
Royal Enfield Meteor 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ లవర్స్‌కు కంపెనీ మరోసారి షాక్‌ను ఇచ్చింది. మిటీయోర్ 350 సిరీస్ మోడల్ బైక్ల ధరలను మరోసారి పెంచింది. 2021 జులైలో ఈ బైక్ మోడల్ ధరలను సుమారు రూ. 10,048 మేర పెంచింది. కేవలం రెండు నెలల వ్యవధిలోనే మరోసారి బైక్ ధరలను రాయల్‌ఎన్‌ఫీల్డ్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఫైర్‌బాల్, స్టెల్లార్, సూపర్నోవా అనే మూడు వేరియంట్‌లపై సుమారు రూ. 6,428 మేర పెంచింది.
చదవండి: Apple: మాకు ఎవరీ సహాయం అక్కర్లేదు..!
మిటీయోర్ 350 ఫైర్‌బాల్ వేరింయట్ కొత్త ధర రూ.198,537 గాను, స్టెల్లార్ వేరియంట్ కొత్త ధర రూ. 204,527గాను, సూపర్‌నోవా 350 వేరియంట్ ధర రూ. 214,513 గా నిర్ణయించింది.ఈ ధరలు ఢిల్లీ ఎక్స్-షోరూమ్ కు చెందినవి. ఆయా ప్రాంతాలను బట్టి బైక్ ధరల్లో మార్పులు ఉండవచ్చును. రాయల్ ఎన్‌ఫీల్డ్ మిటీయోర్ 350 బైక్లను గత ఏడాది నవంబర్ నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచింది. థండర్‌బర్డ్ స్థానంలో మిటీయోర్ 350ను రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రవేశపెట్టింది.
చదవండి: బడాబడా కంపెనీలు భారత్ వీడిపోవడానికి కారణం ఇదేనా..!