మాస్కో: వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వెంట సైనికులను ఉపసంహరణపై భారత్, చైనాల మధ్య జరిగిన అవగాహనను రష్యా స్వాగతించింది. సరిహద్దు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఇరు దేశాల నుంచి సంకల్పం, విశ్వాసం అవసరమని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ సోమవారం అన్నారు.
‘‘ ఐదేళ్ల విరామం తర్వాత కజాన్‌లో చైనా, భారత్‌ల నేతల మధ్య తొలి సమావేశం జరగడాన్ని మేం (రష్యా) స్వాగతిస్తున్నాం. ఆనందం వ్యక్తం చేస్తున్నాం. భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో ఇది.. చాలా సానుకూల పరిణామం. భారత్-చైనా సరిహద్దు వివాదం చాలా సంక్లిష్టమైన సమస్య.దీనికి సుదీర్ఘమైన చర్చల ప్రక్రియ అవసరం. భారత్, చైనా తమ మధ్య ఉన్న సరిహద్దు సమస్యలపై చివరికి విజయం సాధిస్తాయనే విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు.దానికి సంకల్పం, సహృదయం, నమ్మకం అవసరం. సామరస్యానికి ఇవి చాలా అవసరం’’ అని అలిపోవ్ తెలిపారు.
అక్టోబరు 23న రష్యాలోని కజాన్ నగరంలో జరిగే బ్రిక్స్ సమ్మిట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ల భేటీకి రెండు రోజుల ముందే ఎల్‌ఏసీ వెంట పెట్రోలింగ్ ఏర్పాట్లపై చైనాతో భారత్ ఒప్పందాన్ని ప్రకటించింది. సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడం ద్వారా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సాధారణ స్థితికి వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment