commissioner office
-
ట్రాఫిక్ చలాన్ వేశారని బుల్లెట్ యజమాని ఆత్మహత్యాయత్నం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఒక యువకుడు ట్రాఫిక్ పోలీసులు తనపై.. అకారణంగా చలాన్ వేశారని, కమిషనర్ ఆఫీస్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మీరట్ జిల్లాలో జరిగింది. యూపీ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం గంగానగర్-మవాన్‌రోడ్‌లో సాకేత్ క్రాసింగ్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో రోహిత్ అనే యువకుడు గత మంగళవారం తన తల్లికి మందులను కొనుగోలు చేయడానికి బుల్లెట్ వాహనంపై బయలుదేరాడు. బుల్లెట్ వాహనం నుంచి పెద్దగా శబ్దం వస్తుండడంతో ట్రాఫిక్ పోలీసులు అతడిని ఆపివేశారు. శబ్ధం ఎక్కువగా వస్తుండడంతో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ మిశ్రా రూ.16 వేల చలాన్ వేశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఈ విషయంపై కొద్దిసేపు తర్వాత రోహిత్ తన తల్లిదండ్రులతో కలిసి మీరట్‌లోని ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నాడు. అయితే ఎస్పీ అందుబాటులో లేరు. దీంతో ఈ రోజు బుధవారం తల్లిదండ్రులతో రోహిత్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నాడు. అక్కడ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించారు. గమనించిన పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ అనిల్‌కుమార్ తమను మానసికంగా వేధిస్తున్నాడని, ఎన్కౌంటర్ చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధిత యువకుడు కన్నీటి పర్యంతమయ్యాడు. అయితే కమిషనర్ కార్యాలయం ఎదుట న్యూసెన్స్ చేయడంతో రోహిత్, అతడి తల్లిదండ్రులపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి.. తీరా పెళ్లి అనేసరికి.. -
అంతా మా ఇష్టం
‘కరీంనగర్ నగరపాలక సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్‌గా చేరిన ఓ ఒప్పంద ఉద్యోగి తరువాత కమిషనర్ సీసీగా వెళ్లాడు. ఇటీవల కార్యాలయంలో విధులను పక్కకుపెట్టి లైక్ వీడియోలు చేయడం వైరల్‌గా మారింది. దీంతో తనను బదిలీ చేస్తారని ముందుగానే గమనించిన సదరు ఉద్యోగి ‘కమిషనర్ పేషీ సీసీ’ అని ఓ కొత్త పోస్టును సృష్టించుకుని కార్యాలయం నుంచి వెళ్లిపోయాడు. కాగా వీడియోల వ్యవహారంపై ఇంతవరకు శాఖాపరమైన చర్యలు కానరాలేదు. సాధారణంగా మున్సిపల్ కమిషనర్లకు ఒక్కరే సీసీ పనిచేస్తారు. కరీంనగర్ నగరపాలకలో మాత్రం ఇద్దరు సీసీలు ‘ఇష్టా’రాజ్యం ఏలుతున్నారు.’ సాక్షి, కరీంనగర్: ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు, ప్రజాసమస్యలు త్వరగా పరిష్కారమయ్యేలా ఉద్యోగుల కొరతను అధిగమించేందుకు ఔట్‌సోరి్సంగ్ పద్ధతిన సిబ్బ ందిని నియమిస్తారు. కొన్నేళ్లపాటు కాలపరిమితిని ఏర్పరుచుకుని విధులు అప్పగిస్తారు. కాలపరిమితి పూర్తవ్వగానే తప్పుకోవాల్సి ఉంటుంది. కాగా కరీంనగర్ నగరపాలక సంస్థంలో ఔట్‌సోరి్సంగ్ సిబ్బంది రాజ్యమేలుతున్నారు. వీరిని కార్యాలయ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో ‘అంతా మాఇష్టం’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇష్టారీతిన కొలువులు కేటాయించుకుంటున్నారు. అక్కడ ఇబ్బంది ఏర్పడితే తమకు నచ్చిన పోస్టింగ్‌లను వారే సృష్టించుకుని విధులు నిర్వహిస్తున్నారు. సాధారణంగా ఒకశాఖలో ఉద్యోగులు పరిమితికి మించి ఉన్నా.. వారికి పదోన్నతి కల్పించాలన్నా.. బదిలీ చేయాలన్నా.. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. సంబంధిత ఉన్నతాధికారులు ఆయా సిబ్బందికి శాఖలు కేటాయించి విధులు అప్పగించాల్సి ఉంటుంది. అయితే కరీంనగర్ నగరపాలక సంస్థలో ఈ నిబంధనలు ఏమీ అమలు కావడం లేదు. అంతా ఔట్‌సోరి్సంగ్ రాజ్యమే నడుస్తోంది. ఫలితంగా సదరు ఉద్యోగుల కాలపరిమితి ముగుస్తుందని ముందుగానే గ్రహించి, అదే కార్యాలయంలో మరో పోస్టును సృష్టించుకుని కొత్తగా ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు స్పందిస్తున్నారా అంటే అదీ శూన్యమే. ఆడింది ఆట.. పాడింది పాట కరీంనగర్ కార్పొరేషన్లో ఎక్కువగా ఔట్‌సోరి్సంగ్ ఉద్యోగులే. వీరిలో కొందరు మాత్రమే నిబద్ధతతో పనిచేస్తే.. చాలా మంది ఇష్టార్యాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తమకు కేటాయించిన విధులు నిర్వహించకుండా ‘టైంపాస్’ ఉద్యోగం చేస్తున్నారనే ప్రచారం ఉంది. కార్యాలయానికి వచ్చిన ప్రజలతో కనీస మర్యాద పాటించకుండా దురుసుగా వ్యవహరిస్తున్నానేది బహిరంగ రహస్యం. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులపై అజమాయిషి చెలాయిస్తూ.. కిందిస్థాయి సిబ్బందికి వీరే విధులు కేటాయించడం విశేషం. కార్పొరేషన్లో 249మంది ఉద్యోగులు.. కరీంనగర్ కార్పొరేషన్లో మొత్తం పోస్టులు 497. 249మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 248పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఔట్‌సోరి్సంగ్ ద్వారా శానిటేషన్‌లో 857 మంది, ఇంజినీరింగ్ విభాగంలో 260మంది, టౌన్ ప్లానింగ్‌లో 30 మంది, మెప్మాలో ఇద్దరు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది ఏళ్లకాలంగా ఒకే విభాగంలో పాతుకుపోయారు. దీంతో బదిలీపై వచ్చే ప్రభుత్వ ఉద్యోగులను వీరు కంట్రోల్ చేస్తున్నానే ప్రచారం సాగుతోంది. ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు అంతర్గత బదిలీలపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. సీసీల బదిలీలు మాకు తెలియకుండా జరగవు. కార్పొరేషన్ ఇతర విభాగాలపై విచారణ చేస్తాం. సిబ్బందిని అవసరమైన చోట వినియోగిస్తాం. కొన్ని విభాగాల్లో అధికంగా సిబ్బంది ఉన్న విషయంపై విచారణ చేస్తాం. – వల్లూరి క్రాంతి, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ సొంతంగా ఏర్పరుచుకున్న పోస్టులు కొన్ని.. ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్ సీసీగా ఉన్న వ్యక్తి మొదట కంప్యూటర్ ఆపరేటర్‌గా ఔట్‌సోరి్సంగ్ విధానంలో ఉద్యోగంలో చేరాడు. ఆ పోస్టుకు కాలపరిమితి ముగుస్తుందని తెలిసి సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్ అనేపోçస్టును సృష్టించుకుని చేరిపోయాడు. అయితే రాష్ట్రంలో ఎక్కడాకూడా సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు లేవు. అదీ ముగుస్తుందని తెలిసి ప్రస్తుతం కమిషనర్ సీసీగా చేరాడు. శానిటేషన్ విభాగంలో కీలకమైన ఎన్విరాల్మెంట్ ఇంజినీర్ పోస్టుకు డిప్యూటీ ఈఈ క్యాడర్ కేటాయించారు. తాత్కాలిక ఒప్పంద పద్ధతిలో ఓ ఉద్యోగిని తీసుకుని ఎన్విరాల్మెంట్ ఇంజినీర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. తర్వాత ఆ స్థానానికి రెగ్యులర్ ఉద్యోగిని కేటాయించారు. అదే పోస్టులో తాత్కాలిక ఉద్యోగి సైతం కొనసాగుతుండం విశేషం. డిప్యూటీ ఈఈ నామమాత్రంగా మారి టెండర్లు పిలవడానికి పరిమితమయ్యాడని ప్రచారం జరుగుతోంది. శానిటేషన్ విభాగంలో కీలకమైన పోస్టుకు అధికారి ఉండగా.. ఒప్పంద ఉద్యోగిని కొనసాగించడం మన కార్పొరేషన్‌కే చెల్లింది. కార్పొరేషన్ విద్యుత్ విభాగంలో వీధిలైట్లను ఓ ప్రైవేట్ కంపెనీ పర్యవేక్షిస్తోంది. వీధిదీపాల మేయింటనెన్స్‌కు ఏఈ, డీఈతో పాటు 13మంది ఔట్‌సోరి్సంగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో ఇద్దరు ఉద్యోగులు సూపర్వైజర్ పోస్టులు సృస్టించుకుని ‘లీడర్షిప్’ చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఫిల్టర్‌బెడ్‌లో ఒక ఇన్చార్జితో పాటు ఐదుగురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేసేవారు. 15ఏళ్ల నుంచి ఫిల్టర్‌బెడ్ పనితీరులో ఎలాంటి మార్పులు రాలేదు. ఉద్యోగుల మాత్రం ఐదునుంచి 15కు పెరిగారు. వాటర్‌బెడ్‌లో నాలుగు నుంచి ఐదుగురు మాత్రమే విధులు నిర్వహించడానికి అవకాశముంది. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 12 మంది ఔట్‌సోరి్సంగ్ సిబ్బంది విధులు నిర్వహించడం విశేషం. -
సాక్షి జర్నలిస్ట్‌పై జలీల్ ఖాన్ దౌర్జన్యం
-
సాక్షి జర్నలిస్ట్‌పై జలీల్ ఖాన్ వీరంగం
సాక్షి, విజయవాడ: పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వీరంగం సృష్టించారు. సాక్షి వీడియో జర్నలిస్ట్ నానిపై జలీల్ ఖాన్ దౌర్జన్యం చేశారు. తన కోడలితో వివాదం జరుగుతుండటంతో జలీల్ ఖాన్ గురువారం సీపీ కార్యాలయానికి వచ్చారు. ఎమ్మెల్యే తనకు న్యాయం జరపడంలేదని కోడలు మెహమూదా సీపీని ఆశ్రయించారు. దీనిపై సీపీ ఆదేశాల ప్రకారం డీసీపీ రాజకుమారి ఇరువర్గాలను పిలిపించారు. ఈ సందర్భంగా సీపీ కార్యాలయానికి వస్తుండగా జలీల్ ఖాన్‌ను సాక్షి కెమేరామెన్ నాని చిత్రీకరించారు. దీంతో జలీల్‌ఖాన్ బూతులతో దుర్బాషలాడుతూ నానిపై దౌర్జన్యానికి దిగారు. ఏడీసీపీ నవాబ్ జాన్, సీఐ ఉమా మహేశ్వరరావు సమక్షంలోనే కెమెరామెన్‌ను చేయి మెలిపెట్టి కెమెరా గుంజుకున్నారు. ఎమ్మెల్యేకు మద్దతుగా ఆయన అనుచరులు వీరంగం సృష్టించారు. ఇంత జరుగుతున్నా పోలీసు అధికారులు ఎమ్మెల్యేను నిలువరించేందుకు ప్రయత్నించలేదు. ఏడీసీపీ నవాబ్ జాన్ స్వయంగా కెమెరాలో చిత్రీకరించిన విజువల్స్‌ను డిలీట్ చేశారు. పాత్రికేయులు సీపీ కార్యాలయం వద్ద ఆందోళన చేయడంతో కెమెరామెన్‌ను పోలీసులు విడిచిపెట్టారు. -
దేవాలయాలకు పునర్వైభవం తెస్తాం: ఇంద్రకరణ్‌రెడ్డి
హైదరాబాద్: తెలంగాణలోని దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకువస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఎ. ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. సోమవారం నగరంలోని బొగ్గులకుంటలో దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో శ్రీ బంగారు మైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హాజరై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ నిర్మాణానికి అమ్మవారి అశీస్సులు కోరుకున్నట్లు తెలిపారు. కాగా, తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం అధ్వర్యంలో కమిషనరేట్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో శ్రీ మన్మథనామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆవిష్కరించారు. (సుల్తాన్‌బజార్) -
‘వాటా’న్ ఐడియా!
మామూళ్ల విషయంలో తేడాలొస్తే పై అధికారులు వేధింపులకు పాల్పడటం.. అప్పటికీ లొంగకపోతే సదరు సిబ్బందిపై చర్యలకు సిఫారసు చేయడం పరిపాటి. ఈ విషయంలో రవాణా శాఖ ఉప కమిషనర్ కార్యాలయం సిబ్బంది అదృష్టవంతులనే చెప్పాలి. అక్రమార్జన విషయంలో ఓ అధికారి చెప్పిన పెద్దరాయుడి తీర్పు అందరికీ ఆమోదయోగ్యంగా మారింది. సమకూరిన సొమ్ములో 60-40 ఒప్పందంతో ఎవరికీ ఎలాంటి ఇబ్బందిలేకుండా కుదిర్చిన బేరం విషయం తెలిసి ‘వాటా’న్ ఐడియా సర్జీ అని కీర్తించని సిబ్బంది లేకపోవడం గమనార్హం. కర్నూలు, న్యూస్‌లైన్: రవాణా శాఖ ఉప కమిషనర్ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారింది. కార్యాలయంలో పనిచేసే గుమాస్తాలు ఏజెంట్లతో చేతులు కలిపి నిబంధనలకు విరుద్ధంగా వాహన యజమానుల నుంచి మామూళ్లు దండుకోవడం రివాజుగా మారింది. అయితే ఇటీవల తన వాటా మాటేమిటంటూ ఓ అధికారి కింది స్థాయి సిబ్బందిని నిర్మొహమాటంగా నిలదాశారు. తర్జనభర్జనల మధ్య చివరకు అక్రమంగా సమకూరిన సొమ్ములో వాటాలు వేసుకుని పంచుకునేలా ఒప్పందానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కుదిరిన బేరం ప్రకారం 60 శాతం కింది స్థాయి సిబ్బందికి.. 40 శాతం తనకు ఇచ్చేలా ఆ అధికారి తీర్పు చెప్పినట్లు తెలిసింది. ప్రతిరోజూ వంద నుంచి రెండు వందల దాకా వివిధ రకాల ఫైళ్లు కార్యాలయానికి వస్తుంటాయి. ముఖ్యంగా వాహన బదలాయింపులు, పర్మిట్లు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, వాహన రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఫైళ్లే ఇందులో అధికంగా ఉంటున్నాయి. ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానాతో పాటు అదనంగా వెయ్యి నుంచి రూ.3వేల దాకా ఫైళ్ల ‘సామర్థ్యాన్ని’ బట్టి మామూళ్లు వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన రోజుకు రూ. 50వేల నుంచి రూ.75 వేల దాకా కార్యాలయంలో అక్రమార్జన సాగుతున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ మొత్తాన్ని నూతన ఫార్ములా ప్రకారం ఎంచక్కా పంచుకుంటున్నట్లు సమాచారం. దళారులను(ఏజెంట్లను) కార్యాలయంలోకి రాకుండా అడ్డుకోవాల్సిన అధికారులే వారిని ప్రోత్సహిస్తున్నారు. అక్రమ సంపాదనకు అలవాటు పడిన నేపథ్యంలో వాళ్లు.. వీళ్లు అనే తేడా లేకుండా అన్ని స్థాయిల సిబ్బంది ఈ వ్యవస్థను పెంచి పోషిస్తున్నారు. దీంతో ఏ పని కోసం వెళ్లిన వారైనా విధిలేని పరిస్థితుల్లో ఏజెంట్లనే ఆశ్రయించాల్సి వస్తోంది. ఫలితంగా జేబులు గుల్ల చేసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. ఒప్పందం ప్రకారం సక్రమంగా తన శాతం వాటా ఇవ్వలేదనే కారణంతో రెండు వారాల క్రితం కార్యాలయంలో ఆ అధికారి హల్చల్ సృష్టించారు. వివిధ పనులు నిమిత్తం కార్యాలయానికి వచ్చిన ఏజెంట్లపై చిందులు తొక్కి వారి జేబుల్లోని డబ్బులన్నీ లాక్కుని బయటకు నెట్టేయడం విమర్శలకు తావిచ్చింది. కార్యాలయంలో కొనసాగుతున్న దందాపై ఇటీవల ఏసీబీ అధికారులు దాడులు చేసినప్పటికీ అధికారుల్లో మార్పు రాకపోవడం గమనార్హం. బ్యాక్లాగ్ ఎంట్రీ పేరుతో అదనపు వసూళ్లు రవాణా శాఖలో తెచ్చిన మార్పులతో వినియోగదారులకు మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. పరిపాలన సౌలభ్యంతో పాటు వాహనదారులకు విస్తృత సేవలందించేందుకు డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి కేంద్రీకృత సేవల(త్రీ టైర్స్) విధానం అమల్లోకి వచ్చింది. 2002 నుంచి డీటీసీ కార్యాలయంలో టూటైర్ సిస్టమ్ ద్వారా ప్రజలకు సేవలందిస్తున్నారు. ప్రస్తుతం త్రీటైర్ సిస్టమ్ అమల్లోకి వచ్చినందున టూటైర్లోని డేటా మొత్తం త్రీటైర్లోకి మార్పు చేయాలి. అందుకోసం బ్యాక్లాగ్ ఎంట్రీ పేరుతో వినియోగదారుల నుంచి అదనంగా రూ.100 వసూలు చేస్తున్నారు. అయితే కార్యాలయం ద్వారా అందించే సేవలకు చలానా చార్జీలు గతం కంటే రూ.50 నుంచి 200 వరకు అదనపు భారం పడుతుండటంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. కార్యాలయంలో ఏ పని కావాలన్నా వినియోగదారుని పేరు, పూర్తి చిరునామా, మండలం పేరు, పిన్‌కోడ్, మొబైల్ నంబర్ నమోదు తదితర నిబంధనలు తప్పనిసరి చేయడంతో టూటైర్ సిస్టమ్‌లోని డేటా త్రీటైర్ సిస్టమ్‌లోకి అనుసంధానం చేయించుకునేందుకు వినియోగదారులు తీవ్ర ఇక్కట్లకు లోనవుతున్నారు. నేరుగా వెళ్లిన వారికి కొర్రీలతో వాయిదాలు వేస్తూ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. ఏజెంట్ల ద్వారా వెళ్లిన వారికి అందే ముడుపులను బట్టి వెంటనే ఫైళ్లు చకచకా క్లియర్ చేసి పంపుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో వినియోగదారులు వారినే ఆశ్రయించాల్సి వస్తోంది. ఏదేమైనా కార్యాలయంలో కొత్తగా కుదిరిన ఒప్పందం అధికారికి, సిబ్బందికి ఆమోదయోగ్యంగానే ఉన్నా.. వినియోగదారులకు మాత్రం నిత్య నరకం చూపుతోంది. -
కురుమూర్తిరాయ.. ఇదేంటయ్యా!
(చిన్నచింతకుంట)ఆత్మకూర్, న్యూస్‌లైన్: జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన కురుమూర్తిస్వామి వారి బ్రహ్మోత్సవాల సం దర్భంగా నిర్వహించాల్సిన టెంకాయల విక్రయం, తలనీలాల టెండర్లు ము చ్చటగా మూడోసారి కూడా వాయిదాపడ్డాయి. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన టెండర్లు కాంగ్రెస్, టీడీపీ నేతల మధ్య వైషమ్యాల కారణంగా వాయిదాపడినట్లు తెలిసింది. దీంతో ఈనెల 3వ తేదీనుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్న తరుణంలో టెండర్లు వాయిదాపడటంతో ఆలయ ఆదాయానికి రూ.50లక్షలు నష్టం వాటిల్లనుంది. కాంగ్రెస్, టీడీపీల మధ్య నెలకొన్న రాజకీయ విభేదాల కారణంగానే ఈ తంతుకొనసాగుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 18న ‘ఆన్లైన్’ ద్వారా రూ.18లక్షలకు జూరాల నర్సింహా టెంకాయల టెండర్లు దక్కించుకున్నారు. అదేరోజు హైదరాబాద్‌లోని ఓ కంపెనీవారు రూ.30.50 లక్షలకు తలనీలాల టెండర్లు దక్కించుకున్నారు. అనంతరం జరిగిన పరిణామాల కారణంగా ఈనెల 28న హైదరాబాద్‌లోని దేవాదాయశాఖ కమిషనర్ వారి కార్యాలయంలో తిరిగి టెండర్లు నిర్వహించారు. గతంలో టెండర్లు పొందిన వ్యక్తులు అడ్డుకోవడటంతో ఆ టెండర్లను తిరిగి గురువారం మళ్లీ అదే కార్యాలయంలో నిర్వహించారు. గతంలో జరిపిన టెండర్లను ఎందుకు రద్దుచేశారో చెప్పాలంటూ టీసీసీఎం ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు అక్కడ ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నట్లు తెలిసింది. టీడీపీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డి వల్లే ఈ టెండర్లు వాయిదా పడ్డాయని టీసీపీఎం జిల్లా నాయకులు ఐ.శ్రీనివాసులు ఆరోపిస్తున్నారు. పాలకమండలి చైర్మన్ కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు కావడంతోనే ఇరుపార్టీల మధ్య సయోధ్య కుదరకపోవడంతో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన టెండర్లు వాయిదా పడినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. దీని ఫలంగా ఆలయానికి రావాల్సిన రూ.50లక్షల ఆదాయం చేజారిపోయిందని పెదవివిరిచారు. మరో రెండురోజుల్లో ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్కడ టెంకాయల అమ్మకాలు ఎలా, ఎవరు నిర్వహిస్తారని భక్తుల్లో అయోమయం నెలకొంది. గురువారం జరిగిన టెండర్ల ప్రక్రియలో దేవరకద్ర ఎమ్మెల్యే సీతమ్మ, ఆలయ ఈఓ హేమంత్, పాలక మండలి చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్జేసీ కృష్ణవేణి పాల్గొన్నట్లు తెలిసింది.