పెట్రో వడ్డింపు : ఎంత పెరిగిందంటే | Petrol diesel price hiked for 5th day today | Sakshi
Sakshi News home page

పెట్రో వడ్డింపు : ఎంత పెరిగిందంటే

Published Thu, Jun 11 2020 9:16 AM | Last Updated on Thu, Jun 11 2020 9:36 AM

Petrol diesel price hiked for 5th day today - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఇంధన ధరలు గురువారం కూడా పెరిగాయి. వరుసగా ఐదవ రోజు కూడా పెట్రోల్ డీజిల్ ధరలను ప్రభుత్వ చమురు కంపెనీలు పెంచాయి.  పెట్రోల్ , డీజిల్ రెండింటిపైనా లీటరుకు 60 పైసలు చొప్పున వడ్డించాయి.  దీంతో గత ఐదు రోజులలో పెట్రోల్ ధర లీటరుకు  రూ.2.74, డీజిల్ ధర రూ. 2.83 (ఢిల్లీ)  మేర పెరగడం గమనార్హం. (పెట్రో షాక్ : నాలుగో రోజూ)

ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు
ఢిల్లీ : పెట్రోలు  రూ. 74. డీజిల్   రూ. 72.22
ముంబై: పెట్రోల్  రూ. 80.98. డీజిల్  రూ. 70.92
చెన్నై: పెట్రోల్ రూ. 77.96. డీజిల్ రూ.70.64
బెంగళూరు: పెట్రోల్ రూ. 76.39. డీజిల్ రూ. 68.66

హైదరాబాద్: పెట్రోల్ రూ.76.82. డీజిల్ రూ. 70.59
అమరావతి : పెట్రోల్  రూ.77.36. డీజిల్ రూ. 71.18

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement