మినీ బార్బీ బుల్లెట్‌: నెటిజన్లు ఫిదా! వైరల్‌ వీడియో | Viral Video: Man Riding Mini Pink Bullet On Delhi Street Stuns Internet | Sakshi
Sakshi News home page

మినీ బార్బీ బుల్లెట్‌: నెటిజన్లు ఫిదా! వైరల్‌ వీడియో

Published Wed, Nov 1 2023 9:31 AM | Last Updated on Wed, Nov 1 2023 9:56 AM

Viral Video Of Man Riding Mini Pink Bullet On Delhi Street Stuns Internet - Sakshi

బైక్‌ మీద రోడ్డుమీద వెళుతున్నపుడు మన పక్క నుంచి మనకు ఒక జర్క్‌ ఇచ్చి మరీ సర్రున ఒక బైక్‌ దూసుకుపోయిందనుకోండి.  అరే.. పోతార్రా.. అనుకుంటాం.. ఎన్ని యాక్సిడెంట్లు అయినా వీళ్లకి మాత్రం బుద్ధి రాదనుకుంటూ మనసులోనే మధనపడతాం. నిత్య జీవితంలో ఇలాంటివి చాలానే చూస్తూ ఉంటాం. కానీ ఒక్కోసారి అద్భుతాలు కూడా కనిపిస్తాయి కదా..! అచ్చం అలాగే ఢిల్లీ వీధుల్లో ఒక మినీ బుల్లెట్‌ పింకీ  అందర్నీ ఆశ్చర్యపర్చింది.  

Mini Pink Bullet  స్టోరీ ఏంటంటే...ఇన్‌స్టా యూజర్‌ రామ్మీ రైడర్ సైకిల్‌ కంటే చిన్నగా ఉన్న మినీ బుల్లెట్‌కు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలోషేర్‌ చేశారు.   దీంతో నెటిజన్లు తెగ  ఆశ్చర్యపోయారు.   సెల్పీలు, ఫోటోలతో సందడి చేశారు.

నెట్‌లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో 40 లక్షలకు పైగా వ్యూస్‌ను, 3 లక్షల, 87వేల లైక్స్‌ను సొంతం చేసుకుంది. భలే అందంగా ఉంది...సూపర్‌ బుల్లెట్‌  లాంటి  కామెంట్లు వెల్లువెత్తాయి.   "బార్బీ బుల్లెట్ ఇట్స్‌ సో క్యూట్‌’, నాకూ కావాలి అని ఒకరు, అని పిలిచారు.  ఏదైనా యాక్సిడెంట్‌ జరిగినా, ఈ బైక్‌తో  ప్రాణాలు పోయే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి అని మరొకరు వ్యాఖ్యానించారు. ఫైనల్లీ నేను సురక్షితంగా ప్రయాణించే  వెహికల్‌ కనిపించింది అంటూ ఇంకొకరు. ఈ బైక్‌ని చూసిన తర్వాత కాళ్లలో, వెన్నులో  తిమ్మిర్లు మొదలయ్యాయి అంటూ మరో యూజర్‌ సరదాగా కమెంట్‌ చేశారు.  

మినీ పింక్‌ బుల్లెట్‌​ తయారైన విధానంబెట్టిదనిన
మార్కెట్‌లో డిస్‌ కంటిన్యూ అయిపోయిన పాత యాక్టివా స్కూటరే సరికొత్త మినీ పింక్ బుల్లెట్‌లా మారిపోయింది. ఈ వివరాలను ఈ వీడియోలో పొందుపరిచారు. ట్రాఫిక్‌ పోలీసులు సహా నెటిజన్లను పలువురిని ఆకట్టుకున్న  క్యూట్‌ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేసుకోండి మరి! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement