మన్మోహన్ సింగ్ ఎక్కువగా మాట్లాడరని, దూకుడుగా వ్యవహరించరని ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనపై ప్రతిపక్షాలు విమర్శలు చేసేవి. ఆయన్ని మౌనమునిగా వర్ణించేవి. మన్మోహన్ కేవలం కీలుబొమ్మని, రిమోట్ సోనియా చేతిలో ఉందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసేవి. కానీ తాను మాటల మనిషి కాదు చేతల మనిషని ఎన్నోసార్లు మన్మోహన్ నిరూపించారు. ఆయన దూకుడు ఏంటనేది ఆర్థిక సంస్కరణలతోనే దేశానికి తెలిసొచ్చింది.
నెహ్రూ ఆర్థిక విధానాలు, రష్యాతో అనుబంధం కారణంగా 90వ దశకం వరకు సోషలిజం నినాదమే దేశంలో బలంగా వినిపించేది. ఆ నినాదానికి ఎదురుగా వెళ్లి మాట్లాడే దమ్ము, ధైర్యం అప్పటి రాజకీయ నాయకులకు లేదు. సోషలిజంలో భాగంగా అప్పటి ప్రభుత్వాలు గుడ్డిగా విదేశీ దిగుమతులను తగ్గించేందుకు అడ్డగోలుగా పన్నులు విధించేవి. అదే సమయంలో విదేశాలకు చేసే ఎగుమతులకు అనేక ప్రోత్సాహకాలు అందించేవి. అయితే కాలానుగుణంగా ఇందులో మార్పులు చేయకపోవడంతో ఈ రెండు విధానాలు భ్రష్టుపట్టిపోయాయి.
తగ్గేదే లేదు
ఇక్కడి దిగుమతి సుంకాలకు భయపడి విదేశీయులు తమ వస్తువులు అమ్మేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించేవారు కాదు. అదే సమయంలో కీలక విభాగాల్లో ప్రభుత్వ గుత్తాధిపత్యం, లైసైన్స్‌రాజ్ కారణంగా పరిమితంగానే ఇక్కడి పరిశ్రమల నుంచి ఉత్పత్తి జరిగేది. అంతర్జాతీయ మార్కెట్‌లో వీటికి డిమాండ్ లేకపోయినా సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందించే వారు. ఇవి మంచి ఫలితాలు ఇవ్వకపోయినా మార్చే సాహసం ఎవరూ చేయలేదు. కానీ మన్మోహన్ ఏ మాత్రం సంకోచం లేకుండా విదేశీ దిగుమతులపై ఉన్న పన్నులు తొలగించడంతో పాటు స్వదేశీ వస్తువులకు అందిస్తున్న ప్రోత్సాహకాలను నిలిపేశారు. ఫలితాలు ఇవ్వకుంటే ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా వెనుకడానంటూ గట్టి సంకేతాలు పంపారు.
చదవండి: నాయకత్వ లక్షణాలను చాటిన పౌర అణు ఒప్పందం
తెగింపునకు మరో పేరు
పీవీ నర్సింహారావు ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడానికి ముందు దేశంలో రాజకీయ అస్థిరత నెలకొని ఉంది. అంతకు ముందు 11 నెలలకే వీపీ సింగ్ ప్రభుత్వం పడిపోగా, చంద్రశేఖర్ గవర్నమెంట్ పట్టుమని ఏడు నెలలు కూడా ఉండలేకపోయింది. ఇక పీవీది కూడా మైనార్టీ ప్రభుత్వమే అయినా ఇంతటి రాజకీయ అస్థిరతలో సైతం తెగించి ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు మన్మోహన్.
పదవులు...బాధ్యతలు
Comments
Please login to add a commentAdd a comment