Prices Rise
-
కేరళలో ఓనం...కోనసీమకి వరం
కోనసీమ అంటేనే కొబ్బరికి ప్రసిద్ధి. ఇక్కడి రైతులు వరి కంటే మక్కువగా కొబ్బరికి ప్రాధాన్యమిస్తారు. కొబ్బరికాయ దిగుబడి ఇక్కడ బాగుంది అనుకునేలోపే తమిళనాడు, కేరళ రూపంలో గట్టి సవాల్ ఎదురయ్యేది. దాంతో కాయ ఉన్నా.. సరైన ధర ఎన్నడూ లభించేది కాదు. కానీ ఇప్పుడు కేరళలో ఓనం పండుగ వచ్చి అక్కడి కాయ అక్కడికే సరిపోతోంది. తమిళనాడు, కర్నాటకల్లో సరైన దిగుబడి లేకపోవడం, ఉత్తరాదిన దసరా, దీపావళి, కార్తికమాసం రూపంలో పండగలు క్యూ కట్టడంతో కోనసీమ కొబ్బరికి, రైతులకు ముందే పండగొచ్చింది. సాక్షి, అమలాపురం/అంబాజీపేట: కేరళలో ఓనం పండుగ... తమిళనాడులో కొబ్బరికాయ అందుబాటులో లేకపోవడం... కోనసీమ కొబ్బరి రైతులకు పండగ వచ్చింది. కొబ్బరికాయ ధర రికార్డ్ స్థాయిలో పెరగడంతో వారికి దసరా... దీపావళి పండగ ముందే వచ్చింది. కొబ్బరి వెయ్యి కాయల ధర సైజును బట్టి రూ.17,500ల నుంచి రూ.18 వేల వరకు పలుకుతుంది. అంబాజీపేట కొబ్బరి మార్కెట్ చరిత్రలో ఇది ఆల్ టైమ్ హై. కొబ్బరి ధరలు రికార్డు స్థాయిలో పెరగడంతో ఉమ్మడి గోదావరి జిల్లాలోని కొబ్బరి రైతులకు ముందే దసరా, దీపావళి పండగ వచ్చినట్టయింది. వరుస పండగల నేపథ్యంలో కొబ్బరి ధరలు అనూహ్యంగా పెరిగాయి. నెల రోజుల క్రితం వెయ్యి కొబ్బరికాయల ధర రూ.8,500 మాత్రమే ఉండేది. తర్వాత నెమ్మదిగా పెరుగుతూ ఆగస్టు నెలాఖరు నాటికి రూ.10,500కు చేరింది. వినాయక చవితి సమయానికి రూ.11,500 నుంచి రూ.12 వేల వరకు ధర రావడంతో రైతులు చాలా వరకు కోలుకున్నారు. కానీ గత వారం రోజుల నుంచి ధర రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది, తమిళనాడు, కర్ణాటకల్లో కొబ్బరి దిగుబడులు తక్కువగా ఉన్నాయి. కేరళలో ఓనం పండగ కారణంగా స్థానికంగా కొబ్బరి వినియోగం ఎక్కువగా ఉంది. దీనితో ఆ రాష్ట్రం నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు కొబ్బరి ఎగుమతులు మందగించాయి. ఈ కారణంగా ఉత్తరాది మార్కెట్ అవసరాలను ఉమ్మడి గోదావరి జిల్లాల కొబ్బరి తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల గతంలో ఎన్నడూ లేనంత ధర రావడం విశేషం. విజయదశమి, దీపావళి, కార్తికమాసం దృష్టిలో పెట్టుకుని ఇతర రాష్ట్రాల్లోని కొబ్బరి అమ్మకాలు పెరిగాయి. ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాంచల్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి కొబ్బరి ఆర్డర్లు అధికంగా వస్తున్నాయి. సాధారణంగా ఈ రాష్ట్రాలకు డొక్క ఒలిచిన కొబ్బరి ఎగుమతి అవుతుంటుంది. కానీ ఈసారి డొక్కా ఒలుపు చేయని కాయను కొనుగోలు చేస్తుండటం గమనార్హం. రాసుల రూపంలో రూ.18 వేల వరకు ధర ఉండగా 60 రకం (పెద్ద కాయ) డొక్కతో వెయ్యి కాయలు ధర రూ.20 వేలు పలుకుతుంది. ఏడేళ్ల తర్వాత రికార్డు ధర ఏడేళ్ల తర్వాత కొబ్బరికాయకు రికార్డు స్థాయి ధర వచ్చింది. 2017లో కొబ్బరికాయకు జాతీయ మార్కెట్లో రూ.17 వేల ధర రాగా ఈసారి అంతకుమించి ధర పలుకుతుండటం విశేషం.మార్కెట్లో ఈ స్థాయి ధర రావడం అరుదైన విషయమని కొబ్బరి రైతులు, వ్యాపారులు చెబుతున్నారు. కొబ్బరికాయతో పాటు మిగిలిన కొబ్బరి ఉత్పత్తుల ధరలు సైతం పెరిగాయి. ప్రస్తుతం పాత కురిడీ కాయ గండేరా వేయింటికి రూ.14 వేలు, గటగటా రూ.17,500, కురిడీ కొత్త కాయ గండేరా రూ.13 వేలు, గటగట రూ.15,500 పలుకుతుంది. -
బంగారం ఎఫెక్ట్.. భారీగా పెరిగిన పట్టు చీరల ధరలు
కాంచీపురం పట్టు చీరలు పెళ్లిళ్లకు ప్రసిద్ధి. పెళ్లి కోసం కొనుగోలు చేసేవాటిలో బంగారం తర్వాత పట్టు చీరలే ఎక్కువగా ఉంటాయి. అయితే ఆకాశమే హద్దుగా రోజురోజుకూ పెరిగిపోతున్న బంగారం ధరలు కాంచీపురం పట్టు చీరల ధరలపైనా ప్రభావం చూపిస్తున్నాయి.బంగారం, పట్టు చీరల ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో మొత్తంగా పెళ్లిళ్ల బడ్జెట్‌పై భారం పడుతోంది. గత ఎనిమిది నెలల్లో కాంచీపురం పట్టు చీరల ధరలు 50 శాతం పెరిగాయి. దీంతో బంగారం, వెండి వంటి విలువైన లోహాలు తక్కువ స్థాయిలో ఉన్న లేదా పూర్తిగా లేని చీరలను చాలా మంది కస్టమర్లు ఎంచుకుంటున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.క్షీణించిన విక్రయాలుధరల పెరుగుదల కారణంగా ఈ పెళ్లిళ్ల సీజన్లో విక్రయాలు 20 శాతం క్షీణించినట్లు కాంచీపురం పట్టు చీరల అమ్మకానికి పేరుగాంచిన రీటైల్ టెక్స్టైల్ చైన్ ఆర్ఎంకేవీ పేర్కొంటోంది. తక్కువ సమయంలో 35 శాతం నుంచి 40 శాతం వరకు పట్టు చీరల ధరలు పెరగడం ఇదే మొదటిసారి అని ఆర్ఎంకేవీ మేనేజింగ్ డైరెక్టర్ శివకుమార్ చెబుతున్నారు.22 క్యారెట్ల బంగారం ధర 2023 అక్టోబర్ 1న గ్రాముకు రూ. 5,356 ఉండగా 2024 మే 21 నాటికి అది రూ. 6,900 లకు పెరిగింది. అదే సమయంలో వెండి ధరలు గ్రాముకు రూ. 75.5 నుంచి రూ.101 కి పెరిగాయి. రూ. 10,000 కోట్ల విలువైన కాంచీపురం పట్టు చీరల పరిశ్రమ దీని ద్వారా గణనీయంగా ప్రభావితమైంది.50 శాతం పెరిగిన ధరలుకాంచీపురం పట్టు చీరల తయారీదారుల సంఘానికి చెందిన దామోధరన్ ప్రకారం.. గత సంవత్సరం అక్టోబర్ నుంచి ఈ ఏడాది మే మధ్య ఈ చీరల ధరలు 40 నుంచి 50 శాతం పెరిగాయి. కాంచీపురం పట్టు చీర ధర ప్రధానంగా బంగారం, వెండి ధరలపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే బంగారం, వెండితో తయారు చేసిన జరీని ఈ చీరల తయారీలో ఉపయోగిస్తారు. పురాతమైన కాంచీపురం చీరలకు భౌగోళిక సూచిక (GI) ట్యాగ్ కూడా ఉంది. ఒక్కో చీర ధర రూ.20 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు ఉంటుంది. -
కొండెక్కిన వెల్లుల్లి ..ఈ చిట్కాలు ఫాలోకండి!
దేశంలో ఇటీవల కురిసిన వర్షాలకు వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. దీంతో ఉల్లి ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరాయి. మొన్నమొన్నటి నుంచి తగ్గుతూ రాగా, ఇప్పుడు వెల్లుల్లి ధరలు అమాంతం కొండెక్కాయి. మార్కెట్లో ప్రస్తుతం కిలో వెల్లుల్లి ధర రూ.400 నుంచి రూ. 500 వరకు పలుకుతుంది. ఇలాంటప్పుడూ మహిళలు స్పైసీ కూరలు ఎలా వండి పెట్టగలం అన్న సందిగ్ధంలో పడిపోతారు. పైగా వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదని తాలింపుల దగ్గరి నుంచి ప్రతి దాంట్లోని తప్పనిసరిగా వాడేస్తుంటారు. అలాంటిది వెల్లుల్లి వాడకం లేకుండా గడపడం అంటే..కొందరికి చాల కష్టం. అలాంటివారు ప్రత్యామ్రాయంగా ఇలాంటి వాటితో వెల్లుల్లి ప్లేస్‌ని భర్తీ చేసుకోవచ్చు. వెల్లుల్లి బదులుగా ఏం ఉపయోగించొచ్చంటే.. సింపుల్ చిట్కాలు.. ముందుగా మీ కిచెన్ కప్‌బోర్డ్‌లో ఎన్ని వెల్లులిపాయలు ఉన్నాయో చూడండి. వాటిని పాయలుగా విడదీయండి. ఆ తర్వాత చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎండలో పెట్టి బాగా ఎండనివ్వండి. ఇక వాటిని చక్కగా పొడి చేసుకుని పాడవ్వకుండా చిన్న లవంగ మొగ్గ వేసి గాలి చొరబడి డబ్బాలో నిల్వ ఉంచండి. ఈ పొడి వెల్లులి మాదిరి రుచిని సువాసనను తెప్పిస్తుంది కూరకి. ఇది మంచి ప్రత్యామ్నాయం. అలాగే ఈ వెల్లుల్లి పొడికి కాస్త ఉప్పు చేరిస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అయితే కూరల్లో ఈ పొడిని ఉపయోగిస్తున్నట్లయితే కాస్త ఉప్పు తగ్గించండి. అప్పుడు కూర రుచికి వెల్లుల్లికి దగ్గదగ్గరగా మంచి రుచిని అందిస్తుంది. అస్సలు ఇంట్లో వెల్లుల్లి లేదంటే పచ్చి ఉల్లిపాయాలను ఎండలో ఎండబెట్టి చక్కగా పొడి చేసుకుంటే వెల్లులి మాదిరిగా టేస్ట్ వస్తుంది కూరకి. అయితే కూరలో తక్కువ ఉల్లిపాయలను ఉపయోగిస్తే సరిపోతుంది. ఆర్థిక పరంగా సమస్య రాకుండా కొద్దిపాటి చిట్కాలతో ఇంటిని చక్కగా చక్కబెట్టుకుంటే ఆరోగ్యానికా ఆరోగ్యమే గాక ధరల సమస్యకు చెక్ పెట్టొచ్చు. (చదవండి: కళ్లు కలువ పువ్వుల్లా పెద్దవిగా ఉండాలంటే.. ఈ ఐ బ్యాండ్ ఉంటే చాలు!) -
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ ధరలు - కారణం ఇదే..
2024 జూన్ నుంచి స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా పెరిగే సూచనలున్నాయి. ప్రస్తుతం ఉన్న ధరలకంటే సుమారు 10 నుంచి 15 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మెమొరీ చిప్‌ల ధరలు పెరగడంతో వచ్చే త్రైమాసికం నుంచి స్మార్ట్‌ఫోన్ ధరలు పెరగనున్నట్లు సమాచారం. మార్కెట్ పరిశోధన సంస్థ ట్రెండ్‌ఫోర్స్ DRAM (మెమరీ చిప్స్) ధరలలో పెరుగుదల ఉందని సూచించింది. ఎందుకంటే శాంసంగ్, మైక్రాన్ కంపెనీలు మార్చి నుంచి ధరల పెరుగుదలను అమలు చేసే అవకాశం ఉంది. ఆ ప్రభావం స్మార్ట్ఫోన్లపై కూడా ఉంటుందని ట్రెండ్‌ఫోర్స్ తెలిపింది. స్మార్ట్‌ఫోన్, పర్సనల్ కంప్యూటర్ల వినియోగం భారీగా పెరగడం వల్ల ఏఐ, అధిక పనితీరు కలిగిన మెమొరీ చిప్‌ల డిమాండ్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. దీంతో కంపెనీలు చిప్‌ల ధరలను పెంచనున్నాయి. ఇది మాత్రమే కాకుండా.. చైనీస్ కరెన్సీ యువాన్ బలపడటం వల్ల, అక్కడ నుంచి దిగుమతి చేసుకునే విడిభాగాల ఖర్చు కూడా భారీగానే ఉన్న కారణంగా ధరలు పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు. ఇదీ చదవండి: ఆ కంపెనీ ఉద్యోగుల జాబ్స్ పోయినట్టేనా? సీఈఓ ఏమన్నారంటే.. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో మేక్ ఇన్ ఇండియాపై దృష్టి సారించింది. ఇది స్మార్ట్‌ఫోన్ పరిశ్రమకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం బడ్జెట్‌ను పెంచింది. అయినప్పటికీ ఇప్పటికే తయారై సరఫరాకు సిద్దమైన ఫోన్స్ ధరలు 3 నుంచి 8 శాతం, కొత్తగా తయారవుతున్న ఫోన్ల మీద 5 నుంచి 10 శాతం ధరలు పెరగవచ్చని, డిమాండ్‌ను బట్టి ధరలు 10 నుంచి 15 శాతం పెరగవచ్చని సంబంధిత అధికారులు చెబుతున్నారు. -
టీవీల ధరలు మరింత పెరుగుతాయా.. ఎందుకు?
ఇకపై టీవీలు కొనడం మరింత భారం కావచ్చు. తయారీదారులు ఉత్పత్తిని తగ్గించడంతో కీలకమైన ఓపెన్ సెల్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయని, దీనివల్ల టీవీలు ధరలు కూడా మరింత పెరుగుతాయని ఓ నివేదిక ద్వారా తెలుస్తోంది. కోవిడ్ సమయం నుంచే పరిశ్రమ ఈ సమస్యను ఎదుర్కొంటోంది. గత డిసెంబర్ నుంచి ఓపెన్-సెల్ ధరలు ఏకంగా 20 శాతం పెరిగాయి. ఇప్పుడు చైనీస్ న్యూ ఇయర్ తర్వాత ఫిబ్రవరి చివరి నాటికి మరో 15 శాతం పెంచే యోచనలో టెలివిజన్-ప్యానెల్ తయారీదారులు ఉన్నారు. ఏమిటీ ఓపెన్ సెల్? టెలివిజన్ సెట్ల తయారీలో ఓపెన్ సెల్ ప్రధాన భాగాలలో ఒకటి. టీవీల ఉత్పత్తిలో 60-65 శాతం ఓపెన్ సెల్లకే ఖర్చవుతుంది. వీటిని చైనాలోని నాలుగైదు కంపెనీలే తయారు చేస్తున్నాయి. దీని కారణంగా ధరల అధికారం వారి చేతుల్లోనే ఉంటోంది. -
అక్కడ పెట్రోలు రేట్లు ఐదు రెట్లు పెరగనున్నాయి!
పెట్రోల్ ధరలు రెండు రూపాయలు పెరిగితేనే ఆందోళనలు జరిగిన సంఘటనలు గతంలో కోకొల్లలు, అలాంటిది 500 శాతం పెరిగితే?.. అది సామాన్య ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకీ ఇంత శాతం ధరలు ఏ దేశంలో పెరుగుతాయి, ఎప్పటి నుంచి అమలులోకి రానున్నాయనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. భారత్‌లో పెట్రోల్ ధరలు ఇప్పుడు రూ.100 నుంచి రూ.120 మధ్యలో ఉండటంతోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక పాకిస్తాన్, శ్రీలంక దేశాల్లో పెట్రోల్ ధరలు రూ.250 నుంచి రూ.350 వరకు ఉన్నాయి. ఇప్పుడు కరేబియన్ దేశం క్యూబా ఉన్న ధరలనే 500% పెంచుతూ ప్రకటించింది. ఒక వైపు కరోనా ప్రభావం, మరోవైపు అమెరికా తీవ్ర ఆంక్షల మధ్య ఆర్ధిక సంక్షోభంలో పడ్డ క్యూబా.. ద్రవ్యోల్బణ లోటును తగ్గించుకోవడానికి పెట్రోల్ ధరలను భారీగా పెంచాలని నిర్ణయించుకుంది. దీంతో 25 పెసోలుగా ఉన్న ఒక లీటరు పెట్రోల్ రేటు ఫిబ్రవరి 1 నుంచి 132 పెసోలకు పెరుగుతుంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ 450 రూపాయల కంటే ఎక్కువన్నమాట. ఇదీ చదవండి: వాచ్‌మెన్‌కు ఇప్పుడే సారీ చెప్పు.. ఆకాశ్‌ను ఆదేశించిన ముకేశ్ అంబానీ - ఎందుకంటే? కేవలం పెట్రోల్ ధరలు మాత్రమే కాకుండా.. రాబోయే రోజుల్లో డీజిల్, ఇతర రకాల ఇంధనాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని, విద్యుత్, సహజవాయువుల ధరల పెరుగుదల త్వరలోనే జరుగుతుందని ఆర్థిక మంత్రి 'వ్లాదిమిర్ రెగ్యురో' (Vladimir Regueiro) వెల్లడించారు. కొత్త ధరలు అమలులోకి వచ్చిన తరువాత కేవలం అమెరికన్ డాలర్లతో మాత్రమే కొనుగోలు చేయాలనీ క్యూబా ప్రభుత్వం నిర్ణయించింది. ధరలు అందుబాటులోకి వచ్చిన తరువాత క్యూబా ప్రజలు పెద్ద ఎత్తున ఆర్థిక కష్టాలను చవి చూడాల్సి వస్తుందని స్పష్టంగా అర్థమవుతోంది. -
మెర్సిడెస్ బెంజ్ కార్ల ధరల పెంపు
న్యూఢిల్లీ: మెర్సిడెస్ బెంజ్ జనవరి ఒకటి నుంచి కొన్ని మోడళ్ల ధరలను 2% వరకు పెంచనున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇన్పుట్ వ్యయాలు, కమోడిటీ ధరలు, రవాణా సరఫరా ఖర్చులు అధికమవడంతో పాటు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కారణంగా కార్ల ధరలు పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది. సీ–క్లాస్ కారుపై రూ.60,000 నుంచి, టాప్ ఎండ్ మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్680పై రూ.3.4 లక్షల వరకు పెంపుదల ఉంటుంది. మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఏ–క్లాస్ సెడాన్ నుంచి ఎస్యూవీ జీ63 ఏజీఎం వరకు వివిధ మోడళ్ల కార్లను రూ.46 లక్షలు – రూ.3.4 కోట్ల ధరల శ్రేణిలో విక్రయిస్తుంది. -
అత్యధికంగా ఇళ్ల ధరలు పెరుగుతున్నది అక్కడే.. కొనడం కష్టమే!
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు ఏటేటా భారీగా పెరుగుతున్నాయి. అత్యధికంగా ఇళ్ల ధరలు పెరుగుతున్న నగరాల జాబితాలో భారత్‌కు చెందిన నగరాలు ఉన్నాయి. నైట్ ఫ్రాంక్ (Knight Frank) విడుదల చేసిన ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబై నగరం ప్రైమ్ రెసిడెన్షియల్ ధరలలో నాలుగో అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. 6.5 శాతం పెరుగుదలతో నాలుగో స్థానంలో నిలిచింది. గతేడాది సెప్టెంబర్‌లో ఉన్న 22వ ర్యాంక్ నుంచి ఈసారి 18 స్థానాలు ఎగబాకింది. అలాగే న్యూ ఢిల్లీ, బెంగళూరు నగరాలు కూడా తమ ఇండెక్స్ ర్యాంకింగ్స్‌లో మెరుగుదలను నమోదు చేశాయి. న్యూ ఢిల్లీ ఎన్సీఆర్ 4.1 శాతం వృద్ధితో ఏడాది క్రితం 36వ ర్యాంక్ నుంచి ఈ ఏడాది 10వ స్థానానికి ఎగబాకిందని నైట్ ఫ్రాంక్ పేర్కొంది. బెంగళూరు ర్యాంక్ గతేడాది 27 నుంచి ఈ ఏడాది 2.2 శాతం వృద్ధితో 17కి పెరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ 12 నెలల కాలంలో 46 మార్కెట్లలో వార్షిక ప్రైమ్ రెసిడెన్షియల్ ధరలలో సగటు పెరుగుదల 2.1 శాతంగా నమోదైంది. ఇది గతేడాది మూడో త్రైమాసికం నుంచి నమోదైన అత్యంత బలమైన వృద్ధి రేటు. మొత్తంగా 67 శాతం నగరాలలో ఇళ్ల ధరలు పెరుగుదలను నమోదు చేసినట్లుగా నైట్‌ఫ్రాంక్ నివేదిక పేర్కొంది. టాప్‌లో మనీలా ఫిలిప్పైన్స్ దేశ రాజధాని మనీలా 21.2 శాతం వార్షిక ధరల పెరుగుదలతో ఈ ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో నిలిచింది. బలమైన దేశ, విదేశీ పెట్టుబడులు ఇందుకు కారణంగా చెప్పవచ్చు. గత ఎనిమిది త్రైమాసికాల నుంచి వరుసగా అగ్రస్థానంలో ఉంటూ వస్తున్న దుబాయ్ ఈసారి టాప్ ర్యాంక్‌ను కోల్పోయింది. ఈ ఏడాది కేవలం 15.9 శాతం వార్షిక పెరుగుదలను నమోదు చేసింది. ఇక ఈ జాబితాలో శాన్ఫ్రాన్సిస్కో అట్టడుగున నిలిచింది. -
ఏటీఎఫ్ ధర 6 శాతం తగ్గింపు..
న్యూఢిల్లీ: నాలుగు నెలలుగా వరుసగా పెరుగుతూ వచి్చన విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు తాజాగా దాదాపు 6 శాతం తగ్గాయి. అయితే, వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్ (19 కేజీలు) రేటు రూ. 101.5 మేర పెరిగింది. గృహావసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ (14.2 కేజీలు) ధర మాత్రం యధాతథంగా రూ. 903 (ఢిల్లీలో) వద్దే ఉంది. ప్రభుత్వ రంగ ఇంధన రిటైలింగ్ సంస్థలు బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఏటీఎఫ్ రేటు కిలోలీటరుకు రూ. 6,954.25 మేర (5.79 శాతం) తగ్గి రూ. 1,18,199.17కి దిగి వచి్చంది. జూలై నుంచి చూస్తే నాలుగు నెలల్లో విమాన ఇంధనం ధర రూ. 29,391 మేర పెరిగింది. ఎయిర్‌లైన్స్ నిర్వహణ వ్యయాల్లో ఇంధనం వాటా దాదాపు 40 శాతం ఉంటున్న నేపథ్యంలో తాజా తగ్గింపుతో విమానయాన సంస్థలకు కాస్త ఊరట లభించనుంది. మరోవైపు, సవరించిన రేట్ల ప్రకారం 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 1,833గా ఉంటుంది. వాణిజ్య సిలిండర్ ధరను పెంచడం ఇది రెండోసారి. అక్టోబర్ 1న రేటును ఏకంగా రూ. 209 మేర ఇంధన కంపెనీలు పెంచాయి. ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) సంస్థలు .. అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా ప్రతి నెల 1న వంట గ్యాస్, ఏటీఎఫ్ ధరలను సవరిస్తాయి. -
ఆహార ధరల పెరుగుదలే ప్రధాన ఆందోళన
ముంబై: ఆహార ధరల పెరుగుదలే వ్యవస్థలో ప్రధాన ఆందోళనకర అంశమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన (ఎంపీసీ) కమిటీ అభిప్రాయపడింది. ఈ పరిస్థితిలో కఠిన ద్రవ్య విధానవైపే మొగ్గుచూపాలని ప్రస్తుతానికి బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో (6.5 శాతం) యథాతథంగానే కొనసాగించాలని ఎండీ పాత్ర, శశాంక భిడే, అషిమా గోయల్, జయంత్ ఆర్ వర్మ, రాజీవ్ రంజన్‌లతో సహా మొత్తం ఆరుగురు సభ్యులు ఓటు వేశారు. ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకూ జరిగిన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష మినిట్స్ గురువారం విడుదలయ్యాయి. ‘మా పని (ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం) ఇంకా ముగియలేదు. కూరగాయలు తదితర ఆహార పదార్థాల ధరల ప్రాతిపదికన మొదటి రౌండ్ ద్రవ్య విధాన నిర్ణయాలు ఉంటాయి. అదే సమయంలో, విస్తృత ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ద్రవ్యోల్బణం అంచనాలు, ఆందోళనల ప్రాతిపదికన రెండవ–రౌండ్ ప్రభావాన్ని ముందస్తుగా తొలగించడానికి మేము సిద్ధంగా ఉండాలి. దీనికి తక్షణం కఠిన విధానమే సరైందని కమిటీ భావిస్తోంది’’ అని దాస్ సమావేశంలో అభిప్రాయపడ్డారు. 2022 నుంచి 250 బేసిస్ పాయింట్లు పెంపు ఉక్రేయిన్‌పై రష్యా యుద్ధం, క్రూడ్ ధరల తీవ్రత, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్బీఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. అయితే ద్రవ్యోల్బణం కొద్దిగ అదుపులోనికి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో ఈ నెల సమీక్షసహా గడచిన మూడు సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్బీఐ పెద్దపీట వేసింది. అయితే ద్రవ్యోల్బణం భయాలు తొలగిపోలేదని, అవసరమైతే కఠిన ద్రవ్య విధానానికే (రేటు పెంపు) మొగ్గుచూపుతామని కూడా ఆయా సందర్భాల్లో స్పష్టం చేస్తూ వచి్చంది. ఇదే విషయాన్ని ఈ నెల తాజా సమీక్షా సమావేశం అనంతరం కూడా ఆర్బీఐ గవర్నర్ పునరుద్ఘాటించారు. తాజాగా వెలువడిన మినిట్స్ కూడా ఇదే విషయాన్ని సూచించింది. అంచనాలకు అనుగుణంగానే... ఆర్బీఐ ఆందోళనకు అనుగుణంగానే పాలసీ తదనంతరం వెలువడిన జూలై నెల ద్రవ్యోల్బణం తీవ్ర రూపం దాల్చడం గమనార్హం. ఆర్బీఐ కీలక ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో ఏకంగా 7.44 శాతంగా (2022 ఇదే నెల ధరలతో పోల్చి ధరల పెరుగుదల) నమోదయ్యింది. గడచిన 15 నెలల్లో ఈ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. సూచీలో కీలక విభాగాలైన కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల ధరలు తీవ్రంగా పెరగడం దీనికి కారణం. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం ప్లస్ లేదా మైనస్‌తో 4 శాతం వద్ద ఉండాలి. అంటే అప్పర్ బ్యాండ్‌లో 6 శాతం అధిగమిస్తే... దానిని ఎకానమీలో డేంజర్ బెల్సా్గ పరిగణించాల్సి ఉంటుంది. జూలైలో అంకెలు ఈ స్థాయిని అధిగమించడం గమనార్హం. 2022 జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.71 శాతం ఉంటే, ఈ ఏడాది జూన్‌లో 4.87గా నమోదయ్యింది. జూలైలో మళ్లీ తీవ్ర రూపం దాలి్చంది. వినియోగ ధరల సూచీలో కీలక విభాగాలు చూస్తే.. ఒక్క ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం జూలైలో 11.51%గా నమోదయ్యింది. జూన్‌లో ఈ రేటు 4.55%. జూలై 2022లో ఈ రేటు 6.69%గా ఉంది. ఒక్క కూరగాయల ధరలు జూలై లో ఏకంగా 37.43% ఎగశాయి. తృణ ధాన్యాలు, సంబంధిత ఉత్పత్తుల ధరలు 13 శాతం పెరిగాయి. కీలక అంచనాలు ఇవీ... వృద్ధి తీరు: 2023–24లో దేశ జీడీపీ 6.5 శాతం ఉంటుందని ఆర్బీఐ అంచనావేస్తుండగా, క్యూ1లో 8%, క్యూ2లో 6.5%, క్యూ3లో 6%, క్యూ4లో 5.7 శాతంగా అంచనా. 2024–25 మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.6%గా అంచనా. ద్రవ్యోల్బణం ధోరణి: 2023–24లో వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని అంచనావేస్తుండగా, క్యూ2లో 6.2%, క్యూ3లో 5.7%, క్యూ4లో 5.2 శాతంగా అంచనా. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో అంచనా 5.2 శాతం. -
పెరగనున్న హోండా కార్ల ధరలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా వచ్చే నెల నుంచి సిటీ, అమేజ్ కార్ల ధరలను పెంచనుంది. ముడిసరుకు వ్యయం క్రమంగా అధికం అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తాజాగా ప్రకటించింది. అయితే ధర ఎంత పెంచేదీ వెల్లడించలేదు. ప్రస్తుతం ఎక్స్‌షోరూంలో కాంపాక్ట్ సెడాన్ అమేజ్ ధర రూ.7.05 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అలాగే మధ్యస్థాయి సెడాన్ సిటీ రూ.11.57 లక్షల నుంచి మొదలవుతుంది. ఇక హైబ్రిడ్ మోడల్ అయిన సిటీ ఈ:హెచ్ఈవీ రూ.18.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే షాకవుతారు!
Today Gold and Silver Rate: దేశీయంగా గత రెండు మూడు రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి ధర శనివారం బులియన్ మార్కెట్లో మళ్లీ ఎగిసాయి. అటు వెండి ధర కూడా మళ్లీ పరుగందుకుంది. అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు ఊపందుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,310 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,310 వద్ద కొనసాగుతున్నది. (అంత లేదు...నేనూ సంపాదిస్తున్నా: మండిపడిన సమంత) హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 200 ఎగిసి రూ.55150 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర 210 రూపాయలు పుంజుకని 60,160గా పలుకుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధర విషయానికి వస్తే కొనుగోలు దారులకు షాక్ తగిలింది. ఏకంగా 300 రూపాయలు ఎగిసి కిలోవెండి 78500గా ఉంది. గ్లోబల్‌గా ఔన్స్ బంగారం ధర పుంజుకుంది .యూఎస్ జాబ్ డేటా అమెరికన్ డాలర్, బాండ్ ఈల్డ్స్ క్షీణత అని బులియన్ వర్గాలు భావిస్తున్నాయి. (మహిళల రికార్డ్: వారి టార్గెట్ పక్షి కన్నే, గర్వంగా ఉంది: ఆనంద్ మహీంద్ర ప్రశంసలు) ఇదీ చదవండి: తండ్రికే షాకిస్తున్న ఇషా: మురిసిపోతున్న అంబానీ -
హార్లే-డేవిడ్సన్ లవర్స్‌కు భారీ షాక్, ఏకంగా పదివేలు!
Harley Davidson X440:హార్లే-డేవిడ్సన్ లవర్స్‌కు భారీ షాక్. హీరో మోటోకార్ప్ హార్లే-డేవిడ్సన్ బైక్స్ లేటెస్ట్ బైక్ ధరలను భారీగా పెంచేసింది. ఏకంగా 10,500 మేర ధరలను పెంచింది. ఈ పెరుగుదల అన్ని వేరియంట్లకు వర్తిస్తుందని హీరో మోటోకార్ప్ ధృవీకరించింది. ధర పెంపు తర్వాత, హార్లే-డేవిడ్సన్ ఎక్స్440 బైక్ ధర రూ. 2,39,500 నుండి ప్రారంభమవుతుంది (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ప్రస్తుత ప్రారంభ ధర ఆగస్టు 3 వరకు అందుబాటులో ఉంటుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు రూ. 5,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి బైక్‌ను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు హీరో మోటోకార్ప్ గత నెలలో విడుదల చేసిన హార్లే డేవిడ్సన్ ఎక్స్440 కొత్త ధరను ప్రకటించింది. కంపెనీ ప్రయోగ ధరతో పోలిస్తే రూ.10,500 ఖరీదు ఎక్కువ. ఇది 2,29,000 ప్రారంభ ధరతో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. (టికెట్ల ధరలకు ‘రెక్కలు’: ప్రయాణీకులకు ఇక చుక్కలే!) హీరో మోటోకార్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిరంజన్ గుప్తా మాట్లాడుతూ, హార్లీ-డేవిడ్సన్ ఎక్స్ 440 ప్రారంభించినప్పటి నుంచి మంచి ఆదరణ లభించిందనీ, ఆన్లైన్ బుకింగ్‌ల తదుపరి విండోకు వర్తించే కొత్త ధరను ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు. హీరో మోటో భాగస్వామ్యంతో, అమెరికా ప్రీమియం ఆటోమొబైల్ హార్లే-డేవిడ్సన్ భారత మార్కెట్లో తన పోర్ట్‌ఫోలియోను అందుబాటులోకి తెస్తోంది. డిమాండ్కనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు హీరో మోటోకార్ప్ ధృవీకరించింది.సెప్టెంబర్‌లో భారతదేశంలోని రాజస్థాన్‌లోని నీమ్రానాలోని వారి గార్డెన్ ఫ్యాక్టరీలో హార్లే-డేవిడ్సన్ X440 ఉత్పత్తిని ప్రారంభిస్తారు. బుకింగ్ తేదీల ఆధారంగా అక్టోబర్ 2023లో కస్టమర్ డెలివరీలు ప్రారంభమవుతాయి. కాగా హార్లే-డేవిడ్సన్ ఎక్స్ 440 సెగ్మెంట్లో అత్యంత సరసమైన బైక్‌గా చెప్పవచ్చు. అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, హోండా హెచ్నెస్ CB350, బెనెల్లీ ఇంపీరియాలే 400 వంటి ఇతర ప్రసిద్ధ మోడళ్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. -
టికెట్ల ధరలకు ‘రెక్కలు’: ప్రయాణీకులకు ఇక చుక్కలే!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ధోరణులకు అనుగుణంగా దేశీయంగా ప్రభుత్వ రంగ ఇంధన రిటైల్ సంస్థలు విమాన ఇంధన (ఏటీఎఫ్) రేటును ఏకంగా 8.5 శాతం పెంచాయి. అటు వాణిజ్య వంట గ్యాస్ ధరను సిలిండర్‌కు రూ. 100 మేర తగ్గించాయి. తాజా మార్పులతో ఢిల్లీలో ఏటీఎఫ్ రేటు కిలోలీటరుకు రూ. 7,728 పెరిగి రూ. 98,508కి చేరింది. దీంతో వరుసగా రెండో నెలా విమాన ఇంధనం రేటు పెరిగినట్లయింది. జూలై 1నే ఇది 1.65శాతం మేర (కిలోలీటరుకు రూ. 1,477) పెరిగింది. అంతకు ముందు ఆయిల్ కంపెనీలు నాలుగు సార్లు తగ్గించాయి. కొత్త రేట్లు మంగళవారంనుంచి అమల్లోకి వచ్చాయి. పెంపు తర్వాత, న్యూఢిల్లీలో ఏటీఎఫ్ రేటు కిలోలీటర్‌కు రూ.7,728 పెరిగి రూ.98,508.26కి చేరుకుంది. ముంబైలో కిలోలీటర్‌కు రూ.84,854.74 నుంచి రూ.92,124.13కి పెరిగింది. డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్ మెట్రోలలో (రూపాయిలు/కేఎల్) ఏటీఎఫ్ ధరలు న్యూఢిల్లీ - 98,508.26 కోల్‌కతా - 1,07,383.08 ముంబై - 92,124.13 చెన్నై- 1,02,391.64 ఇంటర్నేషనల్ రన్లో డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్ మెట్రోలలో ఏటీఎఫ్ ధరలు (డాలర్లు/కిలో) ఢిల్లీ-902.62 కోల్‌కతా-941.09 ముంబై-900.73 చెన్నై- 897.83 ఇక 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 100 తగ్గి రూ. 1,680కి లభించనుంది. గృహావసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ రేటు యథాతథంగా రూ. 1,103 (14.2 కేజీల సిలిండర్) ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) ప్రతి నెలా 1వ తేదీన వంట గ్యాస్, ఏటీఎఫ్ రేట్లను సవరిస్తాయి. -
గ్యాస్ ధర పెంపు.. పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ ప్రకటన
కేంద్ర ప్రభుత్వం డొమెస్టిక్ నేచురల్ గ్యాస్ ధరను పెంచింది. జులైలో ఒక మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (mBtu)కు 7.48 (సుమారు రూ. 615) డాలర్లు ఉన్న ధరను ఆగస్టులో 7.85 (సుమారు రూ. 645) డాలర్లకు పెంచింది. అయితే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఆయిల్ ఇండియా లిమిటెడ్ సంస్థలకు చెందిన నామినేషన్ ఫీల్డ్‌ల నుంచి ఉత్పత్తి చేసిన గ్యాస్ మాత్రం గరిష్టంగా ఒక మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్‌కు 6.50 డాలర్లు ఉంటుందని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ నోటిఫికేషన్ పేర్కొంటోంది. పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ గత ఏప్రిల్ 8న ఓఎన్జీసీ, ఓఐఎల్, ఇతర లైసెన్సింగ్ పాలసీ బ్లాక్‌ల లెగసీ నామినేషన్ ఫీల్డ్‌ల నుంచి ఉత్పత్తి చేసిన నేచురల్ గ్యాస్ ధరను భారత క్రూడ్ బాస్కెట్‌కు లింక్ చేసింది. ఈ క్షేత్రాల నుంచి ఉత్పత్తయ్యే నేచురల్ గ్యాస్ ధరను ఇండియన్ క్రూడ్ బాస్కెట్ నెలవారీ సగటులో 10 శాతంగా నిర్ణయించారు. అంతకుముందు 2014 డొమెస్టిక్ నేచురల్ గ్యాస్ ప్రైసింగ్ కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం గ్యాస్ ధరలను ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమీక్షించేవారు. నాలుగు గ్లోబల్ గ్యాస్ ట్రేడింగ్ హబ్‌లలో ఉన్న వాల్యూమ్-వెయిటెడ్ ధరల ఆధారంగా ఈ గ్యాస్ ధరలు ఉండేవి. గ్యాస్ ధరల సమీక్షలో జాప్యం, ధరలలో అధిక అస్థిరత కారణంగా పాత మార్గదర్శకాలను సవరించారు. నేచురల్ గ్యాస్ అనేది శిలాజ ఇంధనం. ఇది సేంద్రీయ పదార్ధాల పొరలు (ప్రధానంగా సముద్ర సూక్ష్మజీవులు) వాయురహిత పరిస్థితులలో కుళ్లిపోయినప్పుడు, మిలియన్ల సంవత్సరాలుగా భూగర్భంలో తీవ్రమైన వేడి, ఒత్తిడికి లోనవుతున్నప్పుడు ఏర్పడుతుంది. ఈ నేచురల్ గ్యాస్‌ను వంటకు, విద్యుత్ ఉత్పత్తికి , ప్లాస్టిక్ తయారీకి వినియోగిస్తారు. దీంతో పాటు వాహనాల్లో ఇంధనంగా కూడా ఉపయోగిస్తారు. -
పెరిగిన బంగారం ధరలు, వెండి కూడా పైపైకే
Today Gold and Silver Price పసిడి ధరలు శనివారం మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో విలువైన రెండు లోహాల ధరలు ఊపందుకున్నాయి. హైదరాబాద్‌లో శుక్రవారం 350 రూపాయలకు పైగా పడిన 22 క్యారెట్ల పసిడి శనివారం 10 గ్రాములు రూ.250 ఎగిసి రూ.55,350 స్థాయికి చేరింది. అలాగే 24 క్యారెట్ల గోల్డ్ 270 రూపాయలు పుంజుకుని రూ.60,380గా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, విశాఖపట్నం, పొద్దుటూరు, గుంటూరు నగరాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర కిలోకి మరోసారి 80వేలకు చేరింది. 500 రూపాయలు పెరిగి కిలోకు రూ.80,000 పలుకుతున్నది. శుక్రవారం 2వేల రూపాయల మేర క్షీణించిన సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.55,600గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.60,640 పలుకుతోంది. f వెండి కిలో 600 రూపాయలు పెరిగి 77,000 పలుకుతోంది. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్లో రోజువారీ మార్పులు, చేర్పులకు లోనవుతూ ఉంటాయనే విషయాన్ని గమనించాలి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
షాకిస్తున్న వెండి, బంగారం ధరలు, ఏకంగా రూ. 1100 జంప్
Gold And Silver Rate Today: దేశంలో బంగారం ధరలు మళ్లి పరుగందుకున్నాయి. ఒక వైపు ఎడతెగని వర్షాలతో దేశంలోని చాలా ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. మరోవైపు బులియన్ మార్కెట్లో వెండి, బంగారం ధరలు గురువారం జోరందుకున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, ద్రవ్యోల్బణం, ఫెడ్ వడ్డీ రేట్లు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల పెరుగుదలకు కారణమని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. (బ్లాక్‌రాక్ బ్యాక్ టూ ఇండియా: అంబానీ మరో సంచలనం) 22క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 300 పెరిగి, రూ. 55,450 పలుకుతోంది. 24 క్యారెట్ల బంగాం పది గ్రాములు 330 రూపాయలు ఎగిసి రూ. 60,490కి చేరింది. వెండి కూడా ఇదే బాటలో ఉంది. (మారుతి జిమ్నీని సింగిల్ బెడ్‌తో అలా మార్చేసిన జంట; వైరల్ వీడియో) హైదరాబాద్ మార్కెట్లె పుత్తడి పది గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 55,450 గానూ, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,490గానూ ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలో కొన సాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,600గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,640గా ఉంది. వెండి ధగ ధగలు దేశీయంగా వెండి ధరలు కూడా పుంజుకున్నాయి. వెండి కిలో ధర 1100 రూపాయిలు ఎగిసింది. హైదరాబాద్‌లో కిలో వెండి 8,1500గా ఉంది. అమెరికా ఫెడ్ నిర్ణయం అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ రేటు పెంపు మరింత ఆందోళనకు దారి తీసింది. ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించారు దీంతో వడ్డీరేటు పెంపు ఉండదన్న ఇన్వెస్టర్ల ఆశలపై నీళ్లు జల్లినట్టైంది. దీంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకోనుందని అంచనాలు ఊపందుకున్నాయి. -
శ్రావణం అలా వచ్చిందో లేదో,రూ. 60వేల ఎగువకు బంగారం
Today Gold and Silver rates: ఆషాఢం ముగిసి శ్రావణ మాసం అలా షురూ అయిందో లేదో బంగారం ధరలు ఊపందుకున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల ధరల్లో హెచ్చు తగ్గులను నమోదు చేస్తున్న బంగారం మంగళవారం ఆరంభంలో స్వల్పంగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర మళ్లీ రూ. 60వేల ఎగువకు చేరింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల రూ. 120 పెరిగి రూ.55100 స్థాయికి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.60,100 పలుకుతోంది. అటు వెండి ధర మాత్రం (హైదరాబాద్‌లో) స్వల్పంగా తగ్గింది. ఆరంభంలో కిలోకు రూ.200 పెరిగిన వెండి ధర ప్రస్తుతం 100 క్షీణించి 81,400 వద్ద ఉంది. ఇక ఢిల్లీలో కీలో వెండి 300 పెరిగి ధర 78 వేలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రా. బంగారం రూ.55,130 గాను, 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.60,130 స్థాయివద్ద ఉంది. డాలరు బలహీనం, గ్లోబల్ గోల్డ్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ ఔట్‌లుక్‌ను ప్రభావితం చేసే అమెరికా రిటైల్ అమ్మకాల డేటా కోసం పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నాయి. డాలర్ వీక్నెస్ అంతర్జాతీయం పసిడి ధరలను ప్రభావితంచేస్తున్నాయి. స్పాట్ బంగారం 0.4శాతం పెరిగి ఔన్సుకు 1,961.67 డాలర్లకు చేరుకుంది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 0.5శాతం పెరిగి 1,965.40డాలర్లకు చేరింది. కొనుగోళ్లతో షేర్లు షైన్ అస్థిర బంగారం ధరలు ఉన్నప్పటికీ 2023లో బంగారు ఆభరణాల రిటైలర్ల స్టాక్‌లు మాత్రం లాభాలను ఆర్జిస్తున్నాయని ట్రేడ్ ఎనలిస్టులు చెబుతున్నారు. బెంచ్‌మార్క్ సెన్సెక్స్ ఇండెక్స్‌లో 13 శాతం లాభంతో పోలిస్తే కళ్యాణ్ జ్యువెలర్స్, టైటాన్, పిసి జ్యువెలర్స్, తంగమయిల్ జువెలరీ , త్రిభోవందాస్ భీమ్జీ జవేరి (టిబిజెడ్) ఏప్రిల్ నుండి ఇప్పటివరకు 21-72 శాతం ర్యాలీ చేశాయి. బంగారం ఆల్-టైమ్ హై ,బలమైన వినియోగదారుల కొనుగోలు నుండి 6 శాతం పడిపోయిన నేపథ్యంలో ఈ ర్యాలీ ఊపందుకుంది. -
మళ్లీ పరుగందుకున్న పసిడి, వెండి అయితే ఏకంగా
July 14th Gold Silver Prices: దేశంలో వెండి ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. దేశీయ మార్కెట్లో తగ్గినట్టే తగ్గిన పసిడి ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. అమెరికా డాలర్ బలహీనంగా ఉండటంతో బంగారం ధరలు పెరిగాయి. అటు వెండి కూడా భారీగా పెరిగింది.(జయహో! రాకెట్ వుమన్ ఆఫ్ ఇండియా రీతు కరిధాల్) 22క్యారెట్ల 10గ్రా. పసిడి రూ. 350 పెరిగి, రూ. 55,000కి చేరింది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 380 ఎగిసి రూ. 60,00కి చేరింది. ముంబై, కోల్‌కతా, కేరళ, బెంగళూరు, హైదరాబాద్‌లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.55,000, 24 క్యారెట్ల బంగారం రూ.60,000గా చేరడం గమనార్హం. అటు హైదరాబాద్మార్కెట్లో వెండి ధర ఏకంగా వెయ్యి రూపాయలు ఎగిసింది. ప్రస్తుంతం రూ.813మేర పెరిగి కిలో వెండి 81, 300 పలుకుతోంది. ఇదీ చదవండి: తొలి కంప్యూటర్ అందించిన టెక్ దిగ్గజం, బిలియనీర్ ఎవరో తెలుసా? -
మెక్‌డొనాల్డ్స్‌కి టొమాటో ‘మంట’ ఏం చేస్తోందో తెలుసా?
చెట్టెక్కి కూర్చున్న టొమాటో ధర సామాన్య ప్రజల్నే కాదు.. కార్పొరేట్ ఫుడ్ చైన్లను కూడా వణికిస్తోంది. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ చైన్ మెక్‌డొనాల్డ్స్ కి టొమాటో మంట సెగ బాగా తగిలింది. టొమాటో ధర ఆకాశాన్నంటడంతో సాధారణ జనం టొమాటో లేకుండానే కాలం గడిపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు రెస్టారెంట్లు కూడా టొమాటో లేకుండానే వంటకాలను వడ్డించేందుకు సిద్ధమైపోతున్నాయి. (నిమిషాల్లో రూ.500 కోట్లు: ప్రముఖ ఇన్వెస్టర్‌కి కలిసొచ్చిన అదృష్టం, కారణం!) రికార్డు స్థాయికి చేరిన ధరల సెగతో మెక్‌డొనాల్డ్స్ మెనూ నుంచిటొమాటోను తొలగించేసింది. పెరిగిన ధరలు, సరఫరా లేకపోవడంతో టొమాటో లేకుండానే బర్గర్లు, పిజ్జాలాంటి వాటిని సరఫరా చేస్తోంది. తమ నాణ్యతా ప్రమాణాలకు తగినసరఫరా లేకపోవడమే కారణమంటూ నోటీసులు అంటించడం ఇపుడు హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(World Richest Beggar Bharat Jain: వరల్డ్‌లోనే రిచెస్ట్ బిచ్చగాడు ఎవరో తెలుసా? ఎన్ని కోట్ల ఆస్తి తెలిస్తే..?) ఎంత ప్రయత్నించినా ప్రపంచ స్థాయిలో ఉండే నాణ్యతా ప్రమాణాలకు తగిన టొమాటో దొరకడం లేదు. అందుకే కొన్నాళ్లు టొమాటో లేని ఆహార ఉత్పత్తులను అందించాల్సి వస్తోంది. దిగుమతికీ కష్టపడుతున్నాం' అంటూ ఢిల్లీని కన్నాట్ ప్లాజా రెస్టారెంట్లలో నోటీసులు అతికించింది. సప్లయ్ చెయిన్‌లో నాణ్యమైన సమస్యలే కాకుండా,ధరల సమస్య కూడా తలెత్తిందని నిర్వాహకులు తెలిపారు. (40వేల కోట్లను తృణప్రాయంగా త్యజించిన బిలియనీర్ ఏకైక కొడుకు..ఏం చేశాడో తెలుసా?) కాగా వాతావరణ పరిస్థితులు, భారీ వర్షాలతో దేశంలో టొమాటో దిగుబడి బాగా పడిపోయింది. ఫలితంగా అనేక నగరాల్లో కిలో టొమాటో రూ. 100 నుంచి 200వరకు పలుకుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు టొమాటాల కొరత కారణంగా ప్రత్యామ్నాయాల్ని వాడటమని సూచనలు, ప్రకటనలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా “టొమాటో ధరలు పెరుగుతున్నాయా? బదులుగా టొమాటోప్యూరీ వాడుకోండి” అంటూ టాటా బిగ్‌బాస్కెట్ షాపింగ్ యాప్ ప్రకటనను విశేషంగా నిలుస్తోంది. గతంలో ఉల్లిపాయ ధరలు కూడా బాగా పెరిగినపుడు ఉల్లికి బదులుగా క్యాబేజీని వాడిన వైనాన్ని జనం గుర్తు చేసుకుంటున్నారు. -
మోదీ లూటీ విధానాల వల్లే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుదల
న్యూఢిల్లీ: దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగానికి నరేంద్ర మోదీ ప్రభుత్వ చేతగానితనమే కారణమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ప్రభుత్వ డొల్ల నినాదాలను ప్రజలు ఎంతమాత్రం నమ్మడం లేదని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. మోదీ ప్రభుత్వం ప్రజలను లూటీ చేయడమే పనిగా పెట్టుకుందని, అందుకే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆరోపించారు. జనం కష్టాల్లో ఉంటే బీజేపీ మాత్రం అధికారం కోసం పాకులాడుతోందని దుయ్యబట్టారు. ఈ మేరకు ఖర్గే బుధవారం ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు ఆకాశంలోకి దూసుకెళ్తున్నాయని, నిరుద్యోగం 8.45 శాతానికి చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఉపాధి హామీ పథకాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని, పనులు లేక కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎన్నికల ముందు అచ్చే దిన్, అమృత్ కాల్ అంటూ నినాదాలు ఇచి్చన ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు వాటిని పూర్తిగా విస్మరించారని ఖర్గే ఆక్షేపించారు. ఈసారి ఎన్నికల్లో ఎన్ని రకాలుగా ప్రచారం చేసుకున్నా ఫలితం ఉండదని, బీజేపీని జనం ఓడించడం తథ్యమని జోస్యం చెప్పారు. -
కూరగాయల ధరల నియంత్రణకు చర్యలు
సాక్షి, అమరావతి: పెరుగుతున్న కూరగాయల ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సీఎం యాప్ ద్వారా రోజూ క్షేత్రస్థాయిలో కూరగాయల ధరల హెచ్చుతగ్గులను పరిశీలిస్తోంది. ఉల్లి, ఇతర కూరగాయల ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా.. టమాటా ధర పెరుగుతోంది. ముఖ్యంగా రాయలసీమ, కృష్ణా, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోనే టమాట ధర పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా టమాటాతో పాటు ముందస్తు చర్యల్లో భాగంగా ఉల్లి, బంగాళదుంపలు, మిరప వంటి ఇతర కూరగాయల ధరలను సమీక్షిస్తున్నారు. మరో వైపు ప్రభుత్వం మార్కెటింగ్ శాఖను రంగంలోకి దింపింది. ధరల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కర్నూలు మినహా మిగిలిన జిల్లాల్లో టమాటా ధర బహిరంగ మార్కెట్లో కిలో రూ. 32 నుంచి రూ. 65 మధ్యలో, ఉల్లిపాయలు కిలో రూ.20 నుంచి 25 మధ్య ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్లలో ఈ రెండింటి ధరలు బహిరంగ మార్కెట్‌కంటే తక్కువగా ఉండేలా చర్యలు చేపట్టారు. టమాటా కిలో రూ.100 దాటితే మార్కెట్లో జోక్యం చేసుకొని రైతుల నుంచి కొనుగోలు చేసి సబ్సిడీపై వినియోగదారులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం రైతుబజార్ల ఎస్టేట్ ఆఫీసర్లతో రైతుబజార్ల సీఈవో నందకిషోర్ సమీక్షించనున్నారు. సీఎం యాప్ ద్వారా రోజూ జిల్లాలవారీగా కూరగాయల ధరలను సమీక్షిస్తున్నామని, ప్రస్తుతం ధరలు నియంత్రణలోనే ఉన్నాయని మార్కెటింగ్ శాఖ కమిషనర్ రాహుల్ పాండే ‘సాక్షి’కి తెలిపారు. అవసరమైతే మార్కెట్లో జోక్యం చేసుకుంటామని చెప్పారు. మిర్చి రైతుకు పండగే కంకిపాడు: రాష్ట్రంలో మిర్చి రైతుకు పండగొచ్చింది. సంవత్సర కాలంగా కిలో రూ.50 కి మించని పచ్చి మిర్చి ప్రస్తుతం రూ. 100 దాటింది. వారం, పది రోజులుగా మిర్చి ధర రూ 35 నుంచి క్రమేపీ పెరిగింది. వేసవి కారణంగా మిర్చి సాగు తగ్గింది. డిమాండ్‌కు సరిపడా దిగుబడి లేకపోవడంతో ధర పెరిగింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
టమాటా రూ.100 పచ్చిమిర్చి రూ.160
సాక్షి, హైదరాబాద్: కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. నెలరోజుల క్రితం వరకు రూ.వందకు నాలుగు కిలోల చొప్పున అమ్మిన టమాటాల ధర ఒక్కసారిగా పెరిగింది. హైదరాబాద్‌తోపాటు అన్ని ప్రాంతాల్లోనూ రిటైల్ మార్కెట్లో టమాటా కిలో రూ.100కు చేరింది. పావుకిలో కొనాలంటే రూ.30 ఇస్తే తప్ప దొరకని పరిస్థితి. అలాగే, పచ్చిమిర్చి, బీన్స్, చిక్కుడుతోపాటు అన్ని కూరల్లో వాడే అల్లం, వెల్లుల్లి ధరలు కూడా సామాన్యుడికి ఏమాత్రం అందనంతగా పెరిగిపోయాయి. పచ్చిమిర్చి నాణ్యతను బట్టి కిలో రూ.120 నుంచి 160 వరకు విక్రయిస్తున్నారు. ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు తప్ప బెండకాయలు, బీరకాయలు, చిక్కుడు తదితర కూరగాయల ధరలు కిలో రూ.60–80కి మధ్య ఉండటం గమనార్హం. రైతుబజార్లు, మార్కెటింగ్ శాఖ మొబైల్ వ్యాన్లలో విక్రయించే చోట ధరలు కొంత తక్కువగా ఉన్నప్పటికీ, రిటైల్ దుకాణాల్లో కొనాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. సూపర్మార్కెట్లలో రిటైల్ మార్కెట్ల కన్నా కిలోకు రూ.10–15 వరకు అధికంగా ఉంది. అల్లం కిలో రూ.300 కూరల్లో రుచికి తప్పనిసరైన అల్లం ధర ఊహించని విధంగా కిలో రూ.300కి చేరింది. మంగళవారం హైదరాబాద్ చింతలబస్తీలో బండ్లపైన అల్లం పావుకిలో రూ.80 ఉండగా, కిలోకు రూ.300 చెప్పడం గమనార్హం. వెల్లుల్లి కిలో రూ.200 ఉండగా, మేలురకం ధర రూ.240 ఉంది. మూడు నెలల క్రితం వరకు కిలో రూ.100కి లభించిన అల్లం, వెల్లుల్లి ధరలు ఎన్నడూ లేనివిధంగా పెరిగిపోయి సామాన్యుడు కొనలేనంత పైకి చేరుకున్నాయి. బీన్స్ నాణ్యతను బట్టి కిలో రూ.120 నుంచి రూ.160 వరకు ఉండగా, చిక్కుడుకాయలు కిలో రూ.80 నుంచి రూ. 100కు విక్రయిస్తున్నారు. వేసవిలో కూరగాయలు పండించకనే.. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా మూడునెలలుగా రాష్ట్రంలో కూరగాయల పంటలు ఆశించిన స్థాయిలో లేవు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌లో అకాల వర్షాలు, మే, జూన్లలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా టమాటా, పచ్చిమిర్చి, వంకాయ, బెండకాయ తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఏపీ నుంచి కూడా ఆశించినస్థాయిలో తెలంగాణకు దిగుమతులు లేవు. మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, క్యారెట్ వంటివి తప్ప నిత్యం వండుకునే కూరగాయల దిగుమతులు తక్కువగానే ఉన్నట్లు హైదరాబాద్ రైతుబజార్ ప్రతినిధి ఒకరు చెప్పారు. -
వామ్మో..పసిడి పరుగు, వెండి హై జంప్!
సాక్షి, ముంబై: దేశీయంగా పసిడి పైపైకి చేరుతూ కొనుగోలుదారులకు షాకిస్తోంది. దేశంలో పలు నగరాల్లో బంగారం ధర రూ.61 వేలను దాటేసింది. అటు వెండి కూడా ఇదే బాటలో ఉంది. నేడు దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) పై రూ. 10 పెరిగి.. రూ. 55,310కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.19 పెరిగి రూ.61,340కి చేరుకుంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)రూ.55,300గాను, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏక ంగా వెయ్యి రూపాయలు ఎగిసి రూ.60,330గా ఉంది. కాగా ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61, 360 గా ఉంది. అటు ఢిల్లీలో10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 61, 510 గా ఉంది. ఇక హైదరాబాద్‌లో మరో విలువైన లోహం వెండి ధరలను పరిశీలిస్తే కేజీ వెండి ఏకంగా రూ. 2900పుంజుకుంది. కిలో ధర రూ.77800గా ఉంది. మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. బలహీనమైన అమెరికా ఆర్థిక డేటాతో ఆర్థిక వ్యవస్థ మందగమనం, ఫెడరల్ రిజర్వ్ పాలసీ వడ్డీ రేటు వడ్డన ఆందోళనతో గోల్డ్ ఔన్సు 2వేల డాలర్లు అధిగమించింది. తద్వారా ఒక సంవత్సరం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఎంసీక్స్ గోల్డ్ బుధవారం రూ. 61,130 వద్ద ఉంది. కిలో వెండి 3.7 శాతం ఎగిసి రూ. 74,700 కి స్థాయిని తాకింది. -
యూకేలో పాస్‌పోర్ట్ సిబ్బంది సమ్మె
లండన్: దేశంలో ద్రవ్యోల్బణం రెండంకెలకు ఎగబాకిందని, ధరలు పెరిగిపోతున్నాయని, తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో పాస్‌పోర్ట్ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది సోమవారం సమ్మె ప్రారంభించారు. ఐదు రోజులపాటు ఈ సమ్మె కొనసాగనుంది. దీంతో విదేశాలకు వెళ్లాల్సినవారు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. పాస్‌పోర్ట్‌లు సకాలంలో అందకపోతే ప్రయాణాలు మానుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. యూకేలో ద్రవ్యోల్బణం 10.4 శాతానికి చేరుకుంది. ఆహారం, ఇంధనం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. జీవన వ్యయం భారీగా పెరిగిపోయింది. తక్షణమే వేతనాలు పెంచాలన్న డిమాండ్‌తో వైద్యులు, ఉపాధ్యాయులు, రైళ్లు, బస్సుల డ్రైవర్లు, ఎయిర్‌పోర్టుల్లో పనిచేసి సిబ్బంది, పోస్టల్ సిబ్బంది ఇదివరకే సమ్మెకు దిగారు. మళ్లీ టీచర్ల సమ్మెబాట యూకే ప్రభుత్వం ఆఫర్ చేసిన వేతన 4.5 శాతం పెంపు, 1,000 పౌండ్ల వన్‌టైమ్ చెల్లింపును టీచర్లు తిరస్కరించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 27, మే 2న సమ్మె చేపట్టాలని నిర్ణయించినట్లు నేషనల్ ఎడ్యుకేషన్ యూనియన్ ప్రకటించింది.