Bullet bike
-
శివాజీ జయంతి : మహిళామణుల బుల్లెట్ స్వారీ
సోలాపూర్: హైందవ స్వరాజ్య స్థాపకుడు చత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా శ్రీ శివ జన్మోత్సవ మధ్యవర్తి మహా మండల్ ఉత్సవ కమిటీ తరపున అధ్యక్షుడు సుశీల్ బందపట్టే నేతృత్వంలో శివ శోభాయాత్ర నిర్వహించబడింది. ఆదివారం ఉదయం చత్రపతి సంభాజీ మహారాజ్ చౌక్ వద్దకు శోభాయాత్రలో పాల్గొనేందుకు మహిళలు ద్విచక్ర వాహనాలతో తరలివచ్చారు. మహా మండల్ తరఫున మహిళలకు కాషాయ రంగుతో కూడిన శాలువాలు అందజేశారు. ఈ సందర్భంగా చత్రపతి సంభాజీ మహారాజ్ చౌక్ వద్ద సంబాజీ మహారాజ్ విగ్రహానికి పూజలు నిర్వహించి బైకుల ద్వారా శోభాయాత్ర నిర్వహించారు. ఈ యాత్ర చత్రపతి సంభాజీ మహారాజ్ చౌక్ నుంచి ప్రారంభమై.. చత్రపతి శివాజీ మహారాజ్ చౌక్, మెకానిక్ చోక్, నవిపేట్, రాజువాడే చోక్, చిల్లర చౌపాడ్ తదితర మార్గాల గుండా షిండే జోక్ వరకు నిర్వహించారు. శివ జయంతి నిమిత్తంగా మహిళలు చీరలు, తలపై కాషాయరంగు తలపాగాలు ధరించి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. వీధుల్లో మహిళల బైకు ర్యాలీని తిలకించేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. కాగా షిండే చౌక్‌లో ఊరేగింపు ముగిసిన అనంతరం శివజన్మోత్సవ సన్ మధ్యవర్తి మహా మండల్ వారు మహిళలచే హారతి నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు చేసిన చత్రపతి శివాజీ మహరాజ్ నామస్మరణలతో పరిసరాలు దద్దరిల్లాయి. ప్రతి సంవత్సరం శివ జయంతి నిమిత్తంగా వివిధ తరహాలో శోభాయాత్ర చేపట్టాలని మహిళలు ఆకాంక్షను వ్యక్తం చేశారు. శివ జన్మోత్సవ మధ్యవర్తి మహా మండల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ పద్మాకర్ కాలే, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సుశీల్ బందుపట్టే, పురుషోత్తం భరడే, ప్రకాష్ ననార్వే, అంబదాస్ షెలేక్ దేవిదాస్ గులే, మహేష్ హనీమే చాల్లే, బాలాసాహెబ్ పూనేకర్ తదితరులతోపాటు శివ దినోత్సవం మధ్యవర్తి మహా మండల్ సభ్యులు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు.ఇదీ చదవండి: Delhi Earthquake : డబ్బు కాదు భయ్యా.. బతకాలంటే దమ్ముండాలే! -
బుల్లెట్ నడిపాడని.. చేతులు నరికేశారు!
సాక్షి, చెన్నై : వెనుకబడిన సామాజికవర్గానికి చెందిన ఓ యువకుడు తమ కళ్ల ముందు బుల్లెట్ నడపడాన్ని చూసి ఆగ్రహంతో అగ్రవర్గాలు అతడి చేతులను నరికేశారు. ఈ ఘటన తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మానామదురై సమీపంలో గురువారం జరిగింది. వివరాలు..మేళపాలయంకు చెందిన రామన్, చెల్లమ్మ దంపతుల కుమారుడు అయ్యాస్వామి శివగంగైలోని ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి మరణంతో చిన్నాన్న భూమినాథన్ సంరక్షణలో అయ్యా స్వామి ఉన్నాడు. వెనుకబడిన సామాజిక వర్గానికి చెందినప్పటికీ భూమినాథన్ కాస్త స్తోమత కలిగిన వ్యక్తి. దీంతో చిన్నాన్న బుల్లెట్లో అయ్యాస్వామి కళాశాలకు తరచూ వెళ్లి వచ్చేవాడు.తమ కళ్ల ముందు వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన యువకుడైన అయ్యాస్వామి బుల్లెట్లో గ్రామంలో తిరుగుతుండటాన్ని చూసి అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందిన యువకులు ఆగ్రహంతో ఊగి పోయారు. గురువారం ఉదయం కళాశాలకు బుల్లెట్‌పై వెళ్తున్న అయ్యాస్వామిని అడ్డుకుని అగ్రవర్ణ యువకులు కత్తులతో చేతులను నరికేశారు. వీరి వద్ద నుంచి తప్పించుకుని అయ్యాస్వామి చిన్నాన్న భూమినాథన్ వద్దకు పరుగులు తీశాడు. తక్షణం అయ్యాస్వామిని శివగంగై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అక్కడి నుంచి మదురై రాజాజీ ఆస్పత్రికి తరలించగా, అక్కడ వైద్యులు తెగిన భాగానికి కుట్లు వేసి చికిత్స అందిస్తున్నారు. ఈ సమాచారంతో ఆ గ్రామంలో ఉత్కంఠ నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగారు. అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందిన వల్లరసు, వినోద్, ఈశ్వరన్‌లను అరెస్టు చేసి విచారిస్తున్నారు. -
బుల్లెట్ బండితో తేజస్విని గౌడ.. పోజులు మస్త్ (ఫొటోలు)
-
బైక్‌పై లడఖ్.. జర్నీ
జగద్గిరిగుట్ట: సాఫ్ట్వేర్ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి లడఖ్‌కు బుల్లెట్ బైకులపై వెళ్లారు. కుత్బుల్లాపూర్, చింతల్‌కు చెందిన ఆరుగురు స్నేహితులు ఈ నెల 1న ప్రయాణం మొదలుపెట్టి 17 రోజుల అనంతరం తొమ్మిది రాష్ట్రాలను దాటుతూ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. చింతల్ ఫుట్‌బాల్ క్లబ్‌కు చెందిన అవినాష్, చరణ్‌జీత్ సింగ్, వినయ్, ఇస్తియాక్, ప్రదీప్, మనోజ్‌లు సుమారు 6400 కిలోమీటర్లు ఈ జర్నీ చేశారు. సంవత్సరం ముందు నుండి 1000–2000 కిలోమీటర్లు బైకులపై తిరుగుతూ జరీ్నకి కావాల్సిన వస్తువులు తెలుసుకున్నారు. 17,582 అడుగుల ఎత్తులో ఉన్న లడఖ్, ఖర్దుంగ్లకు చేరుకున్నారు. ట్రిప్ పూర్తి చేసుకొని వచ్చిన వీరికి స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. -
‘బుల్లెట్’ పేలిన ఘటనలో మరొకరి మృతి
హైదరాబాద్: బుల్లెట్ ద్విచక్ర వాహనం పెట్రోల్ ట్యాంక్ పేలిన ఘటనలోఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి షౌకత్ అలీ మంగళవారం మృతి చెందాడు. భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ దుర్ఘటనలో దాదాపు 10 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరు 80 శాతానికి పైగా కాలిన గాయాలతో చికిత్స పొందుతూ.. సోమవారం ఉదయం మహ్మద్ నదీం మృతి చెందాడు. భవానీనగర్ ఇన్స్పెక్టర్ ఎం.బాలస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. జహంగీర్‌నగర్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ రహీంఖాన్ ఈ నెల 10న బుల్లెట్ వాహనంపై తన భార్య నేహాతో పని నిమిత్తం బయటికి వెళ్తున్నాడు. నసీర్ ఫంక్షన్ హాల్ సమీపం వద్దకు రాగానే వాహనం నుంచి స్వల్పంగా మంటలు రాసాగాయి. దీంతో అబ్దుల్ రహీం ఖాన్ వాహనాన్ని స్థానికుల సహాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయతి్నంచాడు. ఇంతలోనే బుల్లెట్ వాహనం కింద పడిపోవడంతో పెట్రోల్ ట్యాంక్ ఒక్కసారిగా పేలడంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఈ ఘటనలో అబ్దుల్ రహీం ఖాన్‌తో పాటు మంటలను ఆర్పేందుకు సహాయం చేసిన స్థానికులు సలేహ, షేక్ అజీజ్, ఖాజా పాషా, చెరుకు బండి యజమాని మహ్మద్ నదీం, ఫలక్‌నుమా జహంగీర్‌నగర్‌కు చెందిన స్క్రాప్ వ్యాపారి షౌకత్ అలీ, మహ్మద్ హుస్సేన్ ఖురేíÙ, షేక్ ఖాదర్, గౌస్ రహమాన్లు మంటల వ్యాప్తి కారణంగా గాయాలకు గురయ్యారు. మంటలను ఆర్పే ప్రయత్నంలో మొఘల్‌పురా పీఎస్ కానిస్టేబుల్ సందీప్ సైతం గాయాలకు గురయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహ్మద్ నదీమ్ సోమవారం మృతి చెందగా.. ఫలక్‌నుమా జహంగీర్‌నగర్‌కు చెందిన స్క్రాప్ వ్యాపారి షౌకత్ అలీ మంగళవారం మృతి చెందాడు. -
సంక్రాంతి కోడిపందేల్లో బుల్లెట్ గెలుచుకున్న కోడిపుంజు
భీమవరం: సంక్రాంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సంప్రదాయ కోడి పందేలు మూడో రోజూ జోరుగా సాగాయి. జిల్లాలోని భీమవరం, ఉండి, పాలకొల్లు, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, ఆచంట నియోజకవర్గాల్లో రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల నాయకులు కోడిపందేలు నిర్వహించారు. పందేలను తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పందేల బరులు కిటకిటలాడాయి. కోడి పందేలతో పాటు గుండాట, పేకాట వంటి జూదాలు కూడా విచ్చలవిడిగా సాగాయి. కోడిపందేల బరులు వద్ద జూదాలు ఏర్పాటుకు నిర్వాహకులు వేలం పాటలు నిర్వహించగా, పెద్ద బరుల వద్ద జూదాల నిర్వహణకు అధిక మొత్తంలో పాటలు పాడినట్లు తెలుస్తోంది. కాళ్ల, తణుకు, ఆకివీడు, యలమంచిలి, ఇరగవరం, అత్తిలి, వీరవాసరం, ఉండి తదితర మండలాల్లో రూ.కోట్లలో బెట్టింగ్‌లు సాగాయి. నగదు లెక్కింపునకు ప్రత్యేకంగా కౌంటింగ్ మెషీన్లు ఏర్పాటు చేయడం గమనార్హం. పగలు, రాత్రి తేడా లేకుండా.. రాత్రి సమయంలో సైతం కోడి పందేలు, జూదాలు నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఫ్లడ్లైట్స్ ఏర్పాటు చేయడమేగాక పందేలను స్పష్టంగా చూడడానికి కొన్ని చోట్ల ఎల్ఈడీ టీవీలు సైతం ఏర్పాటు చేశారు. కాళ్ల మండలంలో బౌన్సర్లను ఏర్పాటు చేసి ప్రత్యేక రక్షణ కంచెలను ఏర్పాటు చేశారు. వీక్షించే వారిని అనుమతించడానికి వారి చేతులకు ప్రత్యేక ట్యాగ్లు వేశారు. బారులు తీరిన కార్లు : కోడి పందేల బరులు వద్ద భారీ సంఖ్యలో చిన్నకార్లు, మోటారు సైకిళ్లు బారులు తీరాయి. పందేల ప్రాంతంలో ఎక్కువ విస్తీర్ణంలో వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అక్కడే భోజనాలతోపాటు అన్ని రకాల తినిబండారాలు అందుబాటులో ఉండడంతో పందెంరాయుళ్లు, వీక్షకులు ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే ఉండేలా ఏర్పాట్లు చేశారు. పోడూరు మండలం కవిటం వద్ద నిర్వహించిన కోడి పందేల శిబిరం వద్ద జూదగాళ్లు విశ్రాంతి తీసుకోడానికి ప్రత్యేక వాహనాలను అందుబాటులో ఉంచారు. వ్యక్తికి తీవ్ర గాయం ఉండి గ్రామంలోని పెదపుల్లేరు రోడ్డులో నిర్వహించిన కోడిపందేల శిబిరం వద్ద పందేలు తిల కిస్తున్న చంటిరాజు అనే వ్యక్తి కాలికి కోడి కత్తి ప్రమాదవశాత్తు తగిలి తీవ్ర గాయం కావడంతో అతనిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అలాగే భీమవరం మండలం తాడేరు గ్రామం వద్ద కోడిపందేల శిబిరం వద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరి తలకు తీవ్ర గాయమైంది. విజేతలకు ద్విచక్రవాహనాలు పాలకోడేరు మండలం పెన్నాడ గ్రామం వద్ద నిర్వహించిన కోడిపందేల్లో ఎక్కువ పందేలు గెలిచిన శృంగవృక్షం గ్రామానికి చెందిన బబ్లు అనే వ్యక్తి బుల్లెట్ మోటారు సైకిల్ గెలుచుకోగా మరో ఇద్దరు విజేతలకు నిర్వాహకులు స్కూటీలను బహుమతులుగా అందజేశారు. -
Om Singh Rathore: బుల్లెట్ బాబా టెంపుల్
మన దేశంలో జాతీయ రహదారుల పక్కన ఆలయాలు కనిపిస్తుంటాయి. అయితే జోద్పూర్–అహ్మదాబాద్ జాతీయ రహదారి పక్కన ఉన్న ఆలయం మాత్రం ఆసక్తికరం. ఆదిత్య కొంద్వార్ అనే రచయిత ఈ ఆలయానికి సంబంధించి విషయాలను ‘ఎక్స్’లో షేర్ చేశాడు. చాలా సంవత్సరాల క్రితం...‘బుల్లెట్ బాబా’ గా పిలుచుకొనే ఓమ్ సింగ్ రాథోడ్ నడుపుతున్న రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. బైక్‌ను పోలీస్‌స్టేషన్‌లో పెట్టారు. అయితే మరుసటి రోజు ఈ బైక్ కనిపించలేదు. అందరూ ఆశ్చర్యపోయేలా ప్రమాదం జరిగిన స్థలంలో కనిపించింది. దీంతో స్థానికులు ఈ ‘బుల్లెట్ బైక్’కు పూజలు చేయడం మొదలుపెట్టారు. తరువాత ఒక ఆలయాన్ని కట్టి ఈ బుల్లెట్ బైక్‌ను విగ్రహంలా ప్రతిష్ఠించారు. కాలక్రమంలో ఇది ‘బుల్లెట్ బాబా టెంపుల్’గా ప్రసిద్ధి పొందింది. రోడ్డుపై ప్రయాణం చేసేవారు ఈ ఆలయం దగ్గర ఆగి ‘ఎలాంటి ప్రమాదం జరగకూడదు’ అని మొక్కుకుంటూ వెళుతుంటారు. -
ఓం బన్నా బుల్లెట్ బాబా
అది 1988 డిసెంబర్ 2, రాత్రి పది దాటింది. రాజస్థాన్ లోని పాలీ–జోధ్‌పూర్ హైవే రూట్లో ‘350cc రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ RNJ7773’ బండి హుందాగా, వేగంగా పరుగులు తీస్తోంది. ఎందుకో ఆ బండి అకస్మాత్తుగా స్కిడ్ అయింది. క్షణాల్లోనే భళ్లుమనే పెద్ద శబ్దం.. ఏకంగా మరణ శాసనాన్నే లిఖించింది. చెట్టును ఢీ కొట్టిన ఆ బండి హెడ్‌లైట్.. మిణుకు మిణుకుమని ఒక్కసారిగా ఆరిపోయింది. మరునాడు ఆ చెట్టు ముందు పడి ఉన్న బుల్లెట్‌ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు విచారణకు సిద్ధమయ్యారు. ఆ బుల్లెట్.. పాలీ జిల్లాలోని ‘చోటిలా’ అనే గ్రామానికి చెందిన జమీందారు జోగ్ సింగ్ కుమారుడు.. ‘ఓం సింగ్ రాథోడ్’ అనే 23 ఏళ్ల యువకుడిదని నిర్ధారించుకున్నారు. ప్రమాదంలో అతను చనిపోయాడని, అతనితో పాటు ప్రమాదానికి గురైన అతని ప్రాణ స్నేహితుడు ట్రీట్మెంట్ పొందుతున్నాడని తెలుసుకున్నారు. వెంటనే బుల్లెట్‌ని.. తమ సీజ్డ్ వెహికల్ యార్డ్‌కి తరలించారు. నరేష్ భట్టి అనే స్థానిక డ్రైవర్.. మరునాడు ఉదయాన్నే పోలీస్ స్టేషన్‌కి వచ్చి..‘నిన్న మీరు స్వాధీనం చేసుకున్న రాథోడ్ గారి బుల్లెట్‌ని.. మళ్లీ యాక్సిడెంట్ జరిగిన చోటే ఎందుకు వదిలేశారు?’ అని ప్రశ్నించాడు. అతని ప్రశ్న పూర్తికాకుండానే.. అక్కడున్న ఓ కానిస్టేబుల్ పరుగున వెళ్లి.. తమ సీజ్డ్ వెహికల్ యార్డ్‌ని పరిశీలించాడు. అంతే వేగంగా తిరిగి వచ్చి ‘యార్డ్‌లో ఆ బుల్లెట్ లేదు సార్’ అని ఆయాసపడుతూ చెప్పాడు. అది ఆకతాయిల పని కావచ్చు అనుకున్న పై అధికారులు.. వెంటనే మళ్లీ సంఘటన స్థలానికి వెళ్లి ఆ బండిని తీసుకొచ్చి.. ఈసారి గొలుసుతో లాక్ చేశారు. తెల్లవారేసరికి యార్డ్‌లో.. గొలుసు మాత్రమే ఉంది. బుల్లెట్ లేదు. అది మళ్లీ యాక్సిడెంట్ జరిగిన చోటుకే వెళ్లిపోయింది. ఇక లాభం లేదని బుల్లెట్ టైర్లలో గాలి తీసి ఓ రోజు.. పెట్రోల్ తీసి మరో రోజు.. బుల్లెట్‌ని యార్డ్‌లో ఉంచడానికి ప్రయత్నించారు. కానీ మళ్లీ బుల్లెట్టే గెలిచింది. పోలీసులు విఫలమయ్యారు. దాంతో అసలు ఆ బుల్లెట్ యాక్సిడెంట్ జరిగిన చోటుకు దానంతట అదే ఎలా వెళ్తోంది? ఎందుకు వెళ్తోంది? ఎవరు తీసుకెళ్తున్నారు? ఇలా ఎన్నో ప్రశ్నలు హడలెత్తించే కథనాలను సృష్టించడం మొదలెట్టాయి. రాథోడ్ ఆత్మ బుల్లెట్ బండిలో చేరిందని.. అదే బండిని అక్కడికి తీసుకెళ్తోందని చాలామంది నమ్మడం మొదలుపెట్టారు. ఆ సమయంలోనే.. రాథోడ్ కలలోకి వచ్చి.. తనకు గుడి కట్టించమని కోరాడంటూ అతడి అమ్మమ్మ ప్రకటించింది. దాంతో భయపడేవారంతా భక్తి బాటపట్టారు. యాక్సిడెంట్ జరిగిన చోటే స్థలాన్ని సేకరించి.. ఆ చెట్టు దగ్గరే గుడి కూడా కట్టేశారు. భక్తుల దర్శనార్థం ఆ బుల్లెట్నీ అక్కడే ప్రత్యేకంగా ఉంచి.. పవిత్రంగా పూజించడం మొదలుపెట్టారు.రాజస్థాన్ రాజ్‌పుత్ కుటుంబానికి చెందిన యువకులను ‘బన్నా’ అని పిలుస్తుంటారు. అందుకే రాథోడ్‌ని కూడా ‘ఓం బన్నా’ అని భక్తితో పిలవడం మొదలుపెట్టారు. అతని ఫొటో పెట్టి.. అతని విగ్రహం కట్టి.. మొక్కులు మొక్కడం ప్రారంభించారు. ప్రయాణాల్లో ప్రమాదాలు జరగొద్దంటే బుల్లెట్ బాబా ఆశీర్వాదం తప్పనిసరి అనేది ఆనవాయితీగా మారింది. జోగ్ సింగ్‌కి ఒక్కగానొక్క కొడుకు రాథోడ్. అతడికి బుల్లెట్ బండి అంటే ప్రాణం. చాలా ఆశపడి కొనుక్కున్న ఆ బండిని.. చాలా ఇష్టంగా చూసుకునేవాడు. పెళ్లి అయిన కొన్ని నెలలకే అలా ప్రమాదంలో చనిపోయాడు. తీరని విషాదంతో ఉన్న జోగ్ సింగ్ కుటుంబానికి.. ఈ ‘ఓం బన్నా టెంపుల్’ ఊరటగా నిలిచింది. ఇక్కడ నేటికీ పెద్ద పెద్ద జాతర్లు జరుగుతుంటాయి. పిల్లలు, పెద్దలు ఏ శుభకార్యం తలపెట్టినా ముందు ఈ గుడికి వెళ్లి దర్శనం చేసుకుంటారు. గాజులు, ఎర్ర జాకెట్ ముక్కలను ముడుపులుగా కడుతుంటారు. అలాగే మద్యాన్ని బుల్లెట్ బాబాకు నైవేద్యంగా పెడుతుంటారు.అయితే రాథోడ్ మరణించిన దారి గుండా.. ప్రయాణం చేసేవారికి ఓం బన్నా ఆత్మ పలు రూపాల్లో కనిపించి.. హారన్ కొట్టమని, జాగ్రత్తగా వెళ్లమని చెప్పినట్లు చాలామంది సాక్ష్యమిస్తుంటారు. ఈ గుడికి వచ్చే భక్తులు.. తమని ఎల్లవేళలా కాపాడమంటూ అర్జీ పెట్టినట్లుగా.. తమ వాహనాల హారన్స్ కొడుతూ ఉంటారు. తమను రక్షించడానికే రాథోడ్ ఆత్మ ఆ గుడి ప్రాంగణంలోని ఆ బుల్లెట్లో ఉందని స్థానికులంతా బలంగా నమ్ముతుంటారు. ఏదేమైనా ఆనాడు బుల్లెట్ స్టేషన్ నుంచి ఎలా ఆ ప్రమాదఘటనా స్థలానికి వెళ్లింది? రాథోడ్ అమ్మమ్మ కల నిజమేనా? ఆ గుడిలో ఆత్మ ఉందా? అది దైవత్వాన్ని ఆపాదించుకుని భక్తుల్ని రక్షిస్తోందా? అనే ప్రశ్నలు సమాధానాల్లేని మిస్టరీనే! - సంహిత నిమ్మన -
బుల్లి బుల్లెట్ బండితో రైడ్..
-
మినీ బార్బీ బుల్లెట్: నెటిజన్లు ఫిదా! వైరల్ వీడియో
బైక్ మీద రోడ్డుమీద వెళుతున్నపుడు మన పక్క నుంచి మనకు ఒక జర్క్ ఇచ్చి మరీ సర్రున ఒక బైక్ దూసుకుపోయిందనుకోండి. అరే.. పోతార్రా.. అనుకుంటాం.. ఎన్ని యాక్సిడెంట్లు అయినా వీళ్లకి మాత్రం బుద్ధి రాదనుకుంటూ మనసులోనే మధనపడతాం. నిత్య జీవితంలో ఇలాంటివి చాలానే చూస్తూ ఉంటాం. కానీ ఒక్కోసారి అద్భుతాలు కూడా కనిపిస్తాయి కదా..! అచ్చం అలాగే ఢిల్లీ వీధుల్లో ఒక మినీ బుల్లెట్ పింకీ అందర్నీ ఆశ్చర్యపర్చింది. Mini Pink Bullet స్టోరీ ఏంటంటే...ఇన్‌స్టా యూజర్ రామ్మీ రైడర్ సైకిల్ కంటే చిన్నగా ఉన్న మినీ బుల్లెట్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలోషేర్ చేశారు. దీంతో నెటిజన్లు తెగ ఆశ్చర్యపోయారు. సెల్పీలు, ఫోటోలతో సందడి చేశారు. నెట్లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో 40 లక్షలకు పైగా వ్యూస్‌ను, 3 లక్షల, 87వేల లైక్స్‌ను సొంతం చేసుకుంది. భలే అందంగా ఉంది...సూపర్ బుల్లెట్ లాంటి కామెంట్లు వెల్లువెత్తాయి. "బార్బీ బుల్లెట్ ఇట్స్ సో క్యూట్’, నాకూ కావాలి అని ఒకరు, అని పిలిచారు. ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, ఈ బైక్‌తో ప్రాణాలు పోయే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి అని మరొకరు వ్యాఖ్యానించారు. ఫైనల్లీ నేను సురక్షితంగా ప్రయాణించే వెహికల్ కనిపించింది అంటూ ఇంకొకరు. ఈ బైక్‌ని చూసిన తర్వాత కాళ్లలో, వెన్నులో తిమ్మిర్లు మొదలయ్యాయి అంటూ మరో యూజర్ సరదాగా కమెంట్ చేశారు. మినీ పింక్ బుల్లెట్ తయారైన విధానంబెట్టిదనిన మార్కెట్లో డిస్ కంటిన్యూ అయిపోయిన పాత యాక్టివా స్కూటరే సరికొత్త మినీ పింక్ బుల్లెట్లా మారిపోయింది. ఈ వివరాలను ఈ వీడియోలో పొందుపరిచారు. ట్రాఫిక్ పోలీసులు సహా నెటిజన్లను పలువురిని ఆకట్టుకున్న క్యూట్ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేసుకోండి మరి! View this post on Instagram A post shared by Rammy Ryder (@rammyryder) -
ఒక్కసారిగా.. బుల్లెట్ బండి బాలుడి పై పడడంతో.. తీవ్ర విషాదం!
సంగారెడ్డి: బుల్లెట్ బండి వద్ద ఆడుకుంటున్న క్రమంలో అది మీద పడి బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాలు. నేపాల్‌కు చెందిన లక్ష్మణ్ రావల్ బతుకుదెరువు కోసం మూడేళ్ల క్రితం అమీన్పూర్ పరిధిలోని బీరంగూడకు వచ్చాడు. సాయి భగవాన్ ఎన్క్లేవ్ వద్ద నివాసం ఉంటూ పనులు చేసుకుంటున్నాడు. ఇతనికి కుమారులు హేమంత్ రావల్(03), భాస్కర్ ఉన్నారు. హేమంత్ 8వ తేదీన ఇంటి పక్కన ఉండే పురుషోత్తం బుల్లెట్ బండి వద్ద ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు అది మీద పడింది. తీవ్ర గాయాలైన బాలుడిని చికిత్స నిమిత్తం చందానగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. బాలుడి తండ్రి లక్ష్మణ్ రావల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
బుల్లెట్టు బండెక్కి బైక్ రైడింగ్.. హిజాబ్ రైడర్ స్టోరీ ఇదే
ఇట్టే వస్తే రానీ వెంటా,నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా,డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ అందాల దునియానే సూపిత్త పా చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ.. పాడుతూ, డ్యాన్స్ చేస్తూ, బైక్ ఎక్కే రోజుల నుంచి గేర్ల్మీద గేర్లు మార్చుకుంటూ రయ్యన దూసుకెళ్తున్నారు నేటి తరం అమ్మాయిలు. సెల్ఫ్‌తో బండిని స్టార్ట్‌చేసి సూదూర ప్రాంతాలకు సోలోగా రైడ్ చేస్తూ దునియాని చుట్టేస్తూ ఆస్వాదిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రీతిలో రైడింగ్ చేస్తుంటే... మరింత ప్రత్యేకంగా హిజాబ్ ధరించి జాతీయ రహదారులే కాదండోయే దేశాలు దాటి మక్కా దాక బుల్లెట్ మీదే వెళ్తానంటోంది ముఫ్పై ఏళ్ల నూర్ బీ. చెన్నైలోని పల్లవరానికి చెందిన అమ్మాయి నూర్‌బీ. సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి. ఇది చేయకు! అది చేయకు! అలా ఉండకు! ఇలా ఉండాలి! అంటూ ఎన్నో నిబంధనలు. అడుగు తీసి అడుగు వేయాలంటే ఆలోచించాలి. అయినా నూర్ బీకి మాత్రం బైక్ నడపడం అంటే ఎంతో ఇష్టం. ఆ ఇంట్లో అమ్మాయిలు బైక్‌లు అస్సలు నడపకూడదు. అయినా తన ఇష్టాన్ని మాత్రం వదులుకోలేదు. కాలేజీలో ఉండగానే మోటర్ సైకిల్ కొనుక్కోవాలనుకునేది. చదువు పూర్తయ్యాక బెంగళూరులోని ఐటీ కంపెనీలో హెచ్ఆర్ ఉద్యోగం వచ్చింది. నెలనెలా వచ్చే జీతంలో కొంత మొత్తాన్ని బండి కొనుక్కోవడానికి దాచుకునేది. ఇలా జమ చేసిన డబ్బులతో 2021లో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మోడల్‌ను కొనుక్కుంది. బండి కొన్న వెంటనే ఉద్యోగం మానేసి రైడింగ్ షురూ చేసింది. ఫస్ట్ రైడ్... ఎన్నాళ్లుగానో వేచిచూస్తోన్న క్షణాలు వచ్చేశాయి. వెంటనే రైడింగ్‌కు ప్రణాళిక రూపొందించుకుంది నూర్. 2021 నవంబర్ 14 తొలి రైడింగ్ గేర్‌ను స్టార్ట్ చేసింది. ఈ రైడ్ గురించి కుటుంబ సభ్యులకు చెప్పలేదు. బెంగళూరు నుంచి మహారాష్ట్ర, డామన్ డయ్యూ, గుజరాత్, రాజస్థాన్ మీదుగా ఢిల్లీ చేరుకుంది. తల్లిదండ్రులకు చెప్పకుండా రహస్యంగా ఉంచినప్పటికీ మహారాష్ట్రలోని లోనావాలకు చేరుకునేటప్పటికి విషయం ఇంట్లో వాళ్లకు తెలిసింది. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు నూర్. ఐదున్నర అడుగుల ఎత్తున్న నూర్.. హిజాబ్ ధరించి బుల్లెట్ బండి మీద డుగ్గు డుగ్గు అని వెళ్తుంటే ఆమెను అంతా ఆసక్తిగా చూసేవారు. ఆ చూపులు నూర్‌కు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చేవి. ఈసడింపులు, యాక్సిడెంట్ ఎదురైనప్పటికీ... ప్రపంచం రోజురోజుకీ అప్డేట్ అవుతున్నప్పటికీ కొంతమంది ఇంకా ‘అమ్మాయి ఏంటీ ఇలా చేస్తోంది? ఇదేం విడ్డూరం?’ అని నోరు వెళ్లబెట్టిన వాళ్ల ఈసడింపులు నూర్‌కూ ఎదురయ్యాయి. అయినప్పటికీ రోడ్డు మీద గేర్లు మారుస్తూపోతూనే ఉంది. తన రైడ్‌ను ఎక్కడా ఆపలేదు. ఇదే దూకుడుతో... ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ప్రయాణిస్తూ నేపాల్‌కు వెళ్లాలనుకుంది. బిహార్ సరిహద్దులోకి రాగానే చిన్న యాక్సిడెంట్ జరిగి రైడింగ్‌ను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. అప్పుడు తన మోటర్ సైకిల్‌ను ట్రైన్లో చెన్నై పంపించాల్సిన పరిస్థితి. చాలా బాధ వేసింది. అయినా తప్పలేదు. 2022 మేలో యాక్సిడెంట్ అయితే జూలైలో కోలుకుని బెంగళూరు వచ్చేసింది. ఇంక బండిని అమ్మేయమని అంతా చెప్పారు. అయినప్పటికీ నూర్ రైడింగ్ అపలేదు. జాతీయ రహదారులేగాక అంతర్జాతీయ రహదారులపై రైడింగ్ చేస్తానూ అంటోంది. వచ్చే సంవత్సరం బెంగళూరు నుంచి మక్కా, సౌదీ అరేబియా కూడా వెళ్తానని చెబుతోంది. మనకంటూ కొన్ని రూల్స్ పెట్టుకోవాలి... ‘‘నేను నోమాడ్ హిజాబీ రైడర్ని. దక్షిణ భారత దేశం నుంచి తొలి సోలోరైడర్ని నేనే అవుతాను. ఉత్తర భారతదేశంలోని గురుద్వారాలు, గుళ్లు, ఆశ్రమవాసులు నా మతం వేరైనప్పటికీ ప్రేమగా భోజన, వసతి సదుపాయాలను కల్పించేవారు. కొన్ని సేఫ్టీరూల్స్ పాటిస్తే తక్కువ బడ్జెట్లో ట్రిప్స్‌ను విజయవంతంగా పూర్తిచేయవచ్చు. సాయంత్రం ఐదు తరువాత ఎటువంటి రైడింగ్ చేయను. తెలియని వ్యక్తులతో అస్సలు మాట్లాడను.పెట్రోల్ బంకులు, ప్రార్థనా స్థలాలు, ఆశ్రమాల్లో రాత్రుళ్లు బస చేస్తూ, ఉదయం రైడింగ్ చేస్తున్నాను. ఈ స్పీడుతో మక్కాను చేరుకుంటాను ’’అని నూర్‌బీ ధీమా వ్యక్తం చేస్తోంది. -
ఇక ఎలక్ట్రిక్ బుల్లెట్ బండి.. ప్రకటించిన రాయల్‌ఎన్‌ఫీల్డ్
రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ ఐషర్ మోటార్స్ రాబోయే రెండేళ్లలో భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేయాలని చూస్తోంది. ఇందుకోసం కోసం 1,50,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సిద్ధార్థ లాల్ తెలిపారు. ఉత్పత్తి మాడ్యులర్ పద్ధతిలో క్రమంగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. గుర్గావ్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ భారతదేశంలో ప్రీమియం మోటార్‌సైకిల్ విభాగంలో 90 శాతం వాటాతో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల విభాగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైన రాయల్ ఎన్ఫీల్డ్ తమ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ మార్కెట్ అవసరాలను అంచనా వేయడానికి ఒక వాణిజ్య బృందాన్ని నియమించినట్లు తెలిపింది. ప్రస్తుతం ప్రోటోటైప్‌ను పరీక్షిస్తున్నామని, రెండేళ్లలో సరికొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేస్తామని సిద్ధార్థ లాల్ వెల్లడించారు. భారతదేశంలో మిడ్-వెయిట్ మోటార్‌సైకిళ్ల మార్కెట్ వేగంగా పెరుగుతోందని చెప్పారు. కంపెనీ గత త్రైమాసికంలో 225,368 రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్‌సైకిళ్లను విక్రయించిందని, ఇది ఏడాది క్రితంతో పోలిస్తే 21 శాతం పెరిగిందని ఆయన వివరించారు. ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ కంపెనీలు హీరో మోటోకార్ప్, హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా), బజాజ్ ఆటో రాబోయే నెలల్లో దాదాపు డజను మిడ్-వెయిట్ మోటార్‌సైకిళ్లను రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీగా తీసుకొస్తున్నాయి. గత నెలలో బజాజ్-ట్రయంఫ్ భారతదేశంలో రెండు 400సీసీ మోడళ్లను విడుదల చేసింది. అలాగే హార్లే డేవిడ్సన్తో కలిసి హీరో మోటర్ కార్ప్ అభివృద్ధి చేసిన X440 బైక్ డెలివరీలను త్వరలో ప్రారంభించాలని భావిస్తోంది. -
బైక్‌కు గుడి కట్టించి పూజలు - సినిమాను తలపించే ఇంట్రెస్టింగ్ స్టోరీ!
ఎక్కడైనా దేవునికి గుడి కట్టి పూజలు చేయడం ఆనవాయితీ.. హిందూ సంప్రదాయం ప్రకారం పంచ్ భూతాలను కూడా పూజిస్తారు. అయితే వీటన్నింటికి భిన్నంగా రాజస్థాన్‌లో ఒక 'బైకు'కి గుడి కట్టి పూజలు చేస్తున్నారు. ఇంతకీ ఆ బైకుకి ఎందుకు గుడి కట్టారు. దీని వెనుక ఉన్న అసలు కథ ఏమిటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, 1980 చివరలో 'ఓం సింగ్ రాథోడ్' అనే యువకుడు తనకు ఎంతగానో ఇష్టమైన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్‌సైకిల్‌పై ప్రయాణించేటప్పుడు ఒక చెట్టుకు ఢీ కొట్టి ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన పాలీ జిల్లాలోని చోటిలా గ్రామ సమీపంలో జరిగింది. బుల్లెట్ బాబా.. ప్రమాదం జరిగిన తరువాత పోలీసులు ఆ బైకుని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అయితే ఆశ్చర్యకరంగా ఆ బుల్లెట్ బైక్ మరుసటి రోజు వెళ్లి ప్రమాదం జరిగిన చోటుకే చేరినట్లు తెలిసింది. ఇది ఎవరో ఆకతాయిల పని అని భావించి పోలీసులు మళ్ళీ ఆ బైకుని స్టేషన్‌కి తీసుకెళ్లారు. మళ్ళీ మునుపటి మాదిరిగానే ప్రమాదం జరిగిన చోటుకే చేరింది. ఈ సంఘటన మొదట్లో అందరిని భయానికి గురిచేసింది. ఆ తరువాత ఇందులో ఏదో దైవత్వం ఉందని గ్రహించి స్థానికులు ఓం సింగ్ రాథోడ్‌కు నివాళులర్పించాలని నిర్ణయించుకున్నారు. ఓం సింగ్ రాథోడ్ ఆత్మ బుల్లెట్ బైకు మీద తిరుగుతుందని భావించి స్థానికులు ప్రమాదం జరిగిన స్థలాన్నే స్థానికులు దేవాలయంగా మార్చారు. ఆ ప్రదేశంలో బుల్లెట్ బైకుకి పూజలు చేయడం ప్రారంభించారు. బుల్లెట్ మోటార్‌సైకిల్‌కు ఓం సింగ్ రాథోడ్ గౌరవార్థం 'బుల్లెట్ బాబా' అని పేరు పెట్టారు. ప్రతి రోజూ ఎంతో మంది భక్తులు ఈ మందిరాన్ని దర్శించి ప్రార్థనలు చేస్తుంటారు. (ఇదీ చదవండి: ఒకప్పుడు రూ. 10 వేల జీతానికి ఉద్యోగం.. ఇప్పుడు కోట్ల సామ్రాజ్యం - ఒక టీచర్ కొడుకు సక్సెస్ స్టోరీ..) ఈ బుల్లెట్ బాబా ఆలయంలో అగరవత్తులు వెలిగించడం, మోటార్ సైకిల్ చుట్టూ ప్రదక్షిణలు చేయడం, మద్యం పోయటం వంటివి అక్కడి ఆచారం. ఈ విధంగా చేస్తే భక్తులకు ప్రయాణ సమయంలో ఎటువంటి ప్రమాదాలు జరగవని ఘాడంగా విశ్వసిస్తారు. ఈ గుడికి కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి కూడా భక్తులు, సందర్శకులు వస్తుంటారు. కొంతమంది మోటార్‌సైకిల్‌దారులు, సాహస యాత్రికులు మరియు ఆధ్యాత్మిక ఔత్సాహికులు తమ ప్రయాణ ప్రయాణంలో భాగంగా ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తుంటారు. (ఇదీ చదవండి: ఆ రెండు యాప్స్ ఉంటే మీ వివరాలు చైనాకే.. వెంటనే డిలీట్ చేయండి!) View this post on Instagram A post shared by Royalenfieldholic® 𝟮𝟬𝟬𝗸🎯 (@royalenfieldholic) -
బుల్లెట్ మాయం
తూర్పు గోదావరి: ఇంటి ముందు పార్కు చేసిన బుల్లెట్ చోరీకి గురైంది. స్థానిక మఠంసెంటర్లోని గంపల వారి వీధిలో నివాసం ఉంటున్న జి.సాయికృష్ణ పెద్దాపురంలో తన బావ బుల్లెట్ (ఏపీ05 ఈడీ 3534) తీసుకువచ్చి శనివారం రాత్రి ఇంటి ముందు పార్కు చేశాడు. ఊరు వెళ్లడం కోసం ఆదివారం ఉదయం చూడగా కనిపించలేదు. వెంటనే ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా, ఆదివారం రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ముసుగు వేసుకున్న ఇద్దరు దొంగలు బుల్లెట్‌ను చోరీ చేసినట్టు గుర్తించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీఐ కె.దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
‘అదొద్దు.. బుల్లెట్టే కావాలి’.. వరునితోపాటు 50 మందిని బుక్ చేసిన పోలీసులు!
ఉత్తరప్రదేశ్‌లోని దెహాత్కు ఊరేగింపుగా వచ్చిన మగపెళ్లివారు వధువు తండ్రి తమకు బుల్లెట్ బండితోపాటు లక్ష రూపాలయల కట్నం అదనంగా ఇవ్వలేదని వెనుదిరిగారు. ఈ విషయమై పెళ్లి కుమార్తె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వరుడు, అతని తండ్రితో పాటు వారి తరుపు 50 మంది బంధువులపై కేసు నమోదు చేశారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం రూరా పోలీస్‌స్టేషన్ పరిధిలోని నౌరంగాబాద్ నివాసి మోతీలాల్ మగపెళ్లి వారు అదనపు కట్నం అడిగారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఫిర్యాదులో తన కుమార్తెకు మున్నూ సింగ్ కుమారుడు బాదల్‌తో వివాహం నిశ్చయమయ్యిందని తెలిపాడు. జూన్ 18న కల్యాణ మండపానికి వరుని తరపు వారంతా వచ్చారన్నాడు. వారికి ఘనంగా స్వాగత సత్కారాలు చేశామన్నాడు. సరిగ్గా పెళ్లి తంతు ప్రారంభమయ్యే సమయానికి మగ పెళ్లివారు అదనపు కట్నం కోసం డిమాండ్ చేశారని తెలిపారు. బుల్లెట్ బండితోపాటు లక్ష రూపాయలు అదనంగా కావాలని కోరారన్నారు. వారు ఉన్నట్టుండి ఇలా అడిగేసరికి అడపెళ్లివారు, మగపెళ్లివారి మధ్య కొట్లాట జరిగిందని తెలిపారు. వరునికి ఇంతకు మునుపే ఒక బైక్ కొనుగోలు చేశామని, అయితే అది వద్దని బుల్లెట్ బండి మాత్రమే కావాలని అడుగుతున్నాడని వధువు తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వరుడు, అతని తండ్రితోపాటు మరో 50 మందిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: మహిళపై లైంగిక దాడి.. అడ్డుకుందని రైలులో నుంచి తోసివేత! -
బుల్లెట్ బండి నడిపిన వరలక్ష్మీ శరత్కుమర్
-
బుల్లెట్ బండి నడిపిన వరలక్ష్మి శరత్‌కుమార్.. వీడియో వైరల్
దక్షిణాది హీరోయిన్లలో నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ది మాత్రం డేరింగ్ అండ్ డైనమిక్ రూట్ అనే చెప్పాలి. అర్ధరాత్రి పోలీసునే చెంపలు వాయించిన రఫ్ బ్యూటీ ఈమె. ఈ విషయాన్ని ఆమె తండ్రి, నటుడు శరత్‌కుమార్‌నే స్వయంగా ఇటీవల ఒక వేదికపై చెప్పారు. ఇక నటిగా వరలక్ష్మి శరత్‌కుమార్ గురించి చెప్పాల్సిన అవసరం ఉండదు. దక్షిణాది సినీ ప్రేక్షకులకు బాగా తెలుసు. పాత్ర ఏదైనా ఈమెకు మోల్డ్ అయిపోతారు. పోడా పోడీ చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి శరత్‌కుమార్ ఆ తరువాత తనకు నచ్చినట్లు కాకుండా ప్రేక్షకులు మెచ్చేటట్లు నటిస్తూ తన స్థాయిని పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పుడు దక్షిణాదిలో కథానాయకి పాత్రలను అటుంచితే ఛాలెంజింగ్‌తో కూడిన విలనిజం పాత్ర అయితే ఈ విలక్షణ నటిని వెతుక్కుంటూ రావాల్సిందే. ఆ మధ్య సర్కార్ చిత్రంలో అలాంటి పాత్రలోనే విజయ్ను ఢీకొన్న వరలక్ష్మి శరత్‌కుమార్ ఇటీవల తెలుగులో వీరసింహారెడ్డి చిత్రంలో బాలకృష్ణకు పోటీ ఇచ్చారు. ఈమెలో మొండి ధైర్యం కూడా ఉంది. నటిగా దశాబ్దం పూర్తి చేసుకున్న వరలక్ష్మి శరత్‌కుమార్ ఇప్పటి వరకు కొన్ని కారణాల వల్ల సైకిల్ తొక్కడం లాంటి వాటి జోలికి పోలేదట. అయితే ఇప్పుడు ఏకంగా బుల్లెట్ ఎక్కేవారు. సైకిల్ నుంచి స్టెప్ బై స్టెప్ బుల్లెట్ నడపడం వరకు నేర్చేసుకున్నారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అది తెగ వైరల్ అవుతోంది. దీని గురించి ఆమె పేర్కొంటూ బాల్యంలో కొన్ని కారణాల వల్ల తనకు బైక్ తోలడానికి ఇంట్లో అనుమతి ఇవ్వలేదన్నారు. అయితే బైక్ నడపడానికి భయాన్ని పోగొట్టడానికి ఇది సరైన టైమ్ అని భావించానన్నారు. దీంతో గత వారం బైక్ నడపడానికి తొలి మెట్టు అయిన సైకిల్ తొక్కడం నేర్చుకున్నానని, ఆ తరువాత స్క్రూటీ, ఇప్పుడు బుల్లెట్ కూడా నడుపుతున్నానని చెప్పారు. మొదట్లో కొంచెం కష్టం, బాధ అనిపించినా, భయాన్ని పోగొట్టడానికి ఇదంతా చేసినట్లు చెప్పారు. ఇక్కడ తాను కింద పడ్డాను అన్నది ముఖ్యం కాదని ఎలా లెగిశాను అన్నదే ముఖ్యమని అభిప్రాయపడ్డారు. -
బుల్లెట్ బండిపై అసెంబ్లీకి రాజాసింగ్.. వీడియో హైలైట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు కొనసాగుతున్నాయి. కాగా, అసెంబ్లీ సమావేశాల సమయంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ శనివారం అసెంబ్లీ సమావేశాలకు బుల్లెట్ బండిపై వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే రాజాసింగ్ అసెంబ్లీ సమావేశాలకు బుల్లెట్ బండిపై వచ్చారు. ఈ క్రమంలో రాజాసింగ్‌ను అసెంబ్లీ వద్ద పోలీసులు సరదాగా ఆపి ముచ్చటించారు. ఈ సందర్బంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. తనకు కొత్త వాహనం కేటాయించడంలేదన్నారు. అందులో భాగంగానే ఇలా నిరసన తెలుపుతున్నట్టు చెప్పారు. కాగా, రాజాసింగ్ వాహనం ఇప్పటికే పలుమార్లు మొరాయించిన విషయం తెలిసిందే. అంతుకు ముందు శుక్రవారం రాజాసింగ్.. ప్రగతి భవన్ ఎదుట ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. దీంతో, పోలీసులు రాజాసింగ్‌ను డీసీఎంలో అసెంబ్లీకి తీసుకువచ్చారు. -
బుల్లెట్: రూ. 1.5 లక్ష నుంచి రూ. 3.5 లక్షల వరకు.. నాడు మిలిట్రీ బైక్, కానీ.. నే
వైరారూరల్ (ఖమ్మం): బుల్లెట్.. దానిపై వెళ్తుంటే ఉండే ఆ రాజసం.. దాని నుంచి వచ్చే ఫైరింగ్.. జనాలు చూసే తీరూ ప్రతీది ప్రత్యేకమే.. బుల్లెట్ అంటేనే ఒకప్పుడు ఉన్నత వర్గాల వాహనంగా చలామణి అయ్యింది. కానీ ఇప్పుడు మధ్య తరగతి ప్రజలు కూడా బుల్లెట్‌పై రయ్.. రయ్.. మంటూ దూసుకుపోతున్నారు. ఇది వరకు గ్రామాల్లో అయితే పలుకుబడి ఉన్నవారు, రాజకీయంగా మంచి పట్టున్నవారు వీటిని ఎక్కువగా వాడేవారు. ఇక పట్టణ ప్రాంతాల్లోనూ మంచి క్రేజ్ ఉంది. మార్కెట్లోకి ఇలా.. ఈ బుల్లెట్ ద్విచక్ర వాహనాన్ని 1955లో ఇండియాన్ ఆర్మీ బోర్డర్ సెక్యూరిటీ కోసం ఇంగ్లాండ్ నుంచి తెప్పించారు. అనంతరం 1960 నుంచి స్పేర్ పార్ట్స్‌ను ఇంగ్లాండ్ నుంచి తెప్పించి ఇండియాలోనే బుల్లెట్ ద్విచక్రవాహనాన్ని ఫిటింగ్ చేసే వారు. ఇవన్నీ గతంలో పెట్రోల్‌తో నడిచేవి. దాని తర్వాత కొన్నేళ్ల పాటు కొంత మంది మెకానిక్‌లు పెట్రోల్ ఇంజన్ తొలగించి డీజిల్ ఇంజన్‌తో రీమోడలింగ్ చేసి మార్కెట్లో విక్రయించేవారు. ఆ సమయంలో డీజిల్ బుల్లెట్లకు భారీ డిమాండ్ ఉండేది. అనంతరం 1994–2000 వరకు బుల్లెట్ కంపెనీ వారే డీజిల్ బుల్లెట్‌ను విడుదల చేశారు. కాలక్రమేణా పొల్యూషన్ కారణంగా 2000 సంవత్సరంలో డీజిల్ బుల్లెట్ వాహనాలు పూర్తిస్థాయిలో బ్యాన్ అయ్యాయి. దాని తర్వాత పలు రకాల బుల్లెట్ ద్విక్రవాహనాలు కొత్త వర్షన్ మోడల్స్‌తో మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఇప్పటి వరకు రాయల్ ఎన్ఫీల్డ్లో కాస్ట్‌ఐరన్ స్టాండర్డ్, ఎలక్ట్రా, క్లాసిక్, థండర్బాడ్, ఇంటర్‌స్పెక్టర్, కాంటినంటల్ జీటీ, హిమాలయం, హంటర్ వంటి మోడల్స్ వాహనాలు మార్కెట్లోకి విడుదలై యువతతో పాటు మధ్య వయస్సు గల వ్యక్తులను సైతం ఆకర్షిస్తున్నాయి. (చదవండి: సర్వేలో బయటపడ్డ షాకింగ్ విషయాలు.. తెలంగాణలో మరీ ఇంత ఘోరమా?) బుల్లెట్ వాహనాన్ని కొనుగోలు చేస్తున్న యువకులు సీసీలపై యువత మోజు.. ప్రస్తుతం మార్కెట్లో 100 నుంచి 180 సీసీ గల ద్విచక్రవాహనాలే అధిక శాతం ఉన్నాయి. ఇటువంటి ద్విచక్రవాహనాలపై మక్కువ లేని యువత బుల్లెట్ ద్విచక్ర వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. బుల్లెట్ వాహనం ఒక్కొక్క మోడల్ ఒక్కో విధంగా సీసీ కలిగి ఉంటుంది. బుల్లెట్ వాహనాలలో 350, 411, 500, 650 సీసీ సామర్థ్యంతో కూడినవి దొరుకుతున్న నేపథ్యంలో.. వీటిని కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు. అంతేకాకుండా బుల్లెట్ వాహనానికి అనుగుణంగా ఉండేందుకు షోరూంతో వచ్చిన సైలెన్సర్‌ను తొలగించి బుల్లెట్‌పై ఉన్న మోజుతో అధిక శబ్ధం వచ్చే సైలెన్సర్ అమర్చుకోని ప్రయాణిస్తూ బుల్లెట్ బైక్‌లను ఆస్వాదిస్తున్నారు. ధర లెక్కచేయకుండా.. బుల్లెట్ ధరతో కారు కొనుగోలు చేయవచ్చు. కానీ యువతతో పాటు మధ్య వయస్సు గల వ్యక్తులు సైతం కారుపై ఆసక్తి కనబర్చకుండా బుల్లెట్ వాహనాలపై మక్కువ చూపుతున్నారు. బుల్లెట్ బండ్ల ధరలు మోడల్‌ను బట్టి వాటి ధర ఉంటుంది. రూ. 1.50 లక్ష నుంచి రూ. 3.50 లక్షల వరకు బుల్లెట్ బైకుల ధరలు ఉన్నాయి. ఇంతటి ధరను కూడా లెక్క చేయకుండా యువత ఈ బుల్లెట్ కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారంటే.. వీటి క్రేజ్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితులోనే బుల్లెట్ ధర రూ. 3.50 లక్షలు వరకు ఉన్న నేపథ్యంలో.. భవిష్యత్తులో వీటి ధర కొంత శాతం మేర పెరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ బుల్లెట్ కొనుగోలుపై యువత వెనుకడుగు వేయకపోవడం కొసమెరుపు. బుల్లెట్ రైడ్.. బుల్లెట్ ద్విచక్రవాహనాలు గంటకు 80 నుంచి 100 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. దీంతో దూర ప్రాంతాల్లో ఉన్న విహారయాత్రలకు ఈ బుల్లెట్ వాహనాలపై ప్రయాణాలు చేయడం పరిపాటిగా మార్చుకున్నారు. రవాణా సౌకర్యార్థం బుల్లెట్ బండ్లు అనుకూలంగా ఉండడం వలన అధికశాతం మంది బుల్లెట్‌ను కొనుగోలు చేసుకుంటూ.. వీటిపై తమకు ఉన్న మక్కువను చూపుతున్నారు. (చదవండి: వరంగల్‌లో విషాదం.. బాలుడిని చంపేసిన ‘చాక్లెట్’) -
లక్షలు పోసి కొన్న బుల్లెట్ బండి.. చూస్తుండగానే కాలిపోయింది
సాక్షి, సంగారెడ్డి: రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మార్కెట్లో ఎన్ని కొత్త మోడల్ బైక్‌లు వచ్చినప్పటికీ బుల్లెట్‌పై యువతకు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు.. లక్షలకు లక్షలు పోసి మరి కొనుక్కొని తమ సొంతం చేసుకుంటారు. డుగ్గు డుగ్గు సౌండ్లతో రోడ్లపై రయ్ రయ్‌మంటూ దూసుకెళ్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని వాహనాల్లో ఉన్నట్టుండి మంటల్లో కాలిపోతున్నాయి. తాజాగా ఓ బుల్లెట్ బండిని స్టార్ట్ చేసే క్రమంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన పటాన్చెరు పట్టణంలో చోటు చేసుకుంది. ఫైర్‌స్టేషన్ ఆఫీసర్ జన్యానాయక్, స్థానికుల వివరాల ప్రకారం.. రామచంద్రాపురానికి చెందిన జావిద్ తన బుల్లెట్ బండిని పటాన్చెరు పట్టణంలో ని బ్లాక్ ఆఫీసు దుకాణాల ఎదుట పార్క్ చేశాడు. పని ముగించుకొని తిరిగి బండిని స్టార్ట్ చేసే క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. -
డుగ్గుడుగ్గు మంటూ..రాయల్ ఎన్ ఫీల్డ్ కొత్త బైక్ వచ్చేస్తోంది!
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ మరో బైక్‌ను విడుదల చేయనుంది. హంటర్ 350 పేరుతో ఆదివారం ఈ బైక్‌ను మార్కెట్‌కు పరిచయం చేయనుంది. ఈ బైక్ ధర రూ.1,30,000 నుంచి రూ.1,40,000 ధర మధ్యలో ఉండనుంది. ప్రస్తుతం ఈ బైక్ తరహాలో టీవీఎస్ రోనిన్, ట్రయంఫ్ బోన్నెవిల్లే టీ120, రాయిల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 ఉండనున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. హంటర్ 350 స్పెసిఫికేషన్స్ రాయిల్ ఎన్ ఫీల్డ్ సంస్థ హంటర్ 350ని నేటి తరం ట్రెండ్‌కు తగ్గట్లుగా డిజైన్ చేయాలని భావించింది. అనుకున్నట్లుగానే బైక్‌ను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వెహికల్ చాసిస్(బైక్ బాడీ)ను పలు మార్లు డిజైన్ చేయడం అవి నచ్చకపోవడం చివరకు ఈ తరహాలో తయారు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. మిగిలిన బైక్స్‌తో పోలిస్తే రాయిల్ ఎన్ఫీల్డ్ 350సీసీ రేంజ్,ట్విన్ డౌన్ ట్యూబ్ స్పైన్ ఫ్రేమ్‌ను అమర్చారు. హంటర్లో రౌండ్ లైట్ క్లస్టర్లు,స్పీడ్‌ను కంట్రోల్ చేసే ట్విన్ రియర్ షాక్‌లు వంటి అనేక క్లాసిక్ రాయల్ ఎన్ఫీల్డ్ డిజైన్ ఎలిమెంట్స్‌ను కలిగి ఉంది. అయితే మొత్తం డిజైన్ 350 సీసీ శ్రేణిలో క్రూయిజర్ కంటే రోడ్‌స్టర్‌గా ఉంది. సీసీ ఒకేలా ఉన్నా బైక్ డిజైన్ ప్రత్యేకంగా ఉందని రాయల్ ఎన్ఫీల్డ్ చెబుతోంది. ఈ బైక్‌లో స్పీడ్‌ను కంట్రోల్ చేయడం లేదంటే పెంచేందుకు ఉపయోగపడే ఫ్రంట్ పోర్క్‌ను 41ఎంఎం(మిల్లీ మీటర్స్) నుండి 130ఎంఎం వరకు అందించింది. అయితే వెనుక భాగంలో 6 దశల ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్,102ఎంఎం వీల్ ట్రావెల్‌తో ట్విన్ ట్యూబ్ ఎమల్షన్ షాక్ అబ్జార్బర్లతో డిజైన్ చేసింది. 17అంగుళాల టైర్లను అమర్చింది. టియర్ డ్రాప్ ఆకారంలో ఉన్న ఫ్యూయల్ ట్యాంక్, రైడర్‌కు మోకాళ్లపై స్ట్రెస్ తగ్గించింది. ఫ్రీగా ఉండేలా డ్రైవింగ్ సీటు వెనుక బాగా ఫ్లాట్‌గా ఉండేలా రూపొందించింది. అయితే ఫుట్ పెగ్‌లు మరింత వెనక్కి జరిపి స్పోర్టియర్ రైడింగ్ పొజిషన్‌ను అందిస్తుంది. ఈ బైక్‌లో టెయిల్ ల్యాంప్ ఎల్ఈడీ యూనిట్ అయితే హెడ్‌ల్యాంప్ హాలోజన్ బల్బ్‌తో వస్తుంది. -
Bullet Bikes: నీ బుల్లెట్టు బండెక్కి చెక్కెత్తపా డుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గని..
సాక్షి, హైదరాబాద్: నగరంలో బైక్ దొంగలు రెచ్చిపోతున్నారు. ఒక వైపు చోరీలు చేస్తూనే పోలీసులకు చిక్కకుండా చాకచక్కంగా తప్పించుకుంటున్నారు. కొండాపూర్, మాదాపూర్ ఐటీ కారిడార్ ప్రాంతాల్లో చోటు చేసుకున్న చోరీలు పోలీసులను నివ్వెర పరుస్తున్నాయి. తాజాగా వెలుగుచూసిన కొన్ని కేసులు దొంగల తెలివితేటలకు అద్దం పడుతున్నాయి. మణిప్రసాద్ అనే వ్యక్తి గురువారం ఉదయం కొండాపూర్‌లో స్టైయిల్ హెయిర్ సెలూన్‌కు వెళ్లాడు. తరువాత బయటకు వచ్చి చూస్తే తన బుల్లెట్ బైక్ కనిపించలేదు. సీసీ పుటేజీ పనిశీలించగా గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై హెల్మెట్ పెట్టుకొని రెండు సార్లు రెక్కీ నిర్వహించి ఓ అపార్ట్మెంట్ వద్ద తన ప్యాషన్ బైక్ పెట్టి నడుచుకుంటూ సెలూన్ దగ్గరకు వచ్చాడు. హ్యాండిల్ లాక్ చేయకపోవడంతో కొద్ది దూరం తోసుకుంటూ వెళ్లి స్క్రూ డ్రైవర్‌తో హెడ్‌లైట్ తీసి వైర్ల సహయయంతో స్టార్ట్ చేసి బుల్లెతో ఉడాయించాడు. 30 నిమిషాల తరువాత వచ్చి అపార్ట్మమెంట్ వద్ద ఉన్న తన ప్యాషన్ బైక్‌ను తీసుకొని పరారయ్యాడు. బుల్లెట్ దొంగ కోసం గచ్చిబౌలి పోలీసులు రెండు బృందులుగా దర్యాప్తు చేపట్టారు. చదవండి👉వైరాలో వింత చేపల వర్షం.. మునుపెన్నడూ చూడలేదే! బుల్లెట్‌ని తోసుకుంటూ వెళుతున్న గుర్తు తెలియని వ్యక్తి పార్క్ చేసిన బుల్లెట్లు మాయం... మాదాపూర్ పీఎస్ పరిధిలోని పర్వత్‌నగర్‌లో నివాసముండే అఖిల్ రెడ్డి మే 26న అర్థరాత్రి ఇంటి ముందు బుల్లెట్ పార్క్ చేశాడు. తెల్లవారు జామున చూడగా బుల్లెట్ కనిపించలేదు. బాధి తుడు మాదాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. నార్సింగి పీఎస్ పరిధిలోని పుప్పాల గూడలో ఓ ఇంటి ముందు పార్క్చేసిన బుల్లెట్‌ను నాలుగు రోజుల క్రితం చోరీ చేశారు. బాధితుడు నార్సింగి పీఎస్‌లో ఫిర్యాదు చేయగా సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. ఐటీ కారిడార్‌లో వరుసగా బుల్లెట్లు చోరీకి గురికావడం పోలీసులకు సవాల్‌గా మారింది. చదవండి👉వర్కర్‌పై కర్కశత్వం.. ఒళ్లంతా బెల్టు వాతలు -
‘దొంగ’ తెలివితేటలు
సాక్షి,గచ్చిబౌలి: బైక్ దొంగలు, చైన్ స్నాచర్ల తెలివితేటలు అంతా ఇంతా కాదు. ఒక వైపు చోరీలు చేస్తూనే పోలీసులకు చిక్కకుండా చతురత ప్రదర్శిస్తున్నారు. ఐటీ కారిడార్‌లో చోటు చేసుకున్న చోరీలు నివ్వెర పరుస్తున్నాయి. కొండాపూర్‌లో నివాసం ఉండె బీహర్‌కు చెందిన ఓ వ్యక్తి ఆరు రోజుల క్రితం కూకట్‌పల్లిలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. ఆ సమయంలో స్థానికులు వెంటపడగా సెల్ ఫోన్ కిందపడిపోయింది. సెల్ ఫోన్‌ను కూకట్పల్లి పోలీసులకు అప్పగించారు. సెల్ ఫోన్ అడ్రస్ తెలుసుకున్న పోలీసులు ఆరువాత ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉంచారు. ఆ తరువాత స్నాచర్.. కొండాపూర్‌లో కూరగాయల మార్కెట్‌కు వెళ్లగా తన సెల్ ఫోన్ పోయిందని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. అది తమ ప్రాంతం కాదని పోలీసులు చెప్పడంతో దాపూర్ పీఎస్‌కు భార్యతో కలిసి వెళ్లాడు. క్రైం పోలీసులు సెల్ ఫోన్‌కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ ఉండటంతో దర్యాప్తు చేస్తామని చెప్పారు. ఆ తరువాత కూకట్పల్లి పోలీసుల వద్దకు వెళ్లగా.. ఈ ఫోన్ ఎవరిదని అడగగా తనదేనని చెప్పాడు. అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లు ఒప్పుకొని కటకటాల పాలయ్యాడు. చదవండి: Hyderabad: కుండపోత.. సిటీలో రోజంతా వర్షం -
బుల్లెట్ బండి.. నోరూరేటట్టు తిండి!
తూర్పు గోదావరి (కొవ్వూరు) : ఈ యువకుడి పేరు పిల్లి శివరామకృష్ణ. ఊరు కొవ్వూరు. చదివింది బీటెక్. చైన్నె, ముంబయి వంటి ప్రాంతాల్లో బుల్లెట్ బండిపై మొబైల్ బార్భీక్యూ చికెన్ దుకాణాన్ని అతను చూశాడు. అనుకున్నదే తడవుగా బుల్లెట్ కొనుగోలు చేశాడు. రూ.3 లక్షలు వెచ్చించి బుల్లెట్‌కు బార్భీక్యూ అమర్చాడు. వివిధ రకాల చికెన్ ఐటెమ్స్ తయారు చేసి విక్రయిస్తున్నాడు. బుల్లెట్‌కు వివిధ రకాల లైట్లు అమర్చడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కొవ్వూరు పట్టణంలో కొత్తరకంగా వ్యాపారం ప్రారంభించడంతో స్థానికులను సైతం ఆకట్టుకుంటున్నారు. కలర్స్, ఆయిల్స్, టెస్టింగ్ సాల్ట్, కార్న్ ఫ్లోర్, మైదా వంటివి వాడకుండానే వివిధ రకాల చికెన్ ఐటెమ్స్ తయారు చేయడంతో పట్టణ వాసులు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద దీనిని రోడ్డు మార్జిన్లో గురువారం ప్రారంభించారు. ఈ నోట ఆ నోట విని ఈ వెరైటీ ఫుడ్ తినడానికి మాంసాహార ప్రియులు క్యూ కడుతున్నారు. ఇలా బుల్లెట్‌కు అన్నీ అమర్చుకోవడం ద్వారా వ్యాపారానికి అనువుగా ఉన్న ప్రాంతాలకు మార్చుకోవచ్చని శివ అంటున్నారు. అంతేకాకుండా విందు భోజనాలకు సైతం వివిధ రకాల చికెన్ ఐటెమ్స్ తయారు చేసి సరఫరా చేస్తానని చెబుతున్నారు. తాను 2013లో బీటెక్ పూర్తి చేసిన అనంతరం హైదరాబాద్‌లో వింగ్స్ అండ్ ఫ్రైస్ రెస్టారెంట్లో మూడేళ్లు మేనేజర్‌గా పనిచేశానని చెప్పారు. డోమినో పిజ్జా రాజమహేంద్రవరం, హైదరాబాద్‌లో రెండేళ్ల పాటు పనిచేశానన్నారు. అనంతరం ప్రశాంత్ కిషోర్ టీములో కొన్నాళ్లు పనిచేశానని శివ చెబుతున్నారు. తనకు హోటల్ రంగంతో ఉన్న అనుబంధంలో ఈ వ్యాపారం ప్రారంభించినట్టు వివరించారు. -
బుల్లెట్ గ్యారేజ్.. ఇచట అన్ని రిపేర్లు చేయబడును!
సాక్షి,విజయనగరం: నీ బుల్లెట్ బండెక్కి వచ్చేతప్పా.. డుగ్గు.. డుగ్గు...డుగ్గు.. డుగ్గని.. అందాల దునీయాను చూపించప్పా.. చిక్కుచిక్కు చిక్కుని.. చిక్కుబుక్కని.. అంటూ ఇటీవల అందరినీ అలరించిన ఈ పాట వింటే చాలు గుర్తుకు వచ్చేది రోయల్ ఎన్ఫీల్డ్ బండి. రెండు దశాబ్దాలకు పూర్వం స్టేటస్ సింబల్‌గా భావించే ఈ రెండు చక్రాల వాహనం డుగ్గు... డుగ్గు అంటూ నడిపితే ఆ రాజసమే వేరు. పూర్వం గ్రామాల్లో సర్పంచ్‌లు.. నాయుడులు వాడే ఈ వాహనం అన్ని వర్గాల ప్రజల మనుసుదోచుకుంటుంది. ఇంతటి చరిత్ర ఉన్న బుల్లెట్ బండికి రిపేర్వస్తే ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఠక్కున గుర్తుకు వచ్చేది ఈశ్వరరావు పేరే. చిన్నపాటి మరమ్మతు నుంచి ఇంజిన్రిపేర్ వరకు ఆయన చేయి పడనిదే బండి రోడెక్కెని పరిస్థితి. అందుకే.. విజయనగరం నడిబొడ్డున గల మహాకవి గురజాడ అప్పారావు కూడలిలోని ఆయన చిన్నపాటి చెక్కబడ్డీ ముందు బుల్లెట్ బైక్‌లు క్యూ కడతాయి. అన్నీ సర్వీసింగ్ కోసమే వచ్చినవే. వాటిని రిపేర్ చేసే వ్యక్తి మాత్రం 7వ తరగతి వరకే చదివి.. మెకానిక్‌లో ఇంజినీరింగ్ ప్రావీణ్యం సంపాదించిన కోరాడ వీధికి చెందిన గొలుసు ఈశ్వరరావు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆయన చిన్నతనంలో బైక్ మైకానిక్ వృత్తిని ఎంచుకున్నారు. మొదటిగా బ్రహ్మాజీ అనే గురువు వద్ద ద్విచక్ర వాహనాల మరమ్మతులు చేయడంలో శిక్షణ పొందారు. అనంతరం గాంధీ గురువు వద్ద రోయల్ ఎన్ఫీల్డ్ బైక్‌లు రిపేర్లు చేయడం నేర్చుకున్నారు. నమ్మిన వృత్తిని ఇష్టంగా భావించిన ఆయన ఆ రంగంలో తనకు వేరెవ్వరు సాటిలేరన్నంత నైపుణ్యాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ప్రతిరోజు ఆయన గ్యారేజ్ వద్ద పదుల సంఖ్యలో ఎన్ఫీల్డ్ వాహనాలకు రిపేర్లు చేస్తూ వాహన చోదకుల మన్ననలు పొందుతున్నారు. శబ్దాన్నిబట్టి సమస్యను గుర్తించేంత నైపుణ్యం.. ఈశ్వరరావు తన గురువు గాంధీ వద్ద నేర్చుకున్న బుల్లెట్ వాహనాల రిపేర్ల వృత్తిని వ్యక్తిగత ఉపాధిగా మలచుకున్నారు. 2000 సంవత్సరం నుంచి చిన్నపాటి గ్యారేజీ ప్రారంభించి బుల్లెట్లకు రిపేర్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఎన్ఫీల్డ్ బైక్‌లు అరకొరగా ఉన్న రోజుల్లో... మేడిన్ ఇంగ్లాడ్ పేరిట అప్పట్లో వాడే 1965, 1975, 1985 మోడల్ వాహనాలకు రిపేర్ చేయడంలో మంచి పరిణితి పొందిన మెకానిక్‌గా గుర్తింపు సాధించారు. బుల్లెట్ శబ్దాన్ని బట్టి సమస్యను గుర్తించేంత విజ్ఞానం ఈశ్వరరావు సొంతం. అందుకే.. బుల్లెట్లో ఏ చిన్న సాంకేతిక సమస్య తలెత్తినా ఆయన గ్యారేజ్‌కు తెస్తారు. ఎన్ఫీల్డ్ వాహనంలో మార్పులు చోటు చేసుకుని నేటితరాన్ని ఆకట్టుకునే మోడళ్లు రావడం, వాహనాల సంఖ్య పెరగడంతో ఆయనకు ప్రతిరోజూ చేతినిండా పనిదొరుకుతోంది. మరో నలుగురు కుర్రాళ్లకు ఉపాధి చూపుతున్నారు. నా గురువులు బ్రాహ్మాజీ, గాంధీలు నేర్పించిన విద్యతో నేడు నేను ఉపాధి పొందడంతో పాటు మరో నలుగురు కుర్రాళ్లకి ఉపాధి కల్పిస్తున్నాను. అప్పట్లో ఊరికో ఎన్ఫీల్డ్ బండి ఉండేది. రోజుకో, రెండు రోజులుకో ఒక బండి షెడ్‌కి వచ్చేది. దానికి మరమ్మతులు చేసే వాడిని. ప్రస్తుతం రోయల్ ఎన్ఫీల్డ్ వాహనాల సంఖ్య పెరిగింది. రోజుకు పదుల సంఖ్యలో వాహనాలు షెడ్‌కు వస్తున్నాయి. జనరల్ సర్వీసు అయితే గంటలో చేసిస్తాం. అదే ఇంజిన్ మరమ్మతులు అయితే రెండు, మూడు రోజుల సమయం తీసుకుంటాం. – గొలుసు ఈశ్వరరావు, రోయల్ ఎన్ఫీల్డ్ మెకానిక్, విజయనగరం చదవండి: నిర్మల ఆత్మహత్య చేసుకుందా.. లేక హత్య చేశారా? -
డుగ్గు డుగ్గుమంటూ .. ‘బుల్లెట్’ బైక్ ఎక్కి పోదామా!
సాక్షి, హైదరాబాద్: కరోనా అనంతరం బైక్ రైడింగ్ ఈవెంట్స్ తిరిగి రోడ్డెక్కుతున్నాయి. నగరానికి చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రైడర్స్ ఇష్టపడే బైక్ టూర్ మూడేళ్ల తర్వాత మరోసారి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు. హిమాలయన్ ఒడిస్సీ పేరుతో నిర్వహించే ఈ బైక్ టూర్...ప్రపంచంలోని అతి పెద్ద రైడ్స్‌లో ఒకటిగా పేరొందింది. ఈ ఏడాది జులై 2న ఢిల్లీలో పునఃప్రారంభం కానున్న ఈ అడ్వంచరస్ రైడ్ 18 రోజుల పాటు హిమాలయ పర్వత ప్రాంతంలో కొనసాగుతుందని, మొత్తం 2,700 కి.మీ దూరం పాటు రైడ్ ఉంటుందని వివరించారు. చదవండి: Hyderabad: బోర్డ్ తిప్పేసిన ఐటీ సంస్థ.. రోడ్డున పడ్డ 800 మంది ఉద్యోగులు -
బెజవాడలో ఫేమస్.. రామకృష్ణ బుల్లెట్ గ్యారేజ్
‘వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డూ.. వాడి చూపుల్లో ఉంది చెగువేరా ట్రెండూ..’, ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా.. డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గని’.. ఇటీవల బాగా ట్రెండ్ అయిన ఈ పాటలు యువతనే కాదు.. వృద్ధులను సైతం ఉర్రూతలూగించాయి. బుల్లెట్టు బండిపై ఉన్న క్రేజ్‌ను రచయితలు అలా తమ పాటలలో వినియోగించుకున్నారు. గతంలో రాయల్ ఎన్ఫీల్డ్æ ఇంటిముందు ఉంటే అదో స్టేటస్ సింబల్. దానిని నడిపే వారు రాజసంగా ఫీలయ్యేవారు. మరి అలాంటి బండికి సుస్తీ చేస్తే.. అదేనండి రిపేరు వస్తే! వాటి యజమానులకు ఠక్కున గుర్తుకొచ్చేది బెజవాడ రామకృష్ణ పేరే. ఆయన తర్వాతే మరే మెకానిక్ అయినా. ఒకటి కాదు, రెండు కాదు ఐదు దశాబ్దాలకు పైగా ‘బుల్లెట్ డాక్టర్’గా ఎన్నో బండ్లకు కొత్త ఊపిరి పోశారు. గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): బందరు లాకుల సెంటర్.. రోడ్డు పక్కన రెండు గదులుండే చిన్నపాటి రేకుల షెడ్డు.. దాని ముందు ఓ తాటాకుల పాక.. అందులో పదుల సంఖ్యలో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్‌లు. అదేదో బుల్లెట్ బండ్ల షోరూం కాదు. ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ అంతకన్నా కాదు. 63 ఏళ్ల పెద్దాయన నడిపే గ్యారేజి అది. 54 ఏళ్లుగా ఇదే వృత్తిలో ఉంటూ.. అనేకమందికి తర్ఫీదునిస్తూ బుల్లెట్ మరమ్మతులకు కేరాఫ్‌గా మారారు పి. రామకృష్ణ. రామకృష్ణ.. కేరాఫ్ కంకిపాడు కంకిపాడుకు చెందిన రామకృష్ణ 1968లో గవర్నర్‌పేట గోపాల్‌రెడ్డి రోడ్డులోని ఓ గ్యారేజిలో మెకానిక్‌గా జీవితం ప్రారంభించారు. 1977లో సొంతంగా తానే బందరు లాకుల వద్ద షెడ్డు నెలకొల్పారు. అప్పటి నుంచి నేటి వరకు అదే పాకలో పనిచేస్తున్నారు. బుల్లెట్ వాహనాలకు మాత్రమే మరమ్మతులు, సర్వీసింగ్ చేయడం ఆయన ప్రత్యేకత. ఆ విధంగా రామకృష్ణ ‘బుల్లెట్ వైద్యుడు’గా పేరు తెచ్చుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ వాడే వారికి రామకృష్ణ సుపరిచితులే. తమ బండికి ఆయన మరమ్మతు చేస్తే నిశ్చింతగా ఉండొచ్చని వాటి యజమానుల నమ్మకం. ఇతర రాష్ట్రాల నుంచి ట్రాన్స్పోర్ట్ ద్వారా వాహనాలను రామకృష్ణ వద్దకు పంపుతారు. ఈయన వద్ద వందలాది మంది బుల్లెట్ మెకానిజం నేర్చుకున్నారు. ఆయన వద్ద నలభై ఏళ్లకు పైగా పనిచేస్తున్న మెకానిక్‌లు ఉన్నారు. ఏడేళ్ల వయసులో బుల్లెట్ సౌండ్ విని.. ‘ఏడేళ్ల వయసులో బుల్లెట్ సౌండ్ విన్నాను. ప్రొద్దుటూరుకు చెందిన జంపారెడ్డి అనే ఉపాధ్యాయుడు కంకిపాడుకు బుల్లెట్‌పై వచ్చి కాఫీ తాగి, పేపర్ చదివి వెళ్లేవారు. ఆయన బుల్లెట్ స్టార్ట్ చేయడం, కిక్ కొట్టడం చూసి ఎంతో ముచ్చట పడేవాడిని. ఆ విధంగా బుల్లెట్ అంటే ప్రేమ పెరిగింది. బుల్లెట్ మెకానిక్ అవ్వాలని అప్పుడే నిర్ణయించుకున్నా. పట్టుదలతో ఈ స్థాయికి ఎదిగా’ అని రామకృష్ణ గతాన్ని నెమరు వేసుకున్నారు. ఏపీడబ్ల్యూ 6988 నంబర్‌తో 1964లో రిజిస్టర్ అయిన బుల్లెట్, ఏపీడబ్ల్యూ 9332 నంబర్‌తో 1968లో రిజిస్టరైన మరో బుల్లెట్ రామకృష్ణ సొంతం. ఆ రెండు బుల్లెట్లు ఇప్పటికీ కండిషన్లో ఉన్నాయి. 1971 నాటి మోడల్ కేబీఆర్ 99 కస్టమర్ బుల్లెట్‌కు ఇప్పటికీ ఆయనే సర్వీస్, మరమ్మతులు చేస్తున్నారు. ఇవికాక 1959 నాటి రాయల్ ఎన్ఫీల్డ్ను ఎంతో సుందరంగా తీర్చిదిద్దినట్లు రామకృష్ణ తెలిపారు. తాము చేసేది రిపేర్ కాదని, వాహనానికి ప్రాణం పోస్తామని రామకృష్ణ చెప్పారు. -
‘బుల్లెట్’ బండి కోసం ప్రాణాలు తీసుకున్నాడు
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): ఫైనాన్స్‌లో తీసుకున్న బుల్లెట్ బండికి కిస్తీలు కట్టకపోవడంతో కంపెనీ వాళ్లు స్వాధీనం చేసుకోగా.. మనస్తాపానికి గురైన యువకుడు శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. యువకుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్తపేట కోమల విలాస్ ప్రాంతానికి చెందిన బెహర లక్ష్మీ, సోమేష్ దంపతులకు ఇద్దరు సంతానం. కొంత కాలంగా దంపతులు విడివిడిగా ఉంటు న్నారు. చదవండి👉: సాఫ్ట్వేర్ యువతితో ప్రేమ, పెళ్లి.. మరో మహిళ పరిచయం కావడంతో.. లక్ష్మి కూలి పనులు, తల్లి వద్ద ఉంటున్న కుమారుడు కార్తీక్ డేకరేషన్ పనులు చేస్తుంటాడు. కొన్ని నెలల క్రితం కార్తీక్ బుల్లెట్ కావాలని తల్లిని కోరగా.. బంగారు నాన్తాడు అమ్మి రూ.50 వేలు డౌన్ పేమెంట్‌గా కట్టి బుల్లెట్ కొనిచ్చింది. ఈఎంఐలు కట్టకపోవడంతో శుక్రవారం కంపెనీ సిబ్బంది వచ్చి బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో రాత్రి అంతా ఇదే విషయాన్ని తల్లికి, స్నేహితులకు చెప్పుకొంటూ మానసిక క్షోభ అనుభవించాడు. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చదవండి👉: మనసు ‘దోశ’కున్న మంత్రి వేణు -
ఇంజనీరింగ్, ఎంబీఏ చదివారు.. విలాసాల కోసం యూట్యూబ్ చూసి..
బనశంకరి(బెంగళూరు): విలాసాల కోసం బుల్లెట్ బైకుల చోరీలకు పాల్పడుతున్న 7 మంది పట్టభద్రుల అంతరాష్ట్ర గ్యాంగ్‌ను బనశంకరి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.68 లక్షల విలువచేసే 30 బైకులను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా ఐరాలకు చెందిన విజయ్ బండి, హేమంత్, గుణశేఖర్రెడ్డి, భానుమూర్తి, పురుషోత్తమ్ నాయుడు, కార్తీక్‌కుమార్, కిరణ్‌కుమార్ అనే ఏడుమంది కలిసి బెంగళూరులో వివిధ ప్రాంతాల్లో 29 వరకూ బుల్లెట్లను చోరీ చేశారు. వీరందరూ కూడా ఇంజనీరింగ్, ఎంబీఏ పట్టాలు పొందిన విద్యావంతులు. కానీ విలాసాల కోసం పెడదారి పట్టారు. యూట్యూబ్ చూసి బైక్‌లను సులభంగా ఎలా చోరీ చేయాలో మెళకువలు నేర్చుకున్నారు. ఇంటి ముందు, పార్కింగ్ స్థలాల్లో నిలిపిన బైకులను లాక్ పగలగొట్టి తీసుకెళ్లేవారు. లాంగ్‌డ్రైవ్ మాదిరిగా బెంగళూరు నుంచి ఏపీకి వెళ్లిపోయి అక్కడ విక్రయించి ఆ డబ్బులతో జల్సాలు చేసేవారు. బుల్లెట్ బైక్‌ల చోరీలపై వరుస ఫిర్యాదులు రావడంతో పోలీసులు నిఘా పెట్టి అరెస్టు చేశారు. వీరి నుంచి 27 బుల్లెట్ బైకులు, 2 పల్సర్ బైకులు, ఒక స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. దక్షిణ విభాగ డీసీపీ హరీశ్‌పాండే, ఏసీపీ శ్రీనివాస్‌లు కేసును ఛేదించారు. చదవండి: ఏడాది ప్రేమ.. ఆపై పెళ్లి, వారం కాపురం చేసి పరార్ -
పూజ చేస్తుండగా పేలిపోయిన బుల్లెట్ బండి
-
నోట్లో సిగరెట్, చేతిలో గన్.. జాంజాం అని బుల్లెట్ రైడింగ్.. విషయం బయటపడటంతో..
సోషల్ మీడియా స్టార్డమ్ కోసం రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. అంతేకాదు ఈ స్టార్డమ్ కోసం సినిమాల్లో చేసే భయంకరమైన స్టంట్లన్నింటిని చేసేస్తున్నారు. అచ్చం అలానే ఇక్కడొక యువకుడు సినిమాలో మాదిరిగా బుల్లేట్ బండిపై తన స్నేహితుడితో కలిసి ఒక ప్రమాదకరమైన విన్యాసం చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అసలు విషయంలోకెళ్లితే....గుజరాత్‌లోని సూరత్‌లో ఇద్దరు యువకులు బుల్లెట్ బైక్‌పై ఒక విన్యాసం చేశారు. ఒకరేమో బుల్లెట్ బండి నడుపుతుంటాడు. ఇంకొకరు బైక్ నడిపే వ్యక్తి పైన కూర్చొని చేతిలో పిస్టల్ పట్టుకుని తిప్పుతూ స్టైయిలిష్‌గా సిగరెట్ కాలుస్తుంటాడు. అలాగే వెనుక 'నాయక్ నహీ ఖల్నాయక్ హూన్' అనే పాట కూడా ప్లే అవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని గుజరాత్ రాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘ్వీ ట్విట్టర్లో పోస్ట్ చేయడమే కాక ఆ యువకులిద్దరినీ అరెస్టు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఈ ప్రమాదకరమైన విన్యాసం చేసినందుకుగాను ఇద్దర్ని అరెస్టు చేశారు. తప్పయిందని పోలీసుల కాళ్లావేళ్లా పడ్డా వినలేదు. వారిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. (చదవండి: చెట్టను నరికేస్తున్నాడని కోపంతో చచ్చేంతవరకు దారుణంగా కొట్టి!... చివరికి..) குஜராத் : சூரத் நகரில் கையில் துப்பாக்கி ஏந்தி பைக்கில் சுற்றிய இருவர் கைது pic.twitter.com/ede8RB4wAI — DON Updates (@DonUpdates_in) January 2, 2022 -
మళ్లీ వైరల్ అవుతున్న బుల్లెట్ బండి
-
Bullet Bandi: మళ్లీ వైరల్ అవుతున్న బుల్లెట్ బండి
సాక్షి, కరీంనగర్: సోషల్ మీడియాలో సెన్సెషన్ క్రియేట్ చేసిన బుల్లెట్ బండి పాట మళ్లీ వైరల్ అవుతోంది. బుల్లెట్ బండి పాటకు ఇప్పుడు చాలా క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. బుల్లెట్ బండి పాట విడుదల అయ్యినప్పటి నుంచి పెళ్లిళ్లు, ఫంక్షన్స్ ఆ పాట లేకుండా ఉండటం లేదంటే అతిశయోక్తి కాదు. ఈ పాటకు పిల్లలు, పెద్దలు, నవ దంపతులు అంతా స్టెప్పులు వేస్తూ ఆడిపాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తాజాగా బుల్లెట్ బండి పాటపై జాయింట్ కలెక్టర్ దంపతులు స్టెప్పులు వేశారు. వివరాలు.. కరీంనగర్ జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ బర్త్ డే వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. సెలవు రోజు కావడంతో బంధువులు ఫ్రెండ్స్‌తో బర్త్‌డే జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ దంపతులు బుల్లెట్ బండి పాటకి స్టెప్పులు వేసి బంధువులకి ఉత్సాహన్ని కలిగించారు. దీంతో మళ్లీ బుల్లెట్ బండిపాట సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోంది. -
ఇక చంద్రుడి మీద డుగ్గు డుగ్గు.. ‘నాసా’ కొత్త తరహా బుల్లెట్టు
Lunar electric motorcycle for NASAs moon exploration: చంద్రుడి మీద చక్కర్ల కోసం...చంద్రుడి మీద మనిషి అడుగుపెట్టి దశాబ్దాలు గడిచాయి గాని, ఇంతవరకు చంద్రుడి మీద ఎవరూ మోటారు సైకిల్ ఎక్కి చక్కర్లు కొట్టలేదు. ఇప్పుడు ఆ లోటు తీర్చడానికే అమెరికన్ జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ కొత్త తరహా బుల్లెట్టు బండిని రూపొందించింది. ఈసారి చంద్రుడి మీదకెళ్లినప్పుడు రాకెట్‌తో పాటు ఈ బుల్లెట్టు బండిని కూడా తీసుకుపోతే, ఇంచక్కా చంద్రుడి నేల మీద డుగ్గు డుగ్గుమని చక్కర్లు కొట్టి రావచ్చు. పూర్తిగా ఎగుడు దిగుళ్లతో నిండి ఉండే చంద్రుడి ఉపరితలంపై సునాయాసంగా ప్రయాణించేందుకు వీలుగా ‘నాసా’ శాస్త్రవేత్తలు బ్యాటరీతో నడిచే ఈ మోటారుబైక్‌ను తయారు చేశారు. ఈ వాహనం బరువు 134 కిలోలు. దీని బ్యాటరీని ఒకసారి పూర్తిగా చార్జ్ చేసుకుంటే, చంద్రుడి ఉపరితలంపై ఏకధాటిగా 70 మైళ్ల వరకు (112 కి.మీ.) ప్రయాణించవచ్చు. దీని గరిష్ఠవేగం 10 మైళ్లు (16 కి.మీ.) మాత్రమే. చదవండి: T20 World Cup 2021: ఆ జట్ల మధ్య ఇదే తొలి ముఖాముఖి పోరు.. టీమిండియా పరిస్థితి ఏంటో! -
సైలెంట్ అయిపోయిన డుగ్గుడుగ్గు బండి సైలెన్సర్స్
మార్కెట్లోకి ఎన్ని బైకులు వచ్చినా బుల్లెట్ బండికి ఉండే క్రేజే వేరు. యువతలో చాలామంది కలల బండి బల్లెట్టే.. అబ్బాయిలకే కాదు.. అమ్మాయిలకు కూడా ఈ బండి అంటే విపరీతమైన పిచ్చి. అందుకే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై ఈ మధ్య కాలంలో వచ్చిన పాటలు కూడా బాగా ట్రెండ్ అయ్యాయి. అయితే రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఇంజిన్ సౌండ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. డుగ్గు డుగ్గు డుగ్గు అంటూ వచ్చే సౌండ్‌కే యువత పడిపోతారు. అయితే బుల్లెట్ సౌండ్‌పై ఉన్న మోజుతో చాలామంది బండి సైలెన్సర్లను ఎక్కువ శబ్దం వచ్చేలా ప్రత్యేకించి రూపొందించుకుంటారు. ఇవి రోడ్డుమీద వెళ్తుంటే భారీ సౌండ్‌తోపాటు శబ్ధ కాలుష్యానికి కారణంగా మారుతోంది. తాజాగా హైదరాబాద్ సిటీ పోలీసుల కన్ను ప్రత్యేకంగా తయారు చేసుకున్న బుల్లెట్ బండి సైలెన్సర్స్పై పడింది. దీంతో ప్రత్యేకించి తయారు చేయించుకున్న వందలాది రాయల్ ఎన్ఫీల్డ్ బండ్ల సైలెన్సర్లను వారు స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటిని ఒక్కచోట చేర్చిన ట్రాఫిక్ పోలీసులు రోడ్డు రోలర్ సాయంతో సైలెన్సర్లను నలిపివేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను హైదరాబాద్ పోలీస్ ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. డుగ్గుడుగ్గు బండి సైలెన్సర్స్ ఇప్పుడు సైలెన్స్ అయిపోయాయని ట్వీట్ చేశారు. Customized #dugudugu bandi silencers are under silence.#HyderabadCityPolice #BulletBandi pic.twitter.com/Y0lK6d13Cq — హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) October 19, 2021 -
‘బుల్లెట్టు బండి’ పాట సరికొత్త రికార్డ్
వెబ్ ప్రత్యేకం: తెలంగాణ యాసలో ఓ అమ్మాయి పెళ్లిపై పెట్టుకున్న ఆశలను ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’ అనే పాట కళ్లకు కట్టేలా ఉంది. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ పాట లేనిది ఏ వేడుక కూడా జరగడం లేదు. తాజాగా ఈ పాట యూట్యూబ్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా వంద మిలియన్ల క్లబ్లో చేరిపోయింది. అత్యధిక వ్యూస్ పొందిన జానపద పాటగా నిలిచింది. చదవండి: ఎంఏ, బీఈడీ చదివి మేస్త్రీ పనికి యువతి రచయిత లక్ష్మణ్ సాహిత్యం అందించగా ప్రముఖ గాయని మోహన భోగరాజు పాడారు. బ్లూ రాబిట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మాణంలో ఎస్కే బాజి సంగీతం అందించిన ఈ పాట ఈ ఏడాది ఏప్రిల్ 7వ తేదీన యూట్యూబ్‌లో విడుదలైంది. ఆడపిల్ల పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్లేందుకు ఎలాంటి ఆశలు.. ఊసులు పెంచుకుని ఉంటుందో ఈ పాటలో ఎంతో హృద్యంగా ఉంటుంది. ఆడవారినే కాక పురుషులను కూడా ఈ పాట ఆకట్టుకుంటోంది. అయితే ఈ పాటకు ఓ నవ వధువు డ్యాన్స్‌తో మరింత వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ పాట తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగువారు ఉండే ప్రతి చోటకు వెళ్లింది. తాజాగా ఆ పాట వంద మిలియన్ల క్లబ్లో చేరింది. పది కోట్ల మందికి పైగా ఆ పాటను విని ఎంజాయ్ చేశారు. ఇది ఒక్క యూట్యూబ్‌లోనే. మిగతా సోషల్ మీడియాలను పరిగణనలోకి తీసుకుంటే వ్యూస్ భారీగా ఉంటాయి. వంద మిలియన్లు దాటడంపై గాయని మోహన భోగరాజు స్పందిస్తూ.. ‘నా తొలి పాట మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’ అని పోస్టు చేసింది. చదవండి: కీడు శంకించిందని గాంధీ విగ్రహాన్ని పక్కన పడేశారు -
ట్రాఫిక్ చలాన్ వేశారని బుల్లెట్ యజమాని ఆత్మహత్యాయత్నం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఒక యువకుడు ట్రాఫిక్ పోలీసులు తనపై.. అకారణంగా చలాన్ వేశారని, కమిషనర్ ఆఫీస్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మీరట్ జిల్లాలో జరిగింది. యూపీ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం గంగానగర్-మవాన్‌రోడ్‌లో సాకేత్ క్రాసింగ్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో రోహిత్ అనే యువకుడు గత మంగళవారం తన తల్లికి మందులను కొనుగోలు చేయడానికి బుల్లెట్ వాహనంపై బయలుదేరాడు. బుల్లెట్ వాహనం నుంచి పెద్దగా శబ్దం వస్తుండడంతో ట్రాఫిక్ పోలీసులు అతడిని ఆపివేశారు. శబ్ధం ఎక్కువగా వస్తుండడంతో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ మిశ్రా రూ.16 వేల చలాన్ వేశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఈ విషయంపై కొద్దిసేపు తర్వాత రోహిత్ తన తల్లిదండ్రులతో కలిసి మీరట్‌లోని ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నాడు. అయితే ఎస్పీ అందుబాటులో లేరు. దీంతో ఈ రోజు బుధవారం తల్లిదండ్రులతో రోహిత్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నాడు. అక్కడ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించారు. గమనించిన పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ అనిల్‌కుమార్ తమను మానసికంగా వేధిస్తున్నాడని, ఎన్కౌంటర్ చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధిత యువకుడు కన్నీటి పర్యంతమయ్యాడు. అయితే కమిషనర్ కార్యాలయం ఎదుట న్యూసెన్స్ చేయడంతో రోహిత్, అతడి తల్లిదండ్రులపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి.. తీరా పెళ్లి అనేసరికి.. -
బుల్లెట్ బండి పాటకు ఏపీ డిప్యూటీ సీఎం సతీమణి డ్యాన్స్
-
వైరల్: బుల్లెట్ బండి పాటకు ఏపీ డిప్యూటీ సీఎం సతీమణి డ్యాన్స్
సాక్షి, తిరుపతి: గత కొన్ని రోజులుగా ఎక్కడ విన్న బుల్లెట్ బండి పాటనే మార్మోగుతోంది. ఏ వేడుకల్లో చూసిన ఇదే పాట వినిపిస్తోంది. ఎప్పుడైతే ఈ పాటకు పెళ్లి కూతురు డ్యాన్స్ చేసిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు దీని హవా కొనసాగుతూనే ఉంది. ‘నీ బుల్లెట్ బండెక్కి వచ్చెత్తా పా.. డుగ్గు డుగ్గు’ అంటూ సాగే ఈ పాటకు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ స్టెప్పులేస్తున్నారు. అంత పాపులర్ అయిన ఈ సాంగ్‌కు తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి సతీమణి డాన్స్ చేశారు. మంత్రి నారాయణస్వామి 42వ వివాహ వార్షికోత్సవాన్ని తిరుపతిలోని ఆయన నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సతీమణి బుల్లెట్ బండి పాటకు భర్త ముందు సరదాగా డాన్స్ చేశారు. ఆమె తన హావభావాలు, స్టెప్పులతో అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
Karnataka: బుల్లెట్‌ను ఢీకొని వంతెన గోడమీదకు దూసుకెళ్లిన కారు
సాక్షి, బొమ్మనహళ్లి (కర్ణాటక): ఇటీవల ఆడి కారు ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడిన దుర్ఘటన మరువకముందే మరో రోడ్డు బీభత్సం చోటుచేసుకుంది. బెంగళూరులో బొమ్మనహళ్ళి–ఎలక్ట్రానిక్ సిటీ మధ్యలోనున్న వంతెన పైన మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు టెక్కీలు వంతైన పై నుంచి కింద పడి దుర్మరణం చెందారు. మృతులు తమిళనాడుకు చెందిన ప్రీతం (30), కృతికా రామన్ (28)గా పోలీసులు గుర్తించారు. వంతెన మీద ఆగడమే తప్పయింది.. ఎలక్ట్రానిక్ సిటీ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన ప్రకారం.. ప్రీతం జేపీ నగరలో నివాసం ఉంటూ సర్జాపుర రోడ్డులోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. కృతికా రామన్ మహాదేవపురలో నివాసం ఉంటోంది. ఇద్దరూ మంచి స్నేహితులు. మంగళవారం రాత్రి 9:45 సమయంలో ఇద్దరూ బెంగళూరు నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై హోసూరు వైపు వెళ్తున్నారు. సరిగ్గా వంతెనపైకి రాగానే బైక్‌లో ఏదో సమస్య రావడంతో నిలిపి చూడసాగారు. మృత్యుశకటమైన కారు.. ఇంతలో ఒక మారుతి బాలెనో కారు వేగంగా వచ్చి ప్రీతం, కృతికాలను ఢీకొట్టడంతో వారు 50 అడుగుల దూరం ఎగిరి వంతెన పై నుంచి కింద సర్వీసు రోడ్డుపై పడిపోయారు. వంతెన ఎత్తు సుమారు 40 అడుగుల పైనే ఉంటుంది. ఇద్దరూ క్షణాల్లో మృత్యువాత పడ్డారు. దీంతో రోడ్డుపై పెద్దసంఖ్యలో జనం పోగయ్యారు. మృతదేహాల నుంచి రక్తం రోడ్డుపై ధారలు కట్టడం, వాహనాల విడిభాగాలు చెల్లాచెదురుగా పడిపోవడంతో భయానకంగా కనిపించింది. కారు వంతెన గోడను సగం వరకూ ఎక్కి నిలిచిపోయింది. కారులోని ఇద్దరికి గాయాలు.. కారు నడుపుతున్న బెంగళూరు ఆనేకల్‌వాసి నితీష్ (23), అతని స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డారు. కొంతసేపటికి పోలీసులు చేరుకుని మృతదేహాలను సెయింట్‌జాన్స్ ఆస్పత్రికి, క్షతగాత్రులను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో కారును వేగంగా నడపడమే కారణమని అనుమానిస్తున్నారు. జంట బ్రిడ్జి పై నుంచి కింద పడడం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ బీఆర్. రవికాంత్‌గౌడ ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు దర్యాప్తులో ఉంది. చదవండి: Hyderabad: తొమ్మిదేళ్ల బాలికను షెటర్‌లోకి తీసుకెళ్లి.. -
ఈ బైక్ ధరలను మరోసారి పెంచిన రాయల్ ఎన్ఫీల్డ్..!
Royal Enfield Meteor 350: రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లవర్స్‌కు కంపెనీ మరోసారి షాక్‌ను ఇచ్చింది. మిటీయోర్ 350 సిరీస్ మోడల్ బైక్‌ల ధరలను మరోసారి పెంచింది. 2021 జులైలో ఈ బైక్ మోడల్ ధరలను సుమారు రూ. 10,048 మేర పెంచింది. కేవలం రెండు నెలల వ్యవధిలోనే మరోసారి బైక్ ధరలను రాయల్‌ఎన్‌ఫీల్డ్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఫైర్‌బాల్, స్టెల్లార్, సూపర్నోవా అనే మూడు వేరియంట్లపై సుమారు రూ. 6,428 మేర పెంచింది. చదవండి: Apple: మాకు ఎవరీ సహాయం అక్కర్లేదు..! మిటీయోర్ 350 ఫైర్‌బాల్ వేరింయట్ కొత్త ధర రూ.198,537 గాను, స్టెల్లార్ వేరియంట్ కొత్త ధర రూ. 204,527గాను, సూపర్నోవా 350 వేరియంట్ ధర రూ. 214,513 గా నిర్ణయించింది.ఈ ధరలు ఢిల్లీ ఎక్స్-షోరూమ్ కు చెందినవి. ఆయా ప్రాంతాలను బట్టి బైక్ ధరల్లో మార్పులు ఉండవచ్చును. రాయల్ ఎన్ఫీల్డ్ మిటీయోర్ 350 బైక్‌లను గత ఏడాది నవంబర్ నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచింది. థండర్బర్డ్ స్థానంలో మిటీయోర్ 350ను రాయల్ ఎన్ఫీల్డ్ ప్రవేశపెట్టింది. చదవండి: బడాబడా కంపెనీలు భారత్ వీడిపోవడానికి కారణం ఇదేనా..! -
బుల్లెట్ బండికి బామ్మ స్టెప్పులు.. వామ్మో ఏ చేసింది రా బాబు !
-
బుల్లెట్ బండికి బామ్మ అదిరిపోయే స్టెప్పులు.. వైరల్ వీడియో
సోషల్‌మీడియాలో ఏది ఎప్పుడు ట్రెండ్ అవుతుందో చెప్పలేం. అలా ఏదైనా ఓసారి నెటిజన్లను ఆకట్టుకుంటే అవి వైరల్‌గా మారి నెట్టింట రచ్చ చేస్తుంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే వాటి హవా కొంత కాలం అలా కొనసాగుతూనే ఉంటుంది. ఇక ‘బుల్లెట్ బండి’ పాట గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాన్య ప్రజలే గాక సెలబ్రిటీల సైతం ఈ పాటకి చిందేస్తున్నారు. తాజాగా ఓ బామ్మ తన భర్త ముందు ‘బుల్లెట్ బండి’ పాటకు స్టెప్పులతో ఇరగదీసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ప్రస్తుతం.. శ్రావణమాసంలో పెళ్లిళ్లతోపాటు ‘బుల్లెట్ బండి’ పాట ట్రెండ్ కూడా నడుస్తోంది. ఇంట్లో పెళ్లి పనులు ప్రారంభించినప్పటి నుంచి బరాత్ అయ్యే వరకూ ఎక్కడ చూసినా ‘డుగ్గు డుగ్గు’ అంటూ ఒకటే మ్యూజిక్ వినిపిస్తోంది. దీంతో ఈ పాటకు ఆఫ్‌లైన్‌లోనే కాదు ఆన్‌లైన్‌లోనూ అంతకంతకు క్రేజ్ పెరుగుతోంది. అయితే ఓవైపు ‘బుల్లెట్టు బండి’ వీడియోలతో పెళ్లికూతుళ్లు, యువతీయువకులు అలరిస్తుంటే మరోవైపు తాను కూడా తక్కువకాదంటూ ఓ వృద్ధురాలు ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది. ఆ వీడియోలో.. దాదాపు 60 ఏళ్లకు పైగా వయసున్న ముసలావిడ .. ‘బుల్లెట్ బండి’ సాంగ్‌కి అద్భుతమైన స్టెప్పులేసింది. తన భర్త మంచంపై కూర్చొని చూస్తుండగా.. సరిగ్గా సాంగ్‌లో రిథమ్‌కి తగ్గట్టు ఆమె డాన్స్ చేసింది. అయితే అతను మాత్రం కదలకుండా అలా చూస్తూనే ఉండిపోయాడు, బహుశా షాక్‌లో ఉన్నాడేమో! ఈ వీడియో చూసిన నెటిజన్లు.. వావ్ సూపర్ బామ్మ అంటున్నారు. కొందరు ఫన్నీగా ఉందని కామెంట్ పెడుతుంటే.. మరికొందరు ‘బామ్మ నువ్వు గ్రేట్’ అని కామెంట్ పెడుతున్నారు. చదవండి: Cat Drink Pig Milk: పంది పాలు తాగిన పిల్లి.. వైరల్ అవుతున్న వీడియో -
13 మిలియన్ల వ్యూస్: ఎయిర్‌హోస్టెస్ డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా
ముంబై: రాత్రికి రాత్రే స్టార్ అయిపోవాలంటే కేవలం సోషల్ మీడియా వల్లనే సాధ్యం. ఇందుకు ఉదాహరణలుగా నిలిచే సంఘటనలో కోకొల్లలు. తాజాగా బుల్లెట్ బండి పాట ఎంత హిట్ అయ్యిందో.. దానికి ఓ నవ వధువు డ్యాన్స్ వేసిన వీడియో కూడా అదే రేంజ్లో ఇంటర్నెట్‌ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. రాత్రికి రాత్రే స్టార్డం సాంపాదించుకుంది సదరు పెళ్లి కుమార్తు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే కొన్ని రోజులుగా ‘మాణికే మాగే హితే’ అనే ఓ పాట ఇంటర్నెట్‌ని తెగ షేక్ చేస్తోంది. ఒరిజినల్‌గా ఈ పాట సింహళి భాషలో(శ్రీలంక)ఉంది. కానీ ఈ పాట పాడిన గాయని గొంతులోని మాధుర్యం ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ప్రసుత్తం ఇది పలు భారతీయ భాషల్లోకి తర్జుమా అయ్యి.. ఇక్కడి జనాలను కూడా తెగ ఆకట్టుకుంటుంది. ఇక ఈ పాట మీద రికార్డయిన ఇన్‌స్టా రీల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో తాజాగా మాణికే మాగే హితే పాటకు ఓ ఎయిర్‌హోస్టెస్ వేసిన క్యూట్ స్టెప్పులు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. పాట ఎంత క్యూట్‌గా ఉందో మీ ఎక్స్‌ప్రేషన్స్ కూడా అంత అందంగా ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. ఇప్పటికే ఈ వీడియో 13 మిలియన్లకు పైగా వ్యూస్ పొందింది. ఆ వివరాలు.. (చదవండి: ‘బుల్లెట్టు బండి’ పాటకు వధువు సూపర్ డ్యాన్స్.. భర్త ఫిదా) ఇండిగోలో ఎయిర్ హోస్టెస్‌గా పని చేస్తున్న ఆయాత్ ఉర్ఫ్ అఫ్రీన్ విమానం ఆగి ఉన్న సమయంలో మాణికే మాగే హితెకు పాటకు డ్యాన్స్ చేసింది. అది కూడా యూనిఫామ్‌లో. ఇక అఫ్రీన్ డ్యాన్స్ చేస్తుండగా.. ఆమె సహచరులలో ఒకరు వీడియోని రికార్డ్ చేశారు. అనంతరం దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఈ పాటకు అఫ్రీన్ వేసిన స్టెప్పులు ఎంతో అందంగా, క్యూట్‌గా ఉండి నెటిజనులను ఫిదా చేస్తున్నాయి. (చదవండి: హుషారుగా డ్యాన్స్.. బెడిసి కొట్టిన బుల్లెట్టు బండి.. వైరల్ వీడియో) ఈ వీడియో చూసిన వారంతా.. ఆ పాటకు మీ ఎక్స్ప్రెషన్స్ సరిగా సెట్ అయ్యాయి.. ఆ పాట.. మీ ఆట బాగా సింక్ అయ్యాయి.. చాలా క్యూట్‌గా డ్యాన్స్ చేశారు అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. ఇక ఈ పాటకు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఫిదా అయ్యానని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Aᴀʏᴀᴛ urf Afreen (@_aayat_official) పాట చరిత్ర ఏంటంటే.. ‘మాణికే మాగే హితే’ పాటను అలపించింది శ్రీలంకలోని కొలంబోకు చెందిన ప్రముఖ పాప్ సింగర్ యొహాని డిసెల్వా. ఆమె కేవలం పాప్ సింగర్ మాత్రమే కాదు.. పాటల రచయిత, నిర్మాత, బిజినెస్ వుమెన్ కూడా. యొహాని తండ్రి మాజీ ఆర్మి అధికారి. తల్లి ఎయిర్‌హోస్టస్. దీంతో యొహాని చిన్నతనంలోనే మలేసియా, బంగ్లాదేశ్ వంటి ప్రాంతాల్లో పర్యటించారు. సంగీతంపై ఉన్న ఆసక్తిని గుర్తించి వాళ్లమ్మ.. ఎంతో ప్రోత్సాహం అందించారు. యూట్యూబర్‌గా కెరీర్ ఆరంభించిన ఆమె.. ‘దేవియంగే బారే’ అనే పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. యూట్యూబ్ వేదికగా ఇలా ఎన్నో పాటలు విడుదల చేసి అందరి మన్ననలు పొందారు. ఈ క్రమంలోనే ‘రాప్ ప్రిన్సెస్’ అనే బిరుదు ఆమెను వరించింది. ఇంతటి పాపులారిటీ సొంతం చేసుకున్న యొహాని 2021 మే నెలలో ‘మాణికే మాగే హితే’ పాట పాడి సోషల్‌మీడియాను షేక్ చేశారు. ఇప్పటివరకూ ఈ పాటను 9 కోట్ల మందికి పైగా వీక్షించారు. చదవండి: బుల్లెటు బండి ! ఆ డుగ్ డుగ్ వెనుక కథ ఇదేనండి !! -
‘బుల్లెట్టు బండి’ పాట 22 రోజుల కష్టం: రచయిత లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ యాసలో వచ్చిన వినసొంపైన పాట ‘బుల్లెట్టు బండి’ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఆ పాటకు ఓ నవ వధువు డ్యాన్స్ చేసి భర్తను సర్ప్రైజ్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆ పాట జనాల్లో మార్మోగుతోంది. ఏ వేడుక జరిగినా.. ఏ శుభకార్యం జరిగినా ‘బుల్లెట్టు బండి’ పాట లేనిది జరగడం లేదు. అంతగా ట్రెండింగ్ అయిన ఆ పాటను రాసిన రచయిత గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. పాట రాసింది లక్ష్మణ్ అని తెలుసు కానీ.. ఆయన ఎక్కడి వ్యక్తో... ఏం చేస్తుంటాడో తెలుసుకోండి. చదవండి: ‘బుల్లెట్టు బండి’ వధువుకు బంపర్ ఆఫర్ పాటల రచయిత కాటికె లక్ష్మణ్ స్వస్థలం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం నిర్దవెల్లి గ్రామం. వీరిది పేద కుటుంబం. లక్ష్మణ్‌తో పాటు రామ్ కూడా జన్మించాడు. అంటే వీరిద్దరూ కవల పిల్లలు. వీరిద్దరినీ రామ్‌లక్ష్మణ్‌గా పేర్కొంటారు. రామ్ గాయకుడిగా గుర్తింపు పొందగా లక్ష్మణ్ రచయితగా రాణిస్తున్నారు. వీరిద్దరూ కలిసి జానపద పాటల ఆల్బమ్స్ చేస్తూ సోషల్ మీడియాలో గుర్తింపు పొందారు. తెలంగాణ యాసలో ఎంతో ఆకట్టుకునేలా రాయడం లక్ష్మణ్ ప్రత్యేకం. సినిమా రంగంపై ఆసక్తితో రామ్ లక్ష్మణ్ హైదరాబాద్‌కు వచ్చారు. ఉపాధి కోసం ఎన్నో ప్రైవేటు ఆల్బమ్స్, జానపద పాటలు పాడారు. లక్ష్మణ్ ఇప్పటివరకు దాదాపు 300 వరకు పాటలు రాశాడు. ఆ పాటలను రామ్ పాడాడు. ఆ పాటలు కొన్ని సినిమాల్లో కూడా వచ్చాయి. ‘నువ్వంటే పిచ్చి, గాయపడిన మనసు’ ఆల్బమ్స్‌తో ఈ సోదరులు ఎంతో గుర్తింపు పొందారు. అచ్చమైన పల్లె భాషలో రాయాలని నిర్ణయించుకున్నట్లు లక్ష్మణ్ తెలిపారు. అయితే ఒకరోజు ప్రముఖ గాయని మోహన భోగరాజు లక్ష్మణ్‌కు ఓ పాట రాయమని అడిగింది. అడిగిన కొన్ని రోజుల్లోనే ‘బుల్లెట్టు బండి’ రాసి ఇచ్చాడు. ఆ పాటను మోహన భోగరాజు పాడి యూట్యూబ్‌లో విడుదల చేయడంతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ పాటకు ఓ నవ వధువు డ్యాన్స్‌తో సోషల్ మీడియానే ట్రెండింగ్‌లోకి వచ్చింది. చదవండి: ఒక్క డ్యాన్స్‌తో సెలబ్రిటీగా ‘బుల్లెట్టు బండి’ వధువు ఈ పాట తర్వాత ఆ ఇద్దరి సోదరులకు భారీగా అవకాశాలు వచ్చాయంట. మున్ముందు కూడా మరిన్ని మంచి పాటలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆశిద్దాం. 8వ తరగతి నుంచి పాటలు రాస్తున్నాడు. చంద్రబోస్, గోరటి వెంకన్న, అందెశ్రీ పాటలు వింటూ అభిరుచి పెంచుకున్నా. ఈ పాటతో 22 రోజుల్లో ఈ పాట రాసినట్లు లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు. తాను చూసిన అక్కాచెల్లెళ్లను చూస్తూ ఆ పాట రాసినట్లు తెలిపారు. ఆ నవ వధువుకు శుభకాంక్షలు తెలిపాడు. -
బుల్లెటు బండి ! ఆ డుగ్ డుగ్ వెనుక కథ ఇదేనండి !!
'నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా... డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గని' అంటూ పెళ్లి బరాత్‌లో నవ వధువు చేసిన డ్యాన్స్ రికార్డులు క్రియేట్ చేసింది. అంతకు ముందు నాలుగేళ్ల కిందట యూత్‌లో సంచలనం రేపి అర్జున్‌రెడ్డి మూవీ బుల్లెట్ డుగ్ డుగ్ సౌండ్స్‌తోనే మొదలవుతుంది. ఇటీవల వచ్చిన జార్జిరెడ్డి సినిమా బుల్లెట్ సాంగ్‌లో అయితే ‘వాడు వస్తుంటే వీధంతా ఇంజను సౌండు’ అంటూ సాహిత్యం కొససాగుతుంది. ఇంతగా హల్చల్ చేస్తున్న ఆ బుల్లెట్ బండి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ ? దాని సౌండు వెనుక ఉన్న కథాకమామీషులేంటో మీకు తెలుసా...! మోటార్ సైకిళ్ల చరిత్ర చాలా పెద్దగానే ఉంది. మోటార్ బైక్‌లను తొలిసారి గా ఫ్యుగోట్ కంపెనీ తయారుచేసింది. ప్రపంచవ్యాప్తంగా రాయల్ ఎన్ఫీల్డ్ రెండో బైక్ తయారీ సంస్థగా నిలిచింది. ప్రస్తుతం బుల్లెటు బండిని ఐషర్ మోటర్స్ లిమిటెడ్ అనుబంధ సంస్ధ అయిన రాయల్‌ఎన్‌ఫీల్డ్ తయారుచేస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ ఈ పేరులోనే ఒక రాజసం ఉంది. ఎక్కువగా రాజకీయనాయకులు ఈ బైక్‌లపై తిరుగుతుంటారు. కచ్చితంగా బుల్లెటు బైక్‌ను సొంతం చేసుకోవాలనే మోజు, క్రేజు యూత్‌లో నెలకొంది. బుల్లెటు బైక్ ఇంగ్లాండ్‌కు చెందిన రెడ్డిచ్ ఎన్ఫీల్డ్ మోటార్స్ కంపెనీ ఈ బైక్‌ను రూపొందించింది. రెండు ప్రపంచ యుద్ధాల సమయంలో రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు ఆర్మీకి ఎంతగానో ఉపయోగపడ్డాయి. చెన్నైలో ప్లాంట్ ఇండియాలో బ్రిటిష్‌వాళ్ల రాకతో వారి పరిపాలనలో రాజసానికి చిహ్నంగా ఈ బైక్‌ను భారత్‌లోకి తెచ్చారు. తొలి దశలో ఇంగ్లండ్ నుంచి ఈ బైకులను ఇండియాకు తెప్పించారు. ఆ తర్వాత 1947 స్వాతంత్ర్యం వచ్చాక ఆర్మీ జవాన్లు గస్తీకాయడం కోసం బుల్లెట్ బైక్‌ను ఎంచుకోవాలని అప్పటి భారత ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే ఇంగ్లాండ్ నుంచి బుల్లెటు బైకులను తీసురావడానికి ఖర్చు ఎక్కువగా అవుతుండడంతో చెన్నైలో తయారీ ప్లాంటు నెలకొల్పాలని నిర్ణయించారు. అలా 1952లో చైన్నెకు చెందిన మద్రాస్ మోటార్స్ ఇంగ్లాండ్‌కు చెందిన రెడ్డిచ్ కంపెనీ భాగస్వామ్యంతో రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియాను స్థాపించారు.350 సీసీ ఇంజన్ సామర్థ్యంతో బుల్లెట్ బ్రాండ్ నేమ్‌తో బైకులు తయారు చేయడం మొదలెట్టింది రాయల్‌ఎన్‌ఫీల్డ్. మొదటి బైక్ బుల్లెట్ భారత్‌లో మొట్టమొదటిసారిగా తయారై మార్కెట్లోకి వచ్చిన బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ వారి బుల్లెట్ బండే. అప్పట్లో భారత ప్రభుత్వం సుమారు 800 బుల్లెట్లను ఆర్మీ కోసం ఆర్డర్ చేసింది. మొదట్లో ఇంగ్లండ్ నుంచి విడిభాగాలు తెప్పించుకుని ఇండియాలో తయారు చేసేవారు. 1962 నాటికి అన్నిభాగాలు ఇండియాలోనే తయారు చేయడం మొదలెట్టారు. ఇప్పటికీ ఇండియన్ ఆర్మీకి రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థనే బైకులను సరఫరాచేస్తోంది. హిమాలయ, ఈశాన్య భారతంలో ఆర్మీ గస్తీ విధుల్లో బుల్లెట్టు బండిది కీలకం. మేడ్ లైక్ ఏ గన్ గోస్ లైక్ ఏ బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ బైక్‌లను పరిచయం చేయడానికి ముందు రెడ్డిచ్ ఎన్ఫీల్డ్ కంపెనీ లాన్ మూవర్స్‌ను కంపెనీ తయారుచేసేది. అంతేకాకుండా తుపాకులను,ఫీరంగులను తయారుచేసేది. 19వ శతాబ్ధంలో యూరప్‌లో యుద్దాలు నిరంతరం జరుగుతుండేవి. అందులో పలు దేశాలకు రైఫిల్స్, స్పోర్టింగ్ గన్లను కూడా ఈ సంస్థనే సరఫరా చేసింది. వీటి నుంచే రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ట్యాగ్ వచ్చింది. అదే.. ‘మేడ్ లైక్ ఏ గన్..గోస్ లైక్ ఏ బుల్లెట్..బిల్ట్ లైక్ ఏ గన్’ బడ్జెట్ బుల్లెట్ పేరు ఇదే రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల సౌండ్ ఎంత గొప్పగానో ఉంటుంది కానీ మైలేజీ చాలా తక్కువ. ఎక్కువగా ఇంధనాన్ని తాగేవి. దీంతో హీరో స్ల్పెండర్డర్ తరహాలో టారస్ పేరుతో ఎకానమీ బైకును కూడా మార్కెట్లోకి తెచ్చి రాయల్ ఎన్ఫీల్డ్. ఈ బైక్ సింగిల్ సిలిండర్, 325సీసీ డిజిల్ ఇంజన్ వేరియంట్‌తో పని చేస్తూ 6.5బీహెచ్పీ సామర్ధ్యంతో 15ఎన్‌మ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేసేది. ఈ బైక్ లీటర్ డిజీల్‌కు సుమారు 70 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చేది. టారస్ బుల్లెట్ మోడల్ బైక్ సుమారు 12 సంవత్సరాలు పాటు అందుబాటులో ఉంది. మైలేజీ భేషుగ్గా ఉన్నా దీని ధర అధికం కావడంతో ఆశించిన మేరకు సేల్స్ జరగలేదు. దీంతో కంపెనీ ఈ మెడల్ని డిస్కంటిన్యూ చేసింది. చెక్కుచెదరని డిజైన్ రాయల్ ఎన్ఫీల్డ్ ట్యాంక్‌పై ఉండే డిజైన్‌ను చైన్నెకు చెందిన కళాకారుడు రూపొందించాడు. రాయల్ ఎన్ఫీల్డ్ పెట్రోల్ ట్యాంకులపై డిజైన్‌ను పూర్తిగా చేతులతోనే వేసేవారు. కాలక్రమేణా బుల్లెట్ బైక్‌లకు డిమాండ్ పెరగడంతో బైక్ ట్యాంక్‌లపై పిన్ స్ట్రిప్‌లను యంత్రాలను ఉయోగించి డిజైన్ చేస్తున్నారు. -
‘బుల్లెట్ బండి’.. వాళ్లిద్దరికి సన్మానం
సాక్షి, కేశంపేట(హైదరాబాద్): యూట్యూబ్‌లో హల్చల్ చేస్తున్న ‘బుల్లెట్ బండెక్కి..’ పాటను రాసిన గేయ రచయితలను ఎంపీపీ రవీందర్‌యాదవ్ బుధవారం సన్మానించారు. మండల పరిషత్ కార్యాలయంలో గేయ రచయితలు మండల పరిధిలోని నిర్దవెళ్లి గ్రామానికి చెందిన రాము, లక్ష్మణ్‌లను శాలువలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వర్కాల లక్ష్మీనారాయణగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి పాల్గొన్నారు. చదవండి: ఒక్క ఆలూ చిప్.. ధర ఏకంగా రూ.14 లక్షలు -
రాజన్న సిరిసిల్లలో బుల్లెట్ బండి పాటకు స్టెప్పులేసిన నర్స్
-
హుషారుగా డ్యాన్స్.. బెడిసి కొట్టిన బుల్లెట్టు బండి.. వైరల్ వీడియో
కరీంనగర్: ఇది సోషల్ మీడియా కాలం. ఓ చిన్న విషయాన్ని షేర్ చేస్తే.. అది జనాలకు నచ్చితే.. ఇట్టే వైరల్‌గా మారిపోతోంది. ఆ ట్రెండ్‌ను చాలా మంది ఫాలో అవుతుంటారు. అయితే డ్యూటీలో ఉండగా ఓ నర్సు చేసిన ‘‘బుల్లెట్టు బండి’’ డ్యాన్స్ బెడిసి కొట్టింది. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండల కేంద్రం పీహెచ్పీలో పని చేస్తున్న కాంట్రాక్ట్ నర్సు జ్యోతి ‘‘బుల్లెట్ బండెక్కి వచ్చేత్తా పా’ పాటకు డ్యాన్స్ చేసింది. అయితే ఇండిపెండెన్స్ డే రోజున.. విధుల్లో ఉండగా డ్యాన్స్ చేయడంతో జ్యోతికి జిల్లా వైద్యాధికారి మెమో జారీ చేశారు. కాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంతోషంగా మాత్రమే డ్యాన్స్ చేసినట్లు వైద్య సిబ్బంది పేర్కొన్నారు. ఆగస్టు 15న తీసిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చదవండి: గిఫ్ట్‌తో వధూవరులకు షాకిచ్చిన కమెడియన్: నవ్వులే నవ్వులు! అయితే జ్యోతికి మెమో జారీ చేయడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో తప్పుపడుతున్నారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ ‘‘కొన్ని రోజుల క్రితం డాక్టర్లు, నర్సులు చేసిన డ్యాన్స్‌లకు జనాలు చప్పట్లు కొట్టి, ప్రశంసలు కురిపించారు. అప్పుడు ఎంత మందికి మెమోలు జారీ చేశారు. ఆ సమయంలో కనిపించని తప్పు ఇప్పుడు ఎందుకు?’’ అంటూ ఘాటుగా స్పందించాడు. కాగా ఈ నెల 14న మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన అటవీ శాఖ ఉద్యోగి ఎఫ్ఎస్వో రాము, సురేఖ దంపతుల పెద్ద కూతురు సాయి శ్రీయను రామక్రిష్ణాపూర్‌కు చెందిన ఆకుల అశోక్‌తో వివాహం జరిపించారు. అప్పగింతల సమయంలో ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’ అనే ఓ జానపద పాటకు వధువు తన బరాత్‌లో సూపర్‌గా డ్యాన్స్ చేసి వరుడిని బంధుమిత్రులతో పాటు.. నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే. చదవండి: Bullet Bandi Song: వధువు సూపర్ డ్యాన్స్.. చూస్తూ ఉండిపోయిన భర్త -
దేశం కోసం మహిళా టీచర్ సాహసం
సాక్షి, చెన్నై: దేశ సమైక్యతను కాంక్షిస్తూ మహిళా టీచరు బుల్లెట్ పయనానికి శ్రీకారం చుట్టారు. తమిళనాడుతో అనుబంధం ఉన్న టీచర్ రాజ్యలక్ష్మి ఢిల్లీలో పని చేస్తున్నారు. ఈమె దేశంపై యువతలో చైతన్యం, అవగాహన కల్పించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం మదురై గోరిపాలయం నుంచి ఆమె తన ప్రయాణం మొదలెట్టారు. బుల్లెట్ నడుపుకుంటూ, మార్గమధ్యలో ఆయా ప్రాంతాల్లో అవగాహన కల్పించి, దేశ సమైక్యతే లక్ష్యంగా ముందుకు సాగారు. ఆమె వెన్నంటి క్రైస్తవ సామాజిక వర్గానికి చెందిన 12 మంది, ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మరో 12 మంది యువకులు మోటారు సైకిళ్ల మీద వెళ్లనున్నారు. చెన్నై, బెంగళూరు, నాగ్‌పూర్, ఢిల్లీ మీదుగా హిమాచల్ ప్రదేశ్ వరకు 4450 కి.మీ దూరం 19 రోజుల పాటు ఈ ప్రయాణం సాగనుంది. అలాగే ధర్మపురి జిల్లా పెన్నగరం సమీపంలోని ఒప్పగౌండన్ హల్లిలో సమాచార శాఖ నేతృత్వంలో గ్రంథాలయం నిర్మించారు. ఇక్కడే భరతమాత స్మారక ఆలయాన్ని సైతం ఏర్పాటు చేయగా, వీటిని మంత్రి స్వామినాథన్ ప్రారంభించారు. -
‘రాయల్’ మరింత ఖరీదు
న్యూఢిల్లీ: రాయల్ ఎన్ఫీల్డ్ తన బైకుల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తయారీ ఖర్చు పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాయల్ ఎన్ఫీల్డ్ ప్రకటించింది. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి వస్తోన్న క్లాసిక్ 350, బెల్లెట్ 350, మీటియర్ 350, హిమాలయన్, ఇంటర్సెప్టార్ 650, కాంటినెంటల్ జీటీ 650 మోడల్స్‌పై ధరలు పెంచింది. జులై 1 నుంచి పెరిగిన ధరలు వర్తిస్తున్నాయి. 4.25 శాతం రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మార్కెట్లో ఉన్న వెహికల్స్‌లో క్లాసిక్ 350 మోడల్ అమ్మకాలు ఎక్కువ. దీంతో పాటు ఇటీవల మార్కెట్లోకి వచ్చిన మోడల్ మీటియర్ 350. ఈ రెండు మోడల్స్‌కి సంబంధించిన ధరలే అధికంగా పెరిగాయి. క్లాసిక్ 350పై 4.24 శాతం, మీటియర్ 350పై 4.25 శాతం ధరలు అధికం అయ్యాయి. పెరిగిన ధరలు జులై నుంచి అమ్మలోకి రానున్నాయి. పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి (రూపాయల్లో) మీటియర్ వేరియంట్స్ కొత్తధర పాతధర ఫైర్‌బాల్ 1,92,109 1,84,319 స్టెల్లార్ 1,98,099 1,90,079 సూపర్నోవా 2,08,084 1,99,679 బుల్లెట్ 350 కొత్తధర పాతధర సిల్వర్ ఓనిక్స్బ్లాక్ 1,58,485 1,53,718 బ్లాక్ 1,65,754 1,60,775 350 ఈఎస్ 1,82,190 1,76,731 -
రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ కోసం టెక్కీ ఆత్మహత్య
సాక్షి, బెంగళూరు: రాయల్ ఎన్ఫీల్డ్ (బుల్లెట్) బైక్‌ను తల్లిదండ్రులు కొనివ్వలేదనే ఆవేదనతో యువ టెక్కీ ఆత్మహత్య చేసుకున్న ఘటన కువెంపునగరలో మంగళవారం జరిగింది. వివరాలు.. టెక్కీ అజయ్ (25) ఐదేళ్లుగా బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. లాక్డౌన్ వల్ల ఇప్పుడు మైసూరులో ఇంటినుంచే పనిచేస్తున్నాడు. తనకు బుల్లెట్ బైక్ కొనివ్వాలని తల్లిదండ్రులను తరచూ అడిగేవాడు. పలు కారణాల వల్ల వారు ఒప్పుకోలేదు. దీంతో అజయ్ ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: 3.46లక్షల ఫాలోవర్స్..‘మీ డై హార్ట్ ఫ్యాన్’ అంటూ -
వైరల్: వరుడి చెంప పగలగొట్టిన వధువు
లక్నో: ఘనంగా పెళ్లి జరిగింది. రిసెప్షన్‌కు అంతా సిద్ధమైంది. కొద్దిసేపట్లో ఫంక్షన్ ప్రారంభమవుతుందనగా వరుడు ఓ మెలిక పెట్టాడు. దానికి వధువు కుటుంబసభ్యులు ససేమిరా అన్నారు. అయినా కూడా వరుడు పట్టుబట్టడంతో విసుగు చెందిన పెళ్లికూతురు పెళ్లి మండపంపైనే అతడి చెంప ఛల్లుమనిపించింది. ఈ ఘటనతో వివాహానికి హాజరైన అతిథులు, బంధుమిత్రులు షాక్‌కు గురయ్యారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అమేథి జిల్లా సలీమ్‌పూర్ గ్రామానికి చెందిన నాసిమ్ అహ్మద్ కుమార్తెకు మహమ్మద్ ఇమ్రాన్ సాజ్‌తో మే 17వ తేదీన వివాహమైంది. బరాత్ అనంతరం విందు ఏర్పాటు చేశారు. అందంగా ముస్తాబై వేదికపై పెళ్లి కుమారుడు ఇమ్రాన్ సాజ్ కూర్చున్నాడు. అయితే ఈ సమయంలో వరకట్నం కింద తనకు బుల్లెట్ వాహనం ఇవ్వాలని వరుడు డిమాండ్ చేశాడు. అల్లుడి విజ్ఞప్తిని వధువు కుటుంబసభ్యులు తమకు కుదరదు.. అంత స్తోమత లేదని బతిమిలాడారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య వివాదం రాజుకుంది. ఇదంతా గమనిస్తున్న వధువు తీవ్ర ఆవేశానికి గురయ్యింది. వెంటనే వరుడి వద్దకు వెళ్లి చెంపపై కొట్టింది. రెండు, మూడుసార్లు చేయి చేసుకుంది. ఆమె చర్యను అభినందించిన గ్రామస్తులు వరుడి కుటుంబసభ్యులపై దాడికి పాల్పడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇరువర్గాలను సర్ది చెప్పేందుకు ప్రయత్నించగా వినిపించుకోలేదు. మనస్తాపానికి గురైన వరుడు విడాకులు కావాలని పట్టుబట్టారు. పంచాయతీ ఎటూ తేలకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: బైక్ దొంగ చేసిన పనికి డ్రైనేజీలోకి పోలీసులు చదవండి: జనం చస్తుంటే.. జాతర చేస్తారా.. -
వావ్.. వజీర్..
సాక్షి. వైరా రూరల్: యూట్యూబ్ అతడికి మార్గదర్శిగా నిలిచింది. అందులో నుంచి బుల్లెట్లను రీమోడలింగ్ చేసే విధానాన్ని నేర్చుకుని.. ఎన్నో పాత బుల్లెట్లను కొత్తగా మార్చాడు. ఈతరం బుల్లెట్ల మాదిరిగానే అవి ఉండటంతో ప్రజల్లో ఆదరణ పెరిగింది. దీంతో ఆ వృత్తినే జీవనోపాధిగా మార్చుకుని “బుల్లెట్’లాగా దూసుకుపోతున్నాడు.. వైరాకు చెందిన వజీర్. తాను రీమోడలింగ్ చేసిన బుల్లెట్ల ఫొటోలు యూట్యూబ్, ఓఎల్‌ఎక్స్‌లలో పెట్టి విక్రయిస్తున్నాడు. ప్రత్యేకంగా ఫేస్బుక్లో పేజీ రూపొందించి ఫాలోవర్ల సంఖ్యను పెంచుకున్నాడు. యూట్యూబ్ చానెల్ ఏర్పాటు చేసి ఎందరో సబ్స్క్రైబర్లను సాధించాడు. 1994 అంతకంటే ముందు వచ్చిన డీజిల్ బుల్లెట్ వాహనాలకు రీమోడలింగ్ చేసి భవిష్యత్‌లో స్థిరపడాలనే లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు వెళ్తున్నాడు. విశేషం ఏంటంటే.. ఇంత వరకు అతను ఎక్కడా షాపు పెట్టలేదు. చదవండి: రాష్ట్రంలో విరివిగా కరోనా పరీక్షలు ఇలా మొదలైంది.. బుల్లెట్ వాహనాలకు రీమోడలింగ్ చేసే షేక్ వజీర్ ఏడేళ్ల కిందట టోరస్ 1995 మోడల్‌కు చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాన్ని కొనుగోలు చేశాడు. దానిని కొన్ని రోజులు నడిపిన తర్వాత ఆ బైక్ రిపేర్‌కు వచ్చింది. దానికి మరమ్మతులు చేయించేందుకు చాలా షాపులు తిరిగాడు. కానీ ఏళ్ల కిందట బుల్లెట్ కావడంతో రిపేర్ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. 1994 కంటే ముందు మోడల్ డీజిల్ బుల్లెట్లకు అప్పటి మెకానిక్‌లు ఆర్డీఓ అప్రూవల్తో పెట్రోల్ వాహనాలుగా మాత్రమే కన్వర్షన్ చేసేవారు తప్ప రిపేర్ మాత్రం చేసే వారు కాదు. ఇలాంటి బైక్‌లను మరమ్మతు చేయడం నేర్చుకుంటే జీవితంలో స్థిరపడవచ్చనే అనే ఆలోచన అప్పుడు అతడికి వచ్చింది. యూట్యూబ్ ద్వారా గుంటూరులో మాత్రమే ఇంజిన్ రిపేర్ చేసే వారు ఉంటారని తెలుసుకున్నాడు. అక్కడికి వెళ్లి ఇంజిన్ రీపేర్ చేయడం, అమర్చడం నేర్చుకున్నాడు. యూట్యూబ్ ద్వారా వాహనంలోని వివిధ భాగాలు వీడదీయడం, వాటిని అమర్చడం నేర్చుకున్నాడు. తాను కొనుగోలు చేసిన బుల్లెట్‌పై ప్రయోగం చేసి సత్ఫలితం సాధించాడు. షాపు పెట్టుకునేందుకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో యూట్యూబ్‌లో చానల్ రూపొందించాడు. తాను రీమోడలింగ్ చేసే ప్రతి వావాహనాన్ని అందులో ఆప్‌లోడ్ చేసి ప్రపంచమంతా వీక్షించే విధంగా దానిని రూపకల్పన చేశాడు. కుంగిపోకుండా.. వజీర్ ఎంబీఏ చేసి ఏదైనా ఉద్యోగంలో స్థిరపడాలని కోరిక. డిగ్రీలో కొన్ని సబ్జెక్టులు తప్పడంతో తన తండ్రి సైదులుకు ఉన్న చికెన్ షాపులో పని చేసుకుంటూ.. చదువుకునే వాడు. ఈ క్రమంలో తన తండ్రి మత్స్యకారుడు కూడా కావడంతో సుమారు ఆరేళ్ల కిందట చేపల వేటకు వెళ్లి ఈదురు గాలులకు రిజర్వాయర్‌లో గల్లంతై మృతిచెందాడు. దీంతో కుటుంబ భారం మొత్తం ఇతడిపై పడడంతో చదువును మధ్యలోనే ఆపేశాడు. తండ్రి మృతి తర్వాత చికెన్ షాపులో కూడా వ్యాపారం తగ్గడంతో.. అతడికి తెలిసిన చికెన్ షాపులో పనిచేస్తూ.. అన్ని తానై తన చెల్లి వివాహం చేశాడు. ప్రస్తుతం కొణిజర్లలో చికెన్ షాపు పార్ట్‌టైంగా నిర్వహిస్తూ.. ఇంట్లో బుల్లెట్ రీమోడలింగ్ చేస్తున్నాడు. ధ్రువీకరణ పత్రాలు ఉంటేనే.. డీజిల్ బుల్లెట్లు 1996 తర్వాత పూర్తిస్థాయిలో బ్యాన్ అయ్యా యి. కానీ, వాటి క్రేజ్ మాత్రం తగ్గలేదు. కారణం ఈ ద్విచక్రవాహనం లీటర్ డీజిల్‌కు 70 కిలోమీటర్ల మైలేజ ఇస్తాయి. ఫేస్బుక్, యూట్యూబ్, ఓఎల్‌ఎక్స్‌ల ద్వారా నాటి బుల్లెట్లు ఎక్కడ దొరకుతాయో.. తెలుసుకొని అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు ఉంటే.. వాటిని కొనుగోలు చేస్తాడు. అనంతరం దాని భాగాలు మొత్తం పూర్తి స్థాయిలో వీడదీసి, దానికి కావా ల్సిన స్పేర్ భాగాలను కొని మొత్తం ఫిట్టింగ్ అంతా పూర్తి చేస్తాడు. నూతన సీట్లు కావాలంటే వాటిని సైతం తయారు చేస్తాడు. పెయింటింగ్, రాయల్ ఎన్ఫీల్డ్ అనే స్టిక్కర్ కూడా వేస్తాడు. మొత్తం రీమోడలింగ్ అయిన తర్వాత తన సోషల్ మీడియా ద్వారా విక్రయానికి సిద్ధం చేస్తాడు. ఇలా ఇప్పటికే ఎన్నో బుల్లెట్లను రీమోడలింగ్, రీస్టోర్ చేశాడు. -
బుల్లెట్‌పై వంటలు.. రుచి చూడాల్సిందే!
సాక్షి, నిజామాబాద్: నగరానికి చెందిన వినయ్ హైదరాబాద్‌లోని తాజ్ హోటల్‌మేనేజ్‌మెంట్‌లో శిక్షణ పొందాడు. అనంతరం ఉద్యోగం కాకుండా వినూత్న ఆలోచనతో స్వయం ఉపాధి పొందుతున్నాడు. బుల్లెట్ బైక్‌పై పొయ్యిని అమర్చి దానిపై చికెన్‌టిక్కా, లెగ్‌పీస్, బ్రేరీబ్రేరి స్టిప్స్, గ్రీల్ పైనాపిల్, క్రిస్పీకార్న్, చికెన్‌కాసాడీయా వంటి వివిధ రకాల వంటకాలను తయారు చేస్తున్నాడు. ఈ వంటకాలు రూ.30 నుంచి 90 వరకు లభిస్తాయని వినయ్ తెలిపారు. నగరంలోని ఎల్లమ్మ గుట్టపై తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. బుల్లెట్ బైక్‌ను తన జీవనాధారంగా మార్చుకొని, పసందైన వంటకాలను అందిస్తు ప్రజలను ఆకట్టుకుంటున్నాడు. (బుల్లితెర ‘గుండన్న’ మనోడే) –సాక్షి ఫొటోగ్రాఫర్–నిజామాబాద్ -
నందలూరులో రూ.25వేలకే బుల్లెట్!
సాక్షి, రాజంపేట: బుల్లెట్ రూ.25 నుంచి రూ.35వేలకే వస్తోందంటే ఆశ్చర్యమే కదూ... వైఎస్సార్ కడప జిల్లా నందలూరులో పలువురు యువకుల చేతిలో బుల్లెట్ కనిపిస్తోందంటే ఇదే కారణం అన్న భావన వినిపిస్తోంది. అసలు విషయం ఏమిటంటే కర్ణాటక నుంచి నందలూరు తదితర ప్రాంతాలకు బుల్లెట్, పల్సర్ లాంటి బైకులను తీసుకొచ్చి అతి తక్కువ ధర విక్రయించే ముఠా వ్యవహారం నందలూరులో బట్టబయలైంది. రూ.1లక్షకు పైగా ఉన్న బుల్లెట్ ద్విచక్రవాహనం ధర రూ.50 వేలకే లభ్యం కావడంతో యువత ఎగబడి కొన్నారు. నందలూరు పోలీసులకు అనుమానం వచ్చి రెండురోజుల కిందట బుల్లెట్ వాహనాలను స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు. వీటిని స్మగ్లింగ్ చేసే అసలు వ్యక్తి కోసం పోలీసులు రంగంలోకి దిగారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను స్టేషన్‌కు తరలించారు. -
టార్గెట్ బుల్లెట్ బైక్..
సాక్షి, హైదరాబాద్: ఖరీదైన ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ఇద్దరు దొంగలను గురువారం అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.15లక్షల విలువైన 10 బైక్‌లను స్వాధీనం చేసుకున్న సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. కూకట్పల్లి ఏసీపీ సురేందర్‌రావు వివరాలు వెల్లడించారు. బీదర్ జిల్లా బసవ కళ్యాణం మండలం, కొడియాల్ గ్రామానికి చెందిన పేరినేని సందీప్ పాటిల్ బాలాజీనగర్‌లో ఉంటున్నాడు. విద్యార్థిగా ఉన్న సమయంలోనే అతను బైక్ చోరీ కేసులో అరెస్టై జైలుకు వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఏడాది నవంబర్‌లో జైలుకు వెళ్లిన అతను ఇటీవల విడుదలయ్యాడు. అయినా తన పంథా మార్చుకోని సందీప్ తన పాత స్నేహితులు విజయ్, శివశంకర్‌లతో కలిసి తిరిగి చోరీల బాట పట్టాడు. గత రెండున్నర నెలల్లో బాలానగర్, సనత్‌నగర్, కూకట్పల్లి, జగద్గిరిగుట్ట, కేపీహెచ్‌బీ, జీడిమెట్ల, అత్నూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 7 బుల్లెట్లు, 3 పల్సర్లు, దొంగిలించినట్లు తెలిపారు. గురువారం భాగ్యనగర్ కాలనీలో వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్న పోలీసులు నంబర్ లేని బుల్లెట్ బైక్‌పై వెళుతున్న సందీప్ పాటిల్, అతడి స్నేహితుడు శివశంకర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు అంగీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరో నిందితుడు విజయం పరారీలో ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో సీఐ ప్రసన్న కుమార్, డీఐ రామకృష్ణ, ఎస్ఐ మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. -
బుల్లెట్ల కదలికలపై డేగకన్ను !
గుంటూరు: ఇష్టానుసారంగా బుల్లెట్లను మార్పులు, చేర్పులు చేస్తూ రోడ్లపై మితి మీరిన వేగంతో హల్చల్ సృష్టిస్తున్న వాహనాలపై పోలీస్, రవాణా శాఖాధికారులు డేగకన్ను వేశారు. జిల్లా వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగాబుల్లెట్లకు పెద్దగా శబ్దం వచ్చేలా నకిలీ సైలెన్సర్లను ఏర్పాటు చేసి ‘మోత మోగిస్తున్నారు’ శీర్షికతో బుధవారం ’సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై ఆయా శాఖల ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించారు. అర్బన్, రూరల్ జిల్లాల ఎస్పీలు సీహెచ్ విజయారావు, సీహెచ్ వెంకటప్పల నాయుడులు సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ’సాక్షి’ పత్రికలో ప్రచురితమైన విధంగా రోడ్లపై వాహనాలు నడుస్తున్నట్లు, నకిలీ సైలెన్సర్లు తయారీ, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఒక వేళ అలాంటివి ఎక్కడ ఉన్నా వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పారు. ఎస్పీల ఆదేశాల మేరకు పోలీసులు బుల్లెట్ల రాకపోకలపై దృష్టి సారించారు. అదే విధంగా డీటీసీ రాజారత్నం కూడా స్పందించి బుల్లెట్ల రాకపోకలపై నిఘా ఉంచి సైలెన్సర్లు మార్పు చేసిన వాహనాలను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఓ వైపు పోలీసులు, మరో వైపు రవాణా శాఖాధికారులు ప్రధాన రహదారులపై నిఘా పెట్టడంతో భారీ శబ్దంతో పాటు మితిమీరిన వేగంతో నిబంధనలను బేఖాతరు చేస్తున్న వాహన యజమానులు బుధవారం తమ బుల్లెట్లను రోడ్డెక్కెనివ్వలేదు. జిల్లాలోని మంగళగిరి, తెనాలి, గుంటూరు, నరసరావుపేట ప్రాంతాల్లో కూడా సైలెన్సర్లను మార్పు చేసిన యువత వాహనాలను బయటకు తీసే సాహసం చేయలేదు. దుకాణాల మూసివేత ’సాక్షి’లో ప్రచురితమైన కథనం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గంటల వ్యవధిలోనే రెండు శాఖల అధికారులు రంగంలోకి దిగడంతో నకిలీ వ్యాపారులు, మెకానిక్‌ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఎక్కడ తమ పేరు బయటకు వస్తుందోనని హడలిపోతున్నారు. తెనాలికి చెందిన మెకానిక్ తన దుకాణంలో ఉన్న సైలెన్సర్లను హడావుడిగా రహస్య ప్రాంతాలకు తరలించాడు. తన పేరు బయటకు రాకుండా ఉంచేందుకు పోలీస్ అధికారులతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. అందుకు ప్రతిఫలం కూడా చెల్లించేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అతన్ని తప్పించేందుకు పోలీస్ అధికారులు భరోసా ఇచ్చి వెంటనే దుకాణం మూయించి వేసి పంపినట్లు సమాచారం. ఇదే తరహాలో విజయవాడలోని నకిలీ సైలెన్సర్లు విక్రయిస్తున్న వ్యాపారికి కూడా సమాచారం అందించడంతో అతను కూడా దుకాణంలో ఉన్న వాటిని అతని గోడౌన్‌కు తరలించినట్లు తెలిసింది. మంగళగిరి, నరసరావుపేటల్లోని మెకానిక్‌లు వారు సైలెన్సర్లు విక్రయించిన బుల్లెట్ల యజమానులకు సమాచారం అందించి బయటకు బుల్లెట్‌ను తీసుకురావద్దని చెప్పి వారు దుకాణాలను మూసి వేశారు. ఏది ఏమైనా రెండు శాఖల ఉన్నతాధికారులు ఇదే విధానంలో నిఘా కొనసాగించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తే రోడ్డుపై వాహనాలు ప్రశాంతంగా రాకపోకలు కొనసాగించడంతో పాటు గుండెజబ్బు రోగులకు కొంత ఊరట నిచ్చినట్లు ఉంటుందని ప్రజలు వాపోతున్నారు. నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర వాసులు కోరుతున్నారు. -
దడ పుట్టిస్తున్న సైలెన్సర్లు!
మామూలు శబ్దం కాదు.. తుపాకీ నుంచి తూటా దూసుకొచ్చినంత సౌండ్. రాకెట్లాగా నిప్పులు చిమ్ముకుంటూ ప్రయాణం.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగం.. అంతా కుర్రకారే.. రేసుల కోసం.. ప్రత్యేక ఆకర్షణ కోసం.. ప్రజలకు దడ పుట్టిస్తున్నారు. బుల్లెట్ వాహనాలకు వింతైన సైలెన్సర్లను బిగించి రోడ్లపై హల్చల్ చేస్తున్నారు. తెనాలిలోని ఓ వ్యాపారి తన కుమారుడు బీటెక్ పూర్తి చేసిన ఆనందంలో అతని కోరిక మేరకు బుల్లెట్ కొనిచ్చాడు. అప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి ఓ మెకానిక్ అధిక శబ్దంతో పాటు నిప్పులు చెరిగే సైలెన్సర్లు విక్రయిస్తున్నట్లు తెలుసుకున్న యువకుడు నేరుగా అక్కడకు వెళ్లి మెకానిక్ కోరినంత డబ్బు ఇచ్చి నిప్పులు చెరిగే సైలెన్సర్‌ను వాహనానికి బిగించుకున్నాడు. దీంతో రాత్రి వేళల్లో ప్రధాన రహదారులపై హల్చల్ చేస్తున్నాడు. నిప్పులు చెరుగుతూ బుల్లెట్ వెళుతుంటే ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ.. రోడ్డు పక్కకు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలోనే అతడు బైక్ రేసులకు రహస్యంగా వెళ్లడం ప్రారంభించాడు. గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అభివృద్ధి చెందుతున్న గుంటూరు జిల్లాలో గడచిన నాలుగేళ్లలో యువతలో బుల్లెట్ల క్రేజ్ పెరిగింది. అధునాతనంగా తీర్చిదిద్దిన వాహనానికి అదనపు హంగులు కోసం ఆసక్తి చూపుతోంది. ఈ క్రమంలో కొందరు మెకానిక్‌లు వారిదైన శైలిలో యువత మోజును క్యాష్ చేసుకుంటున్నారు. కొందరు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటుంటే మరి కొందరు జిల్లాలోనే నకిలీ సైలెన్సర్లను తయారు చేసి గుట్టుగా విక్రయాలు చేస్తున్నారు. మార్పులు ఇలా... జిల్లా వ్యాప్తంగా గడచిన నాలుగేళ్లలో ప్రతిఏటా సగటున 700 బుల్లెట్ వాహనాల విక్రయాలు జరుగుతున్నాయి. అధికంగా యువత వాటినే కొనుగోలు చేసేందుకు ఆసకి చూపుతున్నారు. వాహన కొనుగోలు చేసిన అనంతరం బుల్లెట్‌కు నిబంధనల ప్రకారం 70 నుంచి 80 డెసిబుల్స్ లోపు శబ్దం వచ్చే సైలెన్సర్లను ఏర్పాటు చేస్తారు. అయితే వాటిని తొలగించి వాటి స్థానంలో 90 నుంచి 160 డెసిబుల్స్ సౌండ్ వచ్చే వాటిని బిగించుకుని హంగామా సృష్టిస్తున్నారు. అయితే వీటితో పాటు పటాకా పేరుతో నూతనంగా మార్కెట్లోకి మంటలు వచ్చే సైలెన్సర్లు అందుబాటులోకి వచ్చాయి. రకాలను బట్టి రూ.2 వేల నుంచి రూ.28 వేల వరకు మెకానిక్‌లు వసూలు చేస్తున్నారు. వాటితో పాటు అధిక శబ్దం వచ్చే విధంగా హారన్లను బిగిస్తున్నారు. ఇలా అదనపు హంగులను ఏర్పాటు చేసుకుంటున్న యువత రహస్యంగా బైక్ రేస్‌లు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో గత నెలలో విజయవాడలో బైక్ రేస్ నిర్వహిస్తున్న ఆరుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని కొందరు మెకానిక్‌లు తమిళనాడు, తెలంగాణ, కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరు నుంచి ఆర్డర్లపై సైలెన్సర్లను తెప్పించి విక్రయిస్తున్నట్లు తెలిసింది. జిల్లాలో నకిలీ సైలెన్సర్ల తయారీ.. ఇదిలా ఉంటే కృష్ణా, గుంటూరు జిల్లాలకు సరిహద్దుగా ఉన్న మంగళగిరి, తాడేపల్లి మండలాలను బైక్ రేసులకు అనువైన ప్రాంతంగా యువత ఎన్నుకొంటోంది. ఈ క్రమంలోనే కొందరు వ్యాపారులు ఏకంగా విజయవాడ, తాడేపల్లి, మంగళగిరితో పాటు తెనాలి, గుంటూరు, నరసరావుపేట ప్రాంతాల్లో నకిలీ సైలెన్సర్లను తయారు చేస్తూ విక్రయిస్తున్నట్లు సమాచారం. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి తెస్తున్న సైలెన్సర్లు అధిక రేటు కావడంతో యువత తక్కవ ధరకు వచ్చే వాటిని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడకు చెందిన ఓ వ్యాపారి నకిలీలను తనకు నమ్మకమైన మెకానిక్‌లకు మాత్రమే అమ్ముతున్నట్టు సమాచారం. తెనాలిలో ఓ పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ కానిస్టేబుల్ చెందిన దుకాణంలో మెకానిక్ విజయవాడ నుంచి సైలెన్సర్లను తెప్పించి మరీ విక్రయిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. భారీ శబ్దం వచ్చే హారన్లు, సైలెన్సర్లను బిగించి వాహనాలతో రోడ్లపై యువత హల్చల్ చేస్తున్నారు. ఫలితంగా తోటి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక గుండెపోటు వున్న వారి సంగతి అంతే. ఇంత జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. రవాణా, పోలీస్, శబ్ద కాలుష్యం శాఖల మధ్య సమన్వయం లోపంతో యువత ఇష్టాను సారంగా రెచ్చిపోతున్నారనే వాదన వినిపిస్తోంది. -
బుల్లెట్‌పై కలెక్టర్
సంగారెడ్డి : కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు గురువారం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో కలిసి సంగారెడ్డి పట్టణంలో బుల్లెట్‌పై తిరుగుతూ వివిధ ప్రాంతాలను పరిశీలించారు. పోతిరెడ్డి పల్లి చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై హెచ్ఎండీఏ, మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. కారులో తిరగాల్సిన కలెక్టర్ సాధారణ వ్యక్తిలా బుల్లెట్‌పై తిరగడాన్ని పట్టణ ప్రజలు ఆసక్తిగా చూశారు. -
హారన్లు.. హాహాకారాలు∙
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ముందెళ్లేవారు వెనుకొచ్చే వారికి దారివ్వాలనే సంకేతానికి, వెనుకగా తాము వస్తున్నామనే విషయం తెలిపేందుకు మాత్రమే హారన్లు విని యోగించే కాలం చెల్లిపోయింది. ప్రజ లందరూ తమకు ఆకర్షితులు కావడానికి, తమ గురించే చర్చింకోవడానికి అ న్నట్టుగా ఆయా హారన్లు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఇవే ఫ్యాషన్‌గా మారి ంది. వాటి నుంచి వచ్చే వింతవింత శ బ్ధాలతో నగర ప్రజలను బెంబేలెత్తిపోతున్నారు. శారీరక, మానసిక అనారో గ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. శబ్ద కాలుష్యమే పరమావధి శబ్ద కాలుష్యం సృష్టించడమే పరమావధిగా కొందరు యువకులు తమ బైకులకు అమర్చుకునే హారన్ల ద్వారా ఇతరులకు దడ పుట్టిస్తున్నారు. యువత రోడ్లపై ఇష్టానుసారం తిరుగుతూ వేస్తున్న హారన్ల శబ్దాలు ఒక్కోసారి గుండె కొట్టుకునే వేగాన్ని అమాంతం పెంచేస్తున్నాయి. ఉపధ్రవమేదో జరుగుతోందనే ఆందోళనలో ప్రజలు అయోమయానికి గురౌతున్నారు. ఇటీవల బుల్లెట్ బైక్‌ల వినియోగం పెరగడంతో వాటి నుంచి సాధారణంగానే పెద్దశబ్ధం వస్తుండగా, వాటికి అమర్చే హారన్లు నుంచి వచ్చే పెద్దశబ్దం ధ్వని కాలుష్యాన్ని పెంచిపోషిస్తున్నాయి. చిన్నారులు బిగ్గరగా ఏడుస్తున్నట్లు, ఏదో ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారు హాహాకారాలు చేస్తున్నట్లు, హర్రర్ సినిమాల్లోని భయంకర శబ్దాలు హారన్లుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. మరి కొందరైతే మంత్రులు, కలెక్టర్లు, ఇతర వీఐపీలు బుగ్గకార్లకు వాడే హారన్లు, ఫైర్ ఇంజన్, అంబులెన్స్ హారన్లను కూడా బైకులకు వినియోగిస్తున్నారు. నిబంధనలివి కేంద్ర మోటార్ వాహనాల చట్టంలో వాహనాల హారన్ల శబ్దం ఎన్ని డెసిబుల్స్ ఉండాలో నిర్దేశించారు. ఇవి ట్రాఫిక్ విధులు నిర్వహించే కొందరికి తెలియకపోవడం శోచనీయం. మోటార్ బైకులకు 80 డెసిబుల్స్, కార్లకు 82, ప్యాసింజర్ లేదా నాలుగు టన్నుల లోపు తేలికపాటి వాహనాలకు 85, 12 టన్నుల సామర్థ్యం గల వాహనాలకు 88, అంతకు మించిన భారీ వాహనాలకు 91 డెసిబుల్స్ హారన్ మాత్రమే వినియోగించాలి. అనారోగ్యమే శబ్ద కాలుష్యం అధికమైతే తాత్కాలిక, శాశ్వత వినికిడి లోపం ఏర్పడే ప్రమాదముంది. మోతాదుకు మించిన శబ్దం మెదడుపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. చెవుల్లో దూది పెట్టుకుంటే 5 డెసిబుల్స్ శబ్దం నుంచి రక్షణ కల్పిస్తుంది. అలాగే ఇయర్ ప్లగ్స్ వినియోగంతో 15 డెసిబుల్స్, ఇయర్ మగ్గస్తో 30 నుంచి 40 డెసిబుల్స్ శబ్దం నుంచి రక్షణ కల్పిస్తుంది. – డాక్టర్ దొంతంశెట్టి బసవరాజు, చెవి, ముక్కు,గొంతు వైద్య నిపుణులు మల్టీ టైప్ హారను నిషేధం మోటారు వాహనాల చట్టం మల్టీ టైప్ హారన్లను నిషేధించింది. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, ప్రార్థనా మందిరాలు, బాలికల హాస్టళ్లు వంటి ప్రాంతాల్లో హారన్లను వినియోగించరాదు. ఆయా నిబంధనలను అతిక్రమిస్తే 108 జీఓ ప్రకారం రూ.1000 అపరాధ రుసుంగా వసూలు చేస్తాం. – కె.ఈశ్వరరావు, డీఎస్పీ, ఏలూరు -
డివైడర్‌ను ఢీకొన్న బుల్లెట్ బైక్
పటాన్చెరు టౌన్: బుల్లెట్ బైక్ డివైడర్‌ను ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన పటాన్చెరు పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రవీణ్ కుమార్‌రెడ్డి కథనం ప్రకారం... పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామానికి చెందిన పోచారం నవీన్ కుమార్(21) ఓ మొబైల్ షాప్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతని స్నేహితుడు సంగారెడ్డి శివాజీనగర్‌కు చెందిన పెరుమాండ్ల సాయి రాఘవకుమార్(23) కిరణా షాపు నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో గురువారం రాఘవకుమార్ తన స్నేహితుడు నవీన్‌కుమార్ వద్దకు ఇస్నాపూర్ వచ్చాడు. గురువారం రాత్రి సాయి రాఘవకుమార్‌ను సంగారెడ్డి వద్ద వదలి రావటానికి నవీన్‌కుమార్ తన బుల్లెట్‌పై సంగారెడ్డికి బయలుదేరారు. పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ శివారులో డివైడర్‌ను ఢీకొనడంతో రోడ్డు అవుతలివైపు సంగారెడ్డి నుంచి పటాన్చెరు వచ్చే దారివైపు ఇద్దరూ పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం నవీన్‌కుమార్‌ను బీరంగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నవీన్‌కుమార్ రాత్రి మృతి చెందాడు. సాయి రాఘవకుమార్‌ను గాంధీకి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అడవిలో అమాత్య..
టేకులపల్లి: ఏజెన్సీ ప్రాంతంలో..అడవి బాటలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుల్లెట్‌పై రయ్‌న దూసుకెళ్లి ఆశ్చర్యపర్చారు. మంగళవారం టేకులపల్లి మండల పరిధిలో బోడు వద్ద గల ముర్రేడ్ ఫీడర్ చానల్ పరిశీలించేందుకు ఇదిగో ఇలా బుల్లెట్‌పై బయల్దేరారు. అడవిలో నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉన్న ఫీడర్ వద్దకు సరైన రోడ్డు లేదు. దీంతో మండుటెండలో చెట్లు, పుట్టల వెంట..బండలు ఎక్కిదిగుతూ కాలినడకన కొద్ది దూరం వెళ్లారు. ఆ తర్వాత బుల్లెట్‌పై ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యను కూర్చొబెట్టుకొని స్వయంగా నడుపుకుంటూ బయల్దేరడంతో.. అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది కంగారు పడ్డారు. -
'పులి'పై నాగార్జున సవారీ..
కింగ్ అక్కినేని నాగార్జున బుధవారం కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయంలో సందడి చేశారు. విజయవాడ కల్యాణ్ జువెల్లర్స్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి విమానంలో ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా విజయవాడ ఆటో నగర్‌కు చెందిన ఐరన్ వ్యాపారి సురేష్...పులి ముఖాకృతితో ఉన్న రూ.20 లక్షల విలువైన విదేశీ బుల్లెట్‌ను విమానాశ్రయ ప్రాంగణంలో నాగార్జునతో నడిపించి తమ ముచ్చట తీర్చుకున్నాడు. కాగా నాగార్జునను చూడటానికి అభిమానులు భారీగా తరలి వచ్చారు.