Foreign policy
-
భారత్, చైనాల మధ్య నలిగిపోము: శ్రీలంక అధ్యక్షుడు
కొలంబో: భారత్, చైనా దేశాలతో విదేశాంగ విధానంలో శ్రీలంక సమానమైన వైఖరిని పాటిస్తుందని ఆ దేశ కొత్త అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే అన్నారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి భారత్, చైనా విదేశాంగ విధానంపై స్పందించారు. భారత్, చైనాల మధ్య నలిగిపోయే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. ఆయన ఓ ఇంటర్వ్యులో పొరుగుదేశాలతో విదేశాంగ విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘మా నాయకత్వంలో దేశం భౌగోళిక, రాజకీయ ప్రత్యర్థుల జోలికి వెళ్లకుండా చూస్తాం. నేషనల్ పీపుల్స్ పవర్( ఎన్పీపీ) ప్రభుత్వం ఏ దేశంతోను జతకట్టదని, పొరుగు దేశాలైన భారత్, చైనా రెండు దేశాలతో సమతుల్య సంబంధాలను పెంపొందించుకోవాలని భావిస్తోంది.మేము భౌగోళిక, రాజకీయ పోరాటంలో ఎవరితో పోటీదారులం కాదు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోము. ముఖ్యంగా భారత్, చైనాల మధ్య నలిగిపోవాలనే ఉద్దేశం మాకు లేదు. రెండు దేశాలు విలువైన స్నేహితులుగా మా ప్రభుత్వ సన్నిహిత భాగస్వాములు కావాలని ఆశిస్తున్నాం. యూరోపియన్ యూనియన్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాతో కూడా సంబంధాలను కొనసాగించుతాం” అని అన్నారు.పొరుగు దేశాల ఆధిపత్య పోరులో శ్రీలంక నలిగిపోవద్దని ఇరుదేశాలతో పరస్పర ప్రయోజనకరమైన దౌత్య భాగస్వామ్యం నిర్మించడంపై దృష్టి సారిస్తోందని అన్నారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో శ్రీలంక తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి తటస్థ విదేశాంగ విధాన విధానమే కీలకమని భావిస్తున్నట్లు తెలుస్తోంది.చదవండి: సంక్షోభ లంకపై నెలవంక! -
వినూత్న విదేశాంగ విధానం
నలుగురు నడిచిన బాటలో నడవటం, సంప్రదాయంగా వస్తున్న విధానాలను అనుసరించటం శ్రేయస్కరమని చాలామంది అనుకొనేదే. కొత్త ప్రయోగాలకు దిగితే ఏం వికటిస్తుందోనన్న సంశయమే ఇందుకు కారణం. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించిన తాజా యూరోప్ పర్యటన మన విదేశాంగ విధానం కొత్త మలుపు తిరిగిన వైనాన్ని వెల్లడించింది. ఇది మంచిదా, కాదా అన్నది మున్ముందు తేలుతుంది. అయితే తాము ఎవరికీ దగ్గరా కాదు... దూరమూ కాదని అటు రష్యాకూ, ఇటు పాశ్చాత్య దేశాలకూ మనం చెప్పినట్టయింది. ఒక రకంగా ఇది ప్రచ్ఛన్న యుద్ధ దశలో మన దేశం అనుసరించిన అలీన విధానాన్ని గుర్తుకుతెస్తుంది. మోదీ రెండు రోజులు పోలెండ్‌లో పర్యటించారు. అధ్యక్షుడు ఆంద్రెజ్ దుదాతో సమావేశమయ్యారు శుక్రవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలు జరిపారు. ఇవి రివాజులో భాగంగా సాగిన పర్యటనలు కాదు. మన దేశ ప్రధాని ఒకరు పోలెండ్‌ను సందర్శించటం గత నలభై అయిదేళ్లలో ఇదే తొలిసారి. 1955లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, 1967లో ఇందిరా గాంధీ, 1979లో మొరార్జీ దేశాయ్ ఆ దేశంలో పర్యటించారు. కానీ అప్పటికది సోవియెట్ యూనియన్ ఛత్రచ్ఛాయలో ఏర్పడ్డ వార్సా సైనిక కూటమిలో భాగం. అయితే, 1991లో సోవియెట్ యూనియన్ కుప్పకూలడానికి చాలా ముందే పోలెండ్ బాట మార్చింది. సోవియెట్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన నాటో కూటమి దేశాలకు చేరువైంది. 1999లో నాటోలో చేరింది. 2004లో యూరొపియన్ యూనియన్ (ఈయూ)లో భాగమైంది. ఆ తర్వాత మరెప్పుడూ మన ప్రధానులు ఆ దేశాన్ని సందర్శించ లేదు. ఇక సోవియెట్‌లో ఒకప్పుడు భాగమైన ఉక్రెయిన్ 26 ఏళ్ల క్రితం స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. పాశ్చాత్య దేశాల సలహాతో తన అణ్వస్త్రాలను స్వచ్ఛందంగా వదులుకుంది. భిన్న సందర్భాల్లో వాటి మనోభావాలకు తగినట్టు తన విధానాలను తీర్చిదిద్దుకుంది. వాజపేయి హయాంలో మన దేశం నిర్వహించిన అణు పరీక్షలను వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేసింది. మన కశ్మీర్ విధానాన్ని ఖండిస్తూ వచ్చింది. పాకిస్తాన్‌కు శతఘ్నులు విక్రయించింది. రెండు దేశాల మధ్య ఉండే ద్వైపాక్షిక సంబంధాలు మూడో దేశానికి వ్యతిరేకమని భావించటం మూర్ఖత్వమే అవుతుంది. అలాంటి మూర్ఖత్వాన్ని ఈమధ్య అమెరికాతో పాటు ఉక్రెయిన్ కూడా ప్రదర్శించింది. జూలై రెండో వారంలో మోదీ రష్యాలో పర్యటించినప్పుడు జెలెన్స్కీ ట్విటర్ వేదికగా భారత్‌ను విమర్శించారు. నెత్తురంటిన పుతిన్‌తో ఎలా కరచాలనం చేస్తారని మోదీని ప్రశ్నించారు. ప్రపంచంలోనే అత్యంత క్రూరుడైన నేరగాడిని హత్తుకోవటం విచారకరమన్నారు. ఆ సమయంలో మోదీ తమ దేశంలో ఉన్నారన్న సంగతిని కూడా విస్మరించి కియూవ్‌లో పిల్లల ఆస్పత్రిపై రష్యా బలగాలు దాడి చేసిన మాట వాస్తవమే. అయితే ఆ ఉదంతాన్ని పుతిన్ సమక్షంలోనే మోదీ ఖండించారు. అయినా జెలెన్స్కీకి అది సరిపోలేదు. తాము రష్యాతో యుద్ధం చేస్తున్నాం గనుక ప్రపంచమంతా దాన్ని దూరం పెట్టాలన్న వైఖరిని ప్రదర్శించారు. ఇది తెలివితక్కువతనం. భారత్–రష్యా సంబంధాల సంగతే తీసుకుంటే రష్యా అనేక కారణాల వల్ల పాకిస్తాన్‌కు ఆయుధ విక్రయంపై ఉన్న ఆంక్షలను పదేళ్లక్రితం సడలించింది. దూరశ్రేణి క్షిపణులు, ఇతర రక్షణ పరికరాలు అందజేసింది. ఎంఐ–26 సైనిక రవాణా హెలికాప్టర్లను సమకూర్చుకోవటానికి సాయం అందజేసింది. మనకు ఆయుధాలు, ఇతర రక్షణ పరికరాలు విక్రయించినప్పుడల్లా సమతూకం పాటించే నెపంతో పాకిస్తాన్‌కు కూడా అమ్మకాలు సాగించటం రష్యా నేర్చుకుంది. చైనాతో దాని సంబంధాలు సరేసరి. ఇలా మనకు బద్ధ వ్యతిరేకమైన రెండు దేశాలతో రష్యా సంబంధాలు నెరపుతున్నప్పుడు మనం మాత్రం తమతోనే ఉండాలని అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ కోరుకోవటం అర్థరహితం.రష్యా – ఉక్రెయిన్ల మధ్య మూడేళ్లుగా సాగుతున్న యుద్ధాన్ని ఆపటానికి ఒక తటస్థ దేశంగా భారత్ కృషి చేయాలని చాలా దేశాలు ఆశపడుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను మన దేశం ఖండించలేదు. రష్యాను విమర్శిస్తూ తీసుకొచ్చిన తీర్మానాలపై వోటింగ్ సమయంలో మన దేశం గైర్హాజరైంది. అయితే యుద్ధ క్షేత్రంలో కాక చర్చలతో, దౌత్యంతో మాత్రమే ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని వివిధ అంతర్జాతీయ వేదికలపై మోదీ ఈ మూడేళ్లుగా చెబుతూ వచ్చారు. ఇరు దేశాలూ చర్చలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. సరిగ్గా నాటో 75 యేళ్ల ఉత్సవాల సందర్భంలో రష్యా పర్యటనను ఎంచుకున్నందుకు అమెరికా ఆగ్రహించింది. అయితే ఎడతెగకుండా సాగుతున్న ఈ యుద్ధానికి ముగింపు పలకడమెలా అన్నది దానికి బోధపడటం లేదు. తన మద్దతుతో, పాశ్చాత్య దేశాల సహకారంతో 3, 4 నెలల్లో రష్యాను ఉక్రెయిన్ అవలీలగా జయిస్తుందన్న భ్రమ మొదట్లో అమెరికాకు ఉంది. కానీ రోజులు గడిచేకొద్దీ అది కొడిగట్టింది. నిరుడు ఫిబ్రవరిలో శాంతి సాధన పేరుతో చైనా ఒక ప్రతిపాదన చేసింది. కానీ అందులో రష్యావైపే మొగ్గు కనబడుతోందన్న విమర్శలొచ్చాయి. పైపెచ్చు చైనా అధికారిక మీడియా మొదటి నుంచీ రష్యాను వెనకేసుకొస్తోంది. ఇలాంటి సమయంలో భారత్ దౌత్యంపై ఆశలేర్పడటం సహజం. అయితే పరస్పరం తలపడుతున్న వైరి పక్షాలు మానసికంగా చర్చలకు సిద్ధపడితే తప్ప ఎవరి ప్రయత్నాలైనా ఫలించే అవకాశాలుండవు. ముఖ్యంగా ఈ యుద్ధంలోని నిరర్థకతను రష్యాతో పాటు అమెరికా, యూరొప్ దేశాలు గుర్తించాల్సివుంది. ఆ తర్వాతే ఉక్రెయిన్ దూకుడు తగ్గుతుంది. ఆ మాటెలావున్నా మోదీ పర్యటన మన విదేశాంగ విధానానికి కొత్త బాట పరిచింది. -
భారత్, రష్యాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు సిద్ధం!
రష్యా కొత్త విదేశాంగ విధానంపై చైనా సానూకూలంగా స్పందించింది. దీని గురించి విలేకరులు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మావోనింగ్ స్పందన కోరగా..చైనా రష్యా, భారత్ గుర్తించదగిన రీతిలో అతిపెద్ద శక్తులుగా ఎదుగుతున్నాయి. పైగా ప్రభావంతంగా అభివృద్ధి చెందుతున్నాయి కూడా. ప్రస్తుతం అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలు సంక్లిష్ట మార్పులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా, భారత్ సహా అంతర్జాతీయ సమాజంతో సంబంధాల బలోపేతం చేసుకోవడానికి తాముగా సిద్ధంగా ఉన్నాం. అంతేగాదు పరస్పర గౌరవం, శాంతియుత జీవన, గెలుపు-విజయాల సహకారంతో కూడిన ఈ సరికొత్త విదేశాంగ విధానంతో సంబంధాలను మరింతగా పెంపొందించడానికి చైనా రష్యాలు అంకితభావంతో పనిచేస్తున్నాయి. అని చెప్పారు. కాగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గత శుక్రవారమే కొత్త విదేశాంగ విధానంపై సంతకం చేశారు. దీనిలో రష్యా చైనా, భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసే దౌత్యపరమైన ప్రాధాన్యత గురించి పేర్కొంది. ఈ మేరు 42 పేజీల ఆ కొత్త విదేశాంగ విధానం డాక్యుమెంట్లులో చైనా భారత్ సంబంధాలను ప్రత్యేకంగా పేర్కొనడం గమనార్హం. అంతేగాదు యురేషియా ఖండంలో ఉన్న స్నేహపూర్వక సంబంధాలను మరింతగా పెంచుకోవడం, సమన్వయం చేసుకోవడం వంటి ప్రాముఖ్యతనును కూడా రష్యా నొక్కి చెప్పింది. అలాగే ఈ ప్రాంతంలో భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం, వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టిసారిస్తామని, అలాగే ప్రత్యర్థి దేశాలు, కూటములు చేపట్టే ‘విధ్వంసకర చర్యల’ను నిరోధిస్తామని పుతిన్ ఆ విదేశాంగ విధానంలో వివరించారు. (చదవండి: భారత్ ఐడ్రాప్స్ యూఎస్ ఆరోపణలు! తోసిపుచ్చిన ఫార్మా కంపెనీ) -
అదానీకి దోచిపెట్టడమే విదేశాంగ విధానమా?: రాహుల్
న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని కుబేరుడిని చేయడమే మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానామా? అని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ వీడియో విడుదల చేశారు. నరేంద్ర మోదీ గత తొమ్మిదేళ్లుగా దేశాన్ని భ్రమల్లోనే ఉంచుతున్నారని, తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రపంచంలో మోదీ ఎక్కడికెళ్లినా అదానీని సైతం వెంట తీసుకెళ్లారని గుర్తుచేశారు. PM का विदेश जाना और वहां अडानी को नए बिज़नेस डील मिलना, कोई संयोग नहीं है। ‘मोडानी’ ने भारत की फॉरेन पॉलिसी को फॉरेन ‘डील’ पॉलिसी बना दिया है। पूरा वीडियो देखें: https://t.co/63gl5II39Q pic.twitter.com/CshP26wK6D — Rahul Gandhi (@RahulGandhi) March 14, 2023 ప్రతిష్టంభనకు ప్రభుత్వమే కారణం: జైరాం పార్లమెంట్లో ప్రతిష్టంభనకు ముమ్మాటికీ మోదీ ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ట్విట్టర్లో ధ్వజమెత్తారు. కీలకమైన అంశాలపై ప్రజల దృష్టిని మళ్లించడం ప్రధాని మోదీకి, ఆయన సహచరులకు ఒక అలవాటుగా మారిందన్నారు. రాహుల్ విమర్శలను కేంద్ర మంత్రి, బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ ఖండించారు. కాంగ్రెస్ హయాంలోనే అదానీ వ్యాపారావేత్తగా ఎదిగారన్నారు. ‘‘గుజరాత్ కాంగ్రెస్ సీఎం చిమన్‌భాయ్ పటేల్ తనకు మొదటి బ్రేక్, రాజీవ్ గాంధీ రెండో బ్రేక్ ఇచ్చారని అదానీ స్వయంగా చెప్పారు. ప్రధాని మోదీని దూషించడమే ప్రతిపక్షాల ఉద్దేశం. అంబానీ–అదానీ సాకులే. యూపీఏ ప్రభుత్వ పదేళ్ల పాలన వివాదాలమయం. మోదీ సర్కారు వచ్చాకే అభివృద్ధి జరుగుతోంది’’ అన్నారు. ప్రమాదంలో భావప్రకటనా స్వేచ్ఛ: ఖర్గే మాట్లాడే స్వాతంత్య్రం, నిజాలు రాసే స్వేచ్ఛ ప్రమాదంలో చిక్కుకున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం లోక్మత్ జాతీయ సదస్సులో ఆందోళన వ్యక్తం చేశారు. పాలకులు మీడియాను అణచివేస్తున్నారని ఆరోపించారు. ఓ వర్గం మీడియా వారికి లొంగిపోయిందని ఆక్షేపించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీ కేంబ్రిడ్జి అరుపులు, లండన్ అబద్ధాలు ఆపాలని సదస్సులో పాల్గొన్న కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ హితవు పలికారు. విపక్ష నేతలను వేధించేందుకే దర్యాప్తు సంస్థలను కేంద్రం ప్రయోగిస్తోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ధ్వజమెత్తారు. చదవండి: ఎన్నిసార్లు ఇలానే చేస్తారు.. స్క్రిప్ట్ రైటర్, డైలాగ్ రైటర్‌ను మార్చుకోండి.. -
India Foreign Policy: 2023లో మన విదేశాంగం ఎటు?
మరొక కల్లోలభరితమైన సంవత్సరం ముగిసింది. 2022 ప్రారంభంలో యుద్ధం యూరోపియన్ తీరాలకు చేరుకుంది. కోవిడ్–19 అనంతర సాధారణ స్థితికి ప్రపంచం వస్తున్న తరుణంలోనే ఉక్రెయిన్ను రష్యా ఆక్రమించడంతో ప్రపంచ క్రమవ్యవస్థకు కొత్త సవాళ్లను విసిరినట్టయింది. అమెరికా–చైనా మధ్య ఘర్షణ పదునెక్కుతున్న స్థితిలో రష్యా–చైనా మధ్య బంధం మరింతగా బలపడుతోంది. ప్రతి విషయంలోనూ ఆయుధీకరణ కొత్త వ్యవస్థగా ఆవిర్భవిస్తున్నందున ప్రపంచీకరణ వ్యతిరేక క్రమం చుట్టూ చర్చ బలం పుంజుకుంటోంది. ఈ ఉపద్రవం మధ్య అంతర్జాతీయ సంస్థలు నూతన సవాళ్లను ఎదుర్కోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేవు. కాబట్టి, నూతన సంస్థాగత నిర్మాణాల కోసం శోధన ముందుకు వచ్చింది. జాతీయ వ్యూహాత్మక చింతనకు చెందిన కొన్ని మౌలిక భావనలకు బహిరంగంగా వ్యతిరేకత ఎదురవుతున్నప్పుడు భారతీయ విదేశీ విధానం ఒక సంవత్సర కాలంలో ఈ అన్ని మలుపులకూ స్పందించాల్సి వచ్చింది. 2020లో గల్వాన్ సంక్షోభం భారత ప్రభు త్వాన్ని తన చైనా విధానాన్ని తిరిగి మదింపు చేసుకునేలా ఒత్తిడికి గురిచేసింది. ఆ విధంగానే ఉక్రెయిన్ యుద్ధం భారత్‌ను తన రష్యా విధాన చోదక శక్తుల పట్ల వైఖరిని తిరిగి పరిశీలించుకునేలా చేసింది. అలాగే పాశ్చాత్య ప్రపంచంతో తన వ్యవహార శైలిని కొత్తగా రూపొం దించుకునేందుకు కూడా వెసులుబాటు కల్పించింది. 2022 ఫిబ్ర వరిలో రష్యన్ దురాక్రమణ ప్రారంభమైనప్పుడు, డిమాండ్ చేస్తున్న పాశ్చాత్య దేశాలు ఒకవైపు, విఘాతం కలిగించే రష్యా మరొకవైపు ఉంటున్న స్థితిలో రెండు శక్తులతోనూ సంబంధాలను భారత్ ఎంత కష్టంగా నిర్వహిస్తుందనే అంశంపై చాలా చర్చ జరిగింది. అయితే అత్యంత సంక్లిష్టమైన ప్రపంచ సమస్యపై భారత్ సమతుల్యత ప్రదర్శించడం నుంచి నూతన సంవత్సరం నాడు ప్రారంభమైంది. ఇంధన భద్రత కోసం రష్యాతో తన సంబంధ బాంధవ్యాలను భారత్ కొనసాగించడమే కాదు, మాస్కోతో ఇంధన పొత్తులను మరింతగా పెంచుకోగలిగింది. రష్యాను బహిరంగంగా ఖండించక పోవడం ద్వారా పాశ్చాత్య ప్రపంచం పక్షాన భారత్ నిలబడలేదని పాశ్చాత్య దేశాల్లో కొంతమంది విమర్శిస్తున్న సమయంలోనే, సంవత్సరం పొడవునా పాశ్చాత్య దేశాలతో భారత్ సంబంధాలు మరింత బలపడ్డాయి. భారత్ తన వంతుగా ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ చట్టం, ప్రాదేశిక సార్వభౌమాధికారం నేపథ్యంలో రష్యన్ దురాక్రమణపై ఆరోపించడం నుంచి తన వైఖరిని మార్చు కుంది. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇది యుద్ధ సమయం కాదని రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్‌కు బహిరంగం గానే బోధ చేసేంతవరకు పోయారు. బాలి సదస్సులో జీ20 దేశాల చర్చల సమయంలో సెంటిమెంటును రంగరించి మరీ మోదీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సంవత్సరం ముగిసే సమయానికి ఉక్రెయన్ సంక్షోభాన్ని ముగించే విషయంలో భారత్ మరింత క్రియాశీలక పాత్ర చేపట్టనుందని అంచనాలు పెరిగిపోయాయి. చివరకు ప్రధాని మోదీతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ జెలెన్స్కీ ఫోన్ చేసి మరీ మాట్లాడారు. రష్యా పట్ల భారత్ వైఖరిని పాశ్చాత్య ప్రపంచం ప్రారంభంలో విమర్శనాత్మకంగా అంచనా వేసింది. కానీ ఉక్రెయిన్ సమస్యపై దౌత్యపరమైన ప్రయత్నాల విషయంలో భారత్ చొరవను చివరకు పాశ్చాత్య దేశాలు హేతుపూర్వకంగా గుర్తించాల్సి వచ్చింది. యూరప్ సమస్యలు ప్రపంచ సమస్యలు అవుతాయి కానీ ప్రపంచ సమస్యలు యూరప్ సమస్యలు కావు అనే ఆలోచనలోని కపటత్వాన్ని భారత్ నొక్కి చెప్పింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇండో–పసిఫిక్ వ్యవహారాలకు సంబంధించి భారత్ కేంద్ర స్థానం విషయంలో యూరప్ దేశాలు నిశ్చితాభిప్రాయానికి వచ్చేశాయి. దీంతో ఈ సంవత్సరం భారత్–యూరోప్ సంబంధాలు కొత్త పుంతలు తొక్కాయి. యూరోపియన్ స్థలపరిధుల్లో రష్యాకు ప్రధాన స్థానం ఉన్నప్పటికీ, చైనా నుండీ, దాని దూకుడు ఎత్తుగడలనుంచే తమకు దీర్ఘకాలిక వ్యూహాత్మక సవాళ్లు ఎదురు కానున్నాయని యూరప్ దేశాలకు స్పష్టంగా బోధపడింది. వారి వ్యూహాత్మక తర్కం కారణంగా అమెరికాతో భారత్ సంబంధాలు కూడా ముందంజ వేశాయి. ఇండో–పసిఫిక్ నేడు అత్యంత కీలకంగా మారింది. పసిఫిక్ ప్రాంతంలో ‘క్వాడ్’, మధ్య ప్రాచ్యంలో ‘ఐ2యు2’ (ఇజ్రాయెల్, ఇండియా, యూఎస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) రెండు కీలక భూభాగాల్లో సంస్థాగత వ్యాఖ్యాత లుగా ఆవిర్భవిస్తున్నాయి. న్యూఢిల్లీ, వాషింగ్టన్ ద్వైపాక్షిక సంబంధా లకు మించి, తమ వ్యవహారాలకు చెందిన ఎజెండానే పునర్నిర్వ చించుకుంటున్నాయి. దాంతోపాటు తమ ఆకాంక్షల ఆకృతులను మరింతగా పరిగణనలోకి తీసుకుంటున్నాయి. భారతదేశం నిర్వహంచే అంతర్జాతీయ పాత్రను ప్రపంచం ఇప్పుడు మరింత సీరియస్‌గా తీసుకుంటోంది. ఎందుకంటే సంక్లిష్టమైన గ్లోబల్ సమస్యలను భారత్ ఇప్పుడు మరింతగా పట్టించుకుంటూ, నాయకత్వం వహించగలుగుతోంది. ప్రపంచ సమస్యలకు అది పరిష్కారాలు అందించడానికి సిద్ధపడుతోంది. భావసారూప్యత కలిగిన దేశాలతో భాగస్వామ్యాలను ఏర్పర్చుకుంటోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ తన అధ్యక్ష స్థానాన్ని.. సంస్కరించిన బహుపాక్షికతను, శాంతిపరిరక్షణను, ఉగ్రవాద నిరోధకతను, సముద్ర భద్రతను నొక్కి చెప్పడానికి ఉపయోగించుకుంది. ఈ సమస్యలు భారత్ ప్రయోజనాలకే కాదు, ప్రపంచంలోని విశాల భాగం ప్రయోజనాలకు కూడా చాలా ముఖ్యమైనవి. భద్రతాసమితిలో భారత్ వ్యవహరిస్తున్న తీరులో ఆచరణా త్మకతకు చెందిన కొత్త అర్థం ప్రస్ఫుటమవుతోంది. ఇంతవరకు వినపడకుండా కనిపించకుండా పోయిన విశాల మెజారిటీ దేశాల గురించి మాట్లాడేలా భారత వాణి ఉంటోంది. ఈ ప్రాధాన్యత ప్రాతిపదికపైనే అది జీ20 కూటమి అధ్యక్షత బాధ్యతను చేపడుతోంది. బహుపాక్షికత అనేది తన విశ్వసనీయతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ప్రపంచం ఎదుర్కొంటున్న కీలకమైన సవాళ్లు కొన్నింటికి పరిష్కారాలను అందించే విషయంలో అందరి కళ్లూ న్యూఢిల్లీ చేపట్టిన జీ20 నాయకత్వంపైనే ఉన్నాయి. ఇది అంతర్జాతీయ పర్యవసానాలను రూపుదిద్దగలిగే ‘నాయకత్వ శక్తి’గా భారత్ తన విశ్వసనీయతను పెంపొందించుకోవలసిన సమయం. ప్రత్యే కించి భారత గాథ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న సమయంలో ఇది ఎంతో అవసరం. భారత్ అంతర్జాతీయ పాత్రను మెచ్చుకునే పరిణామాలు ఏర్పడు తున్న సమయంలో ప్రముఖ ఆర్థిక శక్తిగా ఆవిర్భవించడం కీలక పాత్ర పోషించనుంది. ప్రపంచం మొత్తంగా బీజింగ్ వ్యవహారాలపై తీవ్ర అసమ్మతి వ్యక్తపరుస్తున్న తరుణంలో చైనా దూకుడును నిలువ రించడంలో దృఢ వైఖరిని ప్రదర్శిస్తున్న భారత్ కొత్త అవకాశాలను సృష్టించుకుంది. 2022లో ఇలాంటి కొన్ని అవకాశాలను అంది పుచ్చుకోవడంలో భారతీయ విదేశీ విధానం విజయవంతమైంది. మరోవైపున చైనా సవాలు సమీప భవిష్యత్తులో భారత ప్రభుత్వ సమర్థతను పరీక్షించడం కొనసాగించనుంది. శీతాకాలం తర్వాత కూడా ఉక్రెయిన్ సంక్షోభం కొనసాగినట్లయితే భారత్, రష్యా పొత్తు కూడా నిశిత పరిశీలనకు గురవుతుంది. న్యూఢిల్లీ పదేపదే చెబుతున్న ‘బహుళ–అమరిక వాదం’ కూడా 2023లో తీవ్రమైన ఒత్తిడి పరీక్షకు గురికాక తప్పదు. అయితే 2022 గురించి ఏమైనా చెప్పుకోవాలీ అంటే, భారత వాణి విశిష్టతను ప్రపంచం గుర్తించింది. మున్ముందు అది అంతర్జాతీయ వేదికలపై మరింతగా విస్తరిస్తుంది. ఇప్పుడప్పుడే దాని ప్రతిధ్వనులు తగ్గిపోవు. (క్లిక్ చేయండి: అమృతోత్సవ దీక్షకు ఫలితం?!) - హర్ష్ వి. పంత్ ఉపాధ్యక్షుడు, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్, న్యూఢిల్లీ (‘ద హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్యానికి సై: బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్
లండన్: భారత్–బ్రిటన్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) అమలుకు కట్టుబడి ఉన్నట్లు బ్రిటన్ నూతన ప్రధాని రిషీ సునాక్ మరోమారు స్పష్టంచేశారు. ఒప్పందం వాస్తవరూపం దాల్చేందుకు కృషిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. విదేశాంగ విధానంపై బ్రిటన్ పారిశ్రామిక వేత్తలు, వివిధ దేశాల అతిథులు, ఆర్థిక నిపుణులు పాల్గొనే వార్షిక లండన్ మేయర్ బ్యాంకెట్ కార్యక్రమంలో సోమవారం సునాక్ ప్రసంగించారు. ‘ ప్రపంచ వ్యాప్తంగా స్వేచ్ఛాయుత వాణిజ్యానికి బ్రిటన్ ముందునుంచీ మద్దతు పలుకుతోంది. రాజకీయాల్లోకి రాకమునుపు నేను ప్రపంచంలోని వేర్వేరు దేశాల్లో వ్యాపారం చేశా. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో వ్యాపార అవకాశాలు పుష్కలం. 2050కల్లా ప్రపంచవాణిజ్యంలో సగం వాటాను ఇండో–పసిఫిక్ హస్తగతం చేసుకుంటుంది. అందుకే ఇండో–పసిఫిక్ సమగ్రాభివృద్ధి ఒప్పందం(సీపీటీపీపీ)లో భాగస్వాములం అవుతున్నాం. ఇందులోభాగంగా భారత్‌లో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వీలైనంత త్వరగా అమల్లోకి వచ్చేందుకు కృషిచేస్తున్నాను’ అని సునాక్ అన్నారు. చైనాతో స్వర్ణయుగ శకం ముగిసినట్లే ‘చైనాతో బ్రిటన్ కొనసాగించిన వాణిజ్యం, ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన స్వర్ణయుగం ముగిసింది. ఇరు దేశాల మధ్య వాణిజ్యం పెరిగాక అది సామాజిక, రాజకీయ సంస్కరణలు, సత్సంబంధాలకు దారితీయాలి. కానీ చైనా రాజ్యవిస్తరణవాదం, ఆధిపత్య ధోరణి కారణంగా అవి సాధ్యపడలేదు. చైనాతో బ్రిటన్ అద్భుత వాణిజ్యానికి తెరపడినట్లే’ అన్నారు. -
బ్రిటన్, చైనా మధ్య స్వర్ణయుగం ముగిసింది: రిషి సునాక్
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ చైనాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. లండన్‌లో సోమవారం జరిగిన సమావేశంలో తొలిసారి విదేశాంగ విధానంపై ప్రసంగించారు. బ్రిటన్ చైనా మధ్య స్వర్ణ యుగంగా పిలవబడే సంబంధాలు ముగిశాయని వ్యాఖ్యానించారు. యూకే విలువలు, ఆసక్తులపై చైనా వ్యవస్థాగత సవాలు విసరుతోందని, ఇది మరింత తీవ్రమవుతున్నాయని మండిపడ్డారు. చైనా నిరంకుశ పాలనపట్ల బ్రిటన్ దృక్పథాన్ని అభివృద్ధి పరచాల్సిన సమయమిదని అన్నారు. చైనాలో మానవ హక్కుల అణచివేత జరుగుతోందని విమర్శించారు. ‘సామాజిక రాజకీయ సంస్కరణలకు దారితీస్తుందనే అమాయక ఆలోచనతో పాటు మాజీ ప్రధాని డేవిడ్ కెమెరూన్ కాలంలో స్వర్ణయుగంగా పిలవబడిన సంబంధాలు బ్రిటన్, చైనా మధ్య ముగిశాయని స్పష్టం చేస్తున్నాను. మన విలువలు, ఆసక్తులకు వ్యతిరేకంగా డ్రాగన్ దేశం వ్యవస్థాగత సవాలు విసురుతుందని మేము గుర్తించాం. ఇది తీవ్రతరమవుతూ.. మరింత నిరంకుశత్వం వైపు మళ్లుతోంది’ అని అన్నారు. కోవిడ్ ఆంక్షలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను కవర్ చేస్తున్న బీబీసీ జర్నలిస్ట్‌ను చైనా పోలీసులు అరెస్ట్ చేసి దాడి చేసిన ఘటనను ఖండిస్తూ రిషి సునాక్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆర్థిక స్థిరత్వం, వాతావరణ మార్పు వంటి ప్రపంచ వ్యవహారాల్లో చైనా అందించిన ప్రాముఖ్యతను మరచిపోలేదని రిషి సునాక్ తెలిపారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్‌తోపాటు అనేక ఇతర దేశాలు కూడా దీనిని అర్థం చేసుకున్నాయని అన్నారు. అలాగే ఉక్రెయిన్‌కు గత ప్రధానులు బోరిస్, ట్రస్ అందించిన మద్దతును కొనసాగిస్తామని తెలిపారు. వచ్చే ఏడాది ఉక్రెయిన్‌కు సైనిక, మానవతా సాయాన్ని అందిస్తామని పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ మిత్రదేశాలతో వాణిజ్యం, భద్రతా సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. చదవండి: మంకీపాక్స్ పేరు మార్చిన డబ్ల్యూహెచ్ఓ.. ఇకపై ఇలానే పిలవాలి..! కాగా రిషి సునాక్ చైనాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదేం తొలిసారి కాదు. ప్రధాని రేసులో ఉన్న సమయంలో కూడా బ్రిటన్‌తోపాటు ప్రపంచ భద్రతకు చైనా అతిపెద్ద ముప్పుగా పరిణమించిందంటూ విమర్శలు గుప్పించారు. అమెరికా నుంచి భారత్ వరకు ఎన్నో దేశాలను చైనా లక్క్ష్యంగా చేసుకుందనడానికి తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. బ్రిటన్ ప్రధానిగా తాను ఎన్నికైతే డ్రాగన్ దేశం నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎన్నో ప్రణాళికలు తన దగ్గర ఉన్నాయన్నారు. చైనా సాంకేతిక దూకుడుకు ముక్కుతాడు వేసేందుకు నాటో మాదిరి సరికొత్త మిలటరీ వ్యవస్థను రూపొందిస్తానని తెలిపారు ‘జీరో కోవిడ్’ పేరుతో చైనా నాయకత్వం అమలు చేస్తున్న కఠిన ఆంక్షలను ఆ దేశ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. చైనాలోని పెద్దపెద్ద నగరాలు, యూనివర్సిటీలలో నిరసనలు చెలరేగుతున్నాయి. షాంఘైలో నిరసనకు దిగిన కొందరు, ‘షీ జిన్‌పింగ్ దిగిపోవాలి’ అంటూ నినాదాలు చేస్తున్నారు. చైనాలో కోవిడ్ ఆంక్షలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనలను కవర్ చేస్తున్న సమయంలో బీబీసీ జర్నలిస్టు ఒకరిని పోలీసులు అరెస్టు చేసి కస్టడిలో ఆమెపై దాడి చేసినట్లు తెలిసింది. బీబీజీ ప్రతినిధిపై దాడి ఘటన తీవ్రంగా కలవరపరిచిందని యూకే విదేశాంగ కార్యదర్శి జేమ్స్ క్లెవర్లీ అన్నారు. చదవండి: రిషి తోటలో రూ.12 కోట్ల శిల్పం.. వివాదాస్పదంగా ప్రధాని అధికార నివాసం -
ఉగ్రవాదంపై మోదీ వ్యాఖ్యలు...పాక్, చైనాకు ఊహించని ఝలక్
No Money for Terror: పాక్ చైనాలను ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని అంతర్జాతీయ మంత్రివర్గ సమావేశంలో ఉగ్రవాద వ్యతిరేక ఫైనాన్సింగ్(నో మనీ ఫర్ టెర్రర్)పై మాట్లాడుతూ...."కొన్ని దేశాలు తమ విదేశాంగ విధానంలో భాగంగా ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నాయి. మరికొన్ని దేశాలు ఉగ్రవాద వ్యతిరేక చర్యలను అడ్డుకుంటూ పరోక్షంగా మద్దుతిస్తున్నాయి. ఉగ్రవాదం పట్ల సానుభూతి చూపే సంస్థలు, వ్యక్తులను ఒంటరిని చేయాలి. ఇలాంటి విషయాల్లో క్షమాగుణం చూపకూడదు. అన్ని రకాల ఉగ్రవాదాన్ని వ్యతిరేకించేలా ప్రంపంచం ఏకం కావాలి. ఈ సందర్భంగా లష్కరే తోయిబా(ఎల్ఈటీ) చీఫ్ హఫీజ్ సయీద్‌తో సహా ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు యత్నించిన అంతర్జాతీయ ప్రయత్నాలను చైనా ఎలా విఫలం చేసిందో ప్రస్తావించారు. ఉగ్రవాద సంబంధ కార్యకలాపాలను అరికట్టేందుకు నిధులను నిలిపేయాలి. టెర్రర్ ఫైనాన్సింగ్‌పై దాడి చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అంతేగాదు టెర్రర్ ఫైనాన్సింగ్ కోసం కొత్తరకాల టెక్నాలజీలను వినియోగిస్తున్నారు. అలాగే మనీలాండరింగ్, ఆర్థిక నేరాలు వంటి కార్యకలాపాలు టెర్రర్ ఫండింగ్‌కి సహయపడతాయని తెలుస్తోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో యూఎన్ఎస్సీ, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఎఫ్‌ఏలీఎఫ్) వంటి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సాయం చేస్తున్నాయి. ఉగ్రవాదానికి సంబంధించిన ఒక్క దాడి జరిగిన, ఒక్క ప్రాణం పోయినా సహించం, నిర్మూలించేంత వరకు వదిలిపెట్టం. కాశ్మీర్ తరుచుగా ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటుందని, పరిష్కరించడం అత్యంత ముఖ్యమని చెప్పారు. యావత్తు ప్రపంచం ఉగ్రవాదాన్ని తీవ్రంగా పరిగణించక ముందే భారదత్ తీవ్ర భయాందోళనలు ఎదుర్కొందన్నారు. ఎన్నో దశాబ్దాలుగా వివిధ రూపాల్లో ఉగ్రవాదం భారత్‌ని దెబ్బతీయాలని చూసిన తాము ధైర్యంగా పోరాడం" అని చెప్పారు. ఈ క్రమంలో సదస్సును ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ...ఉగ్రవాదం కంటే ఉగ్రవాదానికి ఆర్థిక సాయం చేయడమే అత్యంత ప్రమాదకరమని అన్నారు. ఉగ్రవాదాలను తమ హింసను నిర్వహించేందుకు... యువతను రిక్రూట్ చేసుకోవడం, ఆర్థిక వనరులను పెంచుకోవడం తదితరాల ఎప్పటికప్పుడూ కొత్త మార్గాలను అన్వేషిస్తారన్నారు. ఉగ్రవాదుల తమ ఉనికిని దాచేలా డార్క్‌నెట్‌ని వినియోగిస్తున్నారని జాగుకతతో ఉండాలని సూచించారు. (చదవండి: వీడియో: నెహ్రూ మునిమనవడి వెంట గాంధీ మునిమనవడు.. వైరల్) -
ప్రధాని మోదీపై పుతిన్ ప్రశంసల జల్లు
-
పాకిస్తాన్‌పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు... ఆ దేశాలతో ముప్పు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అణ్వాయుధాల సమన్వయం లేని పాకిస్తాన్‌ని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో ఒకటిగా అభివర్ణించారు. ఈ మేరకు బైడెన్ లాస్ ఏంజిల్స్‌లో జరిగిన డెమోక్రటిక్ కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ రిసెప్షన్ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా రష్యా తీరుపై కూడా విమర్శలు కురింపించారు. బైడెన్ చైనా, రష్యాలతో గల యూసెస్ విదేశాంగ పాలసీ విధానం గురించి చెబుతూ పాకిస్తాన్‌పై ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాదు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కి తనకు కావల్సిన దానిపై పూర్తి క్లారిటీ ఉందని, కానీ పలు వివాదాలను ఎదుర్కొంటున్నాడని అన్నారు. ఈ 21వ శతాబ్దంలో రెండో త్రైమాసికంలో అమెరికాను మరింత శక్తివంతంగా మార్చేందుకు పలు అపారమైన అవకాశాలు ఉన్నాయని నమ్మకంగా చెప్పారు. ఈ మేరకు అమెరికా జాతీయ భద్రతా వ్యూహాం విదేశాంగ పాలసీ సంబంధించిన కీలక పత్రాలను విడుదల చేసింది. ఐతే అమెరికా విడుదల చేసిన 48 పేజీల ఈ డాక్యుమెంట్లలో పాకిస్తాన్‌కి సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదు. ఆ డాక్యుమెంట్లో... హద్దులేని భాగస్వామ్యంతో చైనా, రష్యాలు కలిసిపోతున్నాయని హెచ్చరించారు. ఆ రెండు దేశాలు విసిరే సవాళ్లు చాలా విభిన్నంగా ఉన్నాయన్నారు. ఈ రెండు దేశాలతో యూఎస్‌కి ఎదురయ్యే ముప్పు గురించి నొక్కి చెప్పారు. రష్యా ఆగడాలకు అడ్డుకట్టవేస్తూ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాపై శాశ్వతమైన పోటీని కొనసాగించేందుకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ముఖ్యంగా ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో చైనాతో పోటీ ఎక్కువగా ఉంటుందని, ప్రపంచవ్యాప్తంగా కూడా పెరిగే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. (చదవండి: 'నాటో యుద్ధానికి దిగితే ప్రపంచ విపత్తు తప్పదు': పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్) -
భారత్‌పై మరోమారు ఇమ్రాన్ ప్రశంసలు.. ‘జైశంకర్’ వీడియో ప్రదర్శన!
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్‌పై ప్రశంసలు కురిపించారు. ఏ దేశం ఒత్తిడికీ లొంగకుండా భారత విదేశాంగ విధానం స్వతంత్రంగా ఉందంటూ కొనియాడారు. రష్యా నుంచి చమురు కొనుగోలుతో భారత్‌పై పశ్చిమ దేశాలు విమర్శించటాన్ని తప్పుపడుతూ ఈ మేరకు భారత విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు. లాహోర్ జాతీయ హాకీ మైదానంలో శనివారం అర్ధరాత్రి బహిరంగ సభలో మాట్లాడారు ఇమ్రాన్ ఖాన్. అమెరికా ఒత్తిడి ఉన్నా రష్యా నుంచి తక్కువ ధరకు భారత్ చమురు కొనుగోలు చేసిందన్నారు. ‘భారత్, పాకిస్థాన్ ఒకేసారి స్వాతంత్య్రం పొందాయి. విదేశాంగ విధానం విషయంలో భారత్ ప్రజానుకూల నిర్ణయాలు తీసుకుంటోంది. ఐరోపా దేశాలు రష్యా నుంచి గ్యాస్‌ను కొనుగోలు చేస్తున్నాయి. భారత ప్రజల కోసం తామూ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే తప్పేంటని ఆ దేశ విదేశాంగ మంత్రి ప్రశ్నించారు.’ అని పేర్కొన్నారు ఇమ్రాన్ ఖాన్. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జేశంకర్ ప్రశ్నించిన వీడియోను సభలో ప్రదర్శించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో అమెరికా ఒత్తిడికి పాకిస్థాన్ ప్రభుత్వం లొంగిపోతోందని విమర్శించారు. Former Pak PM Imran Khan plays out video clip of India's foreign minister Dr S Jaishankar during his mega Lahore Rally on Saturday, pointing out his remarks how India is buying Russian oil despite western pressure. Says, 'yeh hoti hai Azad Haqumat' pic.twitter.com/tsSiFLteIv — Sidhant Sibal (@sidhant) August 14, 2022 ఇదీ చదవండి: తైవాన్‌లో అమెరికా బృందం పర్యటనపై చైనా ఆగ్రహం -
భారత్‌పై మరోసారి పొగడ్తల వర్షం కురిపించిన ఇమ్రాన్‌ఖాన్
ఇస్లామాబాద్: భారత్‌పై మరోసారి ప్రశంసలు జల్లు కురిపించాడు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఒకవైపు పశ్చిమ దేశాలు రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై వస్తున్న విమర్శలను ఖండిస్తూ... పాక్ మాజీ ప్రధాని భారత్ అనుసరిస్తున్న విదేశాంగ విధానాలపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మేరకు లాహోర్‌లోని భారీ సభను ఉద్దేశిస్తూ... భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ రష్యా చమురు కొనుగోలు విషయమై స్లోవేకియాలో జరిగిన బ్రాటిస్లావా ఫోరమ్‌లో జూన్ 3న మాట్లాడిన వీడియో క్లిప్‌ని ప్లే చేశాడు. రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేయడం విషయంపై భారత్‌పై అమెరికా ఒత్తిడి పెరిగింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ పై యుద్ధం చేసేలా రష్యాకు నిధులు చేకూరుస్తున్నారంటూ అమెరికా దాని మిత్ర దేశాలై పశ్చిమ దేశాలు పెద్దఎత్తున్న భారత్‌పై ఆరోపణలు చేశాయి. ఆ సమయంలో విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రజలకు కావల్సినంత మేర గ్యాస్ కొంటాం అని స్పష్టం చేశారు. యూరప్ దేశాలు రష్యా నుంచి గ్యాస్ దిగుమతి చేసుకుంటుండగా కేవలం భారత్‌నే ఎందుకు ప్రశ్నిస్తున్నారని అడిగారు. మరోవైపు రష్యా ఉక్రెయిన్ పై దాడికి దిగడానిన భారత్ ఖండిస్తుందని ఇరుదేశాలు సామరస్య పూర్వకంగా సమస్యలు పరిష్కరించుకునే దిశగా తమ వంతు సాయం అందిస్తామని కూడా భారత్ చెప్పిన విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తావించారు. భారత్-పాకిస్తాన్ ఒకే సమయంలో స్వాతంత్య్రాన్ని పొందాయి. కానీ తమ ప్రజలకు అనుగుణంగా భారత్ విదేశాంగ విధానాన్ని రూపొందించిందని ప్రశంసించారు. అంతేకాదు రష్యా చమురు కొనుగోలు విషయంలో భారత్ పై వస్తున్న విమర్శలను ఖండించడమే కాకుండా న్యూఢిల్లీ అమెరికా ఒత్తిడికి తలవొంచకుండా తీసుకున్న దృఢమైన వైఖరిని ఎంతగానో మెచ్చుకున్నారు. పైగా భారత్ అమెరికా వ్యూహాత్మక మిత్రదేశమని కూడా అన్నారు. కానీ పాక్.. భారత్‌లా చెప్పలేదు. పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అమెరికా ఒత్తిడికి నో చెప్పే ధైర్యం చేయలేకపోయింది. పైగా ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి, ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారని వివరణ ఇచ్చుకోలేక పోయింది. అంతేకాదు ఇమ్రాన్ ఖాన్ మరో విషయం గురించి ప్రస్తావిస్తూ... కేవలం భారత్ చౌకగా రష్యా చమురు కొనుగోలుతో యుద్ధానికి నిధులు సమకూరుస్తే మరీ యూరప్ దేశాలు కూడా రష్య చమురు కొనుగోలు చేస్తున్నాయి కదా మరీ అవి కూడా యుద్ధానికి నిధులు సమకూర్చినట్లేనా! ఒక్కసారి ఆలోచించండి అని భారత్‌కి మద్ధతుగా మాట్లాడారు. ( చదవండి: మా చేతులు కట్టేసినట్లు ఉండేది.. ప్రతి చోట బెదిరింపులే: ఇమ్రాన్ ఖాన్) -
చైనా దోస్తీ వల్లే నాకీ పరిస్థితి: ఇమ్రాన్ ఖాన్
చైనాతో పాక్ వాణిజ్య బంధం కొనసాగాలన్న తన ఉద్దేశం వల్లే ప్రధాని పీఠం నుంచి దించేశారని ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రధాని పదవి నుంచి వైదొలిగిన తర్వాత.. లాహోర్‌లో నిర్వహించిన ఓ భారీ బహిరంగసభలో ఖాన్ మాట్లాడారు. పనిలో పనిగా.. భారత్ విదేశాంగ విధానాన్ని పాకిస్థాన్ మరోసారి కీర్తిస్తూనే.. సొంత దేశం రాజకీయాలపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత్ తన ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తుందన్నారు. ఇతర దేశాలకు ప్రయోజనం చేకూర్చే ముందు తన సొంత ప్రయోజనాల గురించి భారత్ ఆలోచించుకుంటుంది. కానీ, పాక్‌లో అలాంటి పరిస్థితులు లేకపోవడం వల్లే ప్రస్తుత సంక్షోభం నడుస్తోందని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించారు. భారత్ అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామి. అయినా రష్యా నుంచి చమురు తీసుకుంటోంది. చమురు కొనుగోలు చేయవద్దంటూ భారత్‌కు అమెరికా సూచించినప్పుడు.. ‘మా దేశానికి ఏది మంచో ఆ కోణంలోనే నిర్ణయం తీసుకుంటాం’ అని సూటిగా చెప్పేసింది. భారత్ విదేశాంగ విధానం అనేది తన సొంత ప్రజల కోసం. కానీ, మన విదేశాంగ విధానం ఇతరులకు మేలు చేసేదిగా ఉండాలని కొందరు కోరుకుంటున్నారు. చైనాతో మన స్నేహాన్ని వారు(తన రాజకీయ ప్రత్యర్థులు) సైతం ఇష్టపడడం లేదు. అప్పుడే కుట్ర (తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా) మొదలైంది’’ అని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు చేశారు. విదేశీ శక్తులకు కూడా చైనాతో వ్యాపారవాణిజ్యాలు నేను మెరుగుపర్చుకోవడం ఇష్టం లేదు. అందుకే ప్లాన్‌తో కుట్రకు తెర లేపారు. కానీ, ఇక్కడి ప్రతిపక్షాల సహకారం లేనిదే అది జరుగుతుందా?. అలా తనను పదవి నుంచి దించేయడంపై తన చైనా దోస్తీ ఓ కారణమైందని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. రష్యా పర్యటన సమర్థన ఇక ప్రధాని హోదాలో తాను రష్యా పర్యటన చేయడం విదేశీ శక్తులకు నచ్చలేదన్న ఇమ్రాన్ ఖాన్.. ఆ పర్యటనను సమర్థించుకున్నారు. తాను రష్యాకు వెళ్లింది 30 శాతం డిస్కౌంట్‌తో చమురు కొనుగోలుకేనని, పాక్ ద్రవ్యోల్బణం నియంత్రణకే తాను ప్రయత్నించానని కామెంట్లు చేశాడు. అయితే.. తన స్వతంత్ర విదేశాంగ విధానమే తనకు శాపంగా మారిందని, అది విదేశీ శక్తులకు నచ్చలేదని, కానీ, అలాంటి విదేశాంగ విధానంతోనే భారత్ ముందుకెళ్లడం గొప్పదనమని పేర్కొన్నాడు ఇమ్రాన్ ఖాన్. చదవండి👉🏾: కానుకల కక్కుర్తిపై ఇమ్రాన్ ఖాన్ స్పందన ఇది -
జైశంకర్‌ను ఆకాశానికెత్తిన రష్యా విదేశాంగ మంత్రి
భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌ను.. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆకాశానికెత్తారు. నిజమైన దేశభక్తుడంటూ జైశంకర్‌ను అభివర్ణించారాయన. ప్రపంచలో ఎక్కడా లేని విధంగా భారత్ సొంత విదేశాంగ విధానాన్ని అవలంభిస్తోందని.. చాకచక్యంగా దౌత్యం నడిపించడంలో జైశంకర్ ముందుంటున్నారంటూ పేర్కొన్నారు సెర్గీ లావ్రోవ్. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో.. రష్యా నుంచి దిగుమతులను తగ్గించుకోవాలంటూ ఒత్తిళ్లు, కొన్ని సవాళ్లు ఎదురైనా భారత్ మాత్రం తన సొంత విదేశాంగ విధానంతో కీలక నిర్ణయం తీసుకోగలిగింది. ఈ వ్యవహారంలో భారత విదేశాంగ వ్వవహారాల మంత్రి జైశంకర్ వ్యవహరించిన తీరు హర్షణీయం. అందుకే ఆయన అతని దేశానికి నిజమైన దేశభక్తుడు అంటూ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆకాశానికి ఎత్తాడు. జైశంకర్ అనుభవజ్ఞుడైన దౌత్యవేత్త, నిజమైన దేశభక్తుడు. దేశ భద్రత కోసం, అభివృద్ధికి అవసరమని భారత్ ఏదైతే విశ్వసిస్తుందో.. మేం కూడా ఆ (భారత్) మార్గంలోనే వెళ్లాలనుకుంటున్నాం. పైగా చాలా దేశాలు భారత్‌లా వ్యవహరించలేవు కూడా అని పేర్కొన్నారు. రష్యాపై ఆంక్షల నేపథ్యంలో భారత్ కొనసాగించిన లావాదేవీలపై అమెరికా అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. విదేశాంగ మంత్రి జైశంకర్ బదులు ఇచ్చారు. ముందు ఈయూ సంగతి చూడాలని, వాళ్లతో పోలిస్తే తాము(భారత్) చేసుకుంటున్న దిగుమతుల మోతాదు చాలా తక్కువేనని, పైగా మానవ హక్కుల ఉల్లంఘన విషయంలోనూ అమెరికా లేవనెత్తిన అభ్యంతరాలకు గట్టి కౌంటరే ఇచ్చారాయన. ఈ నేపథ్యంలో.. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్యా విదేశాంగ మంత్రి పై వ్యాఖ్యలు చేశారు. -
ఇమ్రాన్ ఖాన్ టంగ్ స్లిప్.. ఖండించిన అమెరికా
తనను గద్దెదింపేందుకు జరుగుతున్న రాజకీయ కుట్ర వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలకు భారీగా డబ్బు ఎరవేసి ఆ దేశం ఈ పని చేయిస్తోందంటూ ఖాన్, అతని అనుచర గణం.. అవిశ్వాసం దరిమిలా పదే పదే రీల్ వేస్తున్నాయి. ఈ తరుణంలో.. తాజాగా నేరుగా అగ్రరాజ్యం అమెరికా మీదే ఖాన్ విమర్శ చేశాడు. ఈ నేపథ్యంలో అమెరికా స్పందించింది. ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న ఆరోపణల్లో అర్థం లేదని వైట్‌హౌజ్ ఉన్నతాధికారి కేట్ బెడింగ్‌ఫీల్డ్ వ్యాఖ్యానించారు. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తనను అధికారం నుంచి దింపేయాలని అమెరికా ప్రయత్నిస్తోందంటూ ఇమ్రాన్ ఖాన్ చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు. పాక్ రాజ్యాంగం, చట్టాలపై మాకు గౌరవం ఉంది. జోక్యం చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు మేం పరిశీలిస్తున్నాం’’ అంటూ ప్రకటనను ఆమె మీడియాకు చదివి వినిపించారు. అంతకు మించి స్పందించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారామె. ఇదిలా ఉండగా.. గురువారం సాయంత్రం ఓ జాతీయ టీవీ ఛానెల్లో ఇమ్రాన్ ఖాన్ సుదీర్ఘ ప్రసంగం ప్రసారం అయ్యింది. ఈ సందర్భంగా తనను గద్దె దించేందుకు కారణం తన స్వతంత్ర్య విదేశాంగ విధానమే అని పేర్కొన్న ఖాన్.. ఉక్రెయిన్ ఉద్రిక్తల సమయంలో మాస్కోలో పర్యటించడం నచ్చకనే సదరు దేశం తనను గద్దె దించాలని కుట్ర చేసిందని ఆరోపించాడు. అయితే గంటపాటు సాగిన ప్రసంగంలో దాదాపుగా అమెరికా పేరు తీయకుండా మాట్లాడిన ఆయన.. మధ్యలో మాత్రం ఒకసారి నోరు జారి అమెరికా అని స్పష్టంగా పేర్కొన్నాడు. ఈ తరుణంలోనే అమెరికా స్పందించింది. ఇక భారీగా మిలిటరీ, ఆర్థిక సాయం పాకిస్థాన్‌కు అందించినప్పటికీ.. తనను మాత్రం పట్టించుకోకపోవడంతోనే ఇమ్రాన్ ఖాన్, అమెరికాను ఒక విలన్‌గా చూస్తూ వస్తున్నాడు. అయితే అమెరికా మాత్రం పాక్ రాజకీయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తోంది. -
పందికొక్కులు పాక్‌ను దోచుకుతింటున్నాయి: ఇమ్రాన్‌ఖాన్
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం పాక్ అసెంబ్లీలో ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొబోతోంది. కాగా, ఇప్పటికే ఇమ్రాన్‌కు సొంత పార్టీ ఎంపీలు, మిత్రపక్షాల నేతలు కీలక సమయంలో హ్యాండ్ ఇచ్చారు. అయితే, అవిశ్వాసం నేపథ్యంలో ఆదివారం ఇస్లామాబాద్‌లో ఇమ్రాన్‌ఖాన్ భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో వేలాది మంది మద్దతుదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. దేశంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు విదేశీ శక్తుల ప్రమేయం ఉందన్నారు. విదేశీ శక్తుల డబ్బుతో ఇక్కడి రాజకీయ నాయకులనే వినియోగించి పాక్ విదేశాంగ విధానాన్నే మార్చాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇందుకు సాక్ష్యంగా తన వద్ద ఓ లేఖ ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశాల నుంచి వచ్చే డబ్బుతోనే పాక్‌లో ప్రభుత్వాన్ని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఆ డబ్బు అందుకున్న నాయకులు విదేశీ ఖాతాలకు డబ్బు బదీలీ చేస్తున్నారు. నా ప్రభుత్వం కొనసాగినా, పడిపోయినా.. తాను ప్రాణాలతో ఉన్నా లేకున్నా అలాంటి దేశదోహ్రులను విడిచిపెట్టాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ముగ్గురు తొత్తులు దేశాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. గత 30 ఏళ్లుగా మూడు పందికొక్కులు దేశాన్ని దోచుకుంటున్నాయని పాక్ మాజీ ప్రధానులపై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు గుప్పించారు. వైట్‌కాలర్ నేరగాళ్ల కారణంగా పాకిస్థాన్ ఇంకా పేదరికంలోనే ఉందని ఇమ్రాన్‌ఖాన్ పేర్కొన్నారు. ముషారఫ్ లాగా ఇమ్రాన్ ఖాన్ కూడా లొంగిపోవాలని ఈ డ్రామా అంతా చేస్తున్నారని విమర్శించారు. వారు తమ ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. మరోవైపు ఈ ర్యాలీపై పాక్ ప్రతిపక్ష పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) నేతలు.. ఇమ్రాన్‌ఖాన్ అవిశ్వాస తీర్మానం నుంచి తప్పించుకునేందుకు ఇస్లామాబాద్ వీధుల్లో రక్తపాతం చేయడానికి కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. Asad Umar: It looks like we will come with 2/3 majority next time Faisal Javed Khan: Unbelievable scenes today Testimonials by @Asad_Umar and @FaisalJavedKhan after seeing the Epic Jalsa Crowd from the main stage! #IamImranKhan pic.twitter.com/14Lbg9mCIp — PTI (@PTIofficial) March 27, 2022 -
ఉక్రెయిన్-రష్యా వివాదం: సంయమనం పాటించాలని పిలుపునిచ్చిన తాలిబన్లు!
Russia Ukraine conflict through “peaceful means: అఫ్గనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై ఒక ప్రకటన విడుదల చేసింది.ఈ మేరకు ఇరుదేశాలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. శాంతియుత చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరింది. ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గనిస్తాన్ ఉక్రెయిన్‌లో పరిస్థితిని నిశితంగా పరిశీలించడమే కాక పౌరుల ప్రాణ నష్టం పై ఆందోళన వ్యక్తం చేసింది. హింసను తీవ్రతరం చేసే విధానాలను ఇరు పక్షాలు మానుకోవాలని సూచించింది. అంతేకాదు అఫ్గాన్ తటస్థ విదేశాంగ విధానానికి అనుగుణంగా ఉందని అఫ్గాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది నెలరోజుల క్రితం అఫ్గాన్ రాజధాని కాబూల్‌లో ఇస్లామిక్ మిలిటెంట్లు ఇదే విధమైన సైనిక దాడిని ఉపసంహరించుకుని అధికారాన్ని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు 20 ఏళ్ల తర్వాత అమెరికా సైన్యం ఉపసంహరించుకోవడంతో అష్రఫ్ ఘనీ ఎన్నికైన ప్రభుత్వం పడిపోయిన నేపథ్యంలో గత ఏడాది ఆగస్టు 15న అఫ్గాన్ అధ్యక్ష భవనాన్ని తాలిబాన్ స్వాధీనం చేసుకున్నారు. Statement concerning crisis in #Ukraine pic.twitter.com/Ck17sMrAWy — Abdul Qahar Balkhi (@QaharBalkhi) February 25, 2022 (చదవండి: రష్యా మిలటరీ కాన్వాయ్కి అడ్డుగా నిలుచుని ఆపేందుకు యత్నం!) -
రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సమర్థించడం లేదు: అమెరికా
వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత్‌లో ఎన్డీయే ప్రభుత్వ విదేశాంగ విధానాలు, నిర్ణయాలపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేసిన తాజా వ్యాఖ్యలను తాము సమర్థించబోమని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ అన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగానే భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్–చైనా ఒక్కటయ్యాయంటూ రాహుల్ గాంధీ లోక్‌సభలో ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. పాక్–చైనా బంధంపై మాట్లాడే విషయాన్ని ఆయా దేశాల ప్రజలకే వదిలేద్దామని నెడ్ ప్రైస్ పేర్కొన్నారు. అమెరికా, చైనాలలో స్నేహం కోసం దేన్ని ఎంచుకోవాలన్నది ప్రపంచ దేశాల ఇష్టమని చెప్పారు. దేశానికి రాజా అనుకుంటున్నారు... లోక్‌సభలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై అధికార బీజేపీ మాటల దాడి కొనసాగిస్తోంది. ఆయన భారతదేశానికి ఇన్నాళ్లూ యువరాజులాగా ప్రవర్తిం చేవారని, తప్పుడు రాజును అనుకుంటున్నారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు గురువారం ఎద్దేవా చేశా రు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులను అణచివేయడం, ఆర్టికల్ 370ని రద్దు చేయడం రాహుల్ గాంధీ దృష్టిలో తప్పేనా? అని బీజేపీ అధికార ప్రతినిధి, బిహార్ మంత్రి షానవాజ్ హుస్సేన్ నిలదీశారు. నిజాలే మాట్లాడారన్న కాంగ్రెస్ రెండు భారతదేశాలు అంటూ పార్లమెంట్లో ప్రసంగించిన రాహుల్ గాంధీని పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు సమర్థించారు. దేశానికి రెండు ముఖాలు ఉన్నాయని, ఒకటి ధనికం కాగా, మరొకటి నిరుపేద అని సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. రెండింటి మధ్య అంతరాన్ని పూడ్చడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మాత్రమే రాహుల్ విమర్శించారని గుర్తుచేశారు. ప్రభుత్వ తప్పిదాలను బయటపెట్టాల్సిన బాధ్యత ప్రతిపక్షంపై ఉందని పేర్కొన్నారు. రాహుల్ నిజాలే మాట్లాడారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాథే స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, రాహుల్ వ్యాఖ్యలను విదేశాంగ శాఖ మాజీ మంత్రి నట్వర్ సింగ్ ఖండించారు. సభా హక్కుల నోటీసు పార్లమెంట్ సభ్యులను, దేశ ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే కాంగ్రెస్ నేత రాహుల్ గాం ధీకి వ్యతిరేకంగా సభా హక్కుల ఉల్లంఘన నోటీసును లోక్‌సభ సెక్రటేరియట్‌కు అందజేశారు. భావాలను, అభిప్రాయాలను స్వేచ్ఛ వెల్లడించే రాజ్యాంగబద్ధ హక్కు ప్రతి ఎంపీకి ఉన్నప్పటికీ ఈ విషయంలో మర్యాద పాటించాలని దూబే పేర్కొన్నారు. పార్లమెంట్ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడడం సరైంది కాదన్నారు. కేంద్రం, రాష్ట్రాలకు సంబంధించి రాహుల్ చేసి న వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. భారత్‌ను రాహుల్ ఒక దేశంగా పరిగణించకపోవడం బా ధాకరమని, రాహుల్ అసలు రాజ్యాంగ ప్రవేశికను చదివారా? అని ప్రశ్నించారు. ఆయన ప్రసంగంలోని కొన్ని భాగాలను తొలగించాలన్నారు. -
ఆధిపత్య చదరంగం
అధికారంలోకి వచ్చీ రాగానే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇంటా, బయటా మరమ్మతులు మొదలుపెట్టారు. ముఖ్యంగా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హయాంలో చతికిలబడిన విదేశాంగ విధానం దుమ్ము దులిపి దానికి జవసత్వాలిచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణమంత్రి లాయిడ్ ఆస్టిన్ మొదలుకొని జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులీవాన్ వరకూ అందరూ విదేశీ పర్యటనల్లో బిజీగా వుండటం ఇందుకు రుజువు. సుదీర్ఘకాలం పెండింగ్‌లో వున్న చతుర్భుజ కూటమి(క్వాడ్) శిఖరాగ్ర సమావేశం ఈనెల 12న జరిగింది. ఆన్లైన్లో జరిగిన ఈ సమావేశంలో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ అధినేతలు పాల్గొన్నారు. అది ప్రత్యేకించి చైనాను వ్యతిరేకించటానికి కాదని చెప్పినా ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనాకు వ్యతిరేకంగా అనుసరించాల్సిన ఆచరణాత్మక విధానాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. గత శుక్రవారం లాయిడ్ ఆస్టిన్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై ద్వైపాక్షిక అంశాలతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను కలిశారు. అంతక్రితం ఆయన జపాన్, ఉత్తర కొరియాల్లో కూడా పర్యటించారు. అమెరికా ఉన్నతాధికార బృందంతో చైనా ఉన్నత స్థాయి దౌత్యవేత్తలు గత వారం చివర చర్చలు జరిపారు. ఇందులో చర్చలకన్నా పరస్పర ఆరోపణలు, నిందలే ఎక్కువున్నాయి. హాంకాంగ్, తైవాన్లలో చైనా విపరీత పోకడలు, సైబర్‌దాడులు వగైరాల విషయంలో చైనాను గట్టిగా నిలదీశామని బ్లింకెన్ బాహాటంగానే చెప్పారు. అందుకు బదులు సైనిక బలగాలను ఉపయోగించి, ఆర్ధిక ఆంక్షలు విధించి వేరే దేశాలపై పెత్తనం చేస్తున్న అమెరికా వైఖరిని చైనా ఎత్తిచూపింది. అమెరికా చురుకుదనాన్ని చూసి రష్యా, చైనాలు సహజంగానే అప్రమత్తమయ్యాయి. రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లవ్రోవ్ చైనాలో సోమవారం రెండు రోజుల పర్యటన ప్రారంభించారు. డాలర్ ఆధిపత్యాన్ని ప్రతిఘటించి, అమెరికా ఆంక్షల బారినపడిన దేశాలకు అండగా నిలవాలని తొలిరోజు చర్చల్లో నిర్ణయించారు. వేరే దేశాల సంగతలావుంచి తమపై విధించిన ఆంక్షల గురించే చైనా ఆగ్రహమంతా. చైనాలోని వీగర్ ప్రాంతంలో ముస్లింలపట్ల అనుసరిస్తున్న అణచివేత చర్యలతో ప్రమేయం వున్న ఇద్దరు చైనా ఉన్నతాధికారులపై అమెరికా ఈ ఆంక్షలు ప్రకటించింది. వీగర్ ముస్లింలపై మారణహోమం అమలవుతున్నదని అమెరికా ఆరోపిస్తోంది. ఒకపక్క ఇండో–పసిఫిక్ ప్రాంతంలో తమకు వ్యతిరేకంగా అందరినీ కూడగడుతూ, మరోవైపు ఆంక్షల పేరిట పెత్తనం చలాయిస్తుండటం చైనాకు ఆగ్రహం కలిగిస్తోంది. అటు రష్యా సైతం ఈ మాదిరే కత్తులు నూరుతోంది. మొన్న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసి ట్రంప్‌కి సాయపడమని మరోసారి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలిచ్చారని అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ నివేదిక ఆరోపించింది. అయితే ఈసారి ఆ ఎత్తులు పారలేదని చెప్పింది. ఈ నివేదిక రష్యాకు ఆగ్రహం తెప్పిస్తోంది. క్రితంసారి సైతం డెమొక్రాటిక్ పార్టీ ఇలాంటి ఆరోపణే చేసి తన ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేసిందని అంటున్నది. ఈ నేపథ్యంలోనే చైనా, రష్యా చర్చలు మొదలెట్టాయి. డాలర్ ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు సాంకేతికతలను పెంచుకుని తమ తమ కరెన్సీల వినియోగాన్ని విస్తరించాలని అవి నిర్ణయించాయి. అంతర్జాతీయ చెల్లింపులకు వినియోగిస్తున్న ‘స్విఫ్ట్’ విధానానికి ప్రత్యామ్నాయాన్ని రూపొందించాలని తీర్మానించాయి. వాస్తవానికి ఆ రెండు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యంలో డాలర్ వాటా 2015తో పోలిస్తే గణనీయంగా తగ్గింది. అప్పట్లో డాలర్ మారకం 90 శాతం వరకూ వుంటే నిరుడు తొలి త్రైమాసికంలో అది 46 శాతానికి పడిపోయింది. మన దేశంతోపాటు బ్రెజిల్, చైనా, రష్యా, దక్షిణాఫ్రికాలు సభ్యదేశాలుగా వున్న బ్రిక్స్‌లో కూడా ద్రవ్య మారకానికి ఎవరికి వారు సొంత కరెన్సీలు వినియోగించాలని ఇప్పటికే చైనా, రష్యాలు ప్రతిపాదించాయి. చెప్పాలంటే అమెరికా మిత్ర శిబిరంలోని యూరప్ దేశాలు కూడా ఈ బాటే పట్టాయి. 2019లో ఇరాన్‌పై ట్రంప్ అమలు చేసిన ఆంక్షల్ని అధిగమించటానికి ఈయూ మారకమైన యూరోలో ఇరాన్‌కు చెల్లింపులు చేయటం మొదలుపెట్టాయి. డాలర్‌ని కాదని జరిపే చెల్లింపుల్లో ఎన్నో సంక్లిష్టమైన అంశాలు ఇమిడివున్నాయి. వాటిని అధిగమించటానికి ఇంకా సమయం పడుతుంది. ఇదంతా మరోసారి ఆధిపత్య పోటీ మొదలైన వైనాన్ని వెల్లడిస్తోంది. ఈ పోటీలో ఎవరి పక్షం వహించాలో ఏ దేశానికా దేశం నిర్ణయించుకోక తప్పని స్థితి త్వరలోనే రావొచ్చు. దాదాపు అయిదు దశాబ్దాలపాటు అమెరికా, పూర్వపు సోవియెట్ యూనియన్ల మధ్య సాగిన ప్రచ్ఛన్న యుద్ధం పర్యవసానంగా ప్రపంచం ఎన్నో చేదు అనుభవాలు చవిచూసింది. ఎవరికి వారు ఆయుధాలు పోగేసుకోవటం, కయ్యానికి కాలు దువ్వటం అనేక సందర్భాల్లో ఉద్రిక్తతలు సృష్టించింది. ఘర్షణలు రగిల్చింది. మరోమారు ఆ దిశగానే ప్రపంచం అడుగులు వేస్తున్న దృశ్యం కనబడుతోంది. అందరూ గుర్తించినంతకాలమే ఆధిపత్యం చెల్లుతుంది. ఎవరికి వారు దాన్ని బేఖాతరు చేయటం మొదలుపెడితే ఆ అధిపత్యం తొలుత అర్ధరహితమవుతుంది. ఆ తర్వాత కనుమరుగవుతుంది. కానీ ఆధిపత్యాన్ని వదులుకునే స్థితి ఏర్పడినప్పుడు అందుకు ప్రతి వ్యూహం కూడా వుంటుంది. అది ప్రపంచ యుద్ధంగా పరిణమించకుండా ప్రతి దేశమూ సంయమనంతో మెలగాలి. యుద్ధాలవల్ల మిగిలేది జన నష్టం, అపారవిధ్వంసమేనని గుర్తించాలి. -
విదేశాంగ విధానంపైనే గురి
అమెరికా నూతన అధ్యక్షుడిగా బైడెన్ నియామకంపై వివాదాలు సడలిపోతున్న నేపథ్యంలో బైడెన్ నిర్వహించే విదేశాంగ విధానం చర్చనీయాంశం అవుతోంది. మానవ హక్కులను ఉల్లంఘిస్తున్న చైనాతో తలపడాలంటే అమెరికా తన మిత్ర దేశాలన్నింటితో కలిసి ఐక్య సంఘటన కట్టాల్సి ఉంటుందన్న బైడెన్ అంతర్జాతీయ సమాజానికి బలమైన హామీని ఇచ్చారు. కమ్యూనిస్టు చైనాతో సహకార దృష్టిని కలిగి ఉంటూనే, చైనాపై అమెరికా కఠిన వైఖరి కొనసాగుతుందని బైడెన్ తేల్చి చెప్పారు. ట్రంప్ దౌత్య వ్యూహాల్లో కొన్నింట్లో సమూల మార్పులు చోటు చేసుకోవచ్చని అంచనా. అమెరికా కొత్త విదేశాంగ మంత్రిగా నియమితులైన ఆంటోనీ బ్లింకెన్ తాజా వ్యాఖ్యలతో అమెరికా–భారత్ సంబంధాలు సానుకూలంగా పరిగణించగలవనే ఆశలు రేకెత్తుతున్నాయి. గత కొన్ని వారాలుగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అతి పెద్ద ప్రజాస్వామ్య ఘటన అయిన అధ్యక్ష ఎన్నికను యావత్ ప్రపంచం పరిశీలిస్తూ వచ్చింది. ఎన్నికల ఫలితాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సవాళ్లు విసురుతున్నప్పటికీ, ఎన్నికల ఫలితం మాత్రం స్పష్టంగా తేలిపోయింది. జో బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడిగా అధికార బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో జో బైడెన్ తదుపరి నాలుగేళ్లకు నిర్దేశించుకునే విదేశీ విధాన దిశపై రాజకీయ చర్చలు మొదలయ్యాయి. బైడెన్ హయాంలో అమెరికా దౌత్యవిధానాన్ని పునర్నిర్మించవచ్చని ట్రంప్ పాలనాయంత్రాంగం నిర్దేశించిన దౌత్య వ్యూహాల్లో సమూల మార్పులు చోటు చేసుకోవచ్చని అంచనా. అయితే చైనాపై అమెరికన్ దృక్పథం మాత్రం మునుపటిలాగే కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ‘చైనాపై కానీ, మరే దేశంపై కానీ భవిష్యత్తులో చోటుచేసుకునే పోటీలో నెగ్గాలంటే అమెరికా తన సాంకేతిక విన్నాణాన్ని మరింత పదును చేసుకోవలసి ఉంటుంది, పైగా వనరులను దుర్వినియోగపరుస్తున్న చైనాను ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక వ్యవస్థలను సమైక్యపర్చాల్సిన అవసరం చాలానే ఉంది’ అంటూ ఎన్నికలకు ముందే అమెరికాలోని కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ ప్రచురిస్తున్న ఫారిన్ ఎఫైర్స్ పత్రికలో బైడెన్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. బైడెన్ ప్రకటన అంతర్జాతీయ సమాజానికి బలమైన హామీని ఇచ్చింది. ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి కొన్ని అంశాల్లో కమ్యూనిస్టు చైనాతో సహకార దృష్టిని కలిగి ఉంటామని చెప్పినప్పటికీ, చైనాపై అమెరికా కఠిన వైఖరి కొనసాగుతుందని బైడెన్ తేల్చి చెప్పారు. అయితే ట్రంప్‌లాగా ప్రత్యక్షంగా చైనాపై మాటలయుద్ధం మొదలుపెట్టి పరిస్థితిని మరింత క్షీణింపచేసేలాగా కాకుండా బైడెన్ కాస్త భిన్నంగా వ్యవహరించవచ్చని అంచనా. యూఎస్–చైనా సంబంధాలు.. ఆసియన్ చైనా అసాధారణ వృద్ధి పట్ల అమెరికా స్పందన ఇకపై ఒక ద్వైపాక్షిక సమస్యగా మాత్రం ఉండబోదు. ఇరుదేశాల మధ్య నడుస్తున్న ఘర్షణల్లో చాలా దేశాలు ఇప్పటికే పాలుపంచుకుంటున్నాయి. ప్రధానంగా 5జీ విషయంలో చైనా సాంకేతిక పురోగతిని యూరప్, తదితర దేశాలకు బూచిగా చూపిస్తూ వాటికి కూడా చైనా ప్రమాదకారేనని అమెరికా నచ్చచెప్పింది. దీంతో యూరప్ ఖండంలో చైనా టెలికమ్యూనికేషన్స్ దిగ్గజ సంస్థ హువై నేతృత్వంలో మొదలైన అనేక ప్రాజెక్టులు నిలిచిపోయాయి లేక పూర్తిగా రద్దయిపోయాయి. అమెరికా చైనా మధ్య సాగుతున్న భౌగోళిక రాజకీయసమరంలో ఆగ్నేయాసియా మరో యుద్ధరంగంగా మారిపోయింది. స్వేచ్ఛాయుత సముద్రయానంపై అమెరికా విధానానికి, దక్షిణ చైనా సముద్రంపై తనకున్న చారిత్రక హక్కులను బలంగా ప్రకటిస్తున్న చైనా విధానానికి మధ్య వివాదం అత్యంత స్పష్టమైన రూపానికి వచ్చి చేరింది. ఆసియన్ కూటమిలోని అనేక దేశాలు కూడా దక్షిణ చైనా సముద్రంపై తమ వారసత్వ హక్కును ప్రకటిస్తున్నందున ఈ ప్రత్యేక సమస్యపై పరిష్కారం కోసం ఆసియన్ కూటమి కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తమ సార్వభౌమాధికార హక్కులను పరిరక్షించుకునే విషయంలో ఆగ్నేయాసియా కూటమిలోని మిత్రదేశాలకు తన మద్దతు ఉంటుందని అమెరికా స్పష్టంగా ప్రకటించింది. పైగా, తన సార్వభౌమాధికారం అమలవుతున్న జలాల్లో చైనా చట్టవ్యతిరేక చర్యలపై ఇండోనేషియా చేపట్టిన చర్యలను అమెరికా స్వాగతించింది. అక్టోబర్ చివరలో జకార్తాను సందర్శించిన అమెరికా విదేశీమంత్రి మైక్ పాంపియో తమ వైఖరిని స్పష్టపరిచారు. అయితే అమెరికా చైనాల మధ్య పోటీలో పాలు పంచుకోబోమని ఇండోనేషియా విదేశీ మంత్రి రెట్నో మర్సుది మరింత స్పష్టంగా పేర్కొన్నారు. ఆసియన్ కూటమిలోని 10 సభ్యదేశాలు కూడా ఆసియన్ తటస్థ విధానాన్ని ప్రతిబింబిస్తూ ఇండోనేషియా అనుసరించిన విధానాన్నే ప్రతిధ్వనించాయి. ఏర్పడిన నాటినుంచి తటస్థ వైఖరి అనేది ఆసియన్ కూటమి మౌలిక విలువల్లో ఒకటిగా ఉంటోంది. ప్రస్తుతం రెండు ప్రధాన ఆర్థిక శక్తుల మధ్య శత్రు వాతావరణంలోనూ ఈ కూటమికి తటస్థ విధానమే మార్గదర్శకం వహిస్తోంది. అమెరికా–చైనా సంబంధాలపై ఇండోనేషియా వైఖరి ఇతర ఆసియన్ దేశాలకు కూడా నమూనాగా ఉపకరిస్తుంది. ప్రస్తుత ఘర్షణ వాతావరణంలో వాషింగ్టన్, బీజింగ్ ప్రభుత్వాలు రెండింటితోనూ ఐక్యతతో వ్యవహరిస్తూ మంచి సంబంధాలు నెలకొల్పుకోవడంపైనే ఆసియన్ కూటమి దృష్టి పెట్టాలి. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నికను స్వాగతి స్తూనే ఆసియన్ కూటమి తటస్థతా సూత్రాన్ని బలంగా నొక్కిచెప్పాల్సిన అవసరం ఉంది. బైడెన్ పాలనాకాలంలోనూ కొనసాగే చైనా– అమెరికన్ ఘర్షణ మధ్యలో ఇరుక్కునే పరిస్థితినుంచి ఆసియన్ దూరం జరగాలి. రెండు బలమైన శక్తుల మధ్య అధికార పోరాటం మధ్యలో తన ఉనికిని నిలబెట్టుకోవడం ఆసియన్ కూటమికి కొత్త విషయమేమీ కాదు. గతంలోకి వెళ్లి చూస్తే సోవియట్ యూనియన్–అమెరికా ప్రచ్ఛన్న యుద్ధకాలంలో కూడా తటస్థంగా ఉండటం ద్వారా అంతర్జాతీయ సమాజంలో కీలక విభజనకు దారి తీసే పరిస్థితులను ఆసియన్ కూటమి నిలువరించింది కూడా. ఈ విషయంలో ఆసియన్ కూటమి సాధించిన ఘనవిజయం, తన మూలాలకు కట్టుబడి ఉండటం అనేది అంతర్జాతీయ రాజకీయాల్లో అనూహ్యంగా వచ్చే పెనుతుపానులకు కూడా ఆసియన్ దేశాలు తట్టుకుని నిలబడేలా చేసింది. బైడెన్ పాలన.. భారత్ ప్రయోజనాలు అమెరికా విదేశీ మంత్రిగా బైడెన్ ఎంపిక చేసిన ఆంటోనీ బ్లింకెన్‌తో సంబంధబాంధవ్యాలను నెలకొల్పుకోవడంలో భారత్ అనుసరించే వైఖరి ఇరుదేశాల మధ్య ఒత్తిళ్లను తగ్గించి ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చేవిధంగా ఉండాలి. ఐసిస్‌తో పోరాటం, ఆసియాలో అధికార సమతుల్యతను పునర్నిర్మించడం, అంతర్జాతీయ శరణార్థుల సంక్షోభం వంటి అంశాల్లో బ్లింకెన్ గత మూడు దశాబ్దాలుగా కీలక స్థానాలను చేపట్టి అమెరికా దౌత్య కార్యాచరణకు స్థిరమైన మార్గం చూపారు. దాదాపు బైడెన్ ఆత్మగా వ్యవహరిస్తున్న బ్లింకెన్ వైఖరి, తాజాగా తాను చేస్తూ వస్తున్న వ్యాఖ్యలు.. భారత్–అమెరికా సంబంధాలు సానుకూలంగా పరిణమించగలవనే ఆశల్ని రేకెత్తిస్తున్నాయి. ఆచరణాత్మకవాది అయిన బ్లింకెన్ భారత్ పట్ల సానుకూల దృష్టితో వ్యవహరిస్తారని సౌత్ బ్లాక్‌లోని కేంద్ర ప్రభుత్వ అధికారులు ఆశాభావం వ్యక్తపరుస్తున్నప్పటికీ, డెమోక్రాటిక్ పార్టీలోని వామపక్షం మానవ హక్కుల పరిరక్షణపై ప్రదర్శిస్తున్న నిబద్ధత భారత్ వ్యతిరేక వైఖరిని ప్రతిబింబించవచ్చనే విషయాన్ని తప్పక దృష్టిలో ఉంచుకుని భారత పాలకులు పావులు కదపాలి. -రిఫ్కీ డెర్మవాన్, అండలాస్ యూనివర్సిటీ అధ్యాపకుడు, ఇండోనేషియా -
82 వేలు కాదు..6.4 లక్షలు!
న్యూఢిల్లీ: చైనా చెబుతున్నట్లు ఆ దేశంలో కరోనా కేసుల సంఖ్య కేవలం 82 వేలు కాదని, అది అంతకు 8 రెట్లు ఎక్కువని వెల్లడైంది. ఫిబ్రవరి మొదటి నుంచి ఏప్రిల్ చివరి వరకు సుమారు 6.40 లక్షల మంది చైనాలో కరోనా బారిన పడ్డారని తేలింది. చైనా మిలటరీకి చెందిన నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ నుంచి లీక్ అయిన సమాచారం మేరకు ‘ఫారిన్ పాలసీ మేగజీన్’, వాషింగ్టన్కు చెందిన ‘100 రిపోర్టర్స్’ఒక కథనాన్ని ప్రచురించాయి. ఆసుపత్రులు, అపార్ట్మెంట్స్ సహా చైనా వ్యాప్తంగా, సుమారు 230 నగరాల వారీగా అన్ని ప్రాంతాల్లో కేసుల విస్తృతికి సంబంధించిన పూర్తి వివరాలను టేబుల్ రూపంలో తమకు అందాయని అవి పేర్కొన్నాయి. భౌగోళికంగా, ఏ ప్రాంతంలో, ఏ సమయంలో ఎన్ని కేసులున్నాయనే విషయాన్ని ఆ కథనంలో సమగ్రంగా వివరించారు. కరోనా వైరస్‌ను మొదట గుర్తించిన హుబయి రాష్ట్రం, వుహాన్ ప్రాంతాల్లో కోలుకున్నవారి వివరాలను కూడా ఇందులో పొందుపర్చారు. పూర్తి వివరాలను భద్రత కారణాల రీత్యా ప్రజా బాహుళ్యానికి అందుబాటులో ఉంచడం లేదని, అయితే, వైరస్ వ్యాప్తిపై పరిశోధనలు చేస్తున్న వ్యక్తులు, సంస్థలకు అందజేసే దిశగా ప్రయత్నిస్తున్నామని ‘ఫారిన్ పాలసీ మేగజీన్’, ‘100 రిపోర్టర్స్’ ప్రకటించాయి. దీనిపై చైనా స్పందించలేదు. కానీ, ‘కరోనా విషయంలో విదేశీ మీడియా చైనాపై వివక్షాపూరితంగా వ్యవహరిస్తోంది’ అని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ వివరాలు పూర్తిస్థాయిలో నిజమా? కాదా? అనే విషయాలను పరిశీలించాల్సి ఉందని పలువురు స్వతంత్ర పరిశోధకులు పేర్కొన్నారు. ‘ఫారిన్ పాలసీ ఈ విషయాన్ని బయటపెట్టడం మంచిదే. అయితే, దీనిపై మరింత శోధన జరగాలి’ అని హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో పరిశోధనలు చేస్తున్న డాక్టర్ ఎరిక్ ఫీల్డింగ్ వ్యాఖ్యానించారు. చైనా ప్రకటించిన అధికారిక లెక్కల ప్రకారం ఆ దేశంలోని కరోనా కేసుల సంఖ్య 82,919. మరణాల సంఖ్య 4,633గా ఉంది. -
ప్రియాంకతో కాంగ్రెస్ నిధుల సమస్య తీరొచ్చు!
వాషింగ్టన్: ప్రియాంక గాంధీ వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ద్వారా ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందనేది ఇప్పటి వరకు స్పష్టం కానప్పటికీ.. ఆమె రంగప్రవేశంతో ఆ పార్టీ వనరులు, నిధుల లేమి నుంచి బయటపడే అవకాశముందని నిపుణులు అంటున్నారు. నిధుల విషయంలో అధికార బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ చాలా వెనుకబడి ఉందని వారు చెబుతున్నారు. ‘కాంగ్రెస్‌లో కొత్తగా ప్రచార బాధ్యతలు చేపట్టిన ప్రియాంక ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చు. కానీ, ఎన్నికల్లో గెలుపునకు అవసరమైన నిధుల కొరత తీర్చే అవకాశాలు మాత్రం ఉన్నాయి’ అని కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్‌కు చెందిన రాజకీయ విశ్లేషకుడు మిలన్ వైష్ణవ్ అంటున్నారు. ప్రఖ్యాత ‘ఫారిన్ పాలసీ’ మేగజైన్‌కు రాసిన తాజా వ్యాసంలో ఆయన ఈ విషయం పేర్కొన్నారు. ‘కాస్ట్స్ ఆఫ్ డెమోక్రసీ: పొలిటికల్ ఫైనాన్స్ ఇన్ ఇండియా’ పుస్తకం సహ రచయిత కూడా అయిన వైష్ణవ్.. ‘ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి నిధులు అందకపోవడంతో రాష్ట్ర విభాగాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. 2014 ఎన్నికల తర్వాత జరిగిన పలు ఎన్నికల్లో చాలా తక్కువ విజయాలు సాధించిన ఆ పార్టీ తీవ్ర నిరాశలో కూరుకుపోయి ఉంది. దేశ రాజకీయాలకు కీలక బిందువైన ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పట్టించుకోకుండా ముఖ్యమైన ఎస్పీ–బీఎస్పీ పార్టీల కూటమి ఏర్పడటం మరో దెబ్బ. ఎంతో కీలకమైన ఇలాంటి పరిస్థితుల్లో ప్రియాంక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 41 లోక్‌సభ సీట్లున్న తూర్పు ఉత్తరప్రదేశ్ ఇన్చార్జి బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం వచ్చింది. మిగతా పక్షాలతో కలిసి ఎన్నికల్లో బీజేపీపై పైచేయి సాధించటానికి ఆ పార్టీకి అవకాశం వచ్చింది. అయితే, శ్రేణుల్లో ఉత్తేజం నింపడం, మిత్రుల్ని సంపాదించుకోవడం మాత్రమే కాదు ఎన్నికల్లో గెలుపునకు డబ్బు ఎంతో కీలకం. ఆ పార్టీకి నిధుల కొరత ఉంది. ప్రియాంక రాకతో అది తీరే అవకాశం ఉంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు. -
ముకేశ్ అంబానీ మరో ఘనత
-
ముకేశ్ అంబానీ ‘గ్లోబల్ థింకర్’!
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ దిగ్గజం ముకేశ్ అంబానీ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. ఫారిన్ పాలసీ పబ్లికేషన్స్ 2019 ఏడాదికి సంబంధించి ప్రకటించిన 100 మంది ప్రపంచ అత్యుతమ ఆలోచనాపరుల (గ్లోబల్ థింకర్స్) జాబితాలో ముకేశ్ నిలిచారు. ఇంకా ఈ ర్యాంకింగ్స్‌లో అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టీన్ లగార్డ్ తదితరులున్నారు. మొత్తం 100 మందిలో కొన్ని పేర్లను మాత్రమే ప్రకటించిన ఫారిన్ పాలసీ... పూర్తి జాబితాను ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. ‘44.3 బిలియన్ డాలర్ల సంపదతో 2018లో జాక్ మాను వెనక్కినెట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఆసియాలోనే నంబర్ వన్ అపర కుబేరుడిగా అవతరించారు. ప్రధానంగా చమురు, గ్యాస్, రిటైల్ స్టోర్ల ద్వారా ఆయన ఈ స్థాయిలో సంపదను దక్కించుకున్నారు. అయితే, కొత్తగా ప్రారంభించిన రిలయన్స్ జియో ద్వారా ఆయన భారత్ ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులను తీసుకొచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఫేస్బుక్, గూగుల్‌లకు కూడా పోటీనిచ్చే సత్తా జియోకు ఉంది’ అని ఫారిన్ పాలసీ పేర్కొంది. కాగా, మొత్తం జాబితాను 10 విభాగాలుగా విభజించామని, అందులో ముకేశ్ అంబానీ... టాప్–10 టెక్నాలజీ థింకర్స్‌లో నిలిచినట్లు వెల్లడించింది. ఇంధనం, పర్యావరణానికి సంబంధించిన జాబితాలో ప్రముఖ రచయిత అమితవ్ ఘోష్‌కు కూడా చోటు లభించింది. -
‘స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్ విప్లవానికి తెరతీశారు’
ఆసియాలో అత్యంత ధనవంతుడిగా అవతరించి చరిత్ర సృష్టించిన భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ ఈ ఏడాది టాప్ 100 గ్లోబల్ థింకర్స్‌లో చోటు సంపాదించుకున్నారు. ఫారిన్ పాలసీ గ్లోబల్ మ్యాగజీన్ ప్రతిష్టాత్మకంగా ప్రచురించే ఈ జాబితాలో అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, ఐఎంఎఫ్ హెడ్ క్రిస్టీన్ లాగ్రడేలకు కూడా చోటు దక్కింది. ప్రస్తుతం టాప్ 100 గ్లోబల్ థింకర్స్‌లో కొంతమంది పేర్లను మాత్రమే ప్రచురించిన ఫారిన్ పాలసీ జనవరి 22 నాటికి పూర్తి జాబితాను వెల్లడించనుంది. ‘44. 3 బిలియన్ డాలర్ల సంపదతో ముఖేష్ అంబానీ.. జాక్ మాను వెనక్కి నెట్టి ఆసియాలో అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ఆయిల్, గ్యాస్, రిటైయిల్ రంగాల్లో తనదైన ముద్రవేసిన అంబానీ.. జియోతో భారత టెలికాం రంగంలో సంచనాలు నమోదు చేశారు. జియోను ప్రారంభించిన ఆరు నెలల్లోపే వంద మిలియన్ కస్టమర్లను ఆకర్షించి స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్ విప్లవానికి తెరతీశారు. ఇకపై డిజిటల్ ఎయిర్‌వేవ్స్ ద్వారా లైఫ్‌స్టైల్ ప్రాడక్ట్‌ను అమ్మి గూగుల్, ఫేస్‌బుక్‌లతో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు’ అని ఫారిన్ పాలసీ వెల్లడించింది. అంతేకాకుండా 2019తో గ్లోబల్ థింకర్స్ జాబితా ప్రచురణ పదేళ్ల వసంతంలోకి అడుగుపెడుతోందని ఫారిన్ పాలసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో గత పదేళ్లుగా వివిధ రంగాల్లో ప్రభావం చూపుతూ, క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తుల జాబితా ప్రకటిస్తున్నామని తెలిపింది. వంద మంది గ్లోబల్ థింకర్స్‌లో మొత్తం 10 కేటగిరీలు ఉంటాయని, ముఖేష్ అంబానీ టాప్ 10 టెక్నాలజీ థింకర్స్‌లో చోటు దక్కించుకున్నారని వెల్లడించింది.