సాక్షి, విజయవాడ: దసరా ఉత్సవాల్లో ఘోర అపచారం జరిగింది. భవానీ భక్తులను దేవాదాయ శాఖ దారుణంగా మోసం చేసింది. ఆగమ శాస్త్రానికి తూట్లు పొడిచిన దుర్గ గుడి అధికారులు.. భక్తులకు ఇతర ఆలయాల్లో ప్రసాదాలు పంపిణీ చేశారు. ఇతర ఆలయాల ప్రసాదాలు దుర్గమ్మ ప్రసాదంగా పంపిణీ చేయడం ఆగమ శాస్త్ర విరుద్ధం. దుర్గగుడికి పెదకాకాని, మోపిదేవి, పెనుగంచిప్రోలు ఆలయాల నుంచి తెచ్చిన 37 వేల లడ్డూలు భవానీ భక్తులతో పాటు దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులకు పంపిణీ చేశారు.
ఇతర ఆలయాల నుంచి లడ్డూ ప్రసాదం తెచ్చి దుర్గమ్మ ప్రసాదంగా పంపిణీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవాదాయశాఖ, దుర్గగుడి అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు. బెజవాడ దుర్గమ్మ లడ్డూ ప్రసాదం భవానీ భక్తులకు అత్యంత పవిత్రం, ప్రీతికరం. అయితే, లడ్డు ప్రసాదం కొరత రాకుండా ఉండేందుకేనంటూ చేసిన అపచారాన్ని దుర్గగుడి అధికారులు సమర్థించుకుంటున్నారు. సామాన్య భక్తులతో పాటు భవానీ భక్తుల మనోభావాలను దేవాదాయ శాఖ అధికారులు దారుణంగా దెబ్బతీశారు.
Comments
Please login to add a commentAdd a comment