ప్రధానిగా మన్మోహన్‌సింగ్ సాధించిన అతిపెద్ద విజయాల్లో అమెరికాతో కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందం ప్రత్యేకమైంది. దేశ విదేశాంగ విధానంలో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోయింది. మన్మోహన్ దూరదృష్టికి, నాయకత్వ లక్షణాలకు అద్దంపట్టింది. అణ్వస్త్రపరంగా భారత్‌ను దశాబ్దాలపాటు ఏకాకిగా మిగిల్చిన ప్రపంచ దేశాలకు భారత్ ఈ చరిత్రాత్మక ఒప్పందంతో దీటుగా బదులిచ్చింది.
అమెరికా నుంచి అణు ఇంధన లభ్యత, పౌర అణు సాంకేతికతలో సహకారం సహా ఎన్నో దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే ఈ ఒప్పందం కార్యరూపం దాల్చేలా మన్మోహన్ అవిరళ కృషి చేశారు. నాటి అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్యూ. బుష్‌తో కలిసి మన్మోహన్‌సింగ్ 2005 జూలై 18న పౌర అణు ఒప్పందానికి సంబంధించిన విధివిధానాలపై సంయుక్త ప్రకటన చేశారు.
అయితే ఈ ఒప్పందాన్ని యూపీఏ–1 సంకీర్ణ ప్రభుత్వంలోని మిత్రపక్షమైన వామపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రభుత్వం కుప్పకూలే ప్రమాదం ఉన్నా లెక్కచేయకుండా మన్మోహన్ ముందడుగు వేశారు. విశ్వాస పరీక్ష ఎదుర్కొని మరీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోగలిగారు. 2008 అక్టోబర్‌లో అణు ఒప్పందం కార్యరూపం దాల్చింది.
చదవండి: ప్రపంచం మెచ్చిన రాజనీతిజ్ఞుడు
Comments
Please login to add a commentAdd a comment