లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఒక యువకుడు ట్రాఫిక్ పోలీసులు తనపై.. అకారణంగా చలాన్ వేశారని, కమిషనర్ ఆఫీస్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మీరట్ జిల్లాలో జరిగింది. యూపీ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం గంగానగర్-మవాన్‌రోడ్‌లో సాకేత్ క్రాసింగ్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు.
ఈ సమయంలో రోహిత్ అనే యువకుడు గత మంగళవారం తన తల్లికి మందులను కొనుగోలు చేయడానికి బుల్లెట్ వాహనంపై బయలుదేరాడు. బుల్లెట్ వాహనం నుంచి పెద్దగా శబ్దం వస్తుండడంతో ట్రాఫిక్ పోలీసులు అతడిని ఆపివేశారు. శబ్ధం ఎక్కువగా వస్తుండడంతో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ అనిల్ కుమార్ మిశ్రా రూ.16 వేల చలాన్ వేశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడింది.
ఈ విషయంపై కొద్దిసేపు తర్వాత రోహిత్ తన తల్లిదండ్రులతో కలిసి మీరట్‌లోని ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నాడు. అయితే ఎస్పీ అందుబాటులో లేరు. దీంతో ఈ రోజు బుధవారం తల్లిదండ్రులతో రోహిత్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నాడు. అక్కడ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించారు. గమనించిన పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇన్‌స్పెక్టర్ అనిల్‌కుమార్ తమను మానసికంగా వేధిస్తున్నాడని, ఎన్‌కౌంటర్ చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధిత యువకుడు కన్నీటి పర్యంతమయ్యాడు. అయితే కమిషనర్ కార్యాలయం ఎదుట న్యూసెన్స్ చేయడంతో రోహిత్, అతడి తల్లిదండ్రులపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.
చదవండి: మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి.. తీరా పెళ్లి అనేసరికి..
Comments
Please login to add a commentAdd a comment