Mini
-
AP Cinema : మినీ స్టూడియోతో హార్సిలీహిల్స్‌కు మహర్దశ
బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని ప్రముఖ వేసవి విడిది కేంద్రం.. హార్సిలీహిల్స్‌పై మినీ స్టూడియోను నిర్మిస్తే ఈ ప్రాంతానికి మహర్దశ పట్టనుంది. దీని ఏర్పాటు దిశగా జరుగుతున్న ప్రయత్నాలతో హార్సిలీహిల్స్ భవిష్యత్‌లో సినిమా చిత్రీకరణలకు ప్రముఖ కేంద్రంగా మారనుంది. తద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధితోపాటు ఆర్థికంగానూ ప్రయోజనాలు లభిస్తాయని చెబుతున్నారు. ఎత్తయిన కొండల సొగసులు, ప్రకృతి అందాలు, దట్టమైన అటవీప్రాంతం, చుట్టూ కొండలతో హార్సిలీíహిల్స్ ఇప్పటికే ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వందకుపైగా చిత్రాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకున్నాయి. 1966లో సూపర్‌స్టార్ కృష్ణ నటించిన కన్నెమనసులు సినిమాతో మొదలై ఎన్నో కన్నడ, తెలుగు, తమిళ సినిమాల షూటింగ్ ఇక్కడ జరిగింది. అయితే ఏ ప్రభుత్వం ఇక్కడ షూటింగ్ కోసం చర్యలు చేపట్టలేదు. దీంతో 1996లో కృష్ణ నటించిన ఎన్కౌంటర్ సినిమా తర్వాత పెద్ద నటులెవరూ హార్సిలీహిల్స్ వైపు కన్నెత్తి చూడలేదు. ఈ పరిస్థితుల్లో ప్రముఖ దర్శకనిర్మాత మహీ వీ రాఘవ కొండపై మినీ స్టూడియో, అమ్యూజ్మెంట్ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో హార్సిలీహిల్స్‌కు మంచి రోజులు రానున్నాయని అంటున్నారు. మళ్లీ ఈ మధ్యే సందడి.. ఈ మధ్యకాలంలో హార్సిలీహిల్స్ పరిసర ప్రాంతాల్లో సినిమాలు, వెబ్ సిరీస్ చిత్రీకరణల సందడి నెలకొంది. మహీ వీ రాఘవ ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్ చేస్తే నిర్మాణ వ్యయం భారీగా తగ్గించుకునే అవకాశం ఉందని గుర్తించి ఇటువైపు అడుగులు వేశారు. ఆయన దర్శకత్వం వహించిన పాఠశాల, యాత్ర–2 చిత్రీకరణలు ఈ ప్రాంతంలోనే జరిగాయి. సైతాన్ వెబ్ సిరీస్‌ను సైతం ఇక్కడే చేశారు. ఇంకా విడుదలకాని ‘సిద్ధా లోకం ఎలా ఉంది’ కూడా ఇక్కడే నిర్మాణం జరుపుకుంది. మహీ వీ రాఘవే కాకుండా ఇంకా పలువురు సినిమాలు, వెబ్ సిరీస్‌లను చిత్రీకరిస్తున్నారు. మినీ స్టూడియోతో ఎన్నో సౌకర్యాలు కొండపై మినీ స్టుడియో నిర్మాణం కోసం రెండెకరాల భూమిని కేటాయించాలని మహీ వీ రాఘన ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మినీ స్టూడియోతో ఎన్నో రకాలుగా స్థానికులు లబ్ధి పొందడమే కాకుండా, ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. వ్యాపారపరంగా ఆర్థికంగానూ ప్రయోజనాలు ఉంటాయి. స్టూడియో ద్వారా సినిమాలు, వెబ్ సిరీస్కోసం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది. లైట్స్, చిన్న కెమెరాలు, జనరేటర్లు, వాహనాలు, వెబ్ సిరీస్ కోసం అవసరమైనవి షూటింగ్ కోసం వెంట తీసుకురావాల్సిన పరిస్థితి ఉండదు. షూటింగ్‌కు వచ్చేవారికి విడిది సౌకర్యాలు, భోజనం, షూటింగ్లో పనులు.. ఇలా ప్రతి విషయంలోనూ స్థానికులకు ఆర్థికంగా ప్రయోజనం లభిస్తుంది. పెద్ద సినిమాలు లేకున్నా ఏడాదికి రెండు వెబ్ సిరీస్‌ల చిత్రీకరణ జరిగినా రూ.5 నుంచి రూ.10 కోట్లు ఖర్చవుతుంది. కాబట్టి స్థానికులకు వివిధ రకాలుగా ఆదాయం లభిస్తుంది. స్థానికులకు ఆదాయం, తక్కువ ఖర్చుతో చిత్రీకరణే లక్ష్యం.. హార్సిలీహిల్స్‌పై మినీ స్టూడియో ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని షూటింగ్‌లకు కేంద్రంగా చేయాలన్నదే లక్ష్యం. ఇక్కడి ప్రదేశాలను వెబ్సైట్లో పెట్టి సినిమా చిత్రీకరణలకు అనువనే విషయాన్ని తెలియజేస్తాం. మదనపల్లె, ఆరోగ్యవరం, పరిసర ప్రాంతాల చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తూ ప్రచారం చేస్తాం. పురాతన కట్టడాలు, భవనాలు, పల్లెలు హార్సిలీహిల్స్ పరిసరాల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ సినిమాలు, వెబ్ సిరీస్‌లు తక్కువ ఖర్చుతో చిత్రీకరణ చేసుకునేలా ప్రణాళిక రూపొందిస్తాం. అనుభవజ్ఞులైన వారిని నియమించి సహకారం అందిస్తాం. స్థానికులకు ఆదాయ మార్గాలు పెంచేలా చూస్తాం. –మహీ వీ రాఘవ, ప్రముఖ దర్శకనిర్మాత -
మినీ బార్బీ బుల్లెట్: నెటిజన్లు ఫిదా! వైరల్ వీడియో
బైక్ మీద రోడ్డుమీద వెళుతున్నపుడు మన పక్క నుంచి మనకు ఒక జర్క్ ఇచ్చి మరీ సర్రున ఒక బైక్ దూసుకుపోయిందనుకోండి. అరే.. పోతార్రా.. అనుకుంటాం.. ఎన్ని యాక్సిడెంట్లు అయినా వీళ్లకి మాత్రం బుద్ధి రాదనుకుంటూ మనసులోనే మధనపడతాం. నిత్య జీవితంలో ఇలాంటివి చాలానే చూస్తూ ఉంటాం. కానీ ఒక్కోసారి అద్భుతాలు కూడా కనిపిస్తాయి కదా..! అచ్చం అలాగే ఢిల్లీ వీధుల్లో ఒక మినీ బుల్లెట్ పింకీ అందర్నీ ఆశ్చర్యపర్చింది. Mini Pink Bullet స్టోరీ ఏంటంటే...ఇన్‌స్టా యూజర్ రామ్మీ రైడర్ సైకిల్ కంటే చిన్నగా ఉన్న మినీ బుల్లెట్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలోషేర్ చేశారు. దీంతో నెటిజన్లు తెగ ఆశ్చర్యపోయారు. సెల్పీలు, ఫోటోలతో సందడి చేశారు. నెట్లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో 40 లక్షలకు పైగా వ్యూస్‌ను, 3 లక్షల, 87వేల లైక్స్‌ను సొంతం చేసుకుంది. భలే అందంగా ఉంది...సూపర్ బుల్లెట్ లాంటి కామెంట్లు వెల్లువెత్తాయి. "బార్బీ బుల్లెట్ ఇట్స్ సో క్యూట్’, నాకూ కావాలి అని ఒకరు, అని పిలిచారు. ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, ఈ బైక్‌తో ప్రాణాలు పోయే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి అని మరొకరు వ్యాఖ్యానించారు. ఫైనల్లీ నేను సురక్షితంగా ప్రయాణించే వెహికల్ కనిపించింది అంటూ ఇంకొకరు. ఈ బైక్‌ని చూసిన తర్వాత కాళ్లలో, వెన్నులో తిమ్మిర్లు మొదలయ్యాయి అంటూ మరో యూజర్ సరదాగా కమెంట్ చేశారు. మినీ పింక్ బుల్లెట్ తయారైన విధానంబెట్టిదనిన మార్కెట్లో డిస్ కంటిన్యూ అయిపోయిన పాత యాక్టివా స్కూటరే సరికొత్త మినీ పింక్ బుల్లెట్లా మారిపోయింది. ఈ వివరాలను ఈ వీడియోలో పొందుపరిచారు. ట్రాఫిక్ పోలీసులు సహా నెటిజన్లను పలువురిని ఆకట్టుకున్న క్యూట్ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేసుకోండి మరి! View this post on Instagram A post shared by Rammy Ryder (@rammyryder) -
సబ్సిడీ సిలిండర్లతో దందా
కరీంనగర్ అర్బన్: పేద, మధ్య తరగతి ప్రజలకు అందించే రాయితీ వంట ఇంధనం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. సబ్సిడీ గ్యాస్‌ను కొంతమంది నిబంధనలకు విరుద్ధంగా మినీ సిలిండర్లలో నింపుతూ పెద్ద దందా సాగిస్తున్నారు. సబ్సిడీ సిలిండర్లను కొంతమంది బ్లాక్‌లో కొనుగోలు చేసి అందులోని ఇంధనాన్ని మినీ సిలిండర్లలో నింపి విక్రయిస్తున్నారు. రీఫిలి్లంగ్ ద్వారా ఒక్కో సిలిండర్‌కు అందనంగా రూ.వెయ్యి సంపాదిస్తున్నారు. జిల్లాలో మినీ గ్యాస్ సిలిండర్ల అక్రమ దందా యథేచ్ఛగా నడుస్తోంది. ప్రభుత్వ నిబంధనలు పట్టని హోంనీడ్స్ దుకాణాల నిర్వాహకులు మినీ సిలిండర్లలో గ్యాస్ నింపి విక్రయాలు కొనసాగిస్తున్నారు. మినీ సిలిండర్ సైజ్‌ను బట్టి డబ్బులు గుంజుతున్న నిర్వాహకుల ఆగడాలకు కళ్లెం వేసేవారే కరువయ్యారు. జిల్లా కేంద్రంలోని రాంనగర్, మంకమ్మతోట, గణేశ్‌నగర్, కోతిరాంపూర్, పెద్దపల్లిరోడ్, కోర్టుచౌరస్తాల్లో పదుల సంఖ్యలో గ్యాస్ రీఫిలి్లంగ్ దుకాణాలున్నాయి. జనావాసాల నడుమ అక్రమ దందా నడుస్తుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వీరి అక్రమాలపై నిఘా పెట్టి నియంత్రించాలి్సన సంబంధిత అధికారులు నెలవారీగా నిర్వాహకుల నుంచి ముడుపులు తీసుకుని పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే నామమాత్రంగా కేసులు పెడుతూ తర్వాత దందా నడిచేలా పరోక్షంగా సహకరిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని పలు హోంనీడ్స్ దుకాణాలు అక్రమ గ్యాస్ ఫిల్లింగ్ వ్యాపారానికి అడ్డాగా మారాయి. హైదరాబాద్ నుంచి చిన్న సిలిండర్లు కొనుగోలు చేసి ఇక్కడకు తెచ్చి వ్యాపారం చేస్తున్నారు. రోజుకు వందల సంఖ్యలో మినీ సిలిండర్లు విక్రయిస్తూ లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. రాయితీ గ్యాస్ ధర రూ.766.50 కాగా, వాణిజ్య గ్యాస్ ధర రూ.1500. ఈ సిలిండర్లను వినియోగదారులు, ఏజెన్సీ నిర్వాహకుల సాయంతో కొనుగోలు చేసి రహస్య ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న గోదాంలకు తరలిస్తున్నారు. మరికొందరు దుకాణాల్లోనే వెనుక వైపు మినీ సిలిండర్లలో రీఫిలి్లంగ్ చేస్తున్నారు. జిల్లాలోని పలు మండలాలకు వీటిని తరలించి పెద్దమొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. మధ్య తరగతి ప్రజలు, చిరువ్యాపారులు, పెళ్లికాని ప్రసాదులు, ఉన్నత చదువుల కోసం వివిధ గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి వస్తున్న విద్యార్థులు మినీ సిలిండర్లను ఎక్కువగా వినియోగిస్తుంటారు. వీరి అవసరాలను అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. రూ.766 ఉన్న రాయితీ గ్యాస్ ను గ్యాస్ వినియోగదారుల నుంచి రూ.900 నుంచి రూ. 1000కి కొనుగోలు చేస్తున్న నిర్వాహకులు 3 లేదా 4 సిలిండర్లలో నింపుతూ రూ.వెయ్యి అదనంగా సంపాదిస్తున్నారు. జనావాసాల మధ్య వ్యాపారం జనావాసాల మధ్య అక్రమ దందా నిర్వహిస్తున్నా చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మినీ సిలిండర్లు వాడడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. నిర్వాహకులు అక్రమంగా ఏర్పాటు చేసుకున్న గోదాంలలో గ్యాస్ నింపే సమయంలో ఏదైనా అనుకోని ప్రమాదం సంభవిస్తే భారీ మూల్యం చెల్లించాలి్సందే. ఇవన్నీ సంబంధిత అధికారులకు తెలిసినా సీరియస్‌గా తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనావాసాల మధ్య కార్లలో గ్యాస్ నింపే దందా కూడా ఎక్కువగా సాగుతోంది. భగత్‌నగర్, కోతిరాంపూర్, మంకమ్మతోట, రాంనగర్, విద్యానగర్, సీతారాంపూర్ తదితర ప్రాంతాల్లో దందా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆమోదం పొందిన పలు గ్యాస్ కంపెనీలు మార్కెట్లో 5కిలోల సిలిండర్లు సరఫరా చేస్తున్నాయి. వీటిని వినియోగించేందుకు జనం ఆసక్తి చూపడం లేదు. దీనిపై అవగాహన కల్పించాలి్సన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
బీఎండబ్ల్యూ కొత్త హ్యాచ్, కన్వర్టబుల్ కార్లు
గుర్గావ్ : జర్మనీ లగ్జరీ కారు తయారీదారు బీఎండబ్ల్యూ మినీ హ్యాచ్, కన్వర్టబుల్లో అప్డేటెడ్ వెర్షన్లను నేడు భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. కొత్త మినీ 3-డోర్ కూపర్ ఎస్, మినీ 3-డోర్ కూపర్ డీ, మినీ 5-డోర్ కూపర్ డీ, కొత్త మినీ కన్వర్టబుల్ కూపర్ ఎస్ వెర్షన్లలో నేటి నుంచి అన్ని మినీ డీలర్‌షిప్‌ల వద్ద 2018 జూన్ నుంచి అందుబాటులో ఉండనున్నాయని బీఎండబ్ల్యూ చెప్పింది. ఎక్స్‌షోరూంలో వీటి ధరలు ఈ విధంగా ఉన్నాయి.... మినీ 3-డోర్ కూపర్ డీ (డీజిల్) : రూ.29,70,000 మినీ 3-డోర్ కూపర్ ఎస్ (పెట్రోల్) : రూ.33,20,000 మినీ 3-డోర్ కూపర్ డీ (డీజిల్) : రూ.35,00,000 మినీ కన్వర్టబుల్ కూపర్ ఎస్(పెట్రోల్) : రూ.37,10,000 భారత్‌లో ప్రీమియం మినీ కారు సెగ్మెంట్లో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కొత్త మినీ హ్యాచ్, కొత్త మినీ కన్వర్టబుల్ లాంచ్ చేసినట్టు బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా అధ్యక్షుడు విక్రమ్ పా చెప్పారు. ఈ కొత్త కార్లపై కొత్త మినీ లోగో, టెయిల్‌గేట్, స్టీరింగ్ వీల్, సెంట్రల్ ఇన్స్ట్రుమెంట్ డిస్ప్లే, రిమోట్ కంట్రోల్, సర్క్యూట్ రింగ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్, టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. టైయిల్ల్యాంప్స్ యూనిక్ జాక్ డిజైన్‌తో రూపొందాయి. ఇంటీరియర్ ఫీచర్లు... మల్లి ఫంక్షనింగ్ స్టీరింగ్, 6.50 అంగుళాల కలర్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే విత్ బ్లూటూత్ ఆప్షనల్ 6.5 టచ్‌స్క్రీన్ సిస్టమ్ విత్ మినీ రేడియో విజ్యువల్ బూస్ట్ మినీ వైర్డ్ ప్యాకేజ్ దీనిలో 8.8 అంగుళాల టచ్ స్క్రీన్ విత్ టచ్‌ప్యాడ్ కంట్రోలర్, మినీ ఫైండ్ మేట్, నేవిగేషన్ సిస్టమ్ ప్రొఫెషినల్, మినీ కనెక్టెడ్ ఎక్స్ఎల్, టెలిఫోనీ విత్ వైర్లెస్ ఛార్జింగ్, సెకండ్ యూఎస్బీ ఇంటర్ఫేస్, 20జీబీ ఇంటర్నల్ హార్డ్‌డ్రైవ్ ఉన్నాయి. ఇంజిన్, పనితీరు 3-డోర్ కూపర్ ఎస్, కన్వర్టబుల్ వెర్షన్లు 2.0 లీటర్, 4 సిలిండర్ ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉన్నాయి. 3-డోర్ కూపర్ ఎస్ టాప్ స్పీడు 235 కేఎంపీహెచ్, కేవలం 6.7 సెకన్లలో 0 నుంచి 100 కేఎంపీహెచ్ చేరుకోనుంది 3-డోర్ కూపర్ డీ, 5-డోర్ కూపర్ డీ వెర్షన్లు 1.5 లీటర్ 3 సిలిండర్ డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉన్నాయి. పెట్రోల్ మాదిరిగా కాకుండా ఇది 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సమిషన్తో రూపొందింది. 3, 5 డోర్ కూపర్ డీ టాప్ స్పీడ్ 205 కేఎంపీహెచ్, ఇది 9.2 సెకన్లలో 0 నుంచి 100 కేఎంపీహెచ్‌ను అందుకోగలదు. మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని పొందడానికి, మినీ ఆటో స్టార్ట్/స్టాప్ ఫంక్షన్‌ను కలిగి ఉంది. ఈ వాహనాల్లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ విత్ బ్రేక్ అసిస్ట్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, కార్నింగ్ బ్రేక్ కంట్రోల్, రన్ ఫ్లాట్ టైర్లు ఉన్నాయి.