China: Ready To Boost Ties With Emerging Powers Russia, India - Sakshi
Sakshi News home page

భారత్‌, రష్యాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు సిద్ధం!: చైనా

Published Tue, Apr 4 2023 11:33 AM | Last Updated on Tue, Apr 4 2023 12:19 PM

China Ready To Boost Ties With Emerging Powers Russia And India - Sakshi

కొత్త విదేశాంగ విధానంతో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి రష్యా, చైనాలు అంకితభావంతో పనిచేస్తున్నాయి. 

రష్యా కొత్త విదేశాంగ విధానంపై చైనా సానూకూలంగా స్పందించింది. దీని గురించి విలేకరులు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మావోనింగ్‌ స్పందన కోరగా..చైనా రష్యా, భారత్‌ గుర్తించదగిన రీతిలో అతిపెద్ద శక్తులుగా ఎదుగుతున్నాయి. పైగా ప్రభావంతంగా అభివృద్ధి చెందుతున్నాయి కూడా. ప్రస్తుతం అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలు సంక్లిష్ట మార్పులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా, భారత్‌ సహా అంతర్జాతీయ సమాజంతో సంబంధాల  బలోపేతం చేసుకోవడానికి తాముగా సిద్ధంగా ఉన్నాం.

అంతేగాదు పరస్పర గౌరవం, శాంతియుత జీవన, గెలుపు-విజయాల సహకారంతో కూడిన ఈ సరికొత్త విదేశాంగ విధానంతో సంబంధాలను మరింతగా పెంపొందించడానికి చైనా రష్యాలు అంకితభావంతో పనిచేస్తున్నాయి. అని చెప్పారు. కాగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ గత శుక్రవారమే కొత్త విదేశాంగ విధానంపై సంతకం చేశారు. దీనిలో రష్యా చైనా, భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసే దౌత్యపరమైన ప్రాధాన్యత గురించి పేర్కొంది.

ఈ మేరు 42 పేజీల ఆ కొత్త విదేశాంగ విధానం డాక్యుమెంట్లులో చైనా భారత్‌ సంబంధాలను ప్రత్యేకంగా పేర్కొనడం గమనార్హం. అంతేగాదు యురేషియా ఖండంలో ఉన్న స్నేహపూర్వక సంబంధాలను మరింతగా పెంచుకోవడం, సమన్వయం చేసుకోవడం వంటి ప్రాముఖ్యతనును కూడా రష్యా నొక్కి చెప్పింది. అలాగే ఈ ప్రాంతంలో భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం, వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టిసారిస్తామని, అలాగే ప్రత్యర్థి దేశాలు, కూటములు చేపట్టే ‘విధ్వంసకర చర్యల’ను నిరోధిస్తామని పుతిన్‌​ ఆ విదేశాంగ విధానంలో వివరించారు.

(చదవండి: భారత్‌ ఐడ్రాప్స్‌ యూఎస్‌ ఆరోపణలు! తోసిపుచ్చిన ఫార్మా కంపెనీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement