telangana brahmin society
-
రూ.20 కోట్లతో విదేశీ విద్యాపథకం
సాక్షి,హైదరాబాద్: వివేకానంద విదేశీ పథకం కింద బ్రాహ్మణ విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు తెలంగాణ బ్రాహ్మణ సం క్షేమ పరిషత్ రూ.20 కోట్లను కేటాయించింది. పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేవీ రమణాచారి అధ్యక్షతన గురువారం జరిగిన ఈ సంఘం సర్వసభ్య సమావేశం పలు కీలక తీర్మానాలు చేసింది. రాష్ట్రంలో రూ.10 కోట్లతో బ్రాహ్మణ భవనాలు ఏర్పాటు చేయా లని నిర్ణయించింది. చిన్న పరిశ్రమలు నెలకొల్పేందుకు రూ.5 లక్షలు మించకుండా రాయితీ కల్పిస్తూ 1,900 మంది లబ్ధిదారులకు రూ.36 కో ట్లను కేటాయించింది. అర్హులైన వారికి ఈ నెలాఖరులోగా రాయితీని చెక్కుల రూపంలో అందజేయాలని తీర్మానించింది. పదో తరగతి నుంచి పీజీ వరకు ఉత్తీర్ణులైన నిరుద్యోగులకు 30న ఉద్యోగమేళా నిర్వహించాలని నిర్ణయించింది. -
‘బ్రాహ్మణ సంస్థ’ అధ్యక్షుడిగా జగన్నాథరావు
హైదరాబాద్: తెలంగాణ బ్రాహ్మణ సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడిగా పి.జగన్నాథరావు ఎన్నికయ్యారు. మంగళవారం విద్యానగర్‌లోని సంస్థ కార్యాలయంలో తెలంగాణ బ్రాహ్మణ సేవా సంస్థ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు నిర్వహించినట్లు సంస్థ ఎన్నికల అధికారి వెల్దండ బల్వంతరావు వెల్లడించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని ఆయన ప్రకటించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్.రఘునాథరావు, ప్రధాన కార్యదర్శిగా కె.రామారావు, సంయుక్త కార్యదర్శిగా సి.రుక్మిణి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కె.శ్యామ్, కోశాధికారిగా ఆర్.వెంకటేశ్వర్రావు, సంస్థ గౌరవాధ్యక్షుడిగా కె.సురేశ్ చందర్రావు ఎన్నికైనట్లు తెలిపారు. అలాగే నలుగురు కార్యవర్గ సభ్యులను, ఐదుగురు సలహాదారులను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నూతన కార్యవర్గం 2 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్నట్లు ఆయన వెల్లడించారు. -
దేవాలయాలకు పునర్వైభవం తెస్తాం: ఇంద్రకరణ్‌రెడ్డి
హైదరాబాద్: తెలంగాణలోని దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకువస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఎ. ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. సోమవారం నగరంలోని బొగ్గులకుంటలో దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో శ్రీ బంగారు మైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హాజరై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ నిర్మాణానికి అమ్మవారి అశీస్సులు కోరుకున్నట్లు తెలిపారు. కాగా, తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం అధ్వర్యంలో కమిషనరేట్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో శ్రీ మన్మథనామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆవిష్కరించారు. (సుల్తాన్‌బజార్)