
సాక్షి,హైదరాబాద్: వివేకానంద విదేశీ పథకం కింద బ్రాహ్మణ విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు తెలంగాణ బ్రాహ్మణ సం క్షేమ పరిషత్ రూ.20 కోట్లను కేటాయించింది. పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేవీ రమణాచారి అధ్యక్షతన గురువారం జరిగిన ఈ సంఘం సర్వసభ్య సమావేశం పలు కీలక తీర్మానాలు చేసింది.
రాష్ట్రంలో రూ.10 కోట్లతో బ్రాహ్మణ భవనాలు ఏర్పాటు చేయా లని నిర్ణయించింది. చిన్న పరిశ్రమలు నెలకొల్పేందుకు రూ.5 లక్షలు మించకుండా రాయితీ కల్పిస్తూ 1,900 మంది లబ్ధిదారులకు రూ.36 కో ట్లను కేటాయించింది. అర్హులైన వారికి ఈ నెలాఖరులోగా రాయితీని చెక్కుల రూపంలో అందజేయాలని తీర్మానించింది. పదో తరగతి నుంచి పీజీ వరకు ఉత్తీర్ణులైన నిరుద్యోగులకు 30న ఉద్యోగమేళా నిర్వహించాలని నిర్ణయించింది.