దేవాలయాలకు పునర్‌వైభవం తెస్తాం: ఇంద్రకరణ్‌రెడ్డి | we will develop the temples, says indrakaran reddy | Sakshi
Sakshi News home page

దేవాలయాలకు పునర్‌వైభవం తెస్తాం: ఇంద్రకరణ్‌రెడ్డి

Published Mon, Mar 9 2015 9:01 PM | Last Updated on Sat, Sep 2 2017 10:33 PM

దేవాలయాలకు పునర్‌వైభవం తెస్తాం: ఇంద్రకరణ్‌రెడ్డి

దేవాలయాలకు పునర్‌వైభవం తెస్తాం: ఇంద్రకరణ్‌రెడ్డి

హైదరాబాద్: తెలంగాణలోని  దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకువస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఎ. ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. సోమవారం నగరంలోని బొగ్గులకుంటలో దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో శ్రీ బంగారు మైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హాజరై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ నిర్మాణానికి అమ్మవారి అశీస్సులు కోరుకున్నట్లు తెలిపారు. కాగా, తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం అధ్వర్యంలో కమిషనరేట్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో శ్రీ మన్మథనామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆవిష్కరించారు.
(సుల్తాన్‌బజార్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement