత్పత్తి చేయడమే ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ప్రభావాలను చూస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. వీటికి ప్రత్యామ్నాయం గ్రీన్ హైడ్రోజన్, విద్యుత్తు, ఇథనాల్, మెథనాల్, బయో డీజిల్, బయో ఎల్ఎన్జీ, బయో సీఎన్జీ అని పేర్కొన్నారు. పార్లమెంటు ఆవరణలో ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని అందించాలని స్పీకర్ ఓంబిర్లాను మంత్రి గడ్కరీ కోరారు. చదవండి: రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లవర్స్‌కు శుభవార్త! -
జనం జేబుకు పెట్రో మంట..హైదరాబాద్‌లో సెంచరీ దాటిన డీజిల్ ధర
దేశంలో వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. బుధవారం లీటర్ పెట్రోల్ పై 90 పైసలు, డీజిల్ పై 87 పైసలు పెరిగాయి. దీంతో పెరుగుతున్న ధరలతో బండి బయటకు తీయాలంటే భయపడుతున్నారు. ఇక ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత చమరు కంపెనీలు సామాన్యులపై పెట్రో బాదుడును కొనసాగిస్తున్నాయి. గత మంగళవారం అంటే మార్చి 22 నుంచి ఒక్కరోజు మార్చి 24 మినహా ఇస్తే ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచుతూ వాహనదారుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ధర రూ.114.51 పైసలు ఉండగా డీజిల్ ధర రూ.100.70పైసలుగా ఉంది ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.01 పైసలు ఉండగా డీజిల్ ధర రూ.100.21గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.115.88 పైసలు ఉండగా డీజిల్‌ధర రూ.100.10గా ఉంది చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.69 పైసలు ఉండగా డీజిల్ ధర రూ.96.76 గా ఉంది. -
సామాన్యుడికి చుక్కలు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశ వ్యాప్తంగా సామాన్యులపై పెట్రోల్, డీజిల్ వాత కొనసాగుతోంది. ఐదు రోజుల్లో నాలుగో సారి చమురు సంస్థలు ధరలు పెంచాయి. దీంతో శనివారం దేశ వ్యాప్తంగా లీటర్ పెట్రోల్ పై 89పైసలు, డీజిల్‌పై 86పైసలు పెరిగాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు ధరలను పెంచనందుకు ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన హెచ్‌పీసీఎల్, ఐవోసీ, బీపీసీఎల్ ఏకంగా 2.25 బిలియన్ డాలర్ల (రూ.16,875 కోట్లు) ఆదాయాన్ని నష్టపోయినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగనున్నట్లు సమాచారం. దేశంలో పలు నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.80 పైసలు ఉండగా డీజిల్ ధర రూ.98.10గా ఉంది విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.113.60 పైసలు ఉండగా డీజిల్ ధర రూ.99.56 పైసలుగా ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.98.61పైసలు ఉండగా డీజిల్ ధర రూ.89.87 పైసలుగా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.113.35పైసలుగా ఉండగా డీజిల్ ధర రూ.97.55పైసలుగా ఉంది చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.43పైసలు ఉండగా డీజిల్ ధర రూ.94.47పైసలుగా ఉంది బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.103.93 పైసలు ఉండగా డీజిల్ ధర రూ.88.14పైసలుగా ఉంది -
మరోసారి పెరిగిన ఇంధన ధరలు..! 3 రోజుల్లోనే రూ. 2 పైగా బాదుడు..! కొత్త ధరలు ఇవే..
Fuel Rates Today: రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా బ్యారెట్ క్రూడాయిల్ ధరలు 140 డాలర్లకు చేరుకుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఇంధన ధరలను స్థిరంగా ఉంచిన కేంద్రం..ఇప్పుడు ధరల పెంపుకు చమురు సంస్థలు సిద్ధమయ్యాయి. రెండు రోజుల పాటు వరుసగా పెంచిన చమురు సంస్థలు, ధరల పెంపుకు ఒక్కరోజు బ్రేక్ గ్యాప్ ఇచ్చి మరోసారి బాదుడు షురూ చేశాయి. దేశీయ చమురు కంపెనీలు తాజాగా లీటరు పెట్రోల్ 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంచాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.97.81, డీజిల్ ధర రూ.89.07కు చేరాయి. ముంబైలో పెట్రోల్ రూ.112.51, డీజిల్ రూ.96.70గా ఉన్నాయి. చెన్నైలో 76 పైసల చొప్పున పెరగడంతో పెట్రోల్ రూ.103.67, డీజిల్ రూ.93.71, కోల్‌కతాలో పెట్రోల్ రూ.106.34 (84 పైసలు), డీజిల్ రూ.91.42 (80 పైసలు)కి చేరాయి. ఇక హైదరాబాద్‌లో లీటరు పెట్రోలుపై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసల చొప్పున పెరిగాయి. దీంతో పెట్రోలు ధర రూ.110.91, డీజిల్ రూ.97.23కు చేరాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 112.76, డీజిల్ ధర రూ. 98.74 గా ఉంది. దేశంలో గతేడాది నవంబర్ 4వ తేదీ తర్వాత మొదటిసారిగా మార్చి 22న పెట్రోల్, డీజిల్ ధరలు అధికమయ్యాయి. మార్చి 23న కూడా చమురు కంపెనీలు ధరలు పెంచాయి. తాజా పెంపుతో మూడు రోజుల్లోనే లీటరు పెట్రోల్, డీజిల్ ధరలు రూ.2.40 పైగా పెరిగాయి. చదవండి: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..! వచ్చే 6 రోజుల్లో 4 రోజులు బంద్..! -
పెట్రోల్‌పై రూ.100 ఖర్చు చేసే వారు.. భవిష్యత్తులో వాటితో కేవలం రూ. 10 ఖర్చు చేయొచ్చు
సాంకేతికత, గ్రీన్ ఫ్యుయల్ రంగంలో వేగంగా వస్తోన్న మార్పులతో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు భారీగా తగ్గుతాయని కేంద్ర రోడ్డు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాబోయే రెండేళ్లలో పెట్రోల్‌తో నడిచే వాహనాల ధరల స్థాయికి ఈవీ వాహనాల ధరలు వస్తాయని నితిన్ గడ్కరీ లోక్‌సభలో ప్రస్తావించారు. తక్కువ ఖర్చుతో కూడిన స్వదేశీ ఇంధనానికి మారవలసిన అవసరాన్ని ఆయన ఎత్తిచూపారు. హైడ్రోజన్ ఇంధనం త్వరలోనే వాస్తవికత అవుతుందని, కాలుష్య స్థాయిలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంపీలందరూ హైడ్రోజన్ టెక్నాలజీతో నడిచే వాహనాలను వాడాలని కోరారు. అంతేకాకుండా మురుగు నీటిని గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడానికి తమ జిల్లాల్లో చొరవ తీసుకోవాలని తెలిపారు. దీంతో భవిష్యత్తులో చౌకైన ఇంధన ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్ ఉంటుందని ఆయన చెప్పారు. లిథియం-ఐయాన్ బ్యాటరీల ధరలు తగ్గుతాయని పేర్కొన్నారు. జింక్-ఐయాన్, అల్యూమినియం-ఐయాన్, సోడియం-ఐయాన్ బ్యాటరీల తయారీపై పరిశోధనలు జరుగుతున్నాయని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఇదే జరిగితే పెట్రోల్‌పై ప్రస్తుతం రూ.100 ఖర్చు చేస్తోన్న వారు ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో రూ.10 మాత్రమే చెల్లించే రోజులు త్వరలోనే రానున్నాయని పేర్కొన్నారు. దాంతో పాటుగా ఇండియన్ రోడ్లపై కూడా ఆసక్తి కర వ్యాఖ్యలను చేశారు. భారత్ రోడ్లు సూపర్..! అమెరికన్ రోడ్ల కంటే భారత్‌లోని రోడ్లు అత్యద్భుతంగా ఉన్నాయంటూ గడ్కరీ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో జరిగే రోడ్ల నిర్మాణంపై కూడా ప్రస్తావించారు. ఢిల్లీ-అమృత్ సర్-కత్రా ఎక్స్ ప్రెస్ వేను సాధ్యమైనంత త్వరగా సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీ-అమృత్ సర్ మార్గం ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతుంది అని అన్నారు. అలాగే, కొత్తగా నిర్మిస్తున్న మార్గం వల్ల ఢిల్లీ నుంచి అమృత్ సర్ చేరుకోవడానికి 4 గంటల సమయం మాత్రమే పడుతుందని అన్నారు. కొత్తగా నిర్మిస్తున్న రోడ్డుతో శ్రీనగర్ నుంచి ముంబై చేరుకోవడానికి 20 గంటల సమయం పడుతుందని గడ్కరీ చెప్పారు. చదవండి: వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇక 60 కిలోమీటర్ల వరకు నో టోల్! -
బండి నడపాలంటే భయమేస్తుంది..14ఏళ్ల తర్వాత రికార్డ్ స్థాయికి పెట్రోల్, డీజిల్ ధరలు!!
ఉక్రెయిన్- రష్యా దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది. ఈ యుద్ధంతో ఇరు దేశాలు భారీగా నష్టపోతున్నాయి. అయినా పట్టు సాధించేందుకు దాడుల్ని ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పుడే ఇదే అంశం ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. తాజాగా ఉక్రెయిన్- రష్యా సంక్షోభంతో అమెరికాలో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకాయి. మార్చి10న పెట్రోల్ ధరలు 14ఏళ్ల గరిష్టానికి చేరాయి. 2008 ప్రపంచ ఆర్ధిక సంక్షోభం తర్వాత అమెరికాలో గ్యాలన్ పెట్రోల్ అత్యధికంగా 4.31 డాలర్లకు (అంటే రూ.329కి) చేరింది. 2008 జూలై 17న ఓ గ్యాలన్ పెట్రోలు ధర 4.11 డాలర్లు ఉండేది. ఆ రికార్డు తాజాగా చెరిగిపోయింది. అమెరికాలో ఓ గ్యాలన్ అంటే 3.78 లీటర్లు. కాబట్టి ఓ లీటరు పెట్రోలు ధర దాదాపు రూ.86.97కు చేరింది. డీజిల్ గ్యాలన్ ధర సైతం రికార్డ్ స్థాయిలో 5.05శాతం డాలర్లకు చేరుకుంది. దీంతో అమెరికన్లు ప్రెసిడెంట్ జోబైడెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బండి నడపాలంటే భయమేస్తుందని, సామాన్యుల్ని కాపాడాలని వరుస ట్వీట్లు చేస్తున్నారు. యూఎస్‌లో ఇంధన ధర యూఎస్‌లో పెట్రోల్, డీజిల్‌ను లీటర్లలో కాకుండా గ్యాలన్లలో రూపంలో అమ్ముతారు. అంటే యూఎస్‌లో గ్యాలన్ అంటే 3.78లీటర్లకు సమానం. కాబట్టి యుఎస్‌లో లీటర్ పెట్రోల్,యుఎస్ గ్యాలన్ను లీటర్‌గా, డాలర్లను రూపాయిలుగా మార్చినప్పుడు రూ.86.97 గా ఉంది. అంటే ఇది మనదేశంలో నెలరోజులుగా అమ్ముతున్న పెట్రోల్ ధరల కంటే తక్కువగా ఉంది. శ్రీలకంలో ఏకంగా ఉక్రెయిన్- రష్యా ఉద్రిక్తతల కారణంగా అమెరికాతో పాటు శ్రీలంకలో సైతం పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యులకు మరింత భారంగా మారాయి. ఇటీవల శ్రీలంకకు చెందిన లంక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఎల్ఐఓసీ) ఒకే నెలలో మూడు సార్లు పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచగా.. తాజాగా తాజాగా ఎల్ఐఓసీ ఒకేరోజు డీజిల్ పై రూ.75, పెట్రోల్ పై రూ.50 భారీగా పెంచింది. చదవండి: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం ఊహించని షాక్, 40ఏళ్ల తరువాత కీలక నిర్ణయం! -
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం,పెరగనున్న నిత్యవసర ధరలపై భారతీయులు ఏమంటున్నారంటే!
గతేడాది మనదేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో రూ.100 నుంచి రూ.110 మధ్య ఉండగా.. డీజిల్ ధర రూ.90 నుంచి రూ.100 మధ్యకు చేరాయి. దీంతో వాహనదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.అయితే, రష్యా ఉక్రెయిన్‌పై చేస్తున్న నేపథ్యంలో పెట్రో ధరలతో పాటు, నిత్యవసర వస్తువల ధరలు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. పెరగనున్న ధరలపై ప్రజలు ఎంత ఖర్చు చేస్తారు. పెరుగుతున్న ధరలు, నామమాత్రపు ఆదాయంతో ప్రజలు వారి జీవన విధానంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది. ఉక్రెయిన్-రష్యా వివాదం కారణంగా ముడిచమురు ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు ఎలా ఖర్చు చేస్తారో లోకల్ సర్కిల్స్ సంస్థ తెలుసుకునే ప్రయత్నం చేసింది. దేశంలోని 361 జిల్లాలకు పైగా ఉన్న పౌరుల నుండి సర్వే చేయగా.. ఆ సర్వేకు 66శాతం మంది పురుషులు, 34శాతం మంది మహిళలు 27వేల మంది స్పందించారు. ఆ సర్వేలో పాల్గొన్న ప్రజల అభిప్రాయం ఆధారంగా ఈ ఏడాది తమ సంపాదన తగ్గిపోతుందని ప్రతి రెండు కుటుబాలకు చెందిన వ్యక్తులు నమ్ముతున్నారు. 35 శాతం మంది ఆదాయం అలాగే ఉంటుందని చెప్పగా నాలుగు శాతం మంది తమ ఆదాయం పెరుగుతుందని చెప్పారు. 2022 పొదుపు చేయడం చాలా కష్టమని ప్రతి రెండు కుటుంబాల్లో ఒక ఇంటి సభ్యుడు నమ్ముతున్నాడు. 11 శాతం కుటుంబాలు మాత్రమే పెరుగుతుందని విశ్వసిస్తున్నారు. ఆరు శాతం కుటుంబాలు 25 శాతం లేదా అంతకంటే ఎక్కువ పెరుగుతాయని చెప్పారు. మొత్తం మీద, రెండు కుటుంబాలలో ఒకరు తమ పొదుపు 2022లో తగ్గిపోతుందని విశ్వసించగా, 11 శాతం మంది మాత్రమే అది పెరుగుతుందని విశ్వసించారు. పెట్రోలు, డీజిల్ ధరలు మరోసారి పెరగడాన్ని తాము సహించలేమని సర్వేలో పాల్గొన్న 42 శాతం భారతీయ కుటుంబాలు తెలిపాయి. వీరిలో 24 శాతం కుటుంబాలు ఇప్పటికే తమ విచక్షణ ఖర్చులను తగ్గించుకున్నట్లు చెప్పాయి. కేవలం 22 శాతం కుటుంబాలు మాత్రమే “స్వల్పకాలిక పెరుగుదలను తట్టుకోగలవు” అని, తొమ్మిది శాతం మంది “20 శాతం వరకు”, ఏడు శాతం మంది “10 శాతం వరకు”, 16 శాతం మంది “5 శాతం వరకు” అని చెప్పారు. కాగా కోవిడ్ ప్రభావం, ఉక్రెయిన్ - రష్యాదేశాల మధ్య అనిశ్చితి కారణంగా ఈ ఏడాది భారతీయుల ఆదాయాలు, పొదుపులు తగ్గుతాయని లోకల్ సర్కిల్స్ సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. -
వాహనదారులకు షాకింగ్ న్యూస్..!
ఎన్నో అంచనాల మధ్య ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామణ్ బడ్జెట్-2022ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ కొంతమందికి ఊరటను కల్పించిన మరికొందరికీ తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఇక ప్రతిపక్షాలు బడ్జెట్‌పై తీవ్ర విమర్శలను చేశాయి. బడ్జెట్లో పెట్రోల్, డిజీల్‌పై తీసుకున్న నిర్ణయం మరోసారి వాహనదారులకు షాక్ తగలనుంది. దీంతో పెట్రోల్, డిజీల్ ధరలు లీటర్‌కు రూ. 2 పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కారణం అదే..! పెంపు అప్పటి నుంచే..! ఇథనాల్ లేదా బయోడీజిల్ మిశ్రమం లేకుండా విక్రయించే పెట్రోలియం ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించాలనే ప్రతిపాదనను బడ్జెట్ 2022లో పొందుపరిచారు. దీంతో అన్‌బ్లెండెడ్ ఫ్యూయల్‌పై లీటరుకు రూ. 2 పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనతో చాలా ప్రాంతాల్లో 2022 అక్టోబర్ 1 నుంచి డీజిల్‌పై అదనపు బాదుడును కేంద్రం విధించనుంది. అయితే ఈశాన్య రాష్ట్రాలతో పాటుగా కొన్ని ప్రాంతాలలో పెట్రోలు ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఉద్గారాలను తగ్గించేందుకు..! మిక్స్డ్ పెట్రోల్, డీజిల్‌ను వాడడంతో తక్కువ స్థాయిలో ఉద్గారాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 2022-23 బడ్జెట్లో నాన్-బ్లెండెడ్ ఇంధనాలపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 90 డాలర్లు దాటిన బ్యారెట్ క్రూడ్ ఆయిల్..! అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు రయ్‌మంటూ పెరిగిపోతున్నాయి. 2014 తరువాత బ్యారెల్ బ్రెంట్ ముడిచమురు ధర ఏకంగా 90 డాలర్లకు చేరుకుంది.ఏడేళ్ల గరిష్ట స్థాయికి బ్యారెల్ చమురు ధరల పెంపుకు పలు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులే కారణంగా ఉన్నాయి. ఐరోపా, మధ్యప్రాచ్యంలోని భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు చమురు మంటలకు ప్రధాన కారణంగా ఉన్నాయి. వీటితో పాటుగా డిమాండ్ కంటే చమురు సరఫరా తక్కువగా ఉంది. క్రూడ్ ఆయిల్ ధరలు 90 డాలర్లకు చేరిన భారత్‌లో ఇప్పటివరకు ఇంధన ధరల్లో మార్పు రాకపోవడం విశేషం. చదవండి: తలనొప్పిగా మారనున్న రష్యా-ఉక్రెయిన్ టెన్షన్..! ఇంధన ధరలు రయ్ అంటూ..! -
పాత కార్లను ఎలక్ట్రిక్ కార్లుగా మారిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా?
Convert Diesel And Petrol Car To Electric Car: ఢిల్లీ ప్రభుత్వం ఆటోమొబైల్ రంగం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పాత డీజిల్ వెహికల్స్‌ను ఎలక్ట్రిక్ వెహికల్స్‌గా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం ఎలక్ట్రిక్ కిట్లను తయారు చేసే సంస్థ ఢిల్లీ రవాణా శాఖ ఒప్పందం కుదుర్చుకోనుందని ఢిల్లీ రవాణా మంత్రి కైలాష్ గహ్లోట్ తెలిపారు. 2015లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, 2018లో సుప్రీంకోర్టు 10 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ పాత డీజిల్ వాహనాలు,15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ పాత పెట్రోల్ వాహనాలు ఢిల్లీ -ఎన్సీఆర్ (National Capital Region) లో నడపరాదని ఆదేశించింది. ఈ తీర్పు కారణంగా ఢిల్లీ-ఎన్సీఆర్లోని వినియోగదారులు తమ వాహనాల్ని మూలన పెట్టేశారు. అయితే ఇప్పుడు కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఢిల్లీలోని 10 ఏళ్లకు పై బడిన పెట్రో వాహనాల యజమానులకు ఉపశమనం కలగనుంది. పాత కార్లను ఎలక్ట్రిక్ కార్లుగా మారిస్తే అయ్యే ఖర్చు మనదేశంలో ఈవీ కన్వర్షన్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి ధర రూ.1లక్ష నుంచి రూ.4లక్షల వరకు ఉంటుంది. ఉదాహరణకు హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ ఈట్రియో ఇప్పటికే మారుతీ ఆల్టో,డిజైర్స్ వంటి పెట్రోల్ -డీజిల్ వాహనలను ఒకే ఛార్జ్‌పై 150 కిలోమీటర్ల వరకు బ్యాటరీ పరిధి కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తోంది. ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్ ధర దాదాపు రూ.4లక్షలుగా ఉంది. 2012లో బెంగళూరు కేంద్రంగా ఆల్టిగ్రీన్ సంస్థ పెట్రో వాహనాల్ని హైబ్రిడ్ వెర్షగా మార్చేస్తున్నాయి. ఆల్ట్రిగ్రీన్ హైబ్రిడ్ కిట్ ఇంజిన్‌ను అమర్చుతుంది. డ్యూయల్ ఎలక్ట్రిక్ మెషిన్, జనరేటర్, వైర్‌జీను,పవర్, కంట్రోల్ ఎలక్ట్రానిక్స్ తో పాటు 48వీ బ్యాటరీ ప్యాక్ 4లీడ్ యాసిడ్ బ్యాటరీలతో డిజైన్ చేస్తుంది. ఈ ప్లగ్ ఇన్ సిస్టమ్ ధర రూ.60వేల నుంచి రూ.80వేల మధ్య ఉంటుంది. ఢిల్లీకి చెందిన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ రెట్రోఫిట్ కారు కంపెనీ ఏదైనా మాన్యువల్ గేర్ బాక్స్ ఇంజిన్ కారును రూ.1 నుంచి రూ.2లక్షలకు, తయారీతో పాటు మోడల్ ఆధారంగా హైబ్రిడ్‌గా మార్చేస్తుంది. అయితే ఈ కిట్ ధర రూ.5 లక్షల వరకు ఉండనుందని తెలుస్తోంది. మరి పాతకార్లపై భారీ మొత్తాన్ని వెచ్చించి వాటిని ఈవీ వెహికల్స్‌గా ఎందుకు మార్చుకుంటారనేది ప్రశ్నార్ధకంగా మారింది. పైగా కొత్త ఎలక్ట్రిక్ వెహికల్‌ను కొనుగోలు చేసినందుకు ఆయా ప్రభుత్వాలు రాయితీతోపాటు, ట్యాక్స్‌లో రాయితీ పొందవచ్చు. చదవండి: అరె డాల్ఫిన్‌లా ఉందే, వరల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ రికార్డ్లను తుడిచి పెట్టింది -
కొత్త బంకుల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాల్సిందే!
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంధన సరళీకృత చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా పెట్రోల్ బంకుల సంఖ్య పెంచేందుకు ఇంధనేతర కంపెనీలకూ లైసెన్స్ ఇవ్వాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొత్త ఇంధన రిటైల్ నూతన సరళీకృత విధానాల్లో వివిధ షరతులు ఉన్నాయి. పెట్రోల్ బంకులు ఎన్ని ఉండాలి, ఎక్కడెక్కడ వాటిని నిర్వహించాలనే వివిధ నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనల ప్రకారం నడిస్తేనే కొత్త సంస్థలకు అవకాశం ఇస్తారు. రిటైల్ పెట్రోల్ పంపుల గెజిటే నోటిఫికేషన్ ప్రకారం.. కనీసం 100 పెట్రోల్ బంకులు నెలకొల్పాలి. ఇందులో 5 శాతం మారుమూల ప్రాంతాల్లో ఉండాలి. అలాగే, కంప్రెస్డ్ నేచరల్ గ్యాస్(CNG), బయోఫ్యూయల్, లిక్విఫైడ్ నేచరల్ గ్యాస్, ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ వంటి న్యూ జనరేషన్ ఇంధన మార్కెటింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. మూడేళ్లలో ప్రతిపాదిత రిటైల్ అవుట్ లెట్లలో వాటిని ఏర్పాటు చేసుకోవాలి అని పేర్కొంది. భారతదేశం కొత్త సరళీకృత పెట్రోల్ పంప్ లైసెన్సింగ్ నిబంధనల ప్రకారం.. ఇక నుంచి కొత్తగా పెట్రోల్, డీజిల్ స్టేషన్ ప్రారంభించే స్టేషన్లలో అమ్మకాలు చేసే ముందు కంప్రెస్డ్ నేచరల్ గ్యాస్(CNG), బయోఫ్యూయల్, లిక్విఫైడ్ నేచరల్ గ్యాస్, ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ ఏర్పాటు చేయాలని పేర్కొంది.(చదవండి: వాట్సాప్‌లో ఇలా చేశారో..! మీ అకౌంట్‌ను మర్చిపోవాల్సిందే..!) -
స్వల్పంగా పెరిగిన పెట్రో ధరలు
దేశంలో మరోసారి పెట్రో ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల కారణంగా చమురు ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నా డీజిల్ ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర స్థిరంగా రూ.105.27 ఉండగా..డీజిల్ ధర 26 పైసలు పెరిగి రూ.97.17కు చేరింది. వైజాగ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.106.23 ఉండగా.. డీజిల్ ధర 25 పైసలు పెరిగి రూ.97.65కు చేరింది. గుంటూరులో పెట్రోల్ ధర లీటర్ రూ.107.5 వద్ద స్థిరంగా ఉండగా.. డీజిల్ లీటర్‌పై 25 పైసలు పెరిగి రూ.98.88 వద్దకు చేరింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.27 ఉండగా లీటర్ డీజిల్ ధర 25 పైసలు పెరిగి రూ. 96.65కి చేరింది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.64గా ఉండగా డీజిల్ 23 పైసలు పెరిగి రూ. 92.14కు చేరింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.98.97 ఉండగా.. లీటర్ డీజిల్ 22 పైసలు పెరిగి రూ. 93.45కు చేరింది. -
పెట్రో ధరలు తగ్గింపుపై రాని స్పష్టత, ఇంధనం ఆదా చేసే కార్లకే ప్రాధాన్యం
న్యూఢిల్లీ: పనితీరుపై రాజీపడకుండా ఇంధనాన్ని మరింత ఆదా చేసే వాహనాల తయారీపైనే ఇకపైనా దృష్టి పెడతామని దేశీ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. కొనుగోలుదారులు ఇలాంటి వాహనాల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతుండటమే ఇందుకు కారణమని ఆయన వివరించారు. పర్యావరణ హితమైన, ఇంధనం ఆదా చేసే విధమైన కార్లకు మారుతీ కట్టుబడి ఉందని తెలియజేసే కమ్ సే కామ్ బనేగా (కాస్త ఇంధనం సరిపోతుంది) పేరిట కొత్త ప్రచార కార్యక్రమం ఆవిష్కరణ సందర్భంగా శ్రీవాస్తవ ఈ విషయాలు తెలిపారు. ఇంధన ధరలు ఇప్పుడప్పుడే తగ్గే అవకాశాలేమీ కనిపించడం లేదని, ఈ నేపథ్యంలో కస్టమర్లు మెరుగైన మైలేజీనిచ్చే వాహనాల వైపే ఎక్కువగా మొగ్గు చూపవచ్చని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి మరింత కఠినతరమైన కాలుష్య ప్రమాణాలు అమల్లోకి రానుండటంతో అన్ని ఆటోమొబైల్ కంపెనీలూ ఇంధనం ఆదా చేసే వాహనాలను తప్పనిసరిగా తయారు చేయాల్సి రాగలదని శ్రీవాస్తవ చెప్పారు. స్మార్ట్ హైబ్రిడ్, ఎస్–సీఎన్జీ, కె–సిరీస్ ఇంజిన్లు మొదలైన వినూత్న సాంకేతిక ఆవిష్కరణల ఊతంతో గడిచిన దశాబ్ద కాలంలో తమ వాహనాల సామర్థ్యాన్ని దాదాపు 30% దాకా మెరుగుపర్చామని ఆయన తెలిపారు. ‘ఇంధనం ఆదా చేసే కార్లకు సంబంధించి మేము వివిధ విభాగాల్లో లీడర్లుగా ఉన్నాం. ఆల్టో, వ్యాగన్ ఆర్, బాలెనో స్మార్ట్ హైబ్రిడ్, డిజైర్, సియాజ్, ఎర్టిగా, విటారా బ్రెజా, ఈకో తదితర కార్లు ఈ జాబితాలో ఉన్నాయి‘ అని శ్రీవాస్తవ చెప్పారు. అధిక మైలేజీ, మెరుగైన పనితీరుకు పేరొందిన కే–సిరీస్ ఇంజిన్లు అమర్చిన కార్లు 70 లక్షలకు పైగా విక్రయించామని చెప్పారు. చదవండి: ఆ..!ఇలా అయితే కార్ల ధరల్ని ఇంకా పెంచాల్సి వస్తుంది -
ఆటోమేకర్స్‌కి సర్కార్ షాక్ ! మంత్రి నితిన్ గడ్కారీ కీలక ప్రకటన
చిప్ సెట్ల కొరతతో సతమతం అవుతున్న అటోమొబైల్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. కార్ల తయారీకి సంబంధించి అత్యంతక కీలకమైన విభాగంలో మార్పులు చేర్పులు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారీ కీలక ప్రకటన చేశారు. ప్రతికూల పరిస్థితులు కరోనా సంక్షోభం తర్వాత కార్ల అమ్మకాలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. అయితే అంతర్జాతీయంగా కార్ల తయారీలో కీలకమైన చిప్సెట్ల కొరత నెలకొంది. దీంతో కార్ల తయారీ సంస్థల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోయే పరిస్థితులు ఎదురయ్యాయి. మరోవైపు ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి డిమాండ్ పెరుగుతోంది. ఇలా అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య ఉన్న ఆటో మొబైల్ మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌కి మరో షాక్ ఇచ్చేందుకు కేంద్రం రెడీ అయ్యింది. ఫ్లెక్స్ ఇంజన్లు తయారు చేయండి పెట్రోలు ధరలు కంట్రోల్ కాకపోవడంతో ప్రత్యామ్నాయంగా బయో ఇథనాల్‌తో నడిచే ఇంజన్లతో నడిచే కార్లను మార్కెట్లోకి తేవాలంటూ కార్ల తయారీ సంస్థలను కేంద్రం ఇప్పటి వరకు కోరుతూ వస్తోంది. ఇటు పెట్రోలో/డీజిల్‌తో పాటు బయో ఇథనాల్‌తో నడిచే విధంగా ఫ్లెక్స్ ఇంజన్లు తయారు చేయాలని చెబుతోంది. అయితే కేంద్రం సూచనలకు తగ్గట్టుగా ఫ్లెక్స్ ఇంజన్లు తయారు చేయడంపై కంపెనీలు ఆసక్తి చూపించడం లేదు. ఈవీ మార్కెట్‌పై కొద్దొగొప్పో ఫోకస్ చేస్తున్నాయి. తప్పనిసరి చేస్తాం చెరుకు, వరి ఇతర పంట ఉత్పత్తుల నుంచి బయో ఇథనాల్ భారీ ఎత్తున తయారు చేసే అవకాశం ఉందని, కాబట్టి బయో ఇథనాల్‌కి మార్కెట్ కల్పించాలంటే ఫ్లెక్సీ ఇంజన్లతో నడిచే వాహనాలు ఉండాలి. దీంతో ఫ్లెక్సీ ఇంజన్ల తయారీని తప్పని సరి చేస్తూ త్వరలో ఆదేశాలు ఇస్తామని, ఇందుకు ఆర్నెళ్లకు మించి సమయం పట్టబోదంటూ కేంద్ర రవాణాశాఖ మంత్రి ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కుండ బద్దలు కొట్టారు. అయోమయంలో కంపెనీలు ఓ వైపు కర్భణ ఉద్గారాలు తగ్గించాలని చెబుతూ... ఈవీ మార్కెట్‌కి అనుకూలంగా ప్రభుత్వ విధానాలు రూపొందుతున్నాయని ఇప్పుడు కొత్తగా ఫ్లెక్సీ ఇంజన్లు అంటూ ఒత్తిడి చేస్తే ఎలాగంటూ ఆటోమొబైల్ ఇండస్ట్రీ వర్గాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. దేశ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర విధానం రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. చదవండి: BH-Series Tag: రాష్ట్రాల మధ్య వాహనాల తరలింపు సులభతరం -
తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంత తగ్గిందంటే..
పెరిగిన వంట గ్యాస్ ధరలు సామాన్యులకు గుదిబండగా మారిన తాజాగా స్వల్పంగా తగ్గిన చమురు ధరలు కాస్త ఊరటనిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా వారం రోజులుగా స్టేబుల్‌గా ఉన్న పెట్రోల్ ధర ఈరోజు 10 నుంచి 15 పైసలు వరకు తగ్గింది. డీజిల్ ధర సైతం 14 నుంచి 15పైసలు తగ్గింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెట్రో ధరలు ►ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.101.34 ఉండగా డీజిల్ రూ.88.77గా ఉంది. ►ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39 ఉండగా డీజిల్ ధర రూ.96.33గా ఉంది ►కోల్ కతా లో పెట్రోల్ ధర రూ.101.72 ఉండగా డీజిల్ ధర రూ.91.84గా ఉంది. ►చెన్నైలో పెట్రోల్ ధర రూ.99.08 ఉండగా డీజిల్ ధర రూ.99.38 గా ఉంది. ►హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.40 ఉండగా, డీజిల్ రూ. 96.84 గా ఉంది. ►విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.69 గా ఉండగా, డీజిల్ ధర రూ. 98.61 గా ఉంది. ► విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.14 కాగా, డీజిల్ రూ. 98.06 గా నమోదైంది. -
జులైలో ముడి చమురు ఉత్పత్తి తగ్గింది
న్యూఢిల్లీ: దేశీయంగా ముడిచమురు ఉత్పత్తి జులైలోనూ క్షీణించింది. గతేడాది(2020) ఇదే నెలతో పోలిస్తే 3.2 శాతం తగ్గి 2.5 మిలియన్ టన్నులకు పరిమితమైంది. ప్రధానంగా ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ లక్ష్యాన్ని అందుకోలేకపోవడం ప్రభావం చూపింది. ఈ ఏడాది(2021–22) తొలి 4 నెలల్లో సైతం దేశీ చమురు ఉత్పత్తి 3.4 శాతం నీరసించి 9.9 మిలియన్ టన్నులకు చేరింది. పెట్రోలియం, సహజవాయు శాఖ విడుదల చేసిన గణాంకాలివి. గత నెలలో ఓఎన్జీసీ 4.2 శాతం తక్కువగా 1.6 మిలియన్ టన్నుల చమురును వెలికి తీసింది. ఇక ఏప్రిల్–జులై మధ్య 4.8 శాతం క్షీణించి 6.4 మిలియన్ టన్నులకు పరిమితమైంది. అయితే నేచురల్ గ్యాస్ ఉత్పత్తి పుంజుకుంది. చదవండి : Flipkart: కిరాణా వర్తకులకు ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్ -
స్వల్పంగా తగ్గిన పెట్రో ధరలు
వాహన దారులకు స్వల్ప ఊరట లభించింది. లీటరు పెట్రోలు, డీజిల్‌పై కేవలం15 పైసలు తగ్గిస్తున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. దీంతో గడచిన 38 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రెండవసారి తగ్గినట్లైంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో పెట్రో ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.101.49 ఉండగా లీటర్ డీజిల్ రూ.88.92గా ఉంది హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.105.63ఉండగా డీజిల్ రూ.97.16గా ఉంది ముంబైలో పెట్రోల్ ధర రూ. 107.52 వద్ద ఉండగా డీజిల్ ధర రూ .96.48గా ఉంది ఇక మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు రూ.110 క్రాస్ చేశాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అమరావతి, తిరువనంతపురంలలో సెంచరీ దాటింది. దీంతో పెట్రోల్ ధర రూ.100 దాటిన నగరాల్లో ఢిల్లీ, కోల్‌కతా, భోపాల్, చెన్నై, జైపూర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, పాట్నా, తిరువనంతపురం, పాట్నా, భువనేశ్వర్ తదితర నగరాలు ఉన్నాయి. -
రండి.. ఆయిల్, గ్యాస్ ఉత్పత్తిపై పెట్టుబడులు పెట్టండి
న్యూఢిల్లీ: భారత్‌లో చమురు, సహజ వాయువు ఉత్పత్తి పెంపుపై పెట్టుబడులు పెట్టాలంటూ దేశ, విదేశీ కంపెనీలను పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్‌పురి ఆహ్వానించారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న ఏ సమస్యను అయినా పరిష్కరించేందుకు స్వేచ్ఛాయుత విధానాన్ని అనుసరిస్తామని చెప్పారు. ఇన్వెస్టర్లతో నిర్వహించిన సంప్రదింపుల కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ పిలుపునిచ్చారు. ‘‘ఈ రంగానికి సంబంధించి తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యల గుర్తింపు విషయంలో, సవాళ్లను అధిగమించే విషయంలో మీతో కలసి ప్రభుత్వం పనిచేస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధిని సాధించే దిశగా నడుస్తోంది. దీంతో ఇంధనానికి డిమాండ్ కూడా పెరగనుంది. దీన్ని చేరుకునేందుకు దేశీయంగా అన్వేషణ, ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో దేశ, విదేశీ కంపెనీలు భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. ప్రపంచంలో ఇంధనంపై పెట్టుబడులకు మంచి అవకాశం ఎక్కడ ఉందా? అని ఎవరైనా ఆలోచిస్తుంటే.. అందుకు భారత్ అనుకూలమైనది’’ అని మంత్రి ప్రకటించారు. గతంతో పోలిస్తే భారత్‌లో వ్యాపార నిర్వహణ సులభతరం అయినట్టు చెప్పారు. మూడో దశలో భాగంగా 32 చమురు, గ్యాస్ బ్లాక్‌లను వేలం వేసినట్టు పేర్కొన్నారు. -
దేశంలో పెట్రో ధరలు పెరగకపోవడానికి కారణం అదేనా?!
దేశంలోని వాహనదారులకు పెట్రోధరలపై ఊరట కలిగింది.గత ఆదివారం నుంచి ఈ రోజు(శనివారం) వరకు చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.పార్లమెంట్ సమావేశాలు, ఒపెక్ (పెట్రోలియం ఉత్పత్తి చేసే దేశాల సమాఖ్య) సమావేశంలో కరోనా ఎఫెక్ట్‌తో తగ్గించిన పెట్రోలు నెల వారి ఉత్పత్తి సామార్థ్యాన్ని తిరిగి రోజుకు 400,000 బారెల్స్ పెంచాలని ఒపెక్ దేశాలు నిర్ణయించాయి. ఈ ప్రకటన తర్వాత ముడి ధరలు బాగా పడిపోయాయి. ఇక శనివారం రోజు పెట్రోల్ ధరల వివరాలు హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ .105. 83 ఉండగా డీజిల్ రూ .97.96గా ఉంది ముంబై లీటర్ పెట్రోల్ ధర రూ .107.83 ఉండగా డీజిల్ ధర రూ .97.45గా ఉంది ఢిల్లీలో పెట్రోల్ ధర రూ .101.84 ఉండగా డీజిల్ ధర రూ .89.87గా ఉంది చెన్నైలో పెట్రోల్ ధర రూ102.49 ఉండగా డీజిల్ రూ .94.39 గా ఉంది కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ .102.08 ఉండగా డీజిల్ రూ .93.02 గా ఉంది బెంగళూరు లో పెట్రోల్ ధర రూ .105.25 ఉండగా డీజిల్ రూ .95.26గా ఉంది -
దేశంలో పెట్రో ధరలు,19 రాష్ట్రాల్లో సెంచరీ కొట్టాయి
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గడంతో వాటి ప్రభావం జాతీయ మార్కెట్లపై పడింది. దీంతో గత ఆదివారం నుంచి ఈ రోజు(శుక్రవారం) వరకు చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత శనివారం లీటర్ పెట్రోల్‌పై 30 పైసలు పెరిగింది. ఇక ఈ నెలలో ఇప్పటి వరకు పెట్రోల్ ధర 9 సార్లు పెరగ్గా.. డీజిల్ ధర 5 సార్లు తగ్గింది. పెట్రోల్ ధర 39 సార్లు, డీజిల్ ధర 36 సార్లు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పెట్రోల్ ధరలు 39 సార్లు పెరిగింది. అదే సమయంలో డీజిల్ రేట్లు 36 సార్లు పెరిగాయి. దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పెట్రో రేట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 19 రాష్ట్రాల్లో సెంచరీ కొట్టాయి దేశంలోని 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పెట్రోల్ ధర లీటరు రూ .100 దాటింది. ఇందులో మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, ఒడిశా, లడఖ్, బీహార్, కేరళ, పంజాబ్, సిక్కిం రాష్ట్రాలు ఉన్నాయి. ఇక శుక్రవారం రోజు పెట్రోల్ ధరల వివరాలు హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ .105. 83 ఉండగా డీజిల్ రూ .97.96గా ఉంది ముంబై లీటర్ పెట్రోల్ ధర రూ .107.83 ఉండగా డీజిల్ ధర రూ .97.45గా ఉంది ఢిల్లీలో పెట్రోల్ ధర రూ .101.84 ఉండగా డీజిల్ ధర రూ .89.87గా ఉంది చెన్నైలో పెట్రోల్ ధర రూ102.49 ఉండగా డీజిల్ రూ .94.39 గా ఉంది కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ .102.08 ఉండగా డీజిల్ రూ .93.02 గా ఉంది బెంగళూరు లో పెట్రోల్ ధర రూ .105.25 ఉండగా డీజిల్ రూ .95.26గా ఉంది -
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఎఫెక్ట్: చమురు ధరలు తగ్గనున్నాయా?!
సాక్షి,న్యూఢిల్లీ : దేశంలో చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మే 3 నుంచి నేటి మధ్య కాలంలో వరుసగా 4 రోజుల పాటు పెట్రో ధరలు పెరగకపోవడం గమనార్హం. అయితే అందుకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగడం ఓ కారణమేనని మార్కెట్ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రోజు పెట్రోల్ ధరల వివరాలు ముంబై లీటర్ పెట్రోల్ ధర రూ .107.83 ఉండగా డీజిల్ ధర రూ .97.45గా ఉంది ఢిల్లీలో పెట్రోల్ ధర రూ .101.84 ఉండగా డీజిల్ ధర రూ .89.87గా ఉంది చెన్నైలో పెట్రోల్ ధర రూ102.49 ఉండగా డీజిల్ రూ .94.39 గా ఉంది కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ .102.08 ఉండగా డీజిల్ రూ .93.02 గా ఉంది హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ .105. 83 ఉండగా డీజిల్ రూ .97.96గా ఉంది బెంగళూరు లో పెట్రోల్ ధర రూ .105.25 ఉండగా డీజిల్ రూ .95.26గా ఉంది మరో వైపు త్వరలో చమురు ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూలై 18 న జరిగిన ఒపెక్ (పెట్రోలియం ఉత్పత్తి చేసే దేశాల సమాఖ్య) సమావేశంలో పెట్రోలు ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించారు.కరోనా ఎఫెక్ట్‌తో తగ్గించిన పెట్రోలు నెల వారి ఉత్పత్తి సామార్థ్యాన్ని తిరిగి రోజుకు 400,000 బారెల్స్ పెంచాలని ఒపెక్ దేశాలు నిర్ణయించాయి. ఈ ప్రకటన తర్వాత ముడి ధరలు బాగా పడిపోయాయి. జులై 16న బ్యారెల్ ధర 73.59 డాలర్లు ఉండగా... జులై 19న ధర 68.62డాలర్లుగా ఉంది. ముడి చమురు ఉత్పత్తి పెరుగుతూ పోతే దేశీయంగా ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్? కేంద్రం క్లారిటీ
సాక్షి న్యూఢిల్లీ: సెంచరీ మార్క్ దాటి వాహనదారులకు చక్కలు చూపిస్తున్న పెట్రోల్ , డీజిల్ ధరలపై మరోసారి నిరాశే ఎదురైంది. పెట్రోల్, డీజిల్‌ను వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావాలనే ప్రతిపాదన ఏదీ ఇంతవరకు రాలేదని ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. దీనికి తోడు పెరుగుతున్న ఇంధన ధరలు, వంట నూనెల ధరలపై లోక్‌సభలో వాడి వేడి చర్చ జరిగింది. ప్రధానంగా పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చర్చ జరిగిందా, దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా ప్రాతినిధ్యాలు వచ్చాయా? వస్తే ఎలాంటి చర్యలు తీసుకున్నారు? దీనిపై రాష్ట్రాలతో ఏదైనా చర్చ జరిగిందా అనే ప్రశ్నలను సభలో సభ్యులు లేవ నెత్తారు. ఈ ప్రశ్నలకు సమాధానంగా, జీఎస్టీ పెట్రోల్, డీజిల్ చేర్చాలంటే కౌన్సిల్ సిఫారసు అవసరమని ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి చెప్పారు. ఇది జీఎస్టీ కౌన్సిల్ పరిధిలోని దనీ, ఆదాయం సహా, సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకుని కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. గతనెల (జూన్,12) జరిగిన 44వ సమావేశంలో పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే ప్రతిపాదన ఏదీ చర్చకు రాలేదన్నారు. ప్రస్తుత 2021-22 ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్ ధరను 39 సార్లు, డీజిల్ ధరను 36 సార్లు పెంచినట్లు స్వయంగా మంత్రి లోకసభలో వెల్లడించారు. ఈ కాలంలో ఒక ఒకసారి పెట్రోల్ ధరను, రెండుస్లారు డీజిల్ ధరను తగ్గించగా, మిగిలిన రోజుల్లో ఎటువంటి మార్పు లేదని తెలిపారు. గత ఏడాది 2020-21లో, పెట్రోల్ ధరను 76 సార్లు పెంచగా,10సార్లు తగ్గించారు, డీజిల్ రేట్లు 73 సార్లు పెరగ్గా, 24 సందర్భాలలో తగ్గించామని తెలిపారు. కాగా రికార్డు స్థాయిలో పెరుగుతున్న ధరలకు కళ్ళెం వేసేందుకు పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. మరోవైపు పెట్రోల్,డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువస్తే, కేంద్ర ప్రభుత్వం దానిని పరిశీలిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. -
పెట్రోలు,డీజిల్‌పై పన్నువసూళ్ల రికార్డు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నింగిని తాకుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఎక్సైజ్ పన్ను వసూళ్లు రికార్డు స్థాయిలో పుంజుకున్నాయి. అంతర్జాతీయ చమురు ధరల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వ పన్ను వసూళ్లు 88 శాతం పెరిగి రూ .3.35 ట్రిలియన్లకు చేరుకున్నాయని పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి రామేశ్వర్ లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. వాస్తవానికి ఇది ఇంకా పెరగాల్సి ఉందని అయితే కరోనా మహమ్మారి, లాక్డౌన్ ఆంక్షల సంక్షోభం కారణంగా విక్రయాలు లేక రాబడి క్షీణించిందన్నారు. అయితే కరోనా మహమ్మారి డిమాండ్ భారీగా పడి పోయినప్పటికీ 2020-21లో (ఏప్రిల్ 2020 నుంచి మార్చి 2021 వరకు) పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వ పన్ను వసూళ్లు 88 శాతం పెరిగి రూ .3.35 ట్రిలియన్లకు చేరుకున్నాయని మంత్రి ప్రకటించారు. గత ఏడాది రూ .1.78 ట్రిలియన్ల నుంచి ఈ మేరకు పెరిగిందని మంత్రి చెప్పారు. కరోనా వైరస్,లాక్డౌన్, రవాణా ఆంక్షలు ఇంధన అమ్మకాలను దెబ్బతీసాయనీ చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్-జూన్నెలల్లో ఎక్సైజ్ వసూళ్లు మొత్తం రూ.11.1 ట్రిలియన్లని ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభలో వెల్లడించారు. ఇందులోపెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా ఏటీఎఫ్, నేచురల్ గ్యాస్ ఎక్సైజ్ సుంకం కలిసి ఉందన్నారు. 2020-2021లో మొత్తం ఎక్సైజ్ ఆదాయం రూ .3.89 ట్రిలియన్లు. కాగా 2018-19లో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ వసూళ్లు రూ.2.13 ట్రిలియన్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం (2020-21) మొదటి 10 నెలల్లో పెట్రోల్, డీజిల్ వసూళ్లు రూ .2.94 లక్షల కోట్లగా ఉంది. పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ .19.8 నుంచి రూ .32.9 కు, డీజిల్‌పై రూ.15.83 నుంచినుంచి రూ. 31.8 మేరక రికార్డు స్థాయికి పెంచిన సంగతి తెలిసిందే. -
భారీగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు.. సామాన్యులకు మోతేనా..!
సౌదీ-యూఎఈ మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొవడంతో యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్, ఆయిల్ ఉత్పత్తి దేశాలు(ఒపెక్) మధ్య సోమవారం జరిగిన చర్చలు విఫలమైనాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్‌ఆయిల్ ధర గణనీయంగా పెరిగింది. 2014 సంవత్సరం తరువాత తిరిగి క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. చమురు ధరలు ఆరేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. బ్రెంట్(అట్లాంటిక్ బేసిన్ క్రూడ్‌ఆయిల్) బ్యారెల్ క్రూడ్ ఆయిల్ 0.8 శాతం పెరిగి 77.78 డాలర్లకు చేరుకుంది. అక్టోబర్ 2018 నుంచి ఈ స్థాయిలో బ్యారెల్ ధరలు పెరగలేదు. ఆయిల్ ఉత్పత్తి దేశాల(ఒపెక్)తో గతవారం ఏర్పడిన విభేదాల తరువాత మూడవరోజు చర్చలు జరిపిన ఎలాంటి ఉపయోగంలేకుండా పోయింది. ఆయిల్ కంపెనీ ఉత్పత్తి దేశాలు తిరిగి సమావేశమయ్యే తేదీలను ప్రకటించలేదు. కొన్ని ఒపెక్ దేశాలు ఈ నెలలో చర్చలను తిరిగి ప్రారంభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాయి. అంతేకాకుంగా డిమాండ్‌కు సరిపడ ముడిచమురును ఆగస్టు నుంచి ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. కాగా ఆయిల్ ఉత్పత్తి దేశాలతో చర్చలు వెంటనే సఫలమైయేలా చూడాలని బైడెన్ సర్కార్ ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాక్ చమురు మంత్రి ఇహ్సాన్ అబ్దుల్ జబ్బర్ సోమవారం మాట్లాడుతూ..తమ దేశం చమురు ధరలు పెరగడం ఇష్టం లేదని తెలిపారు. 10 రోజుల్లోపు కొత్త ఒపెక్ + సమావేశానికి తేదీ నిర్ణయించబడుతుందని తాను ఆశిస్తున్నానని చెప్పారు. భారత్‌పై ప్రభావం..! యుఎఈ, ఇతర ఒపెక్ + దేశాలు ఆగస్టులో ఉత్పత్తిని పెంచడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోకపోతే, ముడి చమురు ధరలనుంచి సామాన్యులకు ఉపశమనం కలిగే అవకాశం తక్కువ ఉండనుంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నిఅంటుతున్నాయి. సుమారు 13 రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది. ఈ ధరలు తిరిగి తగ్గేట్గుగా కనిపించట్లేదు. భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు 2021 ప్రారంభం నుండి పెట్రోల్ ధరను 19.3 శాతం, డీజిల్ ధరను 21 శాతం పెంచాయి.పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గత వారం ఒపెక్ సభ్య దేశాలతో సంభాషణలు జరిపారు. ఈ సమావేశాల తరువాత ముడి చమురు ధరలు నియంత్రణలోకి వస్తాయనిఆశాభావం వ్యక్తం చేశారు. -
Petrol Prices: పెట్రో పరుగు, చెన్నైలో కూడా సెంచరీ
సాక్షి, ముంబై: రెండు రోజులు విరామం తరువాత ఇంధన ధరలు శుక్రవారం మళ్లీ పరుగందుకున్నాయి. పెట్రోల్‌పై 35పైసలు పెరగ్గా, డీజిల్ ధర స్థిరంగా ఉన్నాయి. జూలై నెలలో మొదటి పెరుగుదల. తాజా పెంపుతో ఎనిమిది రాష్ట్ర రాజధానులలో పెట్రోలు ధర సెంచరీ మార్క్‌ను దాటి వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. పెట్రోలు ధర 100 రూపాయలు దాటి నగరాల్లో ఇపుడు చెన్నై చేరింది. చెన్నైలో పెట్రోల్ రూ.100.13 డీజిల్ రూ.93.72 పలుకుతోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, ఒడిశా, లడఖ్, బీహార్, కేరళ, తమిళనాడు 12 రాష్ట్రాలున్నాయి. వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు ఢిల్లీలో పెట్రోల్ రూ. 99.16, డీజిల్ రూ. 89.18 ముంబైలో పెట్రోల్ రూ.105.24; డీజిల్ రూ. 96.72 కోల్‌కతాలో పెట్రోల్ రూ.99.04, డీజిల్ రూ. 92.03 బెంగళూరులో పెట్రోల్ రూ.102.48; డీజిల్ రూ.94.54 హైదరాబాద్‌లో పెట్రోల్ రూ103.05; డీజిల్ రూ.97.20 చదవండి: Stockmarkets: ఆటో జోరు, ఐటీ బేజారు -
ఈ బాదుడేందో.. 48 రోజుల్లో 27వసారి
ఒక్కరోజు గ్యాపిచ్చిన చమురు కంపెనీలు మళ్లీ బాదుడు షురూ చేశాయి. పెట్రోల్ పై 29 పైసలు, డీజిల్ పై 27 పైసలు పెంచి పెంపు దూకుడు ఇలానే కొనసాగుతుందనే సంకేతాలు ఇచ్చాయి. ఇక తాజా ధరల పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.97.22 ఉండగా డీజిల్ రూ.87.97 గా ఉంది. ముంబై లో లీటర్ పెట్రోల్ ధర రూ.103.36గా ఉంటే డీజిల్ ధర రూ. 95.44 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.97.12 ఉండగా డీజిల్ ధర రూ.90.82 ఉంది. ప్రస్తుతం రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలలో లీటర్ పెట్రోల్ రూ.100 అంతకంటే ఎక్కువగానే ఉంది. ఆదివారం తాజా ధరల పెరుగుదలతో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటిన రాష్ట్ర రాజధానుల జాబితాలో పాట్నా చేరబోతోంది. ఇక తొలిసారి పెట్రోల్ ధర రూ.100 దాటిన మొదటి రాష్ట్ర రాజధానుల్లో భోపాల్, ఆ తరువాత జైపూర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరులు ఉన్నాయి. ఈ ఏడాది మే4వ తేదీ నుంచి ఇప్పటివరకూ పెట్రో ధరలు పెంచడం 27వసారి. అంటే 48 రోజుల్లో చమురు ధరలు వరుసగా పెరుగుతూ పోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఆంధ్రప్రదేశ్ లో విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 103.65 ఉండగా డీజిల్ ధర రూ. 97.88గా ఉంది విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 102.89 ఉండగా.. డీజిల్ ధర రూ.97.14గా ఉంది కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.26 ఉండగా.. డీజిల్ ధర రూ.97.52గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 103.65 ఉండగా.. డీజిల్ రూ.97.88గా ఉంది. తెలంగాణలో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.04 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.89గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.26 ఉండగా.. డీజిల్ ధర రూ.96.10 గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.58 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 95.46గా ఉంది. -
మూడు లీటర్ల పెట్రోలు, డీజిల్ ఫ్రీ: డీలర్లు గగ్గోలు
తిరువనంతపురం: దేశంలో రికార్డు స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. అంతకంతకూ పెరుగుతున్న ఇంధన ధరలు అటు వాహనదారులకు, ఇటు రవాణా సంస్థలకు, ఆటో డ్రైవర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ తరుణంలో ఆటోడ్రైవర్లకు బంపర్ ఆఫర్ లభించింది. కేరళలోని ఓ పెట్రోల్ స్టేషన్ వద్ద మూడు లీటర్ల పెట్రోలును ఉచితంగా అందించడం విశేషంగా నిలిచింది. కర్ణాటక-కేరళ సరిహద్దులోని ఎన్మకాజే గ్రామ పంచాయతీలోని పెర్లాలోని ఫ్యూయల్ స్టేషన్ యజమాని ఆటోవాలాలకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. 311 మందికి మూడు లీటర్ల చొప్పున పెట్రోల్, డీజిల్‌ను ఉచితంగా అందజేశారు. ఈ విషయాన్ని పెట్రోలు పంపు యజమాని అబ్దుల్లా మధుమోల్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. తన గ్రామంలో కేవలం 100ఆటోలు మాత్రమే ఉన్నాయని ఆయన తెలిపారు. అయినప్పటికీ, చాలా దూర ప్రాంతాలనుంచి వచ్చి తమ ఉచిత ఆఫర్‌ను వినియోగించుకున్నారన్నారు. అంతేకాదు ఆ ఉచిత ఆఫర్‌ను నిలిపివేయాల్సిందిగా ఇతర డీలర్లు తనపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. అయితే అందరూ ఈ విధంగా ఎంతో కొంత సాయం చేయాలని వారికి చెప్పారని, వారి బెదిరింపులు తన సాయాన్ని అడ్డుకోలేవని వెల్లడించారు. రెండు రోజులపాటు, లక్ష రూపాయల విలువైన ఇంధనాన్ని అందించినట్టు మధుమోల్ వివరించారు. కరోనా సంక్షోభం, లాక్డౌన్ వేళ ఇబ్బందుల్లో ఉన్న ఆటోడ్రైవర్లను ఆదుకోవాలనే ఉద్దేశం తప్ప బిజినెస్ ప్రమోషన్ కోసం కాదని ఆయన స్పష్టం చేయడం విశేషం. మరోవైపు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకునేందుకు ఆటో డ్రైవర్లు క్యూ కట్టారు. ఈ ఆఫర్‌పై వారంతా హర్షం వ్యక్తం చేశారు. తమ జీవితంలో ఇలాంటి ఆపర్ ఎపుడూ చూడలేదంటూ మురిసిపోయారు. Shocking ! Pressure from dealers' association to stop my charity work, their claim is it affects other pumps. My counter attack - let all pumps do small charities, you can't stop me. https://t.co/dNzLLqpixb — ABDULLA MADUMOOLE ಅಬ್ದುಲ್ಲ ಮಾದುಮೂಲೆ (@AMadumool) June 14, 2021 -
Petrol diesel prices: పెట్రో రికార్డు పరుగు
సాక్షి, ముంబై: ఇంధన ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. ఇప్పటికే పలు నగరాల్లో పెట్రోల్,డీజిల్ ధరలు సెంచరీ మార్క్ దాటేశాయి. తాజాగా మరోసారి రికార్డు స్థాయికి చేరిన పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒక రోజు విరామం తరువాత, జూన్ 14 న పెట్రోల్ 29 పైసలు, డీజిల్‌పై 31 పైసలు పెంచుతూ కంపెనీలు నిర్ణయించాయి. తాజా పెంపుతో దేశవ్యాప్తంగా రికార్డ్‌స్థాయికి చేరాయి.ముంబైలో పెట్రోల్ ఆల్ టైం గరిష్ట స్థాయి 102.58 రూపాయలను తాకింది. అటు హైదరాబాద్‌లో కూడా లీటర్ పెట్రోల్ సెంచరీ దాటేసింది. పెట్రోల్ రూ.100.20వద్ద, డీజిల్ రూ.95.14గా ఉంది. దేశంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, లడఖ్ సహా ఏడు రాష్ట్రాల్లో పెట్రోల్ లీటరు మార్కుకు రూ .100 పైన ఉంది. మే 4 నుంచి ఇప్పటివరకు ఇంధన ధరలు పెరగడం 25వసారి. దేశంలోని పలున గరాల్లో పెట్రోలు,డీజిలు ధరలు, లీటరుకు ఢిల్లీలో పెట్రోల్ ధర 96.41, , డీజిల్ రూ .87.28 కోలకతాలో పెట్రోలు ధర 96.34,, డీజిల్ రూ. 90.12 బెంగళూరులో పెట్రోలు ధర 99.63, డీజిల్ రూ. 92.52 ముంబైలో పెట్రోలు ధర 102.58, డీజిల్ రూ. 94.70 హైదరాబాద్‌లో పెట్రోలు ధర 100.20 , డీజిల్ రూ. 95.14 అమరావతిలో పెట్రోలు ధర 102.31, డీజిల్ రూ. 96.92 చదవండి: ఎన్ఎస్డీఎల్: అదానీకి భారీ షాక్ -
Petrol Price: రూ.102 దాటేసింది!
సాక్షి, న్యూఢిల్లీ: ఒక రోజుగా గ్యాప్ తరువాత వరుసగా శుక్రవారం, నేడు(శనివారం) రెండు రోజూ ఇంధన ధరలు ఊపందుకున్నాయి. దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో ఇప్పటికే పెట్రో ధర రూ.100 మార్క్‌ను దాటేసింది. తాజాగా పెట్రోల్‌పై లీటర్‌కు 28 పైసలు, డీజిల్‌పై 27 పైసలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయించాయి. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధర రికార్డు స్థాయికి చేరుకుంది . ఈ పెంపుతో వాణిజ్య రాజధాని ముంబైలో లీటరు పెట్రోలు ధర 102 మార్క్‌ను దాటగా, విజయవాడలో సుమారు 102 రూపాయలుగా ఉంది. ఇక దేశ రాజధాని నగరంలో పెట్రోల్ రూ.96.12, డీజిల్ రూ.86.98 గా ఉంది. ఈ నెలలో 12 రోజుల కాలంలో ఇప్పటివరకు ఏడు సార్లు ఇంధన ధరలు పెరిగాయి. మే 4వ తేదీ నుంచి నేటి వరకు 24 సార్లు చమురు ధరలు పెరిగాయి. తొలిసారి 100 దాటిన డీజిల్ ధర: దేశంలో తొలిసారిగా డీజిల్ ధర100 రూపాయలు దాటింది, రాజస్థాన్‌లో లీటరు డీజిల్ ధర ఇపుడు రూ. 100.05 వద్ద అమ్ముడవుతోంది. ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు ఢిల్లీలో పెట్రోల్ రూ.96.12, డీజిల్ రూ.86.98 ముంబైలో పెట్రోల్ రూ.102.30, డీజిల్ రూ.94.39 చెన్నైలో పెట్రోల్ రూ.97.43, డీజిల్ రూ. 91.64 కోల్‌కతాలో రూ.96.06 డీజిల్ రూ.89.83 హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.99.90, డీజిల్ రూ.94.82 విజయవాడలో పెట్రోల్ రూ.101.88, డీజిల్ రూ.96.23 వైజాగ్‌లో పెట్రోల్ రూ.101.05, డీజిల్ రూ.95.41 చదవండి: Weekend love: ఈ వీడియోలను చివరిదాకా చూస్తే.. H1-B, వీసాల తిరస్కరణ: భారీ ఊరట -
Petrol, diesel prices: పెట్రో బాంబు, రికార్డు ధర
సాక్షి, ముంబై: పెరుగుతున్న ఇంధన ధరలకు అదుపులేకుండా పోతోంది. మంగళవారం స్థిరంగా ఉన్న ధరలు బుధవారం మరో రికార్డు స్థాయికి చేరాయి. పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతూ , ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయించాయి. బుధవారం (జూన్ 9)పెట్రోలు ధరను లీటరుకు 23-25 పైసలు, డీజిల్‌పై 23-27 పైసలు మేర పెంచాయి. మే 4 నుంచి 22 వ పెంపు. ఈ నెలలో ఇప్పటి వరకు పెట్రోల్ రిటైల్ ధర లీటరుకు సుమారు 1.07 రూపాయలు పెరిగింది. తాజాగా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ .95.56 (25 పైసల పెరుగుదల) డీజిల్ ధర లీటరుకు రూ .86.47 స్థాయికి చేరింది. ముంబైలో పెట్రోలు లీటరుకు 102 (రూ.101.76) రూపాయల వద్ద అత్యధిక స్థాయిని తాకింది. అలాగే దేశంలో రాజస్థాన్, శ్రీగంగానగర్‌లో పెట్రోలు రూ.106.64 వద్ద, డీజిల్ రూ.99.50వద్ద గరిష్ట ధరను నమోదు చేయడం గమనార్హం. దేశంలోని నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు ముంబైలో పెట్రోలు ధర రూ.101.76 డీజిల్ రూ. 93.85 చెన్నైలో పెట్రోలు ధర రూ.96.94, డీజిల్ రూ. 91.15 బెంగళూరులో పెట్రోలు ధర రూ.99.75, డీజిల్ రూ. 91.67 కోలకతా పెట్రోలు ధర రూ. 95.52, డీజల్ రూ. 89.32 హైదరాబాదులో పెట్రోలు ధర రూ.99.31, డీజిల్ రూ. 94.26 అమరావతిలో పెట్రోలు ధర రూ101.73, డీజిల్ రూ. 96.08 విశాఖపట్టణంలో పెట్రోలు ధర రూ100.49, డీజిల్ రూ. 94.88 చదవండి: బ్యాంకుల జోరు, నిఫ్టీ ఆల్‌టైం హై బాబోయ్ పెట్రోల్.. భవిష్యత్తు హైపర్ ఛార్జర్లదే -
పెట్రో భారం : త్వరలోనే శుభవార్త?!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అప్రతిహతంగా పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలపై వినియోగదారులకు త్వరలోనే ఊరట లభించనుందా? తాజా అంచనాలు ఈ ఆశాలనే రేకెత్తిస్తున్నాయి. పెట్రోలు ధరలు రికార్డు స్థాయిలను తాకడంతో వాహనాలను తీయాలంటేనే భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అటు ప్రతిపక్షాలు, ఇటు ప్రజలు కేంద్రం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే పెట్రో ధరలపై బీజేపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకునుందనే అంచనాలు భారీగా వ్యాపించాయి. ఈ మేరకు చమురుపై ఉన్న పన్నులు తగ్గించి సామాన్యులపై పడుతున్న భారాన్ని తప్పించాలని యోచిస్తోందట. (పెట్రోలుకు తోడు మరో షాక్ ) పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను తగ్గించేందుకు ఆర్థిక మంత్రిత్వశాఖ భారీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. వినియోగదారులపై పన్ను భారాన్ని తగ్గించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాన్ని కనుగొనటానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు, చమురు కంపెనీలు, చమురు మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు ప్రారంభించింది. ధరలను స్థిరంగా ఉంచగల మార్గాలను అన్వేషిస్తున్నామనీ, మార్చి మధ్య నాటికి సమస్యను ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం చమురు రిటైల్ ధరలో పన్నుల వాటానే దాదాపు 60 శాతం దాకా ఉంది. ఈ నేపథ్యంలోనే చమురుపై ఉన్న పన్నులను తగ్గించేందుకు వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు, చమురు సంస్థలు, పెట్రోలియం శాఖతో ఆర్థిక శాఖ సంప్రదింపులు చేస్తోంది. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేృత్వంలోని బీజేపీ సర్కార్ గత 12 నెలల్లో రెండుసార్లు పెట్రోల్, డీజిల్ పై పన్నులను పెంచింది. తాజాగా వినియోగదారులపై భారాన్ని తగ్గించేందుకు కసరత్తు చేస్తో్ంది. అంతేకాదు ముడి చమురు ధరలు పెరిగినా.. రోజువారీగా ధరలను సమీక్షించే పద్ధతిని ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల వ్యాఖ్యలు ఈ అంచనాలకు బలాన్నిస్తున్నాయి. ఇంధనంపై పన్నును ఎప్పుడు తగ్గిస్తామో చెప్పలేను, కానీ, పన్ను భారంపై కేంద్ర, రాష్ట్రాలు చర్చించాలి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. చదవండి: ప్యాసింజర్‌కు అస్వస్థత, కరాచీకి ఎమర్జెన్సీ మళ్లింపు టాటా మోటార్స్‌కు భారీ షాక్ -
పెట్రోలుకు తోడు మరో షాక్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో సామాన్యుడి బతుకు మరింత భారం కానుంది. ఇప్పటికే డీజిల్,పెట్రోలు ధరలు ఆకాశాన్నంటాయి. అటువంట గ్యాస్ సిలిండర్ ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) గృహావసరాల కోసం వినియోగించే పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) ధరలను కూడా ఐజీఎల్ (గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ) భారీగా పెంచేసింది. వంటగ్యాస్ సిలిండర్ల ధరను పెంచిన 24 గంటల్లోనే సీఎన్జీ, పీఎన్జీ ధరలను సవరిస్తూ ఐజీఎల్ నిర్ణయం తీసుకుంది. మంగళవారం తెల్లవారు జామున 6 గంటల నుంచి సవరించిన రేట్లుఅమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది. (మళ్లీ రాజుకున్న పెట్రో సెగ) సీఎన్జీ ధరను 70 పైసల మేర, 91 పైసల మేర పీఎన్జీ రేట్లను పెంచినట్లు ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ప్రకటించింది. కొత్తగా సవరించిన రేట్ల ప్రకారంఢిల్లీలో సీఎన్జీ రేటు 43.40కి పెరిగింది. పీఎన్జీ ధర 28.41కు చేరింది. ప్రస్తుతానికి దేశ రాజధాని సహా నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలో నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్, కాన్పూర్, ఫతేపూర్, హమీర్పూర్, ముజ్జఫర్ నగర్, షామ్లీ, కర్నాల్, కైతాల్, రేవారిలో ఈ ధరల పెంపు అమల్లోకి వస్తుందని ఐజీఎల్ ప్రకటనలో తెలిపింది. అయితే దశలవారీగా అన్ని నగరాల్లోనూ పెంచిన రేట్లు అమలు చేయనున్నాయి. (పెట్రో సెగలపై ఆర్బీఐ సంచలన వ్యాఖ్యలు) -
మరో పిడుగు : భారీగా పెరగనున్న పాల ధర
సాక్షి, భోపాల్ : ఒకవైపు ఆకాశాన్నంటుతున్న పెట్రోలు ధరలు, మరోవైపు వంటగ్యాస్ ధర పెంపు సగటు భారతీయుడి నెత్తిన పెనుభారాన్నిమోపుతున్నాయి. పెట్రో ధరల సెగ నిత్యావసరాలు, రవాణా, ఇతర రంగాలపై పడుతుందన్న ఆందోళన నేపథ్యంలో మరో బాంబు ప్రజల నెత్తిన పడనుంది. ఇప్పటికే భారీ పెరిగిన ఉల్లి ధర సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది.. తాజాగా పాల ధర కూడా భగ్గుమనేందుకు సిద్ధంగా ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాట్లం సిటీలో పాల ధరల పెరగనున్న నేపథ్యంలో దేశంలో కూడా ధర భారీగా పెరగనుందన్న ఆందోళన వినియోగదారులను మరింత బెంబేలెత్తిస్తోంది. (పెట్రో సెగలపై ఆర్బీఐ సంచలన వ్యాఖ్యలు) డీఎన్ఏ సమాచారం ప్రకారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాట్లం సిటీలో పాల ధరలు భారీగా పెరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలోని 25 గ్రామాలకు చెందిన కూరగాయలు, పాల ఉత్పత్తిదారు సంఘాలు నిర్ణయించాయి. ఈ నెల 23న నిర్వహించిన సమావేశంలో లీటరుపై రూ.12 పెంచేందుకు నిర్ణయించారు. సంబంధిత అధికారుల అనుమతి అనంతరం మార్చి 1 నుంచి ధర పెంపును అమలు చేయనున్నారు. ఈ ధర అమల్లోకి వస్తే, లీటరు పాల ధర రూ .55 పలకనుంది. అంటే ప్రస్తుత లీటర్ పాల ధర రూ.43పై అదనంగా మరో రూ.12 చెల్లించాల్సి ఉంటుందన్న మాట. గత ఏడాదిలోనే పాల ధరల పెంపుపై ఉత్పత్తిదారులు డిమాండ్ చేశారు. కానీ, కరోనా వైరస్ సంక్షోభం కారణంగా వాయిదా పడింది. మహమ్మారి కారణంగా పాల ధరల పెంపు వాయిదా పడిందని ఇపుడిక పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో పాల ధరలను కూడా పెంచాలనే నిర్ణయానికి వచ్చినట్టు స్థానిక పాల ఉత్పత్తిదారుల అసోసియేషన్ అధ్యక్షుడు హిరలాల్ చౌదరి వెల్లడించారు. -
మళ్లీ రాజుకున్న పెట్రో సెగ
సాక్షి,ముంబై: దేశవ్యాప్తంగా ఇంధన ధరల మంటలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల విరామం తరువాత మంగళవారం పెట్రోల్, డీజిల్ మళ్లీ పరుగందుకున్నాయి. పెట్రోలుపై 25 పైసలు, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెరిగింది. దీంతో ఈ నెలలో ఇప్పటివరకు పెట్రోల్ ధరలు 15 సార్లు పెరిగి రికార్డు స్థాయిల వద్ద వాహనదారులను బెంబే లెత్తిస్తున్నాయి. ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థల తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటరుకు రూ.90.83, డీజిల్ ధర రూ. 81.32 కు చేరింది. ముంబైలో పెట్రోల్ లీటర్‌కు రూ.97.34కు చేరగా, డీజిల్ రూ.88.44 వద్ద ఉంది పలునగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు చెన్నైలో పెట్రోల్ రూ.92.90, డీజిల్ రూ.86.31 కోల్‌కతాలో పెట్రోల్ రూ.91.12, డీజిల్ రూ.84.20 హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.94.54, డీజిల్ రూ.88.69 అమరావతిలో పెట్రోల్ రూ.97.08, డీజిల్ రూ.90.69 కాగా వినియోగదారుల నడ్డి విరుస్తున్న పెట్రో మంటపై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనకు దిగాయి. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. శివసేన కూడా పెరుగుతున్న పెట్రో ధరలపై కేంద్రంపై విమర్శలు గుప్పించింది. మరోవైపు పశ్చిమ బెంగాల్, అసోం, రాజస్థాన్, మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధన ధరలపై పన్ను తగ్గింపును ప్రకటించిన సంగతి తెలిసిందే. -
పెట్రో సెగ : కేంద్ర ఆర్థికమంత్రిపై హీరో సెటైర్
సాక్షి,ముంబై: వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న పెట్రో ధరలపై దేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైతోంది. ఈ నేపథ్యంలో హీరో సిద్ధార్థ విమర్శలు గుప్పించారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌పై సోషల్ మీడియాలో తన దాడిని ఎక్కుపెట్టారు. ‘మామి తరువాతి స్థాయికి చేరుకున్నారు. ‘ఉల్లిపాయలు లేవు, మెమరీ లేదు, ప్రిన్సిపల్స్ లేవు.. మామి రాక్స్’ అంటూ ట్వీట్ చేశారు. అయితే పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతున్న నేపథ్యంలో పెట్రోలును జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే.. ధరలు దిగొచ్చే అవకాశం ఉందని నిర్మలా గతవారం వ్యాఖ్యానించారు. ధరల అదుపునకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక యంత్రాంగాన్ని రూపొందించాల్సి ఉంటుందన్నారు. మరోవైపు హద్దే లేకుండా పెరుగుతున్నపెట్రోలు, డీజిల్ ధరలపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఇప్పటికే మీమ్స్, వ్యంగ్యోక్తులతో బీజేపీ సర్కార్‌పై నెటిజన్లు విరుచుక పడుతున్నారు. పెట్రోలు ధరలను భారీగా పెంచుతూ సామాన్యులపై భారం మోపుతున్నారంటూ 2013లో కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడిన నిర్మలా సీతారామన్, తాజా పెంపుపై మాత్రం ఆర్థికమంత్రిగా విభిన్నంగా స్పందించారు. దీనికి ఆయిల్ కంపెనీలే బాధ్యత వహించాలని, ఇంధన ధరల నియంత్రణ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండదని పేర్కొనడం గమనార్హం. ఈ వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. మరోవైపు ఫిబ్రవరి మాసంలో రికార్డు స్తాయిలో పుంజుకున్న పెట్రోలు, డీజిల్ గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్నాయి. Maami is next level flexible in her belief system. No onions, no memory, no principles. Maami rocks! https://t.co/4WZ791m1HV — Siddharth (@Actor_Siddharth) February 22, 2021 -
ఒక రూపాయికే పెట్రోలు.. ఎక్కడ?
సాక్షి, న్యూఢిల్లీ: రికార్డు స్థాయికి చేరిన పెట్రోలు ధరలు వాహనదారులను వణికిస్తున్నాయి. ఇటీవలికాలంగా వరుసగా పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు దేశవ్యాప్తంగా సెగలు రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100దాటేసింది. ఫిబ్రవరి నెలలోనే అత్యధికంగా 13 సార్లు ధరలు పెరిగాయంటేనే ధరల మంట తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. దీంతో పెట్రో ధరలపై ఇటీవల బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి షేర్ చేసిన ఒక పోస్ట్ వైరల్‌గా మారింది. తాజాగా మరో వార్త ఆసక్తికరంగా మారింది. ఒకపక్క పొరుగు దేశాలతో పోలిస్తే దేశీయంగా పెట్రో ధరలు మండిపోతున్నాయి. మరోపక్క దక్షిణ అమెరికా దేశాల్లో ఒకటైన వెనిజులాలో లీటరు పెట్రోల్ ధర కేవలం రూపాయి మాత్రమే. ప్రపంచంలో వెనకబడిన దేశమైన వెనిజులాలో లీటర్ పెట్రోల్ ధర 0.020 డాలర్లు. అంటే మన కరెన్సీలో రూ.1.45గా ఉండటం విశేషంగా నిలిచింది. అత్యంత చౌకగా పెట్రోలు విక్రయించే మొదటి పది దేశాల్లో ఐదు ఆసియాలో, నాలుగు ఆఫ్రికాలో, దక్షిణ అమెరికాలో ఒకటి ఉన్నాయి. మరోవైపు 2.40 డాలర్ల వద్ద హాంకాంగ్‌లో పెట్రోలు అత్యంత ఎక్కువ రేటు పలుకుతోంది. తరువాత స్థానాల్లో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ , నెదర్లాండ్స్ ఉన్నాయి. (బాబోయ్ పెట్రోలు : 11వ రోజూ వాత) పొరుగు దేశాలలో పెట్రోల్ ధర భారత్‌తో పోలిస్తే, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ , భూటాన్ దేశాల్లో పెట్రోల్ తక్కువ రేటుకేఅందుబాటులోఉంది. ముఖ్యంగా భూటాన్‌లో పెట్రోలు ధర బాగా చౌక. భారత కరెన్సీ ప్రకారం, పాకిస్తాన్లో పెట్రోల్ ధర లీటరుకు 51.14 రూపాయలు. భూటాన్‌లో పెట్రోల్ లీటరుకు రూ .49.56 వద్ద లభిస్తుంది. శ్రీలంకలో పెట్రోల్ ధర రూ .60.26. బంగ్లాదేశ్‌లో రూ. 76.41 రూపాయలు, నేపాల్‌లో 68.98 రూపాయలు వద్ద ఉంది. ఇరాన్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.4.50 ఉండగా, అంగోలాలో రూ.17.78 ఉంది. అల్జీరియాలో రూ.25.10 ఉండగా, కువైట్ లో రూ.25.18 ఉన్నది. సూడాన్ లో రూ.27.50, నైజీరియాలో రూ.31.65 గా ఉన్నది. మనదేశంలో ఒక్క ఫిబ్రవరిలో ఇప్పటివరకు పెట్రోల్ రూ .3.24, డీజిల్ రూ .3.47 పెరిగింది. మొత్తంమీద ఏడాది కాలంలో పెట్రోల్ ధర లీటరుకు రూ .17 పెరగడం గమనార్హం. -
బాబోయ్ పెట్రోలు : 11వ రోజూ వాత
సాక్షి, న్యూఢిల్లీ: వరుసగా 11వ రోజు కూడా ఇంధన ధరలను పెంచుతూ చమురు సమస్థలు నిర్ణయించాయి. శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు పెట్రోల్‌పై 31 పైసలు పెంచగా, డీజిల్ 33 పైసలు చొప్పున పెరిగింది. దీంతో దేశంలోని అన్ని మెట్రో నగరాల్లోరికార్డు స్థాయిల వద్ద పెట్రో ధరలు మండిపోతున్నాయి. దేశ రాజధానిలో పెట్రోల్ ధర లీటరుకు 90.19 కు చేరుకుంది. డీజిల్ రేటు లీటరుకు. 80.60 పలుకుతోంది. రూ. 100 దాటిన రాష్ట్రాలు మరోవైపు ఇప్పటికే రాజస్థాన్‌లో పెట్రోల్‌కు లీటరుకు రూ.100 స్థాయిని దాటేసింది. కాగా గురువారం మధ్యప్రదేశ్‌లో కూడా పెట్రోల్ ధర లీటరుకు సెంచరీ మార్క్‌ను అధిగమించింది. మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.100.25 దాటి పరుగులు తీయడం గమనార్హం. నేడు (శుక్రవారం) ఇక్కడ పెట్రోలు ధర రూ.100.57 వద్ద, డీజిల్ 91.04 వద్ద కొనసాగుతున్నాయి. పలు నగరాల్లో పెట్రోల్,డీజిల్ ధరలు లీటరుకు ముంబైలో పెట్రోల్ రూ. 96.32 కు, డీజిల్ రూ. 87.32 చెన్నై పెట్రోల్ రూ. 92.25, డీజిల్ రూ. 85.63 బెంగళూరు పెట్రోల్ రూ. 93.21, డీజిల్ రూ. 85.44 హైదరాబాద్ పెట్రోల్ రూ. 93.78, డీజిల్ రూ. 87.91 అమరావతి పెట్రోల్ రూ. 96.34, డీజిల్ రూ. 89.94 -
పెట్రో వాత : త్వరలో 150 రూపాయలకు?
సాక్షి, న్యూఢిల్లీ: ఇంధన ధరల సెగ కొనసాగుతోంది. వరుసగా పదవ రోజు కూడా పెరిగిన ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరల భారంపై వారి గుండెలు బేజారవుతున్నాయి. తాజాగా పెట్రోలుపై 35 పైసలు, డీజిల్‌పై 32-34 పైసల చొప్పున భారం పెరిగింది. దీంతో దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో రికార్డు స్థాయిలో ధరలు కొనసాగుతున్నాయి. రోజుకు 30 పైసల చొప్పున పెట్రోలు ధర పెరుగుతూ పోతే, మరో ఆరు నెలల్లో లీటరుకు 150 రూపాయలకు చేరే అవకాశం ఉందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో పెట్రో బాదుడు సెంచరీ దాటేసిన సంగతి తెలిసిందే. మరోవైపు హద్దే లేకుండా పెరుగుతున్న ధరలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. (పెట్రో బాదుడు : రూ.100 దాటేసింది) దేశం రాజధాని నగరం ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.89.88కు చేరగా, డీజిల్ ధర రూ. 80.27గా ఉంది. వాణిజ్య రాజధాని ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 96.32 వద్ద రికార్డు స్థాయికి చేరింది. డీజిల్ ధర రూ. 87.32 గా ఉంది. పలు నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు హైదరాబాద్ పెట్రోల్ ధర రూ.93.45 డీజిల్ ధర రూ.87.55 అమరావతి పెట్రోలు ధర రూ. 96.03, డీజిల్ ధర రూ. 89.60 కొలకత్తాలో పెట్రోల్ ధర రూ. 91.11, డీజిల్ ధర రూ.83.86 చెన్నైలో పెట్రోల్ ధర రూ. 91.98, డీజిల్ ధర రూ.85.31 బెంగుళూరులో పెట్రోల్ ధర రూ. 92.89, డీజిల్ ధర రూ. 85.09 -
పెట్రో బాదుడు : రూ.100 దాటేసింది
సాక్షి, జైపూర్: దేశవ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు వాహన దారులను బెంబేలెత్తిస్తున్నాయి. వరుస పెంపుతో రికార్డు స్థాయిలనుచేరుతున్నాయి. ఇప్పటికే జైపూర్‌లో పెట్రోలు ధర రూ.100 మార్క్‌ను టచ్ చేసింది. తాజాగా 100 రూపాయలను అధిగమించి వినియోగదారుల గుండెల్లో బాంబు పేల్చింది. వరుసగా 9వ పెంపు నేపథ్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గణాంకాల ప్రకారం రాజస్థాన్‌లోని గంగానగర్ జిల్లాలో పెట్రోల్ ధర బుధవారం (ఫిబ్రవరి 17) రూ .100.13 పలుకుతోంది. డీజిల్ ధర లీటరుకు 92.13 రూపాయలుగా ఉంది. పెట్రోలు ధరకు సంబంధించి దేశవ్యాప్తంగా ఇదే అత్యధిక ధర. (భగ్గుమంటున్న పెట్రోలు, డీజిల్ ధర) -
భగ్గుమంటున్న పెట్రోలు, డీజిల్ ధర
సాక్షి, ముంబై : పెట్రోలు, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా తొమ్మిదవ రోజు ఈ రోజు (బుధవారం, ఫిబ్రవరి 17) కూడా ఇంధన ధరలు పరుగందుకున్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు మరో 25 పైసల మేర ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయించాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతూ వాహనదారుల గుండెల్లో బాంబులు పేల్చుతున్నాయి . దీంతో వాహనాలను బయటకు తీయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. దేశంలోని వివిధ నగరాలలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు హైదరాబాద్ పెట్రోల్ ధర రూ.93.10 డీజిల్ ధర రూ.87.20 అమరావతి పెట్రోలు ధర రూ. 95.69 డీజిల్ ధర రూ. 98.52 ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 89.54, డీజిల్ ధర రూ. 79.95 కొలకత్తాలో పెట్రోల్ ధర రూ. 90.78, డీజిల్ ధర రూ.83.54 ముంబైలో పెట్రోల్ ధర రూ. 96.00, డీజిల్ ధర రూ. 86.98 చెన్నైలో పెట్రోల్ ధర రూ. 91.68, డీజిల్ ధర రూ.85.01 బెంగుళూరులో పెట్రోల్ ధర రూ. 92.54, డీజిల్ ధర రూ. 84.75 -
ఏడో రోజూ పెట్రో మంట
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రో ధర మంటలు వినియోగదారులను వణికిస్తున్నాయి. వరుసగా ఏడో రోజు కూడా ధరలను ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయించాయి. దీంతో సోమవారం (ఫిబ్రవరి 15) దేశ వ్యాప్తంగా వరుసగా ఏడవ రోజు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. పెట్రోల్ ధర 23-26 పైసలు, డీజిల్‌పై 28 నుంచి 30 పైసల మేర ధరలు పెరిగాయి. తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.88.73కు పెరగ్గా డీజిల్ లీటరుకు రూ .79.35 (29 పైసల పెరుగుదల)కు చేరుకుంది. గత ఏడు రోజుల్లో, పెట్రోల్ ధర లీటరుకు 2.06 రూపాయలు పెరగగా, డీజిల్ రేటు లీటరుకు 2.56 రూపాయలు పెరిగింది. పలు నగరాల్లో పెట్రోలు ,డీజిల్ ధరలు లీటరుకు ముంబై పెట్రోల్ రూ .95.46, డీజిల్ రూ .86.34 కోల్‌కతాలో పెట్రోల్ రూ. 90.25, డీజిల్ రూ .82.94 చెన్నైలో పెట్రోల్ రూ. 91.19, డీజిల్ రూ .84.44 హైదరాబాద్‌లో పెట్రోల్ రూ. 92.53, డీజిల్ రూ.86.55 అమరావతిలో పెట్రోల్ రూ. 95.13, డీజిల్ రూ. 88.63 -
వరుసగా అయిదో రోజూ పెట్రో బాదుడు
న్యూఢిల్లీ: దేశంలో వరుసగా అయిదో రోజూ పెట్రోల్ ధరలు పెరిగాయి. శనివారం పెట్రోల్ ధర లీటరుకు 30 పైసలు, డీజిల్ ధర 36 పైసలు పెరిగింది. దీంతో ముంబైలో పెట్రోల్ ధర రూ. 94.93కి చేరువకాగా, డీజిల్ ధర రూ. 85.70కి చేరుకుంది. ఢిల్లీలో పెట్రోల్ ధర జీవితకాల గరిష్టానికి రూ. 88.414కి చేరుకోగా, డీజిల్ ధర రూ. 78.74కు చేరకుంది. ఈ 5 రోజుల్లో పెట్రోల్ ధర రూ. 1.51 పెరగ్గా, డీజిల్ ధర రూ. 1.56 పెరిగింది. మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఆయిల్ రేట్లను తగ్గించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని కోరగా, తగ్గించబోయేది లేదని ఆయిల్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంటు వేదికగా చెప్పిన సంగతి తెలిసిందే. -
ఐదో రోజూ ఆగని సెగ : పెట్రో ధరలు ఆల్‌టైం హై
సాక్షి, ముంబై: పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు వరుసగా ఐదో రోజు కొనసాగుతోంది. వినియోగదారుల గుండెలు గుభిల్లుమనేలా ఇంధన ధరలు ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. గత మంగళవారం నుంచి పరుగు తీస్తున్న ధరలు శనివారం కూడా అదే రేంజ్లో పెరిగాయి. వివిధ నగరాల్లో 30 నుంచి 51 పైసలు, డీజిల్‌పై 36 పైసల నుంచి 60 పైసల మేర పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయించాయి. దీంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. (Petrol Diesel Prices : వాహనదారులకు చుక్కలే!) ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు ఢిల్లీలో పెట్రోల్ రూ.88.44, డీజిల్ రూ.78.74 ముంబైలో పెట్రోల్ రూ.94.93, డీజిల్ రూ.85.70 కోల్‌కతాలో పెట్రోల్రూ.89.73, డీజిల్రూ. 82.33 చెన్నైలో పెట్రోల్ రూ.90.70, డీజిల్ రూ.83.86 బెంగళూరులో పెట్రోల్ రూ.91.40, డీజిల్ రూ.83.47 హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.91.96, డీజిల్ రూ. రూ.85.89 అమరావతిలో పెట్రోల్ ధర రూ.94.58 డీజిల్ రూ.87.99 మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 2.49 శాతం పెరుగుదలతో 62.66 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 2.54 శాతం పెరుగుదలతో 59.72 డాలర్లు చేరుకుంది. (పెట్రోలుపై రూ. 5 తగ్గించిన బీజేపీ సర్కార్)